బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు/బైబులు పోటీలు
4. బైబులు పోటీలు
మనవిమూట
ఈ గ్రంథంలో బైబులు పోటీలు (క్విసులు) 49 పొందుపరచాం. ఈ పుస్తకం విశేషంగా విద్యార్థులకు ఉద్దేశింపబడింది. బైబులు ෆිසීඟ కుతూహలాన్ని పట్టించి బైబులు నేర్చుకుందామనే కోరికను పెంచుతాయి. కనుక హైస్కూలు, కాలేజి విద్యార్థులకు పవిత్రగ్రంథం మీద ఆసక్తిని పెంచడానికి ఈ పొత్తం చక్కగా ఉపయోగపడుతుంది.
బైబులు క్విసులు నడిపించే ఉపాధ్యాయులు ఆయా విద్యార్థి బృందాల స్థాయికి తగినట్లుగా ఈ గ్రంథంలోని పోటీలను ఎన్నుకోవచ్చు. విద్యార్థులకు ఆయా పోటీల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పేపుడు వాళ్ళచే నేరుగా బైబులునుండే జవాబులు చదివించడం ఉత్తమ పద్ధతి, క్విస్ నడిపించేవాళ్ళు ముందుగా జవాబులనూ వాటి సందర్భాలనూకూడ తెలిసికొని వుండాలి. ఇది నాల్గవ ముద్రణం.
విషయసూచిక
1. ఆదిమ మానవులు 209
2. అబ్రాహాము కథ 209
3. యోసేపు కథ 209
4. మోషే కథ 210
5. దావీదు కథ 210
6. ప్రవక్తలు 211
7. పూర్వవేద రాజులు 211
8. పూర్వవేద స్త్రీలు 212
9. నూత్నవేద స్త్రీలు 212
10. బైబులులోని దుర్మారులు 213
11. బైబులు నగరాలు 213
12. బైబులు కొండలు 214
13. బైబులు జంతువులు 214
14. బైబులు కట్టడాలు 214
15. బైబులు ఆహారాలు 215
16. బైబులు వృత్తులు 215
17.బైబులు బాలలు 18.బైబులు కథలు 19.బైబులు వాగ్లానాలు 20.బైబులు గ్రంథాలు 21.ఆదికాండము 22.నిర్గమ కాండము 23. క్రీస్తుజననము 24.క్రీస్తు మేలు చేసిన వ్యక్తులు 25.క్రీస్తు సామెతలు 26.క్రీస్తు అద్భుతాలు 27.క్రీస్తు శ్రమలు 28.మత్తయి సువిశేష వాక్యాలు -1 29.మత్తయి సువిశేష వాక్యాలు -2 30.మత్తయి సువిశేషము 1-7 31. మత్తయి సువిశేషము 8–17 32.మత్తయి సువిశేషము 18-26 33.మత్తయి సువిశేషము 26-28 34.మార్కు సువిశేషము1-6 35.మార్కు సువిశేషము 7-16 36.లూకా సువిశేషము 37.లూకా సువిశేషము 11-15 38.లూకా సువిశేషము 16-24 39.యోహాను సువిశేషము 1-6 40.యోహాను సువిశేషము 7–12 41.యోహాను సువిశేషము 42.అపోస్తలుల చర్యలు 1–4 43.అపోస్తలుల చర్యలు 5-8 44.అపోస్తలుల చర్యలు 8-9 45.యెరూషలేము క్రైస్తవ సమాజము 46.క్రీస్తు శిష్యులు 47పౌలు వాక్యాలు 48 49పౌలు వాక్యాలు. 208 216 216 217 217 218 218 218 219 220 220 221 221 222 222 223 223 224 224 224 225 226 226 227 227 228 228 228 229 229 230 230 231 231 232
1.మొదటి నరహంత ఎవరు? 2.ఆదాముఏవల మూడవ కుమారు డెవరు? 3. ఇతడు దేవునికి సహచరుడై జీవింపగా దేవుడు ఇతనిని కొనిపోయెను. ఇతడు ఎవరు? 4.జలప్రళయ కాలమున ఓడను కట్టిన నరుడెవరు? 5. ఆదిదంపతులు వసించిన తోట పేరేమి? 6. షీనారులో ఆదిమ మానువులు నిర్మించిన గోపురము పేరేమి? 7. భూమి మరల జలప్రళయము వలన నాశము కాదనుటకు దేవుడు పెట్టిన గురుతు ఏమిటి? 8.బైబులులోని నరులందరిలోను ఎక్కువ కాలము జీవించినవా డెవడు? 9. ఆదిమ మానవులలో గొప్ప వేటగాడుగా ప్రసిద్ధి గాంచినవా డెవడు? 10. మొదటిసారిగా ద్రాక్షలను సాగుచేసిన దెవరు?
1.అబ్రహాము జన్మస్థలము ఏది?
2. అతని తండ్రి పేరేమి?
3. అబ్రాహాము మొదటిభార్య పేరేమి?
4.ఆమెకుగల ఈజిప్టు బానిసపిల్ల పేరేమి?
5.ఆ పిల్లకు అబ్రాహాము వలన పుట్టిన బిడ్డడెవరు?
6. నూరేండ్ల యిూడున వున్నపుడు అబ్రాహామునకు పుట్టిన కుమారు డెవరు?
7. అబ్రాహాము శ్మశానమునకు కొన్న గుహ ఏది?
8.అబ్రాహాము కోడలు పేరేమి?
9.ఆమె యిద్దరు కుమారులు ఎవరు?
10.అబ్రాహాము రెండవ భార్య ತೆಮಿ?
{{center|<poem>
1.యోసేపుకి కడగొట్టు తమ్ముడెవరు? 2. యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించి అతనికి ఏమి కానుక నిచ్చెను? 209
3.సూర్యచంద్రులు పదునొకండు నక్షత్రాలు తనకు దండము పెట్టినట్లుగా యోసేపునకు కల వచ్చినది. ఈ వస్తువులు ఎవరిని సూచించును? 4. సోదరులు యోసేపని యిష్మాయేలీయులకు ఎంతవెల కమ్మిరి? 5. యోసేపుతోపాటు చెరలోవున్న రాజసేవకులు ఇద్దరు ఎవరు? 6. తన కలలకు అర్ధము చెప్పినందుకు ఫరో యోసేపుకి ఏమి పదవి నిచ్చెను? 7. యోసేపు భార్య పేరేమి? 8.అతని యిద్దరు కుమారుల పేరులేమి? 9. గృహనిర్వాహకుడు యోసేపు గిన్నెను ఎవరి గోతములో దాచెను? 10. యాకోబు ఆతని కుమారులు ఈజిప్టులోని ఏ మండలమున వసించిరి?
}{{center|
1.నైలు నదిలో మోషే శిశువును చూచిన దెవరు? 2.మోషే ఈజిప్టునుండి ఎందుకు పారిపోయెను? 3.మోషే భార్య పేరేమి? 4.అతని మామ పేరేమి? 5. దేవుడు మోషేను చెప్పలు విడువమనినపుడు అతడు దేనివైపు చూచుచుండెను? 6. దేవుడు ఈజిప్టమీదికి ఎన్నియరిష్టములు పంపెను? 7. దేవుడు యిస్రాయేలీయులను ఏయే స్తంభముల రూపమున నడిపించుకొని పోయను? 8.సీనాయి కొండమీద మోషే దేవునినుండి ఏమి స్వీకరించెను? 9.ఈజిప్టునుండి వెడలి వచ్చినందుకు జ్ఞాపకార్ధముగా మోషే నెలకొల్పిన పండుగ ఏది? 10.అతడు ఏ కొండపై చనిపోయెను?
1.దావీదు తండ్రి పేరేమి? 2.అతడు జన్మించిన నగరమేది? 3. బేత్ల్లెహేము నగరమున అతనిని రాజుగా అభిషేకించి ప్రవక్త ఎవరు? 4.అతడు ఫిలిస్ట్రీయ వీరుని దేనితో కొట్టి చంపెను? 5. అతనికి ప్రాణస్నేహితుడు ఎవరు? 6. దావీదు దాగుకొనిన గుహ పేరేమి?
210 7.దావీదు ఒక సైనికుని మోసముతో చంపించి ఆతని భార్యను తన భార్యను చేసికొనెను. ఆమె పేరేమి?
8.ఈ పాపమునకుగాను దావీదుని చీవాట్ల పెట్టిన ప్రవక్త ఎవరు?
9.తండ్రియైన దావీదుపై తిరగబడిన కుమారుడెవరు?
10.దావీదు తర్వాత అతని కుమారులలో ఎవరు రాజయ్యెను?
6. ప్రవక్తలు
1.రెండవ దేవాలయ నిర్మాణమును ప్రోత్సహించిన ప్రవక్త ఎవరు?
2.సింహముల గుంటలోనికి తోయబడిన దీర్ఘదర్శి ఎవరు?
3.ఎండిన యెముకలు జీవముతో లేచునట్లుగా ప్రవచనము చెప్పిన ప్రవక్త యెవరు?
4.నాల్గువందలమంది ప్రవక్తలు అసత్యము చెప్పచుండగా తానుమాత్రము సత్యమునే చెప్పిన ప్రవక్త యెవరు
5.తెకోవ నగరపు గొర్రెల కాపరి ప్రవక్త అయ్యాడు. అతని పేరేమి?
6.ప్రభువు ఇతనితో స్నేహితుడు స్నేహితునితోవలె మాట్లాడాడు. ఇతడు ఎవరు?
7.ప్రభువు పిలువగా నేనున్నానుకదా నన్ను పంపుడు అని పల్కిన దీర్ఘదర్శి ఎవరు?
8.ఈ ప్రవక్త భార్య పేరు గోమెరు. ఇతని పేరేమి?
9.పూడిక బావిలోనికి త్రోయబడిన దీర్ఘదర్శి ఎవరు?
10.పౌలు నడికట్టుతో తన కాలు సేతులను బంధించుకొనిన ప్రవక్త ఎవరు?
7. పూర్వవేద రాజులు
1.అబ్రాహాముని కలసికొని అతనిని దీవించిన షాలేము రాజు ఎవరు?
2.యిస్రాయేలీయులకు మొదటి రాజెవరు?
3.యువకుడుగా నున్నపడే దేవునినుండి జ్ఞానమును వరముగా కోరుకొనిన రాజెవరు?
4.సొలోమోను దేవాలయమును కట్టుటకు కలపను సరఫరా చేసిన తూరుదేశపు రాజెవరు?
5.సొలోమోనును సందర్శించుటకు వచ్చినరాణి ఎవరు?
6.ఈరాజు దేవుని ప్రార్ధింపగా అతడు ఇతని ఆయుస్సు 15 సంవత్సరాలు
పొడిగించెను. ఈ రాజు ఎవరు?
7.దైవశిక్ష వలన కుష్టరోగియైన రాజెవరు?
8.యిస్రాయేలు చివరి రాజెవరు?
9.హీబ్రూ బాలురను అగ్నిగుండములో త్రోయించిన రాజెవరు?
10.యూదులను బాబిలోనియా ప్రవాసమునుండి తిరిగి రానిచ్చిన పర్షియా రాజెవరు?
8. పూర్వవేద స్త్రీలు
1.చిన్న కుమారునకు మేలు చేయుటకు భర్తను మోసగించిన స్త్రీ ఎవరు?
