23

బా ల నీ తి.

స్తుతము మనలను సుఖముగా బరిపాలించెడి రాజులయందు భక్తిగానుండి ఫలములబొందుటకు బ్రయత్నముఛేయుదము.

క. జనులకు నెల్లనుబూజ్యుడు
    జననాయకుడతనిమహిత ♦శాసనమునప్ర
    జ్ఞనులును మునులును సద్విధి
    జనువారలుకాని కడవ జనగాదెపుడున్

భారతము

విద్య.

     విధ్యయనలోకములోనిసమస్తవస్తుగుణస్వభావాదుల దెలిసికొనుట.
ఈవిద్యయనునది లేనిదే మనుజు దభివృద్ధికి రానేరడు. ఇది కాఱు క్రమ్ముకొన్న చీకటుల ధ్వంసము జెయు సూర్యునిపగిది విరాజిల్లుచుండును. విజ్ఞానమొదవించుచుండును. అపకీర్తి హరించుచుండును., సత్కీర్తి వృద్దిజెందించు చుండును. ఇది మంచి,ఇదిచెడ్డ, యిదిన్యాయ, మిదియన్యాయమను సంగతుల నీవిద్యవలన దెలిసికొనవచ్చును. పరోపకారాది బుద్దులలవడును. నిరామయసౌఖ్యములు చేకూరుచుండును. ఇంకను నీవిద్యను ధనముతో బోల్పదగును. కొన్నికొన్ని కారణములచే నాధనముకన్న నీవిద్యాధనమే యధికమని చెప్ప
24

బా ల నీ తి.

వచ్చును. ఏలయన? అధములవలె నీవిధ్యాధనము దొంగలచేతుల జిక్కదు., భోగాదులచే హరించదు., అన్నలు, దమ్ములుమొదలగుబందుగులు మోసపురీతినైనను హరింపనేరరు. దిక్కులేనిధనము రాజుస్వీకరించినటుల నీవిద్యాధనము స్వీకరింపనేరడు. మఱియు నీవిధ్యాధన మితరుల కెంతయెక్కువగా దానముచేయుచుండిన నదితఱుగక యంతయెక్కువ వృద్ధిజెందుచుడును. కాబట్టి యాధనముకన్న నీవిద్యాధనమే మిగుల గొప్పదియని చెప్పనగు.

       ఈవిధ్యయే, మనజునకు నసుమగునందము. స్వదేశమునందుమిత్త్రము, పరదేశమునందు జుట్టము. ఇదియే సజకసుఖదాయిని. ఇదియే రాజవశ్యము గలిగించును. ఇదియే దైవము. ఇదియేతల్లి వలె దన్ను రక్షించుచున్నది.
      తండ్రివలె శిక్షించి సన్మార్గమున జొన్పుచున్నది. అనుకూలవతియగు భార్యవలె మనమునురంజింపజేయుచున్నది., వేయేల? సర్వకాలమందు గల్పతరువుమాడ్కి నన్నికోరికెల నిచ్చుచుండె దీవిద్యయే!దీనినివర్ణించుటకు నలునకైన  నుదరముగాదు. కాబట్టి యిట్టి విద్యను మనమభ్యసించిన గౌరవించుటకుదగినవారలము కాగలము.
   ఈవిద్య యఱువదినాలుగు తెఱగులై భాసిల్లుచున్నది. వానినామధేయస్ము లెవ్వియునిన?.
(1)ఋగ్వేదము (2) యజుర్వేదము (3)సామవేదము(అధర్వ 4)ణవేదము (5)శిక్ష (6)వ్యాకరణము (7)చంద

25

బా ల నీ తి.

