భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/ఆంధ్రనాయకశతకము
పీఠిక
ఆంధ్రనాయకశతకమును కాసుల పురుషోత్తమకవి రచించెను. ఇతఁడు బందరు సమీపమునందున్న శ్రీకాకుళమునందలి ఆంధ్రవిష్ణునిగూర్చి యీశతకమును రచించెను. పురుషోత్తమకవి భట్టురాజు కులమువాఁడనుటకు శతకములోని "రట్టు సేయుదుఁ గనుము నాబట్టుతనము” అనుపద్యభాగము సహాయము చేయుచున్నది. ఈకవినివాసము శ్రీకాకుళము చెంతఁ గల పెదప్రోలు. ఇతఁడు కాశ్యపగోత్రుఁడు. అప్పలరాజు రమణాంబల కుమారుఁడు. అర్ధంకి తిరుమలాచార్యులశిష్యుఁడు. ఈయంశ మీకవి రచించిన హంసలదీవి గోపాలశతకములోని యీక్రిందిపద్యమువలనఁ దెలియును.
సీ. కాశ్యపగోత్రుఁడఁ గాసులవంశచం
ద్రముఁడ నప్పలరాజు రమణమాంబ
కూర్మితనూజుండ గురువులౌ నద్దంకి
తిరుమలాచార్య శ్రీచరణపద్మ
భవ్యతీర్థమరందపానద్విరేఫాయ
మానమానసుఁడను మాన్యహితుఁడ
పురుషోత్తమాఖ్యుఁడ పూదండవలె నీకు
శతకంబుఁ గూర్చితి శాశ్వతముగ
తే. చిత్తగింపుము మీపాదసేవకుఁ డను
భావజవిలాస హంసలదీవివాస
లలితకృష్ణాబ్ధిసంగమస్థలవిహార
పరమకరుణాస్వభావ గోపాలదేవ.
దేవరకోట సంస్థానములో సుప్రసిద్ధమైయున్న ఆంధ్రనాయకాలయము పూజాపురస్కారశూన్యమై హీనదశయం దున్నపుడు పురుషోత్తమకవి మిగులఁ బరితపించి సుప్రసిద్ధుఁడు ప్రత్యక్షరూపుఁడగు దేవున కిట్టి విపరీతస్థితి చేకూరుటకుఁ గినిసి నిత్యోత్సవములు చేయించికొనక చేతఁగానివానివలె నూరకుంటఁ బ్రతిష్ఠగాదనియుఁ బూర్వకీర్తి నిలుపుకొమ్మనియు నిందాస్తుతులతో నీశతకమును ఆంధ్రనాయకునిగూర్చి రచించెను. ఇతఁడు మానసబోధశతకము, హంసలదీవి గోపాలశతకము, భక్తకల్పద్రుమశతకము, ప్రకృతాంధ్రనాయకశతకము వ్రాసినాఁడు. “మనసా హరిపాదము లాశ్రయింపవే "యని యీకవి మానసబోధశతకము రచించితినని చెప్పుకొనుచున్నాఁడు. ప్రకృతము మానసబోధశతక మొకటి తాడేపల్లి పానకాలరాయకవికృతము కనఁబడుచున్నది. పానకాలరాయకవి చిత్తబోధశతకము వ్రాసెనుగదా! ఇఁక మానసబోధశతక మేల వ్రాయవలసివచ్చెను? పురుషోత్తమకృతికే యెవరేని కర్తృత్వము మార్చి .
రోయని మే మూహించుచున్నాము. లేక పురుషోత్తముని మానసబోధశతక మంతరించినదేమో! నిశ్చయ మెఱుంగరాదు.
నందిగామ
ఇట్లు భాషాసేవకులు,
23-10-25
శేషాద్రిరమణకవులు, శతావధానులు.
