బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ/క్రీస్తు వరప్రసాదం

8.క్రీస్తు వరప్రసాదం

మనవిమాట

14–15 బైబులు భాష్యం సంచికల్లో వరప్రసాదాన్ని గూర్చి చెప్పాం. ఆ సంచికలనే యిక్కడ కొలది మార్పులతో ఏకగ్రంథంగా ముద్రించాం.

క్రైస్తవ జీవితమంటే విశేషంగా వరప్రసాద జీవితమే. ఈ గ్రంథంలో వరప్రసాదాన్ని గూర్చిన దైవశాస్తాంశాలను సులువైన పద్ధతిలో వివరించాం. భక్తులు వరప్రసాదాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలిసికొని దేవునిపట్ల భక్తిని పెంపొందించుకోడానికి ఈ పుస్తకం వుపకరిస్తుంది. ఇది రెండవ ముద్రణం.

పారిభాషిక పదాలు

{{left| <poem> Grace Habitual grace Sanctifying grace uncreated grace Indwelling Actual grace Healing grace Elevating grace Prevenient grace External grace Gratia graits data Gratia gratum faciens Efficient grace Sufficient grace Theological virtues Moral virtues Natural order Supernatural order



బాహిర వరప్రసాదం అన్య ప్రయోజక వరప్రసాదం స్వీయ ప్రయోజక వరప్రసాదం క్రియానిర్వహణ వరప్రసాదం క్రియాసమర్థక వరప్రసాదం దివ్యపుణ్యాలు నైతిక పుణ్యాలు ప్రాకృతిక రంగం

ఆధ్యాత్మిక రంగం

విషయసూచిక

1. పవిత్రీకరణ వరప్రసాదం 253 2. నరుడు దివ్యడు 260 3. దత్తపత్రుడు 266 4. అంతర్నివాసం 271 5. దివ్యవ్యక్తులతో బాంధవ్యాలు 275 6. సహాయక వరప్రసాదం 279 7. సహాయక వరప్రసాదాలు మూడు 282 8. సహాయక వరప్రసాదాలు మరో మూడు 288 9. జ్ఞానదేహం 293 10. సత్ర్కియలు 296 11. హిందూ సంప్రదాయం 301 -ప్రశ్నలు 305

1. పవిత్రీకరణ వరప్రసాదం

జ్ఞానస్నానంతో వరప్రసాద జీవితం ప్రారంభమౌతుంది. ఇక్కడ వరప్రసాదమంటే యేమిటో, అదెలా వుంటుందో విచారిద్దాం. ప్రస్తుతాధ్యాయంలో ఐదంశాలను విలోకిద్దాం.

1. భావవిభాగం

వరప్రసాద భావంలో చాలా విభాగాలున్నాయి. వరప్రసాదాలన్నీ శాశ్వత వరప్రసాదాలూ తాత్కాలిక వరప్రసాదాలూ అని రెండు విధాలుగా వుంటాయి. ল’ৰ্ক্সতঁ వరప్రసాదం ఓమారు మనలో నెలకొన్నంక, చావైన పాపం కట్టుకొనని యంతవరకు మనలో స్థిరగా నిలచివుంటుంది. అందుకే దీనికి ল’ৰ্ছঃ వరప్రసాదం లేక స్థిర వరప్రసాదం అని పేరు. కాని తాత్కాలిక వరప్రసాదం ఈ శాశ్వత వరప్రసాదంలాగ స్థిరంగా నిలువదు. తాత్కాలికంగా మాత్రమే వుండి మనలను ఆయా పుణ్యకార్యాలకు పరికొల్పుతుంది. ఈ తాత్కాలిక వరప్రసాదానికే సహాయక వరప్రసాదమని కూడ పేరు.

ఇకశాశ్వత వరప్రసాదం మరల పవిత్రీకరణ వరప్రసాదం, దైవాత్మక వరప్రసాదం అని రెండు రకాలుగా వుంటుంది. పవిత్రీకరణ వరప్రసాదం క్రొత్త పట్టువు నిచ్చి మనలను పవిత్ర పరుస్తుంది. మన పాపాలను హరిహరిస్తుంది. దివ్యత్వాన్నిచ్చి మనలను దేవుని బిడ్డలను చేస్తుంది. మనలను మోక్షానికి హక్కుదారులను గావిస్తుంది. దైవాత్మక వరప్రసాదమంటే ముగ్గురు దైవ వ్యక్తులు మన హృదయంలో నెలకొనడం, దీనికే అంతర్నివాసం అని పేరు. దైవాత్మక వరప్రసాదం ముగ్గురు దైవవ్యక్తుల సాన్నిధ్యమైతే ఆ దైవవ్యక్త లిచ్చే బహూమానమే పవిత్రీకరణ వరప్రసాదం. ఈ రెండు వరప్రసాదాలూ అవినాభావ సంబంధం కలవి. అనగా ఒకటి ఉన్నచోట రెండవది కూడ ఉండితీరుతుంది. రెండు రకాలుగా వున్న ఈ శాశ్వత వరప్రసాదం, చావైన పాపం కట్టుకొనిన ఆత్మ యందు నిలువదు.

2. వరప్రసాదం ఏమి చేస్తుంది?

వరప్రసాదమంటే యేమిటి? అది మనలోని ఓ దివ్య గుణం. ఈ గుణంవలన మనం భగవంతునికి ప్రియపడతాం. ఈ గుణం దేవుడు మనకు ఉచితంగా యిచ్చేవరం. దానికి మనం ఏవిధంగాను అరులంకాము.

వరప్రసాదం చేసే పనులు చాలా వున్నాయి. దాని వలన మనకు పాపపరిహారం లభిస్తుంది. మనం నీతిమంతులమై దేవునితో రాజీపడతాం. పాపంతో వున్నపుడు దేవునికి విరోధులమై అతనికి అప్రియం కలిగిస్తాం, వరప్రసాదం వలన పావిత్ర్యాన్ని గూడ పొందుతాం.

వరప్రసాదం ద్వారా దేవునికి దత్తపుత్రుల మౌతాం. అతడు మనకు నిజంగా తండ్రి ఔతాడు. పిత పత్ర పవిత్రాత్మలనే ముగ్గురు దైవవ్యక్తులు మన హృదయంలో వసించడం మొదలిడతారు. మనకు దివ్యత్వం లభిస్తుంది.

ఈ వరం ద్వారా మనం విశేషంగా క్రీస్తుతో ఐక్యమై అతని దివ్యజీవితం జీవిస్తాం. కొమ్మలు చెట్టుతో లాగ అతనితో ఐక్యమౌతాం. ఆ క్రీస్తుతో ఐక్యమైన తోడిజనంతోగూడ ఐక్యమై ప్రేమజీవితం జీవిస్తాం.

మోక్షం తండ్రి రాజ్యం. ఆ తండ్రికి బిడ్డలమైన మనం వరప్రసాదం ద్వారా మోక్షానికిగూడ వారసుల మౌతాం.

వరప్రసాద ఫలితాలు ఇన్ని వున్నాయి. ఈ విషయాలన్నిటినీ రాబోయే అధ్యాయాల్లో విపులంగా పరిశీలిస్తాం. ప్రస్తుతానికి పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి విచారిద్దాం.

3. ట్రెంటు మహాసభ బోధలు

ప్రోటస్టెంటు సోదరుల తిరుగుబాటును పురస్కరించుకొని బ్రెంటు మహాసభ 16వ శతాబ్దంలో సమావేశమైంది. అందుచేత ఈ సభ ప్రతిపాదించిన సత్యాలన్నీ ప్రత్యక్షంగానైతేనేమి పరోక్షంగా నైతేనేమి ప్రోటస్టెంటుల నూత్న సిద్దాంతాలను పురస్కరించుకొని వెలువడినవే. వరప్రసాదాన్ని గూర్చిన బ్రెంటు సభ బోధలను గూడ ఈ దృష్టితోనే పర్యవేక్షించాలి.

పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి ట్రెంటు సభ మూడు ముఖ్య విషయాలను బోధించింది. అవి యివి. 1. నీతిని పొందడమంటే దేవుడు మన పాపాలను యథార్థంగా మన్నించడం. 2. నీతిని పొందడమంటే ఆత్మ క్రొత్తతనాన్ని పొందడం. 3. నీతిని పొందడంలో మన సహకారం కూడ వుంటుంది. ఈ మూడు విషయాలు నీతిని పొందడం అనే సత్యాన్ని వివరించే సందర్భంలో బోధింపబడ్డాయి. ඕෂීඩ් ඕශoඨස්කoභී జ్ఞానస్నానంద్వారా పాపాన్ని విడనాడి పవిత్రతను పొందడం. పాపం ద్వారా సిద్ధించే దైవశత్రుత్వాన్నుండి తప్పకొని పవిత్రీకరణ వరప్రసాదంద్వారా దైవ మిత్రత్వాన్ని పొందడం.

1. లూతరు సిద్ధాంతం ప్రకారం నీతిని పొందినంక గూడ మన పాపాలు యథార్థంగా పరిహారం కావు. మనకు దేవునిమీద ప్రేమా నమ్మికా వున్నట్లయితే ఆ దేవుడు మనలను చల్లని చూపుతో జూస్తాడు. క్రీస్తు సిలువమరణం వలన ఆర్థించిన వరప్రసాదాలతో మన ఆత్మను కప్పి అలంకరిస్తాడు. ఈ యలంకరణం ద్వారా మన ఆత్మం స్వయంగా పాపభూయిష్టమైయున్నాదేవుని సముఖంలో మాత్రం ప్రియంగొల్పుతూనే వుంటుంది.

బ్రెంటు సభ ఈ నూత్న వాదాన్ని ఖండించి ఈలా బోధించింది. నీతిని పొందడమంటే దేవుడు మన యాత్మను క్రీస్తు వరప్రసాదాలనే వస్త్రంతో కప్పివేయడం . యథార్థంగా పాపాలనుండి మన్నింపును పొందడం. ఈ మన్నింపు వలననే మనం నీతిమంతులం కాగల్లుతున్నాం.

నరుడు పట్టుకతోనే తొలి ఆదాము పాపంతో జన్మిస్తున్నాడు. పట్టుకతోనే దేవునికి శత్రువూ అప్రియుడూ ఔతున్నాడు. కాని మలి ఆదామునందు జ్ఞాకస్నానం పొంది మలి పుట్టువును పొందుతున్నాడు. దేవునికి దత్తపుత్రుడు ప్రియసుతుడు ఔతూన్నాడు.

2. లూతరు తలంపు ప్రకారం నీతిని పొందడమంటే ఆత్మను క్రీస్తు వరప్రసాదంతో కప్పివేయడం అన్నాం. అంచేత నీతిని పొందినాక గూడ మన ఆత్మయందు వస్తుతః ఏ మార్పూ కలుగదు. నీతిని పొందిన పిదప గూడ ఆత్మపాపం నుండి విముక్తి చెందదు. మనలోని ఆశాపాశాలు కూడ పాపాలే. ఈ యాశాపాశాలు మనం జీవించినంత కాలమూ వుంటాయి కనుక మన యాత్మ కూడ నిత్యం పాపంలోనే జీవిస్తుంటుంది. మరి మనకు రక్షణ లభించేది ఎలాగంటే, మన ఆత్మను వస్త్రంలాగ కప్పివేసిన క్రీస్తు వరప్రసాదంద్వారా, ఈ వరప్రసాదాలను చూచి క్రీస్తుపైగల ఆదరంచే పరలోకపిత మనలను చల్లని చూపున జూస్తాడు. మనలను తనసముఖంలోనికి చేర్చుకొంటాడు. బ్రెంటుసభ ఈ వాదాన్ని నిరాకరించి ఈలా బోధించింది. నీతిని పొందడమంటే మన పాపాలు యథార్థంగా పరిహరింపబడ్డం. మన ఆత్మలో గూడ క్రొత్తతనం ఏర్పడుతుంది. పవిత్రీకరణ వరప్రసాదం ద్వారా మన ఆత్మనూత్నత్వాన్ని పొందుతుంది. పాపపరిహారంతో పాటు ఈ పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూడ భగవంతుడే మనకు అనుగ్రహిస్తాడు. దానిద్వారా మనం పాపావస్థనుండి పవిత్రావస్థను పొందుతాం. నీతిని పొందడమంటే నీతిమంతుడైన దేవుడు మనలను చల్లని చూపన చూడ్డంగాదు. పాపపరిహారం వలనా పవిత్రీకరణ వరప్రసాదం వలనా మనలను నీతిమంతులను చేయడం, ఆశాపాశాలు పాపం వలన పడుతున్నాయి, పాపానికి పరికొల్పుతున్నాయి. కాని అవి స్వయంగా పాపాలు కావు, కావున మనం నీతిని పొందినంక గూడ ఆశాపాశాలు అనే పాపాలు ఉంటాయి అనే మాట పొసగదు.

3. లూతరు మతమున నీతిని పొందాలంటే మన తరపున కావలసింది ప్రేమతో గూడిన నమ్మిక మాత్రమే. దాని వలననే భగవంతుడు మనలను రక్షిస్తాడు. దీనికి మినహా మన సహకారం ఎందుకూ పనికిరాదు. జన్మపాపంద్వారా నరుల బుద్ధి చిత్తశక్తులు పూర్తిగా చెడిపోయాయిగనుక మన స్వాతంత్ర్యంగూడ నశించింది. కావున రక్షణకార్యంలో మన తోడ్పాటేమీ లేదు. మనం వరప్రసాదాలను ఆర్థిస్తాం అనడం కల్ల. మనం వరప్రసాదం ఆర్థిస్తే క్రీస్తు వరప్రసాదం వ్యర్థమైపోదా?

టెంటుసభ ఈ వాదాన్ని ఖండించి ఈలా బోధించింది భగవంతునియందు ప్రేమతో గూడిన నమ్మికను ఉంచడం అవసరమేగాని అంతమాత్రంచేతనే నీతిని పొందలేం. తొలిపాపంద్వారా మన బుద్ధి చిత్తశక్తులు గాయపడ్డాయి గాని నశింపలేదు. కావున నరులకు అవసరమైన స్వాతంత్ర్యం వుంది. ఈ స్వాతంత్ర్యం వలన, మనతోడ్పాటులేందే దేవుడు మనలను రక్షింపడు. మనం పుణ్యాన్ని ఆర్థించందే మోక్షంలో అడుగుపెట్టలేం. మనంకూడ పుణ్యాన్ని అర్ధిస్తున్నామంటే క్రీస్తు సహాయంతోగాని, క్రీస్తు నిస్సహాయంగాగాదు. మనం ఆర్థించే వరప్రసాదం క్రీస్తు వరప్రసాదంమీద ఆధారపడి వుంటుంది కనుక ఆ ప్రభు వరప్రసాదాన్ని వ్యర్థం చేయదు.

నేడు ప్రోటస్టెంటు శాఖలను క్యాతలికు శాఖ నుండి వేరుపరచే ప్రధానాంశాల్లో ఇవీ కొన్ని గనుక పాఠకులు ఈ విభేదాలను చక్కగా గుర్తించాలి. లూతరు బోధించిన పై మూడు సిద్ధాంతాలను 53 ప్రోటస్టెంటు సంపూర్ణంగా అంగీకరింపవు. పైగా అసలు లూతరు బోధించిందేమిటి అన్న విషయంలోగూడ ప్రోటస్టెంటు శాఖల్లో భేదాభిప్రాయాలున్నాయి.

4. పితృపాదుల ఉపమానాలు

పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి చెపూపితృపాదులు రెండుపమానాలు వాడారు. మొదటిది మైనంమీద వేసిన ముద్ర. రెండవది స్ఫటికం గుండా ప్రసరించే వెలుగు.

1. అలెగ్జాండ్రియ సిరిల్ మన ఆత్మలో పనిచేసే పరిశుద్ధాత్మను వర్ణిస్తూ ఈలా చెప్పాడు : “దేవుని నుండి వెడలివచ్చే దైవవ్యక్తి పరిశుద్దాత్మ మైనంపై ముద్రలాగ తన రూపాన్ని మన హృదయంమీద ముద్రిస్తుంది. చిత్రకారుడు ఫలకంపై మరియొకరి చిత్రాన్ని గీస్తాడు. కాని ఈ దివ్యవ్యక్తి మాత్రం తన రూపాన్నే మన హృదయాలమీద చిత్రిస్తాడు. ఈ దివ్యరూపం వలన మనం పాపంద్వారా కోల్పోయిన దేవుని పోలికను తిరిగి పొందుతాం.

ఈ సాదృశ్యంలోని భావాలివి : (1) మన హృదయంలో పరిశుద్దాత్మ వశించడమూ, ఆ యాత్మయిచ్చే వరప్రసాదమూ మైనంమీద వేసిన ముద్రతో పోల్చబడ్డాయి. మైనపు ముద్ద ముద్రను గైకొని నూత్నరూపం తాలుస్తుంది. అలాగే మనంకూడ వరప్రసాదం ద్వారా క్రొత్తతనం పొందుతాం.మార్పుచెందుతాం. (2) లోహంతో చేయబడిన ముద్ర తన రూపాన్ని మైనంమీద ఒత్తుతుంది. మైనంమీద పడిన ముద్ర ఆ లోహపుముద్ర రూపమే. ఇదేరీతిగా భగవంతుడు కూడా పవిత్రీకరణ వరప్రసాదంద్వారా తన పోలికను మన ఆత్మమీద చిత్రిస్తాడు. ఈ పోలిక వలననే మనం దివ్యత్వం పొందుతున్నాం.

ఇవి పోలికలు. కాని అన్ని వుపమానాల్లోలాగే ఈ యుపమానంలో కూడ కొన్ని లోపాలున్నాయి. మొదటిది ముద్ర మైనం ఉపరిభాగాన్నిమాత్రమే సోకుతుంది. భగవత్కృప ఈలా కాకుండ మన ఆత్మమునంతటినీ సోకి మనకు దైవత్వం ఇస్తుంది. రెండవది, లోహపు ముద్రను తొలగించినంక గూడ మైనంమీద ముద్ర నిలిచే వుంటుంది. కాని ఇదేరీతిగా భగవంతుడు మన ఆత్మపై తన పోలికను కలిగించిన పిదప తాను వైదొలగి పోడు. వడ్రంగి బల్లనుచేసి ముగించాక అతని ఆపేక్ష లేకుండానే బల్ల తనంతట తాను ఉండగలదు. కాని వరప్రసాద విషయం ఈలాగాదు. భగవంతుడు మన హృదయంలో ఉన్నంతసేపే అతని పవిత్రీకరణ వరప్రసాదంకూడ హృదయంలో నిలుస్తుంది. మనం పాపం చేసి అతడు వైదొలగిన క్షణంలోనే పవిత్రీకరణ వరప్రసాదం కూడ అంతరించిపోతుంది. అందుకే భగవంతుని అంతర్నివ్రాసానికీ పవిత్రీకరణ వరప్రసాదానికీ అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పాం.

2. పరిశుద్ధాత్మ మనకు దైవత్వాన్ని ఇస్తుందని చెపూ బాసిల్ ఈలా వ్రాసాడు. "పరిశుద్ధాత్మ తన్నాహ్వానించే వాళ్ళ హృదయాల్లో స్థిరమూనూ పరిపూర్ణమునైన వరప్రసాదాన్ని చిలకరిస్తుంది. ఆదివ్యాత్మ కృప అనంతమైనా మన పాత్రతను బట్టి ఆ యాత్మ కృపను స్వీకరిస్తుంటాం. ఆ యాత్మ కూడ తన్నాహ్వానించే వాని హృదయంలో, ఆ హృదయ మాలిన్యం అడ్డుపడనంతవరకూ, వెలిగిపోతూంటుంది. వెలుగు పైబడి నంతనే స్ఫటికం మొదలైన నిర్మల వస్తువులు తాము వెలిగిపోతాయి. నలువైపుల నూత్న తేజం వెదజల్లుతాయి. ఆ రీతిగానే మన యాత్మలు కూడ దేవుని పొంది దేవుని రూపం గైకొంటాయి. దివ్యత్వం పొందుతాయి?

ఈ సాదృశ్యంలోని భావాలివి : (1) పవిత్రీకరణ వరప్రసాదం ఆత్మ ఊపరిభాగంమీద కాదు, ఆత్మయందంతటా ప్రసరిస్తుంది. వెలుగు స్ఫటికాన్నంతటినీ వెలిగించినట్లే వరప్రసాదం ఆత్మనంతటినీ వెలిగిస్తుంది. జ్యోతిర్మయ స్పటికం తానూ జ్యోతీ రెండూకూడ. అలాగే వరప్రసాదమయాత్మం తానూ వరప్రసాదమూ రెండూకూడ. వెలుగు స్ఫటికం యొక్క అస్తిత్వాన్ని నాశం చేయని యట్లే వరప్రసాదంకూడ ఆత్మ ఆస్తిత్వాన్ని నాశం చేయదు. (2) వెలుగు ప్రసరించినంత కాలం మాత్రమే స్ఫటికం ప్రజ్వరిల్లుతుంది. ఆ వెలుగు అంతరించగానే స్ఫటికం బండవారిపోతుంది. అదేరీతిగా మన హృదయంలో దైవసాన్నిధ్యం ఉన్నంతకాలమే వరప్రసాదమూ నిలుస్తుంది. పాపం ద్వారా ఆ దేవుని పోగొట్టుకొనినంతనే ఆ దైవతేజం కూడ చల్లారిపోతుంది.

దివ్యజ్యోతితో వెలిగే ఆత్మం ఆధ్యాత్మిక సత్తు కావున దానిని ఈ భౌతిక నేత్రాలతో చూడలేం. చూచామో, మరి ఈ యైహిక వస్తువులేవీ మన కంటికి ఇంపుగొల్పవు. పెద్దతెరీస, సియన్నా కత్తరీన మొదలైన పనీతురాళ్ళ కూడ పవిత్రస్థితిలోనున్న ఆత్మకంటె సుందరరూపం మరొకటి లేదని వ్రాసారు. ఉదయం గడ్డిమీద కన్పించే నీటిబొట్ల సూర్యుడు ఉదయించనంతవరకూ ఒట్టినీటిబొట్లే. కాని సూర్యకిరణాలు సోకిన వెంటనే ఆ నీటిబొట్ల సూర్యుణ్ణి ప్రతిబింబించుకొని ముత్యాల్లాగ మెరిసిపోతాయి. మన ఆత్మకూడదైవవరప్రసాదాన్ని పొందిన వెంటనే దివ్యరూపంతో, దివ్యతేజంతో మెరసిపోతుంది. ఆ బిందువు తానూ ఓ సూర్యుళ్ళాగ వెలిగినట్లే, మన ఆత్మం కూడ తానూ ఓ దేవుళ్ళాగ మెరసిపోతుంది. ఐనా ఆత్మ దివ్యతేజాన్ని ఆవలితీరాన అడుగుపెట్టిందాకా ఈ భౌతిక చక్షువులతో వీక్షించలేం. ఇంకా తీరము జేరని బాటసారులమైన మనం దివ్యరూపాలను మాసిన అద్దంలోని ప్రతిబింబంలాగ మసకమసకగా మాత్రమే దర్శించగలం - 1 కొరి 13, 12.

5. దివ్యగ్రంథ వర్ణణం

టెంటుసభ ప్రకారం, నీతిని పొందండమంటే మన పాపాలు యథార్థంగా పరిహారం కావడం. మన ఆత్మ వర ప్రసాదాన్ని పొంది క్రొత్తతనాన్నీ మార్పునీ చేకొనడం. దివ్యగ్రంథాలు కూడ ఈ సత్యాలనే బోధిస్తాయి.

1. పాపపరిహారం : మొదటి యోహాను జాబు క్రీస్తు రక్తం మనలను పాపంనుండి శుభ్రంగా కడిగివేస్తుంది అని చెప్తుంది. 1,7. స్నాపక యోహాను క్రీస్తును చూచి "ఇదుగో "లోకం పాపాలను తొలగించడానికై వచ్చిన దేవుని గొర్రెపిల్ల' అంటాడు - యోహా 1,29 క్రీస్తు సిలువమీద మరణంచిందీ మల్లా ఉత్థానమైందీ మన పాపాలను పరిహరించడం కోసమేగదా! కావున నీతిని పొందడం ద్వారా మన పాపాలు యథార్థంగా పరిహారమౌతాయికాని, కప్పివేయబడవు. పూర్వవేదపు యిస్రాయేలు ప్రజలు కూడ దేవుని కృపవల్ల తమ పాపాలు పూర్తిగా మన్నింపబడ్డాయనే నమ్మారు. 51వ కీర్తన "ప్రభూ! కారుణ్యతిశయంతో నా పాపాలను తుడిచివేయి. నన్ను పూర్తిగా కడిగి శుభ్రాత్ముని చేయి.హిస్సోపతో నా పాపాలను కడిగివేయి. నేను మంచుకంటె తెల్లనయ్యేలా నన్ను కడుగు. నాలో నిర్మల హృదయం నెలకొల్పు అంటుంది. ఈ వాక్యాల భావం ప్రకారం, యావే మన పాపాలను పలకమీది అక్షరాలనులాగ తుడిచివేస్తాడు. శుభ్రమైన నీటిలో మరికి బట్టనులాగ మన మలినాత్మను శుభప్రరుస్తాడు. కనుక దేవుడు మన ఆత్మను క్రీస్తు వరప్రసాదంతో కప్పివేయుడు. దాని పాపాలను పూర్తిగా క్షమిస్తాడు.

2. క్రొత్తదనము : పౌలు ఎఫేసీయుల జాబులో "మీ చిత్తవృత్తి యందు నూత్నత్వం పొందండి. నీతి, భక్తి కలవాట్టె దేవునికి పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని చేకొనండి" అంటాడు - 424. ఇలా నూత్నత్వం పొందాలి అని బైబులు చాలా తావుల్లో చెప్తుంది.

ప్రార్థనా భావాలు

1. జ్ఞానస్నానంద్వారా మనం క్రీస్తుతో ఐక్యమౌతాం. అతనినుండి వరప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈ యంశాన్ని నూత్నవేద రచయితలు మూడుపమానాలలో వివరించారు.

