ఐ ద వ అం క ము

మొదటి రంగము

(దేవేంద్రు నింటిలో దేవేంద సదానందులు.

దేవే--తాతలనాటి యిల్లు తరలిపోయెను, ఇమ కర్ర కంప మిగిలినవి. అవికూడ అమ్మి అప్పుతీర్చి, కౌపీనధారినై ఊరూర "భవతి, భిక్షాం దేహి" అని సంచరించెదను. సీతారామాభ్యాం నము.

సదా--దేవేంద్రా, కుశలమా! ఏమి చేయుచుంటివి!

దేవే--కుశాలమే- కూర్చుంటిని

కొనువారు వచ్చెదరు

ఓహో, వచ్చితిరా! రండు. ఇదిగో మంచము, కుర్చి, వీటి కేమిచ్చెదరు?

సదా--ఏమి దేవేంద్రా! పిత్రార్జితమగు సామగ్రి నమ్ము చుంటివా? ఇదెంత శ్రేష్టము !

దేవే--దాని నుంచుకొనుటకన్న పితృణవిముక్తుడ నగుట శ్రేష్టమని నా యూహ. సదానందా, అడ్డు రాకు, అయ్యలారా! పలుక రేమి?
రం 1]

140

భారత రమణి

(వేలాముపాట--1-2-3-4-5 రూపాయిలు.)

సదా-- యాభై రూపాయీలు !

దేవే--సేదానందా, నాప్రాణములు తీయక పాట సాగనిమ్ము.

సదా--నేను పాడకూడదా? నాపాట యాభైరూపాయిలు అయ్యలారా, మీరెంత పాడదలచు కొన్నను దానిపై నేను పాడుదును. పూచికపుల్ల నైన పోనీయను.

(ఉపేంద్రుడు వచ్చును)

ఉపే--తమ్ముడా! పైతృకమగు సామగ్రి నంతటిని వెలాము వేయుచుంటినా? దాధేకృష్ణ ! దీనబంధూ!

దేవే--ఔను. నీ కెద్దియెని కావలసిన పాడవచ్చును.

ఉపే--దేనిని విడిచి పుచ్చుటకును చిత్తము జొత్తిల్ల కున్నది. ఐన నా కా అలమర ఒక్కటియు కావలయు.

దేవే--సరే. అన్నియు ఒకసరియే అమ్మద-పోనీ.

ఉపే--వలదు. అలమర నమ్మితక్కిన వుంచుకొనుము.

దేవే--అవి మాత్రము నాకేల! అన్నియు నమ్మెదను. జే! పరమేశ్వరా!

ఉపే--పూర్వులనాటి వస్తుసంచయము పోనీయరాదు; రాధేకృష్ణ! కృపాళూ! భక్తవత్సలా!

దేవేవ్--పాడండి. అలమర... ఒకరూపాయి.

ఉపే--విదిలేక పాడుచున్నాను. పది రూపాయీలు.

సదా-- యాభై రూపాయిలు.
150

[అం 56

భారత రమణి

ఉపే-- నూరు రూపాయిలు. కృష్ణా! గోవిందా!

సదా-- రెండు నూర్లు--

ఉపే--నాల్గు నూర్లు

సదా--వేయి రూపాయిలు

దేవే--అలమర వేయిరూపాయిలు-ఒకటి-రెండు--

ఉపే-- రెండు వేలు, నాపాట.

(కేదారుడు కఱ్ఱ త్రిప్పుచు వచ్చును.)

కేదా--అది వేలు. దేవేంద్రా! తాళముచెవి తెమ్ము, ఉపేంద్రా! ఊఱకుంటి వేమి? ఇదే అలమర!

ఉపే--ఇది నీకెందుకు కేదారా?

కేదా--నిన్ను జెయిలులోనికి పంపుటకు నేను వెళ్ళి వచ్చితిని! నీ విక పోవలయును.

సదా--కేదారా! ఎట్లు!

(యజ్నేశ్వరుడు వచ్చును)

కేదా--అలమర యిదేనా! యజ్నేశ్వరా!

యజ్నే-- ఇదే! ఇదే! తాళమేదీ? దేవేంద్రుడు వచ్చును)

కేదా--యజ్నేశ్వరా! బయటికి తీయుము.

