బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/దేవుని ఆత్మ
1. దేవుని ఆత్మ
మనవిమాట
ఈ పుస్తకం పవిత్రాత్మనుగూర్చిన వేదసత్యాలను సంగ్రహంగా తెలియజేస్తుంది. దీన్ని పూర్వమే బైబులు భాష్యం 93-95 సంచికల్లో ప్రచురించాం.
ఇక్కడ ఆత్మనుగూర్చిన అంశాలను చిన్నచిన్న ధ్యానాలుగా పొందుపరచాం. పాఠకులు ఈ ధ్యానాలను నిదానంగా చదువుకొని భక్తితో మననం చేసికోవాలి. వీటిల్లో ఉదాహరించిన బైబులు ఆలోకనాలను నేరుగా బైబులునుండే చదువుకోవాలి. ఇది మూడవ ముద్రణం.
విషయసూచిక
1. దేవుని ఆత్మ
1. ఆత్మ నామాలూ సంకేతాలూ 3
2. ఆత్మ దేవుని క్రియాశక్తి 4
3. ఆత్మ దేవుని శక్తి 6
4. ఆత్మ దేవుని తేజస్సు 8
5. పవిత్రమైన ఆత్మ 10
6. ప్రేమనిధియైన ఆత్మ 12
7. జీవజలం ఒసగే ఆత్మ 13
8. రక్షణచరిత్రను నడిపించే ఆత్మ 5
9. కడపటిదినాల్లో దేవుడిచ్చే దానం 17
2. క్రీస్తుని ఆత్మ
10. క్రీస్తు - ఆత్మా 19
11. ఆత్మతో నిండిన క్రీస్తు 20
12.ఆత్మను దయచేసే క్రీస్తు 22
13.క్రీస్తుకి సాక్ష్యంపలికే ఆత్మ 23
14.మరియను నడిపించిన ఆత్మ25
3. తిరుసభలో ఆత్మ
15.తిరుసభ ప్రారంభంలో ఆత్మ 27
16.క్రీస్తుతో ఐక్యంజేసే ఆత్మ 29
17.నరుళ్ళో దేవుని పోలికను కలిగించే ఆత్మ 31
18.దైవపుత్రత్వాన్ని ఒసగే ఆత్మ 32
19.ప్రేషిత సేవ చేయించే ఆత్మ 34
20.ప్రవచనం చెప్పించే ఆత్మ 36
21.సంస్కారాల్లో పనిజేసే ఆత్మ 38
22.నైతికజీవితం గడిపేలా చేసే ఆత్మ 41
23.శారీరక వాంఛలను జయించేలా చేసే ఆత్మ 43
24.పాపపరిహారం దయచేసే ఆత్మ 45
25.ప్రార్ధన చేయించే ఆత్మ 48
26.దైవపుణ్యాలకు కర్తయైన ఆత్మ 50
27.ఆత్మా - దైవవాక్కు 52
28.వరాలు దయచేసే ఆత్మ53
29.శాంతి సంతోషాలు ప్రసాదించే ఆత్మ 55
30.మన బాధల్లో మరణంలో ఆత్మ 56
31.ఆత్మ వినయం 57
32.తల్లిగా ఆత్మ 59
33.ఆత్మకు బదులుగా ముగ్గురు62
34.ఆత్మపట్ల మన బాధ్యతలు63
35.కొన్ని ప్రార్థనలు 65
-ప్రశ్నలు 66
1. ఆత్మ నామాలూ, సంకేతాలూ
1. బైబుల్లో ఆత్మకు ప్రధానమైన హీబ్రూ పేరు రువా (ఆత్మ, వూపిరి). ఈ పేరు కాక ఇతర నామాలు కూడ కొన్ని వున్నాయి. ఆత్మ "ఆదరణ కర్త" - యోహా 14,16. ఓదార్చేవాడని ఈ పేరుకి అర్థం. అతనికి "సత్యస్వరూపి" అని ఇంకో పేరు - యోహా 16,13. రక్షణ ప్రణాళికను తెలియజేసేవాడని ఈ పేరుకి అర్థం. "దేవుని వాగ్దానం" అని మరో పేరు - గల 3,14. తండ్రి ఈ యాత్మను పంపుతానని వాగ్దానం చేసాడు కదా! "దత్త పత్రత్వపు ఆత్మ" అని వేరొక పేరు - రోమా 8,15. ఆత్మద్వారా మనం తండ్రికి దత్తపుత్రులమూ పత్రికలమూ ఔతామని భావం. ఇంకా అతనికి "క్రీస్తు ఆత్మ", "ప్రభువు ఆత్మ", "దేవుని ఆత్మ", "తండ్రి ఆత్మ" అనే నామాలుకూడ వున్నాయి. 1పేత్రు 4,14 అతన్ని "మహిమకల ఆత్మ" అని పిలుస్తుంది. "పవిత్రాత్మ" అనే పేరు చాలాచోట్ల విన్పిస్తుంది.
2. బైబుల్లో ఆత్మకు చాల సంకేతాలున్నాయి. ఇక్కడ ముఖ్యమైనవాటిని పరిశీలిద్దాం
1. జలం ఒక సంకేతం. నీరు ప్రాణాన్నిచ్చినట్లే ఆత్మకూడా మనకు జీవాన్నిస్తుంది. మనం జ్ఞానస్నాన జలాలద్వారా ఆధ్యాత్మిక జీవాన్ని పొందుతాం - యోహా 3,5. జీవజలమనికూడ ఆత్మకు పేరు - యోహా 7,28. ఆత్మను జలాన్ని లాగ పానంచేస్తాం - 1కొ 12, 13.
2. అభిషేకం మరో సంకేతం - 1యేహా 2,20. ఈ పదం ప్రధానంగా భద్రమైన అభ్యంగనాన్ని సూచిస్తుంది. క్రీస్తకీ మనకీకూడ అభిషేకం చేసేది పవిత్రాత్మే - లూకా 4, 18.
3. అగ్ని ఇంకో సంకేతం. ఇక్కడ అగ్ని అంట్టే పాపమాలిన్యాన్ని తొలగించి మనలను పవిత్రపరచే శక్తి అని భావం. క్రీస్తు మనకు ఆత్మతోను అగ్నితోను జ్ఞానస్నానమిస్తాడు - లూకా 3,16. మనం మన హృదయంలోని ఆత్మాగ్నిని ఆర్పివేసికోగూడదు - 1తెస్చ 5,19.
4. మేఘం, వెలుగు ఇంకో ప్రతీక. పూర్వం మేఘం మోషే గుడారంమీదికి దిగివచ్చింది - నిర్గ 33,9–10. ఆత్మ మేఘంలాగ మరియమీదికి దిగివచ్చి ఆమెను గర్భవతిని చేసింది - లూకా 1,35. క్రీస్తు దివ్యరూపధారణ సమయంలో మేఘం కన్పిస్తుంది - లూకా 9,84. అతడు మేఘంగుండ స్వర్గానికి పోయాడు - అచ 1,9. 3 5. ముద్ర మరో ప్రతీక. తండ్రి క్రీస్తుకి ముద్ర వేసాడు - యోహా 6,67. ఆత్మ మనపై క్రీస్తు ముద్ర వేస్తుంది - ఎఫే 4,30.
6. చేయి, వ్రేలు ఇంకో ప్రతీక. క్రీస్తు దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టాడు — లూకా 11,20. అపోస్తలులు ప్రజలపై హస్తాలను చాచడం ద్వారా వారికి పవిత్రాత్మను దయచేసారు - అచ 8,17. ఇక్కడ చేయి, వ్రేలు దైవశక్తిని సూచిస్తాయి.
7. పావురం మరో సంకేతం. జ్ఞానస్నానానంతరం పవిత్రాత్మ పావురం రూపంలో క్రీస్తుమీదికి దిగివచ్చింది. మన దైవర్చానలో పావురం పవిత్రాత్మకు చిహ్నం. మెస్సియా ఆత్మశక్తిద్వారా నూత్న ప్రజలను తయారుచేస్తాడని పావురం భావం.
మనం ఈ నామాలనూ సంకేతాలనూ నిదానంగా ధ్యానించుకొని ఆత్మపట్ల భక్తిని పెంచుకోవాలి.
ప్రార్థనా భావాలు
ఇరెనేయస్ భక్తుడు ఈలా వ్రాసాడు. మనం జ్ఞానస్నానం స్వీకరించినపుడు ఆత్మద్వారా నూత్న జన్మను పొందుతాం. ఆత్మ మనలను క్రీస్తు దగ్గరికి చేర్చగా. క్రీస్తు తండ్రి దగ్గరికి చేరుస్తాడు. పిత మనకు అవినాశశక్తిని దయచేస్తాడు. క్రీస్తుద్వారా తప్ప ఎవడూ తండ్రిని చేరడు. తండ్రినిగూర్చిన జ్ఞానాన్ని ప్రసాదించేది సుతుడే. అలాగే ఆత్మద్వారా తప్ప ఏ నరుడూ దేవుని కుమారుని చేరలేడు. క్రీస్తుజ్ఞానాన్ని ప్రసాదించేది ఆత్మ ఒక్కటే.
2. ఆత్మ దేవుని క్రియాశక్తి
1. ఆత్మకు హీబ్రూ భాషలో రువా అని పేరు. ఈ శబ్దానికి చాల అర్ధాలున్నాయి. 1. రువా అంటే గాలి, ఊపిరి అని అర్థం. 2. నరునిలోని జీవశక్తికీ తెలివికీ సంవేదనలకూ రువా అని పేరు. 3. దేవుని జీవానికీ క్రియాశక్తికీ గూడ రువా అని పేరు. కనుక ఈ పదం చాల విస్తృతభావాలు కలది.
దేవుని క్రియాశక్తియైన ఆత్మ కొందరు యుద్ధవీరుల మీదికి దిగివచ్చినట్లుగా పూర్వవేదంలోని న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతూన్నాం. ఆ యాత్మ ఒత్నీ యేలుమీదికి దిగివచ్చింది - 3,10. గిద్యోనుమీదికి దిగివచ్చింది - 6,34. యెప్తా మీదికి దిగివచ్చింది - 11,29. అలాగే సంసోనును ఆవేశించింది - 14,19. సౌలుమీదికి దిగివచ్చి అతనికి ఆవేశం పుట్టించింది - 1సమూ 10, 5-6. దావీదుమీదికి దిగివచ్చి అతనిలో వుండిపోయింది – 16,13, ఈ వీరులమీదికి దిగివచ్చిన ఆత్మ వీళ్ళను శత్రువులతో యుద్ధం చేయడానికి ప్రేరేపించింది. ఆత్మ ప్రవక్తలమీదికి గూడ దిగివచ్చింది. ప్రభువు బాధామయ సేవకుని ఆత్మతో నింపాడు - యెష42,1. పేదలకు శుభవార్తను ప్రకటించే ప్రవక్తను ఆత్మతో నింపాడు - 61.1. ఆత్మ ప్రేరణంతో వీళ్లు దైవసందేశాన్ని ఎరిగించారు.
కడన మెస్సియాకూడా ఆత్మను పొందినవాడే
“దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది
అది విజ్ఞాన వివేకాలను దయచేసే ఆత్మ
దూరదృష్టినీ బలాన్నీ ప్రసాదించే ఆత్మ
దైవజ్ఞానాన్నీ దైవభీతినీ దయచేసే ఆత్మ" - యొష 11,2.
2. పూర్వవేదంలో ఆత్మ దేవుని క్రియాశక్తిగా మాత్రమే కన్పిస్తుంది. కాని నూత్నవేదంలో ఈయాత్మడు ఓ వ్యక్తిగా కన్పిస్తాడు. ఓ వ్యక్తిగానే అతడు క్రీస్తుమీదికి దిగివచ్చాడు - యోహా 1,33. ఈ క్రీస్తు మహిమను పొంది తండ్రి నుండి ఆత్మను స్వీకరించాక మనకందరికీ ఆ యాత్మను ప్రసాదిస్తాడు - యోహా 7,39.
పూర్వవేదంలో ఆత్మవరాలున్నాయేకాని ఆత్మడు ఓ వ్యక్తిగా కన్పించడు. నూత్నవేదంలో అతడు ఓ వ్యక్తిగాగూడ కన్పిస్తాడు. మన హృదయాల్లో వసిస్తూ మనలను దివ్యలను చేస్తాడు.
నేడు మనం జ్ఞానస్నానం పొందినపుడే ఆత్మను స్వీకరిస్తాం. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ మన హృదయాలపై క్రీస్తుని ముద్రవేస్తుంది - ఎఫే 1,13-14.
దేవుడు తన ఆత్మద్వారా మనలను తన దగ్గరికి ఆకర్షించుకొంటాడు - యోహా 6,44. ఆత్మ మనలను దేవుని దగ్గరికి చేరుస్తుంది. మనలను దేవుని రాజ్యంలోకి ప్రవేశపెడుతుంది.
ప్రార్ధనా భావాలు
1. వేదపండితులు ముగ్గురు దైవవ్యక్తులకు మూడు ప్రత్యేక కార్యాలు ఆరోపించారు. తండ్రి సృష్టి చేసేవాడు. కుమారుడు మనలను పాపాన్నుండి రక్షించేవాడు. ఆత్మడు మన హృదయాల్లో వసిస్తూ మనలను పవిత్రపరచేవాడు. అతడు ప్రధానంగా హృదయనివాసి. మన హృదయంలోనే వుండే యీ దైవశక్తిని మనం నిత్యం గుర్తిస్తుండాలి. 2. యూదుల రబ్బయుల బోధల ప్రకారం ఆత్మడు మన హృదయాల్లో మాట్లాడతాడు, విలపిస్తాడు, దుఃఖిస్తాడు, సంతోషిస్తాడు, మనలను మందలిస్తాడు, హెచ్చరిస్తాడు,
ప్రోత్సహిస్తాడు, మనకు ఓదార్పును దయచేస్తాడు, ఈ కార్యాలన్నీ మన రోజువారి జీవితంలో జరుగుతూనే వుంటాయి. మన తరపున మనం ఆత్మ మనలో జరిగించే ఈ కార్యాలను జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకొంటూండాలి.
3. ఆత్మ దేవుని శక్తి
1. బైబులు ఆత్మనుగూర్చి మాట్లాడేపుడు ప్రేమ అన్న పదాన్ని అట్టే వాడదు. శక్తి అన్న పదాన్ని వాడుతుంది. కనుక ఆత్మను ప్రధానంగా దైవశక్తిగా గణించాలి.
దేవుని శక్తి యేలాంటిదో క్రీస్తు ఉత్థానంలో కన్పిస్తుంది. "క్రీస్తు బలహీనతవల్ల సిలువమీద చంపబడినా దైవశక్తివల్ల సజీవుడుగా వున్నాడు" - 2కొరి 13, 4. ఈ దైవశక్తి దేవుని ఆత్మే క్రీస్తు ఈ యాత్మద్వారానే ఉత్తానమయ్యాడు. ఆత్మ బలమైంది, శరీరం బలహీనమైంది.
2. పూర్వవేదంలో దైవశక్తియైన ఆత్మ యుద్ధవీరుల మీదికి దిగివచ్చింది. ఆత్మ సౌలుమీదికీ, దావీదు మీదికీ, మెస్సియామీదికీ దిగివచ్చింది. 1సమూ 10,6. 16,13. యోష 112. నూతవేదంలో లూకా ఈ పూర్వవేద సంప్రదాయాన్ని అనుసరించాడు. దేవదూత మరియమాతతో "పవిత్రాత్మ నీపై వేంచేస్తుంది, సర్వోన్నతునిశక్తి నిన్ను ఆవరిస్తుంది" అని చెప్పాడు - లూకా 1,35.ఈ పాదంలోని సమాంతరభావాన్ని బట్టి ఇక్కడ ఆత్మా శక్తి ఒకటేనని అర్థం చేసికోవాలి. కనుక దేవుని శక్తియైన ఆత్మ మరియ మీదికి దిగివచ్చి ఆమెను గర్భవతిని చేస్తుందని భావం. క్రీస్తు బహిరంగబోధ ఆత్మబలంతోనే ప్రారంభమైంది. "పిదప యేసు ఆత్మబలంతోనే గలిలయ సీమకు తిరిగి వెళ్ళాడు" - 4,14. అతడు దేవుని శక్తితోనే దయ్యాలను వెళ్ళగొట్టాడు - 11,20. క్రీస్తు ఉత్థానానంతరం దైవశక్తిని పొందేంతవరకూ శిష్యులు యెరూషలేములోనే వుండాలి - 24,49. ఆత్మ వారిమీదికి దిగివచ్చినపుడు వారికి శక్తి లభిస్తుంది - అకా 1,8. ఈ వుదాహరణలన్నిటిలోను దైవశక్తి పవిత్రాత్మేనని వేరుగా చెప్పనక్కరలేదు.
3. తొలినాటి క్రైస్తవ సమాజంలో శక్తి ఆత్మా కలసిపోతూండేవి. పొలు పవిత్రాత్మతోను శక్తితోను తెస్సలోనీయులకు సువిశేష బోధ చేసాడు - 1తెస్స 4,5. పౌలు బోధ క్రీస్తు ఆత్మనూ శక్తినీ ప్రదర్శిస్తుంది - 1 కొరి 2,4. ఇంకా ఆ బోధ ఆత్మశక్తితో నిండివుండి ప్రజలు విశ్వాసానికి విధేయులై యుండేలా చేస్తుంది - రోమా 15,19. సైఫను దైవానుగ్రహంతోను శక్తితోను నిండిపోయాడు — అ.కా. 6,8. ఈ వేద వాక్యాలనుబట్టి దేవుని మహాశక్తి ఆత్మ అనుకోవాలి. దేవుడు పనికి పూనుకోవడమే శక్తి
ఔతుంది. అతడు ఆత్మద్వారా తన పనిని నిర్వహిస్తాడు. పరిశుద్ధ త్రీత్వంలో క్రియాపరుడైన వ్యక్తి పవిత్రాత్మ.
సృష్టిచేసినపుడూ, యూదులతో నిబంధనం చేసికొన్నపుడూ, సుతుడైన సర్వేశ్వరుని మనుష్యావతార మెత్తించినపుడూ, అతనికి ఉత్థానాన్ని దయచేసినప్పుడూ దేవుడు శక్తితో పనిచేసాడు. ఈ సందర్భంలో అలెగ్జాండ్రియా సిరిల్ భక్తుడు "ఆత్మ అంటే దేవుని శక్తీ, క్రియా అనుకోవాలి. దేవుని పనులన్నిటినీ నిర్వహించేది ఆత్మడే" అని నుడివాడు. నరుల క్రియాశక్తిలో బోలెడంత క్రూరత్వమంటుంది. అది చావును తెచ్చిపెడుతుంది. కాని దేవుని శక్తి అంటే దయ, వరప్రసాదం, ప్రేమ.
ప్రార్ధనా భావాలు
ప్రాచీన క్రైస్తవ భక్తుడెవడో పవిత్రాత్మమీద "వేనిసాంక్తి స్పిరితుస్’ అనే భక్తిమంతమైన గేయం వ్రాసాడు. ఈ గీతంద్వారా నేడు మనం ఆత్మకు చక్కగా ప్రార్ధనం చేసికోవచ్చు.
1. "పవిత్రాత్మమా! వేంచేసిరా
పరలోకం నుండి నీ దివ్యప్రకాశ కిరణాన్ని
మా మీదికి ప్రసరించు
2. దరిద్రులకు తండ్రీ!
వరాలొసగే దాతా!
మా హృదయాలకు జ్యోతీ! వేంచేసిరా
3. శ్రేష్టమైన ఓదార్పు నొసగే దేవా!
మా యాత్మకు మేలైన అతిధీ!
మధురమైన ఉపశాంతికరా! వేంచేసిరా
4. శ్రమలలో విశ్రాంతివి నీవు
వేడిమిలో చల్లదనానివి నీవు
బాధలలో దుఃఖనివారకుడివి నీవు
5. భాగ్యామల జ్యోతీ!
నిన్ను విశ్వసించే భక్తుల అంతరంగాలను
వెలుగుతో నింపు
6. నీ దివ్య సహాయం లేందే
నరుల్లో పాపం దప్ప
మంచి అనేదే చూపట్టదు
7. అపవిత్రులమైన మమ్మ శుద్ధిచేయి
ఎండిపోయిన మమ్ము నీటితో తడుపు
మా గాయాలను మాన్పు
8. లొంగని మా హృదయాలను లొంగదీయి
మా కఠిన మనస్సులను కరిగించు
దారిదప్పిన మమ్ము త్రోవకు జేర్చు
9. నిన్ను విశ్వసించే భక్తులకు,
నిన్ను పూజించే విశ్వాసులకు,
నీ యేడు వరాలను ప్రసాదించు
10. పుణ్యాచరణకు తగిన ఫలాన్నీ
ధన్యమైన మరణాన్నీ
శాశ్వత మోక్షానందాన్నీ మాకు దయచే్యి"
4.ఆత్మ దేవుని తేజస్సు
1. పూర్వవేదంలో ఆత్మ దేవుని తేజస్సు. ఈ తేజస్సు యిప్రాయేలీయులకు సీనాయి కొండపై నిప్పలా దర్శనమిచ్చింది. 'యావే తేజస్సు సీనాయికొండమీద నిల్చింది. ఆరురోజులపాటు మొయిలు కొండను క్రమ్మింది. యావే తేజస్సు కొండ కొమ్మన ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా యిప్రాయేలీయులకు కన్పించింది" - నిర్గ 24, 16-17. ఈ తేజస్సు ప్రకాశపూరితమైన ప్రభువు సాన్నిధ్యమే.
ఈ కాంతే దేవుడు చేసే అద్భుతాల్లోకూడ కన్పిస్తుంది. ప్రభువు మన్నాను కురిపించే సందర్భంలో మోషే యిప్రాయేలీయులతో "మీరు ఉదయం ప్రభువు తేజస్సును చూస్తారు" అన్నాడు - నిర్ధ 16,7. లాజరు ఉత్తాన సందర్భంలో క్రీస్తుకూడ మార్తతో "నీవు విశ్వసించినట్లయితే దేవుని తేజస్సును చూస్తావు" అని పల్మాడు - యోహా 11,40. ఇక్కడ తేజస్సు దేవుడు చేసే అద్భుత కార్యాలే. నూత్నవేదంలో తేజస్సు ఆత్మ అనే పదాలు ఒకదానితో ఒకటి మిళితమైపోయాయి. "అప్పడు మనుష్య కుమారుడు మహాశక్తితోను తేజస్సుతోను మేఘారూఢుడై రావడం చూస్తారు" - మార్కు 13,26. ఈ వాక్యంలో శక్తి తేజస్సూ కూడ ఆత్మే 2. పూర్వవేదంలో కాంతిమంతమైన మేఘం గుడారం మీదికి దిగివచ్చేది - నిర్గ 33,9. ఈ మబ్బు ఆత్మకు చిహ్నం. నూత్నవేదంలో ఈ మొయిలుకు మారుగా పవిత్రాత్మే కన్యమరియ మీదికి దిగివచ్చింది — లూకా 1,35. క్రీస్తు ఆత్మద్వారాను, తేజస్సు ద్వారాను గూడ ఉత్తానమయ్యాడు - రోమా 8,11, 6,4. మనం ఉత్థానక్రీస్తుతేజస్సులోనికి మారిపోతాం - 2కొ 3,18. ఆత్మా తేజస్సు ఒకటేనని చెప్పాం. కావననే 1షేత్రు 4,14 "తేజోమయమైన దేవుని ఆత్మ’ అని వాకొంటుంది. “మానవులందరూ పాపంచేసి, దేవుని తేజస్సును కోల్పోయారు" అంటుంది రోమీయుల జాబు 3,23. అనగా పాపంవల్ల మనం దేవుని ఆత్మను పోగొట్టుకొన్నామని భావం. (తెలుగు బైబుళ్ళు “తేజస్సు" అనే మాటను "మహిమ? అని అనువదించాయి. ఇది పొరపాటు.)
ప్రార్థనా భావాలు
ఓ ప్రాచీన క్రైస్తవభక్తుడు "వేని క్రెయాతోర్ స్పిరుతుస్" అనే గేయం వ్రాసాడు. ఆత్మపట్ల భక్తిని పెంపొందించుకోడానికి ఈ గీతం బాగా ఉపయోగపడుతుంది.
1. "సృష్టికర్తవైన పవిత్రాత్మమా!
నీ భక్తుల హృదయాలను సందర్శించు
నీ బిడ్డలమైన మా యెడదలను
వరప్రసాదాలతో నింపు
2. నీవు ఉపశమనదాతవ
మహోన్నతుడైన దేవుని వరానివి
జీవజలానివి, అగ్నిజ్వాలవు, ప్రేమమూర్తివి,
అభ్యంగన కర్తవు
3. నీవు సప్తవరదాతవు
దేవుని కుడిచేతి వ్రేలివి
పరమపిత వాగ్దానానివి
మాకు వాకుక్తిని ప్రసాదించు
4. మమ్ము నీ వెలుగుతో నడిపించు
మా హృదయాలను నీ ప్రేమతో నింపు
నీ మహాశక్తితో
మా దౌర్బల్యాన్ని తొలగించు
5. శత్రువైన పిశాచాన్ని దూరంగా పారద్రోలు
మాకు శాంతిని దయచేయి
మా నాయకుడవైన నిన్ననుసరిస్తూ
మేము సకలాపదలనుండి తప్పించుకొందుముగాక
6. 5 కృపచే తండ్రిని తెలుసుకొందుముగాక
నీ కరుణచే సుతుని గుర్తింతుముగాక
వారిరువురి ఆత్మవైన నిన్ను
సదా విశ్వసింతుముగాక.
5. పవిత్రమైన ఆత్మ
1. ఆత్మశక్తి, తేజస్సు మాత్రమేకాదు, పవిత్రత కూడ. శక్తి, తేజస్సు, పవిత్రత ఈ మూడు భావాలకు పరస్పర సంబంధం వుంది.
యెషయా ప్రవక్త దర్శనంలో చూచిన దేవుణ్ణి దేవదూతలు "సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు లోకమంతా అతని తేజస్సుతో నిండి వుంది" అని స్తుతిస్తున్నారు - యొష 6,3. ప్రభువు పరాత్పరుడు. నరులకు దూరంగా వుండేవాడు. కనుక పవిత్రుడు. హోషేయ ప్రవచనంలో అతడు "నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని" అంటాడు - 119. తండ్రిలాగే ఆత్మడు కూడ నరులకు దూరంగా వుండేవాడు. కనుక పవిత్రుడు, 2. ఆత్మడు పరలోకానికి చెందినవాడు. కావున పవిత్రుడు. అతడు పైనుండి దిగివచ్చే శక్తి - అ.చ.1,8. స్వర్గంనుండి క్రీస్తుమీదికి పావురంలా దిగివచ్చినవాడు - మార్కు 1,10. పరమండలం నుండి శిష్యులమీదికి గాలిలా వేంచేసినవాడు - అ, చ. 2, 2.
3. క్రీస్తు దేవుని పవిత్రమూర్తి - మార్కు 1,24. ఇతడు ఆత్మద్వారా నరరూపం దాల్చినవాడు, ఆత్మద్వారా పవిత్రుడైనవాడు - లూకా 1,85. దేవుడు అతన్ని పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించాడు - అ.చ. 10,38. క్రీస్తు పునరుత్తానుడైనందున పవిత్రపరచే ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడ్డాడు - రోమా 1,4. పవిత్రుడైన ఆత్మడే క్రీస్తుని పవిత్రపరచాడని ఈ వేదవాక్యాల సారాంశం. 4. ఆత్మ పవిత్రుడైన వ్యక్తి జీవనదాత. అతడు లేందే అంతా శూన్యం. అంతా నిస్సారం. ఆత్మ లేకపోతే శరీరం పాపమూ మృత్యువూ మాత్రమే. ఆత్మ లేకపోతే మోషే ధర్మశాస్త్రం మృత్యుదాయిని మాత్రమే - 2కొరి 3,6.
5. దేవుడూ ఆత్మాకూడ పరాత్పరులు, నరునికి దూరంగా వుండేవాళ్ళ.కాని ఆత్మడు సృష్టి ప్రాణులకు దూరంగావున్నా వారికి చేరువగాగూడ వుంటాడు, అతడు స్వర్గంలో వుండేవాడైనా నరుల దగ్గరికి వచ్చి వారికి దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మడు మనలను పవిత్రపరుస్తాడు - 2తెస్స 2,18.జ్ఞానస్నానంద్వారా మనలో ఓ దేవాలయంలోలాగ వసిస్తాడు. కనుకనే పౌలు “మీ శరీరం మీయందు వసించే పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా" అన్నాడు. - 1కొ 6,19. ఆత్మద్వారా మనం ఆధ్యాత్మిక దేవాలయంలో సజీవ శిలలమౌతాం, పవిత్రులమైన యాజకులం, రాచరికపు గురుకులం, పవిత్రమైన జనం, దేవుని సొంత ప్రజ ఔతాం - 1పేత్రు 2,5.9. కనుక ఆత్మ వలన మనం పరిశుద్దులమౌతాం, అతనిద్వారా క్రీస్తుకి పవిత్ర వధువుగాగూడ తయారౌతాం - ఎఫే 5,26-27. శ్రీసభ క్రీస్తు వధువు. కాని ప్రతి ఆత్మా ప్రతిక్రైస్తవుడూ శ్రీసభలాంటివాడే.
