భారత శిక్షాస్మృతి, 1989

रजिस्ट्री सं.डी-२२१
Registered No. D-221
రిజిస్ట్రీ సంఖ్య. డి-221

मूल्य रू. 5.००
Price Rs. 5.00
మూల్యము: రూ 5.00

असाधारण
EXTRAORDINARY
भाग XVI अनुभाग 1
Part XVI Section 1
భాగము XVI అనుభాగము 1
प्राधिकार से प्रकाशित
PUBLISHED BY AUTHORITY
ప్రాధికారము ద్వారా ప్రచురింపబడినది


सं १
No.1
సంఖ్య1
नई दिल्ली
New Delhi
న్యూ ఢిల్లీ
बुधवार

Monday
సోమవారము

११. फिब्रवरि, 1989/१२
11 December, 1989/12

11 డిసెంబర్, 1989/12

माघ

Saka
శక

खंण्ड ४

Vol. 4
సంపుటము 4


MINISTRY OF LAW AND JUSTICE
(LEGISLATIVE DEPARTMENT)
New Delhi, 3rd June, 1989/13 JYESHTHA, 1911 Saka.
The Translation in Telugu of the following Acts namely:-

The translation in Telugu of the Indian Penal Code [Act No. 45 of 1860] is hereby published under the authority of the President and shall be deemed to be the authoritative text thereof in Telugu under Clause (a).of Section 2 of the Authoritative Text (Central Laws) Act, 1973 (Act 50 of 1973).

శాసన మరియు న్యాయ పాలన మంత్రిత్వ శాఖ
(శాసన నిర్మాణ విభాగము)
న్యూ ఢిల్లీ , 3 జూన్, 1989/13 జేష 1911 శక

ది ఇండియన్ పీనల్ కోడు (1860లోని 45వ చట్టము) యొక్క తెలుగు అనువాదము రాష్ట్ర ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. ఈ అనువాదమును ఆ చట్టమునకు ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973లోని 50వ చట్టము) యొక్క 2, పరిచ్ఛేదములోని ఖండము (ఏ) కింద ప్రాధికృత తెలుగు పాఠమైనట్లు భావించవలెను.


భారత శిక్షాస్మృతి

(1860 లోని 45వ చట్టము)

[6వ అక్టోబరు, 1860]

అధ్యాయము-1

అవతారిక

ప్రస్తావన, భారత దేశమునకు సాధారణ శిక్షా స్మృతిని ఏర్పాటు చేయుట ఉపయుక్త మై నందున ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది :--

స్మృతి నామము, మరియు దాని అమలు యొక్క విస్తృతి.

1. ఈ చట్టమును భారత శిక్షాస్మృతి అని పేర్కొనవలెను మరియు ఇది జమ్మూ- కాశ్మీరు రాజ్యము మినహా యావద్భారత దేశమునకు విస్తరించుము.

భారతదేశములో చేయు అపరాధములకు శిక్ష.

2. ప్రతి వ్యక్తియు, ఈ స్మృతి నిబంధనలకు విరుద్ధముగా జరిపి భారత దేశములో దోపియగు ప్రతి కార్యమునకు లేక కార్యలోపమునకు ఈ స్మృతి క్రిందనే శిక్షా పాత్రుడగును; అన్యథా ఆతడు శిక్షాపాత్రుడు కాడు.

భారత దేశము వెలుపల చేయబడియు శాసనమును బట్టి భారతదేశములో విచారణ చేయదగినట్టి అపరాధములకు శిక్ష.

3. భారత దేశము వెలుపల చేసిన అపరాధ విషయమున ఏదేని భారతదేశ శాసనమునుబట్టి వివారణకు గురి కావలసిన ఏ వ్యక్తి పై నైనను, అతడు భారత దేశము వెలుపల చేసిన ఏదేని కార్యమునకు, అట్టి కార్యమును భారత దేశములో చేసియుండిన ఎట్లో ఆదే రీతిగా, ఈ స్మృతి నిబంధనల ననుసరించి చర్య తీసికొనవలెను.

రాజ్యక్షేత్రాతీతమైన అపరాధములకు స్మృతి యొక్క విస్తరింపు.

4. (1) భారతదేశమువకు ఆవల మరియు వెలుపల ఏ స్థలమునందైనను భారతదేశ పౌరుడెవరై నను చేసిన,

(2) భారత దేశములో రిజిస్టరైన ఏదేని నౌక లేక వాయుయానముపై, ఆది ఎచటనున్నను, వ్యక్తి ఎవరైనను చేసిన--

ఏ అపరాధమునకైనను,

ఈ స్మృతి నిబంధనలు వర్తించును.

విశదీకరణము :——భారత దేశములో చేసియుండినచో ఈ స్మృతి క్రింద శిక్షార్హమయియుండి భారత దేశమునకు బయట చేసిన ప్రతి కార్యము ఈ పరిచ్ఛేదములో “అపరాధము" అను పద పరిధియందు చేరియుండును.

ఉదాహరణము

భారత దేశ పౌరుడగు 'ఏ' ఉగాండాలో హత్య చేయును. భారతదేశములో అతడు దొరికిన ఏ స్థలమునందైనను హత్యకై అతనిని విచారణ చేసి దోషస్థాపన చేయవచ్చును.

ఈ చట్టము వలన కొన్ని శాసనములకు భంగము కలుగకుండుట.

5. ఈ చట్టములోనిదేదియు, భారత ప్రభుత్వ సేవలో అధికారులుగా, సైనికులుగా, నావికులుగా, లేక వైమానికులుగా ఉండి, తిరుగుబాటు చేసిన, లేక సేవను విడిచి పారిపోయిన వారిని శిక్షించునట్టి ఏదేని చట్టపు నిబంధనలకైనను, ప్రత్యేకమైన లేక స్థానికమైన శాసనముల నిబంధనలకు వేటి కైనను భంగము కలిగించదు.

అధ్యాయము-2

సాధారణ విశదీకరణములు

మినహాయింపులకు లోబడి స్మృతిలోని నిర్వచనములను అర్థము చేసికొని వలసి యుండుట.

6. ప్రతి అపరాధ నిర్వచనమును, ప్రతి శిక్షా నిబంధనను మరియు అట్టి ప్రతి నిర్వచనమునకు లేక శిక్షా నిబంధనకు గల ప్రతి ఉదాహరణమును అది “సాధారణ మినహాయింపులు " అను శీర్షిక గల అధ్యాయములోని, మినహా యింపులకు లోబడియున్నట్లు, అట్టి నిర్వచనములో, శిక్షా నిబంధనలో లేక ఉదాహరణములో ఆ మినహాయింపులు తిరిగి చెప్పబడక పోయినప్పటికినీ, ఈ స్మృతి యందంతటను అర్ధము చేసికొనవలెను.

ఉదాహరణములు

(ఏ) ఈ స్మృతిలో అపరాధముల నిర్వచనములున్న పరిచ్ఛేదములు ఏడు సంవత్సరముల లోపు వయసు గల బిడ్డ అట్టి అపరాధము చేయజాలడని తెలుపవు; కాని, ఆ నిర్వచనములు -- “ఏడు సంవత్సరముల లోపు వయసు గల బిడ్డ చేసిన దేదియు అపరాధముకాదు” అను నిబంధనగల సాధారణ మినహాయింపునకు లోబడియున్నట్లు వాటిని అర్ధము చేసికొనవలెను.

(బి) హత్య చేసినట్టి 'జడ్' ను వారంటు లేకుండ ఒక పోలీసు అధికారి అయిన, 'ఏ' పట్టు కొనును. ఇచట 'ఏ' అక్రమపరిరోధము అను అపరాధము చేయలేదు. ఏలనన, 'జడ్'ను పట్టుకొనుటకు 'ఏ' శాసనరీత్యా బద్దుడై యున్నాడు. అందుచే ఒక వ్యక్తి దేనినైనను "చేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి దానిని చేసినచో అది అపరాధము కాదు” అను నిబంధనగల సాధారణ మినహాయింపు క్రిందికి ఈ కేసు వచ్చును.

ఒకసారి విశదీకరించిన పదము యొక్క భావము.

7. ఈ స్మృతి యొక్క ఏ భాగమునందైనను విశదీకరించినను ప్రతి పదము, ఆ విశదీకరణముననుసరించియే ఈ స్మృతి యొక్క ప్రతి భాగమునందును ఉపయోగింపబడినది.

లింగము.

8. "అతడు" అను సర్వనామము మరియు దాని జన్యములు, స్త్రీ పురుష వ్యక్తులలో ఏ వ్యక్తిని గురించి యైనను లింగభేదము లేకుండా ఉపయోగింపబడినవి.

వచనము.

9. సందర్భమును బట్టి వైరుధ్యము కాన్పించిననే తప్ప, ఏకవచనార్థమునిచ్చు పదములయందు బహువచనము చేరియుండును; మరియు బహువచనార్ధమునిచ్చు పదములయందు ఏకవచనము చేరియుండును.

“పురుషుడు"

10. "పురుషుడు” అను పదము, ఏ వయసు గల వాడైనను, మగ మనిషిని తెలుపును.

“స్త్రీ "

“స్త్రీ "అను పదము ఏ వయసుగలదైనను ఆడ మనిషిని తెలుపును.

"వ్యక్తి "

11. "వ్యక్తి " అను పదపరిధియందు ఏదేని కంపెనీ, లేక అసోసియేషను, లేక కార్పొరేషనుగా ఏర్పడినదైనను కాకున్నను, వ్యక్తుల నికాయము చేరియుండును.

“ప్రజలు ”

12. "ప్రజలు" అను పదపరిధియందు ప్రజలలోని ఏ వర్గమైనను లేక ఏ సమాజమైనము చేరియుండును.

13. ... ... ... ...

“ప్రభుత్వ సేవకుడు"

14. "ప్రభుత్వ సేవకుడు" అను పదములు ప్రభుత్వ ప్రాధికారముచే, లేక ప్రాధికారము క్రింద భారత దేశమునందు పదవిలో కొనసాగింపబడిన, నియమింపబడిన, లేక నియోగింపబడిన ఎవరేని అధికారిని లేక సేవకుని తెలుపును.

15. ... ... ... ...

16. ... ... ... ...

“ ప్రభుత్వము "

17. "ప్రభుత్వము” అను పదము. కేంద్ర ప్రభుత్వమును లేక రాజ్య ప్రభుత్వమును తెలుపును.

“భారతదేశము "

18. భారతదేశము" ఆనగా, జమ్మూ-కాశ్మీరు రాజ్యము మినహా, భారతదేశ రాజ్య క్షేత్రము అని అర్ధము.

“న్యాయాధీశుడు"

19. “న్యాయాధీశుడు" అను పదము న్యాయాధీశుడను పదవీనామముగల ప్రతి వ్యక్తిని మాత్రమే కాక ఏదేని సివిలు లేక క్రిమినలు శాసనిక చర్యలో అంతిమ తీర్పును, లేక అపీలు చేయనిచో అంతిమముదగు తీర్పును,లేక ఎవరేని మరొక ప్రాధికారి ఖాయపరచిన అంతిమముదగు తీర్పును ఇచ్చుటకు శాసనము ద్వారా అధికారము పొందినట్టి ప్రతి వ్యక్తిని కూడ, లేక

అట్టి తీర్పునిచ్చుటకు శాసనము ద్వారా అధికారము పొందినట్టి వ్యక్తుల వికాయములో ఒకరైన ప్రతి వ్యక్తిని కూడ తెలుపును.

ఉదాహరణములు

(ఏ) 1859 లోని 10వ చట్టము క్రింది దావాయందు అధికారితను వినియోగించు కలెక్టరు ఒక న్యాయాధీశుడు బీ) దోషారోపణ విషయమున అధికారితను వినియోగించి, ఆపీలు ఉన్నను లేకున్నను, జుర్మానా లేక కారావాస శిక్ష విధించుటకు ఆధికారముగల మేజిస్టేటు ఒక న్యాయాదీశుడు.

(సీ) దావాలను విచారణ చేసి నిర్ధారణ చేయుటకు మదరాసు కోడునందలి 1816 లోని 7వ నియమము క్రింద అధికారముగల పంచాయతీ సభ్యుడు. ఒక న్యాయాధీశుడు.

డి) మరొక న్యాయస్థానమునకు విచారణకై పంపుటకు మాత్రమే తనకు అధికారముగల దోషారోపణ విషయమున అధికారితను వినియోగించుచున్న మేజిస్టేటు న్యాయాధీశుడు కాడు.

“న్యాయస్థానము"

20. “న్యాయస్థానము" అను పదము న్యాయికముగా తానొక్కడుగనే వ్యవహరించుటకు శాసనము ద్వారా అధికారము పొందినవాడై అట్లు వ్యవహరించుచున్నట్టి న్యాయాధీశునిగాని, న్యాయికముగా న్యాయాదీశ నికాయముగా వ్యవహరించుటకు శాసనము ద్వారా అధికారము పొందినదై అట్లు వ్యవహరించుచున్నట్టి న్యాయాదీశనికాయమునుగాని తెలుపును.

ఉదాహరణము

దావాలను విచారణ చేసి నిర్ధారణ చేయుటకు మద్రాసు కోడునందలి 1816 లోని 7వ నియమము క్రింద అధికారము కలిగి వ్యవహరించు పంచాయత్ ఒక న్యాయస్థానము.

“పబ్లికు సేవకుడు"

21. “పబ్లికు సేవకుడు" అను పదములు దిగువ వివరింపబడిన వారిలో ఏ వ్యక్తినైనను తెలుపును, అనగా :--

మొదటిది:- ... ... ... ...

రెండవది :- భారత సైనిక, నౌకా, లేక వైమానిక బలములోని ప్రతి కమీషన్డ్ అధికారి;

మూడవది :-- తాను ఒక్కడుగనేగాని ఏదేని వ్యక్తుల వికాయపు సభ్యుడుగా గాని ఏదేని న్యాయనిర్ణయ విధులను నిర్వహించుటకు శాసనము క్రింద అధికారము పొందిన ఎవరేని వ్యక్తితో సహా, ప్రతి న్యాయాధీశుడు ;

నాల్గవది :-- (లిక్విడేటరు, రిసీవరు లేక కమిషనరుతో సహా) ఏదేని శాసనవిషయమును లేక సంగతిని గూర్చిన దర్యాప్తు చేయుట లేక రిపోర్టు చేయుటగాని, ఏదేని దస్తావేజును రూపొందించుట, అధి ప్రమాణికరించుట లేక భద్ర పరచుట గాని, ఏదేని ఆస్తిని స్వాదీనపరచుకొనుట లేక వ్యయనము చేయుటగాని, ఏదేని న్యాయిక ఆదేశికను అమలు పరుచుటగాని, ఏదేని ప్రమాణమును చేయించుటగాని, దుబాసీగా వ్యవహరించుటగాని, న్యాయస్థానమునందు గలభా జరుగకుండా చూచుట గాని, అధికారిగా తన కర్తవ్యమై యున్నట్టి ప్రతి న్యాయస్థానాధికారి, మరియు ఆట్టి కర్తవ్యము లలో దేనినైనను నిర్వర్తించుటకు న్యాయస్థానముచే ప్రత్యేకముగా ప్రాధికారమీయబడిన ప్రతి వ్యక్తి ;

అయిదవది : -ఏదేని న్యాయస్థానమునకు లేక పబ్లికు సేవకునికి సహాయపడు ప్రతి జ్యూరీ సభ్యుడు, ఆఫీసర, లేక పంచాయతీ సభ్యుడు;

ఆరవది :-ఏదేని వ్యాజ్యమును లేక విషయముమ గురించి నిర్ణయము చేయవలసినదిగా లేక నివేదికను సమ ర్పించవలసినదిగా ఏదేని న్యాయస్థానముచే లేక ఎవరేని ఇతర సమర్థ పబ్లికు ప్రాధికారముచే నిర్దేశింపబడిన ప్రతి మధ్యవర్తి లేక ఇతర వ్యక్తి;

ఏడవది :- ఏ వ్యక్తి నైనను పరిరోధములో పెట్టుటకు లేక పరిరోధమునందే ఉంచుటకు ఏదేవి పదవినిబటి అధికారము పొంది ఆ పదవియందున్న ప్రతి వ్యక్తి;

ఎనిమిదవది : అపరాధములను విచారించుట, అపరాధములను గూర్చి సమాచారమిచ్చుట, అపరాధులను విచారణకు తెచ్చుట, లేక ప్రజల ఆరోగ్యమునుగాని భద్రతనుగాని సౌకర్యమునుగాని కాపాడుట తన ఆధికారిక కర్తవ్యమై యున్నట్టి ప్రతి ప్రభుత్వాధికారి;

తొమ్మిదవది :- ప్రభుత్వము తరఫున ఏదేని ఆస్తిని తీసికొనుట, అందుకొనుట, భద్రపరచుట, లేక ఖర్చు చేయుటగాని, ప్రభుత్వము తరఫున ఏదేని సర్వేను, పన్ను నిర్ధారణను లేక కాంట్రాక్టును చేయుట గాని, లేక ప్రభుత్వపు ధనసంబంధ హితములపై ప్రభావము ఉండెడు ఏదేని విషయములో ఏదేని రెవిన్యూ ఆదేశికమును అమలు పరచుట, లేక ఏదేని దర్యాప్తు జరుపుట లేక ఏదేని రిపోర్టు చేయుటగాని, ప్రభుత్వ ధన సంబంధ హితములకు సంబంధించిన ఏదేని దస్తావేజును రూపొందించుట లేక అధి ప్రమాణీకరించుట లేక భద్రపరచుట గావి, ప్రభుత్వ ధన సంబంధ హితములను కాపాడుటకై ఏదేని శాసన ఉల్లంఘనను విచారించుటగాని తన ఆధికారిక కర్తవ్యమై యున్నట్టి ప్రతి అధికారి; పదవది : -ఏదేని ఆస్తిని తీసికొనుట, అందుకొనుట, భద్రపరచుట లేక ఖర్చు చేయుటగాని, ఏదేని సర్వేను, పన్ను నిర్ధారణను చేయుట గాని, ఏదేని గ్రామము, పట్టణము లేక జిల్లా యొక్క ఏదేని లౌకిక, సాముదాయిక ప్రయోజనమునకై ఏదేని రేటునైనను పన్నునైనను విధించుట గాని, ఏదేని గ్రామ, పట్టణ, లేక జిల్లా ప్రజల హక్కులను నిశ్చయించుటకై ఏదేని దస్తావేజును రూపొందించుట, అధి ప్రమాణీకరించుట లేక భద్రపరచుట గాని, తన ఆధికారిక కర్తవ్యమై యున్నట్టి ప్రతి అధికారి;

పదకొండవది: - ఎన్నికల జాబితాను తయారు చేయుటకు, ప్రచురించుటకు, నిర్వహించుటకు లేక సవరించుటకుగాని, ఎన్నికను లేక ఎన్నికలో ఒక భాగమును జరిపించుటకుగాని ఏదేని పదవినిబట్టి అధికారమును పొంది అట్టి పదవియం దున్న ప్రతి వ్యక్తిని;

పండ్రెండవది :- (ఏ) ప్రభుత్వ సేవ చేయుచున్నట్టి లేక వేతనము పొందుచున్నట్టి, లేక ఏదేని పబ్లికు కర్తవ్య నిర్వర్తనకై ప్రభుత్వమునుండి ఫీజుగ లేదా కమీషనుగ ప్రతిమూల్యమును పొందుచున్నట్టి ప్రతి వ్యక్తి;

(బి) కేంద్ర, ప్రొవిన్షయల్, లేక రాజ్య చట్టము ద్వారా అయినను, అట్టి చట్టమును బట్టి అయినను ఏర్పాటు చేయబడిన ఒక స్థానిక ప్రాధికారములో లేక కార్పొరేషనులో లేక కంపెనీల చట్టము, 1956 (1956లోని 1వ చట్టము) యొక్క 617వ పరిచ్ఛేదములోని నిర్వచనము వర్తించు ప్రభుత్వ కంపెనీలో, సేవ చేయుచున్న లేక వేతనము పొందుచున్న ప్రతి వ్యక్తి .

ఉదాహరణము

పురపాలక కమీషనరు. ఒక పబ్లికు సేవకుడు.

విశదీకరణము 1 :- ప్రభుత్వముచే నియమింపబడినవారైనను కాకున్నను, పైన వివరింపబడినవారిలో ఏ వ్యక్తు లైనను పబ్లికు సేవకులగుదురు.

విశదీకరణము 2 :- "పబ్లికు సేవకుడు" అను పదములను అవి ఎచట వచ్చినను, ఒక పబ్లికు సేవక ఉద్యోగ స్థానము నందు ఉండుటకు తనకు గల హక్కులో శాసనపరమైన ఎటువంటి దోషము ఉన్నను, వాస్తవముగా అట్టి స్థానము నందున్న ప్రతి వ్యక్తి యు, అని అర్థము చేసికొనవలెను.

విశదీకరణము 3 :- “ఎన్నిక" అను పదము ఏదేని శాసననిర్మాణ, పురపాలక, లేక ఏ తీరుదైనను ఇతర పబ్లికు ప్రాధికారమునకు సభ్యులను ఎంపిక చేయు పదతిని ఎన్నిక అని శాసనముచే లేక శాసనము క్రింద విహితము చేసినపుడు ఆ సభ్యుల ఎంపికనిమిత్తమైన ఎన్నికను తెలుపును.

విశదీకరణము 4: ... ... ... ...

“చరాస్తి "

22. “చరాస్తి " అను పద పరిధిలో భూమియు, భూ బద్ధమై యున్న లేక భూ బద్దమై యున్నదానికి శాశ్వతముగ బిగించబడియున్న వస్తువులు మినహా, ప్రతి రకపు భౌతికమైన ఆస్తి చేరియుండును.

ఆక్రమ లాభము "

23. “అక్రమ లాభము" అనగా లాభము పొందు వ్యక్తి తనకు శాసనరీత్యా హక్కు లేనట్టి ఆస్తిని శాసన సమ్మతముకాని పద్ధతులవలన పొందగా అతనికి గలిగిన లాభము.

"అక్రమ నష్టము "

“అక్రమ నష్టము” అనగా నష్టపడు వ్యక్తి తనకు శాసనరీత్యా హక్కు ఉన్నట్టి ఆస్తిని శాసన సమ్మతముకాని పద్ధతులవలన పోగొట్టుకొనగా అతనికి కలిగిన నష్టము.

అక్రమముగా లాభము పొందుట.

ఒక వ్యక్తి అక్రమముగా ఆర్జించునపుడే గాక, అక్రమముగా తనవద్ద అట్టే పెట్టుకొనునప్పుడు గూడ అక్రమముగా లాభము పొందునట్లు చెప్పబడును.

అక్రమముగా నష్ట పడుట.

ఏదేని ఆస్తిని ఒక వ్యక్తికి దక్కనీయకుండా అక్రమముగా చేసినపుడును, ఏదేని ఆస్తిని అతని వశములో ఉండనీయ కుండా అక్రమముగా చేసినపుడును, అట్టి వ్యక్తి అక్రమముగా నష్ట పడినట్లు చెప్పబడును.

" నిజాయితీలేకుండ"

24. ఒక వ్యక్తికి అక్రమ లాభమునుగాని మరొక వ్యక్తికి అక్రమ నష్టమునుగాని కలిగించు ఉద్దేశ్యముతో ఏ పనినైనను చేయు వారెవరైనను ఆ పనిని “నిజాయతీ లేకుండా” చేసినట్లు చెప్పబడుదురు. “ కపటముతో 25. కపటమునకు గురి చేయు ఉద్దేశ్యముతో ఒక వ్యక్తి ఏ పనినైనను చేసినచో అతడు ఆ పనిని కపటముతో చేసినట్లు చెప్పబడును, అన్యధా అట్లు చెప్పబడదు.

"విశ్వసించుటకు కారణము"

26. ఒక వ్యక్తికి దేనినైనను విశ్వసించుటకు తగినంత హేతువు ఉన్నచో అతనికి దానిని “విశ్వసించుటకు కారణము" ఉన్నట్లు చెప్పబడును, అన్యథా అట్లు చెప్పబడదు.

భార్య, గుమాస్తా లేక సేవకుని స్వాధీనము లోగల ఆస్తి.

27. ఒక వ్యక్తి తరఫున అతని భార్య, గుమాస్తా లేక సేవకుని స్వాధీనములో ఆస్తి ఉన్నపుడు, ఈ స్మృతి భావములో ఆ ఆస్తి అట్టి వ్యక్తి యొక్క స్వాధీనములో ఉన్నట్లు అగును.

విశదీకరణము :- తాత్కాలికముగానైనను ఒక ప్రత్యేక సందర్భముననైనను గుమాస్తాగా లేక సేవకుడుగా నియోజితుడైన వ్యక్తి ఈ పరిచ్ఛేద భావములో గుమాస్తా లేక సేవకుడు అగును.

"నకిలీగాచేయుట "

28. ఒక వస్తువుతో మరొక వస్తువును పోలునట్లు చేసి, అట్టి పోలికవల్ల మోసము చేయవలెనను ఉద్దేశ్యము గల లేక తద్వారా మోసము జరుగవచ్చునని ఎరిగియుండిన వ్యక్తి “నకిలీ" గా చేసినట్లు చెప్పబడును.

విశదీకరణము 1 :-నకిలీగా చేయుటకు ఖచ్చితమైన అనుకరణము ప్రధానము కాదు.

విశదీకరణము 2 :-ఒక వ్యక్తి ఒక వస్తువుతో మరొక వస్తువును పోలునట్లు చేసినపుడు, అట్టి పోలికవల్ల ఏ వ్యక్తి యైనను మోసగింపబడవచ్చునంతగా ఆ పోలిక ఉన్నయెడల, అట్లు ఆ వస్తువుతో మరొక వస్తువును పోలునట్లు చేయు వ్యక్తి అట్టి పోలికవల్ల మోసము చేయుటకు ఉద్దేశించెనని లేక తద్వారా మోసము జరుగవచ్చునని ఎరిగి యుండెనని తద్విరుద్ధముగా రుజువు చేయబడునంతవరకు, పురోభావన చేయవలెను.

"దస్తావేజు"

29. “దస్తావేజు" అను పదము ఏదేని విషయమునకు సాక్ష్యముగా ఉపయోగించుటకై ఉద్దేశింప బడిన లేక ఉపయోగింపదగిన అక్షరముల, అంకెల, గుర్తులద్వారా గాని, వాటిలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతుల ద్వారాగాని ఏ పదారము పై నైనను వ్యక్తము చేయబడినట్టి లేక వివరింపబడినట్టి ఏదేని విషయమును తెలుపును.

విశదీకరణము 1 :—ఆ అక్షరములు, అంకెలు లేక గుర్తులు ఏ పద్ధతుల ద్వారా లేక ఏ పదార్థము పై ఏర్పర్చబడినని అనునదిగాని ఆ సాక్ష్యము ఒక న్యాయస్థానమునకై ఉద్దేశించబడినదా లేదా అనునది గాని అందు ఉపయోగించదగినదా కాదా అనునది గాని ముఖ్యాంశము కాదు.

ఉదాహరణములు

ఒక కాంట్రాక్టు నిబంధనలను వ్యక్త పరచుచు ఆ కాంట్రాక్టుకు సాక్ష్యముగా ఉపయోగింపదగు వ్రాత ఒక దస్తావేజు ;

ఒక బ్యాంకరు పై ఈయబడిన చెక్కు ఒక దస్తావేజు;

ముక్త్యారునామా ఒక దస్తావేజు.

సాక్ష్యముగా ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన లేక ఉపయోగింపదగిన ఒక మ్యాపు లేక ప్లాను ఒక దస్తావేజు ;

ఆదేశములు లేక నిదేశములు గల వ్రాత ఒక దస్తావేజు ;

విశదీకరణము 2 :-వాణిజ్య సంబంధమైన లేక ఇతరమైన వాడుకను గురించిన విశదీకరణము ప్రకారము దేనిని అక్షరములు, అంకెలు లేక గుర్తులు వ్యక్తము చేయునో, దానిని వాస్తవముగా అట్లు వ్యక్తము చేయక పోయినను ఈ పరిచ్ఛేదపు భాగములో అట్టి అక్షరములు, అంకెలు లేక గుర్తులు దానిని వ్యక్తము చేసినట్లే భావించవలెను.

ఉదాహరణము

తన ఆర్డరు పొందినవారికి చెల్లింపవలసిన ఒక వినిమయపత్రము వెనుకవైపు “ఏ' తన పేరు వ్రాయును. వాణిజ్య సంబంధమైన వాడుక విశదీకరించు ప్రకారము ఆ వినిమయపత్రదారుకు చెల్లింపు చేయవలెనని ఆ పీటీ వ్రాత యొక్క అర్థము. ఆ పీటీ వ్రాత ఒక దస్తావేజు మరియు “వినిమయపత్రదారుకు చెల్లింపుము" అను పదములు గాని అట్టి అర్థమునిచ్చు పదములు గాని ఆ సంతకము పైన వ్రాయబడి యుండిన ఎటో అదే రీతిగా ఆపీటీవ్రాతను అన్వయించవలెను. “విలువైన సెక్యూరిటీ"

30. “విలువైన సెక్యూరిటీ” అను పదములు, ఏ దస్తావేజుద్వారా ఏదేని శాసనిక హక్కు యొక్క ఏర్పాటు, విస్తరణ, బదిలీ, పరిమితము, నిర్మూలనము లేక విడుదల చేయబడునో, లేక ఏ దస్తావేజుద్వారా ఎవరేని వ్యక్తి తాను శాసనిక బాధ్యత కలిగి ఉన్నట్లు గాని తనకు ఒక నిర్దిష్ట శాసనిక హక్కు లేనట్లు గాని అంగీకరించునో ఆ దస్తావేజును లేక అట్లుగ తాత్పర్యమిచ్చు దస్తా వేజును తెలుపును.

ఉదాహరణము

ఒక వినిమయపత్రము వెనుకవైపు 'ఏ' తన పేరును వ్రాయును, ఈ పీటీ వ్రాతవలన శాసన సమ్మతముగా ఆ వినిమయపత్రదారు లగునట్టి ఏ వ్యక్తి కైనను ఆ పత్రము పై గల హక్కు బదిలీ అయినందున ఆ పీటీ వ్రాత ఒక “విలువైన సెక్యూరిటీ” అగును.

"వీలునామా"

31. వీలునామా" అను పదము ఏదేని మరణశాసనాత్మకమైన దస్తావేజును తెలుపును.

కార్యములను నిర్దేశించు పదముల పరిధిలో కార్యాలోపములు శాసనవిరుద్ధమైనవి చేరియుండుము

32. ఈ స్మృతియొక్క ప్రతి భాగమునందును, సందర్భమును బట్టి ఉద్దేశ వైరుధ్యము కాన్పించిన నేతప్ప, చేసిన కార్యములను నిర్దేశించునట్టి పదములు కార్యలోపములకు కూడా అని శాసన విరుద్ధమైనవై నప్పుడు, వర్తించును.

"కార్యము"

33. “కార్యము" అను పదము ఒక కార్యమునేగాక కార్యపరంపరను కూడ తెలుపును.

“కార్యలోపము ”

“కార్యలోపము" అను పదము ఒక కార్యలోపమునే గాక కార్యలోపపరంపరను కూడ తెలుపును.

ఉమ్మడి ఉద్దేశసాధనకై ఆనేకమంది వ్యక్తులచే చేయబడిన కార్యములు.

34. అనేకమంది వ్యక్తులు ఒక ఆపరాధిక కార్యమును వారందరి ఉమ్మడి ఉద్దేశ్య సాధనకై చేసినపుడు అట్టి వారిలో ప్రతి వ్యక్తియు తానొక్కడే ఆ కార్యము చేసియుండిన ఎట్టా అదే రీతిగా ఆ కార్యమునకు బాధ్యుడగును.

అటువంటి కార్యమును నేరము చేయుచున్నానని ఎరిగియు లేక నేరము చేయు ఉద్దేశముతో చేసిన కారణమున ఆది నేరము అయినపుడు.

35. నేరము చేయుచున్నానని ఎరిగియు లేక నేరము చేయు ఉద్దేశముతో చేసిన కారణముస మాత్రమే నేరమగు కార్యము, అనేక మంది వ్యక్తులు చేసినపుడెల్లను ఆ కార్యములో అట్టి ఎరుకతో లేక ఉద్దేశముతో పాల్గొను వారిలో ప్రతి వ్యక్తియు, తానొక్కడే ఆ కార్యమును ఆ ఎరుకతో లేక ఆ ఉద్దేశముతో చేసియుండిన ఎట్లో అదేరీతిగ ఆ కార్యమునకు బాధ్యుడగును.

కార్యమువలన కొంత, కార్యలోపమువలన కొంత కలిగిన ప్రభావము.

36. ఒక కార్యము వలన గాని, ఒక కార్యలోపము వలన గాని ఒకానొక ప్రభావమును కలిగించుట లేక అట్టి ప్రభావమును కలిగించుటకు ప్రయత్నించుట, అపరాధమై నపుడెల్లను, ఆ ప్రభావమును, కార్యము వలన కొంత కార్యలోపమువలన కొంత కలిగించుట అదే అపరాధముగా అర్ధము చేసికొనవలెను.

ఉదాహరణము

'జడ్'కు తిండి పెట్టుటను శాసన విరుద్దముగ మానినందున కొంతవరకును, 'జడ్'ను కొట్టుటవలన కొంత వరకును జడ్'కు మరణమును 'ఏ' ఉద్దేశపూర్వకముగా కలిగించును. 'ఏ' హత్యచేసిన వాడగును.

ఒక అపరాధమగు అనేక కార్యములలో ఒక దానిని చేయుట ద్వారా సహకరించుట,

37. అనేక కార్యముల ద్వారా ఒక అపరాధము చేయబడినపుడు, ఆ కార్యములలో ఏ ఒకదానినైనను, ఒకరుగా గాని ఎవరేని ఇతర వ్యక్తి తో కలసిగాని చేయుట ద్వారా ఆ అపరాధము చేయుటయందు ఉద్దేశపూర్వకముగ సహకరించు వారెవరైనను ఆ అపరాధము చేసిన వారగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' యు 'బి' యు వేరు వేరు సమయములలో 'జడ్'కు చిన్న చిన్న మోతాదులలో విషము నిచ్చుట ద్వారా అతనిని హత్య చేయుదమని ఒప్పందము జరుపు కొందురు. 'ఏ' యు 'బి' యు ఆ ఒప్పందము, ప్రకారము 'జడ్'ను హత్యచేయు ఉద్దేశముతో విష ప్రయోగము చేయుదురు. అతనికి అట్లు అనేక సార్లు ఈయబడిన మోతాదుల విష ప్రభావము వలన 'జడ్' మరణించును. ఇచట 'ఏ' యు 'బి' యు ఈ హత్య చేయుటలో ఉద్దేశ పూర్వకముగా సహకరించుకొందురు. మరియు వారిలో ప్రతి ఒకరు, మరణమును కలిగించిన కార్యములలో ఒక దానిని చేసినందున, వారి కార్యములు వేరు వేరువి అయినప్పటికిని, వారుభయులు అపరాధమును చేసిన వారగుదురు.

(బీ) 'ఏ' యు 'బీ' యు సహ-జై లర్లయినందున ఒకరు మారి ఒకరు తడవకు ఆరు గంటల చొప్పున 'జడ్' అను ఖైదీని కాపలా కాయు బాధ్యత కలిగియున్నారు. 'జడ్'కు మరణమును కలిగించు ఉద్దేశముతో 'ఏ' యు 'బీ' యు, 'జడ్' కొరకు తమకంద జేయబడిన తిండిని తమ కాపలావేళలలో శాసన విరుద్ధముగ అతనికి

ఈయకుండుట ద్వారా ఆ పరిణామమును కలుగ జేయుటలో ఎరిగి యుండియే సహకరించుకొందురు. 'జడ్' ఆకలితో మరణించును. 'ఏ', 'బి' లు ఉభయులు 'జడ్'ను హత్య చేసిన వారగుదురు.

(సీ) 'ఏ' అను జైలరుకు 'జడ్' అను ఖైదీని కాపలాకాయు బాధ్యత కలదు. 'జడ్'కు మరణమును కలిగించు ఉద్దేశముతో 'జడ్'కు తిండి పెట్టుటను 'ఏ' శాసనవిరుద్దముగ మానివేయును. తత్పరిణామముగా 'జడ్' చాల బలహీనుడగును. అయినను ఆట్లు వస్తు ఉంచుట అతనికి మరణమును కలిగించునంతటిది కాదు. 'ఏ' అతని పదవి నుండి బర్తరఫు కాగా 'బీ' అతని పదవిని పొందును. 'బీ' తాను 'జడ్'కు తిండి పెట్టుటను మానుటవలన 'జడ్'కు మరణము కలుగగలదని ఎరిగియుండియు 'ఏ'తో లాలూచీ గాని సహకరింపు గాని లేకుండగనే శాసన విరుద్ద ముగా, 'బి' 'జడ్'కు తిండి పెట్టుట మానును, 'జడ్' ఆకలితో మరణించును. 'బీ' హత్య చేసిన వాడగును. కానీ 'బీ'తో 'ఏ' సహకరించలేదు. కనుక 'ఏ' హత్యా ప్రయత్నము చేసినవాడు మాత్రమే ఆగును.

అపరాధిక కార్యముతో సంబంధముగల వ్యక్తులు వేరువేరు అపరాధములు చేసినవారు కావచ్చును.

38. అనేక మంది వ్యక్తులు ఒక ఆపరాధిక కార్యమును కలిసి చేసిన యెడల లేక దానితో సంబంధము కలిగియున్న యెడల వారు ఆ కార్యము చేయుట వలన వేరు వేరు అపరాధములు చేసిన వారు కావచ్చును.

ఉదాహరణము

'ఏ' తాను పొందిన తీవ్ర ప్రకోపనములో 'జడ్'ను చంపినను హత్య కానట్టి ఆపరాధిక మానవ వధ మాత్రమే అగు పరిస్థితులలో 'ఏ' 'జడ్' పై బడును. 'జడ్' మీద పగ ఉన్న 'బీ' అతనిని చంపు ఉద్దేశముతో తాను, ప్రకోపనము నకు గురికాక పోయినను, 'జడ్'ను చంపుటలో 'ఏ' కు తోడ్పడును. ఇచట 'ఏ' 'బి' లు ఇద్దరూ కలిసి 'జడ్'కు మరణమును కలిగించినప్పటికీ 'బీ' హత్య చేసిన వాడుకాగా 'ఏ' అపరాధిక మానవవధ మాత్రమే చేసిన వాడగును.

“ స్వచ్ఛందముగా"

39. ఒక వ్యక్తి ఒక పరిణామమును ఏ పద్ధతుల ద్వారా కలిగించుటకు ఉద్దేశించెనో ఆ పద్ధతుల ద్వారా కలిగించినప్పుడు, లేక ఏ పద్దతుల వలన దానిని కలిగించుట సంభననుని, వాటిని ఉపయోగించు సనుయమున ఆతనికి తెలియునో లేక విశ్వసించుటకు కారణము ఉండునో,ఆ పద్ధతుల ద్వారా కలిగించినపుడు, ఆతడు ఆ పరిణామము స్వచ్ఛందముగా కలిగించినట్లు చెప్పబడును.

ఉదాహరణము

దోపిడి జరుగుటకు వీలు కలిగించుటకై, ఒక పెద్ద పట్టణములోని నివాస గృహమునకు రాత్రి వేళ 'ఏ' నిప్పంటించి తద్వారా ఒక వ్యక్తి మరణమునకు కారకుడగును. ఇచట, మరణమును కలిగించvaలేనని 'ఏ' ఉద్దేశించక పోవచ్చును, మరియు తన చర్యలవలన మరణము కలిగినందుకు విచారపడి కూడ ఉండవచ్చును. అయినను, మరణము కలిగించుట సంభవమని అతనికి తెలిసియుండినచో, అతడు స్వచ్ఛందముగా మరణమును కలిగించిన వాడగును.

"అపరాధము"

40. ఈ పరిచ్ఛేదములోని ఖండము 2 మరియు ఖండము 3 లో పేర్కొనిన అధ్యాయములలోను, పరిచ్ఛేదములలోను తప్ప," ఆపరాధము" అను పదము ఈ స్మృతిని బట్టి శిక్షార్హమగు పనిని తెలుపును.

అధ్యాయము 4, ఆధ్యాయము 5ఎ లలోను, మరియు ఈ క్రింది పరిచ్ఛేదములలోను, అనగా పరిచ్ఛేదములు 64, 65, 66, 67, 71, 109, 110, 112, 114, 115, 116, 117, 187, 194, 195, 203, 211, 213, 214, 221, 222, 223, 224, 225, 327, 328, 329, 330, 331, 347, 348, 388, 389, మరియు 445లలోను " అపరాధము" అను పదము ఈ స్మృతి క్రింద గాని ఇందు ఇటు పిమ్మట గల నిర్వచనము ప్రకారము ఏదేని ప్రత్యేక లేక స్థానిక శాసనమగు ఏదేని శాసనము క్రింద గాని, శికార్హ మగు పనిని తెలుపును.

మరియు 141, 176, 177, 201, 202, 212, 216 మరియు 441 పరిచ్ఛేదములలో " అపరాధముఅను పదము, ప్రత్యేక లేక స్థానిక శాసనము క్రింద శిక్షార్హమగు పనిని అట్టి శాసనము క్రింద జూర్మానాతో గాని, జుర్మానా లేకుండగాని, ఆరు మాసముల లేక అంత కెక్కువ కాలముపాటు కారావాసముతో శిక్షింపదగినదై నపుడు, ఆ ఆర్థమునే కలిగియుండును.

"ప్రత్యేక శాసనము ”

41.ఒక నిర్దిష్ట విషయమునకు వర్తించు శాసనము. "ప్రత్యేక శాసనము ” అగును.

“స్థానిక శాసనము"

42. భారత దేశములోని ఒకానొక భాగమునకు మాత్రమే వర్తించు శాసనము,"స్థానిక శాసనము" అగును. "శాసన విరుద్ధము" "చేయుటకు శాసన బద్దత "

43. శాసన విరుధ్ధము" అను పదము ఒక ఆపరాధమైనట్టి, లేక శాసనముచే నిషేధింపబడినట్టి, లేక ఒక సివిలు చర్యకు ఆధారము నిచ్చునట్టి ప్రతి పనికిని వర్తించును, మరియు ఏ పనిని ఒక వ్యక్తి చేయకుండుట శాసనవిరుద్ధ మగునో దానిని చేయుటకు అతడు "శాసన రీత్యా బద్దుడై" యున్నట్లు చెప్పబడును.

"హాని”

44. "హాని” అను పదము శాసన విరుద్ధముగ ఎవరేని వ్యక్తికి శారీరకముగా, మానసికముగా, ఖ్యాతి విషయముగా లేక ఆస్తి విషయముగా కలిగింపబడిన ఎటువంటి కీడునైనను తెలుపును.

“ప్రాణము"

45. "ప్రాణము" అను పదము సందర్భమును బట్టి వైరుధ్యము కాన్పించిననే తప్ప, ఒక మనిషి, యొక్క ప్రాణమును తెలుపును.

"మరణము "

46. " మరణము” అను పదము, సందర్భమును బట్టి వైరుధ్యము కాన్పించిననే తప్ప, ఒక మనిషి యొక్క మరణమును తెలుపును.


"జంతువు"

47. “జంతువు” అను పదము మనిషి, కానట్టి ఏ సజీవ ప్రాణినైనను తెలుపును.

"జలయానము."

48. "జలయానము" అను పదము జలమార్గమున మనుష్యులను లేక ఆస్తిని చేరవేయుటకు చేయబడిన దేనినైనను తెలుపును.


"సంవత్సరము " " మాసము"

49. "సంవత్సరము ” అను పదమును లేక “ మాసము” అను పదమును ఎచట ఉపయోగించినను, ఆ సంవత్సరమును లేక మాసమును, బ్రిటిష్ క్యాలెండరు ప్రకారము గణింపవలెనని అర్థము చేసికొనవలెను.

“ పరిచ్ఛేదము"

50. "పరిచ్ఛేదము" అను పదము ఈ స్మృతి లోని అధ్యాయములో ముందు అంకెగల వేరు వేరు భాగము లందు ఒక భాగమును తెలుపును.

“ ప్రమాణము "

51. " ప్రమాణము” అను పదపరిధియందు, ప్రమాణమునకు బదులుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన సత్యనిష్టా, ప్రతిజ్ఞ, మరియు, పబ్లికు సేవకుని సమక్షమున చేయుటకుగాని, న్యాయస్థానమునందైనను, కాకపోయినను, రుజువు కొరకు ఉపయోగించుటకు గాని, శాసనము ద్వారా కోరబడిన లేక అనుమతింపబడిన ఏదేని ప్రఖ్యానము చేరియుండును.

"సద్భావము"

52. తగు జాగరూకతయు, సావధానతయు లేకుండ చేయబడినట్టిది లేక విశ్వసింపబడినట్టిది ఏదియు "సద్భావముతో " చేయబడినట్లు లేక విశ్వసింపబడినట్లు చెప్పబడదు.

"ఆశ్రయము"

52- ఏ. ఆశ్రయమొసగబడిన వ్యక్తికి అతని భార్య లేక ఆమె భర్త ఆ ఆశ్రయమును ఇచ్చిన సందర్భములయందు 157వ పరిచ్ఛేదములో మరియు 130 వ పరిచ్ఛేదములో తప్ప, "ఆశ్రయము" అను పద పరిధియందు ఒక వ్యక్తి, అతడు పట్టు బడకుండ తప్పించు కొనుటకు గాను నీడ, తిండి, నీరు, డబ్బు, గుడ్డలు, ఆయుధములు, మందు గుండు సామాగ్రి లేక వాహనములు సమకూర్చుట గాని, ఈ పరిచ్ఛేదములో పేర్కొనినటువంటివే అయినను కాకున్నను ఒక వ్యక్తికి ఏదో విధముగా సహాయ పడుటగాని చేరి యుండును.

అధ్యాయము-3

శిక్షలను గురించి

"శిక్షలు"

53. ఈ స్మృతి నిబంధనల క్రింద అపరాధులకు విధింపబడెడు శిక్షలు,

మొదటిది—— మరణ దండన; రెండవది—— యావజ్జీవ కారావాసము ; మూడవది——XXX నాల్గవది——కారావాసము:—— ఇది రెండు రకములు, అవేవనగా :——

(1) కఠిన కారావాసము, అనగా కఠోర శ్రమతో కూడినది ; (2) సాధారణ కారావాసము;

అయిదవది——ఆస్తి సమపహరణము; ఆరవది—— జుర్మానా, ద్వీపాంతర వాసమును గూర్చిన నిర్దేశపు అన్వయము,

53- ఏ (1) తత్సమయమున అమలులో నుండు ఏదేని ఇతర శాసనములో గాని, ఏదేని ఆట్టి శాసనమును బట్టియైనను, రద్దు చేయబడిన ఏదేని ఆనుశాసనమును బట్టియైనను ప్రభావము కలిగియున్న ఏదేని లిఖిత పత్రములో లేక ఉత్తరువులో గాని, " యావజ్జీవ ద్వీపాంతర వాసము"ను గూర్చిన నిర్దేశమును దేనినైనను, ఉపపరిచ్ఛేదము మరియు ఉపపరిచ్ఛేదము (3) యొక్క నిబంధనలకు లోబడి, “యావజ్జీవ కారావాసము" ను గూర్చిన నిర్దేశముగా అన్వయించవలెను.

(2) క్రిమినలు ప్రక్రియా స్మృతి ( సవరణ) చట్టము, 1955 (1955లోని 26వ చట్టము) యొక్క ప్రారంభమునకు పూర్వము నిర్ధిష్ట కాలావధిక ద్వీపాంతరవాస దండనోత్తరువు ఈయబడిన ప్రతి కేసులోను ఆదే కాలావధికి కఠిన కారావాస దండనోత్తరువు ఈయబడిన ఎట్లో అదేరీతిగా అపరాధిని శిక్షించవలెను.

(3) తత్సమయమున అమలులోనుండు ఏదేని ఇతర శాసనములో కాలావధిక ద్వీపాంతరవాసమును గూర్చిన లేక (పేరు ఏదైనను) ఏదేని లఘుతర కాలావధిక ద్వీపాంతరవాసమును గూర్చిన ఏ నిర్దేశమనను వదలివేయబడినట్లు భావించవలెను.

(4) తత్సమయమున అమలులో నుండు ఏదేని ఇతర శాసనములోని “ద్వీపాంతరవాసము"ను గూర్చిన ఏ నిర్దేశమునైనను——

(ఏ) ఆ పదబంధమునకు అర్థము "యావజ్జీవ ద్వీపాంతర వాసము" అయినచో, “యావజ్జీవ కారావాసము" ను గూర్చిన నిర్దేశముగా, అన్వయించవలెను.

(బీ} ఆ పదబంధమునకు అర్థము ఏదేని లఘుతర కాలావధిక ద్వీపాంతరవాసము అయినచో, ఆ నిర్దేశము వదలి వేయబడినట్లు భావించవలెను.

మరణదండనను లఘాకరించుట.

54. మరణ దండనోత్త రువు ఈయబడిన ప్రతి కేసులోను సమంచిత ప్రభుత్వము, అపరాధి యొక్క సమ్మతి లేకుండగనే, ఆ శిక్షను ఈ స్మృతి నిబంధనల యందలి ఏదేని ఇతర శిక్షగా లఘాకరించ వచ్చును.

యావజ్జీవ కారావాస దండనను లఘాకరించుట.

55. యావజ్జీవకారావాస దండనోత్తరువు ఈయబడిన ప్రతి కేసులోను, సముచిత ప్రభుత్వము ఆపరాధి సమ్మతి లేకుండగనే, ఆ శిక్షను పదునాలుగు సంవత్సరములకు మించని కాలావధికి, రెంటిలో ఒక రకపు కారావాసమునకు లఘకరించవచ్చును.

55-ఏ. 54వ మరియు 55వ పరిచ్ఛేదములలో “ సముచిత ప్రభుత్వము" అనగా,——

సముచిత ప్రభుత్వము నిర్వచనము.

(ఏ) ఆ దండనోత్తరువు మరణ దండనోత్తరువు అయిన కేసులలోగాని, సంఘము యొక్క కార్యపాలకాధికారము విస్తరించు విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమును ఉల్లంఘించి చేసిన అపరాధమును గురించిన దండనోత్తరువు అయిన కేసులలో గాని, కేంద్ర ప్రభుత్వము అని అర్థము.

ఆ దండనోత్తరువు (మరణ దండనోత్తరువు. అయినను. కాకున్నను ) రాజ్య కార్యపాలకాధికారము విస్తరించు విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమును ఉల్లంఘించి చేసిన అపరాధమును గురించినదైన కేసులతో ఏ రాజ్యములో అపరాధిపై దండనోత్తరువు ఈయబడినదో ఆ రాజ్య ప్రభుత్వము, అని అర్థము.

56.X X X X X X

శిక్ష కాలావధుల భిన్నములు.

57. శిక్ష కాలావధుల భిన్నములను లెక్క వేయుటలో, కారావాసమునకు సమానమై నదిగా లెక్కించవలెను. యావజ్జీవ కారావాసమును ఇరువది సంవత్సరముల కారావాసమునకు సమానమై నదిగా లెక్కించవలెను.

58. X X X X X X X X X X X X

59. X X X X X X X X X X X X

దండన (కొన్ని కారావాసపు కేసులలో) పూర్ణత: లేక భాగతః కఠినమైనదిగాగాని సాధారణమైనదిగాగాని ఉండవచ్చును.

60. అపరాధిని రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపదగియున్న ప్రతి కేసులోను, అట్టి కారావాసము పూర్ణత: కఠినమైనదిగ యుండవలెనని గాని, పూర్ణత: సాధారణమై నదిగ యుండవలెనని గాని, అట్టి కారావాసములో కొంత భాగము కఠినమైనదిగను మిగతా భాగము సాధారణమైనదిగను యుండవలెనని గాని, దండనోత్తరువులో ఆదేశించుటకు అట్టి ఆపరాధిని దండించు న్యాయస్థానము సమర్ధమైనదై యుండును. 61. X X X X X X

62 X X X X X X

జుర్మానా మొత్తము.

63. ఎంత మొత్తము మేరకు జర్మానా వేయవచ్చునో తెలుపబడని యెడల, ఆపరాధికి విధించదగు జుర్మానా మొత్తమునకు పరిమితి లేదు; కాని జుర్మానా అత్యధికమై యుండరాదు.

జర్మానా చెల్లించనందుకు కారావాస దండన.

64. కారావాసముతోపాటు జుర్మానాతో కూడ శిక్షింపదగు అపరాధమునకు, కారావాసముతోగాని కారావాసము లేకుండగాని, అపరాధిని జుర్మానాతో దండించు ప్రతి కేసులోను,

మరియు, కారావాసముతోనైనను జుర్మానాతో అయినను, లేక జుర్మానాతో మాత్రమే అయినను శిక్షింపదగు అపరాధము నకు అపరాధిని జుర్మానాతో దండించు ప్రతి కేసులోను,

జుర్మానా చెల్లించని పక్షమున, అపరాధి ఒక నిశ్చిత కాలావధికి కారావాసమును అనుభవించవలెనని దండనోత్తరువు ద్వారా ఆదేశించుటకు అట్టి అపరాధిని దండించు న్యాయస్థానము సమర్థమైనదై ఉండును, ఈ కారావాసము, అతనికి ఈయబడిన దండనోత్తరువు క్రింద లేక దండన లఘాకరణమునుబట్టి అతడు పాత్రుడగు ఏదేని ఇతర కారావాసమునకు అదనముగ ఉండును.

కారావాసము మరియు జుర్మానా విధింపదగినపుడు, జుర్మానా చెల్లించనందుకు కారావాస పరిమితి.

65. కారావాసముతోపాటు జుర్మానాతో కూడ శిక్షింపదగినదైన అపరాధమైనచో, జూర్మానా చెల్లించని పక్షమున ఆ అపరాధికి న్యాయస్థానము ఆదేశించునట్టి కారావాస కాలావధి, ఆ ఆపరాధమునకు నియతమైన గరిష్ట కారావాస కాలావధిలో నాలుగవ వంతుకు మించరాదు.

జుర్మానా చెల్లించనందుకు ఏరకపు కారావాసము విధించవచ్చును.

66. జుర్మానా చెల్లించని పక్షమున న్యాయస్థానము విధించునట్టి కారావాసము, ఆ ఆపరాధమును గురించి అపరాధికి దండనగా ఈయదగు ఏ రకపు కారావాసమైనను కావచ్చును.

అపరాధము జుర్మానాతో మాత్రమే శిక్షింపదగిన దైనపుడు, జుర్మానా చెల్లించనందుకు కారావాసము,

67. జుర్మానాతో మాత్రమే శిక్షింపదగినదైన అపరాధమైనచో, జూర్మానా చెల్లించని పక్షమున న్యాయస్థానము విధించునట్టి కారావాసము సాధారణమైనదై ఉండవలెను, మరియు జుర్మానా చెల్లించని పక్షమున అపరాధిని కారావాసములో వుంచవలసినదిగా న్యాయస్థానము ఆదేశించు కారావాస కాలావధి ఈ క్రింది కాల ప్రమాణమును మించరాదు : అనగా జర్మానా మొత్తము ఏబది రూపాయలకు మించనపుడు రెండు మాసములకు మించని ఎంత కాలావధియైనను" జుర్మానా మొత్తము ఒక వంద రూపాయలకు మించనపుడు లుగు మాసములకు మించని ఎంత కాలావధియైనన్న ఏ ఇతర కేసులోనైనను ఆరు మాసములకు మించని ఎ కాలావధియైనను కావచ్చును.

జుర్మానా చెల్లించిన మీదట కారావాసము అంతమగుట.

68. జుర్మానా చెల్లించని పక్షమున విధింపబడిన కారావాసము, ఆ జుర్మానా చెల్లించినపుడుగాని శాసన ప్రక్రియ ద్వారా వసూలు అయినపుడుగాని, అంతమగును.

జూర్మానాలో ఆనుపాతిక భాగము చెల్లించిన మీదట కారావాసము అంతమగుట.

69. జుర్మానా చెల్లించని పక్షమున నియతము చేసిన కారావాసపు కాలావధి ముగియుటకు పూర్వము, కొంత జుర్మానా చెల్లింపబడినచో, లేక వసూలు చేయబడినచో, ఇంకను చెల్లింపవలసిన జుర్మానా ఆనుపాతిక భాగము జుర్మానా చెల్లించనందుకు అనుభవించిన కారావాస కాలావధి ఆనుపాతిక భాగముకంటె తక్కువ కాకుండుచో, ఆ కారావాసము అంతమగును.

ఉదాహరణము

'ఏ' కు ఒక వంద రూపాయల జూర్మానాయు, ఆ జూర్మానా చెల్లించని పక్షమున నాలుగు మాసముల కారావాస దండనయు విధింపబడినవి. ఇచట కారావాసపు గడువులో ఒక మాసము పూర్తి యగుటకు పూర్వము డెబ్బది అయిదు రూపాయల జుర్మానా చెల్లింపబడినయెడల లేక వసూలు చేయబడిన యెడల, మొదటి మాసము పూర్తి కాగానే, 'ఏ' విడుదల చేయబడును. మొదటి మాసము పూర్తి యగు సమయమున లేక ఆ తరువాత 'ఏ' కారావాసముతో ఉంటూ ఉండగా ఎప్పుడైనను డెబ్బది అయిదు రూపాయలు చెల్లింపబడినచో లేక వసూలు చేయబడినచో, తత్ క్షణమే 'ఏ' విడుదల చేయబడును. కారావాసపు గడువులో రెండు మాసములు పూర్తి యగుటకు పూర్వము ఏబది రూపాయల జూర్మానా చెల్లింపబడినచో లేక వసూలు చేయబడినచో, రెండు మాసములు పూర్తి కాగానే 'ఏ' విడుదల చేయబడును. ఆరు సంవత్సరముల లోపల గాని, కారావాసములో ఉన్నపుడుగాని, జుర్మానాను వసూలు చేయవచ్చును. మరణము వలన ఆస్తి బాధ్యతవిముక్తముకాదు.

70. జుర్మానాను గాని, దానిలో చెల్లింపక మిగిలియున్న ఏదేని భాగమునుగాని, దండనోత్తరువు ఈయబడిన పిమ్మట ఆరు సంవత్సరముల లోపల ఎప్పుడైనను, మరియు దండనోత్తరువు క్రింద అపరాధి ఆరు సంవత్సరముల కంటె హెచ్చు కాలావధికి కారావాసమునకు పాత్రుడై యున్నచో, అప్పుడు ఆ కాలావధి పూర్తి అగుటకు పూర్వము ఎప్పుడైనను వసూలు చేయవచ్చును, మరియు అపరాధి మరణము వలన అతని మరణానంతరము అతని ఋణములను చెల్లించవలసిన బాధ్యతకు శాసనరీత్యా లోనై యున్న ఆస్తికి అట్టి బాధ్యత విముక్తముకాదు.

అనేక అపరాధములతో కూడుకొనియున్న ఆపరాధమునకు శిక్షా పరిమితి.

71. ఏదేని అపరాధము కొన్ని భాగములతో కూడుకొనియుండి, అందలి ఏ భాగమైనను దానికదే ఒక అపరాధ మగునెడల, అపరాధిని అట్టి అతని అపరాధములలో ఒక దానికి గల శిక్ష కంటే ఎక్కువ శిక్షతో దండించ వచ్చునని అభివ్యక్తముగా నిబంధన ఉన్ననే తప్ప, అట్లు దండించరాదు.

ఏ పని యైనను తత్సమయమున అములు నందుండి అపరాధములను నిర్వచించునట్టి లేక శిక్షించునట్టి ఏదేని శాసనములోని రెండు లేక అంతకు మించిన వేరువేరు నిర్వచనముల క్రిందికి వచ్చు ఆపరాధమగు నెడల, లేక

అనేక కార్యములలోని ఒక కార్యము దానికదే లేక ఒకటి కంటే ఎక్కువ కార్యములు వాటికవే ఒక అపరాధము అగుచు, అన్నియు చేరి ఒక విభిన్న అపరాధమగునెడల,

అపరాధిని విచారణ చేయు న్యాయస్థానము అట్టి అపరాధములలో ఏ ఒక దానికై నను విధించగల శిక్ష కంటె తీవ్రతరమైన శిక్షతో అతనిని దండించరాదు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' ఒక కర్రతో 'జడ్'ను ఏబది దెబ్బలు కొట్టును. ఇచట 'ఏ' ఆ మొత్తము దెబ్బల వల్లమ, ఆ మొత్తము దెబ్బలలోని ఒక్కొక్క దెబ్బవల్లను కూడ స్వచ్ఛందముగా 'జడ్'కు ఘాత కలిగించుట అను అపరాధమును చేసియుండ వచ్చును. ప్రతి దెబ్బకు 'ఏ' శిక్షా పాత్రుడగుచో అతనిని ఒక్కొక్క దెబ్బకు సంవత్సరము చొప్పున ఏబది సంవత్సరముల పాటు కారావాసమునందు ఉంచవచ్చును. కాని అతడు ఆ మొత్తము దెబ్బలకై ఒక శిక్షకు మాత్రమే పాత్రుడగును.

(బి) కాని, 'జడ్'ను 'ఏ' కొట్టుచుండగా 'వై' జోక్యము కలిగించుకొనును.'ఏ' ఉద్దేశ పూర్వకముగా 'వై'ని కొట్టినచో, ఇచట 'వై'ని కొట్టిన దెబ్బ, 'ఏ' స్వచ్ఛందముగా 'జడ్'కు ఘాత కలిగించు కార్యములో భాగము కాదు. కాబట్టి 'జడ్'కు స్వచ్ఛందముగా ఘాత కలిగించినందుకు ఒక శిక్షకును, 'వై'ని కొట్టిన దెబ్బకు మరొక శిక్టకును 'ఏ' పాత్రుడగును.

ఒక వ్యక్తి అనేక ఆపరాధములలో ఒకటి చేసినవాడై దేనిని అతడు చేసెనో సందేహాస్పదమని తీర్పులో చెప్పబడినపుడు ఆ వ్యక్తి కి శిక్ష.

72. తీర్పులో నిర్దిష్టమైన అనేక అపరాధములలో ఒక దానిని ఒక వ్యక్తి చేసెననియు, కాని ఆ అపరాధములలో దేనిని అతడు చేసినదీ సందేహాస్పదమనియు, తీర్పు ఈయబడిన అన్ని కేసులలోను, నిబంధనలను బట్టి ఆ అపరాధము అన్నిటికీ ఒకే తరహా శిక్ష లేనిచో, దేనికి నిబంధనలను బట్టి అన్నిటికంటే తక్కువ శిక్ష గలదో, ఆ ఆపరాధమునకు అపరాధిని దండించవలెను.

ఏకాంతపు చెఱ.

73. ఈ స్మృతి క్రింద కఠిన కారావాస దండనోత్తరువు విచ్చుటకు న్యాయస్థానము అధికారము కలిగియున్నట్టి అపరాధము చేసిన ఏ వ్యక్తియైనను దోషస్థాపితుడై నపుడెల్లను, అపరాధికి దండనగ విధింపబడిన కారావాస శిక్షలో ఏదేని భాగమును లేక ఏవేని భాగములను, మొత్తముమీద మూడు మాసములకు మించకుండ, అపరాధి ఏకాంతపు చెఱయందు గడపవలెనని ఈ క్రింద పేర్కొనబడిన కాల ప్రమాణము ప్రకారము న్యాయస్థానము తమ దండనోత్తరువు ద్వారా ఉత్తరువు ఈయవచ్చును; అనగా———

కారావాస కాలావధి ఆరు మాసములకు మించనిచో, ఒక మాసమునకు మించని కాలము,

కారావాస కాలావధి ఆరు మాసములకు మించి, ఒక సంవత్సరమునకు మించనిచో, రెండు మాసములకు మించని కాలము,

కారావాస కాలావధి ఒక సంవత్సరమునకు మించినచో, మూడు మాసములకు మించని కాలము.

ఏకాంతపు చెఱ యొక్క కాలపరిమితి.

74. ఏకాంతపు చెఱను విధించిన దండనోత్తరువును అమలు పరచుటలో, ఏ సందర్భములోనైనను అట్టి చెఱ తడవకు పదునాలుగు దినములకు మించకూడదు, మరియు ఏకాంతపు చెఱ కాలావధుల మధ్య అట్టి కాలావధులకు తక్కువకాని విరామములు ఉండవలెను, మరియు విధింపబడిన కారావాసము మూడు మాసములకు మించినపుడు, విధింప బడిన మొత్తము కారావాసములో ఏ ఒక మాసములోనైనను ఏకాంతపు చెఱ ఏడు దినములకు మించకూడదు, మరియు ఏకాంతపు చెఱల కాలావధుల మధ్య అట్టి కాలావధులకు తక్కువ కాని విరామములు ఉండవలెను.

12వ ఆధ్యాయము లేక 17వ అధ్యాయము క్రింద కొన్ని అపరాధముల విషయంలో పూర్వము దోష స్థాపనజరిగి యున్నచో హెచ్చింపు శిక్ష.

75. ఎవరైనను

(ఏ) ఈ స్మృతి యొక్క 12వ అధ్యాయము లేక 17వ అధ్యాయము క్రింది మూడు సంవత్సరములు లేక అంతకెక్కువ కాలావధిపాటు రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపదగిన అపరాధమునకు, భారత దేశములో ఒక న్యాయస్థానముచే,

(బి) ... ... ... ... ...

దోషస్థాపితుడై యుండి, ఆ రెండు అధ్యాయములలో దేని క్రిందనైనను ఆదే కాలావధికి అదే రకపు కారావాసముతో శిక్షింపదగిన ఏదేని అపరాధమును చేసినచో, అట్టి తరువాతి ప్రతి అపరాధమునకు, యావజ్జీవ కారావాసమునకు గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసమునకు గాని లోను కావలసియుండును.

అధ్యాయము - 4

సాధారణ మినహాయింపులు

శాసనరీత్యా బద్దుడై యుండి, లేక తాను అట్లు బద్దుడై యున్న సంగతిని గూర్చిన పొరపాటువల్ల విశ్వసించి యుండి ఒక వ్యక్తి చేసినట్టి కార్యము.

76. ఒక వ్యక్తి దేనినైనను చేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి లేక అట్లు బద్దుడై ఉన్నానని శాసనమును గూర్చిన పొరపాటువలన గాక, సంగతిని గూర్చిన పొరపాటువలన సద్భావముతో విశ్వసించియుండి, దానిని చేసినచో, అది అపరాధము కాదు.

ఉదాహరణములు

(ఎ) 'ఎ' అను సైనికుడు శాసన ఆజ్ఞానుసారముగా, తన పై అధికారి ఆదేశమునుబట్టి , ఒకమూకపై కాల్పులు జరుపును. 'ఎ' ఎట్టి అపరాధమును చేయలేదు.

(బి) న్యాయస్థానములో ఒక అధికారి అగు 'ఏ' ఆ న్యాయ స్థానముచే 'వై'ని అరెస్టు చేయుటకు ఉత్తరువు చేయబడినవాడై , తగు దర్యాప్తు జరిపి 'జడ్' ను 'వై' అని అనుకొని 'జడ్'ను అరెస్టు చేయును. 'ఏ' ఎట్టి అపరాధమున చేయలేదు.

వ్యాయికముగా వ్యవహరించునపుడు న్యాయాధీశుడు చేసిన కార్యము.

77. శాసనము ద్వారా ఈయబడిన, లేక ఈయబడినదని తాను సద్భాసముతో విశ్వసించినట్టి, ఏదేని అధికారమును వినియోగించి ఒక న్యాయాధిశుడు, వ్యాయికముగా వ్యవహరించునపుడు చేసినట్టి దేదియు అపరాధము కాదు,

న్యాయస్థానము యొక్క తీర్పును, లేక ఉత్తరువును అనుసరించి చేసిన కార్యము.

78. "ఒక న్యాయస్థానముయెక్క తీర్పును, లేక ఉత్తరువును అనుసరించి చేయవలసినది గాని, దానిని బట్టి చేయదగిన దేనిని గాని ఒక వ్యక్తి అట్టి తీర్పు, లేదా ఉత్తరువు అమలులో ఉండగా చేసినచో, ఆ కార్యమేదియు, అట్టి తీర్పును, లేక ఉత్తరువును ఇచ్చుటకు ఆ న్యాయస్థానమునకు అధికారిత లేనప్పటికినీ, ఆ న్యాయస్థానమునకు అట్టి అధికారిత ఉండెనని ఆ కార్యము చేసిన వ్యక్తి సద్భావముతో విశ్వసించియుండినట్లయితే, అపరాధము కాదు.

ఒక వ్యక్తి శాసన సమర్ధన గలిగి, లేక తనకు అట్టి సమర్థన గలదనే సంగతిని గూర్చిన పొరపాటు వలన విశ్వసించి, చేసిన కార్యము.

79. శాసన సమర్థన కలిగియుండి, లేక శాసనమును గూర్చిన పొరపాటువలన గాక సంగతిని గూర్చిన పొరపాటు వలన తనకు శాసన సమర్ధన గలదన్న సద్భావముతో విశ్వసించి యుండి, ఎవరేని వ్యక్తి చేసినదేదియు ఆపరాధము కాదు.

ఉదాహరణము

'ఏ' కు హత్యగా కాన్పించెడు ఒక పనిని 'జడ్' చేయుచుండగా 'ఏ' చూచును. హత్య చేయుచున్న హంతకులను పట్టుకొనుటకు వ్యక్తులందరికి శాసన మొసగిన అధికారమును పురస్కరించుకొని సద్భావముతో తనకు ఉత్తమమని తోచినంత మేరకు, 'జడ్'ను సముచిత ప్రాధికారుల సమక్షమునకు తీసికొనిపోవుటకుగాను, 'జడ్'ను 'ఏ' పట్టు కొనును. 'జడ్' ఆత్మరక్షణకై వ్యవహరించుచుండెనని చివరకు తేలినప్పటికినీ, 'ఏ' ఎట్టి అపరాధమును చేసియుండలేదు.

శాసనసమ్మతమైన కార్యము చేయుట యందు దుర్ఘటన.

80. శాసనసమ్మతమైన కార్యమును శాసనసమ్మతమైన రీతిలో శాసనసమ్మతమైన పద్ధతుల ద్వారా తగు జాగరూకత, హెచ్చరికలతో చేయుటలో ఎట్టి అపరాధిక ఉద్దేశముగాని, అట్టి ఎరుక గాని లేకుండ దుర్ఘటన లేక దురదృష్టమువలన చేసినదేదియు అపరాధము కాదు.

ఉదాహరణము

'ఏ' ఒక చిన్న గొడ్డలితో పని చేయుచుండెను., గొడ్డలి చిప్ప ఎగిరిపోయి పక్కన ఉన్న మనిషిని చంపును. ఇచట 'ఏ' యందు తగు హెచ్చరిక కొరవడియుండనిచో, అతడు చేసిన కార్యము మన్నింపదగినదై యుండును, మరియు ఆది అపరాధము కాదు.

కీడు కలిగించగల దైనను, అపరాధిక ఉద్దేశము లేకుండ, ఇతరమైన కీడును నివారించుటకు చేసిన కార్యము.

31. కీడు కలిగించవలెనను అపరాధిక ఉద్దేశమేదియు లేకుండ, వ్యక్తికి గాని ఆస్తికిగాని ఇతరమైన కీడు నివారించు లేక తప్పించు నిమిత్తము సద్భావముతో ఒక పని చేయబడినచో, ఆ పని ఏదియు, కీడును కలిగించగలదను ఎరుకతో చేయబడినదను కారణమాత్రమున అపరాధము కాదు.

విశదీకరణము :- - - అట్టి సందర్భములో, ముప్పుతో కూడిన ఆ కార్యమును కీడు కలిగించగలదను ఎరుకతో చేయుట సమర్థనీయమై నదగుటకు లేక మన్నింపదగుటకు నివారింపవలసిన లేక తప్పించవలసిన కీడు స్వభావమును బట్టి యు, ఆసనృతను బట్టియు తగినంతదిగ యుండెనా అనునది ఒక సంగతిని గూర్చిన ప్రశ్న ఆగును.

ఉదాహరణములు

(ఏ) ఒక బాష్ప జలయానము యొక్క కెప్టెన్ అంగన 'ఏ' తన జలయానపు మార్గమును మార్చిననే తప్ప, తాను ఆ జలయానమును ఆపగలుగుటకు ముందే, ఇరువది లేక ముప్పది మంది ప్రయాణీకులు ఉన్నట్టి, 'బీ' అన్న పడవను అనివార్యముగ ఢీకొని ముంచివేయవలసినట్టియు, తన మార్గము మార్చుటద్వారా ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ఉన్నట్టిదై తాను బహుశా : తప్పుకొనగలుగునట్టి 'సీ' అను పడవను ఢీకొని ముంచివేయు ముప్పు కలిగించగలట్టియు పరిస్థితిలో అకస్మాత్తుగా తనవలన ఎట్టి తప్పిదముగాని, నిర్లక్ష్యముగాని లేకయే, చిక్కుకొనును. ఇచట 'సీ' లను పడవను ముంచి వేయు ఉద్దేశము లేకుండ 'బీ' అను పడవలోని ప్రయాణీకులకు అపాయము తప్పించు నిమిత్తము సద్భావముతో 'ఏ' తన మార్గమున మార్చినచో, తాను తప్పించ ఉద్దేశించిన ఆ అపాయము, 'సీ' అను పడవను ముంచివేయు ముప్పునకు అతడు గురిచేయుటను మన్నింపదగినంతదగు ఆపాయమేనని సంగతికి సంబంధించిన విషయముగా నిశ్చయింపబడినచో, తాను చేయుచున్న కార్యము వలన ఆట్లు జరుగగలదని ఎరిగి యుండియు, 'సీ' అను పడవను ముంచి వేసినప్పటికినీ, అతడు అపరాధము చేయలేదు.

(బీ) ఒక పెద్ద అగ్ని ప్రమాదములో మంటలు వ్యాపించకుండా చేయుటకు గాను ఇండ్లను 'ఏ' పడగొట్టును. అతడు సద్భావముతో మనుషులను లేక ఆస్తిని కాపాడవలెనను ఉద్దేశముతో ఈ పని చేయును. ఇచట నివారింపవలసిన కీడు యొక్క స్వభావమును బట్టియు, ఆసన్నతను బట్టియు, 'ఏ' యొక్క కార్యము మన్నింపదగినదని నిశ్చయింపబడినచో, ఏ అపరాది కాడు.

ఏడు సంవత్సరముల లోపు వయసుగల బిడ్డ చేసిన కార్యము.

82. ఏడు సంవత్సరముల లోపు వయస్సుగల బిడ్డ చేసినదేదియు అపరాధము కాదు.

ఏడు సంవత్సరములు దాటి పండ్రెండు సంవత్సరముల లోపు వయస్సుకలిగి అపరిపక్వ బుద్ధి గల బిడ్డ చేసిన కార్యము.

83. ఏడు సంవత్సరములు దాటి పండ్రెండు సంవత్సరముల లోపు వయసు గలిగి తాను దేనినై నను చేయ సందర్భము నందు తన ప్రవర్తన యొక్క స్వభావ పరిణామములను నిర్ణయించుకొనజాలునంతటి పరిపక్వమైన బుద్ది బలము లేనట్టి బిడ్డ చేసినదేదియు అపరాధము కాదు.

మతిస్తిమితములేని వ్యక్తి చేసిన కార్యము

84. దేనినైనను చేయు సమయమున మతిస్తిమితములేని కారణముగ, తాను చేయు కార్యము యొక్క, స్వభావమును గాని, తాను చేయుచున్నది దోషమని లేక శాసన విరుద్ధమని గాని, ఎరుగజాలని వ్యక్తి చేసినదేదియు అపరాధము కాదు.

తన ఇష్టమునకు వ్యతిరేకముగా మత్తు కలిగింపబడిన కారణమున వివేచన చేయజాలని వ్యక్తి చేసిన కార్యము.

85. దేనినైనను చేయు సమయమున మత్తెక్కిన కారణముగ తాను చేయు కార్యము యొక్క స్వభావమును గాని, తాను చేయు చున్నది దోషమని లేక శాసన విరుద్ధమని గాని, ఎరుగజాలని వ్యక్తి చేసిన దేదియు అపరాధము కాదు, అయితే, అతనికి మత్తెక్కించిన వస్తువు అతనికి తెలియకుండ, లేక అతని ఇష్టమునకు వ్యతిరేకముగ అతనికి ఈయబడి యుండవలెను. ఒక ప్రత్యేకమైన ఉద్దేశముగాని ఎరుక గాని ఉండవలసిన అపరాధమును మత్తెక్కిన వ్యక్తి చేయుట.

86. చేయబడిన కార్యము ఒక ప్రత్యేకమైన ఎరుకతోగాని ఉద్దేశముతోగాని చేయబడిననే తప్ప అపరాధము కానట్టి కేసులలో, సుత్తావస్థలో ఆ కార్యమును చేయు వ్యక్తి , అతనికి మత్తు కలిగించిన వస్తువు అతనికి తెలియకుండ లేక అతని ఇష్టమునకు వ్యతిరేకముగా అతనికీయబడియుండిన నేతప్ప, మత్తు లేకపోయినచో అతనికి ఎట్టి ఎరుక ఉండి ఉండెడిదో అట్టి ఎరుకయే అతనికి ఉండిఉన్నట్లు, చర్యలకు పాత్రుడగును.

మరణము లేక దారుణమైన ఘాతను కలిగించు ఉద్దేశము లేకయే మరియు కలిగించ గలదను ఎరుక లేకయే సమ్మతిపై చేసిన కార్యము.

87. మరణము లేక దారుణమైన ఘాతను కలిగించు ఉద్దేశము లేకయే, మరణము లేక దారుణమైన ఘాతను కలిగించగలదని చేయువానికి ఎరుక లేకయే, చేసినదేదియు, దాని వలన కలుగు ఏదేని కీడును సహించుటకు పదునెనిమిది సంవత్సరములు దాటిన వయసు కలిగి, అభివ్యక్తమైన లేక గర్భితమైన సమ్మతి నొసగిన ఏ వ్యక్తి కైనను దాని వలన కలుగునట్టి లేక కలిగించవలెనని చేయువానిచే ఉద్దేశింపబడినట్టి కీడు కారణముగా గాని, అట్టి కీడు కలిగే ముప్పునకు లోనగుటకు సమ్మతించిన అట్టి వ్యక్తికి ఎవరికైనను కీడు కలుగజేయగలదని చేయువానికి తెలిసియున్నట్లు ఏదేని కీడు కారణముగ గాని, అపరాధము కాదు.

ఉదాహరణము

'ఏ' 'జడ్', అను వారు ఒకరితో నొకరు సరదాగా సాము చేయుటకు ఒప్పుకొందురు. ఈ ఒప్పందమునందు క్రీడా నియను ఉల్లంఘనము లేకుండ అట్టి సాము చేయుటలో కలిగింపబడు ఏదేని కీడును సహించుటకు వారిరువురి సమ్మతి గర్భితమై యున్నది. యధానియమముగా ఆడుచు 'జడ్' కు 'ఏ' ఘాత కలిగించుచో, 'ఏ' ఎట్టి అపరాధమును చేయలేదు.

మరణము కలిగించు ఉద్దేశము లేకుండ వ్యక్తిఎలుకొరకు సద్భావముతోను, అతని సమ్మతితోను చేసిన కార్యము.

88. మరణమును కలిగించు ఉద్దేశము లేనట్టి దేదియు, దానివలన కలుగు కీడును సహించుటకు లేక ఆ కీడు కలిగే ముప్పునకు లోనగుటకు, అభివ్యక్తమైన లేక గర్భితమైన సమ్మతి నొసగిన ఏ వ్యక్తి యొక్క మేలుకొరకు అది సద్బావముతో చేయబడినదో, ఆ వ్యక్తికి ఆది కలిగించునట్టి లేక చేయువానిచే కలిగింప ఉద్దేశింపబడినట్టి, లేక చేయు వానికి అది కలిగించగలదని తెలిసియున్నట్టి ఏదేని కీడు కారణముగా, అపరాధము కాదు.

ఉదాహరణము

'ఏ' అను ఒక శస్త్ర చికిత్సకుడు, తానొక ప్రత్యేక శస్త్ర చికిత్స చేసినచో బాధాకరమైన వ్యాధితో నున్నటి 'జడ్'కు మరణము కలుగవచ్చునని తెలిసియుండి, అయితే 'జడ్'కు మరణము కలిగించు ఉద్దేశము లేకుండ, 'జడ్'కు మేలు కలుగవలెనని సద్భావముతో ఉద్దేశించి 'జడ్' సమ్మతితో 'బడ్'కు ఆ శస్త్రచికిత్స చేయుసు. ఎట్టి అపరాధమును చేయలేదు.

బిడ్డ యొక్క లేక ఉన్మాద వ్యక్తి యొక్క మేలుకొరకు సంరక్షకుడు చేసిన లేక సంరక్షకుని సమ్మతితో సద్భావ పూర్వకముగా చేసిన కార్యము.

89. పండ్రెండు సంవత్సరముల లోపు వయసుగల లేక మతి స్తిమితము లేని వ్యక్తి యొక్క మేలు కొరకు సద్భావముతో ఆ వ్యక్తి యొక్క సంరక్షకుడుగాని, శాసన సమ్మతమున ఆ వ్యక్తి యొక్క రక్షణభారము కలిగి ఉన్న, ఎవరేని ఇతర వ్యక్తి గాని, ఆ సంరక్షకుని యొక్క లేక శాసనసమ్మతముగా రక్షణభారము కలిగియున్న ఆ ఇతర వ్యక్తి యొక్క అభివ్యక్తమైన లేదా గర్భితమైన సమ్మతితోగాని, చేసినదేదియు, ఆ వ్యక్తికి దానిచే కలుగునట్టి, లేక చేయు వానిచే కలిగింప ఉద్దేశింపబడినట్టి, లేక కలిగించగలదని చేయువానికి తెలిసియున్నట్టి ఏదేని కీడు కారణముగా అపరాధము కాదు :

మినహాయింపులు.

అయితే——

మొదటిది :-- ఈ మినహాయింపు ఉద్దేశపూర్వకముగా మరణము కలిగించుటకు గాని, మరణము కలిగించ ప్రయత్నించుటకు గాని విస్తరించడు :

రెండవది :-- ఈ మినహాయింపు మరణమును లేక దారుణమైన ఘాతను నివారించుటకైనను, తీవ్రమైన రోగమును లేక అంగవైకల్యమును నయము చేయుటకైనను కానట్టి ఏ ఇతర ప్రయోజనము కొరకో, మరణము కలిగించగలదని చేయుచున్న వ్యక్తి ఎరిగియు చేసినట్టి ఉనికిని విస్తరించదు:

మూడవది :--- ఈ మినహాయింపు, మరణము లేక దారుణమైన ఘాతను నివారించుటకై నను, ఏదేని తీవ్రమైన రోగమును లేక అంగవైకల్పమును నయము చేయుటకైనను తప్ప, స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కలిగించుటకు, లేక దారుణమైన ఘాత కలిగించుటకై ప్రయత్నించుటకు విస్తరించదు:

నాల్గవది :-- ఈ మినహాయింపు ఏ అపరాధమును చేయుటకు విస్తరించదో, ఆ అపరాధ దుష్ప్రేరణకును విస్తరించదు.

