బాల వ్యాకరణము/పీఠిక


  బాల వ్యాకరణము - పీఠిక 

ఆంధ్రభాషకు లక్షణ గ్రంధములు ప్రాచీనులు చేసినవి పెక్కులు కానఁబడుచున్నవి. కొన్ని లక్షణ గ్రంధముల పేర్లు మాత్రమిపుడు వినఁబడుచున్నవి. కానఁబడు గ్రంధములందు సంస్కృత సమములకు లక్షణములు బహు తరముగా రచింపంబడినవి గాని తక్కిన భాషకు విశేషాకారముగా రచింపఁబడినవి కావు కాఁబట్టి యా లక్షణ గ్రంధములు చదువు వారికి నిస్సందేహముగా వచన రచన సేయు కౌశలము చిరకాలము బహులక్ష్యములందుఁ బరిశ్రమము చేయక రానే రాదు. భాషా సమిష్టికి లక్షణ గ్రంధము కుదిరిన పక్షమం దంత శ్రమ బడఁ బని లేదు. తుదకు లక్ష్య పరిఙానము చాలని లక్షణ పరిఙానమంత శ్లాఘ్యము కాదు గాని తుదముట్ట సర్వ లక్షణ పరిఙానము లక్ష్య పరిఙానము చేతనే సాధించుట మిక్కిలి దుష్కరము. కాఁబట్టి యిట్టి కొఱఁత వారింపఁ బూని పెక్కు లక్ష్యములు పలుమాఱు సావధానముఁగా పరిశీలించి రచనా ప్రణాళిక నిర్ణయించుకుని నా నేర్పుకొలఁదిని సంస్కృత భాషలో సూత్ర గ్రంధమొకటి కావించితిని. ఆ గ్రంధము బాలురకు సుసాధము గాకుండుట వలన దాని యందలి సూత్రములు కొన్ని తెనిఁగించి ప్రకృత గ్రంధ రూపమున రచించి నాఁడ.

పీఠిక.

ఆంధ్రభాషకు లక్షణగ్రంథములు ప్రాచీనులు చేసినవి పెక్కులు కానబడుచున్నవి. కొన్ని లక్షణగ్రంథముల పేళ్లు మాత్ర మిప్పుడు వినబడుచున్నవి. కానబదు గ్రంథములందు సంస్కృతసమములకు లక్షణములు బహుతరముగా రచింపబడినవిగాని తక్కినభాషకు విశేషాకారముగా రచింపబడినవికావు. కాబట్టి యాలక్షణగ్రంథములు చదువువారికి నిస్సందేహముగా వచనరచనసేయు కౌశలము చిరకాలము బహులక్ష్యములందు పరిశ్రమముచేయక రానేరదు. భాషాసమిష్టికి లక్షణగ్రంథము కుదిరినపక్షమం దంతశ్రమపడ బనిలేదు. తుదకు లక్ష్యపరిజ్ఞానముచాలని లక్షణపరిజ్ఞానమంత శ్లాఘ్యము కాదుగాని తుదముట్ట సర్వలక్షణపరిజ్ఞానము లక్ష్యపరిజ్ఞానము చేతనే సాధించుట మిక్కిలి దుష్కరము. కాబట్టి యిట్టి కొరత వారింపబూని పెక్కు లక్ష్యములు పలుమారు సావధానముగా బరిశీలించి రచనా ప్రణాళిక నిర్ణయించుకొని నా నేర్పుకొలదిని సంస్కృతభాషతో సూత్రగ్రంథమొకటి కావించితిని. ఆగ్రంథము బాలురకు --- గాకుండుటవలన దానియందలి సూత్రములు కొన్ని తెనిగించి ప్రకృతగ్రంథ రూపముగా రచించినాడ.

కందము.

మానితపునడపేరిమి
మానసమున కింపు బెంప మనునంచలకున్
లోనిడి నీరసనీరము
జానుగ క్షీరంబుగొనుట సహజముకాదే.

శ్రీహయగ్రీవాయనమః.