భగవంతుడు స్వయంగానే పరిశుదుడు. కాని సృష్టి ప్రాణులమ్తేన మనం స్వయంగాగాక దేవునికి సమర్పితులం గావడంద్వారా పవిత్రులమౌతాం. కనుకనే క్రీస్తుకూడ తన్ను తాను దేవునికి ప్రతిష్టించుకొన్నాడు - యోహా 17,19.
ప్రార్థనా భావాలు
1. అల్బర్ట్ భక్తుడు ఈలా చెప్పాడు "ఆత్మడు శ్రీసభను నిత్యం పవిత్రపరుస్తుంటాడు. వరప్రసాదాల ద్వారా, దేవద్రవ్యానుమానాలద్వారా, పుణ్యాలు వరాలద్వారా, అద్భుతాలద్వారా అతడు ఈ పవిత్రీకరణ కార్యాన్ని కొనసాగించుకొంటూ పోతాడు". మన తరపున మనంగూడ, మనలను పవిత్రపరచమని ఆత్మను నిరంతరం అడుగుకొంటూండాలి.
2. ఆత్మడు పవిత్రత్రీత్వంనుండి బయలుదేరే దివ్యవ్యక్తుల్లో కడపటివాడు. కనుక అతనికి త్రీత్వంలో సఫలత్వం ఏమీలేదు, అతని సఫలత్వం త్రీత్వానికి వెలుపలనే వుంటుంది. క్రీస్తు మనుష్యావతారంలోను, నరులమైన మన పవిత్రీకరణంలోను అతని సఫలత్వం బాగా కన్పిస్తుంది. ఈ యాత్మ వలన మనం అధికాధికంగా పవిత్రులమౌతూండాలి. పైగా మనం ఎంతగా పాపంనుండి వైదొలగుతామో అంతగా పవిత్రాత్మకు బిడ్డలమౌతాం.
6. ఆత్మ ప్రేమ నిధి
1. దేవుడు ప్రేమ స్వరూపుడు - 1యోహా 4,8. ఆత్మ దేవుని ప్రేమను మన హృదయాల్లోనికి తీసికొని వస్తుంది. దేవుడు ఆత్మద్వారా మన హృదయాలను ప్రేమతో నింపుతాడు - రోమా 5,5. మనం ఆత్మయందూ ప్రేమయందూగూడ నడవాలి - రోమా 8,4 ఎఫే 5,2.అనగా మనం ఆత్మనుండి ప్రేమనుపొంది ఆ ప్రేమతోనే జీవించాలి.
2. ఆత్మకూ శరీరానికి బద్ధవైరం.ఆత్మ శరీర దుష్టశక్తులను నాశం చేస్తుంది - గల 5,17. ఐతే ఆత్మ ప్రేమను మనకు ఫలంగా ఇస్తుంది — గల 5,22. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆత్మ ప్రేమను మనకు వరంగా ఈయదు. అసలు ఆ యాత్మే ప్రేమ, క్రీస్తు సిలువపై పండిన ఫలం ఆత్మడు. క్రీస్తు సిలువనుండి ఆత్మను మనకు ఓ ఫలంలా అందించాడు. కనుకనే యోహాను సువిశేషం "యేసు సిలువపై తలవంచి ఆత్మను విడిచాడు" అని చెప్తుంది - 19,30, ఇంకా క్రీస్తు అంతరంగంనుండి జీవజలనదులు ప్రవహిస్తాయనే వేదవాక్యంగూడ వంది - 7,38. తండ్రి క్రీస్తుద్వారా మనకు ఆత్మను అనుగ్రహిస్తాడని ఈ వేదవాక్యాల భావం. మహోన్నతుడైన దేవుడు మనకు దయచేసే దానం ఆత్మ.
3. ఆత్మ మనకు తోడినరులతో సహవాసాన్ని దయచేస్తుంది. అనగా మనం తోడి నరులతో ఐక్యమై జీవించేలా చేస్తుంది- 1కొ 13, 13. ఈ యైక్యతే సోదరప్రేమ. అతని ద్వారా మనం ఒక్క దేహమూ, ఒక్క సమాజమూ ఔతాం - 1కొ 12, 13. మన దేహంలోని అవయవాలన్నిటినీ ఒక్కటిగా బంధించి వాటిని ఒక్క వ్యక్తినిగా ఐక్యపరచేది మన ఆత్మ అలాగే జ్ఞానశరీరంలోని నరులందరినీ ఒక్కటిగా ఐక్యపరచి వారిని ఒక్క సమాజంగా చేసేది పవిత్రాత్మ మన దేహానికి మామూలు ఆత్మ వున్నట్లే జ్ఞానశరీరానికి పవిత్రాత్మ వుంటుంది. ఇంకా ఈ యాత్మ భార్యాభర్తలను గూడ ఏకదేహంగా - అనగా ఏకవ్యక్తినిగా ఐక్యపరుస్తుంది - ఎఫే 5,31.
4. ఆత్మడు ప్రేమస్వరూపుడని చెప్పాం. కనుక అతడు దేవుణ్ణి ప్రేరేపించి ప్రాణికోటిని సృష్టిచేయించాడు. దేవునిచే నరవతారమెత్తించాడు. సుతుడైన సర్వేశ్వరుడు నరుడై జన్మించింది ఆత్మశక్తితోనేగదా! - లూకా 1,35. సువిశేషాలు ఆత్మను అగ్నితో పోల్చాయి - మత్త 3, 11. ఇక్కడ ఈ యగ్ని పదానికి చాలా అర్ధాలున్నాయి. ప్రేమ కూడ ఈ యర్గాల్లో ఒకటి. అనగా ఆత్మ మనలను ప్రేమాగ్నితో నింపుతుందని భావం.
5. పూర్వవేద కాలంలో గుడారంపై తేజోమయమైన మేఘం వాలివుండేది. ఈ మేఘానికి బదులుగా నూత్నవేదంలో ఆత్మ కన్పిస్తుంది. ఈ తేజోమయమైన గుడారంలాగే ఈ యాత్మకూడ తేజోమయమైన సాన్నిధ్యం. దేవుడు ఎప్పడుకూడ తన తేజస్సు కొరకే జీవిస్తాడు, పనిచేస్తాడు. నరుడు దేవునికి పోలికగా వుండేవాడు. కనుక, ఇరేనేయస్ వేదశాస్త్రి నుడివినట్లుగా, పరిపూర్ణంగా జీవించే నరుడు కూడ దేవుని తేజస్సేనని చెప్పాలి.
ప్రార్థనా భావాలు
1. సిప్రియన్ భక్తుడు ఈలా వాకొన్నాడు. త్రీత్వంలో పితసుతులను ఐక్యపరచేది ఆత్మడే శ్రీసభ సభ్యులను ఐక్యపరచేదికూడ ఈ యాత్మడే కనుక శ్రీసభ సభ్యులను మురాలుగా విభజించే పతితులను ఆ యాత్మడు అణగదొక్కుతాడు. అతడు ఆనాడు కొరింతులో విభజనకు గురైన క్రైస్తవులనులాగ నేడు మనలనుగూడ ఐక్యపరుస్తాడు - 1కొరి 1,11. ఆత్మడు ఎక్కడుంటే అక్కడ ఐక్యతా వుంటుంది. కనుక మన రోజువారి జీవితంలో మనం ఆత్మనుండి ఐక్యత సోదరప్రేమ అనే వరాలను అడుగుకోవాలి.
2. అగస్టీను భక్తుడు ఈలా వ్రాసాడు. "ఆత్మకు చాలా పేర్లున్నా అతని ప్రధాననామం మాత్రం ప్రేమే. అతడు తండ్రి కుమారుల పరస్పర ప్రేమ. ఈ మూడవవ్యక్తి ప్రేమద్వారా గాని మిగిలిన యిద్దరు వ్యక్తులు ఐక్యంగారు, ఇంకా దేవుని మన హృదయాల్లోనికి కొనివచ్చేదికూడ ఈ యాత్మడే" కనుక ఆత్మనుండి మనం ప్రేమభిక్ష అర్ధించాలి.
7. జీవమొసగే ఆత్మ
1. దేవుడు ప్రాణులను సృజించేవాడు. ప్రాణమొసగేవాడు. అతడు చంపడానికంటె బ్రతికించడానికే సిద్ధంగా వుంటాడు. దేవునిలాగే అతని ఆత్మకూడ జీవమొసగే ఆత్మ - రోమా 82
ఉత్తాన క్రీస్తు జీవనదాయకుడైన ఆత్మతో నిండిపోయాడు. అతడు స్వయంగా ప్రాణదాత ఐన ఆత్మ అయ్యాడు - 1కొ 15,45, అనగా జీవాత్మను పొందిన క్రీస్తు మనకు గూడ ఆధ్యాత్మిక జీవాన్ని దయచేస్తాడని భావం, మొదటి ఆదాము మనకు దయచేసింది భౌతికజీవం, కాని రెండవ ఆదాము దయచేసింది దివ్యజీవం, ఆత్మజీవం,
దేవుని ఆత్మకు హీబ్రూ భాషలో రువా అని పేరు. ఈ మాటకు సృష్టిచేసేది, ఊపిరినొసగేది అని అర్థం. ఈ యాత్మ సృష్ట్యాదిలో పక్షి తన గూటి పైలాగ నీటిపై గుండ్రంగా తిరుగుతుండేది - ఆది 1,2. ఆత్మవల్లనే మొట్టమొదటిసారిగా నీటినుండి జీవకోటి పుట్టుకవచ్చింది. అటుపిమ్మట ఆత్మ ఆదాముకి ఊపిరిపోసింది - ఆది 2.7. అనగా సృష్ణ్యాదిలోనే పవిత్రాత్ముడు ఆదాము మీదికి దిగివచ్చాడు.
ఊపిరి విశ్వమంతటా వ్యాపించివుంది. కావుననే కీర్తనకారుడు
నీవు ఊపిరిపోస్తే ప్రాణిసృష్టి జరుగుతుంది
నీవు భూమికి నూత్నజీవం దయచేస్తావు
అని పాడాడు - 10430. ఆత్మవూపిరి. ఆ వూపిరివల్లనే బాబిలోనియాలో శిధిలమైయున్న ఎముకలు మల్లా జీవాన్ని పొందాయి. "నా ప్రజలారా! నేను మీ సమాధులు తెరిచి మిమ్మలేపుతాను. మిమ్మమళ్ళాయిస్రాయేలు దేశానికి తోడ్కొని పోతాను” - యెహెజేలు 37,14.
2. పాలస్తీనా దేశంలో వాన అట్టే కురవదు. కనుక యూదులు నీటిని అమూల్యమైన వరంగా భావించారు. జీవంతో సమానంగా ఎంచారు. దేవుని దీవెనవల్ల ఎడారి కూడ నీటితో నిండిపోతుందని చెప్పాడు యెషయా
నేను ఎడారిని కొలకులుగా మారుస్తాను
ఎండిన నేలను నీటి బుగ్గలుగా జేస్తాను
-41,18. క్రమేణ జీవదాయినియైన నీరు జీవమొసగే ఆత్మకు చిహ్నమైంది. ఆత్మ నీరు కనుక దేవుడు దాన్ని ప్రజలపై కుమ్మరిస్తాడు. "పిమ్మట నేను నా యాత్మను ఎల్లరిపైకుమ్మరిస్తాను' - యోవేలు 2,28. "నేను దావీదు వంశజులపైనా, యెరూషలేములోని యితర ప్రజలపైనా దయాగుణాన్నీ ప్రార్ధనగుణాన్నీ కుమ్మరిస్తాను" - జెకర్యా 12,10. దేవుడు తన ఆత్మనే ప్రజలపై కుమ్మరిస్తాడు. నేను మీపై శుభ్రమైన జలాలు చల్లి మిమ్మ శుద్ధిచేస్తాను" - యెహె 36,25, ఈ నీరు యెరూషలేములోని దేవాలయం నుండి ప్రవహిస్తుంది. "ఆ దేవళం గుమ్మం క్రిందినుండి నీరు ఊరి తూర్పుదిక్కుగా ప్రవహిస్తుంది" - 37,1. ఇక్కడ ఈ దేవళం దేవునికి చిహ్నం. ఆత్మ యెప్పడు గూడ దేవునినుండిగాని బయలుదేరదు.
బైబులు ఆత్మను సముద్రజలాలతో పోల్చదు. చెలమ నీటితోను వాననీటితోను పోలుస్తుంది. ఈ నీరు జీవాన్నీ సత్తువనూ దయచేస్తుంది.
3. నీరు మృదువుగా వుండి అన్నిటిలోకి ప్రవేశిస్తుంది. నరుని శరీరంలోకిగూడ ప్రవేశిస్తుంది. కనుకనే ప్రభువు "నా యాత్మను మీలో వుంచుతాను" అన్నాడు - యెహె 36,27. ఆత్మ జలంలాంటిదనే పూర్వవేద భావాన్ని నూత్నవేదంలో యోహాను మళ్లా ఎత్తుకొన్నాడు. విశ్వాసంగల భక్తుడు ఆత్మవలనా నీటివలనా గూడ జన్మిస్తాడు - 3,5, క్రీస్తు అంతరంగంనుండి జీవజల నదులు పుట్టుకవస్తాయి. ఈ జీవజలం పవిత్రాత్మే - 7,38-39. పౌలుకి కూడ ఈ భావాలు తెలుసు. మనమందరం ఒకే ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందాం. అందరమూ ఒకే ఆత్మను పానం చేస్తాం - 1కొ 12,13. ఇక్కడ ఆత్మను పానం చేస్తామంటే, శ్రీసభలోని ఆత్మను మనంకూడ స్వీకరిస్తామని భావం. ఇంకా, మోషే ధర్మశాస్త్రం మృత్యువును తెచ్చిపెడుతుంది. కాని ఆత్మ జీవనదాత - 2కొ 8,6.
ప్రార్థనా భావాలు
1.బార్ హెబ్రెయస్ అనే సిరియా భక్తుడు ఈలా వాకొన్నాడు, "పవిత్రాత్మ ప్రధానంగా జీవం. లోకంలోని జీవమంతా ఆ ఆదిమ జీవంనుండి వచ్చిందే. ఆ దివ్యజీవం తండ్రినుండి బయలుదేరి కుమారుని ద్వారా లోకంలోకి వచ్చింది. లోకరీలోని నరులందరికీ ప్రాణమొసగి వారిని దివ్యలనుగా జేస్తుంది. ఆ నరులద్వారా లోకాన్నంతటినీ దివ్యం చేస్తుంది." మనంకూడ దివ్యజీవాన్ని దయచేయమని ఆత్మను నిరంతరం ప్రార్ధిస్తుండాలి.
2.యెరూషలేము సిరిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "క్రీస్తు ఆత్మను జలంగా ఎందుకు పేర్కొన్నాడు? జలం వల్లనే అన్నీ బ్రతుకుతాయి. నీరు నూత్నజీవానికి మూలం. అది పైనుండి దిగివస్తుంది. నీరు ఒక్కటైనా బహువిధాలుగా మారుతుంది. ఏదెను తోటకంతటికీ ఒకే నీటిబుగ్గ నీరు పెట్టింది. ప్రపంచమంతటినీ ఒక్కవానే తడుపుతుంది. ఆ ఒక్క జలమే లిల్లీలో తెల్లగాను, గులాబీలో ఎర్రగాను, మరో పూవులో ముదురు కెంపు వన్నెగాను కన్పిస్తుంది. ఒకే జలం ఆయా వస్తువులకు అనుకూలంగా మారిపోతుంది. ఆత్మకూడ ఒక్కడైనా తన చిత్తాన్నిబట్టి తన వరప్రసాదాలను అనేకులకు అనేక విధాలుగా పంచిపెడతాడు. కనుకనే క్రీస్తు అతన్ని నీటితో పోల్చాడు". ఆత్మజలం మనపై సమృద్ధిగా కురవాలనీ, ఆ నీటిలో మన శరీరాలూ హృదయాలూ నానాలనీ అడుగుకొందాం.
8. రక్షణ చరిత్రను నడిపించే ఆత్మ
1. దేవుడు మట్టిముద్దలోనికి ఊపిరి ఊది నరుని చేయడంతో నరజాతి చరిత్ర ప్రారంభమైంది - ఆది 2,7. దేవుడు వూదిన ఆ వూపిరి ఆత్మే తర్వాత ప్రభువు యిప్రాయేలీయులతో నిబంధనం చేసికొన్నాడు. కాని యూదులు ఆ ప్రభువు నిబంధనాన్ని మీరారు.
యిప్రాయేలీయులు దేవునిమీద తిరగబడి
అతని పవిత్రాత్మను దుఃఖపెట్టారు
- యెష 63,10. కనుక పూర్వవేద నిబంధన చరిత్ర ఆత్మద్వారానే నడిచింది. తర్వాత ప్రభువు నూత్నవేద ప్రజలతో గూడ నిబంధనం చేసికొన్నాడు. ఈ నూత్న నిబంధనపు మధ్యవర్తి క్రీస్తే. యావే ఆత్మ అతనిమీదికి గూడ దిగివచ్చింది.
దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది
అది విజ్ఞాన వివేకాలను ఒసగే ఆత్మ
దూరదృష్టినీ బలాన్నీ ప్రసాదించే ఆత్మ
దైవజ్ఞానాన్నీ దైవభీతినీ దయచేసే ఆత్మ
- యెష11.2. ఈ విధంగా పూర్వ నూ
త్న నిబంధనలు కూడ ఆత్మద్వారానే నెలకొన్నాయి. 2. లూకా సువిశేషంలో మెస్సీయా ఆత్మద్వారా రక్షణ చరిత్రను కొనసాగించుకొని పోతాడు. అతడు ఆత్మ ప్రభావంవల్ల జన్మించాడు-1,35. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ అతనిమీదికి పావురంలా దిగివచ్చి అతన్ని మెస్సీయాగా అభిషేకించింది. అటుపిమ్మట అతన్ని ఎడారికి తోడ్మొనిపోయింది - 4,4. క్రీస్తు ఆత్మప్రభోధంతో పిశాచాలను వెళ్ళగొట్టి దైవరాజ్యాన్ని నెలకొల్పాడు – 11,20. ఆత్మ నరునికి స్నేహితుడై రక్షణచరిత్రను నడిపించుకొనిపోతుంది, క్రీస్తుద్వారా దైవప్రజలకు పరలోక రాజ్యాన్ని స్థాపించిపెడుతుంది. గ్రీకు రోమను ప్రజలూ, మనదేశంలోని హిందూ ప్రజలూ జననమరణాదులతో కూడిన సంసార చక్రంలో చిక్కుకొనిపోయారు. కాని దైవప్రజల కొరకు ఆత్మ నడిపించే రక్షణచరిత్ర మాత్రం అలా జననమరణాదుల్లో చిక్కుకొనిపోక, క్రీస్తుద్వారా ఓ నిర్ణీత గమ్యాన్ని చేరుతుంది. ఆత్మ మహాశక్తితో పనిచేసి సుతుణ్ణి లోకంలో నరుడ్డిగా పుట్టించింది. రక్షణాద్యమానికి గమ్యాన్ని సాధించిపెట్టేది ఈ సుతుడే.
3. రక్షణచరిత్రకు ఆదీ అంతమూ ఆత్మే. ఆత్మ ద్వారానే ఆదిలో జలరాశినుండి ప్రాణికోటి పుట్టింది - ఆది 1,2. ఈ దివ్యచరిత్రకు అంతంకూడ ఆత్మే కనుకనే ఆత్మా వధువు ఇద్దరూ క్రీస్తుని తిరిగిరమ్మని ఆహ్వానిస్తారు - దర్శ 22, 17. ఈ క్రీస్తు పుట్టుక ఆత్మద్వారానే అని చెప్పాం. అతని వుత్తానంగూడ ఆత్మద్వారానే - రోమా 8,11.
4 రక్షణచరిత్రకు ఆత్మ ఆదీ అంతమూ అంటే, ఆ యాత్మడు అతి ముఖ్యమైనవాడు, మన హృదయాల్లో వసించేవాడు అని భావం. కనుకనే ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తద్వారా నా యాత్మను నీ హృదయాల్లో వుంచుతాను అన్నాడు — 36,26. ఇంకా, దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోకి పంపాడు - గల 4,6. ఆత్మద్వారా దేవుడు ప్రేమను మన మృదయాల్లోకి కుమ్మరించాడు - రోమా 5,5. మన ఉత్తానమూ మోక్ష ప్రవేశమూ ఆత్మద్వారానే - 2కొ 1,22. సంగ్రహంగా చెప్పాలంటే ఆత్మడు మనలోనే వుంటాడు - యోహా 14, 17. మనం నిర్ణయాలు చేసికొనేపుడూ, పనికి పూనుకొనేపడూ మన అంతరంగంలో వుండి మనకు ప్రేరణ పట్టిస్తాడు.
ప్రార్థనా భావాలు
1. ఇరెనేయస్ భక్తుడు ఈలా చెప్పాడు. "క్రీస్తులో వసిస్తూన్నపుడే ఆత్మడు నరజాతితో జీవించడానికి అలవాటు పట్టాడు. అటుపిమ్మట ఆ దివ్యమూర్తి అపోస్తలుల్లో వసించాడు. నేడు మనలోను వసిస్తున్నాడు". పవిత్రాత్మకు మానవజాతి అంటే యిష్టం. మానవులతో వుండడం యిష్టం. మన తరపున మనకుకూడ ఆ యాత్మపట్ల ఎనలేని ప్రీతి పుట్టాలి.
2. అగస్టీను భక్తుడు తన విశ్వాసులకు ఈలా బోధించాడు. "నా మట్టుకు నేను మీకు వేదవాక్యం విన్పించాను. కాని మీరు నా పల్ములను విన్నపుడు ఆత్మే మీ హృదయాల్లో బోధచేస్తుంది. లేకపోతే నేను విన్పించిన వేదవాక్యం మీకు అర్థం కానేకాదు. బోధకుల బోధ మనం కేవలం చెవులతో వినడానికి మాత్రమే. మన హృదయాల్లో నిజంగా బోధచేసే దేవుని ఆత్మ పరలోకంలో వుంది. మీలో వసించే క్రీస్తు ఆత్మ మీ హృదయాల్లో మాట్లాడకపోతే నా బోధ నిరర్ధకమే ఔతుంది." బోధకుల బోధలను నిమిత్త మాత్రంగా తీసికొని ఆత్మే నేడు మనకు బోధ చేయాలని వేడుకొందాం.
9. కడపటి దినాల్లో దేవుడిచ్చే దానం
1. ప్రభువు మోషే అనుచరులైన 70 మంది పెద్దలకూ ఆత్మను దయచేసాడు. అతడు మోషే ఆత్మను తీసికొని ఆ పెద్దలకిచ్చాడు - సంఖ్యా 11,25, అటుపిమ్మట న్యాయాధిపతులూ రాజులూ ప్రవక్తలూ ఆత్మను పొందారు. అంత్యదినాల్లో ఆత్మ అందరి మీదికీ దిగివస్తుందని యోవేలు ప్రవచించాడు -2.28. కాని చివరి ప్రవక్తయైన మలాకీతో పూర్వవేదంలో ఆత్మ అదృశ్యమైపోయింది. యేసు ఇంకా మహిమను పొందలేదు కనుక ఆత్మ అనుగ్రహింపబడలేదు అంటుంది యోహాను సువిశేషం 7,39. అనగా ప్రవక్తల కాలం ముగిశాక అదృశ్యమైన ఆత్మ మళ్ళా క్రీస్తు మహిమానంతరంగాని మనకు దర్శనమీయదు. అందుకే కాబోలు ఎఫేసులోని స్నాపక యోహాను శిష్యులు "పవిత్రాత్మడు ఉన్నాడన్న విషయం మేము విననైన లేదే? అన్నారు - అ, చ,19,2.
2. క్రీస్తుతో ఆత్మ మళ్ళా ప్రత్యక్షమైంది. క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో పావురంలా దిగివచ్చింది - లూకా 3,22, ఉత్తాన క్రీస్తు తండ్రినిచేరి పిత వాగ్దానమైన ఆత్మను స్వీకరించాడు. ఆ యాత్మను మన మీద కూడ కుమ్మరించాడు - అ,చ. 2,33. నేడు 17
మనం జ్ఞానస్నాన సమయంలోనే ఈ యాత్మను పొందుతాం. ఈ జీవితయాత్రలో మనలను నడిపించేది ఆత్మే - రోమా 8,14. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను మనం సమృద్ధిగా పొందాలి. ఈ కడపటి దినాల్లో దేవుడు మనకిచ్చే గొప్ప దానం ఆత్మ
ప్రార్థనా భావాలు
1. ఆత్మ గొప్పవరం. క్రీస్తు ఈ వరాన్ని అందరికీ దయచేస్తాడు. నరులు ఒక్కొక్కరి ఆశనుబట్టీ యోగ్యతను బట్టీ క్రీస్తునుండి ఆత్మను పొందుతారు. ఆత్మ అనే వరం లోకాంతం వరకు నరులతోవుండి వారికి వూరటా నమ్మకమూ వెలుగూ దయచేస్తుంది. క్రీస్తునుండి మనం ఆత్మను పుష్కలంగా పొందాలి. ఓసారి పొందిన ఆత్మను భక్తి విశ్వాసాలతో నిలబెట్టుకోవాలి.
2. మనకు ఆత్మ అవసరం ఏమిటి? ఆత్మ లేకపోతే నష్టమేమిటి? ఆత్మ లేకపోతే దేవుడు మనకు దూరమౌతాడు. అతడుంటే దగ్గిరౌతాడు. ఆత్మ లేకపోతే క్రీస్తు కేవలం భూతకాలానికి చెందిన వాడౌతాడు. అతడుంటే క్రీస్తు వర్తమానానికి చెందినవాడౌతాడు.ఆత్మలేకపోతే సువిశేషం మృతాక్షర మౌతుంది. అతడుంటే అది జీవనదాయక సందేశ మౌతుంది.
ఆత్మ లేకపోతే తిరుసభ కేవలం అధికార మందిర మౌతుంది. అతడుంటే అది సేవాసంస్థ ఔతుంది.
ఆత్మ లేకపోతే మనం చేసే వేదబోధ కేవలం రాజకీయ ప్రచారమౌతుంది. అతడుంటే అది నూత్న పెంతెకోస్తు ఔతుంది.
ఆత్మ లేకపోతే అర్చనకాండ కేవలం క్రీస్తు మరణోత్థానాల స్మరణం మాత్రమే ఔతుంది. అతడుంటే అది వరప్రసాద సాధనమౌతుంది.
ఆత్మ లేకపోతే మన శరీరమే మన ఆత్మను జయిస్తుంది. అతడుంటే మన ఆత్మే మన శరీరాన్ని జయిస్తుంది.
ఆత్మ లేకపోతే ఈ లోకంలో కేవలం లౌకిక రాజ్యమే పెత్తనం జేస్తుంది.అతడుంటే ఈ పరలోకరాజ్మంగా మారిపోతుంది.
ఆత్మ మనకు నిత్యనూతనత్వాన్ని దయచేస్తుంది. ఆత్మతో జీవించేదే ఆధ్యాత్మిక జీవితం. 2. క్రీస్తుని ఆత్మ
10.క్రీస్తూ-ఆత్మా
1. పౌలు క్రీస్తు నుద్దేశించి "ఆత్మయైన ప్రభువు" అని పేర్కొన్నాడు. "ప్రభువే ఆత్మ" అన్నాడు – 2కొ 3,17-18, ఇక్కడ క్రీస్తు ఆత్మ అయిపోయాడని భావం కాదు. ఆత్మతో సంపూర్ణంగా నిండిపోయాడని మాత్రమే అర్థం. క్రీస్తు దేవుని కుమారుడైనట్లే, ఆత్మ క్రీస్తు ఆత్మ ఔతుంది. క్రీస్తు ఉత్తానంలో ఆత్మ సంపూర్ణంగా గోచరిస్తుంది.
2. పూర్వవేదంలో మెస్సీయా ఆత్మతో నిండిపోయాడు. “దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది" అన్నాడు యెషయా 11.2 క్రీస్తు ఆత్మద్వారానే జన్మించాడు. జ్ఞానస్నానంలో ఆత్మడు అతనిపై దిగివచ్చాడు - యోహా 1,32. పూర్వం సంసోను సౌలు దావీదు మొదలైన యుద్ధవీరులమీదికి దిగివచ్చినట్లే ఆత్మడు మెస్సీయామీదికి గూడ దిగివచ్చాడు, క్రీస్తు అతనియందు ఆనందించాడు - లూకా 10,21. ఆత్మతోనే పిశాచాలను తరిమివేసాడు - 11,20 3. క్రీస్తకీ ఆత్మకీ దగ్గరి సంబంధం వుంది. ఇద్దరూ మన దగ్గరికి వస్తారు. ఆత్మను తండ్రి పంపుతాడు. "నేను తండ్రిని ప్రార్ధిస్తాను, మీతో ఎల్లపుడూ వుండడానికి మరొక ఆదరణ కర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు" - యోహా 14,16. కాని క్రీస్తు తనంతట తానే మన దగ్గరికి వస్తాడు. "నేను మిమ్మ అనాథులుగా వదలిపెట్టను. నేను మీ యొద్దకు వస్తాను" - 14,18. ఆత్మడు వచ్చి క్రీస్తుని తొలగించడు. క్రీస్తుని మనకు ప్రత్యక్షం చేస్తాడు. క్రీస్తు చనిపోతూ మనకొరకు ఆత్మను విడిచాడు - యోహా 19,30. బల్లెంతో పొడిచిన ప్రభువు ప్రక్కనుండి నెత్తురూ నీరూ కారాయి 19,34 ఈ నీరు ఆత్మనే సూచిస్తుంది. క్రీస్తు ఆత్మా ఏకవ్యక్తికాదు. వేరు వేరు వ్యక్తులు. ఆత్మ మరొక ఆదరణకర్త - 14,16.