ఉదాహరణము

శస్త్రచికిత్స వలన తన బిడ్డకు మరణము కలుగవచ్చునని 'ఏ' ఎరిగియు, ఆ బిడ్డకు మరణము కలిగించు ఉద్దేశము లేకుండ, ఆ బిడ్డ మేలు కొరకు, ఆ దీక్ష సమ్మతి లేకయే శస్త్ర చికిత్సకునిచే శిలా మేహమునకై ఆ బిడ్డకు సద్భావముతో శస్త్ర చికిత్స చేయించును. 'ఏ' యొక్క లక్ష్యము ఆ బిడ్డకు నయము చేయుటయే కనుక అతడు ఈ మినహాయింపు - క్రిందికి వచ్చును.

భయము వలన లేక భ్రమవలన సమ్మతి ఈయబడినదని ఎరిగి యున్నప్పుడు.

90. హాని కలుగునను భయము వలనగాని, సంగతిని గూర్చిన భ్రమ వలన గాని ఒక వ్యక్తిచే సమ్మతి ఈయబడి, అట్టి భయము లేక భ్రమ పరిణామముగా ఆ సమ్మతి ఈయబడినదని కార్యము చేయుచున్నవ్యక్తి ఎరిగియున్నచో లేక అట్లని విశ్వసించుటకు అతనికి కారణమున్నచో, లేక

ఉన్మాద వ్యక్తి యొక్క సమ్మతి.

మతిస్తిమితము లేనందున లేక మత్తులో ఉన్నందున తాను దేనికి సమ్మతించుచున్నడో, దాని స్వభావ పరిణామము లను అర్థము చేసికొనజాలని వ్యక్తి సమ్మతి ఇచ్చినచో, లేక

బిడ్డ యొక్క సమ్మతి.

సందర్భమును బట్టి వైరుధ్యము కాన్పించిననే తప్ప, సమ్మతి పండ్రెండు సంవత్సరముల లోపు వయసు గల వ్యక్తి ఇచ్చినచో,

అట్టి సమ్మతి, ఈ స్మృతియొక్క ఏ పరిచ్ఛేదమువలనను ఉద్ధిష్తమైనట్టి సమ్మతి కాదు.

కలిగించిన కీడుతో నిమిత్తము లేకయే అపరాధములగునట్టి కార్యముల వర్జన.

91. పరిచ్చేదములు 87,88 మరియు 89 లోని మినహాయింపులు, సమ్మతి నిచ్చినట్టి వ్యక్తి కిగాని ఎవరి తరపున సమ్మతి ఈయబడినదో ఆ వ్యక్తికి గాని కలిగించు లేక కలిగించుటికు ఉద్దేశింపబడు లేక కలిగించగలదని ఎరిగి యున్న ఏదేని కీడుతో నిమిత్తము లేకయే అపరాధములగునట్టి కార్యములకు విస్తరించవు.

ఉదాహరణము

గర్బస్రావము కలిగించుట ( స్త్రీ —యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తము సద్భావముతో కలిగింపబడిననే తప్ప) ఆ స్త్రీకి అది కలిగించు లేక కలిగించుటకు ఉద్దేశింపబడు ఏదేని కీడుతో నిమిత్తము లేకనే అపరాధమగును, మరియు అది “అట్టి కీడు కారణముగా " అపరాధమగుట లేదు. కావున అట్టి గర్భస్రావము కలిగించుటకు ఆ స్త్రీ యొసగిన లేక ఆమె సంరక్షకుడు యొసగిన సమ్మతి ఆ కార్యఘును సమర్దనీయమైనదిగ చేయదు.

ఒక వ్యక్తి మేలుకొరకు, సమ్మతి లేకుండ సద్భావముతో చేసిన కార్యము.

92. ఎవరేని వ్యక్తి యొక్క మేలుకొరకు, ఆ వ్యక్తి సమ్మతి లేనప్పటికిని, సద్భావముతో చేసినట్టి దేదియు, ఆ వ్యక్తి తన సమ్మతిని తెలుపుట అసాధ్యమొనరించునట్టి పరిస్థితులున్నచో, లేక తన సమ్మతి నొసగుటకు ఆ వ్యక్తి అసమర్ధుడై యుండి, మేలు కలిగించు ఆ పనిని చేయుటకు సకాలములో సమ్మతిని ఈయగల అతని సంరక్షకుడుగాని, శాసన సమ్మతము, అతని రక్షణభారము కలిగిన ఇతర వ్యక్తి గాని, అందుబాటులో లేనిచో, ఆ వ్యక్తికి అందువలన కలుగు ఏదేని కీడు కారణముగ, ఆపరాధము కాదు :

అయితే,——

మినహాయింపులు.

మొదటిది :-- ఈ మినహాయింపు ఉద్దేశపూర్వకముగా మరణమును కలిగించుటకు గాని మరణము కలిగించ ప్రయత్నించుటకు గాని విస్తరించదు ;

రెండవది :-- ఈ మినహాయింపు, మరణమును లేక దారుణమైన ఘాతను నివారించుటకైనను, తీవ్రమైన రోగమును లేక అంగవైకల్యమును నయము చేయుటకైనను కానట్టి ఏ ఇతర ప్రయోజనము కొరకో మరణము కలిగించగలదని చేయుచున్న వ్యక్తి ఎరిగియు చేసినట్టి దేనికిని విస్తరించడు :

మూడవది:-- ఈ మినహాయింపు, మరణమును లేక ఘాతను నివారించునది కానట్టి ఏదేని యితర ప్రయోజనమునకై స్వచ్ఛందముగా ఘాత కలిగించుటకు లేక ఘాత కలిగించుటకై ప్రయత్నించుటకు విస్తరించదు:

నాల్గవది:-- ఈ మినహాయింపు ఏ అపరాధము చేయులకు విస్తరించదో ఆ అపరాధ మస్పేరణకు విస్తరించదు.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' తన గుర్రము మీది నుండి పడి స్పృహ కోల్పోవును, 'బడ్'కు కాపాల శస్త్ర చికిత్స చేయుట ఆవశ్యకమని 'ఏ' అను శస్త్ర చికిత్సకునికి తోచును. 'జడ్' కు మరణము కలిగించవలేనను ఉద్దేశము లేకుండ 'ఏ' సద్భావముతో 'జడ్' మేలుకొరకు 'జడ్' స్వయముగా నిర్ణయించుకోగల శక్తిని పొందుటకు ముందే 'జడ్'కు కపాల శస్త్ర చికిత్స చేయును. 'ఏ' ఎట్టి ఆపరాధమును చేయలేదు.

(బి) 'జడ్'ను ఒక పులి ఎత్తుకొనిపోవును. తుపాకి కాల్పువలన 'జడ్' చావగలడని ఎరిగియు 'జడ్' ను చంపు ఉద్దేశము లేకుండ సద్భావముతో 'జడ్' మేలును ఉద్దేశించి 'ఏ' పులివైపు తుపాకి కాల్చును. 'ఏ' యొక్క తుపాకి గుండు 'జడ్' కు మరణకారకమైన గాయము చేయును. 'ఏ' ఎట్టి అపరాధమును చేయలేదు.

(సి) 'ఏ' అను ఒక శస్త్ర చికిత్సకుడు, వెంటనే శస్త్ర చికిత్స చేసిననే తప్ప ప్రాణాంతకమగు ఒక దుర్ఘటనకు గురియైన బిడ్డను చూచును. ఆ బిడ్డ యొక్క సంరక్షకుని అనుమతి కోరుటకు సమయములేదు. 'ఏ', ఆ బిడ్డ వలదని వేడుకొన్ననూ వినిపించుకొనక, సద్భావముతో ఆ బిడ్డ మేలునుద్దేశించి శస్త్రచికిత్స చేయును. 'ఏ ' ఎట్టి అపరాధమును చేయలేదు.

(డి) 'జడ్' లను ఒక బిడ్డతో 'ఏ ' తగులబడుచున్న ఇంటిలో ఉండును." క్రిందయున్నవారు ఒక కంబలిని పట్టుదురు. బిడ్డను క్రిందికి పడవేయుటవలన ఆ బిడ్డ చవిపోవచ్చునని ఎరిగియుండియు, ఆ బిడ్డను చంపు ఉద్దే ము లేకుఁడ సద్భావముతో ఆ బిడ్డ మేలునుద్దేశించి 'ఏ ' బిడ్డను ఇంటి పై నుండి క్రిందికి పడవేయును. ఇచట, అట్లు పడవేయుటవలన ఆ బిడ్డ చనిపోయినను, 'ఏ' ఎట్టి అపరాధమును చేయలేదు.

విశదీకరణము :--- కేవలము ధన సంబంధమైన మేలు 88, 89, 92 పరిచ్చేదముల భావములో మేలుకాదు.

సద్భావముతో చేసిన సంసూచనలు.

93. సద్భావముతో చేసిన సంసూచన ఏదియు, అది ఏ వ్యక్తికి సంసూచింపబడినదో ఆ వ్యక్తి మేలుకొరకు సంసూచింపబడినచో ఆ వ్యక్తికి కలిగిన ఏదేని కీడు కారణముగా, అపరాధము కాదు.

ఉదాహరణము

ఒక రోగికి అతడు బ్రతుకdaని 'ఏ' అను శస్త్ర చికిత్సకుడు తన అభిప్రాయమును సద్భావముతో సంసూచించును. ఆ రోగి అదిరిపోయి తత్ పరిణామముగా మరణించును. ఆట్లు సంసూచించుట వలన ఆ రోగికి మరణము కలుగ గలదని 'ఏ' ఎరిగియున్నను, 'ఏ' ఎట్టి ఆపరాధమును చేయలేదు.


బెదిరింపులతో బలవంత పెట్టబడి ఒక వ్యక్తి చేసిన కార్యము.

94, హత్యయు, మరణదండనతో శిక్షింపదగినట్టిదై రాజ్య వ్యతిరేకములగు అపరాధములును తప్ప, ఒక వ్యక్తి ఏపనిచేయకున్నచో తత్ పరిణామముగా ఆ వ్యక్తికి తక్షణమే మరణము కలుగునని దానిని చేయు సమయమున సహేతు కముగ భీతి కలిగించునట్టి బెదరింపులతో చేయుటకు బలవంత పెట్టుబడి ఆ వ్యక్తి చేసిన ఆపని ఏదియు ఆపరాధము కాదు. అయితే, ఆ కార్యమును చేయు వ్యక్తి తనంతతానుగా గాని, తక్షణ మరణముకంటె తక్కువరదగు కీడు తనకు కలుగునను సహేతుకమైన భీతివలనగాని, అట్టి బలవంతమునకు తాను లోనగు పరిస్తితికి తనను గురిచేసికొని యుండరాదు.

విశదీకరణము 1:--తనంత తానుగా గాని, దెబ్బలు కొట్టుదుమని బెదరించిన కారణముగాగాని, బందిపోటు దొంగల ముఠాలో, వారట్టి వారని ఎరిగియుండియు, చేరు వ్యక్తికి శాసనమును బట్టి అపరాధమగునట్టి ఏదేని పనిని తాను సహచరుల బలవంతముపై చేసితినను ఆధారముపై ఈ మినహాయింపువలన మేలు పొందుటకు హక్కు ఉండదు.

విశదీకరణము 2 : బందిపోటు దొంగల ముఠా చేతులలో చిక్కుకొని, శాసనమునుబట్టి అపరాధమగు ఒక పనిని చేయనిచో తక్షణ మరణమునకు గురియగుదునను బెదరింపు ఒత్తిడి వలన ఆ పనిని చేసిన వ్యక్తికి, ఉదాహరణకు ఒక ఇంటిలో బందిపోటు దొంగలు ప్రవేశించి దోచుకొనుటకు గాను తన పనిముట్లను తెచ్చి ఆ ఇంటి తలుపును తెరచు టకు బలవంత పెట్టబడిన కమ్మరికి, ఈ మినహాయింపువలన మేలును పొందుటకు హక్కు ఉండును.

స్వల్పమైన కీడును కలిగించు కార్యము,

95. ఏ పనియు, ఏదైనా కీడును అది కలిగించినదను లేక కలిగించుటకు ఉద్దేశింపబడినదను లేక కలిగించగలదని తెలిసియుండినదను కారణమువలన, అట్టి కీడు మామూలు వివేకము, ఓరిమిగల ఏ వ్యక్తియు పట్టించుకొననటువంటి స్వల్పమైన కీడు అయినచో, అపరాధము కాదు.

స్వయం రక్షణ హక్కును గురించి

స్వయం రక్షణలో చేయబడిన పనులు,

96. స్వయం రక్షణ హక్కును వినియోగించుటకు చేసిన పని ఏదియు ఆపరాధముకాదు.

శరీరము మరియుఆస్తి విషయములో స్వయం రక్షణ హక్కు..

97. 99వ పరిచ్ఛేదము నందలి నిర్బంధనలకు లోబడి.——

మొదటిది :-- మానవ శరీరమునకు హాని కలిగించు ఏదేని ఆపరాధము జరుగకుండా తన శరీరమును గాని ఎవరేని ఇతర వ్యక్తి శరీరమునుగాని రక్షించుటకును; రెండవది :- ---దొంగతనము, దోపిడీ, దుశ్చేష్ట, లేక అపరాధిక అక్రమ ప్రవేశము యొక్క నిర్వచనము క్రింద అపరాధమగుపట్టి ఏదేని కార్యమునకు గాని, దొంగతనము, దోపిడి, దుశ్చేష్ట, లేక అపరాధిక ఆక్రమ ప్రవేశము చేయు ప్రయత్నమగునట్టి ఏదేని కార్యమునకు గాని గురిచేయబడిన తనయొక్క లేక, ఎవరేని ఇతర వ్యక్తి యొక్క చరాస్తినైనను, స్థిరాస్తి నైనను, రక్షించుటకును, ప్రతి వ్యక్తికి హక్కు ఉండును.

మతిస్తిమితములేని వ్యక్తి మొదలైన వారి యొక్క కార్యము విషయములో స్వయం రక్షణ హక్కు.

98. ఒక కార్యమును చేయు వ్యక్తి బాలుడను, లేక పరిపక్వమైన బుద్ధిబలము లేనివాడను లేక మతిస్తి మితము లేనివాడను లేక మత్తుడై యున్నాడను కారణముగా గాని, ఆ వ్యక్తి. ఏదేని భ్రమకు గురియైనవాడను కారణముగా గాని, అన్యధా అపరాధమగునట్టి ఏదేని కార్యము ఆపరాధము కాకపోయినపుడు, ప్రతివ్యక్తియు అట్టి కార్యముపట్ల ఆ కార్యము అట్టి అపరాధపై యుండినచో తనకు ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండెడిదో అట్టి స్వయం రక్షణ హక్కునే కల్గి యుండును.

ఉదాహరణము

(ఎ) 'జడ్', పిచ్చిపట్టి నందువల్ల 'ఎ' ను చంపుటకు ప్రయత్నించును. 'జడ్' ఎట్టి అపరాధమును చేసినవాడు కాడు, కాని 'జడ్' ఉన్మాదుడు కానిచో 'ఏ'కు ఎట్టి స్వయంరక్షణ హక్కు ఉండెడిదో అట్టి స్వయం రక్షణ హక్కునే అతడు కలిగియుండును.

(బి) శాసనరీత్యా తనకు ప్రవేశించు హక్కు గల గృహములో 'ఏ' రాత్రివేళ ప్రవేశించును. 'జడ్' సద్భావముతో, 'ఏ' కన్నపుదొంగ ఆనుకొని అతనితో కలబడును. ఇటువంటి భ్రమతో 'ఏ'తో కలబడినందున ఇచట 'జడ్' ఎట్టి అపరాధము చేయలేదు. కానీ, 'జడ్' ఆ భ్రమతో వ్యవహరింపకుండినచో 'జడ్ ' పట్ల ఎట్టి స్వయం రక్షణ హక్కు 'ఏ' కు ఉండెడిదో అట్టి స్వయం రక్షణ హక్కునే 'ఏ' కలిగియుండును,

స్వయం రక్షణ హక్కు ఉండనట్టి కార్యములు.

99. సద్భావముతో వ్యవహరించుచు ఒక పబ్లికు సేవకుడు తన పదవీ ప్రాపకముతో చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము, ఖచ్చితముగా శాసనరీత్యా సమర్ధనీయమైనది కాకున్నను, ఆది మరణము లేక దారుణ ఘాత కలుగునను భీతిని సహేతుకముగా కలిగించనిదై నపుడు, ఆ కార్యము విషయములో ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండదు.

సద్భావముతో వ్యవహరించుచు ఒక పబ్లికు సేవకుడు తన పదవీ ప్రాపకముతో ఇచ్చిన ఆదేశమును బట్టి చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము, ఆ ఆదేశము ఖచ్చితముగా శాసనరీత్యా సమర్థనీయమైనది కాకున్నను, మరణము లేక దారుణ ఘాత కలుగునను భీతిని సహేతుకముగా కలిగించనిదై నప్పుడు, ఆ కార్యము విషయములో ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండదు.

పబ్లికు ప్రాధికారుల రక్షణ పొందుటకు సమయము ఉన్నట్టి సందర్భములలో ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండదు.

ఈ హక్కు యొక్క వినియోగింపు విస్తృతి,

ఏ సందర్భమునందును, రక్షణ నిమిత్తము ఆవశ్యకమైన దానికంటె అధికమగు కీడును కలిగించుటకు స్వయం ఈ రక్షణ హక్కు విస్తరించదు.

విశదీకరణము 1:--- ఒక కార్యమును చేయుచున్న వ్యక్తి పబ్లికు సేవకుడని తనకు తెలిసియున్ననే తప్ప, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్ననే తప్ప, అట్టి పబ్లికు సేవకుడుగా ఆ పబ్లికు సేవకుడు చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము విషయములో, ఏ వ్యక్తియు తనకు గల స్వయం రక్షణ హక్కును కోల్పోడు.

విశదీకరణము 2 :-- ఒక కార్యమును చేయుచున్న వ్యక్తి పబ్లికు సేవకుని ఆదేశముననుసరించి వ్యవహరించు చున్నాడని తనకు తెలిసియున్ననే తప్ప, లేక ఆట్లు విశ్వసించుటకు తనకు కారణమున్ననేతప్ప, లేక అట్లు వ్యవహరించు వ్యక్తి తాను ఏ ప్రాధికారము క్రింద వ్యవహరించుచున్నాడో తెలిసిననే తప్ప, లేక అతడు వ్రాతమూలక ప్రాధికారమును కలిగియుండి చూపుమని ఆడిగినచో అట్టి ప్రాధికార పత్రమును చూపిననే తప్ప, ఆ పబ్లికు సేవకుని ఆదేశము నను సరించి చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము విషయములో ఏ వ్యక్తియు తనకు గల స్వయం రక్షణ హక్కును కోల్పోడు.

శరీర విషయమున స్వయం రక్షణ హక్కు మరణము కలిగించు మేరకు ఎప్పుడు విస్తరించును.

100. పై కడపటి పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్భంధనలకు లోబడి, శరీర విషయమున స్వయం రక్షణ హక్కు, ఆ హక్కును వినియోగించుకొను సందర్భమును కలిగించిన అపరాధము ఇందు ఇటు పిమ్మట వివరింపబడిన వాటిలో ఏ రకపు ఆపరాధమైనను అయినచో, దౌర్జన్యపరునకు మరణమును, లేక ఏదేని ఇతర కీడును స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును, అవేవనగా:—— మొదటిది :- అన్యథా,ఆ దౌర్జన్యపరిణామముగా తనకు మరణము కలుగునను భీతిని సహేతుకముగ కలిగించగలుగునట్టి దౌర్జన్యము ;

రెండవది :—అన్యథా, ఆ దౌర్జన్యపరిణామముగా తనకు దారుణ ఘాత కలుగునను భీతిని సహేతుకముగా కలిగించగలుగు దౌర్జన్యము;

మూడవది :—మానభంగముచేయు ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము,

నాల్గ వది :-- కామతృష్ణను ప్రకృతి విరుద్ధముగా తీర్చుకొను ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము ;

అయిదవది :--- వ్యవహరణ లేక ఆపహరణచేయు ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము;

ఆరవది :— ఒక వ్యక్తికి తన విడుదలకై పబ్లికు ప్రాధికారుల సహాయమును పొందజాలనను నట్టి భీతిని సహేతుకముగ కలిగించు పరిస్థితులలో, ఆతనిని ఆక్రమముగా పరిరోధించు ఉద్దేశముతో చేసిన దౌర్జన్యము.

మరణము మినహా ఏదేని కీడు కలిగించుటకు అట్టి హక్కు ఎప్పుడు విస్తరించును.

101. అపరాధము, పై కడపటి పరిచ్ఛేదములో పేర్కొనిన ఆపరాధములలో ఏ రకపుదైనను కానిచో శరీర విషయమున స్వయంరక్షణ హక్కు స్వచ్ఛందముగా దౌర్జన్యపరునికి మరణము కలిగించు మేరకు విస్తరించదు. అయితే, 99వ పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్బంధనలకు లోబడి దౌర్జన్యపరునికి మరణము మినహా ఏ కీడునైనను స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును.

శరీర విషయమున స్వయంరక్షణ హక్కు ఎప్పుడు ప్రారంభమగును, ఎంతవరకు కొనసాగును.

102. ఏ అపరాధము చేయబడనప్పటికినీ ఆ ఆపరాధమును చేయుటకైన ప్రయత్నము వలన లేక చేయుదుమను బెదరింపు వలన శరీరాపాయము కలుగునని సహేతుకమైన భీతి కలిగిన వెంటనే శరీర విషయమున స్వయంరక్షణ హక్కు ప్రారంభమై, శరీరాపాయమును గురించిన భీతి ఉండునంత వరకు కొనసాగును.

ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు మరణము కలిగించు మేరకు ఎప్పుడు విస్తరించును.

103. 99వ పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్భంధనలకు లోబడి, ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు ఆ హక్కును వినియోగించుకొను సందర్భము ఏ అపరాధము చేయుట లేక చేయ ప్రయత్నించుట వలన ఏర్పడెనో ఆ ఆపరాధము ఇందు ఇటు పిమ్మట పేర్కొనిన వాటిలో ఏరకమునకైనను చెందినదైన యెడల, దోషకారికి మరణమును లేక, ఏదేని ఇతర కీడును స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును, అవేవనగా :-

మొదటిది :- దోపిడీ;

రెండవది :- రాత్రిపూట ఇంటికి కన్నము వేయుట;

మూడవది : మనుష్య నివాస స్థానముగా లేక ఆస్తికి ఆభిరక్షక స్థానముగా ఒక భవనమును, డేరాను లేక జలయానమును వాడుచుండగా, ఆ భవనమునకు, డేరాకు లేక జలయానమునకు నిప్పు పెట్టెడు దుశ్చేష్ట ;

నాల్గవది :--అట్టి స్వయం రక్షణ హక్కును వినియోగించుకొననిచో, దాని ఫలితముగా మరణమైనను దారుణమైన ఘాతయైనను కలుగునని సహేతుకముగా భీతిని కలిగించునట్టి పరిస్తితులలో జరిగిన దొంగతనము, దుశ్చేష్ట, లేక ఇంట అక్రమ ప్రవేశము.

మరణము మినహా ఏదేని కీడు కలిగించుటకు అట్టి హక్కు ఎప్పుడు విస్తరించును.

104. ఏ ఆపరాధమును చేయుట లేక చేయ ప్రయత్నించుటవలన స్వయం రక్షణ హక్కును వినియోగించ, సందర్భము ఏర్పడునో ఆ ఆపరాధము, పై కడపటి పరిచ్ఛేదములో పేర్కొనిన వాటిలో ఏ రకమునకైనను చెందనిదైన దొంగతనము, దుశ్చేష్ట , లేక అపరాధిక ఆక్రమ ప్రవేశము అయినచో, ఆ హక్కు స్వచ్ఛందముగా మరణమును కలిగించు మేరకు విస్తరించదు, అయితే 99వ పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్బంధనలకు లోబడి, దోషకారికి మరణము మినహా ఏ కీడునైనను స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును.

ఆస్తి విషయమున స్వయం రక్షణ హక్కు ఎప్పుడు ప్రారంభమగును, ఎంతవరకు కొనసాగును.

105. ఆస్తికి ఆపాయము కలుగునని సహేతుకముగా భీతి ప్రారంభమైనపుడు, ఆ ఆస్తి విషయమున స్వయం రక్షణ హక్కు ప్రారంభమగును.

ఆస్తిని గైకొనిన ఆపరాధి దొరకకుండా పోవునంత వరకుగాని, పబ్లికు ప్రాధికారుల సహాయము లభించువరకు గాని, ఆస్తి తిరిగి దొరికేవరకుగాని, దొంగతనమును అడ్డుటలో ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు కొనసాగును. అపరాధి ఏ వ్యక్తికైనను మరణమును లేక ఘాతను లేక అక్రమ అవరోధమును కలిగించుచుండునంతవరకు లేక కలిగింప ప్రయత్నించుచుండునంతవరకుగాని, తత్ క్షణ మరణము, తత్ క్షణ ఘాత, తత్ క్షణ వైయుక్తిక అవరోధము కలుగునని భయము కొనసాగుచుండునంతవరకుగాని, దోపిడిని అడ్డుటలో ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు కొనసాగును.

అపరాధి అపరాధిక అక్రమ ప్రవేశమును లేక దుశ్చేష్టను కొనసాగించుచుండునంతవరకు, అపరాధిక అక్రమ ప్రవేశమును, లేక దుశ్చేష్టను అడ్డుటలో ఆస్తి విషయమున స్వయంరక్షణ హక్కు కొనసాగును.

ఇంట-కన్నము చేయుటద్వారా ఆరంభమైన ఇంట -అక్రమ ప్రవేశము కొనసాగుచుండునంతవరకు, రాత్రి పూట ఇంటికి కన్నము వేయుటను అడ్డుటలో ఆస్తి విషయమున స్వయం రక్షణ హక్కు కొనసాగును.

ఏ ప్రమేయములేని వ్యక్తికి కీడు కలిగించే ముప్పు ఉన్నప్పుడు, ప్రాణాపాయకరమైన దౌర్జన్యమును అడ్డుటలో స్వయం రక్షణ హక్కు

106. మరణ భీతిని సహేతుకముగా కలిగించునట్టి దౌర్జన్యముని అడుటలో స్వయంరక్షణ హక్కును వినియోగించుట యందు, ఏ ప్రమేయము లేని ఒక వ్యక్తికి కీడు కలిగించు ముప్పు లేకుండ అట్టి హక్కును సార్థకముగా వినియోగించు కొనలేని స్థితిలో ఆ స్వయంరక్షకుడు ఉండునో, అతని స్వయం రక్షణ హక్కు ఆ ముప్పును కలిగించు మేరకు విస్మరించును.

ఉదాహరణము

ఒక మూక 'ఎ' పై బడి అతనిని హత్య చేయుటకు ప్రయత్నించును. అతడు మూకపై కాల్పులు జరుపకుండ స్వయంరక్షణ హక్కును సార్ధకముగా వినియోగించుకొనలేదు, మరియు అతడు ఆ మూకలో కలిసియున్న చిన్నపిల్లలకు కీడు కలిగించు ముప్పు లేకుండ కాల్పులు జరపలేదు. 'ఏ' అటు కాల్పులు జరిపినందున ఆ పిల్లలలో ఎవరికైనను కీడు కలిగినను, అతడు ఎట్టి అపరాధమును చేసిన వాడు కాడు.

అధ్యాయము-5

దుష్పేర్ణణను గురించి

ఒక పనికి దుష్ప్రేరణము.

107. ఒక వ్యక్తి---

మొదటిది : --- ఒక పనిని చేయుటకు ఏ వ్యక్తినైనను పురికొల్పినచో, లేక

రెండవది :-- ఆ పనిని చేయుటకు ఒక ఇతర వ్యక్తితో గాని ఒకరికన్నా ఎక్కుమ మంది ఇతర వ్యక్తులతో గాని కుట్రలో చేరియుండగా, ఆ పనిని చేయుటకుగాను ఆ కుట్రను అనుసరించి ఒక కార్యమును చేయుట అయినను,శాసనానుసారము చేయవలసిన దానిని చేయకుండుట అయినను జరిగినచో, లేక

మూడవది ----- ఏదేని కార్యమును చేయుట లేక శాసనానుసారము చేయవలసిన దానిని చేయకుండుట ద్వారా ఆ పనిని చేయుటకు ఉద్దేశపూర్వకముగ తోడ్పడినచో.——

ఆ వ్యక్తి ఆ పనిని చేయుటకు దుష్ప్రేరణ చేసిన వాడగును.

విశదీకరణము : --- ఒక వ్యక్తి బుద్ధిపూర్వకముగా తప్పుగా తెలుపుట ద్వారానైనను, వెల్లడించుటకు తనకు భాధ్యతగల ఒక ముఖ్యమైన సంగతిని బుద్ధి పూర్వకముగా తెలుపకుండుట ద్వారానైనను, స్వచ్ఛందముగా ఒక పని చేయించిన, లేక చేయబడునట్లు చేసిన, లేక చేయించుటకు గాని చేయబడునట్లు చేయుటకుగాని ప్రయత్నించిన ఆ వ్యక్తి, ఆ పనిని చేయుటకు పురికొల్పినట్లు చెప్పబడును.

ఉదాహరణము

'ఏ' అను ఒక పబ్లికు అధికారి ఒక న్యాయస్థానపు వారంటు ద్వారా, 'జడ్'ను పట్టుకొనుటకు ప్రాధికార మొసగబడినాడు. 'బి' ఆ సంగతిని ఎరిగియుండి, 'సీ' అను నతడు 'జడ్' కాడని కూడ ఎరిగియుండి 'సీ' యే 'జడ్' అని బుద్ధి పూర్వకముగా 'ఏ' కు చెప్పి తద్వారా ఉద్దేశపూర్వకముగా 'ఏ' చే 'సీ' ని పట్టుకొనునట్లు చేయించును. ఇచట, పురికొల్పుట ద్వారా 'సీ' ని పట్టు కొనుటకు 'బీ' దుష్ప్రేరణ చేసిన వాడగును.

విశదీకరణము 2:--ఒక కార్యము చేయుటకు ముందు గాని, చేయుచున్నప్పుడు గాని, ఆ కార్యమును సుకరము చేయుటకై ఏ పనినైనను చేసి, తద్వారా ఆ కార్యమును సుకరము చేయు వారెవరైనను, ఆ కార్యము చేయుటకు తోడ్పడినట్లు చెప్పబడుదురు. దుష్ప్రేరకుడు.

108. ఒక అపరాధమును చేయుటకుగాని, శాసనరీత్యా ఆపరాధము చేయజాలిన వ్యక్తిచే దుష్ప్రేరకునికి గల ఉద్దేశముతో, లేక ఎరుకతో చేయబడినచో ఆపరాధమగు నట్టి కార్యమును చేయుటకుగాని దుష్ప్రేరణచేయు వ్యక్తి, అపరాధ దుష్ప్రేరణ చేసిన వాడగును.

విశదీకరణము 1:--దుష్ప్రేరకునికి ఒక కార్యమును చేయు బాధ్యత స్వయముగ లేకున్నను, అతడు. ఆ కార్యమును, శాససరీత్యా చేయవలసిన వ్యక్తిని చేయకుండుమని దుష్ఫేరణ చేయుట ఆపరాధము కావచ్చును.

విశదీకరణము 2 :-- దుష్ప్రేరిత కార్యను జరుగుటగాని, ఆది అపరాధమగుటకు కావలసిన పరిణామము కలుగుటగాని, దుష్ప్రేరణా పరాధమునకు అవసరము కాదు.

ఉదాహరణము

(ఏ) 'స్త్రీ' ని హత్య చేయుమని 'ఏ' అనునతడు 'బి' ని పురికొల్పును. 'బీ' అట్లు చేయుటకు నిరాకరించును.'బీ' ని 'ఏ' హత్యాదుష్ప్రేరణ చేసిన వాడగును.

(బీ) 'డీ' ని హత్యచేయువుని 'ఏ' అనునతడు 'బి' ని పురికొల్పును. ఆపురికొల్పుటననుసరించి 'డీ' ని 'బి' పొడుచును. 'డీ' ఆ గాయము నుండి కోలుకొనును. 'బీ' ని 'ఏ' హత్యాదుష్ప్రేరణ చేసినవాడగును.

విశదీకరణము 3 :-దుష్ప్రేరితుడైన వ్యక్తి శాసనరీత్యా అపరాధము చేయజాలినవాడై ఉండుట గాని, అతడు దుష్ప్రేరకునికి గల దోషయుతమైన ఉద్దేశ్యమునే, లేక ఎరుకనే కలిగియుండుటగాని అతడు దోషయుతమైన ఉద్దేశ్యమును లేక ఎరుకను దేనినైనను కలిగి ఉండుటగాని అవసరము కాదు.

ఉదాహరణము

(ఏ) శాసన రీత్యా ఆపరాధము చేయజాలిన వ్యక్తిచే, 'ఏ' కు గల దోషయుతమైన ఉద్దేశ్యముతో చేయబడినచో అపరాధమగునట్టి ఒక కార్యమును చేయుటకు 'ఏ' ఒక బిడ్డను, లేక ఉన్మత్తుని దుష్ప్రేరణ చేయును. ఇచట ఆ కార్యము చేయబడినను, చేయబడకపోయినను 'ఏ' ఆపరాధ దుష్ప్రేరణ చేసినవాడగును.

(బీ) 'జడ్' ను హత్య చేయు ఉద్దేశ్యముతో, 'జడ్'కు మరణము కలిగించునట్టి కార్యమును చేయుటకు 'ఏ' ఏడు సంవత్సరముల లోపు వయసుగల 'బీ' అను బిడ్డను పురికొల్పును. 'బీ' ఆ దుష్ప్రేరణ పరిణామముగా 'ఏ' లేనపుడు ఆ కార్యమును చేసి తద్వారా 'జడ్'కు మరణము కలిగించును. ఇచట 'బీ' శాసనరీత్యా ఆపరాధము చేయజాలినవాడు కాకున్నను, శాసనరీత్యా 'బి' ఆపరాధము చేయజాలినవాడై యుండి హత్యచేసియుండిన ఎట్లో ఆదే రీతిగా 'ఏ' శిక్షాపాత్రుడగును, మరియు అందువలన అతడు మరణ శిక్షకు లోనై యుండును.

(సీ) 'ఏ' ఒక నివాస గృహమునకు నిప్పంటించవలసినదిగా 'బి'ని పురికొల్పును. 'బీ'కి మతి స్తిమితము లేనందున ఆ కార్యపు స్వభావమును గాని తాను చేయునది దోషమని లేక శాసన విరుద్దమని గాని తెలిసికొనజాలనివాడై 'ఏ ' చే పురికొల్పబడిన పరిణామముగా ఆ గృహమునకు నిప్పంటించును. 'బీ' ఎట్టి అపరాధము చేయలేదు. కాని 'ఏ' ఒక నివాస గృహమునకు నిప్పంటించు ఆపరాధ దుష్ప్రేరణ చేసిన వాడగును, మరియు ఆ అపరాధమునకు నిబంధ నానుసారముగ శిక్షా పాత్రుడగును.

(డీ) 'ఏ' ఒక దొంగతనము చేయించు ఉద్దేశ్యముతో 'జడ్' స్వాధీనము నుండి 'జడ్'కు చెందిన ఆస్తిని తీసికొనుమని 'బి' ని పురికొల్పును. ఆ ఆస్తి 'ఏ' కు చెందినదే అవి 'బీ'కి 'ఏ' విశ్వాసము కలిగించును. ఆ ఆస్తి 'ఏ ' యొక్క ఆస్తి యేనని విశ్వసించి 'బీ' సద్భావముతో దానిని 'జడ్' స్వాధీనమునుండి తీసికొనును. 'బీ' ఈ బ్రమతో వ్యవహరించినందున నిజాయితీ లేకుండ తీసికొనలేదు. కనుక దొంగతనము చేయలేదు. కాని 'ఏ' దొంగతనమును దుష్ప్రేరణ చేసిన వాడగును. మరియు 'బీ' దొంగతనము చేసియుండినచో ఎట్టి శిక్షకు 'ఏ' పాత్రుడయ్యెడువాడా అదే శిక్షకు 'ఏ' పాత్రుడగును.

విశదీకరణము 4 :- ఆపరాధదుష్ప్రేరణ అపరాధమైనందున అట్టి దుష్ప్రేరణ యొక్క దుష్ప్రేరణ కూడ అపరాధమగును.

ఉదాహరణము

'జడ్' ను హత్య చేయుటకు 'సీ'ని పురికొల్పుమని 'ఏ' అనునతడు 'బీ'ని పురికొల్పును. 'బీ'ఆ ప్రకారము 'జడ్' ను హత్య చేయుటకు 'సీ'ని పురికొల్పును. 'బీ' యొక్క పురికొల్పుట పరిణామముగా 'సీ' ఆ అపరాధము చేయును, 'బీ' తన అపరాధ విషయమున హత్యకు ఏ శిక్ష గలదో ఆ శిక్షకు పాత్రుడగును, మరియు, 'ఏ' ఆ అపరాధము చేయుమని 'బీ'ని పురికొల్పినందున 'ఏ' కూడ అదే శిక్షకు పాత్రుడగును.

విశదీకరణము 5:—కుట్రద్వారా దుష్ప్రేరణాపరాధము చేయుటకు, దుష్ప్రేరితాపరాధము చేయు వ్యక్తితో దుష్ప్రేరకుడు కలిసి ఆ ఆపరాధమును జరుపు యోచన చేయుట అవసరము కాదు; ఏ కుట్ర ననుసరించి ఆ అపరాధము చేయబడినదో ఆ కుట్రలో ఆతడు పాల్గొనిన చాలును.

ఉదాహరణము

'జడ్' కు విషప్రయోగము చేయుటకై 'బీ' తో కలిసి 'ఏ' ఒక పథకమును యోచించును. విషమును 'ఏ' ఈయవలెనని ఒప్పందమైనది. ఆటుపై 'ఏ' యొక్క పేరును తెలుపకుండ అన్యవ్యక్తి ఎవరో విషమును ఇచ్చునని తెలుపుచు, 'బీ' ఆ పథకమును 'సీ'కి విశదీకరించును. 'సీ' విషమును సేకరించుటకు ఒప్పుకొని తనకు విశదీక రింపబడిన రీతిగా వాడబడుటకై విషమును సేకరించి 'బి'కి అందజేయును. ఆ విషమును 'ఏ' ఇచ్చును. తత్ పరిణామముగా 'జడ్' మరణించును. ఇచట 'ఏ' తో కలిసి 'సీ' కుట్ర చేయకున్నను ఏ కుట్రననుసరించి 'జడ్' హత్య చేయబడినాడో ఆ కుట్రయందు 'సీ' పాల్గొనినాడు. అందువలన 'సీ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడై హత్యకు ఏ శిక్ష గలదో ఆ శిక్షకు పాత్రుడగును.

భారత దేశము వెలుపల చేయబడు అపరాధములకు భారత దేశములో దుష్ప్రేరణ.

108-ఏ. భారతదేశములో చేయబడియుండినచో అపరాధమగునట్టి ఏదేని కార్యము భారత దేశమునకు వెలుపలను, ఆవలను చేయబడుటకు భారత దేశములో ఆ కార్యమును దుష్ప్రేరణ చేయు వ్యక్తి ఈ స్మృతి భావములో అపరాధ దుష్పరణ చేసినవాడగును.

ఉదాహరణము

గోవాలో హత్య చేయుటకు గోవాలో ఉన్న 'బీ' అను ఒక విదేశీయుని భారత దేశమందున్న 'ఏ' పురికొల్పును, 'ఏ' హత్యాదుష్ప్రేరణ చేసినవాడగును.

దుష్ప్రేరణ పరిణామముగా దుష్ప్రేరిత కార్యము చేయబడి ఆ దుష్ప్రేరణ శిక్షకై అభివ్యక్త నిబంధన యేదియు లేనప్పుడు శిక్ష

109. ఏదేవి, అపరాధమును దుష్ప్రేరణ చేయునతడెవరైనను, ఆ దుష్ప్రేరిత కార్యము దుష్ప్రేరణ పరిణామముగా చేయబడి, అట్టి దుష్ప్రేరణను శిక్షించుటకై ఈ స్మృతిలో అభివ్యక్త నిబంధన యేదియు లేనిచో, ఆ అపరాధమునకు ఏర్పాటు చేయబడిన శిక్షతో దండింపబడును.

విశదీకరణము :-దు షేరణ అగునట్టి పురికొల్పుట యొక్క పరిణామముగా లేక అట్టి కుట్రనసుపరించి , అభివ్యక్ష లేకి అట్టి తోడ్పాటుతో ఒక కార్యము లేక అపరాధము చేయబడినపుడు, ఆ కార్యము లేక అపరాధము దుష్పేరణ పరిణామముగా చేయబడినట్లు చెప్పబడును.

ఉదాహరణములు

(ఏ) 'బీ' అను పబ్లికు సేవకుడు తన అధికార కృత్యములను నిర్వహించుటలో 'ఏ' కు అనుకూలముగా వర్తించు టకు పారితోషికముగా 'బీ' కి 'ఏ' లంచము ఈయజూపును. 'బీ' ఆ లంచమును స్వీకరించును. 161వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమునకు 'ఏ' దుష్ప్రేరణ చేసినవాడగును,

(బీ) తప్పుడు సాక్ష్యము నిచ్చుటకు 'బి' ని 'ఏ' పురికొల్పును. ఆ పురికొల్పుట పరిణామముగా 'బి' ఆ అపరాధమును చేయును, 'ఏ' ఆ అపరాధ దుష్ప్రేరణ చేసినవాడై ఏ శిక్షకు 'బి' పాత్రుడగునో ఆ శిక్షకు పాత్రుడగును.

(సీ) 'జడ్' కు విషము నిచ్చుటకు 'ఏ' 'బి' లు కుట్ర పన్నుదురు, ఆ కుట్రననుసరించి 'ఏ' విషమును సేకరించి దానిని 'జడ్' కు ఈయవలసినదిగా 'బి' కి అందజేయును, 'బి' ఆ కుట్ర ననుసరించి ఆవిషమును 'ఏ' లేనపుడు 'జడ్' కు ఇచ్చి తద్వారా 'జడ్' కు మరణము కలిగించును. ఇచట 'బి' హత్య చేసినవాడగును. 'ఏ' కుట్రద్వారా అపరాధమును దుష్ప్రేరణ చేసినవాడై హత్యకు ఏ శిక్ష గలదో ఆ శిక్షకు పాత్రుడగును.

ఒక కార్యమును దుష్ప్రేరకుని ఉద్దేశ్యముకన్న భిన్నమైన ఉద్దేశ్యముతో దుష్ప్రేరిత వ్యక్తి చేసిన యెడల దుష్ప్రేరణకు శిక్ష.

110. ఒక ఆపరాధమును చేయుటకు దుష్ప్రేరణ చేయువారెవరైనను, దుష్ప్రేరిత వ్యక్తి ఆ కార్యమును దుష్ప్రేరకుని ఉద్దేశ్యముకన్న భిన్నమైన ఉద్దేశ్యముతో లేక ఎరుకతో చేసినచో, ఆ కార్యము దుష్ప్రేరకునికి గల ఉద్దేశ్యముతో లేక ఎరుకతోనే చేయబడినచో ఏ అపరాధము చేయబడి యుండెడిదో ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల శిక్షతో దండింపబడుదురు. ఇతర శిక్ష తోకాదు. ఒక కార్యము దుష్ప్రేరితమై దానికి భిన్నమైన కార్యము చేయబడినపుడు దుష్ప్రేరకుని బాధ్యత.వినాయింపు.

111. ఒక కార్యము దుష్ప్రేరితమై దానికి భిన్నమైన కార్యము చేయబడినపుడు ఆ చేయబడిన కార్యమునే తాను దుష్ప్రేరణ చేసియుండిన ఎట్లో అదేరీతిగను, అదే మేరకును, చేయబడిన ఆ కార్యమునకు దుష్ప్రేరకుడు బాధ్యుడగును;

అయితే, చేయబడిన కార్యము బహుశః ఆ దుష్ప్రేరణ పరిణామమై యుండి దుష్ప్రేరణ అగునట్టి పురికొల్పుట వలన ప్రోద్బలముతోగాని, అట్టి తోడ్పాటుతోగాని, అట్టి కుట్ర ననుసరించి గాని చేయబడి యుండవలెను.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' యొక్క ఆహారములో విషము పెట్టుటకు 'ఏ' అనునతడు ఒక బిడ్డను పురికొల్పి, అందుకొరకై అతనికి విషమును అందజేయును. ఆ పురికొల్పుట పరిణామముగా ఆ బిడ్డ పొరపాటున ఆ విషమును, 'జడ్' యొక్క ఆహారము ప్రక్కన ఉన్నట్టి 'వై' యొక్క ఆహారములో పెట్టును. ఇచట 'ఏ' పురికొల్పుటవలన ప్రోద్బలమునకు ఆ బిడ్డ లోనై వ్యవహరించుచుండి చేసిన కార్యము ఆ పరిస్థితులలో బహుశః ఆ దుష్ప్రేరణవలన కలుగగల పరిణామమై యుండుచో ఆ బిడ్డను 'వై' యొక్క ఆహారములో ఆ విషమును పెట్టుటకు పురికొల్పిన ఎట్లో ఆ రీతిగను, ఆ మేరకును 'ఏ' బాధ్యుడగును.

బి) 'జడ్' యొక్క ఇంటిని తగులబెట్బటకు 'బి' ని 'ఏ' అనునతడు వురికొల్పును. 'బీ' ఆ ఇంటికి నిప్పంటించి అదే సమయమున అచటి ఆస్తిని దొంగిలించును. ఆ దొంగతనము ఇంటిని తగులబెట్టుటవలన బహుశ: కలిగెడు పరిణామము గాక వేరే కార్యమైనందున 'ఏ' ఇంటిని తగులబెట్టుటకు దుష్ప్రేరణ చేసినవాడైనను, దొంగతనమునకు దుష్ప్రేరణ చేసినవాడు కాడు.

(సీ) ఒక నివాస గృహమును అర్థరాత్రి వేళ దోపిడీ చేయు నిమిత్తము 'బి' ని, 'సీ' ని 'ఏ' అనునతడు పురికొల్పి, అందు నిమిత్తమై వారికి ఆయుధములు సమకూర్చును. 'బి' యు 'సీ' యు ఆ గృహములో జొరబడి అందు నివసించువారిలో ఒకరైన 'జడ్' చే ప్రతిఘటింపబడిన వారై 'జడ్'ను హత్య చేయుదురు. ఇచట ఆ హత్య బహుశ: దుష్ప్రేరణ వలని పరిణామమై యున్నచో 'ఏ' హత్యను గూర్చిన నిబంధనానుసారముగల శిక్షకు పాత్రుడగును.

దుష్ప్రేరకుడు దుష్ప్రేరిత కార్యమునకుమ చేయబడిన కార్యమునకును సంకలిత శిక్షకు ఎప్పుడు పాత్రుడగును.

112. దుష్ప్రేరిత కార్యమునకు అదనముగా పై కడపటి పరిచ్ఛేదము క్రింద దుష్ప్రేరకుడు శిక్షాపాత్రుడగునట్టి కార్యము చేయబడి అది ఒక విభిన్న అపరాధమైనచో, దుష్ప్రేరకుడు ఆ అపరాధములలో ప్రతియొక్క దానికి శిక్షాపాత్రుడగును.

ఉదాహరణము

ఒక పబ్లికు సేవకుడు చేసిన జప్తును బల ప్రయోగము ద్వారా ప్రతిఘటించుటకు 'బీ' ని 'ఏ' పురికొల్పును. తత్ పరిణామముగా 'బీ' ఆ జప్తును ప్రతిఘటించి అట్లు ప్రతి ఘటించుటలో జప్తును అమలుపరచుచున్న అధికారికి దారుణమైన ఘాతను స్వచ్ఛందముగా కలిగించును. 'బీ' జప్తును ప్రతిఘటించు అపరాధమును, దారుణమైన ఘాతను స్వచ్చందముగా కలిగించు అపరాధమును, రెండింటిని చేసినందున 'బీ' ఆ రెండు అపరాధములకు శిక్షా పాత్రుడగును. మరియు జప్తును ప్రతిఘటించుటలో 'బీ' దారుణమైన ఘాతను స్వచ్చందముగా కలిగించుట సంభవమని 'ఏ' ఎరిగియున్నఎడల ఆ అపరాధములో ప్రతియొకదానికి 'ఏ' కూడ శిక్షా పాత్రుడగును.

దుష్ప్రేరకుడు ఉద్దేశించిన దానికి భిన్నమగు పరిణామము దుష్ప్రేరిత కార్యమువలన కలిగినచో ఆ పరిణామమునకు దుష్ప్రేరకుని బాధ్యత.

113. ఒక ప్రత్యేకమైన పరిణామమును కలిగించు ఉద్దేశముతో దుష్ప్రేరకునిచే ఒక కార్యము దుష్ప్రేరణ చేయబడి, దుష్ప్రేరకునికి అతని దుష్ప్రేరణ వలన బాధ్యత గలుగు నట్టి ఒక కార్యము, దుఁష్ప్రేరకుడు ఉద్దేశించిన దానికి భిన్నమగు పరిణామమును కలిగించినపుడు ఆ పరిణామమును కలిగించు ఉద్దేశముతో ఆ కార్యమును దుష్ప్రేరకుడు దుష్ప్రేరణ చేసి యుండిన ఎట్లో ఆ రీతిగనే మరియు ఆ మేరకు ఆ పరిణామము విషయమున దుష్ప్రేరకుడు బాధ్యుడగును. అయితే దుష్ప్రేరిత కార్యము వలన అట్టి పరిణామము కలుగుట సంభవమని అతడు ఎరిగి యుండ వలెను.

ఉదాహరణము

'జడ్' కు దారుణమైన ఘాతను కలిగించుటకు 'బీ' ని 'ఏ' పురికొల్పును. ఆ పురికొల్పుట పరిణామముగా 'జడ్'కు దారుణమైన ఘాతను 'బీ' కలిగించును. తత్ పరిణామముగా 'జడ్' మరణించును. అచట దుష్ప్రేరణ చేయబడిన దారుణమైన ఘాత వలన మరణము కలుగుట సంభవమని 'ఏ' ఎరిగియుండినచో, హత్యను గూర్చిన నిబంధనాను సారముగల శిక్షకు 'ఏ' పాత్రుడగును. దుష్ప్రేరకుని సమక్షములో అపరాధము చేయబడినపుడు.

114. ఎవరేని వ్యక్తిని అతని దుష్ప్రేరణ వలన శిక్షా పాత్రునిగా చేయునట్టి కార్యము లేక అపరాధము చేయబడినపుడు అతడు హాజరులో లేనిచో దుష్ప్రేరకుడుగా శిక్షా పాత్రుడగు ఏ సందర్భములోనైనను అతడు హాజరులో ఉన్నచో అట్టి కార్యమును లేక అపరాధమును అతడు చేసినట్లుగా భావించవలెను.

మరణదండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమునకు దుష్ప్రేరణ- ఆపరాధముచేయబడనిచో.

115. మరణ దండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకు దుష్ప్రేరణ చేయు వారెవరైనను, దుష్ప్రేరణ పరిణామముగా ఆ అపరాధము చేయబడనప్పుడు అట్టి దుష్ప్రేరణను శిక్షించుటకు అభివ్యక్త నిబంధన ఏదియు ఈ స్మృతిలో లేనిచో ఏడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపుకారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జూర్మానాకు కూడా పాత్రులగుదురు.

తత్ పరిణామముగా కీడు కలిగించు కార్యము చేయబడినచో.

మరియు దుష్ప్రేరణ పరిణామముగా దుష్ప్రేరకుడు బాధ్యతకు లోనగునట్టిదియు ఎవరేని వ్యక్తి కి ఘాత కలిగించి నట్టిదియు అగు కార్యము చేయబడినచో దుష్ప్రేరకుడు పదునాలుగు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసమునకు పాత్రుడగును మరియు జుర్మానాకు కూడా పాత్రుడగును.

ఉదాహరణము

'జడ్' ను హత్య చేయుమని 'బీ' ని 'ఏ' పురికొల్పును. ఆ అపరాధము చేయబడలేదు. 'బి' 'జడ్'ను హత్య చేసియుండినచో అతడు మరణ దండనకు లేక యావజ్జీవ కారావాస శిక్షకు లోనై యుండెడివాడు. కావున 'ఏ' ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి కారావాసమునకును, జుర్మానాకును పాత్రుడగును, మరియు ఆ దుష్ప్రేరణ పరిణామముగా 'జడ్'కు ఏదేని ఘాత కలిగినచో అతడు పదునాలుగు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి కారావాసమునకును, జుర్మానాకును పాత్రుడగును.

కారావాసముతో శిక్షింపదగు ఆపరాధమునకు దుష్ప్రేరణ- ఆపరాధముచేయబడనిచో.

116. కారావాసముతో శిక్షింపదగు అపరాధమునకు దుష్ప్రేరణ చేయువారెవరైనను, దుష్ప్రేరణ పరిణామముగా ఆ అపరాధము చేయబడనిచో, అట్టి దుష్ప్రేరణను శిక్షించుటకు అభివ్యక్త నిబంధన ఏదియు ఈ స్మృతిలో లేనిచో ఆ అపరాధమునకు నిబంధనానుసారము గల దీర్ఘ తను కారావాస కాలావధిలో నాలుగవ భాగము వరకు ఉండగల కాలావధికి ఏ రకపు కారావాసముతో గాని, ఆ ఆపరాధమునకు నిబంధనానుసారముగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

దుష్ప్రేరకుడు, లేక దుష్ప్రేరిత వ్యక్తి అపరాధనివారణ తన కర్తవ్యమై యున్నట్టి పబ్లికు సేవకుడుగా ఉన్నచో.

మరియు దుష్ప్రేరకుడు లేక దుష్ప్రేరిత వ్యక్తి అట్టి అపరాధము జరుగకుండ నివారించుట తన కర్తవ్యమై యున్నట్టి ఒక పబ్లికు సేవకుడుగా ఉన్నచో, దుష్ప్రేరకుడు ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కాలావధిలో సగ భాగము వరకు ఉండగల కాలావధికి ఆ అపరాధమునకు నిబంధనానుసారము గల ఏ రకపు కారావాసముతో గాని, ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణములు

(ఏ) 'బీ' అను పబ్లికు సేవకుడు తన అధికారకృత్యము లను నిర్వహించుటలో 'ఏ'కు అనుకూలముగా వర్తించుటకు పారితోషికముగా 'బీ' కి 'ఏ' లంచము ఈయజూపును. 'బీ' ఆ లంచమును స్వీకరింప నిరాకరించును, 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగియుండును,

(బీ) తప్పుడు సాక్ష్యము నిచ్చుటకు 'బీ' ని 'ఏ' అను నతడు పురికొల్పును. ఇచట 'బీ' తప్పుడు సాక్ష్యమును ఈయకున్నను 'ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడై ఆ ప్రకారమే శిక్షింపదగి యుండును.

(సీ) దోపిడీని నివారించుట తన కర్తవ్యమైనట్టి 'ఏ' అను పోలీసు అధికారి దోపిడీ చేయుటకు దుష్ప్రేరణ చేయును. ఇచట దోపిడి చేయబడనప్పటికినీ 'ఏ' ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో సగ భాగమునకును, జుర్మానాకును పాత్రుడగును.

(డీ) దోపిడీని నివారించుట తన కర్తవ్యమై నట్టి 'ఏ' అను పోలీసు అధికారిని దోపిడి చేయుమని 'బీ' దుష్ప్రేరణ చేయును. ఇచట దోపిడీ చేయబడనప్పటికినీ 'బీ' ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తను కారావాస కాలావధిలో సగ భాగమునకును, జుర్మానాకును పాత్రుడగును.

ఆపరాధము చేయుటకు జనసామాన్యమునుగాని పదుగురికంటె ఎక్కువ మంది వ్యక్తులనుగాని దుష్ప్రేరణ చేయుట.

117. జన సామాన్యమునైనను, పదుగురికి మించిన ఎంతమందినైనను, ఏదేని వర్గమునై నను ఒక అపరాధము చేయుటకు దుష్ప్రేరణ చేయువారెవరైనను, మూడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

పదిమందికి మించిన సభ్యులతో కూడిన ఒక తెగవారిని వారి విరోధి తెగకు చెందిన సభ్యులు ఊరేగింపు జరుపుకొను చున్నపుడు వారిపై దాడి చేయు నిమిత్తము ఫలాని చోట, ఫలాని సమయమునందు సమావేశము కావలెనని పురికొల్పుచు 'ఏ' అనునతడు ప్రకటన పత్రమును ఒక పబ్లికు స్థలమునందు అంటించును. ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసినవాడగును.

మరణదండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకుగల పన్నుగడను కప్పిపుచ్చుట.

118. మరణదండనతో లేక యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు ఒక అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశముతో, లేక తద్వారా తాను అట్లు వీలును కలిగించుట సంభవమని ఎరిగి యుండి,

ఏదేని కార్యమును చేయుట లేక శాససరీత్యా చేయవలసిన కార్యమును చేయకుండుటద్వారా అట్టి అపరాధమును చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును స్వచ్ఛందముగా కప్పిపుచ్చు, లేక అట్టి పన్నుగడను గురించి దేనినై నను అది అబద్ధ మై నదని ఎరిగియుండియు తెలియజేయువారెవరైనను,

అపరాధము చేయబడినచో, అపరాధము చేయబడనిచో

ఆ అపరాధము చేయబడినచో, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనూ, లేక అపరాధము చేయబడనిచో మూడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను శిక్షింపబడుదురు. మరియు పై రెండు సందర్భములలో దేనియందైనను జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణము

'బీ' అను స్థలములో బందిపోటు జరుగబోవుచున్నదని ఎరిగియుండి, దానికి ఎదుటిదిశ లోఉన్న 'సీ' అను స్థలములో బందిపోటు జరుగబోవుచున్నదని మేజిస్టేటుకు 'ఏ' తప్పుడు సమాచారము యిచ్చును. తద్వారా ఆ అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశ్యముతో మేజిస్టేటును తప్పుదారి పట్టించుసు. పన్నుగడ ననుసరించి 'బి' వద్ద బందిపోటు జరుపబడును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగి యుండును.

అపరాధమును చేయుటకుగల పన్నుగడను ఆ అపరాధమును నివారించవలసిన కర్తవ్యముగల పబ్లికు సేవకుడు కప్పిపుచ్చుట.

119. ఒక పబ్లికు సేవకుడై యుండి అట్టి పబ్లికు సేవకుడుగా ఒక అపరాధమును నివారించుట తన కర్తవ్యమై యుండగా ఆ అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశ్యముతో లేక తద్వారా తాను అట్లు వీలును కలిగించుట సంభవమని ఎరిగియుండి,

ఏదేని కార్యమును చేయుటద్వారా లేక శాసనరీత్యా చేయవలసిన కార్యమును చేయకుండుటద్వారా, అట్టి అపరాధమును చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును స్వచ్చందముగా కప్పిపుచ్చు లేక అట్టి పన్నుగడను గురించి దేనినైనను "అది అబద్దమైనదని ఎరిగియుండియు తెలియజేయువారెవరైనను,

అపరాధము చేయబడినచో.

ఆ అపరాధము చేయబడినచో ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో సగభాగము మేరకు ఉండగల కాలావధికి ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల ఏ రకపు కారావాసముతో గాని అట్టి నిబంధనానుసారముగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆ అపరాధము మరణదండన మున్నగువాటితో శిక్షింపదగినదైనచో

లేక, ఆ అపరాధము మరణదండనతోగాని యావజ్జీవ కారావాసముతోగాని శిక్షింపదగినదైనచో, పది సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు.

అపరాధము చేయబడనిచో.

లేక, ఆ అపరాధము చేయబడనిచో, ఆ అపరాధమునకు నిబంధనామసారముగల దీర్ఘతమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల ఏ రకపు కారావాసముతో గాని, అట్టి నిబంధనానుసారముగల జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

ఒక పోలీసు అధికారి అయిన ' ఏ ' తనకు తెలియవచ్చినట్టి దోపిడీలు జరుపుటకుగల పన్నుగడల నన్నిటినీ గూర్చిన సమాచారమును అందజేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి, 'బీ' దోపిడీ జరుపుటకు పన్నుగడ పన్నుచున్నాడని ఎరిగియుండి, ఆ అపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశముతో అట్టి సమాచారమును తెలియజేయకుండును. ఇచట 'ఏ ' శాసనరీత్యా చేయవలసిన పనిని చేయకుండుటద్వారా ' బీ ' పన్నిన పన్నుగడ ఉన్నదను విషయమును కప్పిపుచ్చిన వాడై, ఈ పరిచ్ఛేదపు నిబంధనల ప్రకారము శిక్షా పాత్రుడగును. కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయు పన్నుగడను కప్పిపుచ్చుట,

120. కారావాసముతో శిక్షింపదగు ఒక ఆపరాధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశముతో, లేక తద్వారా తాము అట్లు వీలు కలిగించుట సంభవమని ఎరిగియుండి,

ఏదేని కార్యమును చేయుట లేక శాసన రీత్యా చేయవలసిన కార్యమును చేయకుండుట ద్వారా ఆట్టి అపరాధమును చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును స్వచ్ఛందముగా కప్పిపుచ్చు లేక అట్టి పన్నుగడను గురించి దేనినై నను అది అబద్ధ మైనదని ఎరిగియుండియు, తెలియజేయువారెవరైనను,

అపరాధము చేయబడినచో.

ఆ ఆపరాధము చేయబడినచో, ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘతమ కారావాన కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి ఆట్టి ఏ రకపు కారావాసముతో నైనను శిక్షింపబడుదురు.

ఆ అపరాధము చేయబడనిచో

ఆ అపరాధము చేయబడనిచో, అట్టి దీర్ఘతమ కారావాస కాలావధిలో ఎనిమిదవ భాగము మేరకు ఉండగల కాలావధికి కారావాసముతో గాని, ఆ అపరాధమునకు నిబంధనాసుసారముగల జుర్మానాలోగాని, ఈ రెండింటితో గాని,శిక్షింపబడుదురు.

అధ్యాయము 5-ఏ

ఆపరాధికమైన కుట్ర

ఆపరాధికమైన కుట్రయొక్క నిర్వచనము.


120-ఏ. ఇరువురుగాని అంతకంటే ఎక్కువమంది వ్యక్తులుగాని—-

(1) ఒక శాసనవిరుద్ధమైన కార్యమును, లేక

(2) శాసనవిరుద్ధము కానట్టి కార్యమును శాసనవిరుద్ధ మగు పద్ధతుల ద్వారా,

చేయుటకు లేక చేయించుటకు ఒప్పందము చేసికొనినపుడు , అట్టి ఒప్పందము ఆపరాధికమైన కుట్ర అనబడును:

అయితే ఒక అపరాధమును చేయుటకైన ఒప్పందము మినహా, ఒప్పందముతోపాటు దాని ననుసరించి ఆ ఒప్పందము చేసికొనిన పక్షకారులలో ఒకరుగాని అంతకంటే ఎక్కువమందిగాని ఏదేని కార్యము చేసిననేతప్ప ఏ ఒప్పందమైనను ఆపరాధికమైన కుట్ర కాదు.

విశదీకరణము:-శాసనవిరుద్ధ కార్యము అట్టి ఒప్పందము యొక్క అంతిమ లక్ష్యమా లేక అట్టి లక్ష్యమునకు కేవలము అనుషంగికమైనదా అనునది ముఖ్యాంశము కాదు.

ఆపరాధికకుట్రకు శిక్ష.

120-బీ. (1) మరణదండనతోగాని, యావజ్జీవ కారావాసముతో గాని, రెండు సంవత్సరములు లేక అంత కంటె ఎక్కువ కాలావధికి కఠిన కారావాసముతోగాని శిక్షింపదగు ఒక అపరాధమును చేయుటకైన అపరాధిక కుట్రలో పాల్గొనినవారెవరైనను, అట్టి కుట్ర విషయములో శిక్షించుటకు ఈ స్మృతిలో అభివ్యక్త నిబంధన ఏదియు చేయబడనియెడల అట్టి అపరాధమును అతడు దుష్ప్రేరణ చేసియుండిన ఎట్లో అదే రీతిగా శిక్షింపబడుదురు.

(2) పైన చెప్పినట్లుగా శిక్షింపదగు అపరాధమును చేయుటకైన ఆపరాధిక కుట్ర కానట్టి ఇతరమైన ఆపరాధిక కుట్రలో పాల్గొనిన వారెవరైనను, ఆరు మాసములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని జుర్మానాలోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అధ్యాయము 6

రాజ్యవ్యతిరేక అపరాధములను గురించి

భారతప్రభుత్వముతో యుద్ధము చేయుట, చేయుటకు ప్రయత్నించుట లేక యుద్ధము చేయుటకు దుష్ప్రేరణ చేయుట.

121. భారత ప్రభుత్వముతో యుద్ధము చేయు, లేక అట్టి యుద్ధము చేయుటకు ప్రయత్నించు, లేక అట్టి యుద్ధము చేయుటకు దుష్ప్రేరణ చేయువారెనరైనను, మరణ దండన తోగాని యావజ్జీవ కారావాసముతోగాని శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకుకూడ పాత్రులగుదురు.

ఉదాహరణము

భారత ప్రభుత్వము పై చేయు తిరుగుబాటునందు 'ఏ' అనునతడు చేరును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును. 121వ పరిచ్ఛేదమును బట్టి శిక్షింపదగిన అపరాధములు చేయుటకు కుట్ర.

121-ఏ. 121వ పరిచ్ఛేదమునుబట్టి శిక్షింపదగిన ఆపరాధములలో దేనినైనను చేయుటకు భారత దేశములో గాని భారత దేశమునకు వెలుపలగాని, కుట్ర చేయు, లేక అపరాధిక బలప్రయోగము ద్వారాగాని ఆపరాధిక బల ప్రదర్శన ద్వారా గాని కేంద్ర ప్రభుత్వము నైనను, ఏదేని రాజ్య ప్రభుత్వమునైనను హడలగొట్టుటకై కుట్ర చేయువారెవరైనను యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము : --ఈ పరిచ్ఛేదము క్రింద “కుట్ర ” అగుటకు కుట్ర ననుసరించి ఏదేనీ కార్యము చేయబడుట గాని శాసనరీత్యా చేయవలసిన కార్యము చేయబడకుండుటగాని అవసరము కాదు.

భారత ప్రభుత్వముతో యుద్ధము చేయు ఉద్దేశముతో ఆయుధములు మొదలైన వాటిని సేకరించుట.

122. భారత ప్రభుత్వముతో యుద్ధము చేయు ఉద్దేశ్యముతో గాని, యుద్ధ సన్నద్కలను ఉద్దేశ్యముతో గాని, జనులను, ఆయుధములను, లేక మందుగుండు సామగ్రిని సేకరించెడు లేక యుద్ధము చేయుటకు ఇతర విధముగా సన్నద్ధులగు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు. మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

యుద్ధము చేయుటకైన పన్నుగడకు వీలు కలిగించు ఉద్దేశముతో కప్పిపుచ్చుట.

123. భారత ప్రభుత్వముతో యుద్ధము చేయుటకు ఒక పన్నుగడ ఉన్నదను విషయమును కప్పిపుచ్చుట వలన అట్టి యుద్ధము జరుగుటకు వీలు కలిగించు ఉద్దేశ్యముతోగాని, ఆట్లు కప్పిపుచ్చుట వలన అట్టి వీలును కలిగించుట సంభవమని ఎరిగియుండి గాని, ఏదేని కార్యము చేయుటద్వారా లేక శాసనరీత్యా చేయవలసిన కార్యము చేయకుండుట ద్వారా ఆ విషయమును కప్పిపుచ్చువారెవరైనను పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఏదేని శాసన సమ్మతమైన అధికారపు వినియోగమును బలవంతముగ చేయించు లేక అవరోధించు ఉద్దేశముతో రాష్ట్రపతి, గవర్నరు మొదలైన వారిపై దౌర్జన్యము చేయుట.

124. భారత రాష్ట్రపతి లేక ఏదేని రాజ్య గవర్నరు తన శాసన సమ్మత అధికారములలో వేటినైనను ఏ రీతిగా నైనను వినియోగించుటకు లేక వినియోగించకుండుటకు అట్టి రాష్ట్రపతిని లేక గవర్నరును ప్రేరేపించు లేక బలవంతము చేయు ఉద్దేశ్యముతో,

అట్టి రాష్ట్రపతి పై లేక గవర్నరు పై దౌర్జన్యము చేయు, లేక ఆతనిని అక్రమముగా ఆవరోధించు లేదా అక్రమముగా అవరోధించుటకు ప్రయత్నించు, లేక ఆపరాధిక బల ప్రయోగము ద్వారానైనను, ఆపరాధిక బల ప్రదర్శన ద్వారానైనను హడలగొట్టు లేదా ఆట్లు హడలగొట్టుటకు ప్రయత్నించువా రెవరైనను,

ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

124-ఏ. పలికినట్టి గాని, వ్రాసినట్టి గాని, మాటలద్వారా, లేక సంజ్ఞల ద్వారా, లేక దృశ్య రూపణములద్వారా లేక అన్యధా, భారత దేశములో శాసనరీత్యా నెలకొల్పబడిన ప్రభుత్వము పట్ల ద్వేషమునైనను అధికార ధిక్కారము నైనను కలిగించు లేక కలిగించుటకు ప్రయత్నించు లేక అహిత భావమును రెచ్చగొట్టు లేదా రెచ్చగొట్టుటకు ప్రయత్నించు వారెవరైనను జుర్మానా సహిత యావజ్జీవ కారావాసముతోగాని, జూర్మానా సహితమై మూడు సంవత్సరములదాక ఉండగల కారావాసముతోగాని, జుర్మానాతోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము, 1 : “ఆహిత భావము" అను పదమునందు రాజ్య భక్తి రాహిత్యము, మరియు వైర భావము అన్నియు చేరియుండును.

విశదీకరణము 2 : ద్వేషమును, అధికార ధిక్కారమును, లేదా అహిత భావమును రెచ్చగొట్ట కుండ, లేక రెచ్చగొట్టుటకు ప్రయత్నించకుండ, శాసనసమ్మతమైన పద్ధతులద్వారా ప్రభుత్వ చర్యలను మార్చించవలెనను దృష్టితో వాటిని ఖండించుచు చేయు విమర్శ ఈ పరిచ్ఛేదము కింద అపరాధము కాదు.

విశదీకరణను 3 : ద్వేషమును, అధికార ధిక్కారమును, అహిత భావమును రెచ్చగొట్టకుండ లేక రెచ్చగొట్టుటకు ప్రయత్నించకుండ ప్రభుత్వము యొక్క పరిపాలక లేక ఇతర చర్యలను ఖండించుచు చేయు విమర్శ ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము కాదు.

భారత ప్రభుత్వముతో మైత్రీబంధము కలిగి యుండి,ఆసియాలోనిదగు ఏదేని రాజ్యముతో యుద్ధము చేయుట.

125. భారత ప్రభుత్వముతో మైత్రీబంధము లేదా శాంతియుత సంబంధము గలిగియుండి, ఆసియాలోనిదగు ఏదేని రాజ్య ప్రభుత్వముతో యుద్ధము చేయు, అట్టి యుద్ధము చేయుటకు ప్రయత్నించు లేక అట్టి యుద్ధము చేయుటకు దుష్ప్రేరణ చేయువారెవరైనను యావజ్జీవకారావాసముతో శిక్షింపబడుదురు. దీనికి జూర్మానా కూడ చేర్చవచ్చును; లేక, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షంపబడుదురు. దీనికి జుర్మానా చేర్చవచ్చును; లేక జూర్మానాతో శిక్షింపబడుదురు, భారతప్రభుత్వముతో శాంతియుత సంబంధము కలిగియున్న రాజ్యము యొక్క రాజ్యక్షేత్రములను కొల్లగొట్టుట.

126. భారత ప్రభుత్వముతో మైత్రీబంధము లేదా శాంతియుత సంబంధము కలిగియున్న ఏదేని రాజ్యము యొక్క రాజ్య క్షేత్రములను కొల్లగొట్టు లేక కొల్ల కొట్టుటకు సన్నాహములు చేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకును, అట్లు కొల్ల గొట్టుటలో ఉపయోగింపబడిన లేక ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన లేక అట్టి కొల్లగొట్టుటద్వారా ఆర్జింప బడిన ఏదేని ఆస్తి యొక్క సమపహరణమునకు కూడ పాత్రులగుదురు.

125వ మరియు 126వ పరిచ్ఛేదములలో పేర్కొన బడిన యుద్ధము లేక కొల్లగొట్టుటద్వారా పొందిన ఆస్తిని పుచ్చుకొనుట.

127. 125వ మరియు 126వ పరిచ్ఛేదములలో పేర్కొనిన అపరాధములలో దేనినైనను చేయుటలో తీసికొనబడినట్టి ఆస్తి అని ఎరిగి యుండియు, ఆ ఆస్తి ని పుచ్చుకొను వారెవరైనను, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకును, అట్లు పుచ్చుకొనిన ఆస్తి యొక్క సమపహరణమునకును కూడ పాత్రులగుదురు.

స్వచ్ఛందముగా పబ్లికుసేవకుడు రాజ్య ఖైదీని లేక యుద్ధఖైదీనితప్పించు కొని పోనిచ్చుట.

128. పబ్లికు సేవకుడై యుండి ఎనలేని రాజ్య ఖైదీగాని యుద్ధఖైదీగాని తన అభిరక్షలో ఉండగా, అట్టి ఖైదీని పరిశోధించి ఉంచిన ఏదేని స్థలము నుండి స్వచ్ఛందముగ అట్టి ఖైదీని తప్పించుకొని పోనిచ్చు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

పబ్లికుసేవకుడు నిర్లక్ష్యముతో అట్టి ఖైదీని తప్పించుకొని పొనిచ్చుట.

129. పబ్లికు సేవకుడై యుండి ఎవరేని రాజ్య ఖైదీగాని యుద్ధ ఖైదీగాని తన అభిరక్షలో ఉండగా అట్టి ఖైదీని పరిశోధించి ఉంచిన ఏవేని స్థలము నుండి నిర్లక్ష్యముతో అట్టి ఖైదీని తప్పించుకొని పోనిచ్చు వారెవరై నను మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు, జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

అట్టి ఖైదీ తప్పించుకొని పోవుటకు తోడ్పడుట, అతనిని తప్పించుట, లేక అతనికి ఆశ్రయమిచ్చుట.

130. రాజ్య ఖైదీ ఎవరైనను లేక యుద్ధ ఖైదీ ఎవరైనను శాసన సమ్మత అభిరక్ష నుండి తప్పించుకొని పోవుటలో ఎరిగియే అతనికి తోడ్పడు లేక సహాయపడు వారెవరైనను, అట్టి ఏ ఖైదీనైనను తప్పించు లేక తప్పించుటకు ప్రయత్నించు వారెవరైనను, శాసన సమ్మత అభిరక్ష నుండి తప్పించుకు పోయిన అట్టి ఖైదీకి ఎవరికైనను ఆశ్రయమిచ్చు లేక ఆతనిని దాచి పెట్టు వారెవరైనను, అట్టి ఖైదీని తిరిగి పట్టు కొనుటను ప్రతిఘటించు లేక ప్రతిఘటించుటకు ప్రయత్నించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు,

విశదీకరణము : భారతదేశములో నిశ్చిత హద్దులలో పెరోల్ పై యధేచ్ఛగా ఉండుటకు అనుజ్జ ఈయబడినట్టి రాజ్య ఖైదీ లేక యుద్ధ ఖైదీ, ఏ హద్దులలో యధేచ్ఛగా ఉండుటకు అతడు అనుమతింపబడెనో ఆ హద్దులను దాటిపోయినచో, అతడు శాసనసమ్మత అభిరక్ష నుండి తప్పించుకొని పోయినట్లు చెప్పబడును.

అధ్యాయము-7

సైన్యమునకు, నౌకాబలమునకు, వైమానిక బలమునకు సంబంధించిన

అపరాధములను గురించి.

తిరుగుబాటుకు దుష్ప్రేరణ చేయుట లేక 'సైనికునిగాని,నావికునిగాని, వైమానికునిగాని, కర్తవ్య విముఖుని చేయటకు ప్రయత్నించుట.

131. భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకాజలము, లేక వైమానిక బలములోని, ఎవరేని అధికారిని, సైనికుని, నావికుని లేక వైమానికుని తిరుగుబాటు చేయుటకు దుష్ప్రేరణ చేయు, లేక అట్టి ఎవరేని అధికారినిగాని, సైనికుని గాని, నావికునిగాని, వైమానికునిగాని అతని రాజ్య నిష్ట నుండియైనను కర్తవ్యమునుండి యైనను విముఖుని చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మావాకు కూడ పాత్రులగుదురు,

1950 లోని 46వ చట్టము1934లోని 34వ చట్టము 1950 లోని 45వ చట్టము.


విశదీకరణము : ఈ పరిచ్ఛేదములో “అధికారి", "సైనికుడు”, “నావికుడు", మరియు "వైమానికుడు” అను పదముల పరిధియందు, సందర్భానుసారముగ ఆర్మీ చట్టమునకు, సేనా చట్టము 1950 నకు, నేవల్ డిసిప్లిన్ చట్టమునకు, ఇండియన్ నేవీ (డిసిప్లిన్') చట్టము 1934, నకు, ఎయిర్ ఫోర్స్. చట్టమునకు, లేక వైమానిక జల చట్టము, 1950 నకు, లోబడియున్న ఏ వ్యక్తియైనను చేరియుండును, తిరుగుబాటుకు దుష్ప్రేరణచేయుట, తత్పరిణామముగా తిరుగుబాటు చేయబడినచో,

132. భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకా బలము లేక వైమానిక బలములోని అధికారిని, సైనికుని నావికుని లేక వైమానికుని తిరుగుబాటు చేయుటకు దుష్ప్రేరణ చేయు వారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా తిరుగుబాటు చేయబడినచో, మరణ దండనతోగాని, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పదవి నిర్వహించు చున్నట్టి పై అధికారి పట్ల దౌరవ్యమునకు సైనికుని, నావికుని లేక వైమానికుని దుష్ప్రేరణ చేయుట.

133. తన పదనిని నిర్వహించుచున్నట్టి ఎవరేని పై అధికారిపట్ల దౌర్జన్యము చేయుటకు భారత ప్రభుత్వ సైన్యములోని నౌకా బలము లేక వైమానిక బలములోని ఒక అధికారిని, "సైనికుని, నావికుని లేక వైమానికుని దుష్ప్రేరణ చేయు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకవు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

అట్టి దౌర్జన్యమునకు దుష్ప్రేరణ, దౌర్జన్యము చేయబడినచో,

134. తన పదవిని నిర్వహించుచున్నట్టి ఎవరేని పై అధికారిపట్ల దౌర్జన్యము చేయబడుటకు భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకా బలము లేక వైమానిక బలములోని ఒక అధికారిని, సైనికుని, నావికుని లేక వైమానికుని దుష్ప్రేరణ చేయు వారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా అట్టి దౌర్జన్యము చేయబడినచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

సైనికుని, నావికుని లేక వైమానికుని తన సేవను విడిచి పారిపోవుటకు దుష్ప్రేరణ చేయుట.

135. భారత ప్రభుత్వ సైన్యములోని, నౌకాబలము, లేక వైమానిక బలములోని అధికారిని, సైనికుని, నావికుని లేక వైమానికుని తన సేవను విడిచి పారిపోవుటకు దుష్ప్రేరణ చేయు వారెనరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

సేనను విడిచి పారిపోయిన వ్యక్తికి ఆశ్రయము నిచ్చుట.

136. భారత ప్రభుత్వ సైన్యము, నౌకాబలము లేక వైమానిక బలములోని అధికారి, సైనికుడు,నావికుడు లేక వైమానికుడు సేవను విడిచి పారిపోయినాడని ఎరిగియుండియు, లేక ఆట్లు విశ్వసించుటకు కారణము ఉండియు, అట్టి అధికారికి, సైనికునికి, నావికునికి లేక వైమానికునికి, ఇందు ఇటు పిమ్మట మినహాయింప బడినట్లు తప్ప, ఆశ్రయమిచ్చు వారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మినహాయింపు : భార్య భర్తకు ఆశ్రయము ఇచ్చిన సందర్భమునకు ఈ నిబంధన విస్తరించదు.

సేనను విడిచి పారిపోయిన వ్యక్తి వాణిజ్య జలయానముపై దాని మాస్టరు నిర్లక్ష్యము వలన దాచబడి యుండుట.

137. భారత ప్రభుత్వ సైన్యమును, నౌకాబలమును, లేక వైమానిక బలమును విడిచి పారిపోయిన ఎనలేని వ్యక్తి దాచబడియున్నట్టి ఒక వాణిజ్య జలయానము యొక్క మాస్టరు లేక ఆ జలయానము బాధ్యతగల వ్యక్తి అట్లు దాచబడి యుండుట తాను ఎరుగకున్నప్పటికీని, మాస్టరుగా లేక అట్టి బాధ్యతగల వ్యక్తిగా తన కర్తవ్యమును నిర్లక్ష్యము చేసియుండని యెడల, లేక ఆ జలయానము పై క్రమశిక్షణ కొరవడియుండని యెడల, ఆట్లు దాచబడియున్నట్లు తాను ఎరిగి యుండెడి వాడగుచో, ఐదు వందల రూపాయలకు మించని శాస్త్రికి పాత్రుడగును.

సైనికుని, నావికుని,లేక వైమానికుని ఆ విధేయతతో కూడిన కార్యము చేయుటకు దుష్ప్రేరణ చేయుట.

138. భారత ప్రభుత్వ సైన్యము, నౌకా బలము లేక వైమానిక బలములోని అధికారి, సైనికుడు, నావికుడు లేక వైమానికుడు చేయు కార్యము అవిధేయతతో కూడిన కార్యమగునవి తాను ఎరిగియుండియు ఆ కార్యమును దుష్ప్రేరణ చేయు వారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా అట్టి అవిధేయతతో కూడిన కార్యము చేయబడినచో, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

138-ఏ X X X

కొన్ని చట్టములకు లోనై యుండు వ్యక్తుల విషయము 1950లోని 46వ చట్టము. 1934లోని 34వ చట్టము,1950లో 45వ చట్టము

139. ఆర్మీ చట్టమునకు, సేవా చట్టము, 1950నకు, నేవల్ డిసిప్లన్ చట్టమునకు, ఇండియన్ నేవీ( డిసిప్లిన్ ) చట్టము 1934 నకు, ఎయిర్ ఫోర్స్ చట్టమునకు, లేక వైమానిక జల చట్టము, 1950 నకు లోబడియున్న ఏ వ్యక్తియు ఈ అధ్యాయములో నిర్వచింపబడిన ఆపరాధములలో దేనికి గాని ఈ స్మృతి క్రింద శిక్షకు లోనై ఉండడు. సైనికుడు, నావికుడు లేక వైమానికుడు ఉపయోగించెడి దుస్తులను ధరించుట, లేక టోకెను పెట్టుకొనుట.