పౌలు దేహం అవయవాలు అనే వుపమానం వాడాడు - 1కొ 12, 27. "జ్ఞానస్నానంద్వారా క్రైస్తవులు క్రీస్తుతో ఐక్యమై అతనితో ఒక్కదేహంగా ఏర్పడతారు. ఈ దేహానికి శిరస్సు క్రీస్తు అవయవాలు క్రైస్తవులు. అవయవాలు శిరస్సు వలన జీవిస్తాయి. ఆలాగే క్రైస్తవులు క్రీస్తు వలన జీవిస్తారు. శిరస్సులోని జీవం అవయవాల్లోనికి మల్లే క్రీస్తులోని దివ్యజీవం క్రైస్తవుల్లోనికి ప్రసరిస్తుంది. ఈ దివ్య జీవనమే వరప్రసాద జీవితం,

2. యోహాను తీగలు రెమ్మలు అనే వుపమానం వాడాడు. -15, 16. తీగలోని సారం రెమ్మలలోనికి ప్రసరిస్తుంది. ఆరెమ్మలు ఆకుదొడిగి పూలుపూచి కాయలు కాస్తాయి. తల్లి తీగనుండి వేరుచేస్తే రెమ్మలు వెంటనే వాడిపోతాయి. క్రైస్తవులు కూడ క్రీస్తుతో ఐక్యమై అతని సారంవలన జీవిస్తుంటారు. అతని సారం వలననే సత్ఫలితాన్ని ఇస్తుంటారు. క్రీస్తునుండి వేరైతే నిప్రయోజకులై పోతారు. క్రీస్తునుండి క్రైస్తవులు పొందే సారమే వరప్రసాద జీవితం. 3. పేత్రు వ్రాసిన మొదటి జాబులో దేవాలయ సజీవ శిలలు అనే వుపమానం వాడాడు -23. క్రీస్తు శిల. ఈ శిలను మూలరాయిగా చేసి తండ్రి దివ్యమందిరాన్ని నిర్మిస్తాడు. క్రైస్తవులుకూడ సజీవ శిలల్లాగ ఆ మందిరంలో నిర్మింపబడతారు. అనగా క్రీస్తుతో కూడి మనమంతా ఒక మందిరమౌతాం. ఈ దేవాలయంలో మనం పరలోకపు తండ్రిని ఆరాధిస్తాం. ఇక్కడ వుపమానం యిది. మందిరానికి ఐక్యతా నిలకడా పెంపూ యిచ్చేది మూలరాయి. అలా క్రైస్తవ ప్రజలకు జీవమూ ఐక్యతా ప్రసాదించేది క్రీస్తు.

పై మూడుపమానాలు క్రీస్తుతో మనకుండే సంబంధాన్నీఐక్యతనూ సూచిస్తాయి. ఈయైక్యత జ్ఞానస్నానం నుండి ప్రారంభమౌతుంది. జ్ఞానస్నానమంటే క్రీస్తు మరడోత్థానాల్లో పాలుపొంది అతని వరప్రసాదాన్ని స్వీకరించడమే.

2. నరుడు దివ్యుడు

పూర్వాధ్యాయంలో పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి చెప్పాం. ఈ పవిత్రీకరణ వరప్రసాదం మనలను దివ్యులను చేస్తుంది. ప్రస్తుతాధ్యాయంలో ఈ దివ్యత్వమంటే యేమిటో విచారించి చూద్దాం. ఇక్కడ మూడంశాలు తెలిసికొందాం.

1. నరుడు దేవుని ప్రతిబింబం

దివ్యజీవితం జీవించే సామర్థ్యాన్ని ఇచ్చేది మనలోని ఆత్మం. ఈ యాత్మ ద్వారానే నరుడు దేవునిపోలికను పొందుతున్నాడు. ఈ పోలికను ఆదికాండం ఈలా వర్ణిస్తుంది. దేవుడు నరుని సృజించాలి అనుకున్నాడు. సమస్త ప్రాణికోటిపై అతడు అధికారం నెరపాలి అనుకున్నాడు. ఇట్లనుకొని తనకు ప్రతిబింబంగా నరుని సృజించాడు. స్త్రీ పురుషులనుగా ఆ నరుని సృజించాడు-126-28. పూర్వ నూత్నవేదాలు చాలా తావుల్లో ఈ విషయాన్ని పేర్కొంటాయి. నరుడు దేవునికి పోలికగా వుంటాడు అనడంలో దివ్యగ్రంథం ఉద్దేశాలు ఇవి 1. నరుడు భగవంతునికి పోలికగా సృజింపబడ్డాడు అంటే అతడు జంతువుల కంటె అధికుడు. ఈ పోలికద్వారా నరుడు భూమ్యాకాశ సముద్రాల్లో సంచరించే ప్రాణులన్నింటి మీద అధికారం నెరవుతూన్నాడు. 2. ఈ పోలిక ద్వారానే అతడు దేవునికి పుత్రుడయ్యాడు. 3. అతని యందు అతనిద్వారా దేవుడు భూమిమీద నెలకొన్నాడు. 4. ఈ పోలికే అతనికి అమృతత్వాన్ని ఇస్తుంది. 5. పాపం వలన నరునిలోని యీ పోలిక మాసిపోతుంది. 6. నరునిలో మళ్ళా యీ పోలికను కలిగించడానికే క్రీస్తు వచ్చాడు. అతడు భగవంతుని ప్రతిబింబం. క్రీస్తు రూపాన్ని ప్రతిబింబించు కోవడమే మన బాధ్యత 8. జ్ఞానస్నానం మొదలైన సంస్కారాలవల్ల, విశ్వాసంవల్లా నైతిక జీవితంవల్ల నానాటికీ ఈ క్రీస్తు పోలిక మనలో పెరుగుతుంది. పరిశుద్ధాత్మఓ చిత్రకారునిలాగ క్రీస్తు రూపాన్ని మన హృదయంమీద చిత్రిస్తుంది. అగస్టీను, అక్వెనాసు మొదలైన దైవశాస్త్రజ్ఞలు పై బైబులు భావాల మీద ఆలోచన సల్పి ఈక్రింది భావాలను వెల్లడించారు. మనుష్యుల్లో దేవుని పోలికా వుంది, త్రీత్వైక సర్వేశ్వరుని పోలికా వుంది.

దేవుని పోలిక మూడు దశల్లో కన్పిస్తుంది. మొదటి దశ సృష్టికి చెందింది. ప్రతి నరుని ఆత్మలోను సృష్టికర్త రూపం వుంటుంది. దీని వలననే అతడు దేవుని తెలిసికొని ప్రేమింప గల్లుతూన్నాడు. జన్మపాపం ద్వారా ఈ రూపం మాసిపోదు. రెండవదశ ఉద్ధరణకు చెందింది. నరుడు ప్రాకృతిక జీవితం నుండి వరప్రసాద జీవితంలో ప్రవేశించి తన ఆత్మలో దేవుని రూపం కలిగించుకుంటాడు. చావైన పాపం చేసిన వెంటనే ఈ పోలిక నశిస్తుంది. మూడవ దశ మహిమకు చెందింది. మోక్షంలో ప్రభుని ముఖాముఖి దర్శించే పనీతుల్లో అతని దివ్యరూపం వెలుగుతూంటుంది. ఈ మూడవ పోలిక ఎప్పటికీ మూసిపోదు, ఈ మూడవ పోలికవలన మనం కూడ దేవునిలాంటి వాళ్ళమౌతాం. అందుకే యోహాను మొదటి జాబు "దేవుడు ప్రత్యక్షమైనప్పడు మనంకూడ అతనిలా ఔతాం, ఉన్నవానిని ఉన్నట్లుగా అతని నిజరూపం చూస్తాం" అని చెప్తుంది - 3,2.

నరులయందు త్రీత్వెక సర్వేశ్వరుని పోలిక కూడ వుంది. నరునిలో ఉనికి, చిత్తశక్తి, బుద్ధిశక్తివుంటాయి. ఉనికి వలన జనుడు ఉండగల్లుతున్నాడు. బుద్ధిశక్తిద్వారా ఆలోచింపగల్లుతున్నాడు. చిత్తశక్తిద్వారా ప్రేమింప గల్లుతున్నాడు.

నరుని ఉనికి పితయైన సర్వేశ్వరునికి పోలికగా వుంటుంది. ముగ్గురు దైవవ్యక్తుల్లోను తొలివ్యక్తి పిత. అతడు అన్ని ప్రాణులకు ఉనికి నిచ్చేవాడు. ఐనా అతని కెవ్వరూ ఉనికి నీయరు. మరి తనంతట, తననుండి తాను ఉండేవాడు. కావున మన యునికి అతని యునికికి ఒక మాదిరి ప్రతిబింబం, ఒక మాదిరి పోలిక.

నరునియందలి బుద్ధిశక్తి రెండవ వ్యక్తియైన సుతుడైన సర్వేశ్వరునికి పోలికగా వుంటుంది. రెండవ దైవవ్యక్తి పిత బుద్ధిశక్తినుండి వెలువడతుంటాడు. కనుకనే అతనికి "వార్త” అని పేరు. అనగా అతడు పిత పలుకూ ఆలోచనమూను. మనలోని ఆలోచనద్వారా ఈ రెండవ దైవవ్యక్తిని పోలివుంటాం.

మనలోని చిత్తశక్తి మూడవ దైవవ్యక్తియైన పరిశుద్దాత్మకు పోలికగా వుంటుంది. చిత్తశక్తి ప్రేమకు ఆధారం కదా! పరిశుద్ధాత్మ కూడ పితసుతుల పరస్పర ప్రేమే. కనుక మనలోని ప్రేమద్వారా పరిశుద్ధాత్మకు పోలికగా వుంటాం.

నరులమైన మనకు దివ్యత్వం లభిస్తుంది. కాని ఈ దివ్యత్వాన్ని పొందే అర్హత మనలో వుండాలి. ఈ యర్హతే మనలోని దేవుని పోలిక. ఈ పోలిక వలననే నరులు పశుపక్ష్యాదులకంటె గొప్పవాళ్లి, దేవుని రూపాన్ని పొంది దైవజీవితం జీవింప గల్లుతున్నారు. రెండవ శతాబ్దపు వేదశాస్త్రజ్ఞడు ఇరెనేయుస్ ‘నరుడు దేవుని మహిమను విస్తరింప జేస్తున్నాడు" అని వ్రాసాడు.

2. గ్రీకు పితృపాదులు

సిరిల్, బాసిల్, గ్రెగొరీ మొదలైన గ్రీకు పితృపాదులు క్రీస్తు ద్వారా మనం దివ్యత్వం పొందుతామని చెప్పారు. వాళ్ళ భావాలను కొన్నిటిని చూద్దాం. క్రీస్తు జననాన్ని గూర్చి వ్రాస్తూ ఇరెనేయస్, మనుష్యుడు దైవకుమారుడు కావడం కోసమే రక్షకుడు మనుష్య కుమారుడై జన్మించాడని చెప్పాడు. అతనేష్యస్ కూడ క్రీస్తు నరుడై నరుని దేవుని గావించాడు అని వ్రాసాడు.

అలెగ్జాండ్రియా సిరిల్ క్రీస్తు దేవదూతల కుటుంబంలో జన్మింపక అబ్రాహాము కుటుంబంలో జన్మించి నరుడుగా మెలగనేల అని ప్రశ్నించుకొని ఈలా జవాబు చెప్పాడు. మన బానిసజాతిలో జన్మించడంవల్ల క్రీస్తుకు కలిగిన లాభమేమీలేదు. మరి లాభమంతా బానిసలమైన మనకే క్రీస్తుద్వారా మనం బానిసానికి తప్పి దైవత్వం పొందుతున్నాం. పేదరికాన్ని జయించి కలిమిని పొందుతున్నాం.

నీస్సా గ్రెగోరీ తలపున, మంచి కాపరియైన క్రీస్తు తప్పిపోయిన గొట్టెను తన భుజాలమీదికి ఎక్కించుకొని తానూ ఆ గొట్టె స్వభావం పొందుతాడు. ఇక్కడ కాపరి దేవుణ్ణి, గొట్టె మానవ సంతతినీ సూచిస్తుంది. క్రీస్తు గొట్టె, కాపరి రెండూకూడ. అతడు గొట్టె దేనికంటే తాను గైకొనిన క్రొత్త స్వభావం వలన. కాపరి ఎందుకంటే తన స్వీయ స్వభావంచేత, ఈ రీతిగా క్రీస్తు మన స్వభావం గైకొనడం చేత మనం క్రీస్తు స్వభావం గైకొంటున్నాం. అనగా భగవంతులమౌతూన్నాం.

నాసియాన్సన్ గ్రెగోరీ తలపున, క్రీస్తు మన రోజువారి పనులను తానూ చేసి వాటిద్వారానే మనకు దైవత్వం ఇస్తాడు. మన నిద్రను ఆశీర్వదించడానికే ప్రభువు తాను నిద్రపోయాడు. మన అలసటను పునీతం చేయడానికే ప్రభువు తానూ అలసట చెందాడు. మన కన్నీటిని పవిపత్రం చేయడానికే ప్రభువు తానూ కన్నీరోడ్చాడు.

ఇంకా ఈ గ్రెగోరీ తన్ను గూర్చి తానే మననం చేసుకొని ఈలా అబ్బురపడ్డాడు. నేను అల్పప్రాణిని మహత్తర ప్రాణినికూడ. మృత్యువువాతబడేవాడిని, అమృతత్వాన్ని పొందేవాడినిగూడ, దేహిని, ఆత్మచే అలంకృతుణ్ణి కూడ. భౌతిక ప్రపంచవాసిని, దైవపరంలో అడుగుపెట్టే వాణ్ణి కూడ. ఏమి వింత? ఈ భాగ్యమంతా క్రీస్తుద్వారానే. నేను క్రీస్తుతో ఐక్యమై క్రీస్తునందు మరణిస్తాను. క్రీస్తుతో భూస్థాపితుడనై అతనితోనే ఉత్తానమౌతాను. క్రీస్తుతో స్వర్గానికి వారసుడ నౌతాను. క్రీస్తు ద్వారా దైవపుత్రుడనౌతాను. దైవత్వం పొందుతాను.

అతనేష్యన్ తలపున, క్రీస్తు మహిమ మనకూ సంక్రమిస్తుంది. క్రీస్తు మనదేహాన్ని గైకొని మన మానుష సంతతితో నివసించడంచే మనం కూడ దేవుని ఆలయాల మౌతాం. కావున దేవాలయాలమైన మనయందు కూడ ప్రభువు ఆరాధ్యుడు. మనలను చూచిన నరులుకూడ "భగవంతుడు వీళ్ళయందున్నాడు" అని భావిస్తుంటారు - 1 కొరి 1425. పై అతనేష్యస్ మనం దైవ పుత్రులమౌతామని కూడ చెప్పాడు, మంటిమీది వాళ్ళని మింటిమీదికి చేర్చడానికే క్రీస్తు మింటి మీదినుండి మంటిమీదికి దిగివచ్చాడు. మానవకుమారులను దైవకుమారులను గావించడం కోసమే దైవకుమారుడు మానవకుమారుడై జన్మించాడు. తాను మనుష్య కుమారుడన్న పేరుతో చలామణి అయ్యాడు. అతని ద్వారా మనం దైవకుమారులమై పరలోకంలోని దేవుణ్ణి "మా తండ్రీ!” అని పిలుస్తున్నాం.

బానిసల ప్రభువు తనకు బానిసయైన ఆదామునకు బానిసయై జన్మించాడు. దానిద్వారా మృత్యుగ్రస్తులైన ఆదాము పుత్రులు అమృతత్వం పొంది దైవ కుమారులయ్యారు. కావుననే "అతడు వారిని దైవపత్రులను చేసాడు" అని చెప్పబడింది. - యెహా 1,12. అతడు స్యభావసిద్ధంగానే దైవకుమారుడు. మనం అతని వరప్రసాదం ద్వారా దైవ పత్రులం. ప్రభువు కరుణామయుడు కాబట్టి తాను ఆదాము పుత్రుడై జన్మించి మనలనుకూడ తనయందు భరించుకొన్నాడు. దీని వలన మనం దేవుణ్ణి మనయందు భరించుకో గల్లుతున్నాం.

హిలరీ భావాల ప్రకారం క్రీస్తు మన మానుష స్వభావాన్ని చేకొని మనలనందరినీ తనలోనికి తీసికొన్నాడు. తాను ఓ పట్టణంలా వుంటాడు. క్రీస్తుతో ఐక్యమై ఆ దివ్యపట్టణంలో వసించే దివ్యపౌరులం మనం.

క్రీస్తుద్వారా దైవత్వాన్ని పొందినట్లే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని పొందుతుంటాం. అలెగ్జాండ్రియా సిరిల్భావాల ప్రకారం, క్రీస్తు పితకు ప్రతిబింబమైతే పరిశుద్దాత్మ క్రీస్తుకు ప్రతిబింబం. కావుననే ఈ పావనాత్మక్రీస్తు రూపురేఖలను మన హృదయాల్లో చిత్రిస్తుంది. ఈలా చిత్రించడం ద్వారానే మనం క్రీస్తు దైవత్వంలో పాలు పొందుతూంటాం.

పితృపాదుల భావాలు ఎంత రమ్యంగా వుంటాయో అంత బహుళంగా వుంటాయికూడ. కాని వాని నన్నిటినీ ఇక్కడ పేర్కొనలేం. వాళ్ళ భావాల సారం యిది: క్రీస్తు స్వభావ సిద్ధంగా దైవకుమారుడు. మనం క్రీస్తు కృపవల్ల దైవ కుమారులం. ఈ దైవత్వంపై మనకు ఏ హక్కూలేదు. స్వభావసిద్ధంగా మనం దేవుళ్ళం కాదుగదా, పాపపు నరులం కూడ. మన స్వభావం వేరు. దైవస్వభావంవేరు. ఐనా ప్రభువు మనమీద దయబూని తన దైవత్వంలో మనమూ పాలు పొందేలా చేసాడు.

3. ఉపనిషద్భావాలు

మనం స్వభావ సిద్ధంగా భగవంతులం కాము, క్రీస్తు వరప్రసాదం వలన దివ్యత్వం పొందుతామని చెప్పాం. కాని హిందూ సోదరులు, జనులు స్వభావసిద్ధంగానే భగవంతులు అని చెప్తారు. వరప్రసాదంతో అవసరం లేకుండానే, మనమే భగవంతులం, భగవంతుడే మనం అని వాదిస్తారు. ఈ వాదనకే అద్వ్తమని పేరు. మోక్షసాధనకై హిందువులు కర్మ భక్తి, జ్ఞానం అనే మూడు మార్గాలు సూచిస్తారు. ఈ మూడింటిలో జ్ఞానమార్గం మాత్రమే అద్వైతవాదాన్ని అవలంబిస్తుంది. ఈ యద్వైత వాదం తొలుత ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడింది, ఉపనిషత్తులు వేదాల్లో ఓ భాగం. క్రీస్తు పూర్వం 8-4 శతాబ్దాల్లో రచింపబడ్డాయి. ఈ యుపనిషత్తులు మానవుడుకూడా భగవంతుడే అనే అద్వెత వాదాన్ని మాత్రమేకాక, నరుడు భగవంతుడు వేరు వేరు సత్తులనే ద్వెత భావాన్నీ ఈ సత్తులన్నీ భగవంతుని గుణాలను కలిగి వుంటాయనే బహ్వీశ్వర భావాన్నీ కూడ బోధిస్తాయి. కనుక ఉపనిషద్బోధల్లో ఓ పాయ మాత్రమే అద్వైత బోధ. ఇక ఈ యద్వైత సారం యిది : (1) మనం మొదటినుండీ బ్రహ్మలమే. (2) ఐనా మాయ వలన ఈ సత్యాన్ని మరచి ఆ బ్రహ్మ వేరు, మనం వేరు అని బ్రాంతి పడుతూంటాం. (3) జ్ఞానం ద్వారా మనం కూడా బ్రహ్మమేనని తెలిసికొనిన వెంటనే ఆ బ్రహ్మతో ఐక్యమై పోతాం. ఈ మూడంశాలను ఒకింత విపులంగా విచారించి చూద్దాం.

1. ఉపనిషత్తులు భగవంతుని "బ్రహ్మము" అని పిలుస్తాయి. ఈ బ్రహ్మము త్రిమూర్తులలోని "బ్రహ్మ" కాదు. జగదాధారమైన కారణం. బ్రహ్మపుంలింగం, బ్రహ్మము నపుంసక లింగం. ఈ బ్రహ్మము, మానవుడు, భౌతిక ప్రపంచము - ఈ మూడు మూడు ప్రత్యేక సత్తులు కావనియు ఒకే సత్తనియ ఉపనిషత్తుల సిద్ధాంతం. చాందోగ్యోపనిషత్తు ఈ విశ్వమంతా బ్రహ్మయే అంటుంది. “సర్వంఖలు ఇదంబ్రహ్మ-" 8,14,1. బృహదారణ్య కోపనిషత్తు నేనే బ్రహ్మమునని చెపుతుంది. జీవాత్మను పరమాత్మతో ఏకం చేస్తుంది. "అహం బ్రహ్మ అస్మి" - 1, 4,10.

2. మనమందరమూ స్వయంగా బ్రహ్మమే. ఐనా మాయకు జిక్కి ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ బంగారపు గనివుంది అని తెలియనివాడు ప్రతిరోజు గనిమీద నడుస్తున్నా అక్కడున్న అమూల్య వస్తువును తెలిసికోలేడు. అలాగే మనమూ ప్రతిదినం బ్రహ్మ జీవితం జీవిస్తున్నా అ బ్రహ్మమును తెలిసికోలేక పోతున్నాం. బ్రహ్మజ్ఞానంద్వారా మాత్రమే నరులు ఈ మాయను దాటగల్లుతున్నారు.

3. బ్రహ్మమును ధ్యానించి బ్రహ్మ స్వభావం తెలిసికోవడంద్వారామనంకూడ బ్రహ్మలమైపోతాం, బ్రహ్మమైపోతామంటే మనమింతకు ముందు కాని నూత్న వ్యక్తిమైపోతామని కాదు. మనం బ్రహ్మమేనని తెలిసికొంటాం, అంతే. ఈ తెలివిడి ద్వారానే బ్రహ్మభావాన్ని పొందుతాం. బ్రహ్మభావం పొందడమంటే ఏదో కావడంగాదు, తెలిసికోవడం మాత్రమే. బృహదారణ్య కోపనిషత్తు నేనే బ్రహ్మను అని తెలిసికొనేవాడు ఈ సర్వమూ ఔతాడు అంటుంది. "ఆహం బ్రహ్మ అస్మీతి స ఇదం సర్వం భవతి" - 1,410. ఈరీతిగా బ్రహ్మముతో ఐక్యమైనంక నేను జగత్తు, భగవంతుడు అనే మూడుసత్తులు ఉండవు. ఈ మూడు ఒకే సత్తుగా పరిగణింపబడతాయి. ఈ యద్వైతవాదం బోధించే దివ్యత్వం మన క్రైస్తవమతం బోధించే దివ్యత్వం కంటె భిన్నమైంది. మన తలపున నరులకు స్వభావ సిద్ధమైన దైవత్వం లేదు. దైవత్వం మనకు వర ప్రసాదం వలన లభిస్తుంది. దైవత్వాన్ని పొందినంకకూడ నరులు దేవునితో కలసిపోరు. మోక్షంలోకూడ నరుడు వేరు, భగవంతుడు వేరు. కాని అద్వెతవాదం ప్రకారం నరులు స్వభావ సిద్ధంగానే భగవంతులు. ఈ భగవత్వభావాన్ని వాళ్ళు ఏనాడూ పోగొట్టుకోలేదు. మరచిపోయారు అంతే. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసికోగానే నరుడూ భగవంతుడై పోతాడు.

ఈ యద్వెతవాదాన్ని హైందవ లెప్పడూ సకారణంగా రుజవు చేయరు. ప్రాచీన ఋషుల అనుభవమని మాత్రం చెపుతూంటారు. వ్యక్తిగతానుభవానికి దైవశాస్త్రరీత్యా ఏమి విలువ? మన దివ్యగ్రంథాలూ పారంపర్యబోధా నరుడు భగవంతుడేనని చెప్పవు.సృష్టి ప్రాణియైన నరుడు సృష్టికర్తనుండి దివ్యత్వమనే భిక్షను స్వీకరిస్తాడని మాత్రం చెప్తాయి.

ప్రార్థనా భావాలు



1. వరప్రసాదం అంటుమామిడి లాంటిది. పుల్లమామిడిపై తీయమామిడిని అంటుకడతాం. దీనివలన తీయమామిడి పుల్లమామిడి సారాన్ని తలలోనికి మార్చుకొని తీయని పండ్లనిస్తుంది. పవిత్రీకరణ వరప్రసాదం మనమీద కట్టబడిన అంటులాంటిది. మనంతటమనం పుల్లమామిడి లాంటివాళ్ళం. ప్రాకృతిక మానవులం. మన జీవితంకూడ పుల్లనిపండ్లనేగాని తీయనిపండ్లనీయలేదు. కాని పవిత్రీకరణ వరప్రసాదం ఓ మారు మనమీద అంటుపాతుకొందో, ఇక మన జీవితమూ మన కార్యాలూ దివ్యత్వాన్ని పొందుతాయి. మన తలపుల్లో పలుకుల్లో చేతల్లో దివ్యత్వం గోచరిస్తుంది. కనుకనే పౌలు "నేను జీవిస్తున్నాను. కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అని చెప్పకొన్నాడు - గల 2, 20. ఇది చాల లోతైన వాక్యం.

2. వరప్రసాదం ద్వారా ప్రాకృతిక మానవులమైన మనం దివ్యమానవుల మౌతాం. దేవుని బిడ్డల్లా ప్రవర్తిస్తాం. ఓమారు ఫ్రాన్సుదేశపు లూయిూరాజు కొమార్తను ఆమె పరిచారిక చిన్నచూపు చూచిందట. రాజకుమారి ఆగ్రహించింది ప్రభువపత్రికనైన నన్ను చిన్నచూపు చూస్తావా అని గద్దించింది. కాని ఆ పరిచారిక ఏమీ జంకక పరలోక భూలోకాలకు ప్రభువైన దేవుని పత్రికను నన్ను ఈ రీతిగా ప్రశ్నిస్తావా అంది, ఔను, మనం వరప్రసాదంద్వారా దేవుని బిడ్డలం, దివ్యజీవితం జీవించేవాళ్ళం. తరచుగా ఈ సత్యాన్ని జఞపకం చేసికోవడం మంచిది

.

3. దత్తపుత్రులు

పూర్వాధ్యాయంలో పవిత్రీకరణ వరప్రసాదం మనలను దివ్యలను చేస్తుంది అని చెప్పాం. ఇదే వరప్రసాదం మనలను దేవునికి దత్తపుత్రులను చేస్తుంది. కావున ఈ యధ్యాయంలో దత్తపుత్రులు కావడమంటే యేమిటో చూద్దాం. ఇక్కడ మూడంశాలను పరిశీలిద్దాం.

1. దత్త పత్రులు


ఎఫెసీయుల జాబులో పౌలు, పరలోకపిత లోకారంభం నుండి మనలను క్రీస్తుద్వారా దత్తపత్రులనుగా ఎన్నుకొన్నాడు అని వ్రాసాడు - 1,5. దత్తపత్రులటే యేమిటి? క్రీస్తు ద్వారా ఎన్నుకోవడమంటే యేమిటి?