కాసుల పురుషోత్తమకవి
ఆంధ్రనాయకశతకము
సీ. | శ్రీమదనంత లక్ష్మీ యుతోరః స్థల | |
తే. | భాను సితభాను నేత్ర సౌభాగ్యగాత్ర | |
సీ. | వైజయంతీధామ వర్ణిత సుత్రామ | |
తే. | దాసులము గామ? నీ పేరు దలఁచుకోమ? | |
సీ. | మానుషహర్యక్ష మార్తాండ సోమాక్ష | |
తే. | సిద్ధసంకల్ప అవికల్ప శేషతల్ప | |
సీ. | గోవింద ముచికుంద సేవిత పాదార | |
తే. | పండితస్తోత్ర చారిత్ర పద్మనేత్ర | |
సీ. | శ్రీకాకుళము భక్తలోక చింతామణి | |
తే. | తెలియ శ్రీకాకుళంబు నీ దివ్యదేశ | |
సీ. | ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ | |
తే. | రమ్ము దర్శన మిమ్ము ఘోరములఁ జిమ్ము | |
సీ. | కలిగినప్పుడె కన్న తలిదండ్రు లెన్న నే | |
తే. | నాబుడత వీవెరా యబ్బ! యబ్బురంపు | |
సీ. | వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు | |
తే. | నిఖిలదైవత కార్యముల్ నిర్వహించు | |
సీ. | అచట లే వని కదా యరచేతఁ జఱచెఁ గ్రు | |
తే. | లేక యచ్చోటులను గల్గలేదె ముందు | |
సీ. | అచింతాఖండ దీపారాధనల చేత | |
తే. | నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు | |
సీ. | భక్తిఁజేసిన శిలాప్రతిమ మాత్రమే కాని | |
తే. | నీకు నిత్యోపచారముల్ లేకయున్న | |
సీ. | ధర నూటయెనిమిది తిరుపతులందు శ్రీ | |
తే. | వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగఁ | |
సీ. | మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం | |
తే. | వత్సరోత్సవ వీక్షణవాంఛ జనుల | |
సీ. | తగునట్లు తిరుమేను తా నామతింపుచు | |
తే. | నిండుకొన్నావు గడియించు నేరుపరివె | |
సీ. | వంచన గాదె దివ్యక్షేత్రపతులలో | |
తే. | నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ | |
సీ. | తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల | |
తే. | హఠము గావించి నీయన్వయంబు లెత్తి | |
సీ. | చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి | |
తే. | నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ | |
సీ. | అబ్బుకో గలవొ కాయక్లేశ మొనరించుఁ | |
తే. | దెచ్చుకొన వేమి వస్త్రాన్నదీపధూప | |
సీ. | తలను బించెపుదండ ధరియించవలె గాని | |
తే. | నెల్లలోక మెఱింగిన గొల్లవాఁడ | |
సీ. | కన్నవారల మున్ను గారాగృహంబున | |
తే. | విఱిగి తిరి గెన్నఁడెన్నఁడో తఱి యెఱింగి | |
సీ. | భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి | |
తే. | నుచ్చనీచంబు లెఱుఁగక యిచ్చఁ జేయు | |
సీ. | విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో | |
తే. | మమత నీలీల లటు సూచి బ్రమసి రేమె | |
సీ. | విక్రమాక్రమిత భూచక్రుఁ డౌ హేమాక్షు | |
తే. | వడిగలతనంబులా యివి? గడన యేమి | |
సీ. | కెరలి కంసుఁడు నిన్ను నఱకఁ గాచినవాని | |
తే. | నీ పరాక్రమ మిట్టిది నిఖిలజగము | |
సీ. | వ్రేపల్లెలో గొల్లవెలఁదులు గొట్ట రా | |
తే. | తలిరుబోఁ డుల యెదుటఁ దత్తరము గలుగ | |
సీ. | ఆలు నిర్వాహకురాలు భూదేవి యై | |