140. భారత ప్రభుత్వ సైనిక, నౌకా లేక వైమానిక సేవలోని సైనికుడు, నావికుడు లేక వైమానికుడు కానప్పటికి, తాను అట్టి సైనికుడు, నావికుడు లేక వైమానికుడు అని విశ్వసింప జేయవలెనను ఉద్దేశముతో అట్టి సైనికుడు, నావికుడు లేక వైమానికుడు ఉపయోగించెడి ఏవేని దుస్తులను పోలియున్న లేక ఏదేని టోకెనుసు పోలియున్న ఏవేని దుస్తులను ధరించు, లేక ఏదేని టోకెను పెట్టుకొను వారెవరైనను, మూడు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని అయిదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అధ్యాయము-8

ప్రజా ప్రశాంతికి భంగకరమగు అపరాధములను గురించి.

శాసన విరుద్ధ సమావేశము.

141. అయిదుగురు లేక అంతకు ఎక్కువమంది వ్యక్తుల సమావేశము, ఆ సమావేశములోని వ్యక్తుల ఉమ్మడి లక్ష్యము ఈ క్రింద పేర్కొనిన వాటిలో ఏదైనచో, "శాసన విరుద్ధ సమావేశము " అనబడును,

మొదటిది :-- కేంద్ర ప్రభుత్వమును 'లేక ఏదేని రాజ్య ప్రభుత్వమును లేక పార్లమెంటును, లేక ఏదేని రాజ్య శాసనమండలిని, లేక పబ్లికు సేవకుడుగ తన శాసన సమ్మత అధికారమును వినియోగించుచున్న ఎవరేని పబ్లికు సేవకుని, ఆపరాధిక బల ప్రయోగము ద్వారా లేక ఆపరాధిక బల ప్రదర్శనము ద్వారా హడలగొట్టుట, లేక

రెండవది :— ఏదేని శాసనమును లేక శాసనిక అదేశికను అమలు పరుచుటను ప్రతిఘటించుట; లేక

మూడవది :- ఏదేని దుశ్హ్చేష్టను లేక ఆపరాధిక ఆక్రమ ప్రవేశమును, లేక ఇతర అపరాధమును చేయుట, లేక

నాల్గవది :-- ఏ వ్యక్తి పట్ల నైనను ఆపరాధిక బలమును ప్రయోగించుట ద్వారానై నను ఆపరాధిక బలమును ప్రదర్శించుట ద్వారానై నను ఏదేని ఆస్తిని స్వాధీనము చేసికొనుట, లేక ఆస్తి స్వాధీనము పొంచుట, లేక ఏ వ్యక్తికై నను ఆతడు స్వాధీనము కలిగియున్న లేక ఆనుభవించుచున్న ఒక దారి హక్కు గాని, నీటిని ఉపయోగించుకొను హక్కుగాని ఇతర నిరాకారమైన హక్కు. గాని దక్కకుండా చేయుట, లేక ఏదేని హక్కును గాని, కలదనుకొను ఏదేని హక్కునుగాని అమలుపరచుట, లేక

అయిదవది:- అపరాధిక బలప్రయోగము ద్వారా లేక ఆపరాధిక బల ప్రదర్శనము ద్వారా ఏ వ్యక్తినైనను అతడు చేయుటకు శాసన బద్దుడుగాని దేనినైనను చేయుమని గాని, అతడు చేయుటకు శాసన రీత్యా హక్కు కలిగియున్నట్టి దేనినైనను చేయకుండుమని గాని బలవంతము చేయుట.

విశదీకరణము :- సమావేశమైనపుడు, ఆ సమావేశము శాసన నిరుద్ధమైనట్టిది కాకున్నను, ఆ తరువాత అది శాసన విరుద్ద సమావేశము కావచ్చును.

శాసవ విరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తి.

142. ఏ సమావేశమునైనను శాసనవిరుద్ద సమావేశముగ నొనర్చెడు సంగతులను ఎరిగియుండియు, ఉద్దేశ పూర్వకముగా ఆ సమావేశములో చేరు లేక దానిని వీడకయుండు నతడెవరైనను శాసన విరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తి అని చెప్పబడును.

శిక్ష.

143. శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మారణాయుధమును ధరించి శాసనవిరుద్ధ సమావేశములో చేరుట.

144. ఏదేని మారణాయుధమును ధరించి గాని, దాడి ఆయుధముగా ఉపయోగించినపుడు మరణము కలిగించజాలు దేనినైనను ధరించిగాని శాసన విరుద్ధ సమావేశమునకు చెందియుండు వారెవరైనను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

చెదరిపోవలసినదని ఆజ్ఞాపింపబడినట్లు ఎరిగియుండియు,శాసనవిరుద్ధ సమావేశములో చేరుట, లేక దానిని వీడకుండుట.


145. ఏదేని శాసన నిరుద్ధ సమావేశమును చెదరిపోవలసినదని శాసన విహిత అతిగా ఆజ్ఞా సంపనట్లు ఎరిగి యుండియు, అట్టి శాసన విరుద్ధ సమావేశములో చేరు లేక దానిని వీడకుండు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు. దొమ్మీ,

146. ఏదీని శాసనవిరుద్ధ సమావేశము యొక్క ఉమ్మడి లక్ష్యమును సాధించుటలో అట్టి సమావేశముగాని దానికి చెందిన ఎవరేని వ్యక్తి గాని, బలప్రయోగమునైనను హింసా ప్రయోగమునైనను జరిపినపుడెల్లను అట్టి సమావేశమునకు చెందిన ప్రతి వ్యక్తి దొమ్మీ అను అపరాధమును చేసినవాడగును.

దొమ్మీకి శిక్ష.

147. దొమ్మీ చేసిన వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మారణాయుధములను ధరించి దొమ్మీ చేయుట.

148. ఏదేని మారణాయుధమును ధరించిగాని, దాడి ఆయుధముగా ఉపయోగించినపుడు మరణము కలిగింపజాలు దేనినైనను ధరించిగాని దొమ్మీ చేసినవారెనరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉమ్మడి లక్ష్యమును సాధించుటలో జరిగిన అపరాధమును శాసనవిరుద్ద సమావేశమునకు చెందిన ప్రతివ్యక్తి చేసిన వాడగుట.

149. శాసనవిరుద్ధ సమావేశము యొక్క ఉమ్మడి లక్ష్యమును సాధించుటలో, ఆ సమావేశమునకు చెందిన ఏ వ్యక్తి యైనను ఒక ఆపరాధమును చేసినచో, లేక ఆ లక్ష్య సాధనలో జరుగుట సంభవమని ఆట్టి సమావేశమునకు చెందిన వ్యక్తులు ఎరిగియున్నట్టి అపరాధమును చేసినచో, ఆ ఆపరాధము జరిగినపుడు ఆ సమావేశమునకు చెందిన ప్రతి వ్యక్తియు ఆ ఆపరాధమునుచేసిన వాడగును.

శాసన విరుద్ద సమావేశములో చేరుటకు వ్యక్తులను కిరాయికి తెచ్చుట లేక కిరాయికి తెచ్చుటకు మౌనానుకూలతను చూపుట,

150. ఏదేని శాసన విరుద్ధ సమావేశములో చేర్చుటకుగాని, అట్టి సమావేశమునకు చెందునట్లు చేయుటకుగాని వ్యక్తినైనను కిరాయికి తెచ్చు, లేక పనిలో కుదుర్చుకొను, లేక నియోగించు, లేదా అందుకుగాను ఏ వ్యక్తినై నను కిరాయికి తెచ్చుటను గాని, పనిలో కుదుర్చుటనుగాని, నియోగించుటనుగాని, ప్రోత్సహించు, లేక అందుకు మౌనానుకూలతను జూపు వారెవరైనను అట్టి శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తులుగ శిక్షింపబడుదురు. మరియు అట్టి ఏ వ్యక్తి యైనను అట్టి శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తిగా అట్టి కిరాయికి తేబడుటను, పనిలో కుదుర్చబడుటను, లేక వినియోగింపబడుటను అనుసరించి చేసినట్టి ఏదేని ఆపరాధమునకు, తాము అట్టి శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తులై యుండినచో, లేక తామే స్వయముగా అట్టి ఆపరాధమును చేసియుండినచో ఎట్లో అదేరీతిగ శిక్షింపబడుదురు.

అయిదుగురు లేక అంతకు ఎక్కువ మంది వ్యక్తుల సమావేశము చెదరి పోవలసినదని ఆజ్ఞాపింపబడిన పిమ్మట, ఎరిగియుండియు అందులో చేరుట లేక దానిని విడువకుండుట,

151. ప్రజాశాంతికి భంగకరము కాగల, అయిదుగురు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులుగల సమావేశము చెదరిపోవలసినదని శాసనసమ్మతముగా అజ్ఞాపింపబడిన పిమ్మట, ఎరిగియుండియు అట్టి సమావేశములో చేరు లేక దానిని వీడక ఉండు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింసబడుదురు.

విశదీకరణము :-- సమావేశము 141వ పరిచ్ఛేద భావములో శాసనవిరుద్ద సమావేశమగుచో, అపరాధి 145వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగియుండును.

దొమ్మీ మొదలైన వాటిని అణచివేయునపుడు పబ్లికు సేవకుని పై దౌర్జన్యము చేయుట లేక ఆతనిని ఆటంకపరచుట.

152. శాసనవిరుద్ధ సమావేశమును చెదరగొట్టు ప్రయత్నములో, లేక దొమ్మీనిగాని జగడమునుగాని అణచివేయు ప్రయత్నములో పబ్లికు సేవకుడుగా తన కర్తవ్యమును నిర్వహించుచున్న ఎవరేని పబ్లికు సేవకుని పై దౌర్జన్యముచేయు, లేక దౌర్జన్యము చేయుదునని బెదిరించు, లేక అతనిని ఆటంకపరచు లేక ఆటంక పరచుటకు ప్రయత్నించు, లేక అట్టి పబ్లికు సేవకునిపై ఆపరాధిక బలమును ప్రయోగించు, లేక ప్రయోగింతునని బెదిరించు, లేక ప్రయోగించుటకు ప్రయత్నించు వారెవరైను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

దొమ్మీ జరిగించు ఉద్దేశముతో బుద్ధి పూర్వకముగా ప్రకోపింప జేయుట.

153. శాసనవిరుద్ధమైన పనిని దేనినై నను చేయుటద్వారా దొమ్మీ అపరాధము జరుగవలెనను ఉద్దేశముతో లేక దొమ్మీ ఆపరాధము జరుగుట సంభవమని ఎరిగియుండి, విద్వేష పూర్వకముగ గాని, బుద్ధి పూర్వకముగ గాని, ఏ వ్యక్తినైనను ప్రకోపింపజేయు వారెవరైనను,

డొమ్మీ జరిగినచో,

దొమ్మీ అపరాధము అట్టి ప్రకోపవరిణామముగా జరిగినచో, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

దొమ్మీ జరగనిచో,

దొమ్మీ ఆపరాధము జరగనిచో, ఆరు నెలలదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గానీ ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు. మతము, జాతి, జన్మస్థలము, నివాసము,భాష మొదలైన వాటి ఆధారము పై విభిన్న వర్గముల మధ్య వైరభావమును పెంపొందించుట మరియు సౌహార్థభంగకర కార్యములను జేయుట.

153.-ఏ. (1) ఎవరై నను——

(ఏ) పలికినట్టి గాని వ్రాసినట్టి గాని మాటల ద్వారా, లేక సంజ్క్షల ద్వారా లేక దృశ్యరూపణముల ద్వారా లేక అన్యధా విభిన్న మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గముల మధ్య, లేక విభిన్న కులముల మధ్య, లేక విభిన్న సమాజముల మధ్య మతము, జాతి, జన్మస్థలను, నివాసము, భాష, కులము లేక సమాజమునకు సంబంధించిన ఆధారముపై లేక ఎట్టిదైనను ఏదేని ఇతర ఆధారముపై , అసౌహార్థతను గాని వైర, ద్వేష లేక వైమనస్య భావమును గాని పెంపొందించిన లేక పెంపొందించుటకు ప్రయత్నించిన యెడల, లేక

(బీ) విభిన్న మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గముల మధ్య, లేక విభిన్న కులముల మధ్య లేక విభిన్న సమాజముల మధ్య సౌహార్దమునకు భంగకరమగునట్టిదై, ప్రజా ప్రశాంతికి భంగము కలిగించునది లేక కలిగించగలదగు కార్యమును చేసినయెడల,

(సి) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గముపైన, లేక ఏదేని కులము వారి పైన, లేక ఏదేని సమాజమునకు చెందినవారిపైన, ఏదేని వ్యాయామములో, ఉద్యమములో, కవాతులో లేక అటువంటి ఇతర కార్యకలాపములో పాల్గొనువారు అపరాధిక బలమునో, హింసనో ప్రయోగించవలెనను లేక ప్రయోగించుటకై శిక్షణ పొందవలెనను ఉద్దేశముతో నైనను, అట్టి కార్యకలాపములో పాల్గొను వారు అపరాధిక బలమునో, హింసనో ప్రయోగించుట, లేక ప్రయోగించుటకై శిక్షణ పొందునట్లు చేయుట సంభవమని ఎరిగియుండి యైనను, అట్టి కార్యకలాపమును నిర్వహించిన యెడలగాని, అట్టి వారిపై ఆపరాధిక బలమునో, హింసనో ప్రయోగించవలెనను లేక ప్రయోగించుటకై శిక్షణ పొందవలెనను ఉద్దేశముతోనైనను, అట్టి కార్యకలాపములో పాల్గొనువారు ఆపరాధిక బలమునో, హింసనో ప్రయోగించుట లేక ప్రయోగించుటకై శిక్షణ పొందుట సంభవమని ఎరిగి యుండియైనను, అట్టి కార్యకలాపమునందు పాల్గొనిన యెడలగాని, మరియు అట్టి కార్యకలాపము, ఎట్టి కారణమువల్లనైనను అట్టి మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గము వారికైనను, కులము వారికి లేక సమాజము వారికైనను భయమును లేక అలజడిని లేక భద్రతారాహిత్య భావమును కలుగజేసిన లేక కలిగించగలదైన యెడల,

వారు మూడు సంవత్సరములదాక ఉండగల కారావాసముతోగాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆరాధనా స్థలము మొదలగు చోట్ల చేసిన అపరాధము.

(2) ఏదేని ఆరాధనా స్థలములో లేక మత సంబంధ ఆరాధనను గాని మత సంబంధ కర్మకాండను గాని జరుపుకొనుచున్న సమావేశములో ఉపపరిచ్ఛేదము (1)లో, నిర్దిష్టమైన ఆపరాధమును జేయువారెవరైనను, అయిదు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

జాతీయ సమైక్యతకు భంగకరమగు ఆరోచణలు, వక్కాణింపులు,

153.- బీ. (1) పలికినట్టి గాని, వ్రాసినట్టి గాని మాటలద్వారా, లేక సంజ్ఞలద్వారా దృశ్యరూపణముల ద్వారా లేక అన్యధా ఎవరైనను.——

(ఏ) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గమునకైనను, ఏదేని కులము, లేక సమాజమునకైనను చెందిన వారైయున్న కారణమున, ఏదేని వర్గపు వ్యక్తులు శాసనము ద్వారా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్టలను కలిగియుండలేరని గాని, భారత సార్వభౌమతను, అఖండతను సమర్థించలేరని గాని, ఏదేని ఆరోపణలు చేసిన లేక ప్రచురించిన యెడల, లేక

(బి) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గమునకైనను, ఏదేని కులము లేక సమాజమునకైనను చెందిన వారైయున్న కారణమున ఏదేని వర్గపు వ్యక్తులకు, భారతదేశ పౌరులుగా వారికి గల హక్కులను లేకుండ గాని దక్కకుండగాని చేయవలెనని వక్కాణించిన, బోధించిన, సలహానిచ్చిన, ప్రచారము చేసిన లేక ప్రచురించిన యెడల, లేక

(సి) ఏదేని మత, జాతి, భాషా లేక ప్రాంతీయ వర్గమునకైనను, ఏదేని కులము లేక సమాజమునకైనను చెందినవారై యున్న కారణముగా ఏదేని వర్గపు వ్యక్తులకు గల బాధ్యతను గురించి దేనినైనను వక్కాణించిన, బోధించిన, వాదన చేసిన, విజ్ఞప్తి చేసిన, లేక ప్రచురించిన యెడల, మరియు అట్టి వక్కాణింపు, బోధ, వాదన లేక విజ్ఞప్తి అట్టి వారి మధ్యనైనను, అట్టి వారికిని ఇతర వ్యక్తులకును మధ్యనైనను అసౌహార్థ తను గాని వైర, ద్వేష, లేక వైమనస్య భావమును గాని కలుగజేసిన లేక, కలుగజేయగల దైన యెడల, వారు మూడు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో గాని, జార్మానాతో గాని, ఈ రెండింటితోగాని, శిక్షించబడుదురు.

(2) ఏదేని ఆరాధనా స్థలములో, లేక మత సంబంధ ఆరాధనను గాని మత సంబంధ కర్మకాండను గాని జరుపుకొనుచున్న సమావేశములో ఉపసరిచ్చేదము (1)లో నిర్దిష్టమైన అపరాధమును చేయువారెవరైనను, అయిదు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

శాసన విరుద్ధ సమావేశము జరుపబడినట్టి భూమి యొక్క సొంతదారు లేక ఆక్రమణదారు.


154. ఏదేని శాసనవిరుద్ధ సమావేశము లేక దొమ్మీ జరిగినప్పుడెల్లను, ఏ భూమిపై అట్టి శాసనవిరుద్ధ సమావేశము లేక అట్టి దొమ్మీ జరుపబడినదో ఆ భూమి యొక్క సొంతదారైనను, ఆక్రమణదారైనను, ఆ భూమిలో హితము కలిగియున్న లేక క్లెయిము చేయుచున్న ఎవరేని వ్యక్తియైనను, అతడుగాని ఆతని ఏజెంటుగాని, మేనేజరుగాని అట్టి అపరాధము చేయబడుచున్నదని లేక చేయబడినదని ఎరిగియుంగి, లేక చేయబడగలదని విశ్వసించుటకు కారణము కలిగియుండి, అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు అతి త్వరగా, అత్యంత సమీపమునగల పోలీసు స్టేషను యొక్క ప్రధాన అధికారికి తద్విషయమును తెలియజేయనిచో, మరియు ఆ అపరాధము చేయబడబోవుచున్నదని విశ్వసించుటకు ఆతనికిగాని వారికిగాని కారణమున్న సందర్భములో, దానిని నివారించుటకు అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు శాసన సమ్మత పద్ధతులనన్నింటిని ఉపయోగించనిచో, మరియు ఆ ఆపరాధము జరిగిన పక్షములో ఆ శాసన విరుద్ధ సమావేశమును చెదరగొట్టుటకు లేక ఆ దొమ్మీని అణచి వేయుటకు అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు శాసన సమ్మత పద్దతులన్నింటిని ఉపయోగించనిచో, వేయి రూపాయలకు మించని జుర్మానాతో శిక్షింపబడును.

దొమ్మీ ఎవరిమేలు కొరకు చేయబడినదో, ఆ వ్యక్తి యొక్క బాధ్యత.

155. ఏ భూమి విషయమున దొమ్మీ జరుగునో ఆ భూమి యొక్క సొంతదారైన, ఆక్రమణదారైన, లేక అట్టి భూమిలో గాని ఆ దొమ్మీకి కారణభూతమైన ఏదైనా వివాద విషయ వస్తువులో గాని హితమును దేనినైనను క్లెయిము చేయువాడైన లేక దానినుండి ఏదేని మేలును స్వీకరించిన లేక పొంచిన వాడైన ఎనలేని వ్యక్తి యొక్క మేలు కొరకు లేక అతని తరఫున దొమ్మీ చేయబడినప్పుడెల్ల ను, అట్టి వ్యక్తి గాని, అతని ఏజెంటు గాని, మేనేజరుగాని అట్టి దొమ్మీ జరుగగలదని యైనను, ఏ శాసన విరుద్ధ సమావేశము ద్వారా అట్టి దొమ్మీ జరిగినదో ఆ శాసన విరుద్ధ సమావేశము జరుగగలదనియైనను విశ్వసించుటకు కారణము ఉండియు, అట్టి సమావేశమును, లేక దొమ్మీని జరుగకుండ నివారించుటకును, దానిని ఆణచివేసి చెదరగొట్టుటకును అతని యొక్క లేక వారి యొక్క శక్తి మేరకు శాసనసమ్మత పద్ధతులనన్నింటిని ఉపయోగించనిచో, అట్టి వ్యక్తి జూర్మానాతో శిక్షింపబడును.

గొమ్మీ ఎవరి మేలు కొరకు చేయబడినదో ఆ సొంతదారు యొక్క లేక ఆక్రమణదారు

156. ఏ భూమి విషయమున దొమ్మీ జరుగునో ఆ భూమి యొక్క సొంతదారైన, లేక అక్రమణదారైన లేక అట్టి భూమిలో గాని ఆ దోమ్మీకి కారణభూతమైన ఏదై నా వివాద విషయ వస్తువులో గాని హితమునుదేనినైనను క్లెయిము చేయు వాడైన లేక దాని నుండి ఏదేని మేలును స్వీకరించిన లేక పొందిన వాడైన ఎవరేని వ్యక్తి యొక్క మేలు కొరకు లేక అతని తరఫున దొమ్మీ చేయబడినప్పుడెల్లను,

అట్టి వ్యక్తి యొక్క ఏజెంటు గాని, మేనేజరు గాని, అట్టి దొమ్మీ జరుగగలదని యైనను, ఏ శాసన విరుద్ద సమావేశము ద్వారా అట్టి డొమ్మీ జరిగినదో ఆ శాసన విరుద్ధ సమావేశము జరుగగలదనియైనను విశ్వసించుటకు కారణము కలిగియుండియు, అట్టి సమావేశమును, లేక దొమ్మీని జరుగకుండ నివారించుటకును దానిని అణచివేసి చెదర గొట్టుటకును అతని యొక్క శక్తి మేరకు శాసన సమ్మత పద్ధతులనన్నింటిని ఉపయోగించనిచో, ఆట్టి ఏజెంటు లేక మేనేజరు జుర్మానాతో శిక్షింపబడును.

శాసనవిరుద్ద సమావేశము కొరకు కిరాయికి తేబడిన వ్యక్తులకు ఆశ్రయమిచ్చుట,

157. శాసస విరుద్ధ సమావేశములో చేరుటకు లేక దానిలో పాల్గొనుటకు కిరాయికి తేబడినారని, పనిలో కుదుర్చు కొనబడినారని, లేక నియోగింపబడినారని గాని, కిరాయికి తేబడనున్నారని, పనిలో కుదుర్చుకొనబడనున్నారని, లేక నియోగింపబడనున్నారని గాని ఎరిగి యుండియు, అట్టి వ్యక్తులకు తన ఆక్రమణములో లేక ఆధీనములోనున్న లేక తన నియంత్రణలోనున్న ఏదేని ఇంటియందు లేక ఆవరణయందు ఆశ్రయమిచ్చు, వారిని చేరనిచ్చు, లేక సమావేశపరచు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు. శాసన విరుద్ధ సమావేశములో లేక దొమ్మీలో పాల్గొనుటకు కిరాయికి తేబడుట.

158. 141వ పరిచ్ఛేదములో నిర్దిష్టమైన కార్యములలో దేనినైనను చేయుటకు లేక చేయుటలో సహాయపడుటకు పనిలో కుదుర్చు కొనబడిన, లేక కిరాయికి తేబడిన, లేక పనిలో కుదుర్చుటకు గాని కిరాయికి పనిచేయుటకు గాని ముందుకు వచ్చు లేక ఆందుకు ప్రయత్నించు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

లేక, సాయుధులై పోవుట.

మరియు పైన చెప్పినట్లు పనిలో కుదుర్చు కొనబడియుండి, లేక కిరాయికి తేబడియుండి, ఏదేని మారణాయుధమును గాని, దాడి ఆయుధముగా ఉపయోగింపబడినచో మరణము కలిగించ జాలు దేనినైనను గాని ధరించి పోవు, ఆట్లు పోవుటకు కుదురు లేక పొవుటకు ముందుకు వచ్చు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుడురు.

జగడము.

159. ఇద్దరు, లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు బహిరంగ స్థలములో కొట్లాడుట ద్వారా ప్రజా శాంతికి భంగము కలిగించినప్పుడు వారు ' జగడమాడినట్లు ' చెప్పబడును.

జగడమాడినందుకు శిక్ష.

160. జగడమాడిన వారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, వంద రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.


అధ్యాయము——9.

పబ్లికు సేవకులు చేయు, లేక వారికి సంబంధించిన అపరాధములను గురించి

పబ్లికు సేవకుడు ఒక అధికారిక కార్యము విషయమున శాసన విహిత ప్రతిమూల్యము గాక ఇతరమైన పారితోషికమును తీసికొనుట.

161. పబ్లికు సేవకుడై యుండి లేక అగుదుననుకొనుచుండి, ఏదేని ఆధికారిక కార్యమును చేయుటకు గాని చేయకుండ మానుకొనుటకు గాని, తన ఆధికారిక కృత్యముల నిర్వహణములో ఏ వ్యక్తి పట్ల నైనను ఏదేని అనుకూలతను లేక ప్రతికూలతను చూపుటకుగాని, చూపకుండ మానుకొనుటకు గాని, కేంద్ర ప్రభుత్వము లేక ఏదేని రాజ్య ప్రభుత్వము లేక పార్లమెంటు లేక ఏదేని రాజ్య, విధానమండలి మూలముగ, లేక 21వ పరిచ్ఛేదము లో నిర్దేశింపబడినట్టి ఏదేని స్థానిక ప్రాధికారము, కార్పొరేషను లేక ప్రభుత్వ కంపెనీ మూలముగ, లేక ఎవరేని పబ్లికు సేవకుని మూలముగ ఏ వ్యక్తి కైనను ఏదేని ఉపకారము, లేక అపకారము చేయుటకు గాని చేయ ప్రయత్నించుటకు గాని, ప్రేరణముగ లేక బహుమానముగ ఏ వ్యక్తి నుండి యైనను తన కొరకు గాని, ఎనలేని ఇతర వ్యక్తి కొరకు గాని శాసన విహిత ప్రతి మూల్యమును గాక ఇతరమైన ఏదేని పారితోషికమును స్వీకరించు, లేక పొందు లేక స్వీకరించుటకు అంగీకరించు, లేక పొందుటకు ప్రయత్నించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

"పబ్లికు సేనకుడ నగదు ననుకొనుచుండి"


విశదీకరణము :-- ఒక వ్యక్తి తానొక పదవిలో ఉందుననుకొనక, తాను ఆ పదవిలో ఉండబోవు చున్నాననియు అప్పుడు తాను వారికి ఉపకారము చేయుదుననియు ఇతరులను మోసముతో విశ్వసింపజేసి, వారి నుండి పారితోషికమును పొందినచో అతడు దగా చేసినవాడు కావచ్చును, కాని అతడు ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆసరాధమును చేసినవాడు కాడు.

"పారితోషికము"

“పారితోషికము" అను పదము ధన రూప పారితోషికములకు, ధన రూపమున అంచనా కట్టనగు పారితోషికములకు పరిమితము కాదు.

శాసన విహిత ప్రతి మూల్యము

శాసనవిహిత ప్రతిమూల్యము " అను పదబంధము శాసన సమ్మతముగా ఒక పబ్లికు సేవకుడు అభ్యర్థించదగు ప్రతి మూల్యమునకు పరిమితము కాదు. దాని పరిధిలో అతడు స్వీకరించవచ్చునని అతడు సేవించుచున్న ప్రభుత్వము అతనికి అనుజ్జ ఒసగిన ప్రతిమూల్యములన్నియు చేరి యుండును.

"చేయుటకు ప్రేరణ బహుమానము"

ఒక వ్యక్తి తాను చేయుటకు ఉద్దేశించని దానిని దేనినైనను చేయుటకు ప్రేరణముగ, లేక తాసు చేయనట్టి దానిని దేనినై నను చేయుటకు బహుమానముగ, పారితోషికమును తీసికొను వ్యక్తి ఈ పదబంధ పరిధియందుచేరి యుండును.

ఉదాహరణములు

(ఏ)'ఏ' అను ఒక మున్సిఫు 'జడ్' అను ఒక బ్యాంకరుకు అనుకూలముగ ఒక వ్యాజ్యములో తీర్పునిచ్చుటకు ఏ'కు బహుమానముగా 'ఏ' యొక్క సోదరునికి ' జడ్' యొక్క బ్యాంకులో ఒక ఉద్యోగమును ' జడ్' చే ఇప్పించును.'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును, (బి) 'ఏ' అను నతడు ఒక విదేశరాజ్యములో కాన్సలు పదవియందుండి, ఆ రాజ్యము యొక్క మంత్రి నుండి ఒక లక్ష రూపాయలను స్వీకరించును. 'ఏ' ఈ మొత్తమును ప్రత్యేకమైన ఒక అధికారిక కార్యమును చేయుటకు గాని, చేయకుండ మాను కొనుటకుగాని, భారత ప్రభుత్వ మూలముగ ఆ రాజ్యమునకు ఏదేని ప్రత్యేకమైన ఉపకారము చేయుటకు గాని చేయ ప్రయత్నించుటకు గాని ప్రేరణముగ, లేక బహుమానముగ స్వీకరించినట్లు కన్పించదు. కాని 'ఏ' ఈ మొత్తమును, తన ఆధికారిక కృత్యముల నిర్వహణములో సాధారణముగా ఆ రాజ్యమునకు అనుకూలతను చూపుటకు ప్రేరణముగ లేక బహుమానముగ స్వీకరించినట్లు కన్పించును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(సీ) 'ఏ' అను ఒక పబ్లికు సేవకుడు, 'ఏ'కు ప్రభుత్వము పై గల పలుకుబడి వలన 'జడ్'కు ఒక బిరుదు లభించినదని 'జడ్' ను మభ్య పెట్టి ఆ ఉపకారమునకై ధనమును 'ఏ' కు 'జడ్' బహూకరించునట్లు చేయును. 'ఏ' ఈ పరిచ్ఛేగములో నిర్వచింపబడిన అపరాధమును చేసిన వాడగును.

అవినీతికరమైన లేక శాసనవిరుద్ధమైన పద్ధతుల ద్వారా ఒక పబ్లికు సేవకునిపై పలుకుబడి నుపయోగించుటకు పారితోషికమును తీసికొనుట.

162. అవినీతికరమైన లేక శాసనవిరుద్ధమైన పద్ధతుల ద్వారా ఎవరేని పబ్లికు సేనకునిచే ఏవేని ఆధికారిక కార్యమును చేయించుటకు లేక చేయకుండ మాన్పించుటకు గాని, అట్టి పబ్లికు సేవకుడుగా అతని ఆధికారిక కృత్యముల నిర్వహణములో ఏ వ్యక్తి పట్ల నైనను ఏదేని అనుకూలతను లేక ప్రతికూలతను చూపింప జేయుటకు గాని, కేంద్ర ప్రభుత్వము, లేక ఏదేని రాజ్య ప్రభుత్వము, లేక పార్లమెంటు లేక ఏదేని రాజ్య విధానమండలి మూలముగనైనను 21వ పరిచ్ఛేదములో నిర్దేశింపబడినట్టి ఏదేని స్థానిక ప్రాధికారము, కార్పోరేషను లేక ప్రభుత్వ కంపెనీ మూలముగ నైనను, ఎవరేని పబ్లికు సేవకుని మూలముగనై నను ఏ వ్యక్తి కైనను ఏదేని ఉపకారము లేక అపకారము చేయించుటకు లేక చేయింప ప్రయత్నించుటకుగాని, ప్రేరణముగ లేక బహుమానముగ ఏ వ్యక్తి నుండియైనను తన కొరకు గాని ఎవరేని ఇతర వ్యక్తి కొరకు గాని ఏదేని పారితోషికమును స్వీకరించు లేక పొందు, లేక స్వీకరించుటకు అంగీకరించు లేక పొందుటకు ప్రయత్నించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకునిపై వైయక్తిక మైన పలుకుబడిని వినియోగించుటకు పారితోషికమును తీసికొనుట.

163. వైయక్తి కమైన పలుకుబడిని వినియోగించుట ద్వారా ఎవరేని పబ్లికు సేవకునిచే ఏదేని ఆధికారిక కార్యమును చేయించుటకు లేక చేయకుండ మాన్పించుటకు గాని, అట్టి పబ్లికు సేవకుడుగా అతని ఆధికారిక కృత్యముల నిర్వహణములో ఏ వ్యక్తి పట్ల నైనను ఏదేని అనుకూలతను లేక ప్రతికూలతను చూపింపజేయుటకుగాని, కేంద్ర ప్రభుత్వము లేక ఏదేని రాజ్య ప్రభుత్వము, లేక పార్లమెంటు లేక ఏదేని రాజ్య విధానమండలి మూలముగనైనను, 21వ పరిచ్ఛేదములో నిర్దేశింపబడినట్టి ఏదేని స్థానిక ప్రాధికారము, కార్పొరేషను లేక ప్రభుత్వ కంపెనీ మూలముగ నైనను, ఎవరేని పబ్లికు సేవకుని మూలముగనైనను ఏ వ్యక్తి కైనను ఏదేని ఉపకారము లేక అపకారము చేయించుటకు లేక చేయించ ప్రయత్నించుటకు గాని, ప్రేరణముగ లేక బహుమానముగ ఏ వ్యక్తి నుండి యైనను తన కొరకుగాని ఎవరేని ఇతర వ్యక్తి కొరకు గాని ఏదేని పారితోషికమును స్వీకరించు, లేక పొందు లేక స్వీకరించుటకు అంగీకరించు లేక పొందుటకు ప్రయత్నించు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

న్యాయాధీశుని సమక్షమున ఒక కేసులో వాదించుటకు ఫీజు తీసికొనునట్టి అడ్వకేటు, విజ్ఞప్తి దారు తన సేవలను, క్లెయిములను వివరించి పంపుకొను విజ్ఞాపన పత్రమును సక్రమముగ వ్రాయుటకు, సరిదిద్దుటకు రుసుము తీసికొనునట్టి వ్యక్తి , శిక్ష విధింపబడిన నేరస్థుని కొరకు ఆ శిక్షను విధించుట అన్యాయమని చూపు వైఖరిగల కథనము లను ప్రభుత్వము సమక్షమున ఉంచుటకు రుసుము తీసికొను ఏజెంటు, - వీరు, వైయక్తి కమైన పలుకుబడిని వినియోగించువారును, వినియోగింతుమని చెప్పుకొను వారును కారు, కావున ఈ పరిచ్చేదము క్రిందికి రారు.

పబ్లికు సేవకుడు 162వ లేక 163వ పరిచ్ఛేదములో నిర్వచించిన అపరాధముల దుష్ప్రేరణ చేసినందుకు శిక్ష

164. పై కడపటి రెండు పరిచ్చేదములలో నిర్వచించిన అపరాధములలో ఏదైనను ఎవరి విషయమున చేయబడినదో ఆతడు ఒక పబ్లికు సేవకుడై యుండి, ఆ అపరాధమును దుష్ప్రేరణ చేసిన యెడల, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణము

'ఏ' ఒక పబ్లికు సేవకుడు. 'ఏ'కు భార్యయైన 'బీ' ఒకానొక వ్యక్తికి ఒక పదవినిమ్మని 'ఏ'ను వేడుటకు ప్రేరణముగ ఒక కానుకను స్వీకరించును. అట్లు చేయుటకు 'ఏ' ఆమెను దుష్ప్రేరణ చేయును. 'బి' ఒక సంవత్సరమునకు మించని కాలావధికి కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును. 'ఏ' మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతోగాని, జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడును.

పబ్లికు సేవకుడు తాను జరుపు చర్య లేక కార్యకలాపముతో ప్రమేయము గల వ్యక్తి నుండి ప్రతిఫలము లేకుండ విలువగల వస్తువును పొందుట.


165. ఒక పబ్లికు సేవకుడుగా ఉండి, అట్టి పబ్లికు సేవకుడుగా తాను జరిపిన, లేక జరుపబోవుచున్న ఏదేని చర్యతో, లేక కార్యకలాపముతో ప్రమేయముగాని, తన యొక్క లేక తాను ఆధీనస్థుడై యున్న ఎవరేని పబ్లికు సేవకుని యొక్క అధికారిక కృత్యములతో ఏదేని సంబంధముగాని కలిగియుండినట్లు , లేక కలిగియున్నట్లు, కలిగియుండబోవునట్లు, తనకు తెలిసియున్నట్టి ఏ వ్యక్తి నుండి యైనను,

లేక ఆట్లు ప్రమేయము కలిగియున్న వ్యక్తి యొక్క హితాభిలాషియై యున్నట్లు లేక అతనితో బంధుత్వము కలిగియున్నట్లు తనకు తెలిసియున్నట్టి ఏ వ్యక్తి నుండి యైనను,

ప్రతిఫలము లేకుండ, లేక తగినంతది కానిదని తనకు తెలిసియున్నట్టి ప్రతిఫలమునకు గాను విలువగల వస్తువును దేనినైనను తన కొరకు గాని, ఎవరేని ఇతర వ్యక్తి కొరకు గాని స్వీకరించు, లేక పొందు, లేక స్వీకరించుటకు అంగీకరించు, లేక పొందుటకు ప్రయత్నించు నతడెవరైనను,

మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణములు

(ఏ) 'ఏ'అను కలెక్టరు, 'జడ్' యొక్క సెటిల్మెంటు కేసు తన వద్ద జరుగుచుండగా 'జడ్' యొక్క ఇంటిని అద్దెకు తీసికొనును. సద్భావపూర్వకముగ బేరము జరిగియుండినచో ఆ ఇంటికై మాసమునకు రెండు వందల రూపాయలు “ఏ' చెల్లించవలసి యుండగా, 'ఏ' మాసమునకు ఏబది రూపాయలు చెల్లించ వలసినట్లు ఒప్పందము జరిగినది. 'ఏ' తగినంత ప్రతి ఫలము లేకుండ 'జడ్' నుండి విలువగల వస్తువును పొందినాడు.

(బీ) 'జడ్' యొక్క కేసు 'ఏ' అను న్యాయాధీశుని న్యాయస్థానమునందు జరుగుచున్నది. మార్కెటులో హెచ్చు రేటు పై విక్రయింపబడుచున్న ప్రభుత్వ ప్రామిసరీ నోట్లను 'జడ్' వద్ద 'ఏ' తగ్గింపు రేటు పై కొనుగోలు చేయును. 'ఏ' తగినంత ప్రతిఫలము లేకుండ 'జడ్' నుండి విలువగల వస్తువును పొందినాడు.

(సీ) 'జడ్' యొక్క సోదరుడు తప్పుడు సాక్ష్యము నిచ్చినాడను ఆరోపణ పై పట్టు కొనబడి 'ఏ' అను మేజిస్ట్రేటు వద్దకు తీసికొనిపోబడును. మార్కెటులో తగ్గింపు రేటు పై విక్రయింపబడుచున్న ఒక బ్యాంకు షేర్లను 'జడ్' కు హెచ్చు రేట్ల పై 'ఏ' విక్రయించును. 'జడ్' ఆ ప్రకారము ఆ షేర్లకు గాను 'ఏ' కు పైకము చెల్లించును. అట్లు 'ఏ' చే పొందబడిన డబ్బు తగినంత ప్రతిఫలము లేకుండ అతనిచే పొందబడిన విలువగల వస్తువు అగును.

161వ పరిచ్చేదము లేక 165వ పరిచ్ఛేదము నిర్వచించబడిన అపరాధముల దుష్ప్రేరణ చేసినందుకు శిక్ష.

165-ఏ. 161వ పరిచ్చేదము లేక 165వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగు ఏదేని అపరాధమును దుష్ప్రేరణ చేయువారెవరైనను, ఆ దుష్ప్రేరణ పరిణామముగా ఆ అపరాధము చేయబడినను చేయబడకున్నను, మూడు సంవత్స రములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటింతోగాని శిక్షింప బడుదురు.

ఏ వ్యక్తి కైనను హాని కలిగించు ఉద్దేశముతో పబ్లికు సేనకుడు శాసనమును పాటించకుండుట,


166. పబ్లికు సేవకుడై యుండి, అట్టి పబ్లికు సేవకుడుగా తాను నడచుకొనవలసిన తీరును గూర్చిన ఏదేని శాసనాదేశమును పాటించకుండుటవలన ఏ వ్యక్తి కైనను హాని కలిగించు ఉద్దేశ్యముతో, లేక అట్టి పాటించని వలన ఏ వ్యక్తి కైనను తాను హాని కలిగించగలనని ఎరిగియుండి అట్లు పాటించకుండు నతడెవరైనను, ఒక సంవత్సరము దాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ఉదాహరణము

ఒక న్యాయస్థా నముచే 'జడ్' కు అనుకూలముగ ఈయబడిన ఒక డిక్రీ తీరుదలకై డిక్రీని ఆస్తి పై అమలు పరచుటకు శాసనాదేశము పొందిన అధికారియగు 'ఏ' తనవలన తద్వారా 'జడ్' కు హాని కలుగగలదని తెలిసియుండియు ఆ శాసనాదేశమును పాటించకుండును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును. పబ్లికు సేవకుడు హాని కలిగించు ఉద్దేశముతో తప్పులతో కూడియున్న దస్తావేజును రూపొందించుట.

167. పబ్లికు సేవకుడై యుండి అట్టి పబ్లికు సేవకుడుగా ఏదేని దస్తావేజును తయారు చేయవలసిన లేక అనుసరించ వలసిన బాధ్యతను కలిగియుండి, ఆ దస్తా వేజును, తప్పులతో కూడియుండినదని తనకు తెలిసియున్న లేక అట్టి దని తాను విశ్వసించుచున్న రీతిలో రూపొందించుటద్వారాగాని, అనువదించుట ద్వారాగాని ఏ వ్యక్తికై నను హాని కలిగించు ఉద్దేశముతో లేక తాను హాని కలిగించగలనని ఎరిగియుండి, అట్లు రూపొందించు లేక అనువదించు నతడెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పబ్లికు సేవకుడు శాసన విరుద్ధముగ వ్యాపారము చేయుట,

168. పబ్లికు సేవకుడై యుండి, వ్యాపారము చేయకుండుటకు అట్టి పబ్లికు సేవకుడుగా శాసనరీత్యా బద్దుడై యుండి, వ్యాపారము చేయునతడెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలానధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పల్లెకు సేవకుడు శాసన విరుద్దముగ ఆస్తిని కొనుట లేక ఆస్తి కొరకు వేలము పొడుట.

169. పబ్లికు సేవకుడై యుండి, ఒకానొక ఆస్తిని కొనకుండుటకు లేక ఆ ఆస్తికై వేలము పాడకుండుటకు అట్టి పబ్లికు సేవకుడుగా శాససరీత్యా బద్దుడై యుండి, ఆ ఆస్తిని తన పేరిటగాని మరొకరి పేరిట గాని, సంయుక్తముగ గాని, ఇతరులతో కలిసి వాటాలలోగాని కొనిన, లేక వేలముపాడిన అతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడును, మరియు ఆ ఆస్తి కొనబడినచో, అధిహరింపబడును.

పబ్లికు సేవకుని ప్రతి రూపణము.

170. ఏదేని ప్రత్యేకమైన పబ్లికు సేవక పదవి తనకు లేదని తెలిసియుండియు, ఆట్టి పదవి తనకు ఉన్నట్లు నటించి లేక అట్టి పదవి యున్న ఎవరేని ఇతర వ్యక్తిగా ప్రతిరూపణము చేసి, ఆపాదించుకొనిన ఆ రూపములో,అట్టి పదవి ప్రాపకముతో ఏదేని కార్యమును చేయు, లేక చేయుటకు ప్రయత్నించు నతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలానధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

కపటోద్దేశముతో పబ్లికు సేవకుడు ఉపయోగించెడి దుస్తులను ధరించుట, లేక టోకెనును వెంట ఉంచుకొనుట.

171. ఒక నిర్దిష్టమైన పబ్లికు సేవక వర్గమునకు చెందిన వాడు కాకున్నను తాను ఆ పబ్లికు సేవక వర్గమునకు చెందియున్నట్లు విశ్వసింపబడవలెనను ఉద్దేశ్యముతో, లేక అట్లు విశ్వసింపబడవచ్చునని ఎరిగి యుండి, ఆ పబ్లికు సేవక వర్గము ఉపయోగించెడి ఏవేని దుస్తులను పోలియున్న దుస్తులను ధరించు లేక వారు ఉపయోగించెడి ఏదేని టోకెనును పోలియున్న టోకెనును తనవద్ద పెట్టుకొను నతడెవరైనను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, రెండు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

అధ్యాయము--9-ఏ

ఎన్నికలకు సంబంధించిన అపరాధములను గురించి

"అభ్యర్థి", " ఎన్నిక హక్కు" నిర్వచనములు

171-ఏ. ఈ అధ్యాయము నిమిత్తము, ---

(ఎ) “అభ్యర్థి " అనగా ఏ ఎన్నికయందై నను అభ్యర్థిగా నామనిర్దేశము చేయబడినట్టి వ్యక్తి అని అర్థము, మరియు ఆ పద పరిధియందు, ఒక ఎన్నిక జరుప తలపెట్ట బడినప్పుడు ఆ ఎన్నికలో తాను కాబోవు అభ్యర్థినని ప్రకటించుకొనిన వ్యక్తి కూడ, ఆ తరువాత అతడు అట్టి ఎన్నికయందు అభ్యర్థిగా నామనిర్దేశము చేయబడినట్లయితే చేరియుండును.

(బి)“ఎన్నిక హక్కు అనగా ఎన్నికయందు అభ్యర్థి గా నిలబడుటకు లేక నిలబడకుండుటకు లేక అభ్యర్థిత్వము నుండి తన పేరును ఉపసంహరించుకొనుటకు లేక వోటు వేయుటకు లేక వోటు వేయకుండుటకు ఒక వ్యక్తికి గల హక్కు అని అర్థము.

"లంచగొండితనము"

171-బీ. (1) ఎవరైనను -

(i) ఏ వ్యక్తి కైనను, అతనినిగాని ఎవరేని ఇతర వ్యక్తి నిగాని ఏదేని ఎన్నిక హక్కును వినియోగించుటకు ప్రేరితుని చేయు లక్షముతో, లేక ఏదేని అట్టి హక్కును వినియోగించినందుకు ఆతనికి గాని ఎవరేని ఇతర వ్యక్తికి గాని బహుమానమొసగు లక్ష్యముతో, పారితోషికము ఇచ్చినయెడల, లేక

(ii) అట్టి ఏదేని హక్కును వినియోగించుటకు గాని, అట్టి ఏదేని హక్కును వినియోగించుటకై ఎవరేని ఇతర వ్యక్తిని ప్రేరితుని చేయుటకు, లేక ప్రేరితుని చేయుటకై ప్రయత్నించుటకుగాని, బహుమానముగా ఏదేని పారితోషికమును తనకొరకుగాని, ఎవరేని ఇతర వ్యక్తి కొరకుగాని స్వీకరించినయెడల.

వారు లంచగొండితనము అను అపరాధమును చేసిన వారగుదురు. అయితే, పబ్లికు విధానమునకు సంబంధించిన ప్రఖ్యానము చేయుట గాని, పబ్లికు చర్య తీసికొందునని వాగ్దానము చేయుటగాని ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము కాదు.

(2) పారితోషికమును ఈయజూపు లేక ఇచ్చుటకు అంగీకరించు, లేక సమకూర్చజూపు లేక సమకూర్చ ప్రయత్నించునట్టి వ్యక్తి పారితోషికము ఇచ్చినట్లు భావించవలెను.

(3) పారితోషికములు పొందునట్టి లేక స్వీకరించుటకు అంగీకరించునట్టి లేక పొందుటకు ప్రయత్నించు నట్టి వ్యక్తి పారితోషికమును స్వీకరించినట్లు భావించబడును, మరియు తాను చేయుటకు ఉద్దేశించని దానిని దేనినైనను చేయుటకు ప్రేరణముగ, లేక తాను చేయునట్టి దానిని దేనినై నను చేసినందుకు బహుమానముగ పారితోషికమును స్వీకరించునట్టి వ్యక్తి ఆ పారితోషికమును బహుమానముగ స్వీకరించినట్లు భావించవలెను.

ఎన్నికలలో అనుచితమైన ఒత్తిడి,

171-సీ. (1) ఏదేని ఎన్నిక హక్కును స్వేచ్ఛగా వినియోగింపబడినీయక స్వచ్ఛందముగా జోక్యము కలుగజేసికొను లేక కలుగజేసికొన ప్రయత్నించు వారేసరైనను, ఎన్నికలో అనుచితమైన ఒత్తిడి చేయు ఆపరాధము చేసినవారగుదురు.

(2) ఉపపరిచ్ఛేదము (1) యొక్క నిబంధనల: వ్యాపకతకు భంగము లేకుండ,

(ఎ) ఏరకపుదైన హానినైనను కలిగింతునని ఏ అభ్యర్థి నైనను, ఏ వోటరునైనను, లేక అభ్యర్థి గాని వోటరుగాని ఎవరిపట్ల హితాభిలాషియై యున్నాడో ఆ వ్యక్తి నైనను బెదరించు వారెవరైనను, లేక

(బి) అభ్యర్థియైనను, వోటరైనను, అతడు ఎవరిపట్ల హితాభిలాషియై యున్నాడో ఆ వ్యక్తి నైనను,దైవాను గ్రహమునకుగాని, ఆధ్యాత్మిక అభిశంసనకు గానీ, గురికాగలడని లేక గురికావింపబడగలడని ఆ అభ్యర్థిని గాని వోటరునుగాని విశ్వసించునట్లు చేయు లేక అట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను,

ఉపపరిచ్ఛేదము (1) యొక్క భావమునందు అట్టి అభ్యర్థి లేక వోటరు. తన ఎన్నిక హక్కును స్వేచ్చగా వినియోగించకుండా జోక్యము కలుగజేసికొన్నట్లు భావింపబడుడురు,

(3) పబ్లికు విధానమునకు సంబంధించిన ప్రఖ్యానమును చేయుటగాని, పబ్లికు చర్య తీసికొందునని వాగ్దానము చేయుటగాని, ఎన్నిక హక్కు విషయమున జోక్యము కలిగించుకొను ఉద్దేశము లేకుండ "కేవలము ఏదేని శాసనిక హక్కును వినియోగించు కొనుటను గానీ, ఈ పరిచ్చేద భావము నందు జోక్యముగా భావించరాదు.

ఎన్నికలయందు ప్రతి రూపణము.

171- డీ. బ్రతికియున్న లేక చనిపోయిన ఎవరిని ఇతర వ్యక్తి పేరుతో నైనను, కల్పితమైన పేరుతో నైనను, ఒక ఎన్నిక యందు వాటు పత్రము కొరకు దరఖాస్తు చేయు, లేక వోటు చేయు, లేదా అట్టి ఎన్నిక యందు ఒకసారి వోటు వేసియుండి అదే ఎన్నికయందు తమ పేరుతో మరల వోటు పత్రము కొరకు దరఖాస్తు చేయు వారెవరైనను మరియు ఎవరేని వ్యక్తిని వోటు వేయుటకు దుష్ప్రేరణచేయు, అతనిచే వోటు వేయించు లేక అట్టి ఏ ప్రకారముగ నైనను వోటు వేయించుటకు ప్రయత్నించు వారెవరై నను, ఎన్నికయందు ప్రతిరూపణాపరాధము చేసిన వారగుదురు.

లంచగొండితనమునకు శిక్ష.

171-ఈ. లంచగొండితనము అను అపరాధము చేయువారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు:

ఆయితే, సత్కార రూపపు లంచగొండితనము కేవలము జర్మానాలో మాత్రమే శిక్షింపబడును.

విశదీకరణము :-- "సత్కారము" అనగా ఆహారము, పానీయము, వినోద కార్యక్రమము లేక సంభారము రూపమున పారితోషికము ఉండునట్టి లంచగొండితనము అని అర్థము,

ఎన్నికయందు అనుచితమైన ఒత్తిడి చేసినందుకు లేక ప్రతి రూపణము చేసినందుకు శిక్ష.

171-ఎఫ్. ఎన్నిక యందు అనుచితమైన ఒత్తిడి లేక ప్రతిరూపణము అను అపరాధములు చేయువారెవరైనను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఎన్నికకు సంబంధించిన తప్పుడు ప్రకటన.


171- జీ. ఎన్నికల ఫలితము పై ప్రభావము కలుగజేయు ఉద్దేశ్యముతో ఎవరేని అబ్యర్ది యొక్క వ్యక్తి గత శీలమునకుగాని, నడవడికి గాని సంబంధించి, అబద్దమైనట్టిదగు మరియు అబద్ధ మైనదని తనకు తెలిసి యున్నటి దైనను, అట్టిదని తాను విశ్వసించునట్టిదైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టి దైనను అగు ఒక సంగతిని గూర్చిన ప్రకటనగా తాత్పర్యమిచ్చు ఏదేని ప్రకటన చేయు లేక ప్రచురించు వారెవరైనను జుర్మానాతో శిక్షింపబడుదురు. ఎన్నికకు సంబంధించి చేసిన శాసన విరుద్ధ చెల్లింపులు.

171- హెచ్. అభ్యర్థి యొక్క వ్రాతమూలకనైన సాధారణ లేక ప్రత్యేక ప్రాధికారము లేకుండ, అట్టి అభ్యర్థి ఎన్నిక అవకాశములను మెరుగు పరుచుటకు లేక అతడు ఎన్నిక ఆగునట్లు చేయుటకు ఏదేని బహిరంగ సభను జరుపుటకుగాని, ఏదేని ప్రసార ప్రకటనను, సర్క్యులరును లేక ప్రచురణమును గూర్చిగాని, ఏదైనా విధముగ గాని, ఖర్చు చేయు లేక ఖర్చుచేయుటకు ప్రాధికారము నొసగు వారెవరైనను, అయిదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు :

అయితే, ఏ వ్యక్తియైనను ప్రాధికారము లేకుండ పది రూపాయల మొత్తమునకు మించని అట్టి ఏవేని ఖర్చులు చేసి ఆట్టి ఖర్చు అయిన తేదీ నుండి పది దినముల లోపల అభ్యర్థి యొక్క ఆమోదమును పొందిన, అతడు ఆట్టి ఖర్చు అభ్యర్థి యొక్క ప్రాధికారముతో చేసినట్లు భావించవలెను.

ఎన్నిక ఖర్చులు లెక్కలను వ్రాసి, ఉంచకుండుట.

171-ఐ. ఎన్నిక యందు చేసిన లేక దానికి సంబంధించి చేసిన ఖర్చుల లెక్కలను తత్సమయమున అమలులో నుండు ఏదేని శాసనమునుబట్టి గాని, శాసనమువలె అమలు కలిగియుండు. ఏదేని నియమమునుబట్టి గాని, వ్రాసి ఉంచవలసియుండియు, అట్టి లెక్కలను వ్రాసియుంచని వారెవరైనను, అయిదు వందల రూపాయలదాక ఉండగల జర్మానాతో శిక్షింపబడుదురు.

అధ్యాయము - 10

పబ్లికు సేవకుల శాసన సమ్మత ప్రాధికారమును ధిక్కరించుటను గురించి

సమను తామీలు కాకుండుటకు లేక ఇతర చర్య జరుగకుండుటకు గాను పరారి అగుట.

172. పబ్లికు సేవకుడుగా సమనును, నోటీసును, లేక ఉత్తరువును జారీచేయుటకు శాసనరీత్యా సమర్ధుడై నట్టి ఎవరేని పబ్లికు సేవకుని నుండి వచ్చినట్టి సమనును, నోటీసును లేక ఉత్తరువును తనకు తామీలు కాకుండ తప్పించు కొనుటకు గాను పరారీ అగువారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు., లేక ఆ సమనుగాని నోటీసుగాని, ఉత్తరువుగాని, న్యాయస్థానము నందు స్వయముగానై నను. ఏజెంటు ద్వారానైనను హాజరు కావలెనను నట్టిది, లేక దస్తావేజును దాఖలు చేయవలెనను నట్టిది అయినచో, ఆరుమాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

సమను తామీలు అగుటను లేక ఇతర చర్య జరుగుటను నివారించుట లేక వాటి ప్రచురణమును నివారించుట.

173. పబ్లికు సేవకుడుగా సమనును, నోటీసును లేక ఉత్తరువును జారీచేయుటకు శాసనరీత్యా సమర్థుడై నట్టి ఎవరేని పబ్లికు సేవకుని నుండి వచ్చినట్టి ఏదేని సమనును, నోటీసును లేక ఉత్తరువును తనకుగాని, ఎవరేని ఇతర వ్యక్తి కిగాని తామీలు అగుటను ఏ రీతిగానైనను ఉద్దేశపూర్వకముగా నివారించు,

లేక, "ఏదేని ఆట్టి సమనును, నోటీసును, లేక ఉత్తరువును ఏ స్థలమునందై నను శాసనసమ్మతముగా అతికించుటను ఉద్దేశపూర్వకముగా నివారించు,

లేక, ఏదేని ఆట్టి సమను, నోటీసు, లేక ఉత్తరువును శాసనసమ్మతముగా అతికించినట్టి ఏ స్థలమునుండి యైనను దానిని ఉద్దేశపూర్వకముగా తొలగించు,

లేక, అధి ప్రఖ్యానము చేయవలసినదని ఆదేశించుటకు పబ్లికు సేవకుడుగా శాసనరీత్యా సమర్థుడైనట్టి ఎవరేని పబ్లికు సేవకుని ప్రాధికారము క్రింది అట్టి అధి ప్రఖ్యానమును శాసనసమ్మతముగా చేయుటను ఉద్దేశపూర్వకముగా నివారించు,

వారెవరైనను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఐదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు;

లేక, ఆ సమనుగాని, నోటీసుగాని, ఉత్తరువుగాని, అధి ప్రఖ్యానము గాని, న్యాయస్థానమునందు స్వయముగా నైనను, ఏజెంటు ద్వారానైనను హాజరు కావలెననునట్టిది, లేక దస్తావేజును దాఖలు చేయవలెననునట్టిది అయినచో, ఆరుమాసములదాక ఉండగల కాలావధికి కారావాసముతోగాని, వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాలో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు. పబ్లికు సేవకుని ఉత్తరువును పాటించి హాజరు కావలసియుండియు, హాజరు కాకుండుట.

174. పబ్లికు సేవకుడుగా సమనును, నోటీసును, ఉత్తరువును లేక అధి ప్రఖ్యానమును జారీచేయుటకు శాసనరీత్యా సమర్థుడైనట్టి ఎవరేని పబ్లికు సేవకుని నుండి వచ్చినట్టి, సమనును, నోటీసును, ఉత్తరువును లేక అధి ప్రఖ్యానమును దేనినైనను పాటించి ఒకానొక స్థలమున మరియు ఒకనొక సమయమున స్వయము గానైనను, ఏజెంటు ద్వారానై నను హాజరగుటకు శాసనరీత్యా బద్దుడై యుండియు,

అట్టి స్థలమున, లేక సమయమున ఉద్దేశపూర్వకముగా హాజరుకానట్టి, లేక హాజరు కావలసిన స్థలమునుండి శాసన సమ్మతముగా వెళ్లి పోదగిన సమయమునకు వెళ్లి పోవునట్టి వారెవరైనను,

ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జూర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

లేక, ఆ సమను గాని, నోటీసు గాని, ఉత్తరువు గాని, ఆది ప్రఖ్యానము గాని న్యాయస్థానము నందు స్వయముగానైనను, ఏజెంటుద్వారానైనను హాజరు కావలెననునట్టిది అయినచో, ఆరుమాసముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, వేయి రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండిటితో గాని, శిక్షింపబడుదురు.

{{c|ఉదాహరణములు|]]

(ఏ) కలకత్తా ఉన్నత న్యాయస్థానము నుండి జారీచేయబడిన సుపీనాను పాటించి ఆ న్యాయస్థాన సమక్షమున హాజరగుటకు ఏ అనునతడు శాసనరీత్యాబద్దుడై యుండియు, ఉద్దేశపూర్వకముగా హాజరు కాకుండును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బి) జిల్లా న్యాయాధీశునిచే జారీచేయబడిన సమనును పాటించి ఆ జిల్లా న్యాయాధీశుని సమక్షమున సాక్షిగా హాజరగుటకు 'ఏ' అనునతడు శాసనరీత్యాబద్దుడై యుండియు, ఉద్దేశపూర్వకముగా హాజరు కాకుండును 'ఏ ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

పబ్లికు సేవకుని వద్ద దస్తావేజును దాఖలు చేయుటకు శాసనరీత్యా బద్దుడైన వ్యక్తి దానిని దాఖలు చేయకుండుట.

175. ఏదేని దస్తావేజును ఎవరేని పబ్లికు సేవకుని వద్ద దాఖలు చేయుటకు లేక అతనికి అందజేయుటకు శాసన రీత్యా బద్ధుడై యుండి, దానిని ఉద్దేశపూర్వకముగా అట్లు దాఖలు చేయనట్టి, లేక అందజేయనట్టి వారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గానీ, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

లేక,ఆ దస్తావేజు న్యాయస్థానములో దాఖలు చేయవలసినట్టిది లేక అందజేయవలసినట్టిది అయినచో, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు,

ఉదాహరణము

జిల్లా న్యాయస్థాన సమక్షమున ఒక దస్తావేజును దాఖలు చేయుటకు శాసనరీత్యా బదుడై యుండియు, "ఏ " అనువతడు ఉద్దేశపూర్వకముగా దానిని దాఖలు చేయడు. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

పబ్లికు సేవకునకు నోటీసును ఇచ్చుటకు లేక సమాచారమును అందజేయుటకు శాసనరీత్యాబద్దుడై యున్నట్టి వ్యక్తి అట్లు చేయకుండుట.

176. ఏ పబ్లికు సేవకునికైనను ఆట్టి పబ్లికు సేవకునిగా అతనికి ఏదేని విషయమును గురించి నోటీసును ఇచ్చుటకు లేక సమా చారమును అందజేయుటకు శాసన రీత్యాబద్దుడైయుండి, శాసనము ద్వారా కోరబడిన రీతిలో మరియు అట్టి సమయమున ఉద్దేశపూర్వకముగా, అట్టి నోటీసును. ఈయనట్టి లేక అట్టి సమాచారమును అందజేయనట్టి వారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు;

లేక, ఈయవలసిన నోటీసుగాని, అందజేయవలసిన సమాచారముగాని, అపరాధము జరుగుటకు సంబంధించినదైనను, అపరాధమును నివారించుటకు లేక ఆపరాధిని పట్టుకొనుటకు కావలసినదైనను అగుచో, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు; 1898 లోని 5వది.

లేక, ఈయవలసిన నోటీసుగాని, అందచేయవలసిన సమాచారముగాని, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1898 యొక్క 565వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1) క్రింద చేయబడిన ఉత్త రువును బట్టి ఈయవలసినదైనచో, లేక అందజేయ వలసినదైనచో, ఆరుమాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తప్పుడు సమాచారమును అందజేయుట,

177. ఏ పబ్లికు సేవకుని కైనను అట్టి పబ్లికు సేవకునిగా అతనికి ఏదేని విషయమును గురించి సమాచారమును ఆందజేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి, ఆ విషయమును గురించి తప్పుడుదని తాము ఎరిగియున్నట్టి లేక తప్పుడుదని తాను విశ్వసించుటకు కారణము కలిగియున్నట్టి సమాచారమును నిజమైన సమాచారముగా అందజేయు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసములోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు;

లేక, శాసన రీత్యా అతడు ఇచ్చుటకు బద్దుడై యున్నట్టి సమాచారము అపరాధము జరుగుటకు సంబంధించినదైనను, ఆపరాధమును నివారించుటకు లేక అపరాధిని పట్టుకొనుటకు కావలసినదై నను ఆగుచో, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతో గాని, లేక ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అను భూస్వామి తన ఎస్టేటు హద్దులలో హత్య జరిగినదని ఎరిగియుండియు, పాముకాట, పరిణామముగా దుర్ఘటనల్ల మరణము సంభవించినదని జిల్లా మేజిస్టేటుకు బుద్ధి పూర్వకముగా తప్పుడు సమాచారము నిచ్చును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బి) గ్రామ పహరాదారగు 'ఏ' ప్రక్క ప్రాంతములో నివసించుచున్న ధనికుడగు 'జడ్' అను సాహుకారు ఇంటిలో బందిపోటు చేయుటకై ఆగంతుకుల గుంపు ఒకటి తన గ్రామము గుండా వెళ్లినదని ఎరిగియుండి, అతి సమీపమునందు గల పోలీసు స్టేషను అధికారికి, బెంగాలు కోడు, 1821 3వ వినియమపు 7వ పరిచ్ఛేదము యొక్క ఖండము 5 క్రింద, పై సంగతిని గురించిన సమాచారమును శీఘ్రముగామ, సకాలములోను అందజేయ వలసిన వాడై యుండి, గ్రామముగుండా వేరే దిశలో సుదూరమందున్న ఒకానోక స్థలములో బందిపోటు చేయుటకై అనుమానాస్పదులైన దుండగులతో కూడిన ఒక గుంపు వెళ్లినదని ఆ పోలీసు అధికారికి బుద్ధి పూర్వకముగా తప్పుడు సమాచారమిచ్చును. ఇచట 'ఏ' ఈ పరిచ్ఛేదపు చివర భాగములో నిర్వచింపబడిన ఆపరాధము చేసిన వాడగును.

విశదీకరణము:—— 176న పరిచ్ఛేదములోను, ఈ పరిచ్చేదములోను 'అపరాధము' అను, పదపరిధి యందు ఏ కార్యము భారత దేశములో చేయబడియుండినచో, ఈ క్రింది పరిచ్ఛేదములలో, అనగా 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459, మరియు 460 లలో దేవి క్రిందనై నను శిక్షింపబడదగియుండునో, అట్టి ఏ కార్యమైనను భారత దేశము వెలుపల ఏ స్థలమునందుచేయబడినదైనను చేరియుండును, మరియు 'అపరాధి' అను పదపరిధియందు అట్టి ఏదేని కార్యము చేసెననెడి ఆరోపణకు గురియైన ఏ వ్యక్తి యైనను చేరియుండును.

ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేయవలసినదని పబ్లికు సేవకుడు తగు రీతిగా కోరినప్పుడు నిరాకరించులు,

178. నిజము చెప్పుదునని ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేయవలసినదిగా కోరుటకు శాసనరీత్యా సమర్దుడై నట్టి పబ్లికు సేవకుడు అట్లు చేయుమని కోరినపుడు, అట్లు చేయుటకు నిరాకరించు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండుగల జూర్మానాతోగాని, లేక ఈ రెండింటిలో గాని శిక్షింపబడుదురు.

ప్రశ్పించుటకు ప్రాధికారముగల పబ్లికు సేవకునికి జవాబు నిచ్చుటకు నిరాకరించుట,

179. ఎవరేని పబ్లికు సేవకునికి ఏదేని విషయమును గురించి నిజము చెప్పుటకు శాసనరీత్యా బద్దుడైయుండి ఆ పబ్లికు సేవకుడు తనకు శాసనరీత్యాగల అధికారములను వినియోగించుటలో ఆ విషయమును గురించి అడిగిన ఏదేని ప్రశ్నకు జవాబు నిచ్చుటకు నిరాకరించు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు. కథనము పై సంతకము చేయుటకు నిరాకరించుట.

180. ఏదేని కథనము పై తత్ కర్తను సంతకము చేయుమని కోరుటకు శాసనరీత్యా సమర్ధుడైన పబ్లికు సేవకుడు ఆ కథనముపై అతనిని సంతకము చేయుమని కోరినపుడు, దానిపై సంతకము చేయుటకు నిరాకరించు నతడెవరైనను మూడుమాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఐదువందల రూపాయల దాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును. పబ్లికు సేవకుని సమక్షమున, లేక ప్రమాణము నైనను ప్రతిజ్ఞనైనను చేయించుటకు ప్రాధికారముగల వ్యక్తి సమక్షమున ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసికూడ అబద్ధము చెప్పుట.

181. ఎవరేని పబ్లికు సేవకునికి గాని ప్రమాణమునైనను ప్రతిజ్ఞ, నైనను చేయించుటకు శాసనరీత్యా ప్రాధికారముగల ఎవరేని ఇతర వ్యక్తికిగాని, ఏదేని విషయమును గురించి నిజము చెప్పుటకై ప్రమాణము లేక ప్రతిజ్ఞ ద్వారా శాసనరీత్యా బద్దుడై యుండి, అట్టి పబ్లికు సేవకునికిగాని పైన చెప్పబడినట్టి ఇతర వ్యక్తికిగాని ఆ విషయమును గురించి ఆబద్దమైనట్టి దగు, మరియు ఆబద్ధమైనదని తనకు తెలిసియున్నట్టిదైనను, అట్టిదని తాను విశ్వసించునట్టి దైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టిదైనను అగు దేనినై నను చెప్పిన వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పబ్లికు సేవకుని శాసన సమ్మత ఆధికారమును అతడు మరొక వ్యక్తి కి హాని కలిగించుటకు ఉపయోగించునట్లు చేయు ఉద్దేశముతో తప్పుడు సమాచారము అందజేయుట.

182. ఎవరేని పబ్లికు సేవకునిచే——

(ఏ) ఏ సంగతులను గురించి ఆతనికి సమాచారము ఈయబడినదో వాటి నిజస్థితి తెలిసియున్నచో అట్టి పబ్లికు సేవకుడు చేయకూడని దేనినైనను చేయునట్లు, లేక చేయుట మానకూడని దేనినైనను మానునట్లు, లేక

(బి) అట్టి పబ్లికు సేవకుని శాసనసమ్మత అధికారమును ఏ వ్యక్తి కైనను హానిని లేక చికాకును కలిగించుటకు ఉపయోగించునట్లు,

చేయించు ఉద్దేశముతో గాని, ఆట్లు చేయించుట సంభవమని ఎరిగియుండిగాని, అట్టి ఏదేని సమాచారమును అది తప్పుడుదని తాను ఎరిగియుండియు, లేక అట్టిదని తాను విశ్వసించియుండియు, అట్టి పబ్లికు సేవకునకు అంద జేయు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని లేక ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ ' తాను ఒక మేజిస్టేటుకు అందజేయుచున్న సమాచారము తప్పుడు దనియు, ఆ సమాచారము వలన ఆ మేజిస్టేటు తనకు ఆధీనస్టుడైన ' జడ్ ' అను పోలీసు అధికారిని బర్తరఫ్ చేయుట సంభవమనియు ఎరిగియుండి, ఆతని కర్తవ్యమును నిర్లక్ష్యము చేసినాడని లేక దుష్ప్రవర్తనగలవాడని, అట్టి మేజిస్టేటుకు సమాచారమునందజేయును. 'ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బి) 'ఏ ' తాను ఒక పబ్లికు సేవకునకు అందజేయుచున్న సమాచారము తప్పుడు దనియు, ఆ సమాచార పరిణామముగా, 'జడ్' కు చికాకు కలుగునట్లు అతని ఇల్లు సోదాచేయబడుననియు ఎరిగియుండి, దొంగచాటుగా తయారైన ఉప్పు 'జడ్' వద్ద ఒక రహస్య స్థలములో ఉన్నదని ఆ పబ్లికు సేవకునకు తప్పుడు సమాచారమును అందజేయును. 'ఏ ' ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(సీ) 'ఏ' తాను ఒకానొక గ్రామ సమీపములో దౌర్జన్యమునకును, దోపిడీకినీ గురి అయినానని ఒక పోలీసుకు తప్పుడు సమాచారమును అందజేయును. అతడు తనపై దౌర్జన్యము చేసినవారిలో ఒకడని ఏ వ్యక్తి పేరును చెప్పడు పనీ ఈ సమాచార పరిణామముగా గ్రామస్థులకు లేక వారిలో కొందరికి చికాకు కలుగునట్లు పోలీసు వార గ్రామములో దర్యాప్తులు, సోదాలు జరుపగలరని ఎరుగును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును చేసిన వాడగును.

పబ్లికు సేవకుని శాసనసమ్మత ప్రాధికారము ననుసరించి ఆస్తిని తీసుకొనుటకు ప్రతిఘటన.

183. పబ్లికు సేవకుడని ఎరిగియుండి, లేక ఆటని విశ్వసించుటకు కారణముండి, ఆతని శాసన సమ్మత ప్రాధికారమును బట్టి ఏదేవి ఆస్తిని తీసికొనుటను ప్రతిఘటింపజూచువారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటితో ఒక రకపు కారావాసముతో గాని, వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు. పబ్లికు సేవకుని ప్రాధికారమునుబట్టి విక్రయింప జూపబడిన ఆస్తి విక్రయమును ఆటంక పరచుట.

184. ఎవరేని పబ్లికు సేవకుడు తన పదవిని బట్టి శాసన సమ్మతముగా ఒసగబడిన ప్రాధికారము ననుసరించి విక్రయింపజూపిన ఆస్తి యొక్క విక్రయమును దేనినైనను ఉద్దేశ పూర్వకముగ ఆటంకపరచువారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు,

పబ్లికు సేవకుని ప్రాధికారమునుబట్టి విక్రయింప జూపబడిన ఆస్తిని శాసన విరుద్ధముగ కొనుట లేక దానికై వేలము పాడుట.

185. ఎవరేని పబ్లికు సేవకుడు తన పదవిని బట్టి శాసవ సమ్మతముగా ఒసగబడిన ప్రాధికారముననుసరించి జరిపిన ఆస్తి విక్రయములో, ఆ విక్రయమునందు ఆ ఆస్తిని కొనుటకు శాసనరీత్యా ఆర్హత లేనట్టి వ్యక్తి యని ఎరిగియుండిన వ్యక్తి పక్షమున -- ఆ వ్యక్తి తానే యైనను, ఇతరుడైనను - అట్టి ఆస్తిని కొనుగోలు చేయు లేక దానికై వేలము పాడువారెవరైనను, లేక వేలము పాడుటవలన ప్రాప్తించెడు బాధ్యతలను నిర్వహించు ఉద్దేశ్యము లేకయే అట్టి ఆస్తికై వేలముపాడువారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి రెండింటిలో ఒకరకపు కారావాసముతోగాని రెండువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు కృత్యములను నిర్వహించుటలో పబ్లికు సేవకుని ఆటంకపరచుట.

186. ఏ పబ్లికు సేవకుని కైనను, ఆతని పబ్లికు కృత్యముల నిర్వహణములో స్వచ్ఛందముగా ఆటంకము కలిగించు వారెవరైనను మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకునికి సహాయ పడుటకు శాసనరీత్యా బద్దుడై యుండియు సహాయ పడకుండుట.

187. ఏ పబ్లికు సేవకునికైనను, అతని పబ్లికు కర్తవ్య నిర్వహణములో సహాయపడుటకు, లేక సహాయము నందజేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి, ఉద్దేశపూర్వకముగా అట్టి సహాయమును చేయకుండు వారెవరై నను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మరియు, న్యాయస్థానముచే శాసనసమ్మతముగా జారీచేయబడిన ఏదేని ఆదేశికను అమలు పరచుటకుగాని, అపరాధము జరుగకుండ నివారించుటకుగాని, దొమ్మీని లేక జగడమును అణచుటకుగాని, ఆపరాధము ఆరోపింపబడిన లేక, అపరాధము చేసిన లేక శాసన సమ్మత అభిరక్ష నుండి తప్పించుకొని పోయిన వ్యక్తిని పట్టుకొనుటకు గాని, అట్టి సహాయమును అభ్యర్థించుటకై శాసనరీత్యా సమర్ధుడైన పబ్లికు సేవకునిచే ఆట్టి సహాయమును చేయవలసినదిగా అభ్యర్థింపబడియున్నచో, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని అయిదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానా తోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకునిచే తగురీతిగా ప్రఖ్యాపన చేయబడిన ఉత్తరువును పాటించకుండుట.

188. ఒక ఉత్తరువును ప్రఖ్యాపన చేయుటకు శాసనసమ్మతముగా అధికారము గల పబ్లికు సేవకునిచే ప్రఖ్యాపన చేయబడిన అట్టి ఉత్తరువునుబట్టి తానొక కార్యమును చేయరాదనిగాని, తన స్వాధీనములోనైనను తన నిర్వహణము క్రిందనైనను ఉన్న ఏదేని ఆస్తిని గురించి ఏదేని ఒక ఏర్పాటు చేయవలెననిగాని ఆదేశించబడిన వాడనని ఎరిగియుండియు, అట్టి ఆదేశమును పాటించని వారెవరైనను,

అట్టి పాటింపమి, శాసనసమ్మతముగా వ్యవహరించుచున్న ఏ వ్యక్తులకైనను, ఆటంకముసు, చికాకును లేక, హానినిగాని, ఆటంకము, చికాకు లేక హాని కలిగెడు ముప్పునుగాని కలిగించుచో, లేక అట్లు కలిగించు వైఖరి గలదైనచో ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని లేక రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

మరియు అట్టి పాటింపమి మానవ ప్రాణమునకు, ఆరోగ్యమునకు లేక భద్రతకు అపాయమును కలిగించునదిగాని కలిగించు వైఖరి గలదిగాని అయినచో, లేక దొమ్మీనైనను, జగడమునైనను కలిగించునదిగాని కలిగించు వైఖరిగలది గాని అయినచో, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము : ఆపరాధి కీడు కలుగజేయవలెనని ఉద్దేశించుటగాని అట్టి పాటించమి కీడు కలిగించగలదని తలచుటగాని ఆవశ్యకము కాదు. తాను పాటించని ఉత్తరువును గురించియు, తన పాటింపమి వలన కీడు కలుగునని లేక కలుగగలదని అతను ఎరిగియున్న చాలును.

ఉదాహరణము

మత సంబంధమైన ఒక ఊరేగింపు ఒకానొక వీధి వెంట పోరాదని ఆదేశించు ఉత్తరువును ప్రఖ్యాపన చేయుటకు శాసనసమ్మత అధికారము గల పబ్లికు సేవకునిచే అట్టి ఉత్తరువు ప్రఖ్యావన చేయబడినది. ఆ ఉత్తరువును గురించి ఎరిగి యుండియు 'ఏ' ఆ ఉత్తరువును పాటించకుండా తద్వారా దొమ్మీ జరుగు ఆపాయమును కలుగజేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధమును చేసినవాడగును. పబ్లికు సేవకునికి హాని కలిగింతునని బెదిరింపు.

189. ఏ పబ్లికు సేవకునినైనను ఆ పబ్లికు సేవకుని యొక్క పబ్లికు కృత్యముల నిర్వర్త నమునకు సంబంధించిన ఏదేని కార్యమును అతడు చేయుటకుగాని, చేయకుండుటకుగాని, చేయుటయందు జాప్యము చేయుటకుగాని ప్రేరేపించు నిమిత్తమై అట్టి పబ్లికు సేవకునికైనను, ఆ పబ్లికు సేవకుడు ఏ వ్యక్తి పట్ల హితాభిలాషియైయున్నాడని తాను విశ్వసించుచున్నాడో అట్టి ఎవరేని వ్యక్తి కైనను హాని కలిగింతునని బెదిరించువారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఒక వ్యక్తి రక్షణ కొరకై పబ్లికు సేవకునికి దరఖాస్తు పెట్టుకొనకుండ ప్రేరేపించుటకై అతనికి హానికలిగింతునని బెదిరించుట,

190. ఏదేని హాని నుండి రక్షణ నిచ్చుటకు గాని అట్టి రక్షణ నిప్పించుటకుగాని శాసనరీత్యా అధికారము గల ఏ పబ్లికు సేవకునికైనను శాసనపరమైన దరఖాస్తును చేయకుండుటకు లేక దరఖాస్తును చేయుట మానుకొనుటకు ఏ వ్యక్తి నైనను ప్రేరేపించు నిమిత్తము ఆ వ్యక్తి కి హాని కలిగింతునని బెదిరించువారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

అధ్యాయము 11

తప్పుడు సాక్ష్యము మరియు న్యాయపాలనకు భంగకరమగు అపరాధములను గురించి

తప్పుడు సాక్షము ఇచ్చుట.

191. ప్రమాణము చేసినందునగాని, అభివ్యక్త శాసన నిబంధననుబట్టి గాని నిజమును చెప్పవలసియుండి లేక శాసన రీత్యా ఏదేని విషయము పై ప్రఖ్యానము చేయవలసి యుండి, ఆబద్ధమైనట్టిదగు, మరియు అబద్ధమై నట్టిదని తనకు తెలిసి యున్నట్టిదైనను, అట్టిదని తాను విశ్వసించుచున్నట్టిదైనను, లేక నిజమైనదని తాను విశ్వసించనట్టిదైనను అగు దేనినైనను చెప్పినవారెవరైనను తప్పుడు సాక్ష్యము ఇచ్చినట్లు చెప్పబడుదురు.

విశదీకరణము 1 :-నోటి మాటలద్వారా చెప్పినదైనను, ఇతర విధముగా తెలిపినదైనను, ఈ పరిచ్చేదపు భావములో “చెప్పిన" దగును.

విశదీకరణము : 2-దేనినై నను చెప్పు వ్యక్తి తాను విశ్వసించుదానిని గూర్చి చెప్పిన అబద్ధము ఈ పరిచ్చేద భావములోనికి వచ్చును, మరియు ఒక వ్యక్తి తాను విశ్వసించనట్టి విషయమును గురించి విశ్వసించుచున్నానని చెప్పినను తనకు తెలియనట్టి విషయమును గురించి తెలియునని చెప్పినను కూడ తప్పుడు సాక్ష్యము ఇచ్చినట్లు కావచ్చును.

ఉదాహరణములు

(ఏ) వేయి రూపాయలకొరకు 'జడ్' పై 'బి'కి గల న్యాయమైన క్లెయిమును సమర్ధించుచు 'బీ' యొక్క క్లెయిము న్యాయమైనట్లు 'జడ్' ఒప్పుకొనగా తాను వినినట్లు విచారణయందు ప్రమాణము చేసి 'ఏ' అబద్ధము చెప్పును. 'ఏ' తప్పుడు సాక్ష్యము ఇచ్చినవాడగును.