దత్తపుత్రుని లక్షణాలు రెండు. 1. మన కుటుంబానికి చెందని అన్యవ్యక్తి నొకనిని పుత్రునిగా స్వీకరిస్తాం. 2. కుటుంబపు ఆస్తిపాస్తులపై అతనికి వారసపు హక్కులభిస్తుంది. ఈ రెండు ఉపకారాలనీ అతనికి హక్కులేదు. క్రొత్త తల్లిదండ్రుల కారుణ్యం వలన ఈ రెండుపకారాలు అతనికి ఉచితంగా లభిస్తాయి.

దేవునిపట్ల మనకు చనువు వుంటుందని తెలియజేయడానికే పౌలు మనం దత్తపుత్రులమని చెప్పడు. దత్తపుత్రుడు క్రొత్త తల్లిదండ్రులను తన సొంత తల్లిదండ్రుల్లాగ భావిస్తాడు. వాళ్ల పట్ల చనువుతోమెలుగుతాడు. వాళ్ళూ అతన్ని ప్రేవున బుట్టిన బిడ్డనులాగ వాత్సల్యంతో చూస్తారు. ఈ చనువు ఈ ప్రేమ దేవునికీ, మనకీ వుండే బాంధవ్యానికి ఓ మాదిరి పోలిక.

దత్తపుత్రుడు యథార్థంగా తల్లిదండ్రుల ప్రేవున పుట్టలేదు. అతనికి భౌతిక జీవితాన్ని ఇచ్చింది వాళ్ళుగాదు. అతని పట్టుక, మనిక ఈ తల్లిదండ్రులమీద ఆధారపడి వుండవు. కాని భగవంతునిపట్ల మన పత్రత్వం ఈలాంటిదిగాదు, పరలోక పిత మనలను దత్తపుత్రులనుగా స్వీకరించినపుడే తన పితృత్వాన్ని మనమీద విస్తరింప జేస్తూంటాడు. మనం అతని స్వభావంలో పాలుపొందుతాం. ఏలాగ?

పిత పత్రుడైన వార్త మన మానుష దేహాన్ని స్వీకరించి క్రీస్తుగా జన్మించాడు. మనం క్రీస్తులోనికి జ్ఞానాస్నానం పొందినపుడు అతనితో ఐక్యమౌతాం. క్రీస్తు స్వీకరించింది ఓ ప్రత్యేక మానుష దేహాన్ని మాత్రమే కాదు. మానుష వ్యక్తులమైన మనలనందరినీకూడ. అతనితోగూడి మన మందరము ఒక్క జ్ఞాన శరీరమౌతాం. అతడు పరలోక పితకు పత్రుడు. ఈ పత్రునితో ఐక్యమైన మనమూ ఈ పత్రుని ద్వారా పరలోకపు తండ్రికి దత్తపుత్రులమరొతాం.

జ్ఞానస్నానంద్వారా క్రీస్తు తన పత్రత్వంలో మనకూ భాగమిస్తాడు. మనలను తన సోదరులను చేసికొంటాడు. అతడు మనకు పెద్దన్న మన మందరమూ అతనికి తమ్ముళ్ళమూ చెల్లెళ్ళమూ ఔతాం. అతని ద్వారా మనం అతని తండ్రికి బిడ్డల మౌతాం. క్రీస్తు వరప్రసాదం మనలను భగవంతుని పత్రులను చేస్తుంది. అందుకే పౌలు పై వాక్యంలో తండ్రి మనలను క్రీస్తుద్వారా దత్తపుత్రులనుగా ఎన్నుకున్నాడు అని వ్రాసాడు.

కాని దివ్యగ్రంథం మనం దత్తపుత్రులమని చెప్పడం దేనికి? క్రీస్తుతోపాటు మనంకూడ పరలోక పితకు సహజపుత్రులం కామా? పితకు సహజ పుత్రుడు క్రీస్తు ఒక్కడే అందుకే దివ్యగ్రంథం అతన్ని "ఏకైక పుత్రుడు" "తొలిపుత్రుడు" అని పిలుస్తుంది. క్రీస్తు మాత్రమే సహజ పత్రుడు గావడంచేత ద్యివగ్రంథం మనలను "దత్తపత్రులు" అని పిలుస్తుంది. ఐనా క్రీస్తులాగే మనంకూడ దేవునికి నిజమైన పత్రులం. అందుకే యోహాను మొదటిజాబు “మనం దేవుని బిడ్డలమని పిలవబడుతూన్నాం. యథార్థంగా బిడ్డలంకూడ" అంటుంది. 3,1.

2. క్రీస్తు - దత్తపుత్రులు

దత్తపత్రుల్లో మూడు తరగతుల ప్రజలు గోచరిస్తారు. మొదటి తరగతికి ఆధారం అన్ని మతాలకు చెందిన ప్రజలూ తాము భగవంతుని బిడ్డలమనే చెప్పకున్నారు. భగవంతుణ్ణి “తండ్రి" అని సంబోధించారు. అతడు సృష్టికర్త ఈ నరులంతా అతడు సృజించిన ప్రాణులు. అతని నుండి ప్రాణం పొందడంవలన నరులు అతనికి దత్తపుత్రు లొలారు.

రెండవ తరగతికి చెందినవాళ్ళ యూదులు. ఈ తరగతికి ఆధారం ఒడంబడిక. ప్రభువు అబ్రహాముతో ఒడంబడిక చేసికొన్నాడు. ఈ యొడంబడికనే సీనాయివద్ద మోషే సమక్షంలో నూతీకరించాడు ప్రభువు. ఈ సీనాయి ఒడంబడిక ద్వారా యిస్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. యావే ఆరాధకులయ్యారు. యావేకు పత్రులయ్యారు. యిప్రాయేలు ప్రజలు వ్యక్తిగతంగాగాదు, సాముదాయికంగా యావేకు పత్రులు. కావుననే మోషే యావే తరపున ఫరోచక్రవర్తితో మాటలాడుతూ “యిస్రాయేలు నా తొలి పుత్రుడు, అతనిని ఈజిప్టునుండి వెడలిపోనీయి" అంటాడు - నిర్గ 4, 21. ఇక్కడ "తొలిపుత్రుడు" అంటే గారాబు బిడ్డ అని భావం. యిస్రాయేలు ప్రజలంతా యావేకు బిడ్డలాంటివాళ్ళు.

మూడవ తరగతికి చెందినవాళ్ళు క్రైస్తవులు. ఈ తరగతికి ఆధారం జ్ఞానస్నానం, యూదులు సాముదాయికంగా యావే పుత్రులన్నాం. క్రైస్తవులు వ్యక్తిగతంగా గూడా యావే పుత్రులు. జ్ఞానస్నానంద్వారా ఈ పత్రత్వం మనకు లభిస్తుంది. యోహాను సువార్త "ధర్మశాస్త్రం మోషేద్వారా లభించింది. కాని వరప్రసాదమూ సత్యమూ క్రీస్తు ద్వారా లభించాయి" అని చెప్తుంది. 1,17. మోషే పూర్వవేదపు మధ్యవర్తి, అతడు యావేనుండి.

ధర్మశాస్రాన్ని గ్రహించి పూర్వవేద ప్రజలకు ఇచ్చాడు. క్రీస్తు నూత్న వేదపు మధ్యవర్తి ధర్మశాస్తానికి మారుగా క్రీస్తు తన కృపనే మనకు అనుగ్రహించాడు. కావుననే “అతని పరిపూర్ణతనుండి మనమంతా కృపకు బదులుగా వేరొక కృపను పొందాము" అని చెప్తుంది యోహాను సువార్త 1, 16. తొలి కృప మోషే ధర్మశాస్త్రం. దానికి బదులుగా మనం పొందిన కృప క్రీస్తు వరప్రసాదం. ఈ కృపకే సత్యం, వరప్రసాదం అనే విశేషణాలు రెండు వాడబడ్డాయి. ఇక్కడ వరప్రసాదమంటే, పరలోకపిత క్రీస్తు ద్వారా మనలను రక్షించడం. సత్యమంటే పరలోకపిత ప్రజలను రక్షిస్తానని తాను పూర్వమే చేసిన ఒడంబడికను క్రీస్తుద్వారా నెరవేర్చుకోవడం.
 
ఈ క్రీస్తుని అందరూ అంగీకరించరు. అంగీకరించిన వాళ్ళకు మాత్రం క్రీస్తు తన పత్రత్వంలో పాలిస్తాడు-1, 12. ఇక్కడ అంగీకరించడమంటే క్రీస్తుని విశ్వసించి అతని లోనికి జ్ఞానస్నానం పొందడం. అలా చేసినవాళ్ళు క్రీస్తు కృపకూ పత్రత్వానికీ పాత్రులౌతారు, ఈ పాత్రతవలననే పరలోకపితకు పుత్రుల మౌతున్నాం.

యూదులు యావేను తండ్రి అనికాక యజమానుడు అని పిలిచేవాళ్ళు ఆ భగవంతునిపట్ల వారికి పెద్ద చనువులేదు. అతడుకూడ నరావతారమెత్తి వాళ్ళ మధ్యలో జీవింపలేదు. యూదులు అతడు మహా పవిత్రమూర్తి అనీ, పాపులమైన మనకూ అతనికీ చాలా అంతరముంటుందనీ చెప్పేవాళ్ళ అందుకే యావేను కంటితో చూచినవాళ్ళ బ్రతకరని అనుకొనేవాళ్ళ-నిర్గ 33,20. భగవంతునికీ మానవునికీగల ఈ యంతరాన్ని తొలగించడానికే క్రీస్తు వచ్చింది. అతని నరావతారం ద్వారా దేవుడు మన మానవలోకంలో అడుగు పెట్టాడు. మానవులు కూడ దేవుని దగ్గరకు వెళ్ళగలిగారు. అతని ద్వారా పరలోకపిత మనకందరకూ సన్నిహితుడయ్యాడు. కావుననే మనం ప్రతిదినం క్రీస్తు ద్వారా ఆ తండ్రిని *పరలోకంలో వుండే మా ඡoසී” అని చనువుతో పిలుస్తూంటాం. యూదులు దేవుణ్ణితండ్రి అని పిలువలేక పోయారు అన్నాం. అతడు యజమానుడు తాము బానిసలు అనుకున్నారు అన్నాం. కాని మనంమాత్రం అతన్ని తండ్రి అని పిలుస్తున్నాం. మనం అతని బిడ్డలమని చెప్పకొంటూన్నాం. ఎందుకు? యూదులనాడు క్రీస్తులేడు. వాళ్ళ అతనిలోనికి జ్ఞానస్నానం పొందనూ లేదు, అతనితో ఐక్యం కానూలేదు. ఈ భాగ్యాలన్నీనేడు మనకు లభించాయి.

3. పరిశుద్ధాత్మ - దత్తపుత్రులు


క్రీస్తుద్వారా మనం పత్రులమౌతాం అన్నాం. కాని ఈలా పుత్రులయ్యేలా చేసేది పరిశుద్దాత్మ ఈ యాత్మ క్రీస్తు వెళ్ళిపోయాక అతని కార్యాన్ని కొనసాగిస్తుంది.
పోలు, పరిశుద్దాత్మ మనలను పుత్రులనుగా చేస్తుందనీ, ఆ యాత్మవలన మనం దేవుని తండ్రి అని పిలువగల్లుతున్నామని చెప్పాడు - రోమా 8, 15. అతడే మరో తావులో పిత తన పుత్రుని యాత్మమైన పావనాత్మను మన హృదయాల్లోనికి పంపాడనీ ఆ

యాత్మతోపాటు మనమూ దేవుని తండ్రి అని పిలుస్తామనీ చెప్పాడు - గల 4,6. ఆ యాత్మ మన హృదయంలో ప్రార్ధనం చేస్తూంటుంది. క్రీస్తు స్వర్గంలో పిత సమక్షంలో మనకోసం ప్రార్ధనం చేస్తుంటాడు - హెబ్రే 7,25. ఆత్మ మాత్రం మన హృదయంలోనే ప్రార్ధనం చేస్తూంటుంది- రోమా 8, 27. ఆత్మప్రార్ధనం, మనం పితపట్ల బిడ్డల్లాగ ప్రవర్తించాలనే.

ప్రాత యిప్రాయేలు యావే పుత్రులై నందున వాగ్లత్త భూమిని వారసంగా పొందారు. క్రొత్తయిస్రాయేలీయులమైన మనమును దేవుని పుత్రులమైనందున మోక్షాన్ని వారసంగా పొందుతాం. క్రీస్తుతో పాటు మనమూ ఈ మోక్షానికి వారసులమౌతాం. క్రీస్తుతోపాటు పుత్రులమైతే అతనితోపాటు వారసుల మౌత్తాం-రోమా 8, 17. మనం ఈ లోకంలో వున్నంతకాలం ఈ వారసం పూర్తిగా లభింపదు. మరణానంతరంగాని మోక్షాన్ని పొందలేం. కాని ఈ వారసానికి గురుతుగా తండ్రి తన ఆత్మను మన హృదయాల్లో వుంచాడు. అందుకే ఎఫేసీయుల జాబు “మీరు ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఈ యాత్మ మన వారసానికై ఈయబడిన సంచకరువు" అంటుంది – 1,14 సంచకరువు లేక బయానా తరువాత ఈయనున్న మొత్తం రొక్మానికి గురుతు. అదే రీతిగా ఈ యాత్మ కూడ భావిలో మనం పొందునున్న పూర్ణమహిమకు, అనగా మోక్ష భాగ్యానికి గురుతు. జ్ఞానస్నానం నుండి గూడ పావనాత్మ మనలను మోక్షభాగ్యానికి తయారుచేస్తూంటుంది. పుత్రులం గనుక ఆత్మ మనలను ఈ మోక్షవారసానికి సిద్ధం చేస్తుంటుంది.

ఇంతవరకు మనం చూచిన విషయాల సారాంశం ఇది. మానుష కుటుంబంలో దత్తపుత్రులు తండ్రి ఆస్తిమీద హక్కును పొందుతారేగాని ఆ తండ్రి స్వభావంలో పాలు పొందరు. తండ్రి తన బుద్ధి శక్తినిగాని ఆలోచనాశక్తినిగాని దత్తపుత్రునికి ఈయజాలడు. ఆ కుమారుని పుట్టుక గూడ తండ్రినుండి కాదు.

కాని దైవకుటుంబంలో ఈలాకాదు. మనం దేవుని పుత్రుల మవడంద్వారా దేవుని మోక్షానికి హక్కుదారులం కావడం మాత్రమేగాదు, ఆ దేవుని స్వభావంలో కూడ పాలుపొందుతాం. ఆ దేవునినుండి క్రొత్త పుట్టుకను పొంది ఆ దేవునివలె దివ్యజీవితం జీవిస్తాం. అందుకే యోహాను తన తొలిజాబులో “మనం దేవుని బిడ్డలమని పిలవబద్ధం మాత్రమే కాదు యథార్థంగానే దేవుని బిడ్డలం" అన్నాడు — 3,1.

భగవంతుని కృప ద్వారా మనం అతని బిడ్డలమౌతూన్నాం. యోహాను తొలి జాబులో “దేవుని నుండి పుట్టిన వాళ్ళల్లో అతని బీజం వుంటుంది" అన్నాడు - 8, 9, ఈ బీజమే వరప్రసాదం. ఈ వరప్రసాదం ద్వారా దేవునితో ఐక్యమౌతాం, మాతృగర్భంలోని పిండం తల్లి జీవితం జీవించినట్లే మనమూ దేవుని జీవితం జీవిస్తాం. అందుకే పేత్రు రెండవ జాబుకూడ మనం భగవంతుని స్వభావంలో పాలుపొందుతామని చెప్తుంది - 1,4 క్రీస్తుద్వారా దేవునికి దత్తపుత్రులం గావటానికిగాని మోక్షాన్ని వారసంగా పొందడానికిగాని మనకు ఏ హక్కులేదు. ఏ యోగ్యతాలేదు. దైవస్వభావం వేరు మానుషస్వభావం వేరు. ఆ ప్రభువు నరులు చేరలేని జ్యోతిః ప్రవాహంలో నివసిస్తూంటాడు. దైహిక నేత్రాలేవీ ఆ దివ్యమూర్తిని ఇంతవరకు చూచి యెరుగవ - 1తిమో 6,16. ప్రభువుకూడ "నా ద్వారా తప్ప ఎవ్వడూ పితదగ్గరకు రాలేడు” అని చెప్పాడు - యోహా 14, 6. అనగా మనము దత్తపుత్రులం కావడమనేది కేవలం దేవుని కృప. మనంతట మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని పత్రులం కాలేం. క్రింది అంతస్తులో ఉన్నవాళ్ళు అటూ యిటూ ఎన్నిసార్లు తిరిగినా పై యంతస్తులోనికి పోలేరు. పై యంతస్తులోకి వెళ్ళాలంటే మెల్లెక్కిపోవాలి. మానవులనుగూడ దైవ పుత్రులనుజేసి పై యంతస్తులోనికి గొనిపోయే మెట్లవరుస క్రీస్తు. క్రీస్తు ద్వారా మనకు లభించే ఈ భాగ్యాన్ని తలంచికొని దేవునికి కృతజ్ఞలమై యుండాలి.

ప్రార్ధనా భావాలు

1. ఐదవ శతాబ్దానికి చెందిన భక్తుడు పెద్ద లియోపాపుగారు ఈలా వ్రాసారు. "క్రైస్తవుడా! నీ ఘనతను నీవు గుర్తించు. దైవస్వభావంలో పాలుపొందిన నీవు మళ్ళా నీ పూర్వపు అధోగతికి దిగజారకు. నీవు ఏ శిరస్సుకి, ఏ దేహానికి అవయవానివో జ్ఞప్తికి దెచ్చుకో. నీవు చీకటి నుండి వైదొలగి దైవరాజ్యపు వెలుగులో ప్రకాశించావని జ్ఞాపకముంచుకో. జ్ఞానస్నానంద్వారా వవిత్రాత్మకు దేవాలయమయ్యావు. పాపకార్యాలద్వారా అంతటి గొప్ప అతిథిని నీ హృదయం నుండి పారదోలకు, పిశాచానికి మరల దాసుడివి కాబోకు. క్రీస్తు తన అమూల్యమైన రక్తంతో నిన్ను విమోచించాడు. అంతదయతో నిన్ను రక్షించిన దేవుడు ఓనాడు నీకు నిష్పాక్షికమైన తీర్పు తీరుస్తాడు సుమా!" ఈ వాక్యాలు పలుసార్లు భక్తి భావంతో మననం చేసికో దగ్గవి.

2. ఓ చిన్నపిల్లవాడు చెట్టమీది పండు కోసికోబోయాడు. కాని అది వాడి కందలేదు. ఆ బాలుడి తండ్రి వాణ్ణి చేతులతో పైకెత్తి పట్టుకోగా వాడా పండు కోసికొన్నాడు. దేవుడు మనకు దత్తపుత్రత్వాన్ని దయచేయడమంటే, మనలను తన చేతులతో పైకెత్తిపట్టుకోవడం. మనం మోక్షం అనే పండుని అందుకొనేలా చేయడం.

3. "నీ వరప్రసాదం ప్రాణంకంటె మెరుగైంది. కనుక నేను నిన్నుస్తుతిస్తాను” అంటుంది కీర్తన 68,4. అన్నికంటె ముఖ్యమైంది మన ప్రాణం. కాని దేవుని వరప్రసాదం ఈ ప్రాణంకంటెగూడ గొప్పది. అసలు మనకు ప్రాణాన్ని దయచేసేదీ ఆ ప్రాణాన్ని నిలబెట్టేదీకూడ దేవుని వరప్రసాదమే. హీబ్రూ భాషలో వరప్రసాదానికి "హెన్" అని పేరు. దేవుని అనుగ్రహానికి పాత్రులం కావడమని ఈ మాటకర్థం. ఇంకా ఈ పదానికి దేవుని దయ, ప్రేమ అనికూడ అర్థం చెప్పవచ్చు. అతనికి ప్రీతిపాత్రులమౌతామని భావం. ఈలాంటి వరాన్ని మనకు దయచేసినందుకుగాను మనం ఆ ప్రభువుకి నిరంతరం వందనాలు చెప్పాలి.

4. అంతర్నివాసం

నరులకు దేవుడొసగే దానం ప్రాకృతిక జీవం. దీనితోపాటు ఆధ్యాత్మిక జీవంకూడ వుంది. ఇదే దివ్యజీవితం, కాని ఈ దివ్యజీవంలో భగవంతుడు తన దానాలను గాదు, తన్నుతానే మనకు అనుగ్రహించుకొంటాడు. అనగా తాను మన హృదయంలో వసిస్తూంటాడు. ఇదే అంతర్నివాసం. కనుక ఈ యధ్యాయంలో ముగ్గురు దైవవ్యక్తులు మన హృదయంలో ఎలా వసిస్తూంటారో చూద్దాం. ఇక్కడ విశేషంగా నూత్న వేదంనుండి పౌలు యోహాను భావాలను తిలకిద్దాం. అంతర్నివాసాన్నే దైవాత్మక వరప్రసాదమనికూడ పిలుస్తారు.

1. క్రీస్తు అంతర్నివాసం

వార్త దేహాన్ని చేకొని మన మధ్యలో వసించింది అంటాడు యోహాను - 1,14, ఈ వార్త కలకాలం నుండి దేవుని యందు దేవునితో వసించే దివ్యవ్యక్తి ఐనా మన మానుషదేహం చేకొని మనజాతి నరుడై, మన మధ్యలో మరియమాత గర్భం నుండి జన్మించాడు ప్రభువు. జగత్ సృష్టిలో ఇంతకు మించిన గొప్ప వదంతం లేదు.

ఈ దివ్యవ్యక్తి తన కృపనూ సత్యాన్ని అనుగ్రహించడానికే మన చెంతకు వచ్చాడు 1,16. ఆ ప్రభువు మనలో వసిస్తుంటాడు. కావుననే అతడు నా యాజ్ఞలను పాటించే వాడు నన్ను పేమిస్తాడు. అతన్ని నేనూ నాపితా పేమిస్తాం. నేను అతనికి కానిపించుకుంటాను" అన్నాడు -14,21. ఇక్కడ కాన్పించుకోవడమనగా క్రీస్తు తన్ను ప్రేమించేవారిలో వసించడం, వసించి వారిలో తన ప్రభావాన్ని చూపెట్టడం.

క్రీస్తు మనయందు వసించడం మాత్రమే గాదు, మనమూ ఆ క్రీస్తునందు వసిస్తాం. ఈ యంతర్నివాసం పిత క్రీస్తునందూ క్రీస్తు పితయందూ వసించడంతో పోల్చబడింది - 6,57.

ద్రాక్షలత ఉపమానం మనకు తెలుసు. క్రీస్తు లత, మనం రెమ్మలం. అనగా మనం క్రీస్తున కదుకుకొని క్రీస్తునందు నెలకొని క్రీస్తునందు కొమ్మలు సాగాలి. క్రీస్తు

కూడ మనయందు నెలకొని తనసారమనే వరప్రసాదాన్ని మనలోనికి ప్రవేశపెడతాడు. కనుకనే “నేను మీ యందులాగే మీరు నా యందు నెలకొని వుండండని ఆదేశించాడు ప్రభువు - 15, 4 ఈ వాక్యం ప్రత్యక్షంగా నాటి ప్రేషితులకే అన్వయించినా, పరోక్షంగా విశ్వాసులందరికీ అన్వయిస్తుంది.

యోహాను లాగే పౌలు కూడ క్రీస్తు అంతర్నివాసాన్ని చాల తావుల్లో వర్ణించాడు. జ్ఞానస్నానం వలన క్రీస్తు మనమూ ఒక్క జ్ఞానదేహ మౌతాం. ఈ దేహానికి శిరస్సు క్రీస్తు మనం అవయవాలం. అనగా మనం క్రీస్తునందూ, మనయందు క్రీస్తూ వసిస్తుంటాడు1 12, 27.

రోమీయులు 6,5 లో పౌలు మనం క్రీస్తు మరణంతో ఐక్యమైతే అతనిని ఉత్తానంతో గూడ ఐక్యమౌతాం అంటాడు. కాని ఇక్కడ "ఐక్యంగావడం" అనే మాటకు పౌలు మూల భాషలో వాడిన శబ్దానికి "పిండం మాతృగర్భంలోలాగ మనమూ క్రీస్తునందు జీవిస్తుంటాం" అనే భావం స్ఫురిస్తుంది. అనగా పిండం మాతృప్రాణమునందు వలె మనమూ క్రీస్తు ప్రాణంలో పాలుపొందుతూంటాం. క్రీస్తుతో మనం ఇంత సన్నిహితంగా జీవిస్తాం. అందుకే పౌలు "నేను గాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అని చెప్పకున్నాడు - గల 2, 20. ఇది మహావాక్యం.

క్రీస్తుతో మనమూ మనతో ఆ క్రీసూ ఐక్యంగావడం ద్వారా ఆ ప్రభు భాగ్యాలు మనకు లభిస్తుంటాయి. మనం అతని బాధలు అనుభవిస్తాం - 2 కొ 1,5. దీని ఫలితంగా అతని ఉత్థానంలో పౌలు పొందుతాం - కొలో 3,12. క్రీస్తుతో శాశ్వత రాజ్యపాలనం చేస్తాం - 2 తిమో 2,12. నేడుకూడ క్రీస్తుమనస్సు శక్తి మనయందు పనిచేస్తుంటుంది - 1కొ 2,16, సంగ్రహంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక సౌభాగ్యాలన్నీ మనకు క్రీస్తుద్వారా లభిస్తాయి. ఆ క్రీస్తు ద్వారా సర్వసంపూర్ణత్వాన్ని పొందుతూంటాం - ఎఫే 3,19.

2. పిత అంతర్నివాసం

పితకూ సుతునికీ ఎడబాటు లేదు. కావున సుతుడు వసించే చోట పితగూడ వసిస్తుంటాడు. అందుకే క్రీస్తు"నన్ను ప్రేమించేవాళ్లు నా యాజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తారు. నా పిత వాళ్ళను ప్రేమిస్తాడు. మేమిద్దరమూ వాళ్ల చెంతకువచ్చి వాళ్ళయందు నివాస మేర్పరచుకుంటాం" అన్నాడు " యోహా 14,23. కనుక క్రీస్తులాగే పిత కూడ మనయందు వసిస్తుంటాడు.

పిత మనలను గాఢంగా ప్రేమించి, మన విమోచనకై తన యేకైక కుమారుని పంపాడు. ఈ సుతుడు నరులందరికీ పితతో పునస్సఖ్యాన్ని చేకూర్చాడు. ఇకమీదట నరులందరు దైవ ప్రేమతో, సోదర ప్రేమతో జీవించాలి. సోదర ప్రేమ ద్వారాకూడ పిత మనయందు వసిస్తుంటాడు. మనం ఒకరినొకరం ప్రేమిస్తే పిత మనయందు వసిస్తాడు =1 యోహాన్ 4, 12.

