బ్రిటిష్ ఇండియా చరిత్ర
భారతదేశమున
బ్రిటిష్ రాజ్యతంత్ర యుగము
అను
బ్రిటిష్ ఇండియా చరిత్ర
"ఈ ప్రమాణములు ప్రోవు చేయుటకు శ్రీ దిగవల్లి శివరావుగారి కెన్నియో యేండ్లు పట్టియుండును. వీ రిందుల కెన్నియోగ్రంథములు .............. తేనెపెర పెట్టుటకు తేనెటీఁగ కెంతకాలము పట్టునో అది యెన్నెన్ని పూలబడి , తిరుగాడునో యెవరి కేమిపట్టె? ఎవరికిని తేనె పెరమీదనే : పెర పెర. అట్టి తేనెపెర ఈ గంథము.”
[శతావధాని వేలూరి శివరామశాస్త్రిగారి పీఠిక]
దిగవల్లి వేంకట శివరావు
బెజవాడ
పరిచయము
చరిత్రకారుఁడు సత్యశిల్పి. అతఁడు వాస్తవచరిత్రనే చిత్రించును. ఉన్నదున్నటులుగా చెప్పునదే చరిత్ర. అందు కల్లగాని కపటముగాని ఉండదు.
చరిత్రకారుఁ డనృతవాదిగాని పక్షపాతిగాని కాఁడు. అతఁ డట్టివాఁ డగునేని అతని జాతియంతయు అనృతమునఁబడి నీచజాతిగా మాఱును.
హిందూదేశము తెల్లవారిచేతులలోఁ బడెను. వారు తమ జయగీతములు పాడుకొని నల్లవారిచేఁగూడ పాడించు కొనిరి.
తెల్లవారు దొరలు, నల్లవారు బానిసలు. తెల్లవారు గురువులు, నల్లవారు శిష్యులు, తెల్లవారు గ్రంథకర్తలు, నల్లవారు అనువాదకులు.
చిన్ననాఁడు బడిలో నేను దేశచరిత్ర చదివితిని, హిందువులు నీచులనియు, తురకలు రాక్షసులనియు, తెల్లవారు దేవతలనియు నా కొక అభిప్రాయము కలిగెను. ఆ కాలమున నా తోడిబాలకు లందఱును ఈ చదువే చదివిరి.
"ఈ యేఁబది యేండ్లలో పుట్టిన దేశచరిత్రలకంటె నూఱు నూటయేఁబది యేండ్లకు మున్ను పుట్టిన దేశచరిత్రలలో ఏ యొండురెండో తక్క తక్కినవన్నియు పక్షపాతము లేనివనియు సమగ్రమయినవ”నియు సుప్రసిద్ధ చరిత్రకర్తలగు ఎడ్వర్‌డ్ థాంప్స౯, జి. టి. గారట్టులు వ్రాసిరి. అసత్యము దాఁగదుగద .సత్యము లన్నియు పుంఖాను పుంఖములుగా బయటఁబడుచున్నవి. విశేషించి ఆంగ్లేయుల నోటినుండియే యివి వెలువడుచున్నవి. అట్టి సత్యముల పుట్టయే ఈ "బ్రిటిష్ రాజ్యతంత్ర యుగము!"
ఈ ప్రమాణములు పోవుచేయుటకు శ్రీ దిగవల్లి శివరావు గారి కెన్నియో యేండ్లు పట్టియుండును. వీ రిందుల కెన్నియో గ్రంథములు చదివియుందురు. తేనెపెర 'పెట్టుటకు తేనెటీఁగ కెంతకాలము పట్టునో అది యెన్నెన్ని పూలబడి తిరుగాడునో యెవరి కేమీపట్టె? ఎవరికిని తేనెపెరమీఁద నే పెర పెర. అట్టి తేనె పెర ఈ గంథము.
కుంఫిణీవారు హిందూదేశమును స్వాహాచేయువఱకును ఇచట పలువురు రాజులు నక్షత్రములవలె వెదఁజల్లఁబడినటు లుండిరి. వీర లందఱతోడను వీరి ప్రజలతోడను వీరి ధనముతోడను గల సంబంధమే యీ గ్రంథము. కావున నిది కలగూర గంపవలెను కప్పల తక్కెడవలెను ఉండక తప్పదు.
ఇచట నొకొక్క రాజున కొకొక్క చరిత్రయు ఒకొక్క దేశమున కొకొక్క రాజనీతియుకలదు. ఇట్టి రాజులు పలువురు. ఇట్టి నీతులు పెక్కు, ఇట్టి హిందూ దేశచరిత్ర మొక మహారణ్యము. శ్రీ దిగవల్లి శివరావుగారు దివ్వెబూని ఈ యరణ్యమున నడచుచు నడుమ నడుమ మనకు పూవులను కాయలను పండ్లను గోసియిచ్చి మనలను నడిపించుచు తీసికొనిపోవు చున్నారు. మన కందఱకును సామాన్యముగా - తెల్లవారు కాలిడకముం దిచట నెందరు రాజులుండిరి? ఇచట ఏలుబడి ఎటులున్నది . ఇచటి ప్రజ యెట్టిది? ఇది యడవి దేశమా అన్యమా? ఇంగ్లీషువారు భుజబలముననే హిందూదేశమును జయించిరా ? తెల్లవారు కొల్లగొట్టిన ధనరాశి ఎచట మూల్గుచున్నది? మ్యూటినీలు ఏలవచ్చెను? కిరస్తానీమత మెటులు చొచ్చెను? అని యిటులు ప్రశ్న లనంతముగా తోఁచును. వీనికన్నిటి కీ పుస్తకమున సరియగు ప్రత్యుత్తరములు మనము పడయఁగలము.. ఇవికాక పంచాయతీల వినాశనము, బ్రిటిష్ వారి న్యాయవిచారణ, నూజవీడు అయోధ్య హైదరాబాదా బాకీలు, భూస్వామిత్వము, జమీందారీ రైతువారీ పద్దతులు, శిస్తులు, మిషనరీలు, గాజుల లక్ష్మీనరుసుగారు జాన్ బ్రూస్ నార్టను, ఉద్యోగములు, కాంగ్రెసు మొదలగు వజ్రశకలము లెన్నియోగనులనుండి యెత్తఁబడి ఇందు ఉల్లేఖింపఁబడినవి. 'కాసటబిసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగువారికి' ఈ గ్రంథము ప్రామాణిక మేకాక అభిరుచికి గూడ కాణాచి. .
అమృతాంజనముతోఁ గాని కాఫీతోఁగాని పనిలేకుండ ఒకగుక్కలో ఈ చరిత్రము నంతయు చదువఁగలిగించిన శ్రీ దిగవల్లి శివరావుగారు అభినందనీయులు.
వేలూరి శివరామశాస్త్రి
బెజవాడ,
ది 28 - 9 - 38.
BIBLIOGRAPHY
The History of British India. (10 Vols.) 1858 – James Mill
The History of British Empire in India. (6 Vols.) 1841 Fifth Report. -Edward Thornton
The Indian Empire. (3 Vols.) -- Montgomery Martin
A History of British India. -- Sir W. W. Hunter
The History of Hindusthan. :3 Vols.) 1803 -- Alexander Dow
The History of India, -- Marshman
History of India. (2 Vols.) 1893 -- Keene
Comprehensive History of India. (1865) - Beveridge
The Empire in India (1864) --Major Evans Bell
Retrospects and Prospects of Indian Policy (1868).
A History of Military Transactions in Indosthan from the year 1745 (3 Vols) 1861. - Robert Orme
The History of India as told by its own historians -Sir H. M. Elliot & T. Dowson
The Rise of British Power in the East 1887 --Elphinstone
The Company and the Crown - Hovell Thurlow.
Empire in Asia, How we came by it; A Book of Confessions --W. M. Torrens
Reform Pamphlets.
The Oxford History of India. - Vincent A. Smith
A History of British India. -P. E, Roberts
Rise of Christian Power in India. -- Major B. D. Basu
Consolidation of Christian Power in India,
India under the British Crown Rise and Fulfilment of British Rule in India.---Edward Thompson and G. T. Garratt
British Expansion in India. Anderson and Subedar
The Imperial Gazetteer of India. (Vols. I to IV)
A Constitutional History of India. - Prof. A. B Keith
Speeches and Documents on Indian Policy. (Vols. I & II).
Collected Works. -Edmund Burke
Impeachment of Warren Hastings. --Edmund Burke
The Law of Civilisation and Decay. - Brooks Adams
Annals of the East India Company. (3 Vols.) - John Bruce
Plans for British India.-J. Bruce Outlines of English Industries. -Cunningham & McArthur
History of the Afghans. (1838) -G. P. Ferrier
Life of Clive, -Malcolm
Considerations on Indian Affairs. (1772) - William Bolts
The Making of British India. - Muir
View of the Rise of the English Government in Bengal. Bishop Heber's Journal,
-[-H, Verelst
Political and Military Transactions in India. – Prinsep
Speeches (1878) - John Bright
History of British India, 2 Vols. 1859) --Ludlow
Thoughts on the policy of the crown towards India. --Ludlow
Essay on Clive. -Macaulay
Essay on Warren Hastings. - Macaulay
Rise of the Mahratta Power. - M, G, Ranade
History of the Mahrattas, --Grant Duff
Mughal Administration. --J. N. Sarcar
History of the Great Mughals. - Kennedy
Sher Shah. -K. Quanungo
A Memoir of Central India. - Sir John Malcolm
History of Bengal. --Captain Stewart
Administration of Justice under the Musliın Rule. Rulers of India series. - Wahed Hussain
India under Early British Rule. --Romcsh Chunder Dutt
The Economic History of India, "
The Victorian Age. "
Private Journal of Moira (Lord Hastings) "
Wellesley Correspondence. -Garwood
War with Tippu. - Major Edward Moor
Narrative of War with Tippu Sultan. -Dirom
England's Quest of Eastern Trade. -Foster
The first Englishmen in India. -R. C. Locke
Vestiges of Old Madras. -HD. Love
Echoes from Old Calcutta. -H. E. Busteed
Life of Sir Thomas Munro. (3 Vols) 1831 -GR. Gleig
India: its administration and progress. -Sir John Strachey
Diary of Ananda Ranga Pillai .(12 Vols)
Private Letters of Marquess of Dalhousie. -J. G. A. Baird
The Marquis of Dalhousie's Administration of British India. -Sir Edwin Arnold The story of my life, -Meadows Taylor
The History of the Indian Mutiny. -Charles Ball
My Diary in India. -Sir Howard Russell
History of the Indian Mutiny. -Kaye and Malleson
The Indian Mutiny of 1857. --Col. G. B. Malleson
The Expansion of England. - J. R. Seeley
The New Spirit in India, -H, W. Nevinson
India. -Keir Hardy
New India. -Sir Henry Cotton
Prosperous British India. -Sir. W. Digby
Lord Curzon, a failure. -C. J. O'Donnel
Recollections, --Lord Morley
The Awakening of India. --Ramsay Macdonald
Young India, -Lala Lajpat Rai
Unhappy India. "
England's debt to India. "
Forty one years in India. --Lord 'Roberts
A Nation in the Making. - Surendranath Bannerjee
An Indian Diary. -E. S. Montague
An authentic account of the condition of the Ryot-submitted to the Secretary to the Board of Control (1854.)
Indian Nation Builders. (3 Vols.) 1 - John Bruce Norton
Mahatma Letters. --A. P. Sinnet
Letters of Madame H. P. Blavatsky to A. P. Sinnet.
How India Wrought for l'rcedom. - Dr. Annie Besant
Indian National Evolution - A, C, Muzumdar
History of the Indian National Congress. --Dr. Pattabhi.
Life and Experiences of a Bengali Chemist.--Dr.P.C. Ray
Speeches and Writings of Gokhale; Lokamanya Tilak. Naoroji; Surendranath Bannerjee; & Mahatma Gandhi. Presidential Addresses of the Indian National Congress. Biographies of Eminent Indians --G. A. Natesan & Co.
Eminent Orientalists "
Biographies in Telugu). Ch. Lakshmi Narasimham garu.
The Modern Review.
విషయసూచిక.
ప్రథమభాగము
ఇంగ్లీషు దొరతనము : చారిత్రక సమీక్ష
1600 - 1937
మొదటి ప్రకరణము
బ్రిటిష్‌యుగమునకు పూర్వమునాటి భారతదేశస్థితి 1 - 20
పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/10 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/11 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/12 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/13 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/14 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/15 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/16 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/17 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/18 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/19 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/20 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/21 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/22 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/23 పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/24 భారత దేశమున
బ్రిటిష్ రాజ్యతంత్ర యుగము
ప్రథమ భాగము:
ఇంగ్లీషు దొరతనము - చారిత్రక సమీక్ష
1600-1937
మొదటి ప్రకరణము
బ్రిటీషు యుగమునకు పూర్వమునాటి భారతదేశ స్థితి.
I
భారతదేశమున బ్రిటీషు ప్రభుత్వము స్థాపింపబడక పూర్వ మీదేశ మధోగతిలో నుండెననియు, ఆ ఘోర దుస్థితినుండి తామీదేశము నుద్దరించితిమనియు, బ్రిటిషుసామాజ్య తత్వవాదులు పలుకుచుందురు; బ్రిటిషువా రీదేశమున కాలిడు నప్పటి కీ దేశస్థితి యెట్లుండెను? పదునారవ శతాబ్దిలో భారత దేశమున మొగలాయి చక్రవర్తులేలిన సామ్రాజ్యము ప్రపంచమున చాల సుప్రసిద్ధ మైనది. ఐరోపాఖండమున నే రాజు క్రింద నందరు ప్రజలు లేరు. ఏ ప్రభుత్వమునకును నంత రాబడి లేదు. ఐరోపాలోని జగత్ప్రసిద్ధకట్టడములను జూచిన విదేశీయులు గూడ హిందూస్థానమునందలి చక్రవర్తులు నిర్మించిన సుందర హర్మ్యములనుజూచి ముగ్ధులైపోవుచుండిరి. ఐరోపాసామ్రాజ్య ముల విభవములనెరిగినవారు కూడ ఢిల్లీసింహాసనము చుట్టు నానాడుండిన యలంకారములను పరివారమునుజూచి ముక్కుల పై వ్రేళ్ళిడికొనుచుండిరి. ఆనాడు మొగలాయి చక్రవర్తుల ఫర్మానాలు పొందిన రాజప్రతినిధుల పరిపాలనమున ఫ్రెంచి దేశపు రాజుక్రిందగాని జర్మనీ చక్రవర్తి పరిపాలనమునగాని యుండినంతమంది ప్రజలుండిరి. వారి రాబడులును వారివానితో సమానము లైనవే.
బ్రిటిషుప్రభుత్వము స్థాపింపబడక పూర్వము పదునాల్గు పదునారవ శతాబ్దములనాటి హిందూ దేశస్థితిని ఆంగ్ల చరిత్ర కారుడగు ఎల్ ఫిస్ స్టస్ వర్ణించియున్నాడు: “ఫిరోజిషా యొక్క చరిత్ర కారుడు (1351-1394) ఆనాటిరైతు లనుభవించు సౌఖ్యమునుగూర్చియు, నాటి గృహములు, అందలి గృహోపకరణములు, వస్తుజాలమును గూర్చియు, నాటి స్త్రీలు వెండిబంగారు నగలు విరివిగా నుపయోగించుటను గూర్చియు, చిత్రవర్ణనలెన్నో చేసినాడు. ఇతని కతిశయోక్తు లన్న ప్రీతియేగాని, ఇత డనేక సంగతులు చెప్పుచు రైతుల ఇండ్లనంటి యొక్కొక్క చిన్నతోట యుండెననియు వివరించుట చూడగా నాటి ప్రజలు సౌఖ్య మనుభవించుచుండిరనుటకు సందియము లేదు. ఆనాడు ప్రజాపీడన మనునది యావంతయైన నున్నట్లు గానరాదు."
నాటి భారతదేశము ఔన్నత్యస్థితిలో నుండెనని 1420 లో దేశములో తిరిగి చూచిన 'నికోలోకోంటీ' చెప్పుచున్నాడు. గుజరాతులోను, గంగా తీరమునను జూచినవిశేషము లితడుత్సా హముతో వర్ణించినాడు. చక్కని యుద్యానవనములుగల పట్టణములు సుప్రసిద్ధములైన నాలుగు గొప్పనగరములు ‘మారజియా' చేరులోపల నితడు చూచినాడు. ఈనగరము ధన కనక వస్తు వాహనములతోను నవరత్నములతోను నిండి యుండెనని వర్ణించియున్నాడు. 16 వ శతాబ్ద ప్రారంభమున దేశమును జూచిన బార్బోసా, బర్టెమాలు లీ సంగతులు నిజ మని నుడువుచున్నారు.
బార్బోసా, క్యాంబేనగరమును వర్ణించుచు అదిచక్కని నగరమనియు, అదిఫలవంతమైన దేశమనియు, వివిధజాతుల వర్తకులతోను, పారిశ్రామికులతోను, వస్తునిర్మాతలతోను నిండియుండెననియు వ్రాసినాడు. 1340-1350 మధ్య మహ్మద్ బిన్ తుగ్లకునాటి ప్రజాపీడన కాలమున దేశమును దర్శించిన ఇబిన్ బట్యూటాకూడ, ఆనాడు తాను జూచిన జనసంకీర్ణములైన మహానగరములు వర్ణించి దేశము అశాంతిలో మునుగక పూర్వముండిన ఔన్నత్యమును సూచించినాడు.
పదునారవ శతాబ్దియారంభమున నేటి పాశ్చాత్యులవలెనే భారతదేశముపట్ల సానుభూతిలేని బేబరుచక్రవ ర్తి ఈ భారతదేశము చాలధనవంతమగు గొప్పదేశమనియు, నిది వెండిబంగారులతో తులదూగుచున్న దనియు వర్ణించి, దీని జన బాహుళ్యమును వివిధ వృత్తులందు పరిశ్రమలందు జీవించు అసంఖ్యాక పారిశ్రామికులను జూచి యచ్చెరువందినాడు. బేబరుచక్రవర్తి అనేక జలాశయములను నీటివనరులను నిర్మించినాడు. క్రొత్త ఫలజాతులు వేయించినాడు. మహమ్మదీయుల వశముగాకుండ ఇంకను హిందూరాజుల వశమున నే యున్న దేశభాగ మింతకన్న తక్కువ భాగ్యవంతముగ లేదు. విజయనగరసామ్రాజ్యమును దర్శించినవా రెల్లరు దాని విభవమునుజూచి యాశ్చర్యపడుచుండిరి. ఢిల్లీ కనోజినగరములతో సరిపోలు నా నగరవిభవము, ఆరాజుల యఖండ వైభవము, శిల్పపోషణ, కవిపోషణ, సైనిక బలములు, కొలువుకూటములు, స్త్రీ పురుషులు ఆభరణములు ధరించుట, వారి సౌభాగ్యము, నగరములోని శిల్పము, విరివియగు వర్తకము, ధనరాసులుగల యంగళ్ళను (1420-21) ఇటాలియను వాడగు నికోలోకోంటీ, 1522 లో పోర్చుగీసు వాడగు పేయసును, ఉన్నిజు (1535-37) మధ్యను, పెర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ (1443-44) మధ్యను వర్ణించినారు. ఆ కాలమున జనసంకీర్ణములగు నితర మహానగరములుగూడ పేర్కొనబడియున్నవి. “ఇబి౯బట్యూటా' దక్షిణ దేశములో అప్పుడే మహమ్మదీయులు జయించిన మధురానగరమును వర్ణించియున్నాడు. అది ఢిల్లీ నగరమువలె నుండెనట. ఈ గ్రంథకర్తయే తాను రెండు నెలలు మలబారులో ప్రయాణము చేయగా సాగులోలేని భూమి కనపడలేదన్నాడు. గృహస్థులందరికిని తోటలు, దొడ్లు, ఆవరణములు నుండెనట. నాటి రేవుపట్టణములు కన్నులపండువుగ నుండెను. తూర్చుపడమటి సముద్రతీరములనుండిన రేవుపట్టణము లెల్ల మహానగరములుగ నుండెను. ప్రపంచములోని అన్ని దేశములనుండియు వర్తకు లిచ్చటికి వచ్చి నెలకొనుచుండిరి. అరేబియా, ఆఫ్రికా, పెర్షియా, చైనాలతో వర్తకము విరివిగా సాగుచుండెను. ఇదిగాక దేశములో నాటువర్తకము విరివిగా జరుగుచుండెను.
షర్షా దేశములోని రాజబాటలనెల్ల బాగుచేసెను. కాని ఇతనికి రెండువంద లేండ్లక్రిందట దేశమును చూచిన ఇబిన్ బట్యూటా హిందువుల పరిపాలనలో నుండిన మలబారులోని బాటలెల్ల బాటసారుల కుపయోగకరముగా చెట్లనీడలతోను, అచ్చటచ్చట విశ్రాంతిగృహములతోను, నూతులతోను చాల సౌఖ్యముగా నుండెనని వర్ణించి యున్నాడు.
