రోయని మే మూహించుచున్నాము. లేక పురుషోత్తముని మానసబోధశతక మంతరించినదేమో! నిశ్చయ మెఱుంగరాదు.


నందిగామ

ఇట్లు భాషాసేవకులు,

23-10-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.


కాసుల పురుషోత్తమకవి

ఆంధ్రనాయకశతకము

సీ.

శ్రీమదనంత లక్ష్మీ యుతోరః స్థల
                      చతురాననాండ పూరిత పిచండ
ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త
                      నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర
సకల పావన నదీ జనక పాదాంభోజ
                      దమణీయ ఖగకులోత్తమ తురంగ
మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప
                      వరకల్పకోద్యాన వన విహార


తే.

భాను సితభాను నేత్ర సౌభాగ్యగాత్ర
యోగిహృద్గేయ భవనైక భాగధేయ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వైజయంతీధామ వర్ణిత సుత్రామ
                      శోభననామ లోకాభిరామ
కువలయశ్యామ వికుంఠపట్టణధామ
                      శ్రుతిహితనామ దైవతలలామ
కృత్యదైత్య సంగ్రామ గీతార్థ పరిణామ
                      యదుకులాంబుధిసోమ అఘవిరామ
సంగర జిత భౌమ రంగద్గుణస్తోమ
                      త్రిభువన క్షేమ వర్ధిష్ణుకామ


తే.

దాసులము గామ? నీ పేరు దలఁచుకోమ?
కొసరితిమి ప్రేమ కోరిన కోర్కు లీవ?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

మానుషహర్యక్ష మార్తాండ సోమాక్ష
                      త్రిభువనాధ్యక్ష కౌంతే.|lines=<poem>పక్ష
మదనకోటివిలాస మంజుల దరహాస
                      శ్రీహృన్నివాస కౌశేయవాస
శార్ఙ్గకోదండ పిచండ భృతాజాండ
                      వినుతవేదండ రవిప్రచండ
దీనశరణ్య విద్విట్భేద నైపుణ్య
                      భక్తానుగణ్య దిక్ప్రభువరేణ్య


తే.

సిద్ధసంకల్ప అవికల్ప శేషతల్ప
నిష్కలంక నిరాతంక నిరుపమాంక
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

గోవింద ముచికుంద సేవిత పాదార
                      వింద నిత్యానంద విశ్వతుంద
శ్రీమంత విజయలక్ష్మీకాంత నిర్మల
                      స్వాంత భక్తోద్యాన వనవసంత
అఘనాశ కోటిసూర్యప్రకాశ వరేశ
                      విజితాశ సన్మనోంబుజ నివేశ
సద్గుణ గేహ వాసవనీల సమదేహ
                      బంధురోత్సాహ సువర్ణవాహ


తే.

పండితస్తోత్ర చారిత్ర పద్మనేత్ర
మధుర మంజులభాష సమస్తపోష
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

శ్రీకాకుళము భక్తలోక చింతామణి
                      శ్రీకాకుళము సుకృతాకరంబు
శ్రీకాకుళము ధరాలోక వైకుంఠంబు
                      శ్రీకాకుళము మర్త్యసేవితంబు
శ్రీకాకుళము వేదసిద్ధాంత మహిమంబు
                      శ్రీకాకుళము హతవ్యాకులంబు
శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు
                      శ్రీకాకుళము సర్వసిద్ధికరము


తే.

తెలియ శ్రీకాకుళంబు నీ దివ్యదేశ
మాంధ్రనాయక నీవె శ్రీహరివి నిజము
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ
                      గనకాంబరప్రభ గ్రందుకొనఁగఁ
బర్వసుధాంశు శోభసముజ్జ్వలవక్త్ర
                      మున నూర్ధ్వపుండ్రము ముద్దు గుల్క
నెగుభుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్‌
                      మూర్ధరత్నకిరీటమునఁ జరింప
వర్ణితోరస్థలి వైయంతిక కౌస్తు
                      భాంతర శ్రీదేవియంద మమర


తే.

రమ్ము దర్శన మిమ్ము ఘోరములఁ జిమ్ము
మభయ మిమ్ము భవత్తత్త్వ మానతిమ్ము
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కలిగినప్పుడె కన్న తలిదండ్రు లెన్న నే
                      నిసువు మాటాడంగ నేర్చె జగతి
జయలిజగంబు లంబకు నిజోదరమునం
                      దేబిడ్డ చూపించె నిద్ధరిత్రిఁ
దొడలపై ముద్దుగా నిడుకొన్న జనని కే
                      పసిపిల్ల కొండంతబరువు దోఁచెఁ
దల్లిచెంగటనుండి యిల్లిల్లుఁ జొచ్చి యే
                      కుఱ్ఱఁ డింతుల బల్మిఁ గూడ నేర్చె


తే.

నాబుడత వీవెరా యబ్బ! యబ్బురంపు
కతలమారివి నీ వెఱుంగనివి గలవె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు
                      భస్మాసురుని పేరుఁ బాపినావు
తనయిల్లుఁ గాచు నుగ్రుని బోరుటకుఁ బిల్చు
                      బాణుచేతులు తెగఁ బఱికినావు
తొలుమిన్కు లజుని మ్రుచ్చిలి గొన్న సోమకుఁ
                      జంపి విద్యలు ధాత కంపినావు
బలిమి దైత్యులు సుధాకలశము న్గొన వారి
                      వంచించి సురలకుఁ బంచినావు


తే.

నిఖిలదైవత కార్యముల్‌ నిర్వహించు
నీకు నిజకార్యము భరంబె నిర్వహింప!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అచట లే వని కదా యరచేతఁ జఱచెఁ గ్రు
                      ద్ధత సభాస్తంభంబు దానవేంద్రుఁ
డచట లే వని కదా యస్త్రరాజం బేసె
                      గురుసుతుం డుత్తరోదరమునందు
నచట లే వని కదా యతికోపి ననిచెఁ
                      బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ
డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ
                      పది వల్వ లూడ్చె సర్పధ్వజుండు


తే.

లేక యచ్చోటులను గల్గలేదె ముందు
కలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అచింతాఖండ దీపారాధనల చేత
                      దీపించు నెప్పుడు దేవళంబు
అగరుసాంబ్రాణి ధూపార్పణంబులచేత
                      భవనం బ దెప్పుడుఁ బరిమళించు
నతినృత్యగీత వాద్యస్వనంబులచేత
                      నెప్పుడుఁ గోవెల యెసక మెసఁగు
నఖిలోపచార సమర్పణంబులచేత
                      మెఱయు నెప్పుడుఁ దిరుమేను కళల


తే.

నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు
దోఁచుచున్నాఁడ విట్టియద్భుతము గలదె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

భక్తిఁజేసిన శిలాప్రతిమ మాత్రమే కాని
                      హరి యిందుఁ గలుగునా యనెడువారు
స్వామి యిం దుండిన సత్యంబుఁ జూపక
                      యుండునే యని పల్కుచుండువారు
బుద్ధావతారంబుఁ బూనినాఁ డఖిలంబుఁ
                      గని కనన ట్లుండు ననెడువారు
దేవతామహిమంబు దెలియునో యేమేమి
                      నడువ నున్నదో యని నుడువువారు


తే.

నీకు నిత్యోపచారముల్‌ లేకయున్న
లోకు లి ట్లాడుకొండ్రు పరాకిదేమి
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ధర నూటయెనిమిది తిరుపతులందు శ్రీ
                      కాకుళం బరయఁ బ్రఖ్యాతమేని
యాంధ్రనాయకుఁడ వం చఖిలదేశంబుల
                      నిన్నుఁ గీర్తించుటే నిజమయేని
వైఖానసోక్తికి వంచన రాకుండ
                      నెరలు చూపినమాట నిజమయేని
వైకుంఠుఁడవు స్వయంవ్యక్తిగా మర్చావ
                      తార మొందినమాట తథ్యమేని


తే.

వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగఁ
జేసికొనకున్న నీకుఁ బ్రసిద్ధి గలదె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం
                      బెప్పుడొనర్తువో చెప్పుమయ్య!
గరిమతో నీ తిరుక్కల్యాణసంభ్రమం
                      బెప్పు డెప్పుడొ వేగ చెప్పు మయ్య
రమతో మహోన్నతరథ మెక్కి తిరువీథు
                      లెప్పు డేతెంతువో చెప్పు మయ్య
ధరణి నభ్యాగతదాన ప్రజాబృంద
                      మెప్పుడు బలియునో చెప్పు మయ్య


తే.

వత్సరోత్సవ వీక్షణవాంఛ జనుల
కెపుడు ఫలియించునో యానతీయు మయ్య
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

తగునట్లు తిరుమేను తా నామతింపుచు
                      మిన్న పీతాంబరం బున్న దనుచుఁ
గమలతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ
                      దక్కు సొమ్మది నీకు తక్కె ననుచు
లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట
                      ముత్తమాంగముఁ బాయ కున్న దనుచు
మండితమాణిక్యకుండలంబులు కర్ణ
                      యుగళితోఁ బుట్టిన ట్లున్న వనుచు


తే.