ము (8)నిరుక్తము (9)జ్యోత్రిషము (10)కల్పము (11)పూర్వమీమాంసము (12)ఉత్తరమీమాంసము (13)పురాణము (14)ధర్మశాస్త్రము (15)గానము (16)కవిత్వము (17)జీవభాష (18)వ్రాతవ్రాయుట (19)చేతనాచేతనవిభాగము (20)జూదము (21)కళాశాస్త్రములేకకొక్కోకము (22)ధనుర్విధ్య (23)శకునము (24)సాముద్రికము (25)రత్నముల బరిశీలించుట (26)తేరునడపుట (27)నేర్పుగావండుట (28)గుఱ్ఱములనెక్కుట (29)మల్లశాస్త్రము (30)ధాతుగంధరసవాదములు (31)కాలముకానికాలమునందు బువ్వులుమొదలగువానిని బుట్టించుట (32)మొనకట్టు(పెట్టుడుమందు) (33)వాకట్టు(వాక్కును మాటలాడకుండజేయుట (34)ఉదశాగ్నులశక్తినిగణనజేయుట (35)ప్రవాహమునాగించుట (36)రహస్యపుబనులందు జమత్కారము (37)మహేంద్రజాలము (38)ఇతరులనుస్వాధీనముజెసికొనిటకై మూర్చబొందించుట. (39)ఘటికలచేగోరికబొందుట (40)మోసములు (41)ఉండికనపడకుండ నుండుట (42)దొంగతనము (43)దూతకృత్యము (44)వేటాడుట (45)విహంగగమనబేదజ్ఞానము (46)చిత్తరువులవ్రాయుట (47)మణిమంత్రక్రయలు (48)లోహకారకత్వము (49)సాలెపని (50)రధకారకర్మము (51)చర్మకారకత్వము (52)ఱాళ్ళనుబగులగొట్టుట. (53)ఘటకారకర్మము (54)బేరము (55)జ్ఞానసామర్ద్యములు (56)అంజనభేదములు (57)మేదరిపని (58)వ్యవసాయము (59)రాజయో
26

బా ల నీ తి.

గాదులతో వాదనముసల్పుట. (60)లావుకూర్మకుక్కుటమెషముమొదలగుపక్షిమృగములకు దగవులాట బెట్టుట. (61)వాక్యములచే సిద్దిబొందుట. (62)నిరొధముచేజేయునుచ్చాటనోపసంహారంబులు. (63)పాశుపల్యము (64)స్వరముచేతవంచనముజేయుట. అనునవి.

   ఈవిద్యలన్నిటిని దెలికొని యుండవలెను. ఈయఱువదినాలుగువిద్దియలలో జూదము, దొంగతనము, మోసము, మొదలగు చెడుగుల నాచరణ మందువిడిచి మిగిలిన మంచిపనులను నాచరించు చుండవలెను.
మన మా యఱువది నాలుగింటిని నభ్యసించుటకు వీలులేకపోయినను దుదకొక సర్వజన సమ్మతమైన వభ్యసించి యందున విద్యాంసులము కావలయును. మనమటులయిన యెడల గురువరాదీజనులామోదమును బొందెదరు. మనతలిదండ్రులు మొదలగుచుట్టములానందించు ధురు. విద్యావిశారదుడు దరిద్రుడైనను గౌరవమున కర్హుడు. విద్వాంసుడు కుంటివాడైనను, గ్రుడ్దివాడైనను సుందరరూపవిహీనుడైనను బూజ్యుడు ఎటులన? చెఱుకు. ఎన్నివంకలబోయినను మారధ్యు ముండుటంబట్టి దానినిగ్రహించుచున్నాముగదా, విద్యనునేర్వనివాడు సరసుడు కానేరడు. సరసుడు కానివాడు శ్లాఘనీయుడుకాడుగదా. చక్కగా విద్యనేర్చినవానిన మనమొకటియైనను వినుటకు జనులుత్సహింతురు., కాని విదావిహీనునివచన మొకటిగాని పదిగాని వినుటకు

27

బా ల నీ తి.

జనులుత్సహించరు. కారణమేమన? లోకమున గాకులచ్వారులచ్వినుటకుజనులుత్సహించెదరా? ఉత్సహించరు. కతమేమన? కాకరవములు కర్ణకఠోరము లగుటయే. మఱియు గోకిలస్వనముల నాలకించుటకు జనులిష్టపడుచున్నారా? ఇష్టపడుచున్నారు. కారణమేమన? పరభృతనినాద ములు కమ్మనినాదములగుటయే! కాబట్టి వివేకులగుపండితులవచనములు దమాదరణీయ ములు. కుపండితాపండితవచనములు త్యాజ్యములు. కొన్నివేళలయం దపండితులు మంచిమాటల వచించిన నవి గ్రహింపదగినవని తెలిసికొనుడు. భార్యయు, భర్తయు జక్కగా విద్యనేర్చి నీతియుతులై కలిసిమెలసి కాపురముజేయుచుండినపుడు వారికిగల యానందము మఱియొకరికిగలుగనెరదు.