యజ్నే-- (తీసి) ఇదిగో వీలు!

దేవే-- వీ లేమిటి?

యజ్నే-- మీతండ్రిగారు వ్రాసిన వీలు!

ఉపే--(తెల్లబోయి యజ్నేశ్వరుని చేతినుండి దాని
రం 1]

151

భారత రమణి

లాగుకొన జూచును.)

కేదా-- ఆ ! ఉపేంద్రా! కాగితము లాగెదవా! (కర్రచూపి) నెత్తి బద్దలు కాగలదు, జాగ్రత్త!

దేవే--మా అన్న దగ్గర నున్న వీలో!

యజ్నే--అది కల్పితము. మీఅన్న మిమ్మందరిని! మోసగించెను. నిజము నె నెఱుగుదు.

దేవే--అన్నా!

కేదా-- బెల్లము కొట్టిన రాయివలె అల్కవేమి?

ఉపే-- యజ్నేశ్వరా! నా కొంప గూల్చితివి! ఇది నీకు తగునా?

యజ్నే--నీకిది వింతగా నున్నదా...ఔబ్య్ వుంతయే ఇన్నాళ్ళు నీచుడు వంచకుడుగా నున్నవడు ఇంతలో ధార్మికుడగుట వింతయే!

కేదా--సిరా, కలము, కాగితము కావలయు. వేగము! వేగము!

సదా-- ఎందుకు?

కేదా--చల్లరి పోవును. దేవేంద్రా! కాగితము, కలమును లేవా!

దేవే--లేకేమి!... ఇదిగో!

కేదా-- ఉండు ముండుము. వ్రాసి యుంచుట మంచిచి. కోపోద్రేకమున మఱతు నెమో!... ఇదిగో.. ఈ...శ్వ...రో...స్తి (అనివ్రాసి గోడకంటించును) సరిగా నున్నదా
152

[అం 5

భారత రమణి

ఇక భయము లేదు...(మోకరించి) ప్రభూ! క్రోధావేశమున నీవు లేవంటిని. నాతప్పు సైరింపుము.

సదా--విచిత్రమైన వ్యక్తి!

కేదా--ఇక నెను గెంతుదునా?

సదా-- గెంతదవా? కేదారా!

కేదా--కెదారా! గెంతెదవా? చిన్నతన మింకను పొలేదా? చీ, చీ.

సదా--ఇది చిన్నతమౌ కాదు. నీ చరిత మతి విశుద్ధము. పూర్వకాలమున మనదేశమున నీబోటి సరళ శ్వాబావులూ, జానపదులు నగుబ్రహ్మణు లింటింట నుండిరి. ఈనాడు విదేశవిద్యాసంఘట్టనమున వారు చూర్ణీకృతులై లుప్త ప్రాయులైరి, కాని అట్టి వారొకరిద్దరు అక్కడక్కడ పొడ చూపుచుందురు. పరమపవిత్రమగు ఆ బ్రాహ్మణ ప్రధను పాడుచేయ జనరు. అది మనదేశమునకు స్వాస్థ్యము. పాదరక్షలు, దందడిగల్గి జిలుగులేనిస్వదేశవస్త్రములు బలిష్టమగు కాయము, స్పూర్తిలగ మనస్సు, సరళతాప్రదీప్తమగు ముఖము. అన్యదేశములం దివి కానరావు. కేదారా! ధన్యోసి.

కేదా-- అలమరా! నీ వెంత ధన్యువు. తాతలనాతి దానవు. నీలో నింకే మున్నదో చూచెదను... (చూచి) ఓరి బాబూ! అరలో అర, దొంగ అర!..ఇందులో నేమున్నదో. కాగితములు కట్ట!...కాదు, నోటులు... నూరు రూపాయీలు నొటులు. ఇదేమిటి? యజ్నేశ్వరా! (చూపును)
రం 1]

153

భారత రమణి

యజ్నే--నే నెరుగను.

దేవే-- ఏదీ-ఇటుతెమ్ము... అయ్యో! ఇగి పోలేదా. ఆ మాట నిజమేనా! ఆహా! అర్దాంగీ! మానదా! (జార విడిచి మోము వంచును)

సదా--ఏమి దేవేంద్రా! అట్లు న్నావు!