(బి) ప్రమాణము చేసి నిజమును చెప్పుటకు 'ఏ' బద్దుడై యుండి ఒకానొక సంతకము 'జడ్' యొక్క దస్తూరిలో ఉన్నదని తాను విశ్వసింపకున్నను అది 'జడ్' యొక్క దస్తూరిలో ఉన్నదని తాను విశ్వసించుచున్నానని చెప్పును. ఇచట ఆతడు చెప్పినది అతనికి అబద్ధమని తెలియును; కావున తప్పుడు సాక్ష్యము ఇచ్చినవాడగును,

(సీ) 'జడ్' దస్తూరి సాధారణముగా ఎటులనుండునో ఎరిగియుండిన 'ఏ' ఒకానొక సంతకము 'జడ్' యొక్క దస్తూరిలో ఉన్నదని తాను విశ్వసించుచున్నానని చెప్పును, ఆది “జడ్" దస్తూరియేనని 'ఏ' సద్భావముతో విశ్వసించుచుండెను. ఇచట 'ఏ' చెప్పినది కేవలము అతని విశ్వాసమునకు సంబంధించినదియును, అతని విశ్వాసమును బట్టి నిజమై నదియును. కావున, సంతకము “జడ్" దస్తూరిలో లేకపోయినను, “ఏ" తప్పుడు సాక్ష్యము ఈయలేదు.

(డి) ప్రమాణము చేసి నిజమును చెప్పుటకు “ఏ' బద్దుడై యుండి 'జడ్' ఫలాని దినమున ఫలానా స్థలములో ఉన్నట్లు తనకు తెలియునని ఆ విషయమును గూర్చి అతనికి ఏమియు తెలియకున్నను చెప్పును. పేర్కొనబడిన ఆ దినమున 'జడ్' ఆ స్థలములో ఉన్నను లేకున్నను 'ఏ' తప్పుడు సాక్ష్యము ఇచ్చిన వాడగును.

(ఈ) ప్రమాణము చేసి ఒక కథనమును లేక దస్తావేజును సరిగా అర్థ వివరణ చేయుటకు లేక అనువాదము, చేయుటకు బద్ధుడై యున్నట్టి దుబాసీ లేక అనువాదకుడైన 'ఏ' ఆ కథనము, లేక దస్తావేజు యొక్క సరియైన అర్ధ వివరణ లేక అనువాదము కానట్టి మరియు సరియైనదని తాను విశ్వసించనట్టి దానిని సరియైన అర్థ వివరణ లేక, అనువాదముగా ఇచ్చును లేక ధ్రువపరచుము. 'ఏ' తప్పుడు సాక్ష్యము నిచ్చినవాడగును. తప్పుడు సాక్ష్యమును కల్పించుట.

192. ఒక న్యాయిక చర్యలో గాని, పబ్లికు సేవకుడుగా వ్యవహరించుచున్నప్పుడు ఒక పబ్లికు సేవకుని సమక్షమున నైనను, ఒక మధ్యవర్తి సమక్షముననైనను శాసనరీత్యా జరుగు చర్యలోగాని, ఏదేని పరిస్థితి, తప్పుడు నమోదు లేక తప్పుడు కథనము సాక్ష్యమునందు కాన్పించవలెననియు అట్లు సాక్ష్యమునందు కాన్పించు ఆ పరిస్థితి, తప్పుడు నమోదు, లేక తప్పుడు కథనము అట్టి చర్యలో ఆ సాక్ష్యము పై అభిప్రాయము ఏర్పరచుకొనవలసిన ఏ వ్యక్తి నైనను ఆ చర్య ఫలితమును గూర్చిన ఒక ముఖ్యాంశము పై తప్పు అభిప్రాయము ఏర్పరచుకొనునట్లు చేయవలెననియు ఉద్దేశించి అట్టి పరిస్థితిని కలిగించు, లేక ఏదేవి పుస్తకములోనై నను, రికార్డులోనైనను అట్టి తప్పుడు నమోదు చేయు లేక అట్టి తప్పుడు కథనము గల ఏదేని దస్తావేజును రూపొందించు నతడెవరైనను తప్పుడు సాక్ష్యమును కల్పించినట్లు చెప్పబడును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కు చెందిన పెట్టెలో ఆభరణములు దొరికి, ఆ పరిస్థితివలన 'జడ్' దొంగతనమునకు దోష స్థాపితుడు కావలెనను ఉద్దేశ్యముతో ఆతని పెట్టెలో 'ఏ' ఆభరణములను ఉంచును. “ఏ' తప్పుడు సాక్ష్యమును కల్పించినవాడగును.

(బి) న్యాయస్థానములో బలపరచు సాక్ష్యముగ ఉపయోగించు నిమిత్తము 'ఏ' తన అంగడి- పుస్తకములో తప్పుడు నమోదు చేయును. 'ఏ' తప్పుడు సాక్ష్యమును కల్పించినవాడగును.

(సీ) 'జడ్' అపరాధిక కుట్రకు దోషస్థాపితుడు కావలెనను ఉద్దేశ్యముతో, అట్టి ఆపరాధిక కుట్రలోని పహాపరాధికి వ్రాసినట్లు తాత్పర్యమిచ్చు ఒక జాబును 'జడ్' దస్తూరిని అనుకరించుచు 'ఏ' వ్రాసి, ఆ జాబును పోలీసు అధికారులు సోదా చేయగలరని తనకు తెలిసియున్నట్టి స్థలములో ఉంచును. 'ఏ' తప్పుడు సాక్ష్యమును కల్పించిన వాడగును.

తప్పుడు సాక్ష్యమువకు శిక్ష.

193. న్యాయికచర్య యొక్క ఏ దశలోనైనను ఉద్దేశపూర్వకముగా తప్పుడు సాక్ష్యమునిచ్చు లేక న్యాయిక చర్యయొక్క ఏ దశలో నైనను ఉపయోగింపబడు ఏమిత్తము తప్పుడు సాక్ష్యము కల్పించువారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు;

మరియు ఏ ఇతర కేసులోనైనను ఉద్దేశపూర్వకముగా తప్పుడు సాక్ష్యము నిచ్చు లేక తప్పుడు సాక్ష్యము కల్పించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము 1:-సైనిక న్యాయస్థాన సమక్షమున జరుగు విచారణ వ్యాయికచర్య ఆగును.

విశదీకరణము 2 :- న్యాయస్థాన సమక్షమున జరిగెడు చర్యకు పూర్వరంగముగా శాసనరీత్యా ఆదేశింపబడు దర్యాప్తు, ఆ దర్యాప్తు న్యాయస్థాన సమక్షమున జరుగకపోయినప్పటికీ వ్యాయికచర్యయందు ఒక దశయై యుండును.

ఉదాహరణము

‘జడ్' ను విచారణకై పంపవలెనా అనుదానిని విశ్చయించు నిమిత్తము మేజిస్టేటు సమక్షమున జరుగు పరిశీలనలో ఏ' ప్రమాణము చేసి అబద్ధపుదని తనకు తెలిసినదానిని నిజమని చెప్పును. ఈ పరిశీలన న్యాయికచర్యయందు ఒక దశయై నందున 'ఏ' తప్పుడు సాక్ష్యము ఇచ్చినవాడగును.

విశదీకరణము 3 :- న్యాయస్థానముచే శాసనానుసారము ఆదేశింపబడి న్యాయస్థాన ప్రాధికారము క్రింద జరుపబడు దర్యాప్తు, ఆ దర్యాప్తు న్యాయస్థాన సమక్షమున జరుపబడనప్పటికినీ, న్యాయికచర్యయందు ఒక దశయై ఉండును.

ఉదాహరణము

భూమి సరిహద్దులను అచ్చటనే నిశ్చయించుటకై న్యాయస్థానము పంపిన అధికారి సమక్షమున జరుగు పరిశీలనములో 'ఏ' ప్రమాణము చేసి ఆబద్ధపుదని తనకు తెలిసియున్నట్టి దానిని నిజమని చెప్పును. ఈ పరిశీలనము న్యాయికచర్యయందు ఒక దశయైనందున, 'ఏ' తప్పుడు సాక్ష్యము నిచ్చినవాడగును. మరణశిక్ష విధింపదగిన అపరాధమునకు దోషస్థాపన చేయు ఉద్దేశముతో తప్పుడు సాక్ష్యమును ఇచ్చుట లేక కల్పించుట.

194. భారతదేశములో తత్సమయమున అమలునందున్న శాసనమును బట్టి మరణ శిక్ష విధింపదగిన అపరాధమునకు ఏవ్యక్తి నైనను, తప్పుడు సాక్ష్యము ఇచ్చుట ద్వారా, దోషస్థాపితుని చేయించవలెనను ఉద్దేశ్యముతో, లేక తాను తద్వారా అట్లు చేయించగలనని తెలిసియుండి తప్పుడు సాక్ష్యమును ఇచ్చు లేక కల్పించు వారెవరైనను యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

తద్వారా నిర్దోషి దోష స్థాపితుడై , మరణశిక్షను అనుభవించినచో,

మరియు అట్టి తప్పుడు సాక్ష్యమును ఇచ్చిన పరిణామముగా నిర్దోషి దోష స్థాపితుడై మరణ శిక్షను అనుభవించినచో అట్టి తప్పుడు సాక్ష్యము ఇచ్చిన వ్యక్తి మరణ శిక్షకుగాని ఇందు ఇంతకుముందు వివరింపబడిన శిక్షకు గాని పాత్రుడగును.

యావజ్జీవ కారావాసముతో ,లేక కారావాసముతో శిక్షింపదగిన అపరాధమునకు దోషస్థాపితుని జేయు ఉద్దేశముతో తప్పుడు సాక్ష్యము నిచ్చుట లేక కల్పించుట.

195. భారతదేశములో తత్సన యమున అమలుసందున్న శాసనమును బట్టి మరణ శిక్ష విధింపదగినది కానిదైనను, యావజ్జీవ కారావాసముతో గాని ఏడు సంవత్సరముల దాక లేక అంత కెక్కువ కాలావధికి కారావాసముతో గాని, శిక్షింపదగిన అపరాధములకు ఏ వ్యక్తి నైనను తప్పుడు సాక్ష్యము నిచ్చుట ద్వారా దోష స్థాపితుని చేయించవలెనను ఉద్దేశ్యముతో లేక తద్ద్వారా తాను అట్లు చేయించ గలనని తెలిసియుండి తప్పుడు సాక్ష్యము నిచ్చు, లేక కల్పించు వారెవరైనను, ఆ ఆపరాధమునకు దోష స్థాపితుడైన వ్యక్తి ఏ శిక్షకు పాత్రుడగునో ఆదే శిక్ష కు పాత్రులై యుందురు.

ఉదాహరణము

'జడ్' ను బందిపోటు ఆపరాధమునకు దోషస్థాపితుని చేయించవలెనను ఉద్దేశ్యముతో న్యాయస్థాన సమక్షమున 'ఏ' తప్పుడు సాక్ష్యమును ఇచ్చును. బందిపోటు చేసినందుకు శిక్ష యావజ్జీవ కారావాసము లేక జూర్మానాతో గాని జుర్మానా లేకుండా గాని పది సంవత్సరములదాక ఉండగల కఠిన కారావాసము; కావున 'ఏ' అట్టి యావజ్జీవ కారావాసము నకైనను, జుర్మానాతో గాని, జుర్మానా లేకుండా గాని అట్టి కారావాసమునకై నను శిక్షాపాత్రుడగును,

తప్పుడుదని తెలిసిన సాక్ష్యమును ఉపయోగించుట.

196. తప్పుడు దనిగాని, కల్పితమై నదనిగాని తనకు తెలిసియున్న ఏదేని సాక్ష్యమును నిజమైన సాక్ష్యమని, లేక యదార్ధ మైన సాక్ష్యమని అవినీతికరముగా ఉపయోగించు లేక ఉపయోగించుటకు ప్రయత్నించు వారెవరైనను తప్పుడు సాక్ష్యము ఇచ్చియున్న లేక కల్పించియున్న ఎట్లో అదే రీతిగా శిక్షింపబడుదురు.

తప్పుడు సర్టిఫికేట్టును జారీచేయుట, లేక దాని పై సంతకము చేయుట.

197. శాససరీత్యా ఈయబడవలసిన లేక సంతకము చేయబడవలసిన సర్టిఫికేట్టునుగాని, శాసనరీత్యా ఏదేని సంగతికి సంబంధించిన సాక్ష్యమునందు స్వీకరింపదగినట్టిదిగా చేయబడిన ఏదేని సర్టిఫికెట్టుగాని ఆట్టి సర్టిఫికెట్టు ఏ ముఖ్యాంశము నందైనను తప్పుడుదని తెలిసియుండి లేక తప్పుడుదని విశ్వసించుచుజారీచేయు, లేక దానిపై సంతకము చేయు వారెవరైనను, తప్పుడు సాక్ష్యము నిచ్చియుండిన ఎట్లో ఆదే రీతిగా శిక్షింపబడుదురు.

తప్పుడుదని తెలిసిన సర్టిఫికేటును నిజమైనదిగా ఉపయోగించుట.

198. అట్టి ఏ సర్టిఫికేట్టునైనను, ఏదేని ముఖ్యాంశమునందు తప్పుడుదని ఎరిగియుండియు, నిజమైన సర్టిఫికేట్టు అని అవినీతికరముగా ఉపయోగించు లేక ఉపయోగించుటకు ప్రయత్నించువారెవరైనను, తప్పుడు సాక్ష్యను నిచ్చియుండిన ఎట్లో అదే రీతిగ శిక్షింపబడుదురు.

శాసనరీత్యా సాక్ష్యముగా స్వీకరింపదగిన ప్రఖానములో అబద్దము చెప్పుట.

199. ఏదేని న్యాయస్థానముగాని, ఎవరేని పబ్లికు సేవకుడుగాని, ఎవరేని ఇతర వ్యక్తి గాని, ఏదేని సంగతికి సాక్ష్యముగా ఏదేని ప్రఖ్యానమును స్వీకరించుటకు శాససరీత్యా బాధ్యత లేక ప్రాధికారము కలిగియుండినపుడు ఆ ప్రఖ్యానము ఏ సంగతిని గూర్చి సాక్ష్యముగా స్వీకరింపబడుటకై లేక ఉపయోగించబడుటకై చేయబడునో అందుకు ముఖ్యమైన ఏదేని అంశమునకు సంబంధించి తప్పుడుదైన, మరియు తప్పుడుదని తనకు తెలిసియున్నట్టిదైనను అట్టిదని తాను విశ్వసించునట్టిదైనను, లేక నిజమైనదని విశ్వసించనట్టిదైనను అగు దేనినైనను ఆ ప్రఖ్యానమునందు చెప్పు వారెవరైనను, తప్పుడు సాక్ష్యము నిచ్చియుండిన ఎట్లో అదేరీతిగా శిక్షింపబడుదురు.

అట్టి ప్రఖ్యానము తప్పుడుదని తెలిసియుండియు నిజమైన దానినిగా ఉపయోగించుట.

200. ఏదేని ఆట్టి ప్రఖ్యానమును, ఏ ముఖ్యాంశమునందైనను అది తప్పుడుదని తెలిసియుండి, నిజమైన దానినిగా అవినీతికరముగా ఉపయోగించు లేక ఉపయోగించుటకు ప్రయత్నించువారెవరైనను తప్పుడు సాక్ష్యము నిచ్చి యుండిన ఎట్లో అదేరీతిగా శిక్షింపబడుదురు.

విశదీకరణము :-- ఏదైనా లాంఛన లోపము జరిగినదను ఆధారముపై మాత్రమే స్వీకారయోగ్యము కాని ప్రఖ్యానము, 199 నురియు 200 పరిచ్చేదముల యొక్క భావములో ప్రఖ్యానముగానే యుండును. అపరాధమును గూర్చిన సాక్ష్యమును అదృశ్యము చేయుట లేక అపరాధికి శిక్ష పడకుండ కాపాడుటకై తప్పుడు సమాచారము అందజేయుట.

201. అపరాధము చేయబడినదని తెలిసియుండియు లేక అట్లు విశ్వసించుటకు కారణముండియు, అపరాధికి శాసనవిహితమైన శిష్ట పడకుండకాపాడు ఉద్దేశముతో, ఆ అపరాధము చేయుటకు గూర్చిన సాక్ష్యమును దేనినై నన్న అదృశ్యముచేయు, లేక ఆ ఉద్దేశముతో ఆ ఆపరాధమునకు సంబంధించి తప్పుడుదని తనకు తెలిసినట్టి లేక తప్పుడు దని తాను విశ్వసించునట్టి ఏదేని సమాచారమును అందజేయు వారెవరైనను,

అపరాధము మరణశిక్ష విధింప దగినదైనచో.

చేయబడినదని అతనికి తెలిసినట్టి లేక అతను విశ్వసించుచున్నట్టి అపరాధము మరణదండనతో శిక్షింపదగిన దైనచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మా నాకు కూడ పాత్రులగుదురు;

యావజ్జీవ కారావావాసముతో శిక్షించ దగినదైనచో.

మరియు ఆ అపరాధము యావజ్జీవ కారావాసముతోనైనను, పది సంవత్సరముల దాక ఉండగల కారావాసముతోనైనను శిక్షింపదగినదైనచో, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

పది సంవత్సరముల కంటే తక్కువదగు కారావాసముతో శిక్షింపదగినదైనచో.

మరియు ఆ అపరాధము, పది సంవత్సరములకంటే తక్కువదగు ఏ కాలావధిక కారావాసముతోనై నను శిక్షింపదగిన దైనచో, ఆ అపరాధమును గురించిన నిబంధనానుసారముగా గల దీర్ఘతను కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, ఆ అపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసముగలదో ఆ రకపు కారావాసముతో నైనను, జుర్మానాతోనైనను, లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు,

ఉదాహరణము

'జడ్' ను 'బి' హత్యచేసెనని 'ఏ' కు తెలిసియుండి, 'బి' కి శిక్ష పడకుండ కాపాడవలెనను ఉద్దేశముతో శవమును దాచుటకు 'బి' కి 'ఏ' సహాయపడును. రెంటిలో ఒక రకపుదగు ఏడు సంవత్సరముల కారావాసమునకును, జుర్మానాకును 'ఏ' పాత్రుడగును.

అపరాధమును గూర్చిన సమాచారము అందజేయవలసిన వ్యక్తి సమాచారమును ఉద్దేశపూర్వకముగా అందజేయకుండుట.

202. అపరాధము చేయబడినదని తెలిసియుండియు, లేక అట్లు విశ్వసించుటకు కారణముండియు, ఆ అపరాధమును గూర్చి శాసనరీత్యా తాను అందజేయ వలసియున్న ఏ సమాచారమునైనను ఉద్దేశపూర్వకముగా అందజేయనివారెవరైనను, ఆరుమాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో నైనను, జుర్మానాతో నైనను, ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

చేయబడిన ఆపరాధమును గూర్చి తప్పుడు సమాచారము నందజేయుట,

203. అపరాధము చేయబడినదని తెలిసియుండియు లేక అట్లు విశ్వసించుటకు కారణముండియు, ఆ అపరాధమును గూర్చి తాను తప్పుడుదని ఎరిగియున్నట్టి లేక తాను అట్టిదని విశ్వసించుచున్నట్టి ఏ సమాచారమునైనను అందజేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానా తోనైనను, ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

విశదీకరణము :--201 మరియు 202 పరిచ్ఛేదములలోను, ఈ పరిచ్ఛేదములోను, 'అపరాధము' ఆను పదపరిధియందు ఏకార్యము భారతదేశములో చేయబడియుండినచో ఈ క్రింది పరిచ్ఛేదములలో, అనగా 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459 మరియు 460 లలో, దేని క్రిందనైనను శిక్షింపదగియుండెడిదో అట్టి ఏకార్యమైనను భారత దేశము వెలుపల ఏ స్థలమునందు చేయబడినదైనను చేరియుండును.

సాక్ష్యముగ దాఖలు కాకుండ జేయుటకై దస్తావేజును నాశన మొనర్చుట.

204. ఒక న్యాయస్థానమునందుగాని ఒక పబ్లికు సేవకుని సమక్షమున గాని శాసనసమ్మతముగా జరుపబడు ఏదేని చర్యలో ఏ దస్తావేజును దాఖలు చేయవలసినదిగా తనను శాసన సమ్మతముగా బలవంత పెట్టవచ్చునో ఆ దస్తావేజు అట్టి న్యాయస్థానము యొక్క లేక అట్టి పబ్లికు సేవకుని యొక్క సమక్ష మున సాక్ష్యముగా దాఖలు చేయబడకుండ లేక ఉపయోగింపబడకుండ చేయు ఉద్దేశముతోగాని, అందు నిమిత్తమై దానిని దాఖలు చేయుటకు తాను శాసస సమ్మతముగా సమను చేయబడిన పిమ్మట, లేక దాఖలు చేయవలసినదిగా కోరబడిన పిమ్మటగాని, అట్టి దస్తావేజును దాచి పెట్టు లేక నాశనమొనర్చు లేక, అట్టి దస్తావేజునంతను, లేక అందలి ఏదేని భాగమును తుడిచివేయు లేదా చదువబడ జాలనిదగునట్లు చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, లేక జుర్మానాతోనైనను లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు. దావా లేక అభియోగములో, కార్యము లేక చర్య నిమిత్తమై తప్పుడు ప్రతి రూపణము.

205. మరొకరిగ తప్పుడు ప్రతి రూపణము చేసి, అట్లు ఆపాదించుకున్న రూపములో, ఏదేని దావాలోగాని, అపరాధిక అభియోగములో గాని దేనినై నను ఒప్పుకొను, చెప్పు, లేక వాదించక తీర్పును స్వీకరించు, లేక ఏదేని ఆదేశికను జారీ చేయించు, లేక జామీనునైనను జమానతునైనను ఇచ్చు, లేక ఏదేని ఇతర కార్యమును చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జర్మానాతోనైనను ఈ రెండింటితో నైనను శిక్షింపబడుదురు.

సమపహరింప బడినది గాగాని, అమలు చర్యలో గాని అభి గ్రహించకుండ చేయుటకై ఆస్తిని కపటముతో తొలగించుట లేక దాచుట.

206. న్యాయస్థానముచే గాని, ఇతర సమర్థ ప్రాధికారముచేగాని, ఒసగబడినట్టి, లేక ఒసగబడగలదని తనకు తెలిసియున్నట్టి దండనోత్తరువు క్రింద ఏదేని ఆస్తినైనను అందలి ఏదేని హితమునైనను సమపహరణముగ లేక జుర్మానా తీరుదలకై తీసికొనబడకుండ గాని, సివిలు దావాలో న్యాయస్థానముచే చేయబడినట్టి లేక చేయబడగలదని తనకు తెలిసి యున్నట్టి డిక్రీని లేక ఉత్తరువును అమలు జరుపుటకై తీసికొనబడకుండగాని చేయు ఉద్దేశముతో, ఆ ఆస్తిని లేక అందలి హితమును కపటపూర్వకముగ తొలగించు, దాచు, ఏ వ్యక్తి కైనను బదిలీచేయు లేక అప్పగించువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానాతోనై నను, లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

సమపహరింపబడినదిగా గాని అమలు చర్యలోగాని అభిగ్రహించకుండ చేయుటకై ఆస్తిని కపటముతో క్లెయిము చేయుట.

207. న్యాయస్థానముచేగాని, ఇతర సమర్థ ప్రాధికారముచేగాని ఒసగబడినట్టి, లేక ఒసగబడగలదని తనకు తెలిసియున్నట్టి దండనోత్తరువు క్రింద ఏదేని ఆస్తినైనను, అందలి ఏదేని హితమునైనను సమపహరణముగ లేక జుర్మానా తీరుదలకై తీసికొనబడకుండగాని, సివిలు దావాలో న్యాయస్థానముచే చేయబడినట్టి లేక చేయబడగలదని తనకు తెలిసియున్నట్టి డిక్రీని లేక ఉత్తరువును అమలు జరుపుటకై తీసికొనబడకుండగాని, చేయు ఉద్దేశముతో ఆ ఆస్తి పై లేక అందలి హితముపై తనకు ఎట్టి హక్కుగాని, న్యాయసమ్మతమైన క్లెయిముగాని లేదని ఎరిగియుండియు ఆ ఆస్తిని లేక అందలి హితమును కపటపూర్వకముగ స్వీకరించు, పుచ్చుకొను, లేక క్లెయిముచేయు, లేక ఆ ఆస్తి యందు ఏదేని హక్కుకు లేక ఏదేని హితమునకు సంబంధించి ఏదేని మోసముచేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములోనైనను, జుర్మానాతోనై నను లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

బాకీలేని సొమ్ముకై కపటముతో డిక్రీని పాస్ కానిచ్చుట.

208. ఎవరైన వ్యక్తి తెచ్చిన దావాలో అట్టి వ్యక్తి కి బాకీలేని సొమ్ముకైనను, బాకీ ఉన్న దానికంటే ఎక్కువ సొమ్ము కైనను, అట్టి వ్యక్తికి హక్కులేని ఏదేని ఆస్తి కైనను, ఆ ఆస్తి యందలి ఏదేని హితమునకైనను, తనపై డిక్రీని గాని ఉత్తరువును గాని కపటముగా పాస్ చేయించుకొను లేక పాస్ కానిచ్చు, లేక డిక్రీ సొమ్ముగాని, ఉత్తరువు సొమ్ము గాని తీరిపోయిన పిమ్మట లేక అప్పటికే తీరిపోయిన దాని దేని విషయములోనైనను తనపై డిక్రీనిగాని, ఉత్తరువునుగాని కపటముగా అమలు జరిపించుకొను లేక అమలుజరుగనిచ్చు వారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారా వాసముతోగాని, జూర్మానాతోగాని, లేక ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

'జడ్' పై 'ఏ' దావా వేయును. తన పై 'ఏ' డిక్రీ పొందగలడని 'జడ్' కు తెలిసియుండి అతని ఆస్తి 'ఏ' యొక్క డిక్రీ క్రింద విక్రయింపబడినచో వచ్చే విక్రయపు రాబడిలో, 'బి' యనునతడు తనకొరకై నను 'జడ్'యొక్క మేలు కొరకై నను, వాటా పంచుకొను నిమిత్తము 'జడ్' పై న్యాయమైన ఎట్టి క్లెయిము 'బి' కి లేక పోయినను 'బీ' చేసిన దావాలో 'ఏ' యొక్క దావా మొత్తము కన్న ఎక్కువ మొత్తమునకు 'జడ్' కపటపూర్వకముగా తనకు వ్యతిరేకముగా తీర్పు కానిచ్చును. 'జడ్' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసినవాడగును.

న్యాయస్థానములో నిజాయితీ లేకుండ తప్పుడు క్లెయిమును చేయుట.

209. న్యాయస్థానములో కపటముతో గాని, నిజాయితీ లేకుండగాని, ఏ వ్యక్తి కైనను హానిని లేక చీకాకును కలిగించు ఉద్దేశముతో గాని, తప్పుడుదని తాను ఎరిగి యున్నట్టి ఏదేని క్లెయిమును చేయు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బాకీలేని సొమ్ముకై కపటముతో డిక్రీని పొందుట.

210. ఎవరేని వ్యక్తి పై అతడు బాకీ లేని సొమ్ముకైనను, బాకీ ఉన్న దానికంటే ఎక్కువ సామ్ముకైనను, తనకు హక్కు లేని ఏదేని ఆస్తికైనను, ఆ ఆస్తి యందలి ఏదేని హితమునకైనను డిక్రీని గాని ఉత్తరువునుగాని కపటముతో పొందునట్టి, లేక డిక్రీ సొమ్ముగాని ఉత్తరువు సొమ్ము గాని తీరిపోయిన పిమ్మట, లేక అప్పటికే తీరిపోయినదాని దేని విషయములో నైనను, ఏ వ్యక్తి పై నైనను డిక్రీని గాని, ఉత్తరువును గాని కపటముగా అమలు జరిపించునట్టి లేక కపటముతో ఏదేని అట్టి కార్యమును తన పేరిట చేయనిచ్చు లేక చేయుటకు అనుమతించునట్టి వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానాతోనైనను, ఈ రెండింటితో నైనను శిక్షింపబడుదురు. హాని కలిగించు ఉద్దేశముతో తప్పుడు అపరాధారోపణ.

211. ఏ వ్యక్తి కై నను హాని కలిగించు ఉద్దేశముతో, ఆ వ్యక్తిపై క్రిమినలు చర్యను ప్రారంభించుటకు గాని ప్రారంభించునట్లు చేయుటకుగాని, అపరాధము చేసినాడని ఆరోపణ చేయుటకు గాని న్యాయమైన లేక శాసనసమ్మతమైన ఆధారమేదియు లేదని ఎరిగి యుండియు, ఆ వ్యక్తి పై అట్టి ఏదేని చర్యను ప్రారంభించు, లేక ప్రారంభించునట్లు చేయు, లేక అట్టి తప్పుడు ఆరోపణము చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానాతోనైనను, ఈ రెండింటితోనై నను శిక్షింపబడుదురు;

మరియు, మరణదండనతోగాని, యావజ్జీవ కారావాసముతోగాని, ఏడు సంవత్సరములు లేక అంత కెక్కువ కాలము దాక కారావాసముతో గాని, శిక్షింపదగు అపరాధమును గూర్చిన తప్పుడు ఆరోపణపై అట్టి క్రిమినలు చర్య తేబడినచో ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మా నాకు కూడ పాత్రులగుదురు.

అపరాధికి ఆశ్రయ మిచ్చుట.

212, అపరాధము చేయబడినపుడెల్లను, అపరాధియని తనకు తెలిసియున్నట్టి లేక అట్లు విశ్వసించుటకు కారణమున్నట్టి వ్యక్తికి శాసనవిహితమైన శిక్ష పడకుండ కాపాడు ఉద్దేశముతో, ఆ వ్యక్తికి ఆశ్రయమిచ్చు లేక అతనిని దాచు వారెవరైనను,

అపరాధము మరణశిక్ష విధింప దగిన దైనచో.

ఆ అపరాధము మరణదండనతో శిక్షింపదగినదైనచో, ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

యావజ్జీవ కారావాసముతో లేక కారావాసముతో శిక్షింపదగినదైనచో

ఆ అపరాధము, యావజ్జీవ కారావాసముతో నైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో నైనను శిక్షింపదగినదైనచో, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

మరియు ఆ ఆపరాధము పది సంవత్సరముల వరకు కాక ఒక సంవత్సరముదాక ఉండగల కారావాసముతో శిక్షింపదగినదైనచో ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, ఆ అపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసముగలదో ఆ రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

ఈ పరిచ్చేదములో 'అపరాధము' అను పదపరిధియందు ఏకార్యము భారతదేశములో చేయబడియుండినచో ఈ క్రింది పరిచ్ఛేదములలో, అనగా 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459 మరియు 460 లలో, దేని క్రిందనైనను శిక్షింపదగియుండెడిదో అట్టి ఏ కార్యమైనను భారతదేశము వెలుపల ఏ స్థలము నందు చేయబడినదైనను, చేరి యుండును, మరియు నిందితవ్యక్తి భారతదేశములో ఆ కార్యమును చేసియుండిన యెట్లో అట్లే ఈ పరిచ్ఛేదము నిమిత్తము అట్టి ప్రతికార్యము శిక్షింపదగినదని భావించవలెను;

మినహాయింపు :-- అపరాధికి భర్త, లేక భార్య ఆశ్రయమిచ్చినట్టి లేక అపరాధిని భర్త, లేక భార్య దాచినట్టి ఏ సందర్భమున కైనను ఈ నిబంధన విస్తరించదు;

ఉదాహరణము

'బీ' బందిపోటు చేసినవాడని 'ఏ' ఎరిగియుండియు, అతనికి శాసనవిహిత శిక్ష పడకుండ కాపాడుటకై తెలిసియే, 'బి'ని 'ఏ' దాచి పెట్టును. ఇచట 'బీ' యావజ్జీవ కారావాస శిక్షా పాత్రుడై యున్నందున, 'ఏ' మూడు సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసమునకు పాత్రుడగును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

శిక్ష పడకుండా అపరాధిని కాపాడుటకై పారితోషికము మొదలగు వాటిని తీసికొనుట.

213. అపరాధమును మరుగుపరుచుటకై, లేక ఏ వ్యక్తి కైనను, ఏదేని అపరాధమునకుండు శాసనవిహిత శిక్ష పడకుండా, అతనిని కాపాడుటకై , లేక ఏ వ్యక్తి కైనను శాసన విహిత శిక్ష పడే నిమిత్తము అతనిపై తాను తీసికొనవలసిన చర్య తీసికొనకుండుటకై ప్రతిఫలముగ తాను, తన కొరకు గాని ఎవరేని ఇతర వ్యక్తి కొరకుగాని, ఏదేని పారితోషికమునై నను, తనకుగాని ఎవరేని ఇతర వ్యక్తి కిగాని పున:ప్రాప్తమగు ఏదేని ఆస్తి నైనను స్వీకరించు, పొందుటకు ప్రయత్నించు, లేక స్వీకరించుటకు అంగీకరించు వారెవరైనను,

అపరాధము మరణ శిక్ష విధింప దగినదైనచో

ఆ అపరాధము, మరణదండనతో శిక్షింపదగినదైనచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు; యావజ్జీవ కారావాసముతో లేక కారావాసముతో శిక్షింప దగినదైనచో

ఆ అపరాధము, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కారావాసముతోగాని శిక్షింప దగినదైనచో, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

మరియు ఆ అపరాధము పది సంవత్సరములదాక ఉండనిదైన కారావాసముతో శిక్షింపదగినదైనచో, ఆ అపరాధము, నకై నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి ఆ ఆపరాధ మునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసము గలదో ఆ రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

అపరాధికి శిక్ష పడకుండ కాపాడుటకై ప్రతి ఫలముక పారితోషికము ఈయజూపుట, లేక ఆస్తిని తిరిగి ఈయజూపుట.

214. అపరాధమును కప్పిపుచ్చుటకై, లేక ఏ వ్యక్తి కై నను ఏదేని అపరాధమునకుండు శాసన విహిత శిక్ష పడకుండ అతనిని కాపాడుటకై , లేక ఏ వ్యక్తి కైనను శాసన విహిత శిక్ష పడే నిమిత్తము అతనిపై తాను తీసికొనవలసిన చర్య తీసికొనకుండుటకై ప్రతి ఫలముగ ఆ వ్యక్తి కి ఏదేని పారితోషికమును ఇచ్చు, లేక ఇప్పించు, ఈయజూపు లేక ఇప్పింపజూపు, ఇచ్చుటకు అంగీకరించు, లేక ఇప్పించుటకు అంగీకరించు, లేక ఏ వ్యక్తి కైనను ఏదేని ఆస్తిని తిరిగి ఇచ్చు లేక తిరిగి ఇప్పించువారెవరైనను,

అపరాధము మరణశిక్ష విధింపదగినదైనదైనచో

ఆ అపరాధము మరణదండనతో శిక్షింపదగినదైనచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగినదైనచో

మరియు ఆ అపరాధము యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కారావాసముతో గాని శిక్షింపదగినదైనచో మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింప బడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

మరియు, ఆ అపరాధము, పది సంవత్సరముల దాక ఉండనిదైన కారావాసముతో శిక్షింపదగినదైనచో ఆ అపరాధము నకై నిబంధనానుసారముగల దీర్ఘతమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, ఆ అపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసము గలదో ఆ రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మినహాయింపు :-- శాసన సమ్మతముగా రాజీచేసికొనదగు అపరాధమునకు సంబంధించిన ఏ కేసుకైనను 213న మరియు 214న పరిచ్ఛేదము యొక్క నిబంధనలు విస్తరించవు.

దొంగలింపబడిన ఆస్తి మొదలైన వాటిని తిరిగి యిప్పించుటకు సహాయ పడుటకు పాతోషికమును తీసికొనుట.


215. ఈ స్మృతి క్రింద శిక్షింపదగు ఏదేని అపరాధము కారణముగ ఏ వ్యక్తి యైనను కోల్పోయిన చరాస్తిని దేనినైనను తిరిగి అతనికి ఇప్పించుటకు సహాయము చేయుదునను మిష పై లేక సహాయము చేసినందుకై, ఏదేని పారితోషికమును, తీసికొను లేక తీసికొనుటకు అంగీకరించు లేక తీసికొనుటకు సమ్మతించు వారెవరైనను, అపరాధిని పట్టించి ఆ అపరాధమునకు దోషస్థాపన చేయించుటకై అన్ని పద్ధతులను తన శక్తి మేరకు ఉపయోగించిననే తప్ప, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

అభిరక్ష నుండి తప్పించుకొని పోయినట్టి లేక పట్టుకొనుడని ఉత్తరువు చేయబడి నట్టి అపరాధికి ఆశ్రయమిచ్చుట.


216. అపరాధ విషయమున దోషస్థాపితుడైన లేక ఆపరాధము ఆరోపింపబడిన ఎవరేని వ్యక్తి, ఆ అపరాధము నకై శాసనసమ్మతమైన అభిరక్షలో ఉండగా, అట్టి అభిరక్ష నుండి తప్పించుకొని పోయినపుడెల్లను,

లేక, ఒక పబ్లికు సేవకుడు, అట్టి పబ్లికు సేవకుని యొక్క శాసన సమ్మత అధికారములను వినియోగించుచు, ఫలానా వ్యక్తిని ఒక అపరాధమునకై పట్టు కొనవలసినదని ఉత్తరువు చేసినప్పుడెల్లను,

అట్లు తప్పించుకొని పోవుటను గూర్చి, లేక పట్టుకొనవలసినదను ఉత్తరువును గూర్చి, ఎరిగియుండియు, ఆ వ్యక్తి పట్టుబడకుండచేయు ఉద్దేశముతో అతనికి ఆశ్రయమిచ్చు లేక అతనిని దాచువారెవరైనను ఈ క్రింది రీతిగా శిక్షింపబడుదురు, అనగా--

అపరాధము మరణశిక్ష విధించదగినదైనచో.

ఏ అపరాధమునకై ఆ వ్యక్తి అభిరక్షలో ఉండెనో లేక ఆ వ్యక్తిని పట్టుకొవవలసినదని ఉత్తరువు చేయబడినదో ఆ అపరాధము మరణ దండనతో శిక్షింపదగినదైనచో, ఏడు సంవత్సరములదాకి ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జార్మానాకు కూడ పాత్రులగుదురు. యావజ్జీవ కారావాసముతో లేక కారావాసముతో శిక్షింపదగినదైనచో

అపరాధము యావజ్జీవ కారావాసముతొగాని, పది సంవత్సరముల వరకు కారావాసముతో గాని శిక్షింపదగినదైనచో జుర్మానాతోగాని జూర్మానా లేకుండగాని, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు;

మరియు, అపరాధము పది సంవత్సరముల వరకు కాక, ఒక సంవత్సరము దాక ఉండగల కారావాసముతో శిక్షింపదగినదైనచో, ఆ ఆపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘతమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, అట్టి ఆపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసము గలదో, ఆ రకపు కారావాసముతో గాని జర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఈ పరిచ్ఛేదములో “అపరాధము" అను పదపరిధియందు, ఏ కార్యమును చేయుట లేక చేయకుండుట విషయమున ఒక వ్యక్తి భారత దేశములో దోషియై యుండినచో ఒక ఆపరాధముగా అది శిక్షింవబడదగియుండి, ప్రత్యర్పణమునకు సంబంధించిన ఏదేని శాసనము క్రిందగాని, అన్యథాగాని భారతదేశములో అతనిని పట్టుకొని అభిరక్ష యందుంచ వలసియుండెడిదో, అది భారతదేశము వెలుపల అతడు చేసి, లేక చేయకుండి, దోషియైనాడని చెప్పబడినట్టి దేనినైనను చేయుట, లేక చేయకుండుట కూడ చేరియుండును, మరియు ఈ పరిచ్ఛేదము నిమిత్తము అట్టి ప్రతి కార్యము చేయుట, లేక చేయకుండుట నిందిత వ్యక్తి భారతదేశములో దోషియై యుండిన ఎలొ అట్లే శిక్షింపదగియుండునని భావించవలెను.

మినహాయింపు :--- పట్టుకొనబడవలసిన వ్యక్తి కి భర్త, లేక భార్య ఆశ్రయమిచ్చినట్టి లేక పట్టుకొనబడవలసిన వ్యక్తిని భర్త, లేక భార్య దాచినట్టి ఏ సందర్భమునకై నను ఈ నిబంధన విస్తరించదు.


దోపిడీ దొంగలకు లేక బందిపోటు దొంగలకు ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రి.

216-ఏ. దోపిడీని లేక బందిపోటును ఎవరేని వ్యక్తులు చేయుచున్నారని గాని ఇటీవలనే చేసినారనిగాని తెలిసి యుండియు, లేక అట్లని విశ్వసించుటకు కారణముండియు, అట్టి దోపిడీ లేక బందిపోటు చేయుటకు వీలుకలిగించు లేక వారికి గాని, వారిలో ఎవరికై నను గాని శిక్ష పడకుండా కాపాడు ఉద్దేశముతో వారికి గాని, వారిలో ఎవరికైననుగాని ఆశ్రయమిచ్చు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము:--- దోపిడీ లేక బందిపోటు చేయుటకు ఉద్దేశింపబడినది లేక చేయబడినది. భారత దేశము, లోపలనా లేక వెలుపలనా అనునది ఈ పరిచ్ఛేదము నిమిత్తము ముఖ్యము కాదు.

మినహాయింపు :-- అపరాధికి భర్త లేక భార్య ఆశ్రయమిచ్చినట్టి ఏ సందర్భమున కైనను ఈ నిబంధన విస్తరించదు.

216. బీ......

వ్యక్తికి శిక్ష పడుతుండ,ఆస్తి సమపహరణము కాకుండ, కాపాడు ఉద్దేశముతో పబ్లికు సేవకుడు శాసనాదేశమును పాటించకుండుట


217. పబ్లికు సేవకుడై యుండి, అట్టి పబ్లికు సేవకుడుగా తాను వ్యవహరించ వలసిన తీరును గూర్చిన ఏదేని శాసనాదేశమును పాటించకుండుట ద్వారా, శాసనవిహిత శిక్ష పడకుండ ఏ వ్యక్తి నైనను కాపాడవలెనను ఉద్దేశముతో, లేక తద్వారా తాను అతనిని అట్లు కాపాడగలననిగాని, అతడు పాత్రుడై యుండునట్టి శిక్ష కంటే తక్కువ శిక్షకు అతనిని లోను చేయవచ్చుననిగాని ఎరిగియుండి, లేదా శాసనానుసారముగా సమపహరణమునకుగాని, ఏదేని ప్రభారమునకు గురికావలసియున్న ఏదేని ఆస్తిని ఆ సమపహరణమునకు లేక ఆ ప్రభారమునకు గురికాకుండ కాపాడవలెనను ఉద్దేశముతో, లేక కాపాడగలనని ఎరిగియుండి బుద్ధి పూర్వకముగా ఆ శాసనాదేశమును పాటించనివారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని,ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

వ్యక్తికి శిక్ష పడకుండ లేక ఆస్తి సమపహరణము కాకుండ కాపాడు ఉద్దేశముతో సరిగా లేని రికార్డును, లేక వ్రాతను పబ్లికు 'సేవకుడు రూపొందించుట

218. పబ్లికు సేవకుడై యుండి, అట్టి పబ్లికు సేవకుడుగా ఏదేని రికార్డును లేక ఇతర వ్రాతను తయారుచేయు బాధ్యత కలిగియుండి, ఆ రికార్డును లేక వ్రాతను సరిగా రూపొందించ కుండుట ద్వారా ప్రజలకై ను, ఎవరేని, వ్యక్తి కైనను నష్టము, లేక హాని కలిగించవలెనను ఉద్దేశముతో, లేక తద్ద్వారా తాను అట్లు కలిగించగలనని ఎరిగియుండి, లేదా తద్ద్వారా ఏ వ్యక్తి కైనను శావన విహిత శిక్ష పడకుండ కాపాడవలెనను ఉద్దేశముతో, లేక తద్వారా తాను అట్లు కాపాడగలనని ఎరిగియుండి, లేదా శాసనము ద్వారా సమపహరణమునకు లేక ఇతర ప్రభారమునకు గురికావలసియున్న ఏదేవి ఆస్తిని ఆ సమపహరణమునకు లేక ప్రభారమునకు గురికాకుండ కాపాడవలెనను ఉద్దేశముతో లేక తద్దార్వా తాను అట్లు కాపాడగలనని ఎరిగియుండి, ఆ రికార్డు లేక వ్రాత సరిగా లేనిదని తెలిసియు అట్టి రీతిలో రూపొందించు. వారెవరై నను, మూడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగానీ, జూర్మానాతో గాని, ఈ రెండింటితొగాని శిక్షింపబడుదురు. వ్యాయికచర్యలో పబ్లికు సేవకుడు శాసన విరుద్ధముగా రిపోర్టు మొదలగు వాటిని అవినీతి కరముగా చేయుట

219. పబ్లికు సేవకుడై యుండి, వ్యాయిక చర్య యొక్క ఏ దశలో నైనను, శాసన విరుద్ధమైనదని తాను ఎరిగియున్నట్టి ఏదేని రిపోర్టును, ఉత్త రువుము, వివిశ్చయమును లేక నిర్ణయమును అవినీతికరముగా గాని, విద్వేష పూర్వకముగా గాని చేయు లేక ఒనగు వారెవరైనను ఏడు పంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారా వాసముతొ గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రాధికారముగల వ్యక్తి తాను శాసన విరుద్దముగా వ్యవహరించుచు ఎరిగియుండియు విచారణకు, లేక పరిశొధమునకు పంపుట.

220. వ్యక్తులను విచారణ కై గాని, పరిశొధమునకై గాని పంపుటకు, లేక పరిశోధమునందే ఉంచియుంచు తాను శాసన విరుద్ధ ప్రాధికారముగల వ్యక్తి, టకు ప్రాధికారమును తనకు ఇచ్చు ఏదేని పదవియందుండి, ఆ ప్రాధికారమును వినియోగించుటలో ఎవరేని వ్యక్తిని విచారణకై గాని పరిశొధమునందుంచుటకై గాని పంపుట ద్వారా లేక పరిశొధమునందే ఉంచియుంచుట ద్వారా తాను శాసన విరుద్ధముగా వ్యవహారించుచున్నట్లు ఎరిగియుండియు, అవినీతికరముగా గాని, విద్వేషపూర్వకముగా గాని అట్లు చేయువారెవరైవము, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఎవరినై నను పట్టుకొను భాధ్యతగల పబ్లికు సేవకుడు ఉద్దేశ పూర్వకముగా అతనిని పట్టుకొనకుండుట,

221. అపరాధము ఆరోపింపబడిన, లేక అపరాధమునకై పట్టు కొవబడవలసిన ఏ వ్యక్తి నైనను తాను పబ్లికు సేవకుడుగా పట్టు కొనుటకు గాని, పరిశొధము నందే ఉంచుటకు గాని శాసనరీత్యా బద్దుడై యున్న పబ్లికు సేవకుడై యుండి, అట్టి వ్యక్తిని ఉద్దేశపూర్వకముగా పట్టు కోనకుండు, లేక అట్టి వ్యక్తిని ఉద్దేశపూర్వకముగా అట్టి పరిశొధము నుండి తప్పించుకొనిపోవచ్చు, లేక తప్పించుకొని పోవుటలో గాని, తప్పించుకొనిపోవుటకు ప్రయత్నించుటలో గాని అట్టి వ్యక్తికి ఉద్దేశపూర్వకముగా తోడ్పడువారెవరై నను ఈ క్రింది విధముగా శిక్షింపబడుదురు; ఎటులననగా, —

పరిశొధమునందున్నట్టి వ్యక్తి పై ఆరోపింపబడిన అపరాధము గాని అతనిని పట్టు కొనబడవలసిన వానినిగా జేసిన అపరాధము గాని మరణదండనతో శిక్షింపదగినదై నచో, జుర్మానాతోగాని, జుర్మానాలేకుండగాని, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాపముతో శిక్షింపబడుదురు, లేక,

పరిశొధమునందున్నట్టి వ్యక్తి పై ఆరోపింపబడిన అపరాధముగాని, అతనిని పట్టుకొనబడవలసిన వారినిగా జేసిన అపరాధము గావి యావజ్జీవ కారావాసముతోనై నను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో నైనను, శిక్షింపదగినదైనచో, జుర్మానా తో గాని, జుర్మానాలేకుండగాని, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములతొ శిక్షింపబడుదురు, లేక

పరిశొధమునందున్నట్టి వ్యక్తి పై ఆరోపింపబడిన అపరాధము గాని అతనిని పట్టుకొనబడవలసిన వానినిగా జేసిన అపరాధముగాని పది సంవత్సరములకన్న తక్కువ కాలావధికి కారావాసముతో శిక్షింపదగినదైనచో, జుర్మానాలో గాని, జూర్మానా లేకుండగాని, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములో శిక్షింప బడుదురు.

దండనోత్త రువుకు గురియైన లేక శాసన సమ్మతముగా పరిశొధమునకు పంపబడిన వ్యక్తిని పట్టుకొను బాధ్యతగల పబ్లికు సేవకుడు ఉద్దేశపూర్వ కముగా పట్టుకొనకుండుట.

222. ఏదేని అపరాధమునకై న్యాయస్ఠానపు దండనోత్త రువుకు గురియైన వ్యక్తి నైనను లేక అభిరక్షలో ఉంచుటకై శాసనసమ్మతముగా పంపబడిన ఏ వ్యక్తి నైనను తాను పబ్లికు సేవకుడుగా పట్టు కొనుటకు గాని అందే ఉంచుటకు గాని శాసనరీత్యా బద్దుడై యున్న పబ్లికు సేవకుడై యుండి, అట్టి వ్యక్తిని ఉద్దేశపూర్వకముగా పట్టుకొన కుండు, లేక అట్టి వ్యక్తిని ఉద్దేశపూర్వకముగా అట్టి పరిశొధమునుండి తప్పించుకొనిపోనిచ్చు, లేక తప్పించుకొని పోవుటలో గాని తప్పించుకొని పోవుటకు ప్రయత్నించుటలో గాని అట్టి వ్యక్తికి ఉద్దేశపూర్వకముగా తోడ్పడు వారెవరైనను, ఈ క్రింది విధముగా శిక్షింపబడుదురు, ఎటులననగా,----

పరిశొధమునందుంనట్టి లేక పట్టు కొనబడవలసియున్నట్టి వ్యక్తి మరణ దండనోత్త రువుకు గురియై యున్నచో, జూర్మానాతో నైనను జుర్మానా లేకుండనై నను యావజ్జీవ కారావాసముతోగాని పదునాలుగు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, శిక్షింపబడుదురు, లేక

పరిశొధమునందున్నట్టి లేక పట్టుకొనబడవలసి యున్నట్టి వ్యక్తి మరణ దండనోత్త రువును బట్టి గాని, అట్టి దండనొత్త రువును లఘాకరించినందు వలన గాని యావజ్జీవ కారావాసమునకైనను, పది సంవత్సరముల లేక అంతకు మించిన కాలావధికి కారావాసమున కైనను లోనై యున్నచో, జుర్మానాతోగాని జుర్మానా లేకుండగాని, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, లేక

పరిశొధమునందున్నట్టి, లేక పట్టు కొనబడవలసియున్నట్టి వ్యక్తి న్యాయస్థానపు దండనోత్త రువును బట్టి పది సంవత్సరములదాక ఉండని కాలావధికి కారావాసమునకు లోనై యున్నచో, లేక ఆ వ్యక్తి అభిరక్ష యందుంచబడుటకై , శాసన సమ్మతముగా పంపబడి యుండిన చో మూడు సంవత్సరములదాక ఉండగల కాలావదికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పబ్లికు 'సేవకుడు తన నిర్లక్ష్యమువల్ల,పరిశొధమునుండి గాని, అభిరక్షనుండి గాని, తప్పించుకొని పోనిచ్చుట.

223. ఏదేని అపరాధ విషయమున ఆరోపణకు గురియైన, లేక దోష, స్థాపితుడైన, లేక ఆభిరక్షలో ఉంచబడుటకై శాసన సమ్మతముగా పంపబడిన ఏ వ్యక్తి నైనను, పరిశొధమునందే ఉంచుటకు పబ్లికు 'సేవకుడుగా . శాసన రీత్యా బద్దుడై యున్న పబ్లికు సేవకుడై యుండి అట్టి వ్యక్తిని నిర్లక్ష్యముతొ పరిశొధము నుండి తప్పించుకొని పోనిచ్చువారెవరైనను, రెండు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానాతొ గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఒక వ్యక్తి శాసనానుసారముగా పట్టుబడవలసియుండి పట్టుబడకుండుటకై ప్రతిఘటించుట లేక ఆటంకపరచుట,

224. తనపై ఆరోపింపబడిన లేక తాను దోష స్టాపితుడైన ఏదేని అపరాధమునకై శాసనానుసారముగాతాను పట్టు బడవలసియుండి పట్టు కొనబడకుండుటకై ఉద్దేశపూర్వకముగా ప్రతిఘటనముగాని, శాసనవిరుద్ధమైన ఆటంకమునుగాని కలిగించు లేక ఏదేని అట్టి ఆపరాధమునకై శాసనసమ్మతముగా తాను నిరోధములో ఉంచబడినట్టి ఏదేని అభిరక్ష నుండి తప్పించుకొనిపోవు లేక తప్పించుకొని పోపుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు,

విశదీకరణము : - పట్టు కొనబడవలసిన వ్యక్తి లేక అభిరక్షలో ఉంచబడవలసిన వ్యక్తి తన పై ఆరోపింపబడిన లేక తాను దోష స్ఠాపితుడైన అపరాధమునకు లోనై యుండు శిక్షకు ఈ పరిచ్ఛేదములోని, శిక్ష అదనముగా ఉండును.

శాసవానుసారముగా పట్టుబడ వలసియున్న ఇతర వ్యక్తి పట్టు బడకుండుటకై ప్రతిఘటించుట లేక ఆటంకపరుచుట.

225. ఎవరైనను ఒక అపరాధమునకై శాసనానుసారముగా పట్టు బడవలసియున్న ఏ ఇతర వ్యక్తి యైనను పట్టుబడకుండుటకై ఉద్దేశపూర్వకముగా ప్రతిఘటనముగాని, శాసన విరుద్ధమైన ఆటంకమునుగాని కలి గించుచో, లేక ఏ ఇతర వ్యక్తి నైనను ఆ వ్యక్తి ఏదేని అట్టి అపరాధమునకై శాసన సమ్మతముగా నిరోధములో ఉంచబడినట్టి ఏదేని అభిరక్ష నుండి ఉద్దేశపూర్వకముగా తప్పించుచో లేక తప్పించుటకు ప్రయత్నించుచో, అతడు రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడును;

లేక, ఏ వ్యక్తిని పట్టుకొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట, లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదో ఆ వ్యక్తి యావజ్జీవ కారావాసముతోనై నను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతోనై నను శిక్షింపబడదగిన అపరాధము విషయమున ఆరోపణమునకు గురియై లేక పట్టుకొనబడవలసినవాడై ఉన్న చో, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును; మరియు జూర్మానాకు కూడ పాత్రుడగును;

లేక, ఏ వ్యక్తిని పట్టు కొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట, లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదొ ఆ వ్యక్తి మరణదండనతో శిక్షింపబడదగిన ఆసరాధము విషయమున ఆరోపణమునకు గురియై లేక పట్టు కొనబడనలసినవాడై, ఉన్నచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును, మరియు జూర్మానాకు కూడ పాత్రుడగును;

లేక, ఏ వ్యక్తిని పట్టు కొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదో ఆ వ్యక్తి న్యాయస్థానపు దండనోత్త రువును బట్టి గాని అట్టి దండనోత్త రువును లఘాకరించినందువలనగాని, యావజ్జీవ కారావాసమునకైనను, పది సంవత్సరముల లేక అంతకు మించిన కాలావధికి కారావాసమునకై నను లోనై యున్నచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును;


లేక, ఏ వ్యక్తిని పట్టుకొనవలెనో, లేక ఏ వ్యక్తిని తప్పించుట లేక తప్పించుటకు ప్రయత్నించుట జరిగినదో ఆ వ్యక్తి మరణ దండనోత్త రుపుకు గురియై ఉన్న చో యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును

అన్యధా నిబంధనలు చేయబడని సందర్భము లలో పబ్లికు సేవకుడు ఎవరినైనా పట్టుకోనకుండుట లేక తప్పించు కొని పోనిచ్చుట.

225-5. 221వ పరిచ్ఛేదము, 222వ పరిచ్ఛేదము, 'లేక 223న పరిచ్ఛేదములో గాని, తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో గాని నిబంధనలు చేయబడని ఏ సందర్భములో నైనను ఏ వ్యక్తి నై నను పట్టు కొనుటకు, లేక పరిశొధమునందే ఉంచి ఉంచుటకు పబ్లికు సేవకుడుగా శాసవరీత్యా బద్దుడై యున్న పబ్లికు సేవకుడై యుండి ఆ వ్యక్తిని పట్టు కొనకుండు, లేక పరిశొధమునుండి అతనిని తప్పించుకొని పోనిచ్చు వారెవరై నను (ఏ) ఉద్దేశపూర్వకముగా అట్లు చేసిన చో, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాలోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు, మరియు

(బీ) నిర్లక్ష్యముతో అట్లు చేసిన చో, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, లేక జుర్మానాతోగాని ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

అన్యధా నిబంధనలు చేయబడని సందర్భములలో శాసనాను సారముగా పట్టుబడ వలసి వుండి పట్టు బడకుండుటకై ప్రతిఘటించుట లేక ఆటంకపరచుట లేక తప్పించుకొని పోవుట, లేక తప్పించుట.


225- బీ. 224వ పరిచ్ఛేదములో గాని 225వ పరిచ్ఛేదములో గాని తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో గాని నిబంధనలు చేయబడని ఏ సందర్భములోనైనను తానై నను ఎవరేని ఇతర వ్యక్తి యైనను శాసనాను సారముగా పట్టు బడవలసియుండగా పట్టు బడకుండుటకు ఉద్దేశపూర్వకముగా ప్రతిఘటించు లేక శాసన విరుద్ధ మైన ఆటంకమును కలిగించు, లేక తాను శాసన సమ్మతముగా ఉంచబడిన ఏదేని అభిరక్ష నుండి తప్పించుకొని పోవు, లేక తప్పించుకొనిపోవుటకు ప్రయత్నించు, లేక ఏ ఇతర వ్యక్తి నైనను ఆ వ్యక్తి, శాసన సమ్మతముగా ఉంచబడినట్టి ఏదేని అభిరక్ష నుండి తప్పించు లేక తప్పించుటకు ప్రయత్నించు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు,

226. * * *

శిక్ష పరిహరింపు షరతును ఉల్లంఘించుట.

227. ఏదేని షరతు పూర్వకమైన శిక్ష పరిహరింపును అంగీకరించి, ఏ షరతు పై అట్టి పరిహరింపు మంజూరు శిక్ష పరిహరింపు చేయబడినదో ఆ షరతు ఉన్నదని ఎరిగియుండియు ఆ షరతును అతిక్రమించు వారెవరైనను ఆ శిక్షలో కొంత భాగమును ఆదివరకే అతడు అనుభవించియుండని చో, ఆదిలి అతనికి ఏ శిక్ష విధింపబడినదో ఆ శిక్ష తోను, ఆ శిక్ష లో అతడు కొంత భాగమును అనుభవించియుండినచో అనుభవించక మిగిలియున్న శిక్ష తోను, శిక్షింపబడుదురు.

న్యాయిక చర్యను నిర్వహించుచున్న పబ్లికు సేవకునకు ఉద్దేశపూర్వకముగా అవమానము, లేక అంతరాయము కలిగించుట,

228. ఏ పబ్లికు సేవకుడై నను ఒక న్యాయిక చర్యను ఏ దశలోనై నను నిర్వహించుచుండగా, ఉద్దేశపూర్వకముగా అట్టి పబ్లికు సేవకుని ఏదేని అవమానమునకు గురిచేయు, లేక అతనికి ఏదేని ఆంతరాయమును కలుగజేయు నిర్వహించుచున్న వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

కొన్ని అపరాధములకు గురియైన బాధిత వ్యక్తి. ఫలాన అని వెల్లడించుట మొదలగునవి.

228- ఏ. (1) పరిచ్ఛేదములు 376, 376-ఏ, 376- బీ, 376-సీ లేక 376- డీ క్రింద అపరాధము నకు గురి అయినట్లుగా చెప్పబడిన లేక నిశ్చయింపబడిన వ్యక్తి ( ఈ పరిచ్ఛేదములో ఇటు పిమ్మట బాధితవ్యక్తి యని నిర్దేశింపబడిన వ్యక్తి), ఫలాన అని తెలియజేయు నట్లు పేరునుగాని, ఏదేని విషయమును గాని ముద్రించు లేక ప్రచురించు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసములో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

(2) బాధిత వ్యక్తి ఫలాన అని తెలియజేయగల ఏదేని పేరును లేక ఏదేని విషయమును ముద్రించుటగాని, ప్రచురించుట గాని-- మొదలగునవి.

(ఏ) పోలీసు స్టేషను బాధ్యతగల అధికారి అయినను అట్టి అపరాధమును గూర్చి దర్యాప్తు జరుపుచున్న పోలీసు అధికారి అయినను ( అట్టి దర్యాప్తు నిమిత్త మై) సద్భావముతో ఇచ్చిన వ్రాతమూలకమైన ఉత్త రువు ననుసరించి లేదా అట్టి ఉత్త రువు క్రింద జరిగినచో, లేక (బి) బాధిత వ్యక్తి వ్రాత మూలకవ.9గ ఇచ్చిన ప్రాధికారము ననుసరించి లేదా అట్టి ప్రాధికారముతో జరిగిన చో, లేక యెడల

(పీ) బాధిత వ్యక్తి మరణించిన యెడల, లేక పై సరైన యెడల, లేక మతి స్తి వితము లేనిదైన ఆ బాధిత వ్యక్తి యొక్క సమీప రక్త బంధువులు ఇచ్చిన వ్రాతమూలకమైన ప్రాధికారము నను సరించి లేదా ఆట్టి ప్రాధికారముతో జరిగిన చో :

అయితే, ఆ సమీప రక్త బంధువులు గుర్తింపు పొందిన సంక్షేను పంస్థ లేక వ్యవస్థ యొక్క ( ఏ పేరుతో పిలువబడునప్పటికిని) అధ్యక్షుడు లేక కార్యదర్శి కానట్టి ఏ వ్యక్తి కైనను అట్టి ప్రాధికారము ఈయరాదు--

అట్టి ముద్రణమునకు లేక ప్రచురణమునకు ఉపపరిచ్ఛేదము (1)లోని దేదియు విస్త రించదు. విశదీకరణము :-- ఈ ఉపపరిచ్ఛేదము నిమిత్తము ″గుర్తింపు పొందిన సంక్షేమ సంస్థ లేక వ్యవస్ఠ ″ అనగా కేంద్ర లేక రాజ్య ప్రభుత్వముచే ఈ విషయమున గుర్తించబడిన సాంఘిక సంక్షేమ సంస్థ లేక వ్యవస్థ అని అర్ఢము.

(3) ఉపపరిచ్ఛేదము (1)లో నిర్దేశింపబడిన ఆపరాధము విషయమున, న్యాయస్థాన సమక్షమున జరుగు ఏదేని చర్యకు సంబంధించిన విషయమును దేనినైనను ఆ న్యాయస్థానపు పూర్వానుజ్ఞ లేకుండనే ముద్రించు లేక ప్రచురించు వారెవరై నను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకవు కారావాసముతో శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-- ఏదేని ఉన్నత న్యాయస్థానము యొక్క లేక సర్వోన్నత న్యాయస్థానము యొక్క తీర్పును ముద్రించుట లేక ప్రచురించుట ఈ పరిచ్ఛేదపు భావములో అపరాధము కాదు.

జ్యూరరుగా లేక ఆ పెసరుగా ప్రతి రూపణము చేయుట.

229. ఏదేని సందర్భములో తాను జ్యూరరుగాగాని, అసెసరుగా గాని రిటర్నులో, లేక పానెలులో చేర్చబడుటకు లేక ప్రమాణము చేయింపబడుటకు తనకు శాసన ప్రకారము హక్కు లేదని తెలిసియుండి, ప్రతిరూపణము ద్వారాగాని, అన్యథాగాని, ఆ సందర్భములో తాను అట్లు రిటర్నులో లేక పానెలులో చేర్చబడునట్లు, లేక ప్రమాణము చేయింప బడునట్లు ఉద్దేశపూర్వకముగా చేయించు, లేక తెలిసియుండియు అట్లు చేయించుకొను, లేక శాసన విరుద్ధముగా తాను ఆట్లు రిటర్నులో లేక పొనెలులో చేర్చబడినట్లు, లేక ప్రమాణము చేయింపబడినట్లు తెలిసి యుండియు అట్టి జ్యూరరుగా గాని, అట్టి అసెసరుగా గాని స్వచ్ఛందముగా సేవ చేయువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అధ్యాయము -12

నాణెములకు, ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన అపరాధములను గురించి

"నాణెము "నకు నిర్వచనము.

230. నాణెము అనగా డబ్బగా చెలామణి అగుటకు గాను ఏదేని ఒక రాజ్య ప్రాధికారము లేక సార్వభౌమాధి కారము క్రింద ముద్రవేయబడి, జారీచేయబడి, తత్సమయమున డబ్బుగా చెలామణియగుచున్న లోహము.

భారతీయ నాణెము.

భారతీయ నాణేము అనగా డబ్బుగా చెలామణి అగుటకుగాను భారత ప్రభుత్వ ప్రాధికారము ద్వారా ముద్ర వేయబడి, జారీచేయబడిన లోహము, మరియు అట్లు ముద్ర వేయబడి, జారీ చేయబడినట్టి లోహము డబ్బుగా చెలామణిలో లేకుండా పోయినప్పటికిని ఈ అధ్యాయము నిమిత్తము భారతీయ నాణెముగ కొనసాగు చుండును.

(ఎ) కౌరీలు నాణెములు కావు: (బి) ముద్ర వేయబడని రాగి తునకలు డబ్బుగా చెలామణియై నను వాములు కావు : (సీ) పతకములు డబ్బుగా చెలామణియగుటకు ఉద్దేశింపబడినవి కానందున నాణెములు కావు : (డీ) కం పెనీవారి రూపాలు అని అనబడు నాణెము భారతీయ వాణేము. (ఈ) భారత ప్రభుత్వ ప్రాధికారము క్రింద పూర్వము డబ్బుగా చెలామణియై నట్టి “ఫరుఖాబాదు" రూపాయి.. ఇప్పుడు అట్లు చెలామణిలో లేకపోయినను, భారతీయ నాణెముగా నుండును.

నకిలీ నాణెములను చేయుట.

231. నకిలీ నాణెములను చేయువారు ఎవరైనను తెలిసియుండియు నకీలీ నాణెములను చేయు ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరై నను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి, రెంటిలో ఒక రకపు కారావాసము తో శిక్షింప బడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-- మోసగించు ఉద్దేశముతో లేక తద్వారా మోసగింపబడుట జరుగగలదని తెలిసియుండియు అసలైన నాణెములు వేరు రకపు నాణెముగా కనిపించునట్లు చేయు వ్యక్తి ఈ అపరాధ రుసు చేసినవాడగును.

నకిలీదగు భారతీయ నాణెములను చేయుట

232. నకిలీ దగు భారతీయ నాణెమును చేయువారెవరైనను, లేక తెలిసియుండియు అట్టి నాణెములను చేయు: ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు. నకిలీ నాణెములను చేయుటకై ఉపకరణములను తయారు చేయుట లేక విక్రయించుట.


233. నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగింపబడు విమిత్త మై గాని అట్లు ఉపయోగించబడుటకు ఉద్దే శించబడినదని ఎరిగియుండియు, లేదా అట్లని విశ్వసించుటకు కారణముండియు గాని ఏదేని అచ్చుదిమ్మెనై నను ఉపకరణము నైనను తయారుచేయు, లేక మలుచు, లేక తయారు చేయునట్టి లేదా మలుచునట్టి ప్రక్రియలో ఏదేనిభాగమును నిర్వర్తించు లేక కొనుగోలుచేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ భారతీయ నాణేములను చేయుటకై ఉపకరణమును చేయుట లేక విక్రయించుట,

234. నకిలీవగు భారతీయ నాణేములను చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని అట్లు ఉపయోగింప బడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండియు, లేక అట్లని విశ్వసించుటకు కారణముండియు గాని, ఏదేని అచ్చు దిమ్మెనై నను, ఉపకరణము నైనను తయారుచేయు, లేక మలుచు, లేక తయారుచేయు నట్టి లేక మలుచునట్టి ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు లేక కొనుగోలు చేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరై నన ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగించు నిమిత్తము ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనము నందుంచు కొనుట.

235. నకిలీ నాణెములను చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని అట్లు ఉపయోగింపబడుటకుద్దేశింప బడినదని ఎరిగియుండియు లేక అట్లని విశ్వసించుటకు కారణముండియుగాని, ఏదేని ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనము నందుంచుకొను వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

భారతీయ నాణెమైనచో:

మరియు, నకిలీ చేయబడెడు వాణెము భారతీయ నాణెమైనచో, పది సంవత్సరములదాక ఉండగల :కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

భారతదేశము వెలుపల నకిలీనాణెములను చేయుటకై భారతదేశములో దుష్ఫేరణము.


236. భారతదేశములో ఉండి, భారత దేశము వెలుపల నకిలీనాణెములను చేయుటకు దుష్ఫేరణము చేయు వారెవరైనను భారతదేశములో అట్టి నాణెములను చేయుటకై దుష్ఫేరణము చేసియుండిన ఎట్లొ అదే రీతిగా శిక్షింప బడుదురు.

నకిలీ నాణెముల దిగుమతి లేక ఎగుమతి

237. ఏదేని నకిలీ నాణెమును, నకిలీదని ఎరిగియుండియు, లేక ఆట్టి డని విశ్వసించుటకు కారణముండియు భారత దేశములోనికి దిగుమతిచేయు, లేక ఆచటినుండి ఎగుమతిచేయు వారెవరైనను, మూడు సంవత్సరములగాక ఉండగల కాలాధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ భారతీయ నాణెముల దిగుమతి లేక ఎగుమతి

238. నకిలీదగు భారతీయ నాణెమని తాను ఎరిగియున్నట్టి, లేక అట్టిదని తాను విశ్వసించుటకు కారణమున్నట్టి ఏదైనా నకిలీ నాణెమును భారతదేశము లోనికి దిగుమతిచేయు, లేక అచటి నుండి ఎగుమతి చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీదని ఎరిగి యుండిన నాణేమును అందజేయుట.

239. . ఉన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణేమని తాను ఎరిగియున్నట్టి ఏదైనా నాణెమును వద్ద ఉంచుకొనియుండి, కపటముతో గాని కపటమునకు గురిచేయువలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్యక్తి కై నను దానిని ఆందజేయు లేక ఏ వ్యక్తి నై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీదని ఎరిగియుండిన భారతీయ నాణెమును అందజేయుట.

240.తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణేమని తాను ఎరిగియున్నట్టి ఏదైనా నకిలీ భారతీయ నాణెమును వద్ద ఉంచుకొనియుండి, కపటముతో గాని కపటమునకు గురిచేయవలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్యక్తి కై నను దానిని అందజేయు, లేక ఏ వ్యక్తి నై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరై నను పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసఘుతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. ప్రథమముగా తన స్వాధీనమునకు వచ్చినప్పుడు నకిలీదని అందజేయువానికి తెలియక నాణెమును, అసలైన నాణెముగా అందజేయుట.

241. నకిలీ నాణెమని తాసు ఎరిగియున్నట్టి దైనను ఆది తన స్వాధీనమునకు వచ్చినప్పుడు నకిలీదని తాను ఎరగనట్టి నకిలీ నాణేమును దేనినై నను ఏ ఇతర వ్యక్తి నైనను అసలైన నాణెముగా పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, నకిలీ నాణేపు విలువకు పదిరెట్ల దాక ఉండగల మొత్తమునకు జార్మానాతో గాని, ఈ రెండింటితొగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

నకిలీ నాణెములను చేయు 'ఏ ' అనునతడు తన సహాపరాధియైన 'బీ' కి కంపెనీ వారి రూపాయలను పోలిన నకిలీ రూపాయలను చెలామణి చేయునిమిత్తము అందజేయును. 'బీ' ఆ రూపాయలను నకిలీ నాణెములను చెలామణిజేయు మరొకవ్యక్తి యైన 'సీ' కి విక్రయించును. అవి నకిలీ వని ఎరిగియుండియు ఆతడు వాటిని కొనును.ఆ రూపాయలను 'సీ' అవి నకిలీవని తెలియనట్టి 'డీ'కి సరుకులకై చెల్లించును. 'డీ' ఆ రూపాయలను పుచ్చుకొనిన పిమ్మట అవి నకిలీవని కనుగొని అవి మంచి రూపాయలైనట్లే వాటిని ఇతరత్రా చెల్లించును . ఇచట ' బీ 'మరియు ' సీ', 239వ లేక సందర్భానుసారముగ, 240వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగియుందురు. కాని ' డీ 'ఈ పరిచ్ఛేదము క్రింద మాత్రమే శిక్షింపబడును.

తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణెమని ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనమందుంచుకొనుట.

242. . తన స్వాధీనమునకు వచ్చినప్పుడే నకిలీ నాణెమని తాను ఎరిగి యుండియు, కపటముతో గాని కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశములో గాని, అట్టి నాణెమును స్వాధీనము నందుంచుకొనిన వారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

తన స్వాధీనమునకు చ్చినప్పుడే భారతీయనాణెమునకు నకిలీదగు నా ణెమని ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనమందుంచుకొనుట.

243. తన స్వాధీ నమునకు వచ్చినప్పుడే భారతీయ నాణెమునకు నకిలీదగు నాణెమని ఎరిగియుండి, కపటముతోగాని, కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశముతో గాని, అట్టి నాణెమును స్వాధీనమందుంచుకొనువారెవరై నను,ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

టంకసాలలోని ఉద్యోగి శాసన నియతమైన తూకమునకు లేక మిశ్రమమునకు భిన్నమైన నాణెమును తయారు చేయుట.

244. శాసనసమ్మతముగా భారత దేశములో స్థాపింపబడిన ఏదైనా టంకసాలలో ఉద్యోగియై యుండి ఆ టంకసాలనుండి విడుదల చేయబడు ఏదేని నాణెమును శాసన నియతమైన తూకమునకు, మిశ్రమమునకు, భిన్నమైన తూకముతో, లేక మిశ్రమముతో చేయు ఉద్దేశముతో ఏదేని కార్యమును చేయు లేక చేయుటకు శాసనరీత్యా బద్దుడై యున్న కార్యము చేయకుండు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నాణెములను తయారుచేయు ఉపకరణమును శాసన విరుద్ధముగా టంకసాలనుండి తీసికొని పోవుట.

245. శాసన సమ్మతముగా భారతదేశములో స్థాపింపబడిన ఏదైనా టంకసాలనుండి, నాణెములను చేయు ఏదైనా పనిముట్టును, లేక ఉపకరణమును శాసన సమ్మత ప్రాధికారము లేకుండ తీసికొనిపోపు వారెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కపటముతోనైనను, నిజాయితి లేకుండా అయినను నాణేపు తూకమును తగ్గించుట లేక మిశ్రమమును మార్చుట.

246. ఏదైనా నాణెము పై , దాని తూకమును తగ్గించునట్లు, లేక ఆందలి మిశ్రమముము మార్చునట్లు దేనినైనను కపటముతో గాని, నిజాయితీ లేకుండ గాని చేయువారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింప బడుదురు మరియు జార్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :— నాణెమును తొలిచి ఏర్పడిన ఖాళీలో ఏదైన ఇతర వస్తువును నింపునట్టి వ్యక్తి నాణెపు మిశ్రమమును మార్చిన వాడగును.

కపటము తోనైనను నిజాయితీ లేకుండా అయినను, భారతీయ నాణెపు తూకమును తగ్గించుట, లేక అందలి మిశ్రమమును మార్చుట.

247. ఏదైనా భారతీయ నాణెము పై దాని తూకమును తగ్గించునట్లు లేక, ఆందలి మిశ్రమమును మార్చునట్లు దేనినైనను కపటముతో గాని, నిజాయితీ లేకుండ గాని చేయు వారెవరైనము, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, ఒక నాణెము వేరే రకపు నాణెముగా చెలామణి కావలెనను ఉద్దేశముతో దాని రూపమును మార్చుట.

248. ఏదైనా నాణేము వేరే, నాణెముగా చెలామణి కావలెనను ఉద్దేశముతో దాని రూపమును మార్చునట్టుగా ఆ నాణెము పై ఏదైనను చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

భారతీయ నాణెము వేరేరకమునకు చెందిన నాణెముగ చెలామణి కావలెనను ఉద్దేశముతో దాని రూపమును మార్చుట.

249. ఏదేని భారతీయ నాణేము వేరే రకమునకు చెందిన నాణెముగా చెలామణి కావలెనను ఉద్దేశముతో, దాని రూపమును మార్చునట్లుగా ఆ నాణెము పై ఏదైనను చేయు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మార్చబడినదని ఎరిగియుండి స్వాధీనము నందుంచుకొన్నట్టి నాణెమును అందజేయుట

250. 246వ లేక 248వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరిగినదో ఆ నాణెమును స్వాధీనము నందుంచుకొని, అట్టి నాణెమునకు సంబంధించి అట్టి అపరాధము జరిగినదని తన స్వాధీనములోనికి ఆ నాణెము వచ్చినపుడు ఎరిగియుండి, కపటముతోనైనను, కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశముతోనై నను ఇతర వ్యక్తి కి ఎవరికైనను అట్టి నాణెమును అందజేయు, లేక ఇతర వ్యక్తి నెవరినై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మార్చిబడినదని ఎరిగియుండి స్వాధీనము నందుంచుకొన్నట్టి భారతీయ నాణెమును అందజేయుట.

251. 247వ లేక 249వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరిగినదో ఆ నాణెమును స్వాధీనము నందుంచుకొని, అట్టి నాణెమునకు సంబంధించి అట్టి అపరాధము జరిగినదని తన స్వాధీనము లోనికి ఆ నాణెము వచ్చినప్పుడు ఎరిగియుండి, కపటముతోనైనను, కపటమునకు గురిచేయ వచ్చునను ఉద్దేశము తోనై నను ఇతర వ్యక్తి కెవరికై నను అట్టి నాణెమును అందజేయు, లేక ఇతర వ్యక్తి నెవరినై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నాణెము మార్పుచేయబడినదని తన స్వాధీనమునకు వచ్చినప్పుడు ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనము నందుంచుకొనుట.

252. 246వ లేక 248వ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరుపబడినదో ఆ నాణెమును దానికి సంబంధించి అట్టి అపరాధము జరిగినదని తన స్వాధీనమునకు వచ్చినపుడు ఎరిగి యుండియు), కపటముతోనై నను కపటమునకు గురిచేయ వచ్చునసు ఉద్దేశముతోనైనను, అట్టి నాణెముసు స్వాధీనము నందుంచుకొన్న వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

భారతీయ నాణెము మార్పు చేయబడినదని తన స్వాధీనమునకువచ్చినపుడు, ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనము నందుంచుకొనుట.

253. 247వ లేక 249వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరుపబడినదో ఆ నాణెములు దానికి సంబంధించి అట్టి ఆపరాధము జరిగినదని తన స్వాధీనమునకు వచ్చినపుడు ఎరిగి యుండియు, కపటముతోనైనను, కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశముతోనై నను, అట్టి నాణెమును, స్వాధీనమునందుంచుకొన్న వారెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ప్రప్రథమముగా తన స్వాధీనమునకు వచ్చినప్పుడు మార్పుచేయుబడినదని ఆందచేయువానికి తెలియక నాణెమును అసలైన నాణెముగా అందజేయుట.

254. పరిచ్ఛేదము 246, 247, 248 లేక 249 లో పేర్కొనబడినట్టి దేదైనను ఏదైనా నాణెమునకు సంబంధించి చేయబడినదని తాను ఎరిగియు, అట్లు చేయబడినదని అది. తన స్వాధీనమునకు వచ్చినపుడే ఎరుగక ఆ నాణెమును ఏ ఇతర వ్యక్తి కై నను అసలైన నాణెముగా లేక అది ఉన్న రకపుదిగాగాక వేరే రకపు నాణెముగా అందజేయు లేక ఆసలైన నాణెముగానో, అది ఉన్న రకపుదిగా గాక వేరే రకపు నాణెముగానో ఏ వ్యక్తి యై నను పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో, లేక మార్పుచేయబడిన నాణెము ఏ రకపు నాణెముగా చెలామణి చేయబడినదో లేక చెలామణి అగుటకు ప్రయత్నింప బడినదో ఆ విలువకు పది రెట్ల దాక ఉండగల మొత్తమునకు జుర్మానాతో శిక్షింపబడుదురు.

ప్రభుత్వ స్టాంపులను నకిలీగా చేయుట.

255. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును నకిలీగా చేయు లేక నకిలీగా చేయు ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరైనను యావజీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. విశదీకరణము :- ఒక విలువగల ఆసలైన స్టాంపును వేరే విలువగల ఆనలైన స్టాంపుగా కాన్నించునట్లు చేసి నకిలీ దానిని చేయు వ్యక్తి ఈ అపరాధమును చేసినవాడగును.

ప్రభుత్వ స్టాంపును నకిలీగా చేయుటకై ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనము నందుంచుకొనుట.

256. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును నకిలీగా చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని, ఉపయోగింపబడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండియు, లేక ఆట్ల ని విశ్వసించుటకు కారణముండియు గాని, ఏదేని ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనమునందుంచుకొను వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ప్రభుత్వ స్టాంపును నకిలీగా చేయు ఉపకరణమును తయారుచేయుట లేక విక్రయించుట.

257. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును నకిలీగా చేయుటకుపయోగింపబడు నిమిత్తమై గాని, అట్లు ఉపయోగింపబడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండి లేక అట్లని విశ్వసించుటకు కారణముండి గాని, ఏదేని ఉపకరణమును తయారు చేయు లేక తయారు చేయునట్టి ప్రక్రియలో ఏదేని భాగము నిర్వర్తించు, లేక కొనుగోలు చేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ ప్రభుత్వస్టాంపును విక్రయించుట

258. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేసి స్టాంపును పోలిన నకిలీ స్టాంపని తాను ఎరిగియున్నట్టి లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఏదేని స్టాంపును వికలుంచు లేక విక్రయింపజూపు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు.