తే. | నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని | |
సీ. | కడలి రాయనిముద్దుకన్నియఁ బెండ్లాడి | |
తే. | తెలియ నవ్యక్తుఁడవు గావు తెలిసికొన్న | |
సీ. | నీ జ్యేష్ఠపుత్త్రుఁ డెన్నికకు రాని యశాశ్వ | |
తే. | నొకరికంటె గుణాధికు లొకరు మీరు | |
సీ. | సకలంబు నీవ యై మొకమఱ్ఱియాకుపై | |
తే. | పరువు గలవాఁడ వేమి ప్రాఁబల్కు లంచు | |
సీ. | కల్లరు ల్గాని వ్రేపల్లెవా రందఱు | |
తే. | నెరుక మాలినవారుఁ నీపరువు దలఁతు | |
సీ. | దూడలలోఁ బెరదూడ మేయఁగఁజూచి | |
తే. | మేమి ఘనకార్యములు చేసి తిద్ధరిత్రి | |
సీ. | కవ్వడి కెంత చక్కఁగ బోధ చేసిన | |
తే. | పోరు చంపక చుట్టముల్ పోర నీల్గఁ | |
సీ. | శ్రీమద్వికుంఠపురీ వరేశుఁడ వయ్యు | |
తే. | గొప్పలో గొప్పవాఁడవు కొలదిలోనఁ | |
సీ. | దుర్యోధనుం డవధ్యుఁడ వంచు మానెఁ గా | |
తే. | నృపులు కొందఱు వెఱచిరే నీకు మున్ను | |
సీ. | రాజు లెవ్వరుఁ బఙ్క్తిభోజన మిడకున్న | |
తే. | పాటి సేయంగ నేరాజు బంధుగుఁడవొ? | |
సీ. | నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది | |
తే. | తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె | |
సీ. | అప్పనంబులు గొన్ను నఖిలదిఙ్మండలే | |
తే. | సాటిసాములరీతి నిచ్చోట నీవు | |
సీ. | బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది | |
తే. | సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ | |
సీ. | మును నందగోవత్సములఁ గాయునప్పుడు | |
తే. | యల్పునిగ నెంచినారె లోకైకనాథ | |
సీ. | పూతనాకుచకుంభపూర్ణ విషస్తన్య | |
తే. | బడుగుదాసరివలె నన్నవస్త్రములకుఁ | |
సీ. | పట్టి గొల్లది రోఁట గట్ట నోపిననీకుఁ | |
తే. | కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ | |
సీ. | కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ | |
తే. | నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు | |
సీ. | పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు | |
తే. | యెంతయాలస్యమున వారి నేలినాఁడ | |
సీ. | అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి | |
తే. | లోకమున నడ్డ మెవ్వరు లేకయునికి | |
సీ. | అది యోగ్యంతరం గాలానబంధంబు | |
తే. | యేమి యాలస్య మిది నీకు నేల సకల | |
సీ. | కఠినస్తనంబుల ఘట్టించి దట్టించి | |
తే. | దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష! | |
సీ. | నీ బొడ్డుదమ్మి లోనికిఁ జొచ్చి చూచిన | |
తే. | గరువ మేటికి నీ మర్మ మెఱుఁగ రనుచుఁ | |
సీ. | పురుషాకృతిగ నిన్ను గురుతుఁ బట్టఁగ రాదు | |
తే. | వస్తునిర్దేశ మొనరింప వశము గాని | |
సీ. | నమ్ముదు రేరీతి నారదు నాత్మజు | |
తే. | ని న్నెఱిఁ గెఱింగి యందఱు నన్నుతింతు | |
సీ. | ఎక్కడ నీకన్న దిక్కు లేనట్ల ని | |
తే. | దత్త్వ మరసిన శుద్ధబుద్ధస్వరూప | |
సీ. | ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె | |
తే. | యిట్టివే కద నీవిద్య లెన్ని యైన | |