నిండుకొన్నావు గడియించు నేరుపరివె
ప్రావలువ బ్రారువాణముల్‌ బ్రాఁతి యేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వంచన గాదె దివ్యక్షేత్రపతులలో
                      మంత్రార్థకృత్యము ల్మాని యున్న?
నపకీర్తిగాదె లోకాలోకములయందు
                      వత్సరోత్సవములు వదలి యున్న?
నగుబాటు గాదె యన్యమతస్థజనులలో
                      నిజదాసకోటి మన్నింపకున్నఁ?
బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో
                      దేవతామహిమంబుఁ దెలుపకున్న?


తే.

నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ
బాడి దప్పిన బలునిందపాలు గావె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల
                      నెలమి సామగ్రిఁ జేయింప వేమి?
సేవకు లందందు సేవింప భావింప
                      తిరువీథుల రథంబుఁ ద్రిప్పవేమి?
వృజిన మెల్లఁ దొలంగు నిజ మంచుఁ బ్రజ లెంచు
                      పరమప్రసాదంబుఁ బంచవేమి?
దివ్య దేశం బిది తీర్థంబు సార్థంబు
                      చక్రతీర్థము కృప సలుప వేమి?


తే.

హఠము గావించి నీయన్వయంబు లెత్తి
కీర్తి నిందఁగ వర్ణించి గేలిపఱతు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి
                      గొల్లయిల్లాండ్రను గొల్లగొనఁగ?
మెక్కంగఁ దగునె ము న్పెక్కిండ్లలో నుట్ల
                      కెక్కి పాల్వెన్నలు డొక్క నిండ?
మ్రుచ్చిలఁ దగునె మళ్ళుచ్చి జలక మ్మాడు
                      మచ్చెకంటుల కోక లిచ్చకముగ?
మ్రొక్కంగఁ దగునె ముం దొక్కపువ్వునకుఁ దాఁ
                      గక్కసించినయాలి కక్కజముగ


తే.

నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ
జేసినాఁడవు మంచిప్రసిద్ధకుఁడవె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అబ్బుకో గలవొ కాయక్లేశ మొనరించుఁ
                      దేవాసురు లటుండ దివ్యరమను
దోచుకోఁ గలవొ చే సాచి లోకము లాచి
                      బలిమహాదాత వైభవము లెల్ల
రాఁ దీయఁగలవొ సత్రాజిత్తుఁ డీకున్న
                      మణిశమంతక మొక మమతఁ గొల్పి
నాటించఁ గలవొ సన్న కసన్ననె వనంబు
                      పెట్టు మ్రాన్పెకలించి పెరటిలోనఁ


తే.

దెచ్చుకొన వేమి వస్త్రాన్నదీపధూప
గంధ తాంబూలములకైన గడన దెలిసె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

తలను బించెపుదండ ధరియించవలె గాని
                      మణికిరీటము బెట్ట మనుజపతివె?
గళమున వనమాలికలు పూనవలెఁ గాని
                      హారము న్వేయ దేశాధిపతివె?
కరమున మురళి చక్కఁగఁ బూనవలెఁ గాని
                      శాతాసిఁ బూనంగ క్షత్రియుఁడవె?
తనువు గోక్షీరవాసన గుప్పవలెఁ గాని
                      చందనం బలఁద రాజవె తలంప?


తే.

నెల్లలోక మెఱింగిన గొల్లవాఁడ
వేది కుల మింత రాజస మేమి నీకు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కన్నవారల మున్ను గారాగృహంబున
                      విడిచి పాఱితివి నీ కడిమి యేమి?
పగవాఁడు పురిటిలోఁ బట్టి నెత్తుకపోవఁ
                      దమకించుచున్న నీ ధైర్య మేమి?
ముద్దుమన్మని గోప్యముగ నొండు బంధింపఁ
                      దెలియన ట్లున్న నీ తెగువ యేమి?
వైరిధాటికి నోడి వనధి మధ్యమునందు
                      నిలు గట్టుకొన్న నీ బలిమి యేమి?


తే.

విఱిగి తిరి గెన్నఁడెన్నఁడో తఱి యెఱింగి
యొరుల నడఁచితి వది యేమి భరము నీకు?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి
                      హేయంబు దోఁచలే దింత నీకు
సంక్రందనాత్మజ స్యందన సారథ్య
                      మెరుసుగాఁ దోఁచలే దింత నీకు
గోపాలకానేక గోవత్సపాలనం
                      బెగ్గుగాఁ దోఁచలే దింత నీకు
వ్రజబాలికా ముక్తవస్త్రాపహరణము
                      హీనమై తోఁచలే దింత నీకు


తే.

నుచ్చనీచంబు లెఱుఁగక యిచ్చఁ జేయు
చేష్ట లివి భక్తహితమతిఁ జేసి తండ్రు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో
                      రాజపీఠం బెక్కరాని నీకు
కుంభినీధవు లెట్లు కూఁతుండ్ర నిచ్చిరో
                      కుల మొల్లకయె నీకు గోపకునకు
సుందరీమణు లెట్లు చూచి మోహించిరో
                      క ప్పగు మైచాయ గలుగునీకు
దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో
                      తిరియువానిని మారు తిరియు నీకు


తే.

మమత నీలీల లటు సూచి బ్రమసి రేమె
తగుదువే యిట్టిఘనతకు దంభభూప
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

విక్రమాక్రమిత భూచక్రుఁ డౌ హేమాక్షు
                      పొం గణంచుటలు కోణంగితనము
కరగతామృతకుంభ గర్వితాసురకోటిఁ
                      దూలఁగొట్టుటలు గయ్యాళితనము
కుచపూర్ణ విషదుగ్ధకుటిల యౌ పూతన
                      పేరు మాయించుట పిల్లతనము
కంసపురీ ద్వారగమనావరోధి యౌ
                      మదకరి నీడ్చుట మకురుతనము


తే.

వడిగలతనంబులా యివి? గడన యేమి
కొద్దిపను లివి నీ కిది పెద్దతనమె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కెరలి కంసుఁడు నిన్ను నఱకఁ గాచినవాని
                      బారి సోదరిఁ ద్రోచి పాఱినావు
సరిపోర నరకు నొంచఁగ లేక చేతివి
                      ల్లాలిచే నిడి దండ నలరినావు
తెగడి బంధువు లాజిఁ దిట్టి కొట్టఁగ నోర్చి
                      వైదర్భిఁ జేపట్టి వచ్చినావు
దర్పకోద్ధతి కెంతొ తత్తరపడి నిజ
                      స్త్రీ పదాబ్జములఁ జే మోపినావు


తే.

నీ పరాక్రమ మిట్టిది నిఖిలజగము
లాజ్ఞ మీఱక నిల్చుట యద్భుతంబు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వ్రేపల్లెలో గొల్లవెలఁదులు గొట్ట రా
                      దొడిదొడి యిల్లిల్లుఁ దూఱలేదొ
రాసకేళికయందు రమణులా యెందఱో
                      చుట్టి పట్టినఁ బాఱఁ జూడలేదొ
పదియాఱు వేల గోపకుమారికలు తేరి
                      పాఱఁ జూచిన మతి బ్రమయలేదొ
ప్రణయవాదంబున భార్య లా యెనమండ్రు
                      గసరివేసినఁ గూర్మిఁ గొసరలేదొ


తే.

తలిరుబోఁ డుల యెదుటఁ దత్తరము గలుగ
నేవు పరరాజముఖమున నిలువ గలవె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఆలు నిర్వాహకురాలు భూదేవి యై
                      యఖిలభారకుఁ డనునాఖ్యఁ దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై
                      కామితార్థదుఁ డన్న ఘనతఁ దెచ్చెఁ
గమలగర్భుఁడు సృష్టికర్త తనూజుఁడై
                      బహుకుటుంబకుఁడన్న బలిమి దెచ్చెఁ
గలుషవిధ్వంసిని గంగ కుమారి యై
                      బతితపావనుఁ డన్న ప్రతిభఁ దెచ్చె


తే.

నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని
మొదటినుండియు నీవు దామోదరుఁడవె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కడలి రాయనిముద్దుకన్నియఁ బెండ్లాడి
                      యూఁచఁగా నిల్లట ముండు టేమి
సహజ నొక్కర్తెను షండ పాండవునకుఁ
                      బెండ్లిఁ జేసితి నీవు పెద్ద వేమి
చిరరతిప్రౌఢను జిన్నబిడ్డని కీవు
                      గూర్చితి వారీతి గూడు నేమి
యుగములనాటి పెన్మగువను ముసలన్న
                      కొగిఁ జేసితివి తగుం దగు మఱేమి


తే.

తెలియ నవ్యక్తుఁడవు గావు తెలిసికొన్న
నిట్టివాఁ డని తెలియలే దెవ్వరికిని
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నీ జ్యేష్ఠపుత్త్రుఁ డెన్నికకు రాని యశాశ్వ
                      తపుఁ బను ల్సేయు సంతతము జగతి
వేరొక ముద్దుకుమారుఁడందఱిమోహ
                      లతల స్త్రీపురుషుల లంకెఁ బెట్టు
నీతలోదరి లోకమాత పక్షాపక్ష
                      దృష్టిఁ జంచలవృత్తిఁ దిరుగుచుండు
నీ వనన్యకృతాది నిబిడమాయావిధా
                      నుల జేయు దెవ్వరిఁ దొలఁగనీక


తే.

