భారత సాక్ష్య చట్టము, 1872

పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/1

భారత సాక్ష్య చట్టము, 1872.

(1872 లోని 1వచట్టము)

(15 మార్చి 1872)

ప్రస్తావన : సాక్ట్యశాసనమును ఏకీకరించుట, వివరించుట మరియు సవరించుట ఉపయుక్తమ్హైనందున ఇందుమూలముగ ఈ క్రింది విధముగ శాసనము చేయబడినది.

భాగము -I

సంగతుల సంబద్ధత

అధ్యాయము - 1

ప్రారంభిక

సంగ్రహ నామము విస్తరణ మరియు ప్రారంభము.


1. ఈ చట్టమును. భారత సాక్ట్య చట్టము 1872 అని పేర్కొనవచ్చును.

ఇది జమ్మూ-కాళ్మీరు రాజ్యము మినహా యావద్బారతదేశమునకు విస్తరించును మరియు ఆర్మీ చట్టము(44 మరియు 45 విక్టొ అ. 58 ) నేవల్‌ డిసిప్పిన్‌ చట్టము, ( 29. మరియు. 30 విక్టొ అ. 109) లేక ఇండియన్‌ నేవీ ( డిసిప్టిన్‌ ) చట్టము, 1934 ( 1934లోని 34వ చట్టము ) లేక ఎయిర్‌ఫోర్సు చట్టము. (7వ జార్జి 5, ఆ. 51) క్రింద సమావేశపరచబడు సేనాన్యాయస్థానములు తప్ప ఇతర సేనాన్యాయస్థానములతో సహా ఏదేని న్యాయస్థానమునందుగాని, న్యాయస్థాన సమక్షములోగాని, జరుగు సమస్త న్యాయిక చర్యలకు వర్తించును. కాని ఏద్దెన న్యాయస్థానమునకు, లేక అధికారికి సమర్చింపబడు అఫిడవిట్లకుగాని, మధ్యవర్తి సమక్షమున జరుగు చర్యలకు గాని వర్తించదు;

మరియు ఇది 1872 సెస్పెంబరు మొదటి దినమున అమలులోనికి వచ్చును,

2.. ( రద్దు చేయబడినది. )

3. ఈ చట్టములో, సందర్భరీత్యా అందుకు విరుద్దమైన ఉద్దేశము గోచరించిననే తప్ప, ఈ క్రింది పదములు మరియు పదబంధములు ఈ క్రింది అర్దములలో వాడబడినవి: --

" న్యాయస్థానము "

"న్యాయస్థానము " అను పదపరిధిలో అందరు న్యాయాధీశులు, మేజిస్ట్రేటులు మరియు, మధ్యవర్తులు తప్ప సొక్ట్యము తీసికొనుటకు శాసన బద్దముగా ప్రాధికారమును పొందిన వ్యక్తులందరును, చేరియుందురు.

"సంగతి ”

"సంగతి * అనగా మరియు ఆ పదపరిథిలో చేరియుండునవి:__

(1) ఇంద్రియములద్వారా గ్రహింప సాధ్యమగునట్టి ఏదేని .విషయము, విషయముల స్థితిగతులు, లేక విషయముల సంబంధము.

(2) ఏ వ్యక్తియైనను గుర్తెరిగియున్నట్టి ఏదేని మానసికస్థితి.

ఉదాహరణములు

(ఏ) ఒకానొకచోట కొన్ని వస్తువులు ఒకానొక తీరుగా అమర్చబడియున్నవి అనునది ఒక సంగతి.
(బీ) ఒకడు దేనినైనను వినెను లేక చూచెను అనునది ఒకసంగతి.
(సీ) ఒకడు కొన్ని మాటలను చెప్పెను అనునది ఒక సంగతి.
(డీ) ఒకనికి ఒకానొక అభిప్రాయము గలదు ఒకానొక ఉద్దేశము గలదు, అతడు సద్భావముతో వ్యవహరించును లేక కపటముతో వ్యవహరించును: లేక ఒక విలక్షణమైన మాటను ఒక విలక్షణమైన అర్దములో వాడును: ఒకడు ఒక విలక్షణమ్హైన అనుభూతిని ఒక నిర్ధిష్ట సమయములో గుర్తెరిగియున్నాడు, లేక గుర్తెరిగి యుండెను అనునది ఒక సంగతి, -
(ఈ) ఒకనికి ఒక తరహా ఖ్యాతి ఉన్సది ఆనునది ఒక సంగతి.

"సంబద్ద "

సంగతుల సంబద్దతను గూర్చి ఈ చట్టపు నిబంధనలలొ నిర్దేశింపబడిన ఏ రితిలో నైనను ఒక సంగతి మరొక సంగతితో సంబంధము గలిగియున్నప్పుడు, ఆ సంగతి ఆ మరొక సంగతికి సంబద్దమై యున్నదని చెప్పబడును.

"వివాదాంశ సంగతులు "

వివాదాంశ సంగతులు అనగా మరియు ఆ పదబంథ పరిధిలో చేరియుండునవి:——

ఏ సంగతి నుండి విడిగా దానినుండియేయై నను, ఇతర సంగతుల కలయికతోనై నను, ఏదేని దావాలో లేక చర్యలో ఉన్నదని గాని, లేదనిగాని చెప్పబడిన ఏదేని హక్కు, బాధ్యత లేక నిరర్హత ఉన్నదో లేదో అనునది గాని, దాని స్వభావము లేక విస్తృతి ఎట్టిదో అనునది గాని అవశ్యముగా ఉహింపదగునో ఆ సంగతి.