బేబరుచక్రవర్తి యీ దేశమునకు వచ్చి చూచిన నాటికి రివిన్యూ ఆదాయము వసూలు చేయు ఉద్యోగులు, వర్తకులు, పనివారు అందరును హిందువులుగ నుండిరని అతడే వ్రాసినాడు. (Erskine's Baber -232).
పోర్చుగీసువారు 1497 లో భారతదేశమునకు వచ్చిరి. వారి ముఖ్యోద్దేశమువ్యాపారలాభములార్జించుట. ఆనాటిపశ్చిమ దేశముల వ్యాపార మెల్ల కళ్ళికోటలోనే నెలకొని యుండెను. అచ్చటినుండి పెర్షియను జలసంధినుండి కన్‌స్టాంటినోపిలుకుగాని జెడ్డానుండి సూయజు ఆలగ్జాండ్రాలద్వారాగాని జర్గుచుండెను. అచ్చట వెనీసువర్తకులు భారతదేశ సరకులనెల్ల ఐరోపారేవుల కెగుమతి చేయుచుండిరి. ఆనాడు కళ్ళికోట ఒక అంతర్జాతీయ రేవుపట్టణముగ నుండెను. అచ్చట నొక (సీజను) వ్యాపార తరుణములో 1500 నౌకలు వచ్చి పోవుచుండెను. వివిధమతముల వారి కిచ్చట మతస్వేచ్ఛ యుండెను. 17 వ శతాబ్దములో టెవర్నియరు. భారతదేశమంతట తిరిగి చూచి చాలకుగ్రామములందు సైతము ధాన్యములు, పిండి, వెన్న, పాలు, చిక్కుడుకాయలు, ఇతర కూరగాయలు, పంచదార, ఇతరమిఠాయిలు పుష్కలముగా దొరుకుచుండెనని వ్రాసినాడు . దీనివలన రైతులస్థితి యెంతబాగుండెనో గ్రామజీవన మెంత సుభిక్షముగా నుండెనో తెలియగలదు.
కృష్ణ దేవరాయలసామ్రాజ్యము కన్యాకుమారియగ్రము మొదలు కృష్ణా తుంగభద్రానదులవరకు . వ్యాపించెను. వారి పలుకుబడి తూర్పున కటకమువరకు పడమర సాల్సెటి వరకు నుండెను. ఈ విజయనగర సామాజ్యము పోర్చుగీసు వర్తకము వలన చాల లాభము పొందెను. పన్ను లేకుండా వర్తకముచేసికొనుటకును, కోటయొకటి కట్టుకొనుటకును పోర్చు గీసు వారికి కృష్ణ దేవరాయ లనుజ్ఞ నిచ్చెను. ఆ కాలమున విజయనగరము ప్రపంచములోని నౌకావాణిజ్యము చేయు వివిధ జాతులవారితో నిండి ఒక అంతర్జాతీయ పట్టణమువలె నుండెను. ఈజిప్టు పారశీకము మొదలగుతురుష్క దేశ రాజులతో వర్తక సంబంధముండెను. సమస్త సరకులలోను విదేశీయవ్యాపారము జరుగుచుండెను. ఏనుగుల గుర్రముల వ్యాపారమును పోర్చుగీసువర్తకులు విరివిగా జరుపుచుండిరి. ఆసామ్రాజ్యమున 300 రేవుపట్టణములుండెను. విజయనగరమున ఒక్కొక్క సరకు కొక్కొక బజారుండెను. పుష్పముల రాసులు రత్న రాసులు గల అంగళ్ళుండెను. ఆనగరములో చిత్రలేఖనము, శిల్పము, లోహ కళలు, శిలానిర్మాణములు, చెక్కడము, దంతపుబనులు, సంగీతసాహిత్యములు విరివిగానుండెను. ఇటువంటి మహాపట్టణమును ఇంతవర కెవ్వరు ప్రపంచములో నింకొకచోట కనివిని యుండలేదని అబ్దుల్‌రజాకు వర్ణించి యున్నాడు.
కృష్ణ దేవరాయలు తన సామ్రాజ్యమును తన సామంత మండలేశ్వరులక్రింద విభజించెను. వీరు తనకు రమారమి పది లక్షల సైన్య మంపునట్లు కట్టడిచేసెను. రైతులనుండి పంటలో ఆరవవంతు మాత్రమే మండలాధిపతులు పన్నుగా వసూలు చేసి దానిలో విజయనగర చక్రవర్తికి సగమువంతు చెల్లించునట్లు బందోబస్తుచేసెను. పంటలకు, సరకులకు సరసమయిన ధరలు నిర్ణ యించి పన్నులు రొక్కరూపముగా వసూలుచేయునట్లు ఆజ్ఞాపించెను. పోర్చుగీసు ఇంజనీయర్ల సహాయమున పెద్ద పెద్ద చెఱువులు త్రవ్వించియు, ఆనకట్టలను కట్టించియు వ్యవసాయ మభివృద్ధి గావించెను.
కృష్ణ దేవరాయల రాజ్యాదాయము 1300 లక్షల బంగారు వరహాలని 16వ శతాబ్దములోని ఒకవిదేశీయ బాటసారి అంచనా వేసినాడు. ఆసామ్రాజ్యము యొక్క సైనికబలములు చాలమంచి శిక్షణమందియుండి లక్షలకొలది సైనికులెల్లప్పుడు యుద్ధసన్నద్ధులుగానుండిరని చూచిన వారు వర్ణించినారు. విజయనగర సామ్రాజ్యము పూర్వహిందూసంప్రదాయముల ప్రకారము పరిపాలింపబడుచుండెను. సర్వమతములపట్ల సహనము చూపబడుచుండినను, రాజులు హిందూమతావలంబులై నేటి మైసూరువలె మతధర్మములపట్లను, గురుపరంపరపట్లను భక్తి చూపుచుండిరి. విద్యారణ్య గురుపరంపరపట్ల మర్యాద జరుపబడుచుండెను. సామ్రాజ్యముయొక్క కేంద్రపరిపాలన చక్రవర్తి స్వయముగానే జరుపును. ఇరువదిమంది మంత్రులు, 9 మంది ముఖ్యదండనాధులు, పదునొకండుమంది సామంతులు నుండిరి. యుద్ధమంత్రి, న్యాయపరిపాలన మంత్రి, కోశమంత్రి మున్నగువారి క్రింద వివిధశాఖల కార్యదర్శులు నేటి డిపార్టుమెంటల్ శెక్రటరీలవలే నుండిరి. ఈ ప్రభుత్వము రాష్ట్రీయ మండలాధిపతుల పరిపాలనను కని పెట్టి చూచుచుండెను. 200 మంది సామంతమండలేశ్వరులు చక్రవర్తికి కప్పములు కట్టుచుండిరి. గవర్నరులవంటి మండలేశ్వరులకు సాలుకు 3 లక్షలు ఆదాయమునుండి 15 వేలవరకు ఆయాపదవియొక్క గౌరవమును బట్టియుండెను.
స్థానికపరిపాలన కేవలము గ్రామపంచాయతులద్వారా జరుగుచుండెను. 1565 నాటికీ సామ్రాజ్యమున 12600 గామములుండెనని శిలాశాసనములవలన తెలియుచున్నది. ప్రతిగ్రామము యొక్క భూస్వామిత్వపద్ధతి ఆ గ్రామసంఘముయొక్క అధికారముక్రిందనే యుండెను. గ్రామ సంఘముసకు సభ్యులు అధికారులు వేరుగానుండిరి. ఈ గామసంఘముల వారే భూవిషయిక వివాదలను పరిష్కరించుచుండిరి. దుర్మార్గములు చేసిన ఉద్యోగుల భూములు వశముచేసికొనుచుండిరి. గ్రామోద్యోగుల తగాదాలు పరిష్కంచుచుండిరి. పల్లపునీటి సాగుకు, నీటివనరులకు రోడ్లకు కట్టడములకు ప్రత్యేకోద్యోగులుండిరి. గ్రామోద్యోగులపైన 'పారుపత్యగారు' లనబడు అధికారులు నాడులనాయకుల అధికారము క్రిందనుండి గ్రామములపైన పై పెత్తనము కలిగియుండిరి. ఈ నాయకులపైన 'కార్యకర్త 'యను సామ్రాజ్యాధికారియే పై పెత్తనము వహించును. దక్షిణమున మధురలో మాత్రము ' పాళెగారు' లను సైనికనాయకులొక క్రొత్త పద్దతిస్వపరిపాలన స్థాపించిరి. 72 పాళెముల పాళెగార్లు సైనికాధికారులుగనుండి ' నేరగాండ్రను, కొండజాతులను, విదేశీయులను అదుపులో నుంచిరి. వారు దేశాదాయములో మూడింట రెండువంతులు తీసికొని మూడవవంతు నాయకులకు పంపుచుండిరి.
అక్బరునాటి మొగలుసామ్రాజ్య విభవము జగత్ప్రసిద్దము. ఈచక్రవర్తి ఎంతగొప్పరణశూరుడో అంతగొప్ప పరిపాలకుడు. అతనివిజ్ఞానసంపద, సర్వమతసహనము, ఔదార్యము, దాతృత్వము క్షమ, ధైర్యసాహసములు వర్ణనాతీతములు. అతడు న్యాయవిచారణలో అగ్నిప్రమాణ పరీక్ష మొదలగు క్రూరపద్దతులు, జంతువధ, బలి, యుక్తవయస్సురాక పూర్వము వివాహము జేయుటను సిషేధించెను. మహమ్మదీయులతో పాటు హిందువులకు సమానముగా నుద్యోగము లిచ్చెను. యాత్రీకుల పైన తలపన్ను తీసివేసెను. యుద్ధమునబట్టుకున్న వారిని బానిసలుగ జేయుపద్ధతి నిషేధించెను. షర్షాప్రారంభించిన ఆర్థికదవ్య సంస్కరణలు పూర్తిచేసెను. భూములనెల్ల కొలిపించి పంటలనుబట్టి తరములనిర్ణయించెను. ధాన్యపుశిస్తును రొఖ్కసిస్తుగా మార్చి రైతు కేది వీలుగనున్న ఆ ప్రకారము శిస్తుచెల్లింప వీలు కలుగజేసెను. బాధకరములగు అనేక పన్నులను రుసుములను తీసివేసెను. దీనివలన ప్రభుత్వమునకు ప్రజలు చెల్లించు సొమ్ములో చాలసొమ్ము తగ్గెను. ఇటాలియను బాటసారి పీట్రోడెల్ వల్లె 1623లో నిట్లు వ్రాసినాడు. “సాధారణముగా ప్రజలందరు మర్యాదగా జీవించుచున్నారు. దేశములో మంచి సంరక్షణ కలదు. రాజు అనవసరమగు నేరారోపణములుచేసి ప్రజాపీడన చేయడు. ఎవరైన సుఖముగా సంపద ననుభవించుటను జూచి వారిని పీడింపడు.” (Reform Pamphlet)
అక్బరు మనుమడగు షాజహాను పరిపాలన మొగలాయి సామ్రాజ్యచరిత్రయం దుత్కృష్టమైనది. దేశము సుభిక్షముముగానుండి శాంతిని సత్పరిపాలనము ననుభవించెను. 1615లో సర్‌తామన్‌రో మొగలుదర్బారుకు ఆంగ్లరాయబారిగావచ్చి అచ్చటి మహావైభవముల జూచి ముగ్ధుడై పోయినాడు. నాటి చక్రవర్తి జహంగీరు శిబిరమున రెండు ఎకరముల ప్రదేశము, పట్టుజరీ తివాచీలతో పరుపబడియుండెను. విలువగల చాందినీలు కట్టబడియుండెను. నవరత్న ఖచితమై ప్రపంచమున కనివిని యెరుగని నెమలిసింహాసనమును నిర్మింపజేసిన షాజుహాను సింహాసనమున నధిష్ఠించిన నాటి అఖండవిభవమును జూచిన టెవర్నియరు షాజహాను తన పట్టాభిషేకమప్పుడు నవరత్నములు బంగారునాణెములతో తులాభారము తూగి వానిని జనమధ్యమున వెదజల్లెనని చెప్పుటయేగాక ఈ చక్రవర్తి కేవలము సామాన్యుడగు రాజువలెగాక తన కుటుంబమును ప్రేమతో దిద్దుకొను తండ్రివలెనే పరిపాలించెనని వర్ణించినాడు. కందహారు దండయాత్రకు తక్కిన యుద్ధములకు గావలసిన సొమ్ములెల్ల ఖర్చుచేయగా షాజహాను చనిపోవు నాటికి 24000000 పౌనుల రొఖ్కమును ఇంకను బంగారు వెండి కడ్డీలును జవాహిరీయు మొగలు ఖజానాలో నిలువయుండెను. ఔరంగజేబు చనిపోవునాటి కెంత ఖర్చు అయిపోయినను నాదర్ షా ఢిల్లీ ప్రాంతమునుండి 1757 లో ఎంతసొమ్ము కొల్ల గొని తీసికొనిపోయిననుకూడ దేశ మింకను భాగ్యవంతముగనే యుండెను. నాడు దేశపరిపాలనము గూడ చాల కట్టుదిట్టముగ జరుగుచుండెను.
మొగలాయి చక్రవర్తియగు అక్బరు కాలమున నా సామ్రాజ్యము వివిధ సుభాలు (రాష్ట్రములు)గా విభజింపబడి ఒక్కొక్కసుభా కొక్కొక్క గవర్నరు నియమింపబడెను. ఇతని కా రాష్ట్రములో పూర్తియైన సివిలు మిలిటరీ అధికారము లన్నియు నుండెను. దేశములో ముందుగా భూములను కొలచి (పయిమాషీ) సర్వే చేయించి భూమిపైన యకరమున కింత పండినదని నిర్ణయించి దీనినిబట్టి శిస్తుతరము నిర్ణయింపబడెను. అక్బరుకాలమున మొదట నిది ప్రతిసాలున జరుపబడెను. తరువాత నిది 10 సంవత్సరముల కొకమారు జరుగు చుండెను. స్థానికజిల్లా రివిన్యూ వసూలు అధికారిని అమల్ గుజా రని వ్యవహరించిరి. ఈ అధికారికి బ్రిటిషు జిల్లాకలెక్టరు జిల్లా మేజస్ట్రీటుకుండిన పోలీసు నేరవిచారణ అధికారము లుండెను. ఈ యుద్యోగికి నేటి కలెక్టరుతో చాల పోలికలు గలవు. ఇతడు రైతు బాంధవుడుగ ప్రవర్తింపవలెనని ఉత్తరువు లుండెను. దురవస్థలోనున్న రైతులకు ఋణము లివ్వవలసిన బాధ్యతయు నితనికి కలదు. స్థానికబొక్కస మితని యధీన మున నుండెను. ఎప్పటికప్పుడు సొమ్ము ఇరసాలు చేయుచుండవలెను. ప్రతినెల ప్రజల స్థితిగతులను విశేషములను ధరలనుగూర్చి ఒక నివేదిక పంపవలెను. అక్బరుకాలమున గ్రామములయొక్క పరిపాలన న్యాయవిచారణ పూర్వము వలెనే పంచాయితీలే జరుపుచుండెను. ప్రతిపట్టణమున నొక "కొత్వాలు" అనబడు మేజస్ట్రీ టుండెను. ఇతడు పోలీసు అధికారిగానుండి పరిపాలనావ్యవహారములన్నియు జరిగించును. పట్టణములకు బయట దేశములో క్రమమగు పోలీసు ఫౌజు లేదుకాని గ్రామములకు వంశపారంపర్యముగా కావలివా రుండిరి. ఈ మేజస్ట్రీటులేగాక న్యాయవిచారణకొరకు “మిర్ అదల్" అనబడు న్యాయాధిపతియుండెను. ఇతడు న్యాయవిచారణలో తీర్పుచెప్పు అధికారి. మహమ్మదీయ ధర్మాధికారియగు ఖాజీకూడ ఒక న్యాయాధికారియేగాని ఇతడు ధర్మశాస్త్రము జెప్పి వ్యాజ్యము నడిపించును. " నేనే అన్యాయము చేసినగూడా నేను దానినిగూర్చి న్యాయవిచారణ చేసితీరెదను" అని అక్బరుచక్రవర్తి పలికియుండెను. అక్బరు చక్రవర్తి న్యాయవిచారణ చేయుట కొరకు ప్రతిదినము ఉదయము 9 గంట లైనతరువాత దౌలతుఖానా యను కొలువుకూటమున కూర్చుండి దావాలను అప్పీళ్ళను విని పరిష్కరించును. ఆసమయమున నాయన సమక్షమున కెల్లరు వెళ్ళవచ్చును. ఒక్కొక్కప్పు డీ న్యాయసభ సాయంత్రముగూడ జరుగును. మధ్యవా రెవ్వరివలన నెట్టి యాటంకము లేకుండా అర్జీలను స్వయముగా స్వీకరించుట కొర కాయన దౌలతు ఖానాలోనికి తెరచియుండు కిటికీదగ్గరకు తరచుగావచ్చి నిలుచుండును. అర్జీల నాయన స్వయముగా విచారించి తీర్మానించును.