నొకరికంటె గుణాధికు లొకరు మీరు
ఇంతచక్కన దెలిసె మీయింటివరుస
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

సకలంబు నీవ యై మొకమఱ్ఱియాకుపై
                      నిచ్చఁ బరుండునాఁ డెంత గలవొ!
తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల
                      నిడుక ముద్దాడునాఁ డెంత గలవొ!
తక్కులమారత్త దక్కించుకొనఁగ ని
                      న్నెత్తుక పెంచునాఁ డెంత గలవొ!
భయలేశ మెఱుఁగక బల్పాముపడగపై
                      గంతులు వైచునాఁ డెంత గలవొ!


తే.

పరువు గలవాఁడ వేమి ప్రాఁబల్కు లంచు
దెలియ వరిముక్కు ముల్లంత తలవొ! లేవొ!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కల్లరు ల్గాని వ్రేపల్లెవా రందఱు
                      హర్షింప నచట నీయాట సాగె
మధురాపురీవరమనుజు లామోదించి
                      మన్నింప నచట నీయాట సాగె
ద్వారకాపట్టణధన్యులు నినుఁ గోరి
                      కొల్వఁగా నచట నీకొల్వు సాగెఁ
గరిపురధర్మజుం డురురాజసభ నిన్ను
                      భూషింప నచట నీముర్వు సాగె


తే.

నెరుక మాలినవారుఁ నీపరువు దలఁతు
రేమి నీపొంకములు సాగు నేమి యచట?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

దూడలలోఁ బెరదూడ మేయఁగఁజూచి
                      యట్టె పట్టుక చావఁగొట్టవలెనె
పొడవ రా వేగ నాబోఁతుకొమ్ములు పట్టి
                      విడువక దానిపే రుడుపవలెనె
ముక్కుతోఁ జెనకిన కొక్కెరాయనిఁ బట్టి
                      వెర వొప్పఁగా మెడ విఱువవలెనె
తన్నుఁ బో తని మృగాధమ మంచు నెంచక
                      తొడరి గార్ధభమును ద్రుంపవలెనె


తే.

మేమి ఘనకార్యములు చేసి తిద్ధరిత్రి
నెన్నటికి నీ వొనర్చిన విట్టిపనులె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కవ్వడి కెంత చక్కఁగ బోధ చేసిన
                      నితరహింసాకర్మ మిష్టపఱుప
రాయబారం బెంత రసికత నడిపిన
                      ననికి భారతుల నాయత్త పఱుప
విశ్వరూపం బెంత విమలతఁ జూపిన
                      నోర్వని కురురాజు నులుకు పఱుప
విలుఁ బట్ట నని యెంతొ చెలిమిగఁ బలికిన
                      నవల సుయోధను నాసపఱుప


తే.

పోరు చంపక చుట్టముల్‌ పోర నీల్గఁ
జూచుచుంటివి యేనాఁటి చుట్ట మీవు?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

శ్రీమద్వికుంఠపురీ వరేశుఁడ వయ్యు
                      గొల్లపల్లెల నుండఁ గోరు టేమి
యక్షీణలక్ష్మీ కటాక్షవీక్షుఁడ వయ్యుఁ
                      ద్రోవ లే కింటింటఁ దోఁచ నేమి
భూరి చతుర్దశ భువనావనుఁడ వయ్యుఁ
                      గడువేడ్కఁ దొఱ్ఱులఁ గాయ నేమి
సన్మునిదేవతా సంభావితుఁడ వయ్యు
                      నాలగావరులతో నాడ నేమి?


తే.

గొప్పలో గొప్పవాఁడవు కొలదిలోనఁ
గొలదివాఁడవు ని న్నెట్లు గొలువ వచ్చు?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

దుర్యోధనుం డవధ్యుఁడ వంచు మానెఁ గా
                      కలుక బంధింపఁగాఁ దలఁప లేదె?
గోపాలుఁడవు పూజఁ గొందువేరా యని
                      సభ నిన్నుఁ దిట్టఁడే చైద్యుఁ డెదిరి?
నీలాంఛనంబులఁ బోలు చిహ్నలు దాల్చి
                      తానె నీ వనఁడె యుద్ధతినిఁ బౌండ్రుఁ?
డెవ్వరుఁ బట్టలే రేను బట్టెద నంచు
                      యవనుండు దరుమఁడే యాహవమున


తే.

నృపులు కొందఱు వెఱచిరే నీకు మున్ను
ప్రాణముల కాసపడరేని భండమున
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

రాజు లెవ్వరుఁ బఙ్క్తిభోజన మిడకున్న
                      దాసునింట భుజించి తనియలేదొ?
బంధువు లెవ్వరు గంధ మీ కుండిన
                      మువ్వంకలది పూయ మురియలేదొ?
దొర లెవ్వరును బూలసరము లీకుండినఁ
                      దెలిసి మాలికుఁ డీగ నలరలేదొ?
ప్రభువు లెవ్వరు వస్త్రబహుమాన మీ కున్నఁ
                      దెచ్చి యిచ్చిన చాకి మెచ్చలేదొ?


తే.

పాటి సేయంగ నేరాజు బంధుగుఁడవొ?
మున్నె నీపస దెలిసిన దెన్న నేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది
                      పంచాయుధము లీవు పట్టినావు
తాఱిటెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి
                      గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి
                      కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి
                      జున్ను బాల్‌ పెరుఁ గీవు జుఱ్ఱినావు


తే.

తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె
తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అప్పనంబులు గొన్ను నఖిలదిఙ్మండలే
                      శ్వరులచే వేంకటాచలనివాసుఁ
డరుదుగా నరువదా ఱవసరంబులు మహా
                      భోగంబుఁ గొనునీలభూధ్రవరుఁడు
పానకం బాలు సాఁబాలు భక్తుల కిచ్చి
                      మెసఁగును మంగళాద్రీశ్వరుండు
పుట్టకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి
                      గంధంబు సింహనగ ప్రభుండు


తే.

సాటిసాములరీతి నిచ్చోట నీవు
మూర్తిమంతంబుఁ జూపక కీర్తి గలదె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది
                      తాఁబేటి కైన సత్త్వంబు గలదు
డీకొన్న నడవిపందికిఁ గల్గు రోసంబు
                      తెరనోటినరుఁడైనఁ దెగువ సేయుఁ
బొట్టివానికి నైన దిట్టతనం బుండు
                      బాపని కైన దర్పంబు గలదు
చుంచురాజున కైన శూరత్వ మున్నది
                      ముసలికి నైనఁ జేపుష్టి గలదు


తే.

సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ
గలికి వై యేమి సేయఁ గలవొ కాని
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

మును నందగోవత్సములఁ గాయునప్పుడు
                      సనునయించిరె కంజజాది సురలు?
విటచోరచేష్టల వ్రేపల్లెఁ దిరుగు నీ
                      దగుమ్రోల నచ్చర లాడినారె?
నరరథాశ్వముల సంగరవీథిఁ దోలునాఁ
                      డెంచి దిక్పతులు భావించినారె?
మగధేశుదాడికి మథుర వీడిననాఁడు
                      దేవర్షు లెల్లఁ గీర్తించినారె?


తే.

యల్పునిగ నెంచినారె లోకైకనాథ
నాథునిఁగ నెంచినారె ము న్దరణిఁ? జెపుమ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

పూతనాకుచకుంభపూర్ణ విషస్తన్య
                      పాయివై బ్రదికిన భాగ్య మేమి?
కాళియాశీవిషగ్రసన ప్రమాదంబు
                      గడచి జీవించిన ఘనత యేమి?
చాణూరమల్లదో స్తంభ ఘట్టన కోర్చి
                      లబ్ధజయుఁడ వైన లాభ మేమి?
సాళ్వరాజామోఘ శక్తిప్రయోగంబు
                      మరలించుకొనిన సామర్ధ్యమేమి?


తే.

బడుగుదాసరివలె నన్నవస్త్రములకుఁ
బరుల కాశింతు విచట నీపంత మేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

పట్టి గొల్లది రోఁట గట్ట నోపిననీకుఁ
                      రోసంబు లే దన్న నీసు గలదె?
జారచోరాదిచేష్టలఁ బ్రవర్తిల్లు నీ
                      కపకీర్తి యన్న భయంబు గలదె?
భార్యచేఁ దన్నులుఁ బడ్డవానికి నీకు
                      లజ్జ లే దని యన్న లాఘవంబె?
కుండంటు లే దని కొసరి మెక్కిన నీకు
                      హీనత లెంచిన న్యూన మగునె?


తే.

కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ
బంత మున్నదె నీ కిసుమంత యైన?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ
                      దనబిడ్డనిగ బెంచె నిను యశోద
జనని గర్భము దించుకొనిన వేఱొకతల్లి
                      కడుపుఁ జేసికొనంగ గలిగెనన్న
తండ్రి వివాహయత్నము సేయ నొల్లక
                      తగులుక వచ్చె నీ ధర్మపత్ని
యన్న రారాజు కీనున్న నీసోదరి
                      యింటికి జోగిరా నంటుకొనియె


తే.

నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు
రట్టు సేయుదుఁ గనుము నా భట్టుతనము
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు
                      పాండవుల్‌ పడినట్టి పాటులేమి!
పూర్వజన్మమునందుఁ బూజించె గజ మండ్రు
                      గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్యస్నేహితుఁడ వండ్రు
                      నెఱిఁ గుచేలుఁడు పడ్డనెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మభక్తియుక్తుం డండ్రు
                      ప్రహ్లాదుఁ డొందిన బాధ లేమి!


తే.

యెంతయాలస్యమున వారి నేలినాఁడ
విట్టిదే నీ దయారసం బెంచి చూద
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి
                      తీవె మున్‌ క్రతుభోక్త నేనే యనుచు
సవతికొమాళ్ళ సమయించి తందఱిఁ
                      దరుగని రాక్షసాంతకుఁడ ననుచు
బంధువు లన్యోన్య వైరానుహతులుగా
                      నడచితి భూభారహారి ననుచు
బలిమి నన్య స్త్రీలఁ బట్టితి వెందఱి
                      నస్ఖలద్బ్రహ్మచర్యమతి ననుచు


తే.

లోకమున నడ్డ మెవ్వరు లేకయునికి
హద్దు లే కిట్లు నడచితి వళుకు మాలి
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అది యోగ్యంతరం గాలానబంధంబు
                      వదలించుకొని నీకు వశము గాదొ!
వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణ
                      నల గుహలుండి రా నలవి గాదొ!
నిమి షార్ధ నిమిషాది నిత్యవేళాచక్ర
                      గతి నిరోధించి రాఁ గ్రమము గాదొ!
వక్రకంటక పంకవత్క్రూరజనమనః
                      కాపథంబులను గా ల్మోపరాదొ!


తే.

యేమి యాలస్య మిది నీకు నేల సకల
జంతుసంతాన రక్షావిచక్షణునకు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కఠినస్తనంబుల ఘట్టించి దట్టించి
                      జడలచే మోది నున్దొడల నదిమి
పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా
                      యువతీసహస్రంబు లుపరతాది
బంధనంబుల నిన్నుఁ బైకొని తమి రేచి
                      రమియింప నిదురింప రాక నాఁటి
బడలిక దీర నాపఁగ రాని సుఖనిద్ర
                      బవళించియున్నట్టి భావ మిచటఁ


తే.

దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష!
మేల్‌ బళా! యింత జా గేమి మేలుకొనవె!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నీ బొడ్డుదమ్మి లోనికిఁ జొచ్చి చూచిన
                      నలువకు నీలోఁతు దెలియకున్నె?
బహుసహస్రాంగనా గృహముల నినుఁ గన్న
                      మునిరాజు నీమాయఁ గనకయున్నె?
నీ విశ్వరూప మెన్నికఁ జేసి పొడఁగన్న
                      నరుఁడు నీయురువు దా నెఱుఁగకున్నె?
తనమనఃపీఠి ని న్ననిశ మారాధించు
                      హరుఁడు భవత్తత్త్వం బరయకున్నె?


తే.

గరువ మేటికి నీ మర్మ మెఱుఁగ రనుచుఁ
దెలిసినమహాత్ములకు నైనఁ దెలియకున్నె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

పురుషాకృతిగ నిన్ను గురుతుఁ బట్టఁగ రాదు
                      స్త్రీమూర్తి వనుచును జెప్ప రాదు
పరఁగ నపుంసకభావ మెన్నఁగ రాదు
                      రూపంబు గల్గు టెఱుంగ రాదు
గుణవంతుఁడ వ టంచు గణుతింపఁగా రాదు
                      మర్యాద దెలియ నేమతికి రాదు
కులజుఁడ వనుచు నిక్కువముఁ జెప్పఁగ రాదు
                      స్థల మెక్కడనొ కాని తెలియరాదు


తే.

వస్తునిర్దేశ మొనరింప వశము గాని
నిన్ను వర్ణింపరా దయా నిశ్చితముగ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నమ్ముదు రేరీతి నారదు నాత్మజు
                      మానిని జేసిన మాయవానిఁ?
దలఁతు రేరీతి నల్‌దలలదయము నోలి
                      బొడ్డుదమ్మినిఁ గన్న పురుషమణిని?
భూషింతు రేరీతి పుష్పబాణవిరోధి
                      విషయభ్రమితుఁ జేయు వేసగాని?
భాషింతు రేరీతి బ్రహ్మాదిమశకప
                      ర్యంతంబు గలిగిన వింతవాని?


తే.

ని న్నెఱిఁ గెఱింగి యందఱు నన్నుతింతు
రెవ్వరికి నీవు కావలె నెంచి చూడ?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఎక్కడ నీకన్న దిక్కు లేనట్ల ని
                      న్నర్చింతు రబ్జగర్భాది సురలు
మఱి యెందు గతి లేనిమాడ్కి మహామును
                      ల్నీయందె లక్ష్యము ల్నిలుపు కొందు
రిలఁ దరణోపాయ మెందున లేనట్లు
                      సజ్జనుల్‌ నీకథల్‌ చదువుకొండ్రు
పగతుర మెయ్యెడ బ్రతికెద మన్నట్లు
                      దునిసిరి నీచేత దనుజు లెల్ల


తే.

దత్త్వ మరసిన శుద్ధబుద్ధస్వరూప
మింత మధికార మెన్నటి దేమి చెపుమ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె
                      సర్వచరాచరజంతువులను
కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె
                      మిథ్యాప్రపంచంబు తథ్యముగను
వేర్వేఱఁ దోఁతువు వేషధారియుఁ బోలెఁ
                      బహువిధదేవతాభద్రకళలఁ
దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ
                      బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి


తే.

యిట్టివే కద నీవిద్య లెన్ని యైన
నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో
                      ముచ్చటించెద వేమి పుణ్యమూర్తి
సాటిగా వెలిగొండవీటి జంగముచెల్మిఁ
                      బచరింతు వేనాఁటి బాంధవుండు
వెలిపాపపాన్పుపై వేడ్కతోఁ బవళింతు
                      వది యేమి భోగిభోగాంతరంబు
పొరుగిండ్ల కేప్రొద్దుఁ బో రాఁ దలఁచునింతిఁ
                      బాయకుండెద వేమి భాగ్యలక్ష్మి


తే.

మంచి సహవాసములు గల్గె నెంచి చూడ
నీకె తగు నట్టివారితో బెనరు నెఱివ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! 52


సీ.

అఖిలపోషకుఁడ వ న్నాఖ్య మాత్రమె కాని
                      కర్తవు నీవె భోక్తవును నీవె
యక్షరుండ వను ప్రఖ్యాతి మాత్రమె కాని
                      చర్చింప వేఱొండు సాక్షి గలఁడె
సుగుణాబ్ధి వని నిన్ను స్తుతి యొనర్చుటె కాని
                      నిర్గుణుం డెవ్వఁడు నీకు మించ
విశ్వాత్ముఁడ వటంచు వినుతించుటయే కాని
                      చొచ్చి ని న్నెవ్వఁడు చూచినాఁడు


తే.

వినుకలులె గాని నిన్ను నీవిశ్వములను
మొద లెఱుంగుదురే నిజంబునకుఁ బిల్వ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఒక గుణంబున నీవె సకల ప్రపంచంబుఁ
                      గల్పించితి వభూతకల్పనముగ
వేఱొకగుణముచే విశ్వవిశ్వప్రాణ
                      రక్షణం బొనరింతు వక్షయముగ
మఱి యొండు గుణముచే మండలంబులు గూడఁ
                      జెఱపివేయుదువు నిశ్శేషముగను
నిర్గుణంబున నీవె నిరవకాశంబుగాఁ
                      బట్టక యుందువు బయలు మెఱసి


తే.

గుణ మొకటి గాదు తెలిసినగుణము లేదు
చేరి నినుఁ గొల్వరాదు వచింపరాదు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

జీవిని జీవి భక్షింపఁ జేసితి వింతె
                      కొని పెట్టినావె చేతనుల కెల్లఁ?
జేసినంత భుజింపఁ జేసినా వింతె కా
                      కెక్కువ లెవ్వరి కిచ్చినావు?
కర్మసూత్రంబునఁ గట్టి త్రిప్పెదవు గా
                      కిచ్చ నొక్కనిఁ బోవనిచ్చినావె?
వెసంబృథక్ప్రతుల వేఱుఁబెట్టితివి గా
                      కందఱి కైకమత్య మిడినావె?


తే.

తెలిసె నీరక్షకత్వంబు దేవదేవ!
వేఱె గతి లేక నిన్ను సేవింప వలసె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నీరుపట్టుగ నుంట నారాయణుఁడ వండ్రు
                      నారాయణాఖ్యాధికార మేమి?
బలిసి యంతట నీవె గలుగ విష్ణుఁడ వందు
                      రావిష్ణునామప్రభావ వేమి?
ముగురు నీవై వెలుంగఁగఁ గేశవుఁడ వండ్రు
                      కేశవాభిఖ్యాప్రకాశ మేమి?
సిరికి మగఁడ వై మెరయ శ్రీపతి వండ్రు
                      శ్రీపతినామప్రసిద్ధి యేమి?


తే.