విశదీకరణము:— సివిలు ప్రక్రియకు సంబంధించి తత్పమయమున అమలునందుండు శాసన నిబంధనల క్రింద ఏదేని న్యాయస్థానము ఒక సంగతిని గూర్చిన వివాదాంశముము రికార్డు చేసినపుడెల్లను, అట్టి వివాదాంశమునకు జవాబు నందు అ ఆంశము ఉన్నదనెడు లేక లేదనెడు సంగతి, ఒక వివాదాంశ సంగతి అగును.

ఉదాహరణములు

'ఏ' అనునతనిపై 'బీ' ని హత్య చేసెనని నేరము మోపబడినది. ఆతని విచారణలో ఈ క్రింది సంగతులు వివాదాంశములు కావచ్చును:—

'బీ' యొక్క మరణమునకు 'ఏ' కారకుడయ్యెను ఆనునది:
'బీ' ని చంపవలెనని “ఏ” ఉద్దేశించెను అనునది;
'బీ' చే తీవరమైన మరియు ఆకస్మికమైన ప్రకోపమునకు 'ఏ' గురి చేయబడెను అనునది:
'బీ'కి మరణహేతువైనవ కార్యమును చేయుసమయమున ఆ కార్యపు స్వభావమును తెలిసికొనుటకు 'ఏ' మతిస్తిమితము లేని కారణమున అశక్తుడ్డై యుండెను అనునది.

“దస్తావేజు”

“దస్తావేజు” అనగా ఏదేని విషయమును ఏ పదార్ధముమీదనై నను రికార్డు చేయునిమిత్తమై ఉద్దేశింపబడిన లేక ఉపయోగింపదగిన అక్షరముల, అంకెల లేక గుర్తుల ద్వారా గాని వాటిలో ఒకటి కన్న ఎక్కువ పద్దతుల ద్వారా గాని, తెలుపబడినట్టి లేక వర్ణింపబడినట్టి విషయము, అని అర్భము.

ఉదాహరణములు

(వాతమూలకమైనది దస్తావేజగును.

ముద్రిత, శిలాముద్రిత, లేక ఛాయాచిత్రిత పదములు దస్తావేజులగును:

ఒక మ్యాపు లేక ప్లాను దస్తావేజగును:

ఒక ధాతుఫలకముపై లేక శిలపై చెక్కబడినది దస్తావేజగును;

ఒక వంగ్య చిత్రము దస్తావేజగును;

"సాక్ట్యము"

'సాక్ట్యమూ అనగా మరియు ఆ పద పరిధిలో చేరియుండునవి:—

(1) న్యాయస్థాన సమక్షమున. పరిశీలనలోనున్న సంగతుల గూర్చిన విషయములకు సంబంధించి న్యాయ స్థానపు అనుజ్క్షతోగాని ఆదేశముపై గాని సాక్షులు తెలియజేయు. అన్ని కథనములు; అట్టి కధనములు వ్యాగూప సాక్ష్యమనబడును.

(2) న్యాయస్థానపు తనిఖీకై దాఖలు చేయబడిన దస్తావేజులన్నియు;

అట్టి దస్తావేజులు దస్తావేజీసాక్ష్యము అనబడును.

“రుజువై నది "

న్యాయస్థానము, తన సమక్షమునగల విషయములను పర్యాలోచించిన మీదట, ఒక సంగతి ఉన్నదని విశ్వసించి నవుడుగాని ఆ ప్రత్యేక కేసు. పరిస్తితులను బట్టి ఒక ప్రాజ్జుడు అది ఉన్నదను ఊహతో వ్యవహరించ వలసియుండు నంత సంభావ్యమై నదిగా ఉన్నదని తలచినపుడుగాని, ఆ సంగతి రుజువె నట్లు చెప్పబడును.

“నిజముకాదని రుజువై నది "

న్యాయస్థానము, తన సమక్షమునగల విషయములను పర్యాలోచించిన మీదట ఒక సంగతి లేదని. విశ్వసించి నపుడు ఘాని, ఆ ప్రత్యేక కేసు పరిస్తితులము బట్టి ఒక ప్రాజ్జుడు అది లేదను ఊహతో వ్యవహారించవలసి యుండునంత సంభావ్యమై నదిగా వున్నదని తలచి నప్పుడుగాని ఆ సంగతి నిజము కాదని రుజువై నట్లు చెప్పబడును.

“రుజువు కాలేదు”

ఒక సంగతి నిజమనిగాని నిజముకాదని గాని రుజువు కానప్పుడు అది రుజువు కాలేదని చెప్పబడును,

“భారతదేశము”

"భారత దేశము " అనగా జమ్ము——కాశ్మీరు. రాజ్యము మినహా భారత దేశ రాజ్య క్షేత్రము అని అర్ధము.

“పురొభావన చేయవచ్చును"

4. ఒక సంగతిని న్యాయస్థానము పులోభావన చేయవచ్చునని ఈ చట్లములో నిబంధనలున్నప్పుడెల్లను అది నిజము కాదని రుజువై ననే తప్ప మరియు అంతవరకు, ఆ సంగతి రుజువై నదని న్యాయస్థానము ఎంచవచ్చును, లేదా దానిని రుజువు పరచుమని కోరవచ్చును.

“పురొభావన చేయవలెను”

ఒక సంగతిని న్యాయస్థానము. పురొభావవ చేయవలెనని ఈ చట్టము ద్వారా ఆదేశింపబడిన ప్పుడెల్లన ఆది నిజముకాదని రుజువై ననే తప్ప మరియు అంతవరకు ఆ సంగతి రుజువ్నెనదని న్యాయస్థానము ఎంచవలెను.

“నిశ్చాయక రుజువు"

ఈ చట్టము ద్వారా ఒక సంగతి వేరొక దానికి నిశ్చాయక రుజువు అని ప్రఖ్యానింపబడినపుడు, న్యాయస్థానము ఆ ఒక సంగతి రుజువైన మీదట ఆ వేరొక సంగతియు రుజువై నట్టు ఎంచవలెను, మరియు ఆ వేరొక సంగతి నిజముకాదని రుజువుపరచుటకై సాక్ట్యమును చేకొనరాదు.