సీ. | కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో | |
తే. | మంచి సహవాసములు గల్గె నెంచి చూడ | |
సీ. | అఖిలపోషకుఁడ వ న్నాఖ్య మాత్రమె కాని | |
తే. | వినుకలులె గాని నిన్ను నీవిశ్వములను | |
సీ. | ఒక గుణంబున నీవె సకల ప్రపంచంబుఁ | |
తే. | గుణ మొకటి గాదు తెలిసినగుణము లేదు | |
సీ. | జీవిని జీవి భక్షింపఁ జేసితి వింతె | |
తే. | తెలిసె నీరక్షకత్వంబు దేవదేవ! | |
సీ. | నీరుపట్టుగ నుంట నారాయణుఁడ వండ్రు | |
తే. | పెట్టుపేరు లనేకముల్ పుట్టుపేరు | |
సీ. | వేఁడని చూదక విపినవహ్నిజ్వాలఁ | |
తే. | భక్తసంరక్షణ త్వరా పరవశతను | |
సీ. | వత్సాపహరణగర్వము మాని యజుఁడు దా | |
తే. | క్షోణిఁ బుట్టుక మాలిన గొల్లవాని | |
సీ. | కొనముట్ట హెచ్చుతగ్గుల ప్రాతఁసుద్దుల | |
తే. | మాట వెళ్ళనివానికి మగుడ నిచ్చి | |
సీ. | అబ్ధిపయఃపాత్ర మద్రికాణంధాన | |
తే. | బక్షపాతివి గావె? యభక్తిఁ బడిరి | |
సీ. | ఉక్కునఁ బసిఁడికన్ రక్కసుఁ డొకఁడు ప | |
తే. | నొక్కి పుడ మింత నీటిపై కెక్కఁదీయ | |
సీ. | అయవారు చదివించినట్లుగాఁ జదువక | |
తే. | కశిపుఁ దునుమాడి ప్రహ్లాదుఁ గరుణ నేలి | |
సీ. | కశ్యపుఁ డదితి ని న్గన్నవారలు గారె | |
తే. | నట్టిదాతను దిగఁద్రొక్కి యతనిసిరులు | |
సీ. | జపతపోనిష్ఠుఁడౌ జమదగ్ని కుదయించి | |
తే. | సేసి యిల విప్రులకు ధారఁ బోసినట్టి | |
సీ. | తా వచ్చెద నటంచు ధైర్యలక్ష్మి మహీజ | |
తే. | గట్టిగా మైథిలినిఁ జెట్టఁ బట్టినట్టి | |
సీ. | ధర్మవిఘాత మిద్ధర నీ వొనర్చిన | |
తే. | మంచినడవడి నడిచినా పెంచి చూడఁ | |
సీ. | నన్ముని నధ్వరసాఫల్యుఁ గావింప | |
తే. | నబ్బె నీకుఁ బరోపకారైన ఫలము | |
సీ. | ఒకపినతల్లి మే లోర్వలే కనిచిన | |
తే. | నీవు సేసినపను లిట్టి నేరుపరివె | |
సీ. | నినుఁ గోరి కన్నతండ్రిని నీనిమిత్త మై | |
తే. | రాజకళఁ జూచి ని న్నొక రాజు వనిన | |
సీ. | కులగురుద్వేషి నొజ్జలుగ పెన్కొని కాచి | |
తే. | బళిర! నీవంటిధార్మికుఁ బ్రస్తుతింపఁ | |
సీ. | శౌర్య మెక్కించి విశ్వామిత్రుఁ డూరకఁ | |
తే. | కాని రోసంబు గలదె నిక్కముగ నీకు? | |
సీ. | కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ | |
తే. | స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య | |
సీ. | నీపేరు వినుటకే యోపక చెవిఁ గంట | |
తే. | పతిత శరణాగతావన ప్రకటదీక్ష | |
సీ. | పఱపిన శస్త్రంబె బహుముఖంబుల దైత్య | |
తే. | దొలఁగి రసురులు కొంత నీబలిమి దెలిసె | |
సీ. | అడవిలోఁ దెరువర్ల నుడుగక తినుచున్న | |
తే. | యెవ్వ రేరాజు లొనరించి రిట్టిపనులు? | |
సీ. | రాజకార్యపరుండు తేజోబలాధికుఁ | |
తే. | లంక సాధించితివి గాని లావుచేత | |
సీ. | నడువఁజాల దని జానకి నెత్తుకొని ముందు | |
తే. | కోప మిటు లేమి? వారు మహాపరాధు | |
సీ. | వరరాజ్యకాంక్షలోఁ బట్టకుండెద వైన | |
తే. | చేసిన ప్రతిజ్ఞలో నొండు వీస మైనఁ | |
సీ. | నిర్దయాత్ములె కాని నిత్యాగ్ని హోత్రాది | |