దేవే--అయిదువేల రూపాయిలు చోరీ అంటినే, అవే యివి! సదానందా! ఎంతమూర్ఖుడ!...నాతల తిరుగుచున్నది. కన్ను చీకట్లు కమ్ముచున్నవి.

ఉపే--యజ్నెశ్వరా! నాకొంప ముంచితివి.

దేవే-- సదానందా! నన్ను లోనికి గొనిపొమ్ము. (పోవును)

యజ్నే--ఉపేంద్రా! నీ కొంప తీసినది నేనే, నీ గొంతుక కోసినది నేనె, నీకిది వింతగా తోపవచ్చును; నిజమే, చిరంతన పాషండుడ, పాపి నగునేను సర్మార్గవర్తిగా నుద్దరింప బదుట సంబవించదు. కాని ఉపేంద్రా! ఇది మాతృదేవతా ప్రసాదఫలము... ఆ నాడు.జ్ఞప్తి యున్నదా! ఏనాడు జగదంబ దెనమలిన ధూసరితముఖమున, నాకు బ్రత్యక్షమై, స్వర్గద్వారముల భేదించి, మోకరించి, చేతులు జోడించి, కన్నుల నీరు గ్రమ్మ, పీడిత సతీత్వరక్షాభిక్ష నన్ను యాచించెనో, ఆనాడే నాచిత్తము పరివర్తనము చెందెను. అత్యంత పాపినయ్యు అ నాడు నేను తరించితిని. నాకిక పాపభీతి లేదు. నీ కట్టి యాశ లేదు.
154

[అం 5

భారత రమణి

కేదా-- బొత్తిగా లేదు

యజ్నే-- నెను కేవలము పాపిని, నీవో అందుకుతోడు వంచకుడవు మునిముచ్చువు. నీ పాపపుంజమును కప్పిపుచ్చుటకు పరమేశ్వరుని పవిత్రనామమును ఆహా! ఏనామము ఆకలి కన్నము, దప్పికి నీరు, పీడకు మందు, పరదేశమున బంధువు, చచ్చువేళ సైదోడు--అట్తి నామమును వీధివీధిని అమ్ముచు, తన్మూలమున ప్రజల కికురించు చుంటివి... ఇంతే కాక-- నీ తమ్మునికూతురు - నీకూతురు కదా?-- ఆనాడు అమ్మా! అని నోరార పిలిచితివే!--అట్టి అనాధ బాలికను ఇంధనముగా నొనర్చి నా వ్యభిచారాగ్నిని రగుల్ప సిద్ధపడితివి!. కేదా--ఎవడు! వీడా! ...ఎవతెను?

యజ్నే--నీచమగు స్వార్ధమునకు--తుచ్చమగు ధనమునకు --అనాధను, నిన్ను విశ్వసించి--తండ్రిని గాకున్న తక్కినవ్ఫారిని నమ్ముకుందురా?--నీ యింట తలదాచుకొన వచ్చిన తన్విని--కాంచనమున కాసించి, కామపాశమున నురిఫోసి-- నామోహాన్ని కాహుతిగా చేయనెంచితివి!

కేదా--(ఉపేంద్రుని మెడబట్టి) ఓరీ! పాజీ! పాషండా! ధమాధమా! నిన్నిక విడువను. ఒక్కవిల్లే అయినచో విదువవలె ననుకొంటిని. నీఫుకుటుంబ ద్రోహివి ధర్మద్రోహివి! సచ్చీలమును సమయింప జూచిన చండాలుడవు. నీధనాశ దగ్దముకాను! నీభోటి పరిపంధిని అతతాయిని, లోకద్రోహిని మహాపాతకిని, శిక్షింపకవిడిచినచో ఈ ప్రపంచ
రం 2]

155

భారత రమణి

ము కాలక్రమమున తలక్రిందు కాదా?... యజ్నేశ్వరునికి బుద్ది వచ్చునట్లు కొట్టి ఒకసారి చెఱసాలకు నేను పోయియుంటిని. నీకు బుద్దిరావలె నన్న నేవే పోవలయును. ఇపటికి నీపాపము పందుటచే నీవంతు వచ్చినది. నడువుము.(ఫోవును)

                  ---

--: రెండవ రంగము :--

(దేవేంద్రు నింటిలో సుశీలా వినయకుమారులు.)