అధ్యాయము-2

సంగతుల సంబద్ధతను గురించి

వివాదాంశ సంగతులను మరియు సంబద్ద సంగతులను గూర్చి సాక్ట్యము ఈయవచ్చును,

5. ఏదేని 'దావాలో లేక చర్యలో అందలి అన్ని వివాదాంశ సంగతులను గురించియు, ఇందు ఇటు పిమ్ముట సంబద్దమైనవని ప్రఖ్యానింపబడినవగు ఇతర సంగతులను గురించియు, అవి ఉన్నవనిగాని లేవని గాని సాక్ష్యము ఈయవచ్చును ఏ ఇతర వాటినిగురించియు ఈయరాచు.

విశదీకరణము;-- సివిలు ప్రక్రియకు సంబంధించి తత్సమయమున అమలునందుండు. శాసనము యొక్క ఏదేని నిబంధన క్రింద ఏ వ్యక్తి కైనను రుజావు చేయుటకు హక్కులేని సంగతిని గురించి సాక్ష్యము ఇచ్చుటకు అతనికి ఈ పరిచ్చేదము వీలు కల్పించదు.


ఉదాహరణములు

(ఏ) 'బీ' ని చంపవలెనను ఉద్దేశముతొ ఆతనిని ఒక బడితెతొ కొట్టి హతం చేసినాడని 'ఏ 'విచారణ చేయబడుచుండును.

"ఏ" యొక్క విచారణలో ఈ క్రింది సంగతులు వివాదాంశములగును:

'ఏ' దుడ్డుకర్రతో 'బీ' ని కొట్టుట:

'ఏ' అట్లు కొట్టుట ద్వారా 'బీ' యొక్క మరణమునకు కారకుడగుట:

'బీ' ని చంపవలెనని 'ఏ' కు గల ఉద్దేశము. (బీ) ఒక కక్టిదారు కేసు మొదటి అకర్షన సమయమున తాను ఆధారపడియున్న బాండును తనతో తీసికొనిరాడు, దాఖలు చేయుటకు సిద్దపరచడు. ఆ చర్యయొక్క ఏదేని తరువాతి దశయందు సివిలు ప్రక్రియాస్మృతిలో విహితవపరచబడిన షరతులననుసరించి కాక అన్యథా ఆ బాండును దాఖలు చేయుటకు గాని దానిలోని విషయములను రుజువు పరచుటకు గాని ఈ పరిచ్చేదము అతనికి వీలు కల్పించదు.

ఒకే వ్యవహార భాగములై యుండు సంగతుల సంబద్దత.

6. వివాదాంశములు గాకున్నను ఒక వివాదాంశ సంగతితో ఒకే వ్వవహరములో భాగమగునంతగా కలిసియున్న సంగతులు అవి ఒకే సమయమునను, స్థలమునను జరిగినవె నను, లేక విభిన్న సమయములలోను స్థలములలోను జరిగినవె నను, సంబద్దములగును,

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అనునతనిపై 'బీ' ని కొట్టి హత్యచేసెనను నేరము మోపబడినది. కొట్టిన సమయముననై నను అంతకు కొంచెము ముందుగా లేక తరువాతనై నను ఒకే వ్యవహార భాగములయిఉండునంత దగ్గరలో 'ఏ' చేగాని 'బీ' చే గాని ప్రేక్షకులచే గాని చెప్పబడినది లేక చేయబడినది ఏదైనను సంబద్దమైన సంగతి అగును.

(బీ) ఆస్తి నాశనము, సైనికదళములపై దాడి, జైళ్ళ భేదనము జరిగియుండిన సాయుధ పోరాటములో పాల్గొనుట ద్వారా భారత ప్రభుత్వము పై యుద్దము చేసెనని 'ఏ' పై నేరము మోపబడినది. వాటన్నిటిలో 'ఏ' పొల్గొనక పోయినను ఈ సంగతులు జరిగియుండుట ఆ మొత్తము వ్యవహారములో భాగమగుటవలన సంబద్దమైనదగును.

(సీ) ఉత్తర ప్రత్యుత్తరములలోని భాగముగు ఒక జాబునందలి నిందాలేఖనమును గూర్చి 'బీ' పై 'ఏ'దావా వేయును. ఆ నిందా లేఖనము ఉత్పన్నమై న విషయమునకు సంబంధించి పక్షకారుల మద్య నడచిన ఉత్తర ప్రత్యుతరములలో భాగములగు జాబులు ఆ నిందా లేఖనము స్వతః వాటియందు. లేకపోయినను, సంబద్ద సంగతులగును.

(డీ) కొన్ని సరుకులను పంపవలసినదిగా 'బీ' కి ఈయబడిన ఉత్తరువును బట్టి అవి 'ఏ' కు అందజేయబడినవా అనునది (పశ్న. ఆ సరుకులు మద్యలో అనేక మంది వ్యక్తులకు వరుసగా అందజేయబడెను. ఆ ప్రతి అందింపు సంబద్ద సంగతి అగును.

వాదాంశ సంగతులకు సందర్భము, హేతువు లేక పరిణామము అగు సంగతులు,

7. సంబద్హ సంగతులను లేక వివాదాంశ సంగతులను, అవ్యవహితముగానై నను అన్యథాయై నను కలుగజేసినట్తి లేక వాటికి హేతుభూతమ్హైన లేక వాటి పరిణామాత్మకమై నట్టి లేక అవి జరుగుటకు పరిస్టితులుగా ఏర్పడినట్టి లేక అవి ఘటిల్లుటకు గాని వ్యవహారాత్మకమగుటకు గాని అవకాశము ఇచ్చినట్టు సంగతులు సంబద్దమైనదగును.