క్రీస్తు మనయందు మనం క్రీస్తునందు వసిస్తాం అన్నాం, అలాగే మనం పితయందు, పిత మనయందు వసిస్తాడు. క్రీస్తుని దేవుని కుమారుడని అంగీకరించిన వాళ్ళల్లో దేవుడు వసిస్తాడు. వాళ్ళూ దేవునియందు వసిస్తారు. 1యోహా 4,15. దేవుడు ప్రేమమయుడు. కావున ప్రేమ జీవితం జీవించే వాళ్లల్లో దేవుడూ జీవిస్తాడు. వాళ్ళూ దేవునియందు జీవిస్తారు - 4,16.
క్రీస్తు అంతర్నివాసం ద్వారా అతని భాగ్యాలు మనకు లభిస్తాయి అన్నాం. అలాగే పిత అంతర్నివాసం ద్వారా అతని భాగ్యాలూ పొందుతాం. పితనుండి పొందే భాగ్యాల్లో అతని "ఆకర్షణం" అనే భాగ్యం చాల గొప్పది. పిత మనలను సుతునివైపు ఆకర్షిస్తుంటాడు - యోహా 6,44. ఎందుకు? పిత తాను జీవనమూర్తి, తన జీవాన్నే సుతునకు ప్రసాదిస్తుంటాడు. ఈ సుతుని జీవాన్నే మనమూ పొందాలని పితకోరిక. కనుకనే మనలను తన కుమారుని వైపు ఆకర్షిస్తుంటాడు - 3,16. మనంకూడ ఆ పితతోను, సుతునితోను సహవాసం చేయాలి - 1యోహా 1,4.

3. పరిశుద్దాత్మ అంతర్నివాసం


ఉత్తానం కాకముందే క్రీస్తు ఆత్మను పంపిస్తానని శిష్యులకు హామీ యిచ్చాడు. ఎల్లప్పడూ వాళ్లవద్ద వుండడానికై మరో ఆదరణకర్తను పంపిస్తానన్నాడు - యోహా 14,16. ఈయాత్మక్రీస్తుబోధించిన సంగతులన్నిటినీ వాళ్ళకు జ్ఞప్తికి తెస్తుంది - 14,26. యోహాను "క్రీస్తునుండి మనం స్వీకరించిన అభిషేకం మనలో నిల్చివుంటుంది" అంటాడు -1 యోహా 2,27. ఏమిటీ యభిషేకం? జ్ఞానస్నానం ద్వారా మనం పొందిన పరిశుద్దాత్మే ఈ యాత్మ క్రీస్తు బోధించిన సత్యాలన్నీ విశ్వాసులకు బోధిస్తుంది. తాను విశ్వాసుల్లో వసిస్తుంది.
పౌలు తన జాబుల్లో "క్రీస్తునందు” “ఆత్మయందు" అనే ప్రయోగాలు రెండూ చాలసార్లు వాడుతుంటాడు. తొలి ప్రయోగానికి మనం క్రీస్తునందు, క్రీస్తు మన యందు వసిస్తుంటామని భావం. రెండవ ప్రయోగానికి మనం ఆత్మయందు, ఆత్మ మన యందూ వసిస్తుంటుందని భావం.
కొరింతు పౌరులకు వ్రాస్తు పౌలు వాళ్ళ దేవాలయం వంటి వాళ్ళనీ ఆత్మ వాళ్ళల్లో వసిస్తుందనీ బోధించాడు- 1కొ 3, 16 ఈ వాక్యంలో విశ్వాసులు సాముదాయికంగా పేర్కొనబడ్డారు. అనగా కొరింతులోని క్రైస్తవ సమాజంలో ఆత్మ వసిస్తుంది. ఇదే జాబు 6,19లో వ్యక్తిగతమైన అంతర్నివాసం చెప్పబడింది. పూర్వవేద ప్రభువు *పెక్రీనా? అనే పేరుతో యూదుల దేవాలయంలో వసించేవాడు. నూతవేదంలో విశ్వాసుల హృదయాలే దేవాలయాలు. ఈ దేవాలయాల్లో దేవుని ఆత్మ వసిస్తుంది.
273

అంతరాత్మలో వసించే యీ దివ్యాత్మ మనకు వరాలనిస్తుంది. దైవప్రేమ, సోదరప్రేమ మన హృదయాల్లో కుమ్మరిస్తుంది. దేవునితో తండ్రితోలాగ సంభాషించి ప్రార్ధనం చేయడం నేర్పుతుంది. మన హృదయాలను వెలిగిస్తుంది - హెబ్రే 6,4
క్రీస్తు కృప, తండ్రి ప్రేమ, ఆత్మ సహవాసం కొరింతీయులతో వుండాలని దీవించాడు పౌలు - 2కొ 13,13. దైవవ్యక్తులు మువ్వరూ విశ్వాసుల హృదయాల్లో వసిస్తూంటారని భావం, మనం పైన పేర్కొన్న అంశాలన్నీ ఈ వాక్యంలో సంగ్రహంగా ఇమిడే వున్నాయి.

4. అంతర్నివాస ఫలితాలు


జ్ఞానస్నానం ద్వారా పితకు పత్రుల మౌతాం. అంతర్నివాసం ద్వారా ఈ పత్రత్వం బలపడుతుంది. ఆ పరలోకపు తండ్రిలాగే మనమూ నాడునాటికి పరిపూరులంగా మంచివాళ్ళంగా తయారౌతాం - మత్త 5,48. కడన పిత మనలను తన దివ్యరాజ్యంలోనికి చేర్చుకుంటాడు — లూకా 12,32.
జ్ఞానస్నానంద్వారా క్రీస్తుకు తమ్ముళ్ళమూ, చెల్లెళ్ళమూ ఔతామన్నాం. క్రీస్తు అంతర్నివాసం ద్వారా మన యీ సోదరత్వం బలపడుతుంది.
మోషే యిప్రాయేలు ప్రజలకు నాయకుడై వారిని ఐగుపునుండి వాద్దత్తభూమికి నడిపించుకొని వెళ్ళాడు. క్రొత్త యిస్రాయేలీయులమైన మనలను క్రీస్తు నాయకుడు పరలోకంలోని పితసాన్నిధ్యానికి నడిపించుకొని వెళ్తాడు.

ఈ లోకంలో వున్నంతకాలం మనం క్రీస్తుద్వారా పితను ఆరాధిస్తుంటాం. మన ఆరాధనమంతా ప్రధాన యాజకుడైన క్రీస్తుద్వారా పితను కొలవడమే. కట్టకడన క్రీస్తు ఈ క్రైస్తవ సమాజాన్నంతటినీ పిత చేతులలోనికి అప్పగిస్తాడు. అపుడు విశ్వాసులందరు దేవునియందు, దేవుడు విశ్వాసులందు శాశ్వతంగా వసిస్తారు - 1కొరి 15, 27-28.
జ్ఞానస్నానంద్వారా పరిశుద్దాత్మ మనలను ఆధ్యాత్మిక మానవులను చేస్తుంది. ఆత్మ అంతర్నివాసం ద్వారా ఈ యాధ్యాత్మిక జీవనం బలపడుతుంది. పూర్వవేదపు యూదులు రాతిపలకమీద వ్రాయబడిన పది యాజ్ఞలను పాటించారు. నూత్న వేద ప్రజలమైన మనం ఆత్మ యిచ్చే అంతరంగిక ప్రబోధాలను పాటిస్తాం. ఆధ్యాత్మికమైన దివ్యజీవితం జీవించడానికి వలసిన శక్తినిగూడ ఆత్మ ప్రసాదిస్తుంది. తన వెలుగుతోఓదార్పుతో సదాలోచనతో మనలను ముందంజ వేయిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితం విశేషంగా పాపనాత్మమీద ఆధారపడివుంటుంది. దేవుని పుత్రులు ఎప్పడూ ఆ యాత్మచేత నడిపింపబడుతూంటూరు.

ప్రార్ధనా భావాలు

1 రెండవ శతాబ్దానికి විධිරධිර క్రైస్తవ రచయిత యొకడు "డయొగ్నీటస్ లేఖ” ಆనే పేరుతో ఓ రచనచేసాడు. దానిలో అతడు ఈలా చెప్పాడు "దేహంలో ఆత్మ యేలూగో ఈ లోక్షంలో క్రైస్తవుడు ఆలాగు. ఆత్మ దేహంలో వసిస్తుంది. కాని దేహానికి చెందిందికాదు. అలాగే క్రైస్తవుడు ఈలోకంలో వసించినా ఈ లోకానికి చెందినవాడు కాదు. అతడు భూలోకంలో వసించినా పరలోక పౌరుడుగా జీవిస్తాడు. ఔను, వరప్రసాదంవల్లనే మనం పరలోక పౌరులంగా జీవింపగల్లుతున్నాం. ఈ భాగ్యానికిగాను మనం ఎంతో సంతోషించాలి.
2 నాల్గవ శతాబ్దానికి చెందిన నీస్సా గ్రెగోరీ భక్తుడు ఈలా చెప్పాడు. ‘నరుడు బూడిదలాంటివాడు, గడ్డిలాంటివాడు. ఐనా అతడు దేవుడంతటివాడౌతాడు. మృత్యువువాతబడేవాడు అమరుడౌతాడు. క్షణమాత్రుడైనవాడు శాశ్వతుడౌతాడు. నరమాత్రుడైనవాడు దేవుడౌతాడు. దేవుని పుత్రుడై దేవుని ఆస్తికి వారసుడౌతాడు. ఇది వరప్రసాద మహిమ". ఈ వరప్రసాద భాగ్యానికి పాత్రులమైన మనం దాన్ని ఎంతో విలువతో జూడాలి.
3 పదవ శతాబ్దానికి చెందిన ఆన్సెల్మ్ భక్తుడు ఈలా వ్రాసాడు. "ఓ ప్రభూ! నీవు నన్ను నీకు పోలికగా చేసావు. ఎందుకు? నేను నిన్ను జ్ఞాపకముంచుకోడానికి, నిన్ను తెలుసు కోడానికి నిన్ను ప్రేమించడానికి, ఈ దొడ్డ భాగ్యాలకుగాను నేను నీకు నమస్కారం చెపున్నాను". మనలోని దేవునిపోలిక వలన మనం సహజంగానే ఆ ప్రభువుని అభిలషిస్తుంటాం. సృష్టివస్తు వ్యామోహంవల్ల కొంతకాలంపాటు ఆ ప్రభువుని విస్మరించినా మళ్ళా అతన్ని జ్ఞప్తికి తెచ్చుకొంటూంటాం.

5. దివ్యవ్యక్తులతో బాంధవ్యాలు


పూర్వాధ్యాయంలో దివ్యవ్యక్తులు ముగ్గురూ మన హృదయంలో వసిస్తుంటారనిచెప్పాం. ఈ ముగ్గురు వ్యక్తులతో మనకు మూడు బాంధవ్యాలు ఏర్పడతాయి. వాళ్లు ముగ్గురూ మూడు ముద్రల్లాంటివాళ్లు, ఎవరి రూపురేఖలను వాళ్లే మన హృదయాలపై చిత్రించుకుంటారు. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. పిత జీవనదాత


క్రీస్తు ద్వారా పిత మనలను తన పుత్రులను చేసికొంటాడని చెప్పాం. పుత్రుడు తండ్రి జీవితంలో పాలుపొందుతాడు. ఆ పత్రుని ద్వారా మనంకూడ తండ్రి జీవితంలో పాలుపొందుతాం.

దివ్యవ్యక్తులు ముగ్గురిలో ఆంతరంగిక జీవితమూ వుంటుంది. బాహిర జీవితమూ వుంటుంది. ఆంతరంగిక జీవితమంటే దివ్యవ్యక్తులు తమయందు మాత్రమే జీవించడం. బాహిర జీవితమంటే ఆ దివ్యవ్యక్తులకు ప్రపంచ ప్రాణులతో వుండే సంబంధం. పిత సుత పరిశుద్ధాత్మల బాహిర జీవితం వాళ్ల అంతర్జీవితాన్ని అనుసరించి వుంటుంది. వాళ్లల్లో రెండు జీవితాలు లేవు. ఒకే జీవితం. కాని మనం మాత్రం దైవవ్యక్తుల జీవితాన్ని అర్థం చేసికోవాలి అంటే దాన్ని బాహిరం ఆంతరంగికం అనే రెండు దృక్కోణాలనుండి పర్యవేక్షించాలి.

ఆంతరంగికమైన దైవ జీవితంలో వార్త లేక సుతుడు పిత నుండి ఉద్భవిస్తాడు. పిత ఒకే పుట్టువు నిస్తాడు. ఈ యొకే పుట్టువు ఆంతరంగికమైన దైవ జీవితంలో, వార్త బాహిరమైన దైవజీవితంలో, సృష్టిప్రాణులు. అనగా మనమూ వార్తా కూడ ఒకే పుట్టువున ఋట్టిన కవలలం, ఆ వార్త దేవని తొలి పుత్రుడైన సుతుడు. మనం మలిపుత్రులమైన ప్రాణులం. ఈ విధంగా అందరి పుట్టువునకు కారకుడుగాన పిత జీవనదాత కావున పితతో మన బాంధవ్యం ఎలా వుంటుందంటే, అతడు మనకు జీవమిచ్చేవాడు. మనం అతని నుండి యుద్భవించిన బిడ్డలం.

 

2. క్రీస్తు సత్యదాత


క్రీస్తు మనకు దైవసత్యాలు తెలియజేస్తాడు. దైవసత్యాలంటే దేవుడేలాంటివాడు, అతడేలా పని చేస్తాడు మొదలైన అంశాలు.

క్రీస్తు మానుష రూపం గైకొనిన దైవవార్త దేవుని యాంతరంగిక జీవితంలో ఈ వార్త పిత బుద్ధిశక్తి నుండి జన్మిస్తుంది. వార్త పిత తలప, ఆలోచన, భావము, ఎరుక, పలుకు, పిత తలపులు భావాలు సుతుని యందు కరుడు గట్టుకుంటాయి. పిత సుతుని పూర్తిగా నెరుగుతాడు. సుతుడును పితను పూర్తిగా నెరుగుతాడు. కావున నరావతార మెత్తిన సుతుడు పితను గూర్చి నరులకు తెలియజేస్తాడు. కనుకనే యోహాను " ఏనాడూ ఏ నరుడూ దేవునిచూచి యెరుగడు. ఆ దేవుని ప్రియ కుమారుడే అతనిని మన కెరుక పరచాడు" అంటాడు -1 -18. ఈలా క్రీస్తు పితనుగూర్చి తెలియజేయడమే దివ్యావిష్కరణం. క్రీస్తు వచ్చింది సిలువపై మరణించి పాప పరిహారం చేయడం కోసం మాత్రమే కాదు. పితను తెలియజేయడం కోసం గూడ.

క్రీస్తు పితనూ పితను గూర్చిన దివ్యసత్యాలను తెలియజేసేవాడు. కావననే అతడు సత్యదాత. పిత మనకు అస్తిత్వము నిచ్చినవాడు గావున మన యునికి యంతటితోను సంబంధించినవాడు. కాని క్రీస్తు విశేషంగా మన బుద్ధిశక్తితో సబంధించినవాడు. సత్యాన్ని గ్రహించేది బుద్ధికదా!

క్రీస్తుతో మనకుండే సంబంధం ఏలాంటిదంటే, అతడు మన బుద్ధిశక్తిని ప్రబోధించే బోధకుడు. అతని నుండి మనం దివ్యసత్యాలను గ్రహించే శిష్యులం, విశ్వాసాన్ని పెంపొందించుకొనే భక్తులం. కావుననే పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ "విశ్వాసం ద్వారా క్రీస్తు మీ యందు వసించాలి" అని ప్రార్థించాడు- 3,17.

8. పరిశుద్ధాత్మ ప్రేమదాత


పిత మనకు దివ్యజీవాన్నీసుతుడు దివ్య సత్యాన్నీ ప్రసాదిస్తే, ఆత్మ దివ్యప్రేమను అనుగ్రహిస్తుంది. ఈ ప్రేమవలననే మనం దేవుణ్ణి తండ్రిలా ప్రేమింపగల్లుతున్నాం.

దేవుని ఆంతరంగిక జీవితంలోపరిశుద్దాత్మ పితపుత్రుల పరస్పర ప్రేమనుండి వెలువడుతుంది. దేవునియందు ఒకే ప్రేమభావం వుంటుంది. ఈ ప్రేమభావమే ఆంతరంగికంగా, పరిశుద్ధాత్మ బహిరంగంగా, దేవుడు సృష్టి ప్రాణులయెడల చూపే అనురాగం. అనగా దేవుని ఒకే యనురాగపు తలపులో మనమూ పావనాత్మమూ ఇమిడి వున్నాం.

ఈ జగము ఇందలి ప్రాణులు వార్తకు పోలికగా వార్త యందు సృజింపబడ్డాయి. అలాగే ఈ జగాన్ని ఇందలి ప్రాణులనూ దేవుడు పావనాత్మకు పోలికగా పావనాత్మయందు ప్రేమిస్తుంటాడు.

దివ్యాత్మచేసేపని దేవుని ప్రేమను మనమీద కుమ్మరించడం మాత్రమే కాదు.మన ప్రేమను గూడ దేవునికి అందించడం. పిత బుద్ధిశక్తినుండి వెలువడే సుతుడు మన బుద్ధిశక్తిమీద పనిచేసి మనం సత్యం గ్రహించేలా చేస్తాడు. అలాగే పితసుతుల చిత్తశక్తి నుండి వెలువడే పరిశుద్దాత్మ మన చిత్తశక్తి మీద పనిచేసి మనం ప్రేమభావం పెంపొందించుకొనేలా చేస్తుంది.

పావనాత్మతో మనకుండే సంబంధం ఎలాంటిదంటే, ఆ యాత్మ మన హృదయాల నంటి అనురాగ భావాలు మొలకెత్తిస్తుంది. దేవుని తండ్రిలా ప్రేమించే విధానం నేర్పిస్తుంది,అందుకే పౌలు "పావనాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి కుమ్మరింపబడింది"అని చెప్పాడు - రోమా 5,5.

ఈ రీతిగా దివ్యవ్యక్తులు ముగ్గురూ మన హృదయాల్లో వసిస్తూ తమతమ ప్రత్యేక స్వభావాలననుసరించి మన హృదయాల్లో పనిచేస్తుంటారు. పిత జీవనదాతగా పనిచేస్తూ మనకు పుట్టువు నిస్తుంటాడు. క్రీస్తు ప్రబోధకుడుగా పని చేసి మన ఆత్మకు దివ్యసత్యాలను వివరిస్తాడు. ఆత్మడు ప్రేమికుడుగా పని చేసి మన హృదయాలను ప్రేమభావంతో నింపుతూంటాడు.

4. భగవత్కారుణ్యం

దేవుడు మనలను గూర్చి యింత శ్రద్ధ చూపడం దేనికి? మనలను యింతగా ప్రేమించడం దేనికి?

ఒకానొక పేదపడుచు. అందము నాగరకత కులీనత మొదలైన గుణాలేవీ లేవు. అందుచే ఆమెను వలచినవాళ్లే లేరు. తల్లిదండ్రులకు ఆమె భారమైంది. జీవించడంవలన ప్రయోజనమేమిటో ఆమెకు అర్థం కాలేదు. తన జీవితం తనకే బరువనిపించింది. ఈలా వుండగా బుద్ధిమంతుడైన యువరాజొకడు త్రోవవెంట వెళ్తు ఆ యువతిని జూచి జాలి గొన్నాడు. ఆమెను తన భార్యనుగా, భావి రాజ్ఞనిగా స్వీకరించాడు. తన ప్రాసాదానికి తోడ్కొని పోయాడు. ఆ యువతి మొదట భయపడింది. కాని విభుని మంచితనాన్నీ అనురాగాన్ని చూచి తెప్పరిల్లింది. క్రమేణ తన యంతస్తునకు తగినట్లుగా రాణీలాగ ప్రవర్తించింది. తీగ చెట్టుకులాగ తాను అతని కంటిపెట్టుకొని జీవించింది, సుఖపడింది.

ఈ కథ దేవునికీ మనకీ అక్షరాల వర్తిస్తుంది. ఆ యువతికి యువరాజునకు రాణి అయ్యే యోగ్యత లేదు. కేవలం అతని కారుణ్యం వలననే ఆమె రాణి కాగలిగింది. భగవంతుడు కూడ ఎందుకు పనికిరాని ప్రాణులమైన మనమీద కరుణబూని తన వరప్రసాదంతో మనకు దివ్యత్వం ఇచ్చాడు. ఓ దేవాలయంలో లాగ మన హృదయంలో వసించడం మొదలెట్టాడు. దానివలన మనకు విలువ వచ్చింది.

యూదులు కొలిచిన యావే ప్రభువు కరుణామయుడు. క్రైస్తవులు కొలిచే క్రీస్తుకూడ తన తండ్రిలాగే కారుణ్యమూర్తి తప్పిపోయిన గొర్రెను కాపరిలాగ, తప్పిపోయిన కుమారుని తండ్రిలాగ, అతడు నిత్యం మనలను వెదుక్కుంటూ వస్తాడు. బైబులు చిత్రించే ఈ భగవంతుని కారుణ్యమే అతని వరప్రసాదం.

ప్రార్ధన భావాలు

1. నాల్గవ శతాబ్దానికి చెందిన గ్రెగోరీ నాసియాన్సన్ భక్తుడు ఈలావాకొన్నాడు "నేను అల్పులడను, ఘనుడను. క్రిందివాడిని, పైవాడిని. మర్త్యుడను, అమరుడను. నాలోని వోగుణం ప్రపంచానిది, మరోగుణం దేవునిది. ఒకటి శరీరానికి మరొకటి ఆత్మకు సంబంధించింది. కనుక నేను క్రీస్తుతో చనిపోయి అతనితో ఉత్దానం కావాలి. అతని దివ్యరూపం నాలో నెలకొనాలి." వరప్రసాదం ద్వారా క్రీస్తు దివ్యరూపం మనలో నెలకొంటుంది.

2. రెండవ శతాబ్దానికి చెందిన ఇరెనేయుస్ వేదశాస్త్రి ఈలా చెప్పాడు "పొడి పిండితో రొట్టెనుగాని ముద్దనుకాని చేయలేం. నీటితో తడిపినట్లయితే పిండిని ముద్దజేసి రొట్టె చేసికోవచ్చు. అలాగే చాలమందిమైన మనం, మనలో మనం ఐక్యంగాలేం.

కాని జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మ నీళ్లలాగ మన మీదికి దిగివస్తుంది. మనలనందరినీ తడిపి మనలో మనం ఐక్యమయ్యేలా చేస్తుంది". అనగా జ్ఞానస్నానంద్వారా మనం పొందే వరప్రసాదం మనకు సోదరప్రేమను దయచేస్తుంది.

3."ఉనికి కంతటికీ దేవుడు కారణమైనట్లే వరప్రసాదానికంతటికీ క్రీస్తు మానుషత్వం
   కారణం" అన్నాడు తోమాసు అక్వినాసు భక్తుడు. ఇది చాల గొప్పవాక్యం. పిత
   తలంపుద్వారా ఈ వనికి అంతా యేర్పడింది. మహిమను పొందిన ప్రభువు
   మానుషదేహంద్వారా వరప్రసాదాలన్నీలభిస్తాయి. అనగా క్రీస్తు వరప్రసాదమూర్తి.
ప్తె అక్వినాసే మరో తావులో 'భౌతిక ప్రపంచంలో వెలుగుకంతటికీ సూర్యుడు కారణమైనట్లే, ఆధ్యాత్మిక ప్రపంచంలో వరప్రసాదానికంతటికీ క్రీస్తకారణం" అని చెప్పాడు. అన్ని గ్రహాలనుండి వచ్చే వెలుగూ సూర్యునినుండే వస్తుంది. ఆలాగే అన్ని విధాలా వచ్చే వరప్రసాదాలూ క్రీస్తునుండే వస్తాయి.

6. సహాయక వరప్రసాదం


పవిత్రీకరణ వరప్రసాదంవలన మనం దివ్యలమౌతాం. దివ్యజీవితం జీవిస్తాం. కాని పవిత్రీకరణ వరప్రసాదం మనకు దివ్యజీవితం జీవించే సామర్థ్య మిస్తుందేగాని, యధార్థంగా దివ్యజీవితం జీవించేలా చేయదు. అలా చేసేది సహాయక వరప్రసాదం. కనుక ఇక మీదట సహాయక వరప్రసాదాన్ని గూర్చి చూద్దాం.

1. సహాయక వరప్రసాదంతో అవసరం


సహాయక వర ప్రసాదంలో చాలా రకాలున్నాయి. ఈ గ్రంథంలో కనీసం ఆరు రకాలైన చూస్తాం. ఇవి చావైన పాపం కట్టుకొనిన ఆత్మలో కూడ వుండవచ్చు. ఈ జాతి వరప్రసాదాలు మనకు దైవత్వాన్ని ఈయలేవు. వీటి వలన మనం మోక్షానికి హక్కుదారులం కాము, పై శాశ్వత వరప్రసాదంతో అవసరంలేకుండానే సహాయక వరప్రసాదం దానంతట ఆది పనిచేయగలదు. ఈ విషయాలన్నీ మున్ముందు స్పష్టమౌతాయి.

        ఈ యధ్యాయంలో మూడంశాలు విచారిద్దాం.
        నడవడం, మాట్లాడ్డం, భుజించడం, నిద్రించడం మొదలైనవి ప్రాకృతిక జీవితంలో మనం చేసే పనులు. ఈ పనుల్లో దేవుడు మనతో సహకరిస్తుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసేపనులు జపించడం, పశ్చాత్తాపపడడం, సంస్కారాలను స్వీకరించడం మొదలైనవి. ఈ యధ్యాత్మిక కార్యాల్లో కూడ దేవుడు నిత్యం మనతో సహకరిస్తుంటాడు. శిరస్సు దేహంలోని అంగాల్లోనికి చైతన్యాన్నిప్రవేశపెడుతూంటుంది. లత రెమ్మలలోనికి

సారాన్ని ప్రవేశపెడుతూంటుంది. అలాగే క్రీస్తు కూడ నీతిని బడసిన విశ్వాసుల్లోనికి తన శక్తిని ప్రసరింప జేస్తుంటాడు. మన సత్కార్యాలను ప్రేరేపించేదీ, కొనసాగించేదీ, ముగింపునకు గొనివచ్చేదీ ఈ దివ్యశక్తి ఈ శక్తిలేకపోతే మనం చేసే పనులు దేవునికి ప్రియపడవు. ఈ శక్తి సహాయక వరప్రసాదం.