క్రీస్తు మహిమను పొందకముందు లోకంలో ఇంకా ఆత్మలేదు - 7,39.
4. పౌలు పవిత్రాత్మను దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అని పేర్కొన్నాడు - రోమా 8,9. క్రీస్తు ఆత్మా కలసే విశ్వాసులను నీతిమంతులనుగా జేస్తారు - 1కొ 6,11. విశ్వాసులు క్రీస్తుకి దేహమౌతారు. ఆత్మకు ఆలయమౌతారు -1కొ 6,15,19. క్రీస్తూ ఆత్మా ఎప్పుడూ కలసిపోతూంటారు. ఏనాడూ ఒకరినుండి ఒకరు వేరుకారు. ఆత్మసహాయం లేందే ఇప్పడు మనం క్రీస్తుని విశ్వసించలేం. "పవిత్రాత్మ వలన తప్ప ఎవడుకూడ యేసే ప్రభువు అని అంగీకరించలేడు” - 1కొ 12,3. ప్రార్థనా భావాలు
1. గ్రెగోరీ నాసియాన్సన్ భక్తుడు ఈలా వ్రాసాడు. "దేవుడు తనలోని ముగ్గురు వ్యక్తులనుగూర్చి మూడుదశల్లో నరులకు తెలియజేసికొన్నాడు. పూర్వవేదం తండ్రినిగూర్చి స్పష్టంగాను క్రీస్తునిగూర్చి అస్పష్టంగాను మాట్లాడుతుంది. నూత్నవేదం క్రీస్తుని స్పష్టంగా బోధిస్తుంది. కాని ఆత్మ దైవత్వాన్ని అస్పష్టంగా మాత్రమే బోధిస్తుంది. పెంతెకోస్తు తర్వాత ఇప్పడు ఆత్మ మన హృదయాల్లో వసిస్తూ తన్నుతాను మనకు స్పష్టంగా తెలియజేసి కొంటూంది. నరులకు తండ్రిని గూర్చి తెలియకముందే కుమారుని తెలియజేయడం, కుమారుని గూర్చి తెలియకముందే ఆత్మను తెలియజేయడం భావ్యం కాదు, అప్పడు మనం ముగ్గురు దైవవ్యక్తులకూ వుండే వ్యత్యాసాన్ని గుర్తించలేక ఒకరితో ఒకరిని కలపివేసి వుండేవాళ్ళమే. పిల్లలకు అరగించుకోలేనంత భోజనం పెట్టకూడదు. వారి కండ్ల చూడలేని సూర్యుణ్ణి వారికి చూపించకూడదు. కనుక దేవుడు తన్నుగూర్చి తాను ఒక విడతగాక, క్రమేణ మెట్లమెట్లుగా తెలియజేసికొన్నాడు". ఇవి లోతైన వాక్యాలు. పలుసార్లు భక్తితో మననం చేసికోదగ్గవి.
2. ఇరెనేయస్ భక్తుడు ఈలా చెప్పాడు. "ఉత్తాన క్రీస్తు శిష్యులకు తన యాత్మను దయచేసాడు. శిష్యులు ఆ యాత్మను పొంది ప్రజలకు జ్ఞానస్నానమిచ్చారు. వారికి ఆ యాత్మను పంచిపెట్టారు. ఈ విధంగా వాళ్ళ శ్రీభను స్థాపించారు. కనుక క్రీస్తూ ఆత్మా శిష్యులు స్థాపించిన శ్రీసభలో నెలకొని వుంటారు." ఈనాడు మనం శ్రీసభ ద్వారాగాని ఆత్మను పొందలేం.
11. ఆత్మతో నిండిన క్రీస్తు
1. పౌలు చెప్పినట్లుగా క్రీస్తు ప్రాణప్రదాతయైనన ఆత్మ అయ్యాడు - 1కొ 15,45, అనగా ఉత్థాన క్రిస్తు పరిశుద్ధత, శక్తి అణిమ, మహిమ మొదలైన ఆత్మలక్షణాలను పొందాడని భావం. క్రీస్తు ఉత్తానం అతని జీవితంలో శిఖరాయమానమైంది. ఆ సంఘటనం తర్వాత అతనికి నూత్నమహిమ ఏదీ లేదు. ఉత్తానంద్వారానే అతడు కుమారుడయ్యాడు. ఈ కుమారుణ్ణి గూర్చి రెండవ కీర్తనం నీవు నాకు కుమారుడవు ఈ దినం నీవు నాకు జన్మించావు అని చెప్తుంది - 2,7. ఉత్తానం ద్వారా సిద్ధించిన ఈ కుమారత్వానికి పరిశుద్దాత్మడే కారకుడు. క్రీస్తు జననం ద్వారానే కుమారుడు. కాని మరణోత్తానాల ద్వారా అతడు తండ్రికి అధిక ప్రీతిపాత్రుడైన కుమారుడయ్యాడు.
2. ఉత్థానక్రీస్తు ఒక్కడే. కాని ఉత్థానంద్వారా అతడు ఓ దేహాన్ని ఓ సమాజాన్ని పొందాడు. ఈ సమాజమే శ్రీభ. కనుకనే అతడు శిష్యులతో "నేను నా తండ్రి యందూ, మీరు నాయందూ నేను మీయందూ ఉన్నామని ఆ దినం మీరు గ్రహిస్తారు" అన్నాడు - యోహా 14,20. ఈలా ఉత్థానక్రీస్తు సమాజాన్ని నెలకొల్పడం గూడ ఆత్మద్వారానే జరిగింది.
3. నిత్యుడైన ఆత్మద్వారా క్రీస్తు తన్ను తాను అర్పించుకొన్నాడు — హీబ్రూ 9,14. చనిపోయిన క్రీస్తుని మళ్ళా ఉత్తానం చేసింది ఆత్మే క్రీస్తు మరణిత్తానాలు ఒకే దైవరహస్యం.
మరణోత్ధానాల ద్వారా క్రీస్తు మన రక్షణ కార్యాన్ని నిర్వహించాడు. మన పాస్క గొర్రెపిల్లయై మనకు విమోచనాన్ని సంపాదించిపెట్టాడు - 1కొ 5,7. ఆత్మద్వారా అతడు మనకు స్వీయదానమూ, స్వీయవరమూ అయ్యాడు. ఇప్పుడు క్రీస్తుని మరణమూ ధర్మశాస్త్రమూ మొదలైనవేవీ బాధించలేవు. ఆత్మద్వారా అతడు సర్వతంత్ర స్వతంత్రుడు - 2కొ 3,17. ఇక అతనిలో ఆత్మశకైగాని శరీర బలహీనత ఏమీ లేదు.
ప్రార్థనా భావాలు
1. శ్రీసభకు శిరస్సు లేక నాయకుడు క్రీస్తు. ఆ సభకు ఆత్మ ఆత్మడే. మన ఆత్మ మన దేహాన్ని నడిపిస్తుంది. దేహంలోని అవయవాలన్నింటినీ అదుపులో వుంచుకొని అవి ఐక్యమత్యంతో పనిచేసేలా చేసేది ఆత్మే. ఈలాగే పవిత్రాత్ముడు కూడ శ్రీసభలోని విశ్వాసులందరినీ ఐక్యపరుస్తాడు. వాళ్ళందరినీ ఒక త్రాటమీద నడిపించి క్రీస్తు దగ్గరికి చేరుస్తాడు. మన సమాజాల్లో ఐక్యతా పరస్పర ప్రేమా వృద్ధిచెందేలా చేయమని ఆత్మను అడుగుకొందాం.
2. లియొనిడెస్ ప్రాచీన వేదసాక్షి. అతనికి ఓరిజన్ అనే శిశువు పుట్టాడు. ఓ దినం లియోనిడెస్ ఓరిజన్ రొమ్ముమీది బట్టను తొలగించి ఆ శిశువుని రొమ్ముమీదనే ముద్దు పెట్టుకొన్నాడు. జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మ ఆ శిశువు హృదయంలో ఓ దేవాలయంలోలాగ వసిస్పూందన్న విశ్వాసంతోనే లెయోనిడెస్ అలా ముదుపెట్టుకొన్నాడు. ఈ ఓరిజస్ తర్వాత గొప్ప వేదపండితుడయ్యాడు. క్రీస్తు ఆత్మ పవిత్ర గ్రంథాలపట్ల భక్తిభావమూ బాల్యంనుండే ఓరిజన్ హృదయంలో నెలకొన్నాయి. ఈ లెయోనిడెస్లాగే నేడు మనంకూడ ఆత్మపట్ల భక్తిని పెంపొందించుకోవాలి.
12. ఆత్మను దయచేసే క్రీస్తు
1. ఉత్తాన క్రీస్తు మనకు ఆత్మను దయచేస్తాడు. క్రీస్తు ప్రాణదాతయైన ఆత్మ అయ్యాడు - అకొ 15,45. అతడు తాను సమృద్ధిగా స్వీకరించిన ఆత్మనే మనకుగూడ దయచేసాడు.
అతని అంతరంగంనుండి జీవజల నదులు ప్రవహిస్తాయి - యోహా 7,38. ఉత్థాన క్రీస్తునుండి పారే నీరు పవిత్రాత్మే. ఈ నీరు నరులను శుద్ధిచేస్తుంది. సఫలులను చేస్తుంది. మనకు జీవమిస్తుంది. పూర్వవేదంలో యెహెజ్కేలు దేవళంనుండి నీరు పారుతూందని చెప్పాడు - 47,1. ఆ దినాన యెరూషలేమునుండి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందని జెకర్యావచించాడు - 14,8. కాని నూత్నవేదంలో క్రీస్తు తననుండే నీరు ప్రవహిస్తుందని వాకొన్నాడు. అతని ఆధిక్యం అలాంటిది.
2. క్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి అతని వద్దనుండి మనకు ఆత్మను పంపుతాడు - యోహా 16,7. ఈ వాక్యంలో తండ్రి దగ్గరికి వెళ్ళడమంటే మోక్షారోహణం చేయడమని అర్థం. క్రీస్తు స్వర్గంనుండి ఆత్మను పంపుతాడు. ఆత్మడు స్వర్గానికి చెందినవాడు. కనుక స్వర్గంనుండిగాని మనమీదికి దిగిరాడు. క్రీస్తు తండ్రి చెంతనుండి మనకు ఆత్మను పంపుతాడు - 15,26. క్రీస్తు తండ్రినుండి ఆత్మను పొంది తాను పొందిన ఆత్మను మనమీద కుమ్మరిస్తాడు - అ.చ. 2,33. ఆత్మను పంపడమనేది క్రీస్తు ఉత్థాన దేవరహస్యంలో ఓ ముఖ్యాంశం.
3. ఆత్మను పంపేది ఉత్తాన క్రీస్తు మాత్రమే. ఉత్థాన దేవరహస్యం ఆత్మకు జన్మస్థానం. క్రీస్తు ప్రక్కను బల్లెంతో తెరవగా నెత్తురూ నీరు స్రవించాయి, పూర్వం మోషే బెత్తంతో రాతి బండను కొట్టగా దానినుండి నీళ్ళు స్రవించాయి - సంఖ్యా 20,11. ఆ రాతిబండ క్రీస్తునే సూచిస్తుంది. ఆ రాయి క్రీస్తే - 1కొ 10,4.
క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నెత్తురు అతడు బలిపశువని తెలియజేస్తుంది. కనుక ఈ నెత్తురు మన పాపాలకు పరిహారం చేస్తుంది. ఇంకా ఈ రక్తం దివ్యసత్రసాదానికి గూడా చిహ్నం. మనం ప్రభువు శరీరరక్తాలను భుజించి మన ఆకలిదప్పులు తీర్చుకొంటాం. అతన్ని స్వీకరించే వాళ్ళకు ఆకలి దప్పులు వుండవు - యోహా 6,35.
క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నీరు వరప్రసాదానికీ జ్ఞానస్నాన జలాలకీ ఆత్మకీ చిహ్నం. ఉత్ధాన దేవరహస్యం ఆత్మకు జన్మస్థానమని ముందే చెప్పాం.
తెరువబడిన క్రీస్తు హృదయంనుండే శ్రీసభ పుట్టుకవచ్చింది. పూర్వం ఆదాము ప్రక్కలోనుండి ఏవ పట్టింది. అలాగే యిప్పడు క్రీస్తు ప్రక్కలోనుండి తిరుసభ పుట్టింది.
క్రీస్తు సిలువపై శిరస్సువంచి ఆత్మను విడిచాడు - యోహా 19,30. క్రీస్తు మరణంనుండి ఆత్మ పట్టింది. ప్రేమతో గూడిన క్రీస్తు మరణంనుండి ప్రేమ నిధియైన ఆత్మ వెలువడింది. క్రీస్తు మరణమే ఆత్మకు మూలం. అతడు మహిమను పొందేంతవరకూ లోకంలో ఆత్మ లేదు - 7,37.
నీరూ నెతురూ క్రీస్తు హృదయంనుండి వెలువడ్డాయి. అవి అతని అంతరంగంనుండి స్రవించాయి. మన రక్షణం కొరకు నీరూ నెత్తురూ ఒలికించిన ప్రభువుని మనం లోకాంతం వరకు ధ్యానించుకోవాలి. "వారు తాము కత్తితో పొడిచిన వానివైపు చూస్తారు" అని ప్రవచించాడు జెకర్యా - 12,10.
క్రీస్తు ఆత్మను దయచేసేవాడు. అతడు మనకిచ్చే దానం ఆత్మ క్రీస్తు ఉత్తాన దేవరహస్యం ఆత్మకు జన్మస్థానం.
ప్రార్థనా భావాలు
1. యెరూషలేము సిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. "పవిత్ర గ్రంథాలను వ్రాయించింది ఆత్మడే. అతడు ఆ పుస్తకాల్లో తన్ను గూర్చి తనకిష్టమొచ్చినంత మాత్రమే చెప్పించాడు. అతడు చెప్పించినదానికంటె మనం ఎక్కువ చెప్పకూడదు. ఐనా అతడు చెప్పించని విషయాలను గూర్చి మనం పరిశోధనం చేయవచ్చు." ఆత్మ పవిత్ర గ్రంథాల్లో తన్ను గూర్చి చాల స్వల్పంగా చెప్పించాడు గనుకనే ఆత్మను గూర్చిన దైవశాస్త్రం అంతగా వృద్ధిచెందలేదు. ప్రాచీనకాలం నుండి ఆత్మకు "గుప్తమైయున్న దేవుడు" అని పేరు. నేటికీ ఆత్మను గూర్చిన దేవరహస్యాలు ఎన్నో అస్పష్టంగానే మిగిలివున్నాయి.
2. సిరియా సీమోను అనే భక్తుడు ఈలా వాకొన్నాడు. "ఆత్మద్వారా మనం రోజూ ఉత్థానం పొందుతాం. ఇది లోకాంతంలో ప్రాప్తించే ఉత్థానం కాదు. ఈ లోకంలోనే పాపంనుండి పొందే ఉత్థానం. ఆత్మ రోజూ మనకు పాప పరిహారాన్ని దయచేస్తుంది. పాపంలో పడిపోయిన మనలను రోజూ పైకి లేపుతుంది." పాపపరిహారమనే యీ వత్థానాన్ని మనం అధికాధికంగా పొందాలని వేడుకొందాం.
13. క్రీస్తుకి సాక్ష్యంబలికే ఆత్మ
1. క్రీస్తు అద్బతాలద్వారా తండ్రి అతనికి సాక్ష్యం బలుకుతాడు - యోహా 8.18. పూర్వవేద గ్రంధాలు అతని తరపున సాక్ష్యం చెస్తాయి. స్నాపక యోహాను అతని పక్షాన సాక్ష్యం బలుకుతాడు - 1,6-7. కడన ఆత్మడుగూడ అతన్ని గూర్చి సాక్ష్యం బలుకుతాడు — 15,26.
2. క్రీస్తుని దోషినిగా నిర్ణయించినపుడు ఎవరూ అతని తరపున సాక్ష్యం చెప్పలేదు. అందరూ అతన్ని ద్రోహినిగానే ఎంచారు. ఇపుడు ఉత్తానం తర్వాత ఆత్మ క్రీస్తుని గూర్చి సాక్ష్యం పలుకుతుంది - 16,8-11. అనగా దోషిగా నిర్ణయింపబడిన క్రీస్తే నీతిమంతుడుగా చలామణి అయ్యాడు. పిశాచమే దోషిగా తీర్పును పొంద్రింది - 12,31.
3. కాని ఆత్మ క్రీస్తుకి ఏలా సాక్ష్యం పలుకుతుంది?
1. ఆత్మడు అపోస్తులుల ద్వారా క్రీస్తు మరతోత్థానాలను గూర్చి లోకానికి సాక్ష్యం చెప్పిస్తాడు = లూకా 24,48.
2. ఇంకా ఆత్మడు విశ్వాసుల హృదయాల్లో కూడ క్రీస్తుకి సాక్ష్యం పల్కుతాడు. "మీరు పవిత్రాత్మ వలన అభిషేకం పొందారు” - 1యోహా 2,20.27. ఆత్మ మన హృదయాల్లో విశ్వాసం పుట్టించి మనం క్రీస్తుని నమ్మేలా చేస్తుంది. ఈ విశ్వాసాన్నే యోహాను ఇక్కడ అభిషేకం అని పిల్చాడు. ఇది మన అంతరంగంలో జరిగే పని.
4. ఆత్మ క్రీస్తుకి ఎందుకు సాక్ష్యం పలుకుతుంది ? తాను సత్యస్వరూపియైన ఆత్మ కనుక - యోహా 16,13, నూత్నవేదం సత్యం అనే మాటను క్రీస్తుకి వాడుతుంది, ఆత్మకూ వాడుతుంది, ఆత్మ శిష్యులకు క్రీస్తుని బోధిస్తుంది. అతని బోధలను వారికి విప్పి చెప్తంది - 1426. వారిని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తుంది - 16, 13. ఈ సంపూర్ణ సత్యం క్రీస్తే. కనుక శిష్యులు ఆత్మ సహాయంతో క్రీస్తుని బాగా అర్థం చేసికొంటారు.
ఆత్మే సత్యం కాదు. క్రీస్తు సత్యం. కనుక ఆత్మ శిష్యులను సత్యంలోనికి నడిపిస్తుంది. మనకు వేదసత్యాలను తెలియజేసేది ఆత్మే అతడు ఎప్పడుకూడ మన హృదయాల్లో పని జేస్తూంటాడు. మన హృదయాల్లో దివ్యజ్యోతిని వెలిగించి మనం క్రీస్తుని అధికాధికంగా అర్థం చేసికొనేలా చేస్తుంటాడు.
ప్రార్థనా భావాలు
1. సిరియా సీమోను అనే భక్తుడు ఈలా ప్రార్థించాడు :
వెలుగైన ఆత్మమా
స్వర్ణనిధివైన ఆత్మమా
స్వీయశక్తితో సర్వాన్ని మార్చే ఆత్మమా
స్వయంగా కదలకే అన్నిటినీ కదిలించే ఆత్మమా
ఆనంద దాయకుడవైన ఆత్మమా
నా హృదయాశలకు నిలయమైన ఆత్మమా
నా కోర్కెలన్నీ తీర్చే ఆత్మమా
నాకు ఆనందానుభూతి నొసగే ఆత్మమా
వేంచేయి.
2.ఇంకో ప్రాచీన భక్తుడు ఆత్మనుగూర్చి ఈలా జపించాడు :
కష్టపడేవాళ్ళను ఓదార్చే ఆత్మమా
మా హృదయాలను శుద్ధిచేసే ఆత్మమా
దుర్భలులకు బలాన్నొసగే ఆత్మమా
పడిపోయేవాళ్ళను నిలబెట్టే ఆత్మమా
వినయవంతుల వినయాన్ని పెంచి
గర్వితుల గర్వాన్ని అణచివేసే ఆత్మమా
అనాథులకు తండ్రివైన ఆత్మమా
పేదలకు ఆశాజ్యోతివైన ఆత్మమా
ఓడ మునిగిన వారికి రేవువైన ఆత్మమా,
నాకు నీపట్ల భక్తిని ప్రసాదించు.
3.నూత్నవేదం ప్రకారం, క్రీస్తు మరణోత్థానాలకు ముందు అతడే తండ్రినుండి ఆత్మను పొందుతాడు. ఈ దశలో అతడు శిష్యులకు ఆత్మను ఈయడు. మరణొత్ధానాల తర్వాత అతడు శిష్యులకు ఆత్మను దయచేస్తాడు. ఈ దశలో అతడు తండ్రినుండి ఆత్మను పొందడు. నేడు ఆత్మా క్రీస్తు ఒకరినొకరు మనకు అందించుకొంటారు. ఆ దివ్యవ్యక్తుల్లో ఒకరున్నచోట మరొకరుకూడ వుంటారు.
14. మరియను నడిపించిన ఆత్మ
1. మరియు తాను జన్మించినప్పటినుండి ఆత్మకు ఆలయంగా వండిపోయింది. గబ్రియేలు ఆమెను "అనుగ్రహ పరిపూర్ణురాలా" అని సంబోధించాడు. అనగా ఆమె ఆత్మతో పూర్ణంగా నిండిపోయిందనే భావం. క్రిసోస్తం భక్తుడు "తండ్రి మరియను ఎన్నుకొన్నాడు. కాని ఆత్మడు ఆమెను సందర్శించి పవిత్రపరచాడు. ఓ తోటకులాగ ఆమెకు నీరు పెట్టాడు" అని వ్రాసాడు. అనగా ఆత్మద్వారా ఆమె సంపూర్ణంగా శుద్ధినిపొంది పవిత్రురాలయిందని భావం. ఆత్మ క్రీస్తుని ఎడారికి నడిపించింది - లూకా 4,1. నేడు తన బిడ్డలమైన మనలను నడిపిస్తుంది - రోమా 8,14. అలాగే మరియనుకూడ నిరంతరం దైవమార్గంలో నడిపించింది.
2. గబ్రియేలు మంగళవార్తను విన్పించినపుడు మరియ దేవుని రక్షణ ప్రణాళికతో సహకరించింది. విశ్వాసంతో దేవుని చిత్తానికి లొంగింది. ఈ సందర్భంలో పవిత్రాత్మే ఆమె విశ్వాసాన్ని బలపరిచింది. ఆత్మ ఆమె మీదికి ఓ మేఘంలా దిగివచ్చింది — లూకా 1,35. ఆ దివ్యశక్తివల్లనే ఆమె గర్భవతి ఐంది, ఆమె కుమారుడు పవిత్రుడయ్యాడు.
ఎలిసబేతును సందర్శించినపుడు ఆమె ఆత్మశక్తితో ప్రవచనం చెప్పింది. ఆ ప్రవచనమే మహిమగీతం. ఆ పాటలో ఆమె దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించాడు అని చెప్పుకొంది. ప్రభువు గర్వితులను అణగదొక్కి దీనులను పైకి లేపేవాడు.
మరియ జీవితకాలంమంతా ఆత్మ ఆమెను నడిపిస్తూనే వచ్చింది. ఆ దివ్యశక్తి మరియను ప్రేరేపించి ఆమె క్రీస్తు జీవిత సంఘటనల భావాన్ని లోతుగా ఆలోచించి చూచుకొనేలా చేసాడు — లూకా 2,19,51.
క్రీస్తు సిలువపై చనిపోయేపుడు ఆ తల్లి సిలువ క్రింద నిలచివుంది. ఆమె తన మనసులో ఫెూరబాధలు అనుభవిస్తూ కుమారుని తండ్రికి సమర్పించింది. కొందరు పునీతుల భావాల ప్రకారం, ఈ సందర్భంలో ఆమె అనుభవించినంత వేదన ఏ నరుడూ అనుభవించలేదు. కాని ఈ బాధను అనుభవించే శక్తి ఆత్ముడే ఆమెకు దయచేసాడు.
ఆత్మ దిగిరాకముందు మరియ శిష్యులతో గలసి మీదిగదిలో ఆత్మ రాకడకొరకు ప్రార్ధించింది - అ,చ,1,14. ఈ కార్యం ఆత్మ ప్రేరణం వల్లనే జరిగింది.
మరియ ఉత్థాపనంలోకూడ ఆత్మశక్తి వుంది. ఆత్మ అనుగ్రహం వల్లనే ఆమె దేహం శిధిలం కాకుండా మోక్షానికి కొనిపోబడింది. జీవనదాతయైన ఆత్ముడు ఆమె మృతదేహానికి శాశ్వతజీవాన్ని దయచేసాడు. ఈలా ఆమె దేహంలోని ప్రతి ముఖ్యసంఘటనంలోను ఆత్మ ప్రభావం వుంది.
3. కాని పవిత్రాత్ముడు కన్య గర్భంలో క్రీస్తు శిశువుని ఏలా రూపొందించాడు? పవిత్రాత్మడు క్రీస్తుకి ముందుగా పోయేవాడు. అతనికి మార్గం సిద్ధంజేసేవాడు. మరియ దేవదూత సందేశాన్ని విని అంగీకరించగానే ఆత్ముడు ఆమె గర్భంలో యేసు శిశువుని రూపొందించాడు, మరియ మొదట పవిత్రాత్మను తన హృదయంలో ధరించింది. ఆ దివ్యవ్యక్తి ఆమెకు పరిపూర్ణ జీవాన్నిచ్చి జీవమయుడైన క్రీస్తు ఆమెనుండి జన్మించేలా చేసాడు. ప్రాచీన క్రైస్తవులు ఆమెను "పవిత్రాత్మకు ప్రియురాలు" అని పేర్కొన్నారు. ఆత్మడు యేసు జననానికి ఓ పవిత్ర గర్భాన్ని వెదికాడు. ఆ గర్భం అతనికి కన్య మరియలో దొరికింది. ఆ నిర్మల గర్భమే దేవుణ్ణి మానవలోకంలోకి తీసుకవచ్చింది. మరియు ఒక్క క్రీస్తకేకాదు, అతని దేహమైన తిరుసభకు కూడ తల్లి, క్రీస్తు మనకు శిరస్సు, మనమందరమూ అతనిలో ఇమిడే వున్నాం. కనుక మరియు మనందరికీ తల్లి, నేడు క్రీస్తు సాన్నిధ్యంలాగే ఆ తల్లి సాన్నిధ్యంకూడ తిరుసభలో నెలకొనివుంది. మరియను క్రీస్తుకి, శారీరకంగా తల్లిని జేసిన ఆత్ముడే ఆమెను తిరుసభకుకూడ ఆధ్యాత్మికంగా తల్లిని చేసాడు. ఆత్మకు వశవర్తినియై జీవించిన మరియు నేడు మనంకూడ ఆ యాత్మ ప్రేరణలకు లొంగి జీవించాలని హెచ్చరిస్తుంది.
ప్రార్థనా భావాలు
1. ఆత్మ దేవునికీ మనకూ నడుమ మధ్యవర్తిగా వుంటుంది. అన్ని వరాలూ వరప్రసాదాలూ తండ్రినుండి క్రీస్తుద్వారా ఆత్మగుండా మనకు లభిస్తాయి. మన తరపున మనం దేవుణ్ణి తెలిసికోవాలన్నా చేరాలన్నా ఆత్మే మార్గం. కనుక మనం ఆత్మగుండ క్రీస్తుద్వారా తండ్రిని చేరుతాం. అసలు ఆత్మ అనుగ్రహం లేందే ఆధ్యాత్మికరంగంలో దేన్నిగూడ సాధించలేం. ఆ దివ్యవ్యక్తి దేవునికీ మనకూ మధ్య వంతెన.
2. నూత్న వేదాంతి సిమియోను అనే భక్తుడు ఈలా నుడివాడు, “ఆత్మ దేవుని నోరు, ఆ నోటితో దేవుడు పలికే పలుకే క్రీస్తు మన నోటితో మన మాటలు తెలియజేస్తాం. నోరు లేకపోతే మన మాటలు ఇతరులకు ఏలా విన్పిస్తాయి? అలాగే ఆత్మ అనే నోరు లేకపోతే క్రీస్తు మనకు విన్పించడు, కన్పించడు".
3. తిరుసభలో ఆత్మ
15. తిరుసభ ఆరంభంలో ఆత్మ
1. శ్రీసభను ప్రారంభించింది క్రీస్తు ఒక్కడే కాదు, ఆత్మకూడ. ఉత్థానక్రీస్తు శరీరం మహిమను పొందిన శరీరం. ఈ శరీరాన్నిగూర్చే అతడు “మీరు ఈ యాలయాన్ని పడగొట్టండి, నేను మళ్ళా దీన్ని మూడు దినాల్లో కడతాను" అని యూదులతో చెప్పాడు, ఇక్కడ క్రీస్తు ఉద్దేశించిన ఆలయం యెరూషలేము రాతిగుడి కాదు. తన ఉత్తాన శరీరమే - యోహా 2,19,21. కాని క్రీస్తుకి ఈ ఉత్థాన దేహంతోపాటు మరో దేహంకూడవుంది. అదే శ్రీసభ. కనుకనే పౌలు కొరింతులోని క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ "మీరందరూ క్రీస్తు శరీరమైయున్నారు. ప్రతివ్యక్తి దానిలో ఒక భాగమే" అని వ్రాసాడు - 1కొ 12,27. ఉత్తాన శరీరంతోపాటు శ్రీసభకూడ క్రీస్తు దేహం. ఈ దేహం మనమే. ఈ దేహనిర్మాత ఆత్మే
2. ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి శ్వాసను ఊదాడు. ఈ శ్వాస పవిత్రాత్మే ఈ యాత్మ ద్వారా వారికి పాపాలను పరిహరించే శక్తి లభించింది - యోహా 20,21-23. క్రీస్తు ఈలా శ్వాసనూదడం, సృష్ణ్యాదిలో దేవుడు మట్టి ముద్దలోనికి శ్వాసనూదడాన్ని జ్ఞప్తికి తెస్తుంది - ఆది 2,7, ఆ శ్వాసకూడ పవిత్రాత్మే అక్కడ ఆ శ్వాసద్వారా మనుష్య సృష్టి జరిగింది. ఇక్కడ ఈ శ్వాసద్వారా శ్రీసభ అనే సృష్టి జరిగింది.