ఉదాహరణములు


(ఏ) 'బీ' ని 'ఏ' దోచుకొనెనా అనునది ప్రశ్న.

ఆ దొపిడికి కొంచెము ముందుగా 'బీ' పైకముతో సంతకు వెళ్ళుట, మరియు. ఇతర వ్యక్తులకు అతడు ఆ పైకమును చూపుట, లేక తనవద్ద పైకము ఉన్న సంగతిని వారికి చెప్పుట అను సంగతులు సంబద్తమైన వగును.

(బీ) 'బీ' ని 'ఏ' హత్య చేసెనా అనునది ప్రశ్న.

హత్య జరిగిన చోటగాని, తత్సమీపమున గాని, పెనగులాటవలన నేలపై ఏర్పడిన గుర్తులు సంబద్దమైన సంగతులగును.

(సీ) 'బీ' ని 'ఏ' విష ప్రయోగము చేసెనా అనునది ప్రశ్న.

విషప్రయోగ లక్షణములు కాన్పించక పూర్వము 'బీ' యొక్క ఆరొగ్య స్థితియు, 'ఏ' కు తెలిసినవె విషప్రయోగమునకు అవకాశము కల్పించినట్టి 'బీ' యొక్క అలవాట్లను, సంబద్దమైన సంగతులగును.

ప్రేరకహేతువు సన్నద్ధత పూర్వపు లేక తరువాతి ప్రవర్తన,

8. ఏదేని వివాదాంశసంగతి లేక సంబద్ద సంగతి విషయమున ప్రేరక హేతువునై నను, సన్నద్దతనై నను చూపు నట్టి లేక సంఘటించునట్టి ఏ సంగతి యైనను సంబద్దమైనదగును.

ఏదేని దావాకు లేక చర్యకు సంబంధించి. లేక అందలి ఏదేని వివాదాంశసంగతికి గాని దానికి సంబద్దమైన సంగతికి గాని సంబంధించి, అట్టి దావాలో లేక చర్యలో ఎవరేని పక్ష కారుని యొక్క లేక ఆపక్ట కారుని ఏజెంటు యొక్క ప్రవర్తనయు, ఏదేని చర్యాగతమైన అపరాధము ఆరొపింపబడిన ఎవరేని వ్యక్తి యొక్క ప్రవర్తనయు, అట్టి ప్రవర్హన ఏదేని వివాదాంశ సంగతిపై గాని సంబద్హ సంగతిపై గాని ప్రభావము గల్గి యున్నద్డైనచో లేక వాటి ప్రభావమునకు తాను గురియైనదైనచో, అ సంగతికి ఆది పూర్వపుదైనను తరువాతి దైనను సంబద్దమైనదగును. విశదీకరణము 1:-- ఈ పరిచ్చేదములో “ ప్రవర్తనము” అను పద పరిధి యందు కథనములు చేరవు. అయితే, కథనములు కానట్టి ఏవేని ఇతర కార్యముల ననుసరించియుండి వాటిని విశదపరచు కథనములు చేరియుండును, మరియు ఈ చట్టపు ఏదేని ఇతర పరిచ్చేదము క్రింద కథనములకు గల సంబద్దతకు ఈ విశదీకరణము భంగము కలిగించదు,

విశదీకరణము 2:-- ఎవరేని వ్యక్తి యొక్క ప్రవర్తన సంబద్దమైనదై నపుడు అట్టి ప్రవర్తనపై ప్రభావము కలిగియుండి, అతనికి తెలుపబడినట్టి లేక అతని సమక్షమున అతనికి వినిపించు మేరలో తెలుపబడినట్టి ఏ కథనమైనను సంబద్దమైనదగును.

ఉదాహరణములు

(ఏ) 'బీ' యొక్క హత్య విషయమున 'ఏ' విచారణ చేయబడుచుండెను. 'సీ' ని 'ఏ' హత్య చేసియుండుట 'సీ' ని 'ఏ' హత్య చేసినాడని 'బీ' కి తెలిసియుండుట, తనకు తెలిసిన విషయమును వెల్లడి చేసెదనని బెదరించి 'ఏ' నుండి డబ్బు గుంజుటకు 'బీ' ప్రయత్నించియుండుట అనునవి సంబద్ద సంగతులు.

(బి) ఒక బాండు మీద రావలసిన డబ్బు చెల్సించుమని. 'బీ' పై 'ఏ' దావావేయును. 'బీ' ఆ బాండుని తాను వాసి ఈయలేదనును.

బాండును (వాసి యిచ్చినట్ను చెప్పబడిన సమయమున ఒకానొక నిమిత్తము 'బీ' కి డబ్బు ఆవసరమై యుండెననునది సంబద్దమైన సంగతి.

(సీ) విషప్రయోగముచే 'బీ' ని హత్య చేసినాడనీ 'ఏ' విచారణ చేయబడుచుండెను. 'బీ' మరణించుటకు పూర్వము 'బీ' కి పెట్టబడినటువంటి విషమునే 'ఏ' సేకరించినాడు అనునది సంబద్దమైన సంగతి.

(డీ) ఒకానొక దస్తావేజు. 'ఏ' యొక్క. వీలునామాయేనా అనునది ప్రశ్న.

'ఏ' దని చెప్పబడిన వీలునామా తేదీకి కొద్దికాలము క్రితమే ఆ వీలునామాలోని నిబంధనలకు సంబంధించ విషయములను గురించి 'ఏ' దర్యాప్తు జరుపుట, అతడు ఆ వీలునామా (వాయుటను గూర్చి వకీళ్ళను సంప్రదించుట మరియు అతడు ఇతర వీలునామాలకు ముసాయిదాలను తయారుచేయించి ఆమోదించకుండుట ఆనునవి సంబద్దములైన సంగతులు.