పసిబాలుని చేతిలో పలకా బలపమూ వుంటాయి. ఐనా ఉపాధ్యాయుడు బాలుని చేతిని బట్టుకొని దిద్దింపనిదే వాడు అక్షరాలు వ్రాయలేడు. ఇదే రీతిగా సహాయక వర ప్రసాదం పరికొల్బందే మనం సత్కార్యాలు చేయలేం.
 
భక్తుడు అగస్టీను మరో వుపమానం చెప్పాడు. నేత్రం ఆరోగ్యంగా వున్నా సూర్యరశ్మి ప్రకాశించేదాకా వస్తువులను చూడలేదు. అలాగే నరుడూ నీతిని పొందినంక కూడ సహాయక వరప్రసాదం సాయపడిందాకా సత్కార్యాలు చేయలేడు. కనుక నరుడు దివ్యడు కావడంలో మూడు మెట్లుంటాయి. మొదటిది పవిత్రీకరణ వరప్రసాదం. దీని ద్వారా దేవుని పోలిక అతనియందు అచ్చువేయబడుతుంది. రెండవది నైతిక పుణ్యాలు, దివ్యపుణ్యాలు, వరాలు. వీని ద్వారా నరుడు దివ్యకార్యాలను చేయగలడు. దివ్య జీవితం జీవింపగలడు. మూడవది సహాయక వరప్రసాదం. దీని ద్వారా అతడు యధార్థంగా దివ్యజీవితం జీవిస్తాడు.

2. సహాయక వరప్రసాదమూ స్వాతంత్ర్యమూ



మనం చేసే దివ్యకార్యాలతో దేవుడూ సహకరిస్తాడన్నాం. ఈ సహకారం వలన మన స్వాతంత్ర్యం భంగపడదా?
 
దైవ సహకారం వలన మన స్వాతంత్ర్యం భంగపడదు. దేవుడు ఆయా ప్రాణుల స్వభావానికి అనుకూలంగా వాటితో సహకరిస్తుంటాడు. జంతుజాలానికి ಬುದ್ಧಿ, స్వాతంత్ర్యమూ అనేవి లేవు. అందుచేత నైసర్గిక బోధనం ద్వారా భగవంతుడే వాటిని స్వయంగా నడిపిస్తుంటాడు. నరులకు స్వాతంత్ర్యమూ, ఆలోచనా వుంది. వాళ్ళ కార్యాలను వాళ్ళ నిర్ణయించుకుంటారు. భగవంతుడు సహాయక వరప్రసాదంతో నరులకు తోడ్పడేప్పడు, ఆ నరులు తమ నిర్ణయాలను తామే చేసికొనేట్లుగానే తోడ్పడుతూంటాడు.
 
ఒక్క ఉదాహరణం చూద్దాం. ఉపాధ్యాయుడు బిడ్డచేతిని బట్టుకొని అక్షరాలు వ్రాయిస్తాడు. ఆ వ్రాసిన అక్షరాలు ఉపాధ్యాయునివి, బాలునివి కూడ ఇక్కడ ఉపాధ్యాయుని తోడ్పాటు వలన బాలుని స్వాతంత్ర్యం నశించలేదు గదా, ఫలసిద్ధికి వచ్చింది. సహాయక వరప్రసాదంతో భగవంతుడు మన ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పడ్డం కూడ ఈలాగే వుంటుంది. అనగా మన పుణ్యకార్యాలకు పూర్తిగా మనమే కర్తలం.
 
భక్తుడు అగస్టీను "మన సహకారం లేకుండానే మనలను సృజించిన దేవుడు మన సహకారం లేందే మనలను రక్షించడు" అని వ్రాసాడు. ఈ వాక్యం భావం ఏమిటి? మనకు పుట్టువు నీయకముందు దేవుడు మన అనుమతిని గైకొనలేదు. అసలు ఉనికిలోనే

లేని మనం పుట్టువునకు ఇష్టపడతామని అనుమతి నీయలేము కదా! కాని ఓ మారు పుట్టామో దేవుడు మనలను స్వాతంత్ర్యపు ప్రాణులనుగా పుట్టించాడు. స్వాతంత్ర్యంతో పుట్టాక దేవుడు మన స్వాతంత్ర్యాన్ని మన్నించకుండా వుండటం ఉచితం కాదు. కావుననే ఆ సర్వశక్తిమంతుడు మన స్వాతంత్ర్యాన్ని మన్నిస్తూ మనలను బలవంత పరచకుండా, మనం చేసే సత్కార్యాలతో సహకరిస్తూంటాడు. ఎవరు ఎలాంటి యిల్లు కట్టుకున్నారో అలాంటి యింట్లోనే వసిస్తారు. మనంకూడా బుద్ధిపూర్వకంగా ఏయే కార్యాలు చేసామో ఆయా కార్యాల ఫలితాన్నే అనుభవిస్తాం.

3. సహాయక వరప్రసాదాలను పొందే మార్గం

పవిత్రీకరణం విశేషంగా పావనాత్మ పని. పవిత్రీకరణ వరప్రసాదాన్నిలాగే సహాయక వరప్రసాదాన్ని గూమ మనకనుగ్రహించేది ఆ దివ్యాత్మయే. ఈ యాత్మ ఓ దేవాలయంలో లాగ మన హృదయాలలో వసిస్తూంటూంది. కావున మనలోనికి మనం ప్రవేశించి మన హృదయంలో నెలకొని వున్న ఆ దివ్యాత్మను దర్శించాలి. అతనికి మొక్కులిడాలి. "ప్రభువు నాతో పల్కేపల్కులు ఆలిస్తాను" అన్నాడు కర్తీనకారుడు - 85 8. క్రీస్త్వనుసరణ గ్రంథకారుడు కూడా "అంతరాత్మలో ప్రభువు పల్కే పల్కులు ఆలించి ఆ ప్రభువు నొద్దనుండి ఓదార్పును పొందేనరుడు భాగ్యవంతుడు" అంటాడు-3,1,1. ఔను. పావనాత్మ మన హృదయంలో సంభాషిస్తూంటుంది. ఆ యాత్మ పలుకులు మనకు వెలుగునీ, ఓదార్పునీ, శక్తిని ప్రసాదిస్తుంటాయి. కావున విశ్వాసులు ఆ యాత్మతో చక్కని పరిచయం కలిగించుకోవాలి. "వేనిసాంకైస్పిరితుస్’ అనే గీతం వర్ణించినట్లుగా, ఆ యాత్మ మన యాత్మకు గారాబు నెచ్చెలి. బిరాన వరాలొసగే దాత. హృదయాలు వెలిగించే భాగ్యామల జ్యోతి. ఎండువారిన యెడదలమీద మంచు చిలుకుతూంటుంది. శీతల హృదయాలకు వెచ్చదన మిస్తూంటుంది. శ్రమల్లో పరిశ్రాంతి, శోకాల్లో కుస్తరింపు, శోధనల్లో బాధల్లో ఉపశాంతి ప్రసాదిస్తుంటుంది. వేయేల! ఆ దివ్యాత్మ తోడ్పాటు లేనిదే పతితమానవులమైన మనలో పాపంతప్ప మేలిగుణ మొక్కటీ వుండదు. అట్టి విశుద్దాత్మను శరణుజొచ్చి మనకు కావలసిన సహాయక వరప్రసాదాలను అడుగుకొంటూండాలి.

ప్రార్ధనా భావాలు

1. తండ్రి వరప్రసాదాలు చాలా వున్నాయి. కాని వాటన్నిటిలోను శ్రేష్టమైన వరప్రసాదం క్రీస్తే, క్రీస్తుద్వారానే మనకు పాపవిముక్తీ రక్షణమూ లభిస్తాయి. కనుక తండ్రి క్రీస్తుద్వారా మనకు అతి ప్రశస్తమైన వరప్రసాదంఇచ్చాడని చెప్పాలి. ఈ భావాన్నే పౌలు “మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమైంది" అన్న వాక్యంలో వ్యక్తం చేసాడు - తీతు 2,11. ఈ ప్రత్యక్షమైన “దేవుని కృప" క్రీస్తు మనుష్యావతారమే. ఈలా తండ్రి వరప్రసాదంగా ఈ లోకంలో అవతరించిన క్రీస్తుకి మనం వందనాలర్పించాలి.

2. అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. ‘నరుడు దేవుని నుండి వైదొలగితే చస్తాడు. అతని వద్దకు తిరిగివస్తే బ్రతుకుతాడు. అతనియందు నెలకొనివుంటే పూర్ణంగా జీవిస్తాడు". వరప్రసాదం మనం దేవునియందు నెలకొని వుండేలాను, పూర్ణజీవితం జీవించేలాను చేస్తుంది.

3. చాలమంది దేవుని వరప్రసాదంతో సహకరించరు కనుకనే ఆధ్యాత్మికంగా వృద్ధిలోకి రారు. ఇది చెడ్డపద్ధతి. మనం వరప్రసాదంతో సహకరించడం నేర్చుకోవాలి. పౌలు దేవుని అనుగ్రహం వలన నేనింతటివాజ్ఞయ్యాను. అతని అనుగ్రహం నాయందు వ్యర్థం కాలేదు" అని చెప్పకొన్నాడు - 1కొ 15,10. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయకండి అని కొరింతీయులను హెచ్చరించాడు - 2కొ 6,1. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా మెలగాలి.

7. సహాయక వరప్రసాదాలు మూడు

ఒకే నర్తకి సావిత్రి, సుశీల మొదలుగాగల పలు పాత్రలను ధరించి, పలురూపాలతో, పలు పేళ్లతో రంగస్థలంమీద నటిస్తుంది. అదేరీతిగా సహాయక వరప్రసాదం కూడా చాలా కార్యాలను నిర్వహిస్తూ చాలా పేర్లతో పిలువబడుతూంటుంది. ఈ యధ్యాయంలో మూడు రకాల సహాయక వరప్రసాదాలను పరిశీలిద్దాం.

1. చికిత్సాత్మక వరప్రసాదం

తొలి పాపం ద్వారా నరుని బుద్ధిశక్తి, చిత్తశక్తి రెండూ గాయపడ్డాయి. బుద్ధిశక్తి ద్వారా దేవుని తెలిసికోగలం. ఐనా జన్మపాప ఫలితంగా ఓ విధమైన మాంద్యం ఈ బుద్ధిశక్తిని మంచులాగ ఆవరిస్తుంది. ఈ మాంద్యం వలన ఆధ్యాత్మిక సత్యాలను అంత నిశితంగా గ్రహింపలేక ప్రపంచ వస్తు వ్యామోహాలకు ఇంద్రియ వ్యాపారాలకూ దాసులమై పోతూంటాం. నేటి మన బుద్ధిశక్తి నీరోడ్చే జబ్బు కన్నులాంటిది.

మన చిత్తశక్తి స్వయంగా సత్కార్యాలు చేయగలదు. స్వాతంత్ర్యంతో ప్రవర్తించగలదు. కాని తొలి పాపానంతరం ఆశాపాశాలు దీనికి వస్తాల్లాగ తొడుగుకున్నాయి. దీని ఫలితంగా మన చిత్తశక్తి స్వాతంత్ర్యం కొంతవరకు నశించిపోయింది. అది సత్కార్యాలకు మారుగా దుష్కార్యాలకు పూనుకొంటుంది. మంచిని చేయడానికి మారుగా ఇంద్రియాలకు ప్రియమైన కార్యాలను చేస్తుంది. పర్వతారోహకుడు శిఖరం ఎక్కగలిగికూడ ఒకోమారు బద్ధకించి వెనుకాడుతుంటాడు. ఈ కొండ కొమ్మ ఎక్కలేననుకొని

నిరుత్సాహపడి వెనుకకు పోతూంటాడు. ఈ రీతినే చిత్తశక్తి కూడ ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి బద్దకించి ఇంద్రియాలకు రుచించే జంతుజీవితం జీవిస్తూంటుంది.

ఈ పరిస్థితుల్లో చికిత్సాత్మక వరప్రసాదం మన మీద ఔషధంలాగ పనిచేస్తుంది. మన బుద్ధిచిత్తశక్తులందలి జాడ్యాన్ని తొలగిస్తుంది. అందుకే దీన్ని చికిత్సాత్మక వరప్రసాదం అన్నాం. అనగా మన ఆత్మ వ్యాధిని నయం చేసే వరప్రసాదం. ఇది బుద్ధిశక్తికి ఓ విధమైన వెలుగునిచ్చి దివ్య సత్యాలను గ్రహించేలా చేస్తుంది. ఈ వెలుగుద్వారా మన బుద్ధి ప్రపంచ వస్తువులను ఆధ్యాత్మిక సత్యాలయందు రంజిల్లుతుంది. అదేవిధంగా చిత్తశక్తికి కూడ ఓ విధమైన దివ్య ప్రేరణాన్ని యిస్తుంది. దీని వలన చిత్తం ఇంద్రియ వ్యాపారాలపై ఏవగింపునొంది ఆధ్యాత్మికకార్యాల్లో రంజిల్లుతుంది. సృష్టి వస్తువులమీది ప్రేమను విడనాడి సృష్టికర్తమీద మనసు నిల్పుతుంది.

ఆధ్యాత్మిక జీవితంలో చికిత్సాత్మక వరప్రసాదం చేసే మేలు అంతింతగాదు. నీతిని పొందిన పిదప గూడ చికిత్సాత్మక వరప్రసాదం ఆదుకోందే పెద్ద కాలం పుణ్యావస్థలో నిలువలేం. మనమా బలహీనప నరులం. పాపావకాశాలా పెక్కులు. కనుక ఈ వరప్రసాదం చేయిచ్చి ముందునకు నడపందే చావైన పాపాలనే గోతుల్లో తప్పక కూలిపోతాం.

ఇక, పాపపు ప్రాణులమైన మనకు స్వల్ప పాపపు అవకాశాలు అనంతాలు, కాని చికిత్సాత్మక వరప్రసాదం మనకు అండగా నిలుస్తుంది. స్వల్పపాపాల నుండి మనలను చాలవరకు వైదొలగిస్తుంది. ఐనా చికిత్సాత్మక వరప్రసాదం సాయపడినంక గూడ, దేవుని ప్రత్యేక అనుగ్రహం లేందే స్వల్పపాపాలన్నిటినీ విడనాడలేం, మరియమాతకు మాత్రం ఈలాంటి ప్రత్యేకానుగ్రహం వుందని బోధిస్తుంది ట్రెంటుసభ.

దివ్యగ్రంథాలు జన్మకర్మ పాపఫలితాలను తేటతెల్లంగా వర్ణిస్తాయి. ప్రపంచమింకా చాలవరకు ఈ లోకపు నాయకుని ఆధీనంలోనే వుంది -యోహా 14, 30. చేప నీటిలోలాగ మనమూ రేయింబవళ్లు పాపపులోకంలో మునిగి తేలుతూంటాం. మన యెడదలో కూడ రోజురోజు పాపపు మొగ్గలు పొటమరిస్తూనే వుంటాయి. ఈ పరిస్థితుల్లో మన బుద్ధికి వెలుగునీ, చిత్తానికి చైతన్యాన్నీ దయచేసే చికిత్సాత్మక వరప్రసాదాన్ని ప్రసాదించమని పావనాత్మను అడుగుకొంటూండాలి.

2. ఉద్ధరణ వరప్రసాదం

ఉద్ధరణ మనగా పైకి లేపడం. మన కార్యాలను ప్రాకృతిక దశ నుండి ఆధ్యాత్మిక దశకు లేపుకొని పోయేది ఉద్ధరణ వరప్రసాదం. నా చేతిలోని కలం పుస్తకం వ్రాస్తుంది. ఐనా పుస్తకం వ్రాయాలంటే బుద్ధి, చిత్తశక్తులుండాలి. కలానికి ఈ శక్తులు లేవు. కనుక అది స్వయంగా పుస్తకం వ్రాయలేదు. బుద్ధి చిత్తశక్తులతో కూడిన నేను చేతిలోనికి తీసుకున్నంక అది పుస్తకం వ్రాస్తుంది. ఇదే రీతిగా మన ఆత్మ కూడ స్వయంగా ఆధ్యాత్మిక 283 కార్యాలు చేయలేదు. అది స్వయంగా చేయగలిగింది ప్రాకృతిక కార్యాలు మాత్రమే. కాని వరప్రసాదం ఈ యాత్మను తన చేతులలోనికి తీసికొని మెట్ల నెక్కించుకొని పోతుంది. ఈలా తీసికొని పోవడమే ఉద్ధరణం. అనగా పుణ్యకార్యాలను ఆచరించేలా చేయడం. పవిత్రీకరణ వరప్రసాదం మన ఉనికిని ప్రాకృతిక దశ నుండి ఆధ్యాత్మిక దశకు కొనివస్తుంది. ఉద్ధరణ వరప్రసాదం మన క్రియలను పాకృతిక దశనుండి ఆధ్యాత్మిక దశకు కొనివస్తుంది.

మనం సత్కార్యాలు చేయాలంటే ఉద్ధరణ వరప్రసాదం అవసరం. కాని తొలినాళ్ళల్లోకి క్రైస్తవులు ఈలా అవసరమా అని సందేహించారు. పేలేజియనులు అనబడే శాఖవాళ్ళు సత్కార్యాలు చేయడానికి ఉద్ధరణ వరప్రసాదం అవసరం లేదని వాదించారు. సెమిపెలేజియనులు అనబడే శాఖవాళ్లు సత్కార్యాలు ప్రారంభించాలంటే ఉద్దరణ వరప్రసాదం అవసరం లేదు గాని వాటిని కొనసాగించాలంటే అవసరం అని వాదించారు. మహా మనీషియైన అగస్టీను జీవితాంతం వరకూ ఈ రెండు శాఖలవాళ్ళతో పోట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించాడు. సత్కార్యాలు ఆరంభించాలన్నా కొనసాగించాలన్నా ఉద్ధరణ వరప్రసాదం అవసరమని శ్రీసభ బోధిస్తుంది.

కైసరియా ఫిలిప్పి చెంత క్రీస్తు "నన్ను గూర్చి మీ యభిప్రాయం ఏమిట"ని శిష్యులను ప్రశ్నించాడు. పేత్రు "నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువవు" అని జవాబిచ్చాడు. క్రీస్తు సంతోషించి "ఈ సత్యం నీకు మనుష్యమాత్రుల వలనగాదు, పరలోకంలోని తండ్రి వలన తెలిసింది" అని పేత్రుని మెచ్చుకొన్నాడు - మత్త 16,16. ఇక్కడ విశ్వాసం అనే సత్కార్యం ప్రస్తావించ బడింది. దివ్యవిశ్వాసం దేవుని వద్ద నుండేగాని అభింపదు. అందుకే పౌలు కూడ ఆత్మ అనుగ్రహం లేందే మనంతట మనం "యేసు ప్రభువు" అని పల్మలేం అన్నాడు–1కొ 12,3.

మరో తావులో ప్రభువు "పిత ఆకర్షించందే ఎవరూ నా వద్దకు రాలేరు" అన్నాడు యోహా 6, 43. మన క్రీస్తుజీవితమూ, ఆధ్యాత్మిక జీవితమూ దేవుని కార్యం, అందుకే పౌలు కూడా "ఏ దేవుడు మీయందు రక్షణకార్యం ప్రారంభించాడో ఆ దేవుడే దాన్ని ముగింపునకు గొనివస్తాడు" అని వ్రాసాడు—ఫిలి 1,6.

ఈ దివ్యగ్రంథ వాక్యాలను బట్టి మన చేత దివ్యకార్యాలను చేయించేవాడు దేవుడు లేక దేవుని వరప్రసాదం అని అర్థం చేసికోవాలి. మన పనులను ప్రాకృతికావస్థ నుండి దివ్యదశకు లేపుకొని పోయేదే ఉద్దరణ వరప్రసాదం.

పశుపక్ష్యాదులకు ఆత్మలేదు. కావున దివ్యత్వం లేదు. నరులకు దివ్యత్వం వందిగాని చాలమంది ప్రపంచ వ్యామోహాల్లో మునిగితేలుతూ ఆ సత్యాన్ని గమనింపనే గమనింపరు. ఇక, అపాత్రుల మైనను మనకు జ్ఞానస్నానం ద్వారా దివ్యత్వం లభించింది. కాని ఈ దివ్యత్వాన్ని పొందినంక గూడ మనం పాకృతిక కార్యాల్లోనే కాలం గడుపుతూంటాం. తినడం, నిద్రించడం, ఉద్యోగం చేయడం. డబ్బుజేసికోవడం మొదలైన పనులు ప్రాకృతిక కార్యాలు. మనం సదుద్దేశం ద్వారా, ఉద్ధరణ వరప్రసాదం ద్వారా ఈ ప్రాకృతిక కార్యాలను దివ్యకార్యాలుగా మార్చుకోవాలి. పైగా స్వతస్సిద్ధంగా దివ్యకార్యాలైన సోదరప్రేమ, ప్రార్ధనం, సంస్కారాలు మొదలైన వున్నాయి. మనం వీటిని గూడా ఆచరించాలి. ఉద్ధరణ వరప్రసాదం ద్వారానే గాని ఇవన్నీ సాధ్యం కావు. కనుక ఈ వరప్రసాదాన్ని ప్రసాదించమని పావనాత్మను అడుగుకొంటుండాలి.

3. ప్రబోధాత్మక వరప్రసాదం

కొలనులోని పద్మం రాత్రి ముకుళించుకొని పోతుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు దాన్ని ప్రబోధించి మేలుకొల్పుతాయి. ఇక రోజంతా పద్మం శోభాయమానంగా విప్పారి వుంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మకు గూడ ఓపాటి ప్రబోధము లేక మేలుకొల్పు లభిస్తుంది. ఈ మేలుకొల్పునిచ్చే వరప్రసాదాన్నే ప్రబోధాత్మక వరప్రసాదం అంటాం. ఈ మేలుకొల్పు వలన మన యాత్మంగూడ పూవులాగ విప్పారుతుంది. చైతన్యం పొంది దివ్యకార్యాలకు పూనుకొంటుంది.


ప్రాకృతిక రంగంలో ఏదైనా ఓ పని చేయాలంటే మున్ముందుగా ఆ కార్యాన్ని గూర్చిన ఆలోచనా, అభిలాషా వుండాలి. ఉదాహరణకు, ఇల్లు కడుతున్నాం అనుకుందాం. మున్ముందుగా ఆ యింటి యొక్క అవసరాన్నీ లాభాన్నీ ఆలోచించి చూచి, దాన్ని అభిలషించిన పిదపనేగాని గృహనిర్మాణానికి పూనుకోము. ఇదేరీతిగా ఆధ్యాత్మిక జీవితంలో గూడ ఆయా పుణ్యకార్యాలను చేయాలంటే - ఉదాహరణకు జపము, సోదరప్రేమ పవిత్రజీవనము మొదలైన వాటిని పాటించాలంటే - మున్ముందుగా ఆలోచనా అభిలాషా అవసరం. ఇదే ప్రబోధం. కాని గృహనిర్మాణాది ప్రాకృతిక కార్యాలను మనమే స్వయంగా ఆలోచించగలం. అభిలషించగలం. ఆధ్యాత్మిక కార్యాలను మాత్రం మనంతట మనం అభిలషించలేం. పరిశుద్దాత్మే మన యాత్మను ప్రబోధించి ఆధ్యాత్మిక కార్యాలను అభిలషించేలా చేస్తుంది.


ఓ నిదురించే వ్యక్తిని పెద్దస్వరంతో పిల్చి తట్టి లేపామనుకుందాం. అతడు మేల్మొని పడక మీదనుండి లేస్తాడు. ఇక్కడ మేల్కొందీ లేచిందీ ఆ వ్యక్షే ఐనప్పటికీ, అతన్ని పిల్చింది తట్టింది మనం. ఈ పిలవడానికీ, తట్టడానికీ అతని సహకారమేమీలేదు. ఈ రీతినే ప్రబోధాత్మక వరప్రసాదాన్నిగూడ మన సహకారం లేకుండానే తలవని తలంపుగా భగవంతుడు ఇస్తుంటాడు. అందుకే 529లో జరిగిన ఓరంజ్ మహాసభ "భగవంతుడు వరప్రసాదమిచ్చేది నరుడు తొలుత ప్రార్ధించినందుకు గాదు. మరి భగవంతుడు తొలుత వరప్రసాద మిచ్చాడు కనుకనే నరుడు ప్రార్ధింప కల్లుతున్నాడు" అని బోధించింది. ఈ వాక్యం ఒక్క ప్రార్థనకేగాదు ఆధ్యాత్మిక కార్యాలన్నిటినీ వర్తిస్తుంది. ఆధ్యాత్మిక జీవితమంటే మనంతట మనం భగవంతుడ్డి వెదుక్కుంటూ పోవడంగాదు. అతడు మనలను వెదుకుంటూ రావడం. ఫ్రెంచి తత్వజ్ఞడు పాస్కాలు వ్రాసిన ఓ గ్రంథంలో భగవంతుడు ಅಘ್ಯುತ್ ఈలా అంటాడు. "నేను నీ వద్దకు వచ్చాను గనుకనే నీవు నన్ను వెదక గలిగావు". భక్తుడు ఆగస్టీనుకూడ "ప్రభూ? నేను నీ కొరకు అన్ని తావుల్లో వెదుకుతూ వచ్చాను. కాని నీవు మాత్రం ఇంతవరకు నా హృదయంలోనే దాగుకొని వున్నావు" అన్నాడు. అనగా భగవంతుడు ఆ భక్తుని హృదయంలో వుండి దాన్ని ప్రనబోధించడం వలననే అతడు దేవుణ్ణి వెదకడం ప్రారంభించాడు.