2.తన దేశమును విడచిపెట్టి అత్తతోపాటు బేత్లెహేమునకు తిరిగివచ్చిన మోవాబు స్త్రీ ఎవరు?
3.పర్ష్యాదేశమున వష్టికి బదులుగా రాణియైన యిస్రాయేలు మహిళ ఎవరు?
4.మోషే అక్క పేరేమి?
5.కుమారుని షిలో దేవాలయమున కానుకగా సమర్పించిన తల్లి ఎవరు?
6.ఉప్పుస్తంభముగా మారిన స్త్రీ ఎవరు?
7.శత్రుసైన్యాధిపతియైన హోలోఫెర్నెసును చంపిన స్త్రీ ఎవరు?
8.బైబులులో కన్పించు ఏకైక మంత్రగత్తె ఎవరు?
9.కణతలలో మేకును దిగగొట్టి శత్రువును చంపిన వీర వనిత ఎవరు?
10.దేవుని దూషీంపుమని భర్తకు సలహా యిచ్చిన స్త్రీ ఎవరు?
9. నూత్నవేద స్త్రీలు
1.దేవాలయమున బాలయేసును తోడివారికి ఎరుకపరచిన వితంతువు ఎవరు?
2.క్రీస్తు ప్రేమించిన సోదరీమణులు ఎవరు?
3.క్రీస్తు ఎవరివద్దనుండి ఏడు దయ్యములను పారదోలెను?
4.క్రీస్తు జీవముతో లేపిన బాలిక ఎవరు?
5.ఒక మోసగాని భార్యయు స్వయముగా మోసగత్తెయునై పేత్రు శాపము వలన ప్రాణములు కోల్పోయిన స్త్రీ ఎవరు?
6.సుఖారు బావివద్ద క్రీస్తుతో మాట్లాడిన స్త్రీ ఎవరు?
7.చెరనుండి మార్కు ఇంటికివచ్చి తలుపుతట్టిన పేత్రుకి ద్వారము తీసిన సేవకురాలు ఎవరు?
8.ఆ నీతిమంతునిగూర్చి నీవు ఏమియు జోక్యము కలిగించుకోవలదు అని భర్తకు కబురు పంపిన స్త్రీ ఎవరు?
9.స్నాపక యోహాను శిరస్సును పళ్ళెములో పెట్టి ఇప్పింపుడు అని హేరోదు రాజును అడిగిన దెవరు? 10.క్రీస్తు ఈమె చేతిని తాకగానె ఈమె జ్వరముపోయినది. ఈమె ఎవరు?
10. బైబుల్లోని దుర్మార్గులు
1.దూరదేశమునకు బోయి తన ధనమంతయు భోగవిలాసములతో దుర్వినియోగము చేసినదెవరు?
2.క్రీస్తు ఎవరికి నక్క అని పేరు పెట్టెను?
3.పేత్రుని మోసము చేయబోయి అతని శాపమువలన ప్రాణములు కోల్పోయినవాడెవడు?
4.అన్నకు దక్కవలసిన జ్యేష్టభాగమును అపహరించిన తమ్ముడెవరు?
5.బలాఢ్యుడైన భర్త తలవెండ్రుకలను గొరిగించి అతనిని శత్రువుల చేతికి అప్పగించిన స్త్రీ ఎవరు?
6.మొర్దకయిని ఉరితీయించబోయి తానే ఉరికంబము ఎక్కినవాడెవడు?
7.నాబోతును చంపించి అతని ద్రాక్షతోటను స్వాధీనము చేసికొనిన రాజెవరు?
8.కుక్కలు ఈ దుష్టురాలి శవమును పీకుకొని తిన్నవి. ఈమె ఎవరు?
9.ఒకజాతి అంతయు నాశమగుటకంటె ఒక వ్యక్తి ఆ జాతికొరకు మరణించుట శ్రేయస్కరమని సలహా యిచ్చిన దెవరు?
10.ఎఫెసు పట్టణమున పౌలుపై గలాటా లేవదీసిన కమసాలి ఎవరు?
11. బైబులు నగరాలు
ఈ క్రింది నగరాల పేర్లను పేర్కొనుడు.
1. ఈ నగరమున క్రీస్తుని పర్వతముమీదినుండి క్రిందికి త్రోయబోయిరి.
2. ఈ నగరములో "తెలియని దేవునికి” గూడ ఒక బలిపీఠ ముండెడిది.
3. అబ్రాహాము ఈ రెండు పట్టణాల కొరకు విజ్ఞాపన చేసెను.
4. దావీదు ఈ నగరమును యొబూసీయులనుండి జయించి తన రాజధానిగా చేసికొనెను
5.ఒక ప్రవక్త ఈ నగరము నాశము కావలెనని కోరుకొనెను. కాని దేవుడు దీనిని రక్షించెను
6.ఈ నగరములో క్రీస్తు శిష్యులను మొట్టమొదటిసారిగా "క్రైస్తవులు" అని పిల్చిరి.
7.ఇది పౌలు సొంతవూరు.
8.ఈ నగరమునకు పోవుదారిలో పౌలు పరివర్తనము చెందెను.
9.ఈ గ్రామమున చనిపోయిన విధవ కుమారుని క్రీస్తు జీవముతో లేపెను.
10.క్రీస్తు ఉత్థానముకాగానే ఇద్దరు శిష్యులు యెరూషలేమునుండి ఈ గ్రామమునకు పయనమైపోయిరి
12. బైబులు కొండలు
ఈ క్రింది కొండలపేర్లు తెలియజేయుడు.
1.మోషే మండుచున్న పొదనుచూచిన పర్వతము.
2.అతడు చనిపోయిన కొండ.
3.ఏలీయా ప్రార్ధింపగా అగ్ని దిగివచ్చిన కొండ.
4.ఏలీయా దేవుని కలసికొనిన కొండ.
5.సమరయులు తమ దేవాలయమును నిర్మించుకొనిన కొండ.
6.నోవా వోడ నిల్చిన కొండ.
7.అబ్రాహాము ఈసాకుని బలిగా సమర్పింపబోయిన కొండ.
8.క్రీస్తు దివ్యరూపము తాల్చిన కొండ.
9.క్రీస్తుని సిలువవేసిన కొండ.
10.అతడు మోక్షారోహణము చేసిన కొండ.
13. బైబులు జంతువులు
ఈ క్రింది జంతువులు ఏవో తెలియజేయుడు,
1.ఈ జంతువు పేరు క్రీస్తు బిరుదములలో ఒకటి.
2.ఇది తన కొమ్మల వలన పొదలో చిక్కుకొనెను,
3.దీని కడుపులో ఒక ప్రవక్త మూడునాళ్లుండెను.
4.ఇది తనపైనెక్కి ప్రయాణము చేయువారితో మాటలాడెను.
5.ఇది ఒక బలాఢ్యుని మీదికి దూకగా అతడు దానిని పట్టుకొని గొర్రెపిల్లనువలె చీల్చివేసెను.
6.ఫరో చక్రవర్తి ఈ జంతువులను పదునాల్డింటిని కలలో చూచెను.
7.ఈ జంతువు యిస్రయేలీయుల పాపములను ఎడారిలోనికి మోసికొని పోయెను.
8.రిబ్కా ఈ జంతువుపైనెక్కి ఈసాకు నింటికి వచ్చెను
9.ఈ జంతువు ఒక పేదవాని పుండ్లను నాకెను.
10.క్రీస్తు హెరోదురాజును ఈ జంతువుతో పోల్చెను
14. బైబులు కట్టడాలు
ఈ క్రింది కట్టడాలు ఏవో తెలియజేయుడు.
1.కఫర్నాములో రోమను సైన్యాధిపతి యూదుల కొరకు దీనిని కట్టించెను.
2.సొలోమోను మొదటిసారిగా దీనిని కట్టించెను.
3.మరియు యోసేపు బాలయేసులకు దీనిలో తావు లభింపలేదు.
4.సిలోయములో ఇది కూలినపుడు 18 మంది మరణించిరి.
5.అవివేకియైన ధనికుడు వీనిని పడగొట్టించి ఇంకను పెద్దవిగా కట్టింపగోరెను.
6.ప్రభువు నజరెత్తూరు వెళ్ళినపుడు ఈ భవనములో వేద గ్రంథము చదివి బోధచేసెను.
7.దీనిని కట్టింపగోరువాడు ముందుగా దీనికగు వ్యయమును గూర్చి ఆలోచింపవలెను.
8.ప్రభువు మత్తయిని ఇచటినుండి పిలిచెను.
9.బుద్ధిహీనుడు దీనిని ఇసుక పునాదిమీద నిర్మించెను.
10.క్రీస్తు పరిసయులను ఈ కట్టడములతో పోల్చెను.
15. బైబులు ఆహారాలు
ఈ క్రింది ఆహారములు ఏవో తెలియజేయుడు.
1.ఉత్థాన క్రీస్తు శిష్యులయెదుట ఈ యాహారమును భుజించెను.
2.బలాఢ్యుడైన నరుడొకడు చనిపోయిన సింహము కళేబరమునందు ఈ యూహారమును కనుగొనెను. 3.ప్రతిదినము కాకులు ఏలియాకు ఈ యాహారమును కొనివచ్చెడివి.
4.ఫరో వంటవాడు తాను వీనిని గంపలో మోసికొని పోవుచున్నట్లు కలగనెను.
5.అబ్రాహాము తన్ను దర్శింప వచ్చిన దేవదూతలకు ఈ పానీయము నిచ్చెను.
6.ఏపావు ఈ యాహారము కొరకు తన జ్యేష్టభాగమును యాకోబునకు అమ్మివేసెను?
7.దీని మాంసమును వేటాడి తెచ్చుటకు ఈసాకు ఏసావును అడవికి పంపెను.
8.కనాను దేశమును వేగుజూడ బోయినవారు ఈ పండ్ల గుత్తిని కర్ర మీద మోసికొనివచ్చిరి.
9.దేవుడు యిప్రాయేలీయులకు ఎడారిలో ఈ పక్షులను ఆహారముగా నొసగెను.
10.యిస్రాయేలీయులు ఐగుప్తునుండి బయలు దేరకముందు దీని మాంసమును భుజించిరి.
16. బైబులు వృత్తులు
1.జల ప్రళయానంతరము నోవా చేపట్టిన వృత్తి ఏది?
2.ఏసావు చేపట్టిన వృత్తి ఏది?
3.యోసేపు సోదరుల వృత్తి యేది?
4.ఫరోరాజు యిప్రాయేలీయులచే ఏమిపని చేయించెను?
5.పేత్రు అంద్రెయ యాకోబు యోహానుల వృత్తి ఏది?
6.క్రీస్తు వస్త్రముల కొరకు చీట్లువేసినవారి వృత్తి యేది?
7.యొప్పాలో పేత్రును అతిథిగా స్వీకరించిన సీమోను వృత్తి యేది?
8.క్రీస్తును చూచుటకు చెట్టుపై కెక్కిన జక్కయ వృత్తి యేది?
9.క్రీస్తు బోధల ప్రకారము ఆరోగ్యవంతులకు అక్కర లేనివాడెవడు?
10.పౌలు ఏ వృత్తిచే జీవించెను?
17. బైబులు బాలలు
ఈ క్రింది బాలలెవరో తెలుపడు
1.ఇతని తల్లి ఇతనిని ఎడారిలో ఒక పొద క్రింద పరుండబెట్టెను.