షాజహాను ఔరంగజేబులు బుధవారమునాడు సామాన్యదర్బారు మానివేసి సభలో పరివేష్టించి న్యాయవిచారణ జేయుచుండిరి. దర్శనగవాక్షమునుండి తిన్నగా దివానీఖాస్ మందిరమునకు ఉదయము 8 గంటలకు చక్రవర్తి వచ్చును. న్యాయోద్యోగులు, ఖాజీలు, “అదళ్ళు" అనున్యాయాధిపతులు, మప్టీలు, ఉలేమాలు, న్యాయశాస్త్రజ్ఞులు “దరోగా-ఈ-అదాలత్" అనబడు కోర్టుల పెత్తనదారుడు, కొత్వాలు అనబడు పట్టణపోలీసు అధికారియు తప్ప సామాన్యసభాసదుల నామందిరమునకు రానీయరు. న్యాయాధికారి ఫిర్యాదీల నొక్కొకరినే చక్రవర్తి కెఱుక పరుపగా నాయన శాంతచిత్తుడై వారి మనవులను విచారించి శాస్త్రధర్మమును తెలిసికొని తీర్పుచెప్పును. (J. N. Sarkar-Mughal Administration quoted by Wahed Hussain 38–40). జహంగీరు చక్రవర్తియొక్క కొలువుకూటమున ముఖ్యముగా నెన్నదగినది, మనవిదారులు తమ అర్జీలను నిర్భయముగా చక్రవర్తికి అందచేయుటకొరకు ఆగ్రా కోటయొక్క షా బురుజుకు కట్టబడిన బంగారు గొలుసు గంటలు. దీని రెండవకొన నదీతీరమున నొకశిలాస్తంభముకు గట్టబడియుండును. మనవి దారులు తమ అర్జీల నాగొలుసుకు గట్టినచో సేవకులయొక్క ఆటంకము లేకుండా ఆ గొలుసు పై కిలాగి చక్రవర్తి స్వయముగా చిత్తగించుచుండును. నిష్పక్ష పాతముగ న్యాయము ప్రసాదించుట చక్రవర్తి కంత ప్రీతి. పాజహాను చక్రవ ర్తి కేవలము తన ప్రజలను కన్నతండ్రివలెనే యాదరించి న్యాయపరిపాలన చేయుచుండెను. సాష్టాంగ దండప్రణామము చేయుట నితడు మాన్పించి ప్రతి బుధవారమును అర్జీలను స్వయముగా వినుచుండెను. (Eliot- History of India Vol VII. P. 170–3) ఔరంగజేబు చక్రవర్తి రాజ్యాధికారము సౌఖ్యముకొరకు కాదనియు ప్రజాక్షేమము కొరకే యనియు నిశ్చయించి నిష్పక్షపాతమగు న్యాయవిచారణ చేయుచుండెను. దర్శనమందిరమున శాంతవదనముతో దినమునకు రెండు మూడుసార్లు వచ్చి నిలిచి మనవుల చిత్తగించును. ప్రజలు నిర్భయముగా తమబాధ లాయనకు జెప్పుకొనుచు న్యాయము పొందుచుండిరని ఇలియట్ తన చరిత్రలో వాసినాడు. (Vol. VII. 158) “ఈచక్రవర్తి చాల తెలివైనవాడు. రాజుయొక్క యధికారము ప్రజల యభివృద్ధిపైన నాధారపడి యుండునని ఇత డెరుగును. తన ప్రభుత్వముయొక్క క్షేమము నాలోచించి యితడు ప్రజాపీడనమును సహింపక తన పరిపాలన చక్కగా జరుగుచున్నదో లేదో అని కనిపెట్టుచుండెను. వ్యవసాయమును వాణిజ్యమును ప్రోత్స హించుచుండెను. ఆయన వరిపాలనలో ప్రతిచోటను ఆస్తికి రక్షణయుండెను. పూర్వపరిపాలనమునందు కన్న గూడా న్యాయవిచారణ ప్రజలకు సులభసాధ్యము గావించెను. దావాలు త్వరలో పరిష్కరించునట్లు చేసెను. ఈయన కాలమున ఉరిశిక్షయే గానరాదు. తనకు వ్యతిరేకముగా తన సోదరుల పక్షము వహించినవారిని కూడా ఆయుధవిసర్జన చేయగానే ఇతడు క్షమించుచుండెను. (History of India - Alexander Dow) తన సింహాసనమునకు మొప్పము కలుగునట్లు చరించిన బందుగులయెడల తప్ప తక్కినవా రందరిపట్ల నితడు చాల ఉదారుడుగ నుండెను. శిక్షించుటయన్న అతని కిష్టములేదు. పుర్రెలతో విజయస్తంభములు నిర్మించుట, జనవధలుచేయుట, మొగలువంశపరిపాలన ప్రారంభదినము లందువలె కౄరకృత్యములుచేయుట యితనికిష్టము లేకుండెను. (Kennedy: History of the Great Moghals)
కేవలము మొగలు చక్రవర్తులేగాక ఆకాలమునాటి సుబేదారులుకూడా నిష్పక్షపాతముగా న్యాయవిచారణ చేయుచుండిరి. వంగరాష్ట్రన బాబు మూర్షిద్‌కూలీఖాను ధర్మపరిపాలనకొరకై తనకొమారుడుచేసిన నేరమున కతని కురిశిక్ష విధించెను. త క్రింది యుద్యోగులన్యాయము చేసినట్లు తెలిసినచో తాను పునర్విచారణచేయును. ఎంతదరిద్రుడైనను ఆయనవలన న్యాయము పొందగలుగుచుండెను. ( Stewart: History of Bengal)
విజయనగర సామ్రాజ్యమునను మొగలు సామ్రాజ్యముననుగూడ ప్రజలు శాంతిభద్రతలు గలిగి సుఖముగా నుండిరి. ఆకాలమున వ్యాజ్యములు వివాదలు హెచ్చుగా లేకపోవుటకు కారణము ఆనాటి ప్రజలకు నేటివలె కోర్టు వ్యాజ్యములయం దాసక్తి లేక పోవుటయె. న్యాయశాస్త్రము యొక్క గుంటచిక్కులు, అందలి జూదరితనమును వారెరుగరు. ఆదినములలో దేశము బలమైన ప్రభుత్వముక్రింద శాంతిభద్రతలతో సుభిక్షముగనుండెను. సాధారణ వివాదలును, కులకక్షలును గ్రామపంచాయతులవలన నే పరిష్కరింపబడు చుండెను. గ్రామ ప్రజలపైన వానికి గొప్ప పలుకుబడియుండెను. గ్రామ స్వపరిపాలనా స్వాతంత్యమునకు మొగలు ప్రభుత్వమెట్టి భంగము కలిగింపలేదుసరికదా దానినింకను ప్రోత్సహించి గ్రామవ్యవహారములన్నియు పంచాయతీ కే వశముచేసియుండెను. (Administration of Justice under Muslim Rule: Wahed Hussain P.46)
భారతదేశమున నింగ్లీషుకోర్టులు వృద్ధియైనకొలదియు అబద్ధపు సాక్ష్యములు అందువలన న్యాయపరిపాలనలో కలుగు అన్యాయములు వృద్ధిజెందెనని చరిత్రకారులు చెప్పుచున్నారని జాన్‌బ్రైట్ ఉపన్యాసములందు చెప్పినాడు. (Vol. II. P. 42.)
బొంబాయిరాజధాని ఇంగ్లీషువారిచేతిలో పడునాటి కచ్చట మహారాష్ట్రపరిపాలనావిధాన మమలులో నుండెను. విజయనగర సామ్రాజ్యాధీశుల ఆంధ్రపరిపాలనా పద్ధతులనే శ్రీఛత్రపతిశివాజీయు నాయన తరువాత పరిపాలించిన పీష్వాలును అవలంబించిరి. (Tilak's speeches 31–3–18 Gokhale Hall) అష్టప్రధానుల ప్రభుత్వమని యత్యంత ప్రఖ్యాతిగాంచిన పరిపాలనా విధానము నాంధ్రసామ్రాజ్యము నుండియే గ్రహించిరి.
ఈ మహారాష్ట్ర పరిపాలనను ధ్వంసముజేసినది ఎల్ ఫిన్ స్టన్ అను నాంగ్లేయ రాజ్యతంత్రజ్ఞుడు. మహారాష్ట్రపద్ధతుల నెల్ల రూపుమాపిన పిదప నితడే మరల నాంగ్లేయప్రభుత్వ కంపెనీక్రింద నారాష్ట్రమునకు కమీషనరుగ నియమింపబడెను. తన పరిపాలనలో నితడు కొంత ఉదారభావమును జూపి ఆంగ్ల విద్యాపద్ధతులు స్థాపించి దేశీయుల కాంగ్లపరిపాలనపై భక్తి గలిగించుటకు ప్రయత్నించినాడు. ఇతడు వ్రాసిన సంగతులను బట్టియే పీష్వాలకాలమునాటి పరిపాలన ఎంతచక్కగా నుండెనో తెలియగలదు. పీష్వాప్రభుత్వ కాలమున పుసహా యొకమహానగరము. ఇంతటి గొప్పనగరమున గూడ నొక్క బందిపోటయిన జరిగియుండలేదన్నచో దేశ మెంత శాంతిసౌఖ్యముల ననుభవించుచుండెనో తెలియగలదు. మద్యపానము పూర్తిగా నిషేధింపబడెను. నేటి రివిన్యూపరిపాలనలో ప్రసిద్దిజెందిన జమాబందీ పద్దతిని మొట్టమొదట స్థాపించినవాడు నానాఫర్నవీసు అను మహారాష్ట్ర పరిపాలకుడే ! దానినే తరువాత బ్రిటిష్ పరిపాలకు లవలంబించిరి. రాజ్యపరిపాలనకు సంబంధించిన లెక్కలు, ఆదాయవ్యయపట్టికలు, జమాఖర్చు లెక్కలు మొదలగునవి తయారు చేయుపద్ధతులు గూడ నాకాలముననే ప్రారంభింపబడినవి. నానాఫర్నవీసుచే నియమింపబడిన గూఢచార్లు పోలీసుభటులు, ఏసర్దారు ఎప్పు డే మనుష్యునితో ఏమి మాట్లాడినది గూడా ఆయనకు తెలియబరచుచుండిరి. అయితే దేశభక్తుల నేదో విధముగా బంధింపదలచు నేటి సి. ఐ. డి. లకు నాటి గూఢచారుల కెంతో భేదముకలదు. నేటి ప్రభుత్వ పద్ధతులలో చాలవరకు పీష్వాలకాలమునాటివేగాని పద్దతుల యుపయోగములో మార్పులున్నవి. పీష్వాలపరిపాలనలో ప్రజలకు గ్రామస్థులకు నుండిన పలుకుబడి యిప్పుడు పోయి ఉద్యోగులయధికారములు హెచ్చుచేయబడి అధికారుల జులుము మితిమీరినది. సర్వాధికారియగు కలెక్టరు ప్రజాపాలకుడైనాడు. (చూడు : లోకమాన్యతిలకు ఉపన్యాసములు)
II
ఔరంగజేబుచక్రవర్తి పరిపాలనముననే మొగలు సామ్రాజ్యనాశకారణము లేర్పడెను. ఈభూపాలుడు క్రీ.శ. 1707న చనిపోవగనే ఈ కారణములు మరింత వృద్ధిజెందెను. ఔరంగజేబు చనిపోయినపిదప నలుబది సంవత్సరములలోనే మొగలు సామ్రాజ్య మంతరించెనని చెప్పవచ్చును. ఔరంగజేబుని యనంతరము మొగలాయి సింహాసనము నెక్కిన రాజులెల్ల అంతఃపురమునందు సురాపానలోలురై భంగుమత్తునను, వార వనితలసల్లాపములందును, విదూషకుల సంభాషణలతోను ప్రొద్దుపుచ్చుచుండిరి. హిందూదేశమునకు పశ్చిమోత్తరమున నున్న కనుమలనుండి క్రూరజాతులవారు వచ్చిపడి భారతీయుల భాగ్యమును కొల్లగొనుచుండిరి. పెర్షియా దేశపు వీరు డొకడు భరతఖండము జొచ్చి, ఢిల్లీ ప్రవేశించి, భరతఖండమునందు కాలిడుటకు తావిమ్మని మనచక్రవర్తుల నడుగవచ్చిన రాయబారుల కచ్చెరువు గొలిపిన మయూరసింహాసనమును బట్టుకొనిపోయెను. పెర్షియావారు మొదలిడిన నాశనమును ఆఫ్‌గనులు పూర్తిచేయసాగిరి. మొగలాయి సార్వభౌమత్వమును రాజపుత్రులు నిరాకరించిరి. సిక్కులు సింధునదీ ప్రాంతముల నేలసాగిరి. దిన వెచ్చములకు పోరాడుసైనికులు కొందరు రోహిలుఖండము నాక్రమించిరి. యమునానదీతీరములందు జాబురాజపుత్రులు విజృంభించిరి. భరతఖండమున పశ్చిమతీరమున, భరతఖండము నేకచ్చత్రముగ నేలదలచినవారి నెల్లర ధిక్కరించి బ్రిటిషువారితోకూడ నెన్నో ఘోరయుద్ధములుచేసి బ్రిటిషువారి యదృష్టవశమున తుదకు లొంగిన వీరాతివీరుల (మహారాష్ట్ర) జాతి ఔరంగజేబు కాలములోనే బయలు దేరెను. ఔరంగజేబుని యనంతర మాతని సామ్రాజ్యమునందెల్ల మహారాష్ట్రుల పేరుమ్రోగెను. ఈ జాతి మొగలాయిరాజప్రతినిధుల ననేకుల నడచివేసెను. దక్షిణ భరతఖండమునెల్ల వీ రాక్రమించిరి. పూనాలో, గ్వాలియరులో, గుజరాతులో, బీహారులో మహారాష్ట్రనాయకులు పాలింపసాగిరి. అప్పుడప్పుడు చుట్టుపట్లకు మరాటీదండ్లు వచ్చి గ్రామములను కొల్లగొనుచుండెను. ఈ దాడులను జూచి భయపడి కర్షకులు గ్రామములు వదలి యరణ్యముల కేగుచుండిరి. పెక్కు పరగణాలు వీరికి కప్పములుగట్టి వీరిబాధ తప్పించుకొనసాగెను. పేరునకు మాత్రము చక్రవర్తి బిరుదమును ధరించిన మొగలు వంశీకుడగు నిర్భాగ్యుడుకూడ వీరికి లంచ మిచ్చుకొనవలసివచ్చెను. ఈ మరాటీదండు ఢిల్లీ కోటగోడలకు దగ్గరగనే విడిసెను. ఇంకొకదండు ఏటేటను బంగాళాదేశమునందలి సేద్యపు భూములలో విడియుచుండెను. ఐరోపావర్తకు లీ మరాటీదండులవలన తమగిడ్డంగుల కే ముప్పుగల్గునో యని వణకుచుండిరి.
హిందుదేశమున మొగలాయి రాజప్రతినిధు లెచ్చోట నైన బలవంతులుగనుండిరేని వారే స్వతంత్ర ప్రభువులగు చుండిరి. పేరునకుమాత్రము మొగలాయి చక్రవర్తికి కప్పముగట్టు సామంతరాజులుగ నుండిరి. చక్రవర్తి కెప్పుడై న నజరానాలంపిన కద్దు, లేనిచో లేదు. వారికి కావలసినచో ఏదైన గొప్ప బిరుదమును చక్రవర్తివలన నందుచుండిరి. వీరు వంశపరంపరముగ నేలుచుండిరే గాని చక్రవర్తి యిష్టము వచ్చినప్పుడు వీరిని తొలగించుటకు వీలు లేకుండెను. ఇట్లే బంగాళమును, కర్నాటకము నేలిన మహమ్మదీయ నవాబుల వంశీయులును, హైదరాబాదు నేలు నైజామువంశము నుద్భవించినవి.
ఎన్నటికైన నీకల్లోల మంతమగునా? భరత ఖండమున శాంతియుత ప్రభుత్వము మరల నెలకొల్పబడునా? యను ప్రశ్నల కేజ్యోతిష్కుడును ప్రత్యుత్తర మీయజాలకుండెను. హిందూదేశమును మహారాష్ట్రులేలుదురో మహమ్మదీయు లేలుదురో, లేక "మొగలుచక్రవర్తులవంశము యొక్క మూలపురుషునివంటి వీరు డెవడైన నేకొండలోయలనుండియైన వచ్చునో యనుకొనిరే గాని, భరత ఖండముసకు పది వేలమైళ్ళ దూరముననున్న ద్వీపమునుండి వర్తకము చేయుట కొరకు వచ్చిన వణిజ సంఘము వా రొకశతాబ్దము లోపుగనే హిమాచల ప్రాంతములనుండి కన్యాకుమారివరకుగల దేశమునెల్ల చల్లగ కాజేసి ఏకచ్ఛత పరిపాలనమును స్థాపింతురని ఎవ్వరును కలనైన తలపరైరి.
రెండవ ప్రకరణము
బ్రిటిష్ ఇండియా నిర్మాణము.
I
బ్రిటిష్ వారీ దేశము నాక్రమించిన విధము.
ఆంగ్లేయులు భారతదేశమునకు వర్తకము చేయుటకొరకు 1600 సం||లో పట్టాపొందివచ్చి మెల్లగా దేశాక్రమణముజేసి అచిరకాలముననే బ్రిటిష్ సామ్రాజ్యమును స్థాపించిన విచిత్ర పరిణామమునకు ప్రపంచచరిత్రలో నింకొక యుదాహరణము గానరాదు. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనము అప్రయత్నముగా, తలవని తలంపుగా జరిగినదని పొఫెసర్ సీలీపండితుడు చెప్పుమాటలు సరికావు. భారతదేశమున తను ఆధిపత్యమును సుస్థిరముగా నెలకొల్పవలెనను నుద్దేశము ఆంగ్లేయ వర్తక కంపెనీవారి డైరెక్టరులకు 1687 లోనే కలిగినదని సర్ విలియం హంటరుగారు తమ బ్రిటిష్ ఇండియాచరిత్ర రెండవకూర్పు పీఠికలో వ్రాసియున్నారు. అయితే వారు తలపెట్టినది రాజకీయాధిపత్యముగాక వాణిజ్యాధిపత్యమే యని అతని తలంపు. భారతదేశమున ఆంగ్లేయులు జరిగించిన చర్యల వలన వాణిజ్యాధిపత్యము రాజకీయాధిపత్యమునకు దారితీసినదని స్పష్టమగుచున్నది. భారతదేశమున వర్తకలాభములతోపాటు రాజ్య సంపాదనకూడ కంపెనీవా రభిలషించిరనుటకు లిఖితా ధారములు కలవు.
1689 లో నింగ్లాండునుండి కంపెనీ డైరెక్టరులు భారతదేశములోని కంపెనీయధికారుల కిట్లువ్రాసిరి. "వ ర్తకలాభము వలెనే భూములపై నవచ్చు రివిన్యూ (ఆదాయము) కూడా వృద్దిచేయవలయు ననియే మా యభిప్రాయము. వర్తకములో వేయి విపత్తులు కలిగినను మనలను రక్షింపగలట్టి దీ రివిన్యూ ఆదాయమే. దానివలననే ఇండియాలో మనమొక బలవంతమగు జాతిగా నిలువగలుగుదుము. లేనియెడల మనము దేశములో వర్తకము జేసికొనుటకు పట్టానొందివచ్చిన పరాయివారిగనే యుందుము. అట్టి స్థితిలో నితరుల కెవ్వరికిని పనికిరానిచోట్ల మాత్రమే మనము వర్తకము చేసికొనవలసి వచ్చును."
భారతదేశమును ఇంగ్లీషువారు తమ భుజబలముచేత నెన్నడును జయింపలేదు. ఈ దేశరాజులను నవాబులను నొకరిపై నొకరిని పురికొల్పి అందరిని నాశనముజేసియే వారు రాజ్యాక్రమణము జేసిరి. "మొట్టమొదట ఆర్కాటు నవాబును అణచుటకు కంపెనీవారికి నైజాము సహాయము జేసెను. తరువాత నైజూము నణచుటకు ఆర్కాటు నవాబు సాయపడెను. ఇట్లే మహమ్మదీయుల నణచుటకు మహారాష్ట్రులును, మహారాష్ట్రుల నణచుటకు మహమ్మదీయులును కంపెనీవారికి తోడ్పడిరి. తిరిగి ఈ పద్ధతి తప్పకుండా హిందువుల నణచుటకు ఆఫ్‌గనులును ఆఫ్గనుల నడచుటకు హిందువులును కంపెనీవారికి తోడ్పడిరి. ఈ దేశము నింగ్లీషువారికి చేజిక్కించుటకు మన దేశరాజులయొక్కయు నవాబులయొక్కయు భుజబలమే.- అంతఃకలహలము లే కారణములయ్యెను. ఇంకొక విశేష మేమనగా నీ మహాసామ్రాజ్యమును స్థాపించుటలో నింగ్లీషువారి కొక్క చిల్లిగవ్వయైనను ఖర్చుకాలేదు. ఈ బ్రిటీషువారు నిజముగా భారతీయుల ధనముతోను భారతదేశ వర్తకముతోను దేశాక్రమణము జేసిరి. ఇంగ్లీషువా రీదేశమును తమఖడ్గబలమువలన జయించలేదు. కేవలము కుటిలోపాయమువలన జిత్తులవలన రాజ్యతంత్రప్రయోగము వలననే జయించిరి. నిజముగా బలప్రయోగముచే నీదేశము నాక్రమించుటకు వారు బహిరంగముగా ప్రయత్నించియుండినచో నీ దేశములో నాటికి బలవంతులై యుండిన రాజులుఏకమై వీరిని పారదోలియుందురు. ఆంగ్లేయులు చాలా తెలివితేటలతో తమరాజ్యతంత్రమును ప్రయోగించిరి. దేశములోని రాజులలోను నవాబులలోను వైరములు బుట్టించి యెవరిపక్షముననో చేరి తాము లాభమును పొందుచుండిరి. నిజముగా నాంగ్లేయులకు 1687 నాటికే సామ్రాజ్యకాంక్ష యుండెను. గాని పైకి తమకురాజ్యకాంక్ష లేదనియు కేవలము వ్యాపారలాభము నార్జించుటయే తమ యుద్దేశమనియు చెప్పుకొనుచుండిరి. దిగ్విజయముచేసి సామ్రాజ్యము స్థాపింతునని క్లైవు 1765 లో చెప్పినప్పుడు డైరెక్టర్లు ఖర్చు భరింపలేమనిరి. ఆనాటి రాజులు నవాబులు ఆంగ్లేయులనుజూచి మోసపోయిరి, ఒకరికన్న నింకొకరు వీరి సహాయమును పొందుచు వీరికి హెచ్చు సౌకర్యముల నివ్వసాగిరి. వీరందరును పోరాడుకొని దుర్బలులై పోయినపిదప నాంగ్లేయులు నిజస్వరూపమును జూపించిరి. ఇట్లు భారత దేశాక్రమణమును ఆంగ్లేయవర్తకులు తమకు వీలైనట్లుగను దమ్మిడీ ఖర్చు లేకుండగను జేసిరి.