(ఈ) 'ఏ' పై ఒక నేరము మోపబడెను.

మోపబడిన ఆ నేరము జరుగుటకు పూర్వము లేక జరుగు సమయమున లేక అటు పిమ్మట ఆ కేసు యొక్క సంగతులు తనకు అనుకూలముగా అగుపడునట్టుజేయు న్నెఖరి గల సాక్ట్యము 'ఏ' సమకూర్చుకొనుట లేక అతడు సాక్ట్యమును నాశనము చేయుట, లేక మరుగుపరచుట లేక సాక్షులు కాదగు వ్యక్తులు హాజరు కాకుండ నివారించుట లేక వారు హాజరు కాకుండునట్టు చేయుట లేక నేరమును గూర్చి తప్పుడు సాక్ట్య ము ఇచ్చుటకు వ్యక్షులను సిద్దము చేయుట అనునవి సంబద్దములైన సంగతులు.

(ఎఫ్‌) 'బీ'ని 'ఏ' దోచుకొనెనా అనునది ప్రశ్న.

'బీ' దోపిడికి గురియైన పిమ్మట "'బీ' ని దోచుకొనిన వానిని పట్టుకొనుటకై. పొలీసులు వచ్చుచున్నారు” అని 'సీ' 'ఏ' సమక్షమున చెప్పుట, ఆ వెనువెంటనే 'ఏ' పారిపోవుట అనునవి సంబద్దములై న సంగతులు అగును.

(జీ) 'బీ' కి 10,000 ల రూపాయలు 'ఏ' బాకీయుండెనా అనునది ప్రశ్న.

తనకు డబ్బు అప్పు ఇమ్మని 'సీ' ని 'ఏ' అడుగుట 'ఏ' సమక్షమునను అతడు వినునట్లు గాను 'డీ' “10,0006 రూపాయలు 'బీ' కి 'ఏ' బాకియున్నాడు. కావున 'ఏ' ను నమ్మవద్దని నేను మీకు సలహాఇచ్చుచున్నాను” అని 'సీ' తో చెప్పుట, మరియు అంతట ఎట్టి జవాబు ఈయకుండ 'ఏ' వెళ్ళిపోవుట అనునవి సంబద్దముల్దెన సంగతులు అగును.

(హెచ్‌) ఒక నేరమును 'ఏ' చేసెనా అనునది ప్రశ్న.

నేరస్థుని కొరకు దర్యాప్తు జరుగుచున్నట్లు హెచ్చరిక చేయుచు ఒక జాబు తనకు అందిన పిమ్మట 'ఏ' పరారీ అగుట, మరియు ఆ జాబులోని విషయములు, సంబద్ధములై న సంగతులు అగును.

(ఐ) 'ఏ' ఒక నేరము మోపబడెను,

మోపబడిన ఆ నేరము జరిగిన తరువాత అతడు పరారీ అగుట, లేక ఆ నేరము ద్వారా ఆర్జింపబడిన ఆస్తి నిగాని ఆ అస్తి అమ్మకపు రాబడిని గాని స్వాధీనము నందు అతడు ఉంచుకొనుట, లేక నేరము చేయుటలో ఉపయోగింపబడిన లేక ఉపయోగింపదగిన వస్తువులను మరుగు పరచుటకు ప్రయత్నించుట అనునవి సంబద్దములైన సంగతులు అగును.

(జే) 'ఏ' మానభంగమునకు గురియైనదా అనునది ప్రశ్న. జరిగినదని చెప్పబడిన ఆ మానభంగమునకు పిమ్మట కొద్దిసేపటికి ఆమె ఆ నేరమును గురించి ఫిర్యాదుచేయుట, ఫిర్యాదుకు. దారితీసిన పరిస్థితులు, ఫిర్యాదునందలి మాటలు, సంబద్దములైన సంగతులు అగును.

ఆమె ఫిర్యాదు చేయకయే తనకు మానభంగము వాటిల్లినట్లు చెప్పుట, ఈ పరిచ్చేదము క్రింద ప్రవర్తనగా సంబద్దమ్హైనది కాదు, కాని 32వ పరిచ్చేదము యొక్క ఖండము (1) క్రింద మరణ వాజ్మూలముగా గాని, 157వ పరిచ్చేదము క్రింద బలపరిచే సాక్ష్యముగా గాని సంబద్దమైనది కావచ్చును.

(కే) 'ఏ' ని దోచుకొనిరా యనునది ప్రశ్న.

జరిగినదని చెప్పబడిన ఆ దోపిడికి పిమ్మట వెంటనే అతడు ఆ అపరాధమును గురించి ఫిర్యాదు చేయుటయు ఫిర్యాదుకు దారితీసిన పరిస్థితులు ఫిర్యాదునందలి మాటలు సంబద్దములైన సంగతులు అగును.

అతడు. ఫిర్యాదు చేయకనే తాను దోపిడీకి గురియైనట్లు చెప్పుట ఈ పరిచ్చేదముు క్రింద ప్రవర్తనగా సంబద్దము కాదు. కాని 32వ పరిచ్చేదము యొక్క ఖండము (1) క్రింద మరణ వాజ్మాలయముగా గాని 157వ పరిచ్చేదము క్రింద బలపరిచే సాక్ట్యముగా గాని సంబద్దమైనది కావచ్చును.

సంబద్ద సంగతులను విశదీకరించుటకు లేక ప్రవేశపెట్టుటకు ఆవశ్యకములైన సంగతులు.

