భక్తిరసశతకసంపుటము/దాశరథిశతకము/190-191
ఉ. దారుణపాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తి వి
స్తార దవానలార్చికి సుధారసవృష్టి దురంతదుర్మతా
చార భయంకరాటవికిఁ జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!14
చ. హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై
కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై
పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!15
ఉ. ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్
గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే
తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!16
చ. "పరమదయానిధే పతిత పావననామ హరే"యటంచు సు
స్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమున దాల్తు మీరటకు జేరకుఁడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ!17
చ. అజునకుదండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
ద్ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా
డ్ధ్వజ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!18
ఉ. "పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా
ఖండలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో
దండకళాప్రవీణుఁ"డను తావక కీర్తివధూటికిత్తు బూ
దండలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ!19
ఉ. శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ!20
ఉ. .......
-------------------గలో జల మబ్బినట్లు దు