విన--సుశీలా! పెండ్లి చేసుకో నంటివే!

సుశీ-- నాది పొరపాటు-- ఈలోకమును స్వర్గ మనుకొంటిని. కాదు, ఇది నరకము. నారీజాతిని పురుషుల కామిష రూపమున పరమేశ్వరుడు సృజించెనని ఎఱుగనైతిని.

విన-- అదెట్లు!

సుశీ--ప్రపంచమను నీ యరణ్యమున ముగ్దహరిణమువోలె స్త్రీజాతి మెలగుచుండును. అయ్యో... నారీలోకమా!.. దాస్యమొనర్చుటకె నీవు పుట్టితివి, మొదట తండ్రికి పిదప పతికి, ఆవెన్క సంతతికి! అన్యాశ్రయమే నీకు జీవిత్ పరమావధి. నీవు స్వతంత్రవు కానేరవు. ఆ శక్తి నీకులెదు, కావుననే అబలవు.

విన--శక్తి లేకెమి? పురుషుని అంధతాశక్తిని వారి లోనికి తెచ్చునది స్త్రీయేకదా!...నార్యవమానముచే కౌరవకులము సమూలము నశింపలేదా? నారీశాపప్రభావమున
156

[అం 5

భారత రమణి

రావణుని లంక ధ్వస్తముకాలేదా? నారీకటాక్షవీక్షణా ప్రభావమున నెందరెందరో దైత్యులు పరాజితులు కాలేదా?

సుశీ--పురుషుల కృపను ఆధారముగా గొని స్త్రీ జాతి జీవింపవలయును. ఇదే బహుదు:ఖహేతువు.

విన--ఇందు పురుషుల నేర మేమి?

సుశీ--లేదు లేదు. నెరము వారిది కాదు. పురుషుల కాహారముగా పరమేశ్వరుడు స్త్రీలను సృజించెను. పురుషులేమి చేయుదురు? వారును శక్తివంచనలేక సర్వేశ్వరుని అవిచారమునకు యధాసంబవ ప్రతీకార మొనర్చుచునే యున్నారు. కావుననే వారు స్త్రీల నాదరించుట, గృహలక్ష్ములని గౌరవించుట సంభవించు చున్నది. ఇదంతయు వారి కృపగాదా?

విన-- కృపమా?

సుశీ--కాకున్న!... బాల్యవివాహము, అంత;పుర నిర్బంధము (ఘోషా) మొదలగునవి స్త్రీజాతియెడ పురుషులొనర్చు అత్యాచారములని భావించుచుంటిని కాని, లంపటలు, రక్తపిపాసువులు నగు పురుషాధముల బారినుండి సహజ కోమమలగు స్త్రీజనమును రక్షించుకొర కొనర్చిన అహ: కృత్యములని యిప్పు డెరింగితిని. మన యాచారములు కుసంస్కారము లనరాదు. పురుషులు నీచులు, లంపటలు, వ్యభిచారులు నగునంతకాలము, సంఘము అధ:పతితమై యుందు నంత వరకు--స్త్రీలకు దేహదార్ధ్యము, మనోబలమును కలుగనంతకాలము వారిని రక్షించుట కిట్టి యోగములుండి తీరవలయు. ఏలయన వారు తమ్ము తాము రక్షించుకొన నెరరు.

విన--పురుషు లంత నీచు లంటివే, వివాహ మేల చెసుకొంటివి?

సుశీ-- ఇది వివాహమా? కాదు కాదు. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క పురుషు నాశ్రయించి వాని యాజ్ఞలను పాలించుచు, వానిసేవ చేయుచుండును; దానికిమారుగ అతడామెకు అన్నవస్త్రముల నిచ్చుచుండును. ఇది నింద్యమగు దాస్యము కాని, యోగ్యమైన వివాహము కాదు. (వినోదిని వచ్చును)

విన--యోగ్యమైన వివాహ మెట్టిది?