3. అపోస్తలుల చర్యల ప్రకారం పెంతెకోస్తు దినాన శ్రీసభ ఆవిర్భవించింది. ఆనాడే ఆత్మ శిష్యులమీదికి గాలిలా, అగ్నిలా, నాలుకల్లా దిగివచ్చింది - 2.1-4 పేత్రు ఈ యంశాన్ని ఈలా వివరించాడు: ఉత్తానక్రీస్తు తండ్రి కుడిప్రక్కను చేరుకొని అతనినుండి ఆత్మను పొందాడు. తాను పొందిన ఆత్మను శిష్యులమీద కుమ్మరించాడు. అదే పెంతెకోస్తు లేక ఆత్మ దిగిరావడం - 2,33. ఈ యంశాన్ని క్రీస్తు ముందుగానే శిష్యులకు ఎరిగించాడు. అతడు మీరు ఆత్మతో జ్ఞానస్నానం పొందుతారు అని చెప్పాడు - 1,5. యెరూషలేములో తొలినాటి భక్తసమాజం 120 మంది - 1,15. వీళ్ళంతా నీటితోగాక ఆత్మతోనే జ్ఞానస్నానం పొందారు. వీళ్ళే తొలి శ్రీసభ. అనగా శ్రీసభను ప్రారంభించింది ఆత్మే ఈ సందర్భంలో ఇరెనేయస్ వేదశాస్త్రి ఈలా చెప్పాడు. “తండ్రి తన వాక్కుతోను శ్వాసతోను శ్రీసభను సృజించాడు, అవి రెండు అతనికి రెండు చేతుల్లాంటివి. ఈ రెండు చేతులతోనే అతడు పూర్వం ఆదాముని చేసాడు." ఇక్కడ ఈ వేదశాస్త్రి దృష్టిలో తండ్రి వాక్కు క్రీస్తు తండ్రి శ్వాస పవిత్రాత్మ
చనిపోయిన క్రీస్తుని మళ్ళా సజీవుని చేసింది ఆత్మే - రోమా 8,11. శ్రీసభకు ఊపిరిపోసింది గూడ ఆత్మే కనుక క్రీస్తుతోపాటు ఆత్మడుకూడ శ్రీసభను స్థాపించాడు అని చెప్పాలి. తండ్రి క్రీస్తునీ ఆత్మనుకూడ శ్రీసభలోనికి పంపాడు,
4. ఆత్మ ప్రారంభించిన శ్రీసభ ఆత్మశక్తితోనే చెందడం మొదలుపెట్టింది. సమరయలోని భక్తసమాజం ఆత్మను పొందింది - 8,14-17. కైసరియలోని కొర్నేలి బృందం ఆత్మను పొందింది – 10,44–48, ఎఫెసు నగరంలోని భక్తులు ఆత్మను పొందారు - 19,1-7. ఈ విధంగా తిరుసభ పెంపజెందుతూ వచ్చింది. క్రైస్తవులందరూ ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందారని వాకొన్నాడు పౌలు. "మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం? - 1కొ 12,13. క్రీస్తు మరణించి పునరుత్తానుడై తన ఆత్మను కుమ్మరింపగా శ్రీసభ పుట్టింది. అది క్రీస్తు దేహం. ఆ దేహం మనమే.
ప్రార్థనా భావాలు
1. మనం శ్రీసభలో ఆత్మసాన్నిధ్యాన్ని అట్టే గుర్తించం. శ్రీసభకూ ఆత్మకూ చాల దగ్గిర సంబంధం వుంది. ఇరెనేయస్ భక్తుడు ఈలా నుడివాడు. శ్రీసభ వున్నచోట పవిత్రాత్మ వుంటుంది. పవిత్రాత్మ వున్నచోట శ్రీసభ వుంటుంది. సకల వరాలూ వుంటాయి. కనుక శ్రీసభలో చేరనివాళ్ళు ఆత్మ వరాలు పొందలేరు.
2. శ్రీసభ దేశదేశాల్లో విస్తరించివున్న బ్రహ్మాండమైన క్రైస్తవ సమాజం. ఈ క్రైస్తవులంతా కలసి ఐక్యభావంతోను పవిత్రంగాను జీవించడంలోనే పవిత్రాత్మశక్తి కన్పిస్తుంది. ఈ పవిత్రత, ఐక్యత అనేవి నరమాత్రులవల్ల సిద్ధించే లక్షణాలు కావు, దైవశక్తివల్ల లభించే గుణాలు,
16. క్రీస్తుతో ఐక్యంజేసే ఆత్మ
1. ఆత్మ మనలను క్రీస్తుతో ఐక్యంజేస్తుంది. ఈ యైక్యత జ్ఞాస్నానం ద్వారా ప్రారంభమౌతుంది. మ నమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం - 1కొ 12,13. అనగా మనం ఆత్మ అనుగ్రహం వల్ల క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది ఒక్కసమాజానిమయ్యాం, మనుష్యావతార సమయంలో ఆత్మ సుతునికి ఓ దేహమిచ్చింది. ఇప్పుడు మళ్ళా శ్రీసభ అనే దేహాన్నిస్తుంది.
2. అప్పరసాలను దివ్యసత్రసాదంగా మార్చేది ఆత్మే ఈ సత్రసాదంకూడ క్రీస్తు శరీరమే. ఆత్మతో నిండివున్న ఈ దివ్యభోజనాన్ని ఆరగించి మనం క్రీస్తుతో ఐక్యమౌతాం. ఒకే రొట్టెలో పాలుపంచుకొనే మనం ఒక్క శరీరమౌతాం - 1కొ 10,17, ఆత్మ మనలను క్రీస్తుతో కలుపుతుంది. ఈ కలయికద్వారా మనమంతా క్రీస్తనే వరునికి వధువులమౌతాం. క్రీస్తనే శరీరంలో అవయవాలమౌతాం. అతడు తన శరీరమైన శ్రీసభకు శిరస్సు - కొల్లో 1,18. ఎప్పడుగూడ ఆత్మ మనలను తనతోగాక క్రీస్తుతో ఐక్యంజేస్తుంది,
శ్రీసభ కేవలం సాంఘిక, ఆర్థిక అవసరాలను తీర్చే సంఘం మాత్రమేకాదు. అది క్రీస్తునుండీ ఆత్మనుండీ ఉద్భవించింది. ఆధ్యాత్మికమైంది. ఆ సభలోనే చేరిన మనంకూడ ప్రభువుతో ఐక్యమౌతాం. మన దేహంలోని అవయవాలను మన ఆత్మ ఒక్కటిగా బంధిస్తుంది. కనుకనే మన అవయవాలన్నీ కలసి ఐక్యభావంతో పనిచేస్తున్నాయి. ఈలాగే శ్రీసభ అనే జ్ఞానదేహంలో అవయవాలైన క్రైస్తవులందరినీ ఐక్యపరచేది పవిత్రాత్మే ఈ యాత్మ శక్తివల్లనే క్రైస్తవులు ఏ దేశానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఏ కాలానికి చెందినా ఒకరినొకరు అంగీకరింపగల్లుతున్నారు.
పతితులు తమ దబ్బరబోధలతో శ్రీసభలోని కొందరిని అపమార్గం పట్టిస్తారు. తిరుసభను విభజిస్తారు. కాని ఆత్మ ఆ సభను నిరంతరం ఐక్యపరుస్తుంది. eyes; లోకాన్నంతటినీ ఒక్కటిగా కలిపేస్తుంది - జ్ఞాన 1,7.
3. శ్రీసఖేమో ఒక్కటే. ఐనా దానిలో చాల అవయవాలూ, చాల భాగాలూ వున్నాయి, క్రీస్తు పెక్కు అవయవాలతో కూడిన ఒక్క శరీరం వంటివాడు. పెక్కు అంగాలతో కూడిన శరీరం ఒక్కటే గదా! 1కొ 12,12. దేవుడు ఒక్కడైగూడ ముగ్గురు వ్యక్తులుగా వున్నాడు. అలాగే ఆ దేవుని సమాజమైన తిరుసభకూడ ఒక్కటైనా భిన్నభిన్న వ్యక్తులతో కూడివుంది. ఐక్యతా విభిన్నతా రెండూ దాని లక్షణాలు. ఈ రెండు లక్షణాలకూ కర్త పవిత్రాత్మే. ఈ యాత్మ శ్రీసభ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దయచేస్తుంది - 1కొ 12, 11. ఈ వరాల వలన మనలో వైవిధ్యం ఏర్పడుతుంది. తిరుసభ సభ్యులు ఎప్పుడూ ఐక్యమైయుండాలి. ఐనా ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. పవిత్రాత్ముడు కోరేది యిదే. ఆ యాత్మడు ఐక్యతకూ భిన్నత్వానికి గూడ కర్త అని చెప్పాం. మూస:చcenter
1. పేత్రు 4,10 పలురకాల ప్రజలు దేవుని నుండి పలురకాల వరాలను పొందుతారని చెప్తుంది. శ్రీసభ క్రీస్తు శరీరం. ఆ శరీరానికి జీవమిచ్చేది ఆత్మే ఆ శరీరంలో మనమందరం సభ్యులం. పుణ్యపురుషుడైన హేబెలునుండి ఎన్నుకోబడినవారిలో చిట్టచివరి వ్యక్తివరకు అందరికీ వరాలిచ్చేది, అందరి విశ్వాసాన్ని పెంచేది ఆత్మే ఆ యాత్మడు తానొక్కడైకూడ భిన్న వ్యక్తులకు భిన్న వరాలిస్తాడు- 1కొ 12,11.
1. "సాలోమోను గీతాలు" అనే గ్రంథాన్ని వ్రాసిన ఓ సిరియా భక్తుడు ఈలా నుడివాడు. “సంగీతకారుడు వాద్యాన్ని చేతబట్టి తంత్రులను మీటగానే అది మధుర సంగీతం పలుకుతుంది. అలాగే దేవుని ఆత్మ నా హృదయ తంత్రులను మీటగానే నేనతని ప్రేమద్వారా స్తుతిగీతాలు పలుకుతాను". ఈ భక్తునిలాగే మనంకూడ ఆత్మ ప్రభావంతో దేవుణ్ణి స్తుతించాలి.
17.నరుల్లో దేవుని పోలికను కలిగించే ఆత్మ
1. దేవుడు మట్టిముద్దలోనికి తన శ్వాసను ఊదగా ఆ ముద్ద జీవంగల ప్రాణి ఐంది - ఆది 2,7. అతడే ఆదిమ మానవుడు, ఆదాము. ఆ శ్వాస పవిత్రాత్మే అది దేవుని వూపిరి. ఆ యాత్మ మనలోనికి ప్రవేశించింది కనుక మనం “ఆధ్యాత్మిక’ మానవులమయ్యాం. ప్రాచీన భక్తులు వాకొన్నట్లుగా ఆత్మ మన ఆత్మకే ఆత్మ ఆ యాత్మ మనలో వుండబట్టే మనం నిత్యం దేవుణ్ణి కోరుకొంటున్నాం. అతనితో ఐక్యంకాగోరుతున్నాం. అతనివైపు పయనిస్తున్నాం. బాసిల్ భక్తుడు చెప్పినట్లు, ఆరోగ్యంగావున్న కన్ను వస్తువులను చూస్తుంది. ఆత్మతో నిండివున్న నరుడు దేవుణ్ణి దర్శిస్తాడు. దేవుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు - ఆది 1,26-27. ఈ పోలిక, లేక రూపం, నరునికి తనలోని దైవశ్వాస వల్లనే, అనగా దేవుని ఆత్మవల్లనే వచ్చింది. ఈ పోలిక నరునికి లభించిన ఏదో వొక గుణంకాదు. అసలు నరుడే దేవుని పోలిక. కాని దేవునికి ప్రధానమైన పోలిక క్రీస్తే - కోస్తే 1,15. ఆ క్రీస్తుద్వారానే మనం దేవుని పోలికను పొందాం. అతని ద్వారానే దేవునితో ఐక్యంగావాలని అభిలషిస్తాం. ఇప్పుడు మనం మొదట జ్ఞానస్నానంలో క్రీస్తు పోలికను పొంది ఆ పోలికద్వారా దేవుని పోలికను పొందుతాం. కనుక మనం దేవుని పోలికకు పోలికగా వుంటాం అని చెప్పాలి. 2. నరుడు పాపంచేసి దేవుని పోలికను కోల్పోయాడు. కాని క్రీస్తు తన మరడోత్తానాలద్వారా మనలో ఈ పోలికను పునరుద్ధరించాడు. కాని యిప్పడు మన హృదయంలో క్రీస్తు పోలికనూ దేవుని పోలికనూ నెలకొల్పేది పవిత్రాత్మే అతడు గొప్ప చిత్రకారుడు. మన హృదయంలో దైవరూపాన్ని చిత్రించేది అతడే. దేవునికీ మనకూ ఐక్యతను సాధించిపెట్టేది దైవాత్ముడే 2పేత్రు 1,4. మనం దైవ స్వభావంలో పాలుపొందామని చెప్తుంది. దేవుని పోలిక వల్లనే మనకు దైవస్వభావం సిద్ధించింది. దేవుడు నరుడ్డి రెండు దశల్లో సృజించాడు. మొదటిది ప్రాతసృష్టి అనగా ఆదాము సృష్టి కాని మానవజాతి పాపంవల్ల పతనమై దేవుని పోలికను కోల్పోయింది. దేవుడు క్రీస్తు మరణోత్తానాలద్వారా నరులను మళ్ళా నూత్నంగా సృష్టించాడు. మనం మళ్ళా దేవుని రూపాన్ని పొందాం. ఈ రెండు దశల్లోను నరుళ్ళి దేవుని రూపాన్ని నెలకొల్పింది ఆత్మే భగవంతుడు లోకాన్ని నరునికొరకు సృజించాడు. కాని నరుడ్డి తనకొరకు సృజించాడు. కనుక ఆత్మ తాను నరుళ్ళో పుంచిన దైవరూపంద్వారా అతన్ని నిరంతరం దేవునివైపు ఆకర్షిస్తుంటుంది, ఆయాత్మ అనుగ్రహంవల్ల నరుడు దేవునిపట్ల భక్తి పెంచుకొంటాడు. అతన్నిచేరి అతనితో కలసిపోగోరుతాడు. మనలోవున్నదేవుని రూపం మనం దేవునికి చెందినవాళ్ళమని నిరూపించే దివ్యముద్ర.
మనలో వసించి మన హృదయంలో దైవరూపాన్ని చిత్రించే ఆత్మ మూడు పనులు చేస్తుంది. మనం దేవునితో, క్రీస్తుతో ఐక్యమై జీవించేలా చేస్తుంది. తోడినరులతో ప్రేమభావంతో కలసిమెలసి వుండేలా చేస్తుంది. మన దైవస్వభావాన్ని మనం గుర్తించి దివ్యత్వం గలవారిలా బాధ్యతాయుతంగా జీవించేలా చేస్తుంది. ఆత్మద్వారా దేవుని పోలికను పొంది వుండడం నరుని మహాభాగ్యాల్లో వొకటి అని చెప్పాలి.
ప్రార్థనా భావాలు
1. బైబులు గ్రంథాలను వ్రాయించింది ఆత్మ పవిత్ర గ్రంథంలో ఆత్మ నెలకొని వుంటుంది. ఐతే ఆత్మ జీవం.ఆ దివ్యవ్యక్తి సాన్నిధ్యం వలన బైబులు వాక్కు సజీవవాక్కు ఔతుంది. జ్ఞానస్నాన సమయంలో క్రీస్తు మీదికి దిగివచ్చినట్లుగా ఆత్మడు దైవవాక్కులోనికికూడ దిగివచ్చి దాన్ని సజీవం చేస్తాడు - హెబ్రే 4, 12. ఈలా ఆత్మతో నిండివున్న జీవవాక్కుని మనం భక్తితో పఠించాలి. ఇంకా, మనం ఆత్మశక్తితోనే వేదవాక్కుని అర్థంచేసికొంటాం గూడ. ఆ దివ్యవ్యక్తి అనుగ్రహించందే బైబులు ఎవ్వరికీ బోధపడదు.
2. గ్రెగొరీ నాసియాన్సన్ భక్తుడు ఈలా వ్రాసాడు. క్రీస్తు జన్మించాడు. ఆత్మడు అతనికి ముందుగా మార్గం సిద్ధంజేసాడు. క్రీస్తు జ్ఞానస్నానం పొందాడు. దివ్యాత్ముడు అతనికి సాక్ష్యం పలికాడు. క్రీస్తు శోధనలకు గురయ్యాడు. ఆత్మడు అతన్ని యెడారికి కొనిపోయాడు. ప్రభువు అద్భుతాలు చేసాడు. ఆత్మడు అతనికి శక్తినిచ్చాడు. క్రీస్తు మోక్షారోహణం చేసాడు. ఆత్మడు ఇప్పడు అతని వుద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. ఈలా ఆ యిద్దరికీ ఎడతెగని సంబంధం వుంది.
18. దైవ పుత్రత్వమొసగే ఆత్మ
l. జ్ఞానస్నాన సమయంలోనే పవిత్రాత్మ మనలను దేవుని పుత్రులనుగాను పుత్రికలనుగాను చేస్తుంది. మనం దత్తపుత్రత్వాన్నొసగే ఆత్మను స్వీకరించాం. ఆ యాత్మద్వారా దేవుని అబ్బా అనగా నాన్నా అని పిలుస్తాం - రోమా 8,15. పూర్వవేదంలోని యూదులు తాము దేవుని బానిసలమనుకొన్నారు. ఆ దేవుణ్ణిచూచి భయపడ్డారు. కాని నూత్నవేదంలో మనం దేవునికి బానిసలమనుకోము. బిడ్డల మనుకొంటాం. దేవునిపట్ల యూదులకు లేని చనువు మనకుంది.
దేవుడు ఆదామని తన్నుపోలిన వాడ్డిగా చేసాడు. అతనికి దేవుని కుమారుడని పేరు - ఆది 5,1. నూత్నవేదంలో మనం క్రీస్తుద్వారా దేవుని కుమారులమూ కుమార్తెలమౌతాం. కాని క్రీస్తుద్వారా మనలను దేవుని బిడ్డలను చేసేది మాత్రం పవిత్రాత్మే క్రీస్తు దేవునికి సహజపుత్రుడు. మనం దత్తపుత్రులము మాత్రమే. ఇక ఈ దత్తపుత్రత్వాన్ని మనకు దయచేసేది పవిత్రాత్మే ఆత్మద్వారానే క్రీస్తు దేవునికి కుమారుడయ్యాడు. ఆ యాత్మద్వారానే మనంకూడ కుమారునియందు కుమారులమౌతాం - గల 4,5-7.
2. సత్యస్వరూపియైన ఆత్మ మీలో వుంటాడు అని చెప్పాడు ప్రభువు - యోహా 14,17. పవిత్రాత్ముడు మనలో వసిస్తుంటాడని ఈ వాక్యం భావం. పూర్వవేదంలోని ఏ భక్తుడుకూడ, ఏ ప్రవక్తకూడ, పవిత్రాత్ముడు తనలో వసిస్తున్నాడని చెప్పకోలేదు. వాళ్ళు ప్రభువు సాన్నిధ్యం తమతో వుంటుందని నమ్మారు. అది తమలో వుందనుకోలేదు. ప్రవక్తల్లో ఆత్మ క్రియాశక్తీ, ప్రేరణమూ వున్నమాట నిజమే. కాని ఆత్మే తమలో వుందని ప్రవక్తలు భావించలేదు. నూత్న వేదంలో పవిత్రాత్ముడు మనలో ఓ వ్యక్తిగా వసిస్తాడు. త్రీత్వంలోను క్రీస్తులోను ఉన్నట్లే అతడు మనలో కూడ వుంటాడు. ఈలావుండి మనలను దేవుని పత్రులనుగా జేస్తాడు. ఈ దివ్యనివాసం పూర్వవేదంలోని భక్తుల్లో లేదు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యేక భాగ్యం.
3. బిడ్డలు తండ్రి ఆస్తికి హక్కుదారులౌతారు. మన తండ్రి దేవుడు. అతని ఆస్తి మోక్షం. కనుక మనం దేవుని బిడ్డలమై అతని మోక్షానికి వారసులమౌతాం, కాని మనం మోక్షానికి వారసులమయ్యేలా చేసేది మాత్రం పవిత్రాత్మే కనుకనే పౌలు " దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్లానాన్ని మనం పొందుతాం అనడానికి ఆత్మే హామీ" అని వాకొన్నాడు - ఎఫే 1, 14 దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానం మోక్ష బహుమానమే. దీన్ని మనం సంపాదించుకొంటాం అనడానికి ఆత్మే మనకు హామీగా వుంటుంది. ఇక్కడ "హామీ" అంటే బయానా లేక సంచకరువు, క్రయవిక్రయాల్లో బయానా ఇచ్చినవాడు తర్వాత పూర్తిసామ్ముగూడ చెల్లిస్తాడు. ఆలాగే ఆత్మ ఈ లోకంలోనే మనకు మోక్షాన్ని కొంతవరకు ఇప్పిస్తుంది. మన మరణానంతరం ఆ మోక్షం మనకు పూర్తిగా దక్కేలా చేస్తుంది. కనుకనే పౌలు మరో తావలో, మనం దేవుని పుత్రులం గనుక దేవునికి వారసులం అని నుడివాడు. మన వారసత్వమైన మోక్షాన్ని మన కిప్పించేది పవిత్రాత్మే - రోమా 8, 16-17. ఇందుకు మనం ఆత్మకు ఎంతో కృతజ్ఞలమై యుండాలి.
ప్రార్ధనా భావాలు
1. ఆత్మడు పూర్వవేదంలో కన్పించే తీరుకీ నూత్న వేదంలో కన్పించే తీరుకీ చాలా తేడాలున్నాయి.
అతడు పూర్వవేదంలోని పుణ్యాత్ముల మీదికి ఓ గొప్ప శక్తిలా దిగివచ్చాడు. కాని నూతవేదంలోని స్నాపక యోహాను మీదికి, క్రీస్తుమీదికీ, శిష్యుల మీదికీ ఓ వ్యక్తిగా దిగివచ్చాడు.
పూర్వవేదంలో భక్తులు ఆత్మవరాలు పొందారేగాని అతన్ని ఓ వ్యక్తినిగా పొందలేదు. నూత్నవేదంలో ఆత్మ భక్తులమీదికి ఓ వ్యక్తిగా వేంచేసివచ్చి వాళ్ళకు తన వరప్రసాదాలను దయచేసింది.
పూర్వవేదంలో పవిత్రాత్ముడు ప్రవక్తలకు తన వెలుగును ప్రసాదించాడు. కాని నూత్నవేద భక్తుల్లో అతడు ఓ దేవాలయంలోలాగ వసిస్తాడు.
పూర్వవేదంలో ఆత్మ సాన్నిధ్యం తాత్కాలికమైంది. కాని నూత్నవేదంలో అది శాశ్వతమైంది.
2. బాసిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "పరిశుద్ధ గ్రంథం ఆత్మనుగూర్చి చాల తక్కువగా చెప్తుంది. కనుక భక్తులుకూడ ఆత్మనుగూర్చి ఎక్కువగా మట్లాడరు. మనం ఆత్మను పూర్ణంగా అర్థంచేసికొనేదీ, అనుభవానికి తెచ్చుకొనేదీ మోక్షంలోనే".కనుక ఈ లోకంలో వున్నంతవరకు ఆత్మ మనకు చాలవరకు అర్థంకాని దైవరహస్యంగానే వుండిపోతుంది.
19. ప్రేషిత సేవ చేయించే ఆత్మ
1. ప్రేషిత సేవ ద్వారా ఆత్మ శ్రీసభను వ్యాప్తిజేస్తుంది. అన్ని దేశాల్లోను అన్ని కాలాల్లోను శ్రీసభ నెలకొనేలా చేస్తుంది. పెంతెకోస్తునాడు ఆత్మ శిష్యులమీదికి నాలుక రూపంలో దిగివచ్చిందని వింటున్నాం - అచ 2,3, నాలుకద్వారా మాట్లాడతాం, సమాచారం తెలియజేస్తాం. కనుక నాలుకలా వచ్చిన ఆత్మ మనం లోకానికి క్రీస్తుని గూర్చి సమాచారాన్ని అందించేలా చేస్తుంది. ఆత్ముదు ఎప్పడూ భక్తులను ప్రేషిత సేవకు పంపుతూనే వుంటాడు. అతడు ఫిలిప్పని రథమెక్కిపోతూన్నయితియోపీయుని దగ్గరికి పంపాడు - అ.చ.8,29. పేత్రుని అన్యజాతివాడైన కొర్నేలివద్దకు పంపాడు - 10, 19–20, సౌలు బర్నబాలను అన్యజాతి ప్రజలకు బోధచేయడానికి పంపాడు - 13,2-4 అసలు తొలినాటి ప్రేషితుల వేదబోధ అంతా దేవుని ఆత్మయొక్క శక్తితోనే జరిగింది. ఆత్మ పౌలుచే ఆసియా, బితూనియా రాష్ట్రాల్లో వేదబోధ చేయించనీయలేదు. మాసెడోనియాలో చేయించింది - అ,చ, 16,6,7,9.
పౌలు ప్రేషితుడుగా వ్యవహరించడానికి పిలువబడినవాడు. సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడు - రోమా 1,1. ఆత్మ ఎల్లవేళలా పిలువబడినవారిని వేదబోధకు పంపుతూంటుంది.
క్రీస్తు శిష్యులమీదికి ఊదిన ఊపిరి వారిని వేదబోధకు పంపింది - యోహా 20,22, ఈ ఊపిరి పవిత్రాత్మే మొదట దేవుడు మట్టిముద్దలోనికి గాలిని వూదగా సృష్టి జరిగింది. ఆదాము ఆవిర్భవించాడు - ఆది 2,7. క్రీస్తు శిష్యులమీదికి వూదిన గాలి నూత్న సృష్టిని జరిగిస్తుంది. ఈ నూత్న సృష్టి క్రైస్తవ ప్రపంచమే. క్రీస్తు తనతో వుండడానికీ, సువార్తా ప్రకటనకు పంపడానికి పండ్రెండు మందిని ఎన్నుకొన్నాడు - మార్కు 3, 14 ప్రేషితులు ప్రధానంగా సువార్తాబోధకు వెళ్ళేవాళ్ళు. కాని ఈ కార్యం జరిగేది మాత్రం ఆత్మద్వారానే.
2. ప్రేషితులు ఉత్థాన క్రీస్తునిగూర్చి బోధించారు. కాని ఈ బోధనాకార్యం ఆత్మశక్తివల్లనే జరిగింది. ఆత్మ శక్తివల్లనే వాళ్ళు అన్యజనులను దేవునికి విధేయులను జేయగలిగారు - రోమా 15,19. ఆత్మ క్రీస్తుని లోకానికి తెలియజేస్తుంది. ఆత్మ ప్రోద్భలంవల్లనే ప్రేషితులు క్రీస్తుని గూర్చి బోధించారు - అచ 4,31. నిజమైన వేదబోధ ఎప్పడూ ఆత్మ ప్రేరణం వల్లనే జరుగుతుంది.
పౌలు విలువలేని ఓ మట్టిపాత్రలాంటివాడు. కాని ఆ పాత్రలో గొప్ప సంపద వుంది. ఆ సంపద క్రీస్తు సందేశమే. అతడు ఆ సంపదను లోకానికి పంచిపెడతాడు - 2కొ 47. అతడు స్వయంగా బలహీనుడు. కాని అతని బలహీనతను ఆధారంగా జేసికొని ఆత్మ తన శక్తిని చూపిస్తుంది. అతని ద్వారా క్రీస్తు సందేశాన్ని విన్పిస్తుంది - 1కొ 3,13.
3. పౌలు మొదలైన తొలినాటి భక్తులు బోధించిన క్రీస్తు సందేశాన్ని తిమోతి జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. అది పారంపర్య బోధ. కాని ఆత్మశక్తివల్లనే అతడు ఆ బోధను కల్లీలేకుండా పదిలపరచగలిగాడు. కల్లీ లేకుండా ఇతరులకు అందించగలిగాడు -2తిమో 1,14. ఈలాగే నేడు మనంకూడ వేదబోధను కల్తీచేయకూడదు. తొలినాటి వేదబోధకులు ఏ సందేశాన్ని విన్పించారో, దాన్ని మాత్రమే మనం ప్రజలకు తెలియజేయాలి. ఆత్మ మనతోవుండి మనం కల్తిలేని వేదబోధ చేసేలా సాయపడుతుంది.
ప్రార్థనా భావాలు
1. 6సిరియా సీమోను భక్తుడు ఓ గీతంలో ఆత్మను గూర్చి ఈలా వ్రాసాడు.
ఆత్మమా! నీవేలా అనలంగాను
శీతలంగాను గూడ వుంటావు?
నీవు చీకటిని వెలుగునుగాను
మృత్యువుని జీవంగాను
నరుణ్ణి దేవుణ్ణిగాను ఏలా మార్చుతావు?
