బాల నీతి/పరోపకారము
బా ల నీ తి.
పరోపకారము.
ఇతరులకు మేలుజేయుట పరోపకారమనబడు.పరోపకారము జేయువారల బరోపకారులని పలికెదరు. ఈపరోపకారులు తాము కష్టముల ననుభవించుచుండినను దీనులయొక్క బాధలబోగొట్టి వారికి సౌఖ్యము జేకూర్చుచుందురు. వృక్షములు నిండువేసవిని దామాఖరకరకిరణములచే గ్రాగుచున్న మిడిమిడి యెండలో మలమల మాడుచు వచ్చిన నధికుని జేరదీసి నీడనొసంగి వానిసంతాపమునుహరించుటలేదా? సజ్జనులితరులచే దానుపకార మధికముగా నందినను వారుప్రుల్కుమాత్రముపకారము జేయుచుందురు. దుర్జను లితరులచే దాముపకారముల నెక్కువగా బొందియును దిరిగి యాయుపకారుల కపకారములనే కూర్చుచుందురు. ఱాలచే ఱువ్వినను గినియక రసాలసాలములు మనకుబండ్లనిచ్చుటయు, మరణావస్దలో నుండెడి పామునుదీసికొనివచ్చి తగిన యుపకరములొనరించి దానిపీడ దొలగించి పొలములోని దనిజకగాబెంచినను నదిమనల గఱవక విడువకుండుటయు మనకు బ్రత్యక్షంబేకదా? దుర్మార్గుడు పరులచే దాను బాధ బొందుచున్నను నితరులకు గీడొనరించు పనియందు యోచించుచుండును.మండూకము పాము నోటిలో నుండియు బ్రక్కన నీగలున్న వానిని భక్షించుటకై యత్నించునుగదా?
61
బా ల నీ తి.
బా ల నీ తి.
63
బా ల నీ తి.
రీరము ప్రకాశించునేరదు. కాని పరోపకారముచేత నది ప్రకాశించగలదు. అనగా మనుజునకు బరోపకారము జేయుట పరమార్దమని ముఖ్యాభిప్రాయము.
మనము సతతము పరోపకారము జేయుచుండిన గీర్తివంతులము కాగలము.
ఈవిధముగా బరోపకారము గీర్తి జెందిన వారలలో నొకరిని జూచించు చున్నాను.మున్ను కుంతీదేవి తనసుతులతో నేకశిలా నగరంబున నొక బ్రాహ్మణునిగృహంబున గారణాంతర ముగ గాపురము జేయుచుండెను. ఇటులుండ నొక దినమున దాము నివసించు గృహయజమానుడు మొదలగువా రేడ్చుచుండిరి. ఇదియేమి? ఈరోదన మెచ్చటిదని విస్మయంబందుచు గుంతీదేవి వారలను "మీరేలగాకిగోలగా నేడ్చుచున్నారు? మీకేమి యాపద గలిగెను? దానినిపుడే పోగొట్టి సుకులనుగా మిమ్ము జేయగలను. కాన గారణముల దెలియబరచు" డని యడిగెను. అంతట నాగృహ యజమానుడామెతో "అమ్మా! ఈగ్రామమునోబకుం" డను రక్కసుడొకడు గలడు. వాడు ప్రతితిన మొక్కొక్క యింటిలోజొచ్చి యానికేతనమున నుండు వాఱలనందఱిని జంపి తినుచుండెడివాడు. వానిని నిర్జించుటకు మాపురవాసులకు గాని మారాజులకు గాని శక్తిలేకపొయెను. అంతట బౌరులారక్కసుని
బా ల నీ తి.
తొ "బ్రతిదినమిలువరుస రెండెనుబోతులను, బండెడు రక్తమాంసమిశ్రితాన్నమును, నొకమానిసినిదెచ్చి నీకియ్యగలము. కాన స్వేచ్చగా జనులనుజంపుట దయచేసి మానుకొనమని మనవి జేసికొనిరి. ఆరక్కసు డందుల కంగీకరించెను. ఆయేర్పాటుప్రకార మిలువరస జరుగుచువచ్చినది. నేటికాయేర్పాటు మాయింటికిగూడ సిద్ధమాయెను. మాయింటిలో నాబార్యయు, గొమరితె, కొమరుడు, నేను, నలుగురము గలము. కాని యొకరినొకరు విడిచిపట్టలేక గగ్గోలుగా నీవిధమున నేడ్రుచుంటి" మని చెప్పెను. అంత గుంతీదేవి వీరియవస్దంగని పరోపకార పారీణురాలు గనుక వారుకోరకపోయినను వారితో "మీరు దు:ఖింపకుడు. నాకైదుగురు కొమరులు గలరు. అందున రెండవకుమరు డారక్కసున కాహారముగా బోగలడని వచించెను. అంతట నాయజమానుడు చెవులుమూసుకొని 'రామరామ మాయింటికధితులుగా వచ్చిన మిమ్ములను స్వకీయప్రాణ సంరక్షణార్దమై రక్కసుని కాహారంబుగా బంపించుట పాటియే? పాడివిడిచి మీరుచెప్పిన విధమున నేనొరించిన నాకు సత్కీర్తి లభించునా? లభించదు. కాన దాని నేవిననొల్ల, నని యామెతో ననెను.