నకిలీ ప్రభుత్వస్టాంపును స్వాధీనమునందుంచుకొనుట

259. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును పోలిన నకిలీ స్టాంపని తాను ఎరిగియున్నట్టి.ఏదేని స్టాంపును, అసలైన స్టాంపుగా ఉపయోగించు, లేక వ్యయనము చేయు ఉద్దేశముతో గాని, అసలైన స్టాంపుగా ఉపయోగింపబడుటకు గాని తన స్వాధీనము నందుంచుకొను వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీదని ఎరిగియుండి ప్రభుత్వ స్టాంపును అసలైన దానివలె ఉపయోగించుట

260.ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును పోలిన నకిలీ స్టాంపని ఎరిగియుండి, దానిని అసలైన స్టాంపుగా ఉపయోగించు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతో ప్రభుత్వ స్టాంపుగల పదార్థముపై వున్న వ్రాతను తుడిచవేయుట లేక దస్తావేజు కొరకై ఉపయోగింపబడిన స్టాంపును దానినుండి తొలగించుట.

261. ప్రభుత్వము రెవెన్యూ కోరకు జారీచేసిన స్టాంపుగల ఏదేని పదార్ధము నుండి కపటముతోగాని, ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్రాత లేక దస్తావేజు కొరకై అట్టి స్టాంపు ఉపయోగింపబడినదో, ఆ వ్రాతను తుడిచివేయు లేక దస్తా వేజు నుండి ఆస్టాంపును తొలగించు వారెవరై నను, ఏదేని వ్రాత లేక దస్తావేజు కొరకు ఉపయోగింప బడిన స్టాంపును వేరొక వ్రాత లేక దస్తా వేజు కొరకు ఉపయోగించుటకై అట్టి వ్రాత లేక దస్తావేజు నుండి ఆ స్టాంపును తొలగించు వారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ముందే ఉపయోగింపబడినదని ఎరిగియున్న ప్రభుత్వ స్టాంపును ఉపయోగించుట.

262. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన స్టాంపును ఆది ముందే ఉపయోగింపబడినదని ఎరిగియు, కపటముతో గాని, ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతో గాని దేని కొరకైనను మరల ఉపయోగించు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

స్టాంపు ఉపయోగింపబడినదని తెలియజేయు గుర్తును తుడిచివేయుట.

263. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన స్టాంపు నుండి అట్టి స్టాంపు ఉపయోగింపబడినదని తెలియజేయుటకు దాని పై వేయబడిన లేక ముద్రింపబడిన ఏదేని గుర్తును, కపటముతో గాని, ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతోగాని, తుడిచివేయు లేక తొలగించు వారెవరైనను, అట్టి గుర్తు తుడిచివేయబడినట్టి దని లేక తొలగింపబడినట్టిదని ఎరిగి యుండియు, అట్టి ఏదేని స్టాంపును స్వాధీనమునందుంచుకొను, లేక విక్రయించు, లేక వ్యయనము చేయు వారెవరైనను, ఉపయోగింపబడినదని తాను ఎరిగియున్నట్టి ఏదేని అట్టి స్టాంపును విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి, ఈ రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు. కృత్రిమ స్టాంపుల నిషేధము.


263-ఏ. (1) (ఏ) ఏదేని కృత్రిమ స్టాంపును తయారు చేయు, ఆట్టిదని ఎరిగియుండియు చెలామణిచేయు, దానితో వ్యాపారము నడుపు, విక్రయించు లేక ఏదేని కృత్రిను స్టాంపును అట్టిదని ఎరిగియు తపాలా నిమిత్తమై ఉపయోగించు వారెవరైనను, లేక

(బి) ఏదేని కృత్రిమ స్టాంపును, శాసన సమ్మత హేతువు లేకుండ, తన స్వాధీనములో ఉంచుకొను వారెవరైనను, లేక

(సీ) కృత్రిమ స్టాంపును దేనినైనను తయారు చేయుటకై ఏదేని అచ్చుదిమ్మె, ప్లేటు, ఉపకరణము లేక సామాగ్రిని తయారు చేయు లేక శాసన సమ్మత హేతువు లేకుండ వాటిని తన స్వాధీనము నందుంచుకొను వారెవరైనను,

రెండువందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

(2) ఎవరేని వ్యక్తి యొక్క స్వాధీనమునందున్న ఏదేని అట్టి స్టాంపును, కృత్రిము స్టాంపును దేనినైనను తయారుచేయుటకై ఆతని స్వాధీనమందున్న అచ్చు దిమ్మెను, ప్లేటును, ఉపకరణమును లేక సామాగ్రి అభి గ్రహించవచ్చును, మరియు, అభిగ్రహించినచో సమపహరణము చేయవలెను,

(3) ఈ పరిచ్ఛేదములో, “కృత్రిమ స్టాంపు" అనగా, తపాలా రేటును తెలుపుటకు గాను ప్రభుత్వము జారీచేసిన దను తప్పుడు తాత్పర్యము నిచ్చు ఏదేని స్టాంపును, లేక తపాలా రేటును తెలుపుటకుగాను ప్రభుత్వము జారీ చేసిన ఏదేని స్టాంపు విషయమున కాగితము పై గాని, అన్యధా గాని చేయబడిన తుల్యరూపణము, అనుకరణము, లేక రూపకల్పనము అని అర్థము.

(4) ఈ పరిచ్ఛేదములోను 255 నుండి 263 వరకుగల ( రెంటిని కలుపుకొని ) పరిచ్ఛేడములలోను, తపాలా రేటును TE :యు నివి: తము జారీ చేయబడిన ఏదేని స్టాంపుకు సంబంధించి గాని, దానిని నిర్దేశించిగాని “ప్రభుత్వము" అను పదము ఉపయోగింపబడినపుడు, 17వ పరిచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికిని, భారత దేశమునందలి ఏ భాగము లోనై వను, మరియు హర్ మెజెస్టీ యొక్క డొమినియన్లలో ఏ భాగములోనైనను, ఏ విదేశములోనైనను, ప్రభుత్వ కార్బహి లవమును నిర్వహించుటకు శాసనము ద్వారా ప్రాధికారము పొందిన వ్యక్తి లేక వ్యక్తులు ఆ “ ప్రభుత్వము" అను పద పరిధియందు చేరియున్నట్లు భావించవలెను.

అధ్యాయము-13

తూనికలు, కొలతలకు సంబంధించిన అపరాధములను గురించి

తూచుటకై తప్పుడు ఉపకరణమును కపటముతో ఉపయోగించుట.

264. తూచుటకై తప్పుడుగని తాను ఎరిగియున్నట్టి ఏదేని ఉపకరణమును కపటముతో ఉపయోగించు వారెవరైనను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తప్పుడు తూనికను లేక కొలత సాధనమును కపటముతో ఉపయోగించుట.

265. ఏదేని తప్పుడు తూనికను గాని, పొడుగును, లేక పరిమాణమును కొలిచే తప్పుడు సాధనమును గాని, కపటముతో ఉపయోగించుట, లేక ఏదేని తూనికను గాని పొడుగును లేదా పరిమాణమును కొలుచు సాధనమును గాని సరియైన దానికి భిన్నమైన తూనికగానైనను కొలిచే సాధనముగానై నను కపటముతో ఉపయోగించు వారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తప్పుడు తూనికను లేక కొలత సాధనమును స్వాధీనమునందుంచుకొనుట.


266. తప్పుడుదని తాము ఎరిగియున్నట్టి ఏదేని తూచే ఉపకరణమును గాని ఏదేని తూనికను గాని, పొడుగును లేక పరిమాణమును కొలిచే సాధనమును గాని, కపటముతో ఉపయోగించ వచ్చునను ఉద్దేశముతో, దానిని తన స్వాధీనమునందుంచుకొను వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తప్పుడు తూనికను లేక కొలత సాధనమున తయారు చేయుట లేక విక్రయించుట,

267. సరియైనదిగా ఉపయోగింపబడవలెననియైనను లేక ఆట్లు ఉపయోగింపబడగలదని ఎరిగియుండి యైనను, తప్పుడుదని తాను ఎరిగియునట్టి ఏదేని తూచే ఉపకరణమును గాని, తూనికనుగాని, పొడుగును లేక పరిమాణమును కొలిచే సాధనమును గాని తయారు చేయు, విక్రయించు, లేక వ్యయనము చేయు వారెవరైనను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్టింపబడుదురు.

అధ్యాయము -14

ప్రజల యొక్క ఆరోగ్యము, భద్రత, సౌకర్యము, సభ్యత మరియు

నైతిక వర్తనమునకు భంగము కలిగించు అపరాధములను గురించి.

పబ్లిక్ న్యూసెన్సు.

268. ఏదేని కార్యమును చేయుటవలన లేక శాసనానుసారముగా చేయవలసిన దానిని చేయకుండుటవలన ప్రజలకు గాని, సమీపములో నివసించుచుండు, లేక ఆస్తిని ఆక్రమించియుండు జనులకు గాని ఉమ్మడిగా ఏదేని హానిని, అపాయమును లేక చికాకును కలుగజేయునట్టి, లేక ఏదేని సార్వజనిక హక్కును వినియోగించుకొను అవసరముగల వ్యక్తులకు హానిని, ఆటంకమును, అపాయమును లేక చికాకును తప్పక కలిగించునట్టి వ్యక్తి పబ్లికు న్యూసెన్సును కలిగించిన వాడగును.

ఉమ్మడి న్యూసెన్సును, ఏదేనొక సౌకర్యము లేక అనుకూల్యము. దాని వలన కలుగునను ఆధారముపై, మన్నించరాదు.

ప్రాణాపాయకరమగు పాంక్రామిక రోగమును వ్యాపింప జేయగల నిర్లక్ష్యపు కార్యము.

269. ప్రాణాపాయకరమగు ఏదేని సాంక్రామిక రోగమును వ్యాపింప జేయగలదియు, ఆట్లు వ్యాపింపజేయగలదని తనకు తెలిసినట్టి లేక విశ్వసించుటకు కారణమున్నట్టిదియు అగు ఏదేని కార్యమును శాసన విరుద్ధముగా గాని, నిర్లక్ష్యముగా గాని చేయు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రాణాపాయకరమగు పాంక్రామిక రోగమును వ్యాపింప జేయ గల కార్యమును దుర్బుద్ధి తో చేయుట.

270. ప్రాణాపాయకరమగు ఏదేని సాంక్రామిక రోగమును వ్యాపింప జేయగలదియు, ఆట్ల వ్యాపింప జేయగలదని తనకు తెలిసినట్టి లేక విశ్వసించుటకు కారణమున్నట్టిదియు అగు ఏదేని కార్యమును దుర్భుద్ధి తో చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటి తోగాని శిక్షింపబడుదురు.

క్వారం టైను నియమమును పాటించకుండుట.

271. ఏదేని జలయానమును క్వారం టైను స్థితిలో ఉంచుట కొరకు గాని క్వారం టైను స్థితిలో ఉన్న జలయానములకు ఒడ్డున ఉన్న వారితో లేక ఇతర జలయానములతో రాకపోకలను క్రమబద్ధము చేయు కొరకు గాని, ఏ స్థలములో సాంక్రామిక రోగము వ్యాపించి యుండునో ఆ స్థలమునకు ఇతర స్థలములకు మధ్య రాకపోకలను క్రమబద్ధము చేయుట కొరకు గాని, ప్రభుత్వము చే చేయబడి ప్రఖ్యానింపబడిన ఏదేని నియమమును ఎరిగియుండియు పాటించకుండు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

విక్రయమునకై ఉద్దేశింపబడిన ఆహారమును లేక పానీయమును కర్తీ చేయుట.

272. ఏదేని ఆహార లేక పానీయ వస్తువును విక్రయించు ఉద్దేశముతో గాని, ఆది ఆహార లేక పానీయ వస్తువుగా విక్రయింపబడగలదని తెలిసియుండిగాని, అట్టి ఆహార లేక పానీయ వస్తువును ఆహారముగా లేక పానీయముగా హానికరమగునట్లు చేయుటకు గాను కల్తీ చేయు వారెవరైనను,ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

హానికరమగు ఆహారమును లేక పానీయమును విక్రయించుట.

273. హానికరమైనదిగా చేయబడినట్టి, లేక హానికరముగా అయినట్టి, లేక ఆహారముగగాని పానీయముగా గాని ఉపయోగించుటకు పనికిరాని స్థితిలో ఉన్నట్టి ఏదేని వస్తువును, ఆహారముగా గాని, పానీయముగా గాని ఉపయోగించుటకు అది హానికరమై నదని ఎరిగియుండియు, లేక అట్లని విశ్వసించుటకు కారణముండియు, ఆహారముగా లేక పానీయముగా ఆ వస్తువును విక్రయించు, విక్రయింపజూపు, లేక విక్రయమునకై పెట్టు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఓషధుల కల్తీ.

274. ఏదేని ఓషధిని, లేక ఔషధమును, అది కల్తీ చేయబడని దానివలె ఏదేని వైద్యము నిమిత్తము విక్రయింపబడవలెనను, లేక అట్లు ఉపయోగింపబడవలెనను ఉద్దేశము తో గాని, ఆట్లు విక్రయింపబడగలదని యైనను, ఉపయోగింపబడగలదని యెనను ఎరిగియుండి గాని, అట్టి ఓషధి లేక ఔషధము యొక్క శక్తిని తక్కువ చేయునట్టి, లేక దాని గుణమును మార్చునట్టి లేక దానిని హానికర మగునదిగ చేయు నట్టి రీతిలో దానిని కల్తీ చేయు వారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానా తో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు. కల్తీ ఓషదుల విక్రయము

275. ఏదేని ఓషధి యొక్క లేక ఔషధము యొక్క శక్తిని తక్కువ జేయునట్టి లేక దాని గుణమును మార్చు నట్టి లేక దానిని హానికరమగునదిగ చేయునట్టి రీతిగా కల్తీ చేయబడినదని ఎరిగియుండియు కర్తీ చేయబడని దానివలె దానిని విక్రయించు, లేక విక్రయింపజూపు లేక విక్రయమునకై పెట్టు, లేక ఔషధముగా ఏదేని ఔషధశాల నుండి దానిని ఇచ్చు, లేక కల్తీ దని తెలియని ఏ వ్యక్తి చేనైనను ఔషధముగా ఉపయోగింప చేయువారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఒక ఓషధిని వేరురకపు ఓషధిగా లేకఔషధముగా విక్రయించుట.

276. ఏదేని ఓషధిని వేరురకపు ఓషధిగా లేక ఏదేని ఔషధమును వేరు రకపు ఔషధముగా ఎరిగియుండియు విక్రయించు, లేక విక్రయింపజూపు, లేక విక్రయమునకై పెట్టు, లేక వైద్యము కొరకు ఏదేని ఔషధశాల నుండి ఇచ్చువారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానా తోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

సార్వజనిక ఊట లేక జలాశయము యొక్కనీటిని మురికిచేయుట.

277. ఏదేని సార్వజనికమైన ఊట, లేక జలాశయము యెుక్క నీరు సాధారణముగా వాడబడు ప్రయోజనమునకు అంతగా పనికిరాకుండా చేయుటకై స్వచ్ఛందముగా అపరిశుభ్రము చేయు, లేక మురికిచేయు వారెవరైనను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఐదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానా తో గాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

వాతావరణమును ఆరొగ్యమునకు హానికరమగునట్లు చేయుట. వా 278. ఏదేని స్థలములో, అచటికి దరిదాపుల నివసించు, లేక వ్యాపారము చేసికొను, లేక పబ్లికు మార్గమున నడచు, జన సామాన్యము యొక్క ఆరోగ్యమునకు హానికరమగునట్లు చేయుటకై అచటి వాతావరణమును స్వచ్ఛందముగా కలుషితము చేయు వారెవరైనను, ఐదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

పబ్లికు మార్గముపై దుడుకుగా వాహనమును నడుపుట లేక స్వారీచేయుట.

279. మనుష్యులకు ప్రాణాపాయము కలిగించాడు,లేక ఇతర వ్యక్తి కెవరికైనను ఘాతనుగాని, హానినిగాని కలిగించగల రీతిలో అత్యంత దుడుకుగా లేక నిర్లక్ష్యముతో ఏదేని పబ్లికు మార్గము పై ఏదేని వాహనమును నడుపు, లేక స్వారీచేయు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాలోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

జలయానమును దుడుకుగా నడుపుట.

280. మనుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు, లేక ఇతర వ్యక్తి కెవరికై నను ఘాతనుగాని హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా లేక నిర్లక్ష్యముతో ఏదేని జలయానమును నడుపు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొగాని, ఒక వేయి రూపాయలదాకు ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

తప్పుడు వెలుగును,గుర్తును లేక బోయ్ ని ప్రదర్శించుట.

281. ఏదేని తప్పుడు వెలుగును గుర్తును, లేక బోయ్ ని ప్రదర్శించుటవలన ఏ నావికునై నిను తప్పుదారి పట్టించ వలెనను ఉద్దేశముతో గానీ, తప్పుదారి పట్టించగలనని ఎరిగియుండి గాని, అట్లు ప్రదర్శించు వారెవరై నను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

సురక్షితముగా లేనట్టి లేక మితిమీరిన బరువు ఎక్కింపబడినట్టి జలయానములో వ్యక్తిని కిరాయికి జలమార్గమున తీసికొనిపోవుట.

282. ఏదేని జలయానము: ఎవరేని వ్యక్తికి ప్రాణాపాయము కలిగించెడు స్ఠితిలోనైనను, మితిమీరిన బరువు ఎక్కింపబడినదిగానై నను ఉన్నపుడు, ఎరిగియుండియుగాని, నిర్లక్ష్యము వలన గాని ఆ వ్యక్తిని కిరాయికి ఆ జలయానములో జలమార్గమున తీసికొనిపోవు, లేక తీసికొనిపోబడునట్లు చేయు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు మార్గములో లేక నౌకాయాన పథములో అపాయము లేక ఆటంకము కలిగించుట.

283. ఏదేని కార్యమును చేయుట ద్వారా గాని, తన స్వాధీనములో నున్న, లేక తన వశమునందున్న ఏదేని ఆస్తి విషయములో సరియైన జాగ్రత్త తీసికొనకుండుట ద్వారాగాని, ఏదేని పబ్లికు మార్గములో లేక నౌకాయాన పథములో ఏ వ్యక్తి కైనను అపాయమును, ఆటంకమును లేక హానిని కలిగించు వారెవరైనను రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

విషపదార్థము విషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

284. ఏదేని విష పదార్థముతో మనుష్యులకు ప్రాణపాయము కలిగించెడు లేక ఏ వ్యక్తి కైనను ఘాతను గాని, హానిని గాని కలిగించగలరీతిలో దుడుకుగా, లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు, లేక, తన స్వాధీనములో ఉన్న ఏదేని విషపదార్థముతో మనుష్యులకు బహుశః కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఆట్టి విష పదార్థము విషయములో, ఎరిగియుండియుగాని, నిర్లక్ష్యముతోగాని, తీసికొనకుండెడు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబదుదురు.

నిప్పు, లేక మండునట్టి పదార్థము విషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

285. నిప్పు లేక ఏదేని మండునట్టి పదార్ధముతో మనుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు లేక ఏ ఇతర వ్యక్తి కైనను ఘాతనుగాని హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా లేక, నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు, లేక తన స్వాధీనములో ఉన్న ఏదేని నిప్పుతో లేక ఏదేని మండు నట్టి పదార్థముతో మనుష్యులకు బహశః కలుగగల ప్రాణాపాయమును నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఆట్టి నిప్పు, లేక మండునటి పదార్థము విషయములో ఎరిగియుండియుగాని నిర్లక్ష్యముతో గాని, తీసికొనకుండెడు, వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రేలుడు పదార్థము విషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

286. ఏదేని ప్రేలుడు పదార్థముతో మసుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు. లేక, ఏ ఇతర వ్యక్తి కైనను ఘాతనుగాని, హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా, లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు,

లేక, తన స్వాధీనములో ఉన్న ఏదేని ప్రేలుడు పదార్ధముతో మనుష్యులకు బహుశ: కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను అట్టి పదార్థము విషయములో ఎరిగియుండియు గాని నిర్లక్యము తో గాని, తీసికొనకుండెడు,

వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

యంత్రసామగ్రి విషయమున నిర్లక్ష్య ప్రవర్తన,

287. ఏదేని యంత్రసామాగ్రితో, మనుష్యులకు ప్రాణాపాయము కలిగించెడు, లేక ఏ ఇతర వ్యక్తికైనను ఘాతనుగాని, హానిని గాని కలిగించగల రీతిలో దుడుకుగా లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేసెడు,

లేక, తన స్వాధీనములో ఉన్న, లేక తన వశమునందున్న ఏదేని యంత్రసామాగ్రితో మనుష్యులకు బహుశః కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తమ ఆట్టి యంత్ర సామాగ్రి విషయములో ఎరిగి యుండియు గాని నిర్లక్ష్యముతోగాని, తీసికొనకుండెడు,

వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

కట్టడమును పడగొట్టు,లేక మరమ్మతుచేయు విషయమున నిర్లక్ష్యం ప్రవర్తన,

288. ఏదేని కట్టడమును పడగొట్టుటలో, లేక మరమ్మతు చేయుటలో ఆ కట్టడముగాని, దానిలో ఏదేని భాగముగాని పడిపోవుట వలన మనుష్యులకు బహుశ: కలుగగల ప్రాణాపాయము నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఎరిగియుండియుగాని, నిర్లక్ష్యముతో గాని, ఆ కట్టడము విషయములో తీసికొనకుండెడు వారెవరైనను ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

జంతు వషయమున నిర్లక్ష్య ప్రవర్తన.

289. తన స్వాధీనమునందున్న ఏదేని జంతువు మూలముగా మనుష్యులకు బహుశః కలుగగల ప్రాణాపాయమును గాని, ఏదేని దారుణ ఘాతనుగాని నివారించుటకు సరిపోవునంత జాగ్రత్తను ఎరిగియుండియు లేక నిర్లక్ష్యముతో, అట్టి జంతువు విషయములో తీసికొనకుండెడు వారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అన్యథా నిబంధనలు లేని సందర్భములలో పబ్లికు న్యూ సెన్సు చేసినందుకు శిక్ష

290. శిక్షకై ఈ స్మృతిలో అన్యథా నిబంధనలు లేని ఏ సందర్భములో నై నను పబ్లికు న్యూ సెన్సు చేయు వారెవరైనను రెండు వందల రూపాయలదాక ఉండగల జూర్మానాతో శిక్షింపబడుదురు.

న్యూ సెన్సును కొన సాగించరాదని వ్యాదేశము ఇచ్చిన పిమ్మట దానిని కొనసాగించుట.


291. న్యూ సెన్సును మరల కలిగించరాదని, లేక కొనసాగించ రాదని వ్యాదేశమును శాసనసమ్మత ప్రాధికారము గల ఏ పబ్లికు సేవకుడై నను ఇచ్చిన మీదట, అట్టి న్యూ సెన్సును మరల కలిగించు, లేక కొనసాగించు వారెవరైనను ఆరు మాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాపముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు. అశ్లీ లకరమైన పుస్తకములు మున్నగు వాటి విక్రయము మొదలగునవి.

292. (1) ఉపపరిచ్ఛేదము (2) నిమిత్తము ఒక పుస్తకమును, కరపత్రమును, పత్రికను, వ్రాతను, రేఖా చిత్రమును, వర్ణ చిత్రమును, రూపణమును, ఆకృతిని లేక ఏదేని ఇతర వస్తువును, అది కామాతురతను కలిగించు నదైనచో, కామ వాంఛలను ప్రేరేపించునదైనచో, లేక దాని ప్రభావముగాని ( అది రెండు లేక అంత కెక్కువ విభిన్నాంశములతో కూడినదైనయెడల) ఏదేని ఒక అంశపు ప్రభావముగాని, మొత్తముగా తీసికొనబడినపుడు దాని ప్రభావము గాని అన్ని సందర్భములను బట్టి అందలి, లేక అందు పొందుపరచిన విషయమును చదువగల, చూడగల లేక వినగల వ్యక్తులను దుర్నీతిపరులుగను, అవినీతిపరులుగను చేయు వైఖరిగలదైనచో, అశ్లీలకరమై నదిగా భావించవలెను.

(2) (ఏ) ఏదేని అశ్లీ ల కరమైన పుస్తకమును, కరపత్రమును, పత్రికను, రేఖా చిత్రమును, వర్ణ చిత్రమును, రూపణమును, ఆకృతిని, లేక ఏదేని ఇతర అశ్లీలకరమైన వస్తువును, అది ఏదైనప్పటికిని విక్రయించు, కిరాయికిచ్చు, పంచి పెట్టు, బహిరంగముగ ప్రదర్శించు లేక ఏ రీతిగ నైనను ప్రచారములో పెట్టు, లేక విక్రయించుటకు, కిరాయి. కిచ్చుటకు, పంచి పెట్టుటకు, బహిరంగముగ ప్రదర్శించుటకు, లేక ప్రచారములో పెట్టుటకు దానిని రచించు, తయారుచేయు, తన స్వాధీనము నందు కలిగియుండు, లేక

(బి) ఏదేని అశ్లీ లకరమైన వస్తుపు, పైన చెప్పబడిన ఏ ప్రయోజనము కొరకై నను విక్రయింపబడునని,కిరాయి కీయబడునని, పంచి పెట్టబడునని, లేక బహిరంగముగ ప్రదర్శింపబడునని, లేక ఏ రీతిగనై నను ప్రచారములో పెట్టబడునని ఎరిగియుండిగాని, అట్లు విశ్వసించుటకు కారణముండిగాని, అట్టి వస్తువును దిగుసుతి చేయు, ఎగుమతి చేయు లేక రవాణాచేయు, లేక

(సీ) పైన చెప్పబడిన ఏ ప్రయోజనము కొరకై నను అశ్లీ లకరమైన వస్తువులు ఏవై నను చేయబడునని, తయారు చేయబడునని, కొనబడునని, ఉంచబడునని, దిగుమతి చేయబడునని, ఎగుమతి చేయబడునని, రవాణా చేయుబడునని, బహిరంగముగ ప్రదర్శింపబడునని, లేక ఏ రీతిగవైనను ప్రచారములో పెట్టబడునని ఏ వ్యాపార సరళిలో తనకు తెలియ వచ్చినదో, లేక విశ్వసించుటకు కారణము కలిగినదో అట్టి ఏ వ్యాపారము నందైనను పాల్గొను, లేక దాని నుండి లాభములు పొందు లేక,

(డీ) ఎవరేని వ్యక్తి ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమగు నట్టి ఏ కార్యమునై నను చేయుచున్నాడని గాని చేయుటకు సిద్ధముగ నున్నాడనిగాని అట్టి అశ్లీ లకరమైన వస్తువును దేనినైనను ఏ వ్యక్తి నుండి యైనను, ఏ వ్యక్తి ద్వారానైనను సేకరింప వచ్చునని గాని, ప్రకటన చేయు, లేక ఏ పద్ధతుల ద్వారానై నను తెలియజేయు, లేక,

(ఈ) ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమగుపట్టి ఏదేని కార్యమును చేయజాపు, లేక చేయుటకు

ప్రయత్నించు, వారెవరైనను, మొదటి దోష, స్థాపనకై రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, రెండు వేల రూపాయలదాక ఉండగల జుర్మానాతోను శిక్షింపబడుదురు, మరియు రెండవ లేక, ఆ తరువాతి దోషస్థాపన జరిగిన సందర్భములో ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, ఐదువేల రూపాయలదాక ఉండగల జుర్మానాతో కూడాను శిక్షింపబడుదురు.

మినహాయింపు :-ఈ పరిచ్ఛేదము ఈ క్రింది వాటికి విస్తరించదు :--

(ఏ) (i) దేని ప్రచురణము వలన విజ్ఞాన శాస్త్రము, సాహిత్యము, కళ, విద్వత్తు , లేక ప్రజానీకమునకు సంబంధించిన ఇతర విషయముల యొక్క హితము పెంపొందింప బడునను ఆధారము పై ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అట్టి ప్రచురణము సమర్థ నీయమని రుజువు పరచ బడునో అట్టి ఏదేని పుస్తకము, కరపత్రము, పత్రిక, వ్రాత, రేఖాచిత్రము, వర్ణ చిత్రము, రూపణము, లేక ఆకృతి, లేక,

(ii ) ఏది మత ప్రయోజనముల కొరకై సద్భావ పూర్వకముగా భద్రపరచబడునో, లేక ఉపయోగింపబడునో అట్టి ఏదేని పుస్తకము, కరపత్రము, పత్రిక, వ్రాత, రేఖాచిత్రము, పర చిత్రము, రూపణము, లేక ఆకృతి, (బి) (i) ప్రాచీన స్మారక చిహ్నములు మరియు పురాతత్త్వ స్థలముల అవశేషముల చట్టము, 1958 (1958లోని 24వ చట్టము ) యొక్క భావములోని ఏదేని ప్రాచీన స్మారక చిహ్నము పై గాని దానిలో గాని,

(ii) ఏదేని దేవాలయము పై గాని, విగ్రహముల ఉరేగింపు కొరకై ఉపయోగింపబడు లేక ఏదేని మత ప్రయోజనము కొరకు భద్రపరచబడు లేక ఉపయోగింపబడు ఏదేని రథము పై గాని, దానిలో గాని

శిల్పముగా మలచబడిన, చెక్కబడిన, రంగులతో చిత్రింపబడిన, లేక వేరు విధముగ రూపొందింపబడిన ఏదేని రూపణము.

లేబ్రాయపు వ్యక్తులకు అశ్లీలకరమైన వస్తువులను విక్రయించుట మొదలగునవి.

293. ఇరువది సంవత్సరముల లోపు వయసు గల ఏ వ్యక్తి కై నసు పై కట్ట కడపటి పరిచ్ఛేదములో నిర్దేశింపబడి నట్టి ఏదేని అశ్లీ లకరమైన వస్తువును విక్రయించు, కిరాయికిచ్చు, పంచి పెట్టు, ప్రదర్శించు లేక ప్రచారమునందు పెట్టుటలో అందజేయు, లేదా ఆట్లు జేయజూపు, లేక అట్లు చేయ ప్రయత్నించు వారేవరైనను మొదటి దోష స్థాపన పై మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, రెండు వేల రూపాయల దాక ఉండగల జుర్మానా తోను, రెండవ లేక తరువాతి దోషస్థాపన జరిగిన సందర్భములో ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, ఐదు వేల రూపాయలదాక ఉండగల జుర్మానాతో కూడను, శిక్షింపబడుదురు.

అశ్లీ లకరమై నకార్యములు మరియు పాటలు,

294. ఇతరులకు చికాకు కలుగునట్లుగా –

(ఏ) ఏదేని బహిరంగ స్థలములో ఏ అశ్లీ లకరమై న కార్యము నై నను చేయు,

(బీ) ఏదేని బహిరంగ స్థలములో గాని దానికి సమీపమున గాని ఏవేని అశ్లీ లకరమైనట్టి పాటలనుపాడు, కథా గేయములను పఠించు, మాటలను ఉచ్చరించు, వారెవరైనను మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

లాటరీ కార్యాలయమును ఏర్పరచుకొనుట,

294. ఎ రాజ్య లాటరీ, లేక రాజ్య ప్రభుత్వము ప్రాధికారమొసగిన లాటరీ కానట్టి లాటరీని నడుపు నిమిత్తము ఏదేని కార్యాలయమును లేక స్థలమును ఏర్పరచుకొనియుండు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మరియు అట్టి ఏ లాటరీలో నై నను ఏదేని టికెట్టును, చీటీని, అంకెను లేక బొమ్మను తీయుటకు సంబంధించు నట్టి లేక వర్తించునట్టి ఏదేని సంఘటన, లేక ఆనిశ్చత పరిస్థితిపై ఆధారపడి ఏ వ్యక్తి యొక్క మేలు కొరకైనను ఏదేని సొమ్ము చెల్లించుటకు, లేక ఏదేని సరుకులను అందజేయుటకు, లేక ఏదేని పనిని చేయుటకు లేక ఏదేని పనిని చేయకుండుటకు ప్రతిపాదనను దేనినైనను ప్రచురించు వారెవరై సను, ఒక రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

అధ్యాయము ----15

మత సంబంధమైన అపరాధములను గురించి


ఏ వర్గమువారి మతమునైనను అవమాన పరచవలెనను ఉద్దేశముతో ఆరాధనా స్థలమును పాడు చేయుట లేక అపవిత్రము చేయుట

295. ఏ వర్గమువారి మతమునై నను అవమానపరచనలెనను ఉద్దేశముతో గాని, ఏ వర్గమువారైనను తమ మతమును అవమాన పరచినట్లు భావించగలరని తెలిసియుగాని, ఏదేని ఆరాధనా స్థలమును, లేదా ఏ వర్గము వారైనను పవిత్రమైనదిగా భావించు ఏదేని వస్తువును నాశముచేయు, పాడు చేయు, లేక అపవిత్రముచేయు వారెవరై నను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసము తో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితో గాని శిక్టింపబడుదురు.

ఏ వర్గమువారి మతమునైనను, మత విశ్వాసముల నైనను అవమానపరచుట ద్వారా మత విషయకముగా వారి మనస్సుకు బాధ కలిగించు ఉద్దే శముతో బుద్ది పూర్వకమైన, విద్వేష పూర్వకమైన కార్యములు చేయుట


295-ఏ. మత విషయకముగా భారతీయ పౌరులలో ఏదేని వర్గము వారి మనస్సుకు బాధ కలగించవలెనని బుద్ధిపూర్వకముగా, విద్వేషపూర్వకమైన ఉద్దేశముతో ఆ వర్గమువారి మతమునైనను, మత విశ్వాసములనైనను, పలికినట్టి, లేక వ్రాసినట్టి మాటల ద్వారాగాని, సంజ్ఞ లద్వారా గాని, దృశ్యరూపణముల ద్వారా గాని, అన్యధాగాని అవమానపరచు, లేక అవమాన పరచుటకు ప్రయత్నించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు. మత సమావేశమునకు విఘ్నము కలుగజేయుట.


296. మతసంబంధమైన ఆరాధనను గాని, మతసంస్కారములను గాని శాసన సమ్మతముగా నిర్వర్తించు కొనుచున్న ఏదేని సమా వేశమునకు స్వచ్ఛందముగా విఘ్నము కలుగజేయు వారెవరైనను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

స్మశానవాటికలు స్మశానవాటికలు అక్రమముగ ప్రవేశించుట

297. ఏ వ్యక్తి మనస్సునైనను నొప్పించవలెననెడి లేక ఏ వ్యక్తి మతమునైనను అవమానపరచవలెననెడి ఉద్దేశముతోగాని, తద్వారా ఎవరేని వ్యక్తి యొక్క మనస్సు నొప్పించబడగలదని లేక ఎవరేని వ్యక్తి యొక్క మతము అవమానపరచబడగలదని ఎరిగియుండియు,

ఏదేని ఆరాధనా స్ఠలము నందైనను, ఏదేని స్మశానవాటిక పై నై నను అంత్య క్రియలను జరుపుటకై లేక మృతుల అవశేషములను భద్రముగానుంచుటకై కేటాయింపబడిన ఏదేని స్థలము పై నైనను అక్రమముగ ప్రవేశించు లేక ఏ మనుష్య శవమునై నను ఆవజ్ఞకు గురిచేయు, లేక అంత్య క్రియలను జరుపుట కొరకు సమావేశమైన ఏ వ్యక్తులకైనను విఘ్నము కలిగించు వారెవరైనను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి ఇంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మత విషయకముగా మనస్సు నొప్పించు ఉద్దేశముతో బుద్ది పూర్వకముగా మాట అనుట మొదలగునవి.

298. మత విషయకముగా ఎవరేని వ్యక్తి మనస్సును నొప్పించవలెనను ఉద్దేశముతో బుద్ధి పూర్వకముగా ఆవ్యక్తి వినునట్లు ఏవేని మాటలను అను, లేక ఏదేని ధ్వనిని చేయు, లేక ఆ వ్యక్తి కి కనపడునట్లు ఏదేని సైగ చేయు, లేదా ఏదేని వస్తువును ఉంచు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

అధ్యాయము-16

మనుష్య శరీర విషయమున ఆపరాధములు ప్రాణహానికర ఆపరాధములను గురించి

అపరాధిక మానవ వధ.

299. మరణము కలుగజేయవలెనను ఉద్దేశముతో లేక మరణమును కలిగించగల శారీరక హానిని కలుగజేయవలెనను ఉద్దేశముతో ఒక కార్యమును చేయుట ద్వారా గాని, అట్టి కార్యమువలన ఆ మరణము కలిగించగలనని ఎరిగియుండి ఆ కార్యమును చేయుటద్వారా గాని, మరణమును కలుగజేయు వారెవరైనను ఆపరాధిక మానవవధ అను అపరాధమును చేసిన వారగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అను నతడు మరణమును కలుగజేయవలెనను ఉద్దేశముతో గాని, మరణము కలుగగలదని ఎరిగియుండిగాని, ఒక గొయ్యిని పుల్లలతోను, గడ్డి తోను కప్పును. 'జడ్' ఆ నేల గట్టి దేనని విశ్వసించుచూ దాని పై నడచివెళ్లి గోతిలో పడి చనిపోవును. ఏ ఆపరాధిక మానవవధ ఆను అపరాధమును చేసినవాడగును.

(బి) 'జడ్' ఒక పొదవెనుక ఉన్నాడని 'ఏ' కు తెలియును. 'బి' కి ఆది తెలియదు. 'జడ్' కు మరణము కలుగజేయవలెనను ఉద్దేశముతో, లేక మరణము కలుగగలదని తెలిసియుండియు, 'ఏ' ఆ పొదవై పు కాల్పులు జరుపుమని 'బీ' ని ప్రేరేపించును. కాల్పులు జరిపి 'జడ్' ను చంపును. ఇచట 'బి' ఎట్టి అపరాధమును చేసినవాడు కాకపోవచ్చును కాని, 'ఏ' ఆపరాధిక మానవవధ అను అపరాధమును చేసిన వాడగును.

(సి) ఒక కోడిని చంపి దానిని దొంగిలించవలెనను ఉద్దేశముతో 'ఏ' దాని పై తుపాకి కాల్చి, పొదవెనుక ఉన్నట్టి 'బి' ని చంపును, కాని ఆతడు అచట ఉన్నాడని 'ఏ' కు తెలియదు. ఇచట 'ఏ' శాసనవిరుద్ధమైన కార్యమును చేయుచుండినప్పటికినీ, అతనికి 'బీ' ని చంపవలెనను ఉద్దేశములేదు. మరణము కలుగగలదని తాను ఎరిగియున్నట్టి కార్యమును చేసి అతడు మరణము కలిగించలేదు. అందువలన 'ఏ' ఆపరాధిక మానవవధ అను అపరాధమును చేయలేదు.

విశదీకరణము 1 :-ఎవరేని వ్యక్తి, అస్వస్థత, రోగము లేక శారీరక దౌర్బల్యముతో బాధపడుచున్న మరోక వ్యక్తి కి శారీరక హానిని కలుగజేసి తద్వారా ఆ మరొక వ్యక్తి త్వరగా మరణించునట్లు చేసినచో, అతడు మరణమును కలుగజేసినట్లు భావించవలెను.

విశదీకరణము 2:-శారీరక హానిద్వారా మరణము కలుగజేయబడిన యెడల, సరియైన వైద్యోపచారముల నైపుణ్యముగల చికిత్స జరిపి యుండినచో మరణము నివారింపబడి యుండెడిదైనప్పటికీ, అట్టి శారీరక హాని కలుగజేసిన వ్యక్తి ఆ మరణమును కలుగజేసినట్లు భావించవలెను. విశదీకరణము 3: తల్లి గర్భమునందున్న బిడ్డకు మరణమును కలుగజేయుట మానవవధ కాదు. కాని ప్రాణముతో ఉన్న బిడ్డకు ఆ బిడ్డ శ్వాస పీల్చకున్నప్పటికిని, లేక పూర్తిగా బయటపడనప్పటికిని, ఆ బిడ్డ యొక్క శరీర భాగము ఏదైనా బయటకు వచ్చియుండినచో, ప్రాణముతోయున్న బిడ్డ కు మరణము కలుగజేసిన అది అపరాధిక మానవవధ కావచ్చును.

హత్య,

300. ఇందు ఇటు పిమ్మట మినహాయింపబడిన కేసులలో తప్ప, మరణమును కలుగజేసిన కార్యము, మరణ మును కలుగజేయవలెనను ఉద్దేశముతో చేయబడినచో, లేక--

రెండవది:—ఆ కార్యము కీడు కలిగింపబడిన వ్యక్తి కి మరణము కలిగించగలదని అపరాధికి తెలిసియున్నట్టి శారీరక హానిని కలిగించు ఉద్దేశముతో చేయబడినదైనచో, లేక—

హత్య,

మూడవది:—ఆ కార్యము ఏ వ్యక్తి కైనను శారీరక హానిని కలుగజేయ వలెనను ఉద్దేశముతో చేయబడియుండి కలుగజేయ ఉద్దేశింపబడినట్టి శారీరక హాని మరణమును కలుగజేయుటకు సహజముగా సరిపోవునంతదైనచో, లేక--

నాల్గవది: ఆ కార్యము మరణమునుగాని, మరణమును కలిగించగల శారీరక హానినిగాని, బహుశ: కలుగజేయ జాలునంతటి ఆసన్నమైన అపాయముతో కూడినదని ఆ కార్యము చేయు వ్యక్తి కి తెలిసియుండి మరణమునుగాని, పైన చెప్పినటువంటి హానినిగాని కలుగజేయు ముప్పుకు గురిచేయుటకు కారణమేదియు లేకుండగనే, అతడు అట్టి కార్యమును చేసినచో ఆపరాధిక మానవవధ హత్య అగును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్'ను చంపవలెనను ఉద్దేశముతో 'ఏ' అతనిని షూట్ చేయును. తత్పరిణామముగా 'జడ్' మరణించును. 'ఏ' హత్య చేసినవాడగును.

(బి) ఒక దెబ్బలోనే మరణము సంభవించునంతటి వ్యాధితో 'జడ్' బాధపడుచున్నాడని తెలిసియుండియు 'ఏ' శారీరక హానిని కలుగజేయవలెనను ఉద్దేశముతో 'జడ్' ను కొట్టును. ఆ దెబ్బవలన 'జడ్' మరణించును. ఆ దెబ్బ, సహజముగ ఆరోగ్యవంతుడైన వ్యక్తి కి మరణమును కలిగించునంతటిది కాకున్నను, 'ఏ' హత్య చేసిన వాడగును. కాని 'జడ్' ఏదేని వ్యాధితో బాధపడుచున్నాడని తెలియక, సహజముగ ఆరోగ్యవంతుడైన వ్యక్తి కి మరణమును కలిగించలేని దెబ్బ కొట్టినచో, ఇచట 'ఏ' శారీరక హాని కలుగ జేయుటకు ఉద్దేశించినప్పటికిని, మరణము కలిగించు ఉద్దేశము గాని, సహజముగా మరణము కలిగించగల శారీరక హానిని కలిగించు ఉద్దేశము గాని అతనికి లేకుండినచో, ఆతడు హత్య చేసిన వాడు కాదు.

(సీ) సహజముగా ఒక మనిషికి మరణమును కలిగించు నంతగా 'జడ్' ను కత్తితో గాని, దుడ్డు కర్రతో గాని 'ఏ' ఉద్దేశపూర్వకముగా గాయపరచును. తత్పరిణామముగా 'జడ్' మరణించును. ఇచట 'జడ్' కు మరణము కలిగించవలెనను ఉద్దేశము 'ఏ' కు లేకుండినప్పటికిని 'ఏ' హత్య చేసిన వాడగును.

(డీ) కారణమేదియు లేకుండగనే 'ఏ' వ్యక్తుల గుంపు పై బారు చేసిన ఫిరంగిని ప్రేల్చి, అందులో ఒకరిని చంపును. ప్రత్యేకముగా ఏ వ్యక్తినై నను చంపవలెనని ముందు పన్నుగడ ఏదియు 'ఏ' కు లేక పోయినప్పటికిని, ఆతడు హత్య చేసిన వాడగును.

ఆపరాధిక మానవ వధ ఎప్పుడు హత్య కాదు.

మినహాయింపు 1:—అపరాధి తీవ్ర, ఆకస్మిక ప్రకోపనమునకు లోనై తనను తాను అదుపులో పెట్టుకొనగల శక్తిని కోల్పోయినప్పుడు, ప్రకోపనము కలిగించిన వ్యక్తి కి మరణమును కలుగజేసినచో, లేక పొరపాటు వలన గాని, దుర్ఘటన వలన గాని ఎవరేని ఇతర వ్యక్తి కి మరణమును కలుగజేసినచో, ఆపరాధిక మానవవధ హత్య కాదు.

పై మినహాయింపు యీ క్రింది మినహయింపులకు లోబడియుండును:

మొదటిది :—ఆ ప్రకోపనము, ఏ వ్యక్తినైనను చంపుటకు, లేక ఏ వ్యక్తి కై నను కీడు కలుగజేయుటకు ఒక సాకుగా, అపరాధియే కోరితెచ్చుకొనినదిగా గాని, అపరాధియే స్వచ్ఛందముగా కలిగించిన ప్రకోవవా పనితమై నదిగా గాని అయి ఉండరాదు.

రెండవది :- ఆ ప్రకోపనము, శాసనమును పాటించుటలో చేయబడిన దేనివల్ల నైనను, పబ్లికు సేవకునియొక్క అధికారములను శాసన సమ్మతముగా వినియోగించుటలో అట్టి పబ్లికు సేవకునిచే చేయబడిన దేనివల్ల నైనను కలిగించబడినదై ఉండరాదు. మూడవది :---ఆ ప్రకోపనము, స్వయం రక్షణ హక్కునుశాసన సమ్మతముగా వినియోగించుకొనుటలో చేయబడిన దేనివలననైనను కలిగించబడినదై ఉండరాదు.

విశదీకరణము :- ఆ ప్రకోపనము, అపరాధమును హత్యకాకుండచేయుటకు, సరిపోవునంత తీవ్రమైనది,ఆకస్మికమైనది అగునా అనునది సంగతిని గూర్చిన ప్రశ్న అగును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కల్పించిన ప్రకోపనము వలన ఆవేశము చెంది, 'ఏ' ఉద్రేకముతో 'జడ్' యొక్క బిడ్డ యైన 'వై' ని ఉద్దేశ పూర్వకముగా చంపును. ఆ ప్రకోపనము, ఆ బిడ్డ కలిగించినది కానందునను ఆ ప్రకొపనము మూలముగ ఒక కార్యమును చేయుటలో దుర్ఘటన వలనగాని, దురదృష్టము వలన గాని ఆ బిడ్డకు మరణము కలుగనందునను, ఇది హత్య అగును.

(బి) తీవ్రము, ఆకస్మికమునైన ప్రకోపనమును 'ఏ' కు 'వై' కలుగజేయును. ఈ ప్రకోపనముచే, 'ఏ' కు సమీపము నందే ఉన్నను కనుచాటుగా ఉన్న 'జడ్' ను చంపవలెనను ఉద్దేశము లేకయే, తన్మూలముగా ఆతడు చావగలడని తెలియకయే, 'ఏ' “వై” పై పిస్తోలును కాల్చును, 'జడ్' ను 'ఏ' చంపును. ఇచట “ఏ' హత్య చేయలేదు, కాని అపరాధిక మానవవధను మాత్రము చేసిన వాడగును.

(సీ) 'జడ్' అను ఒక బెయిలిఫ్ శాసన సమ్మతముగా 'ఏ' ను అరెస్టు చేసినాడు, అరెస్టు వలన అకస్మాత్తుగా కలిగిన తీవ్రమైన ఉద్రేకములో 'ఏ' 'జడ్' ను చంపును. పబ్లికు సేవకుడు తన అధికారమును వినియోగించుటలో చేసిన పనిద్వారా ఈ ప్రకోపనము కలుగజేయబడినందున, ఇది హత్య అగును.

(డీ) 'జడ్ ' అను మేజి స్టేటు సమక్షమున 'ఏ' సాక్షిగా హాజరగును. 'ఏ' ఇచ్చిన వాజ్మూలములో ఒక్క మాటను కూడ తాను విశ్వసించుట లేదనియు 'ఏ' తప్పుడు సాక్ష్యమునిచ్చి నాడనియు 'జడ్' అనును. ఈ మాటలవలన అకస్మాత్తు గా 'ఏ' ఉద్రిక్తుడై 'జడ్' ను చంపును. ఇది హత్య అగును.

(ఈ) 'జడ్' యొక్క ముక్కునుపట్టి లాగుటకు 'ఏ' ప్రయత్నించును. తన్నివారణ కై 'జడ్' స్వయం రక్షణ హక్కును వినియోగించు కొనుటలో 'ఏ'ను నొక్కి పట్టు కొనును. తత్ పరిణామముగా ఆకస్మాత్తుగా కలిగిన తీవ్రమైన ఉద్రేకములో 'ఏ' 'జడ్' ను చంపును. స్వయం రక్షణ హక్కును వినియోగించు కొనుటలో చేసిన పనిద్వారా ఈ ప్రకోపనము కలుగజేయబడినందున, ఇది హత్య అగును.

(ఎఫ్) 'బీ' ని 'జడ్' కొట్టును. 'బి' ఈ ప్రకోపనము వలన ఆవేశముతో ఆగ్రహా పేతుడగును. అక్కడే ఉన్న 'ఏ', 'బీ' యొక్క ఆగ్రహమును స్వప్రయోజనమునకు ఉపయోగించుకొనవలెననియు, అతనిచే, 'జడ్' ను చంపించ వలెననియు ఉద్దేశించి తన్నిమిత్తమై 'బీ' చేతికి కత్తిని అందించును. 'బీ' ఆ కత్తితో 'జడ్' ను చంపును. ఇచ్చట 'బీ' ఆపరాధిక మానవవధను మాత్రమే చేసియుండవచ్చును. కాని 'ఏ' హత్య చేసిన వాడగును.

మినహాయింపు 2:-- శరీరమును లేక ఆస్తి నిగురించి స్వయంరక్షణ హక్కును అపరాధి సద్భావపూర్వకముగా వినియోగించుకొనుటలో శాసనరీత్యా తనకు ఈయబడిన అధికారమును అతిక్రమించి, పూర్వచింతన లేకుండను అట్టి రక్షణ హక్కు నిమిత్తమై అవసరనుగు దానికంటే ఎక్కువ కీడును కలుగజేయవ లెనను ఉద్దేశమేదియు లేకుండనుఎవరి పై అట్టి రక్షణ హక్కును వినియోగించుకొనుచున్నాడో ఆ వ్యక్తి కి మరణమును కలిగించినచో, ఆపరాధిక మానవవధ హత్య కాదు.

ఉదాహరణము

దారుణమైన ఘాతకలుగునటుల కాకుఁడ, గుర్రపు కొరడాతో 'జడ్' 'ఏ' ను కొట్టుటకు 'జడ్' ప్రయత్నించును. ఏ' పిస్తోలును బయటకు తీయును. 'జడ్' దౌర్జన్యమును కొనసాగించుచుండును. 'ఏ' తాను గుర్రపు కొరడా దెబ్బలను తప్పించుకొనుటకు వేరు మార్గము లేదని సద్భావ పూర్వకముగా విశ్వసించి, 'జడ్' ను పిస్తోలుతో కాల్చి చంపును, “ఏ' హత్య చేయలేదు, కాని ఆపరాధిక మానవవధను మాత్రమే చేసిన వాడగును.

మినహాయింపు 3:—ఆపరాధిక మానవవధ చేసిన అపరాధి, తాసు పబ్లికు సేవకుడుగా ఉండి, లేక న్యాయపాలన నిర్వహణ కై వ్యవహరించుచున్న పబ్లికు 'సేవకునికి తోడ్పడుచుండి, అట్టి పబ్లికు సేవకుడుగా తన కర్తవయమును తగు రీతిగా నిర్వహించుటకు శాసనసమ్మతమై నదనియు, ఆవశ్యకమై నదనియు తాను సద్భావముతో విశ్వసించి మరణము కల్పించబడిన వ్యక్తి పట్ల పగ లేకుండను, శాసన రీత్యా తనకు ఈయబడిన అధికారములను అతిక్రమించి ఒక కార్యమును చేయుట ద్వారా మరణమును కలుగజేసినచో ఆపరాధిక మానవవధ హత్యకాదు. మినహాయింపు 4:-అపరాధిక మానవవధ చేసిన అపరాధి అకస్మాత్తుగా తటస్థించిన కలహమువల్ల అకస్మాత్తుగా జరిగిన కొట్లాటలోని ఉద్రేకముతో మండిపడి పూర్వచింతన లేకుండా, ఆ అవకాశమును దుర్వినియోగ పరచకుండా లేక క్రూరముగ గాని. అసాధారణముగ గాని ప్రవర్తించకుండా అపరాధిక మానవవధ చేసినచో ఆ అపరాధిక మానవవధ హత్యకాదు.

విశదీకరణము :— అట్టి సందర్భములలో ఏ పక్ష మువారు ప్రకోపమును కలిగించినారు అనునది, లేక ప్రప్రథమముగా దౌర్జన్యము చేసినారు. అనునది ముఖ్యాంశము కాదు.

మినహాయింపు 5:—మరణము కలిగింపబడిన వ్యక్తి వయస్సులో పదునెనిమిది సంవత్సరములు దాటిన వాడై యుండి తన సమ్మతితోనే మరణమునకుగాని, మరణము కలుగగల ముప్పునకు గాని గురిచేయబడినపుడు అపరాధిక మానవవధ హత్యకాదు.

ఉదాహరణము

'ఏ' స్వచ్ఛందనముగా తన ప్రేరణ వలన పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల వ్యక్తి యైన 'జడ్' ను ఆత్మహత్య చేసికొనునట్లు చేయును. ఇచట 'జడ్' లేబ్రాయపు వాడై నందున తన మరణమునకు సమ్మతినిచ్చుటకు అసమర్థుడై యుండును. కావున "ఏ" హత్యా దుష్ప్రేరణ చేసినవాడగును.

మరణము కలిగించుటకు ఉద్దేశింపబడిన వ్యక్తికి కాక ఇతర వ్యక్తికి మరణము కలిగించుటద్వారా అపరాధిక మానవ వధ

301. మరణము కలిగించుటకు తాను ఉద్దేశించియుండి, లేక మరణము కలుగగలదని ఎరిగియుండి, ఒక వ్యక్తి ఏపనినై నను చేయుట ద్వారా, మరణము కలిగింపవలెనని తాను ఉద్దేశించియుండనట్టి లేక మరణము కలుగగలదని తాను ఎరిగియుండనట్టి ఏ వ్యక్తి కై నను మరణమును కలిగించుట ద్వారా అపరాధిక మానవవధను చేసినచో, ఆ అపరాధిచే చేయబడిన అపరాధిక మానవవధ, అతడు ఏ వ్యక్తికి మరణము కలిగించుటకు ఉద్దేశించి యుండెనో లేక మరణము కలుగగలదని ఎరిగియుండెనో ఆ వ్యక్తి కి మరణము కలిగియుండినచో, అది ఎట్టి రకపుదై యుండెడిదో అట్టి రకపుదే అగును.

హత్య చేసినందుకు శిక్ష.

302. హత్యచేయు వారెవరైనను, మరణదండనతో గాని, యావజ్జీవ కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడా పాత్రులగుదురు.

యావజ్జీవ ఖైదీ హత్య చేసినందుకు శిక్ష,

303. యావజ్జీవ కారావాస దండనోత్త రువు ఈయబడియుండి, హత్యచేయువారెవరై నను మరణదండనతో శిక్షింపబడుదురు.

హత్య కానట్టి అపరాధిక మానవ వధ చేసినందుకు శిక్ష.

304. హత్య కానట్టి ఆపరాధిక మానవవధ చేయు వారెవరై నను మరణమును కలుగజేసినట్టి కార్యమును మరణము కలిగించవలెనను, లేక మరణము కలిగించగల శారీరక హానిని కలిగించవలెనను ఉద్దేశముతో చేసియుండినచో యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు :

లేక, ఆకార్యముచేయుటవలని మరణము కలుగగలదని ఎరిగి యుండి, మరణము కలిగించవలెననియైనను, మరణము కలిగించగల శారీరక హాని కలిగించవలెననియైనను ఉద్దేశమేదియు లేకుండ, ఆ కార్యమును చేసియుండినచో, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

నిర్లక్ష్యముతో మరణము కలుగజేయుట.

304-ఏ. ఆపరాధిక మానవవధ కాకుండా, తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో కూడిన ఏదేని కార్యము చేయుటద్వారా, ఏ వ్యక్తి కైనను మరణము కలుగజేయు వారెవరైనను, రెండు సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

బిడ్డను లేకఉన్మతు డైన వ్యక్తిని ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయుట.

305. పదునెనిమిది సంవత్సముల లోపు వయస్సుగల ఏ వ్యక్తి యైనను, ఉన్మత్తుడగు ఏ వ్యక్తి యైనను, మతి బ్రమణముగల ఏ వ్యక్తి యైనను, జడుడు ఎవరైనను, లేక త్రాగుడు మత్తులో ఉన్న ఏ వ్యక్తి యైనను, ఆత్మహత్య చేసికొనినయెడల, అట్టి ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయువా రెవరై నను మరణ దండనతో గాని, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరములకు మించని కాలావధికి కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయుట.

306. ఏ వ్యక్తి యై నను ఆత్మహత్య చేసికొనినచో, అట్టి ఆత్మహత్య చేసికొనుటకు దుష్ప్రేరణ చేయు వారెవరైనను పది సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు. హత్యా ప్రయత్నము.

307. ఎవరై నను ఎట్టి ఉద్దేశముతో లేక ఎట్టి ఎరుకతో మరియు ఎట్టి పరిస్థితులలో ఏదేని కార్యమును చేసి మరణమును కలుగజేసియుండినచో అతడు హత్యచేసిన దోషియై యుండెడివాడా, అట్టి ఉద్దేశముతోను, లేక ఎరుకతోను మరియు అట్టి పరిస్థితులలోను ఆ కార్యమును చేయు నతడెవరైనను పది సంవత్సములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడును మరియు జుర్మానకు కూడా పాత్రుడగును. మరియు, అట్టి కార్యము ద్వారా ఏవ్యక్తికైనను ఘాత కలిగింపబడినచో, అపరాధి యావజ్జీవ కారావాసముతో గాని, ఇంతకు పూర్వము పేర్కొనబడినట్టి శిక్షకు గాని పాత్రుడగును.

యావజ్జీవ ఖైదీలు చేయు ప్రయత్నములు,

యావజ్జీవ కారావాసమునకు దండనోత్త రువు ఈయబడియుండి, ఈ పరిచ్చేదము క్రింద అపరాధము చేయు ఏ వ్యక్తి యైనను ఘాత కలిగించినచో మరణ దండనతో శిక్షింపబడవచ్చును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' ను చంపవలేనని ఉద్దేశముతో, అతనికి మరణము కలిగించినచో తాను హత్యా దోషియగునట్టి పరిస్థితులలో, 'ఏ' తుపాకిని 'జడ్' పై కాల్చును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షాపాత్రుడగును.

(బీ) పసిబిడ్డకు మరణము కలిగించు ఉద్దేశముతో 'ఏ ' ఆ బిడ్డను నిర్మానుష్యమైన స్థలమునంద, అరక్షితముగా వదలివేయును. ఆ బిడ్డ మరణించినప్పటికిని, ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసిన వాడగును. . (సీ) 'జడ్' ను హత్య చేయవలెనని ఉద్దేశించి 'ఏ' ఒక తుపాకిని కొని, దానిని మందుగుండుతో నింపున, 'ఏ ' ఇంకను అపరాధమును చేయలేదు. 'ఏ' ఆ తుపాకిని 'జడ్' పై కాల్చును. అతడు ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగుసు, మరియు కాల్పులు జరుపుట ద్వారా అతడు 'జడ్' ను గాయపరచినచో అతడు ఈ పరిచ్ఛేదము మొదటి పేరాయొక్క చివరి భాగమునందలి నిబంధనానుసారముగల శిక్షకు పాత్రుడగును,

(డీ) 'జడ్' ను విష ప్రయోగము చేయుట ద్వారా హత్య చేయవలెనని ఉద్దేశించి, 'ఏ' విషమును కొని తనవద్ద నున్న ఆహారములో దానిని కలుపును. ' ఏ.” ఈ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును ఇంకను చేయలేదు. 'ఏ' ఆ ఆహారమును 'జడ్' బల్లపై ఉంచుసు, లేక 'జడ్' బల్ల పై పెట్టుటకై 'జడ్'యొక్క సేవకులకు దానిని అందించును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసిన వాడగును.

అపరాధిక మానవ వధ చేయుటకు ప్రయత్నము.

308. ఏదేని కార్ద్యమును ఎట్టి ఉద్దేశముతో లేక ఎట్టి ఎరుకతో, మరియు ఎట్టి పరిస్థితులలో ఎవరైనను చేసి మరణమును కలుగజేసి యుండినచో అతడు హత్య కానట్టి అపరాధిక మానవవధ చేసిన దోషియై యుండెడి వాడో, అట్టి ఉద్దేశముతోను, లేక ఎరుకతోను, మరియు అట్టి పరిస్థితులలోను ఆ కార్యమును చేయు వారెవరై నను మూడు సంవత్సరముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానా తో గాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు, మరియు అట్టి కార్యము ద్వారా ఏ వ్యక్తి కైనను, ఘాత కలిగింపబడినచో, ఏడు సంవత్సముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని, శిక్షింపబడుదురు.

ఉదాహరణము

ఎట్టి పరిస్థితులలో తాను మరణమును కలుగజేసి యుండినచో హత్యకానట్టి అపరాధిక మానవవధ చేసిన దోషియై యుండెడివాడో, అట్టి పరిస్థితులలో 'ఏ' అకస్మాత్తు గా కలిగిన తీవ్ర ప్రకోపనమునకు గురియై 'జడ్' "పై పిస్తోలును కొల్చును. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసిన వాడగును.

ఆత్మహత్య చేసికొనుటకు ప్రయత్నము.

309. ఆత్మహత్య చేసికొనుటకు ప్రయత్నము చేసి, అట్టి అపరాధము చేయుటకై ఏదేని కార్యమును చేయు వారెవరైనను, ఒక సంవత్సరము దాకా ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని,జుర్మానాతో గాని ఈ రెండింటితో గాని, శిక్షింపబడుదురు.

థగ్గు

310. ఈ చట్టము చేయబడిన పిమ్మట ఎప్పుడైనను, హత్య చేయుట ద్వారా గాని, హత్య సహితముగ గాని దోపిడి చేయుటకై నను, బిడ్డలను ఎత్తుకు పోవుటకై నను ఎవరేని ఇతరునితో, లేక ఇతరులతో అలవాటుగా జట్టుగా యుండు నతడెవరైనను థగ్గు అనబడును.

311. థగ్గు అయిన ఎవరైనను, యావజ్జీవ కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడా పాత్రుడగును.

గర్భస్థులైన బిడ్డలకు హానిని కలిగించుట, శిశువులను అరక్షితముగా వదిలి వేయుట,

జననములను కప్పిపుచ్చుట--వీటిని గురించి.

గర్భస్రావము కలిగించుట.

312. గర్భవతియైన స్త్రీకి స్వచ్ఛందముగా గర్భస్రావము కలిగించువారెవరైనను, అటు గర్భస్రావమున కలిగించుట సద్భావముతో ఆ స్త్రీ ప్రాణమును కాపాడు నిమిత్తము కానిచో, మూడు సంవత్సములదాక ఉండగలు కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు, మరియు పిండము కదలాడుచున్న స్థితిలో ఆ స్త్రీ ఉన్నచో, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు,మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

విశదీకరణము :- తనకు తానే గర్భ స్రావము కలిగించుకొను స్త్రీ ఈ పరిచ్ఛేదము భాసములోనికి వచ్చును.

స్త్రీ సమ్మతి లేకుండ గర్భస్రావముకలిగించుట,

313. పిండము కదలాడెడి స్థితిలో స్త్రీ ఉన్నను లేకున్నను, ఆ స్త్రీ సమ్మతి లేకుండా పై కడపటి పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధమును చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

గర్భ స్రావమును కలిగించు ఉద్దేశ్యముతో చేసిన కార్యము ద్వారా మరణము కలుగుట.

314. గర్భవతియైన స్త్రీకి గర్భస్రావము కలిగించవలెనను ఉద్దేశముతో అట్టి స్త్రీకి మరణము కలిగించునట్టి ఏదేని కార్యమును చేయు వారెవరైనను, పది సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

స్త్రీ సమ్మతి లేకుండా ఆ కార్యమును చేసినచో

ఆ స్త్రీ సమ్మతి లేకుండ ఆ కార్యమును చేసినచో యావజ్జీవ కారావాసముతోగాని, పైన పేర్కొనబడిన శిక్ష తో గాని శిక్షింపబడుదురు.

విశదీకరణము : -- ఆ కార్యము చేసి నందు వలన మరణము కలుగగలదని అపరాధికి తెలిసియుండ వలెననుట ఈ ఆపరాధమునకు అవశ్యకము కాదు

సజీవముగా బిడ్డ జన్మించకుండజేయవలెనను లేక జన్మించిన పిమ్మట ఆ బిడ్డకు మరణము కలిగించవలెనను ఉద్దేశ్యముతో చేసిన కార్యము.

315. బిడ్డ సజీవముగా జన్మించకుండా చేయవలెనను లేక జన్మించిన పిమ్మట మరణించినట్లు చేయవలెనను ఉద్దేశముతో, బిడ్డ పుట్టుటకు పూర్వము ఏదేని కార్యమును చేసి, తద్వారా ఆ బిడ్డ సజీవముగా జన్మించకుండా చేయలేక జన్మించిన పిమ్మట మరణించునటు చేయువారెవరైనను, సద్భావముతో తల్లి ప్రాణము కాపాడు నిమిత్తము, అట్టి కార్యము చేయనిచో, పది సంవత్సముల దాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతో గాని, ఈ రెంటితో గాని శిక్షింపబడుదురు.

అపరాధిక మానవ వధ అగునట్టి కార్యముద్వారా గర్భములో కదలాడు స్థితిలో నున్న బిడ్డకు మరణము కలుగించుట.

316. ఏదేని కార్యము ద్వారా తాను మరణమును కలిగించినచో అపరాధిక మానవధ చేసిన దోషియై యుండెడి పరిస్థితులలో ఆ కార్యమును చేసి తద్వారా గర్భములో కదలాడు స్థితిలో నున్న బిడ్డకు మరణము కలుగజేయు వారెవరైనను పది సంవత్సములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

ఉదాహరణము

గర్బిణి స్త్రీ కి మరణము కలిగించి యుండినచో అపరాధిక మానవవవధ అగునట్టి ఒక కార్యమును ఆ స్త్రీ కి మరణమును కలుగగలదని తెలిసి యుండియు 'ఏ' చేయును.ఆ స్త్రీ కి హాని కలిగినది, కాని ఆమె మరణించ లేదు. అయితే ఆమె గర్భములో కదలాడు స్థితిలో వున్న బిడ్డకు తద్వారా మరణము కలిగినది, 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధము చేసిన వాడగును.


పండ్రెడు సంవత్సరముల లోపు వయసుగల బిడ్డను, తల్లి గాని, తండ్రిగాని, ఆ బిడ్డ రక్షణ బాధ్యత కలిగియున్న వ్యక్తి గాని అరక్షితముగ వదలివేయుట మరియు పరిత్యజించుట.

317. పండ్రెండు సంవత్సరముల లోపు వయస్సుగల బిడ్డ యొక్క తండ్రి లేక తల్లియై యుండి, లేక అట్టి, బిడ్డ రక్షణ బాధ్యతను కలిగి యుండి, అట్టి బిడ్డను పూర్తిగా పరిత్యజించు ఉద్దేశముతో ఏ స్థలమునందైన ను అట్టి బిడ్డను అరక్షితముగా వదలివేయు లేక విడిచి వెళ్లు వారెవరైనను, ఏడు సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము :- అరక్షితముగా వదలివేయుట వలన బిడ్డ మరణించినచో, హత్య చేసినందుకుగాని, సందర్భానుసారముగా, అపరాధిక మానవవధ చేసినందుకుగాను, అపరాధీని విఛారణకు గురిచేయపకుండా నివారించుట, ఈ పరిచ్ఛేదము యొక్క ఉద్దేశము కాదు. శవమును రహస్యముగ పాతి పెట్టుట మొదలగునవి చేయుటద్వారా జననమును కప్పిపుచ్చుట.

318. జన్మించుటకు ముందుగాని, జన్మించుటకు తరువాతగాని, జనన సమ యమున గాని, బిడ్డ ఎప్పుడు మరణించినను, రహస్యముగా అట్టి బిడ్డ శవమును పాతి పెట్టి యైనను మరోక విధముగా నై నను అట్టి బిడ్డ యొక్క జననమును ఉద్దేశ పూర్వకముగా కప్పిపుచ్చుటకు ప్రయత్నించువారెవరైనను రెండు సంవత్సవరముల దాక ఉండగల కాల వధికి రెంటిలో ఒక రకపు కారావసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఘాతను గురించి

ఘాత.

319. ఏ వ్యక్తి కైనను శారీరకమైనబాధను, రోగమును లేక అంగవైకల్యమును కలిగించువారెవరైనను ఘాత కలుగ జేసినట్లు చెప్పబడుదురు.

దారుణమైన ఘాత.

320. ఈ క్రింది రకము ఘాతలు మాత్రమే “దారుణమైనవి.” అని అనబడును.

మొదటిది :– పుంస్త్వమును పోగొట్టుట.

రెండవది :-ఏ కంటి దృష్టినై నను శాశ్వతముగా పోగొట్టుట,

మూడవది : చెవి యొక్క వినికిడి శక్తి నై నను శాశ్వతముగా పోగొట్టుట.

నాల్గవది; ఏదేని అవయవమును లేక కీలును పోగొట్టుట.

ఐదవది :- ఏదేని అవయ ము లేక కీలు యొక్క పాటవమును నాశనమొనర్చుట, లేక శాశ్వతముగ వికల మొనర్చుట.

ఆరవది ---- తలను లేక ముఖమును శాశ్వతముగా వికృత మొనర్చుట.

ఏడవది :- ఎముకను లేక పంటిని విరుగ గొట్టుట, లేక తొలగదోయుట.

ఎనిమిదవది : ప్రాణాపాయమును కలిగించునట్టి, లేక బాధిత వ్యక్తిని ఇరువది దినముల వరకు తీవ్రమైన శారీరక బాధకు గురిచేయునట్టి లేక మామూలు పనులను చేసికొనజాలకుండునట్లు చేయునట్టి ఏదైన ఘాత.

స్వచ్ఛందముగా ఘాతను కలిగించుట,

321. ఏదేని కార్యము చేయుట ద్వారా ఏ వ్యక్తినై నను ఘాత కలిగించవలెనను ఉద్దేశముతో, లేక తాసు తద్వారా ఏ వ్యక్తి కై నను ఘాత కలిగించగలనని తెలిసియుండియు, ఆ కార్యమును చేసి ఏ వ్యక్తి కైనను తద్ద్వారా ఘాతను కలిగించు వారెవరైనను "స్వచ్ఛందముగా ఘాత కలిగించినట్లు" చెప్పబడుదురు.

స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.

322. స్వచ్ఛందముగా ఘాతను కలుగజేయునతడెవరై నను, తాను కలిగించవలెనని ఉద్దేశించినట్టి, లేక కలిగించగలనని ఎరిగియున్నట్టే ఘాత దారుణమైన ఘాతయైనచో, మరియు తాను కలుగజేసినట్టి ఘాత దారుణమైన ఘాత యె నచో, “స్వచ్చందముగా దారుణమైన ఘాత కలిగించినట్లు" చెప్పబడును.

విశదీకరణము :- ఒక వ్యక్తి దారుణమైన ఘాత కలిగించవలెనని ఉద్దేశించి, లేక కలిగించగలనని ఎరిగియుండి, దారుణమైన ఘాతను కలిగించినప్పుడు తప్ప, స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కలిగించినట్లు చెప్పబడడు. కాని ఒక రకపు దారుణమైన ఘాత కలిగించవలెనని ఉద్దేశించి, లేక కలిగించగలనని ఎరిగియుండి వాస్తవముగా మరొక రకపు దారుణమైన ఘాతను కలిగించినచో, అతడు స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కరిగించినట్లు చెప్పబడును.

ఉదాహరణము

'జడ్' ముఖమును శాశ్వతముగ వికృత మొనర్చవలెనని 'ఏ' ఉద్దేశించి లేక వికృతము కాగలదని ఎరిగియుండి 'జడ్' ను ఒక దెబ్బ కొట్టును. ఆ దెబ్బ 'జడ్' ముఖమును శాశ్వతముగా వికృత మొనర్చదు. కాని, 'జడ్' ను ఇరువది దినముల వరకు తీవ్రమైన శారీరక బాధ అనుభవించునట్లు చేయును. 'ఏ' స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కలిగించిన వాడగును.

స్వచ్ఛందముగా ఘాత కలిగించినందుకు శిక్ష.

323. 334వ పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించు సందర్భములో తప్ప, స్వచ్ఛందముగా ఘాతను కలిగించు వారెవరైనను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయల దాకా విస్తరించగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు. అపాయకరమైన ఆయుధములు లేక ఏదేని సాధనముల ద్వారా స్వచ్ఛందము గా ఘాతను కలుగజేయట.

324. 334వ పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించు సందర్భములో తప్ప, షూట్ చేయుట, పొడుచుట, లేక సరకుల కొరకైన ఏదేని ఉపకరణము ద్వారా గాని దాడిచేయు ఆయుధముగా వాడబడినయెడల మరణమును కలిగించగల ఏదేని ఉపకరణము ద్వారాగాని, నిప్పు లేక ఏదేని వేడి పదార్ధము ద్వారా గాని, ఏదేని విషము లేక ఏదేని క్లారక పదార్ధము ద్వారా గాని, ఏదేని ప్రేలుడు పదార్థ ముద్వారా గాని, శ్వాస పీల్చుకొనుట, మింగుట లేక రక్తములోనికి ఎక్కించుటవలన మనుష్యుని శరీరమునకు హాని కలిగించు ఏదేని పదార్ధము ద్వారా గాని, ఏదేని జంతువు ద్వారా గాని, స్వచ్ఛందముగా ఘాతను కలుగజేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

స్వచ్చందము గా దారుణమైన ఘాతను కలిగించినందుకు శిక్ష.

325. 335వ పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించు సందర్భములో తప్ప, స్వచ్ఛందముగా దారుణమైన ఘాత కలుగజేయు వారెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

అపాయకరమైన ఆయుధములు లేక సాధనముల ద్వారా స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట,

326. 335వ పరిచ్ఛేదపు నిబంధనలు వర్తించు సందర్భములో తప్ప, షూట్ చేయుట, పొడుచుట, లేక నరుకుట కొరకైన ఏదేని ఉపకరణము ద్వారా గాని, దాడిచేయు ఆయుధముగా వాడబడిన యెడల మరణమును కలిగించగల ఏదేని ఉపకరణము ద్వారా గాని, నిప్పు లేక ఏదేని వేడి పదార్ధము ద్వారా గాని, ఏదేని విషపు లేక ఏదేని కారక పదార్ధము ద్వారా గాని, ఏదేని ప్రేలుడు పదార్ధము ద్వారా గాని శ్వాస పీల్చుకొనుట, మింగుట లేక రక్తములోనికి ఎక్కించుట వలన మనుష్య శరీరమునకు హాని కలిగించు ఏదేని పదార్ధము ద్వారా గాని, ఏదేని జంతువు ద్వారా గాని, స్వచ్చందముగా దారుణమైన ఘాతను కలుగజేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఆస్తిని బలవంతముగ గ్రహించుటకు లేక శాసన విరుద్ధ కార్యమును నిర్భంధ పెట్టి చేయించుటకు స్వచ్ఛందముగ ఘాతను కలుగజేయుట.


327. బాధితుని నుండి లేక బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తి నుండి ఏదేని ఆస్తి నైనను, విలువగల సెక్యూరిటీనై నను, బలవంతముగ గ్రహించు నిమిత్తముగాని, బాధితుని లేక అట్టి బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని, శాసన విరుద్ధమైనట్టి , లేక అపరాధము చేయుటకు వీలు కలిగించునట్టి దేనినై నను చేయుటకై నిర్భంధ పెట్టు నిమిత్త ముగాని, స్వచ్ఛందముగ ఘాతను కలుగజేయు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఆపరాధమును చేయవలెనను ఉద్దేశ్యముతో విషము మొదలగు వాటిని ప్రయోగించి ఘాతను కలిగించుట.

328, ఏ వ్యక్తి కైనను ఘాతను కలిగించవలెనను ఉద్దేశముతో గాని, ఒక అపరాధమును చేయవలెనను లేక చేయుటకు వీలు కలిగించవలెనను ఉద్దేశముతో గాని, తాను తద్వారా ఘాతను కలిగించగలనని ఎరిగి యుండి గాని, అట్టి వ్యక్తి కి ఏదేని విషమునై నను, మైకము, మత్తు లేక అనారోగ్యము కలిగించు ఏదేని ఓషధిని, లేక ఇతర వస్తువునై నను పెట్ట లేక అతను పుచ్చుకొనునట్లు చేయు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఆస్తిని బలవంతముగా గ్రహించుటకు లేక శాసనవిరుద్ధ కార్యమును నిర్బంధ పెట్టి చేయించుటకు స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.

329. బాధితుని నుండి, లేక బాధితుని హితాభిలాషియగు వ్యక్తి నుండి ఏదేని ఆస్తి నైనను, విలువగల సెక్యూరిటీ నైనను, బలవంతముగ గ్రహించు నిమిత్త ముగాని, బాధితుని లేక అట్టి బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని శాసన విరుద్ధ మైనట్టి లేక అపరాధము చేయుటకు వీలు కలిగించునట్టి దేనినై నను చేయుటకై నిర్భంధ పెట్టు నిమిత్త ముగాని వ్యక్తి కి స్వచ్ఛందము గా దారుణమైన ఘాత కలిగించు వారెవరైనను యావజ్జీవ కారా వాసముతో గాని లేక పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి గాని రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు.

బలవంత పెట్టి నేరమును ఒప్పించుటకు లేక బలవంత పెట్టి ఆస్తిని తిరిగి ఇప్పించుటకు స్వచ్ఛందముగా ఘాతము కలిగించుట.

330. బాధితుని లేక బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని బలవంత పెట్టి, ఏదేని నేరము చేసినట్లు ఒప్పించుటకు గాని, ఏదేని అపరాధము లేక దుష్ప్రవర్తన కనిపెట్టుటకు దారితీయగల ఏదేని సమాచారమును ఇచ్చునట్లు చేయు నిమిత్తము గాని, ఏదేని ఆస్తి ని, లేక విలువగల 'సెక్యూరిటీని తిరిగి ఇచ్చుటకు, లేక తిరిగి ఇచ్చునట్లు చేయించుటకు, లేక ఏదేని క్లెయిమును లేదా ఆధ్యర్ధనను తీరునట్లు చేయుటకు, లేక ఏదేని ఆస్తి లేదా విలువగల సెక్యూరిటీ తిరిగి ఈయబడుటకు దారితీయగల సమాచారము నిచ్చునట్లు చేయుటకు, ఆ బాధితుని లేక బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని నిర్బంధ పెట్టు నిమిత్త ముగాని, స్వచ్ఛందముగా ఘాత కలిగించు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అను పోలీసు అధికారి, 'జడ్'ను నేరము చేసినట్లు ఒప్పుకొనునట్లు చేయించుట కై 'జడ్'ను చిత్రహింసకు గురి చేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును. (బి) ఏ' అను పోలీసు అధికారి దొంగిలింపబడిన ఆస్తి ఎచట నిక్షిప్తము చేయబడినదో చూపునటుల చేయుటకై 'బి'ని చిత్ర హింసకు గురిచేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసినవాడగును.

(సీ) 'ఏ' అను రెవెన్యూ అధికారి ' జడ్ ' నుండి రావలసిన కొన్ని రెవెన్యూ బకాయిలను చెల్లించునట్లు అతనిని బలవంత పెట్టుటకై 'జడ్'ను చిత్రహింసకు గురిచేయును, 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద ఆపరాధమున చేసినవాడగును.

(డీ) 'ఏ' అను జమీందారు ఒక రైతును మక్తా చెల్లించునట్లు బలవంత పెట్టుటకై చిత్రహింసకు గురి చేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసిన వాడగును.

బలవంత పెట్టి నేరమును ఒప్పించుటకు లేక బలవంత పెట్టి ఆస్తిని తిరిగి ఇప్పించుటకు స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.

331. బాధితుని లేక బాధితుని హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని బలవంత పెట్టి ఏదేని నేరము చేసినట్లు బలవంత పెట్టి ఒప్పించుటకు గాని, ఏదేని అపరాధమును లేక దుష్ప్రవర్తనను కని పెట్టుటకు దారితీయగల ఏదేని సమాచారము ఇచ్చునట్లు చేయు నిమిత్తముగాని ఏదేని ఆస్తిని లేక విలువ గల సెక్యూరిటీని తిరిగి ఇచ్చుటకు లేక తిరిగి ఇచ్చునట్లు చేయించుటకు లేక ఏదేని క్లెయిమును లేదా అభ్యర్థనను తీర్చునట్లు చేయుటకు లేక ఏదేని ఆస్తి లేదా విలువగల సెక్యూరిటీ తిరిగి ఈయబడుటకు దారితీయగల ఏదేని సమాచారము నిచ్చునట్లు చేయుటకు ఆ బాధితుని లేక ఆ బాధితుని హితాభిలాపియగు ఎవరేని వ్యక్తిని నిర్బంధ పెట్టు నిమిత్తముగాని స్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించు వారెవరైనను పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పబ్లికు సేవకుని భయపెట్టి అతడు తన కర్తవ్య నిర్వహణమును చూచుకొనునట్లు చేయుటకై స్వచ్చందముగా ఘాతను కలిగించుట.

332. పబ్లికు సేవకుడగు ఏ వ్యక్తి కైనను, ఆతడు అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును నిర్వహించు చున్నపుడు గాని, ఆ వ్యక్తి నైనను ఏ ఇతర పబ్లికు సేవకునై నను ఆట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును నిర్వహింపకుండ చేయవలెనను లేక భయపెట్టి మానుకొనునట్లు చేయవలెనను ఉద్దేశముతోగాని, ఆ వ్యక్తి అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యమును శాసనసమ్మతముగా నిర్వహించుటలో చేసిన, లేక చేయుటకు ప్రయత్నించిన ఏదేని పనియొక్క పరిణామముగ గాని, స్వచ్ఛందముగ ఘాతను కలిగించు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకుని భయపెట్టి అతడు తనకర్త వ్య నిర్వహణమును మానుకొనునట్లు చేయుటకై స్వచ్చం దముగా దారుణమైన ఘాతను కలిగించుట.