2.ఇతడు బాలుడుగా నున్నపుడే కలలు కనెను.
3.సోదరులందరిలో కడగొట్టవాడైన ఇతడు పుట్టినపుడు ఇతని తల్లి చనిపోయెను.
4.రాజకుమారి ఇతని తల్లినే ఇతనికి దాదిగా నియమించెను.
5.దేవళములో పెరుగుచున్న ఇతనికి ఇతని తల్లి ప్రతియేడు క్రొత్త అంగీని కుట్టుకొని వచ్చెడిది.
6.ఏడ్గురు అన్నలున్నను ఈ కడగొట్టవాడు రాజయ్యెను
7.ఎలీషా ప్రవక్త కుష్ట నయముచేయునని ఈమె నామానునకు తెలియజేసెను.
8.ఇతడు జన్మించువరకు ఇతని తండ్రి మూగవాడుగా నుండెను.
9.పండ్రెండేడ్ల యిూడున తలిదండ్రులతో యెరూషలేము వెళ్ళిన బాలుడు.
10.క్రీస్తు జీవముతో లేపిన బాలిక.
18. బైబులు కథలు
ఈ క్రింది మాటల వలన బైబులులోని ఏ వ్యక్తులు మీకు జ్ఞప్తికి వచ్చెదరో తెలుపడు.
1.జీవవృక్ష ఫలము
2.ఇంద్రధనుస్సు
3.సింహముల గుంట
4.మండుచున్న పొద
5.చేపకడుపులో మూడునాళ్ళు
6.అగ్ని రథము నెక్ముట
7.ఒడిసెల రాతిదెబ్బ
8.కొండమీద పొట్టేలును బలియిచ్చుట
9.కోడిక్షూత
10.మేడిచెట్టు నెక్కట
19.బైబులు వాగ్దానాలు
ఈ క్రింది వాగ్దానములను ఎవరు ఎవరికి చేసిరి?
1.నేను నిన్నొక మహాజాతినిగా తయారుచేయుదును.
2.ప్రభువును నమ్మినవారు పక్షిరాజువలె రెక్కలు చాచి పైకెగురుదురు.
3.నన్ను ప్రేమించువారిని దీర్ఘయువుతో సంతృప్తి పరచెదను.
4.నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగును.
5.నేను నీకు వివేకము విజ్ఞానము ప్రసాదింతును.
6.యెరూషలేము వీధులు మరల ఆటలాడుకొను బాలబాలికలతో నిండియుండును.
7.నేను లోకాంతము వరకు మీతో నుందును.
8.నీవ రాయివి. ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను.
9.ఎక్కడ యిద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేనును ఉందును.
10.నేడే నీవు నాతోకూడ పరలోకము ప్రవేశింతువు.
20. బైబులు గ్రంథాలు
1.ఈ పుస్తకము పేరు గణిత శాస్త్రమున వచ్చును.ఇది యేది?
2.లోకసృష్టిని యిస్రాయేలీయుల జన్మవృత్తాంతమును తెలియజేయు పుస్తకమేది?
3.ఒక అందమైన రాణి పేరు కల పొత్తమేది?
4.ఒక రాజు ప్రేమగీతాల గ్రంథమేది?
5.అంత్యదినాలలో ఆత్మ ఎల్లరిమీదికి దిగివచ్చునని చెప్పెడు గ్రంథమేది?
6.చేప మింగీవేసిన కథానాయకుడుగల గ్రంథమేది?
7.యిస్రాయేలీయుల పాటల పుస్తకమేది?
8.మోవాబు పుణ్యస్త్రీ కథను వర్ణించు గ్రంథ మేది?
9.తియొఫిలుకు అంకితమీయబడిన సువిశేషమేది?
10.సుంకరి వ్రాసిన సువిశేషమేది?
21.ఆదికాండము
1.జంతువులకు పక్షులకు మొదట పేర్లుపెట్టిన దెవరు?
2.జలప్రళయము సమసిపోయినదని నోవా యెట్ల తెలిసికొనెను?
3.నీ సంతతిని యిసుక రేణువులవలె వృద్ధిచేయుదును అని ప్రభువు ఎవరికి మాట యిచ్చెను? 4.దుర్మార్గులతోపాటు నీతిమంతులనుగూడ నాశము చేయుదువా అని దేవుని ప్రార్ధించిన దెవరు?
5.ప్రభువు యాకోబునకు పెట్టిన క్రొత్త పేరేమిటి?
6.పొడుగుచేతులు నిలువుటంగీ కల యువకుడెవరు?
7.బక్కచిక్కిన ఆవులు బలసిన యావులను తిన్నట్లుగా కలగాంచిన దెవరు?
8.ఫరో యోసేపకి పెట్టిన పేరేమిటి?
9.యోసేపు బెన్యామీనుల తల్లి యెవరు?
10.యోసేపు భార్య పేరేమి?
22.నిర్గమ కాండము
1.మోషేశిశువు తల్లి ఇతనిని ఏ నదిలో వదిలిపెట్టెను?
2.మోషేను దత్తుతీసుకొని పెంచిన దెవరు?
3.అతడు "నేను దగ్గరికి వెళ్ళి చూచెదను" అనుకొన్నది దేనిని గూర్చి?
4.ఫరో కట్టకడన యిప్రాయేలీయులను ఈజిప్టునుండి ఎందుకు వెళ్ళిపోనిచ్చెను?
5.యిస్రాయేలీయులు దాటిపోయిన సముద్రము పేరేమి?
6.ఐగుప్తనుండి బయలుదేరకముందు యిస్రాయేలీయులు దేనిని భుజించిరి?
7.మోషే రాతినుండి నీటిని రప్పించిన తావేది?
8.బంగారు దూడను చేసిన దెవరు?
9.మోషేమీద తిరగబడినందులకు శిక్షగా మిర్యాముకు ఏమి వ్యాధి సోకెను?
10.యిస్రాయేలీయులు ఎడారిలో భుజించిన రెండు ఆహారములు ఏవి?
23. క్రీస్తు జననము
1.క్రీస్తు బేత్లెహమున జన్మించునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
2.క్రీస్తు జననకాలమున జనాభా లెక్కలు తయారు చేయించిన రోమను చక్రవర్తి వరు?
3.మరియు తొలిచూలు కుమారుని కని ఎక్కడ పరుండబెట్టెను?
4.క్రీస్తు శిశువుని సందర్శింప వచ్చినవారిలో మొదటివారెవరు?
5.యేసు అను పేరునకు అర్థమేమి?
6.ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో వెళ్ళిపోనిమ్మ అని పల్కిన దెవరు?
7.దేవాలయమున క్రీస్తు శిశువును చూచిన ప్రవక్త్రి ఎవరు?
8.తూర్పుదేశపు జ్ఞానులు ఏ గురుతుచూచి బేల్లెహేమునకు వచ్చిరి?
9.వారు ఆ శిశువునకు సమర్పించిన బహుమతు లేవి?
10.మరియా యోసేపులు బాలయేసుతో ఏ దేశమునకు పారిపోయిరి?
24. క్రీస్తు మేలు చేసిన వ్యక్తులు
1.క్రీస్తు ఈమె చేతిని తాకగానే ఈమె జ్వరము పోయెను. ఈమె ఎవరు?
2.మీరు తమ పడవ సముద్రములో మునిగిపోవునని భయపడిరి. కాని క్రీస్తు వీరిని రక్షించెను. వీరెవరు? 3.నల్గురు స్నేహితులు ఇతనిని మోసికొనివచ్చి ఇంటి కప్పగుండ క్రీస్తు చెంతకు జారవిడిచిరి. ఇతడు ఎవడు? 4.ఈ రోగపీడితురాలు క్రీస్తు అంగీని తాకినంతనే ఆరోగ్యము పొందినది. ఈమె ఎవరు?
5.సుంకపు మెట్టకడ కూర్చొనియుండగా క్రీస్తు ఇతనిని పిల్చెను. ఇతడు ఎవడు?
6.ఈ గ్రుడ్డివాడు త్రోవప్రక్కన కూర్చుండి భిక్ష మడుగుకొనుచుండగా క్రీస్తు ఇతనికి దృష్టి ప్రసాదించెను. ఇతడు ఎవడు?
7.క్రీస్తును చూచుటకు మేడిచెట్టును ఎక్కినవా డెవడు?
8.ఈమె తల్లి ఈమె తరపున క్రీస్తుకు మనవిచేయగా అతడు ఈమెకు పట్టిన దయ్యమును వెళ్ళగొట్టెను, ఈమె ఎవరు?
9.యేసూ! నీవు నీ రాజ్యములో ప్రవేశించినపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని పల్కిన దెవడు? 10.అవిశ్వాసివికాక విశ్వాసివై యుండుమని క్రీస్తు ఎవరిని మందలించెను?
25.క్రీస్తు సామెతలు
ఈ క్రింది వాక్యములు ఏ సామెతల లోనివి?
1.మీరు పనిపాటలులేక దినమంతయు ఇచట నిలచియున్నారేమి?
2."నా పొరుగువాడెవడు?" అని అడిగిన వేదశాస్త్రి ప్రశ్నకు సమాధానముగా క్రీస్తు చెప్పిన సామెత యేది? 3.ఓరీ అవివేకి! ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అపుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందను? 4.నేను దేవునికి భయపడను, మానవులకు గౌరవింపను.
5.అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరచు కొనుటలేదు – ఏవి?
6.ఇది శత్రువు చేసిన పని - ఏది?
7.రొమ్ము బాదుకొనుచు దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను - ఎవరు?
8.మన మధ్య దాటుటకు వీలులేని అగాధమున్నది - ఎవరెవరికి మధ్య?
9.నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక అనేక విషయములను నీకు అప్పగింతును.
10.హృదయపరివర్తనము అవసరములేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతులకంటె, హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము కలుగును.
26. క్రీస్తు అద్భుతాలు
1.క్రీస్తుని కలసికొనుటకై నీటిమీద నడవబోయిన శిష్యుడెవరు?
2."ఎప్పతా" అనగా నేమి?
3.మిగిలిన తొమ్మిదిమంది యేరీ - ఈ వాక్యము ఏ అద్భుతములోనిది?
4.క్రీస్తు "నా గడియ ఇంకను రాలేదు" అన్నది ఏ యద్భుతమును చేయకముందు?
5.యిస్రాయేలు ప్రజలలోకూడ నేనింతటి విశ్వాసమును చూడలేదు అని క్రీస్తు ఎవరిని గూర్చి పలికెను? 6.ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవి కదా? - ఇది యే యద్భుతములోని వాక్యము? 7.బిడ్డల రొట్టెను కుక్కలకు వేయతగదు అని క్రీస్తు ఎవరితో అనెను?
8.క్రీస్తు శపించిన చెట్టు ఏది?
9.నా వద్ద వెండిబంగారములు లేవు అన్నది యెవరు?
10. దేవుని సహకారము లేనియెడల నీవు చేయుచున్న అద్భుతకార్యములను ఎవడును చేయలేదు అని క్రీస్తుతో అన్నది ఎవరు?
27. క్రీస్తు శ్రమలు
1.క్రీస్తు దేనిపై నెక్కియెరూషలేము ప్రవేశించెను?
2.యేసు కానుకల పెట్టెవద్ద కూర్చుండి ఎవరిని మెచ్చుకొనెను?