సుశీ--స్త్రీపురుషులు సమకక్షులనియు, వారియందెట్టి ఎచ్చుతగ్గులును లేవనియు భావన ప్రబలి, వివాహము లాలసాప్రేరితము కాక ప్రేమకల్పితమై, మగవాని విలాసమునకును ఆడదాని అన్నోదకములంకును వివాహ మేకాధారము కాకయుండిన వివాహము యధార్ధమైన వివాహమునజెల్లును.

విన--అదెట్లు!

సుశీ--దంపతులప్రేమ నిష్కామమై, నిర్మమమై, నిర్ముక్తము కావలయు. ప్రేమ ఉత్కటము కాక ధీరమై, శాంతమైఉండవలయు. సంశయము, ఉద్రేకము, అసహనము, విరహము అందుండరారు. అది ఆకాశమువలె స్వచ్చమై సముద్రమువలె గంభీరమై, పర్వతమువలె అచలమై యుండవలయును.

వినో--చెల్లెలా, నీవు చెప్పునది ఆదర్శ ప్రేమ. ఈ కాలమున నట్టిది సమకూరదు. జరుగనెరనిది జతపడు టెట్టులు! ద్వంద్వసమ్మిళితమై యుండుటచేతనె ఈలోకము మధురమగు చున్నది. చెడ్డ--మొదలగునాటి చేతనే ఈ సంసారము మధురమై, సర్వజనాభిలషిత మగుచున్నది. ఇందు గెల్చి మంచివార మనిపించుకొనినచో స్వర్గము మనకు కరగతమగును. భోజనమునకు వేళస్ మీరినది రండు. (పోవును)

(కేదారుడు తొందరగా వచ్చును)

కేదా-- ఏదీ బిడ్డ? ఇందెవ్వరును లేరు! పాట వినిపించుటకు సదానందుని సామాకుల పిల్చుకొని వచ్చితిని. ఆహా! సదానందుడు రచించిన ఆపాట ఎంత హృద్యముగా నున్నది!...ఏదీ!...చిరము జీవింపుము...ఆపైని..ఆ.. భారతరమణీ.. తరువాత.. ఏదో ...ప్రవరా! అని వచ్చును. నాకు స్మృతిశక్తి సన్నగిల్లినది...బుద్ధి....అసలే పూజ్యము...

(పరమానందుడు వచ్చును)

సదా-- అక్కఱలెదు. మహోదరహృత్సంపదచేతనే నీవు పృధ్వినెల్ల జయించితివి! పురాణమ్లయం దనేక చరిత్ర ములున్నవి. ఇతిహాసములందు మరికొన్ని కలవు. కాని ఇట్టి సరళము, స్థిరము, ఉదారము, అనఘము, అకృపణము, ఆనందమయము నగు శీల మెందును గాంచబోము.

(దేవేంద్రుడు సుశీల, వినయుడు, వినోదియును వత్తురు.

దేవే-- సదానందా, ఏరీ నీ శిష్యులు? నీవు రచించిన గీరమును మనపిల్లలకు వినిపింతము లోనికి రమ్మనుము...

(సదానందుడు వెళ్ళి వారితో వచ్చును)

(భక్త్గగణము పాడుదురు.)

పాట

చిరముజీవింపుము - భారతరమణీ -
   రమణీకుల ప్రపరా!
 దరహసితానన - సుధామయీ
    కోకిలకంఠమృదుమధురస్వరా ॥చి॥
లలితగుణగణా - లజ్జాభరణా-
   నిఖిల భువనవిజయీనయనా|
మలయపవన గమనా - విషయాంచిత-
   స్నేహప్రీతి శమదమముఖరా
ముక్తాదశనా - సత్కగురుజనా-
   రక్తకమలదళ కోమల అథరా ॥చి॥
ధరసమసహనా - సరళసునచ-నా।
    స్వార్ధదాసునికి దాసిన్
బురదను శశికళ - పూడ్చిన పోలిక
   సరసిజగర్భుడు - నెరపెను నిన్నున్

పూతారిత్రా - గౌరవపాత్రా
  సంవృతి శోకలతాలవిత్రా ॥చి॥
               -----

అందరు-- జే బారతరమణికి జే! భారతమాతకు జే! భారతభాగ్యవిధాతకు జే!