333. పబ్లికు సేవకుడగు ఏ వ్యక్తి కైనను, అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యమును నిర్వహించుచున్నపుడు గాని, ఆ వ్యక్తినైనను, ఏ ఇతర పబ్లికు సేవకునైనను, అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యమును నిర్వహింపకుండ చేయవలెనను లేక భయ పెట్టి మానుకొనునట్లు చేయవలెనను ఉద్దేశములో గాని, ఆ వ్యక్తి అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్త వ్యములను శాసనసమ్మతముగ నిర్వహించుటలో చేసిన, లేక చేయుటకు ప్రయత్నించిన ఏదేని పని యొక్క గాని, స్వచ్ఛందముగ దారుణమైన ఘాతను కలిగించు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

ప్రకోపనము కలిగించబడి స్వచ్చంద ముగ, ఘాతను కలిగించుట.

334. ప్రకోపనము కలిగించిన వ్యక్తి కి కాక ఏ ఇతర వ్యక్తి కై నను ఘాత కలిగించవలెనని తాను ఉద్దేశించక, ఘాత కలుగగలదని తాను ఎరిగియుండక, తీవ్ర ఆకస్మిక ప్రకోపనమునకు గురియై స్వచ్చందముగ ఘాతను కలిగించువారెవరైనను, ఒక మాసము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

ప్రకోపనమునకుగురియైస్వచ్ఛందముగా దారుణమైన ఘాతను కలిగించుట.


335. ప్రకోపనము కలిగించిన వ్యక్తికి కాక ఏ ఇతర వ్యక్తి కైనను, దారుణమైన ఘాతను కలిగించవలెనని తాను ఉద్దేశించక, దారుణమైన ఘాతకలుగ గలదని తాను ఎరిగియుండక, తీవ్ర ఆకస్మిక ప్రకోపమునకుగురియై స్వచ్ఛందముగ దారుణమైన ఘాతను కలిగించు వారెవరైనము, నాలుగు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, రెండు వేల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము : పరిచ్ఛేదము, 300లోని 1వ మినహాయింపు, ఏ వినాయింపులకు లోనై యున్నదో అవే వినాయింపులకు కడపటి పరిచ్ఛేదములు రెండును లోనై యుండును.

ఇతరుల ప్రాణమునకు గాని శరీరమునకుగాని అపాయకరమగు కార్యము,

336. మసుష్య ప్రాణమునకుగాని, ఇతరుల శరీరమునకు గాని ఆపాయము కలుగునంతటి తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును జేయు వారెవరై సను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి, రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, రెండు వందల ఏబది రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగానీ శిక్షింపబడుదురు. ఇతరుల ప్రాణమునకు గాని శరీరమునకుగాని అపాయకరమగు కార్యము చేసి ఘాతను కలిగించుట.

337. మనుష్య ప్రాణమునకుగాని, ఇతరుల శరీరమునకు గాని అపాయము కలుగునంతటి తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేయుట ద్వారా ఏ వ్యక్తి కైనను ఘాత కలిగించు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి, రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగానీ ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఇతరుల ప్రాణమునకు గాని శరీరమునకుగాని అపాయకరమగు కార్యము చేసి దారుణమైన ఘాతను కలిగించుట.

338. మనుష్య ప్రాణమునకుగాని, ఇతరుల శరీరమునకు గాని ఆపాయము కలుగునంతటి తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేయుటద్వారా ఏ వ్యక్తి కైనను దారుణమైన ఘాతను కలిగించువారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయల దాక ఉండగల జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అక్రమ అవరోధమును, అక్రమ పరిరోధమును గురించి :

అక్రమ అవరోధము.

339. ఏ వ్యక్తి నైనను అతడు వెళ్లుటకు హక్కుగల ఏదేని దిశలో పోకుండా చేయుటకై ఆ వ్యక్తిని స్వచ్ఛందముగా ఆటంకపరచు వారెవరైనను ఆ వ్యక్తిని ఆక్రమముగ ఆవరోధించినట్లు చెప్పబడుదురు,

మినహాయింపు :- భూమి పై లేక నీటి పై గల ప్రయివేటు దారిని ఆటంకపరచుటకు తనకు శాసన సమ్మతమైన హక్కు ఉన్నదని సద్భావముతో విశ్వసించువ్యక్తి ఆటంకపరచుట ఈ పరిచ్ఛేద భావములో అపరాధము కాదు,

ఉదాహరణము

ఒకదారి వెంట పోవుటకు 'జడ్'కు హక్కు ఉండగా, ఆ దారిని ఆటంకపరచుటకు తనకు హక్కుగలదని సద్భావముతో విశ్వసించకయే 'ఏ' ఆదారిని ఆటంకపరచును, అందువలన 'జడ్' ఆ దారి వెంట పోలేకపోయెను. 'ఏ' ఆక్రమముగా 'జడ్' ను ఆవరోధించిన వాడగును.

అక్రమ పరిరోధము.

340. ఏ వ్యక్తి నైనను అన్ని వైపుల నిశ్చిత హద్దులను దాటి పోకుండునట్లుగా ఆక్రమముగా అవరోధించి వారెవరైనను, ఆ వ్యక్తిని “ఆక్రమముగ పరిరోధించి” నట్లు చెప్ప బడుదురు.

ఉదాహరణములు

(ఏ) చుట్టూ గోడగల స్థలము లోనికి 'జడ్' పోవునట్లు చేసి, అందులో 'జడ్' ఉండగా 'ఏ' దానికి తాళము వేయును. ఆ విధముగా 'జడ్' తన చుట్టూ ఉన్న గోడల హద్దును దాటి, ఏ దిశలోనూ పోలేకుండ చేయబడినాడు."ఏ" అక్రమముగ 'జడ్'ను పరిరోధించిన వాడగును.

(బీ) ఒక భవనపు ద్వారములవద్ద తుపాకులతో మనుష్యులను 'ఏ' కాపలా ఉంచి, 'జడ్'కు ఆ భవనము నుండి అతడు బయటకి పోవుటకు ప్రయత్నించినచో వారు 'జడ్'ను కాల్చివేసెదరని, 'ఏ' చెప్పును. 'ఏ' అక్రమముగా 'జడ్'ను పరిరోధించిన వాడగును.

అక్రమముగా అవరోధించినందుకు శిక్ష

341. ఏ వ్యక్తి నైనను అక్రమముగ అవరోధించు వారెవరైనను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆక్రమముగా పరిరోధించినందుకు శిక్ష.

342. ఏ వ్యక్తి నైనను అక్రమముగ పరిరోధించు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మూడు లేక అంతకంటె ఎక్కువ దినముల వరకు అక్రమ పరిరోధను.

343. మూడు లేక అంతకంటే ఎక్కువ దినములవరకు ఏ వ్యక్తినైనను , అక్రమముగా పరిరోధించు వారెవరై నను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పది లేక అంతకంటే ఎక్కువ దినముల వరకు అక్రమ పరిరోధము.


344. పది లేక అంతకంటే ఎక్కువ దినములవరకు ఏ వ్యక్తి నైనను ఆక్రమముగ పరిశోధించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. ఒక వ్యక్తిని విడుదల చేయ వలసినదని రిట్ జారీ చేయబడి యుండగా ఆ వ్యక్తిని అక్రమముగా పరిరొధించుట.

345. ఏ వ్యక్తి నై నను విడుదల చేయవలసినదని తగురీతిగా రిట్ జారీ చేయబడినట్లు ఎరిగియుండియు, ఆ వ్యక్తిని అక్రమముగ పరిరోధములో ఉంచు నతడెవరైనను, ఈ ఆధ్యాయపు ఏదేని ఇతర పరిచ్ఛేదము క్రింద అతడు పాత్రుడగు ఏదేని కారావాస కాలావధికి అదనముగా, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును.

రహస్య ప్రదేశమున అక్రమ పరిరోధము,

346. ఒక వ్యక్తిని ఎవరినై నను పరిరోధించినట్లు ఆ పరిరోధింపబడిన వ్యక్తి యొక్క హితాభిలాపియగు ఏ వ్యక్తి కిగాని, ఏ పబ్లికు సేవకునికి గాని తెలియకుండునట్లుగా, లేక ఏ చోట పరిరోధము జరిగెనో ఇంతకు పూర్వము పేర్కొనిన ఏ వ్యక్తి చేతను లేక ఏ పబ్లికు సేవకుని చేతను తెలియబడకుండు లేదా కనుగొన బడకుండునట్లుగా చేయు ఉద్దేశమును సూచించునట్టి రీతిలో ఆ వ్యక్తిని అక్రమముగ పరిరోధించు నతడెవరైనను, అట్టి అక్రపు పరిరోధమునకు ఆతడు పాత్రుడగు ఏదేని ఇతర శిక్షకు అదనముగ, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడును

ఆస్తిని బలవంతముగా గ్రహించుటకు, లేక శాసన విరుద్ధ కార్యమును నిర్బంధ పెట్టి చేయించుటకు అక్రమముగ పరిశోధించుట.

347. పరిశోధింపబడిన ఎవరేని వ్యక్తి నుండి, లేక పరిరోధింపబడిన వ్యక్తి యొక్క హితాభిలాషియగు ఎవరేని వ్యక్తి నుండి, ఏదేని ఆస్తి నైనను, విలువగల సెక్యూరిటీనై నను బలవంతముగా గ్రహించు నిమిత్త ముగాని, పరిరోధింపబడిన ఎవరేని వ్యక్తిని, లేక అట్టి వ్యక్తి యొక్క హిఠాభిలాషియగు ఎవరేని వ్యక్తిని, శాసన విరుద్ధమై సట్టి దేనినై నను చేయుటకు లేక అపరాధము చేయుటకై వీలుకలిగించునట్టి ఏదేని సమాచారమును ఇచ్చుటకు నిర్బంధ పెట్టు నిమిత్త ముగాని, ఆ వ్యక్తిని అక్రమముగ పరిరోధించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బలవంత పెట్టి నేరమును ఒప్పించుటకు లేక బలవంత పెట్టి ఆస్తిని తిరిగి ఇప్పించుటకు అక్రమముగా పరిరొదించుట.


348. పరిరోధింపబడిన ఎవరేని వ్యక్తిని, లేక పరిరోధింప బడిన వ్యక్తి యొక్క హితాభిలాషియగు ఎవరేని వ్యక్తిని బలవంత పెట్టి ఏదేని నేరము చేసినట్లు ఒప్పించటకుగాని, ఏదేని అపరాధము లేక దుష్ప్రవర్తన కని పెట్టుటకు దారితీయగల ఏదేని సమాచారము ఇచ్చునట్లు చేయు నిమిత్త ముగాని, ఏదేని ఆస్తిని లేక విలువగల సెక్యూరిటీని తిరిగి ఇచ్చుటకు లేక తిరిగి ఇచ్చునట్లు చేయుటకు, లేక ఏదేని క్లెయిము లేక అభ్యర్ధనను తీర్చునట్లు చేయుటకు, లేక ఏదేని ఆస్తి లేక విలువగల సెక్యూరిటీ తిరిగి ఈయబడుటకు దారితీయగల ఏదేని సమాచారము నిచ్చునట్లు చేయుటకు పరిరోధింపబడిన వ్యక్తి ని లేక పరిరోధింపబడిన వ్యక్తి యొక్క హితా భిలాషియగు ఎవరేని వ్యక్తిని నిర్బంధ పెట్టు నిమిత్త ముగాని, ఆ వ్యక్తిని అక్రమముగ పరిశోధించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

అపరాధిక బల ప్రయోగమును, దౌర్జన్యమును గురించి :

బల ప్రయోగము

349. ఒక వ్యక్తి మరొక వ్యక్తి కి చలనము, చలన భేదము, లేక చలన రాహిత్యమును కలిగించిన చో, లేక అతడు ఆ మరొక వ్యక్తి యొక్క శరీరమునకు గాని, ఆ మరొకవ్యక్తి ధరించియున్న లేక కొనిపోవుచున్న దేనికిగాని, తనకు తగిలినదని ఆ మరొకవ్యక్తి కి అనిపించునంతగా అతని దగ్గరగా ఉన్న దేనికిగాని, తగులునట్లు ఏ వస్తు వునకైనను, చలనము, చలన భేదము లేక చలన రాహిత్యమును కలిగించిన చో, ఆవ్యక్తి కి ఆ మరొకని పై బల ప్రయోగము చేసినట్లు చెప్పబడును. అంతే, చలనము, చలన భేదము, లేక చలన రాహిత్యము కలుగజేయు వ్యక్తి ఇందు ఇటు పిమ్మట వివరింపబడిన మూడింటిలో ఒక విధముగా ఆ చలనమును, చలన భేదమును, లేక చలని రాహిత్యమును కలుగ జేసి యుండవలెను. ;

మొదటిది : తన శారీరక శక్తి వలన;

రెండవది : తన వలన గాని, ఎవరేని ఇతర వ్యక్తి వలన గాని మరొక కార్యము చేయబడకుండనే, ఆ చలనము, లేక చలన భేదము లేక చలన రాహిత్యము కలుగునట్లు ఏదేని వస్తువును అమర్చుట వలన ;

మూడవది : ఏదేని జంతువునకు చలనము, చలన భేదము , లేక చలన రాహిత్యము కలుగునట్లు చేయుటవలన;

అపరాధిక బల ప్రయోగము.

350. ఏదేని అపరాధమును చేయుటకై గాని, బల ప్రయోగమునకు గురిచేయబడిన వ్యక్తికి హానిని, భయమును లేక చికాకును, అట్టి బలప్రయోగము ద్వారా కలిగించవలెనని ఉద్దేశించిగాని, అట్టి బల ప్రయోగము కలిగించుట సంభవ మని ఎరిగియుండిగాని, ఏ వ్యక్తి పై నైనను ఆ వ్యక్తి సమ్మతి లేకుండ ఉద్దేశపూర్వకముగ బల ప్రయోగము చేయు వారెవరైనను, ఆ ఇతరుని పై అపరాధిక బల ప్రయోగము చేసినట్లు చెప్పబడుదురు.

ఉదాహరణములు

(5) 'జడ్' ఒక నది దరిన లంగరు దిగిన పడవలో కూర్చొని యున్నాడు. 'ఏ' ఆ లంగరును వూడదీసి తద్వారా ఉద్దేశపూర్వకముగ ఆ పడవను ప్రవాహములో కొట్టుకొని పోవునట్లు చేయును. ఇచట 'జడ్'కు “ఏ” ఉద్దేశపూర్వకముగ చలనము కలుగజేసినాడు, మరియు అతడు ఏ వ్యక్తి చేనై నను ఇతర కార్యమేదియు చేయబడకుండనే చలనము కలిగెడు రీతిలో వస్తుపులను అమర్చుట ద్వారా దీనిని చేసినాడు. అందువలన “ఏ” “జడ్” పై ఉద్దేశపూర్వకముగ బలప్రయోగము చేసినవాడగును, మరియు అతడు, ఏదేని అపరాధమును చేయుట గాని, 'జడ్' కు హానిని, భయమును లేక చికాకును ఈ బలప్రయోగము ద్వారా కలిగించవలెనని ఉద్దేశించి, లేదా కలిగించగలనని తెలిసి గాని, 'జడ్' యొక్క సమ్మతి లేకుండ అట్లు చేసి యుండినచో, “జడ్” పై “ఏ” అపరాధిక బలప్రయోగము చేసినవాడగును.

(బీ) 'జడ్' ఒక రథములో పోవుచున్నాడు. 'జడ్' యొక్క గుర్రములను “ఏ” కొరడాతో కొట్టి అవి వేగముగ పరిగెత్తునట్లు చేయును. ఇచట “ఏ” జంతువులను వాటి చలనమును మార్చుకొనునట్లు చేయుట ద్వారా 'జడ్' కు చలనములో మార్పు కలుగునట్లు చేసెను. అందువలన 'జడ్' పై “ఏ” బలప్రయోగము చేసినవాడగును మరియు తద్వారా " జడ్" కు హాని, భయము, లేక చికాకును కలిగించవలెనని " ఏ ” ఉద్దేశించి గాని, కలిగించగలనని తెలిసియుండి గాని దీనిని “జడ్” యొక్క సమ్మతి లేకుండ చేసియుండినచో, “జడ్” పై “ఏ" అపరాధిక బలప్రయోగము చేసినవాడగును.

(సీ ) 'జడ్' ఒక పల్లకిలో పోవుచున్నాడు. 'జడ్' ను దోచుకోనవలెనను ఉద్దేశముతో "ఏ” పల్లకి దండెను పట్టు కొని పల్లకిని ఆపును. 'జడ్' కు చలనము లేకుండ “ఏ” చేసినాడు మరియు అతడు తన శారీరక శక్తి తో దీనిని చేసినాడు. అందువల్ల "జడ్ పై “ఏ” బలప్రయోగము చేసినవాడగును, మరియు “జడ్” యొక్క సమ్మతి లేకుండ అపరాధమును చేయుటకై ఉద్దేశ పూర్వకముగ "ఏ" అట్లు చేసియుండినందున “ఏ" 'జడ్' పై అపరాధిక బలప్రయోగమును చేసినవాడగును.

(డీ) “ఏ” ఉద్దేశ పూర్వకముగ వీధిలో 'జడ్' ను నెట్టును. ఇచట “ఏ” తన శారీరక శక్తి తో తన శరీరమునకు అది 'జడ్' ను తాకునట్లు చలనము కలిగించినాడు. అతడు అందువల్ల ఉద్దేశపూర్వకముగా 'జడ్' పై బలప్రయోగము చేసినాడు. మరియు అతడు. తద్వారా 'జడ్' కు హాని, భయము లేక చికాకును కలిగించవలెనని ఉద్దేశించి గాని, కలిగించగలనని తెలిసియుండిగాని, 'జడ్' యొక్క సమ్మతి లేకుండ అట్లు చేసియుండినచో అతడు 'జడ్' పై అపరాధిక బలప్రయోగము చేసినవాడగును.

(ఈ) "ఏ" ఒక రాయిని, 'జడ్' కు గాని, 'జడ్' బట్టలకు గాని 'జడ్' కొనిపోవుచున్న ఏదేని వస్తువుకు గాని తగులవలెనని, లేక అది నీటికి తగిలి ఆ నీటిని 'జడ్' బట్టల పై కి గాని 'జడ్' కొని పోవుచున్న ఏదేని వస్తువు పైకి గాని చిమ్మవలెనని ఉద్దేశించి, లేక అట్లు జరుగగలదని తెలిసియుండి, విసరును. ఇచట రాయిని విసరుట వలవ ఏదేని వస్తువు 'జడ్' కు గాని 'జడ్' బట్టలకు గాని తగిలిన చో 'జడ్' పై 'ఏ' బలప్రయోగము చేసిన వాడగును మరియు అతడు తద్వారా 'జడ్' కు హాని, భయము, లేక చికాకును కలిగించవలెనని ఉద్దేశించి 'జడ్' యొక్క సమ్మతి లేకుండ అట్లు చేసియుండినచో అతడు. 'జడ్' పై అపరాధిక బల ప్రయోగము చేసిన వాడగును.

(ఎఫ్) 'ఏ' ఉద్దేశ పూర్వకముగ ఒక స్త్రీ యొక్క మేలిముసుగును తొలగించును. ఇచట 'ఏ' ఉద్దేశపూర్వకముగ ఆమె పై బలప్రయోగము చేసినాడు మరియు అతడు తద్వారా ఆమెకు హాని, భయము లేక చికాకును కలిగించవలెనని ఉద్దేశించిగాని లేక కలిగించవలెనని తెలిసియుండిగాని, ఆమె యొక్క సమ్మతి లేకుండ అట్లు చేసియుండిన చో, అతడు ఆమె పై అపరాధిక బల ప్రయోగము చేసినవాడగును,

(జీ) 'జడ్' స్నానము చేయుచున్నాడు. 'ఏ' మరుగుచున్నవని తాను ఎరిగియున్నట్టి నీటిని స్నానపు తొట్టిలో పోయును. ఇచట మరుగుచున్న నీరు 'జడ్' కు తాకునట్లు గాని, తగిలినవని 'జడ్' కు అనిపించునంత దగ్గరలో ఉన్న ఇతర నీటికి తాకునట్లు గాని 'ఏ' తన శారీరక శక్తి తో ఆ మరుగుచున్న నీటికి ఉద్దేశపూర్వకముగ చలనము కలిగించును.'ఏ' అందువలన 'జడ్' పై ఉద్దేశపూర్వకముగ బల ప్రయోగము చేసినాడు, మరియు అతడు తద్వారా 'జడ్' కు హాని, భయము, లేక చికాకును కలిగించవలెనని ఉద్దేశించిగాని, కలిగించగలనని తెలిసియుండిగాని 'జడ్' యొక్క సమ్మతి లేకుండ దీనిని చేసియుండినచో, 'ఏ' అపరాధిక బల ప్రయోగము చేసినవాడగును.

(హెచ్) 'జడ్' యొక్క సమ్మతి లేకుండ 'జడ్' పై కి దుముకునట్లు 'ఏ' ఒక కుక్కను ఉసిగొల్పును, ఇచ్చట 'జడ్' కు హాని, భయము లేక చికాకును కలిగించవలెనని 'ఏ' ఉద్ధేశించినచో, అతడు 'జడ్' ఫై అపరాధిక బల ప్రయోగము చేసినవాడగును. దౌర్జన్యము.

351. ఏ వ్యక్తి యైనను తానుచేయు ఏదేని సైగలేక సన్నాహము అచటనే ఉన్న ఎవరేని వ్యక్తి పై తాను ఆపరాధిక బలప్రయోగము చేయబోవుచున్నట్లు భీతిని అతనికి కలిగించవలెనను ఉద్దేశముతో లేక అట్టి భీతి కలుగగలదని తెలిసియుండి, అట్టి సైగ లేక సన్నాహము చేసినయెడల అతడు దౌర్జన్యము చేసినట్లు చెప్పబడును,

విశదీకరణము : -- మాటలు మాత్రమే దౌర్జన్యము కానేరపు : అయితే, ఒక వ్యక్తి అనెడి మాటలు అతని సైగలకు, లేక సన్నాహములకు ఆపాదించు అర్దము వలన ఆ సైగలు లేక సన్నాహములు దౌర్జన్యము కావచ్చును.

ఉదాహరణములు

(ఏ), 'జడ్' ను 'ఏ' కొట్టబోవుచున్నాడని 'జడ్' విశ్వసించునట్లు చేయవలెనను ఉద్దేశముతో, లేక అట్లు విశ్వసింపజేయగలనని తెలిసియుండి, 'జడ్' వైపు 'ఏ' తన పిడికిలిని చూపును. 'ఏ' దౌర్జన్యము చేసిన వాడగును.

(బీ) ఒక భీకరమైన కుక్కను 'జడ్' పై పడునట్లు 'ఏ' చేయబోవుచున్నాడని 'జడ్' విశ్వసించునట్లు చేయవలెనను ఉద్దేశముతో లేక అట్లు విశ్వసింపజేయగలనని తెలిసియుండి, 'ఏ' ఆ కుక్క యొక్క మూతి కట్టు సడలింప ప్రారంభించును, 'జడ్' పై 'ఏ' దౌర్జన్యము చేసిన వాడగును.

(సీ) “నిన్ను కొడతాను" అని 'జడ్' కు చెప్పును 'ఏ' కర్రను ఎత్తును. ఇచట 'ఏ' అనిన మాటలు ఎట్టి సందర్బములోను దొరన్యము క్రిందికి రానప్పటికిని, ఏ ఇతర పరిస్థితుల తోను కూడియుండనిచో చేసిన సైగ మాత్రమే దౌర్జన్యము క్రిందికి రాలేక పోయినప్పటికీని మాటలతో స్పష్టము చేయబడిన ఆ సైగ దౌర్జన్యము క్రిందికి రావచ్చును.

తీవ్ర ప్రకోపనము వలన గాక అన్యధా దౌర్జన్యము లేక ఆపరాధిక బలప్రయోగము చేసినందుకుశిక్ష.

352. ఒక వ్యక్తి కలిగించిన తీవ్ర ఆకస్మిక ప్రకోపనమువలన గాక అన్యధా ఆ వ్యక్తి పై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ గాని ఐదువందల రూపాయల దాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

విశదీకరణము :-- తీవ్ర ఆకస్మిక ప్రకోపనము ఆ అపరాధమునకు ఒక సాకుగా అపరాధియే కోరి తెచ్చుకొనినది గాని స్వచ్చందముగ కలిగించిన ప్రకోపనా ఫలితమైనది గాని అయినచో, లేక

ఆ ప్రకోపనము, శాసనమును పాటించుటలో చేయబడిన దేనివల్ల నైనను, పబ్లికు సేవకుని యొక్క అధికారములను శాసన సమ్మతముగ వినియోగించుటలో అట్టి పబ్లికు సేవకునిచే చేయబడిన దేనివల్ల నైనను కలిగించబడినదైనచో, లేక

ఆ ప్రకోపనము స్వయం రక్షణ హక్కును శాసన సమ్మతముగ వినియోగించుటలో చేయబడిన దేనివల్ల నైనను కలిగించబడినదైనచో---

అది ఈ పరిచ్చేదము క్రింది అపరాధమునకు గల శిక్షను తగ్గించదు.

ఆ ప్రకోపనము, అపరాధమునకుగల శిక్షను తగ్గించుటకు సరిపోవునంత తీవ్రమైనది, ఆకస్మికమై నది అగునా అనునది సంగతిని గూర్చిన ప్రశ్న అగును.

పబ్లికు సేవకుని భయపెట్టి అతడు కర్త వ్యమును నిర్వహించుటను మానుకొనునట్లు చేయుటకై దౌర్జన్యము, లేక అపరాధికణల ప్రయోగము చేయుట.

353. పబ్లికు సేవకుడగు ఏ వ్యక్తి కైనను, అతడు అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును నిర్వహించ చున్నపుడు గాని, ఆ వ్యక్తిని అట్టి పబ్లికు సేవకుడుగ. తన కర్తవ్యమును నిర్వహింపకుండ చేయ వలెనను లేక భయపెట్టి మానుకొనునట్లు చేయవలెనను ఉద్దేశముతో గాని, ఆ వ్యక్తి చే అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును శాసన సమ్మతముగా నిర్వహించుటలో చేసిన, లేక చేయుటకు ప్రయత్నించిన పనియొక్క ఏదేని పరిణామముగా గాని, దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

స్త్రీకి లజ్జా భంగము కలిగించు ఉదేశ్యముతో ఆమెపై దౌర్జన్యము లేక ఆపరాధిక బలప్రయోగము చేయుట.

354. ఏ స్త్రీ కైనను లజ్జా భంగము కలిగించు ఉద్దేశముతో లేక ఆమెకు లజా భంగము కలుగగలదని ఎరిగి ఆమె పై దౌర్యనము లేక అపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

తీవ్ర ప్రకోపనము వలన గాక అన్యధా ఒక వ్యక్తిని అగౌరవపరచు ఉద్దేశముతో దౌర్జన్యము లేక ఆపరాధిక బలప్రయోగము చేయుట.

355. ఒక వ్యక్తి కలిగించిన తీవ్ర ఆకస్మిక ప్రకోపనముసకులోనై గాక అన్యధా, ఆ వ్యక్తి పై దౌర్జన్యము, లేక అపరాధిక బల ప్రయోగము చేసి అతనిని అగౌరపపరచవలెనను ఉద్దేశముతో అతనిపై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు. ఒక వ్యక్తి కొనిపోవుచున్న ఆస్తిని దొంగిలించు ప్రయత్నములో దౌర్జన్యము, లేక ఆపరాధిక బల ప్రయోగము చేయుట.

356. ఒక వ్యక్తి ధరించియున్న దానిని లేక కొనిపోవుచున్న ఏదేని ఆస్తిని దొంగిలించు ప్రయత్నములో ఆ వ్యక్తి పై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములో గాని, జర్మానాలోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఒక వ్యక్తిని అక్రమముగ పరిరోధించు ప్రయత్నములో దౌర్జన్యము, లేక ఆపరాధిక బలప్రయోగము చేయుట.


357. ఏ వ్యక్తి నైనను ఆక్రమముగ పరిరోధించు ప్రయత్నములో ఆ వ్యక్తి పై దౌర్జన్యము, లేక ఆపరాధిక బలప్రయోగము చేయు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తీవ్ర ప్రకోపనమునకు లోనై దౌర్జన్యము, లేక ఆపరాధిక బల ప్రయోగము చేయుట.


358. ఏ వ్యక్తి యై నను కలిగించిన తీవ్ర ఆకస్మిక ప్రకోపనము వలన ఆ వ్యక్తి పై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, రెండు వందల రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము: ఈ కడపటి పరిచ్చేదము 352 వ పరిచ్చేదమునకు గల విశదీకరణమునకు లోనై యుండును.

వ్యపహరణము, అపహరణము బానిసత్వము మరియు బలవంతపు చాకిరిని గురించి

వ్యపహరణము.

359. వ్యపహరణము రెండు విధములు : భారత దేశమునుండి వ్యపహరించుట మరియు శాసన సమ్మత సంరక్షణ నుండి వ్యవహరించుట.

భారత దేశము నుండి వ్యవహరించుట.

360. ఎవరేని వ్యక్తిని, ఆ వ్యక్తి సమ్మతి లేకుండ, లేక ఆ వ్యక్తి తరపున సమ్మతించుటకు శాసనిక ప్రాధికారము గల వ్యక్తి సమ్మతి లేకుండ, భారతదేశపు సరిహద్దుల ఆవలకు కొంపోవు వారెవరైనను,ఆ వ్యక్తిని భారతదేశమునుండి వ్యవహరించినట్లు చెప్పబడుదురు.

శాసన సమ్మత సంరక్షణము నుండి వ్యవహరించుట.

361. పురుషుడైనచో పదహారు సంవత్సరముల లోపు వయస్సుగల, స్త్రీ అయినచొ పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల, ఎవరేని మైనరును లేక మతిస్తిమితము లేని ఎవరేని వ్యక్తి ని, అట్టి మైనరు యొక్క లేక అట్టి మతిస్తి మితము లేని వ్యక్తి యొక్క శాసనసమ్మత సంరక్షకుని రక్షణమునుండి, అట్టి సంరక్షకుని సమ్మతి లేకుండ తీసికొనిపోవు, లేక ఆశ చూపి తన వెంటవచ్చునట్లు చేయు వారెవరైనను, అట్టిమై నరును లేక ఆ వ్యక్తిని శాసన సమ్మత సంరక్షణము నుండి వ్యవహరించినట్లు చెప్పబడుదురు.

విశదీకరణము: ఈ పరిచ్చేదములోని “ శాసనసమ్మత సంరక్షకుడు ' అను పదపరిధియందు శాసనసమ్మతముగ అట్టి మైనరు, లేక ఇతర వ్యక్తి యొక్క రక్షణభారమునుగాని అభిరక్ష నుగాని అప్పగింపబడిన వ్యక్తి ఎవరైనను చేరియుండును.

మినహాయింపు : అనౌరసుడైన బిడ్డకు తానే తండ్రినని సద్భానముతో విశ్వసించునట్టి , లేక అట్టి బిడ్డ యొక్క శాసన సమ్మత అభిరక్షకు తానే హక్కుదారునని సద్భావముతో విశ్వసించునట్టి ఎవరేని వ్యక్తి చేయు కార్యమునకు అట్టి కార్యము దుర్నీతికరమైన, లేక శాసనవిరుద్ధమైన ప్రయోజనముకొరకు చేయబడినదైననే తప్ప, ఈ పరిచ్చేదము విస్తరించదు.

అపహరణము.

362. బల ప్రయోగముతో నిర్భంధ పెట్టి గాని, మోసముతో కూడిన ఏవేని పద్ధతులతో ప్రేరేపించి గాని, ఎవరేని వ్యక్తిని ఏదేని స్థలమునుండి వెళ్లి పోవునట్లు చేయు వారెవరైనను ఆ వ్యక్తిని అపహరణము చేసినట్లు చెప్పబడుదురు.

వ్యవహరించినందుకు శిక్ష,

363. ఏ వ్యక్తి నైనను భారతదేశమునుండిగాని, శాసన సమ్మత సంరక్షణమునుండిగాని వ్యవహరించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షంపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బిచ్చమెత్తించుటకు మైనరును వ్యవహరించుట లేక ఆవిటివానిని చేయుట.

363-ఏ. (1) ఎవరేని మైనరు, బిచ్చమెత్తుటకై నియోగింపబడుటకు గాను, లేక ఉపయోగింపబడుటకుగాను ఆ మైనరును వ్యవహరించు, లేక అందుకై , ఆ మైనరుయొక్క శాసన సమ్మత సంరక్షకుడు కాకుండియు, ఆ మైనరు యొక్క అభిరక్షను పొందువారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, (2) ఎవరేని మైనరు బిచ్చమెత్తుటకై నియోగింపబడుటకు గాను లేక ఉపయోగింపబడుటకు గాను, అట్టి మైనరును అవిటివానిని చేయు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

(3) మైనరుయొక్క శాసనసమ్మత సంరక్షకుడు కానట్టి ఏ వ్యక్తి యైనను, అట్టి మైనరును బిచ్చమెత్తుటకై నియోగించునెడల, లేక ఉపయోగించునెడల, బిచ్చమెత్తుటకై ఆ మైనరు నియోగింపబడుటకుగాను లేక ఉపయోగింపబడుటకుగాను ఆ మైనరును అతడు వ్యవహరించినాడని గాని అన్యథా ఆ మైనరు అభిరక్షను పొందినాడని గాని, తద్విరుద్ధముగా రుజువు చేయబడినవే తప్ప, పురోభావన చేయవలెను.

(4) ఈ పరిచ్ఛేదములో, -

(ఏ) ' బిచ్చమెత్తుట ' అనగా -

(1) ఒక బహిరంగ స్థలములో పాటపాడు, నాట్యము చేయు, జోస్యము చెప్పు, గారడీ పనులు చేయు లేక వస్తువులను అమ్ము నెపముతో గాని, అన్యథాగాని బిచ్చము అడుగుట లేక తీసికొనుట అనియు,

(ii) బిచ్చము అడుగు, లేక తీసుకొను నిమిత్తమై ఏవేని ప్రేవేటు ఆవరణములలో ప్రవేశించుట అనియు,

(iii) బిచ్చమును పొందు లేక బలవంత పెట్టి తీసుకొను లక్ష్యముతో తనదైనను, ఎవరేని ఇతర వ్యక్తి దైనను, లేక ఏదేని జంతువుదైనను ఏదేని వ్రణము, పుండు, గాయము, అంగవైకల్యము లేక వ్యాధిని బయటికి కనబరచుట, లేక ప్రదర్శించుట, అనియు,

(iv) బిచ్చము అడుగుటకై లేక తీసుకొనుటకై మైనరును ప్రదర్శన వస్తువుగ ఉపయోగించుట అనియు అర్థము.

(బి) “మైనరు" అనగా --

(i) మగవారి విషయములో పదునారు సంవత్సరముల లోపు వయసు గల వ్యక్తి అనియు,

(ii) ఆడవారి విషయములో పదునెనిమిది సంవత్సరములలోపు వయసు గల వ్యక్తి అనియు,అర్హము.

హత్య చేయుటకుగాను వ్యవహరించుట లేక అపహరించుట.


364 ఏ వ్యక్తి యైనను హత్య చేయబడుటకుగాను, లేక హత్య చేయబడగల అపాయమునకు గురిచేయబడులకుగాను, ఆ వ్యక్తిని వ్యసహరించు లేక అపహరించు వారెవరై నను యాపజీన కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణములు

(ఏ) ఒక దేవతకు 'జడ్' బలి ఈయబడవచ్చునను ఉద్దేశముతో, లేక బలి ఈయబడగలడని ఎరిగి యుండి " జడ్'ను 'ఏ' భారత దేశము నుండి వ్యవహరించును. "ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచించిన అపరాధమును చేసినవాడగును.

(బి) 'బి' హత్య చేయబడుటకుగాను, ఆతనిని అతని ఇంటి నుండి 'ఏ' బలవంతముగ ఎత్తు కొనిపోవును లేక ఆశ చూపించి తన వెంటవచ్చునట్లు చేయును. 'ఏ' ఈ పరిచ్చేదములో నిర్వచించిన అపరాధమును చేసిన వాడగును.

వ్యక్తిని రహస్యముగను,అక్రమముగను పరిరోధమునందుంచు ఉద్దేశముతో వ్యవహరించుట లేక అపహరించుట.

365. ఏ వ్యక్తి యైనను రహస్యముగను అక్రమముగను పరిరోధమునందుంచబడునట్లు చేయు ఉద్దేశముతో ఆ వ్యక్తిని వ్యవహరించు లేక అపహరించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వివాహము చేసికొనుట మొదలగువాటికిగాను బలవంత పెట్టుటకై

366. ఏ స్త్రీ యైనను, ఆమె యిష్టమునకు వ్యతిరేకముగా ఎవరేని వ్యక్తిని వివాహమాడవలసినదని బలవంతమునకు గురి కావలెనను ఉద్దేశములో, లేక ఆమె అట్లు బలవంత పెట్ట బడగలదని ఎరిగియుండిగాని, అక్రమ సంభోగము జరుపవలసినదని ఆమె బలవంతమునకు లేదా ప్రలోభమునకు గురికావలెనని, లేక ఆమె అట్లు బలవంత స్త్రీని, వ్యవహరించుట,అపహరించుట లేక ప్రేరేపించుట.

పెట్టబడగలదని లేదా ప్రలోభ పెట్ట బడగలదని ఎరిగియుండిగాని, ఆమెను వ్యవహరించు, లేక అపహరించు వారెవరైనను పది సంవత్సరములదాకి ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకి, కూడ పాత్రులగుదురు, మరియు ఈ స్మృతిలో నిర్వచింపబడినట్లు అపరాధికమైన జడిపింపు ద్వారా గాని, ప్రాధికారి దుర్వినియోగము ద్వారాగాని, లేక బలవంత పెట్టుటకైన ఏ ఇతర పద్ధతి ద్వారాగాని, ఏ స్త్రీ యై నను మరొక వ్యక్తి తో అక్రమ సంభోగము జరుపుటకై బలవంత పెట్టబడవలెనను, లేక ప్రలోభ పెట్టబడవలెనను ఉద్దేశముతో లేక అట్లు బలవంత పెట్ట బడగలదని లేదా ప్రలోభ పెట్ట బడగలదని ఎరిగియుండి, ఆ స్త్రీని ఏ స్థలము నుండి యైనను వెళ్లి పోవుటకు ప్రేరేపించు వారెవరైనను కూడ పైన చెప్పబడినట్లు శిక్షా పాత్రులగుదురు,

మైనరు బాలికను తార్చుట.

366-ఏ. పదునెనిమిది సంవత్సరముల లోపు వయసుగల ఎవరేని మైనరు బాలికను, ఆమె బలవంత పెట్టుబడి యైనను, ప్రలోభ పెట్ట బడియైనను ఇతర వ్యక్తి తో అక్రమ సంభోగమునకు గురి కావలెనను ఉద్దేశముతోగాని, ఆమె బలవంత పెట్ట బడియైనను, ప్రలోభ పెట్ట బడియైనను, ఇతర వ్యక్తితో అక్రమ సంభోగమునకు గురిచేయబడగలదని 'ఎరిగి యుండిగాని, ఏదేని స్థలము నుండి వెళ్లి పోవుటకు లేక ఏదేని కార్యమును చేయుటకు ఏ విధముగానై నను ప్రేరేపించు వారెవరైనను, పది సంవత్సరము లదాక ఉండగల కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విదేశము నుండి బాలికను-దిగుమతి చేయుట.

366-బీ. ఇరువది యొక్క సంవత్సరముల లోపు వయసు గల ఎవరేని బాలికను, ఆమె బలవంత పెట్టబడి యైనను, ప్రలోభ పెట్టబడియైనను ఇతర వ్యక్తి తో ఆక్రమ సంభోగమునకు గురి చేయబడవలెనను ఉద్దేశముతో గాని బలవంత పెట్టబడియైనను ప్రలోభ పెట్ట బడియైనను ఇతర వ్యక్తి తో ఆక్రము సంభోగమునకు గురిచేయబడగలదని ఎరిగియుండి గాని, భారతదేశమునకు వెలుపలి ఏదేని దేశము నుండియైనను జమ్మూ- కాశ్మీరు రాజ్యము నుండి యైనను భారతదేశము లోనికి దిగుమతి చేయు వారెవరైనను పది సంవత్సరములదాక ఉండగల కారావాసములో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వ్యక్తిని దారుణ ఘాతకు, బానిసత్వము మొదలగు వాటికి గురి చేయుటకు గాను వ్యవహరించుట లేక అపహరించుట.

367. ఏ వ్యక్తి యైనను దారుణమైన ఘాతకు లేక బానిసత్వమునకు లేక ఎవరేని వ్యక్తి యొక్క ప్రకృతి విరుద్ద కామ వాంఛకు గురిచేయబడుటకు, లేక గురిచేయబడగల అపాయములో పెట్ట బడుటకు గాని, అట్లు ఆ వ్యక్తి గురిచేయబడగలడని, లేక అట్టి అపాయములో పెట్ట బడగలడని ఎరిగియుండిగాని, ఆ వ్యక్తిని వ్యవహరించు, లేక అపహరించ వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు,

వ్యవహరింపబడిన, లేక అపహరింపబడిన వ్యక్తిని అక్రమముగ దాచియుంచుట, లేక పరిరోధమునందుంచి యుంచుట.

368. ఏ వ్యక్తి యైనను వ్యవహరింపబడినాడని, లేక అపహరింపబడినాడని ఎరిగియుండి, అట్టి వ్యక్తిని అక్రమముగ దాచియుంచు లేక పరిరోధించునతడెవరైనను, ఆతడు అట్టి వ్యక్తిని ఏ ఉద్దేశముతో లేక ఎరుకతో, లేక ఏ ప్రయోజనమునకై దాచియుంచినాడో లేక పరిశోధమునందుం చినాడో అదే ఉద్దేశముతో లేక ఎరుకతో, లేక ఆదే ప్రయోజనమునకై అతడు అట్టి వ్యక్తిని వ్యవహరించియుండిన లేక ఆపహరించియుండిన ఎట్లో అదే రీతిగా శిక్షింపబడును.

పది సంవత్సరములలోపు వయస్సుగల ఎవరేని బిడ్డ ఒంటిపై నుండి దొంగిలించు ఉద్దేశముతో ఆ బిడ్డను వ్యవహరించుట లేక అపహరించుట.


369. పది సంవత్సరముల లోపు వయసుగల బిడ్డ ఒంటి పై నుండి ఏదేని చరాస్తిని నిజాయితీ లేకుండ తీసికొనవలెనను ఉద్దేశముతో ఆ బిడ్డను వ్యవహరించు, లేక అపహరించు వారెవరైనసు, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఎవరేని వ్యక్తిని బానిసగ కొనుట లేక యిచ్చి వేయుట.

370. ఎవరేని వ్యక్తిని బానిసగ దిగుమతిచేయు, ఎగుమతిచేయు, తీసికొనిపోవు, కొను, అమ్ము, లేక ఇచ్చివేయు లేక ఎవరేని వ్యక్తిని బానిసగ తీసికొను, స్వీకరించు, లేక ఆతని ఇష్టము లేకుండ నిర్భంధించు వారెవరైనను, ఏడు, సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జర్మానాకు కూడ పాత్రులగుదురు.

పరిపాటిగా బానిసల వ్యాపారము చేయుట.

371. పరిపాటిగా బానిసలను దిగుమతిచేయు, ఎగుమతిచేయు, తీసికొనిపోవు, కొను, అమ్ము, లేక వారి విషయమున దుర్వ్యాపారముచేయు లేక వారి విషయముని వ్యాపారము చేయు వారెవరైనను యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు, జుర్మానాకు కూడ పాత్రులగుదురు. వేశ్యావృత్తి మొదలగు వాటి కొరకై మైనరును అమ్ముట.

372. పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల వ్యక్తి నెవరినై నను, అట్టి వ్యక్తి. ఏదో ఒక వయస్సులో వేశ్యావృత్తి కొరకైనను, ఎవరేని వ్యక్తితో అక్రమ సంభోగము జరుపుట కొరకైనను, శాసనసమ్మతము కానట్టియు దుర్నీతికరమైనట్టియు ఏ ప్రయోజనము కొరకైనను వినియోగింపబడవలెనను, లేక ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతోగాని, అట్టి వ్యక్తి ఏదో ఒక వయసులో అట్టి ఏదేని ప్రయోజనమునకు వినియోగింపబడునని లేక ఉపయోగింపబడునని ఎరిగియుండిగాని, అమ్ము, కిరాయికిచ్చు, లేక అన్యధా ఇచ్చివేయు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారాహసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.


విశదీకరణము 1 :-- పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల స్త్రీ ఒక వేశ్యకు, లేక వేశ్యాగృ హమును నడుపు లేదా నిర్వహించు ఎవరేని వ్యక్తికి అమ్మబడినపుడుగాని, కిరాయి కీయబడినప్పుడుగాని, అన్యధా ఇచ్చివేయబడినపుడుగాని, అట్టి స్త్రీని ఆట్లు ఇచ్చివేయు వ్యక్తి వేశ్యా వృత్తి కొరకై ఆమె ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఆమెను ఇచ్చి వేసినట్లు తద్విరుద్ధముగ రుజువు చేయబడునంత వరకు, పురోభావవ చేయవలెను.

విశదీకరణము 2:-- ఈ పరిచ్ఛేదము నిమిత్తము “అక్రమ సంభోగము " అనగా, వివాహము ద్వారా కలుపుబడనట్టి వ్యక్తుల మధ్యగాని వివాహముగా పరిగణింపబడనప్పటికిని, ఆ వ్యక్తులు చెందియున్నట్టి సమాజము యొక్క లేక వారు విభిన్న సమాజములకు చెందిన వారైనయెడల అట్టి రెండు సమాజముల యొక్క, వైయక్తిక శాసనముచే లేక ఆచారముచే వారి మధ్య వివాహ సదృశసంబంధమును సంఘటింపజేయునదిగా గుర్తింపబడు ఏదేని సంయోగము లేక సంబంధము ద్వారా కలుపబడనట్టి వ్యక్తుల మధ్యగాని, జరిగిన సంభోగము అని అర్థము.

వేశ్యావృత్తి, మొదలగు వాటికొరకై మైనరును కొనుట.

373. పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల వ్యక్తి నెవరినై నను, అట్టి వ్యక్తి ఏదో ఒక వయసులో వేశ్యావృత్తి కొరకైనను, ఎవరేని వ్యక్తితో అక్రమ సంభోగము జరుపుట కొరకై నను శాసన సమ్మతము కానట్టియు దుర్నీతి కర మైనట్టియు, ఏ ప్రయోజనము కొరకైనను నియోగింపబడవలెను, లేక ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతోగాని, అట్టి వ్యక్తి ఏదో ఒక వయసులో అట్టి ఏదేని ప్రయోజనమునకు నియోగింపబడునని లేక ఉపయోగింపబడునని ఎరిగియుండిగాని, కొను, కిరాయికి తీసికొను, లేక అన్యధా స్వాధీనమును పొందు వారెవరైనను పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు, కూడ పాత్రులగుదురు.

విశదీకరణము 1:--పదునెనిమిది సంవత్సరముల లోపు వయసుగల స్త్రీని కొను, కిరాయికి తీసికొను, లేక అన్యధా స్వాధీనమును పొందు ఎవరేని వేశ్య, లేక వేశ్యాగృహమును నడుపు లేక నిర్వహించు ఎవరేని వ్యక్తి, వేశ్యావృత్తి కొరకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో అట్టి స్త్రీని తన స్వాధీనములోనికి తీసికొనినట్లు, తద్విరుద్దముగ రుజువు చేయబడునంతవరకు, పురోభావన చేయవలెను,

విశదీకరణము 2 :-- "అక్రమ సంభోగము” 372 వ పరిచ్ఛేదము లోని అర్థమునే కలిగియుండును,

శాసన విరుద్దమైన బలవంతపు చాకిరి,

374. ఏ వ్యక్తి నై నసు, అతని ఇష్టమునకు వ్యతిరేకముగ చాకిరి చేయుమని శాసన విరుద్ధముగ బలవంత పెట్టు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

లైంగిక అపరాధములు

375. ఇందులో ఇటు పిమ్మట మినహాయింపబడిన సందర్భములలో తప్ప, ఈ క్రింది ఆరు రకములలో మానభంగము, దీని క్రింది కై నను వచ్చు పరిస్థితులలో ఒక స్త్రీ తో సంభోగము చేసిన పురుషుడు “మాన భంగము" చేసినట్లు చెప్పబడును -

మొదటిది :—ఆమె ఇష్టమునకు వ్యతిరేకముగ;

రెండవది :—ఆమె సమ్మతి లేకుండ;

మూడవది :—ఆమె సమ్మతితో--ఆమెకు గాని ఆమె ఎవరిపట్ల హితాభిలాషిగా ఉన్నదో ఆ వ్యక్తి కిగాని మరణము లేక ఘాతకలుగునని భయపెట్టి ఆమె సమ్మతిని పొందినపుడు;

నాల్గవది --- ఆమె సమ్మతితో. - తాను ఆమె భర్త కాననియు, ఆమెకు శాసన సమ్మతముగ ఎవరితో వివాహమై నదో, లేక వివాహమై నట్లు ఆమె విశ్వసించుచున్నదో అట్టి మరొక పురుషుడే తానని ఆమె విశ్వసించుటవలన ఆమె సమ్మతి ఇచ్చియుండినదనియు ఆ పురుషుడు ఎరిగియున్నప్పుడు ;

అయిదవది :- ఆమె సమ్మతితో-అట్టి సమ్మతి ఇచ్చినప్పుడు, మతిస్తి మితము లేని కారణమున గాని మత్తులో ఉన్న కారణమున గాని, అతడే స్వయముగానై నను మరొకరి ద్వారా నై నను ఏదేని మైకము కలిగించు లేక అనారోగ్యకరమైన పదార్దమును ఆమెకు ఇచ్చిన కారణమున గాని, ఆమె తాను సమ్మతించుచున్న దాని యొక్క స్వభావ పరిణామములను తెలుసుకొనజాలనిదై యున్నప్పుడు,

ఆరవది : ఆమె సమ్మతితో గాని సమ్మతిలేకుండ గావి—ఆమె పదహారు సంవత్సరముల లోపు వయస్సుగల దైనపుడు.

విశదీకరణము:- మాన భంగ అపరాధమునకు ఆవశ్యకమైన సంభోగమగుటకు అంతర్గ మనము చాలును,

మినహాయింపు :- ఒక పురుషుడు పదిహేను సంవత్సరముల లోపు వయస్సు గలది కానట్టి తన భార్యతో జరిపిన సంభోగము మానభంగ అపరాధముకాదు.

మానభంగము చేసినందుకు శిక్ష

376. (1). ఉపపరిచ్ఛేదము (2) లోని నిబంధనలలో తెలిపిన సందర్భములలో తప్ప, మానభంగము చేయు నతడెవరైనను, ఏడు సంవత్సరములకు తక్కువకాని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును; అయితే, అది యావజ్జీవ కారావాసముగాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముగాని కావచ్చును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును. కాని, మానభంగమునకు గురియైన స్త్రీ అతని భార్యయేయై యుండి ఆమె పండ్రెండు సంవత్సరముల లోపు వయస్సుగలది కానట్టి సందర్భములో, అతడు రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

అయితే, న్యాయస్థానము తీర్పులో పేర్కొనవలసిన, తగిన మరియు ప్రత్యేకమైన కారణములనుబట్టి ఏడు సంవత్సరములకంటె తక్కువైన కాలావధికి కారావాసదండన విధించవచ్చును.

(2) ఎవరైన-

(ఏ). తానొక పోలీసు అధికారియై యుండి,

(i) తాను నియమింపబడిన పోలీసు స్టేషను హద్దులలో, లేక

(ii) తాను నియమింపబడిన పోలీసు స్టేషనులోనిదై నను కాకున్నను , ఏదేని స్టేషన్ హౌస్ ఆవరణలో లేక

(iii) తన అభిరక్షలో ఉన్న లేక తనకు అధీనస్థుడైన పోలీసు అధికారి అభిరక్ష లో ఉన్న స్త్రీని మానభంగము చేసినచో, లేక

(బి) తానొక పబ్లికు సేవకుడై యుండి, తన పదవి ఆసరాతో, అట్టి పబ్లికు సేవకునిగా తన ఆభి రక్ష లో ఉన్న లేక తన అధీనస్తు డైన ఒక పబ్లికు సేవకుని అభిరక్షిలో ఉన్న ఒక స్త్రీని మానభంగము చేసినచో, లేక

(సీ) ఒక జైలు, బందీగృహము, లేక తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనముచే లేదా అట్టి శాసనము క్రింద స్థాపింపబడిన ఇతర ఆభిరక్ష స్థానము, లేక మహిళల లేదా బాలల సంస్థ - వీటిలో దేని యొక్క యాజమాన్యములో గాని సిబ్బందిలో గాని ఉండి, తన పదవీ ఆసరాతో అట్టి జైలు, బందీ గృహము, అభిరక్ష స్థానము, లేక సంస్థ లో ఉంటున్న వారిని ఎవరినైన మాన భంగము చేసినచో

(డి) ఒక ఆసుపత్రి యాజమాన్యములో, లేక సిబ్బందిలో ఉండి, తన పదవీ ఆసరాతో ఆ ఆసుపత్రిలో ఒక స్త్రీని మానభంగము చేసినచో, లేక

(ఈ) ఒక స్త్రీ గర్భవతియని ఎరిగియుండి ఆమెను మానభంగము చేసినచో, లేక

(ఎఫ్) పన్నెండు సంవత్సరముల లోపు వయసుగల స్త్రీని మానభంగము చేసినచో,

(జీ) సామూహికముగా మానభంగము చేసినచో,

ఆతడు పది సంవత్సరములకు తక్కువకాని కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడును . అయితే అది యావజ్జీవ కారావాసము కావచ్చును. మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును;

అయితే, న్యాయస్థానము తీర్పులో పేర్కొనవలసిన తగిన, మరియు ప్రత్యేకమైన కారణములను బట్టి పది సంవత్సరములకంటె తక్కువైన కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాస దండన విధించవచ్చును. విశదీకరణము 1:-ఒక ముఠాలోని వ్యక్తులలో ఒకరుగాని అంతకంటే ఎక్కువ మందిగాని ఆ ముఠా ఉమ్మడి ఉద్దేశమును సాధించుకొనుటలో ఒక స్త్రీని మానభంగము చేసినచో, ఈ ఉపరిచ్ఛేదపు భావములో వారిలో ప్రతి వ్యక్తి యు సామూహికముగా మానభంగము చేసినట్లు భావింపబడును.

విశదీకరణము 2 :- “మహిళల లేక బాలల సంస్థ " అనగా, అనాధ శరణాలయము, ఉపేక్షిత స్త్రీల, లేక బాలల గృహము, లేక వితంతుశరణాలయము, లేక ఏదేని ఇతర పేరుతో పిలువబడుచున్నదైనను, స్త్రీలను లేక బాలలను చేర్చుకొనుటకును, వారి సంరక్షణ కొరకును స్థాపింపబడి నిర్వహింపబడునట్టి సంస్థ అని అర్థము.

విశదీకరణము 3 :-- “ఆసుపత్రి" అనగా ఆసుపత్రి యొక్క ఆవరణ అని అర్థము, మరియు ఆ పద పరిధిలో, కోలుకొనుచున్న వ్యక్తు లనుగాని, వైద్య పరిచర్య అవసరమైన వ్యక్తు లనుగాని తిరిగి ఆరోగ్యవంతులనుగా చేయవలసియున్న వ్యక్తులను గాని చేర్చుకొని చికిత్సచేయు ఏదేని సంస్థ ఆవరణలు చేరియుండును.

వేర్పాటు సమయములో ఒక వ్యక్తి తన భార్యతో సంభోగించుట.

376-ఏ. తన భార్య వేర్పాటు డిక్రీ పొందియుండిగాని, ఏదేని ఆచారము లేక వాడుకనుబట్టి గాని, విడిగా నివసించుచుండగా, ఆమెతో ఆమె సమ్మతి లేకుండ సంభోగము జరిపినతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాపముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

పబ్లికు సేవకుడు తన అభిరక్షలో నున్న స్త్రీతో సంభోగించుట,

376-బి. పబ్లికు సేవకుడై యుండి, తన పదవీ ఆసరాతో అట్టి పబ్లికు సేవకునిగా, తన అభిరక్ష లోనున్న లేక తనకు ఆధీనస్ఠు డైన ఒక పబ్లికు సేవకుని అభిరక్ష లో ఉన్న ఎవరేని స్త్రీని, తనతో సంభోగము జరుపవలెనని ప్రేరేపించు లేక ప్రలోభ పెట్టు నతడెవరై నను, అట్టి సంభోగము మానభం గాపరాధము క్రిందికి రాకున్నను, అయిదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

జైలు, బందీ గృహము మొదలగువాటి అధీక్షకునిచే సంభోగము,

376-సీ. ఒక జైలు, బందీ గృహము, లేక తత్పమయుమున అమలునందున్న ఏదేని శాసనముచే లేదా అట్టి శాసనము క్రింద స్థాపింపబడిన ఇతర అభిరక్ష స్ఠానము లేక మహిళల, లేదా బాలల సంస్థ-వీటిలో దేనియొక్క మేనేజరుగాగాని ఆధీక్ష కుడుగాగాని ఉండి, తన పదవీ ఆసరాతో, అట్టి జైలు, బందీ గృహము, అభిరక్ష స్థానము లేక సంస్థలో ఉంటున్న ఎవరేని స్త్రీ ని తనతో సంభోగము జరుపవలెనని ప్రేరేపించు లేక ప్రలోభ పెట్టు నతడెవరైనను, అట్టి సంభోగము మాన భంగాపరాధము క్రిందికి రాకున్నను, అయిదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును. మరియు జార్మానాకు కూడ పాత్రుడగును.

విశదీకరణను 1:- “జై లు, బందీ గృహము, లేక ఇతర అభిరక్ష స్థానము, లేక మహిళల లేదా బాలల సంస్థకు సంబంధించి “ఆదీక్ష కుడు" అను పదపరిధిలో అట్టి జైలు, బందీ గృహము, అభిరక్ష స్థానము, లేక సంస్థలో ఏదేని ఇతర పదవియందుండి ఆ పదవినిబట్టి అచట ఉంటున్న వారిపై అధికారము వినియోగించుచున్న లేక నియంత్రణ కలిగివున్న వ్యక్తి చేరియుండును. "

విశదీకరణము 2 :-- "మహిళల లేదా బాలల సంస్థ " అను పదబంధమునకు 376వ పరిచ్ఛేదము లోని ఉపపరిచ్ఛేదము (2) యొక్క విశదీకరణము 2 లో గల అర్థమే ఉండును.

ఆసుపత్రి యొక్క యాజమాన్యము, లేక సిబ్బందిలోని వారెవరైనను ఆసుపత్రిలోని స్త్రీతో సంభోగము జరుపుట.

376–డీ. ఆసుపత్రియొక్క యాజమాన్యములో లేక ఆసుప త్రియొక్క సిబ్బందిలోని వాడై యుండి తన పదవి ఆసరాతో ఆసుపత్రిలోని ఏ స్త్రీ తో నైనను సంభోగించిననో, అట్టి సంభోగము మావభంగాపరాధము క్రిందికి రాకున్ననూ, అయిదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడును. మరియు జూర్మానాకు కూడ పాత్రుడగును.

విశదీకరణము :- "ఆసుపత్రి" అను పదమునకు పరిచ్ఛేదము 376 లోని ఉపపరిచ్ఛేదము (2) యొక్క విశదీకరణము 3 లోగల అర్థమే ఉండును.

ప్రకృతి విరుద్ధ అపరాధములను గురించి

ప్రకృతి విరుద్ధమగు అపరాధములు.

377. ఎవరేని పురుషునితో, స్త్రీ తో లేక జంతువుతో స్వచ్ఛందముగ ప్రకృతి విరుద్ధమైన మై ధునము సలుపు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటితో ఒకరకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-ఈ పరిచ్ఛేదములో వివరింపబడిన అపరాధమునకు ఆవశ్యకమైన మైధునమగుటకు అంతర్గమధనము చాలును,

అధ్యాయము—17

ఆస్తివిషయక అపరాధములను గురించి,

దొంగతనమును గురించి

దొంగతనము,

378. ఏదేని చరాస్తిని ఏవ్యక్తి స్వాధీనము నుండి యై నను తప్పించి ఆవ్యక్తి సమ్మతిలేకుండ, నిజాయితీ లేకుండ ఆ ఆస్తిని తీసికొను ఉద్దేశముతో, ఆట్లు తీసికొనుటకుగాను ఆ ఆస్తికి చలనము కలిగించు వారెవరైనను దొంగతనము చేసినట్లు చెప్పబడుదురు,

విశదీకరణము 1:--- ఒక వస్తువు భూబద్ధమై యున్నంతవరకు అది చరాస్తి కానందున దొంగతనమునకు గురిఅగునది కాడు. కాని అది భామినుండి వేరుచేయబడిన వెంటనే దొంగతనమునకు గురిచేయబడగలదగును.

విశదీకరణము 2:- ఏ కార్యము ద్వారా వేరుచేయుట జరిగినదో అదే కార్యమువలన కలిగింపబడిన చలనము దొంగతనము కావచ్చును.

విశదీకరణము 3:- ఒకవ్యక్తి ఒకవస్తువుకు వాస్తవముగ చలనము కలిగించుటవలననేగాక ఆ వస్తువు చలనమునకుగల అడ్డంకిని తొలగించుటవలన, లేక ఆ వస్తువును ఏదేని ఇతర వస్తువునుండి వేరుచేయుట వలన, ఆ వస్తువునకు చలనము కలిగించినట్లు చెప్పబడును.

విశదీకరణము 4:- ఒకవ్యక్తి ఏ పద్ధతి ద్వారా ఆయినను ఒక జంతువుకు చలనము కలిగించినచో, ఆతడు ఆ జంతువుకు చలనము కలిగించినట్లును, ఆట్లు కలిగిన చలన పరిణామముగా ఆ జంతువువలన చలనము కలిగించబడిన ప్రతి వస్తువుకు చలనము కలిగించినట్లును చెప్పబడును.

విశదీకరణము 5 --- ఈ నిర్వచనములో పేర్కొనిన సన్ముతి అభివ్యక్త మైనదైనను, గర్భితమైనదైనను కావచ్చును. మరియు స్వాధీనము కలిగియున్న వ్యక్తి గాని, సమ్మతి నిచ్చుటకు అభివ్యక్త మైన లేక గర్భితమైన ప్రాధికారమును పొందియున్న ఎవరేని వ్యక్తి గాని ఆ సమ్మతిని ఈయవచ్చును.

[{c|ఉదాహరణములు|}}

(1) బడ్' భూమిలోని ఒక చెట్టును, 'జడ్' స్వాధీనమునుండి నిజాయితీలేకుండ తీసికొనవలెనను ఉద్దేశముతో, 'జడ్' సమ్మతి లేకుండ, 'ఏ' ఆను నతడు కొట్టి వేయును. 'ఏ' అట్లు తీసికొనుటకుగాను ఆ చెట్టును పడగొట్టగానే అతడు దొంగతనము చేసిన వాడగును.

(బి) 'ఏ' అనునతడు కుక్కకు ఎరగానుండు వస్తువును తనజేబులో ఉంచుకొని, 'జడ్' యొక్క కుక్క ఆ ఎర వెంటబడునట్లు చేయును. 'జడ్' స్వాధీనమునుండి 'జడ్' సమ్మతిలేకుండ, నిజాయితీ లేకుండ ఆ కుక్కను తీసికొనిపోవుట “ఏ' ఉద్దేశమైనచో, 'జడ్' యొక్క కుక్క ఏ'ను వెంబడించుటకు మొదలిడగానే 'ఏ' దొంగతనమూ చేసినవాడగును.

(సీ) విలువైన వస్తువులుగల ఒక పెట్టెను మోయుచున్న ఎద్దు 'ఏ' కు యెదురుపడును. ఆ పెట్టెను నిజాయితీ లేకుండ తీసికొనుటకు గాను ఆతడు ఆ ఎద్దును ఒక దిక్కుకు మళ్లించును. ఎదు కదలగానే 'ఏ' ఆ పెట్టెను దొంగిలించినవాడగును.

(డీ) 'జడ్' యొక్క సేవకుడైన 'ఏ' ఆనువానికి 'జడ్'చే 'జడ్' యొక్క వెండిసాసూసుకు సంరక్షణ భారము అప్పగింపబడియుండగా, 'జడ్' సమ్మతిలేకుండ, నిజాయితీ లేకుండ ఆ వెండి సామానుతో 'ఏ' పారిపోవును. 'ఏ' దొంగతనము చేసిన వాడగును.

(ఈ) 'జడ్' ప్రయాణమై పోవుచు, తాను తిరిగి వచ్చువరకు తన వెండి సామానును గిడ్డంగి పాలకుడైన 'ఏ' అను వానికి అప్పగించును. 'ఏ' ఆ వెండి సామానును ఒక కంసాలివద్దకు గొంపోయి అమ్మును. ఇచ్చట ఆ వెండి సామాన్లు 'జడ్' స్వాధీనములో లేవు. అందువలన వాటిని 'జడ్' స్వాధీనమునుండి తప్పించుట జరుగదు. కనుక 'ఏ ' దొంగతనము చేయలేదు. కొన్ని అపరాధిక న్యాసభంగము చేసి యుండవచ్చును,

(ఎఫ్) 'జడ్' ఆక్రమణలో ఉన్న ఇంటిలోని బల్ల పై 'జడ్' ఉంగరమును 'ఏ' అనునతడు చూచును. ఇచట ఉంగరము 'జడ్' స్వాధీనములో ఉన్నది. 'ఏ' దానిని నిజాయితీ లేకుండ తొలగించినచో 'ఏ' దొంగతనము చేసినవాడగును. (జీ) ఎవరి స్వాధీనములోను లేకుండ ఒక రహదారిలో పడియున్న ఉంగరమును 'ఏ' అనునతడు చూచును. ఆతడు దానిని తీసికొనుట ద్వారా దొంగతనము చేసినవాడుకాడు. కాని, ఆస్తిని అపరాధిక దుర్వినియోగము చేసినవాడు కావచ్చును.

(హెచ్) 'జడ్' ఇంటిలో ఒక బల్ల పై 'జడ్' ఉంగరము పడి ఉండగా 'ఏ' అనునతడు చూచును. సోదా జరిగినచో తనను కని పెట్టుదురను భయముచే 'ఏ' ఆ ఉంగరమును తక్షణమే కైవసము చేసికొనుటకు సాహసించక, దానిని 'జడ్' కనుగొనుట ఎప్పటికీని అసంభావ్యమగు స్థలములో దాచును. ఉంగరము పోయిన విషయము మరువబడిన తరువాత దాచిఉంచిన స్థలమునుండి ఆ ఉంగరమును తీసికొని, విక్రయించవలెనను ఉద్దేశముతో 'ఏ' అట్టు దాచివాడు, ఇచట 'ఏ' ఆ ఉంగరమును మొట్టమొదటిసారి చూచి తీయగనే దొంగతనము చేసినవాడగును.

(ఐ) 'ఏ' తన గడియారమును, నగల వర్తకుడైన 'జడ్' అనునతనికి సరిచేయించుటకై ఇచ్చును. 'జడ్' దానిని తన దుకాణమునకు గొంపోవును. నగల వర్తకుడు ఆ గడియారమును శాసన సమ్మతముగ హామీగా ఉంచుకొనదగినట్టి ఋణమేదియు 'ఏ' అతనికి బాకీ లేడు. 'జడ్' దుకాణములోనికి 'ఏ' బహిరంగముగ ప్రవేశించి 'జడ్' చేతిలో ఉన్న తన గడియారమును బలాత్కారముగ లాగుకొని వెళ్లిపోవును. ఇచట 'ఏ' అపరాధిక అక్రమ ప్రవేశమును, దౌర్జన్యమును చేసియుండినప్పటికిని, అతడు చేసినది నిజాయితీ లేకుండ చేయనందున ఆతడు దొంగతనము చేసినవాడు కాడు.

(జె) 'జడ్' గడియారమును మరమ్మతు చేసినందుకు 'జడ్'కు 'ఏ' డబ్బు బాకీఉన్నందున, శాసన సమ్మతముగ ఆబాకీకి హామీగా ఆ గడియారమును 'జడ్' తనవద్ద ఉంచుకొనియుండగా, 'జడ్' యొక్క, బాకీకి హామీగా ఆ ఆస్తి 'జడ్'కు దక్కకుండ చేయు ఉద్దేశముతో, 'ఏ' ఆ గడియారమును 'జడ్' స్వాధీనము నుండి తప్పించి 'ఏ' తీసికొనినచో, అతడు దానిని నిజాయితీలేకుండ తీసికొనినందున దొంగతనము చేసినవాడగును.

(కె) అటులనే, 'ఏ' తన గడియారమును 'జడ్' వద్ద కుదువ పెట్టి ఆ గడియారము పై తాను తీసికొనిన అప్పును చెల్లించకుండ, 'జడ్' సమ్మతి లేకుండ ఆ గడియారమును “జడ్' స్వాధీనము నుండి తప్పించి తాను తీసికొనినచో, ఆ గడియారము అతవిదేయైనను, ఆతడు దానిని నిజాయితీ లేకుండ తీసికొనినందున, దొంగతనము చేసిన వాడగును.

(ఎల్) 'జడ్'కు చెందిన వస్తువును 'జడ్' స్వాధీనము నుండి తప్పించి 'జడ్' సమ్మతి లేకుండ 'ఏ' అనునతడు తీసికొనను. దానిని 'జడ్'కు తిరిగి ఇచ్చి వేసినందుకు బహుమానముగ 'జడ్' నుండి డబ్బు రాబట్టు కొనువరకు దానిని తనవద్ద నే ఉంచుకొనవలెనను ఉద్దేశముతో 'ఏ' అట్లు చేసెను. ఇచట 'ఏ' నిజాయితీ లేకుండా తీసికొనినాడు. అందువలన 'ఏ' దొంగతనము చేసినవాడగును.

(ఎమ్) 'జడ్'కు స్నేహితుడగు 'ఏ' 'జడ్' లేనప్పుడు 'జడ్' యొక్క గ్రంధాలయములోనికి వెళ్లి పుస్త కమును, కేవలము చదువుకొను నిమిత్తమును, తిరిగి ఇచ్చివేయవలెనను ఉద్దేశముతోను 'జడ్' అభివ్యక్త సమ్మతి లేకుండ తీసికొని పోవును. ఇచట బహుశా 'జడ్' యొక్క పుస్తకమును ఉపయోగించుకొనుటకు 'ఏ' తనకు 'జడ్' యొక్క గర్భిత సమ్మతి కలదని తలచియుండవచ్చును. ఇదే 'ఏ' యొక్క భావము అయినచో 'ఏ' దొంగతనము చేయలేదు.

(ఎస్) 'జడ్' యొక్క భార్యను 'ఏ' అను నతడు ధర్మము చేయుమని అడుగుసు. ఆమె భర్త యైన 'జడ్'కు చెందినవని 'ఏ' కు తెలిసియున్నట్టి వగు డబ్బును, ఆహారమును బట్టలను ఆమె 'ఏ' కు ఇచ్చును. ఇచ్చట బహుశః బిక్షము పెట్టుటకు 'జడ్' యొక్క భార్యకు అనుమతి కలదని “ఏ' తలచియుండవచ్చును. ఇదే 'ఏ' యొక్క భావము అయినచో ఏ దొంగతనము చేయలేదు.

(ఓ) 'జడ్' యొక్క భార్యకు 'ఏ' అనునతడు విటుడు. ఆమె ఒకవిలువగల ఆస్తిని 'ఏ'కు ఇచ్చును. ఆ ఆస్తి 'జడ్'కు చెందినదనియు, దానిని ఇచ్చుటకు ఆమెకు 'జడ్' యెక్క అనుమతి లేదనియు తాను ఎరిగియుండి 'ఏ' ఆ ఆస్తిని నిజాయితీ లేకుండ తీసికొనిన చో, అతడు దొంగతనము చేసినవాడగును.

(పీ) 'జడ్' కు చెందిన ఆస్తి తన ఆస్తి యేనని 'ఏ' సద్భావముతో విశ్వసించుచు, ఆ ఆస్తిని 'బీ' స్వాధీనము నుండి తప్పించి 'ఏ' తీసికొనును. ఇచ్చట 'ఏ' నిజాయితి లేకుండ తీసికొనలేదు. అందువలన అతడు దొంగతనము చేయలేదు.

దొంగతనము చేసి నందుకు శిక్ష,

379. . దొంగతనము చేసిన వారెవరైనను మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకవు కారావాసముతో గాని, జుర్మానాతో గానీ ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు. నివాస గృహము మొదలగువాటిలో దొంగతనము.

380. ఏదేని భవనము, డేరా, లేక జలయానము మనుష్య నివాసముగా ఉపయోగింపబడుచుండగా, లేక ఆస్తి అభిరక్ష కొరకు ఉపయోగింపబడుచుండగా అట్టి ఏదేని భవనము, డేరా, లేక జలయానములో దొంగతనము చేయువారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

యజమాని యొక్క స్వాధీనములోని ఆస్తిని గుమాస్తా, లేక సేవకుడు దొంగతనము చేయుట,

381. గుమాస్తాగా లేక సేవకుడుగా యుండియైనను, గుమాస్తా, లేక సేవకుని హోదాలో నియోగింపబడి యుండియైనను, తన యజమాని లేక నియోజకుని యొక్క స్వాధీనములో ఉన్న ఏదేని ఆస్తిని దొంగతనము చేయువారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దొంగతనము చేయుటకుగాను మరణము, ఘాత లేక అవరోధము కలిగించుటకై సన్నాహముచేసికొనమీదట దొంగతనము చేయుట.


382. దొంగతనము చేయుటకు గాను, లేక అట్టి దొంగతనము చేసిన పిదప తప్పించుకొని పోవుటకుగాను, లేక దొంగిలించిన ఆస్తిని తనవద్ద ఉంచుకొనుటకు గాను, ఏవ్యక్తి కైనను, మరణము, ఘాత, లేక అవరోధము కలిగించుటకై గాని, మరణమునకు, ఘాతకు లేక అవరోధమునకు గురియగుదునను భయమును అతనికి కలిగించుటకై గాని సన్నాహము చేసికొనియుండి, దొంగతనము చేయువా రెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' స్వాధీనములో ఉన్న ఆస్తిని 'ఏ' దొంగతనము చేయును. ఈ దొంగతనము చేయుచున్నపుడు 'జడ్' ప్రతిఘటించే సందర్భములో 'జడ్' కు ఘాత కలిగించు నిమిత్తమై గుండ్ల తో నింపబడిన ఒక పిస్తోలును 'ఏ' తన దుస్తుల క్రింద ఉంచుకొనును. ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసిన వాడగును.

(బీ) 'ఏ' 'జడ్' యొక్క జేబు కొట్టును. అంతకుముందుగా 'ఏ తనసహచరులను 'జడ్' చుట్టు నిలిపి ఉంచెను. జేబుకొట్టు చుండగా 'జడ్' గమనించి ప్రతిఘటించుచో లేక 'ఏ'ను పట్టుకొనుటకు అతను ప్రయత్నించు చో వారు 'జడ్'ను అవరోధించవలెనని 'ఏ' అట్లు చేసెను. ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును 'ఏ' చేసిన వాడగును.


బలాద్గ్రహణమును గురించి

బలాద్రహణము.

383. ఉద్దేశపూర్వకముగా ఏ వ్యక్తి నైనను ఆ వ్యక్తికి గాని ఎవరేని ఇతరవ్యక్తి కి గాని ఏదేని హాని కలిగింతునని భయపెట్టి, అట్లు భయ పెట్టబడిన వ్యక్తిచే ఏదేని ఆస్తిని లేక విలువగల సెక్యూరిటీని, లేక విలువగల సెక్యూరిటీగా మార్చవీలైనదై సంతకము చేయబడిన లేక ముద్రవేయబడిన దేనినైనను నిజాయితీ లేకుండ ఏ వ్యక్తికైనను అందజేయించు నతడెవరైనను 'బలాద్గ్ర హణము' చేసినవాడగును.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అనునతడు తనకు డబ్బు ఈయనిచో 'జడ్' కు పరువునష్టము కలిగించే ఒక నిందా లేఖనమును ప్రచురించెదనని 'జడ్' ను బెదరించును. ఈ విధముగా 'జడ్' తనకు డబ్బునిచ్చునట్లు చేయును. 'ఏ' బలాద్గ్రహణము చేసినవాడగును.

(బి) 'జడ్' కొంతడబ్బును 'ఏ'కు చెల్లింతునని ఒక ప్రామిసరీనోటు వ్రాసి, సంతకము చేసి 'ఏ'కు అందజేసిననే తప్ప 'జడ్' యొక్క బిడ్డను అక్రమ పరిరోధములో ఉంతునని 'జడ్' ను 'ఏ' బెదరించును, 'జడ్' ప్రామిసరీనోటు పై సంతకము చేసి అందజేయును. 'ఏ' బలాద్గ్ర హణము చేసినవాడగును.

(సీ) 'జడ్' కొంత పంటను 'బీ' కి అందజేయుదుననియు, ఆట్లు చేయనిచో శాస్త్రి కి గురియగుదుననియు ఒక బాండును వ్రాసి సంతకము చేసి 'బీ' కి అందజేసిననే తప్ప, 'జడ్' యొక్క పొలమును దున్నించి వేయుటకు దుండగులను పంపుదునని, 'జడ్' ను 'ఏ' బెదరించి తద్వారా 'జడ్' బాండు పై సంతకము చేసి అందజేయునట్లు చేయును. బలాద్గ్రహణము చేసినవాడగును.

(డీ) దారుణమైన ఘాత కలిగింతునని 'జడ్' ను భయపెట్టి నిజాయితీ లేకుండ 'ఏ' అనునతడు ఒక ఖాళీ కాగితము పై 'జడ్' చే సంతకము చేయించి లేక అతని ముద్రను వేయించి ఆ కాగితము 'జడ్' తనకు అందజేయునట్లు 'జడ్' ను ప్రేరేపించును. 'జడ్' ఆ కాగితము పై సంతకము చేసి 'ఏ' కు అందజేయును. ఇచట అట్లు సంతకము చేయబడిన కాగితమును విలువగల 'సెక్యూరిటీగా మార్చవచ్చును. కావున 'ఏ' బలాద్గ్రహణము చేసినవాడగును. బలాద్గ్రహణము చేసినందుకు శిక్ష,

384. బలాద్రహణము చేయువారెవరై నను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

బలాద్గ్రహణము చేయుటకుగాను హాని కలిగింతునని ఒక వ్యక్తిని భయపెట్టుట.

385. బలాద్గ్రహణము చేయుటకుగాను. ఏదేని హాని కలిగింతునిని ఏ వ్యక్తినైనను భయ పెట్ట. లేక భయపెట్టుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, 'జుర్మానాలో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మరణము లేక దారుణమైన ఘాత కలుగునని ఒకవ్యక్తిని భయ పెట్టుట ద్వారా బలాద్గ్రహణము చేయుట.

386. ఏ వ్యక్తినైనను, వ్యక్తి కి గాని, ఎవరేని ఇతర వ్యక్తికిగాని మరణము, లేక దారుణమైన ఘాత కలుగు నని భయ పెట్టుటద్వారా బలాద్గ్రహణము చేయువారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బలాద్గ్రహణను చేయుటకుగాను మరణము, లేక దారుణమైన ఘాత కలుగునని ఒక వ్యక్తిని భయ పెట్టుట.

387, బలాద్గ్రహణము చేయుటకుగాను, ఏ వ్యక్తి నై నను, ఆ వ్యక్తి కిగాని, ఎవరేని ఇతర వ్యక్తి కి గాని మరణము, లేక దారుణమైన ఘాత కలుగునని భయ పెట్టు, లేక అటు భయ పెట్టుటకు ప్రయత్నించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటికో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

మరణ దండన లేక యావజ్జీవ కారావాసము,మొదలై నవాటితో శిక్షింపదగు అపరాధము మోపబడునను బెదిరింపు ద్వారా బలాద్గ్రహణము చేయుట.

388. ఏ వ్యక్తి నై నను, ఆ వ్యక్తి పై గాని, ఎవరేని ఇతరుని పై గాని, మరణదండనతొ, లేక యావజ్జీవ కారావాసముతో లేక పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో శిక్షింపదగిన ఏదేని ఆపరాధమును చేసినట్లు, లేక చేయుటకు ప్రయత్నించినట్లు, లేక అట్టి అపరాధమును చేయుటకు ఎవరేని ఇతర వ్యక్తిని ప్రేరే పించుటకు ప్రయత్నించినట్లు అపరాధము మోపబడునని భయ పెట్టుట ద్వారా బలాద్గ్రహణము చేయు వారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మా నాకు కూడ పాత్రులగుదురు, మరియు ఆ ఆపరాధము ఈ స్మృతిలోని 377వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగిన అపరాధమైనచో, యావజ్జీవ కారావాసముతో శిక్షింపబడవచ్చును.

బలాద్గ్రహణము చేయుటకుగాను, ఒకవ్యక్తిని అతని పై ఆపరాధము మోపబడునని భయపెట్టుట.

389. బలాద్గ్రహణము చేయుటకుగాను ఏ వ్యక్తి నైనను, ఆ వ్యక్తి పై గాని ఎవరేని ఇతరుని పై గాని, మరణ దండనతో, లేక యావజ్జీవ కారావాసముతో లేక పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కారావాసముతో శిక్షింపదగిన అపరాధమును చేసినట్లు లేక చేయుటకు ప్రయత్నించినట్లు అపరాధము మోపబడునని భయ పెట్టు లేక 'అట్లు భయ పెట్టుటకు ప్రయత్నించు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు ఆ అపరాధము ఈ స్మృతిలోని 377వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగిన ఆపరాధమైచో, యావజ్జీవ కారావాసముతో శిక్షింపబడవచ్చును.

దోపిడిని, బందిపోటును గురించి

దోపిడి.

390. ఏ దోపిడీయందైనను దొంగతనముగాని బలాద్గ్రహణము గాని చేరి ఉండును.

దొంగతనము ఎప్పుడు దోపిడీ అగును.

దొంగతనముచేయుటకుగాని, దొంగతనము చేయుటలో గాని, దొంగిలింపబడిన ఆస్తిని తీసికొనిపోవుటలో లేక తీసికొసిపోవుటకు ప్రయత్నించుటలో గాని, ఆ లక్ష్యసిద్ధి కై ఏ వ్యక్తి కై నమ మరణము, లేక ఘాత, లేక అక్రమ అవరోధమునైనను, తక్షణ మరణము, లేక తక్షణ ఘాత, లేక తక్షణ ఆక్రమ అవరోధము కలుగునను భయమునైనను అపరాధి స్వచ్ఛందముగ కలిగించినచో లేక కలిగించుటకు ప్రయత్నించినచో దొంగతనము “దోపిడీ" ఆగును.