3.క్రీస్తు కడపటివిందు భుజించిన పిమ్మట ప్రార్థన చేయుటకు ఎక్కడికి పోయెను?
4.యూదా క్రీస్తుని ఎన్ని వెండికాసులకు పట్టియిచ్చెను?
5.సిలువను మోయుటలో క్రీస్తుకి సాయపడిన నరుడెవరు?
6.క్రీస్తు తన్ను సిలువ వేయువారికొరకు ఏమని ప్రార్థించెను?
7.సిలువపై క్రీస్తు దేనిని త్రాగుటకు నిరాకరించెను?
8.క్రీస్తు సిలువపై ఏమి వ్రాసిపెట్టిరి?
9.క్రీస్తు దేహమును ఇప్పింపుమని పిలాతుని అడిగినదెవరు?
10.యేసు భౌతికదేహమును ఎచట పాతిపెట్టిరి?
28. మత్తయి సువిశేష వాక్యాలు - 1
ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుడు
l.మానవుడు కేవలము రొట్టెవలననే జీవింపడు. దేవుడు వచించు - - - - జీవించును.
2.హృదయ పరివర్తనము చెందుడు - - - - సమీపించియున్నది.
3. మీరు నన్ను అనుసరింపడు. నేను మిమ్ము - - - - చేయుదును.
4.కామేచ్చతో పరస్త్రీని పరికించు ప్రతివ్యక్తి ఆమెతో - - - - వ్యభిచరించినట్లే,
5.నీ సంపదలున్న చోటనే నీ - - - - ఉండును.
6.ఏ నరుడును ఇద్దరు - - - - సేవింపజాలడు. కనుక నీవు ఎన్నడును దైవమును - - - - సేవింపజాలవు.
7.పరులనుగూర్చి మీరు తీర్పు చేయకుడు. అప్పడు మిమ్ముగూర్చియు - - --
8.ఇతరులు మీకేమి చేయవలెనని కోరుకొందురో దానిని మీరు . . . .
9.నా బోధలు ఆలించి పాటించని ప్రతివాడు . . . . ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు.
10. మీ తలవెండ్రుకలన్నియు . . . . కావున భయపడకుడు.
29. మత్తయి సువిశేష వాక్యాలు - 2
ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుడు
1.నీవు పేత్రువు. ఈ రాతి మీద . . . . నిర్మింతును.
2. నన్ను అనుసరింప గోరువాడు . . . . సిలువను తీసికొని నన్ను అనుసరింపవలెను.
3. మానవుడు లోకమంతటిని సంపాదించినను . . . . వానికి ప్రయోజనమేమి?
4.ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాపేరిట . . . .
5. నీ అనుమతి యైనచో నేను నీకు, మోషేకు, ఏలియాకు మూడు . . . .
నిర్మింతును.
6. మీరు చిన్నబిడ్డవలె రూపొందిననే తప్ప . . . . ప్రవేశింప జాలరు.
7. దేవుడు జతపరచిన జంటను . . . . వేరు పరుపరాదు.
8.- - - . నా యొద్దకు రానిండు. అట్టి వారిదే పరలోక రాజ్యము.
9. మానవులకు ఇది అసాధ్యము. కాని దేవునికి సమస్తము . . . .
10.భూమి ఆకాశము గతించి పోవునుగాని . . . . గతించిపోవు.
30. మత్తయి సువిశేషము 1-7
1.ఇమ్మానువేలు అనగానేమి?
2. క్రీస్తు జన్మించినపుడు యూదయా రాజెవరు?
3. క్రీస్తుకి నజరేయుడు అను పేరు ఎట్లు వచ్చెను?
4. అతడు ఎడారిలో ఎంతకాలముండెను?
5. ఎడారిలో పిశాచ శోధనలు ముగిసిన పిదప క్రీస్తుకి ఎవరు సేవలు చేసిరి?
6. క్రీస్తుకి మొదట ఏ యిద్దరు శిష్యులైరి?
7.నీ శత్రువుని ద్వేషింపుము అని పూర్వవేదము బోధించెను. దీనికి బదులుగా క్రీస్తు బోధించిన దేమిటి?
8. క్రీస్తు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మొదటి మాటలు ఏవి?
9. లిల్లీ పుష్పమువలె సుందరములైన వస్త్రములు తాల్చలేని పూర్వవేద రాజు ఎవరు?
10. నరులు ఇద్దరు యజమానులను సేవింపలేరు. ఆ యిద్దరు ఎవరు?
31. మత్తయి సువిశేషము 8 -17
1.నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని యేసుకి మనవి చేసిన దెవరు?
2.యిస్రాయేలు ప్రజలలోను నేను ఇట్టి విశ్వాసము చూడలేదు అని ప్రభువు ఎవరిని గూర్చి పలికెను?
3. భారముచే అలసి సొలసియున్నవారికి ప్రభువు ఏమి దయచేయును?
4.శిష్యులు పంట పొలములో వెన్నులు త్రుంచి తిన్నది ఏ దినమున?
5. విత్తవాని ఉపమానమును చెప్పినపుడు క్రీస్తు ఎక్కడ ఉండెను?
6.దాచబడిన ధనము ఆణిముత్యము అనునవి దేనికి ఉపమానములు?
7. నీటిపై నడచుచు క్రీస్తు దగ్గరికి రాగోరినది ఎవరు?
8.తబోరు కొండపై క్రీస్తుతో మాటలాడిన ఇద్దరు పూర్వవేద భక్తులు ఎవరు?
9.ఆ కొండపై క్రీస్తుతోనున్న ముగ్గురు శిష్యులు ఎవరు?
10. క్రీస్తు పేత్రు ఇద్దరు దేవాలయపు పన్నుచెల్లించుటకు కావలసిన నాణెము వారికి ఎచట దొరికెను?
32. మత్తయి సువిశేషము 18–26
1.క్రీస్తు బోధల ప్రకారము మనము తోడివారిని ఎన్నిసార్లు క్షమింపవలెను?
2. తన యిద్దరు కుమారులకు ఉపకారము చేయమని క్రీస్తుని అడిగిన తల్లి యెవరు?
3. క్రీస్తు బోధల ప్రకారము, ధర్మశాస్త్రములోని రెండు ప్రధానాజ్ఞలు ఏవి?
4. ఇది రాతిపై రాయి నిలువకుండ పడగొట్టబడును అని ప్రభువు దేనినిగూర్చి పలికెను?
5. అవివేకవతులైన కన్నెలు తమ కాగడాలతోపాటు దేనిని తీసికొని పోలేదు?
6. ముగ్గురు సేవకుల సామెతలో మూడవవాడు తాను తీసికొన్న సొమ్మను ఏమి చేసెను?
7. ప్రభువు ఎవరికి చేసినది తనకు చేసినట్లుగా భావించును?
8. "ఈ సువార్త ఎచట బోధించబడునో అచట ఈమె చేసిన కార్యము ప్రశంసింపబడును" — ఆమె చేసిన కార్యము ఏమిటి?
9. క్రీస్తు తన మరణమునకు ముందు శిష్యులతో ఏ పండుగను జరుపగోరెను?
10.గెత్సెమని తోపులో యూదులు క్రీస్తుని బంధించుటకు యూదా ఏమి గురుతు నిచ్చెను?
33. మత్తయి సువిశేషము 26 - 28
1.క్రీస్తుని నిరాకరించుచు "ఆ మనుష్యుని నేను ఎరుగను" అని చెప్పిన దెవరు? 2. కోడికూసిన పిమ్మట పేత్రు వెలుపలికివెళ్ళి ఏమి చేసెను? 3. యూదా దేవళములో విసిరికొట్టిన వెండి నాణెములతో ప్రధానార్చకులు ఏమి చెసిరి? 4.క్రీస్తునకు తీర్పు చెప్పినపుడు పిలాతు చేతులు ఏల కడుగుకొనెను? 5. "ఏలీ ఏలీ లామా సబక్తాని" అనగా నేమి? 6. క్రీస్తు చనిపోవునపుడు మధ్యాహ్నము మూడుగంటల పాటు దేశమంతట ఏమి యసాధారణ దృశ్యము కన్పించెను? 7.క్రీస్తు చనిపోయిన పిమ్మట ఏమి చినిగెను? 8. క్రీస్తునిగూర్చి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పల్కిన దెవరు? 9.యేసు దేహమును ఇప్పింపమని పిలాతుని అడిగిన దెవరు? 10. ఉత్థాన క్రీస్తు శిష్యులకు చేసిన చివరి వాగ్దానమేమిటి?
34. మార్కు సువిశేషము 1 - 6
1.స్నాపక యోహాను ఏమి దుస్తులు ధరించెను? 2.క్రీస్తు యాకోబు యోహానులను పిల్చినపుడు వారు ఏమి చేయుచుండిరి? 3.నల్లురు పడకపై మోసికొనివచ్చిన పక్షవాత రోగిని క్రీస్తు చెంతకు ఎట్లు తీసికొని రాగల్గిరి? 4.క్రీస్తు సూక్తుల ప్రకారము, ప్రాతగుడ్డకు దేనిని మాసిక వేయరు? 5.క్రీస్తు యాకోబు యోహానులకు "బోయనెర్గెస్" అని పేరు పెట్టెను. ఆ మాటలకు అర్థమేమి? 6.గెరాసీను మండలములోని దయ్యములు క్రీస్తు అనుమతిపై వేనిలో ప్రవేశించెను? 7. "తలితా కుమీ" అనగా నేమి? 8. నీవు స్నాపక యోహాను తలను కోరమని ఎవరు ఎవరికి చెప్పిరి? 9. యేసు ఎన్ని రొట్టెలతోను ఎన్నిచేపలతోను ఐదువేల మందికి ఆహారము పెట్టెను? 10. ఆ యాహారమును జనసమూహము దేనిపై కూర్చుండి భుజించెను?
35. మార్కు సువిశేషము 7–16
1.క్రీస్తు శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారని తప్పపట్టిన దెవరు?
2.మనుష్యులు చెట్లవలెనుండి, నడచుచున్నట్లు నాకు కన్పించుచున్నారు అని క్రీస్తుతో చెప్పిన దెవరు?
3. నన్నుగూర్చి మీరేమనుకొనుచున్నారు అని క్రీస్తు శిష్యులను అడుగగా పేత్రు ఏమి జవాబు చెప్పెను?
4.క్రీస్తు "సైతానూ! ఛీ! పో!" అన్నది యెవరిని?
5. క్రీస్తు ఒక వర్గము వారిని తన యొద్దకు రానివ్వమన్నాడు. దైవరాజ్యము వారిదేనన్నాడు. వారు ఎవరు?
6.క్రీస్తు చూపునిచ్చిన యెరికో గ్రుడ్డివాని పేరేమి?
7. పరిసయులు చక్రవర్తికి పన్ను చెల్లించుట న్యాయమా కాదా అని అడిగినపుడు క్రీస్తు చెప్పిన సమాధానమేమి? 8.కడపటి భోజనము ముగిసిన తరువాత క్రీస్తు ఆవేదన చెందుచు ప్రార్థన చేసిన తాను ఏది?
9. “తండ్రీ! ఈ పాత్రమును నానుండి తొలగింపుము" - ఈ వాక్యములో "పాత్రము” అనగానేమి?