నీవు మా హృదయాల్లోకి ప్రవేశించి
మా అంతరంగాన్ని ఏలా మార్చుతావు?
మా దుఃఖాన్ని ఏలా ఆనందంగా చేస్తావు?
నీవు మాతో ఎలా వసిస్తావు?
మా పాపాలకు ఏలా కోపించకుండా వుంటావు?
మమ్మేలా భరిస్తావు?
మహోన్నతంలో వసించే నీవు
భూమిమీది మా చర్యలను ఏలా గమనిస్తావు?
2. ఆత్మ మనమీదికి దిగివచ్చినపుడు గొప్ప నెమ్మదీ శాంతీ ఆనందమూ కలుగుతాయి. దీన్ని పురస్కరించుకొనే క్రీస్తు లోకం ఈయలేని శాంతిని నేను మీకు ఇస్తానని వాకొన్నాడు - యోహా 14,27.
20. ప్రవచనం చెప్పించే ఆత్మ
1. ప్రవక్తలు విశేషంగా పవిత్రాత్మచే ప్రబోధితులైనవాళ్ళు. ఆత్మ వారిద్వారా మాట్లాడింది. "ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని చెప్పారు" - 2షేత్రు 1,21. పూర్వం మోషే ప్రజలందరూ ఆత్మనుపొంది ప్రవచనం చెప్పాలని కోరాడు - సంఖ్యా 11,29. యోవేలు ప్రవక్తకూడా నరులందరూ ఆత్మనుపొంది ప్రవచనం చెప్తారని పల్మాడు - అచ 2,17. ప్రభువు తన ప్రజలను ప్రవక్తలనుగాజేసి వారికి ఉపదేశం చేస్తాడు అన్నాడు యెషయా - 54,12. నూత్నవేదంలో పవిత్రాత్మే మనకు అభిషేకం చేస్తుంది – 1యోహా 2,20. అనగా ఆత్మ మన హృదయాల్లో విశ్వాసం పుట్టించి మనం వేదసత్యాలను గ్రహించేలాను వాటిని ఇతరులకుగూడ తెలియజేసేలాను చేస్తుంది.
బైబులు గ్రంథ రచనతో దివ్యశ్రుతి ముగిసింది. కనుక ఇప్పుడు మనం క్రొత్త వేదసత్యాలేమీ నేర్చుకోము. కాని ఆత్మప్రేరణంతో ప్రాత వేదసత్యాలనే మరింత లోతుగా గ్రహిస్తాం. ఆ వేదసత్యాలనుండి పురాతన విషయాలనూ నూత్న విషయాలనూ నేర్చుకుంటాం - మత్త 13,52.
2. ప్రవచన వరాన్ని దయచేసేది ఆత్మే ఆ వరంలో ముఖ్యమైన అంశం వేదగ్రంథ రచన. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని విన్పించారు - 2షేత్రు 1,21. ఆత్మ క్రీస్తుని మహిమపరుస్తుంది. ఏలా? వేదగ్రంథాలను వ్రాయించడంద్వారా, వాటిని ప్రకటింపజేయడంద్వారా. నూత్నవేదగ్రంథాలు తెరువబడిన క్రీస్తు హృదయంనుండి ఆత్మ ప్రేరణంవల్ల పుట్టాయి.
మనం మామూలుగా తిరుసభ, దివ్యసత్ర్పసాదం క్ర్రీస్తు శరీరమని చెప్తాం. కాని దివ్యగ్రంథాలుకూడ క్రీస్తు శరీరమని చెప్పాలి. వాటిల్లోగూడ ఆత్మశక్తివల్ల క్రీస్తు సాన్నిధ్యం నెలకొని వుంటుంది. కనుక మనం వేదగ్రంథాన్ని పఠించేపుడు క్రీస్తే మనతో మాటలాడుతుంటాడు. అగస్టీను భక్తుడు చెప్పినట్లుగా, సువిశేషం క్రీస్తు నోరు. పవిత్రగ్రంథంద్వారా ఆత్మ దేవుని సందేశాన్ని విన్పిస్తుంది.
3. ప్రవచనవరం పూర్వం వేదగ్రంథ రచయితల్లో కన్పించింది. ఈనాడది వేదగ్రంథ పఠితల్లో కన్పిస్తుంది. ఈ వరంద్వారా మనం పవిత్రగ్రంథాన్ని అర్థం జేసికొంటాం. దాన్ని ఇతరులకుగూడ బోధిస్తాం. ఈ బోధయెప్పడూ ఆత్మశక్తివల్లనే జరుగుతుంది - 1కొ 12,3. పూర్వవేదంలో ప్రవచనవరం చివరి ప్రవక్తమైన మలాకీతో ఆగిపోలేదు. ఆ వరం తర్వాత రబ్బయిలలో కొనసాగింది. దీని బలంతోనే రబ్బయిలు పూర్వవేదంమీద వ్యాఖ్యలు చెప్పారు. నూత్నవేదంలోగూడ వేదబోధ చేసే వాళ్ళందరికీ ఈ వరం కొదోగొప్పో వుంటుంది. దేవుణ్ణి నిరాకరించే ఆధునిక ప్రపంచంలో మనం ఈ వరాన్ని వినియోగించుకొని మరీ అధికంగా వేదబోధ చేయాలి.
వేద గ్రంథాలను చదివి అర్థంజేసికోడానికి ఆత్మ సహాయం అత్యవసరం, పవిత్ర గ్రంథంలోని ప్రవచనానికి ఎవరి యిష్టం వచ్చినట్లుగా వాళ్లు అర్థం చెప్పకూడదు - 2షేత్రు 1,20. ఆత్మ మనకు ఆ గ్రంథ భావాన్నితెలియజేయాలి. ఆ యాత్మ సహాయంతోనే దాన్ని మనం ఇతరులకు బోధించాలి.
ఆత్మ వేదగ్రంథ వాక్యం మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆ వాక్కు మన హృదయంలో సజీవంగా నెలకొనేలా చేస్తుంది - హెబ్రే 4,12. కనుక ఎప్పుడుగూడ మనం ఆత్మ సహాయంతోగాని వేదగ్రంథాన్ని పఠించగూడదు. ఆత్మ తోడ్పాటుతో వేదగ్రంధాన్ని చదివితే దానిలో తప్పక క్రీస్తుని కలసికొంటాం, దివ్యగ్రంథ పఠన ప్రయోజనం ఇదే.
మనం బైబులు చదువుకొనేపుడు ఆత్మ మన ముఖం మీది ముసుగును తొలగిస్తుంది. అప్పుడు క్రీస్తు జ్యోతి మనమీద ప్రసరిస్తుంది - 2కొ 3,17-18. మనం వేద గ్రంథంలోని వాక్యంలో క్రీస్తు స్వరాన్ని స్పష్టంగా గుర్తిస్తాం.
ప్రార్థనా భావాలు
1. సిరియా సీమోను భక్తుడు ఈలా నుడివాడు. “తండ్రి విశ్వాసగృహంలాంటివాడు. క్రీస్తు ఆ గృహానికి తలుపులాంటివాడు. ఆత్మడు ఆ తలుపుకి తాళపు చెవిలాంటివాడు." ఆత్మ గొప్ప వెలుగు. ఆ వెలుగునుపొంది మనం వేదసత్యాలను గ్రహిస్తాం. దేవుణ్ణి విశ్వసిస్తాం.
2. ఇరెనేయస్ భక్తుడు ఈలా చెప్పాడు. తండ్రికి వాక్కూ శ్వాసా రెండూ ఉన్నాయి. ఆ వాక్కే క్రీస్తు ఆ శ్వాసే పవిత్రాత్మ ఇవి రెండూ దేవునికి రెండు చేతుల్లాంటివి. ఈ రెండిటిద్వారా అతడు ఆదిమానవుడైన ఆదామని చేసాడు. అతన్ని తనకు పోలికగాగూడ చేసాడు. ఈ రెండిటిద్వారానే అతడు మళ్ళా శ్రీసభనుగూడ చేసాడు.
21. సంస్కారాల్లో పనిచేసే ఆత్మ
1. ఆత్మ క్రియాశక్తివల్లనే శ్రీసభ ఏర్పడింది, ఈ శ్రీసభలోని ఏడు సంస్కారాలూ ఆత్మవరప్రసాద బలం వల్లనే ఫలసిద్ధిని పొందుతాయి. ఇక్కడ ఈ యేడింటినీ క్రమంగా పరిశీలిద్దాం.
పూర్వవేదం ఆత్మకు నీటిని సంకేతంగా వాడింది. ఈ సంకేతానికి తగినట్లుగానే నూత్నవేదంలో ఆత్మ క్రీస్తు ప్రక్కలోనుండి నీరులాగా ప్రవహించింది - యోహా 19,34. ఈ నీరు ఆత్మ జ్ఞానస్నానం, వరప్రసాదం మొదలైన వాటికన్నిటికి చిహ్నంగా వుంటుంది. మనం నీటివలన ఆత్మ వలనా ఆధ్యాత్మికంగా జన్మిస్తాం - 3,5. క్రీస్తు మరణోత్తానాల్లోకి జ్ఞానస్నానం పొందుతాం - రోమా 6,3-5. క్రీస్తు మరణంలోకి జ్ఞానస్నానం పొంది అతనితోపాటు పాపానికి చనిపోతాం. క్రీస్తు ఉత్థానంలోకి జ్ఞానస్నానం పొంది అతనితోపాటు పవిత్ర జీవితానికి లేస్తాం. ఈ జ్ఞానస్నానం ద్వారా ఆత్మ మనలను క్రీస్తు శరీరమైన శ్రీసభలోనికి చేరుస్తుంది. మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం - 1కొ 12,13.
2. జ్ఞానస్నానంలాగే భద్రమైన అభ్యంగనం గూడ ఆత్మనూ వరప్రసాదాన్నీ దయచేస్తుంది. కాని రెండింటికి తేడా వుంది. జ్ఞానస్నానం చిన్నపిల్లలకు. అది మనలను క్రీస్తుతో ఐక్యం చేస్తుంది. భద్రమైన అభ్యంగనం పెద్దవాళ్ళకు. అది మనలను శ్రీసభతో ఐక్యం జేస్తుంది. ఈ సంస్కారంద్వారా మనం శ్రీసభకు, అనగా తోడివారికి సేవలు చేస్తాం. క్రీస్తుకి సాక్ష్యంగా వుంటాం. అతన్ని ఇతరులకు బోధిస్తాం. ఇతరుల హృదయాల్లోకూడ విశ్వాసరూపంలో క్రీస్తు జన్మించేలా చేస్తాం - గల 4,19. లోకంలో మన విశ్వాసాన్నిధైర్యంగా ప్రకటిస్తాం, ఈ కార్యాలన్నీ ఆత్మద్వారా జరుగుతాయి. సమరయ ప్రజలు స్వీకరించింది ఈ భద్రమైన అభ్యంగనాన్నే - అచ 8,14-17.
3. నడిపూజలో పీఠంమీది అప్పరసాలను క్రీస్తు శరీరరకాలుగా మార్చేది పవిత్రాత్మే. కనుకనే పూజలో “మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బతిమాలు కొనుచున్నాము" అని దేవునికి ప్రార్థన చేస్తాం, ఆత్మ క్రీస్తు మరణోత్థానాలను అప్పరసాల్లోనికి ప్రవేశపెట్టి వాటిని దివ్య వస్తువులనుగా మారుస్తుంది. పూర్వవేదంలో దేవుని వాక్కూ శ్వాసా రెండూ వున్నాయి. ఈ వాక్కు క్రీస్తు, ఈ శ్వాస ఆత్మ ప్రతి సంస్కారంలోను క్రీస్తు, ఆత్మ ఇద్దరు కలసే పనిచేస్తారు. క్రీస్తు రొట్టె నుద్దేశించే "ఇది నా శరీరం" అని చెప్పాడు. కాని ఆ రొట్టెను ప్రస్తుతః క్రీస్తు శరీరంగా మార్చేది మాత్రం ఆత్మే క్రీస్తు శరీరంనుండి నీరూ నెత్తురూ స్రవించినప్పడు దివ్యసత్రసాదం పుట్టింది - యోహా 19,34. అది ఆత్మవల్లనే తయారైంది. కనుక ఆత్మసాన్నిధ్యంతో నిండివుంటుంది. ఈనాడు జీవంకొరకు మనం ఈ రొట్టెనూ ఈ పానీయాన్నీస్వీకరిస్తాం - యోహా 6,53-54. శ్రీసభలో దీనికంటె శక్తిమంతమైన సంస్కారం మరొకటి లేదు.
4. కేవలం కొన్ని ఆజ్ఞలనూ పుణ్యాలనూ పాటించినంత మాత్రాన్నే నరుడు పవిత్రుడు కాడు. క్రీస్తుని విశ్వసించి పవిత్రాత్మను పొందడం ద్వారా అతడు పవిత్రుడౌతాడు. పవిత్రాత్మ లేనివాడెల్ల పాపాత్ముడే నరులందరు పాపంచేసి దేవుని మహిమను (ఆత్మను) కోల్పోయారు - రోమా 3,23. నరుడు తన పాపాలకు పశ్చాత్తాపపడితే దేవుడు అతనికి తన ఆత్మను అనుగ్రహించి అతని పాపాలు మన్నిస్తాడు. అసలు ఆత్మేమనకు పాపపరిహార మౌతుంది. ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి శ్వాసను (ఆత్మను) వూది వారికి పాపాలను మన్నించే శక్తిని దయచేసాడు - యోహా 20,22-23. కనుక ఆత్మద్వారానే పాపపరిహారం జరుగుతుంది. నేడు తిరుసభ ఈ పాపపరిహారాన్ని ప్రకటిస్తుంది — లూకా 24,47. నరులు క్రీస్తుని అంగీకరించి దేవునితో సఖ్యపడాలి అని నలుమూలలా బోధిస్తుంది - 2కొ 5,19. ఈ పనంతా ఆత్మద్వారానే జరుగుతుంది.
5. గురుపట్టం పొందినవారిని ప్రాచీన శ్రీసభ "పెద్దలు" అని పిల్చింది. పవిత్రాత్మద్వారా తిరుసభలోని మంద ఈ పెద్దలకు అప్పగింపబడింది - అచ. 20,28. తిమోతి పౌలు హస్తనిక్షేపణం వల్లనే దేవుని వరమైన ఆత్మను పొందాడు -2తిమో 1,6. అనగా అతనికి ఆత్మద్వారానే గురుపట్టం సిద్ధించింది. క్రీస్తులాగే అతని శిష్యులుకూడ దేవునికి నివేదితులు - యోహా 17,19. ఈలా నివేదితులైన తర్వాత వాళ్ళ ప్రజలను పవిత్రులను చేస్తారు. గురువు కూడ పవిత్రాత్మద్వారా ప్రజలను దేవునికి నివేదిస్తాడు - రోమా 15-16. కనుక ఆత్మద్వారానే గురుపట్ట సంస్కారం ఫలప్రదమౌతుంది.
6. అన్ని సంస్కారాల్లా కాకుండ, జ్ఞానవివాహ సంస్కారాన్ని వధూవరులే ఒకరికొకరు ఇచ్చుకొంటారు. మన వివాహం క్రీస్తు శ్రీసభతో ఐక్యంకావడానికి గుర్తుగా వుంటుంది - ఎఫె 5,32. వివాహం వధూవరుల మధ్య ఓ నిబంధనం లాంటిది. వివాహసంస్కారం ద్వారా భార్యాభర్తలను ఐక్యంజేసేది పవిత్రాత్మే వధూవరులు పరస్పర ప్రేమతో ఒకరితో నొకరు ఐక్యంగావడం ఈ సంస్కారం యొక్క ప్రయోజనం - ఎఫె 5,31. ఈ యైక్యతవల్లనే వాళ్ళ నూత్నకుటుంబాన్ని నెలకొల్పుతారు. ఈ యైక్యతను ప్రసాదించేది పవిత్రా.7. కడపటిది అవస్థాభ్యంగం. ఆత్మ స్వయంగా అభ్యంగనమే. క్రీస్తు ఆత్మచే అభిషిక్తుడయ్యాడు - అచ 10,38. అతనిలోనికి ఐక్యమయ్యేవాళ్ళనుగూడ ఆత్మ అభిషేకిస్తుంది. అవస్థాభ్యంగన అభిషేకంద్వారా వ్యాధిగ్రస్తులకూ ఆరోగ్యమూ, ఊరటా, పాపపరిహారమూ లభిస్తాయి. ఆత్మ అభ్యంగనాన్ని పొందిన రోగి వసించి అతనికి ఉపశాంతిని దయచేస్తుంది. ఆ రోగి పాపాలను మన్నించి అతన్ని పవిత్రుని చేస్తుంది. మందు మన దేహం మీద పనిచేస్తుంది. కాని అవస్థాభ్యంగనం ప్రత్యక్షంగా మన ఆత్మమీద పనిచేస్తుంది. పరోక్షంగా మాత్రమే అది మన దేహంమీద పనిచేస్తుంది. వ్యాధిగ్రస్తునికి పెద్దలచే తైలాన్ని పూయించాలి అనే యాకోబు వాక్యం ఈ సంస్కారాన్నే పేర్కొంటుంది - యాకో 5,14-15. ఈరీతిగా ఏడు సంస్కారాల్లోను ఆత్మ పనిచేస్తుంది.
ప్రార్ధనా భావాలు
1. గురుపట్ట సంస్కారాన్నిచ్చేది పవిత్రాత్మే పీఠాధిపతి అభ్యర్థిపై చేతులుచాచి ఈలా ప్రార్ధిస్తారు. "సర్వశక్తిగల పితా! ఈ సేవకునికి గురుత్వపు ఘనతను ప్రసాదించండి. ఇతని హృదయంలో పవిత్రాత్మ శక్తిని నూతీకరించండి. దీనివలన ఇతడు మీనుండి ఆచార్యత్వంలో రెండవ అంతస్తును పొందునుగాక. నిగ్రహజీవితాన్ని అలవర్చుకొని తన సత్ర్పవర్తనం వలన అందరికీ ఆదర్శంగా వుండునుగాక." ఈ హస్తనిక్షేపణం ద్వారాను, ఈ ప్రార్ధనం ద్వారాను సామాన్య మానవుడు ఆత్మనుపొంది గురువుగా మారిపోతాడు.
2. పరలోక జపం "మీ రాజ్యం వచ్చునుగాక" అనే వాక్యం వస్తుంది. కాని ఈ వాక్యానికి బదులుగా ప్రాచీన పితృపాదులు చాలమంది “నీ పవిత్రాత్మ మాపై దిగివచ్చి మమ్ము శుద్ధిచేయునుగాక" అనే వాక్యాన్ని గ్రహించారు. అనగా ఆత్మ మనలను పవిత్రపరచి మనకు మోక్షభాగ్యాన్ని దయచేస్తుందని భావం.
22. నైతిక జీవితం గడిపేలా చేసే ఆత్మ
1. భక్తులు నైతిక జీవితం గడిపేలా చేసేది ఆత్మే పూర్వవేదకాలానికి ధర్మశాస్త్రమున్నట్లే నూత్న వేదకాలానికి క్రీస్తు కట్టడలున్నాయి. కాని ఈ కట్టడలన్నిటికీ కర్త ఆత్మడే అందుచే అతడే నూత్న వేదకాలానికి ప్రధాన నియమం అని చెప్పాలి. మనం ఆత్మవలన జీవించేవాళ్ళం గనుక ఆత్మకు వశవర్తులమై నడచుకోవాలి - గల 5,25.
పూర్వవేదకాలంలో ధర్మశాస్త్రం రాతిపలకలపై రాయబడింది. అది నరుల అంతరంగంలోగాక వారి హృదయాలకు వెలుపల వుంది. దాన్ని పాటించే శక్తిగూడ పూర్వవేద నరులకు లేదు. కనుకనే యూదులు తరచుగా ధర్మశాస్తాన్ని మీరుతూ వచ్చారు. కాని నూత్నవేదపు ధర్మశాస్త్రం మన హృదయాల్లోనే లిఖింపబడింది. దాన్ని పాటించే శక్తిగూడ మనకుంది. కనుకనే యిర్మీయా ప్రవచనం ఈలా చెప్తుంది. "ఆ దినం వచ్చినపుడు నేను యిస్రాయేలు ప్రజలతో చేసికొనే నిబంధనం ఇది. నేను నా ధర్మశాస్తాన్ని వారి అంతరంగంలో వుంచుతాను. వారి హృదయాలపై లిఖిస్తాను" - 31,33. పై ప్రవక్త చెప్పినట్లుగా ధర్మశాస్తాన్ని ఈలా మన అంతరంగంలో వుంచేది పవిత్రాత్మే "ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలచివుంది" -1యోహా 2,27. ఈ వాక్యం ప్రకారం మనలను ఆంతరంగికంగా అభిషేకించేవాడు పవిత్రాత్ముడే దైవవాక్కు ద్వారా పవిత్రాత్ముడు మన హృదయాల్లో క్రీస్తుపట్ల విశ్వాసాన్ని పట్టిస్తాడు. ఈ విశ్వాసమే ఇక్కడ అభిషేకం అని చెప్పబడింది. పవిత్రాత్మ మన హృదయాల్లో క్రీస్తుపట్ల విశ్వాసం పట్టిస్తూ మనం ఆ క్రీస్తు కట్టడల ప్రకారం జీవించేలా చేస్తుంది.
ఆత్మ తన శక్తితో మన చిత్తశక్తికి బలాన్ని దయచేస్తుంది. ఈ బలంతోనే మన చిత్తశక్తి ఆయా నైతికక్రియలను నిర్వహిస్తుంది. చెట్ట పండ్లుకాస్తుంది, తల్లి బిడ్డను కంటుంది. అలాగే మన చిత్తశక్తికూడ ఆయా నైతిక క్రియలను నిర్వహిస్తుంది. ఆ క్రియలను పండ్లలా కాస్తుంది. ఈ శక్తి దానికి ఆత్మనుండే లభిస్తుంది. ఆత్మ మన హృదయంలో ప్రేమ, ఆనందం, శాంతి మొదలైన తొమ్మిది పండ్లు ఫలించేలా చేస్తుందని పౌలు నుడివాడు - గల 5,22. ఫలితాంశమేమిటంటే, నూత్నవేదకాలంలోనైతికజీవితం గడపాలనే అభిలాష మన హృదయంలోనుండే వస్తుంది. ఆత్మే ఆ యభిలాషను మన అంతరంగంలో మొలకెత్తిస్తుంది. కనుకనే నైతికంగా జీవించడం మనకు అంత కష్టమనిపించదు. ఈ భావాలన్నిటినీ సంగ్రహంగా తెలియజేసూ పౌలు "దేవుని ఆత్మ నడిపించేవాళ్ళ దేవుని పత్రులు" అని వాకొన్నాడు - రోమా 8,14.
2.1 యోహాను 3,9 దైవప్రకృతి (దైవబీజం) మనలోనే వుంది కనుక మనం పాపకార్యాలు చేస్తూ పోమని చెప్తుంది. 1 యోహాను 2,20 మరియు 27 వచనాల్లో అభిషేకాన్ని గూర్చి చెప్పాడు, ఈ దైవప్రకృతీ ఈ యభిషేకమూ రెండూ మన హృదయంలోని దైవవాక్కునే సూచిస్తాయి, ఆత్మ మన హృదయంలోని ఈ వాక్కుపై పనిచేసి మన మనస్సులో క్రీస్తుపట్ల విశ్వాసం పుట్టిస్తుంది. మనం అతని కట్టడల ప్రకారం జీవించేలా చేస్తుంది. క్రీస్తు భక్తులమయ్యేలా చేస్తుంది. క్రీస్తు మనకు తండ్రిని తెలియజేస్తాడు. కాని ఆత్మ మనకు క్రీస్తుని తెలియజేస్తుంది. క్రీస్తు తండ్రికి ప్రియకుమారుడు. ఆత్మ మనంకూడ క్రీస్తుద్వారా తండ్రికి ప్రీతిపాత్రులమైన బిడ్డలమయ్యేలా చేస్తుంది. ఆత్మ మనలను క్రీస్తు చెంతకు తీసికొనిపోగా, క్రీస్తు మనలను తండ్రి చెంతకు చేరుస్తాడు. కనుక మన క్రైస్తవ విశాస్వమూ భక్తి సత్ర్కియలూ నైతిక జీవితమూ పాపం నుండి వైదొలగడమూ అన్నీ ఆత్మద్వారానే జరుగుతాయి. మన నైతిక జీవితానికి కర్త ఆత్మే.
ప్రార్ధనా భావాలు
1. ఆత్మ అభ్యంగన తైలంలాగ మెల్లగా మనలోనికి ప్రవేశిస్తుంది. మన పాపాలనూ స్వార్థబుద్ధినీ మనం గ్రహించేలా చేస్తుంది, మనం వాటి కొరకు పశ్చాత్తాపపడేలా చేస్తుంది. అటుపిమ్మట మన పాపాలను మన్నిస్తుంది. కనుక క్రీస్తుతోపాటు ఆత్మకూడ మనకు పాపపరిహారాన్ని దయచేస్తుంది. 2. డీట్రిక్ బోన్ హోపర్అనే భక్తుడు ఈలా నుడివాడు. నీవు స్వేచ్ఛను పొందాలంటే మొదట నీ యింద్రియాలనూ నీ కోరికలనూ అదుపులో పెట్టుకో. నీ దేహమూ మనస్సూగూడ నిర్మలంగా వుండాలి. అవి నీకు లొంగివుండాలి, ఆత్మ నిగ్రహం లేనివాళ్ళకు ఆత్మవరమైన స్వేచ్ఛ లభించదు.
23. శారీరక వాంఛలను జయించేలా చేసే ఆత్మ
1. మన శరీరం నిత్యం పాపక్రియలవైపు మొగ్గుతూంటుంది. కాని ఆత్మ తన వరప్రసాదబలంతో మనం ఈ శరీర వాంఛలను జయించేలా చేస్తుంది. పౌలు ఈలా చెప్పాడు. "మీరు ఆత్మయందు జీవించండి. శరీర వాంఛలను తృప్తిపరచకండి. శరీరం ਕੰ ఆత్మ కోరేదానికి విరుద్ధంగా వుంటుంది. అలాగే ఆత్మ కోరేది శరీరం కోరేదానికి విరుద్ధంగా వుంటుంది. ఈ రెండిటికీ బద్ధవైరం" - గల 5,16–17. మన ఆత్మ మంచిని కోరితే మన శరీరం చెడ్డను కోరుతుంది. ఇంకా, ఎవడు చల్లిన విత్తనాలకు తగిన పంటను వాడు కోసికొంటాడు. శరీర వాంఛలకు అనుకూలమైన విత్తనాలు చల్లేవాడికి మరణమనే పంట పండుతుంది. ఆత్మకు అనుకూలమైన విత్తనాలు చల్లేవాడు నిత్యజీవమనే పంట కోసికొంటాడు - గల 6, 7-8 పవిత్రాత్మ మన శరీరవాంఛలను మట్టపెడుతుంది. ఈ యంశాన్ని పురస్కరించుకొని పౌలు ఈలా చెప్పాడు, శరీరవాంఛల ప్రకారం జీవించే వాళ్ళు శరీరం కోరుకొనే పాపకార్యాలకే తమ మనస్సును అర్పిస్తారు. ఆత్మాభిలాషల ప్రకారం జీవించేవాళ్ళు ఆత్మ కోరుకొనే పవిత్రకార్యాలకే తమ మనస్సును అర్పిస్తారు. శారీరక వాంఛలు మరణానికీ, ఆత్మవాంఛలు జీవానికీ దారితీస్తాయి - రోమా 8,6-7.
పౌలూ పేర్కొన్నఈ సూత్రాలను రోజువారి జీవితంలో మనంకూడ అనుభవానికి తెచ్చుకొంటూనే వుంటాం. ఓవైపు మనం పాపంద్వారా పిశాచ పుత్రులం, మరోవైపు జ్ఞానస్నాన విశ్వాసాలద్వారా, వాక్కుద్వారా దేవుని పుత్రులం. కనుక పాపస్వభావమూ దైవస్వభావమూ రెండూ మనలో వుంటాయి. మనలోని ఈ రెండు స్వభావాలూ నిరంతరం ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూనే వుంటాయి. ఈ రెండు ప్రకృతులను బైబులు వెలుగు, చీకటి అనికూడ పిలుస్తుంది. ఈ రెండిటి మధ్య జరిగే పోరాటాన్ని ఆధ్యాత్మిక మానవులు గుర్తిస్తూనే వుంటారు, ఈ పోరాటంలో ఆత్మ మన పక్షాన్ని అవలంభించి మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తాన క్రీస్తూ ఆత్మా యిద్దరూ శోధనల్లో మనకు విజయాన్ని చేకూర్చి పెడతారు. 2. కొందరు ఆత్మ ప్రబోధాన్ని పెడచెవిని బెడతారు. శరీర వాంఛలకు లొంగిపోయి పాపంలో బడతారు. అప్పడు కూడ ఆత్మ వాళ్ళను వదిలిపెట్టదు. వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాప భావాలు పుట్టిస్తుంది. వాళ్ళకు పరివర్తనం కలిగిస్తుంది. పూర్వం జక్కయ అన్యాయంగా సొమ్ముజేసి కొంటూండగా ప్రభువు అతన్ని మందలించి అతనికి పరివర్తనం కలిగించాడు - లూకా 19,1-10. ఈ రీతిగానే ఆత్మ మనలనుగూడ మందలిస్తుంది. అతడు ఓ దేవళంలోకిలాగ మన యెడదల్లోకి వేంచేస్తాడు. మన హృదయ దేవాలయాన్ని శుద్ధిచేస్తాడు. ఆత్మ శిష్యుల మీదికి వేంచేసింది పాపపరిహారాన్ని దయచేయడానికే. కనుకనే ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి ఆత్మనువూది మీరు ప్రజల పాపాలు మన్నించండి అని చెప్పాడు - యోహా 20,22-23.