భారత దేశమందు కంపెనీ వారి అధికారము పలుకుబడి నానాటికి హెచ్చసాగెను. రాజ్యతంత్రము ప్రయోగించి మొగలాయి చక్రవర్తిని లోబరచుకొనిరి. నవాబులను చేతిలో పెట్టుకొని కీలుబొమ్మలవలెనాడించుచుండిరి. పేరునకుఆచక్రవర్తి ఆనవాబులు దేశాధికారులుగాని నిజమైన అధికారులు కంపెనీ వారే. అయినను చాలారోజులవరకు దేశముయొక్క సామాన్య పరిపాలనగాని, శాంతిభద్రతలను గాపాడు పోలీసు అధికారము గాని, న్యాయవిచారణచేయు అధికారముగాని కంపెనీవారు వహించలేదు. అది తమచేతిలోని కీలు బొమ్మలకే వదలి కేవలము పన్నుల వసూలు అధికారముమాత్రమే తాము వహించిరి. నవాబులకు పరిపాలనకు సొమ్ము లేనందున వారది నిర్వహింపలేక పోవుచుండిరి. ఈ పద్ధతి చాలకాలము నడచిన పిదప దేశములో తాము నిలిపిన కీలు బొమ్మల నూడలాగి ప్రభుత్వాధికారములను కంపెనీవారే వహించిరి. కంపెనీ డైరెక్టరులు నియమించిన గవర్నరులే దేశపరిపాలకులైరి. ఈ పరిపాలనలో కూడా పాతపద్ధతులు మానలేదు. ఏదోమిష పైన యుద్ధముచేయుట ఆయుద్దవ్యయము తమ కీలుబొమ్మ నవాబులపైననో ప్రజలపైననో వేయుట, రాజ్యాక్రమణము చేయుట యీరాజ్యమునెల్ల తమ లాభముకొరకు పరిపాలించి లాభము నందుట కారంభించిరి. తమకు లోబడి కప్పములు గట్టిన నవాబులను రాజులుగా కొన్నాళ్లు ఏలనిచ్చుచుండిరి గాని వారివద్ద నుండి ధనములాగుకొని పీల్చి పిప్పి జేసి యేదోమిష పైన వారి రాజ్యము లాగికొనుచుండిరి. అనేక స్వదేశరాజులు భయపడి తామే లోబడి కప్పములు కట్టసాగిరి. మిత్రభేద ములు, కుటిలతంత్రములు ప్రయోగింపబడుచుండెను. కప్పము కట్టలేదనియో, యేదో లోపము జరిగినదనియో, ఔరసుడు లేడనియో, నింకేదోమిషపైననో కొందరి రాజ్యములు లాగి కొనుచు దేశమును ఇంగ్లీషుపరగణాలుగా చేయుచుండిరి. ఇట్లు క్లైవు వార౯ హేస్టింగ్సులు ప్రారంభించిన కుటిలరాజ్యతంత్రము అత్యద్భుతముగా ప్రయోగించబడి నేటి బ్రిటిషు పరగణాలును స్వదేశసంస్థానములునుగల బ్రిటిష్ ఇండియా నిర్మించబడెను.
ఆంగ్లేయ వర్తకుల కోపులు కొఠీలు కోటలయ్యెను. వీరి ఫ్యాక్టరీ గుమాస్తాలు కలెక్టరులైరి. వీరి ముఖ్యాధికారులు గవర్నరులైరి. వీరుకాపలా కొరకు పెట్టిన రెండువందల సిపాయీలు రెండులక్షల సైన్యములయ్యెను. వీరి వ్యాపారపు టోడలు యుద్ధనౌకలయ్యెను. చూచుచుండగనే వర్తకముజేసికొను సంఘమువారు దేశపరిపాలకులైరి. స్వతంత్రభారతము బ్రిటిష్ ఇండియాగా మారిపోయెను. ఈమార్పు ఒక్క సారిగా జరుగలేదు. కొన్నియేండ్లలో జరిగినది. బలవంతముగా గాక అప్రయత్నముగా జరిగినట్లు జరిగినది. 1857 వరకు కంపెనీపరిపాలనకాలమున భారతదేశము నిజమునకు బ్రిటిషుఇండియాగా నున్నను సిపాయి విప్లవా నంతరము 1858 లో ఆంగ్లరాజమకుటము క్రింద పాలితరాజ్యముగా ప్రకటింపబడిన పిదపనే ఇది సాక్షాత్తుగా బ్రిటిష్ రాజ్యమైనది.
II
బ్రిటిష్ ఇండియా నిర్మాణచరిత్ర
బ్రిటిష్‌వారు రాజ్యాధిపత్యము సంసాదించు నప్పటి కింకను దేశము నిమిత్తమాత్రముగా మొగలుచక్రవర్తిక్రిందనే యుండెను. గాని వివిధభాగములను పరిపాలించు రాజులు నవాబులు స్వతంత్రులుగ నుండిరి. ఉత్తరమున వంగరాష్ట్రము, బీహారు, ఒరిస్సాపరగణాలు వంగరాష్ట్ర నవాబుక్రింద నుండెను. అతని ముఖ్యపట్టణము మూర్షిదాబాదు. అయోధ్య, నవాబు వజీరుక్రింద నుండెను. ఇతనిక్రింద కాశీరాజు మొదలగు అనేక సామంతు లుండిరి. మొగలు సామ్రాజ్య రాజధానియగు ఢిల్లీలోను రాజపుత్రస్థానము మధ్యరాష్ట్రములు పశ్చిమకనుమలందును మహారాష్ట్రుల యాధిపత్యముండెను. దక్షిణహిందూస్థానమున హైదరాబాదునవాబు పరిపాలనక్రింద ఆర్కాటు నవాబు, తంజావూరు రాజు, మైసూరుసంస్థానము నుండెను. పశ్చిమోత్తర హిందూదేశము మొగలుచక్రవర్తి పరిపాలనలోనే యుండెను. బ్రిటిషువారు నెలకొనునప్పటి కీభాగము శిక్కులక్రిందికి వచ్చెను. వారినుండి బ్రిటిషువారు దీనిని లాగికొనిరి. సింధురాష్ట్రము అమీరులక్రింద నుండెను.
ఈ విశాలదేశము బ్రిటిషువారి అధికారముక్రిందికి వచ్చిన కథ చాల చిత్రమయినది. ఎట్లువచ్చినదో దక్షిణ హిందూదేశమునుండి చూతము.
తంజావూరు
తంజావూరు అనేక శతాబ్దములనుండి స్వతంత్రరాజుల పరిపాలనక్రింద నుండిన చిన్న రాజ్యము. 1741 లో ప్రతాపసింహు డీ రాజ్యసింహాసనము నధిరోహించెను. ఆ నాడు ఫ్రెంచివారితో పోటీగానుండిన ఆంగ్లవర్తకకంపెనీవా రీ రాజుతో స్నేహము జేసికొనిరి. కొద్దిరోజులలో నీ ప్రతాపసింహుని సోదరుడు ఆ రాజ్యసింహాసనమును సంపాదించుటకు తనకు సాయపడినచో దేవికోటను, ఒక జాగీరును ఇచ్చెదనని ఆంగ్లేయులతో రాయబారము నడిపెను. అంతట వీరు దాని కాసపడి మిత్రద్రోహము చేయుటకుగూడ వెనుదీయక ప్రతాపుని సింహాసనభ్రష్టుని చేయుటకొరకు సైన్యమునంపిరి గాని యీ ప్రయత్నము విఫలమయ్యెను. మరల నింకొక సైన్యమునంపి దేవికోటను పట్టుకొని తమ్ము దేవికోటలో కదలకుండ, నుండనిచ్చినచో తమ క్రొత్తస్నేహితుని విడనాడుటయేగాక అతనిని బంధించి యుంచెదమనియు అతనికి కొంత భరణము నివ్వవలసినదనియు ప్రతాపునితోనే బేరముబెట్టిరి. భారతదేశమున బ్రిటీషువారు రాజ్యాక్రమణ కొరకు చేసిన ధర్మయుద్ధములలో నిదియే మొదటిది.
తంజావూరు కర్నాటక నవాబు క్రింది సామంతరాజ్యము. ఈ కర్నాటక నవాబుపై యధికారి దక్షిణహిందూస్థాన సుబేదారుడు. అనగా మొగలాయి చక్రవర్తియొక్క దక్షిణరాష్ట్రపాలకుడగు హైదరాబాదు నవాబు. ఆనాడు ఆంగ్లేయులకు ఫ్రెంచివారికిని వ్యాపారములో పోటీగానుండెను. ఫ్రెంచివారికన్న తాము హెచ్చులాభము పొందవలెనని తలచియే ఆంగ్లేయులు దేవికోట నాశించియుండిరి. 1754 లో ఆంగ్లేయులును ఫ్రెంచివారును సంధిజేసికొనగా నిక నీ కర్నాటక నవాబురాజ్యమున కీ విదేశీయులవలన నేబాధలు కలుగవని తలచిరి, గాని త్వరలోనే ఇది పొరబాటు అని తేలినది. ఆంగ్లేయుల స్నేహితుడగు మహమ్మదాలీ కర్నాటకనవాబుగా నంగీకరింపబడెను. అంతట నతనికి గప్పములివ్వక తిరుగుబాటుచేయుచున్న కొందరు హిందూసామంతరాజుల నణచుటకు ఆంగ్లేయులు తలపెట్టిరి. పాండుచేరీలోని ఫ్రెంచివారు దీనికి తమ యసమ్మతిని తెలిపిరి. అంతట కలహములు కలిగెను. ఫ్రెంచివా రోడిరి. ఫ్రెంచివారితో చేసిన యీ యుద్దముకొరకు ఆంగ్లేయులకైన ఖర్చుల క్రింద కర్నాటకనవాబు ఆంగ్లేయవర్తక కంపెనీవారికి సాలుకు 280000 పౌనులు లేక 28 లక్షలరూపాయల చొప్పున నిచ్చునట్లు విధించి 1763 లో నతనితో నొక సంధి పత్రము మీద సంతకము చేయించిరి. కొన్ని భూములయొక్క శిస్తులను ఆదాయమును ఈ బాకీక్రింద జమకట్టు ఏర్పాటుతో ఆ భూములను కంపెనీ కిచ్చునట్లు కంపెనీవారు నవాబుతో ఏర్పాటు జేసిరి. నవాబు మారుమాటాడకుండ దీనికఁగీకరింపవలసి వచ్చెను. నవాబువలన జాగీరులందిన ఈ జాగీరుదారులే నిజముగా నవాబునకు యజమానులుగానుండిరి. ఆంగ్లేయులు దక్షిణ హిందూస్థానమున నడుగిడునప్పుడు వీరికి నిలువనీడలేదు. వారికి మొట్టమొదట సహాయము చేసినవాడు కర్నాటక నవాబు. తరువాత వారి విరోధులగు ఫ్రెంచివారితో యుద్ధములందు సహాయము జేసినవాడు నితడే.
ఇట్టి ఆప్తమిత్రుడు ఆ శతాబ్దము పూర్తియగునప్పటికి ఆంగ్లేయవర్తక కంపెనీవారి చేతిలో కీలుబొమ్మ స్థితికి దిగిపోయెను. ఆకంపెనీనౌకరుల దయాధర్మములపై నాధారపడ వలసిన వాడయ్యెను. లార్డు వెలస్లీ యీ నవాబుతో మరల నొక సంధియేర్పాటు గావించునాటి కీ నవాబు ఆంగ్లేయుల స్నేహపు వలలో జిక్కి వారిరక్షణ యురిత్రాళ్ళలో బాధపడుచు అసహాయుడై యుండెను. అతనిరాజ్యముయొక్క మేనేజిమెంటు కంపెనీవారిచేతిలో నుండెను. ఇప్పు డీ క్రొత్తసంధివలన నతని రాజ్యముయొక్క ఆదాయములో నైదువంతులలో నాల్గువంతులు కంపెనీవారికి శాశ్వతహక్కుగా నిచ్చి వేయబడెను. మిగిలిన ఐదవవంతు ఆదాయ మీ నవాబుపోషణకొరకు ప్రత్యేకింపబడెను. ఇట్టీనవాబు వీరిచేతిలో మనువర్తిదారుడైనాడు. పాతస్నేహము కృతజ్ఞతలను బట్టి ఈ భరణమును నవాబు దర్జాయు మాత్ర మీ దురదృష్టవంతుని కింకను గొన్నాళ్ళు మిగిల్చియుంచిరి. గాని 1853 నాటి గవర్నరుజనరలగు డల్‌హౌసీకి ఈ పూర్వకాలపు మర్యాదయు, ఈ దర్జాయు, మనువర్తియు, అర్థములేనట్లుగా కనబడి కంపెనీడైరక్టర్లతో ఆలోచించి ఈ కృతజ్ఞత ప్రహసనము నంతటితో నంతమొందింప దలచి అప్పటి కర్ణాటక నవాబు తదనంతరము వచ్చిన అజిం పానీబిరుదు వహింపవలదని నిషేధించి అతని కీయవలసిన ఐదవవంతు ఆదాయము నిచ్చుటకు నిరాకరించెను. 'శాశ్వతసంధి'పత్రనియమములు గూడా అవి పరిపాలించుట యవసరమని తమకు తోచినంతకాలమే గాని, తరువాత తాము మన్నింపవలసిన పనిలేదని ఈ గవర్నరు జనరలు సూత్రీకరించెను.
బ్రిటిషువారితో సంధిచేసికొనిననవాబు 1792 లో చనిపోగా ఆనాటి పరిస్థితులనుగూర్చి మిల్లు తన బ్రిటిషుఇండియా చరిత్రలో నిట్లు వ్రాసినాడు “అయోధ్యయు కర్నాటకమును పూర్వము చాల భాగ్యవంతములైన రాజ్యములు. బ్రిటిషు ప్రభుత్వముయొక్క పలుకుబడి క్రిందికి వచ్చినతరువాత దుష్ట పరిపాలనవలన భారతదేశములోని తక్కిన ఏభాగమునను గానరాని దౌర్భాగ్యస్థితికి వచ్చినవి. వీనిదుస్థితికి ప్రపంచములోని ఏ భాగమునను పోలికలేదు. ఈ ఘోరస్థితి బ్రిటిషు సంపర్క మువలన నెట్లు గలిగినది ?” (Mill's History of British India Book VI. 51-52.) ఈ ప్రశ్నకు జబాబు 1792 లో నవాబుతోడి సంధినిగూర్చి వెలస్లీ పరిపాలనకాలమునాటి చరిత్రకారుడగు వెల్లింగ్ట౯ వ్రాసిన మాటలలోనే కనబడును. బ్రిటిషువా రిండియాలో చేసిన ఈమాదిరి సంధు లన్నిటియందు వలెనే ఈ సంధియందుకూడ నొక్క ప్రధానమగు అనర్థకముకలదు. నవాబుయొక్క ఆంతరంగిక వ్యవహారములలో కంపెనీవా రెట్టి జోక్యము కలిగించుకొనరాదను నొక నియమముకలదు గాని ఈపరిపాలనను నిలిపియుంచుటకొర కీ కంపెనీ వా రెల్లప్పు డేదో జోక్యము కలిగించుకొనుచునే యుండిరి. ఇంకొక ముఖ్యమైన అసర్ధక మేమనగా కంపెనీవారి కిచ్చుకొన వలసిన సొమ్మును గడువులోపల నిచ్చుకొనుట కీ నవాబు తక్కినవారివలెనే పెద్ద వడ్డీ కప్పు పుచ్చుకోవలసి వచ్చుచుండెను. మరియు నా రాజ్య భాగములందలి శాసన ధర్మవిధులు కంపెనీవారి ఫోర్టుసెంటుజార్జి కోటలోని సివిలు మిలిటరీ యాంగ్లేయ జనులనలన నిర్మింపబడి అమలు జరుపబడుచుండెను. ఇందువలన అనర్థకము లసంఖ్యాకములుగ నుండెను. 1792 సంవత్సరపు సంధిషరతులు అమలు జరుగ నారంభించినది మొదలు పెన జెప్పిన అనర్థకములను సంస్కరించుటకును, కంపెనీవారి ఆదాయమును బందోబస్తు చేసికొనుటకును వలసిన మార్పులను చేయవలెనని ప్రతి గవర్నరును నవాబును కోరుచుండెను గాని నవాబు దీని కంగీకరింపలేదు. ఈ పద్ధతినలన దేశాదాయము క్రమక్రమముగా క్షీణించిపోవుచుండెను. ప్రజాపీడన మధికమై ప్రజలలో అశాంతి ప్రబలుచుండెను. ఇట్టిస్థితిలో కంపెనీవారికి టిప్పుసుల్తానుతో యుద్దము తటస్థించెను. అంతట వెలస్లీ యీ కర్నాటకమును బ్రిటిషురాజ్యములో కలుపుకొనదలచెను. దానికొక నెపము సులభముగనే దొరికెను. ఈ కర్నాటకనవాబు తన ప్రక్క రాజగు టిప్పుతో నుత్తరప్రత్యుత్తరములు జరుపుచున్నాడనియు ఇవి సంధి షరతులకు భంగకరమనియు నందువలన కంపెనీవారు తమ క్షేమముకొరకు వలసినచర్య గైకొనుట కర్హులనియు . నిర్ణయించి పైనచెప్పిన ప్రకారము కర్నాటక నవాబును మనువర్తిదారుగ జేసివైచెను. వెలస్లీయొక్క ఉత్తరువులు మద్రాసుకు చేరునప్పటికి అప్పటి కర్నాటక నవాబు ఓమ్‌దల్‌ఉమ్రా అనారోగ్యముగ నుండి తన వ్యవహారములు చక్కబెట్టుకోలేని స్థితిలో నుండెను. తరువాత కొద్దిరోజులలోనే చనిపోయెను. అంతట నీ నవాబు టిప్పుతో ఉత్తరములు నడుపుచుండెనను సంగతియు అందువలన బ్రిటిషుప్రభుత్వమువారు తీసికొన నిశ్చయించిన చర్యను గూర్చియు అతని కొమారునికి తెలియపరచిరి. చిన్న నవాబు దీని కంగీకరింపలేదు. అంతట ఆ యువకుని త్రోసిరాజని క్రొత్తషరతులకు అంగీకరించు పద్ధతిని అతని తమ్ముని కర్నాటక నవాబుగ జేసిరి!
III
మైసూరు
మైసూరు మొదట హిందూరాజ్యము. హైదరాలీయను మహమ్మదీయ సైనికుడు తన తెలివి తేటలవలన నా రాజ్యము సింహాసనము సధిష్టించి పాతరాజును మనువర్తిదారుగ జేసెను.
బ్రిటిషు ప్రభుత్వమువారు హైదరాలీతో సంధిజేసికొని స్నేహముచేసిరి. అయితే మైసూరురాజ్యములోని ఓడ రేవగు బారామహలు నింగ్లీషువారు అక్రమముగా పట్టుకొనగా హైదరాలీకి కోపమువచ్చెను. అతడు మద్రాసు మీదికి దాడివెడలి ఆంగ్లేయులు తసకనుకూలమగు సంధి కొడబడునట్లు చేసెను. దీనివలన నతనిని ఎవరైన నెదిరించినచో నింగ్లీషువారు ఏడుసిపాయి పటాలముల నతనికి సహాయ మంపవలెనని నిర్ణయింపబడెను. . 1778 లో బ్రిటిషువారు ఫ్రెంచివారితో యుద్ధముచేయుచు పాండుచేరీనిపట్టుకొని మైసూరులోచేరిన 'మాహి'ని ముట్టడించిరి. హైదరాలీ తన అసమ్మతిని చూపినను వినలేదు. అంతట నతడు కర్నాటకములోని ఆంగ్లప్రదేశములపై దండెత్తి వచ్చెను. ఈతని రాకకు ఆప్రదేశజనులు తమ్ముద్దరించుటకువచ్చినట్లు సంతసించిరని ఆంగ్లచరిత్రకారుడగు మిల్లు వ్రాసియున్నాడు. అనగా నాప్రజ లానాటి యాంగ్లపరిపాలనలో నంత బాధపడుచుండిరన్న మాట!
ఆ యుద్ధములో సేనానాయకుడుగనుండిన యొక ఆంగ్లేయుడుకూడ హైదరు ప్రజానురంజకుడుగ నుండెనని వ్రాసినాడు. హైదరు పేటా ఆర్కాటులను స్వాధీనపరుచుకొనెను. అతడు అచ్చటి ప్రజల కెవ్వరివలన నెట్టి బాధయు కలుగనీయ లేదు. ఎట్టిదోపిడియు అశాంతియులేకుండ కాపాడెను. నవాబు క్రిందనుండిన యుద్యోగులనెల్ల ఆ యుద్యోగములందే యుండనిచ్చెను. ఆంగ్లేయోద్యోగులకు కావలసిన సొమ్ముగూడ హైద రిచ్చెనని టారెన్సు తన గ్రంథమున వ్రాసినాడు. తరువాత నాంగ్లేయులు మైసూరుపై దండయాత్ర వెడలినప్పుడు జరిగించిన అత్యాచారములకు భీభత్సములకు నిది యెంతభిన్నము! అయిన నాంగ్ల చరిత్రకారులు హైదరు నొక్క రాక్షసునిగ జిత్రించిరి. ఆంగ్లేయులతోడి యుద్ధమధ్యముననే 1782 లో హైదరు మరణించెను. టిప్పుసుల్తాను మైసూరు రాజయ్యెను. ఆంగ్లేయు లతనితో నొక సంధి జేసికొనిరి.