10.క్రీస్తు దేహమునుంచిన సమాధి ద్వారమునకు అడ్డముగా ఏమి దొర్లించిరి?
86. లూకా సువిశేషము 1-7
1.లూకా తన సువిశేషమును ఎవరి కొరకు వ్రాసెను?
2.క్రీస్తు జన్మించినపుడు రోమను చక్రవర్తి ఎవరు?
3. మరియు తాను కనిన క్రీస్తు శిశువును ఎచట పరుండ బెట్టెను?
4. క్రీస్తు పండ్రెండేండ్ల యిూడున ఏ పట్టణమును సందర్శించెను?
5. బాలయేసు దేవాలయమున ఎవరికి ప్రశ్నలు వేసెను?
6. స్నాపక యోహాను బోధ ప్రారంభించిన కాలమున రోమను చక్రవర్తి యెవరు?
7.క్రీస్తు విశ్రాంతి దినమున అలవాటు చొప్పన ఎచటికి వెళ్ళెడివాడు?
8. క్రీస్తునకు తన యింట గొప్ప విందు చేసిన శిష్యుడెవరు?
9.కఫర్నాములో రోమను శతాధిపతి యూదులకు ఏమి కట్టించెను?
10. జనులు ఒక యువకుని శవమును పాడె పై మోసికొని వచ్చుచు క్రీస్తుకి ఎదురుపడినది ఏ గ్రామమున?
37. లూకా సువిశేషము 7-11
1.రానున్నవాడవు నీవేనా అని అడుగుటకు క్రీస్తు నొద్దకు మనుష్యులను పంపిన దెవరు?
2.గెరాసీను మండలములోని నరుని ఆవేశించిన భూతము పేరేమి?
3. చనిపోయినపుడు యాయిూరు కొమార్తె వయసెంత?
4.ఆకాశమునుండి అగ్నిని రప్పించి సమరయుల గ్రామమును నాశము చేయగోరిన శిష్యులెవరు?
5. నాగటిమీద చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేనికి అయోగ్యుడు?
6.నీ పేరిట పిశాచములు కూడ మాకు లోపబడుచున్నవి అని క్రీస్తుతో చెప్పిన దెవరు?
7.క్రీస్తు ఎవరిని ఆకాశమునుండి మెరుపవలె పడుచుండగా చూచెను?
8.క్రీస్తు పాదములవద్ద కూర్చుండి అతని బోధలు విన్న భక్తురాలు ఎవరు?
9.శిష్యులు ప్రార్థన నేర్పమని అడుగగా క్రీస్తు వారికి ఏ జపము నేర్పించెను?
10.అర్ధరాత్రిలో వచ్చినవాడు తన మిత్రుని ఎన్నిరొట్టెలు బదులీయమని కోరెను?
38. లూకా సువిశేషము 11-15
1.మంచి సమరయుని కథలో దొంగలకు చిక్కినవాడు ఏ నగరమునుండి ఏ నగరమునకు ప్రయాణము చేయుచుండెను?
2.గాయపడి త్రోవ ప్రక్కన పడియున్న వానిని పట్టించుకొనకుండ వెళ్ళిపోయిన
యిద్దరు ఎవరు?
3.క్రీస్తు బోధల ప్రకారము, నరులు ఏ పక్షులకంటె శ్రేషులు?
4. "అవి విత్తనములు నాటవు. నూర్పిళ్ళ చేయవు. ధాన్యము నిలువజేయవు" - అవి ఏవి?
5. క్రీస్తు ఈమెను తాకగా ఈమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను. ఈమె ఎవరు?
6. క్రీస్తు పరలోక రాజ్యమును ఏ చెట్టుతో పోల్చెను?
7. కోడి తన పిల్లలను వలె నేను నీ బిడ్డలను కాపాడగోరితిని అని క్రీస్తు ఏ పట్టణముతో చెప్పెను?
8.ప్రభువు నూరుగొర్రెల సామెత చెప్పెను. వానిలో తప్పిపోయినవి ఎన్ని?
9.అతడు చెప్పిన ఇంకొక సామెతలో, ఒక స్త్రీ ఒక వస్తువును పోగొట్టుకొని దానికై యింటిలో వెదకెను. ఆ వస్తువు ఏమిటి?
10. "మరణించిన ఈ నా కుమారుడు మరల బ్రతికెను" — ఆ కుమారుడు ఎవరు?
39. లూకా సువిశేషము 16–24
1."కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను" ఎవరి వ్రణములు?
2. వ్యాధి నయమయిన పదిమంది కుష్టరోగులతో తిరిగి వచ్చి ప్రభువుకి వందనములు చెప్పినవాడు ఏ జాతి వాడు? 3.ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవాలయమునకు వెళ్లిరి. ఆ యిద్దరు ఎవరు?
4.తల్లలు పసిబిడ్డలను క్రీస్తు దగ్గరికి తీసికొని రాబోగా ఎవరు అడ్డు వచ్చిరి?
5.క్రీస్తు నీ యాస్తినమ్మి పేదలకు దానము చేయమనగా బాధపడి వెళ్ళి పోయినవా వడు?
6.జక్కయ వృత్తి యేమిటి?
7. యేసు గమనించుచుండిన పేద వితంతువు కానుకల పెట్టెలో ఎంత సౌమ్మ వేసెను?
8.సిలువపైనున్న క్రీస్తుకు సైనికులు ఏమి త్రాగనిచ్చిరి?
9. ఎమ్మావనకు వెళ్ళిన యిద్దరు శిష్యులలో ఒకని పేరేమి?
10. ఉత్తానక్రీస్తు ఏ నగరము సమీపమున మోక్షారోహణము చేసెను?
40. యోహాను సువిశేషము 1-6
1.యోహాను సువిశేషములో మొదటివాక్యమేది?
2. క్రీస్తు పాదరక్షల వారును విప్పటకైనను యోగ్యుడను కానని చెప్పిన దెవరు?
3. క్రీస్తు ఏ శిష్యుని అంజూరపు చెట్టుక్రింద నుండగా చూచెను?
4. మరల జన్మించిననేతప్ప నరుడు దేవుని రాజ్యమును చూడజాలడని క్రీస్తు ఎవరితో చెప్పెను?
5. యాకోబు బావి ఏ పట్టణమవద్ద నున్నది?
6.క్రీస్తు ఒక స్త్రీతో మాటలాడుటనుచూచి ఆశ్చర్యపడిన దెవరు?
7.మొదట తనలోనికి దిగినవాని వ్యాధిని నయము చేయు కోనేరు పేరేమిటి?
8. క్రీస్తు ఎన్ని రొట్టెలు ఎన్నిచేపలు తీసికొని ఐదువేల మందికి ఆహారము పెట్టెను?
9. పితరులు ఎడారిలో దేనిని భుజించిరి?
10."మేము ఎవరియొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు" అని క్రీస్తుతో చెప్పినదెవరు
41. యోహాను సువిశేషము 7–12
1.ఆయనవలె ఎవడును ఎన్నడును మాటాడలేదు అని క్రీస్తుని గూర్చి పల్కిన దెవరు?
2."నేనును నీకు శిక్ష విధింపను. వెళ్లము. ఇక పాపము చేయకుము" అని క్రీస్తు ఎవరితో పలికెను?
3.క్రీస్తు దినమునుచూచి సంతోషించిన పితరుడు ఎవరు?
4.యేసు పుట్టు గ్రుడ్డివానికి చూపు నిచ్చుటకు వాని కన్నులమీద ఏమి రాచెను?
5.తోడేలు వచ్చుట చూచి గొర్రెలమందను విడచి పారిపోవువా డెవడు?
6.మరియా మార్తల యూరు ఏది?
7. "నేను పునరుత్దానమును జీవమును" అని క్రీస్తు ఎవరితో నుడివెను?
8. యేసు ఎవరికొరకు కంట తడిపెట్టెను?
9.యెరూషలేము ప్రవేశించిన క్రీస్తును ప్రజలు ఏమి మట్టలతో ఆహ్వానించిరి?
10. క్రీస్తు భూమినుండి పైకి ఎత్తబడినపుడు యేమి చేయును?
42. యోహాను సువిశేషము 18–21
1.క్రీస్తు నడుమునకు తుందుగుడ్డ కట్టుకొని పళ్ళెములో నీళ్ళుపోసి ఏమి చేసెను?
2.కడపటి విందులో క్రీస్తునుండి రొట్టెముక్కను స్వీకరించినంతనే యూదా లోనికి ఎవరు ప్రవేశించిరి?
3.మాకు తండ్రిని చూపింపుము అని క్రీస్తుని అడిగిన దెవరు?
4. "నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపదును". ఎవరిని పంపును?
5.క్రీస్తుకు చెందిన ఏ వస్తువు కొరకు సైనికులు అదృష్టపు చీట్లు వేసికొనిరి?
6. సైనికుడు క్రీస్తు ప్రక్కను బల్లెముతో పొడువగా ఏమి స్రవించెను?
7. క్రీస్తు ఉత్దానాంతరము మొదట ఖాళీ సమాధిలోనికి ప్రవేశించిన దెవరు?
8.ఉత్థాన క్రీస్తునిచూచి తోటమాలియని భ్రమపడిన దెవరు?
9. చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని క్రీస్తు ఎవరితో చెప్పెను?
10. ఉత్థానానంతరము క్రీస్తు పేత్రుని మూడుసార్లు అడిగిన ప్రశ్నయేది?
43. అపోస్తలుల చర్యలు 1–4
1.ఉత్థాన కీస్తు ఎన్నాళ్ళపాటు శిష్యులకు కనిపించుచు వచ్చెను?
2.శిష్యులు ఎవరినుండి జ్ఞానస్నానము పొందుదురు?
3.క్రీస్తు పరలోకమునకు కొనిపోబడినపుడు అతనిని ఏమి కమ్మివేసెను?
4. క్రీస్తు మోక్షారోహణము చేసిన పిదప శిష్యుల సంఖ్య ఎంత?
5. మత్తీయతోపాటు అపోస్తలుల పదవికి పోటీ చేసిన దెవరు?
6.ఏ పండుగ దినమున ఆత్మ అపోస్తలుల మీదికి దిగి వచ్చెను?
7.అంత్యదినములలో నరులందరిమీద నా యాత్మను కుమ్మరించెదనని ప్రవచించిన పూర్వవేద ప్రవక్తయోవరు? 8.దేవాలయములోని ఏ ద్వారమవద్ద పేత్రు కుంటివానికి నడచెడు శక్తినిచ్చెను?
9.విచారణ సభ పెట్టెడి కష్టములలో అపోస్తలులు ధైర్యము కొరకు ప్రార్ధింపగా, వారున్న స్థలమునకు ఏమి జరిగెను?
10.బర్నబా అను పేరునకు అర్థమేమి?
44. అపోస్తలుల చర్యలు 5-8
1.అననీయా సఫీరాల నేరమేమిటి?
2.ప్రధానార్చకులు చెరలో పెట్టించిన అపోస్తలులను ఎవరు విడిపించిరి?
3. అపోస్తలులను చెరనుండి వదిలివేయుడని సలహా యిచ్చిన ధర్మశాస్త్ర బోధకుడు ఎవరు?
4.విచారణ సభవారు కొరడాలతో కొట్టింపగా అపోస్తలులు ఎందుకు సంతసించిరి?
