ములుమనగు పనుల దానుబొందినపు డీధరంరాజువలె శాంతముదాల్చి మిన్నకిండినవారలు కలరా? లేరు. లేరని నొక్కివక్కాణించవ్లయును.ఇట్టి యసాధ్యమగునోర్పు నవలంబించుటవలననే యాధర్మరాజు కలక్రమమున శత్రువుల్నందఱినిజంపి సార్వభౌముడై సకలసామంతులును, జననిచయమును, ధర్మముగా బరిపాలొంపగలిగెను. మఱియు నాయమనందనుడు శాంతమువహించుట వలనగాదె “యజతశత్రు” డని యన్వర్ధనామమునుబడసెను. అతనికీర్తి. శాంతమునందిప్పటికి దశదిక్కుల దేజరిల్లుచున్నదికదా. కాబట్టి మనము, కష్టములబొందినను నోర్పువిడనాడకయుండుదము. మఱియు దీనిచే మనపనుల గొనసాగించు చుందుము.

క.ఒరులేమనినొనర్చిన
  పరపర?యత్రయముదనమనంబుకగుదా
  డొరులకు నవినీయకునికి
  పరాయణము పరమధర్మశ్బధములనెల్లన.

వినయము.

వినయమనగా బెద్దలసన్నిధినణకువగా నుండుట అట్టివానికిని గురుశిక్షవలన మంచిగొనములు కలుగునని వచించియుంటినిగదా. ద్నివలన సకలసుజనమనోహరము వినయము కలుగును. ఈవిషయము నేజనుడుతాదలసినపని

39

బా ల నీ తి.

నినేఱవేర్చుకొనగలడు. వినయములేనివాడు పలునెంజిలులకు నొడిగట్టవలసివచ్చును. మంచికొలమునందుబుట్టినానని గర్వముండక యడతివకలిగి యుండవలెను. విద్యావంతులలో దాను మొదటివాడై వాని గాంచినను నడకునవిడిచిమితిమీఱియుండుట మంచిదికాదు. అడకువగలిగినవాడు విద్యావిహీనుడైనను గౌరవార్హుడుకాగలడు. కురువేరు చూచుటకు సాబగుగానుండకపోయినను సువాసనయుండుకతనగౌరవభాజనమగుచున్నదికదా. అడకువగలిగిన నెటువంటిపనులైననుసాధింపవచ్చు. వినయముగలవాడు శత్రువుచేతను గీడుబొందనేరడు. గొప్పవారలయనుగ్రహమునకు బాత్రుడుకాగలడు. విద్యతోబాటు వినయముగలిగిన నెక్కువప్రకాశమానుడై భూజనులచే భూరిగ బొగడ్తనుగాంచుచుండును. సహజసౌందర్యమునకు దగినటులదళతళ యను మంచిదుస్తులధరించిన నదియెక్కువసాపునింపుట మనమీక్షించుటలేదా? ఈసుగుణగణముల నొసగువినయ ముత్తముడవలంబించును. కొలదివారలు విద్యాసామర్ద్యాదులులేకపోయిన ను బెద్దలసన్నిధినైన నణకువగానుండక నిక్కుచుందురు. రత్నాకరుడగు సముద్రుడు జలమెంతయధికముగాగలిగినను మితి(చెలియలికట్ట)మీఱక మరల వెనుకకుబోవుచుండుటయు, వాగుకొంచెమునీరెక్కువకాగానే మితిమీఱినాశనమవుటయు. మనముచూచుచున్నాముకదా.ఆటలబెడ్డల దగ్గఱనిక్కియుండుటగౌరవమని యావినయరహితులు
40

బా ల నీ తి.

తలచుదురు. కానియదివట్టిభ్రమయనినమ్ముడు. దుర్జనుడు వినయరహితుడై కన్నులబైకిజూచుచుండును. సజ్జనుడు సుగుణములచే నిండుకొనియున్నను దలనువాంచి వినయముగా జొక్చుచుండును. లోకమున గొమ్మలులేనిమ్రోడునభమువంకజూచుటయు, సుమనోమనోజ్ఞంబులగు ఫలసుమాదులనిండుకొనియున్నతరువు తమశాఖల నొంచికొనియుండుటయు మనమీక్షించుటలేదా? కాబట్టి యటులనుండుట స్వాభావికమే. తానుధనవంతుడైనను విద్యావంతుడైనను దరిద్రునిగాని విద్యావిహీనునిగాని చూచి నవ్వకూడదు. నవ్వినయెడల వారునింకొకపరి మనలజూచి రెట్టింపుగానవ్వగలరని తెలిసికొనుడు.మూరెడుపెరిగిబరెడు క్రుంగుటయేల! మిత్రులారా! “అత్యుచ్చ్రయ:పతనహేతు:” అనగా “నెక్కువపెఱుగుట విఱుగుటకొఱకె“ యనివినలేదా? కాననేదైన నెప్పటికైనను నిక్కియుండుట మంచిదికాదు. లోకమున మానవులువినయమునజెప్పుమాటలవినుచుందురుగాని భయమున వచించుమాటలు వినుచుందురా? వినరు. ఆవుయొక్క పొదుగును దిన్నగా బితికినయెడల బాలిచ్చునుకాని దానినిగోసివేసిన బాలివ్వగలదా? ఈయదు. కానవినయపూర్వకవచనములు విరోధిసాధనభూతములు ఈవిషయమేసర్వత్రసాధకము. వినయములేక పెద్దలనవమానించినవారలు కష్టములబొందగలరు. తనకిదివఱకున్నకీర్తియు గూడబోవును.
6]

41

బా ల నీ తి.