హైదరు తన జీవిత కాలములో చాలవరకు యుద్ధము లందు నిమగ్నుడై యున్నను, అతడు రాజ్యపరిపాలనము నేమరలేదు. అతని పరిపాలనలో, పారిశ్రామికులు వర్తకులు అభివృద్ధిగాంచిరి. కృషి, వర్థిల్లెను. ఉద్యోగులందు లంచగొండెతసము అణచి వేయబడెను. తన రాజ్యములో నలుమూలలను విదేశ రాజ్యవ్యవహారములనుగూడ హైదరు జాగ్రత్తగాకనిపెట్టి చూచుచునేయుండెను. అతనికి చదువు రాకపోయినను మంచి తెలివి తేటలతో తన ఉత్తర్వులను తన కార్యదర్శులకు చెప్పి వ్రాయించును. అతడు చనిపోవు నాటి కతని ఖజానానిండ ద్రవ్యముండెను. దేశము సుభిక్షముగనుండెను. 300000 కాల్బలముగల సైన్యము, విశాలదేశము నుండెను. (చూడు రిఫారం ప్యాంఫ్లెట్ - కర్నల్‌పుల్లర్‌టన్ .)
టిప్పుసుల్తానుగూడ చాలా తెలివికలవాడు. అతనిదేశము చక్కగా పాడిపంటలతో తులతూగుచుండుట; పరిశ్రమ లభివృద్ధిలో నుండుట; క్రొత్తపట్టణములు బయలు దేరుచుండుట; వాణిజ్యము బాగుగా జరుగుచుండుట; ప్రజలు సుఖముగా నుండుట చూచిన విదేశీయులనేకు లాతనిపరిపాలనను పొగడియున్నారు. అతనిపైన నాంగ్లేయచరిత్రకారులు వేసిన అపవాదులకు భిన్నముగా అతనియందు ప్రజలు అనురాగమును కలిగియుండుటను దెలిపినారు. (Moore-War with Tippu).
“డిరోం" అను నింకొక గ్రంథకర్తకూడ టిప్పుసుల్తాను పరిపాలనలో మైసూరు సుభిక్షముగా నుండుట వర్ణించినాడు. (Diroms' Narrative). హైదరు టిప్పూలిరువురు అర్ధశతాబ్దమునకు తక్కువగా నేలిరి. ఈఔన్నత్యము కేవలము హైదరు టిప్పూలే చేసినది కాదు. ఈ యౌన్నత్య కారణములు, మైసూరులోని చక్కనికాలువలు, అంతకుముందు పాలించిన హిందూరాజుల కాలముననే నిర్మింపబడెను.
1789లో ఆంగ్లేయులకు మైసూరుతో మూడవయుద్ధము తటస్థించెను. 1792 లో టిప్పుసుల్తాను తనరాజ్యములో సగము ఆంగ్లేయులకిచ్చి విశేష నష్టపరిహారము నొసగవలసి వచ్చెను. హైదరు రాజవంశమునకు మిగిలిన రాజ్యమును వెలస్లీ పూర్తిగా బ్రిటిషు రాజ్యములో కలుపుకొని ఆవంశమును రూపుమాపి. ప్రాతహిందూరాజ కుటుంబములోని వారిలో మిగిలియున్న వారికి కొద్ది రాజ్యభాగ మిచ్చి మైసూరు రాజుగా జేసెను.
IV
వంగ రాష్ట్రము
హైదరాలీ మైసూరు నాక్రమించిన సంవత్సరముననే వంగరాష్ట్రము బ్రిటీషువారి స్వాధీనమైనది. వంగరాష్ట్రము మొగలు చక్రవర్తిమకుటములోని విలువలేని భూషణము. బ్రిటిషువారివశమైన యీ క్రొత్తరాజ్యము తరుగనిసంపదలు కల దేశమని ఈ రాజ్యము తన యజమానులను ప్రపంచములో కెల్ల ధనవంతమగు సంఘముగజేసి తీరునని క్లైవు అప్పుడే చెప్పియుండెను. వంగరాష్ట్రము నందనవనమని పేరువడసియుండెను. "ఈరాజ్యములో ప్రజలకు ఆస్తికి నెట్టిభయమును లేదు. విలువగల సరుకులతో పోవువర్తకులు సైతము ప్రభుత్వమువా రుచితముగా నిచ్చు రక్షకభటుల సంరక్షణకలిగి నిర్భయ ముగా ప్రయాణము చేయగలుగుదురు. ఏజిల్లాలోనైన నొక ధనపుమూట నెవరైనపారవేసికొనినచో నది చూచినవారు దానిని ఒక కొమ్మకు కట్టి రక్షకభటులకు తెలుపు నీతి మర్యాదచ్చట కల"దని హాల్ వెల్ వాసి యున్నాడు.
(Tracts upon India. Reform Pamphlet No. 9)
“డక్కాలో సాగుచేయని భూమిలేదు. న్యాయము చక్కగా పరిపాలింపబడుచుండెను. జస్వంతరావు పరిపాలన నిర్దుష్టముగానుండెను. అతడు విద్యావంతుడు. ప్రజానురంజకుడు. సర్వమక్తావ్యాపారపంటలపైన నతడుపన్నులుతీసి వేసెను.” అనివ్రాసియున్నాడు, అలివర్దీఖాను వంగరాష్ట్ర నవాబగునప్పటికి వంగరాష్ట్ర మట్టి మంచిస్థితిలో నుండెను. అతని పరిపాలనలో 'దేశ మభివృద్ధి గాంచెను. సత్ప్రవర్తనము, సమర్థతయు నతనికి గావలసిన యోగ్యతలు.మహమ్మదీయు లైనను హిందువులైనను అతడు సమానముగ జూచి మంత్రి పదవులకు సైనికోద్యోగములకు నియమించుచుండెను. దేశాదాయము దూరపు ఢిల్లీకి పంపివేయుటగాక దేశక్షేమముకొరకు ఖర్చు చేయబడుచుండెను. (హిస్టరీ ఆఫ్ బెంగాల్ , స్టివార్డు) వంగరాష్ట్రము ఆంగ్లేయ పరిపాలనక్రిందికి వచ్చిన పదేండ్లలోపుగా దేశములో గొప్పమార్పు వచ్చినది. రాష్ట్రమున దుష్పరిపాలనము ప్రజాపీడనమును మితిమీరినవి. " దేశపరిస్థితులు తెలియక దూరములనుండి కేవలము ధనకాంక్షతో నుండు కంపెనీ డైరెక్టర్లకు తప్ప నీ దేశములో తాము చేయు పనుల కిక నెవ్యరికిని బాధ్యత వహింపనక్కరలేని పద్దతిలో అమితమైన లంచగొం డెలై అధిక గౌరవముగల కంపెనీ యుద్యోగులు, మానవమాత్రుడు గ్రహించుకొనలేని వ్యామోహములకు ఆశలకు విశేషావకాశములు కలిగి యుండుట, యేదైన నొక కబు రింగ్లాండుకు పోయి వచ్చుటకు 1 1/2 సంవత్సరములు పట్టుపరిస్థితిలో క్లైవు ఇంగ్లాండుకు వెళ్ళినపిదప 5 సంవత్సరములుజరిగిన దుష్టపరిపాలన వర్ణనాతీతము. క్రీస్తుకుపూర్వకాలమున రోము సామ్రాజ్యములో గవర్నరులుగా పంపబడిన “ప్రోకాన్సలు"లు చంద్రకాంత శిలాహర్మ్యములు నిర్మించుకొనుటకు సంపదలతో తులతూగుటకు అత్తరులో పొరలుటకు ఇంద్రభోగము లనుభవించుటకు తమక్రిందనుండిన పరగణాల భాగ్యభోగ్యములనెల్ల పిండిపీల్చి పిప్పిచేయుచుండి నట్లే క్రీస్తు తరువాత మనదేశము నాక్రమించిన ఆంగ్లేయవర్తక కంపెనీ నౌకరులు మనదేశ భాగ్యభోగ్యము లనుభవింపసొగిరి. దేశములోని వర్తకమును తమహస్తగతమును జేసికొనిరి. దేశవస్తువులను తమకు చౌకగా సమ్మునట్లు తమవస్తువులను ప్రియముగా గొనునట్లు నేటివులను బాధించుచుండిరి. దేశములోని న్యాయవిచారణాధికారులను, పోలీసులను, రివిన్యూ అధికారులను, ఈ తెల్లనౌకరులు తృణీకరించి అవమానించు చుండిరి. బ్రిటిషు ఫ్యాక్టరీయొక్క ప్రతినౌకరుకును కంపెనీవారికి గల సర్వాధికారములు నుండెను. ఇట్లు కలకత్తాలోని తెల్లవారందరు అతి స్వల్పకాలములోనే లెక్క లేనంత ధనము నార్జించుకొనిరి. మూడుకోట్ల భారతీయుల భాగ్యభోగ్యము లెల్ల ఇట్లు హరింపబడి వారు ధనికులైరి. వీరు దరిద్రులైరి. ఈప్రజలు పూర్వపరిపాలకుల క్రిందనుండి నప్పుడు దుష్పరిపాలనము మితిమీరినచో నీప్రజలు తిరుగబడి ఆ పరిపాలకులను కూలద్రోయ గలుగుచుండిరి. కాని నేడు దాపురించిన క్రొత్తప్రభుత్వ మిట్లు కూలద్రోయ వీలైనదికాదు. అనాగరక ప్రాచీనప్రభుత్వములలో కెల్ల నన్యాయమగు నిరంకుశ ప్రభుత్వముయొక్క ప్రజాపీడనము ఆధునిక నాగరకత వలన విశేషపశుబలము కలిగిన ప్రభుత్వములలో కెల్ల బలమైన ప్రభుత్వముయొక్క పశుబలము గలిగియుండెను. అందువలన దీని గట్టిపట్టును ప్రజలు విడిపించుకో లేకుండిరి. (Macaulay's Essay on Clive.)
అయోధ్య
అయోధ్య చరిత్రయు పై విధముగనే యుండెను. అయోధ్య ఆంగ్లేయుల వశము గాక పూర్వము సుభిక్షముగ నుండెను. ప్రజల కెట్టి బాధయు లేకుండగనే సాలుకు మూడు కోట్ల రూపాయలు ఆదాయము వచ్చుచుండెను. నావిక సైన్యమును చాలమంది సివిలు ఉద్యోగులను పోషింపవలసిన భారమును నవాబుపై నాంగ్లేయులు విధించిరి. అంతట నీ ఖర్పు భరించలేక అతడు చిక్కులలో పడెను. దేశము పాడైపోయి దారిద్ర్యమున బడెను. అతని ఆదాయము సగమునకు క్షీణించెను. సాలుకు 34 లక్షల రూపాయలచొప్పున తొమ్మిది సంవత్సరము లీ దురదృష్ట రాష్ట్రమునుండి ఆంగ్లేయులు సొమ్ము పిండిరి. (Mill's History of India) కంపెనీయొక్క సివిలు మిలిటరీ యుద్యోగుల జీతములు, పింఛనులు, నవాబు ఆదాయము మ్రింగివై'చెను. అతని అధికారముకూడా క్రమక్రమముగా క్షీణించి ఆంగ్లేయుల హస్తగతమయ్యెను. అతని అధికారము గౌరవము సంపదయునశించినవి. వార౯ హేస్టింగ్సు ఆనాటి స్థితిని వర్ణించియున్నాడు. “దీనివలన దేశములోని ప్రజలకు ఆంగ్లేయ పద్దతులపైన తీవ్రమైన అసహ్యభావము కలిగెను. నవాబు వజీరు సేవకుల హక్కులకు బాధ్యతలకు భంగకరముగా తెల్లవారు ప్రవర్తించుచుండిరి. కేవలము తెల్లవారి లాభముకొరకు నవాబుపైన పన్ను విధించుట అతడు భరింపలేని అతని కక్కరలేని సైనిక వ్యయభారము నతనిపైన వేయుట ఎంత అన్యాయము ! అయోధ్యలోని ప్రతి ఆంగ్లేయునకు సర్వాధికారము లుండెను. లక్షలకొలది ఆదాయమును వారు హక్కుగా గోరుట ప్రారంభించిరి. ఒక్క యాటలో రెండు లక్షల నొడ్డుట వారికొక లెక్కగా లేదు." అని వార౯ హేస్టింగ్సు వగచినాడు. కార౯ వాలిస్ కాలములో ఆంగ్లేయు లీ అయోధ్యవలన పుచ్చుకొను డిమాండు సాలుకు 250000 పౌనులనుండి 700000 పౌనులకు పెరిగినది. తరువాత నది యింకను పెంచబడినది. 1801లో రాజ్యమునంతయు లాగికొందునని బెదిరించి వెలస్లీ సాలుకు 1300000 పౌను లాదాయము వచ్చు అర్ధ భాగమును లాగుకొన్నాడు. 1815 మొదలు 1825 వరకు అప్పులను పేరున 40 లక్షల పౌనులు బలవంతముగా తీసికొని నవాబుకు రాజని బిరుదునిచ్చి ఎందుకు పనికిరాని భూముల నిచ్చినారు. ఈ చరిత్రభాగ మెవరో వ్రాసినది కాదు; ఆ అన్యాయములు చేసినవారు రచియించినదే! ఈ అయోధ్య రాష్ట్ర దుష్పరిపాలనకు ప్రజల దారిద్ర్యమునకు ప్రజాపీడనకు కారణము నేటి పరిపాలకులా ? వారిపైన స్వారి చేయుచుండిన ఆంగ్లప్రభువులా? (Reform Pamphlet No. 9)
VI
మహారాష్ట్ర రాజ్యము
మహారాష్ట్రుల పరిపాలనను గూర్చి ఆంగ్లచరిత్రకారు లనేకములగు అబద్దపుకథలను గల్పించి ఆవీరజాతికి నాయకుడగుశివాజీని దోపిడిదొంగయని నిందించినారు. కాని ఆమహానుభావుని గొప్పదనమును భారతీయులెల్లరు నిటీవల గహించి అతనిని పూజించుచున్నారు.
ఔరంగజేబు రాజ్యకాలమున మొగలుసామ్రాజ్యము యొక్క పునాదుల నీ మహావీరుడు శివాజీ కదల్చివైచినాడు. అతనికి కేవలము రణకౌశలముమాత్రమే గాక మంచి ప్రభు మంత్రోత్సాహశక్తులు, పరిపాలనా దక్షతయు గలవు. తన పరిపాలనలో ప్రజల సంరక్షణకొర కత డనేక శాసననియమములు చేసి వానిని తన రాష్ట్రీయగ్రామాధికారులు సక్రమముగా పాటించునట్లు చేసెను. యుద్దమువలని అనర్ధకములనుండి ప్రజలను కాపాడుటకొర కతడు చేసిన కట్టుబాటుల ప్రాశస్త్యమునుగూర్చి అతని శత్రువులుకూడ పొగడియున్నారు. ఈ “దోపిడిదొంగ" యొక్క సద్గుణములు అప్రతిమానములు. దేశ ముయొక్క సత్పరిపాలన కొర కత డేర్పరచిన బందోబస్తులు అతడు గతించిన ఎనుబదివత్సరములవరకు గూడ చక్కగా పనిచేసియుండుటయే అతని గొప్పదనమునకు సాక్షి . 'ఆంక్విటిల్ డు పెర్రాన్' అనునతడు ఆనాడు భారత దేశమును దర్శించి ప్రకటించిన వ్యాసములో మహారాష్ట్ర రాజ్యమును గూర్చి చక్కగా వర్ణించియున్నాడు:
(Brief account of a voyage to India. Anquetil du Perron published in Gentleman's Magazine 1762).
"సూరతునుండి నేను పశ్చిమ కనుమలు దాటితిని. పగలు పదిగంటలవేళ నేను మహారాష్ట్ర దేశముజొచ్చితిని. సత్యయుగమునాటి నిరాడంబరత్వము ఆనందము నాకన్నులకు గోచరించినవి. ప్రకృతి యిచ్చట కృత్రిమపు మార్పులజెంద లేదు. యుద్ధము దుఃఖము నిచ్చటి ప్రజలెరుగరు. ప్రజలెల్లరు సంతోషముగ మంచిబలశాలురుగ ఆరోగ్యవంతులుగా నుండిరి. అతిథిపూజ, అభ్యాగతి కాతిథ్యము నచ్చట సర్వసామాన్యమగు మర్యాద. బంధుమిత్రులకు ఇరుగు పొరుగువారికే గాక కేవలము పరాయివారినిగూడ ఆ రాజ్యములోని గృహస్థులు సత్కరింతురు."
శివాజీ తరువాత రాజ్యమేలినవారుకూడ చాల సమర్థులగురాజనీతిజ్ఞులు. బాజీరావుబులాల్‌కు మహారాష్ట్రులధైర్య సాహసములు. ధృడకాయము మాత్రమేగాక కొంకణ బ్రాహ్మణుల విద్యాజ్ఞానము, మర్యాదయు నుండెను. అతడు మహావక్త,కుశాగ్రబుద్ధి, గంభీరుడు, నిరాడంబరుడు, మంచినీతి జ్ఞుడు. సామాన్యసైనికులతోపాటు కష్టముల కోర్చుకొనును. అతనితర్వాత రాజ్యాధిపత్యము వహించిన బాలాజిరావుకుగూడ మంచిరాజనీతికౌశలము యుద్ధమధ్యమున దేశపరిపాలనను చక్కగా నడిపిన దిట్టరి. అతనికాలమున ప్రజలస్థితి యింకనుఅభివృద్ధి గాంచెను. దేశాదాయము వసూలు, వేలముపాటలు వేయు యిజారా పద్దతి నితడు మాన్పెను. న్యాయ విచారణ జనసామాన్యమునకు సులభసాధ్యము జేసెను. బాలాజీరావు తరువాత పరిపాలకుడైన మధోరావు యుద్ధమునందెంత చతురుడో పరిపాలనమం దంత సమర్థుడు.
ఈ కాలమున భారత దేశమం దంతటిలోను మహారాష్ట్రదేశ మత్యంత ఔన్నత్యము ననుభవించుచుండెను. మధోరావు మంత్రి, సుప్రసిద్ధుడగు రామశాస్త్రి. అతని ధర్మ నిర్నయములు తీర్పులు నేటికి ప్రమాణములుగా నున్నవి. అత డెంతో శ్రద్దవహించి జనసామాన్యమున కెల్ల మేలొన గూర్చెను. ఒకరోజుకు కావలసిన దానికన్న నెక్కువ ఆహార సామగ్రి నుంచుకొనుట కీ సద్ధర్ము డంగీకరింప కుండెను. (Grant Duff's History of the Mahrattas Vol.II 208)
పీష్వాయొక్కరాజ్యములను నానాఫర్నవీసు ఇరువదైదేండ్లు అత్యంతసమర్ధతతో పరిపాలించెను. ఇతడు తన చాకచక్యమువలన బుద్ధికుశలతవలన ఆవిశాల సామ్రాజ్యము నతి చతురతతో పరిపాలించెనని అతని ధర్మపద్ధతులను సత్పరిపాలన న్యాయపరిపాలనలను సర్ జాన్ మాల్కం చక్కగా వర్ణించి యున్నాడు. “దక్షిణమహారాష్ట్ర జిల్లాలయం దంత చక్కనికృషి సంపద, సమృద్ధియైన పాడిపంటలు నింకేభాగమునను నాకు గనబడ లేదు. పీష్వాయొక్క రాజధాని నగరమగు పూనాపట్టణము మిక్కిలి ధనవంతమైన వర్తకస్థానము. కృషికి అనుకూల పరిస్థితులులేని ఈ దక్షిణాపథము (డెక్కన్)లో నింతటి కృషి సంపదయుండుట యాశ్చర్యజనకముగా నున్నది” అని పలికినాడు. హోల్కారు పరిపాలనలో నున్న ఇంకొక మహారాష్ట్ర రాజ్యభాగమును గూర్చి ఇతడే ఇట్లు చెప్పినాడు “మాళవరాజ్యము క్రూరజాతుల చేతులలోబడి పాడైనదిగాని ఆస్థితిలో కూడా యీ రాష్ట్రములో ధనకనకవస్తు వాహనములతో గొప్ప సాహుకారులతో నిండి గొప్ప వ్యాపారమునకు ఆటపట్టులగు మహానగరములు నిరంతరాయమగు ఎగుమతి దిగుమతి వ్యాపారము నాకు గనబడినది. భారతదేశములో నెల్ల యెడలను వ్యాపార భీమాకార్యాలయములు చక్కగా పనిచేయుచునే యున్నవి. పైన చెప్పిన దక్షిణ మహారాష్ట్ర జిల్లాలు వాణిజ్యకృషి విషయములందు పూర్వపు ఔన్నత్యముకన్న మన బ్రిటిషుపరిపాలనమున హెచ్చుఅభివృద్ధిగాంచునని నాకు తోచదు. మొత్తముమీద మహారాష్ట్ర పరిపాలన శాంతి యుతముగను ప్రజానురంజకముగనుండెను. ఈ ఔన్నత్యమునకు ముఖ్యకారణము వ్యవసాయ జీవనమన్న హిందువులకు గల ప్రీతియే. పట్టణములను గ్రామముల నుద్దరించి అభివృద్ధిచేయు పద్ధతి మనకన్న వారికెక్కుడు చక్కగా తెలియుననుటకు సందియము లేదు. ధనవంతులకు ప్రోత్సాహమిచ్చుట పెట్టుబడిని వృద్ధిచేయుట అన్నిటికన్నను ముఖ్యముగా గ్రామ పురోభివృద్ధికి తోడ్పడుట ఇతర భారతీయసంస్థలను సంరక్షించి జనసామాన్యములోని అన్నితరగతుల వారికి తగు జీవనాధార . వృత్తులు కల్పించుటయు నీ యౌన్నత్యమునకు కారణములు." (Reform Pamphlet No. 9).