5. యెరూషలేములోని క్రైస్తవులకు సేవలు చేయుటకు ఎందరు పరిచారకులను నియమించిరి?
6.శత్రువులు సైఫనుని న్యాయసభ అధికారుల యెదుటికి తీసికొనిరాగా అతని ముఖము దేనివలె కన్పించెను?
7.సైఫనుని ఏ రీతిగా చంపిరి?
8.సైఫనుని చంపినవారు తమ వస్త్రములను ఎవరివద్ద ఉంచిరి?
9. అతడు చనిపోవుచు శత్రువుల కొరకు ఏమని ప్రార్థించెను?
10. సైఫను మరణానంతరము క్రైస్తవ సంఘము ఏమి విపత్తుల పాలయ్యెను?
45. అపోస్తలుల చర్యలు 8 –9
1.ఫిలిప్ప ఏ నగరమున సువార్తను బోధించి అద్భుతములు చేసెను?
2. నీవు నీ డబ్బుతోపాటు నాశమగుదువుగాక అని పేత్రు ఎవరిని తిట్టెను?
3. ఫిలిప్ప ఏ మార్గమందు యితియోపీయుని కలిసికొనెను?
4. ఇతియోపీయుడు ఏ ప్రవక్త గ్రంథమును చదువుచుండెను?
5.గొర్రెపిల్లవలె వధ్యస్థానమును కొనిపోబడినది ఎవరు?
6.ఏ నగరము సమీపమున ఉత్థాన క్రీస్తు పౌలునకు దర్శనమిచ్చెను?
7.పౌలు డమస్కు పట్టణమున ఏ వీధిలో వసించెను?
8.పౌలునకు జ్ఞానస్నాన మిచ్చినది ఎవరు?
9.పౌలు శిష్యులు పౌలుని డమస్కునుండి ఎట్లు బయటికి పంపిరి?
10.యరుశాలమున పౌలును అపోస్తలులకు పరిచయము చేసినది ఎవరు?
46. యెరూషలేము క్రైస్తవ సమాజము అ.చ. 1-8
1.యూదాకు బదులుగా 12వ అపోస్తలుడుగా ఎన్నికైన శిష్యుడు ఎవరు?
2.ఆత్మ దిగిరాకముందు యెరూషలేమున క్రీస్తు శిష్యులు ఎంతమంది యుండిరి?
3.ఆత్మ దిగివచ్చి పేత్రు ప్రసంగము చేసిన పిదప యెరూషలేమున ఎంతమంది జ్ఞానస్నానము పొందిరి?
4.దేవాలయమున "అందమయినది" అనుద్వారము నొద్ద పేత్రు ఏమి యద్భుతము చేసెను?
5.యూదులు విచారణసభ అపోస్తలులను చంపగోరగా వారిని చంపవలదని సలహా యిచ్చిన పరిసయుడు ఎవరు?
6.మొట్టమొదటి వేదసాక్షిగా మరణించిన దెవరు?
7.సైఫనుని రాళ్ళతో కొట్టినవారు తమ వస్త్రములను ఎవరివద్ద ఉంచిపోయిరి?
8.గాజామార్గమందు ఫిలిప్ప ఎవరికి జ్ఞానస్నానమిచ్చెను?
9.యెరూషలేమన అపోస్తలులు ఉమ్మడి జీవితము గడుపుచుండగా తన ఆస్తినమ్మి, వచ్చిన పైకమును అపోస్తలులకు ఇచ్చిన దెవరు?
10. పేత్రు యెదుట బొంకి ప్రాణములు కోల్పోయిన భార్యాభర్తలు ఎవరు?
47. క్రీస్తు శిష్యులు
ఈ క్రిందివారు ఎవరు?
1. క్రీస్తు ఇతనితో "నీవు రాయివి. ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను" అని చెప్పెను.
2.ఇతడు క్రీస్తుతో "ఇక్కడ ఒక బాలునివద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు, రెండు చేపలు కలవు" అని పల్కెను. 3.పాస్క భోజనమును సిద్ధము చేయుటకు ప్రభువు పేత్రుతోపాటు ఇతనినికూడా పంపెను.
4.హెరోదు ఈ భక్తని కత్తితో చంపించెను.
5.క్రీస్తు ఇతనిని సుంకపు మెట్టునుండి పిలచెను.
6. ఇతనికి దిదీము అను రెండవ నామము కలదు
7. క్రీస్తు ఇతనితో "నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే" అని చెప్పెను.
8. యూదాకు బదులుగా ఇతడు పండ్రెండవ శిష్యుడు అయ్యెను.
9. ఇతడు అన్యజాతి జనులకు అపోస్తలుడు.
10. క్రీస్తుకు పండ్రెండు మంది శిష్యులతోపాటు వేరొక శిష్యవర్గముకూడ కలదు. వీరు ఎంతమంది?
48. పేత్రు జీవితము
1.పేత్రు అన్న పేరేమి?
2.పేత్రు సొంత పేరేమి? అతనికి క్రీస్తు పెట్టిన పేరేమి?
3.క్రీస్తు వ్యాధినయము చేసిన పేత్రు బంధువు ఎవరు?
4. పేత్రు దేనిమీద నడవబోయి విఫలుడయ్యెను?
5. నేనెవరినని మీరు భావించుచున్నారు అని యేసు అడగగా, పేత్రు చెప్పిన జవాబు ఏది?
6.పేత్రు కొండమీద క్రీస్తు మోషే యేలీయాలకు ఏమి నిర్మింప గోరెను?
7. గెత్సెమని తోపులో అతడు ఎవరి చెవిని తెగనరికెను?
8.పేత్రు బొంకుకు ఒక పక్షికి సంబంధమున్నది. ఆ పక్షి యేది?
9.నా వద్ద వెండిబంగారములు లేవు అని అతడు ఎవరితో ఆమెను?
10.అతడు క్రీస్తుని బోధించిన రోమను సైన్యాధిపతి పేరేమి?
49. పౌలు వాక్యాలు
ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుడు.
1.మనము పాపాత్ములమై యున్నపుడు క్రీస్తు మన కొరకు . . . .
2. ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు . . . .
3. ప్రభువు వచ్చువరకు మీరు ఆయన . . . . ప్రకటింతురు.
4. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో . . . .
5.ఎవడైనను క్రీస్తునందున్న యెడల అతడు నూత్న సృష్టియగును. ప్రాతజీవితము గతించినది . . . . ప్రారంభమైనది.
6.నా కృప నీకు చాలును. బలహీనతయందు నా . . . . పరిపూర్ణమగుచున్నది.
7. నేను ఎప్పడు బలహీనుడనో అప్పడే . . . .
8. ఇక జీవించునది నేను కాదు . . . . నా యందు జీవించుచున్నాడు.
9.శరీరము కోరునది . . . . కోరుదానికి విరుద్ధముగా నుండును. ఆత్మ కోరునది . . . . కోరుదానికి విరుద్ధముగా నుండును.
10. సూర్యుడు అస్తమించులోగా మీ . . . . చల్లారిపోవలెను.
జవాబులు
1వ పోటీ
1.కయిూను — ఆది 4,8
2.షేతు - 4,25
3. హానోకు - 5,24
4. నోవా - 6,14
5.ఏదెను - 2,8
6.బాబెలు - 11,9
7. వరదగుడి - 9, 13-15
8.మెతూషెలా - 5,27
9. నిమ్రోదు-10,9
10. నోవా - 9,20
2వ పోటీ
1.ఊరు = ఆది 11, 28
2. తెరా - 11, 27
3. సారయి – 11, 29
4. హాగారు - 16.1
5. ఇష్మాయేలు - 16,11
6. ఈసాకు - 21,5
7. మక్ఫేలా - 23, 17-20
8. రిబ్కా - 24, 64
9.ఏసావు, యాకోబు - 25, 25-26
10. కతూరా = 25, 1
232
3వ పోటీ
1.బెన్యామీను - ఆది 42, 13
2. పొడుగు చేతుల నిలువుటంగీ - 37, 3
3.అతని తల్లిదండ్రులనూ సోదరులనూ - 37, 9–10
4. 20 వెండికాసులు - 37,28
5.పానీయవాహకుడు, వంటవాడు - 40, 1-4
6. ఈజిప్టుకు సర్వాధికారి –41, 41
7. ఆస్నతు - 41, 45
8.మనష్షె ఎఫ్రాయిూము - 41, 51-52
9.బెన్యామీను - 44,2
10.గోషెను - 47, 6
4వ పోటీ
1.ఫరో కొమార్తె - నిర 2, 5-6
2.ఐగుప్తియని చంపినందున - 2, 12-15
3. సిప్పొరా - 2,21
4.యిత్రో- 3,1
5. మండుచున్న పొద - 3, 2-5
6.పది
7.అగ్ని స్తంభము, మేఘస్తంభము - 13, 21
8.పదియాజ్ఞలు
9. పాస్క - 12, 14
10. నెబో - ద్వితీ 34, 1
5వ పోటీ
1.యీషాయి - 1 సమూ 16,11
2. బేత్లెహేము - 16, 11
3. సమూవేలు - 16, 13
4. ఒడిసెల రాతితో - 17, 49
5.యోనాతాను - 18, 1
6.అదుల్లాము - 22,1
7.బత్షెబా - 2సమూ 11,27
8. నాతాను -2సమూ 12,1
9. అబ్షాలోము - 15,1-6
10.సాలోమోను
6వ పోటి
1.హగ్గయి - 2,4
2. దానియేలు - 6, 16
3. యెహెజ్కేలు – 37
4. మీకాయా - 1 రాజు 22, 14
5.ఆమోసు - 1,1
6. మోషే - నిర్గ 33, 11
7. యెషయా - 6,8
8. హోషేయ - 1,3
9. యిర్మీయా - 38,6
10. అగబు - అచ 21, 10-11
7వ పోటి
1. మెల్కీ సెడెకు - ఆది 14, 18
2.సౌలు
3.సొలోమోను - 1రాజు 3, 9
4. హీరాము - 1రాజు 5,10
5. షెబా రాణి - 1రాజు 10,10
6.హిజ్మియా - యెష 38,5
7.ఉజ్జీయా - 2 రాజుల దినచర్య 26, 19
8.సిద్కియా
9.నెబుకద్నెసరు - దానియేలు 3
10.కోరెషు - ఎజ్రా 1, 1-4