9. ఒక వివాదాంశ సంగతిని గాని సంబద్ద సంగతిని గాని విశదీకరించుటకై నమ ప్రవేశ పెట్టుటకైనను ఆవశ్యకమైనట్టి , లేక వివాదాంశ సంగతి వలనగాని సంబద్ద సంగతి వలనగాని తట్తిన ఒక ఊహను బలపరచు. లేదా ఖండించునట్టి, లేక ఏదేని వస్తువుదై నను వ్యక్తిద్దై నను ఆనవాలు సంబద్దమయినదిగా ఉన్నపుడు, ఆ ఆనవాలును స్థిరపరచునట్టి, లేక ఏదేని వివాదాంశ సంగతి గాని సంబద్ద సంగతిగాని జరిగిన సమయమునై నను స్తలమునై నను నియతము చేయునట్టి లేక ఏదేని అట్టి సంగతిని గూర్చిన వ్యవహారములో పాల్గొనిన పక్షకారుల సంబంధమును తెలియజేయునట్టి సంగతులు అందు నిమిత్తమై ఆవశ్యకమైనంతవరకు, సంబద్దములైన సంగతులు అగును.

ఉదాహరణములు

(ఏ) ఒకానొక దస్తావేజు 'ఏ' యొక్క. వీలునామాయేనా అనునది ప్రశ్న.

అటులని చెప్పబడిన ఆ వీలునామా తేదీన 'ఏ' కి గల అస్తి యొక్కయు. అతని కుటుంబము యొక్కయు పరిస్తితులు సంబద్దములైన సంగతులు కావచ్చును.

(బీ) 'ఏ' కు అప్రతిష్టకరమైన ప్రవర్తనను అపాదించు నిందా లేఖన విషయమున 'బీ' పై 'ఏ' దావా వేయును; నిందా లేఖనమని చెప్పబడిన ఆ విషయము సత్యమేనని 'బీ' ఉద్ఘాటించును.

నిందాలేఖన ప్రచురణ కాలమున పక్టకారుల స్థితిగతులు సంబంధములు వివాదాంశములైన సంగతులను ప్రవేశపెట్టునవిగా సంబద్దముల్టెన సంగతులు కావచ్చును.

అట్లు చెప్పబడిన నిందా లేఖనముతో సంబంధము లేని విషయమును గూర్చి 'ఏ' 'బీ' మధ్య గల వివాదము యొక్క వివరములు అసంబద్దములు, కాని, 'ఏ' 'బీ' ల మధ్య వివాదము ఉండెను అను సంగతి అది వారికిగల సంబంథములపై ప్రభావము గలదైనచో సంబద్దము కావచ్చును.

(సీ) 'ఏ' పై ఒక నేరము మోపబడెను.

నేరము జరిగిన వెంటనే 'ఏ' తన ఇంటినుండి పరారీ అగుట వివాదాంశ సంగతులకు తరువాతిదియును వాటి ప్రభావమునకు గురియై, నదియునైన ప్రవర్తనగా 8వ పరిచ్చేదము క్రింద సంబద్దమైన సంగతి అగును.

అతడు ఇంటినుండి వెడలిన సమయమున అతనికి తాను పోవుచున్న స్థలములో హఠాత్తుగా అత్యవసరమైన పని తగిలి యుండుట అతడు హఠాత్తుగా ఇంటినుండి వెడలిన సంగతిని విశదపరచు న్హైఖరి కలదిగా సంబద్దమైన సంగతి అగును.

అతడు ఏ పనికై వెడలెనో ఆ వివరములు, ఆ పని హఠాత్తయినదియు, అత్యవసరమైనదియు అని చూపుటకు అవశ్యకమై నంత మేరకు తప్ప, సంబద్దములు కావు.

(డీ) తనతో, 'సీ' చేసికొనిన నౌకరీ కాంట్రాక్టును భంగపరచునట్లు 'సీ' ని ప్రేరేపించినాడని 'బీ' పై 'ఏ' దావా వేయును. 'ఏ' వద్ద నౌకరీని వదలివేసినప్పుడు, 'సీ' “నాకు 'బీ' ఇంతకంటే మంచి నౌకరీని ఈయజూపినందున నేను వెళ్ళి పోవుచున్నాను” అని 'ఏ' తో చెప్పెను. ఈ కథనము వివాదాంశ సంగతిగా సంబద్దమయినట్టి 'సీ' యొక్క ప్రవర్తనను విశదపరచునదిగా సంబద్దమైన సంగతి అగును.

(ఈ) దొంగతనపు నేరము మోపబడిన, 'ఏ' అనునతడు దొంగిలింపబడిన ఆస్తిని 'బీ' కి ఇచ్చుటయును 'బీ' ఆ అస్తిని 'ఏ' భార్యకు ఇచ్చుటయును. చూడబడినవి.. 'బీ' ఆ ఆస్తిని అందజేయుచు 'ఏ' దీనిని నిన్ను

దాచమన్నాడు” అని చెప్పును. 'బీ' యొక్క కథనము ఆ వ్యవహారములో భాగమ్హైనట్టి సంగతిని విశదపరచునదిగా సంబద్దమైన సంగతి అగును,

(ఎఫ్‌) 'ఏ' దొమ్మీ చేసెనని విచారణ చేయబడుచుండెను. అతడు నాయకుడుగా ఒక గుంపును నడిపించి నట్లు రుజువు చేయబడినది. గుంపుయొక్క కేకలు ఆ వ్యవహార స్వభావమును విశదపరచునవిగా సంబద్దములగును.

ఉమ్మడి పన్నుగడనుచే గురించి కుట్రదారు చెప్పబడినవి లేక చేయబడినవి.