ఇక విద్యనేర్వనివారికి, నాలుగుకాళ్ళులెని కొఱంత యొకటితక్క మొకములకును వీరికిని నంతరం బింతయను గాన్పింపదు. ఈవిద్యావిహీనులు మంచిచెడ్డలేఱుంగురు. లాభా లాభముల గుఱ్తెఱుంగరు. పెద్దలు చెప్పినబుద్దినివిని తమతప్పులను దిద్దుకొనరు. విదావిహీనుడు మదన సమానసౌందర్యముకలవాడైనను యౌవనమధ్యస్దు డైనను మంచివంశమునందు బుట్టినవాడైనను విద్యలేనికతన గ్రుడ్డిగవ్వకైనను గొఱగాక యుండును. మోదుగపువ్వు ఎంతసుందరముగానున్నను సువాసన లేనికతనగదా జనులు దానిని గనుల గనుకొనరు,. ధనరూపయౌవనాదు లీవిద్యాతిశయము వ్చలన
28

బా ల నీ తి.

భాసిల్లుచున్నవి, కాని వేఱొకదానిచే బ్రకాశించుటలేదు. చీకటిలో గనపడనిపదార్దములు దీపమువలనగదా కనబడుచున్నవి. అటులనే యీవిధ్యవలన మనకు దెలియని సంగతుల గ్రమముగా దైసికొనవచ్చున్. సర్వ విధములను సద్యశమొసంగు నీవిద్యను జదివికాదె శంకరాచార్యులు ప్రసిద్ధికెక్కినది. ఆయన చరిత్రమెంచుక దెలియపఱచెద.

     శ్రీశంకరాచార్యులు చిఱుతప్రాయముకలవారైనను మంచిబుద్ది నలవరించుకొని తల్లియందు భక్తికలవాడై గోవిందపాదాచార్యులకడ విద్యాబ్యాసమొనరించి గొప్పపెండితుడాయెను. అంతట వ్యాసరచితబ్రహ్మసూత్ర ములకు భాష్యమొనరించి "భాష్యకారు"లని వాసి గాంచెను. అంతట లోకమున వక్తృశిఖామణీయై కవి వదుడై  యోగీశ్వరుడై యిప్పటికిని జగద్గురువని వెన్నె కెక్కుచుండెను. వారిగ్రంధముల్ నీతిదాయకములు, వారివేదాంతమార్గమనన్యసామాన్యము., వారెన్నడో విధివశులైనను నేటిచఱకు వారిపావనజీవితము జనులకుదెలియుటయెటుల? విద్యవలననేకదా. కాబట్టిప్రతివారును చ్విద్యనేర్చి ధనముసంపాదించి వివేకముకలిగి సుఖముగా నుండవలెను. ఈవిద్యనేర్వవలసినదేమనమయమందనివ? ఐదేడులు వచ్చినదిమొదలు ఇరువదెనిమిది సంవత్సరములవఱకు విద్యనభ్యసించవలెను. కాబట్టి పైవిధములందలి సకలజనసమ్మతమగు మంచివిద్య  నునేర్చి విద్యాగతుమై వరసముగౌరాభాజనులగుదురు. 

తే.గీ."విద్యయొసగును వినయంబు♦వినయమునను
       బడయు బాత్రత పాత్రత♦వలన ధనము
       ధనమువలనను ధర్మంబు♦దానివలన
       నైహికాముష్మికసుఖంబు♦లందు నరుడు."

సత్యము.

సత్యమనగా నితరులచే జెప్పబడినదికాని వినినది కాని తానుజూచినదికాని యున్నదానిని నుడువుటయే.

ఇటుల జెప్పబడినవిషయమందును, వినినవిషయ మందును, గనినవిషయమందును, బుదిపూర్వక ముగా దాఱుమాఱుగా లేనిపోనివి కల్పించి చెప్పుట యసత్యమనబడు.

ఈయసత్యము బలుకువా రవినీతులు, వీరు చెప్పువాక్యముల నెవరును విశ్వసించరు విశ్వసింపక పోవుటవలన దమకాశ్యకములైన పనులన్నియు జెడిపొవును. చెడినతోడనె యలజడుల గుందుచు దరిగానక యుండుదురు. దీంచ్వలనగ్రమముగా మనోవ్యాధి జనింపగలదు. ఈమనోరోగమువలన మృతిజెందిన జెందవచ్చు. ఈయసత్యమాడువారు ఘోరనరక వాసులై యుందురు., "అసత్యమాడుట బ్రహ్మహత్యతో సమాన" మని పండితప్రకాండులు నుదివిరి. తన్నునెవరైన నొకధర్మవిషయమును గురించి నడిగినయెడల