--: మూడవ రంగము :--

(చెరసాలలో ఉపేంద్రుడు)

ఉపే-- నేను సర్వమును వీడి వచ్చితిని గాని దు:ఖము నన్ను వీడుటలేదు. చెఱసాలకు నేను వచ్చినను ఇది చేయి వీడకున్నది... అయ్యే ! నేను గానుగయెద్దువలె నాపాపానరణమున క్రుమ్మరు చున్నాను. అబ్బా ! ఇది నన్ను కొరడాతో చావమోదుచు ముల్లుకఱ్ఱతో ముట్టిపై పొడుచుచున్నది. నాహృదయసాగరమున తుపాను పుట్టినప్పుడెల్ల దాని ప్రబలోచ్ఛ్వాసము పొంగి పొర్లుచున్నది. ఇప్పు డెవరినైన గాఢముగా కౌగిలింపవలెనని యున్నది. నా అంతరంగము పరిక్షుభిత మగుచున్నది. మనోవ్యాధి జనించిలోలోన బాధ కెరలు చున్నది. ప్రాయశ్చిత్త మేనాటికి పరిశేషించునో యోచింప జాలను. హా! దైవమా! ఎన్నాళ్లకు దరిజేర్చెదవు?

(చెఱకాపరి వచ్చును)

చెఱ-- రెండేళ్ళకు-

ఉపే-- అయ్యా! నేనొర్చిన పాపపుంజము నీవెరింగినచో --రెండేండ్లు కాదు. రెండువందలేండ్లు శిక్ష ననుభవించినను నాపాపము తరుగబోదని నీవెంతువు. నేనేమి చేసితినో నీ వెరుగుదువా!

చెఱ-- ఎరుగ కేమి? మోసము చేసితివి.

ఉపే-- అయ్యో! ఇదేనా నీవెరిగినది? ఏమియు నెరుగని అనాథబాల మానము మాప నెంచితిని, అమాయికుడు ఋజుమార్గవర్తియు నగు సోదరుని మోసగించి ధ్వంసము చేయనెంచితిని; రక్తమాంస సంబంధమును తాఱుమాఱు చేసి, దానికి తిండిపెట్టక చంపితిని. అది సన్నిపాతరోగముచే సమయలేదు, అన్నపానములు లేక అలసి మడిసినది. అయ్యో !

చెఱ-- ఎవరు?

ఉపే-- నాభార్య! దానికి మాతండ్రి వ్రాసిన వీలుబోగట్టా తెలియును, అది బైటపెట్టునను భీతిచే దానికి విషమిచ్చి చేతులార చంపుకొంటిని, నిద్రలో నాకంటి కేది కట్టుచున్నదో ఎరుగుదువా?

చెఱ--చెప్పు చెప్పు.

ఉపే--ఈ పాపమంతయు నా తలగడ నిల్చి, నా వైపు చూచుచు, నానెత్తిపై నాడుచున్నది... అన్నిటికన్న ఘోరతమమగు పాప మింకొకటి కలదు. నా పాపజాలమును భగన్నామమను తెఱమరుగున దాచి బకధ్యానము చేయు చుంటిని... అయ్యా! నాగతి ఏమి కానున్నది?

చె।కా।--చీ!చీ! పాతకీ! నీ మొగము చూడరాదు (ఫోవును)

ఉపే--నిజము-నిజము.ఇక్కడ ఏ కూలివానితో నైన మాటలాడినచొ కొంత తాపోపశమన మగునేమో! కాని ఎవ్వరును కానరారు...ఒంటరి నైతిని, జంఝామారుతము లీల, పొగబండి తెరగున, ఉప్పెన లాగున, నా మనము ప్రచండవేగమున పారొపోవ నెంచుచున్నది. ఎచ్చటికో నేనెరుగను. పరుగు మాత్రము కనబడుచున్నది. అహోరాత్రములు గానుగ త్రిప్పవలెనని యున్నది, గాని దేహమున కట్టిదార్డ్యము లెదు. పాపికి చిత్తశాంతి అలవడునా?...అబ్బా! అబ్బా! ఈ నరక మెంతని అనుభవింతును? దయామయా ఎంత కాల మీరోతను నన్ను త్రోయుదువు! అదిగో దేవేంద్రుడు తమ్ముడా! రమ్ము.