10. ఇద్దరు లేక అంతకెక్కువ మంది వ్యక్తులు కలసి ఒక అపరాధమును లేక ఒక చర్యాయోగ్య దోషమును చేయుటకు కుట్ర పన్నినారని తలచుటకు సహేతుకమైన ఆధారము ఉన్న ఎడల, ఆ వ్యక్తులలో ఏ ఒక్కరి కైనను ఆ ఉమ్మడి ఉద్దేశము తొలుతగా కలిగిన పిమ్మట అట్టి ఉద్దేశమును గురించి వారిలో ఏ ఒక్కరిచే నైనమ చెప్పబడినది, చేయబడినది, లేక (వాయబడినది యేద్దెనను అట్లు కుట్ర పన్నుచున్నట్లుగా తలచబడు వ్యక్తులలో ప్రతి ఒక్కరినిగూర్చియు, ఆ కుట్ర ఉన్నట్టు రుజువు చేయుటకును, అట్టి ఎవరేని వ్యక్తి ఆ కుట్రలో పాల్గొ నెనని చూపుటకును సంబద్దమైన సంగతి అగును.

ఉదాహరణము

భారత ప్రభుత్వముపై యుద్దము చేయుటకై జరిగిన ఒక కుట్రలో 'ఏ' చేరినాడని విశ్వసించుటకు సహేతుకమైన ఆధారము కలదు.

ఆ కుట్ర నిమిత్తము యూరపు దేశములో 'ఏ' ఆయుధములు సేకరించుట 'సీ' అదేమాదిరి లక్ష్మ్యమునక్షె, కలకత్తాలో డబ్బును వసూలు చేయుట, 'డీ' ఆ కుట్రలో చేరవలసినదిగా బొంబాయిలో వ్యక్తులను ప్రేరేపించుట, 'ఈ' ఆలక్ష్యమును సమర్ధించు (వాతలను ఆగ్రాలో ప్రచురించుట, 'ఎఫ్‌ ' కాబూల్‌లో ఉన్న 'జీ ' కి 'సీ ' కలకత్తాలో వసూలు, చేసిన డబ్బును ఢిల్లీనుండి పంపుట, మరియు 'హెచ్‌ ' ఆ కుట్ర యొక్క వృతాంతమును తెలుపుచు వాసిన జాబులో గల విషయములు--వీటితో ప్రతి యొకటియు 'ఏ' కు వాటిలోని అన్నిటినీ గురించి తెలియకుండి నను వాటిని చేసిన వ్యక్తులు అతడెరుగని వారైనను, అతడు ఆకుట్రలో చేరుటకు పూర్వము. లేక ఆ కుట్ర నుండి విడిపోయిన తరువాత అవి జరిగిననై నప్పటికిని ఆ కుట్ర జరిగినదని రుజువు చేయుటకును అందు 'ఏ ' సహాపరాధియని రుజువు చేయుటకును కూడ సంబద్దములైన సంగతులగును. అన్యధా సంబద్దములు కానివి ఎపుడు సంబద్ద సంగతులగును,

11. అన్యథా సంబద్దములు కాని సంగతులు--

(1) అవి ఏదేని వివాదాంశ సంగతికి లేక సంబద్ద సంగతికి విరుద్దముగా ఉన్నచో,

(2) స్వతః గాని ఇతర సంగతులతో కలసిగాని అవి ఏదేని వివాదాంశ సంగతి లేక సంబద్ద సంగతి ఉండుట నైనను లేకుండుటనైనను అత్వంత సంభావ్యము లేక అసంభావ్యము చేయుచో,--

సంబద్దములైన సంగతులు అగును.

ఉదాహరణములు


(ఏ) 'ఏ' ఒకానొక దినమున కలకత్తాలో ఒక నేరమును చేసెనా అనునది ప్రశ్న.

'ఏ' ఆ దినమున లాహోరు లో ఉండుట సంబద్దమైన సంగతి అగును.

ఆ నేరము చేయబడినప్పుడు దాదాపు ఆ సమయములో 'ఏ' ఆ నేరము జరిగిన స్థలమునకు సుదూరమున ఉండుట, అతడు ఆ నేరమును అచటి నుండి చేయుట అసాధ్యము గాకున్నను అత్యంత అసంభావ్వమగునపుడు, సంబద్ద సంగతి అగును.

(బీ) 'ఏ' ఒక నేరము చేసెనా అనునది ప్రశ్న.

పరిస్థితులను బట్టి ఆ నేరము తప్పక 'ఏ' బీ' 'సీ ', 'డీ ' లలో ఒకరు చేసి యుండవలెను. ఆ నేరమును చేయ ఇతరులెవరికిని వీలులేదనియు, దానిని 'బీ' 'సీ లేక 'డీ' చేయలేదనియు చూపు ప్రతి సంగతియు సంబద్ద సంగతి అగును.

నష్ట పరిహారమునకై వేసిన దావాలలొ మొత్తమును నిర్దారణ చేయుటకు న్యాయస్థానమునకు తోడ్పడగల సంగతులు సంబద్దములు.