పెట్టుపేరు లనేకముల్‌ పుట్టుపేరు
గుఱు తెఱింగిన నీమూల మెఱుఁగవచ్చు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వేఁడని చూదక విపినవహ్నిజ్వాలఁ
                      ద్రావెదో తేనియఁ ద్రావినట్లు
భార మం చనక గోవర్ధనపర్వతం
                      బెత్తెదో పూబంతి యెత్తినట్లు
విషపుంజ మనక నాభీలాజగరజిహ్వఁ
                      జింపెదో ప్రాబట్టఁ జింపినట్లు
పెస నసాధ్యుండని వెరవక నరకుని
                      నఱికెదో పార్వేఁట నఱికినట్లు


తే.

భక్తసంరక్షణ త్వరా పరవశతను
జేసినా వేమొ యూరక సేయఁగలవె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వత్సాపహరణగర్వము మాని యజుఁడు దా
                      నపరాధి ననుచు సాష్టాంగ మెఱఁగె
భవుఁడు బాణున కాజి బాసట యై వచ్చి
                      భక్తునిఁ బట్టిచ్చి ప్రణుతిఁ జేసె
వజ్రి శిలావృష్టి వర్షించి లజ్జించి
                      తప్పుఁ జేసితి నంచు దండ మిడియె
సమవర్తి భీతి నంజలిఁ జేసి యాత్మలో
                      కస్థితు గురుపుత్రుఁ గాను కిచ్చె


తే.

క్షోణిఁ బుట్టుక మాలిన గొల్లవాని
నిన్ను నావేల్పు లోడింప నేర రేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కొనముట్ట హెచ్చుతగ్గుల ప్రాతఁసుద్దుల
                      తాతపుస్తక మొకఁ డాతతాయి
మ్రుచ్చిలి నీటిలోఁ జొచ్చి డాఁగిన వాని
                      పావన మేమి వెంబడిగఁ బెద్ద
కోఱమీనంబవై యాఱొండుసంద్రము
                      ల్నిముసంబులో నీఁది నెమకి వాని
డొక్క వ్రక్కలుగాఁ గఱుక్కున బరిఁ గోసి
                      కడ లేనినుడువు లెక్కటికి నోట


తే.

మాట వెళ్ళనివానికి మగుడ నిచ్చి
యింతపనికిని నవతార మెత్తి తీవు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అబ్ధిపయఃపాత్ర మద్రికాణంధాన
                      మహిరాజగుణము దా రమరఁ గూర్చి
యమృతాభిలాష దేవతాసురుల్‌ మథియింప
                      గిరి మున్గం గచ్ఛపాకృతి వహించి
నిర్వహించుట గాని సర్వకాశ్యపులలోఁ
                      బఙ్క్తిభేదముఁ జేసి పల్మ ఱాస
కొల్పి దైత్యులనోరుఁ గొట్టి యాదిత్యుల
                      కమృతాన్న మిడితి వాయమరులందుఁ


తే.

బక్షపాతివి గావె? యభక్తిఁ బడిరి
నమ్ముదురె యానిశాటు లెన్నటికి నిన్ను
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఉక్కునఁ బసిఁడికన్‌ రక్కసుఁ డొకఁడు ప
                      ల్దిక్కు లోరిచి బొల్లిపక్కి మావు
నెక్కు రౌ తెక్కడఁ జిక్కెడు నంచు నీ
                      యిక్కువ లరయంగఁ గిక్కురించి
నక్కితి విలక్రిందఁ జొక్కపుఁ బంది వై
                      కొక్కరింపుచు నాతఁ డక్కడికిని
మొక్కరింపఁగఁ జొరఁ బొక్కతే.|lines=<poem>కట వాని
                      డొక్కగఱుక్కునఁ జెక్కిపట్టి


తే.

నొక్కి పుడ మింత నీటిపై కెక్కఁదీయ
మక్కువ దనర్ప నది యేమి రక్కరింపు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అయవారు చదివించినట్లుగాఁ జదువక
                      మఱి కొట్టి తిట్టక వెఱపుఁ గొనక
తనయుఁ డెంతో పరధ్యానంబుగా నున్నఁ
                      దండ్రి వల్దని చెప్పఁ దగఁడె ధాత్రి
నీకుఁ గోపం బేమి నృహరిరూపంబున
                      స్తంభంబులోఁ బుట్టి చటులనేత్ర
దంష్ట్రానఖప్రభ దహనకీలలఁ బోలి
                      భగ్గు రనంగఁ బైఁబడి హిరణ్య


తే.

కశిపుఁ దునుమాడి ప్రహ్లాదుఁ గరుణ నేలి
తందఱి కసహ్య మయ్యె ని న్నపుడె కనఁగ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కశ్యపుఁ డదితి ని న్గన్నవారలు గారె
                      పెంచిరే మరుగుజ్జుబిడ్డ వనుచుఁ
గుండిక దండంబు గోఁచితో వచ్చిన
                      కపటవటుండు నిక్కముగ భూమి
సురుఁడు గాఁడని యాత్మగురుఁడీయవల దనఁ
                      గరుణించి బలిదాత కామితార్థ
మొసగంగ నభివృద్ధి నొంది మే లొర్వక
                      ధర్మంబు నాల్గుపాదముల జరుపు


తే.

నట్టిదాతను దిగఁద్రొక్కి యతనిసిరులు
దెచ్చి కులగోత్రభేది కీ నిచ్చకంబో
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

జపతపోనిష్ఠుఁడౌ జమదగ్ని కుదయించి
                      కరము దారుణవృత్తిఁ గత్తి కట్టి
కినుక రాజద్రోహమునకు శంకింపక
                      సకలభూపతుల గొంతుకలు గోసి
కార్తవీర్యార్జును కరసహస్రం బొండు
                      తఱి గండ్రగొడ్డంట నఱికివైచి
వసుధపై రక్తప్రవాహంబు లొనరించి
                      తజ్జలంబులఁ బితృతర్పణములు


తే.

సేసి యిల విప్రులకు ధారఁ బోసినట్టి
కీర్తియే కాని బ్రహ్మణ్యకృత్య మగునె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

తా వచ్చెద నటంచు ధైర్యలక్ష్మి మహీజ
                      వెంట రా నడవికి వెడలినావు
సుగ్రీవుఁ డున్నచో సొమ్ము దా నిడ సీ.|lines=<poem>
                      యాజాడ నతనిపొం దతికినావు
ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చి నిన్‌
                      దెచ్చినరిపుల సాధించినావు
వైదేహి భవదంకవసతిఁ గూర్చున్నచో
                      భువనసామ్రాజ్యముల్‌ పొందినావు


తే.

గట్టిగా మైథిలినిఁ జెట్టఁ బట్టినట్టి
పౌరుషము లబ్బె నేనాఁటి పూరుషుఁడవొ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ధర్మవిఘాత మిద్ధర నీ వొనర్చిన
                      మూఁడులోకంబులు మ్రోసె నపుడె
జనకునికూఁతు నిచ్చను బెండ్లి యాడంగ
                      నరనాథకోటులు నవ్వి రపుడె
పుణ్యజనంబులఁ బోరి బాధింపంగ
                      సుర లద్భుతము నొంది చూచి రపుడె
సంతతాశ్రిత విభీషణు రాజుఁ జేయంగ
                      నల రవీంద్రులు సాక్షి నిలిచి రపుడె


తే.

మంచినడవడి నడిచినా పెంచి చూడఁ
గీర్తి గల మూర్తివే యిట్టి వార్త లరయ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నన్ముని నధ్వరసాఫల్యుఁ గావింప
                      జానకీపరిణయోత్సవము గలిగె
రవినందనునిఁ గీశరాజ్యాధిపతిఁ జేయ
                      సేతుబంధనకీర్తిఁ జెందఁ గలిగె
బహుదేవతాస్త్రీల బందిగంబులఁ బాపఁ
                      జెఱ నున్న వైదేహిఁ జెందఁ గలిగె
నలవిభీషణుని లంకాధినాథునిఁ జేయ
                      నెలమి నయోధ్య నీ వేలఁ గలిగె


తే.

నబ్బె నీకుఁ బరోపకారైన ఫలము
లంతియే కాక నీచేత నైన దేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఒకపినతల్లి మే లోర్వలే కనిచిన
                      విపినంబులకుఁ బోవు వెఱ్ఱి గలఁడె?
తండ్రి మృతుండైనఁ దనరాజ్య మత్తఱి
                      నేల రాకుండిన బేల గలఁడె?
యనుజుండు వల దన నాలిమాటలు విని
                      చెడుగిఱ్ఱిఁ బట్టఁ బో వెడఁగు గలఁడె?
పరదేశమున నుండి బలవద్విరోధంబు
                      బలిపించుకొన్న వెంగలియు గలఁడె?


తే.

నీవు సేసినపను లిట్టి నేరుపరివె
జగదుపద్రవ మెట్లు పోఁ జఱచినావొ?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నినుఁ గోరి కన్నతండ్రిని నీనిమిత్త మై
                      చింతించి మృతిఁ బొందఁ జేసినావు
నిను వని న్సేవింప ననుజు నాఁకటి కేమి
                      యొసఁగ కీవే పండ్లు మెసఁగినావు
నినుఁ గపు ల్గొల్చి తల్చినకార్య మీడేర్పఁ
                      బిదపవారలఁ జెట్లఁ బెట్టినావు
నిన్నుఁ బాయ కడవికిఁ జనుదేర నిల్లాలి
                      నొరుపంచఁ గొన్నాళు లుంచినావు


తే.