మరియమాత బాలయేసును దేవాలయానికి కొనిపోయింది. అదే సమయంలో సిమ్యోను అనే వృద్దుడు ఆత్మచే ప్రబోధితుడై దేవాలయానికి వచ్చాడు - లూకా 2, 27. ఇతడు చాల యేండ్లనుండి యిస్రాయేలు పునరుద్ధరణాన్ని అభిలషిస్తున్నాడు. ఆ పునరుద్ధరణాన్ని ప్రసాదించే మెస్సీయాను కండ్గార చూచిందాకా కన్నులు మూయవని పరిశుద్దాత్మ అతనికి హామీ యిచ్చింది. ఇది ప్రబోధమే.
పౌలు తన మూడవ ప్రేషిత ప్రమాణములో మాసెడోనియాలోని ఫిలిప్పి పట్టణం నదీ తీరాన గుమికూడిన స్త్రీలకు ప్రసంగించాడు. వారిలో లూదియా అనబడే ఆమె హృదయాన్ని దేవుడు ప్రబోధింపగా ఆమె జ్ఞానస్నానము పొందింది - అచ 16, 14 తరువాత ఆమె అపోస్తలులకు ఆతిథ్యమిచ్చింది. అక్కడ అందరు స్త్రీలుంటే దేవుడు ఆమె హృదయాన్నే ఎందుకు ప్రబోధించాడో ఎవరు చెప్పగలరు?
మొదట ఆయా కార్యాలను అభిలషించడానికి, అటు పిమ్మట వాటిని కొనసాగించడానికీ వలసిన సామర్థ్యమిచ్చేవాడు ప్రభువేనన్నాడు పౌలు - ఫిలి 2, 13. అనగా భగవత్రబోధం వలననే ఆయా సత్కార్యాలకు పూనుకొంటామని భావం. యెహెజేలు ప్రవచనంలో ప్రభువు "నేను మీలోని రాతిగుండెను తీసివేసి దాని తావన క్రొత్తదైన మాంసపు గుండెను నిల్పుతాను" అంటాడు - 86, 26. ఇక్కడ రాతి గుండె విధేయతలేని జీవితాన్ని మాంసపు గుండె విధేయాత్మక జీవితాన్ని సూచిస్తుంది. అనగా దేవుడు మన హృదయంలో ఈ మార్పును గలిగించాలి. ఈ ప్రబోధాన్ని మనకీయాలి
పైన నిద్రించే వ్యక్తి ఉపమానం వాడాం. మనం ప్రబోధించినపుడు నిద్రించే వ్యక్తి పడకమీద నుండి లేవవచ్చు లేవకపోవచ్చు. ఇదే విధంగా మనంకూడ ప్రబోధక వరప్రసాదాన్ని గుర్తించి ఆయా పుణ్యకార్యాలకు పూనుకోవచ్చు. పూనుకోకపోవచ్చుగూడ, నరుడు స్వతంత్రుడు కనుక ఒకోమారు పరిశుద్దాత్మ ప్రబోధాలను పెడచెవిని పెడుతూంటాడు. ఇది చాల పెద్దయనర్థకం, విశ్వాసులు భక్తిభావంతో తమ హృదయంలోని ప్రబోధాలను గుర్తించడానికి అలవాటు పడాలి. ఆత్మ మన అంతరాత్మలో మెల్లగా మాట్లాడుతూంటూంది, అభిలాషలు పుట్టిస్తూంటుంది. జపతత్పరులేగాని ఈ యాత్మ ప్రబోధాలను అభిలాషలను గుర్తించలేరు. 

ఆత్మ ప్రబోధాన్ని గుర్తించినంక ఆ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి. స్వర్గస్టులైన 23వ జాన్ పోపుగారు క్రైస్తవ మహాసభ జరిపించాలి అనే ప్రబోధాన్ని హృదయంలో గుర్తించారు. వెంటనే ఆయన రెండవ వాటికన్ సభను సమావేశపరచాడు. ఈ సభ వలన కల్గిన మేళ్లు అన్ని యిన్నికావు. మొదటి పెంతెకోస్టు తర్వాత ఈ రెండవ వాటికన్ వంటి క్రైస్తవ సంఘటనం మరొకటి జరగలేదని చాలామంది విజ్ఞల అభిప్రాయం. జాన్ పోపుగారు వాటికన్ సమావేశ ఫలితాలను కన్నులార చూడకముందే కన్నుమూసారు. కాని నేడు మనం ఆ సత్ఫలితాలను అనుభవిస్తున్నాం. ఈ జాన్ పోపుగారివలె మనం కూడ ఆత్మ యిచ్చే ప్రబోధాలను పాటించడం నేర్చుకోవాలి. “ఈ దినం మీరు ప్రభువు పల్మలు ఆలించినటైతే ఎంత మేలయ్యేది! ఆనాటి మీ పితరుల వలె నేడు మీరు కూడ హృదయం కఠినపరచుకోకండి" అంటుంది కీర్తన 95,7. ఈ వాక్యాలు ప్రతిరోజు స్మరించుకోదగ్గవి.

ప్రార్ధనా భావాలు

1. మూడవ శతాబ్దానికి చెందిన క్లెమెంట్ అనే వేదశాస్త్రి యీలా వ్రాసాడు. "మొక్కలను మడిలో నుండి పెరికి తోటలో నాటుతారు. అక్కడవి బాగా పెరుగుతాయి. మనతోట క్రీస్తే మనలను పూర్వపు పాపజీవితంనుండి పెరికివేసి క్రీస్తు అనే మంచి నేలలో నాటుతారు. క్రీస్తు అనే తోటలో మనం చక్కగా ఫలిస్తాం." అనగా క్రీస్తు వరప్రసాదం మన మీద పనిచేసి మనం దివ్యజీవితం జీవించేలా చేస్తుందని భావం.

2. మనం వరప్రసాదంతో సహకరించాలని చెపూనాల్గవ శతాబ్దానికి చెందిన జెరోము భక్తుడు ఈలా వ్రాసాడు. “అడగడం మన పని, ఈయడం దేవుని పని. కార్యాన్ని మొదలు పెట్టడం మన పూచీ, దాన్ని ముగించడం దేవుని పూచీ, మనకు చేతనైంది మనం చేస్తే, మనకు చేతకానిది దేవుడే చేస్తాడు." కనుక మన మెప్పడుకూడ దేవుని వరప్రసాదంతో సహకరించి సత్కార్యాలకు పూనుకోవాలి.

3. బావిలో నీరు చేదుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీతో క్రీస్తు"నేను నీకు జీవజల మిస్తాను" అని చెప్పాడు. ఈ జలం అంతరంగమనే చెలమనుండి ఉబికి వస్తుందనీ, దాని ద్వారా శాశ్వత జీవం పొందవచ్చుననీ చెప్పాడు - యోహా 4, 14. బైబుల్లో జలం ఆత్మను సూచిస్తుంది. క్రీస్తు ఉత్తానమయ్యాక తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. ఈ యాత్మ ద్వారా మనకు వరప్రసాదం లభిస్తుంది. అనగా ఉత్థాన క్రీస్తు ఆత్మ మన ఆత్మలో వుండి మన అంతరంగంలో వరప్రసాదాన్ని ఊరినూంటుంది. చెలమలోనుండి నీళ్ళు వుబికి వచ్చినటుగా మన అంతరంగంలోనుండి వరప్రసాదం ఉబికి వస్తూంటుంది.

8. సహాయక వరప్రసాదాలు మరో మూడు

పూర్వాధ్యాయంలో ఒకే సహాయక వరప్రసాదం మూడు రూపాల్లో పని చేస్తుందని చెప్పాం. ఈ యధ్యాయంలో మరో మూడు రకాల సహాయక వరప్రసాదాలను గూర్చి విచారిద్దాం. ఇక్కడ మూడంశాలను పరిశీలిద్దాం.

1. బాహిరవరప్రసాదం

నరుడు సాంఘిక జీవి. అనేకమంది ప్రజలతో తిరుగుతూంటాడు, అనేక సంఘటనల్లో పాల్గొంటూంటాడు. ఈ సంఘటనలూ ఈ నరులూ అతనికి వరప్రసాద కారకులౌతూంటారు. వరప్రసాదం మన ప్రాకృతిక జీవితానికి అనుకూలంగా వర్తిస్తూంటుంది. క్రీస్తు నరావతారం ద్వారా ఈ భౌతిక ప్రపంచమంతా పునీతమైంది. కనుక ఈ సంఘటనలు ఈ నరులు మనకు వరప్రసాదాన్ని ఈయగలరు. ఈ సత్యాన్ని బాగుగా గ్రహించిన పునీత చిన్నతెరేస "సర్వం వరప్రసాదమయంం" అని నమ్మింది.

బాహిర వరప్రసాదమంటే బాహ్యసంఘటనంవల్ల లభించే వరప్రసాదం. దీనిలో కొన్ని దీర్ఘకాల ముండేవి. కొన్ని తాత్కాలికాలు. వివాహ జీవితంలో భార్యాభర్తలు ఒకరి కొకరు వర ప్రసాద కారకులు. తల్లిదండ్రులూ బిడ్డలూ ఒకరికొకరు వరప్రసాద కారకులు. ఇవన్నీ దీర్ఘకాలముండే బాహిర వరప్రసాదాలు.
ఓ మంచి ప్రసంగాన్నో మంచి సంభాషణనో వినడం, ఓ మంచి పుస్తకాన్ని చదవడం తాత్కాలికమైన బాహిర వరప్రసాదానికి ఉదాహరణలు. బాహిర వరప్రసాదాన్ని అర్థం చేసికోవడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు :

సద్ధంథ పఠనం

 : అగస్టీను పరివర్తనకు దివ్యగ్రంథ పఠనం చివరి కారణం. "ఆశాపాశాలతో కూడిన దైహికవాంఛలకు తావీయక క్రీస్తును ధరించండి" అన్న రోమీయుల జాబు నందలి వాక్యాన్ని చదివి అతడు మనసు మార్చుకొన్నాడని వింటూన్నాం - 13. 14. ఇదే రీతిగా ఇన్యాసిలొయోలా కూడ యుద్ధంలో గాయపడి ఆస్పత్రిలో వున్నపుడు పనీతుల జీవిత చరిత్రలు చదివి మనసు మార్చుకొన్నాడు. రాజుల కొలువు మాని దేవుని కొలువులో చేరాడు. నేడు సద్దంథ పఠనం ద్వారా పరిశుద్ధాత్మ మన హృదయాలను ప్రబోధిస్తుంటుంది.

సత్సంభాషణలు:

ఆల్పోన్సస్ రొడ్రిగస్ అనే సహోదరుని శిష్యుడు పీటర్ క్షేనర్ క్షేవర్ ఆ సహోదరుని సంభాషణలు వలన ప్రేరితుడై దక్షిణ అమెరికాలోని నీగ్రో ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడ్డాడు. వీళ్ళిద్దరూ దొడ్డ పునీతులు. జస్టిన్ అనే ఓ రోమను యువకుడు దేవుణ్ణి తెలిసికోగోరి చాలమంది భక్తులను సందర్శించాడు. ఒకానొక యూదవృద్ధుడు అతన్ని పూర్వవేదం చదవమని సలహా యిచ్చాడు. దానితో జస్టిన్ బైబులు

పఠనం ప్రారంభించాడు. ఈయన రెండవ శతాబ్దిలో వేదసాక్షిగా మరణించాడు. సత్సంభాషణం ద్వారా దివ్యాత్ముడు మన హృదయంలో మాట్లాడుతూంటాడు. ప్రబోధం కలిగిస్తుంటాడు.

సంఘటనలు:

పేత్రు క్రీస్తు నెరుగనని మూడుసార్లు బొంకాడు. ఆ ప్రభువు అతనివైపు జాలితో చూచాడు. పేత్రు తన తప్పను తెలిసికొని పశ్చాత్తాపంతో బోరున యేడ్చాడు -లూకా 22,62, ఫ్రాన్సిస్ ಬೌದ್ದಿಯಾ అను నాతడు కూడ భార్య మరణం కారణంగా జేసుసభలో చేరి గొప్ప భక్తుడయ్యాడు. ఈలాగే జీవితంలోని రకరకాల సంఘటనలు మనకు వరప్రసాదాన్నిస్తూంటాయి.

కుటుంబం:

భక్తురాలగు మోనీక తన భర్త పెట్రీష్యస్ పరివర్తనానికి, కుమారుడు ఆగస్టీను పరివర్తనానికి కారకురాలైంది. రోమను సామ్రాజ్యమునందలి క్రైస్తవ వనితలు చాలమంది తమ భర్తలు జ్ఞానస్నానం పొందడానికి కారకురాళ్ళయ్యారని వేదసాక్షుల చరిత్రలు చెపూంటాయి. ఈలా కుటుం జీవితంలో ఓ వ్యక్తి మరోవ్యక్తికి వరప్రసాద కారణం కావచ్చు.

ఈలా జీవితంలో ఆయా సన్నివేశాలు ఆయా వ్యక్తులూ మనకు వరప్రసాద కారకులౌతూంటారు. అందుకే పౌలు "దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకి అన్నీ మంచినే చేస్తాయి” అని వాకొన్నాడు - రోమా 9, 28.

2. అన్యప్రయోజక వరప్రసాదం

ఇంతవరకు నాలు రకాల సహాయక వరప్రసాదాలను చూచాం. ఇవన్నీస్వీయ ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడ్డాయి. ఇవిగాక అన్యప్రయోజనం కొరకు ఉద్దేశింపబడిన సహాయక వరప్రసాదాలూ వున్నాయి. అనగా ఇవి తనకుగాక ఇతరులకు ఉపయోగపడుతుంటాయి.

ఇవీ చాలా వున్నాయి. కొన్ని విశ్వాసుల సమాజం కోసం ఉద్దేశింపబడ్డాయి. దివ్యప్రేరణం ఈలాంటిదే. దీనిద్వారా పరిశుద్ధ రచయితలు బైబులు గ్రంథాలను వ్రాసి విశ్వాసుల కందరకూ మేలు చేకూర్చారు. భగవంతుడు అనుగ్రహించే దర్శనాలూ ఈలాంటివే. శ్రీ హృదయ దర్శనాలకు పాత్రురాలైన మర్గరీత మరియు క్రైస్తవ ప్రజలకందరకును దివ్య ప్రేమను చాటి చెప్పగల్లింది. పౌలు తన గ్రంథాల్లో పేర్కొనిన దైవవరాలూ ఈలాంటివే - 1కొ 12, 7-11. అన్యభాషల్లో మాటలాడ్డం, ప్రవచించడం, ఉపన్యసించడం మొదలుగా గల ఈ వరాలు ముప్పెదాకా వున్నాయి. శ్రీసభ తొలినాళ్లలో ఈ వరాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ జ్ఞానదేహం పెంపుకోసమ ఉద్దేశింపబడ్డాయి - ఎఫే 4, 13. మరికొన్ని సమాజ మంతటి కొరకు గాక, పరిమిత వ్యక్తుల కొరకు ఉద్దేశింపబడ్డాయి. వివాహ జీవితము మఠశ్రేష్టత్వము, గురుత్వము మొదలైనవి ఈలాంటివి. వివాహ జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు, వాళ్ళిద్దరూ కలసి బిడ్డలకూ వరప్రసాద కారకులౌతారు. మఠ శ్రేష్ఠులదారా మఠవాసులకు అనేక వరప్రసాదాలు లభిస్తాయి. గురువు ద్వారా విశ్వాసులకు పెక్కువరప్రసాదాలు సిద్ధిస్తాయి.

3. క్రియా నిర్వహణ వరప్రసాదం

పవిత్రీకరణ వరప్రసాదం మన ఉనికికి, సహాయక వరప్రసాదం మన కార్యాలకు దివ్యత్వమిస్తాయని చెప్పాం. కనుక సహాయక వరప్రసాదం మనం ఆయా దివ్యకార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది, ఈ సహాయక వరప్రసాదంతో మనం సహకరిస్తే ఆయాసత్కార్యాలను చేసి ముగిస్తాం. సహకరింపకపోతే ఆ కార్యాలు ఆలాగే కుంటుపడిపోతాయి. కాబట్టి ఈ సహాయక వరప్రసాదంలో రెండు మెట్లుంటాయి. మొదటి మెట్టని క్రియా సమర్థక వరప్రసాదం అంటాం. ఈ మెట్టులో సహాయక వరప్రసాదం మనకు పుణ్యకార్యాన్ని చేయగలిగే సామర్థ్యం ఇస్తుంది. రెండవ మొట్టను క్రియానిర్వహణ వరప్రసాదం అంటాం. ఈ మెట్టులో పై సామర్ధ్యాన్ని సద్వినియోగ పరచుకొని పుణ్యకార్యంచేసి ముగిస్తాం. ఈ రీతిగా మన తోడ్పాటు వలన క్రియా సమర్థక వరప్రసాదం క్రియా నిర్వహణ వరప్రసాదంగా మారిపోతుంది.

ఓ వుదాహరణం చూద్దాం. డమస్కు త్రోవలో పయనమై పోతువున్న సౌలుని క్రీస్తు ప్రబోధించాడు, "సౌలూ! ఎందుకు నన్ను హింసిస్తున్నావు?” అని అడిగాడు. సౌలు విషయం గ్రహించాడు. ఇది మొదటిమెట్టు. అతడు గుండె బండ చేసికోలేదు. పరివర్తనం చెంది క్రీస్తుకు నచ్చిన శిష్యుడయ్యాడు. ఇది రెండవమెట్టు. ఈలాగే తన్ను శత్రువులకు పట్టీయవచ్చే యూదానుకూడ క్రీస్తు ప్రబోధించాడు. "మిత్రుడా! మనుష్యకుమారుని ముద్దుతో శత్రువులకు పట్టీయ వచ్చావా" అని హెచ్చరించాడు. యూదాకు అర్థమైంది. ఇది మొదటి మెట్టు, యూదా ఈ క్రియా సమర్థక వరప్రసాదంతో సహకరించనేలేదు. తన పాపకార్యాన్నుండి వైదొలగలేదు. అంచేత ఇక్కడ క్రియానిర్వహణ వరప్రసాదం లేనేలేదు.

మన జీవితంలో కూడ ఓ పుణ్యకార్యాన్ని చేయాలనో ఓ పాపకార్యాన్నుండి వైదొలగాలనో బలమైన కోరిక కలుగుతూంటుంది, ఇది ఓ ప్రబోధం, ఓ అంతర్వాణి. ఇదే క్రియా సమర్థక వరప్రసాదం. ఇట్టి పట్టుల్లో మనం అంతర్వాణితో సహకరించి ఆత్మ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి, అలా నడచుకొంటే ఆ ప్రబోధమే క్రియా నిర్వహణ వరప్రసాదమౌతుంది. ఆలా నడుచుకోకపోతే వరప్రసాదాన్ని వ్యర్థపరచినవాళ్ళ మౌతాం.

ఈలా వ్యర్థపచవద్దని నూత్నవేదం చాలా తావుల్లో హెచ్చరిస్తుంది. సైఫను చనిపోతూ యూదుల నాయకులను "మీరు హృదయాలు రాయి చేసికొన్నారు. పరిశుద్దాత్మను ప్రతిఘటిస్తున్నారు" అని మందలించాడు - అచ 7,51. పౌలు కొరింతీయులకు రెండవ జాబు వ్రాస్తూ "దేవుని వరప్రసాదం వ్యర్థపరచకండి" అని హెచ్చరించాడు - 6,1.

పైన యూదా ఉదాహరణం చూచాం. "ముద్దుతో మనుష్య కుమారుని పట్టిస్తున్నావా!" అని క్రీస్తు యూదాను మందలించాడు అని చెప్పాం - లూకా 23, 48. ఈ యుదాహరణలన్నిటిల్లో నరులు క్రియాసమర్థక వరప్రసాదంతో సహకరింపకపోవడంచే అది క్రియా నిర్వాహణ వరప్రసాదంగా మారిపోలేదు. అనగా ఆ పుణ్యకార్యం నిర్వహింపబడనే లేదు. అగస్టీను "మనం మొదట భగవంతుని త్యజించందే భగవంతుడు మనలను త్యజించడు" అని వ్రాసాడు. అనగా మనం దుర్భుద్దులమై వరప్రసాదంతో సహకరించడం. గొర్రెపోతును ముందుకు లాగుతూంటె అది వెనక్కు బోతుంటుంది. అలాగే వరప్రసాదం మనలను ముందుకు వెళ్ళమని ప్రబోధిస్తుంటే మనం దుర్బుద్ధితో వెనక్కు వెళూంటాం. కనుక జీవితంలో మనం వరప్రసాదంతో ఎంతవరకు సహకరిస్తున్నామా అని జాగ్రత్తగా ఆత్మవిచారం చేసికోవాలి.
ఓ మూరు మన సహకారం వలన క్రియాసమర్ధక వరప్రసాదం క్రియానిర్వహణ వరప్రసాదంగా మారిందో, ఇక యీ వరప్రసాదం మరో క్రియా సమర్థక వరప్రసాదాన్ని మొలకెత్తిస్తుంది. అది గూడ మళ్ళా క్రియానిర్వహణ వరప్రసాదమైందో మరోక్రియా సమర్ధక వరప్రసాదాన్ని మొలకెత్తిస్తుంది. ఈ వరప్రసాదాలు ఈ రీతిగా గొలుసుకట్టులాగ, చెరువులోని అలల్లాగ ఎడతెగకుండా పెరిగిపోతూనే వుంటాయి, పైన పౌలు పరివర్తనను ఉదహరించాం. పరివర్తనానంతరం పౌలు గ్రీకు పట్టణాల్లో చాలచోట్ల క్రీస్తును బోధించాడు. క్రైస్తవ సమాజాలు స్థాపించాడు. ఈ సమాజాల మేలు కొరకై మళ్లా చాలా జాబులు వ్రాసాడు. మల్లా ఈ సమాజాల స్థితిగతులను విచారించడానికై తీతు తిమోతి మొదలగు తన శిష్యులను అధికారులనుగా నియమించాడు. వరప్రసాద మానవుడు జీవితమంతా ఈలా తామరతంపరగా వృద్ధిచెందుతూంటాడు. భగవంతునికీ తోడి నరులకూ ప్రియపడే కార్యాలను చేసికొంటూ పోతాడు

. క్రియానిర్వహణ వరప్రసాదం అరటి బోదెలాంటిది. అరటి చెట్టు కాపుకు వచ్చేప్పటికి మరో పిలక వేస్తుంది. ఆ పిలక గూడ తల్లి చెట్ట పద్ధతినే అనుసరిస్తుంది. వరప్రసాదంతో సహకరించామంటే రోజురోజుకి మన జీవితం ఫలభరిత మౌతుంది. మన వరప్రసాదం పెరిగినా తరిగినా ఇక్కడున్నన్నినాళ్లే మన మార్జించిన వరప్రసాదానికి మరులోకంలో వృద్ధి క్షయాలు ఉండవు. చనిపోయేపుడు ఏపాటి వరప్రసాదంతో చనిపోతామో ఆమీదట శాశ్వతకాలమూ అపాటి వరప్రసాదంతోనే ఉండిపోతాం. కనుక ఈ లోకంలో ఉన్నంత కాలమూ మన వరప్రసాదం పెరుగుతుండాలనే దేవుని కోరిక.

ఇంతవరకూ వరప్రసాదాన్ని గూర్చి మనం చెప్పిన విషయాలన్నీ ఈ క్రింది ప్రాచీన జపంలో చక్కగా పొందుపరచబడ్డాయి. "ప్రభూ! మా జపాలూ పనులూ మీ

ప్రేరణంతో ప్రారంభమగునుగాక, మీ సహాయంతో కొనసాగును గాక, మీయందే ముగింప జెందునుగాక"

ఇంకొక్క విషయాన్ని మాత్రం చెప్పి ఈ యధ్యాయాన్ని ముగిద్దాం. భగవంతుడు మనలను ఏ యంతస్తుకు పిలిచాడో ఆ యంతస్తునకు చెందిన బాధ్యతలను నిర్వహించే వరప్రసాదం కూడ ఇస్తాడు. ఆందుకే అగస్టీను "దేవుడు మనలను అసాధ్యమైన పనులు చేయమని అజ్ఞాపింపడు. కనుక ఆయా బాధ్యతలు మన పాల బడినపుడు, శక్తిగల యంతవరకు మన మా బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. శక్తి చాలనియపుడు భగవంతుని సహాయం అడుగుకోవాలి. భగవంతుడు మన మనవులను ఆలించి ఆ బాధ్యతలను నిర్వహించే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు" అని బోధించాడు. అతడే మరో తావులో "ప్రభూ! మొదట నీ వాజ్ఞాపించే కార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించు. ఆ మీదట నీ యిష్టం వచ్చిన కార్యాన్ని ఆజ్ఞాపించు, చేస్తాను" అని వాకొన్నాడు. సంసార జీవితంలో దైనందిన కార్యాలతో విసిగి వేసారిపోయే ప్రజలు ఈ వాక్యాలను స్మరించుకోవడం మేలు.

ప్రార్ధనా భావాలు

1. ఓరిజిన్ వేదశాస్త్రి యిలా వాకొన్నాడు. "నీవు వూపిరిపోసినట్లయితే ప్రాణి సృష్టి జరుగుతుంది. నీవు భూమికి నూత్నజీవాన్ని దయచేస్తావు" అంటుంది కీర్తన 104, 30. ఈ వూపిరి పవిత్రాత్కే ఆ యాత్మ నరుల హృదయాల్లోనికి ప్రవేశించి వాళ్లల్లోని ప్రాతమానవుని నాశం చేస్తుంది. అతని స్థానే నూత్నమానవుని ఆవిర్భవింపజేస్తుంది." ఈ నూత్న మానవుడే వరప్రసాద మానవుడు.
2. సొలోమోను దేవాలయాన్ని నిర్మించడానికి లక్షలాది కూలీలు పని చేసారు. ఆ దేవాలయాన్ని పూర్తిచేయడానికి ఏడేండ్లు పట్టింది -1 రాజు 9, 38. కాని బాబిలోనియా రాజు కేవలం 3,300 మంది సైనికులతో వచ్చి ఒక్కరోజులోనే ఆ మందిరాన్నిధ్వంసం చేసాడు. వరప్రసాదంతో మన హృదయమనే దేవాలయాన్ని నిర్మించుకోవడానికి చాల యేండ్లు పడుతుంది. కాని పాపంతో దాన్ని ధ్వంసం చేసికోవడానికి మాత్రం ఒక్క నిమిషమే చాలు.
3. జీవితంలో కష్టాలు వొస్తూంటాయి. మనం వాటిని తొలగించమని దేవుణ్ణి అడుగుకొంటాం, కాని ప్రభువు తరచుగా ఆ కష్టాలను తొలగించడు. వాటిని భరించే శక్తిని మాత్రం దయచేస్తూంటాడు. పౌలు తన బాధను తొలగించమని ఆడగ్గా ప్రభువు "నా కృప నీకు చాలు. నరుల బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమౌతుంది" అని చెప్పాడు-2 కొ 12-9. కనుక వరప్రసాద బలంతో మన పాలబడే కష్టాలను భరించాలి.

9. జానదేహం

ఉత్థాన క్రీస్తు మన మధ్యలో నెలకొని వుండేలా చేసే సంస్థ శ్రీసభ ప్రభువు ఆర్థించిన వరప్రసాదాలు శ్రీసభ ద్వారాగాని మనలను చేరవు. ఈ శ్రీసభనే పౌలు "జ్ఞానదేహం" అని పిలుస్తుంటాడు. ఇక్కడ మూడంశాలు విచారిద్దాం.