8వ పోటీ
1.రిబ్కా - ఆది 27, 6-10
2.రూతు - 1, 22
3.ఎస్తేరు - 2, 18
4. మిర్యాము - నిర్గ 15, 20
5.హన్నా- సమూ 1, 28
6. లోతు భార్య - ఆది 19,26
7. యూదితు
8. ఎండోరు మంత్రగత్తె - 1సమూ 28,7
9.యాయేలు - న్యాయాధి 4,21
10. యోబు భార్య - 2,8
9వ పోటీ
1.అన్నా - లూకా 2, 38
2. మరియ, మార్త - యోహా 11,5
3. మరియు మగ్డలీన - లూకా 8, 2
4.యాయిూరు కొమార్తె — లూకా 8, 41–42
5. సఫీర - అచ 5
6.సమరయ స్త్రీ - యోహా 4, 5-7
7. రోడా - అచ 12, 12,13
8.పిలాతు భార్య - మత్త 27, 19
9.హెరోదియా కొమార్తె - మత్త 14, 8
10.పేత్రు అత్త - మత్త 8, 14
10వ పోటి
1.తప్పిపోయిన కుమారుడు - లూకా 15, 13
2.హెరోదుకి - లూకా 13, 32
3.అననీయ - అచ 5,5
4.యాకోబు - ఆది 25
5.డెలీల - న్యాయాధి 16, 19
6. హామాను - ఎస్తేరు 7, 10
7. అహాబు = 1 రాజు 21, 16
8. యొసెబెలు - 2రాజు 9, 36
9. కయిఫా - యోహా 11, 50
10.దెమేత్రి - అచ 19,24
235
11వ పోటి
1.నజరేత్తు — లూకా 4, 29
2. ఆతెన్సు - అచ 17, 23
3.సొదొమ,గొమర్రా - ఆది 18
4.యెరూషలేము - 2సమూ 5,6
5. నీనివే - యోనా 3
6. అంతియోకయ - అచ 11,26
7. తార్సు - అచ 22,3
8.దమస్కు - అచ 9,3
9.నయాను - లూకా 7,11
10. ఎమ్మావు - లూకా 24, 13
12వ పోటి
1.హోరేబు - నిర్గ 3,1
2.నెబో - ద్వితీ 34, 1
3. కర్మెలు - 1రాజు 18,38
4. హోరేబు - 1 రాజు 19,8
5. గెరిజం - యోహా 4,20
6. అరారతు - ఆది 8,4
7. మోరీయా - ఆది 22,2
8.తబోరు - లూకా 9, 28
9.గొల్గొత - యోహా 19, 17
10. ఒలీవ కొండ - అచ 1, 12
13వ పోటి
1.గొర్రెపిల్ల - యోహా 1, 29
2. పొట్టేలు - ఆది 22, 13
3.తిమింగిలము - మత్త 12, 40
4. గాడిద - సంఖ్యా 22, 30
5. సింహము -న్యాయాధి 14, 5-6
6.ఆవులు - ఆది 41, 18-19
-236
7.మేక - లేవీ 16, 22
8. ఒంటె - ఆది 24, 64
9.కుక్కలు — లూకా 16, 21
10. నక్క - లూకా 13, 32
14వ పోటి
1.ప్రార్థనా మందిరము - లూకా 7,5
2.దేవాలయము - 1 రాజు 6, 1
3.సత్రము - లూకా 2, 7
4. బురుజు - లూకా 13, 4
5. కొట్లు - లూకా 12, 18
6.ప్రార్ధనా మందిరము- లూకా 4, 16
7. గోపురము - లూకా 14, 28
8. సుంకపు మెట్ట - మత్త 9, 9
9. ఇల్లు - మత్త 7, 26
10.సున్నము కొట్టిన సమాధులు - మత్త 23, 27
15వ పోటి
1.కాల్చిన చేప - లూకా 24, 42
2.తేనె - న్యాయాధి 14,8
3. రొట్టె, మాంసము - 1రాజు 17,6
4.పిండివంటలు- ఆది 40, 17
5.పాలు - ఆది 18,8
6.పులుసు - ఆది 25, 34
7. జింకమాంసము - ఆది 27,3
8.ద్రాక్షపండ్లు - సంఖ్యా 13, 23
9.పూరేడు పిట్టలు - సంఖ్యా 11, 31
10.గొర్రెపిల్ల - నిర్గ 12, 3
16వ పోటి
1.వ్యవసాయము - ఆది 9, 20
2.వేటగాడు - ఆది 25, 27
3.గొర్రెల కాపరులు - ఆది 47, 3
237
4.ఇండ్లు కట్టుపని - నిర్గ 1, 14
5. బెస్తలు - మత్త 4, 18
6.సైనికులు - మార్కు 15, 24
7.చర్మకారుడు – అచ 10, 5 -6
8. సుంకరి - లూకా 19, 2
9.వైద్యుడు - 9, 12
10. గుడారములు తయారుచేయుపని - అచ 18, 3
17వ పోటి
1.యిష్మాయేలు - ఆది 21, 15
2.యోసేపు - ఆది 35, 5-11
3. బెన్యామీను - ఆది 35, 16-18
4. మోషే - నిర్ల 2, 8-9
5. సమూవేలు -1 సమూ 2, 19
6.దావీదు - 1సమూ 16,13
7. యిస్రాయేలు బాలిక - 2 రాజు 5, 2-3
8.స్నాపక యోహాను - లూకా 1, 20
9.బాలయేసు - లూకా 2, 41–42
10.యాయిూరు కొమార్తె - లూకా 8, 54-55
18వ పోటి
1.ఆదాము, ఏవ - ఆది 3, 5-6
2. నోవా - ఆది 9, 13
3.దానియేలు - దాని 6, 16
4.మోషే - నిర్గ 3, 1-2
5.యోనా - 1, 17
6. ఏలీయా - 2రాజు 2, 11
7.గొల్యాతు - 1సమూ 17, 49
8. ఈసాకు - ఆది 22,10
9.పేత్రు - మత్త 26, 75
10. జక్కయ - లూకా 19, 4
238
19వ పోటి
1.దేవుడు అబ్రాహామునకు - ఆది 12,2
2. దేవుడు భక్తులకు - యొష 40, 31
3.దేవుడు భక్తులకు - కీర్త 91, 16
4.క్రీస్తు పౌలుకు - 2 కొరి 12, 9
5.దేవుడు సాలోమోనుకు - 2రాజు 3,12
6. దేవుడు జకర్యాకు - జెకర్యా 8,5
7.క్రీస్తు తన శిష్యులకు - మత్త 28, 20
8.క్రీస్తు పేత్రుకు - మత్త 16, 18
9. క్రీస్తు తన శిష్యులకు - మత్త 18, 20
10. క్రీస్తు మంచి దొంగకు — లూకా 23, 48
20వ పోటి
1.సంఖ్యాకాండ
2. ఆదికాండ
3.ఎస్తేరు
4. పరమ గీతము
5. యోవేలు
6.యోనా
7.కీర్తనలు
8.రూతు
9.లూకా సువిశేషము
10.మత్తయి సువిశేషము
21వ పోటీ
1.ఆదాము - 2, 20
2.పావురము ఒలీవ ఆకుతో తిరిగి వచ్చినందున - 8, 11
3. అబ్రాహాముకి - 13, 16
4.అబ్రాహాము - 18, 23
5. యిస్ర్రాయేలు - 32, 28
6. యోసేపు - 37, 3
239
7.ఫరో - 41, 4
8. జఫనత్ పానెయా - 41, 45
9. రాహేలు - 46, 19
10. ఆస్నతు - 41, 45
22వ పోటి
1.నైలు
2.ఫరో కొమార్తె - నిర్గ 2, 10
3.మండుచున్న పొద - 3,3
4.తన తొలిచూలి కుమారుని చావని చూచి - 12, 29-31
5.రెల్ల సముద్రము - 13, 18
6.పాస్క గొర్రెపిల్లను - 12, 11
7.మస్సా, మెరీబా - 17,7
8.అహరోను - 32, 4
9.కుష్ట - సంఖ్యా 12, 10
10. మన్నా పూరేడు పిట్టలు - నిర్గ 16, 13-15
23వ పోటి
1.మీకా - మత్త 2, 6, మీకా 5, 2
2. అగస్తు సీసరు — లూకా 2, 1
3.పశువుల తొట్టిలో - లూకా 2, 7
4.గొర్రెల కాపరులు - లూకా 2, 15-16
5. నరులను పాపమునుండి రక్షించువాడు - మత్త 1, 21
6.సిమియోను - లూకా 2, 29
7.అన్నా - 2, 38
8. చుక్కను చూచి - మత్త 2,2
9.బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము - మత్త 2, 11
10. ఈజిప్టుకు - మత్త 2, 13
24వ పోటి
1. పేత్రు అత్త - మత్త 8, 14
2. శిష్యులు - మత్త 8, 23
3.పక్షవాత రోగి - మార్కు 2.3
240
4. రక్తస్రావ రోగి - మత్త 9, 20 5. మత్తయి 9,9 6. బర్తిమయి - మార్కు 10, 46 7. జక్కయ = లూకా 19, 4 8. కననీయ స్త్రీ కొమార్తె - మత్త 15, 22 9. మంచిదొంగ - లూకా 23, 42 10. తోమా - యోహా 20, 27
2 5వ పోటీ
1. ద్రాక్షతోట కూలీల సామెత - మత్త 20, 6 2. మంచి సమరయుని సామెత - లూకా 10, 29 3. అవివేకియైన ధనికుని ఉపమానము - లూకా 12, 20 4. అన్యాయపు న్యాయాధిపతి - లూకా 18, 4 5. లిల్లీ పుష్పములు - మత్త 6, 28 6. గోదుమ చేనిలో కలుపుగింజలు చల్లుట - మత్త 13, 28 7. సుంకరి = లూకా 18, 13 8. అబ్రాహాము లాజరులకును ధనికునికి మధ్య - లూకా 16, 26 9. ముగ్గురు సేవకుల కథ - మత్త 25, 21 10. తప్పిపోయిన గొర్రె సామెత - లూకా 15, 7
{{|26వ పోటి}} 1. పేత్రు - మత్త 14, 28 2. తెరువబడుము - మార్కు7, 34 3. పదిమంది కుష్ఠరోగులు - లూకా 17, 17
4. కానావూరి వివాహము - యోహా 2, 4 5. కఫర్నాము శతాధిపతిని గూర్చి - మత్త 8, 10 6. తుఫానును అణచుట - మత్త 8, 27 7. కననీయ స్త్రీతో - మత్త 15, 26 8. అంజూరము - మార్కు 11, 13 9. పేత్రు - అచ 3,6 10. నికొదేము - యోహా 3, 2 241 . .