దేవే--(నమస్కరించి) అన్నా! నాతప్పు సైరింపుము.

ఉపే--నేనా! నీవు నా తప్పుల సైరింఫవలయును. నేను చేయు దుష్కృతము లన్నియు ప్రపంచప్రభలచే ఇంతవరకు ఎరుగబడకున్నను, ఈ బందియందున్న రెండు దినములలో నాకన్నులకు కట్టినట్లున్నది. ఈ చెరసాల పాపులకు పరమ పావనమగు చోటు.

(సదానందుడు కేదారుడును వచ్చెదరు)

{{left|రం 2]}

163

భారత రమణి

కేదా-- ఈశ్వరు డున్నాడా, లేడా, అని గొప్ప సమస్య!

సదా-- లేకేమి? ఉన్నాడని నీవే సిద్దాంతీకరించితివి.

కేదా-- నాకు సందియము లెదు, కాని చిత్తము చలించునపు డెల్ల "నీవు లేవని" తలచుచుంటిని, దైవమా! తప్పు సైరింపుము. "నీవు వున్నావు", అందుకు ప్రత్యక్ష ప్రమాణంఈడీఘొ! (ఉపేంద్రుని చూపును)

సదా-- కేదారా! గొడ్దు గోతి బడిన బెడ్డనేయు తగునా? పీడితుని దు:ఖమును జూసి సంతరించుట సత్పుషులకు పాడిగాదు.

కేదా-- ఔను కాని, నాడు పాపియైనచో--

సదా--పాపియైనను, పతితుడైనను, బ్రహ్మరాక్షసి యైనను కష్ట మనుభవించుట కనజాలను.

కేదా-- అట్టియెడ నాకెట్టి చింతయు నుండదు. పరమానంద ముదయించును, తదుద్ర్తేకమున గెంతవలెనని కోరిక పుట్టును.

సదా-- కేదారా! అది నీకు తగాదు.

కేదా--దుష్టులు దండింపబడ వలదా?

ఉపే-- సత్యము, కేదారా, నీవన్నది నిజము. ఈ ప్రవచనమున ఋషు లున్నారని చెప్పుటకి నీవే తార్కాణము ఏలయన నీ గూర్చి చింత నీ కెన్నడును లేదు, ఇతరులకై
164

[అం 5

భారత రమణీ

నీ సర్వస్వము ధారపోయుచుందువని న్నింతవఱకు తెలుసుకొన లెకుంటిని. నా అపరాధము లనేకములు, వానినెల్ల సైరింపుము.

కేదా--అట్లనెదవేల ఉపేంద్రా?

దేవే--కేదారా! అన్నగారిని క్షమింపుము.

కేదా--బాగు బాగు! నే నెవ్వడను క్షమించుటకు?

ఉపే--అయ్యా! నా మొగము చూడుము, నాహృదయమున నత్యంత భయావహమగు అధి యున్నది. బయట కమ్ముచున్న అంధకారము కన్న అది సాంద్రతరము. ఈ శిక్షకన్న ఆ శిక్ష కఠోరము. రాత్రి నిద్రలో పీడకలలు వచ్చి, "ఎంతద్రోహ మొనర్చితిని? ఎంత పాప మొనర్చితిని?" అని ఒడలెల్ల కంపము నొంది మేల్కొనుచుందును. సొదరా! క్షమింపవా? (నమస్కరించును)

దేవే--కేదారా! అన్నగారిని క్షమింపుం.(ఏడ్చును)

కేదా--ఉపేంద్రా! నీ సోదరుడు నీకై యేడ్చుచున్నాడు, కావున నాకు కూడ నీ యెడ జాలి పుట్టుచున్నది. నీ వెంత పాపివి, ఎంత ద్రోహి వైనను, నేడు సుఖానహమగు దినము కావున నీపై నాకుండు ద్వేషము నంతయు క్షమ అనుగంగాజలమున కడిగి పవిత్రము చేయుచున్నాను. ఉపేంద్రా! సొదరా! మ్లానమగు నీ ముఖము చూడ నీ కీచెఱ బాసి
రం 2]

165

భారత రమణి

నే నిందుండవలయునను కోర్కె పుట్టుచున్నది. అది వీలగునా?