1. జ్ఞానదేహ సిదాంతం

పూర్వవేదంలో ప్రభువు యిప్రాయేలు ప్రజలను వ్యక్తిగతంగా గాక, ఓ జాతిగా ఎన్నుకున్నాడు. యిప్రాయేలు ప్రజలంతా గలసి యావే పుత్రుడు. వారిది సాంఘికమైన వ్యక్తిత్వం, ఈ పూర్వవేదపు సాంఘిక వ్యక్తిత్వమే నూత్నవేదానికి అన్వయించినపుడు జ్ఞానదేహం అని చెప్పబడుతుంది. పౌలు “జ్ఞానదేహం" అనే శబ్దాన్ని ఎక్కడా వాడలేదుగాని, దాని సిద్దాంతాన్ని మాత్రం వివరించాడు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్ళంతా క్రీస్తు అవయవాలుగా ఏర్పడతారు. విశ్వాసులూ క్రీస్తు కలిసి ఒక్క వ్యక్తిగా ఒసగూడుతారు. ఈ యైక్యత జ్ఞానస్నానం ద్వారా, దివ్యసత్రసాదం ద్వారా సిద్ధిస్తుంది.
జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో మరణిస్తాం. క్రీస్తుతో ఉత్తాన మౌతాం. క్రీస్తుకు ఆంకితమౌతాం. క్రీస్తనే వాతావరణంలో జీవిస్తాం - రోమా 6,1-11. ఈ క్రీస్తు జీవితాన్నే దివ్యసత్రసాదం కూడ పోషించి పెద్ద జేస్తుంది. ఒకే రొట్టెను భుజించిన వాళ్ళంతా ప్రభువుతో ఒక్క దేహమౌతారు. ఆ ప్రభువు ద్వారా తోడి ప్రజలతోను ఐక్యమౌతారు. 1కొ 10, 17.
శరీరంలో ఎన్నో అవయవాలుంటాయి. ఐనా అవన్నీ ఒక్క దేహ మౌతాయి. ఈలాగే విశ్వాసులంతా క్రీస్తుతో ఒక్క దేహమౌతారు - 1కొ 12,12. ఈ దేహానికి శిరస్సు క్రీస్తే, స్త్రీకి శిరస్సు భర్త, అలాగే విశ్వాసులకు శిరస్సు క్రీస్తు - 1కొ11,3. ఇక్కడ శిరస్సు అంటే నాయకుడు లేక అధిపతి అని అర్థం. క్రీస్తు విశ్వాసులను పిత యొద్దకు నడిపించుకొని పోయే నాయకుడు. రెండవ మోషే.
క్రీస్తుతో ఒక్కటిగా ఐక్యమైన విశ్వాసులు ఆ క్రీస్తు ద్వారా తమలో తాము ఐక్యమౌతారు. ఒక్క రొట్టెగా మారిన గోదుమ గింజలు, ఒక చేరెడు రసంగా మారిన ద్రాక్షపండ్లు, ఒక దేహంగా ఏర్పడిన అవయవాలు తమలో తాము ఐక్యమౌతాయి. ఆవిధంగానే క్రీస్తుతో ఐక్యమైన విశ్వాసులూ తమలో తాము ఐక్యమౌతారు. అనగా క్రీస్తునందు అందరూ అక్కచెల్లెళూ అన్నదమ్ములూ ఔతారు. దేహంలోని అవయవాలు ఒకదాని కొకటి ఉపయోగపడినట్లే మనమూ ఒకరి కొకరం ఉపయోగపడాలి - రోమీ12, 4.

2.జ్ఞానదేహపు బాధ్యతలు

క్రీస్తునందు ఒక్కటిగా ఐక్యమైన ప్రజలు జాతిభేదాన్ని పాటించకూడదు. పౌలు క్రైస్తవుల్లో యూదులు, గ్రీకులు రోమనులు ఉన్నారు. ఐనా వీళ్ళంతా క్రీస్తుతో ఐక్యమైన ప్రజలు గనుక వీళ్ళల్లో వీళ్ళ జాతిభేదాలు పాటించకూడదు - కొలో 3,11. నేడు కులభేదాలనూ, వర్గభేదాలనూ వదలివేయలేక సతమతమౌతున్న భారతీయ క్రైస్తవులు పౌలుబోధలను స్మరించుకోవడం మేలు.

ఈ రీతినే క్రీస్తులోనికి ఐక్యమైన ప్రజలు లింగభేదాన్నీ పాటించరాదు - గల 3, 28. స్త్రీలను ఓ ప్రత్యేక జాతిగా భావించి కేటాయిస్తూ వుండడం నూతవేద బోధలకు విరుద్ధం. దేహంలోని అవయవాల్లాగే క్రీస్తుతో ఐక్యమైన ప్రజలూ ఒద్దికగా, కలుపుగోలుతనంతో జీవిస్తూండాలి. క్రైస్తవుల మధ్య కలహాలు పనికిరావు. జగడాలు కలిగించి విశ్వాసులను ఒకరినుండి ఒకరిని వేరుపరచే ప్రయత్నం తలపెట్టరాదు - 1కొ 1, 13.

విశ్వాసులు ఒకరికొకరు దురాదర్శం జూపి పాపకారణం కాకూడదు. మన పాడు పనులను జూచి ఇతరులు కూడ పాడుపనులు చేసేలా వుండకూడదు. ఈ బలహీనప నరులకోసం కూడ క్రీస్తు సిలువమీద చనిపోయాడు - 1కొ 8,11 క్రైస్తవ ప్రజలు ఒకరితో మరొకరు సత్యాన్నేగాని అసత్యాన్ని వచింపగూడదు - 2 కొ1, 19-20. అబద్ధపు మాటలు ప్రాత జీవితానికి, సత్యభాషణాలు క్రొత్తజీవితానికి చెందినవి. కొలో 8, 9-11.

3. వరప్రసాదాలన్నీ శ్రీసభ నుండే

క్రీస్తు ఆర్ధించిన వరప్రసాదాలు అతని జ్ఞానశరీరమైన శ్రీసభ ద్వారా గాని విశ్వాసులకు లభింపవు. నూత్నవేద ప్రజల రక్షణకై ప్రభువు ఏర్పరచిన మార్గం శ్రీసభ. క్రీస్తు వరప్రసాదాలు శ్రీసభ ద్వారా సభ్యులకు చేరడం మాత్రమేకాదు. ఈ సభ్యులనుకూడ శ్రీసభతో జోడిస్తాయి. ఈ రీతిగా శ్రీసభతో ఐక్యం గావడం ద్వారా సభ్యుల వరప్రసాదాలు కూడ ఒకరి వొకరికి ఉపకరిస్తాయి. ఈ కారణం చేత క్రైస్తవ సమాజంలో రక్షణం వ్యక్తిగతంకాదు, సాంఘికం. "ఎవరికి వారే యమునా తీరే" అనే భావం క్రీస్తుతో ఒక్క దేహంగా ఐక్యమైన క్రైస్తవ ప్రజలకు చెల్లదు. మన మందరమూ క్రీస్తు నందు ఒక్క సమాజంగా ఐక్యమయ్యాం గనుక సుఖదుఃఖాల్లోను ఒకరినొకరం భరించుకొంటూండాలి. మనమందరమూ పితకు బిడ్డలం, క్రీస్తుకు సోదరసోదరీ జనులం. క్రీస్తు ఏర్పరచిన శ్రీసభలో సభ్యులం. ఇక, దేహంలోని అవయవాల నన్నింటినీ ఆత్మ ఒక్కటిగా బంధిస్తుంది. ఈ ఆత్మ దేహాన్ని విడిచిపోయినపుడు నరుడు మరణిస్తాడు. దేహంలోని అంగాలు కూడ శిథిలమై పోతాయి. ఇక అవి ఒక్కటిగా పని చేయవు. ఇక, శ్రీసభ అనే జ్ఞానదేహాన్ని ఒక్కటిగా బంధించేదీ దానిలోని అవయవాలైన వివిధ ప్రజలకు ఐకమత్యం చేకూర్చేదీ పవిత్రాత్మ "దివ్యభోజనంలాగే దివ్యాత్మకూడ విశ్వాసులకు ఐక్యత చేకూరుస్తుంది" అన్నాడు సిరిల్ భక్తుడు.

నూత్నవేద ప్రజలమైన మనం క్రీస్తుద్వారా గాని తండ్రి దగ్గరకు వెళ్లలేం. కాని శ్రీసభ ద్వారాగాని క్రీస్తు దగ్గరికి వెళ్లలేం. దేవుడు శ్రీసభను రక్షణ మార్గంగా నిర్ణయించాడు. కావుననే సిప్రియస్ "దేవుణ్ణి తండ్రిగా బొందాలంటే మున్ముందుగా శ్రీసభను తల్లిగా బొందాలి" అని చెప్పాడు, మరియు మాత క్రీస్తును ఉదరంలో భరించింది. ఆ ప్రభువుకి పుట్టువు నిచ్చింది. అలాగే శ్రీసభకూడ మనలను తన ఉదరంలో భరించింది. మనకు జ్ఞానస్నానపు పుట్టువు నిచ్చింది. ప్రభువు మరియమాతను ఎంత ప్రేమభావంతో చూచాడో మనమూ శ్రీసభను అంత ప్రేమభావంతో చూడాలి. ఆ తల్లి అందించే వరప్రసాదాలను ప్రేమ గౌరవాలతో స్వీకరించాలి.

ప్రార్ధనా భావాలు

1. యావే ప్రభువు మోషే ముందుగా సాగిపోతూ తన్ను గూర్చి తాను ఈలా ప్రకటించుకొన్నాడు. "ప్రభువు! ప్రభువు! అతడు కరుణామయుడూ దయాపరుడూ ఐన దేవుడు. అతడు సులభంగా కోపపడేవాడు కాదు. నిత్యం ప్రేమ జూపేవాడు. నమ్మదగినవాడు. వేలకొలది ప్రజలను కృపతో జూచేవాడు. మన దోషాలను అపరాధాలనూ పాపాలనూ మన్నించేవాడు" - నిర్గ 34, 6–7. మనం వరప్రసాదాన్ని గూర్చి చెప్పే ముఖ్య భావాలన్నీ ఈ వేదవాక్యాల్లో ఇమిడి వున్నాయి. కనుక భక్తుడు ఈ వాక్యాలను జాగ్రత్తగా మననం చేసికోవాలి.

2. బైబులు భావాల ప్రకారం దేవుని వరప్రసాదాన్ని పొందడమంటే అతని దీవెన పొందడమే. పూర్వవేదంలో యాజకులు ప్రజలను దీవించేపుడు "ప్రభువు మిమ్మ దీవించి కాపాడునుగాక. మిమ్మ కరుణించి ఆదరంతో జూచునుగాక. మిమ్మ కృపతో జూచి మీకు సమాధానం దయచేయునుగాక" అని పలికేవాళ్లు - సంఖ్యా 6,24–26. దేవుని వరప్రసాదాన్ని పొందినపుడు మనం ఈ దీవెనలన్నిటినీ స్వీకరిస్తాం. 3. "తిరుసభ సేవంతాగూడ మాటలద్వారా నైతేనేమి చేతలద్వారా నైతేనేమి క్రీస్తు సందేశాన్ని లోకానికి వెల్లడిచేసి అతని వరప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టడమే” అంటుంది రెండవ వాటికన్ మహాసభ వరప్రసాదంతో నిండివున్న మానవులు ఇతరులకు గూడ వరప్రసాదాన్ని అందిస్తారు. కనుక మొదట మనతరపున మనం వరప్రసాద మానవులంగా తయారుకావాలి.

10. సత్ర్కియలు

దినదినము మనము చేసే సత్కార్యాల ద్వారా కూడ క్రీస్తు కృపను పొందుతూంటాం. ప్రస్తుతాధ్యాయంలో దైనందిన క్రియల ద్వారా వరప్రసాదం ఎలా ఆర్థిస్తామో విచారిద్దాం. ఇక్కడ మూడంశాలను ఆలోచిద్దాం.

1. సత్ర్కియలు, బహుమానం

మన జీవితంలో జపించడం, సంస్కారాలు స్వీకరించడం మొదలైన ఆధ్యాత్మిక క్రియలుంటాయి. భుజించడం, నిద్రించడం, ఆయా పనులు చేసికోవడం మొదలైన ప్రాకృతిక క్రియలూ వుంటాయి. వస్తుతః ప్రాకృతిక క్రియలకంటె ఆధ్యాత్మిక క్రియలు ఎక్కువ విలువ కలవి. ఐనా జ్ఞానస్నానం ਕੇਹੇo, దివ్య వ్యక్తులను హృదయంలో నిలుపుకొని, దివ్యజీవితం జీవించే విశ్వాసులందు ఈ ప్రాకృతిక క్రియలుకూడ విలువైనవే. ఈ యధ్యాయంలో "సత్ర్కియులు" అన్నపదం పైరెండు రకాల క్రియలకూ వర్తిస్తుంది. పాప క్రియలు, సదుద్దేశంతో చేయని పనులు మాత్రమే ఈ సత్ర్కియల్లో చేరవు.

ఇక, దైనందిన బాధ్యతలతో క్రీస్తు జీవితాన్ని జీవించడం ద్వారా క్రీస్తు వరప్రసాదాన్ని పొందుతాం. ఏలాగ? జ్ఞానస్నానంద్వారా క్రీస్తుతో ఐక్యమౌతాం. క్రీస్తు మనతో ఐక్యమౌతాడు. కావున మనం ఆయా పనులు చేసేపుడు క్రీస్తు మనతో సహకరిస్తుంటాడు. అనగా క్రీస్తు వరప్రసాదం మనలో పనిచేస్తుంటుంది. అందుకే పౌలు కూడ "దేవుని అనుగ్రహం వలన నేను ప్రేషితధర్మం అవలంబించాను. నేను గాదు, దేవుని వరప్రసాదమే.నాయందు పని చేస్తుంది" అని చెప్పకున్నాడు – 1కొ 15, 10. అనగా పౌలుతోపాటు దేవుని వరప్రసాదమూ పని చేసిందని భావం. ఈ రీతిగా మనం చేసే ప్రతి కార్యలలోను ప్రభు వరప్రసాదం మనతో పనిచేయడం వల్ల మనం చేసే పనులన్నీ సత్కార్యాలుగా మారిపోతున్నాయి. అయస్కాంతం నిప్ప మొదలైన వస్తువులు తమ కంటుకొన్న పదార్థాలకు తమ ధర్మం ఇస్తాయి. ఇదే రీతిని ప్రభువున కంటుకొని ప్రభువునందు నెలకొనిన మన జీవితంగూడ ప్రభు జీవితంలాగే దివ్యమౌతుంది. ఈలా క్రీస్తు వరప్రసాదాన్ని పొందడం వలన మూడు బహుమానాలు పొందుతాం. మొదటిది, రోజురోజుకీ మన వరప్రసాదం అభివృద్ధి చెందుతూంటుంది. తీగ రెమ్మలలోకి సారాన్ని పంపి రోజురోజుకీ ఆ రెమ్మలను పెంపునకు గొనివస్తుంది. అదే రీతిని క్రీస్తు సారము లేక వరప్రసాదము రోజురోజు మనలోనికి ప్రసరిస్తుంది. మనమూ పుష్టిని పొందుతాం. ఈ పప్లే బహుమానం.

రెండవది, నిత్యజీవితం పొందుతాం. వరప్రసాద జీవితమనగా దివ్యజీవితం జీవించడమే. ఈ దివ్యజీవితమే మరణంతో నిత్యజీవితంగా మారిపోతుంది. ఇదే మోక్షజీవితం. మూడవది, మహిమను పొందుతాం. ఉత్థాన క్రీస్తు మహిమాన్విత జీవితం జీవిస్తుంటాడు. మోక్షంలో మనమూ క్రీస్తు మహిమలో పాలు పొందుతాం. కాని మనం పాలుపొందే మహిమ మన సత్ర్కియలను బట్టి వుంటుంది.

ఇక్కడ బహుమాన స్వభావాన్ని చక్కగా అర్థం చేసికోవాలి. ప్రాకృతిక రంగంలో మన క్రియలే మనకు బహుమాన మిస్తాయి. ఉదాహరణకు కసరత్తుద్వారా దేహం పుష్టిమంతం గావించుకొంటాం. కాని ఆధ్యాత్మిక రంగంలో ఈ నియమం చెల్లదు. ఎన్ని మంచి పనులు చేసినా మనంతట మనం భగవంతుని కృపను పొందలేం. మన అంతస్తు వేరు, అతని అంతస్తు వేరు. కాని భగవంతుడే మన మీద జాలిగొని తాను మంచివాడు కావున ఆయా పుణ్యకార్యాలు చేయడానికి సహాయపడతాడు. అలా చేసిన పుణ్యకార్యాలను - అవి కేవలం మన కార్యాలేనన్నట్లు - వరప్రసాదంతో బహూకరిస్తాడు. అనగా నరులు సత్కార్యాలు చేసే సామర్థ్యమిచ్చేది భగవంతుడే. కడకు ఆ సత్కార్యాలను బహూకరించేదీ భగవంతుడే. కనుకనే అగస్టీను “దేవుడు మన పుణ్యకార్యాలకు మెచ్చి మోక్షాన్ని బహుమానంగా ఇస్తున్నాడంటే, తన సత్కార్యాలను తానే మహిమ పరచుకొంటున్నాడు" అని వ్రాసాడు.

పౌలు తన జీవితపు ప్రొద్దు పడమటకు క్రుంకినంక తిమోతికి వ్రాసిన రెండవ

జాబులో "నేను మంచి పోరాటం పోరాడాను. పందెంలో గెల్చాను. విశ్వాసం నిలబెట్టుకొన్నాను. ఇక న్యాయమూర్తియైన ప్రభువు నా కొరకు కిరీట మొకటి సిద్ధం జేసి వుంచుతాడు. కడదినాన నాకది లభిస్తుంది. నా కొక్కడికే గాదు, ప్రభురాకడ కొరకై వేచివుండే వాళ్ళందరికీ ఈలాంటి కిరీటం లభిస్తుంది." అని వ్రాసాడు, ఏమిటీ కిరీటం? మోక్ష బహుమానమే. సత్ర్కియల ద్వారా పుణ్యాత్ములు పొందే బహుమానాన్నే దివ్యగ్రంథాలు "కిరీటం” అని పిలుస్తాయి. ప్రభువు తన్ను ప్రేమించే వాళ్ళకిస్తానని ప్రమాణం చేసిన జీవపు కిరీటాన్ని నీతిమంతులంతా పొందుతారు - యాకో 1, 12. మంచి క్రైస్తవ జీవితం వలనా సత్కార్యాల వలనా కలిగే బహుమానం మోక్షభాగ్యమనే కిరీటం.

2. సత్కార్యాలకు ఉండవలసిన నియమాలు

మనం చేసే పనులు దేవునికి ప్రియపడాలంటే, అవి వరప్రసాదమనే బహుమానాన్ని పొందాలంటే, ఈ క్రింది మూడు నియమాలను పాటించాలి. ప్రేమభావం, క్రీస్తుతో ఐక్యంగావడం, ఉద్దేశ పారిశుద్ధ్యం. నరుడు వెలుపలి కార్యాలను మాత్రమే చూస్తాడు. భగవంతుడు హృదయాలను గూడ పరిశీలిస్తాడు. మనం ఏ వద్దేశంతో ఆయా పనులు చేస్తున్నామా అని కూడ పరిశీలించి చూస్తాడు. దేవునికి మన పనులతో అవసరం లేదు. బిడ్డలమైన మన ప్రేమభావం మాత్రం అతనికి ప్రియం గలిగిస్తుంది. అందుకే మనం ప్రేమభావంతో చేసిన పనులు మాత్రం ఆ ప్రేమమూర్తికి ప్రియం గలిగిస్తాయి. కావుననే ప్రభువు "బిడ్డా! నాకు నీ హృదయాన్ని ఈయి" అంటాడు. క్రీస్తు కేవలం మరణం ద్వారానే మనలను రక్షింపలేదు. అతడు తండ్రిపట్ల జూపిన విధేయత మనపట్ల జూపిన ప్రేమ కూడ మనలను రక్షించాయి. విధేయతతో ప్రేమతో సిలువపైకెక్కిన ప్రభువు ప్రతి కార్యంలోను మనకు మార్గదర్శకంగా వుండాలి.

ద్రాక్షలతతో ఐక్యమైయున్నంత వరకు మాత్రమే రెమ్మలు పూలుపూచి కాయలు కాస్తాయి. తల్లితీగనుండి వేరైన వెంటనే రెమ్మలు వాడిపోతాయి. మనమూ ఇంతే. క్రీస్తుతో ఐక్యమై యున్నంత వరకే సత్ఫలితాన్ని ఇస్తాం. కావున మనం చేసే పనులన్నీ క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు చేస్తూండాలి. క్రీస్తు ద్వారా ఎందుకంటే, అతనిద్వారాగాని పితను చేరలేం. క్రీస్తుతో ఎందుకంటే, మన కార్యాలను బహూకరించేది ప్రభువు ఆర్ధించిన వరప్రసాదాలే. క్రీస్తునందు ఎందుకంటే, చేప నీటిలోలాగ, పిండం మాతృగర్భంలో లాగ మనమూ నిత్యం క్రీస్తునందు జీవిస్తూంటాం. కావుననే పౌలు కొలోసా పౌరులకు వ్రాస్తూ "మీరు చేసే పనులన్నీ ప్రభు యేసు నామంమీదుగానే చేయండ"ని బోధించాడు -3,17.

దేహానికి ఆత్మ యేలాంటిదో మన కార్యకలాపాలకూ సదుద్దేశం ఆలాంటిది. ఆత్మం దేహంలోని అవయవాలన్నిటినీ ఒక్కటిగా సంధించి వానికి జీవ మిస్తుంది. ఉద్దేశ పారిశుద్ధ్యం కూడ మన పనుల నన్నిటినీ ఒక్కటిగా సంధించి అవి దేవునికి ప్రియపడేలా చేస్తుంది. ఉద్దేశ పారిశుద్ధ్యమంటే స్వీయ ప్రీతి కొరకుగాక, దైవప్రీతి కొరకు ఆయా పనులు చేస్తుండడం. ఒకే రకపు కాగితాలు రెండున్నాయి. ఒక దానిపై ప్రభుత్వంవారి ముద్రవుంది. అది నూరు రూపాలయ నోటు. విలువ కలది. రెండవదానిపై ఈ ముద్ర లేదు. కనుక దానికి ఏ విలువలేదు. చిత్తుకాగితాల బుట్టలో పడుతుంది, అంతే ఉద్దేశ పారిశుద్ధ్యం అనే ముద్రతోగూడిన మన పనులు ప్రభుత్వంవారి ముద్రపడిన కాగితంలాగ విలువయైనవి.ఈ ముద్రలేని పనులకు దేవుని యెదుట ఏ విలువా లేదు. అందుకే మనం రోజురోజు ఈ సదుద్దేశాన్ని నూత్న పరచుకొంటూండాలి. రోజురోజు ఉదయం "ప్రభూ! నీకు ప్రియంగలిగించడానికే ఈ పనులను చేస్తున్నాను. వీటన్నిటిని భక్తితో నీకే సమర్పిస్తున్నాను" అని చెప్పకొంటూండాలి. జప అపోస్తలుల ప్రార్థనా పద్ధతికూడ దీనికి తోడ్పడుతుంది. ఆయా కార్యాలకు ముందు ప్రభు సాన్నిధ్యం కలిగించుకొని ప్రభునామం ఉచ్చరించడంగూడ మంచి పద్ధతి. “జ్ఞాని కొలది కాలంలోనే పరిపూరుడయ్యాడు. కనుక అతడు కొలది కాలంలోనే దీర్ఘకాలం జీవించాడు" అంటుంది సొలోమోను జ్ఞానగ్రంథం - 4,13. అనగానీతిమంతుల కార్యాలన్నీ పుణ్యమయం గావున వాళ్లు బహుకాలంలో ఆర్ధింపవలసిన పుణ్యాలను గూడ అనతికాలంలోనే ఆర్థించారని భావం. ఉద్దేశ పారిశుద్ధ్యంతో పనిచేసేవాళ్ళు ఈలాంటి జ్ఞానులుగా గణింపబడతారు.

3. పరసువేది

పరసువేది నంటిన లోహం బంగారం ఔతుంది. దాన్ని సాధించడానికై ప్రాచీనులు చాలమంది విశ్వప్రయత్నాలు చేసారు. అసలు ఈ పరసువేది అనే శిల ఒకటివుందో లేదో మనకు తెలియదు. కాని మన కార్యాలను మాత్రం బంగారంగా మార్చే పరసువేది ఒకటుంది. అదే జ్ఞానస్నానం, మనలను క్రీస్తుతో జోడించే సాధనం. ఓమారు జ్ఞానస్నానం ద్వారా ತಿನ್ನಿಟ್ ఐక్యమయ్యాయో, మన కార్యాలూ క్రీస్తు కార్యాలే ఐపోతాయి. మన జీవితమూ ఒక రీతిగా క్రీస్తు జీవితమౌతుంది.

మన యీదైనందిన కార్యాల ద్వారానే భావిమోక్షాన్ని పొందగలుగుతున్నాం. పొలం దున్నుకొనడం, పంటలు పండించుకోవడం, అన్నం వండుకోవడం, నిద్రించడం, బిడ్డలను కనడం ఈ రీతిగా మనం చేసే పనులు సామాన్యమైనవే కావచ్చు. ఐనా ఈ పనులు ద్వారానే క్రీస్తు కృపను బడసి, క్రీస్తు మహిమకు హక్కుదారులం కాగల్లుతూన్నాం. ఎందుచేత? క్రీస్తుతో ఐక్యం కావడం వలన. మంటిమీద జీవించే మన యీ జీవితం - అదియే మాదిరి జీవితమైనసరే - వ్యర్థంకాదు. గొప్ప ఓదార్పునీ, మనశ్శాంతినీ ప్రసాదించే సత్యం యిది.

ఫ్రాన్సిస్ శారివారివలె మనం దూరదేశాలకు వెళ్ళి క్రీస్తును బోధించలేం, అంటియోకయా ఇన్యాసి వారివలె సింహాలకు మేతైవేదసాక్షిగా మరణించలేం. తోమాసు అక్వినాసుగారివలె మేధాశక్తితో దైవశాస్తాంశాలను ప్రతిపాదించలేం. 23వ జాన్ పోపుగారివలె శ్రీసభలో ఉత్తేజకరమైన నూత్నభావాలను ప్రవేశపెట్టలేం. మదర్ తెరేసాలాగ సాంఘికసేవ చేయలేం. మనం పేదరికంలో పట్టి పేదరికంలోనే చనిపోవచ్చు మనం చేసే గొప్పకార్యాలేవీ లేకపోవచ్చు. మన వూరికి వెలుపల మన పేరు తెలిసినవాళ్ళ ఎవరూ ఉండకపోవు. ఐనా నిరుత్సాహపడవలసిన అవసరమేమీలేదు. రోజురోజుకీ మనం జీవించే సామాన్య జీవితమే, రోజురోజుకీ మనం చేసికొనే మామూలు పనులే మనలను పవిత్రులను జేయగలవు. మనలను దేవుని పత్రులనుజేసి భావి మహిమకు పట్టానీయగలవు. కావలసినదంతా, క్రీస్తుతో ఐక్యమై సదుద్దేశంతో ఆయా పనులు చేసికొంటూ పోవడమే.