ఆనాడు రాజ్యమేలిన మహారాష్ట్ర పరిపాలకులలో రాణీ అహల్యాబాయి చాలా ప్రసిద్దిచెందిన మహారాజ్ఞి. ఆమె పరిపాలనమున దేశ మనుభవించుచుండిన శాంతిని సౌఖ్యమును సర్‌జాన్ మాల్కలం వర్ణించియున్నాడు. తనప్రజల కందరికిని క్షేమలాభములు కలిగించుటయే ఈమహారాణియొక్క పరమ లక్ష్యముగ నుండెను. సాహుకారులు, వర్తకులు, కర్షకులు, రైతులు, ధనవంతులై యభివృద్ధి జెందుటను వీక్షించుటయన్న ఈమెకు పరమసంతోషము. మాళవరాజ్యమున కీమె పరిపాలనము మేలుబంతిగనుండెను. ఈమె అనేకకోటలు నిర్మిం చెను. వింధ్యపర్వతముల కడ్డముగా నొకవిశాలమగు రాజబాటను నిర్మించెను. మహారాష్ట్ర దేశములోని రాజులెల్లర కీమెయందు మిక్కుటమగు భక్తి. (Malcolm's History of Central India Vol. I. P. 176. 195.).
ఆనాటి మహారాష్ట్రరాజ్య సమ్మేళనములోని ప్రముఖులలో బీరారురా జొకడు. ఈతని రాజ్యముకూడ మంచిస్థితిలో నుండెను. ఈజిల్లాలలో పర్యటనము జేసిన ఐరోపాజాతి బాటసారు లీరాజ్యముయొక్క సారవంతమగు భూమి, వాణిజ్యము, ప్రజల యభివృద్ధినిగూర్చి పుష్కలములగు పాడిపంటలు గొప్ప దేవాలయములు, నీటి వనరులు ప్రజల యభివృద్ధినిగూర్చి వర్ణించియున్నారు.
VII
పశ్చిమోత్తరపరగణా
“రాంపూరు రాజ్యములోనుండి పోవునప్పుడు అచ్చటి కృషి, సంపద దృష్టి నాకర్షింపక మానదు. ఒక్క జేనెడుభూమియైన వదలకుండ సాగుచేయబడుచుండెను. ఋతువు అనుకూలముగ లేకపోయినను జిల్లాలోని భూమియంతయు పంటతో నిండియుండెను. దీనివలననే యిచ్చటి రైతుల మంచిస్థితి వెల్లడియగుచున్నది. నవాబు మైదుల్లాఖానుయొక్క వ్యవహార దక్షతను అందరు మెచ్చుకొనుచుండిరి. ఇతడు విద్యాధికుడు, ఉదారుడు నగు భూస్వామి. దేశాభివృద్ధికొరకు తానేచాలాసొమ్ము వెచ్చించుచుండెను. సాగుకొరకు గొప్ప నిర్మాణములు విశేషధనము కావలసినప్పుడెల్ల ఇతడు విరివిగా ఖర్చుపెట్టుటకు వెనుదీయడు. కాలువలు త్రవ్వించెను. చిన్న నదుల కడ్డుకట్టలుకట్టి నీటిని పొంగించి పరిసర ప్రదేశములను సారవంతముచేసి పల్లము సాగుకు అనుకూలముగా జేయుచుండెను. తన ప్రజలను చక్కగా పరిపాలించి కాపాడుచుండెను. అన్నివిషయములందు నింకను చక్కగా పాటుపడునట్లు వారి నితడు ప్రోత్సహించుచుండెను. రోహిలఖండముయొక్క పరిపాలన విషయములో రోహిల పరిపాలకుల పద్దతిని బ్రిటిషుపరిపాలనాపద్దతితో పోల్చిచూచినచో నీనాగరకబ్రిటిషుపరిపాలనకన్న 'అనాగరక' రోహిలపరిపాలనమే ఎక్కువ బాగుండెననుటకు సందియము లేదు. ఈ రాజ్యము బ్రిటిషువారిచేతిలోనికి వచ్చిన ఏడేండ్లలో దేశాదాయములో 2 లక్షలరూపాయలుమాత్రము వృద్ధిజెందెను. తరు వాత నిరువదియేండ్లలో నీదేశాదాయమునందును అయోధ్యలోనిదత్తమండలములయొక్క ఆదాయమునందును సాలుకు , 20 లక్షల రూపాయలు తరుగు రాసాగెను. ఋతువులయొక్క అతివృష్టి, అనావృష్టి దోషములవలన చుట్టుప్రక్కల భూభాగములలో పంటలు పాడైపోయినప్పుడుకూడా దయారామ్ భగవత్ సింగుల రాజ్యములు సుభిక్షముగానుండి పాడిపంటలతో తులతూగు చుండెను. ఈ “చుట్టుప్రక్కల భూభాగము" లనునవి అప్పటి కై దేండ్లనుండి బ్రిటిషుప్రభుత్వమువారి స్వాధీనములో నున్న భూములు! (Bishop Heber's Journal. Vol. II. Quoted in Reform Pamphlet.)
బిషప్ హెబరు తన జర్నలులో (Vol.II. Page 77-9), సాదత్ ఆలీపరిపాలనకాలమున అయోధ్య మంచి యభివృద్ధిలో, నుండుటను పేర్కొని సాదత్ ఆలీ చాలా తెలివికలవాడనియు వ్యవహారదక్షుడనియు, విజ్ఞానశాస్త్రమన్న అతనికి ప్రీతియనియు చెప్పియున్నాడు. గవర్నరు జనరలగు హేస్టింగ్సుకూడా సాదత్ ఆలీయొక్క ధర్మవర్తనమును ఋజుగుణమును దయార్ద్రహృదయమును పొగడియుండెను.
VIII
భరతపురము
ఆనాటి నేటివు పరిపాలకులక్రింద భరతపురము చక్కగా అభివృద్ధి జెందుచుండిన సంగతి కూడా బిషప్ హెబరు వర్ణించియుండెను. “భారతదేశములో నేనుచూచినప్రదేశములలోనికెల్ల ఈ రాజ్యభాగములోని పల్లపునీటిసాగు వనరులు చాలాబాగు న్నవి. వరిపంట చాలాచక్కగానున్నది. ప్రత్తి విరుగబండినది. చెరుకుపంట సమృద్ధిగానున్నది. అనేక చెరుకు గానుగలుండుటయే ఈ దేశము యొక్క సంపదకు సాక్షి . జనసంఖ్య హెచ్చుగా లేదుగాని గ్రామములు మంచి స్థితిలో నున్నవి. కంపెనీవారి భూముల స్థితినిబట్టి చూడగా రాజపుత్రస్థానము నందట్టి సంపద కనబడుట నాకాశ్చర్యకరముగా నున్నది. భరతపుర సంస్థానాధీశుడు చాలసమర్థుడును ప్రజానురంజకుడగు పరిపాలకుడునై యుండవలె. లేదా మన బ్రిటిషు రాష్ట్రములందవలంబింపబడుచున్న పరిపాలనా విధానము నేటివుపరిపాలకుల రాజ్యములందువలె ప్రజలయభివృద్ధికి సౌఖ్యమునకు అనుకూలమైనది కాకుండునట్టిదైన గావలె నని నాకు తోచుచున్నది. ”
సతారారాజగు ప్రతాపసింహునియొక్క సుగుణముల గూర్చి అతని పాలనలోని రాజ్యముయొక్క సంపదనుగూర్చి బ్రిటిషు ప్రభుత్వమువారే పొగడియున్నారు. (1843 నెం 569, 1268 పుట) కంపెనీడైరక్టర్లు ఆ రాజుకు వ్రాసిన ఒకలేఖలో నిట్లు కలదు. “మాప్రభుత్వమునుండి మాకువచ్చుచున్న సమాచారములను బట్టి చూడగా మీవిధ్యుక్త ధర్మములను మీరెంతో చక్కగా నిర్వహించుచున్నట్లు మాకు కనబడుచున్నది. మీ పరిపాలనలో మీరాజ్యమత్యంతాభి వృద్ధిగాంచుచు మీ ప్రజలు సుఖముగా నుండుటయు మీరు అవలంబించిన చక్కని పరిపాలనా పద్దతియొక్కయు మీసత్స్వభావము యొక్కయు పరిణామముగనున్నది. మాకు చాలసంతసముకలిగించినది. ప్రజోప యోగకరములగు అనేకనిర్మాణములను మీరు స్వయముగా విశేషసొమ్ము ఖర్చుపెట్టి నిర్మించుట మీయందు మాకుగల గౌరవము నినుమడింపజేసి మాకు సంతోషప్రదమైనది”.
ఇట్లీరాజుగారి సత్పరిపాలనమును దానివలన నారాజ్యము పొందుచున్న అభివృద్ధినిగూర్చి బ్రిటిషుప్రభుత్వ మాయనను అభినందించుచున్న కాలముననే తమ పరిపాలనలో జేరిన మూడుకోట్ల ప్రజలస్థితి ఎట్లుండెను? ఫ్రెండ్‌ఆఫ్‌ఇండియాలో 1852 ఏప్రియల్ 1 వ తేదీన డాక్టర్ మార్షమన్‌గా రిట్లు వర్ణించినారు. 'వంగరాష్ట్రములోని రైతుల దుస్థితి ఊహించుటకు గూడ వీలులేనంత ఘోరముగా నున్నదను సంగతి నెవ్వరు కాదనజాలగలరు? ఈ రైతులు కుక్కలు వసించుటకైన తగని గూభ్యముల (hovels) లో నివసింతురు. చింపిరి పేలికలు ధరింతురు. వీరి కుటుంబములలో నెవరికిని రోజు కొకపూటయైన కడుపునిండ భోజనముండదు. వీరికి సామాన్య మానవ సౌఖ్యములైనను లేవు. సాలుకు మూడునాలుగుకోట్లరూపాయల విలువగల పంటను పండించు ఈ రైతుల నిజమైన స్థితిగతులు బయల్పడినచో విన్నవారిగుండె బ్రద్దలైపోవును. బ్రిటిషు పరిపాలనకు పూర్వము నందనవనముగ నుండిన వంగరాష్ట్ర మీ అధోగతి లోనికి వచ్చిన సంగతి స్వయముగా చూచిన వారి వర్ణనమిది. నిజముగా నీ వంగరాష్ట్రము మొదటి నుండియు ఘోరస్థితిలో నున్నచో నీ బ్రిటిషువారు ఈవందసంవత్సరములలో దాని నుద్దరించుట కేమిచేసిరి ! క్లైవుయొక్క పలుకు లింకను లిఖితరూపముగా నిలిచియున్నవి: "వంగరాష్ట్రము తరుగనిసంపదలకు నిలయమైన భూమి. - దీనియజమానుల నిది ప్రపంచములోకెల్ల ధనవంతులుగ జేయగల భూమి.” ఈ పరిణామము ఎట్లు కలిగినది? తనకాలమున నారాష్ట్రప్రజలు క్రమక్రమముగా ఘోరదారిద్ర్యమున దుస్థితిలో మునుగుచున్నారని గవర్నరుజనరలైన కారన్ వాలీస్ ప్రభువే పలికియున్నాడు. నానాటికి హెచ్చింపబడిన రివిన్యూ శిస్తు వసూళ్ళవలస 1765 కు 1790 కు మధ్య బ్రిటిష్ ప్రభుత్వమువారు తా మంతకంతకు ధనవంతులుకాగా నారాజ్యప్రజ లంతకంతకు దరిద్రులైనారు. దేశము నిర్దనమై పట్టి పోయినది. 1827 లో గవర్నరు జనరలుగ నుండిన లార్డుహేస్టింగ్సు ఇట్లు చెప్పినాడు: (Parliamentary Papers Page 157) "మన చేతికింద నొక క్రొత్తతరమువారు పెరిగినారు. మన శాసనములక్రింద రక్షణక్రింద వ్యాజ్యములు పెరిగినవి. స్పర్ద హెచ్చినది. నీతి క్షీణించినది. న్యాయవిచారణ శాఖవలెనే మనుష్యుల, ఆస్తిరక్షణయు, అతృప్తికరముగా నుండెను." 1851 ఆగస్టు 28 వ తేదీన ఫ్రెండ్ ఆఫ్ ఇండియాలో నొక వ్యాసమున నిట్లు వ్రాయబడినది. “ధనముగలవా డెవ్వడును తెల్లవారులోపల తన ధన మెవరో యొకరు దోచుకొనరను ధైర్యముతో పండుకొనజాలడు. రివిన్యూ (శిస్తువసూలు); న్యాయవిచారణ, పోలీసు మొదలగు అన్ని శాఖలలోను మన పరిపాలన పనికిమాలినదిగ నున్నదని గవర్నరుజనరలు విలియం బెంటికు పలికిన పలుకులలో నతిశయోక్తిలేదు. ఇది బ్రిటిష్ పరిపాలనలోని శాంతి భద్రతలు;సత్పరిపాలన".[1]
మూడవప్రకరణము
స్వతంత్రరాజులు సామంతులగుట
I
స్వదేశసంస్థానములసమస్య
ఆంగ్లేయతూర్పు ఇండియా కంపెనీ పదునేడవ శతాబ్ద ప్రారంభము (1600) మొదలు పదునెనిమిదవ శతాబ్దమధ్య (1757) వరకును కేవలము భారతదేశ స్వదేశరాజులయొక్కయు నవాబులయొక్కయుదయపైన ధర్మముపైన నాధారపడిహాలెండు, ఫ్రెంచిదేశపు వర్తకులతోపాటుపోటీగా నీదేశములో వర్తకము చేసికొనుచు కాలక్షేపముచేయు వ్యాపారసంఘముగా నుండెను. అటుపిమ్మట 1757 మొదలు 1857 వరకు నింకొంక నూరేండ్లు వా రేదేశమున రాజ్యాక్రమణము చేయుచు తాము సంపాదించిన రాజ్యాధిపత్యమును గట్టిపరచుకొనుచు నాంగ్లేయపార్లమెంటు ప్రభుత్వముతో కలసి యీదేశ రాజ్యపరిపాలనాధికారములను చలాయించుచు క్రమక్రమముగా తన వ్యాపార హక్కులను వ్యవహారములను విరమించుకొన సాగెను. 1857 లో జరిగిన భారతదేశ సిపాయిల స్వాతంత్య విప్లవానంతరము కంపెనీవారి కప్పటికి మిగిలియున్న రాజ్య పరిపాలనాధికారములు ఆంగ్లరాజ్య మకుటమునకు ఆంగ్లపార్లమెంటుకు బదలాయింపు చేయబడెను. (Government of India. - Ilbert)
మొగలాయిసామ్రాజ్యము బలహీనమై దానికిలోబడి యుండిన సామంతులు స్వతంత్రులై అధికారముకొరకు రాజ్య సంపాదనకొరకు ప్రాకులాడుచు నిరుగుపొరుగు వారిపై దండెత్తుచు దేశశాంతికి భంగము కలిగించుచుండగా దేశరక్షణ చేయవలసిన కేంద్రమొగలు ప్రభుత్వము అట్లు చేయలేని సమయములో క్రొత్తగా నీ దేశమున వ్యాపారము చేసికొనవచ్చిన విదేశీయవర్తకులు నిర్భయముగను సుఖముగను వ్యాపారముచేసికొనుట దుర్లభమయ్యెను. అందువలన దురాశాపరులును బలవంతులు నగు చిన్నరాజులు, నాయకులు, బందెపోటుదొంగలు తమపైబడి కొల్లగొనకుండ స్వసంరక్షణము కొరకు వీరు సైన్యము లుంచుకొనవలసి వచ్చెను. తమతోపాటు వ్యాపారముచేయు తెల్లవర్తకులతోను యిరుగుపొరుగు స్వదేశ రాజ్యములతోను దెబ్బలాటలు యుద్ధములు తప్పలేదు. బొంబాయి సముద్రతీరములందు సూరతు మొదలగుచోట్ల నాంగ్లవర్తక కంపెనీవారు వర్తకస్థానముల నేర్పరచుకొనిన పిదప అచ్చటి సముద్రతీరపు పరిస్థితులనుబట్టి ఆంగ్లేయులకు సముద్రచోరుల వలననేగాక, తమతో పోటీచేయు పోర్చుగీసు డచ్చి ఫ్రెంచివర్తకుల వలని భయము, మహారాష్ట్ర దండులవలని భయములేకుండా చూచికొనవలసిన అగత్యము కలిగియుండినందున నీ ఉద్దేశముతో, వీరు కొల్హాపూరు, సావంతవాడి, జంజీర, జఫారాబాదు, క్యాంబే మొదలగు సముద్రబలముగల రాజ్యములతో సముద్రచౌర్యమునణచు షరతులుగల సంధిచేసికొనిరి. ఇట్లే పీష్వాతో 1739 లో చేయబడిన సంధియు సముద్రతీర రక్షణకు వాణిజ్యమునకు సంబంధించినది. ఫ్రెంచినాయకుడగు డూప్లే దక్షి ణాపథమున నవాబులలో నెవరో యొకరిపక్షమున జేరి గొప్ప పలుకుబడి సంపాదించుట లాభముపొందుటయు చూచి ఆంగ్లేయులు నిది ప్రారంభించిరి. 1744 లో నింగ్లాండుపైన ఫ్రెంచిదేశము యుద్ధము ప్రకటించినది. 1748 లో సంధి జరిగెను గాని ఆ సమయమున మనదేశములో నీ రెండు దేశముల వర్తకులకు రగుల్కొనిన యుద్దకీలలు ఆరక ప్రజ్వలించుచునే యుండెను. 1756 లో నైరోపాలో మరల యుద్దముతటస్థించి 1763 వరకు జరిగినది. ఈ సందర్భములో ఫ్రెంచివారు భారతదేశమున తమబలముల నుపేక్షించుటవలన నైజాముదగ్గఱ వారి పలుకుబడి తగ్గిపోయి ఆంగ్లేయులపలుకుబడి హెచ్చినది. ఈ సమయముననే ఆంగ్లేయులు అతనివలన ఉత్తరసర్కారులు సంపాదించిరి. 1665 లో దీనిని స్థిరపరచుచు ఢిల్లీ చక్రవర్తి ఫర్మానా పొందిరి. 1775 లో అమెరికా స్వాతంత్ర్యయుద్ధ మారంభమై ఇంగ్లాండుకు ఫ్రెంచిదేశమునకు సముద్రయుద్ధముకలిగెను. ఈ సందర్భమున భారతదేశమున మరల నీ కంపెనీలు పోరాడెను. 1783 లో నైరోపాలో సంధిజరిగినను భారతదేశమున కుట్రలుజరుగుచునే యుండెను. ఫ్రెంచిదేశమున ప్రజావిప్లవము కలిగిన పిదప 1793 లో ఫ్రెంచిదేశ మింగ్లాండుపైన మరలయుద్ధము ప్రకటించినది. అంతట ప్రపంచములో వీరాధివీరుడని ప్రసిద్ధిగాంచిన నెపోలియను ఐరోపాలోని రాజ్యములనెల్ల నుఱ్ఱూతలూగించి ఆంగ్లేయులను మూడుచెరువుల నీళ్లుత్రాగించినాడు. ఈ యుద్ధములందును, ఫ్రెంచివారితోడి సామదానభేదదండోపాయ ప్రయోగములందును, ఆంగ్లేయుల కీ దేశములోని రాజులయొక్కయు నవాబులయొక్క యు స్నేహసహాయము లనసరములయ్యెను. ఇదియే వివిధసంస్థానములతోడి సంధి యొడంబడికలు చేయుట ప్రారంభించుటకు గారణమయ్యెను. ఈ సందర్భమఃన నాంగ్లేయులు తమకు సాయముచేయు స్వదేశ రాజులను నవాబులను స్వతంత్రరాజులుగా గౌరవించుచు వారి యడుగులకు మడుగులొత్తి యుద్ధములందు సంపాదింపబడిన రాజ్యభాగములను వారికిచ్చి తాము ఒదిగి యుండుచుండిరి.