12. నష్టపరిహారము కోరబడిన దావాలలో ఇప్పించవలసియుండు నష్టపరిహారపు మొత్తమును నిర్ధారణ చేయుటకు న్యాయస్థానమునకు తోడ్పడు ఏ సంగతి అయినను సంబద్దమైనదగును. హక్కు లేక ఆచారము ప్రశ్నగతమై నపుడు సంబద్దమైన సంగతులు

13. ఏదేని హక్కు లేక ఆచారము ఉన్నదా అనునది ప్రశ్నగతమైనచొ, ఈ క్రింది సంగతులు, అనగా,

(ఏ) ప్రశ్నగత హక్కు లేక ఆచారము ఏ వ్యవహారము వలన ఏర్పడెనో, క్షెయిము. చేయబడెనో, మార్పు చేయబడెనొ గుర్తింపబడెనో, ఉన్నదనిగాని లేదనిగాని చెప్పబడెనో, లేక ఏ వ్యవహారము. దాని ఉనికికి విరుద్దముగా ఉన్నదో ఆ స్యవహారము ఏదైనను,

(బీ) ఆ హక్కు లేక ఆచారము ఏయే సందర్భములందు క్లెయిము చేయబడెనొ, గుర్తింపబడెనో, లేక వినియొగింపబడెనొ లేక ఏయే సందర్భములందు దాని వినియోగము వివాదగ్రస్త మాయెనో, ఉన్నదని, చెప్పబడెనో, లేక అనుసరింపబడకుండెనొ ఆ ప్రత్యేక సందర్భములు ఏన్లైనను,

సంబద్దములైన సంగతులగును,

ఉదాహరణము

ఒక మత్స్య క్షేత్రము పై హక్కు ఉన్నదా ఆనునది ప్రశ్న.

'ఏ' పూరీకులకు ఆ మత్స్య క్షేత్రమును ప్రదత్తము చేసిన పత్రము, 'ఏ' తండ్రి ఆ మత్స్య క్షేత్రముపైన పెట్టిన తాకట్టు, తరువాత ఆ తాకట్టుకు విరుద్దముగా 'ఏ' తండ్రిచే ఆ మత్స్యక్షేత్ర ప్రదానము, 'ఏ' తండ్రి ఆ హాక్కును వినియొగించినట్టి లేక 'ఏ' యొక్క ఇరుగుపొరుగువారు ఆ హక్కు యొక్క వినియోగము ఆపుచేసినట్టి ప్రత్యేక సందర్బములు, సంబద్దములైన సంగతులు అగును.

మానసిక లేక శారీరక స్థితి యొక్క లేక శారీరక అనుభూతి యొక్క ఉనికిని తెలుపు సంగతులు,

14. ఎవరేని ఒక ప్రత్యేక వ్యక్తిపట్ల ఉద్దేశము, ఎరుక సద్భావము, నిర్లక్షము, దుడుకుతనము, నైమనస్యము లేక సొమనస్యము మొదలగు ఏదేని మానసిక స్థితి ఉన్నట్టు తెలుపు సంగతులుగాని, ఏదేని శారీరక స్థితి లేక శారీరక అనుభూతి ఉన్నట్లు తెలుపు సంగతులుగాని, అట్టి మానసిక లేక శారీరక స్టితి లేక శారీరక అనుభూతి ఉన్నదా యనునది వివాదాంశమైనను సంబద్దాంశమై నను అయినపుడు, సంబద్దములైన సంగతులు అగును.

విశదీకరణము-1: ——సంబద్దమగు మానసిక స్థితి ఉన్నట్లు తెలుపునదిగా సంబద్దమైనదగు సంగతి అట్టి మానసిక స్తితి, సాధారణముగా ఉన్ఫదనిగాక, ప్రశ్నగతమైన ప్రత్యేక విషయ సంబంధమున ఉన్నదని తెలుపవలెను. '

విశదీకరణము. 2 ———అయితే ఏదేని అపరాధము.మోపబడిన వ్యక్తి విచారణలొ, ఆ నిందితునిచే లోగడ ఒక అపరాధము. చేయబడుట, ఈ పరిచ్చేద భావముతో సంబద్దమ్మెనదైన యెడల అట్టి వ్యక్తి దోషియను పూర్వ నిర్ణయము కూడ సంబద్దమై న సంగతి అగును,

ఉదాహరణములు

(ఏ) దొంగలింపబడిన సరుకులను అవి దొంగిలింపబడినవని తెలిసియు, తీసికొనెనని 'ఏ' పై నేరము మొపబడినది.

దొంగిలింపబడిన ఒక వస్తువు అతని స్వాధీనములో గలదని రుజువు చేయబడినది. దొంగిలింపబడిన అనేక, ఇతర వస్తువులు అదే సమయమున అతని స్వాధీనములో ఉండెనను సంగతి, తన స్యాదీనములో ఉన్న ప్రతివస్తువునుక అన్ని వస్తువులును, దొంగిలింపబడినవేనని అతనికి తెలిసియున్నట్టు చూపు వైఖరి కలదగుటచే సంబద్దమైన సంగతి అగును.

(బీ) నకిలీ నాణెమును అది నకిలీ నాణెమని తెలిసియుండియు మరొక వ్యక్షికి కపటముగా ఇచ్చెనను నేరము 'ఏ' పై మొపబడినది.

ఆ నాణెమును ఇచ్చినపుడు అనేక ఇతర నకిలీ నాణేములు “ఏ” స్వాధీనములో ఉండెనను సంగతి సంబద్దమైనదగును.

అంతకు పూర్వము మరొక వ్యక్తికి నకిలీ నాణేమునుు, అది నకిలీ నాణెమని తెలిసి యుండియు, సిసలైన నాణెముగా ఇచ్చి దోషిగా నిర్ణీతుడాయెననునది సంబద్దమైన సంగతి అగును.

(సీ) 'బీ' యొక్క కుక్క భీకరమైనదని 'బీ' ఎరిగి యుండెనననియు. ఆ కుక్కచే తనకు హాని కలిగించెననియు 'బీ' పై 'ఏ' దావా వేయును,

లొగడ ఆ కుక్క 'ఎక్స్‌వెో మరియు 'జడ్‌ ' అనువారిని కరచి యుండుట, వారు 'బీ' కి ఫిర్యాదులు చేసియుండుట సంబద్దములైన సంగతులు.

(డీ) ఒక వినిమపత్ర సీకర్తయైన 'ఏ' పేయి యొక్క పేరు కల్పితమైనదని ఎరిగి యుండెనా అనునది ప్రశ్న.