భరతమాత స్తుతి
ఈ భారతమాత స్తుతిని తెలుగు కవి శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు రచించిన అంటరానివారు ఎవరు? అనే కావ్యం నుండి గ్రహించ బడినది
సీ !! భూరి సస్య ఫల సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌ భాగ్య భాగ్యోపేత భరత మాత ! భారతాది సుగుణ సంభరిత పాలిత నిత్య ఫలిత పుణ్య వ్రాత భారతమాత ! హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహు విధాఖ్యాత మా భారత మాత ! పూర్వ సంచిత భాగ్య భోగ్య సంధాత దు ర్భర దుఃఖ నాశ శ్రీ భారత మాత ! తే !గీ ! మహిత విష్ణు పదీ పూత భారత మాత వర మహా వీర మాత మా భారతమాత భవ్య రత్న ప్రసూతి మా భారత మాత మాతలకు మాత భారత మాత దలతు !!