    ఇటుల వినయములేక పెద్దలనవనమనించి చెడిపోయినవారలు కొందఱు కలరు. వరిలో నొకనిజెపొఎద.
     యయాతియను నొకమహారాజుండెను. ఆయన, దేవయానిశర్మిష్టలను వివాహమాడియుండెను. అతడు జనులనుజక్కగా బరిపస్లించె అనేకయాగము లొనరించెను. లెక్కలేనిదానముల గావించెను. అంత గుమారునిబట్టాభిషిక్తునిజేసి వనమునకేగి నిరాహారుడై చలగాలమి తపమచరించెను. ఈతడు చేయని సత్కార్యమింకొకటిలేదని చెప్పవచ్చు. ఇటుల మంచిపనులజేయుటవలన నీంహారాజునకు స్వర్గలోకము నివసముగా లభించెను అచ్చట నింద్రునిచే సత్కారముల నీమహారజుపొందుచుండెను. అంత నాస్వర్గలోకమున కదిపతియగు దేవేంద్రునకు, నీమహరాజుంకు,నీక్రిందివిధముగా సంవాదమాయెను.
    ఇంద్రుడు—రాజా!నీవెవ్విధమున రాజ్యంబు బరిపాలొంచితివి?
    యయాతి—సుఖంబుగా ధర్మరాజుగా రాజ్యంబు బరిపాలొంచితిని.
    ఇం —ఓరాజా! ఏమితపస్సుజేసితివి? నీవిదివఱకే బ్రహ్మలోకసుఖం బనుభవించి యిచటికివచ్చినాడవు. సమన్యమా? నీతఓస్సుజూడ దుష్కర మైనదిగానున్నదే?
యయా—అవును. ఇంద్రా!దేవతలలోగాని మహమునులలోగాని యక్షులలోగాని రాక్షసులలోగాని నాతోస
42

బా ల నీ తి.

మానముగా దపమొనరించినవారు కానరారు, వారినందఱిని మించినదుష్కరతపము నేనాచరించి యుంటిని, నాకునేనే యపమానము.

    ఇం--చాలుజాలు.నీగ్రంధమిక గట్టిపెట్టుము. నీతో సమానముగా: దపమొనరించినవారు మహా మునులు నులు గూడ గారుగా? ఏమినీతపోభి మానముల్!.ఈయభిమా నమువలన గొప్పవారల నవమానపఱచితివిగదా. సరి సరి. నీవికబుణ్య లోకంబున నుండదగినవాడవుకావు. సత్వరమే మనుష్యలోకమునకరుగుమని తఱిమివేసెను. 
   ఆలోకించితిరా! ఆయయాతిమహారాజు తానే మంచి రాజనియు దానాచరించినతపమే మిన్నయ నియు దలచి దేవేంద్రునితో వినయములేక యహంకారముగా మునులు మొదలగుగొప్పవారల నవమానపఱచుచు బలికినందునకదా సకలసుఖము లకు దల్లియ్లిల్లగువ్వర్లోకంబునుండి దు:ఖముల కునికి పట్టగు మనుష్యలోకముంబునకు వచ్చినది. కాన నెవడైన దానెంతగొప్పవాడైనను జననీజాకుల సమక్షమునగాని గురువరాదిశ్రేష్ఠులయెదుటగాని ప్రభవులదరియందుగాని నిక్కుచు మాటలాడ గూడదు. మఱియు వారిసమీపమున మిక్కిలి వినయముకలిగి యుండవలెను. కపటవినయమున నటించగూడదు. ఒకవేళ నటులనటించినను వివేక వంతులు తెలిసికొనగలరు. అత్తఱిగీడులు మూడగలవు. కాన మనము పిన్ననాటనుండి యీకపటము లేని యడకువ నబ్యసించుచుం డిన గ్రమక్రమముగా జక్కగా బట్టువడును. కాని పెద్ద వారమైనతరువాత వినయమభ్యసింపవలననిన నంతగా బట్టుపడదు. "చెట్టైయొంగనిది మ్రానై యొంగునా?" కాన మనమీబాల్యదశనుండియే వినయ మభ్యసించుదము. అటుల నభ్యాసమొనర్చినయెడల సకలసంపదలు మనల జేరనపేక్షించుచుండును.

క. వినయమె కీరితినిచ్చుచు
    వినయమె పృధులాభములను♦వేగమె కూర్చున్
    వినయమెజగమున నన్నుతి
    గనుగొనగాజేయుగాన♦గె
    

సహవాసము.

సహవాసమనగా గూడియుండుట. అనగా నొకని తో నొకడు కలిసియుండుటయే.

ఈసహవాసమువలన గీర్తియు, నపకీర్తియు, లాభము, నష్టము, మంచి, చెడు, కష్టము, గౌరవము, పరిభవము. మొదలగునవన్నియు సంప్రాప్తించు. మనమెటువంటివారలతో సహవాసము జేసిన నట్టిగుణము లలవడును. అనగా మనము దుర్జనులతో సహవాసముజేసినయెడల నపకీర్తియు, నష్టము, గష్టము, నవమానములోనగు చెడుగుణ ములు కలుగును. ఇక సజ్జనులతో సహవాసమొనర్చిన గీర్తియు