3. ఆత్మ మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. ఆత్మ వున్నచోట స్వాతంత్ర్యముంటుంది -2కొ 3,17. ఈ స్వేచ్ఛ ప్రధానంగా పాపంనుండే - రోమా 8,2. పాపం చేసేవాళ్ళు పిశాచానికి బానిసలౌతారు. ఆత్మ మనలను దేవునికి దత్తపుత్రులనుగా జేసి ఈ స్వేచ్చను ప్రసాదిస్తుంది. మనకు స్వేచ్చనిచ్చేవాడు తండ్రే. అది మనకు క్రీస్తుద్వారా ఆత్మ సహాయం వలన లభిస్తుంది. కుమారుడు మిమ్ముస్వతంత్రులను జేస్తే మీరు నిజంగా స్వతంత్రులౌతారు అన్నాడు ప్రభువు - యోహా 8,36.
ఐతే స్వేచ్ఛ అంటే నియమాలు మీరి విచ్చలవిడిగా సంచరించడం గాదు. అది అరాజకం అనిపించుకొంటుంది, నిజమైన స్వేచ్చ ఇతరులకు సేవలు చేయడానికి పూనుకొంటుంది. “ఈ స్వేచ్ఛవలన మీరు లౌకిక వ్యామోహాలకు లొంగిపోగూడదు. దీనిద్వారా ఒకరికొకరు సేవలు చేయండి" - గల 5, 13. క్రీస్తు సర్వతంత్ర స్వతంత్రుడు, కాని అతడు శిష్యుల కాళ్ళూ కడిగి వారికి సేవలు చేసాడు. పౌలు కూడా స్వతంత్రుడే కాని అతడు అందరికీ దాసుడై సేవలు చేసాడు. ఈ మహానుభావులు మనకు ఆదర్శం కావాలి. అగస్టీను చెప్పినట్లు, భక్తి భయంతో ప్రారంభమౌతుంది. ఇది పూర్వవేద పద్ధతి. కాని భక్తి ప్రేమతో గూడిన సేవాకార్యాలతో ముగుస్తుంది, ఇది నూత్నవేద పద్ధతి.
4. ఇంకా, దైవభక్తుల్లో ఓ రకమైన ధైర్యం కన్పిస్తుంది. ఈ ధైర్యం ఆత్మవరమైన స్వేచ్ఛనుండే జనిస్తుంది. మాకు ఇంత నమ్మకం వుంది కనుకనే మేము ఇంత ధైర్యంతో వున్నాం అన్నాడు పౌలు-2కొ 3,12. శిష్యులు పవిత్రాత్మతో నిండినవారై ధైర్యంతో క్రీస్తు సందేశాన్ని విన్పించారు - అచ 4,31. ప్రాచీన వేదసాక్షులు తమ్ము హింసించేవారిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. నేడుకూడ కొంతమది భక్తుల్లో ఈ ధైర్యం కొట్టవచ్చినట్లుగా కన్పిస్తుంది. ఇది ఆత్మయిచ్చే వరమే. ప్రార్ధనా భావాలు
1.నోవేష్యస్ అనే భక్తుడు ఈలా వ్రాసాడు. ఆత్మకోరేది శరీరం కోరేదానికి విరుద్ధంగా వుంటుంది. మనలోని దుష్టవాంఛలనూ కామాన్నీ ఉద్రేకాన్నీ మోహాగ్నిని అణచివేసేది ఆత్మమే. త్రాగుబోతుతనాన్నీ దురాశనీ అల్లరితో గూడిన ఆటపాటలనూ అణగదొక్కేదికూడ ఆత్మమే. ఇంకా, సోదరప్రేమను దయచేసేదీ, ప్రేమ భావాలను రేకెత్తించేదీ, ముఠా తత్వాలను రూపుమాపేదీ, సత్యాన్ని బోధించేదీ, పతితులను ఖండించేదీ, భక్తిరహితులను బహిష్కరించేదీ, సువిశేషాలను సంరక్షించేదీ ఆత్మమే. అపోస్తలులను క్రీస్తుకి సాక్షులనుగా చేసిందీ, వేదసాక్షులకు మొక్కవోని ధైర్యాన్నిచ్చిందీ, కన్యల కన్యాత్వాన్ని కాపాడిందీ, క్రీస్తు బోధలను పదిలపరచేదీ, శ్రీసభ విశ్వాసాన్ని కాపాడేదీ, తప్ప చేసినవారిని సవరించేదీ ఆత్మమే.
2.ఓ ప్రాచీన భక్తుడు ఈలా వ్రాసాడు, ఆత్మడు కేవలం ఆత్మస్వరూపుడైకూడ మన దేహాన్ని బలపరుస్తాడు. అతడు వేదసాక్షుల్లోనికి ప్రవేశించి వారి శరీరాలను బలపరచాడు. కనుకనే వాళ్ళ నానాహింసలు భరించగలిగారు. ఆత్మసాన్నిధ్యం వల్లనే వారి దేహాలు దౌర్బల్యాన్ని విడనాడి బలాన్ని పొందాయి. వాళ్ళ నరమాత్రులై కూడ ఆత్మసాన్నిధ్యం వల్ల దేవళ్ళా ప్రవర్తించగలిగారు. ఇంకా, ఆత్మడు కన్యల్లోకి ప్రవేశించి వారికి బ్రహ్మచర్యవరాన్ని ప్రసాదించాడు. ఆ యాత్మసాన్నిధ్యంవల్లనే వాళ్ళు కామ ప్రలోభాలను జయించి దృఢగాత్రులయ్యారు.
3.క్రైస్తవునిలో స్వేచ్చ, సేవ అనే రెండు గుణాలు వుంటాయని చెపూ లూతరు ఈలా వ్రాసాడు. "క్రైస్తవుడు స్వేచ్చాపరుడు. అతడు ఎవ్వరికీ దాసుడు కాడు. కాని క్రైస్తవుడు సేవకుడు, విధేయాత్మడు. అతడు అందరికీ లొంగి వుంటాడు".
24. పాపపరిహారాన్ని దయచేసే ఆత్మ
1. క్రీస్తు భక్తులమైన మనం పాపం చేయకూడదు. ఐనా బలహీనతవల్ల చాలసార్లు పాపంలో పడిపోతూంటాం. అప్పడు ఆత్మ మనలను వదిలివేయదు. పడిపోయిన మనలను మెల్లగా లేపుతుంది. హృదయంలో పశ్చాత్తాపం పట్టించి మనం మన పాపాలకు దుఃఖపడేలా చేస్తుంది. పరివర్తనం పుట్టించి మనం మళ్ళా ప్రయాణాన్ని కొనసాగించేలా చేస్తుంది.
నరుడు దేవునికి పోలికగా కలిగింపబడినవాడు. దేవుణ్ణి చేరవలసినవాడు. నిరంతరం దేవునిపై ఆధారపడి జీవించవలసినవాడు. కాని అతడు తన స్వేచ్ఛను దుర్వినియోగం జేసికొని దేవుణ్ణి నిరాకరిస్తాడు. తనకు తానే దేవుడై పోతాడు. పాపంజేసి దేవునికి దూరమైపోతాడు. అపుడు ఆత్మ వరప్రసాదం అతనిపై సోకి అతడు మళ్ళా పశ్చాత్తాపపడేలా చేస్తుంది. తప్పిపోయిన కుమారుళ్ళా మళ్లా తండ్రి యింటికి తిరిగివచ్చేలా చేస్తుంది. అతడు ఈలా తిరిగివచ్చేలా చేసేది ఆత్మడే.
పెంతెకోస్తు దినాన ప్రజలు పేత్రు ఉపన్యాసం విని తీవ్రంగా మనసు నొచ్చుకొని సోదరులారా! మేము ఏంచేయాలి అని అడిగారు. పేత్రు మీరు పరివర్తనం చెంది యేసుక్రీస్తు నామాన జ్ఞానస్నానం పొందండి. అప్పుడు మీ పాపాలు పరిహారమౌతాయి. మీరు ఆత్మను పొందుతారు అని చెప్పాడు - అచ 2,37-38. ఇక్కడ ఆత్మే ఆ ప్రజల మనసులో బాధను పుట్టించి వాళ్ళకు పరివర్తనం కలిగించింది, వాళ్ళ ఆత్మలకు "మేలైన అతిథి" గా వాళ్ళ హృదయాల్లోకి దిగివచ్చింది. నేడు మనకు పరివర్తనం కలిగించి మన పాపాలను మన్నించేదికూడ ఆ యాత్మడే. అసలు ఆ పవిత్రమూర్తే మన పాపపరిహారం.
2. ఉత్తాన క్రీస్తు శిష్యులమీదికి శ్వాసనువూది "మీరు పవిత్రాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలనైనా క్షమిస్తే అవి క్షమింపబడతాయి" అన్నాడు — యోహాను 20,23– 23. ఈ శిష్యులు పవిత్రాత్మశక్తితోనే పాపాలు మన్నించారు. ఈలా మన్నించే అధికారాన్ని తమ అనుయాయులకుకూడ యిచ్చిపోయారు. ఆదిమ తిరుసభ దైవప్రేరణచే పాపాల మన్నింపుకొరకు ఓ దేవద్రవ్యానుమానాన్నికూడ నెలకొల్పింది, అదే నేటి మన పాపసంకీర్తనం. ఆత్మకీ పాపపరిహారానికీ దగ్గరి సంబంధం వుంది. పవిత్రాత్మ మనకు పశ్చాత్తాపం పుట్టించి మన పాపాలను కడిగివేస్తుంది. తాను పవిత్రమూర్తిగాన మన అపవిత్రతను పూర్తిగా తొలగిస్తుంది. వెలుతురు చీకటిని పారద్రోలినట్లుగా మన కల్మషాన్ని నిర్మూలిస్తుంది.
పాపసంకీర్తనాన్ని కేవలం మన్నింపును పొందేతంతునుగా మాత్రమే భావించకూడదు. అది ప్రధానంగా నరునికి పరివర్తనం కలిగించే సంస్కారం. పరివర్తనమంటే మన హృదయాన్ని మార్చుకోవడం, ఈ మార్పుని ఆత్మమాత్రమే దయచేయగలదు. ఆత్మ పాపసంకీర్తనంలో గురువునీ పాపినీగూడ సోకి ఈ మార్పుని దయచేస్తుంది. ప్రవక్త యెహెజ్కేలు నుడివినట్లుగా, నరులకు నూత్న హృదయాలను దయచేసేవాడు ఆత్మడు - 36,26. పాపపరిహారం పొందిన నరుడు మళ్ళా దేవుణ్ణి ప్రేమించి అతని చిత్తప్రకారం జీవించడం మొదలుపెడతాడు.
అంబ్రోసు భక్తుడు ఈలా వ్రాసాడు, “మీరు ఎవరి పాపాలనైనా క్షమిస్తే అవి క్షమింపబడతాయని వేదశాస్త్రం చెప్తుంది. కాని నరులు తమ సొంత శక్తితోనే తోడి నరుల పాపాలను మన్నించలేరు. పితపుత్ర పవిత్రాత్మల నామాల మీదిగా వాళ్ళ పాపపరిహారాన్ని దయచేస్తారు." ఈలాంటి వాక్యాలనుబట్టి ప్రాచీనకాలంనుండి తిరుసభలో పాపపరిహార ప్రక్రియా వుంది, ఆత్మద్వారా ఆ ప్రక్రియ జరుగుతుందనే నమ్మకమూ విశ్వాసుల్లో వుంది అనుకోవాలి.
3. యెరూషలేం సిరిల్ భక్తుని భావాల ప్రకారం, ఆత్మ మన పాపాలను మన్నించడం మాత్రమేకాదు. మన జీవితకాలమంతా సహాయంచేస్తు మనలను కాపాడుతూంటుంది. "నీవు దేవుని నమ్మితే ఆత్మ నీ పాపాలను మన్నిస్తుంది. అంతమాత్రమేకాదు, నీ శక్తికి మించిన కార్యాలను నీచే చేయిస్తుంది. నీ హృదయంలోని భక్తిని బట్టి నీవు ఆత్మ వరప్రసాదాన్ని పొందుతావు. నీ జీవితకాలమంతా ఆయాదరణ కర్త నీతో వుండిపోతాడు. ఆ దివ్యవ్యక్తి నిన్ను తన సైనికుణ్ణిలాగ ఆదుకొంటాడు. నీ కార్యాలన్నిటిలోను, విశేషంగా నీవు శత్రువులతో పోరాడేపుడు అతడు నిన్ను కాచి కాపాడతాడు. నీవు పాపంద్వారా ఆ యాత్మను దుఃఖపెట్టకుండా వుంటే చాలు, అతడు నీకు అన్ని వరప్రసాదాలు దయచేస్తాడు, ఆత్మను దుఃఖపెట్టవద్దు అనే వేదవాక్యం వుంది కదా! - ఎఫె 4,30."
కనుక మనం బలహీనతవల్ల పాపంలో పడిపోయినపుడెల్ల ఆత్మ సహాయాన్ని అడుగుకొని పశ్చాత్తాపపడాలి. అవసరమైనపుడు పాపసంకీర్తనంగూడ చేసికొని పాప పరిహారం పొందాలి. ఎప్పటికప్పుడు ఆత్మద్వారా శుద్ధిని పొందే వాడే నిజమైన క్రైస్తవుడు.
ప్రార్థనా భావాలు
1. కీర్తన 33,6 ఈలా చెప్పంది :
ప్రభువు తన వాక్కుతో ఆకాశాన్ని సృజించాడు
తన నోటి వూపిరితో సూర్యచంద్రులను చేసాడు.
ఇక్కడ దేవుని వాక్కంటే కుమారుడు. అతని నోటి వూపిరి అంటే పవిత్రాత్ముడు. ఈ యిద్దరిద్వారా దేవుడు లోకాన్ని సృజించాడని భావం. ఇరెనేయస్ వేదశాస్త్రి ఈ యిద్దరూ తండ్రికి రెండు చేతుల్లాంటివాళ్ళనీ ఈ యిద్దరి ద్వారానే అతడు సృష్టి చేసాడనీ వాకొన్నాడు.
2. నూత్న వేదాంతి అనబడే సిమియోను భక్తుడు ఈలా చెప్పాడు. "దేవుణ్ణి తెలిసికొనే ముఖ్యసాధనం పవిత్రాత్మ వరప్రసాదమే. ఈ వరప్రసాదం మన హృదయాలను శుద్ధిచేసి వాటికి వెలుగుని ప్రసాదిస్తుంది. ఈ వెలుగువల్ల మనం దేవుణ్ణి గ్రహించి విశ్వసిస్తాం. దీనివల్ల నూత్నజన్మను పొంది దేవునికి బిడ్డలమౌతాం. ఆత్మడు మనకు దైవజ్ఞానాన్ని దయచేసేవాడు కనుక అతనికి "తాళపుచెవి" అని పేరు వచ్చింది." {{చెంతెర్|
25. ప్రార్థన చేయించే ఆత్మ
}]1. తొలినాటి క్రైస్తవులు బృందంగాగూడి భక్తితో ప్రార్థన చేసేవాళ్ళు ー1కొరి 11,18. ఆత్మే మనచే ప్రార్థన చేయిస్తుందని పౌలు స్పస్ట్ంగా చెప్పాడు. మనం ఆధ్యాత్మికంగా బలహీనులం. ఎప్పడు, దేనికొరకు, ఏలా ప్రార్ధించాలో మనకు తెలియదు. మన దౌర్భాగ్యాన్ని తలంచుకొని ఆత్మ బాధపడుతుంది, విలపిస్తుంది. ఆత్మేమన తరపున ప్రార్ధన చేయడం మొదలుపెడతుంది. కాని మనచేగూడ జపం చేయించి మన జపాన్ని తన జపంతో జోడిస్తుంది. తల్లి పసిబిడ్డను వేలిచ్చి నడిపించినట్లే మనలను ప్రార్థనలో నడిపిస్తుంది. ఈలా ఆత్మ మనకొరకు, మనతోగలసి, మనలోనే ప్రార్థన చేస్తుంటే అందరి హృదయాలు తెలిసిన తండ్రి ఆ ప్రార్థనను వెంటనే అర్థంజేసికొంటాడు. ఆత్మ మన రక్షణాన్ని పురస్కరించుకొనే ప్రార్థన చేస్తుంది. కనుక తండ్రి ఆ ప్రార్థనను తప్పక అంగీకరిస్తాడు - రోమా 8,26-27. జపాన్ని గూర్చి పౌలు చెప్పిన ఈ వాక్యాలు చాల విలువైనవి.
ఇంకా ఆత్మ మనం ఎడతెగక ప్రార్థన చేసేలా చేస్తుంది - 1తెస్స 5,17. దేవునినుండి మనం పొందిన ఉపకారాలకు ఆ తండ్రికి వందనాలు చెప్తూ ప్రార్థన చేసేలా చేస్తుంది - కొలో 3,16. ప్రార్థన ద్వారా మనం చాలా వరాలు పొందవచ్చు, కాని అన్నిటికంటె శ్రేష్టమైన వరంగా ఆ యాత్మనే పొందుతాం - లూకా 11,13.
ప్రార్థనద్వారా ఆత్మ మనలను దేవుని బిడ్డలనుగా జేస్తుంది. పవిత్రాత్ముడు మన హృదయాల్లోవుండి మనచే దేవుణ్ణి అబ్బా అనగా నాన్నా అని పిలిపిస్తాడు. పూర్వవేదంలో ఏ యూద భక్తుడు కూడ ఇంత చనువుతో దేవుణ్ణి నాన్నా అని సంబోధించలేదు. క్రీస్తే మొదటిసారిగా ఈలా జపించాడు - మార్కు 14-36. ఈనాడు మనం ఆత్మశక్తితో క్రీస్తు ప్రార్థనను మన ప్రార్థనగా జేసికొంటాం. ఇది చాల శ్రేష్టమైన జపం.
మనం ఆత్మయందు, అనగా ఆత్మ ప్రేరణంతో జపిస్తాం - ఎఫె 6,18, ఆత్మ ప్రేరేపించందే మనంతట మనం ప్రార్థన చేయలేం. ఇంకా, మన ప్రార్థన చాలసారులు స్పష్టంగా వుండదు, మనుష్యులముందేగాదు, దేవునిమందు కూడ మన భావాలూ కోరికలూ స్పష్టంగా తెలియజేయలేం. అందుచే మన వేడికోలు అవ్యక్తంగా వుండిపోతుంది, ఈలాంటి సందర్భాల్లో ఆత్మ మన జపానికి ఓ రూపమంటూ ఇస్తుంది. దాన్ని స్పష్టంజేసి దేవునిమందు పెడుతుంది.
ఉత్థాన క్రీస్తు మోక్షంలోవుండి తండ్రి సమక్షంలో మనకొరకు జపిస్తాడు - హెబ్రే 7,25. కాని పవిత్రాత్మ మన హృదయంలోనే వుండి మనకొరకు జపిస్తుంది. ఈ యిరువురు దైవవ్యక్తుల ప్రార్థనాబలంవల్లనే మనం కొద్దోగొప్పో భక్తిని అలవరచ్చుకోగల్లుతున్నాం - రోమా 8,15.
2. తరతరాల పొడుగునా పునీతులకు జపం నేర్పింది ఆత్మ భక్తులచే మహా ప్రార్థనలు చేయించింది ఆత్మ పుణ్యాత్ములకు భక్తిపారవశ్యాన్ని కలిగించింది ఆత్మ బైబుల్లోని ప్రశస్త్రజపాలైన కీర్తనలను వ్రాయించింది ఆత్మ.
వేదవాక్యాన్ని చదువుకొని ప్రార్ధన చేసికోడానికి పవిత్రాత్మ విశేషంగా తోడ్పడుతుంది. బైబులు వాక్యాన్ని జపించే విధానంలో మూడు మెట్లున్నాయి. మొదటిది, భక్తిభావంతో పవిత్రగ్రంథంలోని ఓ వాక్యాన్ని చదువుకొంటాం. రెండవది, ఆ వాక్యం భావమేమిటా అని కొంచెం సేపు ఆలోచించి చూస్తాం. ఆత్మే మన హృదయంలో వెలుగును పుట్టించి మనం ఆ వాక్యాం అర్ధాన్ని గ్రహించేలా చేస్తుంది. మూడవమెట్టు, ఆ పాక్యాన్ని పురస్కరించుకొని ప్రార్ధన చేసికొంటాం. ఈ ప్రార్ధన మనవి, కృతజ్ఞత, పశ్చాత్తాపం, ఆరాధన అనే నానారూపాల్లో వుండవచ్చు. ఈ జపాన్ని నడిపించేది ఆత్మే ఈలా మొదటి వాక్యాన్ని పురస్కరించుకొని ప్రార్థించాక దాని తర్వాతి వాక్యానికి వెత్తాం. ఈవిధంగా మనకు అందుబాటులోవున్న కాలాన్నిబట్టి బైబుల్లోని ఓ వాక్యాన్నిగాని పేరానుగాని అధ్యాయాన్నిగాని ముగించుకొంటాం, ఇది సులువైన ప్రార్ధనాపద్ధతి.
ప్రార్ధనా భావాలు
1. కీర్కెగార్డ్ అనే భక్తుడు ఈలా జపించాడు. "ఆత్మమా! పవిత్రాత్ముడవైన నీవు అపవిత్రుడైన నరుళ్ళి, మురికి మానిసిలో వసిస్తావు. జ్ఞానివైన నీవు మూరుడైన నరుల్ల్లో వసిస్తావు. సత్యానివైన నీవు మోసగాడైన నరుట్లో జీవిస్తావు. ఆత్మమా! నీవు నా హృదయాన్ని కూడ నీకు నివాసయోగ్యంగా తయారుచేయి. నా యెడదలోని మాలిన్యాన్నీ మూర్ధత్వాన్నీ మోసాన్నీ తొలగించి దానిలో వసించు." ఈ జపం మనంకూడ జపించదగ్గది.
2. ఓ ప్రాచీన భక్తుడు ఈ వుపమానాలు చెప్పాడు. ఆత్మ మనలను దేవునిలోకి మార్చివేస్తుంది. ద్రాక్షరసంలో పడిన నీటిబొట్టు రసమైపోతుంది. నిప్పలో పెట్టిన ఇనుపముక్క నిప్పయిపోతుంది. సూర్యరశ్మి సోకిన గాలి తానూ వెల్లురైపోతుంది. అలాగే ఆత్మతో ఐక్యమైపోయిన మనం కూడ ఆత్మలోనికి మారిపోతాం.
3. పాపిలో ఆత్మ వసించదు. పవిత్రునిలో వసిస్తుంది. కనుకనే ప్రాచీన క్రైస్తవులు భక్తులను "ఆత్మధరులు" అని పిల్చేవాళ్ళు. 26. దైవపుణ్యాలకు కర్తయైన ఆత్మ
ప్రేమ, విశ్వాసం, నిరీక్షణం అనే మూడు దైవపుణ్యాలూ ఆత్మ దయచేసే వరాలే. ఈ విషయాన్ని విపులంగా పరిశీలిద్దాం.
1. ప్రేమ ఆత్మ దయచేసే వరం. తండ్రి ఆత్మ ద్వారా ప్రేమశక్తిని మన హృదయాల్లో కుమ్మరిస్తాడు - రోమా 5,5, ఈ ప్రేమ దైవప్రేమా సోదరప్రేమా కూడ ఇక్కడ విశేషంగా సోదరప్రేమను పరిశీలిద్దాం. ధర్మశాస్త్రమంతా సోదరప్రేమలో ఇమిడే వుంది. కనుక ఈ ప్రేమను పాటిస్తే ధర్మశాస్తాన్నంతటినీ పాటించనట్లే - గల 5, 14 సోదరప్రేమ విశ్వాస నిరీక్షణలకంటె గొప్పది - 1కొ 13, 13. మొదట మనం తోడి నరులను ప్రేమిస్తే తర్వాత వారికి ఏమి చేసినా చెల్లుతుంది.
యూదులు ధర్మశాస్తాన్నిపాటించలేకపోయారు. అది వారికి పెనుభారంగాను, పెద్దకాడిగాను తోచింది. ధర్మశాస్త్రసారం సోదరప్రేమేనని చెప్పాం. నూత్నవేదంలో క్రీస్తు ప్రధానంగా బోధించింది సోదరప్రేమా దైవప్రేమలనే. ధర్మశాస్త్రమనేకాడి కష్టమైంది. కాని క్రీస్తు ప్రేమాజ్ఞ అనే కాడి సులువైంది. ధర్మశాస్త్రమనే భారం బరువైంది. కాని క్రీస్తు ప్రేమాజ్ఞ అనే బరువు తేలికైంది - మత్త 11,29.
సోదరప్రేమద్వారా మనం తోడి నరులకు సేవలు చేస్తాం, ప్రేమతో ఒకరినొకరు సేవించండి అన్నాడు పౌలు - గల 5,13. మదర్ తెరీసా ఈ సేవకు చక్కని ఉదాహరణం.
యూదులకు పెంతెకోస్తు పండుగ అంటే ధర్మశాస్తాన్ని పొందిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవడం. కాని క్రైస్తవులమైవు మనకు పెంతెకోస్తు పండుగ అంటే ఆత్మదిగివచ్చిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆత్మ మనమీదికి దిగివచ్చి మనకు దయచేసేది ప్రధానంగా ప్రేమవరాన్నే కనుక సోదరప్రేమలో తప్పిపోయే వాళ్ళు ఆ వరాన్ని సమృద్ధిగా దయచేయమని వినయంతో ఆత్మను అడుగుకోవాలి.
2. విశ్వాసంగూడ ఆత్మ దయచేసే వరమే. సైఫను మొదలైన ఏడురు పరిచారకులు ఆత్మతోను విశ్వాసంతోను నిండినవాళ్ళ - అచ 6,5. అనగా ఆత్మే ఆ భక్తులకు విశ్వాసాన్ని ప్రసాదించింది. ఈ యాత్మద్వారా మనం యేసే ప్రభువని అంగీకరిస్తాం - 1కొ 12,3, అనగా యేసే దేవుడని నమ్ముతాం. కనుక ఆత్మవరం లేనివాళ్ళు క్రీస్తు దైవత్వాన్ని విశ్వసింపలేరు.
క్రొత్తగా జ్ఞానస్నానం పొందేవాళ్ళను ఆత్మవిశ్వాసానికి విధేయులనుగా చేస్తుంది - రోమా 1,5. అనగా ఆత్మ భక్తులు క్రీస్తుని విశ్వసించి అతనికి విధేయులయ్యేలా చేస్తుందని భావం. ఈ విశ్వాసం పూర్వం అబ్రాహామునిలాగే ఈనాడు మనలనుగూడ నీతిమంతులను జేస్తుంది. అతనికిలాగే మనకుగూడ రక్షణాన్ని దయచేస్తుంది - రోమా 4,19.
ఆత్మ దయచేసే విశ్వాసంద్వారా క్రీస్తుని నమ్ముతాం. అతని మరణిశోత్తానాల శక్తిని విశ్వసిస్తాం, క్రీస్తుకూడ తన ఆత్మద్వారా మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఒకోసారి క్రీస్తుపట్ల మనకు విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాంటప్పడు ఆ విశ్వాస వరాన్ని బలపరచమని ఆత్మనే అడుగుకోవాలి.
3. మోక్షాన్ని చేరుకొని క్రీస్తుని దర్శిస్తామని నమ్మడమే నిరీక్షణం, ఈ వరాన్ని మనకు దయచేసేదికూడ ఆత్మమే. ఆత్మవల్లనే మనం దేవుని పుత్రులమౌతాం. ఈ వారసం మనకు లభిస్తుందనడానికి ఆత్మే హామీ - ఎఫె 1,14. కనుక మనం మోక్షాన్ని ఆశించేలా చేసేదీ, ఆ భాగ్యం మనకు దక్కుతుందని నమ్మేలా చేసేదీ ఆత్మే ఇంకా ఈ యాత్మ మనం ఈ మోక్షభాగ్యం కొరకు ఆశతో ఎదురుచూచేలా చేస్తుంది. బాధతో మూలిగేలాకూడ చేస్తుంది - రోమా 8,13. ఒకోసారి మనం ఈ లోక భాగ్యాలతోనే సంతృప్తి చెందుతాం. పరలోక భాగ్యాలను ఆశించం. ఈ దౌర్భాగ్యం నుండి మనలను కాపాడమని ఆత్మనే అడుగుకోవాలి. మనకు స్వర్గ సంపదలమీద కోరిక పుట్టించమని ఆ ప్రభువుని వేడుకోవాలి.
ప్రార్థనా భావాలు
1. పిత, సుతుడు, పవిత్రాత్మ అనే ముగ్గురు దైవవ్యక్తులకుగల సంబంధాన్నివేదశాస్తులు కొన్ని వుపమానాలతో వివరించారు. టెరూలియన్ ఈలా చెప్పాడు. "మొదట తండ్రి వున్నాడు. అతనినుండి కుమారుడు బయలుదేరుతాడు. వారిరువురినుండి కడన ఆత్మడు బయలుదేరుతాడు. ఏలాగంటే, వేరునుండి చెటూ ఆ చెట్టునుండి ఫలమూ ఉద్భవిస్తాయి. జలధారనుండి నదీ ఆ నదినుండి కాల్వా బయలుదేరుతాయి. సూర్యునినుండి కిరణాలూ వాటినుండి ప్రకాశమూ పడతాయి."
