బాల నీతి/దుర్జనులు, వారి గుణములు
బా ల నీ తి.
యాద్రోణా చార్యుడు చేకొనకపోయినను విలువిద్య యందు శ్రద్ధకలవాడగుట బట్టియేకదా స్వకీయజన మును విడిచి భయంకరమగు నడవికేగి మన్నుతో నాద్రోణుని రూపమునుజేసికొని దానినె గురువుగా దలచికొని శ్రద్ధతో స్వయముగా నేర్చుకొని త్రిలోకము లందు విలువిద్యయందు దానె మేటియని ప్రసిద్దికెక్క గలిగినది. ఆప్రసిద్ధినివిని యొకడాయర్జునుడును ద్రొణుడును నంతపని జేసినది. కాబట్టి శ్రద్ధనుబట్టి విద్యయుండును. ఒకవిద్యయే యననేల? సమస్తము నీశ్రద్ధనుబట్టియే యుండును. కాన మనము శ్రద్ధవలన విద్యాదులబొంది ప్రసిద్ధి బొందుదము.
క. శ్రద్ధ రవితనయ సాత్వికి
బోద్ధవ్యా వాస్తిశుభము♦బొనరించుమన
శ్శుద్ధి స్వరూప దాని బ్ర
బుద్ధుడు పాటించు జూవె♦పురుషాత్మికగన్.
(భారతము.)
దు ర్జ ను లు, వా రి గు ణ ము లు.
123
బా ల నీ తి.
టికి మాటికిని బొంకులాడుచు బ్రతిజ్ఞలుసేయుచు బ్రమాణములుజేయుచు నితరుల నమ్మించుటకై యనేకవిధముల బాటుబడుచుందురు. వీరలు, తమ పని యెవనివలనగొనసాగవలెనో యది తెలిసికొని వానిని జేరి ప్రణామములాచరించి మిక్కిలి తిన్నని మాటలతో మాటలాడుచు బయోముఖవిషకుంభముల బాతి బాసిల్లుచు గపటవినయముజూపుచు విశేషముగా నాతనియందు భక్తికలవారుగా నటించి యాసుజనుని వలన దమపనిగొనసాగించుకొనుచుందురు. అంత నీకు జనుల తమపనినెఱవేర్చినవారలనే కృతఘ్నతకలవారై పలు తెఱగుల భాదించుచుందురు. ఈకుమతులు సధ్యమైనకొలది నితరులను దమచేతజిక్కించుటకె యత్నింతురు. ఒకవేళ వారు తమచేతులజిక్కనిచో వేడికోలుచేనైనను జిక్కించుకొందురు. "అందినశిఖయు నందకున్నగా" ళ్ళని వినియుండలేదా?
ఈకుచరితు లాదిని దమపని కొనసాగునంత వఱకు గడువినయముగానుండి పిమ్మట మేమే శ్రేష్టులమని నిక్కుచుందురు. వీరికుపకారమొన రించినవారెదలో "ఏకుమేకయినదే" యని చింతించు చుందురు. కాబట్టి దుర్జనుల కెవరైనను సాయము జేయగూడదని తెలిసికొనుడు. ఈదుర్మార్గులకొకపరి మంచిబుద్ధిపుట్టినటుల గానుపించినను వారిని నమ్మగూడదు. పాపటకాయ పైకిబాగుగా గానుపించి నను లోపలిచేదుయెచటికరుగును? కాననొకపరి వారు మనకు మంచివాడుగా బా ల నీ తి.
గాన్పించినను నమ్మగూడదు. వీరినినమ్మియుండుట "కుక్కతొకబట్టుకొని గోదావరియీదుటయె" మఱియు వీరికి సాయముజేయుట "పామునకుబాలుపోయు టయె"
"అతివినయంధూర్తలక్షణ" మ్మనగా దూర్తుని యొక్కలక్షణ మతివినయమనియర్దము. కాన సామాన్యముగా మిక్కిలివినయమునటించువారు దుర్జనులైయుందురని చెప్పవచ్చును.ఈవినయములు తమభార్యలు మహాపతివ్రత లైనను సంతానవతులైనను, సౌందర్యవతులైనను, సద్గుణవతులైనను, సరకుసేయక యాయమ్ముల ననాదరణదృష్టితో జూచుచుందురు. వీరలు తమయుద్దేశ మగునంతవఱకు గడుప్రియులవలె నటించి పిమ్మట విషపూరితంబులగుకోరలుగలిగిన సర్పముమాస్కి నాశనముజేయజెలరేగుచుందురు. ధైర్యమువీడి భయముకలవాడై తమ్మును గొనియాడు చువచ్చి శరణాగతుడగు నతిధినిగాని యభ్యాగతిని గాని యీకుచరితులు నిర్దయులైవారల జంప నుంకించుచుందురు. అధికప్రసంగములేక యభిమాన ధనులైయుండు పెద్దమనుష్యుల నీదుర్మార్గులు మందులుగా భావించుచుందురు. సద్వ్రతమునందు శుచికలవాడై యొకడుండుటగాంచి వానిని వీరు "అబ్బా!లేనిపోని యీదంబాచారములెందుకో? తెలియకున్న" దని యీసడించుచు: బల్కుచుందురు. శూరుని నిర్దయునుగాను, మునిమ్రుచ్చుగాని, బలవంతునిగర్వవంతునిగాను, మంచి
125
బా ల నీ తి.