మైసూరు యుద్ధములైన పిదప జయింపబడిన రాజ్య భాగములందు కొన్నిటిని హైదరాబాదునైజాము కిచ్చిరి. నైజాము ఆంగ్లేయులతో శాశ్వతముగా స్నేహముగ నుండి వీరికి సహాయముచేయుచు తనరాజ్యమును సుఖముగా పరిపాలించు కొనునట్లు వీరికి ఒడంబడిక సంధిజరిగెను. హైదరాలీ తొలగించిన పూర్వపురాజకుటుంబమునకు మైసూరును మరల నిచ్చునపుడు తిరువాంకూరు కొచ్చిను సంస్థానముల వలెనే రక్షితరాజ్యము (ప్రొటెక్ట రేటు) గా చేయబడెను. కర్నాటక నవాబు నధికారవిహీనునిగ జేసి 1801 వరకు పేరునకుమాత్రము నవాబుగా నుంచి తరువాత అదియులాగివేసిరి. ఇట్లే ఉత్తరమున అయోధ్యవిషయమునను జేసిరి. దేశములోని రాజులు నవాబులు నెల్లరు పేరునకు ఢిల్లీచక్రవర్తికి లోబడినవారేగాని నిజముగా స్వతంత్రులై వర్తించు చుండిరి. దక్షిణాపథమున మహారాష్ట్రులు విజృంభించి దేశములోని పరిపాలకుల నుండి చౌతుపన్ను బలవంతముగా వసూలుచేయుచుండిరి. 1757 లో ప్లాసీయుద్ధము జరిగినపిదప నాంగ్లేయులను జూచిన షా ఆలం చక్రవర్తికిని భయముగనే యుండెను. వారేది కోరిన అది యిచ్చుచుండెను. అందువలననే 1765లో వంగరాష్ట్ర బీహారు ఒరిస్సాల దివానీ యధికారమునిచ్చి ఉత్తర సర్కారులును దక్షిణాపథములును ఆంగ్లేయులకు ఉత్తరసర్కారులకు కర్నాటకమునకు గూడ రాజ్యాధికార పట్టానిచ్చెను. ఇట్లు మొట్టమొదట ఫ్రెంచివారితో కలహముల నెపమున కుట్రలు చేసి దేశీయరాజుల కలహములందు తమకు దమ్మిడీ ఖర్చులేకుండ యుద్ధములలో వచ్చిన రాజ్యభాగమున దోపిడి సొమ్ములో తాముగూడ పంచుకొనగానే మొట్ట మొదటలో నత్యవసరము కలిగినగాని యితరులతో జోక్యము కలిగించుకొన దలపని ఆంగ్లేయ వర్తకులు మానవ రక్తమును రుచి మరిగిన వ్యాఘ్రములై దేశములో విజృంభించిరి.
తమకు సులభముగా లభించిన రాజ్యభాగములందలి ఆదాయమును తాము సుఖముగా అనుభవింపవలెనన్నచో దాని కేమియు నుపద్రవము లేకుండ కాపాడుకొనవలెనుకదా! దానికి కూడ దమ్మిడి ఖర్చులేని ఉపాయము నాలోచించి చుట్టునుండు భూభాగమును తమతో స్నేహముగానుండు ఏ స్వదేశరాజుకో నవాబుకో ఉండునట్లు చూచుచుండిరి. ఒక్కొక్కప్పు డట్టి రాజ్యములు తమకు వచ్చినను దానిని శాత్రవ మధ్యరాజ్యముగా (బఫ్ఫర్ స్టేట్) జేయు కుటిలోపాయము బన్నిరి. దీనికే ఆవరణ (“రింగుఫెన్సు") నీతియని వ్యవహరించిరి. ఈ యుద్దేశమును పురస్కరించుకొనియే బక్సారు యుద్ధమైన పిదప మహారాష్ట్రుల భయములేకుండా కాపుదలగా నుండుటకు అయోధ్యను శాత్రవ మధ్యరాజ్యముగా నుంచి దీనిని నవాబునకే యిచ్చిరి. అట్లే టిప్పూ తదనంతరము మైసూరురాజ్యములో కొంత పూర్వరాజవంశీయున కిచ్చిరి. 1817 లో సీతాబాల్డీ యుద్ధమైన పిదప నాగపురమును భా౯స్లేరాజుకు మరలనిచ్చిరి. మొదటి సిక్కుయుద్ధానంతరము లాహోరు సంస్థానమును గూడ అట్లేయుంచిరి. ఆ కాలమున నాంగ్లేయకంపెనీప్రభుత్వము ఆయాస్వదేశ రాజులతోను నవాబులతోను చేసికొనిన సంధియొడంబడికలను చూచినచో ఆరాజులు నవాబులు అంతర్జాతీయ ధర్మమునుబట్టి సర్వాధికార ప్రభుత గల స్వతంత్రరాజులుగనే వ్యవహరించినట్లు గోచరించును. ఇంకా విశేష మేమనగా కంపెనీవారు చాలకాలము తమ అధికారము లెల్ల సర్వంసహాచక్రవర్తియగు ఢిల్లీపాదుషావలన సంక్రమించినట్లుగనే వ్యవహరించుచుండిరి. కాని షాఆలంచక్రవర్తి వీరి “సంరక్షణ నిర్బంధము” నుండి వెలువడి మహారాష్ట్రుల యండజేరి వారి ఖైదీయైనపిదప నీకపటనాటకము నాడుటకు వీలులేకపోయినది. అంతట నీ కంపెనీవారు దేశములోని తక్కిన సామంత పరిపాలకులవలెనే స్వతంత్రులై వ్యవహరింపసాగిరి. తాము భరింపలేని బరువులుమాత్రము నెత్తిపైన పెట్టుకొనకుండా ఉపాయముగా విజృంభింపసాగిరి.
కర్నాటక నవాబు తన రాజ్యముయొక్క మేనేజిమెం టుకు లెక్క చెప్పి తన మధ్య ఫలసాయమును శిస్తుల ఆదాయమును తన కివ్వవలసినదని ఆంగ్లేయకంపెనీపై ఇంగ్లాండు - చాన్సరీకోర్టులో వ్యాజ్యము దాఖలుచేయగా ఆ వ్యాజ్యవిచారణకు నియమింపబడినకమీషనరగు “అయిర్" దొర ఈవ్యవహారము సామాన్య వ్యాజ్యము కాదనియు ఒకరికొకరు లోబడని రెండు రాజ్యములవారి మధ్యసంధి యొడంబడికలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమనియు తీర్మానించి దావా త్రోసివేసెను. ఇట్లు కంపెనీవా రొక స్వతంత్ర రాజ్యపరిపాలకులను సూత్రము స్థిరపరుపబడెను.
II
స్వదేశ సంస్థానములతో నాంగ్లేయ కంపెనీవారవలంబించిన రాజ్యనీతిలోని రెండవ ఘట్టము, “సబార్డినేట్ అయిసొలేష౯" అనబడు విధానము. ఇది 1813 లో ప్రారంభమైనదని చెప్పవచ్చును. స్వదేశ సంస్థానాధీశుల స్వాతంత్ర్య గౌరవము అనవసరముగా స్వదేశరాజులతో జోక్యముకలిగించుకొన గూడదను భావము నశించి మెల్లగా నీరాజులను నవాబులను రాజ్యతంత్రమున నిరికించి కంపెనీవారి పలుకుబడిక్రింద నుంచి అధికారమునకు లోబరచుటకు ప్రయత్నములు జరిగెను.
1798-1905 మధ్య వెలస్లీగవర్నరు జనరలుగా నున్నప్పుడే అతడు దూరదృష్టితో నీస్వదేశరాజులు నవాబులు ఫ్రెంచి వారికి తోడ్పడకుండా నాంగ్లేయులకు వశులై యుండుమార్గము నాలోచించెను, గాని కేవలము కంపెనీవారికి లోబడియుండు నట్లు చేయజాలకపోయెను. వెల్లస్లీజేసిన సంధియొడంబడికలను బట్టి రాజులు నవాబులు ఆంగ్లేయ కంపెనీతో స్నేహముగా నుండునట్లును ఉభయులు ఒండొరులకు సహాయులై యుండునట్లును, ఉభయులకు రక్షణకొరకు ఆంగ్లేయసైన్యములను సంస్థానములలో నుంచునట్లును ఏర్పాటు చేసెను. కొన్ని సంధిపత్రములందు కంపెనీ ప్రభుత్వమునకు విధేయులై యుండవలెనను మాటను చల్లగాజేర్చినాడు. నెపోలియను భయము తీరిన పిమ్మట హేస్టింగ్సు గవర్నరు జనరలుగా వచ్చిన వెంటనే క్రొత్త రాజ్యనీతి ఖచ్చితముగా అమలు జరుపబడెను. వెలస్లీ కాలమున 1802 లో పీష్వాతో చేయబడిన సంధిలోనే అతని సర్వాధికారములు తీసివేయబడు సూచనలు కలవు.
1806 లో షాఆలంచక్రవర్తి చనిపోయినను 1832 వరకు ఢిల్లీపరగణాలు చక్రవర్తి కొమారుని పేరుతోనే వ్యవహరింపబడినను హేస్టింగ్సు కాలమునుండి మొగలాయి చక్రవర్తి అధికార మావంతయైన మిగులలేదు. 1813 లోనే తక్కిన మహారాష్ట్రరాజులపైన పీష్వాకుగల సర్వాధికారము అదృశ్యమైనది. ఆనాటికి దేశములో నాంగ్లేయకంపెనీ తప్ప యింకొక బలమైన ప్రభుత్వసంస్థ లేనేలేదు. అందువలననే కంపెనీవారు సర్వాధికారులనియు, ఈ సంస్థానాధీశులు సామంతులనియు హేస్టింగ్సు స్పష్టముగా ప్రకటించి తన సంధిపత్రములం దీ సంగతిని వివరించినాడు.
బ్రిటిషువారు స్వదేశ రాజులపట్ల చూపిన గౌరవము, స్నేహము, అధికారము, కాలపరిస్థితిని బట్టి మారినవి. వెల్లస్లీ 1798 మొదలు 1805 వరకు గవర్నరు జనరులుగ నుండెను. ఇతడు వచ్చునప్పటికి ఐరోపాలోగాని, భారతదేశమునగాని ఆంగ్లేయుల పరిస్థితులు బాగుగా లేవు. ఐరోపాలో ఫ్రెంచి విప్లవమున ఆంగ్లేయులు యుద్ధమున మునిగిరి. భారతదేశమున ఇంగ్లీషువారికి చిరకాలమునుండి స్నేహితుడుగా నుండిన నైజాము ఫ్రెంచివారి స్నేహము నపేక్షించి తన సైన్యములకు ఫ్రెంచి యుద్యోగులచేత శిక్షణము చేయించుచుండెను. సింధియా రాజుగూడ ఇట్లు చేయుటయే గాక ఫ్రెంచిసేనలనే తన సంస్థానమున నుంచుకొనెను. ఐరోపాలో ఫ్రెంచివారికిని ఆంగ్లేయులకును యుద్ధములు జరుగుచుండుటయు, నెపోలియ౯ ఖ్యాతి భారతదేశమున వ్యాపించుటవలన నితనిని ఈజిప్టుమార్గమున హిందూ దేశమునకు వచ్చి యీ యాంగ్లేయులను వెడలగొట్టవలసినదని ఆంగ్లేయులతో విరోధించియున్న టిప్పుసుల్తాను నెపోలియసు కాహ్వానము లంపెను. ఈ పరిస్థితులలో ఆంగ్లేయుల గౌరవము తగ్గిపోయి ఫ్రెంచివారి గౌరవము హెచ్చుచుండెను. వెల్లస్లీ యీ పరిస్థితులు చూచి ఆంగ్లేయుల పలుకుబడిని హెచ్చించుటకు మార్గము లాలోచించినాడు. దిగ్విజయముచేసి జయించుట కలలోనివార్త. అందువలన చాణక్య నీతిప్రయోగింప దలచినాడు. స్వదేశరాజులతోమంచి మాటలాడి వారితో సంధిచేసికొని ఆసంధిషరతులందు బ్రిటిషు వారిపలుకుబడికి కావలసినకట్టుబాటులు చేయదలచినాడు.స్వదేశ స్వాతంత్ర్యమును కాపాడుటకును ఇతరులతో యుద్ధము కలిగిన వారికి భయములేకుండగ నుఁడుననిచెప్పి బ్రిటిషు సైన్యముల నుంచుకొనుట మంచిదని నయమునను, భయమునను, కొందరిని ప్రోత్సహించి తంత్రమును నడిపినాడు. కొందరంగీకరించినచో అందరును దారికివత్తురు. ఇట్లుచేసినచో ఫ్రెంచివారి పలుకుబడి తగ్గిపోయి ఆంగ్లేయుల పలుకుబడి హెచ్చును. ఆంగ్లేయులకిక భయముండదు స్వదేశరాజులు కోరలు దీసిన పాములగుదురు. స్వదేశరాజుల స్వాతంత్ర్యము నాంగ్లేయు లంగీకరించి వారి కపాయము రాకుండ సహాయము చేయుచుండుటకు స్నేహముగ నుండుటకు పూచీపడి ఆంగ్లసైన్యములను తమరాజ్యమున నుంచుకొని వాని కగువ్యయముక్రింద కొంతసొమ్మునో కొంత అయివజువచ్చు రాజ్యమునో యిచ్చునట్లును బ్రిటిషుప్రభుత్వము అనుమతిలేకుండా యితరులతో యుద్ధముగాని శాంతి సంధిగాని చేసికొనకుండునట్లును తమరాజ్యస్థానమున నాంగ్లేయ ప్రభుత్వ ప్రతినిధిని రాయబారిగ నుంచుకొనునట్లు ఒడంబడికలు వ్రాయించుటకును రాయబారములు నడిపెను.
ఫ్రెంచివారి యొత్తిడివలన స్వదేశ సంస్థానాధీశుల సహాయము ఆంగ్లేయుల కత్యవసరమయ్యెను. ఏదోవిధముగా వారిని మంచిచేసుకొనవలయును. మైసూరు రాజుగానుండిన టిప్పు సుల్తానుకు మార్క్వెస్ ఆఫ్ వెల్లస్లీ వ్రాసిన లేఖలో నీ యుద్దేశము స్పష్టముగా కనబడుచున్నది. “సగౌరవమైన ఈ లేఖలోని సంగతులు తమరు చిత్తగించినచో నీ క్రింది సంగతులు విశదముకాగలవు. ఫ్రెంచిజాతివారు మానవధర్మమును, గౌరవమును, మతమును పాడుజేసినారు. ప్రపంచములోని అన్ని రాజరికములు, పరిపాలనాక్రమములు, మతములు, వారి యాశాపిశాచమునకు తనివితీరని కొల్లకు నాశనమునకు గురికా వలసిన వనియే వారి తలంపు. రెండవ సంగతి. ఇస్లాముమతమునకు అధీశుడగు ఖాలీఫును వారు దౌర్జన్యము చేసినారు. మహమ్మద్ ప్రవక్తగారి జ్ఞాపకములు మిగిలియున్న దేశములో యుద్ధము ప్రారంభించి నష్టపెట్టుచున్నారు.
ప్రస్తుత మీ ఫ్రెంచివారి నెదిరించుటకొరకు బ్రిటిషువారికిని గ్రాండ్ సీనియర్ కును స్నేహ సంబంధమైన ఒడంబడిక సంధిషరతులు జరిగి యున్నవి. బ్రిటిషుజాతికి వ్యతిరేకముగా మీరు ఫ్రెంచివారితో స్నేహము చేయుచున్నసంగతి గ్రాండ్ సీనియర్ కు తెలిసినది. ఫ్రెంచివారి కుట్రలవలన మోసముల వలన ద్రోహమువలన సీనియరుకు కలిగిన అనుభవ ఫలితము నతడు మీకు తెలియపరుపదలచినాడు. బ్రిటిషుసైన్యబలముల నుండి ప్రస్తుతము తప్పించుకొని తిరుగు ఫ్రెంచివారి వలన మీకు సహాయము కలుగునను పొరబాటు తలంపు మానవలెనని ఆయన మిమ్ముల హెచ్చరించుచున్నాడు. మీ ప్రవక్తల గోరీలను అపవిత్రము చేయుట పూర్తిచేసి మతము ధ్వంసము చేయువరకు గూడ వారు మీకు సహాయము చేయవత్తురనుట కల్ల. నేను అనేకమారులు మీకు సూచించుచు వచ్చిన రాజీ పద్దతు లింతవరకు మీరు పెడచెవిని బెట్టి యుంటిరి. మీమత గురువుయొక్క హితబోధలనైన మీరు విశ్వసించి ఇప్పుడు మారాయబారికి మీరు దర్శనమిచ్చి అతనితో మాటలాడి మామిత్రమండలికిని మీకును గల అభిప్రాయభేదముల నన్నిటిని ఫైసలు చేయించి ప్రపంచశాంతికి భంగము కలిగించు (ఫ్రెంచి) వారినుండి ఈ దేశమును రక్షింప తోడ్పడెదరని నమ్ముచున్నాను.”
III
గవర్నరు జనరలు హేస్టింగ్సు (1818-31) ప్రైవేటు జర్నలువలన ఆనాడు స్వదేశ సంస్థానములపట్ల ప్రయోగింపబడిన రాజనీతి స్పష్టపడుచున్నది. “ఇప్పుడు వాతావరణమెల్ల యుద్ధమేఘములతో నిండినది. దీనికి ముఖ్యకారణము స్వదేశరాజులతోడి సంబంధము లింతవరకు నిర్ధారణ కాకపోవుటయే! వారితో మనము చేసికొన్న సంధిపత్రములందు వారినిస్వతంత్రరాజులుగా మనము పరిగణించుచున్నాము. వారి యాస్థానములకు మనము మన ప్రతినిధులను (రెసిడెంట్లను) పంపుదుము. వీరు కేవలము రాయబారులుగామాత్రమే వ్యవహరింపక సర్వాధికారులుగా ప్రవర్తింతురు. ఆ రాజుల స్వంత వ్యవహారములందుగూడ వీరు జోక్యము కలిగించు కొందురు. వారి కెదురుతిరుగు దుర్మార్గ ప్రజలకు వీరు మద్దతుచేయుదురు. సర్వాధికారము పెత్తనమును బహిరంగముగా ప్రదర్శనము చేయును. తాను జరిగించు చర్యలకు ప్రభుత్వము మద్దతు చేయగలందులకు మనకు లాభింపగల సందర్భముల నేవో కొన్ని చూపించును. అంతట మన కౌన్సిలువారతని నాయొక్కవిషయముననేగాక అన్నివిషయములందును సమర్థించి మద్దతుచేయుదురు. ఇక ఈరాజుల వారసత్వము విషయమునగూడ అనవసరముగా మనము జోక్యము కలిగించుకొనుచున్నాము. వీనివలన ఆరాజులకు లోపల క్రోధముకలుగుచున్నది.” అని 1-2-1814 తేదీన వ్రాసికొన్నాడు. ఫిబ్రవరు 16 వ తేదీన “మనముఖ్యోద్దేశము బ్రిటిషుప్రభుత్వముయొక్క సర్వాధికారమును పేరునకు స్థిరముగా నెలకొల్పుటయై యుండవలెను. పేరునకు గాకపోయినను వాస్తవమునకు తక్కిన రాజులెల్లరు మనకు సామంతులుగా నుండునట్లు చేయవలెను. మొగలుచక్రవర్తి క్రింద నున్నట్లు గాకపోయినను మనము వారి రాజ్యములు వారి కుండనిచ్చినందులకు ప్రతిఫలముగా వారు తమసైనికబలములెల్ల మనకు సాయమున కుపయోగించి తోడ్పడవలెను. ఈ రాజులలో తగవులువచ్చినచో ఒండొరులతో పోరాడుకొనక ఈ రాజ్యముల సమ్మేళనములెల్ల అధిపతులమగు మనము చెప్పినట్లు వినవలెను. ఈ రెండు విషయములందు వారు మనకు లోబడియుండవలెను. ఈ షరతులకు కొందఱి రాజులనై నను మనము లోబరచినచో తక్కినవా రందఱును లోబడితీఱుదురు. ఢిల్లీ చక్రవర్తి యధికారమున కిది విరుద్ధమైనను వీలునుబట్టి మన మీ ఏర్పాటులు చేసికొని తీరవలెను. పరిస్థితులు చాల కష్టముగా నున్నవి, గాని అదనుకొఱకు వేచియుండి దీనిని సాధించెదను" అనినాడు.