బలాద్గ్రహణను ఎప్పుడు దోపిడీ ఆగును,

బలాద్గ్ర హణము చేయు సమయమున అపరాధి భయ పెట్టబడిన వ్యక్తి యొక్క ఎదుటనే ఉండి, ఆ వ్యక్తి కైనను వేరొక వ్యక్తి కై నను తక్షణ మరణము, తక్షణ ఘాత, లేక తక్షణ అక్రమ అవరోధము కలుగునని ఆ వ్యక్తిని భయ పెట్టుట ద్వారా బలాద్గ్రహణము చేసి, అట్లు భయ పెట్టుటద్వారా, అట్లు భయపెట్టబడిన వ్యక్తి చే అప్పటికప్పుడే బలాద్గ్ర హిత వస్తువును ఇచ్చివేయునట్లు చేసినచో బలాద్గ్ర హణము “దోపిడీ" అగును.

విశదీకరణము :-- తక్షణ మరణము, తక్షణ ఘాత, లేక తక్షణ అక్రమ ఆవరోధము కలుగునని ఆ ఇతర వ్యక్తిని భయ పెట్ట జాలునంతగా అతనికి సమీపములో అపరాధి ఉండుచో అపరాధి ఆతని ఎదుట ఉన్నట్లు చెప్పబడును.

ఉదాహరణములు

(ఏ) ఏ' అనునతడు 'జడ్' ను లేవకుండా పట్టుకొని 'జడ్' యొక్క సమ్మతిలేకుండ కపటముతో 'జడ్'దుస్తులనుండి డబ్బును, నగలను తీసికొనును. ఇచట 'ఏ' దొంగతనము చేసినాడు మరియు ఆ దొంగతనము చేయుటకుగామ 'జడ్' కు ఆక్రమ అవరోధమును స్వచ్ఛంధముగా కలుగజేసినాడు, కాబట్టి 'ఏ' దోపిడీ చేసినవాడగును.

(బీ) ఏ' అనునతడు 'జడ్' ను రహదారిలో కలసికొని, ఒక పిస్తోలును చూపి డబ్బుల సంచిని ఇమ్మని అడుగును. తత్పరిణామముగ 'జడ్' తన డబ్బుల సంచిని ఇచ్చి వేయును. ఇచట, తక్షణ ఘాత కలుగునని 'జడ్' ను భయపెట్టి, బలాద్గ్రహణముచేయు సమయమున ఆతని ఎదుటనే ఉండి 'ఏ' అతని డబ్బుల సంచిని బలాద్గ్రహణము చే సెను, కాబట్టి 'ఏ' దోపిడీ చేసిన వాడగును.

(సీ) 'ఏ' అనునతడు రహదారిలో 'జడ్' ను 'జడ్' యొక్క బిడ్డను కలిసికొనును. 'ఏ' ఆ బిడ్డను పట్టుకొని'జడ్' తన డబ్బుల సంచిని ఇచ్చి వేసిననే తప్ప, బిడ్డను కొండచరియలో పడవేయుదునని బెదరించును. 'జడ్' తత్ పరిణామముగ తన డబ్బుల సంచిని ఇచ్చివేయును. ఇచట ఎదుటనే ఉన్న బిడ్డకు ఘాత కలుగునని 'జడ్' ను భయ పెట్టుట ద్వారా 'జడ్' నుండి 'ఏ' డబ్బుల సంచిని బలాద్గ్రహణము చేసెను. కాబట్టి 'జడ్' ను 'ఏ' దోపిడీ చేసిన వాడగువు.

(డీ) “నీ బిడ్డ నా ముఠా చేతులలో నున్నది. నీవు మాకు పదివేల రూపాయలను పంపిననే తప్ప, ఆ బిడ్డను చంపివేయుదుము” అని చెప్పుట ద్వారా, 'ఏ' అనునతడు 'జడ్' నుండి ఆస్తిని పొందును. ఇది బలాద్గ్ర హణము మరియు అట్టిదిగ శిక్షింపదగినదే, అయినను తన బిడ్డకు తక్షణ మరణము కలుగునను భయము 'జడ్' కు కలిగింపబడిననే తప్ప, ఇది దోపిడీ కాదు.

బందిపోటు,

391. ఐదుగురు, లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసికట్టుగా దోపిడీ చేసినపుడు గాని దోపిడీ చేయుటకు ప్రయత్నించినపుడు గాని కలిసికట్టుగా దోపిడీ చేయుచున్న లేక దోపిడీ చేయుటకు ప్రయత్నించుచున్న వ్యక్తులును, అట్లు చేయుటకు లేక ప్రయత్నించుటకు అచట ఉండి తోడ్పడుచున్న వ్యక్తులును మొత్తముగా ఐదుగురు లేక అంతకంటె ఎక్కువమంది అయినపుడుగాని, అట్లు చేయుచున్న, లేక ప్రయత్నించుచున్న, లేక తోడ్పడుచున్న ప్రతి యొక వ్యక్తి “బందిపోటు” చేసినట్లు చెప్పబడును.

దోపిడి చేసినందుకు శిక్ష.

392. దోపిడీ చేయు వారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు ఆ దోపిడి రహదారి పై సూర్యాస్తమయ సూర్యోదయముల మధ్య చేయబడిన యెడల, కారావాసము పదునాలుగు సంవత్సరములదాక ఉండవచ్చును.

దోపిడీ చేయుటకు ప్రయత్నించుట.

393. దోపిడీ చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జార్మానాకు కూడ పాత్రులగుదురు.

దోపిడీ చేయుటలో ఘాతను స్వచ్ఛందముగా కలిగించుట.

394. ఏ వ్యక్తి యైనను, దోపిడి చేయుటలో లేక దోపిడీ చేయుటకు ప్రయత్నించుటలో ఘాతను స్వచ్ఛందముగ కలిగించుచో, అట్టి వ్యక్తియు, అట్టి దోపిడీ చేయుటలో, లేక దోపిడీ చేయుటకు ప్రయత్నించుటలో అట్టి వ్యక్తి తొ సంయుక్త ముగా ప్రమేయముగల ఎవరేని ఇతర వ్యక్తి యు యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు,

బందిపోటు చేసినందుకు శిక్ష.

395. బందిపోటు చేయువారెవరైనను యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

హత్య తోకూడిన బందిపొటు.

396. కలిసికట్టుగా బందిపోటు చేయుచున్న ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమంది వ్యక్తులలో ఏ ఒక్కరైనను ఆట్లు బందిపోటు చేయుటలో హత్య చేయుచో, ఆ వ్యక్తులతో ప్రతి ఒక్కరుసు మరణ దండన తోగాని, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి కఠిన కారావాముతో గాని, శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు,

మరణము, లేక దారుణ ఘాత కలిగించుటకైన ప్రయత్నముతో కూడిన దోపిడీ లేక జందిపోటు.

397. దోపిడీ లేక బందిపోటు చేయు సమయములో ఆపరాధి ఏదేని మారణాయుధమును ఉపయోగించుచో లేక ఏ వ్యక్తి కైనను దారుణమైన ఘాత కలిగించుచో, లేక ఏ వ్యక్తి కైనను మరణము, లేక దారుణమైన ఘాత కలిగించుటకు ప్రయత్నించుచో, అట్టి ఆపరాధికి విధింపవలసిన కారా వాసము ఏడు సంవత్సరములకు తక్కువకానిదై యుండవలెను. మారణాయుధము ధరించి దోపిడి లేక బందిపోటు చేయుటకు ప్రయత్నము.

398. దోపిడీ లేక బందిపోటు చేయుటకై ప్రయత్నించు సమయమున ఆపరాధి ఏదేని మారణాయుధమును ధరించియుండుచో, అట్టి అపరాధికి విధిం చవలసిన కారావాసము ఏడు సంవత్సరములకు తక్కువ కానిదై యుండ వలెను.

బందిపోటు చేయుటకై సన్నాహము చేయుట.

399. బందిపోటు చేయుటకై ఏదేని సన్నాహము చేయువారెవరై నను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బందిపోటు ముఠాకు చెందియున్నందుకు శిక్ష.

400.ఈ చట్టము చేయబడిన తరువాత ఎప్పుడై నను పరిపాటిగా బందిపోటు చేయుటకై జతగా కూడినట్టి వ్యక్తుల ముఠాకు చెందినవారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దొంగల ముఠాకు చెందియున్నందుకు శిక్ష.

401. ఈ చట్టము చేయబడిన తరువాత ఎప్పుడైనను, థగ్గుల ముఠా లేక బందిపోటు ముఠాతో కాకుండా పరిపాటిగా దొంగతనమునుగాని, దోపిడీగాని చేయుటకై జతగా కూడిన ఏదేని సంచార, లేక ఇతర వ్యక్తుల ముఠాకు చెందియున్నవారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బందిపోటు చేయుటకై గుమికూడుట.

402. . ఈ చట్టము చేయబడిన తరువాత ఎప్పుడైనను బందిపోటు చేయుటకై గుమికూడిన ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమంది వ్యక్తులలో తానొకడుగా ఉన్న ఎవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కఠిన కారావాసముతో శిక్షింపబడును, సురియు జుర్మానాకు కూడా పాత్రుడగును.

ఆస్తిని ఆపరాధిక దుర్వినియోగము చేయుటను గురించి

ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయుట.

403. చరాస్తి ని దేనినై నను నిజాయితీ లేకుండ దుర్వినియోగముచేయు లేక సొంతమునకుపయోగించుకొను వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కు చెందిన ఆస్తిని తాసు తీసికొను సమయమున 'ఏ' అనునతడు ఆ ఆస్తి తనదేనని సద్భావముతో విశ్వసించుచు 'జడ్' స్వాధీనము నుండి తప్పించి తాను తీసికొనును. 'ఏ' దొంగతనము చేసినవాడు కాడు. అయితే 'ఏ' తన పొరపాటును కనుగొన్న తరువాత నిజాయితీ లేకుండ ఆ ఆస్తిని సొంత ఉపయోగమునకై వినియోగించుకొనుచో అతడు ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును,

(బీ) 'జడ్' కు స్నేహితుడగు 'ఏ' అనునతడు. 'జడ్' లేనప్పుడు 'జడ్' యొక్క గ్రంథాలయమునకు వెళ్ళి 'జడ్' యొక్క అభివ్యక్త సమ్మతి లేకుండ, ఒక పుస్తకమును తీసికొనిపోవును. ఇచట ఆ పుస్తకమును చదువుకొను నిమిత్తమై దానిని తీసికొనుటకు 'జడ్' యొక్క గర్భితమైన సమ్మతి తనకు గలదను భావముతో 'ఏ' ఉండినయెడల 'ఏ' దొంగతనము చేసినవాడు కాడు. అయితే ఆ తరువాత 'ఏ' సొంత లాభము కొరకు ఆ పుస్తకమును అమ్మినచో అతడు ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును.

(సి) 'ఏ' 'బీ' అనువారు ఒక గుర్రమునకు ఉమ్మడిగా సొంతదారులై యుండగా ఆ గుర్రమును ఉపయోగించుకొను ఉద్దేశ్యముతో 'ఏ' దానిని 'బి' స్వాధీనమునుండి తప్పించి తాను తీసికొనును. ఇచ్చట గుర్రమును ఉపయోగించుకొనుటకు 'ఏ' కు హక్కు ఉన్నందున అతడు ఆ గుర్రమును నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేసిన వాడుకాడు. అయితే 'ఏ' ఆ గుర్రమును అమ్మి వచ్చిన మొత్తమును తాను తన సొంతమునకు వినియోగించుకొనుచో ఆతడు ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధము చేసినవాడగును.

విశదీకరణము 1:— కొంత కాలముపాటు మాత్రమే నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయుట ఈ పరిచ్ఛేద భావములో దుర్వినియోగమగును.

ఉదాహరణము

పీటీ వ్రాయకనే సంతకము చేయబడి 'జడ్' కు చెందినట్టి ప్రభుత్వ ప్రామిసరీ నోటొకటి 'ఏ' కు దొరకును.ఆ ప్రామిసరీనోటు 'జడ్' కు చెందినదని 'ఏ' ఎరిగియుండియు, ముందు ఎప్పుడై నను 'జడ్' కు దానిని తిరిగి యిచ్చే ఉద్దేశముతో, దానిని ఒక బ్యాంకరువద్ద అప్పుకు హామీగ కుదువ పెట్టును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసిన వాడగును. విశదీకరణము 2 :-- ఏ ఇతర వ్యక్తి స్వాధీనములోనూ లేని ఆస్తి తనకు దొరకగా సొంతదారు కొరకు దానిని కాపాడుటకై లేక అతనికి తిరిగి యిచ్చుటకై అట్టి ఆస్తిని తీసికొనునట్టి వ్యక్తి, ఆ ఆస్తిని నిజాయితీ లేకుండా తీసికొనలేదు, లేక దుర్వినియోగపరచలేదు కనుక అపరాధము చేసినవాడు కాదు; అయితే అతనికి సొంతదారు ఎవరో తెలిసి యున్నప్పుడు లేక కనుగొనుటకు మార్గ మున్నప్పుడుగాని, అతడు సొంతదారును కనుగొనుటకు యుక్తమైన పద్ధతులనుఉపయోగించి సొంతదారుకు నోటీసు పంపి, ఆస్తిని ఆ సొంతదారు క్లెయిము చేయుటకు వీలుపడునంత వరకు ఆ ఆస్తి తో వేచియుండవలసిన యుక్త మై సకాలమునకు ముందుగా గాని, ఆ ఆస్తిని సొంతము చేసికొనినచో అతడు పైన నిర్వచింపబడిన అపరాధము చేసినవాడగును.

అట్టి సందర్భములో ఏవి యుక్త మైన పద్ధతులు, లేక ఏది యుక్తమైన కాలము అనునది సంగతిని గూర్చిన ప్రశ్న.

ఆస్తి దొరికిన వ్యక్తికి ఆ ఆస్తి సొంతదారు ఎవరనిగాని, ఫలానా వ్యక్తి దాని సొంతదారని గాని తెలిసియుండుట ఆవశ్యకము కాదు; ఆస్తిని వినియోగపరచుకొను సమయమున ఆ ఆస్తి తనదని అతడు విశ్వసించకపోవుటయే, లేక దాని అసలు సొంతదారు దొరకడని సద్భావముతో విశ్వసించుటయే సరిపోవును.

ఉదాహరణములు

(ఏ) ఫలానివారిది అని తెలియని ఒక రూపాయి 'ఏ' అను వానికి ఒక రహదారిన దొరకును. 'ఏ' ఆ రూపాయిని తీసికొనును. ఇచట 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేయలేదు.

(బి) 'ఏ' కు దారిలో ఒక బ్యాంకు నోటుతోపాటు ఒక జాబు దొరుకును. జాబులోని చిరునామా వలనను,అందలి విషయముల వలనను ఆ నోటు ఎవరిదో అతనికి తెలిసినది. కాని, అతడు ఆ నోటును వినియోగపరచుకొనును. అతడు ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధము చేసిన వాడగును.

(సీ) బేరరుకు చెల్లింపదగు ఒక చెక్కు 'ఏ' అను వానికి దొరకును. చెక్కును పోగొట్టు కొన్న వ్యక్తి ఎవరో అతడు ఊహింప లేడు. అయితే చెక్కు యొక్క డ్రాయర్ పేరు అందుగలదు. అతడు తాను ఎవరి పేరిట చెక్కు వ్రాసెనో ఆవ్యక్తి చిరునామాను తెలియజేయగలడని 'ఏ'కు తెలిసియుండియు, సొంతదారును కనుగొనుటకు ప్రయత్నించక 'ఏ' చెక్కును వినియోగించుకొనును. 'ఏ'. ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును చేసినవాడగును.

(డీ) 'జడ్' యొక్క డబ్బులసంచి అందులోని డబ్బుతో సహా క్రిందపడిపోవుటను 'ఏ' చూచును. 'జడ్'కు దానిని తిరిగి ఇచ్చివేయు ఉద్దేశముతో 'ఏ' ఆడబ్బుల సంచిని తీసుకొనును, అయితే తరువాత దానిని తనసొంతము చేసికొనును. “ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును చేసినవాడగును.

(ఈ) 'ఏ' అను నతనికి డబ్బులసంచి దొరకును, అది ఎవరిదో అతనికి తెలియదు. ఆతడు తరువాత ఆది 'జడ్ ' అనునతనికి చెందినదని కనుగొనియు, దానిని తన సొంతము చేసికొనును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధము చేసినవాడగును.

(ఎఫ్) 'ఏ' కు విలువగల ఒక ఉంగరము దొరకును. అది ఎవరిదో అతనికి తెలియదు. ఆ ఉంగరము సొంతదారును కనుగొనుటకు ప్రయత్నించకయే దానిని వెంటనే 'ఏ' అమ్మివేయును. 'ఏ' ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధము చేసినవాడగును.


ఒక వ్యక్తి మరణించి నవుడు అతని స్వాధీనములో ఉండిన ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగముచేయుట.

404. ఒకవ్యక్తి మరణించినపుడు అతని స్వాధీనములో ఉండిన ఆస్తి అని ఎరిగియుండి, అప్పటినుండి ఆ ఆస్తిని స్వాధీనపరచుకొనుటకు శాసనరీత్యా హక్కుదారైన ఏ వ్యక్తియు ఆ ఆస్తిని స్వాధీనపరచుకొనలేదని ఎరిగియుండి నిజాయితీ లేకుండా అట్టి ఆస్తిని దుర్వినియోగముచేయు లేక సొంతము చేసికొను వారెవరైనను మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకుకూడ పాత్రులగుదురు; మరియు అట్టి వ్యక్తి మరణ సమయమున అతని గుమాస్తాగా గాని, సేవకుడుగా గాని ఆపరాధి వనిచేయుచుండిన యెడల కారావాసము ఏడు సంవత్సరములదాక ఉండవచ్చును.

ఉదాహరణము

'జడ్ ' అను నతని మరణ సమయమున గృహసామగ్రి, డబ్బు ఆతని స్వాధీనములో ఉండెను. అతని సేవకుడైన 'ఏ' ఆ డబ్బును, దానిని స్వాధీన పరచుకొనుటకు హక్కుదారైన వ్యక్తి స్వాధీన పరచుకొనకపూర్వమే, నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయును, 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధము చేసిన వాడగును.

ఆపరాధిక న్యాసభంగమును గురించీ

అపరాధిక న్యాస భంగము,

405. ఆస్తి గాని, ఆస్తిపై ఆధిపత్యముగాని ఏదేని రీతిగా అప్పగింపబడియుండి, ఆ ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయు, లేక సొంతము చేసికొను, లేక అట్టి న్యాసమును నిర్వహించు పద్ధతిని విహితపరచు ఏదేవి శాసనాదేశమునుగాని అట్టి న్యాస నిర్వహణమునకు సంబంధించి తాను చేసికొనిన, అభివ్యక్త మైనదైనను, గర్భితమైన దైనను, ఏదేని శాసనబద్ధ మైన కాంట్రాక్టునుగాని అతిక్రమించి ఆ ఆస్తిని నిజాయితీ లేకుండ ఉపయోగించుకొను,లేదా వ్యయనముచేయు లేదా బుద్ధి పూర్వకముగ ఏవ్యక్తి నైనను, ఆట్లు చేయనిచ్చు వారెవరైనను “ఆపరాధిక న్యాస భంగము" చేసిన వారగుదురు.

విశదీకరణము 1 :-తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనము ద్వారా నెలకొల్పబడిన భవిష్యనిధికి గాని, కుటుంబ ఫింఛను నిధికిగాని జమకట్ట బడుటకై ఉద్యోగి వాటాను ఉద్యోగికి చెల్లింపవలసిన వేతనములనుండి బిగబట్టు కొనునట్టి నియోజకుడై యున్న వ్యక్తి కి, ఆట్లు అతనిచే బిగబట్టు కొనబడిన వాటా మొత్తము అప్పగింప బడినట్లు భావించవలెను. మరియు సదరు శాసనమును అతిక్రమించి అట్టి వాటాను సదరు నిధికి ఆతడు చెల్లింపని చో, పైన చెప్పబడిన శాసనాదేశమును అతిక్రమించి అట్టి వాటా మొత్తమును నిజాయితీ లేకుండ అతడు ఉపయోగించు కొనినట్లు భావించవలెను.

విశదీకరణము 2 : ఉద్యోగుల రాజ్య భీమా చట్టము, 1948- (1948లోని 34వ చట్టము) క్రింద నెలకొల్పబడిన ఉద్యోగుల రాజ్య భీమా కార్పొరేషను పరమందుండి నిర్వహింపబడు ఉద్యోగుల రాజ్య భీమానిధికి జమ కట్టబడుటకై ఉద్యోగి వాటాను ఉద్యోగికి చెల్లింపవలసిన వేతనములనుండి బిగబట్టు కొనునట్టి నియోజకుడై యున్న వ్యక్తి కి, అట్లు ఆతనిచే బిగబట్టు కొనబడిన వాటా మొత్తము అప్పగించబడినట్లు భావించవలెను. మరియు సదరు శాసనమును అతిక్రమించి, అట్టి వాటాను సదరు నిధికి అతడు చెల్లింపనిచో, పైనచెప్పబడిన శాసనాదేశమును అతిక్రమించి. అట్టి వాటా మొత్తమును నిజాయితీ లేకుండ అతడు ఉపయోగించుకొనినట్లు భావించవలెను.

ఉదాహరణములు

(ఏ) ఒక మృతవ్యక్తి యొక్క వీలునామాకు 'ఏ' అను నతడు నిర్వాహకుడై యుండి, మృతవ్యక్తి చరాస్తులను వీలునామా ననుసరించి విభజించవలెనను శాసనాదేశమును నిజాయితీలేకుండ పాటింపక వాటిని సొంతముచే కొనును. 'ఏ' ఆపరాధిక న్యాసభంగము చేసినవాడగును.

(బీ) ఏ' అనునతడు ఒక గిడ్డంగిపాలకుడు, 'జడ్' ప్రయాణమై పోవుచు, తన గృహసామగ్రిని 'ఏ' అప్పగించి ఒక నిర్ణీత మొత్తమును గిడ్డంగి గదికై తాను చెల్లించిన మీదట తనకు తనగృహ సామగ్రిని వాపసు చేయవలసినదని కాంట్రాక్టు చేసికొనును. 'ఏ'ఆ సరుకులను నిజాయితీ లేకుండ అమ్మివేయును. 'ఏ' ఆపరాధిక న్యాస భంగము చేసినవాడగును.

(సీ) కలకత్తాలో నివసించుచున్న 'ఏ' అనునతడు డిల్లీ లో నివసించుచున్న 'జడ్'కు ఏజెంటు. 'ఏ'కు 'జడ్' పంపే మొత్తములన్నియు 'జడ్' ఆదేశానుసారముగ 'ఏ' పెట్టుబడి పెట్టవలెనని 'ఏ', 'జడ్'ల మధ్య ఒక అభివ్యక్తమైన లేక గర్భితమైన కాంట్రాక్టు కలదు. కంపెనీవారి పత్రములలో పెట్టుబడి పెట్ట వలసినదను ఆదేశములతో 'జడ్' 'ఏ'కు ఒక లక్ష రూపాయలను పంపును. 'ఏ' నిజాయితీలేకుండ ఆ ఆదేశములను పాటించక ఆ డబ్బును సొంత వ్యాపారములో వాడుకొనును. 'ఏ' అపరాధిక న్యాసభంగము చేసిన వాడగుసు,

(డీ) అయితే, పై కడపటి ఉదాహరణములో బెంగాలు బ్యాంకులో షేర్లను కలిగియుండుట 'జడ్'కు ఎక్కువ లాభదాయకమని 'ఏ' నిజాయితీగా సద్భావముతో విశ్వసించుచు, కంపెనీవారి పత్రములు కొనుటకు బదులుగా 'జడ్' యొక్క ఆదేశములను పాటించక బెంగాలు బ్యాంకులో షేర్లను కొనినచో, ఇచ్చట 'జడ్'కు నష్టము కలిగినప్పటికీ, ఆ నష్టమునకై 'ఏ' పై సివిలు చర్యలు తీసుకొనుటకు అతనికి హక్కు ఉన్నప్పటికినీ, 'ఏ' నిజాయితీ లేకుండ వ్యవహరించనందున, అపరాధిక న్యాసభంగము చేయలేదు.

(ఈ) 'ఏ' అను రెవెన్యూ అధికారికి పబ్లికు డబ్బు అప్పగింపబడి యున్నది. తన పరమందున్న పబ్లికు డబ్బు నంతను, శాసనాదేశానుసారముగా, లేక ప్రభుత్వముతో తనకుగల అభివ్యక్తమైన లేక గర్భితమైన కాంట్రాక్టు వలన, అతడు ఒకానొక ఖజానాలో చెల్లించవలసియున్నది. 'ఏ' ఆ డబ్బును నిజాయితీ లేకుండ వినియోగించుకొనును. 'ఏ' ఆపరాధిక న్యాసభంగము చేసినవాడగును. (ఎఫ్) వాహకుడైన 'ఏ' అనునతనికి తనఆస్తిని భూమార్గమునగాని జలమార్గమునగాని తీసికొనిపోవుటకై 'జడ్' అప్పగించెను, ఆ ఆస్తిని నిజాయితీలేకుండ 'ఏ' దుర్వినియోగము చేయును, 'ఏ' ఆపరాధిక న్యాస భంగము చేసిన వాడగును.

అపరాధి న్యాస భంగము చేసినందుకు శిక్ష

406. ఆపరాధిక న్యాస భంగముచేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

వాహకుడు మొదలగు వారు చేయు ఆపరాధిక న్యాసభంగము.

407. నాహకుడుగా, రేవు గిడ్డంగి పాలకుడుగా, లేక గిడ్డంగి పాలకుడుగా ఆస్తి ఆప్పగింపబడియుండి, అట్టి ఆస్తి విషయమున ఆపరాధిక న్యాసభంగముచేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

గుమాస్తా లేక సేవకుడు చేయు ఆపరాధిక న్యాసభంగము.

408. గుమాస్తా యై యుండి లేక సేవకుడై యుండి, లేక గుమాస్తా గానై నను సేవకుడుగానై నను వినియోగింపబడియుండి ఆట్టి హెదాలో ఏ రీతిలోనై నను ఆస్తి గాని, ఆస్తి పై ఆధిపత్యముగాని అప్పగించబడియుండి, ఆ ఆస్తి విషయమున ఆపరాధిక న్యాసభంగము చేయువారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

పబ్లికు సేవకుడు,బ్యాంకరు వ్యాపారస్తుడు లేక ఏజెంటు చేయు అపరాధిక న్యాస భంగము

409. పబ్లికు సేవకుడుగా తన హోదాలో గాని, బ్యాంకరుగా, వ్యాపారస్తుడుగా, అడీ దారుగా, దలారీగా, అటార్నీగా లేక ఏజెంటుగా తన వ్యాపార సరళితో గాని, ఆస్తి లేక ఆస్తి పై ఏదేని ఆధిపత్యము ఏ రీతిలొనైనను అప్పగించబడి యుండి, ఆ ఆస్తి విషయమున ఆపరాధిక న్యాసభంగము చేయు వారెవెరైనను యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడా పాత్రులగుదురు.

దొంగలింపబడిన ఆస్తిని స్వీకరించుటను గురించి

దొంగిలింపబడిన ఆస్తి.

410. దొంగతనము ద్వారా గాని, బలాద్గ్ర హణముద్వారా గాని, దోపిడీ ద్వారా గాని, స్వాధీనము బదిలీ అయిన ఆస్తియు, అపరాధిక దుర్వినియోగమునకు లేక ఆపరాధిక న్యాసభంగము నకు గురిఅయిన ఆస్తియు, ఆ బదిలీ లేదా దుర్వినియోగము, లేదా న్యాస భంగము, భారతదేశములోపల జరిగినను, వెలుపల జరిగినను, దొంగిలింపబడిన ఆస్తి అని పేర్కొబడును. ఆయితే, అట్టి ఆస్తిని స్వాధీనపరచుకొనుటకు శాసనరీత్యా హక్కుగల వ్యక్తి యొక్క స్వాధీనములోనికి ఆ ఆస్తి అటుతర్వాత వచ్చినచో అప్పుడు అది దొంగిలింపబడిన ఆస్తి గ పరిగణింపబడదు.

దొంగిలింపబడిన ఆస్తిని నిజాయితీ లేకుండ స్వీకరించుట.

411, దొంగలింపబడిన ఆస్తిని, దేనినైనా, అది దొంగలింపబడిన ఆస్తియని ఎరిగియుండి, లేక దొంగిలింపబడిన ఆస్తియని విశ్వసించుటకు కారణముండి, నిజాయితీ లేకుండ స్వీకరించు లేక వద్ద ఉంచుకొను వారెవరై నను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

బందిపోటు చేయుటలో దొంగిలింపబడిన ఆస్తిని నిజాయితీ లేకుండ స్వీకరించుట.

412. బందిపోటు చేయుటద్వారా ఆస్తి యొక్క స్వాధీనము , బదిలీ అయినదని తాను ఎరిగియున్నట్టి లేక ఆట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి దొంగలింపబడిన ఆస్తిని నిజాయితీలేకుండ స్వీకరించు లేక వద్ద ఉంచుకొను నతడెవరైనను, దొంగలింపబడినదని తాసు ఎరిగియున్నట్టి, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఆస్తి ని బందిపోటు ముఠాకు చెందినవాడని, లేదా చెందియుండినవాడని తాను ఎరిగియున్నట్టి, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి, వ్యక్తి నుండి నిజాయితీ లేకుండ స్వీకరించు నతడెవరైనను, యావజ్జీవ కారావాసములోగాని, పది సంవత్సశములదాకా ఉండగల కాలావధికి కఠిన కారావాసముతోగాని శిక్షింపబడును. మరియు జుర్మానాకుకూడ పాత్రుడగును.

దొంగిలింపబడిన ఆస్తితో పరిపాటిగా వ్యాపారము చేయుట.

413. దొంగలింపబడిన ఆస్తియని తాను ఎరిగియున్నట్టి లేక ఆట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఆస్తిని పరిపాటిగా స్వీకరించు, లేక అట్టి ఆస్తి తో పరిపాటిగా వ్యాపారము చేయు నతడెవరై నను, యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

దొంగిలింపబడిన ఆస్తిని దాచుటలో సహాయపడుట.

414. దొంగిలింపబడిన ఆస్తియని తాను ఎరిగియున్న, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఆస్తి ని దాచుటలో, లేక వ్యయసము చేయుటలో, లేక కొట్టి వేయుటలో స్వచ్చం దముగ సహాయపడు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

దగాను గురించి

దగా.

415. ఏ వ్యక్తి నైనను మోసగించుట ద్వారా అట్లు మోసగింపబడిన వ్యక్తిని కపటముతోనైనను, నిజాయితీగా లేకుండనై నను ఏదేని ఆస్తి ని ఎవరేని వ్యక్తి కి అందజేయునట్లు చేయు లేక ఎవరేని వ్యక్తి వద్ద ఏదేని ఆస్తి ని ఉంచుటకై సమ్మతి వొసగునట్లు చేయువారెవరైనను, లేక ఆట్లు మోసగింపబడిన వ్యక్తి ని, అతడు అట్లు మోసగింపబడి యుండని చో అతని యొక్క శరీరమునకు, మనస్సుకు, ఖ్యాతికి లేక ఆస్తి కి నష్టమునై నను, కీడునై నను కలిగించునదైన లేక కలిగించగలదైన ఏ కార్యము నయితే అతడు చేయకుండా ఉండెడివాడో ఆకార్యమును చేయునట్లు లేదా ఏకార్యమునయితే అతడు చేసియుండెడివాడో ఆ కార్యమును చేయకుండునట్లు ఉద్దేశపూర్వకముగా చేయువారెవరై నను దగాచేసినట్లు చెప్పబడుదురు,

విశదీకరణము : సంగతులను నిజాయితీ లేకుండ కప్పిపుచ్చుట ఈ పరిచ్ఛేదభావములో మోసము అగును.

ఉదాహరణములు

(ఏ) ఏ' అనునతడు తాను సివిలు సేవలో ఉన్నట్లు తప్పుడు నటన ద్వారా 'జడ్' ను ఉద్దేశపూర్వకముగా మోసగించును. నిజాయితీ లేకుండ ఆ విధముగా తాను మూల్యము చెల్లించదలచనట్టి సరుకులను 'జడ్' తనకు అరువుగా ఇచ్చునట్లు చేయును. 'ఏ' దగా చేసినవాడగును.

(బి) ఒకవస్తువు పై నకిలి గుర్తును పెట్టుట ద్వారా ఆ వస్తువు ఒకానొక ప్రసిద్ధ 'నిర్మాతచే తయారు చేయబడినదను నమ్మకము 'జడ్'కు కలిగించి 'ఏ' అను నతడు అతనిని ఉద్దేశపూర్వకముగ మోసగించును. ఆవిధముగ నిజాయితీ లేకుండ అతడు ఆ వస్తువును 'జడ్' కొనునట్లును, మూల్యము చెల్లించునట్లును చేయును. 'ఏ' దగా చేసిన వాడగును.

(సీ) 'ఏ' అనునతను ఒక వస్తువు యొక్క తప్పుడు నమూనాను 'జడ్'కు చూపించి ఆ వస్తువు నమూనాకు సరిపోలినదను నమ్మకము. 'జడ్'కు కలిగించి అతనిని ఉద్దేశపూర్వకముగ మోసగించును. నిజాయితీలేకుండ 'ఏ' తద్ద్వారా 'జడ్' ఆ వస్తువును కొని మూల్యము చెల్లించునట్లు చేయును. 'ఏ' దగా చేసినవాడగును.

(డీ) 'ఏ' అనునతడు ఒక వస్తువును కొని దాని మూల్యము చెల్లించుటకై తాను తన డబ్బు ఉంచి యుండని వ్యాపార సంస్థ పై వ్రాసిన ఒక వినిమయ పత్రమును అది అనాదరింపబడునని భావించియు, ఈయజూపుట ద్వారా 'జడ్'ను మోసగించును. తద్వారా మూల్యము చెల్లించవలెనను ఉద్దేశ్యము లేకుండ, నిజాయితీ లేకుండ.ఆ వస్తువుము “జడ్” ఇచ్చునట్లు చేయును. 'ఏ' దగా చేసినవాడగును.

(ఈ) వజ్రములు కావని తాను ఎరిగియున్నట్టి వస్తువులను వజ్రములుగా కుదువ పెట్టుటద్వారా, 'ఏ' అనునతడు 'జడ్'ను ఉద్దేశపూర్వకముగా మోసగించును. 'జడ్' తద్ద్వారా డబ్బు అప్పిచ్చునట్లు నిజాయితీ లేకుండ చేయును. 'ఏ దగా చేసినవాడగును.

(ఎఫ్) తవకు డబ్బు అప్పిచ్చినట్లయిన, ఆడబ్బును తిరిగి చెల్లించు తలంపు తనకు కలదని 'ఏ' అన్ నతడు 'జడ్'ను విశ్వసింప జేసి, ఉద్దేశపూర్వకముగా మోసగించును, తద్వారా, 'ఏ' తిరిగి చెల్లించు ఉద్దేశము తనకు లేకుండనే, నిజాయితీలేకుండ, డబ్బు 'జడ్' అప్పిచ్చునట్లు చేయును. 'ఏ' దగా చేసినవాడగును.

(జీ) నీలిమందు. మొక్కలను కొంతగా 'జడ్'కు అందజేయు ఉద్దేశము తనకు లేకయె అట్టి తలంపు తనకు కలదని విశ్వసించునట్లు చేసి 'ఏ' అనునతడు 'జడ్' ను ఉద్దేశపు ర్వకముగా మోసగించును. తద్వారా, అట్లు ఆందజేయబడునను నమ్మకము పై , తనకు బయానాగా, 'జడ్' డబ్బు ఇచ్చునట్లు 'ఏ' నిజాయితీ లేకుండ చేయును. 'ఏ' దగాచేసిన వాడగును. అయితే, డబ్బు తీసుకొను సమయమున నీలిమందు అందజేయుటకు 'ఏ' ఉద్దేశించియుండి ఆ తరువాత తన కాంట్రాక్టును భంగపరచి నీలిమందు మొక్కలను అందజేయనిచో అతడు దగా జేసినవాడుకాడు, కాని అతడు కాం ట్రాక్టు భంగమున కై సివిలు చర్యకు మాత్రము పాత్రుడగును.

(హెచ్) 'జడ్'తో తాను చేసికొనిన కాంట్రాక్టులో 'ఏ' అను నతడు తాను నిర్వర్తించవలసిన భాగమును నిర్వర్తించకుండనే నిర్వర్తించితినని 'జడ్' ను విశ్వసింపజేసి 'ఏ' అను నతడు ఉద్దేశపూర్వకముగ అతనిని మోసగించును. తద్వారా 'ఏ' నిజాయితీ లేకుండ, తనకు 'జడ్' డబ్బు చెల్లించునట్లు జేయును. 'ఏ' దగా జేసినవాడగును.

(ఐ) 'ఏ' ఒక ఎస్టేటును 'బి' కి విక్రయించి హస్తాంతరణ చేయును. అట్టి విక్రయమువల్ల తనకు ఆస్తి పై హక్కు ఏదియు లేదని 'ఏ' ఎరిగియుండియు, పూర్వము 'బీ'కి విక్రయించి పాస్తాంతరణచేసిన సంగతిని నెల్లడించకుండ, 'జడ్' కు అదే ఆస్తిని విక్రయించిగాని, తాకట్టు పెట్టి గాని 'జడ్' నుండి క్రయమును లేక తాకట్టు డబ్బును పొందును. 'ఏ' దగా చేసిన వాడగును.

ప్రతి రూపణముద్వారా దగా చేయుట,

416. ఒకవ్యక్తి తాను వేరొకవ్యక్తి నని నటించుట ద్వారా గాని ఎరిగియుండియే ఒక వ్యక్తిని మరొకవ్యక్తి స్థానమున ఉంచుట ద్వారా గాని, ఎరిగియుండియే తాను తననుగా గాక వేరొక వ్యక్తిగా తెలియజేయుటద్వారాగాని, మరొకవ్యక్తిని వాస్తవముగా అతడు ఎవరో ఆవ్యక్తి గా గాక వేరొక వ్యక్తి గా తెలియజేయుటద్వారా గాని, దగాజేయుచో ప్రతిరూపణము ద్వారా దగా చేసినట్లు చెప్పబడును.

విశదీకరణము:-ఎవరిని ప్రతిరూపణము చేయుట జరిగినదొ ఆ వ్యక్తి నాస్తవ వ్యక్తి యైనను, కాల్పనిక వ్యక్తియైనను ఈ అపరాధము చేసినట్లగును.

ఉదాహరణములు

(ఏ) ఏ' అనునతడు తాను అదే పేరుగల ఒక ధనికుడైన బ్యాంకరుగ నటించుట ద్వారా దగా జేయును.'ఏ' ప్రతి రూపణముద్వారా దగా చేసినవాడగును.

(బి) 'ఏ' అనునతడు మరణించిన 'బి' అనువ్యక్తి గా నటించుట ద్వారా దగాజేయును. 'ఏ' ప్రతిరూపణము ద్వారా దగా చేసినవాడగును.

దగా చేసినందుకు శిక్ష.

417. దగా జేయు వారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

నీ వ్యక్తి యొక్క హితమును కాపాడుటకు అపరాధి బాధ్యుడై యున్నాడో ఆ వ్యక్తికి అక్రమ నష్టము కలుగవచ్చునని ఎరిగియుండి దగా చేయుట.

418. ఏ వ్యవహారములో, శాసనరీత్యాగాని, శాసనబద్ధ మైన కాంట్రాక్టు రీత్యాగాని, ఎవరి హితమును కాపాడుటకై తాను బాధ్యుడై యున్నాడో ఆవ్యక్తి కి తాను తద్వారా అక్రమ నష్టమును కలిగించవచ్చునని ఎరిగియుండియు ఆ వ్యవహార సంబంధముగా దగాచేయు నతడెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావదికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

ప్రతి రూపణము ద్వారా దగా చేసినందుకు శిక్ష.

419. ప్రతిరూపణముద్వారా దగాచేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

దగా చేసి నిజాయితీ లేకుండ ఆస్తిని అంద జేయించుట.

420. దగాజేసి తద్వారా నిజాయితీ లేకుండ మోసగింపబడిన వ్యక్తి చే ఏ వ్యక్తి కైనను ఏదేని ఆస్తిని అందజేయించు, లేక విలువగల 'సెక్యూరిటీనైనను, విలువగల సెక్యూరిటీగా మార్చుటకు వీలుండి సంతకము చేయబడిన లేక ముద్రవేయబడిన దేనినైనను, రూపొందింపజేయు, మార్పించు, లేదా దానినంతనుగాని, అందలి యేదేనిభాగమునుగాని నాశనముచేయించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ఆస్తి విషయమున కపటముతో చేసిన పత్రములు, వ్యయనములను గురించి

ఋణదాతలకు పంచిపెట్ట బడకుండా చేయుటకై ఆస్తిని నిజాయితీ లేకుండా గాని కపటముతోగాని, తొలగించుట లేక దాచుట.

421. తన ఋణదాతలకు గాని ఎవరేని ఇతర వ్యక్తి యొక్క ఋణదాతలకుగాని, శాసనానుసారము ఏదేని ఆస్తి పంచి పెట్ట బడకుండ జేయు ఉద్దేశముతోనైనను, పంచి పెట్ట బడకుండా చేయగలనని ఎరిగియుండియైనను, నిజాయితీ లేకుండా గాని కపటముతోగాని ఆ ఆస్తిని తొలగించు, దాచు, లేక ఏ వ్యక్తి కైనను అందజేయు, లేక తగినంత ప్రతిఫలము లేకుండ ఏవ్యక్తి కై నను బదిలీచేయు, లేదా బదిలీచేయించు నతడెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

నిజాయితీ లేకుండగాని కపటముతో గాని ఋణమును ఋణ దాతలకు లభ్యము కాకుండునట్లు చేయుట,

422. తనకుగాని, ఎవరేని ఇతర వ్యక్తి కిగాని రావలసిన ఏదేని ఋణమును, లేక ఆధ్యర్థనను తానుగాని ఆ ఇతర వ్యక్తి గాని చెల్లింపవలసిన ఋణములకై శాసనానుసారముగ లభ్యముకాకుండునట్లు నిజాయితీలేకుండ లేదా కపటముతో చేయునతడెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును. ప్రతిఫలమును గురించి తప్పుడు కథనముగల బదిలీపత్రమును నిజాయితీ లేకుండగాని కపటముతో గాని నిష్పాదించుట.

423. ఏదేని ఆస్తి నిగాని, అందలి ఏదేని హితమునుగాని బదిలీచేయునదిగ, లేక ఏదేని ప్రభాతమునకు గురి చేయునదిగ తాత్పర్యము నిచ్చునట్టిదై, అట్టి బదిలీ లేక ప్రభారము కొరకైన ప్రతిఫలమునకు సంబంధించిగాని, ఎవరి ఉపయోగము లేదా మేలుకొరకు అదివాస్తవముగ ఉద్దే శింపబడినదో ఆ వ్యక్తి, లేక వ్యక్తులకు సంబంధించిగాని, ఏదేని తప్పుడు కథనముగలదైన ఏదేని పత్రమును లేక లిఖితమును నిజాయితీ లేకుండగాని కపటముతోగాని సంతకముచేయు, విష్పాదించు లేక దానికి పక్ష కారులగు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆస్తి ని నిజాయితీ లేకుండగాని, కపటముతో గాని తొలగించుట లేక దాచుట.

424. తనయొక్క లేక ఎనలేని ఇతర వ్యక్తి యొక్క ఏదేనీ ఆస్తిని నిజాయితీలేకుండగాని, కపటముతోగాని దాచు, లేక తొలగించు లేదా దానిని చాచుటలోనైనను తొలగించుటలోనై నను నిజాయితి లేకుండగాని, కపటముతోగాని సహాయపడు, లేదా తాను హక్కుదారై యున్న ఏదేని అభ్యర్థననైనను, క్లెయిమునైనను నిజాయితీలేకుండ వదలుకొను నతడెవరైనను, రెండు సంవత్సరముల గాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని రెండింటితో గాని శిక్షింపబడును,

దుశ్చేష్టను గురించి

దుశ్చేష్ట

425. ప్రజల కైనను, ఎవరేని వ్యక్తి కై నసు, అక్రమ నష్టము, లేదా చెరుపు కలిగించు ఉద్దేశముతో గాని, తాను కలిగించగలనని ఎరిగియుండిగాని, ఏదేని ఆస్తికి నాశనము కలిగించు లేక ఏదేని ఆస్తి యొక్క విలువనుగాని, ఉపయోగితను గాని నాశనము చేయునట్లు లేదా తగ్గించునట్లు లేదా ఆస్తి కి హాని కలుగునట్లు, ఆ ఆస్తిలో గాని దాని స్థితిలో గాని ఏదేని మార్పు కలిగించు నతడెవరైనను, “దుశ్చేష్ట" చేసిన వాడగును.

విశదీకరణము 1:-- -- హాని కలిగినట్టి లేక నాశనమైనట్టి ఆస్తి యొక్క సొంతదారుకు నష్టమును లేక చెరుపును కలిగించవలెనని అపరాధి ఉద్దేశించుట “దుశ్చేష్ట " అను అపరాధమునకు ఆవశ్యకముకాదు. ఏదేని ఆస్తికి హాని కలిగించుట ద్వారా ఏ వ్యక్తి కైనను, ఆ ఆస్తి అట్టి వ్యక్తి కి చెందినదై నను కాకున్నను, అక్రమ నష్టము లేక చెరుపు కలిగించుట తన ఉద్దేశము అయినచో, లేక కలుగగలదని తాను ఎరిగి యుండినచో చాలును.

విశదీకరణము 2 :-- కార్యమును చేయునట్టి వ్యక్తికి చెందియున్న ఆస్తి కిగాని, ఆ వ్యక్తి కిని, ఇతరులకును ఉమ్మడిగా చెందియున్న ఆస్తి కిగాని చెరుపు కలుగజేయు కార్యము ద్వారా “దుశ్చేష్ట" చేయవచ్చును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్' కు అక్రమ నష్టము కలిగించవలెనను ఉద్దేశముతో 'జడ్' కు చెందిన ఒక విలువైన సెక్యూరిటీని 'ఏ' అనునతడు స్వచ్ఛందముగ తగులబెట్టును. 'ఏ' దుశ్చేష్ట చేసినవాడగును.

(బీ) 'జడ్' కు ఆక్రమ నష్టము కలిగించవలెనను ఉద్దేశముతో 'జడ్' కు చెందిన మంచుగడ్డలు చేయు గది లోనికి 'ఏ' అనునతడు వీటిని వదలి ఆవిధముగ మంచుగడ్డలను కరిగించును. 'ఏ' దుశ్చేష్ట చేసిన వాడగును.

(సీ) 'జడ్' కు ఆక్రము నష్టము కలిగించు ఉద్దేశముతో 'జడ్' ఉంగరమును 'ఏ' అనునతడు స్వచ్ఛందముగ నదిలో పడునట్లు విసరివేయును. 'ఏ' దుశ్చేష్ట చేసినవాడగును.

(డీ) తాను 'జడ్' కు చెల్లించవలసిన ఋణపు తీరుదలకుగాను జరుపబడు అమలు చర్యలో తన చరాస్తి తీసికొనబడనున్నదని తెలిసి 'జడ్' కు ఋణము తీరకుండా చేయుటద్వారా 'జడ్' కు చెరుపు చేయు ఉద్దేశముతో 'ఏ' ఆ చరాస్తిని నాశనము చేయును. 'ఏ' దుశ్చేష్ట చేసిన వాడగును.

(ఈ) ఏ' ఒక ఓడను భీమా చేసిన తరువాత భీమా హామీదార్లకు చెరుపుచేయు ఉద్దేశముతో స్వచ్ఛందముగ ఆ ఓడను కొట్టుకొని పోవునట్లు చేయును. 'ఏ' దుశ్చేష్ట చేసినవాడగును.

(ఎఫ్) ఓడ తాకట్టు పై అప్పిచ్చినట్టి 'జడ్' కు చెరుపుచేయు ఉద్దేశముతో 'ఏ' అనునతడు ఆ ఓడను కొట్టుకొని పోవునట్లు చేయును.'ఏ' దుశ్చేష్ట చేసినవాడగును.

(జీ) ఒక గుర్రము 'జడ్' కు 'ఏ' కు ఉమ్మడి ఆస్తిగా ఉన్నది. 'జడ్' కు ఆక్రమ నష్టము కలిగించు ఉద్దేశముతో 'ఏ' అనునతడు ఆ గుర్రముమ షూట్ చేయును. 'ఏ' దుశ్చేష్ట చేసినవాడగును.

(హెచ్) 'జడ్' కు చెందిన వంటకు చెరుపుచేయు ఉద్దేశముతోను, చెరుపు కలుగగలడని ఎరిగియుండియు 'ఏ' అనునతడు 'జడ్' పొలములోనికి పశువులు చొరబడునట్లు చేయును. 'ఏ' దుశ్చేష్ట చేసిన వాడగును. దుశ్చేష్టకు శిక్ష.

426. దుశ్చేష్ట చేయు వారెవరైనసు మూడు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఏబది రూపాయల మొత్తము మేరకు చెరుపు కలిగించు దుశ్చేష్ట,

427. దుశ్చేష్ట చేసి తద్వారా ఏబది రూపాయల వరకు లేక అంతకు మించిన మొత్తము వరకు నష్టము, లేక చెరుపు కలుగజేయు వారెవరై నను. రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పది రూపాయల విలువగల జంతువును చంపుట లేక వికలాంగ పరచుట ద్వారా చేసిన దుశ్చేష్ట.

428. పది రూపాయల లేదా అంతకు మించిన విలువగల ఏదేని జంతువునుగాని జంతువులనుగాని చంపుట, వాటికి విషము పెట్టుట, వాటిని వికలాంగపరచుట, లేక నిరుపయోగమై నవాటిగ చేయుట ద్వారా దుశ్చేష్టను చేయువారెవరై నను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జూర్మానాలోగాని,ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఎంత విలువ గలవైనను పశువులు మొదలగు వాటిని లేక ఏబది రూపాయల విలువగల ఏదేని జంతువును చంపుట ద్వారా చేసిన దుశ్చేష్ట.

429. ఎంత విలువగలదై నను--ఏదేని ఏనుగును, ఒంటెను, గుర్రమును, కంచరగాడిదను, గేదెను, ఆంబొతును, ఆవును లేక ఎద్దును గాని, ఏబది రూపాయల లేదా అంతకు మించిన విలువగల ఏదేని ఇతర జంతువునుగాని, చంపుట, విషము పెట్టుట, వికలాంగ పరచుట, లేక నిరుపయోగమై నదిగా చేయుట ద్వారా దుశ్చేష్టను చేయువా రెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, రెండింటితో గాని శిక్షింపబడుదురు.

నీటిపారుదల నిర్మాణములకు హాని కలిగించుట ద్వారా గాని, వీటిని ఆక్రమముగా మల్లించుట ద్వారా గాని చేసిన దుశ్చేష్ట.


430. వ్యవసాయ ప్రయోజనముల కొరకు, లేక మనుష్యులకుగాని, ఆస్తిగా ఎంచబడు జంతువులకుగాని ఆహారము లేదా పానీయముకొరకు, లేక పారిశుధ్యము కొరకు, లేక ఏదేని వినిర్మాణము కొనసాగించుట కొరకు అవసరమగు నీటి సరఫరాను తగ్గింపజేయునట్టి, లేక తగ్గింపగలదని తాను ఎరిగియున్నట్టి, ఏదేని కార్యమును చేయుటద్వారా దుశ్చేష్ట చేయునతడెవరైనను ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పబ్లికు రోడ్డు, వంతెన,నది, లేక కాలువకు హాని కలిగించుట ద్వారా వేసిన దుశ్చేష్త,

431. ఏదేని పబ్లికు రోడ్డును, వంతెనను, నౌకాయానానుకూలమైన నదిని, లేక సహజమైనదైనను కృత్రిమమై నదైనను, నౌకాయానానుకూలమైన జలమార్గమును, ప్రయాణమునకుగాని, ఆస్తి రవాణాకుగాని పనికి రానిదిగనో, తక్కువ సురక్షితమై నదిగనో చేయునట్టిదైనను, చేయగలదని తాను ఎరిగియున్నట్టి దైనను ఏదేని కార్యమును చేయుట ద్వారా దుశ్చేష్ట చేయునతడెవరైనను, ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానా తోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పబ్లికు మురుగుకాల్వకు చెరుపు కలుగునట్లుగా దానిని జలమయము చేయుట ద్వారా గాని, ఆది పారకుండా ఆటంకపరచుట ద్వారాగాని చేసిన దుశ్చేష్ట.

432, పబ్లికు మురుగు కాలువకు హాని లేక చెరుపు కలుగునట్లు దానిని జలమయము చేయునట్టి లేక అది పారకుండా ఆటంకపరచునట్టి లేక తద్వారా అది జలమయమగునని లేదా దానికి ఆటంకము కలుగగలదని తాను ఎరిగి యున్నట్టి ఏదేని కార్యమును చేయుట ద్వారా దుశ్చేష్ట చేయునతడెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాలోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

దీపస్తంభమును, లేక సముద్ర చిహ్నమును నాశనము చేయుట, కదిలించుట, లేక తక్కువ ఉపయోగకరమైనదిగా చేయుట ద్వారా చేసిన దుశ్చేష్ట.

433. ఏదేని దీప స్తంభమును గాని, సముద్ర చిహ్నముగ ఉపయోగింపబడు ఇతర దీపమునుగాని, నావికుల కొరకు మార్గదర్శకముగ ఉంచబడిన ఏదేని సముద్ర చిహ్నము, లేదా బోయ్ లేదా ఇతర వస్తువునుగాని నాశనము చేయుటద్వారా లేక కదలించుట ద్వారా, లేక పైన చెప్పబడినట్టి దీపస్తంభము, సముద్ర చిహ్నము, బోయ్, లేదా ఇతర వస్తువును నావికులకు మార్గదర్శకముగ తక్కువ ఉపయోగకరమగునట్లు చేయునట్టి ఏదేని కార్యమును చేయుట ద్వారా దుశ్చేష్ట చేయువా రెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెండింటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు,

పబ్లికు ప్రాధికారిచే ఏర్పరచబడిన భూమి హద్దు గుర్తును నాశనము చేయుట, కదలించుట మొదలగునవి చేయుట ద్వారా చేసిన దుశ్చేష్ట.


434. పబ్లికు సేవకుని ప్రాధికారమునుబట్టి ఏర్పరచబడి, భూమి హద్దులు ఏర్పరచు ఏదేని గుర్తును నాశనము చేయుట లేక కదలించుట ద్వారా గాని, అట్టి భూమి హద్దుల నేర్పరచు చిహ్నమును అట్టి చిహ్నముగ తక్కువ ఉపయోగకరమగునట్లు చేయు ఏదేని కార్యమును చేయుటద్వారాగాని, దుశ్చేష్ట చేయువారెవరై నను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు. వందరూపాయల మొత్తము మేరకు, లేక వ్యవసాయ విషయమున పది రూపాయల మొత్తము మేరకు చెరువు కలిగించు ఉద్దేశముతో నిప్పు లేక ప్రేలుడు పదార్థము ద్వారా చేసిన దుశ్చేష్ట.

435. ఏ ఆస్తి కై నను వంద రూపాయిల లేక అంతకుమించిన మొత్తము మేరకు, లేక (ఆ ఆస్తి వ్యవసాయ ఫలసాయమై నయెడల) పది రూపాయల లేక అంతకు మించిన మొత్తము మేరకు చెరుపు కలుగజేయవలెనను ఉద్దేశముతో గాని, తద్వారా తాను అట్టి చెరుపును కలిగించగలనని తెలిసియుండిగాని, నిప్పు ద్వారానై నను, ఏదేని ప్రేలుడు పదార్థము, ద్వారా నైనను దుశ్చేష్ట చేయునతడెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

ఇల్లు మొదలగు వాటిని నాశనము చేయు ఉద్దేశముతో నిప్పు లేక ప్రేలుడు పదార్థము ద్వారా చేసిన దుశ్చేష్ట

436. సాధారణముగ ఆరాధన స్థలముగగాని, మనుష్య నివాసముగగాని, ఆస్తి అభిరక్షణ స్థలముగగాని ఉపయోగింపబడునట్టి ఏదేని భవనమును నిప్పు లేక ఏదేని ప్రేలుడు పదార్థముద్వారా నాశనము చేయు ఉద్దేశముతో గాని, తద్వారా తాను నాశనము చేయగలనని ఎరిగియుండిగాని, దుశ్చేష్ట చేయునతడెవరైనను యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

డెక్క వున్న జలయానమును లేక ఇరువది టన్నుల భారపు జలయానమును నాశనము చేయు లేక భద్రత లేనిదిగా చేయు ఉద్దేశముతో చేసిన దుశ్చేష్ట.

437. డెక్కువున్న జలయానమును, లేక ఇరువది టన్నుల లేక అంతకుమించిన భారపు ఏదేని జలయానమును నాశనము చేయు, లేక భద్రత లేనిదిగచేయు ఉద్దేశముతోగాని, తద్వారా నాశనము కాగలదని, లేక భద్రతలేనిది కాగలదని ఎరిగియుండి గాని ఆ జలయానము విషయమున దుశ్చేష్ట చేయు వారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

437వ పరిచ్ఛేదములో వివరించబడిన దుశ్చేష్టను నిప్పు లేక ప్రేలుడు పదార్థము ద్వారా చేసినపుడు శిక్ష.

438. "పై కడపటి పరిచ్ఛేదము లో వివరింపబడిన దుశ్చేష్ట నిప్పు ద్వారా గాని, ప్రేలుడు పదార్థముద్వారాగాని చేయు, లేక చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దొంగతనము మొదలగునవి చేయు ఉద్దేశముతో జలయానమును ఉద్దేశపూర్వకముగ మెరకతట్టు లేక దరి తట్టునట్లు చేసేనందుకు శిక్ష

439. ఏదేని జలయానమును, అందులోని ఏదేని ఆస్తిని దొంగిలించు, లేక అట్టి ఏదేని ఆస్తిని నిజాయితీ లేకుండ దుర్వినియోగము చేయు ఉద్దేశముతో గాని, ఆస్తి ఆట్లు దొంగిలించబడ వచ్చును, లేక దుర్వినియోగము చేయబడవచ్చునను ఉద్దేశముతో గాని, మెరక తట్టునట్లు లేక దరితట్టునట్లు ఉద్దేశపూర్వకముగ చేయు వారెవరై నను పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మరణము లేక ఘాత కలిగించుటకు సన్నాహము చేసిన పిమ్మట చేయబడిన దుశ్చేష్ట.

440. ఏ వ్యక్తి కై నను మరణము, లేక ఘాత లేక అక్రమ అవరోధమునుగాని మరణము, లేక ఘాత లేక అక్రమ అవరోధము గల్గునను భయమును గాని కలిగించుటకు సన్నాహము చేసియుండి, దుశ్చేష్ట చేయు వారెవరై నను ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదును.

ఆపరాధిక అక్రమ ప్రవేశమును గురించి

ఆపరాధిక అక్రమ ప్రవేశము,

441. ఆపరాధము చేయవలెనను ఉద్దేశముతో గాని, ఆస్తి ని స్వాధీనము నందు కలిగి ఉన్న ఏ వ్యక్తినై నను, జడిపించు, అవమానించు లేక చికాకు పెట్టు ఉద్దేశములో గాని, అట్టి ఆస్తిలో, లేదా ఆస్తి పై ప్రవేశించు వారెవరైనను, లేక అట్టి ఆస్తి లో, లేదా ఆస్తి పై శాసన సమ్మతముగ ప్రవేశించియుండి, అట్టి ఏ వ్యక్తి నై నను జడిపించు అవమానించు, లేక చికాకు పెట్టు ఉద్దేశముతోగాని, అపరాధమును చేయవలెనను ఉద్దేశముతో గాని, శాసన విరుద్ధముగా, అచటనే ఉండు వారెవరైనను “అపరాధిక ఆ క్రమ ప్రవేశము " చేసినట్లు చెప్పబడుదురు.

ఇంట అక్రము ప్రవేశము.

442. మనుష్య నివాసముగా ఉపయోగింపబడు ఏదేని భవనము, లేక జలయానములోగాని, ఆరాధన స్థలముగ లేక ఆస్తి అభిరక్షణ స్థలముగ , ఉపయోగింపబడు ఏదేని భవనములో గాని ప్రవేశించుటద్వారా ఆయినను, ఆచటనే ఉండుట ద్వారా ఆయినను, ఆపరాధిక అక్రమ ప్రవేశము: చేయు వారెవరైనను, “ఇంట ఆక్రమ ప్రవేశము " చేసినట్లు చెప్పబడుదులు.

విశదీకరణము:- -ఇంట ఆక్రమ ప్రవేశము అగుటకు ఆపరాధిక ఆక్రమ ప్రవేశము చేయు వాని శరీరమందలి ఏ భాగమై నను ప్రవేశ పెట్టబడుట సరిపోవును.

ప్రచ్ఛన్నముగ ఇంట ఆక్రమ ప్రవేశము.

443. ఆక్రమ ప్రవేశము చేయు వ్యక్తిని ఆక్రము ప్రవేశమునకు గురియై నట్టి భవనము లోనికి, డేరా లేదా జలయానము లోనికి రాకుండా చేయుటకు లేక అందుండి వెళ్లగొట్టుటకు హక్కు కలిగినట్టి ఏ వ్యక్తి కైనను అట్టి ఇంట -ఆక్రమ ప్రవేశము జరుగుట తెలియకుండ వుండునట్లు ముందు జాగ్రత్తలు తీసికొనియుండి ఇంట— ఆక్రమ ప్రవేశము చేయు వారెవరై నను " ప్రచ్ఛన్నముగ ఇంట- ఆక్రమ ప్రవేశము" చేసినట్లు చెప్పబడుదురు.

రాత్రివేళ ప్రచ్ఛన్నముగ ఇంట ఆ క్రమ ప్రవేశము,

444. సూర్యాస్తమయమైన తర్వాత, తిరిగి సూర్యోదయము కాకముందు ప్రచ్ఛన్నముగా ఇంటి- ఆ క్రమ ప్రవేశముచేయు వారెవరై నను “ప్రచ్ఛన్నముగ రాత్రివేళ ఇంట- ఆక్రమ ప్రవేశము" చేసినట్లు చెప్పబడుదురు.

"ఇంటికి కన్నము వేయుట.

445, ఇంట- ఆక్రమ ప్రవేశము చేయు వ్యక్తి ఇంటిలోనికి గాని ఆందరి ఏదేని భాగములోనికి గాని ఇందు ఇటు తరువాత వివరింప బడిన ఆరు పద్ధతులలో దేనిద్వారా ఆయనను ప్రవేశించినచో, లేక అపరాధము చేయుటకై ఇంటిలో గాని, అందలి ఏ భాగములో గాని ఉండియుండి, లేదా ఒక ఆపరాధమును ఆందుచేసియుండి, ఆ ఇంటినుండిగాని, అందలి ఏదేని భాగము నుండి గాని, అట్టి ఆరుపద్ధతులలో దేనిద్వారా అయినను బయటికిపోయినచో, ఆతడు ఇంటికి కన్నము,వేసినట్లు చెప్పబడును, ఆ పద్దతులేవనగా -

మొదటిది : ఆతడు, ఇంట- ఆక్రమ ప్రవేశము చేయుటకుగాను, తానై నను. ఇంట-ఆక్రమ ప్రవేశ దుష్చేరకుడెవరైనను చేసిన మార్గము గుండా ప్రవేశించుట లేక బయటికి పోవుట.

రెండవది :--- అతడు తనచేతను ఆపరాధ దుష్పేరకుని చేతను తప్ప, మరే ఇతర వ్యక్తి చేతను మనుష్యుల ప్రవేశార్ధమని ఉద్దేశింపబడనట్టి ఏదేని మార్గముగుండా గాని, ఏదేని గోడనై నను, భవనమునై నను అధిరోహించుట లేదా దాని పై కి ఎక్కుటద్వారా ఉపలభ్యమైన ఏదేని మార్గము గుండా గాని ప్రవేశించుట 'లేక బయటికి పోవుట.

మూడవది :-- అతడు ఇంటి ఆక్రమణదారుచే తెరచుటకు ఉద్దేశింపబడని ఏదేని పద్ధతిద్వారా ఇంట- ఆక్రమ ప్రవేశము జేయుటకుగాను, తానుగాని ఇంట - ఆ క్రమ ప్రవేశ దుష్పేరకుడెవరై ననుగాని తెరచిన మార్గముగుండా ప్రవేశించుట లేక బయటికి పోవుట .

నాల్గవది --- ఆతడు ఇంట- ఆ క్రమ ప్రవేశము చేయుటకుగాను లేక ఇంట- అక్రమ ప్రవేశము చేసిన తరువాత బయటపడుటకు గాను ఏదేని తాళమును తీసి ప్రవేశించుట లేక బయటికి పోవుట,

ఐదవది :- ఆతడు. ఆపరాధిక బల ప్రయోగము ద్వారా గాని, దౌర్జన్యము చేయుటద్వారా గాని ఏ వ్యక్తి నైనను దౌర్జన్యమునకు గురి చేయుదునని బెదిరించుట ద్వారా గాని, ప్రవేశించుట లేక బయటికి పోవుట.

ఆరవది:- అతని ప్రవేశముగాని నిష్క్రమణము జరుగకుండుటకై మూయబడినదనియు, తనచే గాని ఇంట - ఆక్రమ ప్రవేశ దుష్ప్రేరకుని చేగాని తెరువబడినదనియు తాను ఎరిగియున్నట్టి ఏదేని మార్గ ముగుండా ప్రవేశించుట, లేక బయటికి పోవుట,

విశదీకరణము : -- ఇంటితోపాటు ఆక్రమణలో ఉన్న ఏదేని ఉపగృహము లేక భవనము, దానికినీ అట్టి ఇంటికినీ మధ్య రాకపోకలకు సరాసరి దారి ఉన్నప్పుడు ఈ పరిచ్ఛేదపు భావములో ఇంటిలొ భాగమగును,

ఉదాహరణములు

(ఏ) జడ్" యొక్క ఇంటి గోడకు కన్నము చేసి ఆ కన్నములో తన చేతిని పెట్టుట ద్వారా 'ఏ' అను వాడు ఇంట- ఆక్రము ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(బి) ఓడయొక్క డెక్కల మధ్యగల కిటికీగుండా లోనికి చూచుట ద్వారా 'ఏ' అనునతడు ఇంట ఆక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట ఆగును. (సీ) కిటికీ గుండా 'జడ్' యొక్క ఇంటిలోనికి ప్రవేశించుట ద్వారా 'ఏ' అనునతడు ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(డీ) గడియ వేయబడిన తలుపును తెరచుకొని 'జడ్' యొక్క ఇంటిలో ప్రవేశించుట ద్వారా 'ఏ' అనునతడు ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(ఈ) తలుపులోని రంధ్రము గుండా ఒక తీగెను దూర్చి గడియను ఎత్తి తలుపు తెరిచి 'జడ్' యొక్క ఇంటిలోనికి ప్రవేశించుట ద్వారా 'ఏ' ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(ఎఫ్) 'జడ్' పోగొట్టు కొన్నట్టి 'జడ్' ఇంటి తాళముచెవి 'ఏ' అనువానికి దొరకగా అతడు ఆ తాళము చెవితో తలుపును తెరచి 'జడ్' ఇంటిలో ప్రవేశించుటద్వారా ఇంట అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

(జి) 'జడ్' తన ఇంటి వాకిలి వద్ద నిలచియున్నాడు. 'జడ్' ను క్రింద పడదొసి 'ఏ' అనునతడు బలాత్కారముగ త్రోవ చేసికొని ఆ ఇంటిలో ప్రవేశించుటద్వారా ఇంట -అక్రమ ప్రవేశము చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట అగును.

{ హెచ్) 'వై' యొక్క ద్వారపాలకుడైన 'జడ్' 'వై' యొక్క వాకిలివద్ద నిలిచియున్నాడు. 'జడ్' ను కొట్టుదునని బెదిరించి తనను అడ్డ కుండా భయ పెట్టి 'ఏ' అనునతడు ఇంటిలో ప్రవేశించుట ద్వారా ఇంట అక్రమ ప్రవేశము,చేయును. ఇది ఇంటికి కన్నము వేయుట ఆగును.


446. సూర్యాస్త మయమైన తర్వాత, తిరిగి సూర్యోదయము కాకముందు ఇంట కన్నము వేయువారెవరై నను “రాత్రివేళ ఇంటికి కన్నము వేసినట్లు" చెప్పుబడుదురు.

ఆపరాధిక అక్రమ ప్రవేశమునకు శిక్ష.

447. అపరాధిక అక్రమ ప్రవేశము చేయువారెవరైనను మూడు మాసములదాకా ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఐదు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని ఈ రెండింటితో గాని శిక్షింపబడుడురు.

ఇంట- అక్రమ ప్రవేశమునకు శిక్ష.

448. ఇంట- అక్రమ ప్రవేశము చేయువారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలొ ఖట ఆక్రము ప్రవేశ ఒక రకపు కారావాసముతో గాని ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు

మరణ దండనతో శిక్షింపదగు ఆపరాధమును చేయుటకుగాను ఇంట- అక్రమ ప్రవేశము,

449. మరణ దండవతో శిక్షింపదగు ఏదేని ఆపరాధమును చేయుటకుగాను ఇంట అక్రమ ప్రవేశము చేయువారెవరైనను యావజ్జీవ కారావాసముతొ గాని, పది సంవత్సరములకు మించని కాలావధికి కఠిన కారావాసముతో గాని, శిక్షింపబడుదురు; మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకుగాను ఇంట-అక్రమ ప్రవేశము.

450. యావజ్జీవ కారావాసముతో శిక్షింపదగు ఆపరాధమును చేయుటకుగాను ఇంట అక్రమ ప్రవేశము చేయువారెవరైనను, పది సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కారావాసముతో శిక్షింపదగు అపరాధమును చేయుటకుగాను ఇంట-అక్రమ ప్రవేశము.

451, కారావాసముతో శిక్షింపదగు ఏదేని అపరాధమును చేయుటకుగాను ఇంట అక్రమ ప్రవేశము చేయు వారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. మరియు చేయుటకు ఉద్దేశింపబడిన అపరాధము దొంగతనమగుచో కాలా వాసపు కాలావధిని ఏడు సంవత్సరముల దాక పొడిగించవచ్చును.

ఘాత, దౌర్జ న్యము,లేక అక్రమ అవరొధమునకు సన్నాహము చేసికొన్న పిమ్మట ఇంట అక్రమ ప్రవేశము.

452. ఏ వ్యక్తి కై నను ఘాత కలిగించుటకు లేక ఏ వ్యక్తి పై నను దౌర్జన్యము చేయుటకు లేక ఏ వ్యక్తి నైనను అక్రమముగా అవరోధించుటకు లేక ఏ వ్యక్తి నై నను ఘాతకుగాని, దౌర్జన్యమునకుగాని, అక్రమ అవరోధమునకు గాని గురి చేయుదునని భయ పెట్టుటకు సన్నాహము చేసియుండి ఇంటా అక్రమ ప్రవేశము చేయు నతడెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షించబడును. మరియు జుర్మానాకు కూడా పాత్రుడగును. ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నమున చేసినందుకు శిక్ష.

453. ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నమున చేయు లేక ఇంటికి కన్నము వేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండ గల కాలావధికి రెంటిలో ఒకరకపు కారా వాసముతొ శిక్షింపబడుదురు, మరియ: జుర్మానాకు కూడ పాఅ పాత్రులగుదురు.

కాలావాసముతో శిక్షింపుదగు అపరాధమును చేయుటకుగాను ఇంట -అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నము, చేయుట లేక ఇంటికి కన్నము వేయుట,

454. కారావాసముతో శిక్షింపదగు ఏదేని అపరాధమును చేయుటకు గాను ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నముగ చేయు లేక ఇంటికి కన్నము వేయు వారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు, జుర్మానాకు కూడ పాత్రులగుదురు. మరియు చేయుటకు ఉద్దేశింపబడిన ఆపరాధము దొంగతనమగుచో కారావానపు కాలావధిని పది సంవత్సరములదాక పొడిగింపవచ్చును.

మాత, దౌర్జన్యము లేక అక్రమ అవరోధమునకు సన్నాహము చేసికొన్న పిమ్మట ఇంట అక్రమ ప్రవేశము.ప్రచ్చన్నముగ చేయుట లేక ఇంట -- కన్నము వేయుట.

455. ఏ వ్యక్తికైనను ఘాత కలిగించుటకు లేక ఏ వ్యక్తి పై నైనను దౌర్జన్యము చేయుటకు, లేక ఏ వ్యక్తి నైనను అక్రమముగ అవరోధించుటకు, లేక ఏ వ్యక్తి నై నను ఘాతకు గాని, దౌర్జన్యమునకు గాని, అక్రమ అవరోధమునకు గాని గురిజేయుదునని భయ పెట్టుటకు సన్నాహము చేసియుండి, ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ చేయు, లేక ఇంటికి కన్నము వేయు నతడెవరై నను, పది సంసత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్టింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

రాత్రిపూట ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగా చేసినందుకు లేక ఇంటికి కన్నము చేసినందుకు శిక్ష.

456. రాత్రిపూట ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ జేయు లేక రాత్రిపూట ఇంటికి కన్నము వేయు వారెవరై నను. మూడు సంవత్సరములగాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు,

కారావాసముతో శిక్షింపదగు అపరాధము చేయుటకుగాను రాత్రివేళ ప్రచ్ఛన్నముగ ఇంట అక్రమ ప్రవేశము చేయుట లేక ఇంటికి కన్నము చేయుట.

457. కారావాసముతో శిక్షింపదగు ఏదేని అపరాధమును చేయుటకు గాను రాత్రిపూట ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ జేయు, లేక ఇంటికి కన్నము చేయు వారెవరై నను ఆరు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు చేయుటకు ఉద్దేశింప బడిన అపరాదము దొంగతనమగుచో కారావాసపు కాలావధిని పదునాలుగు సంవత్సరములు దాక పొడిగించ వచ్చును .


ఘాత, దౌర్జన్యము లేక అక్రమ అవరోధమునకు సన్నాహము చేసికొన్న పిమ్మట రాత్రివేళ ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నము చేయుట లేక ఇంటికి కన్నము వేయుట.

458. ఏ వ్యక్తి కైనను ఘాత కలిగించుటకు, లేక ఏ వ్యక్తి పై నై నను పౌర్బన్యము చేయుటకు, లేక ఏ వ్యక్తి నైనను అక్రమముగ అవరోధించుటకు, లేక ఏవ్యక్తి నై నను ఘాతకు గాని, దౌర్జన్యమునకు గాని, అక్రమ అవరోధమునకు గాని గురిచేయుదునని భయ పెట్టుటకు సన్నాహము చేసియుండి, రాత్రివేళ ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగా చేయు, లేక రాత్రిపూట ఇంటికి కన్నము వేయు వారెవరై నను, పదునాలుగు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసము తొ శిక్షింప బడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్ఛన్నముగ చేయుటలోగాని ఇంటికి కన్నము వేయుటలోగాని దారుణ ఘాత కలుగజేయుట.

459. ఇంట- అక్రమ ప్రవేశమున ప్రచ్ఛన్నము చేయుటలో గాసి, ఇంటికి కన్నము వేయుటలో గాని, ఏ వ్యక్తి కై నను దారుణ ఘాత కలుగజేయు, లేక ఏ వ్యక్తి కై నను మరణమునై నను దారుణ ఘాతనై నను కలుగజేయుటకు ప్రయత్నించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. రాత్రివేళ, ఇంట అక్రమ ప్రవేశము ప్రచ్చన్నముగ చేయుటలో గాని, ఇంటికి కన్నము వేయుటలో గాని సంయుక్తముగా ప్రమేయముగల వ్యక్తులలో ఒకరు మరణము లేక దారుణమైన ఘాత కలుగజేసినయెడల, వారందరు శిక్షింపదగి యుందురు.

460. రాత్రివేళ ఇంట --- అక్రమ ప్రవేశము ప్రచ్చన్నముగ జేయు లేక రాత్రివేళ ఇంటికి కన్నము వేయు సమయమున, అట్టి అపరాధము చేసిన ఏ వ్యక్తి యై నను స్వచ్ఛందముగ ఎవరేని వ్యక్తికి మరణము నైనను, దారుణ ఘాతనైనను కలిగించినచో లేక కలిగించుటకు ప్రయత్నించినచో, అట్లు రాత్రివేళ ఇంట—అక్రమ ప్రవేశము ప్రచ్చన్న ముగ చేయుటలో లేక రాత్రివేళ ఇంటికి కన్నము వేయుటలో సంయుక్త ముగా ప్రమేయముగల ప్రతి వ్యక్తియు యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, శిక్షింప బడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

లోన ఆస్తి ఉన్న పేటికను నిజాయితీ లేకుండా పగులగొట్టి తెరచుట,

461. లోన ఆస్తి ఉన్నట్టిదై లేక ఉన్నదని తాను విశ్వసించుచున్నట్టిదై మూయబడి యున్న ఏదేని పేటికను నిజాయితీ లేకుండగాని దుశ్చేష్ట చేయు ఉద్దేశముతో గాని, పగులగొట్టి తెరచు, లేక మూసియుంచు, బంధనము విప్పు నతడెవరై నను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జూర్మానాతో గాని ఈ రెండింటితో గాని, శిక్షింప బడును.

అభిరక్ష ఆప్పగింపబడిన వ్యక్తి అదే అపరాధమును చేసినప్పుడు శిక్ష,

462. లోన ఆస్తి ఉన్నట్టిదై లేక ఉన్నదని తాను విశ్వసించు నట్టిదై మూయ బడియున్న ఏదేని పేటికను, అప్పగింప బడియుండి, దానిని తెరచుటకు ప్రాధికారము లేకుండియు, నిజాయితీ లేకుండగాని, దుశ్చేష్ట జేయు ఉద్దేశముతో గాని, ఆ పేటికను పగులగొట్టి తెరచు, లేక మూసియుంచు, బంధనము విప్పు నతడెవరైనను, మూడు వత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

{{c|అధ్యాయము-18

{{c|[[larger|దస్తావేజులకు, స్వామ్య చిహ్నములకు సంబంధించిన|}} {{c|అపరాధములగురించి

కూట రచన

463. ప్రజల కైనను, ఎవరేని వ్యక్తి కైనను చెరుపును లేదా హానిని కలిగించవలెననెడి, లేక ఏదేని క్లెయిము నైనను, హక్కునై నను బలపరచవలెననెడి, లేక ఏ వ్యక్తినైనను ఆస్తిని వదలు కోనున్నట్లు గనో ఏదేని కాంట్రాక్టును,అభివ్యక్త మైనదై నసు, గర్భితమై నదైనను, చేసికోనున్నట్లు గనో చేయవలెననెడి ఉద్దేశముతో గాని, కపటమునకు గురి చేయవలెనను, లేదా కపటమునకు గురి చేయవచ్చునను ఉద్దేశముతో గాని, ఏదేని తప్పుడు దస్తా వేజునై నను దస్తా వేజులో ఒక భాగమునైనను రూపొందించు వారెవరైనను కూటరచన చేసిన వారగుదురు.

464 ఒక వ్యక్తి —

తప్పుడు దస్తా వేజును రూపొందించుట.

మొదటిది: ఒక దస్తావేజు లేదా ఒక దస్తా వేజు నందలి భాగము, ఏ వ్యక్తి చే లేదా ఏవ్యక్తి ప్రాధికారమును బట్టి, రూపొందించబడలేదని, సంతకము చేయబడలేదని, ముద్ర వేయబడ లేదని, లేదా నిష్పాదింపబడలేదని తాను ఎరిగి యున్నాడో, ఏ సమయమున అది రూపొందించబడలేదని, సంతకము చేయబడలేదని, ముద్ర వేయబడలేదని, లేదా నిప్పాదింపబడలేదని తాను ఎరిగి యున్నాడో ఆ సమయమున గాని, ఆ వ్యక్తి చేగాని, ఆ వ్యక్తి ప్రాధికారమునుబట్టి గాని అది రూపొందింపబడినదని, సంతకము చేయబడినదని, లేదా నిష్పాదింపబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో నిజాయితీ లేకుండనై నను, కపటముతోనై నను అట్టి దస్తావేజును, లేదా దస్తా వేజునందలి భాగమును రూపొందించుచో లేదా దాని పై సంతకము చేయుచో, లేదా ముద్ర వేయు చో, లేక దానిని నిష్పాదించుచో, లేదా దస్తా వేజు నిష్పాదింప బడినట్లు సూచించు ఏదేని గుర్తును దాని పై వేయుచో, లేక

రెండవది : తనచేగాని, ఎవరేని ఇతర వ్యక్తి చేగాని, ఒక దస్తావేజు రూపొందింపబడిన తరువాత, లేక నిష్పాదింపబడిన తరువాత దానిలో మార్పు చేయుటకు శాసన సమ్మత ప్రాధికారము లేకుండియు, సూర్పుచేయు సమయమున అట్టి ఇతర వ్యక్తి జీవించియున్నను లేక మరణించి యున్నను, నిజాయితీ లేకుండగాని, కపటముతోగాని రద్దు పరచుటద్వారా అయినను, అన్యధా అయినను ఆ దస్తా వేజులోని, ఏదేని ముఖ్యాంశమును మార్పు చేయుచో, లేక

మూడవది : దస్తా వేజులోని విషయములనుగాని, దానిలో చేయు మార్పు యొక్క స్వభావమునుగాని, మతి స్తిమితము లేనందున, లేదా మత్తులో ఉన్నందున ఎవరేని వ్యక్తి తెలిసికొనజాలకున్నాడని, లేక మోసగించబడినందున తెలియకున్నాడని ఎరిగియుండి, నిజాయితీ లేకుండగాని, కపటముతోగాని అట్టి వ్యక్తి చే ఆ దస్తావేజు పై సంతకము చేయించుచో, ముద్ర వేయించుచో, దానిని నిష్పాదింప జేయుచో, లేక మార్పు జేయించుచో, ఆ వ్యక్తి తప్పుడు దస్తా వేజును రూపొందించినాడని చెప్పబడును.

ఉదాహరణములు

(ఏ) ‘బీ ' పై 10,000 రూపాయలు చెల్లించవలసినదిగా ' జడ్' వ్రాసి పరపతిపత్రము 'ఏ' అనునతని వద్ద ఉన్నది. 'బీ'ని కపటమునకు గురిచేయుటకుగాను 10,000 లకు ఒక సున్నను చేర్చి, ' జడ్' ఆ పత్రమును అట్లే వ్రాసెనని 'బీ 'ని విశ్వసింప జేయవలెనను ఉద్దేశముతో 'ఏ' ఆ మొత్తమును 1,00,000గ జేయును. 'ఏ' కూటరచన చేసినవాడగును.