తే. | కులము బ్రాహ్మణ్య మగు దైత్యకులము నెట్లు | |
సీ. | ఒక్కవ్రేటునఁ గూలునో వాలి బలశాలి | |
తే. | యింద ఱాయంబు లెరుగుదు వందువలన | |
సీ. | మొసలిఁ బెట్టినకస్తి మొఱ్ఱ బెట్టినహస్తి | |
తే. | భవభయంబున నిన్నెంత ప్రస్తుతింపఁ | |
సీ. | నీచువాసనచేత నీటిలో నుండుట | |
తే. | మ్రానువై యుంట గుఱ్ఱపుమనిసి వంట | |
సీ. | ఖరు నాజిలోఁ జొచ్చి శర ముచ్చి పో నేయ | |
తే. | యశ మదెంతొ ప్రయాస లభ్యంబె కాని | |
సీ. | ఘోరకబంధుదీర్ఘోరుదోర్దండముల్ | |
తే. | కలిత రాజోపచార భోగములఁ గీర్తి | |
సీ. | నీ శాంతి యంభోధి నిర్భరాంబువులు బా | |
తే. | నెంచరాని గుణాఢ్యుఁడ వీవె యనుచుఁ | |
సీ. | జనకువాక్యమున రాజ్యవిసర్జనమె కాని | |
తే. | నిఖిల రక్షోవిదారణ నిర్భయాంక | |
సీ. | వెఱపించఁ గలవొ చేవిలు నీ కొసంగి తా | |
తే. | జగతి నిటు సంతతోత్సాహచరణమునకు | |
సీ. | ని న్నెదుర్కొన రాని నెపమునఁ గోపించి | |
తే. | ఎంతరోసంబు గలవాఁడ వేమి నీవు | |
సీ. | పరపురుషాకృత గురుతుగాఁ జూడక | |
తే. | సాహసుఁడ వైతిని న్నుంచి శంకరుండు | |
సీ. | సకల వర్ణంబులు సంకరంబులు జేసి | |
తే. | ననిశము చరాచరాది జీవావనైక | |
సీ. | భువనమోహన! కృష్ణమూర్తివి నీ వేని | |
తే. | యెంచ దేవర దైవమో యీవె కాని | |
సీ. | ఆలగాపరివాఁడ వనక నిన్నఖిలవే | |
తే. | పుడమి నీ దగు కొంచెపునడత లెంచ | |
సీ. | మామయింటికిఁ బోవ మంచితీర్థము పుట్ట | |
తే. | ఎవ్వరింటికిఁ బోయిన నేమి ఫలము | |
సీ. | దుర్జనభంజనోర్యుక్త సుదర్శన | |
తే. | సన్నుతామోఘ బాణైకశార్ఞ్గచక్ర | |
సీ. | ఇల్లు రత్నాకరం బెన్నాళ్ళకును జాలు | |
తే. | ధాత్రి నెవ్వరి రక్షించఁ దలఁచినావొ | |
సీ. | అబ్ధికన్యా వివాహ మహోత్సవము నాఁడుఁ | |
తే. | ననుచు నిట రాజ్యరమఁ బెండ్లియాడ | |
సీ. | అఖిలలోక స్థాపనాచార్యమణి వయ్యు | |
తే. | నిన్ను సేవింప రెవ్వరో పెన్నిధాన | |
సీ. | కైలాస మేరు సంకాశ నాగాశన | |
తే. | బరకృతోత్సవ మిచ్చట బ్రాఁతె నీకు | |
సీ. | కోరిక లీను వైకుంఠంబులోని | |
తే. | రామమూర్తికి వాంఛేతర ప్రపంచ | |
సీ. | గుఱుతుగ సద్భక్తకోటి కీనాఁటికి | |
తే. | జగము లన్నియు నీకు వశ్యము లటంటి | |
సీ. | వెనుక వేసుకొని యుర్వీనాథకోటులు | |
తే. | మనుజయత్నంబు బల మెంత మాత్ర మీవు | |
సీ. | జనితరంగాపారసంపరాబ్ధి నే | |
తే. | కేళి సంహర్షితాంతరంగికుడ వయ్యు | 102 |
సీ. | ఆగామి సంచిత ప్రారబ్ధము లటుండ | |
తే. | శేషపర్యంక! రాజ్యలక్ష్మీసహాంక | |
సీ. | ప్రాణులకర్మముల్ పరికింపఁ బదునల్గు | |
తే. | కలవు కల వని నీపాదకమలములకు | 104 |
సీ. | పూర్వకవీంద్రులు పుణ్యఫలం బేమి | |
తే. | కృపకుఁ బాత్రముఁ జేయు మక్షీణభాగ్య | |
సీ. | కావ్యదోషము లెఱుంగని మత్కవిత్వంబు | |
తే. | పతితుఁ జేపట్టినావు చేపట్టినావె | |
సీ. | శబరి యెంగిలిపండ్లు చవిఁజూచు ననుకంప | |
తే. | శతక మంగీకరింపుము జగతి జనకుఁ | |
సీ. | శతక మొకటి 'మనసా హరిపాదము | |
తే. | భవదనుగ్రహ కవితచేఁ బ్రబలువాఁడ | 108 |