27వ పోటీ
1. గాడిదపై - మత్త 21, 5 2. పేద విధవను - మార్కు 12, 41–42 3. గెత్పెమని తోపునకు - మార్కు 14, 32 4. ముప్పది - మత్త 26, 15 5. కురేనియా సీమోను - మార్కు 15, 21 6. తండ్రీ! వీరు చేయునదేమో వీరెరుగరు. వీరిని క్షమింపుము - లూకా 23, 34
7. చేదు కలిపిన ద్రాక్షరసము - మార్కు 15, 23 8. ఇతడు యూదుల రాజగు యేసు - మత్త 27, 37 9. అరిమతయియ యోసేపు — లూకా 23, 52
10. యోసేపు తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో - మత్త 27, 60
28ස් ෆිජ්
1. ప్రతి వాక్కువలన - మత్త 4,4 2 . పరలోకరాజ్యము - 4, 17
3. మనుష్యులను పట్టువారినిగా - 4,19 4. మనస్సున - 5, 28 5. హృదయమును - 6, 21 6.. యజమానులను - ద్రవ్యమును 6, 24 7 ..తీర్పు చేయబడదు - 7, 1 8.. ఇతరులకు చేయుడు - 7, 12 9. .ఇసుకపై - 7, 26 10. లెక్కింపబడియే యున్నవి - 10, 30
29ය ෆිජ්
1. నా సంఘమును - మత్త 16, 18 2. .తన్ను తాను త్యజించుకొని - 16, 24 3.. తన ఆత్మనుకోల్పోయినచో -16,26 4. కూడుదురొ-18,20 5 శిబిరములు = 17, 4
6. పరలోక రాజ్యము - 18, 3 7. మానవమాత్రుడు - 19, 6
8. చిన్నబిడ్డలను - 19, 14
9. సాధ్యమే - 19, 26
10. నా మూటలు - 24, 35
30వ పోటీ
1. దేవుడు మనతో ఉన్నాడు - మత్త 1, 23
2. హెరోదు - 21
3.అతడు నజరేతు నగరమున వసించుటచే - 2, 23
4.40 రోజులు - 42
5.దేవదూతలు - 4, 11
6.పేత్రు, అందైయా 4, 18
7. నీ శత్రువుని ప్రేమింపుము - 5, 43-44
<poem>8. పరలోకమందున్న మా తండ్రీ - 6, 9
9.సాలోమోను - 6, 29
10. దేవుడుద్రవ్యము - 6, 24
</poem>
31వ పోటీ
>1.కుష్టరోగి - 8.2
2. కఫర్నాము శతాధిపతి - మత్త 8, 10
3.విశ్రాంతి — 11, 28
4.విశ్రాంతి దినమున - 12, 1
5. గలిలయ సరస్సులోని పడవలో 13, 1-2
6. పరలోక రాజ్యమునకు - 12, 44-45
7. పేత్రు - 14, 29
8.మోషే, యేలీయా - 17, 3
9. పేత్రు, యాకోబు, యోహాను - 17, 1
10.చేప నోటిలో — 17, 27
32వ పోటీ
1.ఏడు డెబ్బిది పర్యాయాలు - మత్త 18, 22
2. యాకోబు యోహానుల తల్లి - 20, 20 243
3.దైవప్రేమ, సోదరప్రేమ - 22, 37-39
4. యెరూషలేము దేవాలయము - 24, 2
5.నూనె - 25, 3
6.భూమిలో దాచెను - 25, 25
7. తన సోదరులకు చేసినది - 25, 40
8. పరిమళ ద్రవ్యముతో క్రీస్తు శిరస్సును అభిషేకించెను - 26, 12
9. పాస్క పండుగ - 26, 18
10.ముదుపెట్టుకొనుట - 26, 48
1.పేత్రు - 26, 74
2.వెక్కివెక్కి యేడ్చెను - మత్త 26, 75
3.కుమ్మరివాని పొలము - 277
4. క్రీస్తు మరణమునకు తాను బాధ్యుడను కానని తెలియజేయుటకు - 27, 24
5. నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి? - 27, 46
6.చీకట్లు కమ్మెను - 27, 45
7.దేవాలయపు తెర 27, 51
8.శతాధిపతి, సైనికులు – 27, 54
9.అరిమత్తయియ యోసేపు 27, 57
10. లోకాంతము వరకు నేను మీతో వుందును - 28, 20
1.ఒంటె రోమముల వస్త్రము, తోలుపట్టీ - మార్కు 1, 6
2. పడవలో వలలు బాగుచేసికొనుచుండిరి - 1, 19
3. ఇంటికప్పను ఊడదీసి పడకను క్రిందికి దింపిరి - 2, 4
4. క్రొత్త గుడ్డను - 2, 21
5. ఉరిమెడివారు — 3, 17
6. పందులలో - 5, 13
7.ఓ బాలిక లెమ్ము -5, 41
8. హెరోదియా తన కూతురికి - 6, 24
9. ఐదు రొట్టెలు, రెండు చేపలు - 6, 41
10. పచ్చికపై – 6, 39
244
1. పరిసయులు - 7, 2 2. బెత్సయిదా గ్రుడ్డివాడు - 8, 24 3. నీవు క్రీస్తువు - 8, 29 4. పేత్రుని - 8, 33 5. చిన్నబిడ్డలు – 10, 14 6. బర్తిమయి - 10, 46 7. కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి చెల్లింపుడు - 12, 17 8. గెత్పెమని - 14, 32 9. సిలువ మరణము = 14, 36 10. పెద్ద రాతిని - 15, 46
1. తెయోఫిలు అనునతని కొరకు - లూకా 1, 1-3
2. అగుస్తు - 2, 1 3. పశువుల తొట్టిలో -2, 7 4. యెరూషలేము = 2, 41–42 5. వేదబోధకులకు - 2, 46 6. తిబేరియస్ - 3,1 7. ప్రార్థనామందిరమునకు - 4, 16 8. లేవీ - 5, 29 9. ప్రార్థనామందిరము - 7,5 10. నాయూను - 7, 12
1. స్నాపక యోహాను - లూకా 7, 19 2. దళము - 8, 30 3. పండ్రెండు ఏండ్లు - 8, 42 4. యాకోబు యోహాను - 9, 54 5. దైవరాజ్యమునకు - 9, 62 245
1. డెబ్బది యిద్దరు శిష్యులు - 10, 17 2. సైతానుని - 10, 18 3. బెతనీ మరియ — 10, 39
4. పరలోక జపము - 11, 1
5. మూడు – 11, 5
38ස් ෆිස්
1. యెరూషలేమునుండి యెరికోకు - లూకా 10, 30 2. యాజకుడు, లేవీయుడు - 10, 31-32 3. పిచ్చుకలకంటె - 12, 7 4. ఆకాశపక్షులు - 12, 24 5.నడుము వంగిపోయిన స్త్రి - 13, 12-13 6.ఆవపు చెట్టు - 13, 19 7. యెరూషలేము - 13, 34 8. ఒక్కటి - 15, 4 9.నాణము - 15,8 10. తప్పిపోయిన కుమారుడు - 15, 24
39.ස් ෆිස්
1.లాజరుని - లూకా 16, 21 2.సమరయుడు - 17, 16 3. పరిసయుడు, సుంకరి • • 18, 10 4. శిష్యులు - 18, 15 5. ధనిక యువకుడు - 18, 23 6. సుంకరి = 19, 1-2 7. రెండు కాసులు – 21, 2 8.చేదు ద్రాక్షరసము - 23, 36 9. క్లియోపా - 24, 18 10 బెతని = 24, 50
40వ పోటీ
1.ఆదిలో వాక్కు ఉండెను - యోహా 1.1
2.స్నాపక యోహాను - 1, 27
3.నతనియేలు - 1, 48
4.నికొదీముతో - 3, 3
5.సకారు - 4,5
6.శిష్యులు - 4, 27
7.బెత్పతా - 5,2
8.ఐదు రొట్టెలు, రెండు చేపలు - 6, 9
9.మన్నాను - 6, 49
10.పేత్రు - 6, 68
41వ పోటీ
1.ప్రధానార్చకులు పంపిన బంట్రిబౌతులు - యోహా 7, 46
2.వ్యభిచారమున పట్టబడిన స్త్రీతో - 8, 11
3.అబ్రాహాము - 8, 56
4.ఉమ్మి కలిపిన మట్టి - 9,6\
5.జీతగాడు - 10, 12
6.బెతానియా - 11,1
7.మార్తతో - 11, 25
8.లాజరు కొరకు - 11, 36
9.ఖరూరపు మట్టలతో - 12, 13
10.అందరినీ తన యొద్దకు ఆకర్షించును - 12, 32
42వ పోటీ
1.శిష్యుల కాళ్ళు కడిగెను - యోహా 13, 5
2.సైతాను - 13, 27
3.ఫిలిప్ప - 14, 8
4.పవిత్రాత్మను - 16,7
5.అంగీ కొరకు 19, 24
6.నెత్తురు, నీళ్ళ - 19, 34 1. 0. l 0. 40ස් ෆිස් ఆదిలో వాక్కు ఉండెను - యోహా 1.1 స్నాపక యోహాను - 1, 27 నతనియేలు - 1, 48 నికొదీముతో - 3, 3 సకారు - 45 శిష్యులు - 4, 27 బెత్పతా - 5,2 ఐదు రొట్టెలు, రెండు చేపలు - 6, 9 మన్నాను - 6, 49 పేత్రు - 6, 68 41ක් ෆිස් ప్రధానార్చకులు పంపిన బంట్రిబౌతులు - 3ரூ 7, 46 వ్యభిచారమున పట్టబడిన స్త్రీతో - 8, 11 అబ్రాహాము - 8, 56 ఉమ్మి కలిపిన మట్టి - 9,6 జీతగాడు - 10, 12 బెతానియా - 111 మార్తతో - 11, 25 లాజరు కొరకు - 11, 36 ఖరూరపు మట్టలతో - 12, 13 అందరినీ తన యొద్దకు ఆకర్షించును - 12, 32 42ක් ෆිලිහී శిష్యుల కాళ్ళు కడిగెను - యోహా 13, 5 సైతాను - 13, 27 ఫిలిప్ప - 14, 8 పవిత్రాత్మను - 16,7 అంగీ కొరకు 19, 24 నెత్తురు, నీళ్ళ - 19, 34 247
45వ పోటి
1.సమరయ – 8, 5
2.సీమోను అను మాంత్రికుని - 8, 20
3. గాజాకు పోవు మార్గమున - 8, 26
4.యెషయా గ్రంథము - 8, 30
5.యేసు - 8, 32
6.డమస్కు - 9, 3
7."తిన్ననిది" అను వీధిలో - 9,11
8.అననీయ - 9, 18
9.గంపలో కూర్చుండబెట్టి గోడమీదినుండి అవతలకు దింపిరి – 9, 25
10. బర్నబా - 9, 27
46వ పోటి
1.మత్తీయ - అ, చ, 1, 26
2. 120మంది - 1, 15
3. 300మంది - 2, 41
4.కంటివానిని నడిపించెను -3,8
5.గమలియేలు - 5, 34
6.సైఫను - 7, 60
7.పౌలువద్ద - 7, 58
8. ఇతియోపియారాణి కోశాధికారియైన నపుంసకునికి - 8, 38-39
9.బర్నబా - 4, 37
10.అననీయ, సఫీరా - 5
47వ పోటీ
1.పేత్రు - మత్త 16, 18
2.అంధ్రెయ- యోహా 6, 9-10
3.యోహాను — లూకా 22, 8
4.యాకోబు - అ,చ. 12,2
249
5.మత్తయి - మత్త 9,9
6. తోమా - యోహా 20, 24
7. ఫిలిప్ప - యోహా 14,9
8. మత్తీయ - అ,చ. 1,26
9. పౌలు - రోమా 11, 13
10. 72 -లూకా 10,1
48వ పోటి
1.అంద్రెయ - యోహా 1, 40
2.సీమోను - కేఫా (పేత్రు) -1, 42
౩. పేత్రు అత్త - మార్కు 1, 30-31
4.నీటిమీద - మత్త 14, 29-30
5.నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువవు - మత్త 16, 16
6.మూడు శిబిరాలు- మత్త 17,4.
7.మాల్మస్ చెవిని - యోహా 18, 10
8.కోడి - లూకా 22, 60
9.కుంటివానితో - అ.చ. 3.6
10.కొర్నేలి - అ.చ. 10,1
49వ పోటి
1.మరణించెను - రోమా 5,8
2. రక్షింపబడును - రోమా 10, 13
3.మరణమును - 1 కొరి 11, 26
4.దారుణమగును - 1 కొరి 9, 16
5. క్రొత్త జీవితము - 2కొరి 5, 17
6. శక్తి - 2కొరి 12, 9
7. బలవంతుడను - 2 కొరి 2, 10
8. క్రీస్తే - గల 2, 20
9. ఆత్మ - శరీరము - గల 5, 17
10. కోపము - ఎఫే 4, 26
250