రాజకళఁ జూచి ని న్నొక రాజు వనిన
మానుషం బేది? యిది యంత మాయ గాని
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కులగురుద్వేషి నొజ్జలుగ పెన్కొని కాచి
                      నిష్ఠురమంత్రము ల్నేర్చినావు
పూర్వదేవతలు కాపుర మున్నపురియందు
                      వంచించి యగ్గిఁ బెట్టించినావు
తాతలతరమునఁ ద్రవ్వించినపయోధి
                      పేరుగాఁ గొంత పూడ్పించినావు
మోస మౌ టెఱుఁగక మోహించి వచ్చిన
                      యెలనాగముక్కుఁ గోయించినావు


తే.

బళిర! నీవంటిధార్మికుఁ బ్రస్తుతింపఁ
గొదువ లింకేమి కైవల్య మెదుట వచ్చు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

శౌర్య మెక్కించి విశ్వామిత్రుఁ డూరకఁ
                      దొడరింపఁ దాటకఁ దునిమినావు
వైదేహి వాక్యనిర్భంధంబుఁ ద్రోయలే
                      కఱిముఱి మారీచు నఱికినావు
వెనుకంజ వైచిన విడువక పైకి రా
                      నరుదుగా ఖరుతలఁ దరిగినావు
మొఱ్ఱో యనుచు దేవమునులు వా రెన్నాళ్ళో
                      యనుసరింప దశాస్యుఁ దునిమినావు


తే.

కాని రోసంబు గలదె నిక్కముగ నీకు?
మనసు మెత్తనివాఁడ నే మనఁగ వచ్చు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ
                      బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ
                      నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన
                      మారీచుఁ డొనరించె మాయ లెన్ని
నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప
                      వానియిల్లా లెంత వగచి తిట్టె


తే.

స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య
కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నీపేరు వినుటకే యోపక చెవిఁ గంట
                      గట్టుకున్నాతనిఁ గావ నేమి?
కలన నీతోఁ గత్తిఁ గట్టుక పోరాడు
                      వాని సోదరుని బ్రోవఁగ బ నేమి?
బాధింపఁ దగు మహాపాత కుండటుచేరి
                      నీవాఁడ నంటె మన్నింప నేమి?
మాయవేసముల నీ మర్మ మారయుచున్న
                      విమత ధూతల బట్టి విడువ నేమి?


తే.

పతిత శరణాగతావన ప్రకటదీక్ష
లోకముల కబ్బురంబుగ నీకె గలదొ?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

పఱపిన శస్త్రంబె బహుముఖంబుల దైత్య
                      వాహినీమర్మము ల్వ్రచ్చి వెడల
ముందు దూసిన బాణమునకన్న సరి మించి
                      వెనుకమ్ము దైత్యుల విఱుగఁ బొడువ
నేసినమార్గణం బెదు రెక్కి యితరాస్త్ర
                      మడఁచి క్రవ్యాదుల మగుడఁ జేయ
నిగిడించిన శరంబె నిర్జరారులఁ ద్రుంచి
                      తొడిఁదొడిఁ దనకుఁ దా దొసకుఁ జేరఁ


తే.

దొలఁగి రసురులు కొంత నీబలిమి దెలిసె
ముష్టి నీ దెంత నీయస్త్రములదె వింత
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అడవిలోఁ దెరువర్ల నుడుగక తినుచున్న
                      యాఁడుదాని వధించు టర్హ మగునె?
చిక్కినవారికిఁ జేతు లెంతయుఁ జాఁచు
                      మొండివాని వధించ ముఖ్య మగునె?
యెక్క డెక్కడ నైన నేఱుక తినుకాకి
                      కన్ను బోఁ బొడుచుట ఘనగుణంబె?
కడు వ్రేటుఁ బడి గడ్డి కఱచినఁ మారీచుఁ
                      దఱిమి బాధించుట నెఱతనంబె?


తే.

యెవ్వ రేరాజు లొనరించి రిట్టిపనులు?
చేసితివి యింక నె ద్దేని సేయఁగలవు!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

రాజకార్యపరుండు తేజోబలాధికుఁ
                      డాంజనేయుఁడు భృత్యుఁ డగుటఁ జేసి
యమితశౌర్యుఁడు ప్లవంగమకులేశుఁ డినజుఁ
                      డఱ లేని స్నేహితుఁడగుటఁ జేసి
విమతమర్మజ్ఞుండు విశ్వాసభరితాత్ముఁ
                      డల విభీషణుఁ డాప్తుఁ డగుటఁ జేసి
సుమనస్కు లమనస్కు లమృతవాక్యంబులన్‌
                      బొసఁగ నాశీర్వదించుట జేసి


తే.

లంక సాధించితివి గాని లావుచేత
నిర్జరారుల గెలువంగ నీతరంబె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నడువఁజాల దని జానకి నెత్తుకొని ముందు
                      నడచు విరాధుని నఱకు టేమి?
చనవున వైదేహి చనుబిడ్డవలెఁ నోటఁ
                      బట్టిన యైంద్రికన్గొట్టు టేమి?
సీ.|lines=<poem> సంతోషింపఁ జిత్రవేషముఁ దాల్చి
                      తిరుగు మారీచుని నరుకు టేమి?
తల్లినివలెఁ దెచ్చి ధరణీజను నశోక
                      వని నిల్ప రావఁణు దునుము టేమి?


తే.

కోప మిటు లేమి? వారు మహాపరాధు
లైన ముక్తిప్రసాదార్హు లగుట యేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వరరాజ్యకాంక్షలోఁ బట్టకుండెద వైన
                      సుగ్రీవునగరంబుఁ జూడరాదె?
పరధనంబున కాస పడక యుండెద వైన
                      నాలంక నొకరాయి యంటరాదె?
పరయోష పై నిచ్చఁబాయ కుండెద వైన
                      నల శూర్పణఖముక్కు నిలుపరాదె?
పరదానవులఁ ద్రుంపఁ బంతగించెద వైన
                      మూల దైత్యులఁ దోలి పుచ్చరాదె?


తే.

చేసిన ప్రతిజ్ఞలో నొండు వీస మైనఁ
దప్పు వోకుండ నడచిన ధార్మికుఁడవొ!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నిర్దయాత్ములె కాని నిత్యాగ్ని హోత్రాది
                      కర్మనైష్ఠికులైన ఘనులు గారె?
శుచిశూన్యులే కాని శ్రుత్యాదిపాఠక
                      ప్రకటవేదార్థబోధకులు గారె?
సత్యహీనులె కాని చంద్రశేఖరపాద
                      పద్మపూజానందపరులు గారె?
మాయికులే గాని మంత్ర ప్రయోగోప
                      సంహరణ క్రియాచణులు గారె?


తే.

కులము బ్రాహ్మణ్య మగు దైత్యకులము నెట్లు
గూల్చితివి బ్రహ్మహత్యకు గొంక కహహ?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఒక్కవ్రేటునఁ గూలునో వాలి బలశాలి
                      చెట్లుమా టొగ్గి వేసితివి గాని
మొనసి నీల్గునె పఙ్క్తిముఖుఁడు తన్నాభికా
                      మృతకుంభ పగలఁ గొట్టితివి గాని
కుంభకర్ణుఁడు రణక్షోణిలోఁ దీరునే
                      తీఱని నిద్ర నెదిర్చెఁ గాని
చిక్కునే యింద్రజి త్తుక్కున సోదరుం
                      డశననిద్రలు మాని యఁడఁచె గాని


తే.

యింద ఱాయంబు లెరుగుదు వందువలన
మడిసి రసురులు నీచేత మడియువారె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

మొసలిఁ బెట్టినకస్తి మొఱ్ఱ బెట్టినహస్తి
                      రక్కరించితి నన్నరంబె మేమి?
తులువ పల్వురిలోన వలువ నిప్పంగ జాన
                      సిగ్గుఁ గాచితి నన్నపగ్గె యేమి?
బలువు శాపముచేత బండపాఱిననాఁతి
                      ఱంకుఁ బాపితి నన్న బింక మేమి?
పెద్ద మోదినభీతి బెగడి వచ్చినకోఁతి
                      కండ జేసితి నన్న యంద మేమి?


తే.

భవభయంబున నిన్నెంత ప్రస్తుతింపఁ
గరుణఁ జేపట్ట లేని నీ ఘనత యేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నీచువాసనచేత నీటిలో నుండుట
                      యెక్కువప్పులను రా యెత్తుకొనుట
కడుపాఁకటికిఁ దుంగకాయలు మెక్కుట
                      యని నోరు దెఱచి పెల్లఱచుచుంట
సిరి గల్గి బిచ్చపుఁ జిప్పఁ జేపట్టుట
                      చేకత్తి పరరాజుచేతి కిడుట
పట్టణప్రజకుఁ జెప్పక పాఱిపోవుట
                      కలు ద్రావి నిను నీవె దెలియకుంట


తే.