యుపన్యాసకుని వాచాటునిగాను, సద్విమర్శకుని రంధ్రాన్వేషణ తత్పరునిగాను, బరిగణించుచుందురు.
వీరలు నిష్కారణముగా గొప్పవారలను బీడించుచుందురు. కనవునీరుమదలగువానిచే బ్రతుకుచేపలను నిష్కారణముగా బోయవాడు పీడించుటలేదా?
ఇట్లు నిష్కారణముగా బెద్దలని పేరుగాంచిన వారిని జిక్కుల జిక్కించుట కడునన్యాయము. వీరలు యమగదానుగ్రహపత్రులు కాగలరు.
ఈదుర్జనులు తమపని కొనసాగనియెడల నత్తఱిప్రాక్తన ఫలమిదియని తెలిసికొనక దైవమునుదొక్రుచుందురు. ఇటుల దూఱుట “తుంటిని గొట్టినపండ్లు విరిగిన“నను లోకోక్తిసరిపోవుచున్నది. వీరలు గురిగింజవలె దమదప్పుల దాముదెలిసికొనక యితరుల తప్పులవెదకు చుందురు. ఈకుమతులకు దైవవశమున గొంచెమున్నత పదవిలభించెనేని “నికనాకేమిరా“ యనిగర్వించి తమక్రిందివారలను నెక్కువగా వీరలు వేధించుచుందురు. ఈకుచరితులు, దైవమునందును, రాజునందును, జననీజనకులందును, మహాపతివ్రతయగు భార్యయందును, సద్గురునందును విశ్వాసహీనులై వారిని దృణీకరించుచుందురు.ఈదుర్మార్గులకు, విధ్య, ధనము, బలము, నీమూడు సుగుణములు మదోద్రేక కరములగుచున్నవి. ఇవియెసుమతులకు సాధుత్వ మార్గదర్శకములు.
బా ల నీ తి.
సుజనులేదేని యొక మంచికార్యమును జేయుచుండిననీ కుచరితులు దానినెటులైన నాగింపవలె నను యుద్దేశముతో విశ్వప్రయత్నము లొనరించు చుందురు. ఇతరుడు గొప్పదశలో నున్నాడని వినిన సహించక యీదుర్మార్గులాదశ నుండి వానిని దొలగింప జేయుటకుద్యమించు చుందురు. ఎదుటివారిప్రొయ్యి చక్కగా మండుచుండిన, దానిని జూడలేక తనప్రొయ్యిలో నీళ్లుపోసికొనినాడట" యనులోకోక్తివిన లేదా?ఈదుష్టులు లోకాపవాదకు భయపడరు. బొంకుటకు గొంకరు. గురుదారలనైన నంటుటకు జంకరు. సురాపానాదుల జేయుటకు శంకించరు. లోభత్వమున గ్రోధమున దగ్గియుండరు. కృతజ్ఞత యెట్టిదోయెఱుగరు. జూదమాడుటకతిశ్రద్ధకలవారు. వీరు చేయుపనుల వేఱువేఱుగా జెప్పనేల? ఈకుమతులకు జెయదగని పనియేలేదు. వీరలు తేనెపూసిన కత్తుల వలె బ్రకాశించుచుందురు. వీరలు బ్రతివాడును, దమవలెనుండుటకు బ్రయత్నముల జేయుచుందురు. "తాజెడ్డకోతివనమెల్ల జెఱచె" నను లోకోక్తి వినవె? ఈదుర్జనులుపైకి మేడిపండువలె మేలిమిగా గానుపించినను లోపల జూడ వారిశరీర మంతయు విషమయమై యుండును. పాములకు గోరలయందును, తలయందీగకును, దేలునకు గొండియందును, దుర్జనులకు నిలువెల్లను విషము కలదని పెద్దలుచెప్పగ వినలేదా? దుర్మార్గులు విద్వాంసులైనను విడువదగినవారలు, ఎ
బా ల నీ తి.
టులనన? పాము మంచిమణిచే బ్రకాశించు చున్నదై నను నదిచెడ్డపురుగుకాబట్టి దానిని విడుచుచున్నాము కదా. ఈదుర్జనులకు బరమున ఘోరనరకముతప్ప వేఱేదియును లేదు. ఇహమున నపకీర్తియు గలదు.