ఓ పసిబాలుడు. ఇంటి ప్రక్కనున్న రాతిని కదిలించాలని తన చిన్న చేతులతో నెట్టాడు. వాడికి ముచ్చెమటలు పోసాయి. కాని రాయేమో కదల్లేదు. అంతలో ఆ పసిబిడ్డ తండ్రి కుమారుని ప్రయత్నం గమనించి రాతి దగ్గరకు వచ్చాడు. "అది నీకు కదుల్లుందా! నన్నెందుకు పిల్చావు గావు?" అని కుమారుడ్డి మందలించాడు. తన బలమైన చేతులను ఆ పసిబిడ్డ బలహీనప చేతులతో జోడించి రాతిని అవలీలగా అవతలకు నెట్టివేసాడు. మన విషయమూ ఇంతే క్రీస్తుతో ఐక్యం గానంత వరకూ మన యీ దరిద్ర జీవితమూ, జిగేలు మనిపింపని మన యీ మామూలు పనులూ చాల భారమనిపిస్తాయి. కాని ప్రభువు చేయిస్తే చాలు, ఈ భారపు రాతిని సునాయాసంగా ప్రక్కకు నెట్టివేయగలం. క్రీస్తు మనతో మనం క్రీస్తుతో ఐక్యం గావడమంటే యిదే.

ప్రార్ధనా భావాలు

1. క్రీసోస్తం భక్తుడు ఈలా వాకొన్నాడు. “మట్టితో కలసివున్న ముడిలోహాన్ని కొలిమిలో కరిగించి బంగారం తయారుచేస్తారు. ఆలాగే జ్ఞానస్నానం మట్టిముద్దలమైన మనలను బంగారంగా మారుస్తుంది. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ అగ్నితో మనలోకి దిగివచ్చి మనలోని ప్రాపంచిక మానవుని కాల్చివేసి ఆధ్యాత్మిక మానవుని వెలుపలికి తెస్తుంది." అనగా జ్ఞానస్నాన సమయంనుండి మనలో వరప్రసాదం పనిచేయడం ప్రారంభిస్తుంది. H 2. క్రీస్తు వరప్రసాదాన్ని గూర్చి ట్రెంటు మహాసభ "శిరస్సు ప్రాణాన్ని అవయవాలలోనికి వలె, తీగ సారాన్ని రెమ్మలలోనికివలె, క్రీస్తు తన వరప్రసాదాన్ని మన ఆత్మలోనికి ప్రసరింపజేస్తుంటాడు" అని బోధించింది. దేహానికి జీవమిచ్చేది శిరస్సు కొమ్మలకు జీవమిచ్చేది తల్లితీగ. క్రైస్తవులకు జీవమిచ్చేది క్రీస్తు.

3. వరప్రసాదం దేవుడు మనకు ఉచితంగా యిచ్చే వరం. కేవలం మన పుణ్యక్రియలద్వారా మనం దాన్ని సంపాదించలేం. మనం అంతస్తు వేరు, వరప్రసాదం అంతస్తువేరు. కనుక మనకు దానిమీద ఏలాంటి హక్కు లేదు. ప్రభువు తన కృపద్వారా మనలను ఎన్నుకొంటాడుగాని మనంచేసే సత్ర్కియాలద్వారా కాదు - రోమా 11,6.

11. హిందూ సంప్రదాయం

పూర్వాధ్యాయాల్లో మన క్యాతలిక్ సిద్ధాంతంప్రకారం వరప్రసాదమంటే యేమిటో వివరించాం. కాని మనం భారతీయ క్రైస్తవులం. ఈ భారతదేశంలో హిందూసంప్రదాయం ప్రధానమైంది. హైందవ మహరులూ వరప్రసాదాన్ని గూర్చి బోధించారు. హైందవ భక్తులూ వరప్రసాద జీవితం జీవించారు, జీవిస్తున్నారు. కనుక హైందవ సంప్రదాయం ప్రకారం వరప్రసాద జీవితం ఏలా వుంటుందో తెలిసికోవడం గూడ అవసరం. ఇక, మత విషయాలు వచ్చినపుడు మన క్యాతలిక్ సమాజంలో లాగ హిందువులలో ఏకాభిప్రాయమూ, ఏకబోధలంటూ వుండవు. ఐనా పదిమందికీ అంగీకారమైన భావాలను మాత్రమే ఇక్కడ సంగ్రహంగా పొందుపరుస్తున్నాం.

1. శబాలు

మామూలుగా హిందూ సంప్రదాయం వరప్రసాదానికి నాలు పేర్లు వాడుతుంది. 1. అనుగ్రహం : ఈ శబ్దానికి భగవంతుడే మనలను చేపట్టడం అని భావం, 2. ప్రసాదం: ఈ శబ్దానికి వెలుగుతో కూడిన శాంతి అని అర్థం. ఈ శాంతిభగవంతుడిచ్చే వరం. 3. కృపః & శబ్దానికి నెనరు అని అర్థం. 4. పుష్టి : అనగా పెంపచెందడం. ఈ శబ్దాన్ని వల్లభాచార్యుడు మాత్రమే వాడాడు.

2. ప్రాథమిక విషయాలు

హిందూ సంప్రదాయం రెండు ప్రధాన సిద్ధాంతాల మీద ఆధారపడివుంటుంది, 1. నరుడూ దేవుడూ ఒకటే. నరునికీ దేవునికీ భేదంలేదు. "త్వమే వాహం"- నీవే నేను - అని ఉపనిషత్తులు చెప్తాయి. 2. నరుడు భగవంతుడి నుండి వేరైపోయి పునర్జన్మ లెత్తుతూంటాడు. కర్మబంధాలలో తగులకొంటూంటాడు. మాయవలన నేను వేరు, భగవంతుడు వేరు అనిభ్రాంతిపడుతూంటాడు. అతడు నేనూ భగవంతుట్టేనని గుర్తించినపుడు మళ్ళీ ఆ భగవంతునితో ఐక్యమైపోతాడు. అదే ముక్తి.

1. దివ్యత్వం

 : మనం వరప్రసాదం ద్వారా దివ్యత్వం పొందుతామని నమ్ముతాం. హిందువలు ఈలా అనరు. నరుడు స్వతస్సిద్దంగానే భగవంతుని అంశ, వరప్రసాదం వలన మనం పూర్వం ఏ భగవంతునికి చెందామో మళ్ళీ ఆ భగవంతునితో ఐక్యమైపోతాం. భగవంతుడు మన మీద దయదలచి తన వరప్రసాదాన్ని ఉచితంగా ఈయడు. మనకు దానిమీద జన్మహక్కు వుంది. మనం భగవంతునికీ దత్తపుత్రులం గాము. దివ్యపుణ్యాలు, నైతిక పుణ్యాలు, వరాలు ఇవేవీ లేవు. అసలు మనమే దేవుళ్ళమైనపుడు ఇవన్నీ యెందుకు?

2. ఆరంభం

 : దేవుడే మనలను రక్షించడానికి పూనుకొంటాడని మనం చెప్తాం. మనం ప్రాకృతికరంగానికి చెందిన వాళ్ళం. వరప్రసాదం ఆధ్యాత్మిక రంగానికి చెందినది. మనంతట మనం దాన్ని పొందలేం. దేవుడే పనిబూని వరప్రసాదాన్ని మన కిస్తుంటాడు. హిందూ సంప్రదాయాలలో కూడ భగవంతుడే నరుణ్ణి పిలవడమనేది వుంది. భగవంతుడే నరుణ్ణి వరిస్తాడు. అతనికి రక్షణనో, శిక్షణనో ముందుగానే విధిస్తాడు కూడ.

3. పాపవిముక్తి

 : దేవుడు మొదట వరప్రసాదం ద్వారా మన పాపాలను పరిహరిస్తాడనీ ఆ మీదట మనలను పవిత్రపరుస్తాడనీ మనం నమ్ముతాం. ఇవి మనం సొంతంగా చేసిన పాపాలు. కాని హిందూ సంప్రదాయంలో పాపం ఈ యర్థంలో అట్టే కనిపించదు. హిందువులకు పాపమంటే ప్రధానంగా పునర్జన్మలో చిక్కుకోవడమే. వరప్రసాదం కలిగించే విముక్తి పాపంనుండికాదు, పునర్జన్మనుండి భగవంతుడు మన కర్మ బంధాలను తెంచివేసి మనం మల్లా పునర్జన్మ యెత్తకుండా వుండేలా చేస్తాడు.

3. పవిత్రీకరణ వరప్రసాదం, సహాయక వరప్రసాదం

1. పవిత్రీకరణ

 : పవిత్రీకరణ వరప్రసాదంద్వారా దేవుడు మనలను ప్రాకృతిక దశనుండి ఆధ్యాత్మిక దశకు తీసికొని వెళ్లాడని మనం నమ్ముతాం. హిందువుల దృష్టిలో ప్రాకృతిక దశ లేనేలేదు. మనం మొదటి నుండీ భగవంతులమే గనుక ఎప్పడూ ఆధ్యాత్మిక దశలోనే వుంటాం. కనుక వాళ్ళ సంప్రదాయంలో పవిత్రీకరణ వరప్రసాదమనేదే లేదు.

2. అంతర్నివాసం

: దేవుడు వరప్రసాదము ద్వారా మనలో వసిస్తుంటాడనీ, పరిశుద్ధాత్మడు మనలను నడిపిస్తూంటాడనీ మనం నమ్ముతాం. హిందువులు ఈలా నమ్మరు. వరప్రసాదముద్వారా దేవుడు క్రొత్తగా మనలో వసించడు. కాని వరప్రసాదముద్వారా మనమూ దేవుడిమేనని తెలసికొంటాం. కనుక అది నూత్న నివాసంగాదు, నూత్నజ్ఞానం. ఉపనిషత్తులు మనలో వసించే భగవంతుణ్ణి "అంతర్యామి", "ఆత్మారాముడు" అని పిలుస్తాయి. కాని ఈ వ్యక్తి ఏంచేస్తాడో స్పష్టంగా చెప్పవు.

3. సహాయక వరప్రసాదం

 : సహాయక వరప్రసాదం ద్వారా దేవుడు మనలను ప్రబోధిస్తూంటాడనీ, మన పనులతో సహకరిస్తుంటాడనీ మనం నమ్ముతాం, హిందూ సంప్రదాయం దీన్ని"సహకారీ కారణం" అని పిలుస్తుంది. అనగా దేవుడు మన పనులతో సహకరించే కారణం అని భావం. కాని ఈ సహాయక వరప్రసాదం దేవుడు నరునికిచ్చే ఉచిత వరంకాదు. నరుని జన్మహక్కు ఇక్కడ హిందూ సంప్రదాయంలో రెండు విభిన్న మార్గాలున్నాయి. కొందరు "మార్గాలన్యాయం" ఎన్నుకొన్నారు. పిల్లి తానే తన పిల్లను నోట గరచుకొని మోసుకొనిపోతుంది. ఈలాగే భగవంతుడు తానే మనలను మోసుకొని

పోతాడు అన్నారు కొందరు. ఈ మార్గం ప్రకారం నరుని సహకారంతో గాని, స్వాతంత్ర్యంతోగాని అట్టే అవసరం లేదు. మరి కొందరు “మర్కట న్యాయం" ఎన్నుకొన్నారు. కోతిపిల్ల తల్లికడుపునకు కరచుకొని ఉంటుంది. కోతి దానిని పట్టుకోదు. అదే కల్లి కడుపునకు అంటిపెట్టుకొని వుంటుంది. ఈలాగే మనంతట మనమే భాగవంతునికి అంటిపెట్టుకొని వండాలి అన్నారు మరికొందరు. ఈ మార్గం ప్రకారం నరుని సహకారం చాల ముఖ్యం. ఇవి రెండూ భక్తిమార్గాలే. రెండింటి ప్రకారము నరుడు తన్ను తాను భగవంతునికి అర్పించుకోవాలి. ఈ యాత్మార్పణకే "ప్రపత్తి" అని పేరు. (వరప్రసాదాన్ని గూర్చిన క్యాతలిక్ సమాజం బోధలు మర్మట న్యాయానికి దగ్గరగా వుంటాయి. ప్రోటస్టెంటు సమాజం బోధలు మార్థాలన్యాయానికి దగ్గరగా వుంటాయి.)

4 వరప్రసాదమూ, సత్కార్యాలూ

మన సత్కార్యాలవల్ల వరప్రసాదం పెరుగుతుందని మనం భావిస్తాం. హిందూ సంప్రదాయంలోకూడ కర్మమార్గమనేది వుంది. స్వధర్మాన్ని పాటించడమే ఉత్తమ కర్మ. కాని ఈ కర్మలు ఏం చేస్తాయి? అవి మనకు వరప్రసాదం ఆర్ధించిపెట్టవు. పునర్మజన్మనుండి విముక్తిపొందడానికి మాత్రం ఉపయోగపడతాయి. పైగా కర్మమార్గం భక్తిమార్గం కంటే తక్కువది. కనుక మన సత్కార్యాలకూ, వరప్రసాదానికీ సంబంధం లేదు.

5. మోక్షం, అవతారం, సమాజం

1) మోక్షం

: మనం వరప్రసాద జీవితమే మోక్ష జీవితంగా మారిపోతుందనీ, ఇది పిందె, అది పండు అనీ చెప్తాం, హిందూ సంప్రదాయంలో వరప్రసాదానికీ, మోక్షానికీ సంబంధం అట్టేలేదు. ఐనా వరప్రసాదంద్వారా మాయ నుండి తప్పకొని నేనూ భగవంతుట్టేనని తెలిసికొంటాం గనుక అది పరోక్షంగా మోక్షకారణ మౌతుంది. మనకు మోక్షమంటే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సన్నిధిలోవుండడం. హిందువులకు మోక్షమంటే పునర్జన్మలను బాసి మళ్లా దేవునితో కలిసిపోవడం. ఈ కలిసిపోవడంలోకూడ మల్లా భేదాలున్నాయి. కొందరు దేవునితో ఒకటిగా కలిసిపోతామన్నారు. కొందరు అలాకాదు, దేవుని సన్నిధిలో వుండిపోతామన్నారు. దేవుని వ్యక్తిత్వమూ, మన వ్యక్తిత్వమూ వేరువేరుగా వుంటాయన్నారు.

2) అవతారం

: మనం భగవంతుడు నరావతారం పొందాడనీ, అతడే క్రీస్తనీ నమ్ముతాం. ఆ క్రీస్తు తన మరణోత్థానాలవలన మనకు వరప్రసాదం సంపాదించిపెట్టాడనీ, జ్ఞానస్నానంద్వారా అతనితో ఐక్యమై అతని వరప్రసాదం పొందుతామని చెప్తాం. హిందూ సంప్రదాయంలోకూడ రామకృష్ణాది అవతారాలున్నాయి. కాని ఈ యవతారం ద్వారా

భగవంతుడు ఏంచేస్తాడో అంత స్పష్టంగా బోధపడదు. ఆ యవతారమూర్తి నరులకు వరప్రసాదం ఇస్తాడనిగానీ, నరులందరినీ రక్షిస్తాడనిగాని ఎక్కడా స్పష్టంగా విన్పించదు. ఓతావులో మాత్రం గీత "ధర్మసంస్థాపనార్ధాయ" అంటుంది - 48. అనగా ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడని భావం. ఈ భగవంతుని అవతారం వలన మనలో మారేమీ కలుగదు. అతని సత్కార్యాలూ బోధలూ మాత్రం మనకు మార్గదర్శకంగా వుంటాయి. హిందువుల దృష్టిలో ప్రపంచానికంతటికీ ఏకైక భగవంతుడంటూ లేడు. ఎవరి ఇష్టంవచ్చిన దేవరను వాళ్ళు "ఇష్టదేవత" అన్నపేరుతో కొలుచుకొంటూంటారు అంతే.

3) సమాజం :

మనం వరప్రసాదంద్వారా ఒక్క సమాజంగా ఏర్పడతామని చెప్తాం. అదే శ్రీసభ, క్రీస్తు వరప్రసాదాలు ఈ సభ ద్వారానే మనకు లభిస్తాయి. మనలను ఈ సభలో సభ్యులనుగా చేస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వరప్రసాదం వ్యక్తిగతమైందే కాని సామాజికమైందికాదు. "ఎవరికివారే యమునాతీరే" అని హిందువుల భావం. ఐనా హిందూ సాంప్రదాయంలో కూడా సామాజిక భావాలు రెండు మూడున్నాయి, సత్సంప్రదాయం అంటే సనాతన హిందువులకు చెందిన సంప్రదాయం. శిష్యులు దీన్ని పాటించాలి. ఈలా పాటించేవాళ్ళు ఓ సమాజమౌతారు. భక్తులు సదురువుతో కూడుకొనివున్న సమాజమౌతారు. సత్సమాజం లేక సత్సంగతి అంటే భక్తుల సమాజం.

ఇక్కడ మనం చెప్పిన భావాలన్నీ ప్రాచీన హిందూ మహర్షుల గ్రంథాలనుండి, బోధనలనుండీ గ్రహింపబడినవి. కాని హిందూ ప్రజలందరు ఈ శాఖకు చెందినవాళ్ళే అనుకోరాదు. హిందువుల్లో సామాన్య ప్రజలకు వరప్రసాదాన్ని గూర్చి భిన్నభావాలుంటాయి. తుకారాం, మాణిక్యవాసకరు మొదలైన భక్తులుకూడ మన క్రైస్తవుల్లాగే స్వయంకృతమైన పాపాన్ని ఒప్పకొన్నారు. భగవంతుడూ, నరుడూ ఒకటికాదని బోధించారు. భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని అడుగుకొన్నారు. మనం దైనందిన జీవితంలో కలుసుకొంటూండే సామాన్య హిందూ ప్రజల్లోకూడ మన భావాలకు దగ్గరగా వుండే భావాలు విరివిగా కల్పిస్తాయి. కనుక సామాన్య హిందూ ప్రజలమార్గం వేరు. పైన మనం చూపిన ఋషులు ఆచార్యులు బోధించిన మార్గంవేరు.

మనం రెండు భిన్నమతాల భావాలను పోల్చిచూచేపడు మొదట వానిలోని భేదాలనుకాదు సామ్యాలను గుర్తించాలి. మహా మేధావియైన అగస్టీ "ప్రపంచములోని నరులందరూ సహజంగానే క్రైస్తవ భావాలు కలిగి వుంటారు" అన్నాడు. వరప్రసాదాన్ని గూర్చి ప్రాచీన హిందూ ఋషులూ, భక్తులూ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లోనైతేనేమి, నేటి సామాన్య హిందూ ప్రజలు జీవించే ఆధ్యాత్మిక జీవిత విధానంలోనైతేనేమి, మన క్రైస్తవ భావాలకు సన్నిహితంగా వుండే భావాలు ఎన్ని వున్నాయో చూడండి! నరులందరిలోను ఒకే పరిశుద్దాత్మడు, ఒకే అంతర్యామి ప్రబోధం కలిగిస్తున్నాడనడానికి ఇది గొప్ప తార్మాణం గదా!

ప్రస్నలు

అధ్యాయం-1

1.శాశ్వత వరప్రసాదానికీ తాత్కాలిక వరప్రసాదానికీ భేద మేమటి? పవిత్రీకరణ వరప్రసాదానికీ దైవాత్మక వరప్రసాదానికీ తేడా యేమిటి?

2.వరప్రసాదాన్ని గూర్చిన లూతరు భావాలను సవరిస్తూ బ్రెంటు మహాసభ బోధించిన మూడు ముఖ్య విషయాలను వివరించండి.

3.పవిత్రీకరణ వరప్రసాదాన్ని వివరిస్తూ సిరిల్, బాసిల్ భక్తులు వాడిన రెండు ఉపమానాలను వివరించండి.

4.క్రీస్తునుండి మన వరప్రసాదాన్ని స్వీకరిస్తామనిచెప్పడానికి పౌలు, యోహాను, పేత్రు, వాడిన ఉపమానాలను వివరించండి.

అధ్యాయం ー2

1.నరుడు దేవుని ప్రతిబింబం అనడంలో దివ్యగ్రంథం ఉద్దేశాలేమిటివో వివరించండి.

2.క్రీస్తుద్వారా మనం దైవత్వం పొందుతామనే గ్రీకుపితపాదుల భావాలను కొన్నిటిని పేర్కొనండి.

3.నరుడు స్వభావ సిద్ధంగానే దివ్యడు అనే ఆద్వైతవాదానికీ, అతడు వరప్రసాదం ద్వారా దివ్యత్వం పొందుతాడు అనే క్రైస్తవ వాదానికీ భేదం ఏమిటి?

అధ్యాయం -3

1.క్రీస్తు ద్వారా మనం తండ్రికి ఏలా దత్తపుత్రులమౌతాం?

2.సృష్టి నిబంధనం జ్ఞానస్నానాల ద్వారా నరులు దేవునికి దత్తపుత్రులయ్యే తీరును వివరించండి

3."ధర్మశాస్త్రం మోషేద్వారా లభించింది. కాని వరప్రసాదమూ సత్యమూ క్రీస్తుద్వారా లభించాయి” - యోహా 117. వివరించండి.

4.పరిశుద్ధాత్మ మనలను ఏలా దత్తపుత్రులను చేస్తుంది?

అధ్యాయం -4

1.తండ్రి అంతర్నివాసాన్ని వివరించండి

2.క్రీస్తు అంతర్నివాసాన్ని వర్ణించండి

3.ఆత్మ అంతర్నివాసాన్ని విశదీకరించండి

అధ్యాయం -5

1.తండ్రి జీవనదాత ఏలా ఔతాడు?

2.క్రీస్తు సత్యదాత ఏలా ఔతాడు?

3.పవిత్రాత్మ ప్రేమదాత ఏలా ఔతాడు?

అధ్యాయం -6

1.సహాయక వరప్రసాదంతో మనకు అవసరమేమిటి?

2.సహాయక వరప్రసాదం వలన మన స్వాతంత్ర్యం భంగపడదా?

3.సహాయక వరప్రసాదాలను సాధించే మార్గం ఏమిటి?

అధ్యాయం -7

1. చికిత్సాత్మక వరప్రసాదాన్ని వివరించండి.

2.ఉద్దారణ వరప్రసాదమంటే యేమిటి?

3.ప్రబోధాత్మక వరప్రసాదాన్నిగూర్చి తెలియజేయండి.

అధ్యాయం -8

1.బాహిర వరప్రసాదాన్ని వివరించండి.

2.అన్యప్రయోజక వరప్రసాదం అంటే యేమిటి?

3.క్రియానిర్వహణ వరప్రసాదాన్ని గూర్చి తెలియజేయండి.

అధ్యాయం -9

1.జ్ఞానదేహ సిద్ధాంతాన్ని వివరించండి

2.జ్ఞానదేహ బాధ్యతలను పేర్కొనండి

3.వరప్రసాదాలన్నీ ఏలా తిరుసభనుండే లభిస్తాయో తెలియజేయండి

అధ్యాయం -10

1.మన దైనందినకార్యాలద్వారానే క్రీస్తు వరప్రసాదాన్ని పొందడం ఏలా?

2.సత్కార్యాలకు వుండవలసిన మూడు నియమాలు ఏమిటివి?

3.మన రోజువారి క్రియలు ఏలా బంగారంగా మారిపోతాయి?

ఫాదర్ పూదోట జోజయ్య, S.J. గారు, పూదోట మరయ్య, చిన్నమ్మ దంపతులకు 1931వ సం|| ఫిబ్రవరి 15న, గుంటూరు జిల్లాలోని కనపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యను కనపర్రులో, ఉన్నతవిద్యను ఫిరంగిపురంలో" అభ్యసించారు. మద్రాసు లొయోలాలో కళాశాల విద్యను పూర్తిచేసి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో M.A. (సాహిత్యం) లో పట్టా పుచ్చుకున్నారు. 1955లో తమిళనాడులోని దిండిగల్ నందు యేసుసభలో చేరిన జోజయ్యగారు, అటుపిమ్మట కొడైకెనాల్ లోని తత్వశాస్రాన్ని కర్సియాంగలో వేదాంతశాస్రాన్ని నిశిత పరిశీలనా దృష్టితో క్షుణ్ణంగా అధ్యయనం గావించారు. 1965, మార్చి 27న బిషప్ ముమ్మడి ఇగ్నేప్యస్ గారి చేతుల మీదుగా ఫిరంగిపురంలో గురుపట్టం పొందారు.

రోమనగరంలోని బిబ్లికల్ ఇన్స్టిట్యూట్లో బైబులు విద్యనభ్యసించిన జోజయ్యగారు ఆ తర్వాత తనదైన విశిష్టశైలిలో బైబులు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. లొయోలా కళాశాలలో 2 సంవత్సరములు ఉపన్యాసకునిగా విద్యార్థులకు చక్కని శిక్షణను అందించారు. పుస్తకరచన, బైబులుబోధ, విద్యార్థులకు నాయకత్వ శిక్షణ వీరి ముఖ్య కార్యక్రమాలు.

సాహిత్యరంగంలో వీరు నిర్వహించిన కొన్ని బృహత్తర కార్యక్రమాల వివరాలు :

1.అనువాదకునిగా  : అకుంఠిత దీక్షతో 17 సం||లు అవిరళకృషిసల్పి క్యాథలిక్ బైబులులోని పూర్వవేదాన్ని జనరంజకంగా తెలుగులోనికి అనువదించారు.

2.అధ్యాత్మికవేత్తగా :ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేస్తూ ఆయన నడిపే బైబులు భాష్యం పత్రిక, బైబులు గ్రంథమాల ఆయన ఆధ్యాత్మికరంగంలో నిత్యకృషీవలుడని చెప్పకనే చెబుతాయి.

3. విద్యార్థి బాంధవునిగా : విద్యార్ధిలోకాన్ని ఉత్తేజపరచడానికి, వారిలో నవచైతన్యం నింపడానికి ఆయన నడిపే చైతన్యవాణి పత్రిక, విద్యార్డిహిత ; పైథమాల, విద్యార్ధిలోకానికే నిర్దేశకాలు.

4.వక్తగా  : ఆంధ్రరాష్ట్రమంతటా తిరిగి విద్యార్థులకు,ఉపాధ్యాయులకు ఉపదేశకులకు సామాన్యప్రజానీకానికి వందలకొలది సదస్సులు నిర్వహించి, వారిలో నవ్యోత్సాహాలను నింపారు.