మ్రానువై యుంట గుఱ్ఱపుమనిసి వంట
పుడమి నాడిక సేయక విడువ నిన్ను
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఖరు నాజిలోఁ జొచ్చి శర ముచ్చి పో నేయ
                      వెనుకకు లంఘించి వెఱచె ననిరి
యనిఁ బాఱునో కోఁతి యతి మ్రానిమాటున
                      నేయ వాలినిఁ బొంచి యేసె ననిరి
గరుడధ్వజుం డన్న గురుతుఁ దెల్పుట కున్న
                      బలభీతి శస్త్రాహి బద్ధుఁ డనిరి
బలినిఁ జంపఁగ రానివరమున యాచింప
                      వృత్తి నాతని భిక్ష మెత్తె ననిరి


తే.

యశ మదెంతొ ప్రయాస లభ్యంబె కాని
యెంతలో వచ్చు నపకీర్తి యెఱుఁగ వేమి
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఘోరకబంధుదీర్ఘోరుదోర్దండముల్‌
                      తరిగి వచ్చిన మాట తథ్య మేని
పంఙ్క్తికంఠాత్మజ ఫణిరాజబంధమో
                      చనుఁడ వై వచ్చుట సత్యమేని
మైరావణాభేద్య కారాగృహముఁ గూల్చి
                      బ్రదికి వచ్చినపల్కు భద్రమేని
మారీచు దుస్తరమాయాభ్రమతఁ బాసి
                      విజయ మొందినసుద్ధి నిజమ యేని


తే.

కలిత రాజోపచార భోగములఁ గీర్తి
శాలి పై యిందు మెఱయుట సాక్షి జగతి
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

నీ శాంతి యంభోధి నిర్భరాంబువులు బా
                      ణముఖంబునకుఁ దెచ్చు నాఁడె తెలిసె
నీ కోప మరి రావణైకానుజన్ము నా
                      నగరి రాజుగఁ జేయు నాఁడె తెలిసె
నీ కీర్తి కపటదుర్నితుఁడౌ ధ్వాంక్షదా
                      నవు తప్పుఁ గాచిన నాఁడె తెలిసె
నీయభిజ్ఞత యవినిందిత నీతన్వి
                      నగ్నినిఁ జొరు మన్న యపుడె తెలిసె


తే.

నెంచరాని గుణాఢ్యుఁడ వీవె యనుచుఁ
దెలిసి మ్రొక్కెద నితర మౌ దిక్కు లేక
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

జనకువాక్యమున రాజ్యవిసర్జనమె కాని
                      యడరు శౌర్య మొకింత విడిచినావె?
దీక్ష నాభరణము ల్దివియు మాత్రమె కాని
                      వర ధనుర్బాణము ల్వదలినావె?
వ్రత మని కాంచనాంబరముఁ గట్టవు గాని
                      బిగువు వజ్రాంగి మై విదచినావె?
ప్రతినఁ బరార్థమే మితర మొల్లవు గాని
                      యభిమానధనముపై నలిగినావె?


తే.

నిఖిల రక్షోవిదారణ నిర్భయాంక
వేషధారివి నీ మునివృత్తి యేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వెఱపించఁ గలవొ చేవిలు నీ కొసంగి తా
                      విగతరోషుం డైన విప్రవరునిఁ
గట్టించఁ గలవొ సాగరముపై సేతువు
                      మలలఁ గోఁతులమూక లలరఁ బట్టి
ఘనత నీఁ గలవొ యన్నను గొట్టి తమ్మున
                      కారాజ్య మా చంద్రతారకముగ
వేంచేయఁ గలవొ విన్వీథిఁ దేరగ నున్న
                      పుష్పకం బెక్కి నీపురికి మరల


తే.

జగతి నిటు సంతతోత్సాహచరణమునకు
యుక్తి సేయుదు వోహొ నీ శక్తి దెలిసె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ని న్నెదుర్కొన రాని నెపమునఁ గోపించి
                      గోపితహితు నూతుఁ గొట్టవలెనె?
సంబంధినోటఁ గొంచెపుమాట రా వాని
                      కరిపురం బలుకఁ బెకల్పవలెనె?
నిను జూచి వేడ్క నొందిన గర్వముగ నెంచి
                      నిండి పాఱెడు నీరు నిలుపవలెనె?
చెలికానివలె నొద్దఁ చేరి యెత్తుకొనంగఁ
                      గినుకఁ ప్రలంబునిఁ దునుమవలెనె?


తే.

ఎంతరోసంబు గలవాఁడ వేమి నీవు
తెలివికాఁడవె బలరామ! తెలిసె నిందు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

పరపురుషాకృత గురుతుగాఁ జూడక
                      త్రిపుర పతివ్రతాతిలకములను
విటపయుక్తి భ్రమించి విఫలభ్రమతఁజేసి
                      తత్సతీపతుల దుర్దాంతబలుల
హతము సేయించితి వల మహానటునిచే
                      రథారధాంగాశ్వసారథిశరాన
గుణనిషంగాస్త్రము ల్కోరినట్లుండు నే
                      సమకూర్చి యసురుల సంహరించి


తే.

సాహసుఁడ వైతిని న్నుంచి శంకరుండు
త్రిపురసంహరుఁ డను నాఖ్యఁ దెచ్చుకొనియె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

సకల వర్ణంబులు సంకరంబులు జేసి
                      యఖిల ధర్మములు శూన్యములు సేసి
భూతలంబును బాపభూయిష్ఠముగఁ సేసి
                      పరగఁ బ్రపంచంబు భ్రష్టు సేసి
కలి విజృంభించిన కడపటనా నీవు
                      తురగవాహనుఁడ వై దోర్విరాజి
ఖడ్గచంచద్ధారఁ గలుషాత్ముల వధించి
                      శిష్టసంరక్షణ సేయు టెల్ల


తే.

ననిశము చరాచరాది జీవావనైక
జాగరూకుఁడవా నీవు జాగు దెలిసె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

భువనమోహన! కృష్ణమూర్తివి నీ వేని
                      ఆలీల లిచ్చట నాడవలదె?
బలసముజ్జ్వల కామపాలుఁడ వీ వేని
                      దీపించి యాబల్మిఁ జూపవలదె?
వీరనృసింహావతారుఁడ వీ వేనిఁ
                      దత్తేజ మింతైనఁ దాల్పవలదె
సత్యవిక్రమ! రామచంద్రుఁడ వీ వేని
                      ఆపౌరుష మొకింత చూపవలదె?


తే.

యెంచ దేవర దైవమో యీవె కాని
చూపఱకు నీదు మహిమను జూపవలదె?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఆలగాపరివాఁడ వనక నిన్నఖిలవే
                      దాంతమార్గ విహారి వందు నేమి?
హలముఁ బట్టివవాఁడ వనక న్బహువిధా
                      జాండనిర్వాహుఁడ వందు నేమి?
యలసారివాఁడ వంచనక నిన్ను సమస్త
                      శాస్త్రప్రపూర్ణుఁడ వందు నేమి?
యడవి ద్రిమ్మరివాఁడ వనక నిన్సకల లో
                      కాపన్నివారుఁడ వందు నేమి?


తే.

పుడమి నీ దగు కొంచెపునడత లెంచ
కభినుతింతునె లోకైక విభుఁడ వనుచు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

మామయింటికిఁ బోవ మంచితీర్థము పుట్ట
                      దతఁ డంత కారువాఁడతఁడె సుమ్ము
పునుక కంచము తోలుపుట్టంబు గలమిత్రుఁ
                      డెందు నన్నముఁ జెట్టు నేమి గప్పు
మాటమాత్రం బైన మగువ నో రాపదు
                      కొడుకు పెట్తునె తలగొట్లమారి
యన్నది మేషాండ మున్న దిచ్చే దొక్క
                      తొఱ్ఱిగొ డ్డది నీకుఁ దోలు నేమి


తే.

ఎవ్వరింటికిఁ బోయిన నేమి ఫలము
ఉన్నచో నుండి సిరులఁ బెంపొందు మయ్య
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

దుర్జనభంజనోర్యుక్త సుదర్శన
                      ధారివే నీవు యదార్థముగను
శాత్రవభయద విస్వన పాంచజన్య భూ
                      షిత కరాంబుజుఁడవే సిద్ధముగను
మత్తారిభేదనాయత్త కౌమోదకి
                      నిజకరభరితమే నిశ్చయముగ
ఘోరవిద్విడ్రక్త ధారార్ధ్రనందక
                      సంధానపాణివే సత్యముగను


తే.

సన్నుతామోఘ బాణైకశార్ఞ్గచక్ర
శయుఁడవే నమ్మవచ్చునే స్వామి! నిన్ను?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ఇల్లు రత్నాకరం బెన్నాళ్ళకును జాలు
                      జీవనం బొరుల యాచింపవలెనె?
ఇంట మహాలక్ష్మి యెప్పుడు దాండవం
                      బొనరించు నొకఁడు నీ కొసఁగవలెనె?
స్థిరత లోలోన నిక్షేపించు ధనము నెం
                      చఁగ రాని దొకరిఁ జేఁ జాపవలెనె?
పంటపైరులకాఁపు కంటఁ గాయుచునుండు
                      కోరికఁ బెరసొమ్ము గొనఁగవలెనె?


తే.