(బీ) 'ఏ ' అనుతడు. ఒక ఎ స్టేటును తాను ' బీ 'కి ని కయించి తద్వారా 'బీ' నుండి క్రయ ధనమును పొందవలెనను ఉద్దేశముతో, తనకు ఆ ఎస్టేటు 'జడ్' నుండి సంక్రమించినట్లు తాత్పర్యమిచ్చు దస్తావేజు పై , 'జడ్' యొక్క ప్రాధికారము లేకుండ, ' జడ్ ' యొక్క మొహరుతో ' ఏ ' ముద్ర వేయును. 'ఏ' కూటరచన చేసినవాడుగును.

(సీ) ఒక బ్యాంకరు పై వ్రాయబడిన ఒక చెక్కు ఏ ' అనువానికి దొరకును. ఆ చెక్కు బేరరుకు చెల్లింపవలసినదిగా 'బీ 'చే సంతకము చేయబడి ఉండును, కాని ఎంత మొత్త మును అనునది ఖాళీగా వదలివేయబడినది. 'ఏ ' ఆ చెక్కు మీద కపటముతో పదివేల రూపాయల మొత్తమును వ్రాసి చెక్కులోని ఖాళీని నింపును,'ఏ' కూటరచన చేసినాడు.

(డీ) ఏ ' అనునతడు ఒక బ్యాంకరు పై చెక్కును వ్రాసి ఎంత మొత్తము చెల్లింపవలెను అనునది ఖాళీగా వదలి సంతకము చేసి తన ఏజెం టైన ' బీ ' వద్ద ఉంచుచూ, కొన్ని చెల్లింపులను చేయు నిమిత్తమై పదివేల రూపాయలకు మించని మొత్తమును వ్రాయుట ద్వారా ఆ చెక్కులో ఖాళీని నింపవలసినదిగా ' బీ 'కి 'ఏ ' అనుమతి నొసగును.' బీ ' కపటముగ ఇరువదివేల రూపాయల మొత్తమును వ్రాసి ఆ చెక్కులోని ఖాళీని నింపును. 'బి' కూటరచన చేసినాడు.

(ఈ) 'బీ' నుండి ప్రాధికారము పొందకుఁడ, 'ఏ' అనునతడు తన పై 'బీ' వ్రాసినట్లుగా ఒక వినిమయ పత్రమును వ్రాయును. అసలైన బిల్లుగా దానిని ఒక బ్యాంకరు వద్ద డిస్కౌంటు చేసి చెల్లించ వలసిన కాలము నాటికి దానిని చెల్లించుదామని 'ఏ' ఉద్దేశము. 'బీ' యొక్క హామీ తనకు గలదని ఆ బ్యాంకరు భావించునట్లు చేసి తన్మూలముగా ఆ పత్రముసు డిస్కౌంటు చేయించి ఆ బ్యాంకరును మోసగించు ఉద్దేశముతో 'ఏ' ఆ వినిమయ, పత్రమును వ్రాసినందున 'ఏ' కూటరచన చేసిన వాడగును.

(ఎఫ్) 'జడ్' యొక్క వీలునామాలో ఈ మాటలున్నవి . “మిగిలియున్న నా ఆస్తి నంతయు, 'ఏ' 'బీసీ' లకు సమానముగా పంచి పెట్ట వలెనని నేను ఆదేశించు చున్నాను." 'ఏ' ఆ ఆస్తి అంతయు తనకూ 'సీ' కే ఈయబడినదని విశ్వసింపబడ వలెనను ఉద్దేశముతో నిజాయితీ లేకుండా 'బీ' పేరును చెరిపి వేయుసు. 'ఏ' కూటరచన చేసినవాడగును.

(జీ) 'ఏ' అనునతడు ప్రభుత్వ ప్రొనోటు మీద “జడ్" కు గాని ఆతని ఆర్డరు పొందిన వారికి గాని చెల్లించ వలసినది" అను పదములను పీటీ వ్రాసి క్రింద సంతకము చేయుట ద్వారా దానిని 'జడ్' కు గాని, ఆతని ఆర్డరు పొందిన వారికి గాని చెల్లించ వలసి యుండునట్లు చేయును. 'జడ్' కు గాని, అతని ఆర్డరు పొందిన వారికి గాని చెల్లించ వలసినది" అను పదములను 'బీ' నిజాయితి లేకుండా తుడిచి వేసి తద్వారా ప్రత్యేక పీటీ వ్రాతను ఖాళీ పీటీ వ్రాతగా మార్చును. 'బీ' కూటరచన చేసినాడు.

(హెచ్) 'ఏ'అను నతడు ఒక ఎస్టేటును 'జడ్' కు విక్రయించి అతనికి హస్తాంతరణ చేయును. 'ఏ' అటు తరువాత 'జడ్' ను కపటమునకు గురిచేసి ఆ ఎస్టేటును అతనికి దక్క కుండ చేయుటకు గాను తాను, 'జడ్'కు ఆ ఎస్టేటును హస్తాంతరణ చేయుటకు పూర్వమే దానిని 'బీ' కి హస్తాంతరణ జేసినట్లు విశ్వసింప జేయు ఉద్దేశముతో, 'జడ్' కు హస్తాంతరణ జేసిన తేదీకి ఆరునెలలకు ముందు తేదీ వేసి అదే ఎ స్టేటుకు 'బీ' పేర హస్తాంతరణ పత్రమును నిష్పాదించును. 'ఏ' కూటరచన చేసిన వాడగును.

(ఐ) 'జడ్' తన వీలునామాను చెప్పగా 'ఏ'వ్రాయును. 'జడ్' చెప్పిన వసీయతుదారు పేరుకు బదులు వేరొకరి పేరును వసీయతుదారుగా 'ఏ' ఉద్దేశపూర్వకముగ వ్రాసి, 'జడ్' చెప్పిన ప్రకారమే ఆ వీలునామా

తాను తయారు చేసినానని అతనికి తెలిపి 'జడ్' చే ఆ వీలునామా పై సంతకము చేయించును. 'ఏ' కూటరచన చేసినవాడగును.

(జే) 'ఏ' అనునతడు ఒక జాబుద్వారా, 'జడ్' నుండి మరియు ఇతర వ్యక్తు లనుండి ముష్టి ఎత్తు కొనవలెనను ఉద్దేశముతో 'ఏ' సచ్ఛీలుడనియు, దురదృష్టవశాత్తు దీనస్థితిలో ఉన్నాడనియు, జాబును 'బీ' వ్రాసి యిచ్చినట్లు అతని ప్రాధికారము పొందకుండ 'ఏ' వ్రాసి 'బీ' పేరిట సంతకము చేయును. ఇచట 'జడ్'చే 'అతని ఆస్తిని ఇప్పించుకొనుటకుగాను 'ఏ' తప్పుడు దస్తా వేజులను రూపొందించినందున 'ఏ' కూట రచన చేసిన వాడగును.

(కే) 'జడ్' వద్ద ఉద్యోగమును పొందు ఉద్దేశముతో 'ఏ' అనునతడు. తాను సచ్చీలుడని తెలుసు ఒకజాబును 'బీ' వ్రాసియిచ్చినట్లు వ్రాసి 'బీ' యొక్క ప్రాధికారము పొందకుండ దాని పై 'బీ' పేరిట సంతకము చేయును 'ఏ' కూట రచిత సర్టిఫికేటుచే 'జడ్'ను మోసగించి తద్వారా ఒక అభివ్యక్తమైన లేక గర్భితమైన సేవా కాంట్రాక్టును 'జడ్' తనతో కుదుర్చుకొనునట్లు చేయుటకు ఉద్దేశించినందున 'ఏ' కూటరచన చేసినవాడగును.

విశదీకరణము 1: ఒకమనిషి తన పేరిటనే తాను సంతకము చేయుట కూట రచన కావచ్చును.

ఉదాహరణములు :

(ఏ) 'ఏ' తన పేరేగల వేరొక వ్యక్తి చే వినిమయ పత్రము వ్రాయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో తన పేరులోనే ఆ వినిమయ పత్రము పై సంతకము చేయును. 'ఏ' కూటరచన చేసినవాడగును.

(బీ) 'ఏ' అనునతడు ఒక ఖాళీ కాగితము పై "స్వీకరింపబడినది.” అను పదమును వ్రాసి 'జడ్' పేరుతో సంతకము చేయును. ఇందుమూలముగా తరువాత ఆ కాగితముమీద 'జడ్' పై ఒక వినిమయ పత్రమును 'బీ' వ్రాసి ఆ వినిమయపత్రము 'జడ్' స్వీకరించినట్లుగా దాన్ని పరాక్రాంతము చేయుట అతని ఉద్దేశమై యున్నది 'ఏ' కూటరచన చేసిన వాడగును, మరియు 'బీ' ఆ సంగతి ఎరిగియుండి 'ఏ' యొక్క ఉద్దేశమును పురస్కరించుకొని కాగితము పై ఆ పత్రమును వ్రాయుచో, 'బి' కూడ కూటరచన చేసినవాడగును.

(సీ) 'ఏ' అనునతనికి అదే పేరుగల వేరొక వ్యక్తి యొక్క ఆర్డరు పొందినవారికి చెల్లించవలసిన ఒక వినిమయ పత్రము దొరకును. ఎవరి ఆర్డరు ప్రకారము ఆ పత్రము చెల్లింపబడవలసియుండునో ఆవ్యక్తి చే పీటీ వ్రాయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'ఏ' కు చెల్లింప వలసినదని ఆ వినిమయ పత్రము పై తానే పీటీ వ్రాయును. ఇచట 'ఏ' కూటరచన చేసినవాడగును.

(డీ) 'బి' ఆనునతని పై ఒకడిక్రీని అమలు పరచుటలో విక్రయింపబడగా ఒక ఎస్టేటును ఏ' కొనును. ఎస్టేటు అభి గ్రహణము చేయబడిన తరువాత 'బీ' 'జడ్' తో లాలూచిపడి 'ఏ' ను కపటమునకు గురిచేయు ఉద్దేశముతోను, అభిగ్రహణమునకు మునుపే 'బీ' చే కౌలుకు యొసగబడి దని విశ్వసింపజేయుటకును, 'జడ్' పేరిట ఆ ఎస్టేటు విషయమున నామమాత్రపు మక్తాకు దీర్ఘ కాలికముగా, కౌలును నిష్పాదనచేసి, ఆ కౌలుపై అభి గ్రహణమునకు ఆరునెలల ముందటి తేదీ వేయును. 'బీ' కొలును తన పేరులోనే నిష్పాదన చేసినను కౌలు పై అంతకు ముందటి తేదీని వేయుట వలన, అతడు కూటరచన చేసినవాడగును.

(ఈ) వ్యాపారస్తు డైన 'ఏ' తాను దివాలా తీయుదునని ముందుగా ఊహించి తన ఋణదాతలను కపటమునకు గురిచేయవలెనను ఉద్దేశములో, తన చరాస్తి ని 'ఏ' యొక్క. మేలుకొరకై 'బీ' పరముచేసి ఆ వ్యవహారము నిజమై నదిగా కాన్పించునట్లు చేయుటకుగాను 'బీ' నుండి తాను ఒక మొత్త మును అప్పు తీసికొన్నందుకై , ఆ మొత్తమును చెల్లింతునని ఒక ప్రోనోటు వ్రాసి తాను దివాలా తీయు దశకు చేరకముందే దానిని వ్రాసినట్లు విశ్వసింపజేయ ఉద్దేశముతో పత్రము పై అంతకు ముందటి తేదీని వేయును. 'ఏ' ఈ నిర్వచనపు మొదటి శీర్షిక క్రింద కూటరచన చేసినవాడగును.

విశదీకరణము 2 : ఒక తప్పుడు దస్తా వేజును ఆది వాస్తవమైన వ్యక్తి చే చేయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో ఒక కల్పిత వ్యక్తి పేరునగాని, అది ఒక వ్యక్తి చే అతని జీవితకాలములో చేయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో మరణించిన ఒక వ్యక్తి పేరున గాని రూపొందించుట కూటరచన కావచ్చును.

ఉదాహరణము

ఒక వినిమయపత్రమును ఒక కల్పితవ్యక్తి పై వ్రాసి, దానిని పరాక్రాంతము చేయు ఉద్దేశముతో అట్టి కల్పిత వ్యక్తి పేరులో కపటముతో 'ఏ' అనునతడు ఆ పత్రమును స్వీకరించును. 'ఏ' కూటరచన చేసినవాడగును. 1 కూట రచనకు శిక్ష.

465. కూటరచన చేయువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

న్యాయస్థానపు రికార్డు లేక పబ్లికు రిజిస్టరు మొదలగువాటిని కూటరచన చేయుట.

466. ఒక న్యాయస్థానము యొక్క రికార్డుగ, చర్యగ, లేక న్యాయస్థానమునందలి రికార్డుగ, చర్యగ, లేక జననము, బాప్టి జము, వివాహము, లేదా ఖననములను గురించిన రిజిస్ట రుగ, లేక పబ్లికు సేవకుడు అట్టి పబ్లికు సేవకుడుగ ఉంచిన రిజిస్టరుగ లేక తన పదవీ హోదాలో పబ్లికు సేవకుడు ఇచ్చినట్లు తాత్పర్యమిచ్చు నట్టి సర్టిఫికెటుగ లేదా అట్టి దస్తా వేజుగ లేక దావా వేయుటకు గాని ఉత్త రవాదనచేయుటకు గాని అందులో ఏవేని చర్యలను నడుపుటకు గాని తీర్పును ఒప్పుకొనుటకు గాని, ఈయబడిన ప్రాధికారపత్రముగ, లేక ఒక ముక్త్యారునామాగ తాత్పర్యము నిచ్చు దస్తా వేజును కూటరచనచేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలా వధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విలువగల 'సెక్యూరిటీ, వీలునామా మొదలగు వాటిని కూటరచన చేయుట.

467. విలువగల సెక్యూరిటీగ, లేక వీలునామాగ, లేక పుత్రుని దత్తు చేసుకొనుటకైన ప్రాధికారపత్రముగ తాత్పర్యము నిచ్చు దస్తావేజునుగాని, విలువగల ఏదేని సెక్యూరిటీని ఇచ్చుటకు లేక బదిలీ చేయుటకు లేక దాని పై వచ్చే అసలును, వడ్డీని లేదా లాభాంశములను పుచ్చుకొనుటకు లేక ఏదేని డబ్బునై నను చరాస్తి నైనను విలువగల సెక్యూరిటీ నైనను పుచ్చుకొనుటకు లేదా అందజేయుటకు ఏవ్యక్తి కైనను ప్రాధికారమిచ్చు నదిగ తాత్పర్యమునిచ్చు దస్తా వేజును గాని డబ్బు చెల్లింపును ఒప్పుకొనుచూ ఇచ్చే చెల్లు చీటీగా లేక రసీదుగా, లేక ఏదేని చరాస్తి నై నను విలువగల సెక్యూటీనైనను అందజేసినందుకు చెల్లు చీటీగా లేక రసీదుగా తాత్పర్యమునిచ్చు ఏదేని దస్తా వేజును గాని, కూటరచనచేయు వారెవరైనను యావజ్జీవ కారావాసముతోగాని, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

దగా చేయుటకు కూటరచన.

468. దగాచేయుటకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఒక దస్తా వేజును కూటరచన చేయు వారెవరైనను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకుకూడ పాత్రులగుదురు.

అపఖ్యాతి కలిగించుటకు కూటరచన,

469. ఎవరేని పక్ష కారునికి అపఖ్యాతి కలిగించవలెనను ఉద్దేశముతో గాని, ఆందునిమిత్తమై ఉపయోగింపబడగలదని ఎరిగి యుండిగాని ఒక దస్తావేజును కూటరచనచేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కూటరచితమైన దస్తావేజు.

470. పూర్ణతః గాని, భాగతః గాని కూటరచన ద్వారా చేయబడిన తప్పుడు దస్తావేజు “కూటరచితమైన దస్తావేజు " అని పేర్కొనబడును.

కూటరచితమైన దస్తావేజును అసలైనదిగా ఉపయోగించుట.

471. కూటరచితమైన దస్తా వేజుని తాను ఎరిగియున్న లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణమున్న ఏదేని దస్తావేజును కపటముతోగాని, నిజాయితీ లేకుండ గాని అసలైన దస్తావేజుగ. ఉపయోగించు నతడెవరైనను, తాను అట్టి దస్తావేజును కూటరచన చేసియుండిన ఎట్లో అదేరీతిలో శిక్షింపబడును.

467వ పరిచ్చేదము క్రింద శిక్షింపదగు కూట రచనను చేయు ఉద్దేశ్యముతో నకిలీ మొహరు మొదలగు వాటిని చేయుట లేక వాటిని స్వాధీనము నందుంచుకొనుట.

472. ఈ స్మృతియొక్క 467 వ పరిచ్చేదము క్రింద శిక్షింపదగునట్టి ఏదేని కూటరచనను చేయుటకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఏదేని మొహరునుగాని, ప్లేటునుగాని, ముద్రవేయు ఇతర ఉపకరణమునుగాని తయారుచేయు లేక దానిని నకిలీగాచేయు లేక అట్టి ఏదేని మొహరునుగాని, ప్లేటునుగాని, ఇతర ఉపకరణమునుగాని అది నకిలీదని ఎరిగియుండి అట్టి ఉద్దేశములో తన స్వాధీనములో ఉంచుకొను వారెవరై నను. యావజ్జీవ కారావాసముతో గాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

అన్యధా శిక్షింపదగు కూటరచన చేయు ఉద్దేశ్యముతో నకిలీ మొహరు మొదలగు వాటిని చేయుట, లేక వాటిని స్వాధీనము నందుంచుకొనుట,

473. ఈ అధ్యాయము యొక్క 467 వ పరిచ్ఛేదము క్రింద గాక ఏదేని ఇతర పరిచ్చేదము క్రింద శిక్షింపదగునట్టి ఏదేని కూటరచన చేయుటకై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో ఏదేని మొహరునుగాని, ప్లేటునుగాని, ముద్రవేయు ఇతర ఉపకరణమునుగాని తయారుచేయు, లేక దానిని నకిలీగా చేయు, లేక అట్టి మొహరునుగాని, ప్లేటునుగాని ఇతర ఉపకరణమును గాని అది నకిలీదని ఎరిగియుండి అట్టి ఉద్దేశముతో తన స్వాదీనములో ఉంచుకొనువాడెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు. మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. 466వ లేక 467వ పరిచ్ఛేదములో వివరింపబడిన దస్తావేజు కూటరచన చేయబడినదని ఎరిగియుండి దానిని అసలైనదిగా ఉపయోగించు ఉద్దేశ్యముతో దానిని స్వాధీనము నందుంచుకొనుట.

474. ఏదేని దస్తావేజు కూటరచన చేయబడినదని ఎరిగి యుండి, కపటముతో గాని, నిజాయితీ లేకుండ గాని దానిని అసలైన దానినిగా ఉపయోగింపవలెనను ఉద్దేశముతో దానిని తన స్వాధీనములో ఉంచుకొను వారెవరైనను ఆ దస్తావేజు ఈ స్మృతియొక్క 466వ పరిచ్ఛేదములో పేర్కొనబడిన రకములలో ఏదియైనను అయినయెడల ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు, మరియు ఆ దస్తావేజు 467వ పరిచ్ఛేదములో పేర్కొనబడిన రకములలో ఏదియైనను అయినయెడల యావజ్జీవ కారావాసముతోగాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

467వ పరిచ్ఛేదములో వివరింపబడిన దస్తావేజులను అధి ప్రమాణీకరించుట కొరకు ఉపయోగింపబడు ఆకృతిలేక గుర్తును నకిలీగా చేయుట, నకిలీ గుర్తు వేయబడిన సామాగ్రిని స్వాధీనమునందుంచు కొనుట.

475. ఈ స్మృతియొక్క 467 వ పరిచ్ఛేదములో వివరింపబడిన ఏదేని దస్తా వేజును అధి ప్రమాణీకరించుట కొరకై ఉపయోగింపబడు ఏదేని ఆకృతిని లేక గుర్తును ఏదేని సామగ్రిమీదఅప్పుడే కూటరచనచేయబడిన, లేక ఆ తరువాత కూటరచన చేయబడనున్న ఏదేని దస్తావేజు అధిప్రమాణీకరింపబడినట్లు కన్పించునిమిత్తమై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో, అట్టి సామగ్రిపై గాని అట్టి సామగ్రి యొక్క పదార్థములో గాని ఆ నకిలీ ఆకృతిని లేక గుర్తును వేయువారెవరైనను లేక అట్టి ఉద్దేశముతో అట్టి ఏదేని నకిలీ ఆకృతి, లేక గుర్తు దాని పైన వేయబడిన లేదా దాని పదార్థములో పూయబడిన ఏదేని సామగ్రిని స్వాదీనమునందుంచుకొన్నట్టి వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

467వ పరిచ్ఛేదముల వివరింపబడినవి కాక ఇతరమైన దస్తావేజులను అధి ప్రమాణీకరించుట కొరకు ఉపయోగింపబడు ఏదేని ఆకృతిని లేక గుర్తును నకిలీగా చేయుట, లేక నకిలీ గుర్తును వేయబడిన సామగ్రిని స్వాధినము నందుంచు కొనుట,

476. ఈ స్మృతి యొక్క 467వ పరిచ్ఛేదములో వివరించబడిన దస్తా వేదాలను కాక ఇతరమైన ఏదేని దస్తావేజును అధి ప్రమాణీకరించుట కొరకై ఉపయోగింపబడు ఏదేని ఆకృతిని లేక గుర్తును ఏదేని సామాగ్రి మీద అప్పుడే కూటరచవ చేయబడిన, లేక ఆ తరువాత కూటరచన చేయబడనున్న, ఏదేని దస్తావేజు అధి ప్రమాణీకరింప బడినట్లు కా విమిత్తమై ఉపయోగింపబడవలెనను ఉద్దేశముతో, అట్టి సామాగ్రి పై గాని అట్టి సామాగ్రి కొరకు ఉపయోగింపబడు యొక్క పదార్థములో గాని ఆ నకిలీ ఆకృతిని లేక గుర్తును వేయు వారెవరైనను అట్టి ఉద్దేశముతో అట్టి ఏదేవి నకిలీ ఆకృతిని ఆకృతి లేక గుర్తు దాని పై నవేయబడిన లేదా దాని పదార్థము లోన వేయబడిన ఏదేవి సామాగ్రిని స్వాధీనము నందుంచు కొన్నట్టి వారెవరైనను ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వీలునామాను, దత్తత ప్రాధికార పత్రమును లేక విలువగల సెక్యూరిటీని కపటముతో రద్దు చేయుట,నాశనము చేయుట మొదలగునవి.


477. వీలునామాగా, పుత్రుని దత్తు చేసికొను ప్రాధికారముగా, లేక ఏదేని విలువగల సెక్యూరిటీగా ఉన్నట్టి లేదా అట్లని తాత్పర్య మిచ్చునట్టి ఏదేని దస్తావేజును కపటముతొనై నను నిజాయితీ లేకుండనైనను, ప్రజలకు లేక ఎవరేని వ్యక్తి కి చెరువును లేదా హానిని కలుగజేయు ఉద్దేశముతోనైనను, రద్దు చేయు, నాశనముచేయు లేదా విరూపము చేయు లేక, రద్దు చేయుటకుగాని, నాశనము చేయుటకుగాని, విరూపము చేయుటకుగాని, ప్రయత్నించు, లేక దాచు లేదా దాచుటకు ప్రయత్నించు, లేక అట్టి దస్తావేజు విషయమున దుశ్చేష్ట చేయు వారెవరైనను యావజ్జీవ కారావాస ముతో గాని ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

లెక్కలను తారుమారు చేయుట.

477-ఏ. గుమాస్తాగా, అధికారిగా, లేక సేవకుడుగా ఉండిగాని, గుమాస్తాగా, అధికారిగా, లేక సేవకుడిగా నియోగింపబడియుండిగాని, ఆ హోదాలో వ్యవహారించుచుండిగాని, తన వియోజకునికి చెందినదగు, లేక అతని స్వాధీనములోనున్న, లేక తన నియోజకుని కొరకుగాని అతని తరఫున గాని తనచే స్వీకరింపబడిన ఏదేని పుస్తకమునకాగితమును, వ్రాత ప్రతిని, విలువగల సెక్యూరిటీని, లేక ఖాతా లెక్కను బుద్ధి పూర్వకముగను, కపటమునకు గురిచేయు ఉద్దేశముతోను నాశనము చేయు, మార్పుచేయు, అసమగ్రముచేయు,లేక తారుమారు చేయునతడెవరైనను బుద్ధిపూర్వకముగను, కపటమునకు గురిచేయు ఉద్దేశముతోను, ఏదేని అట్టి పుస్తకములో, కాగితములో, వ్రాత ప్రతిలో విలువగల సెక్యూరిటీలో లేదా ఖాతా లెక్కలో ఏదేని వివరమును తప్పుడు నమోదుచేయు, లేదాచేయుటకు దుష్ప్రేరణ చేయు, లేక ఏదేని ముఖ్య వివరమును లోపింపజేయు, మార్పుచేయు, లేదా లోపింపజేయుటకు గాని, మార్చుటకుగాని దుష్ప్రేరణచేయు నతడెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

విశదీకరణము:-- ఈ పరిచ్ఛేదము క్రింద చేయబడు ఏదేని ఆరోపణములో కపటమునకు ఏ వ్యక్తిని గురిచేయు ఉద్దేశముఉండెనో ప్రత్యేకముగా పేర్కొనకుండ, లేక ఎంత మొత్త మును గూర్చి కపటమువకు గురిచేయ ఉద్దేశముండెనో, లేదా అపరాధము ఏదినమున చేయబడెనో ప్రత్యేకముగా నిర్ధిష్ట పరచకుండ, కపటమునకు గురి

చేయవలెనను సాధారణ ఉద్దేశము ఉండెనని చెప్పినచాలును.

'స్వామ్యచిహ్నములు, తదితర చిహ్నములను గురించీ

478. X X X X X

స్వామ్య చిహ్నము.

479. చరాస్తి ఫలాని వ్యక్తి కి చెందినదని సూచించుటకు ఉపయోగించబడు గుర్తు స్వామ్యచిహ్నము అనబడును.

480. X X X X X X X

తప్పుడు స్వామ్య చిహ్నమును ఉపయోగించుట.

481. ఏదైన చరాస్తి పై లేక ఏవేని సరుకుల పై గాని, చరాస్తి యై నను సరకులైనను ఉన్న ఏదేని పెట్టె, బంగి, లేక ఇతర పేటిక పై గాని, ఆ చరాస్తి లేక సరుకు ఒక వ్యక్తి దై యుండగా మరొకరిదని విశ్వసింపదగియుండునట్లు చిహ్నమును దేనినై నను వేయువారెవరైనను, పైన ఏదేని చిహ్నముగల ఏదేని పెట్టెను, బంగీని లేక ఇతర పేటికను అందలి చరాస్తి లేక సరుకు ఒక వ్యక్తి దైయుండగా మరొకరిదని విశ్వసింపదగియుండునట్లు ఉపయోగించువారెవరైనను, తప్పుడు స్వామ్య చిహ్నమును ఉపయోగించినట్లు చెప్పబడుదురు.

తప్పుడు స్వామ్య చిహ్నమును ఉపయొగించినందుకు శిక్ష.

482. ఏదేని తప్పుడు స్వామ్యచిహ్నమును ఉపయోగించునతడెవరైనను, కపటమునకు గురిచేయు ఉద్దేశము లేకుండ తాను వ్యవహరించినట్లు రుజువు చేసిననే తప్ప, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసము తో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

వేరొకరు ఉపయోగించు స్వామ్య చిహ్నమును నకిలీగా చేయుట.

483. ఇతర వ్యక్తి ఎవరైనను ఉపయోగించు ఏదేని స్వామ్య చిహ్నమును నకిలీగా చేయువారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

పబ్లికు సేవకుడు ఉపయోగించు చిహ్నమును నకిలీగా చేయుట.

484. పబ్లికు సేవకుడు ఉపయోగించు ఏదేనిస్వామ్య చిహ్నమును గాని, ఏదేని ఆస్తి ని గురించి అది ఒక ప్రత్యేక వ్యక్తి చేనై నను, ప్రత్యేక సమయముననైనను, ప్రత్యేక స్థలములోనై నను నిర్మాణము చేయబడినదని, లేక ఆ ఆస్తి ఒక ప్రత్యేక నాణ్యతగలిగినదని, లేక ప్రత్యేక కార్యాలయము ద్వారా వచ్చినదని లేక అది ఏదేని మినహాయింపుకు అర్హమై నదని సూచించుటకై పబ్లికు సేవకుడు ఉపయోగించు ఏదేని చిహ్నమును గాని నకిలీగాచేయు, లేదా ఏదేని అట్టి చిహ్నము నకిలీదని ఎరిగియుండి దానిని అసలైనదిగా ఉపయోగించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

స్వాన్యు చిహ్నమును నకిలీగా చేయుటకై ఏదేని ఉపకరణమును తయారు చేయుట లేక స్వాధీనము నందుంచుకొనుట.

485. స్వామ్యచిహ్నమునకు నకిలీ దైన చిహ్నమును చేయు నిమిత్త మై ఏదేని అచ్చు దిమ్మె, ప్లేటు లేక ఇతర ఉపకరణమును తయారుచేయు, లేక స్వాధీనమునందుంచుకొను లేక ఏవేని సరుకులు ఒక వ్యక్తి వై యుండగా మరొకరి వైనట్లు సూచించు నిమిత్తమై స్వామ్యచిహ్నమును స్వాధీనమునందుంచుకొను వారెవరై నను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని శిక్షింపబడుదురు.

నకిలీ స్వామ్యచిహ్నము గల సరుకులను విక్రయించుట.

486. నకిలీ స్వామ్యచిహ్నము అంటింపబడినట్టి లేక అట్టి చిహ్నము ముద్రింపబడినట్టి నైనను నకిలీ స్వామ్యచిహ్నము అంటించబడిన లేక ముద్రింపబడిన ఏదేని పెట్టె, బంగీ, లేదా పేటికలో ఉన్నట్టి వైనను, ఏవేని సరుకులను గాని వస్తువులను గాని విక్రయించు, లేక విక్రయమునకు పెట్టు లేక విక్రయించుటకై స్వాధీనమునందుంచు కొనునతడెవరైనను, అతడు,-

(ఏ) ఈ పరిచ్ఛేదమును ఉల్లంఘించు అపరాధమును చేయకుండుటకు యుక్తమైన ముందు జాగ్రత్తల నన్నింటిని తీసికొనియుండి, అపరాధమును చేసినట్లు చెప్పబడిన సమయమున ఆ చిహ్నము అసలైనది కాదని అనుమానించుటకు తనకు కారణమేదియు లేకుండెననియు, మరియు,

(బి) ప్రాసిక్యూటరు గాని, అతని తరఫున గాని చేయబడిన అభ్యర్ధన పై , అట్టి సరుకులను, లేక వస్తువులను తానెవరి నుండి పొందెనో అట్టి వ్యక్తులను గూర్చి తనకు తెలిసిన, తాను తెలిసికొనగలిగిన సమాచారమునంతను తానిచ్చి యుండెననియు, లేక

(సీ) ఇతర విషయములను బట్టి కూడ తన ప్రవర్తనలో దోషము లేదనియు,

రుజువు చేసిననేతప్ప, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును. సరుకులున్న ఏదేని పేటిక పై తప్పుడు చిహ్నమును వేయుట.

487. సరుకులతో నింపిఉన్న ఏదేని పెట్టె బంగీ, లేదా ఇతర పేటికయందు లేని సరుకులు ఉన్నవనియు అందున్న సరుకులు లేవనియు, లేక ఆ పేటికలోని సరుకుల స్వభావము లేక నాణ్యతకు వేరగు స్వభావము లేక నాణ్యత కలవిగ ఒక పబ్లికు సేవకునినై నను ఎవరేని ఇతర వ్యక్తి నై నను విశ్వసింపజేయుటకు తగినట్లు వీలుకలిగించు రీతిలో అట్టి పెట్టె, బంగీ, లేక ఇతర పేటిక పై తప్పుడు చిహ్నమును వేయనతడెవరైనను, కపటమునకు గురిచేయు ఉద్దేశము, లేకుండ తాను వ్యవహరించినట్లు రుజువు చేసిననే తప్ప, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

అట్టి తప్పుడు చిహ్నమును దేనినై నను ఉపయోగించినందుకు శిక్ష

488. పై కడపటి పరిచ్ఛేదము ద్వారా నిషేధింపబడినట్టి ఏదేని రీతిలో అట్టి తప్పుడు చిహ్నమును దేనినై నను ఉపయోగించు నతడెవరైనను కపటమునకు గురిచేయు ఉద్దేశము లేకుండ తాను వ్యవహరించునట్లు రుజువు చేసిన నేతప్ప, అట్టి పరిచ్ఛేదమును ఉల్లంఘించి అపరాధమును చేసియుండిన ఎట్లో అట్లే శిక్షింపబడును.

హాని కలుగ జేయవలెనను ఉద్దేశముతో స్వామ్య చిహ్నము విషయమున అంతః క్షేపము.

489. ఎవరేని వ్యక్తికి హాని కలిగించు ఉద్దేశముతో గాని, తద్వారా హాని కలిగించగలనని ఎరిగియుండిగాని ఏదేని స్వామ్య చిహ్నమును తొలగించు, నాశనము చేయు, విరూపము చేయు, లేక ఆ చిహ్నమునకు దేనినైనా చేర్చు వారెవరై నను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

కరెన్సీ నోట్లను, బ్యాంకు నోట్లను గురించి

కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను నకిలీగా చేయుట.

489- ఏ. – ఏదేని కరెన్సీ నోటును, లేక బ్యాంకు నోటును నకిలీగా చేయు, లేక నకిలీగా చేయు ప్రక్రియలో ఎరిగియుండియు ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-- ఈ పరిచ్ఛేదము నిమిత్తము మరియు పరిచ్ఛేదములు 489- బీ, 489-సీ, 489-డీ 489- ఈల నిమిత్తము “బ్యాంకునోటు" అనగా బేరరుకు అభ్యర్ధన పై డబ్బు చెల్లించే పద్ధతిలో ప్రపంచములో ఎచటనై నను బ్యాంకింగ్ వ్యాపారము చేయు ఎవరేని వ్యక్తి చే జారీచేయబడి, లేక ఏదేని రాజ్యపు లేదా సార్వభౌమాధికారపు ప్రాధికారముచేగాని ఫ్రాధికారమును బట్టి గాని జారీ చేయబడి, డబ్బుకు తుల్యమై నదిగానై నను డబ్బుకు మారుగా నైనను ఉపయోగించబడుటకై ఉద్దేశింపబడిన ప్రామిసరీనోటు లేక ఒప్పంద పత్రము అని అర్థము.

కూటరచితమైన లేక నకిలీవైన కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను అసలై నవిగా ఉపయోగించుట.

489- బీ. ఏదేని కూటరచితమైన, లేక నకిలీదైన కరెన్సీ నోటు లేక బ్యాంకు నోటు కూటరచితమై నదని, లేక నకిలీదని ఎరిగియుండి, లేక అట్లు విశ్వసించుటకు కారణము కలిగియుండి, ఏ ఇతర వ్యక్తి కైనను దానిని విక్రయించు, లేక అతని నుండి కొను లేక తీసికొను, లేక అన్యధా దాని క్రయ విక్రయములు జరుపు లేదా, అసలై నదిగా దానిని ఉపయోగించువారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

కూటరచితమైన లేక నకిలీవైన కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను స్వాధీనము నందుంచుకొనుట.

489-సీ. ఏదేని కూటరచితమైన లేక నకిలీదైన కరెన్సీ నోటును, లేక బ్యాంకు నోటును కూటరచితమైనదని లేక నకిలీదని ఎరిగియుండి, లేక అట్లు విశ్వసించుటకు కారణము కలిగియుండి, దానిని అసలైనదిగా ఉపయోగించు ఉద్దేశముతో నై నసు, అది అసలైనదిగ ఉపయోగింపబడవచ్చునను ఉద్దేశముతోనై నను, దానిని స్వాధీనమునందుంచు కొనువారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను కూట రచన చేయుటకు లేక నకిలీగా చేయుటకు ఉపకరణములను లేక సామగ్రిని తయారుచేయుట లేక వాటిని స్వాధీనమునందుంచు కొనుట.

489-డీ. ఏదేని కరెన్సీ నోటును లేక బ్యాంకు నోటును కూటరచన చేయుటకు లేక నకిలీగా చేయుటకు ఉపయోగింపబడు నిమిత్త మై గాని అట్లు ఉపయోగింపబడుటకు ఉద్దే శింపబడినదని ఎరిగి యుండి లేక అట్లు విశ్వసించుటకు కారణము కలిగియుండిగాని ఏదేని యంత్రపరికరమును ఉపకరణమును, సామాగ్రిని తయారు చేయు, తయారుచేయ ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు లేక కొను, లేక విక్రయించు, లేక వ్యయనము చేయు, లేక స్వాధినము నందుంచుకొనువారెవరైనను, యావజ్జీవ కారావాసముతోగాని పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి , రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు. కరెన్సీ నోట్లను లేక బ్యాంకు నోట్లను పోలియుండు దస్తావేజులను రూపొందించుట లేక ఉపయోగించుట.

489-ఈ-(1) ఏదేని కరెన్సీ నోటుగ, లేక - బ్యాంకు నోటుగ తాత్పర్యమిచ్చునట్టి లేదా ఏదేని విధముగ దానిని పోలియుండునట్టి, లేదా మోసగించుటకు వీలు కలిగించునట్లుగా దానిని పోలియుండునట్టి ఏదేని దస్తా వేజును రూపొందించు, లేక రూపొందింపజేయు, లేక ఏ ప్రయోజనము కొరకైనను ఉపయోగించు, లేక ఏ వ్యక్తి కైనను అందజేయు వారెవరైనను, వందరూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు.

(2) ఏ దస్తా వేజును రూపొందించుట ఉపపరిచ్ఛేదము (1) క్రింద అపరాధమై యున్నదో ఆ దస్తావేజు పై ఏ వ్యక్తి యొక్క పేరైనను ఉన్నచో, అట్టి వ్యక్తి ఎవరైనను, ఏ వ్యక్తి చే అది ముద్రింపబడినదో అన్యధా రూపొందింపబడినదో ఆ వ్యక్తి పేరును, చిరునామాను పోలీసు అధికారి కోరిన మీదట, శాసనసమ్మత హేతువేదియు లేకుండ, అతనికి తెలుపుటకు నిరాకరించు చో, రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడును.

(3) ఏ దస్తా వేజు విషయములో ఎవరేని వ్యక్తి పై ఉపపరిచ్ఛేదము (1) క్రింది అపరాధము ఆరోపింపబడినదో అట్టి దస్తా వేజు పైన గాని, అట్టి దస్తావేజా సంబంధమున ఉపయోగింపబడిన లేక పంచి పెట్టబడిన ఏదేని ఇతర దస్తా వేజు పైన గాని ఎవరేని వ్యక్తి పేరు ఉన్నయెడల, తత్పతికూలముగ రుజువు చేయబడునంత వరకు, ఆ వ్యక్తి ఆ దస్తావేజును రూపొందింపజేసినాడని పురోభావన చేయవచ్చును.

అధ్యాయము-19

సేవా కాంట్రాక్టుల ఆపరాధికభంగమును గురించి

490. ... ... ... ...

నిస్సహాయుడై నవ్యక్తికి పరిచర్యలు చేయుటకు అవసరములను సమకూర్చుటకు చేయబడిన కాంట్రాక్టు భంగము.

491. లేబ్రాయము వలన, మతిస్తి మితము లేనందువలన, రోగము వలన, లేక శారీరక దౌర్భల్యమువలన తన సురక్షత కొరకు ఏర్పాటు చేసికొనుటకు గాని తన అవసరములను సమకూర్చుకొనుటకు గాని నిస్సహాయుడు లేక అశక్తుడు అయినట్టి ఎవరేని వ్యక్తి కి పరిచర్యలు చేయుటకు లేక అవసరములను సమకూర్చుటకు శాసనసమ్మతమైన కాంట్రాక్టు ద్వారా బద్దుడై యుండి, స్వచ్ఛందముగ అట్లు చేయకుండ మానివేయు వారెవరైనను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, రెండు వందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

492 ... ... ... ...

అధ్యాయము-20

వివాహమునకు సంబంధించిన అపరాధములను గురించి

ఒక పురుషుడు శాసన సమ్మతముగా వివాహము జరిగినదని మోసముతో విశ్వసింప జేసి తనతో కాపురము చేయునట్లు చేయుట.

493. ఒక పురుషుడు తాను శాసన సమ్మతముగా వివాహమాడని ఎవరేని స్త్రీని, తనతో ఆమెకు శాసన సమ్మతముగ వివాహమై నట్లు మోసముతో విశ్వసింపజేసి ఆ విశ్వాసముతో తనతో కాపురముచేయునట్లు, లేక సంభోగమును సల్పునట్లు చేసినచో ఆతడు పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

భర్త జీవించియుండగా భార్యగాని, భార్య జీవించియుండగా భర్త గాని మరల వివాహమాడుట.


494. భర్త జీవించియుండగా భార్య గాని, భార్య జీవించియుండగా భర్త గాని వివాహము చేసికొనిన కారణముగా అట్టి వివాహము ప్రభావ శ్యూనమై నట్టి దగు ఏ పరిస్థితిలోనై నను అట్టి వివాహము చేసికొనువారెవరైనను,ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మినహాయింపు :-- అట్టి భర్తతో లేక భార్యతో ఒక వ్యక్తి కి జరిగియుండిన వివాహము ప్రభావ శూన్యమై నదని సమర్థ వ్యాయస్తానముచే ప్రఖ్యానింపబడిన చో ఆ వ్యక్తి కి ఈ పరిచ్ఛేదము విస్త రించదు, మరియు

పూర్వ వివాహపు భర్త లేక భార్య జీవించియుండగా వివాహము చేసికొను వ్యక్తి కి తరువాతి వివాహమగు ఆ సమయము నాటికి అట్టి భర్త లేక భార్య అట్టి వ్యక్తి వద్ద నిరంతరాయముగా ఏడు సంవత్సరముల పాటు లేకుండాపోయి జీవించి యుండినట్లు ఆ వ్యక్తికి ఆ కాలములో సమాచారము లేక పోయినచో, అట్టి తరువాతి వివాహము చేసికొను వ్యక్తి కి ఈ పరిచ్ఛేదము విస్తరించదు. అయితే, అతనికి లేక ఆమెకు తెలిసియున్నంత మేరకు వాస్తవముగా ఆ సంగతులను,ఏ వ్యక్తి తో అట్టి వివాహము జరుగుచున్నదో ఆ వ్యక్తికి, అట్టి వివాహము జరుగుటకు పూర్వమే అతడు లేక ఆమె తెలియజేసి యుండవలెను.

ఏ వ్యక్తి లో తరువాతి వివాహము జరిగినదో ఆ వ్యక్తి కి పూర్వవివాహ విషయమును తెలియకుండ కప్పిపుచ్చి పై అపరాధము చేయుట.

495. ఏ వ్యక్తి తో తరువాతి వివాహము జరిగినదో ఆ వ్యక్తి కి పూర్వ వివాహపు సంగతి తెలియకుండ కప్పి పుచ్చి పై కడపటి పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేయువారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుగురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

శాసన సమ్మత వివాహము కాకుండ కపటముతో వివాహ సంస్కారమును జరిపించు కొనుట.

496. నిజాయితీ లేకుండగాని, కపట ఉద్దేశముతోగాని, వివాహ సంస్కారమును, తద్వారా తనకు శాసన "సమ్మతమైన వివాహము జరుగుట లేదని ఎరిగియుండియు జరిపించుకొను వారెవరై నను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వ్యభిచారము

497. ఒకవ్యక్తి పర పురుషుని భార్యయై యుండగా ఆ సంగతి తాను ఎరిగియుండియు, లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణముండియు, ఆ పురుషుని యొక్క సమ్మతిగాని మౌనానుకూలతగాని లేకుండ, ఆ వ్యక్తితో సంభోగించు నతడెవరైనను, ఆ సంభోగము మానభంగాపరాధము క్రిందికి రానిదైనచో, వ్యభిచార అపరాధమును చేసినవాడగును, మరియు ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటిలో గాని శిక్షింపబడును. అట్టి సందర్భములో ఆ భార్యను దుష్ప్రేరకు రాలుగ శిక్షింపరాదు.

వివాహిత స్త్రీ ని అపరాధిక ఉర్దేశముతో ఆశచూపి రప్పించు కొనుట లేక తీసికొనివెళ్లుట లేక నిరోధములో ఉంచుట.

498. పరపురుషుని భార్యయై యున్న స్త్రీని ఎవరినై నను, ఆ సంగతి తాను ఎరిగి యుండియు, లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణముండియు, ఎవరేని వ్యక్తి ఆమెతో అక్రమ సంభోగము చేయవలెనను ఉద్దేశముతో అట్టి పురుషుని నుండి లేక అట్టి పురుషుని తరఫున ఆమె రక్షణ బాధ్యతగల ఎవరేని వ్యక్తి నుండి ఆమెను తీసికొని పోవు లేదా ఆశచూపి రప్పించుకొను, లేదా అట్టి ఉద్దేశముతో అట్టి స్త్రీని ఎవరినైనను దాచు లేదా నిరోధములో ఉంచు నతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

అధ్యాయము-20..ఏ

భర్త యొక్క లేక ఆతని బంధువుల యొక్క క్రూర ప్రవర్తన

స్త్రీ యొక్క భర్త గాని ఆతని బంధువుగాని ఆమెపట్ల క్రూరముగ ప్రవర్తించుట,

498-ఏ. ఒక స్త్రీ పట్ల ఆమె భర్త గాని, అతని బంధువుగాని క్రూరముగా ప్రవర్తించినచో, ఆతడెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

విశదీకరణము :---ఈ పరిచ్ఛేదము నిమిత్తము 'క్రూర ప్రవర్తన' అనగా:

(ఏ) స్త్రీ ఆత్మహత్యకు దారితీయునటు వంటి లేక ఆ స్త్రీ ప్రాణమునకు గాని, ఆమె అవయవమునకు గాని, (మానసికమై నదైనను, శారీరకమై నదైనను) ఆమె ఆరోగ్యమునకుగాని, తీప్రమైన హానిని లేక అపాయమును కలిగించజాలునటువంటి బుద్ధి పూర్వకమైన ఏదేని నడవడి, లేక


(బీ) ఏదేని ఆస్తి గాని, విలువైన సెక్యూరిటీగాని కావలెనను శాసనసమ్మతముకాని ఏదేని కోరికను నెరవేర్చుటకు ఆ స్త్రీని, లేదా, ఆమె బంధువైన ఎవరేని వ్యక్తిని బలవంత పెట్టు దృష్టితో, లేక అట్టి కోరికను ఆమెగాని,ఆమె బంధువైన ఎవరేని వ్యక్తి గాని నెర వేర్చనందుకు ఆ స్త్రీని వేధించిన యెడల, అట్టి వేధింపు అని అర్హము.

అధ్యాయము --21

పరువు నష్టమును గురించి

పరువు నష్తము.

499. పలికిన మాటలు, లేక చదువుటకుద్దే శింపబడిన పదముల ద్వారా గాని, సంజ్ఞల ద్వారాగాని, దృశ్య రూపణముల ద్వారా గాని, ఏదేని ఆరోపణను చేయుటవలన ఎవరేని వ్యక్తి యొక్క ఖ్యాతికి హానికలిగించు ఉద్దేశముతో నై నను, హాని కలిగించునని ఎరిగియుండియైనను, హాని కలిగించగలదని విశ్వసించుటకు కారణము కలిగియుండి యైనను అట్టి వ్యక్తికి సంబంధించి ఏదేని అట్టి ఆరోపణను చేయు లేక అట్టి ఆరోపణను ప్రచురించు నారెవరై నను, ఇందు ఇటు పిమ్మట మినహాయింపబడిన సందర్భములలో తప్ప, ఆ వ్యక్తికి పరువునష్టము కలిగించినట్లు చెప్పబడుదురు,

విశదీకరణము 1:- మరణించిన వ్యక్తి పై ఏదేని ఆరోపణను చేయుట, ఆ వ్యక్తి జీవించియున్నచో అతని ఖ్యాతికి ఆ ఆరోపణ హాని కలిగించునదైయుండి, అతని కుటుంబమువారి లేక ఇతర సన్నిహిత బంధువుల మనసులను నొప్పించుటకు ఉద్దేశింపబడినదైనచో, పరువు నష్టము క్రిందికి రావచ్చును.

విశదీకరణము 2:-ఒక కంపెనీకి సంబంధించిగాని, వ్యక్తుల అసోసియేషనుకు లేక సముదాయమునకు సంబంధించి గాని సామూహికముగా ఒక ఆరోపణను చేయుట పరువు నష్టము క్రిందికి రావచ్చును.

విశదీకరణము 3:- అనుకల్పికముగగాని, వ్యంగ్యముగా గాని వ్యక్త పరచబడిన ఆరోపణము పరువు నష్టము క్రిందికి రావచ్చును.

విశదీకరణము 4 :--- ఒక ఆరోపణము, ప్రత్యక్షముగగాని పరోక్షముగగాని, ఇతరుల దృష్టిలో ఒకవ్యక్తి యొక్క నైతిక ప్రతిపత్తిని లేక మేథా సంపత్తిని కించపరచునదైననే తప్ప, లేక అతని కులమున కైనను, ఆ జీవికైనను సంబంధించి అట్టి వ్యక్తి యొక్క శీలమును కించపరచునదైననే తప్ప, లేక ఆ వ్యక్తి యొక్క పరపతిని కించ పరచునదై ననేతప్ప, లేక ఆ వ్యక్తి యొక్క శరీరము జగుప్సాకరమైన స్థితిలో గాని సామాన్యముగా తలవంపులు కల్గిగించునని తలచబడు స్థితిలోగాని ఉన్నదని విశ్వసింపజేయునదైననే తప్ప, ఏ ఆరోపణము కూడ ఆ వ్యక్తి యొక్క ఖ్యాతికి హాని కలిగించినట్లు చెప్పబడదు.

ఉదాహరణములు

(ఏ)'బీ' యొక్క గడియారమును 'జడ్' దొంగిలించెనని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'ఏ' అనునతడు "'జడ్' నిజాయితీగల మనిషి, 'బి' యొక్క గడియారమును అతడు దొంగిలించనేలేదు” అని చెప్పెను. మినహాయింపులలో ఒక దాని క్రిందకు వచ్చిననే తప్ప, ఇది పరువునష్టము అగును.

(బి) 'బీ' యొక్క గడియారమును ఎవరు దొంగిలించినారని 'ఏ'ని అడిగిరి, 'బీ' యొక్క గడియారమును 'జెడ్' దొంగిలించెనని విశ్వసింపజేయు ఉద్దేశముతో, “ఏ' తన వేలుతో 'జడ్' ను చూపును. మినహాయింపులలో ఒక దాని క్రిందకు వచ్చిననే తప్ప, ఇది పరువునష్టము అగును.

(సీ) 'బీ' యొక్క గడియారమును 'జడ్' దొంగిలించెనని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'ఏ' అను నతడు 'బీ' యొక్క గడియారముతో 'జడ్' పరిగెత్తి పోవుచున్నట్లు ఒక చిత్రము వేయును. మినహాయింపులలో ఒక దాని, క్రిందకు వచ్చిననే తప్ప, ఇది పరువునష్టము అగును.

ప్రజా శ్రేయస్సు చేయవలసిన లేక ప్రచురించవలసిన నిజమైన ఆరోపణము.

మొదటి మినహాయింపు :- ఎవరేని వ్యక్తికి సంబంధించి నిజమైన ఆరోపణను దేనినైనను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేయవలసియున్నచో, లేక ప్రచురించవలసియున్నచో, అట్టి ఆరోపణచేయుట పరువునష్టము కాదు, ఆరోపణము ప్రజాశ్రేయస్సుకై చేసినదా కాదా అనునది సంగతిని గూర్చిన ప్రశ్న.

పబ్లిక్ సేవకుల పబ్లికు నడవడి.

రెండవ మినహాయింపు : -పబ్లికు కృత్యముల నిర్వహణములో ఒక పబ్లికు సేవకుని నడవడిని గురించి లేక ఆ నడవడినిబట్టి విదితమగునంత మేరముట్టు కే అతని శీలమును గురించి ఏ అభిప్రాయమునై నను సద్భావముతో వ్యక్తము చేయుట పరువునష్టము కాదు.

ఏదైనా ప్రజాసమస్య సంబంధముగ ఎవరేని వ్యక్తి యొక్క నడవడి.

మూడవ మినహాయింపు : ఏదైనా ప్రజా సమస్య సంబంధముగా ఎవరేని వ్యక్తి యొక్క నడవడిని గురించియు ఆ నడవడినిబట్టి విశదమగునంత మేరమట్టుకే అతని శీలమును గురించియు ఏ అభిప్రాయమునై నను సద్భావముతో వ్యక్తము చేయుట పరుపునష్టము కాదు.

ఉదాహరణము

“జడ్" అను నతడు ఒక ప్రజా సమస్యను గురించి ప్రభుత్వము నకు అర్జీ పెట్టు కొనుటలో గాని, ఒక ప్రజాసమస్య పై సమావేశము జరు పవలెనను అభ్యర్ధన పత్రము పై సంతకము చేయుటలో గాని, అట్టి సమావేశమునకు అధ్యక్షత వహించుటలో లేక హాజరగుటలో గాని, ప్రజాసహాయమర్ధించు ఏదేని సంఘమును ఏర్పాటు చేయుటలో లేక అందు చేరుటలో గాని, ఏ పదవీకర్త వ్యములు దక్షతతో నిర్వహించబడుటయందు ప్రజలకాసక్తి గలదో అట్టి ఏదేని పదవి కొరకు పోటీపడు అభ్యర్థులలో ఒకనికి వోటు వేయుట లేక వోట్ల కొరకు ప్రచారము చేయుటలో గాని విధితమైన 'జడ్' యొక్క నడవడిని గూర్చి ఎట్టి అభిప్రాయమునై నను 'ఏ' అను నతడు సద్భావముతో వ్యక్తము చేయుట పరువునష్టము కాదు.

న్యాయస్థాన చర్చల రిపోర్టులను ప్రచురించుట.

నాల్గవ మినహాయింపు :--న్యాయస్థాన చర్యలను గురించి లేక అట్టి ఏవేని చర్యల ఫలితమును గురించి ముఖ్యాంశములలో యథాతధముగా రిపోర్టును ప్రచురించుట పరువునష్టము కాదు.

విశదీకరణము :-- న్యాయస్థానపు విచారణకు ప్రాథమిక ఘట్టముగా న్యాయస్థానములో బహిరంగముగా పరిశీలన జరుపుచున్న జస్టిస్ ఆఫ్ ది పీస్ గాని ఇతర అధికారి గాని ఈ పరిచ్ఛేద భావములో ఒక న్యాయస్థానమై యుండును.

న్యాయస్థానమునందు నిర్ణయింపబడిన కేసు గుణా గుణములు లేక సంబంధిత సాక్షుల, తదితరుల నడవడి.

ఐదవ మినహాయింపు :-- ఒక న్యాయస్థానముచే నిర్ణయింపబడిన ఏదేని సివిలు లేక క్రిమినలు కేసు యొక్క గుణగుణములను గురించిగాని, అట్టి ఏదైనా కేసులోని పక్ష కారుగా, సాక్షిగా, లేక ఏజెంటుగా ఎవరేని వ్యక్తి యొక్క నడవడిని గురించి గాని, ఆ నడవడిని బట్టి అట్టి వ్యక్తి యొక్క శీలము విదితమగునంత మేర మట్టుకే ఆతని శీలమును గురించిగాని, ఏ అభిప్రాయమునై నను సద్భావముతో వ్యక్తము చేయుట పరువునష్టము కాదు.

ఉదాహరణములు

'ఏ' అను నతడు ఇట్లు చెప్పను. “ఆ విచారణలో 'జడ్' యొక్క సాక్ష్యము ఎంత పరస్పర విరుద్ధముగా ఉన్నదంటే ఆతడు మూర్కుడైనా అయి ఉండవలెను, నిజాయితీ లేని వాడుగనైన ఆయివుండవలెను అని నేను తలచుచున్నాను" 'ఏ' వ్యక్త పరచిన అభిప్రాయము సాక్షిగా 'జడ్' యొక్క నడవడినిబట్టి విదితమగు చున్నంత మేరకు మట్టుకే 'జడ్' యొక్క శీలమును గురించినదై నందున, అతడు దీనిని సద్భావముతో చెప్పియుండినచో ఈ మినహాంంపు క్రిందికి వచ్చును.

(బీ) అయితే, 'ఏ' అనునతడు 'జడ్' నిజము చెప్పు మనిషి కాడని నాకు తెలియును, గనుక ఆ విచారణలో అతడు చెప్పిన దానిని నేను విశ్వసించను" అని చెప్పినచో, అతడు 'జడ్' యొక్క శీలమును గురించి వ్యక్త పరచిన అభిప్రాయము సాక్షిగా 'జడ్' యొక్క నడవడి పై ఆధారపడని అభిప్రాయమై నందున ఏ' ఈ మినహాయింపు క్రిందికి రాడు.

బహిరంగ ప్రదర్శము యొక్క గుణాగుణములు,

ఆరవ మినహాయింపు : ఏదేని ప్రదర్శనము ప్రజా నిర్ణయమునకై ప్రదర్శకునిచే సమర్పింపబడినపుడు దాని గుణగుణములను గురించి, లేక ఆతని శీలము అట్టి ప్రదర్శనమునుబట్టి విదితమగుచున్నంత మేరకుమట్టుకే ప్రదర్శకుని శీలమును గురించి ఏదేని అభిప్రాయమును సద్భావముతో వ్యక్తము చేయుట పరువునష్టము కాదు.

విశదీకరణము : ఒక ప్రదర్శనము ప్రజా నిర్ణయమునకు సమర్పించుట అభివ్యక్తముగ గాని, ప్రజా నిర్ణయమునకు సమర్పింపబడినదని గర్భితముగా తెలిపే ప్రదర్శకుని చర్యల వలన గాని, జరుగవచ్చును.

ఉదాహరణములు

(ఏ) ఒక పుస్తకమును ప్రచురించునట్టి వ్యక్తి ఆ పుస్తకమును ప్రజా నిర్ణయమునకు సమర్పించిన వాడగును.

(బి) ప్రజల సమక్షమున ఉపన్యాసమునిచ్చిన వ్యక్తి ఆ ఉపన్యాసమును ప్రజానిర్ణయమునకు సమర్పించిన వాడగును.

(సీ) బహిరంగస్థలములో ప్రదర్శనయిచ్చే నటుడు లేక గాయకుడు తన నటనమును లేక గానమును ప్రజానిర్ణయమునకు సమర్పించిన వాడగును,

(డీ) 'జడ్' ప్రచురించిన ఒక పుస్తకమును గురించి, 'ఏ' అనునతడు ఇట్లు చెప్పును. 'జడ్' యొక్క పుస్తకము వివేకశూన్యమై నదిగా ఉన్నది; 'జడ్' వ్యసనపరుడై యుండవలెను 'జడ్' యొక్క పుస్తకము ఆసభ్యముగా ఉన్నది; 'జడ్'

దుష్ట మనస్కుడై యుండవలెను. 'జడ్' ను గురించి 'ఏ' వ్యక్త పరచిన అభిప్రాయము 'జడ్' యొక్క పుస్తకమునుబట్టి విదితమగుచున్నంత మేరకు మట్టుకే 'జడ్' యొక్క శీలమును గురించినదై యున్నందున, ఆతడు దానిని సద్భావముతో చెప్పి యుండినచో అతడు ఈ మినహాయింపు క్రిందికి వచ్చును.

(ఈ) అయితే 'ఏ' అనునతడు “ 'జడ్' వ్యసనపరుడు, స్త్రీ లంపటుడు అయినందున అతని పుస్తకము వివేక శూన్యముగాను, అసభ్యముగాను ఉన్నందుకు నేను ఆశ్చర్యపడను" అని చెప్పినయెడల, 'జడ్' యొక్క శీలమును గురించి 'ఏ' స్యక్త పరచిన అభిప్రాయము, 'జడ్' యొక్క పుస్తకము పై ఆధారపడియుండని అభిప్రాయము అయినందున, అతడు ఈ మినహాయింపు క్రిందికి రాడు.

మరొక వ్యక్తిపై తనకు శాసనసమ్మత ప్రాధికారము ఉన్న వ్యక్తి సద్భావముతో అతనిని గురించి చేసిన అభిశంసన.

ఏడవ మినహాయింపు :--- శాసనము ద్వారా ప్రదత్త మైన, లేక మరొక వ్యక్తితో చేసికొనిన శాసనసమ్మతమైన కాంట్రాక్టునుబట్టి ఉత్పన్నమైన ఏదేని ప్రాధికారమును ఒక వ్యక్తి ఆ మరొక వ్యక్తి పై కలిగియుండి, అట్టి శాసన సమ్మత ప్రాధికారమునకు సంబంధించిన విషయములలో ఆ మరొకరి నడవడిని సద్భావముతో ఏదేని అభిశంసనచేయుట పరువునష్టము క్రిందికిరాదు.

ఉదాహరణము

సాక్షి యొక్క, లేక న్యాయస్థానపు అధికారి యొక్క నడవడిని ఒక న్యాయాధీశుడు సద్భావముతో అభిశంసన చేయుట ; ఒక శాఖాధిపతి తన ఉత్తరువులకు లోబడియుండు వారిని సద్భావముతో అభిశంసన చేయుట; తల్లి గాని, తండ్రిగాని తమ పిల్ల వానిని ఇతర పిల్లల ఎదుట సద్భావముతో అభిశంసనచేయుట, తల్లి నుండి గాని తండ్రి నుండి గాని ప్రాధికారమును పొందినట్టి బడిపంతులు ఒక విద్యార్థిని ఇతర విద్యార్థుల ఎదుట సద్భావముతో అభిశంసనచేయుట; సేవకుడు సేవచేయుటలో జూపిన అజాగ్రత్త కై అతనిని యజమాని సద్భావముతో అభిశంసన చేయుట; ఒక బ్యాంకరు తన బ్యాంకు యొక్క క్యాషియరును అట్టి క్యాషియరుగా అతని నడవడిని గురించి సద్భావముతో అభిశంసన చేయుట ఈ మినహాయింపు క్రిందికి వచ్చును.

ప్రాధికారముగల వ్యక్తి వద్ద సద్భావముతో అపరాధము మోపుట.

ఎనిమిదవ మినహాయింపు :- ఆపరాధము మోపబడిన విషయమునకు సంబంధించి ఒక వ్యక్తి పై శాసనసమ్మత ప్రాధికారము గల వారిలో ఎవరివద్ద నైనను సద్భావముతో ఆ వ్యక్తి పై అపరాధము మోపుట పరువునష్టము క్రిందికిరాదు.

ఉదాహరణము

ఏ' అను నతడు సద్భావముతో 'జడ్' పై ఒక మేజి స్టేటు సమక్షమున అపరాధము మోపుచో 'ఏ' సద్భావముతో 'జడ్' అను సేవకుని నడవడిని గురించి 'జడ్' యొక్క యజమానికి ఫిర్యాదు చేయుచో 'ఏ' సద్భావముతో 'జడ్' అను పిల్ల వాని యొక్క నడవడిని గురించి 'జడ్' యొక్క తండ్రికి ఫిర్యాదు చేయుచో-- 'ఏ' ఈ మినహాయింపు క్రిందికి వచ్చును.

తనయొక్క లేక ఇతరుల యొక్క హితమును కాపాడుటకై ఒక వ్యక్తి చే సద్భావముతో చేయబడిన ఆరో పణము.


తొమ్మిదవ మినహాయింపు : --ఒక వ్యక్తి మరొకరి శీలమును గురించి సద్భావముతో ఆరోపణము చేయుట, ఆ ఆరోపణచేయునట్టి వ్యక్తి యొక్క లేక ఎవరేని ఇతర వ్యక్తి యొక్క హితమును కాపాడుటకు గాని, ప్రజా శ్రేయస్సు కొరకు గాని ఆ ఆరోపణము చేయబడినదైన యెడల, పరువునష్టము క్రిందికి రాదు.

ఉదాహరణము


(ఏ) దుకాగాదారైన 'ఏ' తన వ్యాపారమును నిర్వహించు 'బి' తొ "జడ్" కు నగదు యిస్తే తప్ప ఏమియు విక్రయించవద్దు, ఎందుకంటే అతడు నిజాయితీపరుడన్న అభిప్రాయము నాకు లేదు” అని చెప్పును 'ఏ' తన హితమును కాపాడుకొనుటకై సద్భావముతో ఈ ఆరోపణచేయుచో అతడు ఈ మినహాయింపు క్రిందికి వచ్చును.

(బి) మేజి స్టేటు అయిన 'ఏ', తన పై అధికారికి రిపోర్ట్ చేయుచూ "జడ్" యొక్క ప్రవర్తనను గూర్చి ఆరోపణము చేయును. ఇచట ఆ ఆరోపణను సద్భావముతోను, ప్రజా శ్రేయస్సు కొరకును చేయబడియుండినచో 'ఏ' ఈ మినహాయింపు క్రిందికి వచ్చును.

హెచ్చరింపబడిన వ్యక్తి శ్రేయస్సు కొరకుగాని ప్రజా శ్రేయస్సు కొరకు గాని ఉద్దేశించి చేసిన హెచ్చరిక

పదవ మినహాయింపు : ---ఒక వ్యక్తి సద్భావముతో మరొక వ్యక్తిని గురించి హెచ్చరిక చేయుట, అట్లు హెచ్చరింపబడిన వ్యక్తి యొక్క, లేక అతడు ఎవరి హితాభిలాషియో ఆ వ్యక్తి యొక్క శ్రేయస్సు కొరకు గాని ప్రజా శ్రేయస్సు కొరకు గాని అట్టి హెచ్చరిక ఉద్దేశింపబడినదైనచో, పరువునష్టము క్రిందికి రాదు.

పరువు నష్టము కలిగించేందుకు శిక్ష.

500. మరొకరికి పరువు నష్టము కలిగించువారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు. పరువు నష్టము కలిగించునదని ఎరిగియున్న విషయమును ముద్రించుట లేక నగిషీ చెక్కుట.

501. ఏదేని విషయము ఎవరేని వ్యక్తికి పరువు నష్టము కలిగించునదని ఎరిగియుండి లేక అట్లని విశ్వసించుటకు తగిన కారణము కలిగియుండి, అట్టి విషయమును ముద్రించు, లేక నగిషీ చెక్కువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితో గాని శిక్షింప బడుదురు.

పరువునష్టము కలిగించు విషయమును కలిగినట్టిదై, ముద్రింప బడిన లేక నగిషీ చెక్కబడిన ఏదేని వస్తువును విక్రయించుట.

602. పరువు నష్టమును కలిగించు విషయము కలిగినట్టిదై, ముద్రింపబడిన లేక నగిషి, చెక్కబడిన వస్తువును దేనినైనను, దానియందటి విషయము ఉన్నదని ఎరిగియుండి, విక్రయించు లేక విక్రయింపజూపువా రెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానాలో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అద్యాయము-22

ఆపరాధిక మైన జడిపింపు, అవమానము, చికాకులను గురించి

ఆపరాధికమైన జడిపింపు

503. బెదిరింపుచే మరొక వ్యక్తిని కలవర పెట్టే ఉద్దేశముతోగాని ఏ హానిని కలిగింతునని తాను బెదిరించునో ఆ హాని కలుగకుండుటకై అట్టి వ్యక్తి చేయుటకు శాసనరీత్యా బద్దుడు కాని ఏదేని కార్యమును చేయునట్లు చేయు, లేదా చేయుటకు శాసనరీత్యా హక్కుగల ఏదేని కార్యమును చేయకుండునట్లు చేయు ఉద్దేశముతోగాని, అట్టి వ్యక్తి యొక్క శరీరమునకు, ఖ్యాతికి లేక ఆస్తి కైనను, అతడు ఎవరి హితాభిలాషియో ఆ వ్యక్తి యొక్క శరీరమునకు లేక ఖ్యాతికైనను ఏదేని హాని కలిగింతునని అతనిని బెదిరించువారెవరైనను ఆపరాధికముగ జడిపించిన వారగుదురు.

విశదీకరణము : - ఎవరేని మృత వ్యక్తి యొక్క ఖ్యాతికి హాని కలుగజేయుదునను బెదిరింపు, బెదిరింపబడిన వ్యక్తి మృత వ్యక్తి యొక్క హితాభిలాషియై యున్న యెడల ఈ పరిచ్ఛేదము క్రిందికి వచ్చును.

ఉదాహరణము

'బి' నడుపుచున్న సివిలు దావాను అతడు విరమించుకొనునట్లు చేయుటకై 'బీ' యొక్క ఇంటిని తగుల బెట్టుదునని 'ఏ' అనునతడు బెదిరించును. 'ఏ' ఆపరాధికముగ జడిపించిన వాడగును.

శాంతిభంగమును కలిగించవలెనని ఉద్దేశపూర్వకముగా అవమానించుట.

504. ప్రకోపనమువలన ఎవరేని వ్యక్తి ప్రజా శాంతికి భంగము కలిగించవలెనని లేక ఏదేని ఇతర అపరాధమును చేయవలెనని ఉద్దేశించిగాని, అట్లు జరుగగలదని ఎరిగియుండిగాని, అతనిని ఉద్దేశపూర్వకముగ అవమానించి తద్వారా ప్రకోపింపజేయువారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రజలను బాధించు దుశ్చేష్ట కు దారితీయు ప్రకటనలు,

505. (1) (ఏ) భారతదేశపు సేనలోని, నౌకాబలములోని లేదా వైమానిక బలములోని ఎవరేని అధికారిగాని సైనికుడుగాని, నావికుడుగాని, వైమానికుడు గాని తిరుగుబాటు చేయునట్లయినను, తన ఉద్యోగ కర్తవ్యమును .అన్యధా నిర్లక్ష్యము చేయునట్ల యినను అట్టి కర్తవ్యమును నిర్వర్తించకుండునట్లయినను చేయవలెనను ఉద్దేశముతో లేదా అట్లు చేయగలుగునట్టి; లేక

(బి) రాజ్య వ్యతిరేకమైన లేక ప్రజా ప్రశాంతికి భంగకరమైన అపరాధము చేయుటకు ఏ వ్యక్తి నైనను ప్రేరేపించునట్లుగా ప్రజలకు, లేక ప్రజలలో ఏదేని వర్గమునకు భయమును లేక కలవరమును కలిగించవలెనను.ఉద్దేశము తో లేదా అట్లు కలిగించగలుగునట్టి; లేక

(సీ) ఏదేని వర్గము లేక సమాజమునకు చెందిన వ్యక్తులను ఏదేని ఇతర వర్గము లేక సమాజమునకు చెందినవారి పై ఏదేని అపరాధము చేయుటకు పురికొల్పవలెనను ఉద్దేశముతో, లేదా అట్లు పురికొల్పగలుగునట్టి, ఏదేని ప్రకటనను. వదంతిని, వార్తను చేసిన, ప్రచురించిన లేక ప్రచారములో పెట్టినవారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతోగాని, జర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

వర్గములమధ్య వెర భావమును, ద్వేష భావమును వైమనస్య లేక పెంపొందించు ప్రకటనలు

(2) మతము, జాతి, జన్మస్థానము, నివాసస్థానము భాష, కులము లేక సమాజము ఆధారముగ లేక ఎట్టిదైనను ఏదేని ఇతర ఆధారము పై విభిన్న మత, జాతి, భాష లేక ప్రాంతీయ సముదాయముల మధ్య, కులముల లేదా సమాజముల మధ్య వైర, ద్వేష లేక వైమనస్య భావములను సృష్టించు లేక పెంపొందించు ఉద్దేశముతో, లేదా అట్టి భావములను సృష్టింపగలుగు లేదా పెంపొందింపగలుగునట్టి వదంతితోగాని, కలవర పెట్టు సమాచారముతోగాని కూడియున్న ప్రకటనను లేక వార్తను చేసిన, ప్రచురించిన లేక ప్రచారములో పెట్టినవారెవరై నను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు. ఉప పరిచ్ఛేదము(2) క్రింది అపరాధమును ఆరాధనా స్థలము మొదలగువాటిలో చేయుట.

(3) ఏదేని ఆరాధనా స్థలములో గాని, మతారాధనలను, లేక మతోత్సవములను జరుపుకొనుచున్న ఏదేని సమావేశములో గాని ఉపపరిచ్ఛేదము (2) లో నిర్దేశించిన అపరాధమును చేయువారెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మినహాయింపు :- ఏదేని అట్టి ప్రకటనను, వదంతిని, లేక వార్తను చేయు, ప్రచురించు లేక ప్రచారములో పెట్టు వ్యక్తి అట్టి ప్రకటన, వదంతి లేక వార్త నిజమై నదని విశ్వసించుటకు సహేతుకమైన ఆధారములు కలిగియుండి పైన చెప్పబడినట్టి ఉద్దేశమేదియు లేకుండ సద్భావముతో అట్టి ప్రకటనను, వదంతిని, లేక వార్తను చేయుట, ప్రచురించుట, లేక ప్రచారములో పెట్టుట, ఈ సరిచ్ఛేద భావములో అపరాధము కాదు.

అపరాధికముగా జడిపించినందుకు శిక్ష.

506. అపరాధికముగా జడిపించునతడెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని, శిక్షింపబడును.

మరణము లేక దారుణమైన ఘాత మొదలగు వాటిని కలిగింతునని బెదిరించినచో

సురియు ఆ బెదిరింపు మరణమును గాని, దారుణమైన ఘాతనుగాని కలిగించెదనని లేక ఏదేని ఆస్తికి నిప్పు పెట్టి నాశనము చేయుదుననిగాని, మరణ దండన తోనై నను యావజ్జీవ కారావాసముతోనై నను ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కారావాసముతొనైనను, శిక్షింపదగు అపరాధమును చేయుదుననిగాని, ఒక స్త్రీ శీలవతి కాదని ఆరోపింతుననిగాని, అయిన చో ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానా తోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును,

పేరు దాచి చేసిన సంసూచనద్వారా అపరాధికముగ జడిపించుట.

507. పేరు దాచి చేసిన సంసూచనద్వారా, లేక బెదిరించే వ్యక్తి యొక్క పేరును గాని నివాసస్థలమునుగాని తెలియనీయకుండ ముందు జాగ్రత్త తీసికొని, ఆపరాధికముగా జడిపించు వారెవరైనను పై కడపటి పరిచ్ఛేదములోని అపరాధమునకు నిబంధనానుసారముగల శిక్షకు అదనముగా రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు.

దైవా గ్రహమునకు గురి చేయబడుదునని ఒక వ్యక్తిని విశ్వసించునట్లు చేసి జడిపించు కార్యము.

508. శాససరీత్యా ఒక వ్యక్తి చేయవలసినది కానట్టి దేనినై నను అతనిచే చేయించుటకు, లేక శాసనరీత్యా అతడు చేయవలసియున్నట్టి దేనినై నను అతనిచే మాన్పించుటకు అపరాధి సంకల్పించి, అపరాధి చేయించదలచిన కార్యమును ఆ వ్యక్తి చేయనిచో, లేక అపరాధి మాన్పించదలచిన కార్యమును చేసినచో ఆ వ్యక్తి గాని, అతడు ఎవరికి హితాభిలాషియై యున్నాడో అట్టి ఎవరేని వ్యక్తి గాని, అపరాధి చేయు. ఏదేని కార్యము ద్వారా దైవా గ్రహమునకు గురియగునని లేదా గురి చేయబడునని ఆ వ్యక్తిని విశ్వసించునట్లు చేసి, లేదా విశ్వసించునట్లు చేయ ప్రయత్నించి స్వచ్ఛందముగా ఆ వ్యక్తి చే శాసన రీత్యా ఆతడు చేయవలసినదికాని దేనినై నను చేయించు, లేక శాసనరీత్యా అతడు చేయవలసియున్నట్టి దేనినై నను పూన్పించు వారెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

'ఏ' అను నతడు తాను ధర్నా కూర్చొనుట ద్వారా 'జడ్' దైవా గ్రహమునకు గురి యగునని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'జడ్' యొక్క గుమ్మము వద్ద ధర్నా కూర్చొనుసు. 'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేసినవాడగును.

(బీ) ఒకానొక కార్యమును 'జడ్' చేసిన నేతప్ప 'ఏ' అనునతడు తన బిడ్డలలో ఒకరిని 'జడ్' దైవా గ్రహమునకు గురియగునని విశ్వసింపబడెడు పరిస్థితులలో చంపుదునని 'ఏ' 'జడ్'ను బెదిరించును.'ఏ' ఈ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధమును చేసినవాడగును.

స్త్రీ కి సిగ్గు చేటు కావలెనని ఉద్దేశింపబడిన మాట, సైగ లేక కార్యము.

509. ఒక మాటను లేక ధ్వనిని వినుటవలన, ఒక సైగను, లేక వస్తువును చూచుటవలన ఏ స్త్రీ యైనను సిగ్గు చేటుకు గురికావలెనను ఉద్దేశ్యముతో, అట్టి ఏదేని మాటనుపలుకు, ధ్వనిని లేక సైగను చేయు, వస్తువును ప్రదర్శించు లేక అట్టి స్త్రీ ఏకాంతముగా ఉన్నప్పుడు అచటికి చొరబడు వారెవరైనను, ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు,

తప్పు త్రాగిన వ్యక్తిచే పబ్లికు స్థలములో దుర్వర్తన.

510. త్రాగుడు మత్తు కో ఏదేని పబ్లికు స్థలములోకి లేక తన ప్రవేశము ఆక్రమ ప్రవేశమగునట్టి ఏదేని స్థలములోకి ప్రవేశించి, ఆచట ఎవరేని వ్యక్తికి చికాకు కలిగించు రీతిలో ప్రవర్తించు నతడెవరై నను ఇరువది నాలుగు గంటలదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని పది రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

అధ్యాయము-23

అపరాధములను చేయుటకై ప్రయత్నించుటను గురించి

యావజ్జీవ కారావాసముతోగాని ఇతర విధమైన కారావాసముతోగాని శిక్షింపదగు అపరాధములను చేయుటకై ప్రయత్నించి నందుకు శిక్ష

511. యావజ్జీవ కారావాసముతోగాని, కారావాసముతోగాని, ఈ స్మృతి క్రింద శిక్షింపదగు అపరాధమున, చేయుటకు లేక అట్టి అపరాధమును చేయించుటకు ప్రయత్నించి అట్టి ప్రయత్నములో ఆ అపరాధమునకు చేరువయగు ఏదేని కార్యమును చేయువారెవరైనను, అట్టి ప్రయత్నము చేసినందుకు శిక్షించుటకై ఈ స్మృతి క్రింద అభివ్యక్త నిబంధన ఏదియు లేనియెడల, ఆ అపరాధము విషయముస నిబంధనానుసారముగల యావజ్జీవ కారావాసములో లేక, సందర్భానుసారముగ దీర్ఘ తమ కారానాసములో సగ భాగము వరకు ఉండగల కాలావధి మేరకు ఏ రకపు కారావాసముతోగాని, ఆ అపరాధము విషయమున నిబంధనానుసారముగల జుర్మాగా తో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉదాహరణములు

('ఏ') 'ఏ' అనునతడు ఒక పెట్టెను పగులగొట్టి కొన్ని నగలను దొంగిలించుటకు ప్రయత్నించును. పెట్టెను అట్లు తెరచిన పిమ్మట అందులో నగ ఏదియు లేనట్లు కనుగొనును.అతడు దొంగతనము చేయుటకు చేరునగ, ఒక కార్యము చేసెను. అందువలన ఈ పరిచ్చేదము క్రింద అతడు అపరాధము చేసినవాడగును,

('బీ')'ఏ' అనునతడు 'జడ్' జేబులో చేతిని దూర్చి 'జడ్' జేబు కొట్టి వేయుటకై ప్రయత్నము చేయును.'జడ్' జేబులో ఏమియు లేనందున 'ఏ' విఫలుడగును. 'ఏ' ఈ పరిచ్చేదము క్రింద అపరాధము చేసినవాడగును.


వి. ఎస్. రమాదేవి, కార్యదర్శి, భారత ప్రభుత్వము, తప్పొప్పుల పట్టిక భారత శిక్షాస్మృతి పరిచ్ఛేదము పంక్తి తప్పు ఒప్పు 7. విశదీకరించినను విశదీకరించిన ఉదా (సి) 1 1 1 నియమము 19. . 20. . వినియమము నియమము వినియమము 1 ఆఫీసరు ఆ సెనరు ఆదేశికను 3 ఆదేశమును 21. అయిదవది. 21. తొమ్మిదవది. 29. విశదీకరణ 2 ఉదా: 29. , నిశదీకరణ 2 ఉదాహరణ 536 4 ఎటా 5 పీటీవాతను 65 గరిష పీటీ వ్రాసు జాకెట్టును తొలగించవలెను. గరిష నాలుగు, ఎంత 5, లుగు, 6 ఎ వల్లను పల్లమ అపరాధమున ఆసరాగమును చుచును చూచును మార్గమున ఆుకొంట మార్గమును మేలు కొరకు 3 సంరకుడు ఆధ్యాయము-5 పరిణామగా mA - MAM: - - -Name 67 67. 71. ఉదా (ఎ) 76. ఉదా (బి) 79. 81. ఉదా : (ఎ) 88. సూర్షిను నోటు 89 మార్చిను నోటు 107 ఉపశీర్షిక 109 ఉదా : (బి) 120 129 సూరిను నోటు 132 130 మారిసు వోటు 140 145 185 మార్జిను నోటు 166 171-సీ (2) (బి) 171-డీ 182 ( (3) 183 సంరక్షకుడు అధ్యాయము -5 పరిణామముగా కొల్ల గొట్టుటకు ఖైదీవి 2 3 కొల్లా కొట్టుటకు కై దీని పరిమముగా పరిణామముగా 2 & 3 3 & 4 వారీపోపుటకు పారిపోవుటకు ఆజ్ఞా పించనట్లు చర్య పాటించమి దైవానుగ్రహమునకు వాటు ఆజ్ఞాపించినట్లు చర్యతో పాటింపమి దైనా గ్రహమునకు వోటు రెంటితో 195 4 నిచు కాని రెంటిలో నిచ్చు సర్టిఫికెట్లు చేయుటను 197 1 2 పర్టిఫికేటు చేయుటకు తద్దార్వా వాములు 6 1 వాణెములు 5 201 218 230 (బి) 234 243 సూర్జిను నోటు 243 సూర్జిను నోటు 256 మార్జిను నోటు 259 సూరిను నోటు 2 3 జుర్మా నాకు చ్చినప్పుడే నామునకు స్వానము స్వానము జూర్మానాకు వచ్చినప్పుడే నాణెమునకు స్వాధీనము స్వాధీనము NA CA-7 (i) పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/118 పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/119