అంత గుంతి "అయ్యా! మీయవస్దజూడలేక నారెండవకుమారుని మీకుబదులుగా బంపదనంటిని. నాకుమారుని భక్షించుట కారక్కసునికి వశముకదు. ఈకుమారు డిది వఱకే మహాబలవంతు లనేకుల జంపినవాడు. వీనినిగూడ 65
బా ల నీ తి.
జంపి మీకుపకారమొనరించగలడనిచెప్పి మీరంత మాత్రమును విచారించకు"డని దృఢముగాబలికి తనకుమారుండగు భీమునిబిలిచి సంగతులన్నియు జెప్పి వీరిదు:ఖమునుబాపుమనిచెప్పి రెండెనుబోతులను, బండెడురక్తమాంసముమిశ్రితా న్నమును నిప్పించి యాబీముని రక్కసునియెద్దకు బంపించెను. అంతట నాభీముడారక్కసున కించుకంత దూరమున నిలువబడి యాబండినినున్న యన్నము ను దిట్టముగా దినుచు "రమ్ముర"మ్మని కేకలు వేయుచుండెను. దానినిగాంచి యారక్కసుడు "వీడెవడో కాని నాయెదుటకువచ్చి నాకైతెచ్చిన యన్నము దినుచు నిర్లక్ష్యముగా గేకలువేయుచున్నాడని తలచి కనులరవలు రాలునట్లు జంపునంత వేగముతో నాభీమునిపై దడాలున బడెను.అంతట నాభీమునికి నీరక్కసునకు గొలదికాలము యుద్ధముజరిగెను. అంతట భీముడారక్కసుని కటికంఠ ప్రదేశముల బట్టికొని యొక గ్రుద్దుగ్రుద్దెను. దానికీ దాళలేక యారక్కసుడు మృతినందెను. అంత భీముడారక్కసుని శవమును దీసికొనివచ్చి పురజనులకు జూపించెను. తరువాత బౌరులీభీమునికి, నీతనితల్లియగు కుంతికి,నామె కుమారులకు బిండివంటలు జేయుచు విందుల మొనరించుచు వచ్చిరి. తుదకాభీముని కుత్సవంబు సల్పి "పరోపకారివై మాబాధలు పొగొట్టితివని కొని యాడిరి.
కంటిరా? ఆకుంతీదేవి రాక్షసునకుమారునకు బదులుగా తన రెండవ కుమారుని బంపెనుగదా? ఆభీముడు తనతల్లియును బా ల నీ తి.
మతిని నారక్కసునిజంపి యాపురవాసుల కెంత యుపకారమొనర్చెనో, యెంతసుఖము గూర్చెనో తెలిసిందికదా? కాబట్టియే వారలు పరోపకార మందు బ్రసిద్దికెక్కియున్నవారలు. కావున మనల నితరులు కోరినను, గొరక పోయినను శక్తికొలది నుపకారమొన రించి శ్రేయస్కరముగా నుందము.
ఆ.వె. పరుల కుపకరింప♦పాపక్షయంబగు
పరుల కుపకరింప♦బట్టుకొమ్మ
పరుల కుపకరింప♦బరలోకసాధన
పరుల కుపకరింప♦బలిమి వేమ!॥
కృ త జ్ఞ త.
చేయబడినమేలు నెఱిగియుండుట కృతజ్ఞత యనబడు. అనగా దానితరులచేబొందినమేలును మఱువకుండ నుండుటయే!
ఈకృతజ్ఞత కలిగినవారలు కృతజ్ఞలని బల్కబడుదురు. ఈకృజ్ఞలెకృతార్దులని చెప్పనగువీర లితరులచే నింతకుముందున్న పొందిన లాభములే కాక యింకను లాబములుబొందుచుందురు. కాని "ఒఫలానా" వానివలన నాపని కొనసాగినదని తలచుచు నాయుపకారిని సుతించుచు మగుడ నతనికి దాను తగిన