ధాత్రి నెవ్వరి రక్షించఁ దలఁచినావొ
కోరువారలచేఁ బూజ గొందు వింతె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అబ్ధికన్యా వివాహ మహోత్సవము నాఁడుఁ
                      జూడలే దిచ్చోట జూడఁ గలిగె
జానకీకల్యాణసంభ్రమం బానాఁడు
                      జూడలే దిచ్చోట జూడఁ గలిగె
భోజసుతోద్వాహ భూరివైభవమందుఁ
                      జూడలే దిచ్చోటఁ జూడఁ గలిగె
రేవతీపరిణయ శ్రీవిలాసంబపుడు
                      చూడలే దిచ్చోటఁ జూడఁ గలిగె


తే.

ననుచు నిట రాజ్యరమఁ బెండ్లియాడ
నిన్నుఁ బ్రజలు సేవించి సంతోషభరితులైరి
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

అఖిలలోక స్థాపనాచార్యమణి వయ్యు
                      నిజభక్తగురునిచే నిలుపుకొన్న
గర్భస్థితానేక కమలజాండుఁడ వయ్యు
                      నొండుకోవెలని జెల్వొందుచున్న
బహుచరాచర భూతపరిపాలకుఁడ వయ్యు
                      భక్తార్పితార్థము ల్పట్టుచున్న
హరచతుర్ముఖ దేవతాగోచరుఁడ వయ్యు
                      నెప్పుడు దర్శనం బిచ్చుచున్న


తే.

నిన్ను సేవింప రెవ్వరో పెన్నిధాన
మెదుట నుండంగఁ గనిమూసి యేఁగువారె
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కైలాస మేరు సంకాశ నాగాశన
                      స్కంధంబుపై రథోత్సవము గల్గఁ
జందనమందార సంతానకల్పక
                      వనముల మృగయోత్సవమ్ము గల్గ
రంగత్పయఃపయోరాశి వీచికలపై
                      వర్ణింప డోలోత్సవంబు గల్గ
బహుఫణారత్న శుంభద్భుజంగమ భోగ
                      వసతిఁ బర్యంకోత్సవంబు గల్గ


తే.

బరకృతోత్సవ మిచ్చట బ్రాఁతె నీకు
భక్త జనులకు నేత్రోత్సవంబె కాని
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కోరిక లీను వైకుంఠంబులోని
                      లోననగరిలో నామూల నవ్యదివ్య
సౌధంబుదాపలి సరసమందారవ
                      నాంతరామృత సరఃప్రాంతచంద్ర
కాంతోపలోత్పల కల్పితపర్యంక
                      సకల సౌభాగ్య లక్షణనివాస
లక్ష్మీమనోజ్ఞ విలాసివశీకృత
                      సంభోగసామ్రాజ్యసంతతాభి


తే.

రామమూర్తికి వాంఛేతర ప్రపంచ
మేమి గావరె లీలార్థ మింతె కాని
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

గుఱుతుగ సద్భక్తకోటి కీనాఁటికి
                      విడరాని బహుఋణస్థుఁడవు నీవు
సేవకు లెన్నెన్ని త్రోవలఁ జనుచున్న
                      వదలక యనుసరించెదవు నీవు
నిజదాసు లాత్మేచ్ఛ నిలిపి రెచ్చో నిన్నుఁ
                      దొలఁగ కచ్చోటనే నిలచె దీవు
శ్రితు లంబలియు నైనఁ జేఁ జూప నది యెంత
                      యమృతభోగంబుగా నలరె దీవు


తే.

జగము లన్నియు నీకు వశ్యము లటంటి
వీవు నిజదాసవశ్యుఁడ వెంత ఘనత?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

వెనుక వేసుకొని యుర్వీనాథకోటులు
                      సైంథవుఁ గావంగఁ జాలినారె?
ధర నేయు తనసుతు శిర మెవ్వఁడతఁ డీల్గ
                      శాపించి సింధురా జోపినాఁడె?
సాటింతు నాసర్వసైన్యంబు లని కర్ణు
                      చేశక్తి నరు నేయఁ జెప్పినారె?
పరులచే నొవ్వని పంతంబు గలభీష్ము
                      డర్జునాస్త్రంబుల కాఁగినాఁడె?


తే.

మనుజయత్నంబు బల మెంత మాత్ర మీవు
నిజము కరుణించు నాతఁడే విజయుఁ డరయ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

జనితరంగాపారసంపరాబ్ధి నే
                   తఱి దరింపగలేక యెఱుక గలిగె
జేపట్టి దరిచేర్తు వాపదుద్ధారి నీ
                   వనుచు గుయ్యిడుచున్న నభయదాన
మీక యపేక్షించె దింత దయాబ్ధివి
                   యితరకార్యభారం బదెంత యున్న
శరణాగతుల బ్రోచు బిరుదు నీ కున్నదే
                  కరిరాజు బ్రోవ నిందిర రహస్య


తే.

కేళి సంహర్షితాంతరంగికుడ వయ్యు
రమను జేకొని వేంచేయు ఱవ్వ యేమి?
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

102


సీ.

ఆగామి సంచిత ప్రారబ్ధము లటుండ
                      నిజజన్మమందు నే నెల్లవేళ
నఘములే చేసితి నని యుష్మత్సుధా
                      సదృశ నిర్హేతుక జాయమాను
కరుణాకటాక్ష వీక్షణ మెంచ కెప్పుడో
                      ప్రసరింపవలె నే నపారదురిత
వారధిఁ దరియింపవలెఁ గాని గతి యితః
                      పర మెఱుంగను భక్తపాలనాంక!


తే.

శేషపర్యంక! రాజ్యలక్ష్మీసహాంక
ప్రధననిశ్శంక! యదుకులాంబుధిశశాంక!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

ప్రాణులకర్మముల్ పరికింపఁ బదునల్గు
                   రఁట ధర్మదేవత లవి లిఖించి
చిత్రగుప్తులు లెక్క సేయుదురంట యని
                   ధర్మరాజాదులదండ నునిచి
చేసినవారిచేఁ జెప్పించి
                   బాధించి నరకకూపములయందుఁ
ద్రోయింతురఁట యట్టిదుర్గతిఁ దప్పింప
                  దక్షుఁడ వాపన్నరక్షకుఁడవు


తే.

కలవు కల వని నీపాదకమలములకు
శరణు శరణంటి నభయం బొసంగుమయ్య
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

104


సీ.

పూర్వకవీంద్రులు పుణ్యఫలం బేమి
                      సాక్షాత్కరించి యస్మత్పరంబు
గా గద్యపద్యముల్‌ గల్పించు మనిన వే
                      వర మొసంగితి వండ్రు వాంఛఁ జేసి
నేర్చి నట్లుగఁ గూర్చి నేఁటి కవిత్వంబు
                      నీకంకితముఁ జేసి నెనరు దోఁపఁ
జేదోయి యొగ్గిన శ్రీపాదరజ మింత
                      నామీఁదఁ బాఱ నీ వేమి సామి


తే.

కృపకుఁ బాత్రముఁ జేయు మక్షీణభాగ్య
లక్షణాంచిత పాదపల్లవకరాబ్జ!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

కావ్యదోషము లెఱుంగని మత్కవిత్వంబు
                      విద్వన్నుతంబుఁ గావించినావు
బహిరంత రింద్రియ పరిశుద్ధి లేని నా
                      తలఁపులోపల వచ్చి నిలచినావు
పుణ్యకర్మ మొకింత పూని సేయని నన్నుఁ
                      బెద్దలచేత మెప్పించినావు
పురుషప్రయత్నంబు గురు తెఱుంగని నన్ను
                      భుక్తి గల్గఁగ జేసి ప్రోచినావు


తే.

పతితుఁ జేపట్టినావు చేపట్టినావె
యన్యగతిఁ బోవనీయకు మార్తరక్ష!
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

శబరి యెంగిలిపండ్లు చవిఁజూచు ననుకంప
                      కుబ్జ గంధము పూఁతఁ గొన్నకరుణ
పాంచాలి కోర సాపడిన దయారతి
                      గోపమ్మ యుగ్గుఁబాల్‌ గ్రోలుకృపను
మాలికుఁ డొసఁగు తోమాలెఁ దాల్చినప్రేమ
                      ద్విజుని కొం గటుకులు దిన్నకూర్మి
గుహుఁడు పాదములు బట్టుట కుల్బు నెనరును
                      నుడుతదాస్యమునకుఁ బొడము ప్రేమ


తే.

శతక మంగీకరింపుము జగతి జనకుఁ
డర్భ కావ్యక్త భాషల నలరి నట్లు
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!


సీ.

శతక మొకటి 'మనసా హరిపాదము
                      లాశ్రయించవె' యని యల్లినాఁడఁ
గరిమ 'రామా! భక్త కల్పద్రుమా!' యని
                      యొప్పగా శతకంబుఁ జెప్పినాఁడ
నలరులదండ మీ కనఁగ 'హంసలదీవి
                      గోపాల శతకంబుఁ' గూర్చినాఁడ
యుష్మ దంకితముగా నూహించ శకమ మీ
                      నంచితంబుగ రచియించినాఁడ


తే.

భవదనుగ్రహ కవితచేఁ బ్రబలువాఁడ
నవని గాసుల పురుషోత్త మాఖ్యవాఁడ
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

108