2. అతనేష్యస్ భక్తుడు ఈలా వివరించాడు, “తండ్రి దీపం, కుమారుడు దీపకాంతి. ఆత్మడు ఆ కాంతితో మనలను వెలిగించేవాడు. ఇంకా తండ్రి జలధార, కుమారుడు ఆ ధారనుండి పుట్టిన నది. ఆ నదినుండి మనం త్రాగేనీరు ఆత్మ."
3. దీపం తన కాంతితో అన్ని వస్తువులను ప్రకాశించేలా చేస్తుంది. అలాగే ఆత్మ తాను సోకినవారందరినీ తేజోమయులను చేస్తుంది.
27. ఆత్మా దైవవాక్కు
1. ప్రాచీనకాలంనుండి భక్తులు బైబులు చదువుకొనేపుడు ఆత్మకు ప్రార్థన చేస్తూ వచ్చారు. పూర్వం యిర్మీయా యెషయా మత్తయి మార్కు మొదలైన పరిశుద్ధ రచయితలకు ప్రేరణం పట్టించి వారిచే బైబులు వ్రాయించింది పవిత్రాత్మే కనుక ఆ యాత్మ అనుగ్రహం లేందే ఎవరికీ పవిత్రగ్రంథం వశపడదు. బైబులు ఆధ్యాత్మిక విషయాలు చెప్పే పుస్తకం. ఆత్మ సహాయంలేందే ఆధ్యాత్మిక విషయాలు ఎవరు అర్థం చేసికోగలరు? ఆత్మ రెండు ప్రేరణలు దయచేస్తుంది. ఒకటి రచయితకీ, మరొకటి పాఠకుడికీ, రచయితకు కలిగే ప్రేరణం దివ్యగ్రంథాలు వ్రాయడానికి, మత్తయి మార్కు మొదలైనవాళ్ళు ఈ ప్రేరణంతోనే సువిశేషాలు వ్రాసారు. పాఠకులకు కలిగే ప్రేరణం బైబులు చదవడానికి, ఈ ప్రేరణం వల్ల మనం మళ్ళా బైబులు వ్రాయం. ఇదివరకే వ్రాసిన బైబులు చాలు. ఈ ప్రేరణంవల్ల మనం బైబులు అర్థం చేసికొంటాం. దానిపట్ల భక్తి కలిగించుకొని దాని బోధల ప్రకారం జీవిస్తాం. కనుక బైబులు చదువుకొనేపుడు మనం ఈ ప్రేరణను బాగా వాడుకోవాలి. 2. పౌలు బోధిస్తుంటే లూదియా అనే భక్తురాలు వింది. ప్రభువు ఆమె హృదయాన్ని తలుపు తెరచినట్లుగా తెరచాడు - అచ 16,14. ఈనాడు మనం బైబులు చదువుకొనేపడు ఆత్మ మన హృదయాన్ని కూడ ఈలాగే తెరుస్తుంది. లేకపోతే మనకు భక్తి పట్టదు. యోహాను మొదటి జాబు మీరు పవిత్రుని వలన అభిషేకింపబడ్డారు అని చెప్తుంది - 2,20. అతనినుండి మీరు పొందిన అభిషేకం మీయందు నిల్చివుంది అంటుంది - 2,27. ఈ రెండు అలోకనాలు పేర్కొనే "అభిషేకం" పవిత్రాత్మ ప్రభావమే. మనం మొదట వేదవాక్యం వింటాం. అది విత్తనంలా మన హృదయంలో పడుతుంది. ఆత్మ మన హృదయంలో పడిన ఈ వేదవాక్యాన్ని మనకు వివరిస్తుంది. దీనివలన మన హృదయంలో భక్తి పడుతుంది, మనం క్రీస్తుని విశ్వసిస్తాం. ఈ ప్రక్రియనే ఇక్కడ అభిషేకం అన్నారు. ఆత్మ వివరించకపోతే వేదవాక్యం మన హృదయంలో ఏలాంటి ప్రభావమూ చూపలేదు. నేడు ఆత్మ మనకు క్రీస్తు బోధలను విప్పి చెప్తుంది. అతని వుపదేశాలను తలపనకు తెస్తుంది - యోహా 14,26. ఆత్మ వివరించి చెప్పకపోతే క్రీస్తు బోధలు మనకు అర్థం కావు. అతని జీవిత సంఘటనలు మనకు బోధపడవు. విశేషంగా అతని మరణిశోత్తానాలు భావాన్ని మనం గ్రహించలేం. ఆత్మడు మనలను సర్వసత్యంలోనికి నడిపించేవాడు 16,13. క్రీస్తు తెలియజేసే దివ్యశ్రుతే ఈ సత్యం, అనగా అతడు తండ్రినిగూర్చి తెలియజేసే అంశాలే సత్యం. అసలు క్రీస్తే సత్యం. ఈ సత్యం మనకు అర్థమయ్యేలా చేసేది ఆత్మడే. 3. మనం వేదబోధ చేస్తాం, శ్రోతలు మన బోధ వింటారు. అలా వినగానే ఆత్మ వాళ్ళ హృదయాలను కదిలిస్తుంది, దీని ఫలితంగా శ్రోతల హృదయాల్లో భక్తి విశ్వాసాలు పుడతాయి. లేకపోతే వాళ్ళ క్రీస్తుని గ్రహించలేరు. పౌలుకి ఈ సత్యం బాగా తెలుసు. కనుకనే అతడు తన వేదబోధను ప్రజలు బాగా ఆలించేలా ప్రార్థించమని తన క్రైస్తవులను అర్ధించాడు - కొలో 43. ఆత్మ లేందే దేవద్రవ్యానుమానాలు పని చేయవు. దైవవాక్కుకూడ ఓ దేవద్రవ్యానుమానంలాంటిది. కనుక ఆత్మలేందే బైబులు పనిచేయదు. పూర్వనూత్నవేదాలు క్రీస్తునే బోధిస్తాయి. ఈలాంటి వేదవాక్యాలను ఆత్మ సహాయం లేందే ఎవరు అర్థంచేసికోగలరు? ఆత్మడు అనుగ్రహించందే ఎవడు క్రీస్తుని గ్రహించగలడు? కనుక మనం ఎప్పడుకూడ ఆత్మను వేడుకొనిగాని వేదవాక్యాన్ని ధ్యానించుకోగూడదు.
ప్రార్ధనా భావాలు
1. ముగ్గురు దైవవ్యక్తులనుగూర్చి నీసా గ్రెగొరీ భక్తుడు ఈ వుపమానం చెప్పాడు. "మొదటి ఒక దీపం వుంది, దానినుండి రెండవ దీపాన్ని వెలిగించారు. ఆ రెండవ దానినుండి మూడవ దీపాన్ని వెలిగించారు. ఈ మూడవ దీపం మొదటి రెండిటినుండీ వచ్చిందే. అదే ఆత్మ". 2. న్యూడో డయెనీష్యస్ అనే భక్తుడు ఈ వుపమానం చెప్పాడు. “అన్నిటికి మూలకారణమైన తండ్రి చెట్టు లాంటివాడు. క్రీస్తూ పవిత్రాత్మా ఆ చెట్టునుండి పట్టే మొగ్గలూ పూలూ అనుకోవాలి."
28. వరాలు దయచేసే ఆత్మ
ఆత్మ భక్తులకు నానావరాలు దయచేస్తుంది. వీటి ద్వారా భక్తులు భగవంతునికి చేరుమోతారు. ఇక్కడ ఈ వరాలనుగూర్చి విపులంగా తెలిసికొందాం. 1. ఆత్మ మెస్సీయా శిశువుకు ఆరు వరాలు దయచేస్తుందని చెప్పాడు యెషయా ప్రవక్త. ఈ వరాలు విజ్ఞానం, వివేకం, బలం, సదుపదేశం, దైవజ్ఞానం, దైవభీతి 11.2-3. ఇక్కడ హీబ్రూ బైబులు ఆరువరాలనే పేర్కొన్నా దీని అనువాదమైన గ్రీకు సెపవాజింత్ బైబులు దైవభక్తి అనే ఏడవ వరాన్నిగూడ పేర్కొంది, దీనివల్ల ఆత్మసప్తవరాలు దయచేస్తుందనే సంప్రదాయం వాడుకలోకి వచ్చింది. బైబులు ఆత్మ మెస్సీయాకు సప్తవరాలనిస్తుందని చెప్తుంది, కాగా ఆ మెస్సీయాను విశ్వసించే భక్తులకు కూడ ఈ వరాలు లభిస్తాయని మనం నమ్మవచ్చు. ప్రాచీన కాలంనుండి క్రైస్తవభక్తులు ఈలాగే విశ్వసిస్తూ వచ్చారు. ఈ యేడు వరాలూ వ్యక్తిగత పావిత్ర్యం కొరకు ఉద్దేశింపబడినవి. కనుక వీటిద్వారా ఆత్మ మనలను పవిత్రులను చేస్తుంది. అసలు వరాలు ఎన్ని? బైబులూ క్రైస్తవ సంప్రదాయమూ ఏడని చెప్తుంది. కాని బైబుల్లో ఏడు పూర్ణసంఖ్య అనగా ఈ యేడు ఆత్మయిచ్చే వరాలన్నిటినీ సూచిస్తాయి. ఆత్మ వరాలన్నీ ఈ యేడింటిలో ఇమిడివున్నాయని భావం. ఆత్మవరాలు ఎన్నయినా వుండవచ్చు. కాని అవన్నీ ఈ యేడింటిలో ఇమిడే వుంటాయి. 2. పౌలు తన జాబుల్లో చాలచోట్ల ఆత్మ ఎన్నోవరాలు దయచేస్తుందని చెప్పాడు. కాని యీ వరాలు పై యెషయా పేర్కొన్నవాటిలాగ వ్యక్తిగత పావిత్రానికి ఉపయోగపడవు. మనం ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగపడతాయి. కనుక వీటిని సేవావరాలు లేక ప్రేషిత వరాలు అన్నారు (Charisms). 1కొ 12,7-10.28. రోమా 12,6-8. ఎఫే 4, 11 వచనాల్లో వీటి ప్రస్తావనం వస్తుంది. ఈ యాలోకనాల్లో పౌలు ఇంచుమించు ఇరవై వరాలదాకా పేర్కొన్నాడు. అవి బుద్ధి, జ్ఞానం, విశ్వాసం, స్వస్థత చేకూర్చడం, అద్భుతాలు చేయడం, ప్రవచనం చెప్పడం, భాషల్లో మాటలాడ్డం, వివేచనం, పరిచర్య ప్రోత్సహించడం, దానం చేయడం, పర్యవేక్షణం, కరుణకార్యాలు, సువార్త చెప్పడం, కాపరులుగా, అపోస్తలులుగా, సహాయకులుగా, పరిపాలకులుగా మెలగడం మొదలైనవి. మనం ఈ సేవావరాలను విరివిగా వాడుకొని తోడిప్రజలకు, విశేషంగా పేదసాదలకు పరిచర్య చేయాలి. వారిని వృద్ధిలోనికి తీసికొని రావాలి. ఈ పరిచర్యద్వారా మనం నేరుగా కాదుగాని పరోక్షంగా పవిత్రులమౌతాం. 3. ఆత్మ పైరెండు రకాల వరాలనేకాక ఫలాలను కూడ దయచేస్తుంది. ఇవి తొమ్మిది వున్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం. విశ్వసనీయత, సాధుశీలత, ఇంద్రియ నిగ్రహం - గల 5,22. ఈ ఫలాలవల్ల హృదయంలో సంతోషమూ మాధుర్యభావమూ నెలకొంటాయి. ఇవి సప్తవరాలకంటెగూడ శ్రేష్టమైనవి.
ప్రార్ధనా భావాలు
1. శ్రీసభలో అధికారమనేది వుంది. శ్రీసభ అనే సమాజం మేలుకొరకు పవిత్రాత్మే దీన్ని ప్రసాదించింది. ఐనా శ్రీసభలోని అధికారులు తరచుగా ఈ శక్తిని దుర్వినియోగం చేస్తుంటారు. అలా చేసినప్పుడు తిరుసభలోని సామాన్యక్రైస్తవుల కుత్తుక నొక్కేసినట్లవుతుంది. ఆత్మవాళ్ళకిచ్చిన వరాలను వినియోగించుకోక వ్యర్థం చేసినట్లవుతుంది -1తెసు 5,19. భారతదేశం తిరుసభలో ఈయనర్ధం తరచుగా కలుగుతుంటుంది.
2. శ్రీసభలో అధికారమూ వుంది, ఆత్మ వరాలూ వున్నాయి. అధికారమున్నవాళ్ళు ఇతరులమీద పెత్తనం చెలాయింపబోతారు. వరాలున్నవాళ్ళు అధికారులకు లొంగకుండా విచ్చలవిడిగా ప్రవర్తించబోతారు. కాని మనం అధికారాన్నీ వరాలనూగూడ సద్వినియోగం జేసికొని తిరుసభను ఓ భవనంలా నిర్మించాలి. పూర్వం అధికారానికి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. ఇప్పడు వరాలకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తున్నారు. ఐనా ఈ రెండూ సమపాళ్ళలో వుండాలి, అప్పడే తిరుసభ వృద్ధిలోకి వచ్చేది. ఈ శక్తులను మనం ఏనాడూ దుర్వినియోగం చేయగూడదు.
29. శాంతి సంతోషాలను ప్రసాదించే ఆత్మ
1. పిశాచం విచారానుభూతిని కలిగిస్తుంది. కాని పవిత్రాత్మఆనందానుభూతిని కలిగిస్తుంది. హృదయంలో శాంతిని నెలకొల్పుతుంది. ఆత్మఫలాల్లో సంతోషమూ శాంతికూడ వున్నాయి - గల 5,22. పౌలు బర్నబాలు అంతియోకయలో వేదప్రచారం చేస్తూంటే అచటి భక్తులు ఆత్మ ప్రభావంవల్ల శాంతి సంతోషాలతో నిండిపోయారు - అచ 13,52. డెబ్బదియిద్దరు శిష్యులు వేదబోధచేసి తిరిగి వచ్చాక పవిత్రాత్మ ప్రభావం వలన క్రీస్తు స్వయంగా ఆనందానుభూతి చెందాడు — లూకా 10,21.
నేడు ఉత్థానక్రీస్తు తన ఆత్మద్వారా మనకు శాంతినీ సంతోషాన్నీ దయచేస్తాడు. అతడు ఉత్థానమైన పిమ్మట యెరూషలేములోని శిష్యులకు ఈ భాగ్యాలను దయచేసాడని వింటున్నాం - యోహా 20,19-20. పౌలు ఫిలిప్పిలోని క్రైస్తవులకు మీ రెల్లప్పుడూ ఆనందించండని చెప్పాడు - ఫిలి 4,4. క్రైస్తవులమైన మనం మన నాయకుడైన క్రీస్తుని తలంచుకొని ఆనందించాలి. ఈ లోకం కేవలం కన్నీటి కనుమ మాత్రమేకాదు. దేవుడు తన బిడ్డలమైన మనకు ఇక్కడ ఆనందాలు కూడ దయచేస్తాడు. ఈ యానందాలూ సంతోషాలూ భవిష్యత్తులో మనం అనుభవించబోయే మోక్షానందానికి గుర్తుగావుంటాయి. ఈ లోకంలో కొన్ని ఆనందాలు లేకపోతే బ్రతుకు దుర్భరమౌతుంది. కనుక దేవుడు వీటిని మనకు దయచేస్తాడు. ఐతే నిర్మలమైన ఆనందాలన్నిటికీ కర్త పవిత్రాత్మే ఉత్తానక్రీస్తు ఆత్మ మనం క్రీస్తునందు ఆనందించేలా చేస్తుంది. పుణ్యజీవితం గడపడంద్వారా, తోడిప్రజలను సేవలు చేయడం ద్వారా, వేదవాక్యం ధ్యానం చేసికోవడంద్వారా - ఇంకా నానాపవిత్రకార్యాలద్వారా మనం ఆనందించేలా చేస్తుంది.
ప్రార్థనా భావాలు
1. నేడు చాల తావుల్లో పవిత్రాత్మకూటాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ఆత్మపట్ల భక్తిని పెంపొందించుకోవడానికి బాగా వుపయోగడపడతాయి. ఈ కూటాల్లో వేదసత్యాలనుగూర్చిన నిర్వచనాలుండవు. వాటనిగూర్చిన వివరణలుంటాయి. వేదసత్యాలను కథలరూపంలో వివరిస్తారు. సాక్ష్యాలరూపంలో బలపరుస్తారు. పాటలరూపంలో గానం చేస్తారు. కనుక ఈ సమావేశాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. భక్తులు వీటిల్లో పాల్గొని ఆత్మను లోతుగా అనుభవానికి తెచ్చుకోవాలి.
2. పౌలు బోధకీ యోహాను బోధకీ వ్యత్యాసముంది. పౌలు దైవపుత్రత్వమూ మోక్షభాగ్యమూ మనకు ఈ లోకంలో ఇంకా పూర్తిగా లభింపలేదని చెప్పాడు.ఆ భాగ్యాలు మోక్షంలోగాని సంపూర్తిగా లభించవన్నాడు. కాని యోహాను మనకు ఈ భాగ్యాలు ఈ లోకంలోనే లభించాయని చెప్పాడు. మనం క్రీస్తుని నమ్మి అతని ఆత్మను పొందాం గనుక ఈ భాగ్యాలు ఇక్కడే సమృద్ధిగా లభించాయి అనుకోవాలి.
30. మన బాధల్లో మరణంలో ఆత్మ
1. మన బాధల్లోను మరణంలోను ఆత్మ సాన్నిధ్యం వుంటుంది. పూర్వం బాధామయ సేవకుడు ఆత్మ సాన్నిధ్యంతోనే బాధలు అనుభవించాడు - యెష 42,1. సిలువపై మరణించిన క్రీస్తు ప్రక్కనుండి నీళ్ళూ నెత్తురూ స్రవించాయి కదా! - యోహా 19,34.ఈ నీళ్లు ఆత్మను సూచిస్తాయి. కనుక క్రీస్తు శ్రమల్లోను మరణంలోను గూడ ఆత్మ ప్రత్యక్షమై వుంటుంది.
వేదహింసలు మనకు శ్రమలను దెచ్చిపెడతాయి. ఈ శ్రమల్లో మనం శత్రువులముందు ఏమి మాట్లాడాలా అని కంగారు పడనక్కరలేదు. మనలో వుండే ఆత్మే ఆ సమయంలో మనం పలకవలసిన పలుకులు పలికిస్తుంది - మత్త 10,20. అనగా మన శ్రమల్లో ఆత్మ మనకు సహాయం చేస్తుంటుంది. మనం క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం ధన్యమని యెంచాలి. ఆ శ్రమల్లో దేవుని ఆత్మ మనమీదికి దిగివస్తుంది - 1షేత్రు 4,14. క్రీస్తుతోపాటు మనం కూడ శ్రమలు అనుభవిస్తే అతని వారసమైన మోక్షభాగ్యం మనకు కూడ లభిస్తుంది - రోమా 8,17. కాని ఈ మోక్షభాగ్యం మనకు లభించేలా చేసేది పవిత్రాత్మే.
2. మన శ్రమల్లో ఆత్మసాన్నిధ్యం వుంటుందని చెప్పాం. అలాగే మన మరణంలోకూడ ఆత్మప్రత్యక్తమై వుంటుంది. మనం క్రీస్తు మరణోత్థానాల్లోకి జ్ఞానస్నానం పొందుతాం. - రోమా 6,3. అతడు శారీరకంగా మరణించినట్లే మనం పాపజీవితానికి మరణిస్తాం. అతడు శారీరకంగా ఉత్తానమైనట్లే మనం పుణ్యజీవితానికి ఉత్థానమౌతాం. జ్ఞానస్నానంలో క్రీస్తు మరణం మనమీద సోకి మనకు జీవాన్నిస్తుంది. కాని జీవశక్తి ఎప్పడూ ఆత్మనుండే.కనుక ఉత్థాన క్రీస్తు ఆత్మ మన జీవితంలోను మరణంలోను మనమీద సోకి మనకు జీవశక్తిని దయచేస్తుంది.
క్రైస్తవ భక్తుడు తన శ్రమల్లోను మరణంలోను గూడ తన్నుతాను ఆత్మకు అర్పించుకోవాలి. ఆ యాత్మ నుండి ఓదార్పునూ శక్తినీ పొందాలి.
ప్రార్థనా భావాలు
1.రిచర్డ్ ఆఫ్ సెంట్ విక్టర్ అనే భక్తుడు ఈలా నుడివాడు.
తండ్రిలో ఏకత్వమంది
బహుత్వం క్రీస్తుద్వారా లభిస్తుంది
కాని త్రీత్వాన్ని సమాప్తం చేసేది మాత్రం పవిత్రాత్మే
2. భద్రమైన అభ్యంగనంద్వారా గృహస్టులు ఆత్మను పాంది బాలఢ్యులౌతారు. క్రీస్తుకి సాక్షులౌతారు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తారు. తమ మాటలద్వారా చేతలద్వారాగూడ శ్రీసభ వ్యాప్తికి తోడ్పడతారు.
31. ఆత్మ వినయం
1. ఎప్పడుగూడ స్వచ్ఛమైన ప్రేమ వినయంతో నిండివుంటుంది. కాని ఆత్మ ప్రేమకు నిలయం. అందుచే ఆత్మకుండే వినయం అంతా యింతా కాదు.
త్రీత్వంలో ఆత్మ వినయంతో తన్నుతాను తగ్గించుకొంటుంది. ఆ యాత్మ తండ్రినీ క్రీస్తునీ మనకు తెలియజేస్తుంది. కాని మూడవవ్యక్తిని మనకు తెలియజేసేవాళ్ళెవరూ లేరు. తండ్రి కుమారుని పంపుతాడు. కుమారుడు ఆత్మను పంపుతాడు. కాని ఆత్మడు ఎవరినీ పంపడు. ఆత్మ తండ్రినీ కుమారునీ మహిమపరుస్తుంది. కాని ఆత్మను మహిమ పరచేవాళ్ళెవరూ లేరు. ఆత్మద్వారా తండ్రీ కుమారుడూ ప్రవక్తలూ మాట్లాడతారు. కాని బైబుల్లో ఆత్మ తన్ను గూర్చి తాను ఒక్కమాటకూడ చెప్పకోదు. ఆ యాత్మకు రూపురేఖలుండవు. అసలు ఆత్మ ఎవరోకూడ బైబులు స్పష్టంగా జెప్పదు. దైవవ్యక్తికి ఇంత వినయమూ అని మనం విస్తుపోతాం. మనలనుగూర్చి మనం లోకానికి తెలియజేసికోవాలని ఎంత ఆరాటపడతాం! మనలనుగూర్చి మనం ఎంతగా ప్రచారం జేసికొంటాం! ఆత్మకు ఈ కక్మూర్తి ఎంతమాత్రం లేదు.
2. ఆత్మడు నిరంతరం పనిచేస్తూనే వుంటాడు. కాని అతని పని తన కొరకు కాదు, మనకొరకు. మనలను పవిత్రులను చేయడంకొరకు.మనం క్రీస్తుని ప్రకటిస్తాంగాని ఆత్మను ప్రకటించం. ఆత్మద్వారా దేవుని తండ్రీ అని పిలుస్తాం. క్రీస్తుని ప్రభువు, దేవుడు అని పిలుస్తాం. కాని మనం ఆత్మను పేరెత్తి పిలచేలా చేసే దివ్యశక్తి ఏదీ లేదు. ఆత్మడు మనలను తండ్రి దగ్గరికీ కుమారుని దగ్గరికీ రాబడుతూంటాడుగాని తన దగ్గరికి రాబట్టుకోడు. ఇది వినయంగాకపోతే మరేమిటి?
3. నరుని శక్తి అతన్ని గర్వాత్ముణ్ణి చేస్తుంది. కాని ఆత్మశక్తి ఆ యాత్మను వినయాత్మణ్ణి చేస్తుంది. ఆత్మడు వినయవంతుడు ఐనట్లుగానే అతడు వసించే భక్తులుకూడ వినయంగానే వుంటారు. ఎప్పడుకూడ నరుల్లో వినయం గొప్పతనానికీ దైవసాన్నిధ్యానికీ గురుతు.
తండ్రి తాను చేసిన సృష్టితో ఐక్యమౌతుంటాడు. ఇది తండ్రి వినయం. కుమారుడు దైవస్వభావం కలవాడు. ఐనా తన్ను తాను రిక్తునిచేసికొని దాసుడై మానువునికి పోలికగా జన్మించాడు - ఫిలి 2,8. ఇది కుమారుని వినయం. పరిశుద్ధ రచయితలచే బైబులునంతటినీ వ్రాయించింది పవిత్రాత్మ. కాని ఆ యాత్మ ఈ గ్రంథంలో తన్ను గూర్చి తాను ఎక్కడా, ఏమీ స్పష్టంగా చెప్పించుకోలేదు. ఇది ఆత్మ వినయం.ఈ దైవవ్యక్తులనుజూచి గర్వాత్ముడైన నరుడు వినయాన్ని అలవర్చుకోవాలి. దేవునికి వినయం తగినట్లే నరునికి గర్వం తగుతుంది కాబోలు!
ప్రార్థనా భావాలు
1. ఇరెనేయస్ భక్తుడు ఈలా వాకొన్నాడు. పిండిని నీటితో తడపందే ముద్దకాదు. అలాగే ఆత్మ అనుగ్రహం లేందే మనం ఒకరితో ఒకరం ఐక్యంగాలేం. ఇంకా, ఎండిన నేలగాని నీరులేని చెట్టగాని ఫలించవు. వీటికి నీరు పెడితే ఫలిస్తాయి.అలాగే ఆత్మ అనుగ్రహం వుంటేనేగాని మనం కూడ ఫలించం. 2. ఎఫేము భక్తుడు ఆత్మను అగ్నితో వుపమిస్తూ ఈలా వ్రాసాడు. మరియమాత గర్భంలో అగ్నీ ఆత్మా వున్నారు మనం పొందే జ్ఞానస్నానంలో అగ్నీ ఆత్మా వున్నారు మనం స్వీకరించే సత్రసాదంలో అగ్నీ ఆత్మా వున్నారు రొట్టెలో వున్న ఆత్మను మనం భుజించలేం ద్రాక్షరసంలో వున్న అగ్నిని మనం త్రాగలేం మన పెదవులు స్వీకరించే ఈ యప్పరసాలు అద్భుత వస్తువులు అనుకోవాలి.
32. తల్లిగా ఆత్మ
1. దేవునికి తండ్రి అని పేరు. క్రీస్తుకి కుమారుడని పేరు. కాని ఆత్మకు ఏ పేరూ లేదు. తండ్రి కుమారులకు లాగ అతనికి ఏ సంబంధమూ లేదు. దేవుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు. ఈ నరుడు ఫ్రీ పురుషులనుగా వుంటాడు. నరుళ్ళో స్త్రీత్వమంది కనుక అతనికి ఆదిరూపమైన భగవంతుజ్లో గూడ స్త్రీత్వముండి వండాలి. ఈ స్త్రీత్వం, మాతృత్వం, పవిత్రాత్మలో గోచరిస్తుంది. 2. పవిత్రాత్మ మనలను దేవునికి బిడ్డలనుగా చేస్తుంది. కనుక ఈ యాత్మ తల్లిలాంటిది. ఓవిధంగా చెప్పాలంటే, ఆత్మ దేవునికి గర్భంలాంటిది. ఈ గర్భం నుండే మనం ఆధ్యాత్మికంగా జన్మిస్తాం. శ్రీసభలో వాడుకలోవున్న రెండు సంకేతాలు ఆత్మ తల్లిలాంటిదని నిరూపిస్తాయి. మొదటిది, శ్రీసభను తల్లి అని వాకొంటాం. ఈ శ్రీసభలో ఆత్మ వసిసూంటుంది. మనం శ్రీసభ గర్భంనుండీ, ఆ సభలో వసించే ఆత్మ గర్భంనుండీ, బిడ్డల్లాగ జన్మిస్తాం. కనుక ఆత్మ మనకు తల్లి, రెండవది, మనం జ్ఞానస్నాన జలంనుండి ఆధ్యాత్మికంగా జన్మిస్తాం. జలం అన్ని ప్రాణులకు పుట్టుకనిచ్చే తల్లి, స్త్రీగర్భంకూడ జలమయంగానే వుంటుంది. దానిలోనే మనుష్య పిండం పెరుగుతుంది. ఇక, జ్ఞానస్నాన జలం ఆత్మకు చిహ్నం. కనుక మనం ఆత్మ అనే తల్లినుండి ఆధ్యాత్మికంగా జన్మిస్తాం.
3. బైబులు దేవుణ్ణి తల్లితో పోలుస్తుంది. యెషయా ఈలా వాకొన్నాడు.
"స్త్రీ తన పసికందును మరచిపోతుందా?
తన ప్రేవున పుట్టిన బిడ్డమీద
జాలిజూపకుండా వుంటుందా? ఆమె తన శిశువును మరచిపోయినా
"తల్లి కుమారునివలె నేను మిమ్మ ఓదారుస్తాను యెరూషలేమన మిమ్మ ఓదారుస్తాను" - 66,13.
ఈ వాక్యాలు పేర్కొనే దైవమాతృత్వం పవిత్రాత్మకు బాగా వర్తిస్తుంది. జూల్యానా అనే భక్తురాలు 15వ శతాబ్దంలో ఇంగ్లండులోని నోర్విచ్లో జీవించింది. ఈమె తండ్రినీ క్రీస్తునీ తల్లి అనే పిల్చింది. కనుక దేవుడు తల్లి అనే భావం మన క్రైస్తవ సంప్రదాయంలో వుంది. పవిత్రాత్ముడే ఈ తల్లి.