ఫ్రెంచిజాతితోడి యుద్ధభయ ముండినందున ప్రారంభములో బ్రిటిషువారు భారతదేశ స్వదేశరాజులతోను, నవాబులతోను చేయుసంధిపత్రములు ఒకరికొకరు సహాయభూతులుగా నుండునట్టి సమానగౌరవ షరతులతో జరుగుచుండెను. ఫ్రెంచివారి నేదోవిధముగా సాధించవలెనని తమతో స్నేహముగ నుండిన స్వదేశ సంస్థానముల రాజులు సైన్యము లుంచుకొనుట కును, వా రితర రాజులతో సంధియేర్పాటులు చేసికొనుటకును బ్రిటిషువా రంగీకరించుచుండిరి. ఫ్రెంచివారి భయముపోయి నప్పటినుండియు బ్రిటిషుప్రభుత్వముయొక్కనీతి మర్యాదలును మార్పుజెందెను. 1850 ఆప్రాంతములలో జరిగిన సంధిపత్రములందు సమానప్రతిపత్తి గానరాదు. తమతోసంధి చేసికొను స్వదేశసంస్థానములు తమ యధికారమునకు లోబడిన సామంతరాజ్యము లను భావముతో నీ సంధిపత్రములు వ్రాయబడ సాగెను. స్వదేశసంస్థానము లితర సంస్థానములతో ప్రత్యేక సంధి యేర్పాటులు చేసికొనుటను ఆంగ్లేయకంపెనీ ప్రభుత్వము నిషేధించెను.
ఈసంస్థానములకు సహాయముచేయుట కను నెపముతో నాంగ్లేయ సైన్యములను ఆ యా సంస్థానములందు నిలిపియుంచి వానికగు వ్యయము నీ సంస్థానములు భరింపవలెనను నిర్బంధపు షరతులను సంధిపత్రములం దుదహరించిరి. ఈ సంస్థానముల రక్షణముకొరకు తాముంచిన సైన్యముల ఖర్చులక్రింద నొక నిర్ణీతపు మొత్తమును కప్పముగాచెల్లించు షరతుకూడా సంధులందు చేర్చిరి.
ఇట్లీసంస్థానములు రెక్కలువిరిగిన పక్షులస్థితికి గొనిరాబడెను. పూర్వము వీరికుండిన ' నేటివు' పటాలములు, ఫ్రెంచి యుద్యోగులుపోయి యిప్పు డాంగ్లేయ పటాలము లాసంస్థానములందు నిలిపి యుంచబడెను. పైకి వాని రక్షణకొఱకు, సహాయముకొఱకు అని చెప్పినను, నిజముగా నాంగ్లేయప్రభుత్వమువారికి వ్యతిరేకముగా వీ రెట్టి కుట్రలు జరిగించకుండా కనిపెట్టి యుండుటకును ఆంగ్లే య రాజ్యాధిపత్యమునకు తోడ్పడుటకునే యీ పద్ధతి అవలంబించబడెను. ఇది అనేక విధములుగా బిటీషువారికి లాభకారిగను స్వదేశసంస్థానములకు భరింపలేని భారముగను నుండెను. ఈ సైనిక వ్యయముల ఖాతా పెరుగుట, సంస్థానాధీశులు చెల్లించలేకుండుట, దీనికి ప్రతిఫలముగా రాజ్యభాగము లాంగ్లేయులకు వ్రాసి యివ్వబడుట, యింకననేకసౌకర్యము లొసగుట పరిపాటి యయ్యెను.
స్వదేశసంస్థానముల యాస్థానములలో నాంగ్లేయ ప్రభుత్వప్రతినిధులు రెసిడెంట్లనుపేరున నిలుపబడిరి. వీరునిజముగా నాంగ్లేయ గూఢచారులుగానుండి సంస్థానాధీశుల పట్ల కుట్రచేయుచు వారిపైన చాడీలు చెప్పుచు వారిని కూలద్రోయు చుండిరి. వీరిని చూచిన భయము అసహ్యము వృద్ధియయ్యెను. వీ రాయా సంస్థానములందు తమకుతంత్రములను ప్రయోగించుచు సర్వాధికారులుగ ప్రవర్తించుచుండిరి. [2]ఈ సంస్థానాధీశులతోడి సంబంధములందు క్రమక్రమముగా బ్రిటిషువారు తమ సర్వాధికారములను బిగువుచేయుచుండిరి. 1818 లో నాటి గవర్నరుజనరలగు హేస్టింగ్సు ఉదయపురము మహారాణాగారితో చేసిన సంధిపత్రము నుదాహరణముగా గైకొనవచ్చును.
దానిలో 3వ షరతు ఉదయపురము మహారాణా బ్రిటిషు ప్రభుత్వమునకు సర్వదా లోబడియుండి వారికి సహకారిగా నుండవలెను. అతడు వారి సర్వాధికారమును శిరసావహించవలెను. ఇతరరాజులతో నెట్టి సంబంధమును కలిగియుండరాదు.
6 వ షరతుప్రకారము సంస్థానము యొక్క ఆదాయములో నాలుగవవంతును 5 సంవత్సరములవరకు కప్పముగా చెల్లించి తరువాత ఆదాయములో 8లో 3 వంతులు శాశ్వతముగా కప్పము గానిచ్చుచుండవలెను. 8 వ షరతు ప్రకారము బిటిషు గవర్నమెంటువారు కోరినప్రకారము ఉదయపుర సంస్థానము సైన్యముల నుంచుకొనవలెను. హేస్టింగ్సు హయాములో స్వదేశ సంస్థానములపైన నిట్లనేక కఠిననియమములు, హెచ్చు కప్పములు విధింపబడుచుండెను. అందువలన వారి ఖజానాలు వట్టివైపోయి వారు ప్రజలపైన భరింపలేని అత్యధికపన్నులు విధించుచుండిరి. డల్‌హౌసీకాలములో నీసంస్థానాధీశులను పీడించుట, అవమానించుట, వారి రాజ్యములను లాగికొనుట విచ్చలవిడిగా జరిగెను. ఈ సంస్థానాధీశులు ప్రజలును గూడ యీబాధలు పడిపడి తుదకు 1857 విప్లవములో పాల్గొనుటకు మొదట సిద్ధపడిరి గాని ఆంగ్ల పరిపాలకులు చాలమంది సంస్థానాధీశులకు ఆసలుగొల్పి కొనివేసి లోబరచుకొనిరి.
అందుకే విక్టోరియా రాజ్ఞి ప్రకటనలో "స్వదేశ సంస్థానాధీశుల హక్కులు, దర్జాలు, గౌరవములు మా స్వంతవానివలెనే గౌరవింతుమనియు సంధినియమములు పాటింతుమనియు” కొన్ని మాటలు చేర్చబడినవి.
IV
సిపాయి విప్లవానంతరము ఈ సంస్థానముల తోడి బ్రిటిష్ సంబంధముల చరిత్రలో క్రొత్తఘట్టము ప్రారంభమైనది. ఆంగ్లేయసలహాదారులు, ఏజెంట్లు రెసిడెంట్లు సంస్థానములయొక్క ప్రభుత్వయంత్రమునందు హెచ్చుపలుకుబడిని సంపాదించి బలవంతులై ప్రవర్తించునట్లు చేయబడిరి. బహిరంగ మర్యాదలను కొన్నిటిని పైకి ప్రసాదించుచు, క్రమక్రమముగా ఆంగ్లేయప్రభుత్వముయొక్క సర్వాధికారములను బిగువుపరుపసాగిరి. ప్రతి సంస్థానములోను రెసిడెంట్లు నియమింపబడిరి. చాల సంస్థానములందు పేరున కాసంస్థానాధీశుడు రాజుగ నుండెను గాని నిజముగా పరిపాలించువాడు రెసిడెంటే! సైనికవ్యయముకొఱకు కప్పములు విధింపబడని సంస్థానములు సైన్యములనే పోషించవలసి యుండెను. బ్రిటిష్ వారి సైనిక వ్యూహములకొఱకు సంస్థానములందు రైళ్లను రోడ్లను బ్రిటిషువారు బలవంతముగా నిర్మించిరి. తపాలా తంతి చెలామణి బ్రిటిషువారు తమ చేతులలో నుంచుకొనిరి. ఆంగ్లప్రభుత్వ యిజారాలగు ఉప్పు, నల్లమందు సంస్థానములు తయారు చేయరాదు. గనులను త్రవ్వు హక్కులను ఆంగ్లేయకంపెనీల కిచ్చునట్లు ఒత్తిడిచేసిరి. తమ పలుకుబడి యధికారములను వినియోగించి బ్రిటిషువర్తకమును అభివృద్ధి పరచిరి. ఈబ్రిటిషురాజ్యతంత్రముయొక్క రాజ్యనీతిసూత్ర మేమనగా నీ సంస్థానాధీశులకు ప్రజలపైనగల నిమిత్తమాత్రములగు నిరంకుశాధికారములను హెచ్చించుట, బ్రిటిషువారితోడి సంబంధములందుమాత్రము వారి యధికారములను తగ్గించుట, సంస్థానముల ప్రజలు తమ బాధలనుగూర్చి ఆందోళన చేసి తిరుగుబాటు చేయకుండా వారిని అణచియుంచుటకు బ్రిటిషు సైన్యములెల్లప్పుడును సంసిద్ధముగ నుంచబడునుగాని ఈసంస్థానాధీశుల క్రింద ప్రజ లెంత బాధపడుచున్నను వారి సివిలు హక్కులను సంరక్షించుటకైన నీ యూంగ్లేయ ప్రభువులు ప్రయత్నింపరైరి.
స్వదేశ సంస్థానముల యొక్క వంశపారంపర్యపు హక్కుదారు లెవరాయని నిర్ణయించుటలో కూడా బ్రిటిషు ప్రభుత్వమునకు హక్కుకలదని మణిపురము విషయమున 1891 లో నింగ్లాండులోని ఇండియా రాజ్యాంగ కార్యదర్శి - బహిరంగముగా ప్రకటించుటతో నీసంస్థానములపైన బ్రిటిషు ప్రభుత్వము చలాయించు సర్వాధికారములు స్పష్టీకరింప బడినవని చెప్పవచ్చును.
స్వదేశసంస్థానములలో సివిలు క్రిమినలు న్యాయవిచారణధికారములు చలాయించు సంస్థానాధీశుల రాజ్యములు, సార్వభౌమ ప్రభుత్వమువారికిని సామంత రాజ్యములకును సమష్టి గానట్టి యధికారములు గల రాజ్యములు, అని రెండు తరగతులుగా విభజించిరి. ఢిల్లీచక్రవర్తి సిపాయి విప్లవమున పాల్గొనెనను నేరమున కాతనిని విచారించి శాశ్వత కారాగార శిక్ష విధించుటతో భారతదేశ రాజులపైన మొగలాయి చక్రవర్తి సార్వభౌమత్వము పేరులేకుండ పోయినది. ఆంగ్లేయ రాజ్యమకుటమే భారతదేశ సార్వభౌమత్వమును వహించినది. ఈ సంస్థానములకు విదేశ వ్యవహారములు చేసికొను . హక్కులులేవు. విదేశ ప్రభుత్వములతో గాని ఇతర సంస్థానములతో గాని ఎట్టి సంధి యొడంబడికలు చేసికొనవీలులేదు. బ్రిటిషు ప్రభుత్వము వారి అనుమతి లేకుండా ఐరోపాజాతీయులనుగాని అమెరికా జాతీయులనుగాని ఉద్యోగులుగా నియమింపరాదు. ఇతర రాజ్యములయొక్క వ్యాపార ప్రతినిధులను గూడ వీరుంచుకొనవీలులేదు. బ్రిటిషు ప్రభుత్వమువా రిచ్చిన బిరుదులు తప్ప విదేశీయ బిరుదులుగూడ స్వీకరింపరాదు. తన ప్రజలు విదేశములకు పోవదలచినచో తాను “ ప్యాసుపోర్టు" చీటినీయ వీలులేదు. ఇతరదేశములతో వ్యాపార సంబంధములు జరుపవలెనన్నచో బ్రిటిషు ప్రభుత్వముద్వారా జరుపుకొనవలెను. తనపట్ల నేరముచేసినవారి నెవరినైన తాను విచారించుటకు పట్టుకొనవలెనన్నచో బ్రిటిషు ప్రభుత్వము వారిని “ఎక్ స్ట్రాడిషను" చర్య జరుపుడని కోరవలెను. స్వదేశసంస్థాన ప్రజలు విదేశములలో బ్రిటిషు ప్రజలుగనే పరిగణింపబడుదురని మస్కట్ వారి సంధివలన 1873 లో స్థిరపడినది. స్వదేశస్థానములయొక్క సరిహద్దులు అంతర్జాతీయ ధర్మమున బ్రిటిషు సరిహద్దులుగా పరిగణింపబడును. అనగా సంస్థానమునకు వ్యక్తిత్వము లేదన్నమాట !
సంస్థానములలో నొండొరులకు గల తగవులు బ్రిటిషు ప్రభుత్వమువారివలన పరిష్కరించు కొనవలెను. స్వదేశసంస్థానములను సంరక్షించు బాధ్యత, . శాంతిభద్రతల బాధ్యత బ్రిటిషువారిదే గనుక వారికి సైన్యము లనావశ్యకములని 1844 లో గ్వాలియరుతో సంధిచేయుటలోను 1881 లో మైసూరును పూర్వరాజుకు వశముచేయుటలోను వారుంచుకో తగిన సైన్యముల సంఖ్య తగ్గింపు చేయబడెను. శాంతిభద్రతలు కాపాడు బాధ్యత బ్రిటీషువారిదే గనుక సంస్థానములు అవసరము వచ్చినప్పుడు వారి ఉత్తర్వులెల్ల శిరసావహించవలెను. సంస్థానములుంచు కొనదగిన ఆయుధములు నిర్ణయింపబడెను. లోపల కోటలు దుర్గములు బలముచేయరాదు. బ్రిటిషు సేనలకు అన్ని సదుపాయములు చేయవలెను.
V
ఇటీవల భారతదేశమున జాతీయోద్యమము ప్రబలుచున్న సందర్భమున కొంతకాలమునుండి బ్రిటిషువారి సంస్థానములతోడి సంబంధములందు ప్రయోగించు రాజనీతిలో మరల కొంతమార్పు కలిగెను. భారతదేశ జాతీయైక్యతను విచ్ఛిన్నముచేయుటకును, అఖిలభారత జాతీయ కేంద్రప్రభుత్వము నిర్మించుట కాటంకము కలిగించుటకును, ఈ సంస్థానములు స్వతంత్రప్రభుత్వములని ప్రకటింపసాగిరి. కర్జను రాజప్రతినిధిగా నుండగా నీ సంస్థానాధీశులు చేయు ప్రజాపీడనము దుర్వ్యయమునుజూచి యతడు వానిని మందలించి ఈ సంస్థానముల ఆదాయమును కేవలము స్వప్రయోజనముకొఱకుపయోగించుట కీ సంస్థానములు ఈ రాజుల స్వంతజమిందారీలు కావనియు కేవలము సోమరితనముతో కాలము వెళ్లబుచ్చుట కీ సంస్థానాధీశులకు భగవంతుడు శాశ్వతపట్టా వ్రాసి యివ్వలేదనియు హెచ్చరించినాడు. వీరు విచ్చలవిడిగా నింగ్లాండు పోవుటను నిషేధించినాడు. గాని తరువాత హార్డిం రాజ ప్రతినిధియైనప్పుడు సంస్థానాధీశుల విదేశవ్యవహారములపైన అనవసరపుహద్దు లేర్పరచుట ఈ సంస్థానాధీశుల యాత్మగౌరవమునకు భంగము అనినాడు. భారతదేశ స్వదేశసంస్థానములయొక్క రాజకీయ ప్రతిపత్తినిగూర్చి విచారించుటకు 1927 లో బ్రిటిషు గవర్నమెంటువా రేర్పరచిన విచారణసంఘమువా రీ సంస్థానముల స్వాతంత్ర్యమును సూత్రీకరించిరి. భారతదేశశాసనసభలకు బాధ్యతవహించు కేంద్రప్రభుత్వము స్థాపించునెడల నది నూతన రాజ్యాంగముపైన నాధారపడిన క్రొత్త ప్రభుత్వమగుననియు బ్రిటిష్‌ప్రభుత్వమువారికిని ఈ సంస్థానాధీశులకును చరిత్రరీత్యా ఏర్పడిన పరస్పర సంబంధములు వారి యంగీకారము లేకుండా ఈ క్రొత్తప్రభుత్వమునకు ట్రాన్సుఫరు చేయబడరాదనియు సలహా నిచ్చిరి. సంస్థాన ప్రజల పక్షమున కొందరు ప్రతినిధు లీ విచారణసంఘమును దర్శించి తమ సాధక బాధకములు చెప్పుకొన దలపగా సంస్థానములందలి ఆంతరంగిక పరిపాలనతో బ్రిటిషుప్రభుత్వమునకు సంబంధములేదని సాకుచెప్పి వారిమాటలు వినుటకు నిరాకరించిరి. అయితే పైన చెప్పబడినట్లు బ్రిటిషుప్రభుత్వమువారికి నీ సంస్థానములకును జరిగిన అన్ని సంధిపత్రములలోను ఆయా సంస్థానప్రజల సౌఖ్యమును పెంపొందించుటను. గూర్చిన షరతులు చేర్చబడియే యున్నవి. మరియు పైన జెప్పినట్లు బ్రిటిషుప్రభుత్వమువా రింతవరకు తమ సర్వాధికారములను చలాయించుచునే యున్నారుగాని ఇప్పుడీ రాజ్యాంగ సంస్కరణల సందర్భమున నిట్లు సాకులు చెప్పుచున్నారు! ఈ కమిటీవారి సూచనలను సైమను కమిటీవారును తమ నివేదికలో అంగీకరించినారు.
ఇటీవల శాసింపబడిన నూతన ఇండియా రాజ్యాంగ చట్టమును చేయుటలో బ్రిటిషువా రీ నెపమున కొంత రాజ్యాంగ నాటకము నాడి సంస్థానములపైన ఆంగ్లరాజమకుటమునకుగల సర్వాధికారములను పురస్కరించుకొని ఈసంస్థానములను తమ కీలుబొమ్మలుగా నుపయోగించుకొని భారతదేశ ప్రజా ప్రతినిధుల ప్రభుత్వమునకు ఆటంకములుకలిగింప గల అనేక బందోబస్తులను జేసికొనినారు.
ఈ సంస్థానముల రాజ్యభాగము 824000 చతురపు మైళ్లు వైశాల్యము కలిగియున్నను దీని జనసంఖ్య బ్రిటిషు భూభాగముతో పోల్చిచూచినచో చాల హీనముగ నున్నది. దీనిలో హైదరాబాదు, మైసూరు, బరోడా రాజ్యములు గాక తక్కిన రాజ్యములు రాజపుత్రస్థానమువంటి నిరుపయోగమైన పంటలులేని భూములుగనో లేక అడవి ప్రదేశములో కొండప్రదేశములుగనో యున్నవి. దీనికి కారణము ఆంగ్లేయులు మంచి భూభాగము లెల్ల పూర్వరాజులనుండి లాగుకొని బ్రిటిషు ఇండియాలో చేర్చివేయుట. ఈ రాజులను నాయకులను యుద్ధములం దీమారుమూలలకు తరిమియుండుట 1857 తరువాత క్రొత్తరాజ్యాక్రమణలు చేయక పోయినను ఆనాటికి మిగిలిన సంస్థానము లిట్టిస్థితిలో మిగిలెను.
నాలుగవ ప్రకరణము
బ్రిటిషుప్రభుత్వ తత్వము
I
మహమ్మదీయ ప్రభుత్వమునకు ఇంగ్లీషు ప్రభుత్వమునకు తారతమ్యములు
బ్రిటిషువా రీ దేశాక్రమణ జేయక మునుపు భారతదేశమును పరిపాలించిన మహమ్మదీయ ప్రభువులు కూడా ఆంగ్లేయులవలెనే మొదట విదేశీయులుగ నుండిననువారి పరిపాలనకును బ్రిటిషుపరిపాలనకును చాల తారతమ్యము కలదు.
మహమ్మదీయులు మొదట విదేశీయులే యైనను వా రీ దేశమున స్థిరపడి అచిరకాలములోనే దేశప్రజలలో కలిసిపోయి ఈ దేశమునే తమస్వదేశముగా జేసికొనిరి. అందువలన వారిది దేశీయుల పరిపాలనముగనే యుండెను. దేశముయొక్క అభివృద్ధికి వారు తోడ్పడిరి. ఇచ్చటి ధనమునెల్ల ఇచ్చటనే ఖర్చుపెట్టిరి. ఇక ఆంగ్లేయులన్ననో తమ జాత్యభిమానము వీడక తా మీ దేశమున కేవలము ప్రభుత్వాధికారములు చలాయించుటకు వచ్చిన పరిపాలకుల మనియు నీదేశమువలన లాభము పొందుటకు తమకుహక్కు కలదనియు తలచి ఈ దేశము యొక్క భాగ్యభోగ్యములనెల్ల సీమకు తరలింపసాగిరి. వీరిది - కేవలము విజాతీయ పరిపాలనముగనే యుండెను. దేశప్రజలతో వీరు కలిసిమెలసి యుండక వేరింటికాపురము చేయుచు నీ దేశముయొక్క క్షేమ లాభములమాట ఆవంతయైన గమ