సదా--కేదారా! నీ పల్కు దారునమగు ఏనుగు వంటి దైనను, నీ మనసు నవ్యనవనీతము వంటిది. మన పురాణములందలి మహర్షుల చరితములు చదువుచుండుము. వారు నీకన్న ఉత్తములా?

ఉపే--కేదారా, నీవు క్షిమించితివి కావుననా కేదు:ఖము లేదు. ఇక నవ్వుచు ఈ శిక్ష వహింతును. దేవేంద్రా! నాసర్వస్వము నీది, విత్తమంతయు నీ పిల్లల కిచ్చి, అంతకన్న నెక్కుడగు నాహృదయమును నీవు గొనుము. నీవు సుఖివై చిరం జీవింపుము.

దేవే-- సుఖమా! నావంటి దౌర్బాగ్యునకు సుఖమా?

సదా--దేవేంద్రా! నీ యెడ కొన్ని దు:ఖహేతువు లున్నవని ఎఱుంగుదు. ఈ లోకమున కెవలసుఖ మనుభవించువారు కాని కేవలదు:ఖ మనుభవించువారు గాని ఉండరు. అంతటను సుకదు:ఖములు మిశ్రితములై యుండును. దు:ఖములేని సుఖము నాటకరంగస్థలమందే కానవచ్చును సంసారము నాటకము కాదు.

ఉపే-- సదానందా, దేవేంద్రా! మీ యిద్దఱి ఋణము నేనీ జన్మమున తీర్చజాలను, మీ యుపకారమును జన్మాంతరములనైన మఱువజాలను. ఇక నెంతయో కాలము
166

[అం 5

భారత రమణి

మనియుండువాడ గాను, జీవింపవలెనని కొర్కె కూడ లేదు. నా భార్యయెడ నే నొర్చిన ఘోరపాతకమున్ సమ్మార్జింపుమని ఆమెను వేడుకొనుట మిగిలినది. ఆమె జీవితమంతయు దారిద్ర్యదు:ఖమున గడిచెను. అట్టిచో నే నొంటరిగా సంపత్సుఖము ననుభవించు టెట్లు?

కేదా-- ఒంటరిగ్సా నందువేల? దేవేంద్రా! మా వదినె కూడ నీకు తోడునీడయై సుఖింపగలదు.

దేవే--కలలోని వార్త! ఆ యుత్తమురాలు పాపభూయిష్టమగు ఈ ప్రపంచమును వీడినది. ఆమెను నా కడుపున పెట్టుకొంటిని, చేతులార చంపితిని.

కేదా--దేవేంద్రా, పాపము శమించునుగాక! ఆమె జీవముల బాయలేదు.

దేవే--కేదారా, నిజమేనా?

కేదా--నే నెన్నడేని అసత్య మాడితినా? ఇది పరియాచక మనుకొంటివా? ఆత్మహత్య కానించుకొన వలనని ఆమె నిశ్చయించుకొనుట నిజము. కాని నేనామెను సమాధానపరచి పుట్టింటికి పంపితిని. తిరుగ నే డిటకు రప్పించి మాయింట నుంచితిని.. నీకెట్టి చింతయు వలదు.

దేవే--కేదారా! కేదారా! నిన్నేమని భావింతును?

కేదా--నన్ను సొదరునిగా నెంచుము.

ఉపే-- వలదు, వలద్, సొదరున కిట్టి మహత్వ ముండునా?
రం 2]

167-4

భారత రమణి

కేదా--ఉపేంద్రా! సౌదర్యమహిమ యందలి గౌరవము నీవు నిల్పుకొన లేకపోతివి, సౌదర్యమున నింతకన్న నెక్కుడు మహత్వమున్నది.

(చెఱకాపరి వచ్చును)

చెకా-- అయ్యలారా! బాగయ్యె- వెలికి రండు

దేవే-- అన్నా! నాకు సెలవిమ్ము

ఉపే-- దేవేంద్రా సుఖివై చిరంజీవిని కమ్ము

తదాస్తు తదాస్తు.

స మా ప్త ము