ఆత్మనుగూర్చి మాట్లాడేపుడు ఈయబడ్డం, వరం, ప్రేమ అనే మూడు పదాలు వాడతాం. ఆత్మ మనకు దేవునిచే ఈయబడింది. మూడవవ్యక్తి వరమూ ప్రేమా కూడ. ఇక, ఈ మూడు పదాలు తల్లికిగూడ వర్తిస్తాయి. తల్లి శిశువుకి ఈయబడుతుంది. తల్లి శిశువుకి వరంగాను ప్రేమగాను వుంటుంది. కనుక ఆత్మకూడ తల్లి లాంటిది అనుకోవాలి. ప్రాచీన క్రైస్తవులు ఆత్మను తల్లిగానే భావించారు.
4. ఆత్మ మనపట్ల నిత్యమూ తల్లిలాగే మెలుగుతుంది. తల్లి బిడ్డను పాలతో పెంచుతుంది. ఆత్మకూడ మనలను వాక్యమనే పాలతో పెంచుతుంది - 1పేత్రు 2,2. ఆత్మ మనచే మన తండ్రియైన దేవుణ్ణి నాన్నా అని పిలుస్తుంది - గల 4,6. మనం క్రీస్తుని దేవుణ్ణిగా విశ్వసించేలా చేస్తుంది - 1కొ 12,3.తోడి నరులపట్ల ప్రేమభావం జూపి వారిని సోదరీ సోదరులనుగా అంగీకరించేలా చేస్తుంది - గల 5,22. ఓ తల్లిలా చిన్నబిడ్డలమైన మనకు ప్రార్ధనం నేర్చుతుంది - రోమా 8,26. భౌతికరంగంలో తల్లి బిడ్డకు ఎన్ని సేవలు చేస్తుందో ఆధ్యాత్మిక రంగంలో ఆత్మ మనకు అన్ని సేవలు చేస్తుంది.
5. క్రీస్తు శిష్యులను విడనాడి వెళ్ళిపోకముందు వారికి ఆత్మ మరియమాత అనే రెండు వరాలు దయచేసాడు. ఈ యాత్మా మరియమాతా కలసే పనిచేస్తుంటారు. మరియ ఆత్మశక్తితోనే గర్భవతి ఐంది, మరియమాత గర్భాన్ని ఫలభరితం చేసింది ఆత్మే దేవుడు ఆత్మ అనే గర్భంనుండి తన కుమారుడు జన్మించేలా చేసాడు. పవిత్రాత్మ క్రీస్తు జన్మించినపుడు తల్లిగా వ్యవహరించింది. అలాగే మనం ఆధ్యాత్మికంగా జన్మించేపుడుగూడ తల్లిగా వ్యవహరిస్తుంది.
6. ఆత్మ తల్లి లాంటిదని చెప్పాం. కనుక తల్లిలాగే శ్రీసభలో నెలకొని వుంటుంది. తల్లిలాగే ఆ సభను నడిపిస్తూంటుంది. ఆత్మశ్రీసభలో ఓ అధికారిలాగ పెత్తనం చెలాయించదు. ఓ తల్లిలాగ వినయంతో, ప్రేమతో సేవలు చేస్తుంది - మత్త 20,25-28. శ్రీసభ సభ్యుల్లో పురుషులూ వున్నారు, స్త్రీలూ వున్నారు. పురుషులు శిరస్సయిన క్రీస్తుకి, అనగా నాయకుడైన క్రీస్తుకి పోలికగా వుంటారు. స్త్రీలు తల్లియైన ఆత్మకు పోలికగా వుంటారు.ఆ యాత్మలోలాగే స్త్రీలలోగూడ ప్రేమ, సేవ ప్రచురంగా కన్పిస్తాయి. ఇంకా, స్త్రీలు మరియమాతకూ శ్రీసభకూగూడ పోలికగా వుంటారు. ఈలా ఆత్మను తలపింపజేసే స్త్రీలకు శ్రీసభలో ఎక్కువ ప్రాముఖ్యముండాలి. పురుషులు వాళ్ళ వరాలను అణచివేయకూడదు. వాళ్ళ సేవలను అధికంగా వినియోగించుకోవాలి. మామూలుగా మన క్యాతలిక్ సమాజంలో స్త్రీలకు మతవిషయాల్లో స్థానం వుండదు. వేదవ్యాపక కృషిలో వాళ్ళు తోడ్పడరు. మనం వాళ్ళకు అధికంగా తర్ఫీదునిచ్చి ఎన్నో బాధ్యతలు ఒప్పజెప్పాలి.
7. ఆత్మ తల్లికి పోలికగా వుంటుంది. కనుక తల్లి బిడ్డలను ఎంత ప్రేమతో సాకుతుందో ఆత్మ మనలను అంత ప్రేమతో సాకుతుంది. బిడ్డలు తల్లి దగ్గరికి ఇష్టంతో వెత్తారు. కష్టసుఖాల్లో తల్లిని ఆశ్రయిస్తారు. అలాగే మనంకూడ ప్రీతితో ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ యాత్మపట్ల భక్తిని అలవర్చుకోవాలి. మన కష్టాల్లో ఆ దివ్యవ్యక్తి సహాయం అడుగుకోవాలి. సుఖాల్లో అతనికి వందనాలు అర్పించుకోవాలి. ఆత్మపట్ల మనకు గాఢమైన చనువూ పరిచయమూ వండాలి.
కాని చాలమంది క్రైస్తవుల జీవితం దీనికి భిన్నంగా వుంటుంది. ఆత్మను నిజంగా అనుభవానికి తెచ్చుకొన్నవాళ్లు అరుదు. రోజువారి జీవితంలో ఆత్మచే నడిపింపబడేవాళ్ళు ఇంకా అరుదు. కాని పౌలు దేవుని బిడ్డలు దేవుని ఆత్మచే నడిపింపబడతారు అని చెప్పాడు - రోమా 2,14 అసలు మన క్రైస్తవులకు చాలమందికి పునీతులపట్ల వుండే భక్తికూడ ఆత్మపట్ల వుండదు. ఇది శోచనీయం. ఆత్మ త్రీత్వంలో మూడవ దైవవ్యక్తి. అతడు అనుగ్రహించకపోతే ఎవరూ క్రీస్తు దగ్గరికి రాలేరు. అతనికిగాకపోతే మరెవరికి భక్తి జూపుతాం?
తల్లి దగ్గరికిపోని బిడ్డకి తల్లి యేలా అనుభవానికి వస్తుంది? ఆత్మ దగ్గరికిపోని క్రైస్తవునికి ఆత్మయేలా అనుభవానికి వస్తుంది? లౌకికరంగంలో తల్లిలేని బిడ్డడికి ఎంత కొరతో ఆధ్యాత్మికరంగంలో ఆత్మలేని బిడ్డడకి అంత కొరత. కనుక ఆత్మపట్ల అధికాధికంగా భక్తిని పెంపొందించుకొందాం.
ప్రార్థనా భావాలు
1. అఫ్రాటిస్ అనే సిరియా భక్తుడు ఆత్మను తల్లితో పోలుస్తూ ఈలా చెప్పాడు. “అవివాహితుడైన క్రైస్తవ సన్యాసికి దేవుడే తండ్రి, ఆత్మమే తల్లి, అతనికి వేరే ప్రేమలు ఏవీలేవు.” 2. ఇరెనేయస్ భక్తుడు "బ్రతికివున్న నరుణ్ణి దేవుని తేజస్సు అనాలి. నరుని జీవితానికి సాఫల్యం దేవుణ్ణి దర్శించడమే" అని వ్రాసాడు. ఇక్కడ ఈ భక్తుడు పేర్కొన్న దేవుని తేజస్సు ఆత్మ ప్రభావమే. ఆత్మశక్తితోనే మనం దేవుణ్ణి దర్శిస్తాం.
33. ఆత్మకు బదులుగా ముగ్గురు
1. క్యాతలిక్ సమాజానికి చెందిన మనం ఆత్మను తరచుగా మరచిపోతూంటాం. మన ప్రార్థనల్లో భక్తికృత్యాల్లో, మతాచరణంలో ఆత్మను అట్టే పట్టించుకోం. ఇది పొరపాటు. క్యాతలిక్కులమైన మనం ఆత్మను విస్మరించి ఆత్మకు బదులుగా మూడంశాల్లో శ్రద్దాభక్తులు చూపిస్తూంటాం. అవి సత్ప్రసాదం, పోపుగారు, మరియమాత. ఈ మూడంశాలను క్రమంగా పరిశీలిద్దాం.
మామూలుగా మనకు దివ్యసత్ర్పసాదంపట్ల అపార భక్తి వుంటుంది. ఉండవలసిందే. అది ప్రభువు ప్రేమ చిహ్నం. కాని పొరపాటేమిటంటే, దివ్యసత్రసాదంలో క్రీస్తుని మాత్రమే గుర్తిస్తాం. దానిలో క్రీస్తుబలీ శరీరమూ సాన్నిధ్యమూ మాత్రమే గమనిస్తాం. కాని అప్పరసాలు క్రీస్తు శరీరరక్తాలుగా ఏలా మారాయి? పవిత్రాత్మ వేంచేయడంవల్లనే కదా! అన్ని సంస్కారాలతోపాటు దీనిలో గూడ ఆత్మే పనిచేస్తుంది. ఆత్మ ఆవాహనంవల్లనే రొట్టెరసాలు క్రీస్తు శరీరరక్తాలవుతాయి. కనుక దివ్యసత్రసాదంలో క్రీస్తుతోపాటు ఆత్మసాన్నిధ్యాన్ని గూడ గుర్తించాలి. క్రీస్తుని ఆరాధించినట్లే ఆత్మనుకూడ ఆరాధించాలి. దివ్యసత్ప్రసాద భక్తి ఆత్మను విస్మరించేలా చేయకూడదు.
2. పోపుగారిపట్ల మనకు విశేష గౌరవాదరాలు వుంటాయి. ఉండవలసిందే. ప్రోటస్టెంట్ల పోపుగారి అధికారాన్ని గుర్తించరు. ఈ లోటును భర్తీచేయడానికో అన్నట్లు మనం పరిశుద్ధ తండ్రిగారిని అధికంగా గౌరవిస్తూంటాం. మంచిదే. పోపుగారు శ్రీసభలో ఐక్యతకు చిహ్నంగా వుంటారు. క్రైస్తవులంతా ఒకే విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఒకే నాయకుణ్ణి అనుసరిస్తున్నారు అనడానికి గురుతుగా వుంటారు. కాని క్రైస్తవుల ఐక్యతకు పోపుగారికంటెగూడ ముఖ్యమైన కారణం పవిత్రాత్మ. ఆత్మ అనుగ్రహంవల్లనే క్రైస్తవులు ఎన్నిదేశాల వాళ్ళయినా, ఎన్ని జాతులవాళ్ళయినా ఒక్క సమాజంగా కలసిమెలసి జీవించగల్లుతున్నారు. మన దేహంలోని అవయవాలన్నిటిని ఒక్కటిగా ఐక్యపరచేది మన ఆత్మ అలాగే క్రైస్తవులందరినీ ఒక్కటిగా ఐక్యపరచేది పవిత్రాత్మ. కనుక మనం పోపుగారిపట్ల చూపే గౌరవాదారాలు ఆత్మను మరచిపోయేలా చేయకూడదు. పోపుగారిని పట్టించుకొంటే చాలు, ఆత్మను విస్మరించినా పరవాలేదులే అనిపించేలా చేయకూడదు. 3. మనం దేవమాతపట్ల అధిక భక్తిని చూపిస్తాం. చూపించవలసిందే. ప్రోటస్టెంట్ల దృష్టిలో క్రీస్తువేరు దేవమాత వేరు. క్రీస్తు దేవుడు, మరియమాత కేవలం సామాన్య వ్యక్తి. క్రీస్తుని ఆరాధించాలి, మరియను పట్టించుకోకపోయినా పరవాలేదు. కాని మన దృష్టిలో క్రీసూ మరియా ఎప్పడూ కలసే వుంటారు. వాళ్ళిద్దరిపట్లా తప్పకుండా భక్తి చూపించవలసిందే. కాని ఈ భక్తి మరియ చాలు, పవిత్రాత్మను స్మరించకపోయినా పరవాలేదులే అనిపించేలా చేయకూడదు. ఇది పెద్దపొరపాటు.
చారిత్రకంగాజూస్తే, ఇప్పడు మనం మరియమాతకు చేసే ప్రార్థనలు మొదట ఆత్మకు చెందినవి. ఆమెను మంచి ఆలోచనయొక్కమాత, వివేకంగల కన్యక, జ్ఞానంయొక్క ఆలయం, దేవరహస్యంగల రోజాపుప్పం అని సంబోధిస్తాం. కాని ఈ సంబోధనలు ప్రాచీనకాలంలో పవిత్రాత్మకు వర్తించేవి. మరియమాత శ్రీసభకు ఆత్మలాంటిదీ, క్రీస్తుతోపాటు ఆమె సాన్నిధ్యంగూడ మనతో వుంటుందనీ భావిస్తాం. కాని ఈ రెండుభావాలు ప్రాచీనకాలంలో పవిత్రాత్మకు వర్తించేవి. ప్రోటస్టెంటులు పవిత్రాత్మకు ఆరోపించే విషయాలు మనం మరియకు ఆరోపిస్తుంటాం.
మరియను పవిత్రపరచింది పరిశుద్ధాత్మ ఆమె గర్భంలో క్రీస్తు శిశువు నెలకొనేలా చేసింది ఆత్మ. ఆత్మ అనుగ్రహంవల్లనే ఆమె దేవమాత, వరప్రసాదాలమాత ఐంది. మరియపట్ల తప్పకుండా భక్తి చూపవలసిందే. కాని ఈ భక్తి మనం ఆత్మను మరచిపోయేలా చేయకూడదు. ఆత్మకు బదులుగా మరియమాతవుంది చాలులే అనిపించేలా చేయకూడదు.
ప్రార్థనా భావాలు
l. ఇల్డెఫోన్సుస్ అనే భక్తుడు మరియమాత నుద్దేశించి ఈలా ప్రార్ధించాడు. "అమ్మా! నీవు పవిత్రాత్మ ద్వారా క్రీస్తుని నీ గర్భంలో ధరించావు. ఆ యాత్మ ద్వారా నేనుకూడ క్రీస్తుని నా హృదయంలో ధరించేలా చేయి. ఆత్మద్వారా నీవు క్రీస్తుని ప్రేమించావు. ఆరాధించావు. ఆ యాత్మద్వారానే నేనుకూడ క్రీస్తుని ఆరాధించి ప్రేమించేలా చేయి. ఆత్మఆనాడు నీయందు నిర్వహించిన పవిత్రకార్యాలను నేడు మాయందును కొనసాగించుగాక.”
34. మన బాధ్యతలు
1. ఆత్మపట్ల మన బాధ్యతలు ఏలా వుండాలి? పౌలు పవిత్రాత్మను విచారంలో ముంచకండి అన్నాడు — ఎఫే 4,30. మనం పాపం చేసినపుడెల్లా ఆ యాత్మను దుఃఖపెడతాం. కనుక భక్తుడు పాపానికి దూరంగా వుండాలి. ఒకవేళ పాపంలోపడితే వెంటనే పశ్చాత్తాపపడి హృదయశుద్ధిని పొందాలి. ఇంకా, పౌలు ఆత్మను ఆర్పివేయకండి అన్నాడు – 1తెస్స 5,19. మనం చాలసార్లు ఆత్మప్రబోధం వినం. ఆత్మకు ద్రోహంగా పాపంచేస్తాం. అలాంటప్పుడు మన హృదయంలో వెలిగే ఆత్మను దీపాన్నిలాగ ఆర్పివేస్తాం. ఇంకా, సైఫను యూదులతో వాదిస్తూ పవిత్రాత్మను ఎదిరించవద్దని చెప్పాడు – అచ 7,51. ఆత్మ కలిగించే మంచి ఆలోచనలను బుద్ధిపూర్వకంగా తిరస్కరించి పాడుపనులు చేసినపుడెల్లా ఆత్మను ఎదిరిస్తుంటాం.
2. ఆత్మచేసే ప్రధానకార్యం, క్రీస్తుని మన చెంతకు తీసికొనిరావడం, మనలను క్రీస్తు చెంతకు తీసికొనిపోవడం, ఆ ప్రభువుపట్ల మనకు విశ్వాసం పుట్టించడం. ఆత్మ అనుగ్రహించందే యెవడుకూడ యేసే ప్రభువుని చెప్పలేడు -1కొ 12,3. అనగా ఆత్మ అనుగ్రహించందే ఎవడుకూడ యేసే దేవుడని విశ్వసించలేడు. కనుక ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించి నిండుహృదయంతో ప్రేమించే భాగ్యాన్ని దయచేయమని ఆత్మను అడుగుకొందాం.
ప్రార్ధనా భావాలు
1. యెరూషలేం సిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. "పవిత్రాత్మ దయ్యాలుకూడ ఆత్మలే. కాని ఈ రెండురకాల ఆత్మలూ మనమీద పనిచేసే తీరుమాత్రం భిన్నంగా వుంటుంది. తోడేలు గొర్రెమీదికిలాగ పిశాచం నరుని మీదికి దూకుతుంది. నరుని పీడించి బాధించి నాశంజేస్తుంది. దయ్యం నరునికి సహజశత్రువు కనుక అది అతనిపట్ల బహుక్రూరంగా ప్రవర్తిస్తుంది. దీనికి భిన్నంగా పవిత్రాత్ముడు చాల మృదువుగా నరునిమీదికి దిగివస్తాడు. ఆ యాత్మ రాకముందే మన హృదయంలో ఓ విధమైన వెలుగూ జ్ఞానమూ జనిస్తాయి. పవిత్రాత్ముడు దయాపూర్వకంగా మన మీదికి దిగివస్తాడు. అతడు వచ్చేది మనలను కాపాడ్డానికి, బలపరచడానికి, హెచ్చరించడానికి, మనకు బోధ చేయడానికి, వెలుగును దయచేయడానికి చీకటిలో వున్నవాడు సూర్యకాంతిని చూడగానే ఉత్తేజం పొందుతాడు. చీకటిలో వున్నవుడు కన్పించని వస్తువులను చూస్తాడు, అలాగే ఆత్మను పొందినవాడుకూడ మనసులో ఉత్తేజాన్ని పొంది సామాన్య జనులు చూడలేని వస్తువులను చూస్తాడు. నరులకు తెలియని రహస్యాలను గ్రహిస్తాడు. అతనిదేహం భూమిమీదనే వున్నా ఆత్మమాత్రం మోక్షంలో వుంటుంది."
2. నాసియాన్సన్ గ్రెగోరి భక్తుడు ఈలా చెప్పాడు. మొదట పవిత్రాత్మ దేవదూతల్లో పనిచేసి వారికి తేజస్సునీ పాపం చేయకుండా వుండేశక్తినీ ప్రసాదించింది. తరువాత పితరుల్లో పనిచేసి వారికి దేవుణ్ణి తెలిసికొనే శక్తిని దయచేసింది. ఆ పిమ్మట ప్రవక్తల్లో పనిచేసి వారికి మెస్సీయాను గూర్చిన భవిష్యత్ జ్ఞానాన్ని ఇచ్చింది. అటుపిమ్మట అపోస్తలుల్లోకి ప్రవేశించి వారికి మూడువిధాలుగా ఉపయోగపడింది. మొదటిది, క్రీస్తు ఉత్దానానికి ముందు వాళ్ళకు అద్భుతాలు చేసే శక్తి నిచ్చింది. ఈ దశలో వాళ్ళ ఆత్మను సరిగా గుర్తించలేదు. రెండవది, క్రీస్తు ఉత్దానానంతరం వారిపై శ్వాసగా వేంచేసివచ్చింది. ఈ దశలో వాళ్లు ఆత్మను ఒక పాటిగా గుర్తించారు. మూడవది, క్రీస్తు మోక్షారోహణానంతరం పెంతెకోస్తు దినాన వారిమీదికి దిగివచ్చింది. ఈ దశలో ఆత్మ ఒక వ్యక్తిగా వారిలో వుండిపోయింది, ఈ దశలో అపోస్తలులు ఆత్మను స్పష్టంగా గుర్తించారు."
3. పై గ్రెగోరీ భక్తుడే ఇంకా యిలా చెప్పాడు. ఆత్మ మనకు నూత్న జన్మనిస్తుంది. మనలోని చీకట్లను తొలగించి మనకు వెలుగును ప్రసాదిస్తుంది. ఆత్మడు మహాజ్ఞాని, మహా ప్రేమమూర్తి, అతడు పూర్వం ఒక కాపరిలో ప్రవేశించి అతన్ని రాజనీ, కీర్తనకారుడ్డీ చేసాడు. అత్తిచెట్లను పెంచే మరో కాపరిలో ప్రవేశించి అతన్ని ప్రవక్తను చేసాడు. ఒక బాలునిలో ప్రవేశించి అతన్ని న్యాయమూర్తిని చేసాడు. బెస్తల్లో ప్రవేశించి వారిచే క్రీస్తనే వలలో నరులను చేపల్లా పట్టించాడు. దైవరాజ్యాసక్తిగల వేదహింసకునిలో ప్రవేశించి అతన్ని పౌలునిగా మార్చివేసాడు. నేడు ఆ యాత్మడ్డి మనంకూడ అనుభవానికి తెచ్చుకొందుముగాక."
85. కొన్ని ప్రార్థనలు
1. పరమపితా! నీ యాత్మను మా హృదయాల్లోకి పంపు. అతడు ప్రేరేపించి వ్రాయించిన బైబులు గ్రంథాన్ని మేము అర్థంచేసికొనేలా చేయి. ఆ గ్రంథానికి మేము వివరణం చెప్పేపుడు నీయాత్మ వద్దేశించిన భావాలను మాత్రమే తెలియజేప్పేలా అనుగ్రహించు. మా బోధలు వినే ప్రజలందరు సత్ఫలితాన్ని పొందేలా దయచేయి - సెరాపియన్ భక్తుడు.
2. బాధితులకు ఓదార్పునొసగే ఆత్మమా! వేంచేయి. మా దుష్టచేష్టలను సవరించి మా గాయాలను మాన్పే దైవవ్యక్తి దిగిరా. గర్వితులను అణచివేసి వినయాత్మలను ప్రోత్సహించే దివ్యశక్తి! దిగిరా. బలహీనులకు బలమును, పడిపోయినవారిని లేవనెత్తేవాడివినైన ఆత్మమా! విచ్చేయి. అనాథులకు తండ్రివి, పేదలకు ఆశామూర్తివి, నావికులకు నక్షత్రానివి, ఓడ మునిగినవారికి రేవువువైన మూడవవ్యక్తి వేంచేయి. ఆత్మలలో అతి పవిత్రుడవైన తండ్రీ! నామీదికి వేంచేసి నన్నుకరుణించు. నన్నుగూడ నీలాంటివాణ్ణిగా తయారుచేయి - ఫేకాంప్. 3. దివ్యజ్యోతీ వేంచేయి. నిత్యజీవమూ దిగిరా. దాగియున్న దైవరహస్యమా విచ్చేయి. పేరులేని నిధీ రా, అనిర్వచనీయమైన భాగ్యమా దయచేయి. నరులు ఊహింపలేని దివ్యవ్యక్తీ దిగిరా. అనంతానందమా వేంచేయి. ఆరిపోని వెలుగా వేంచేయి. రక్షణం పొందేవారి ఆశా విచ్చేయి. నిద్రించేవారిని లేపే దివ్యశక్తి దిగిరా. చనిపోయినవారికి ఉత్థానమా రా. నీవు సోకినవారినెల్ల మార్చివేసే మహాశక్తి దిగిరా. సృష్టికర్తా దిగిరా. మేము చూడలేని, తాకలేని, గ్రహింపలేని శక్తి దయచేయి. నీవు కదలకుండానే మమ్ము కదిలించే శక్తి రా. స్వర్గంనుండి దిగివచ్చి చీకటిలోవున్న మమ్మదర్శించే ప్రభువా విచ్చేయి. అందరు ప్రీతితో ఉచ్చరించే దివ్యనామమా దిగిరా, శాశ్వతానందమా, నాశంగాని కిరీటమా దయచేయి. మారాజైన దేవుడు ధరించే నీలలోహిత వస్త్రమా విచ్చేయి. రత్నాలు పొదిగిన స్పటికపు వడ్డాణమా దిగిరా. గంధపు పరిమళమా విచ్చేయి. దేవుని కుడిపార్న్వాన ఆసీనుడవైయున్న ప్రభువా దిగిరా, నా నికృష్ణపు ఆత్మ సదా ఆశించే దేవా రా, వంటరిగా వుండేవాళ్ళకు ఉపశమనమా విచ్చేయి. హృదయంలోని కోరికవై నేను నిరంతరం కోరుకొనే భాగ్యమూర్తీ దయచేయి. నా వూపిరీ జీవమూ ఐన ప్రభూ వేంచేయి. నా ఆత్మకు శాంతి ఆనందమూ కిరీటమూ మహిమా ఐన ప్రభూ విచ్చేయి - నూత్న వేదాంతి సిమియోను,
ప్రశ్నలు
1. దేవుని ఆత్మ
1. ఆత్మ నామాలనూ, సంకేతాలనూ తెలియజేయండి.
2. పూర్వవేదంలో ఆత్మ దేవుని క్రియాశక్తిగా మాత్రమే కన్పిస్తుంది. నూత్నవేదంలో
అతడు ఓ వ్యక్తిగా కన్పిస్తాడు - వివరించండి.
3 .ఆత్మ యేలా దేవుని క్రియాశక్తి ఔతుందో వివరించండి.
4. ఆత్మడు పవిత్రాత్ముడు ఎలా అయ్యాడు?
5.ఆత్మ మనకు ప్రేమశక్తిని ఏలా దయచేస్తుంది?
6. ఆత్మ మనకు జీవాన్ని ఏలా అందిస్తుంది? నీరు ఆత్మకు ఎందుకు చిహ్నమైంది?
7.పూర్వనూత్నవేదాల్లోని రక్షణచరిత్రను నడిపించేది ఆత్మేనని నిరూపించండి.
8.ఆత్మ కడపటిదినాల్లో దేవుడు మనకిచ్చే దానమని నిరూపించండి.
2. క్రీస్తుని ఆత్మ
9.క్రీస్తుకీ ఆత్మకూ గల సంబంధాన్ని తెలియజేయండి
10.దేవుడు మూడు దశల్లో తన్ను గూర్చి తాను మనకు తెలియజేసికొన్నాడు – వివరించండి.
66 2.
11. క్రీస్తు ఆత్మతో నిండినవాడని నిరూపించండి.
12. ఉత్తానక్రీస్తు మనకు ఆత్మను ఏలా యిస్తాడు?
13. ఆత్మ క్రీస్తుకి ఏలా సాక్ష్యం పలుకుతుంది?
14. ఆత్మ మరియను ఏలా నడిపించింది?
౩. తిరుసభలో ఆత్మ
15. క్రీస్తుతోపాటు ఆత్మడుకూడ తిరుసభను స్థాపించాడు - వివరించండి. 16. ఆత్మ మనలను క్రీస్తుతో ఏలా ఐక్యం చేస్తుంది? 17. దివ్యవ్యక్తి మనలో దేవుని పోలికను ఏలా కలిగిస్తాడు? 18. ఆత్మ మనకు దైవపుత్రత్వాన్ని ఒసగే తీరును తెలియజేయండి. 19 ఆత్మ మనలను ప్రేషిత సేవకు ఏలా పరికొల్పుతుంది? 20 ఆత్మ మనచే ఏలా ప్రవచనం చెప్పిస్తుంది? 21. ఏ మూడు దేవద్రవ్యానుమానాలైనా తీసికొని ఆత్మ వాటిల్లో పనిచేసే తీరును
వివరించండి.
22. మన నైతిక జీవితానికి కర్త ఆత్మే - వివరించండి. 23. ఆత్మద్వారా మనం శారీరక వాంఛలను ఏలా జయిస్తాం? 24. దైవవ్యక్తి మనకు పాపపరిహారాన్ని ఏలా దయచేస్తాడు? 25. ఆత్మ మనచే ఏలా ప్రార్ధన చేయిస్తుంది? 26. ఆత్మ మనకు ప్రేమ, విశ్వాసం, నిరీక్షణం అనే దైవపుణ్యాలను ఏలా దయచేస్తుంది? 27. వేదవాక్యాన్ని అర్థంచేసికొనే శక్తిని ఆత్మ మనకు ఏలా దయచేస్తుంది? 28. ఆత్మ మనకు దయచేసే సప్త వరాలనూ సేవా వరాలనూ వివరించండి. 29. ఆత్మ ఫలాల్లో ఏ రెండిటినైనా తెలియజేయండి. 30. మన శ్రమల్లో మరణంలో ఆత్మ ఏలా ప్రత్యక్షమై వుంటుందో తెలపండి, 31. ఆత్మకుండే వినయం అంతా యింతా కాదు - వివరించండి. 32. ఆత్మ మనపట్ల ఏలా తల్లిగా మెలుగుతుందో తెలుపండి. 33. సత్రసాదం, పోపుగారు, మరియమాత - ఈ ముగ్గురు మనం పవిత్రాత్మను
విస్మరించేలా చేయకూడదు - వివరించండి.
34. ఆత్మపట్ల మన బాధ్యతలు ఏమిటివి? 67