తుందిలముగా దుష్టక్ర్మముల నొనరించువారలు దు:ఖములను బొందగలరు. అట్లు పూర్వుమందున దు:ఖములను బొందినవారును గలరు. వారిలో నొక నిని జూపించుచున్నాను.తొల్లివావణుడను రక్కసుడొక్కడుకలడు. ఈతడు మహాపరాక్రమశాలి. ఈతడు నిష్కారణముగా నితరులను బాదించు చుండెడివాడు. బలహీనులను వేధించియన్యాయముగా రాజ్యమును గ్రహిచినవాడు. అహర్షులతపమును బాడు చేసినవాడు. తనకు మిక్కిలి దగ్గఱచుట్టమును నీతివిశారదుండగు గుబేరుని, దురహంకారముచే దూలనాడినవాడు. నాతోసమాను డెక్కడలేడని నిక్కుచుండెడివాడు. వరదారలను జెఱబట్టుచుండెడివాడు. మహాప్రతివ్రతల బాడు జేయ బాటుపడుచుండెడివాడు. పరద్రవ్యము ను బ్రెల్లముతో సమానముగాదిన జూచుచుండెడి వాడు. వేయేల? ఈరావణాసురునితో సమానుడైన దుర్మార్గుడింకొకడులేడు. ఈరావణాసురుడిట్టివాడు కానట్టియే నలకుబేరునిచేతను, బ్రహ్మచేతను శాపముల బొందెను. మతిమంతుడును, దనయనుజుడునగి విభీషణుడు తన్నువిడనాడె
బా ల నీ తి.
ను. తుదకీదుర్మార్గములవలననే యారావణుడు శ్రీరాముల వారిచే మృతిజెందవలసివచ్చెను.
చూచితిరా! ఆరావనాసురు డావిధముగా దుర్మార్గ కార్యముల నొనరించుటవలననె కదా వాడావిధమగు హానిని బొందినది. కాబట్టివిషవిరాజితమూర్తులై గర్హులైన యీదుర్మార్గుల మనముముందరి జేరనీయగూడదు. సంభాషణసేయగూడదు. "దుష్టందూరేచవర్జయే" త్తన గాదు దుర్మార్గునిదూరమునందె విడువవలయునని యర్దము. కాన మనకాకుమతులను దూరమునందే యుంచవలెను. మఱియు వారితో నెక్కువశత్త్రుత్వము న నుండరాదు. మిత్త్రత్వముతో బొత్తుగానుండరాదు. ఆదుర్జనులతో మనకత్యంతావసరము కలిగినప్పుడు తాత్కాలిక స్నేహమాచరింపవలెను. ఎక్కువ చెలిమి జేయగూడదు. చేసినదప్పక బాధకలుగగలదు. తమలపాకున సున్నమిసుమంతవేసినబాగుండును గాని యెక్కువవేసిన నాలుకబొక్కి కీడుగలుగ జేయదా? కాన నెక్కువస్నేహముపనికిరాదు. ఈశుమతులతొ సహవాసముచేసినయెడల మనము కూడ వారితోపములకాగలము. కుజనసహవాసము వలన దొషములలవడుననియు, సుజనసహవాసము వలన సుగుణములు కలుగుననియు నిదివఱకె చెప్పి యుంటినిగదా. అదిగాక సుజనుల తోడ గలహము పెట్టుకొనుటయైనను మచిదికాని చెడుగులతో జెలిమి జేయుట జేటని మనయార్యులు నొక్కిచెప్పిరి. అనగా దుర్జనమైత్రి యెంతమాత్రము మంచిదికాదని వారి 120
బా ల నీ తి.
ముఖ్యాభిప్రాయము, కాన మనము దుర్మార్గగుణములున్న నవి విడిచిపెట్టి సన్మార్గమవలంబించి దుర్మార్గసంసర్గమును విడనాడి సన్మార్గులసహవాసము జేసిజననుతులమగుచుందము.
క. తగునిదితగదని యెదలో
వగనక సాధులకు బేద♦వారలకెగ్గుల్
మొగిజేయు దుర్వినీతుల
కగు నని మిత్తాగమంబు♦లైన భయబుల్.
(భారతము)
సత్ప్రవర్తనము.
మంచినడవడి కలిగియుండుటయెసత్ప్రవర్తనమనబడు.
ఈసత్యప్రవర్తనగలిగినవారికి బనులన్నియు ననుకూలించును. వీరితరులకు వంద్యులుగాగలరు. పరోపకారధురీణులునుగాగలరు. ఈసత్ప్రవర్తకులకున్న సౌఖ్యము లొరులకుండవు. కాబట్టి ప్రతిమనుజుడు సత్ప్రవర్తనగలిగియుండవలెను.
లోకమున బ్రతివాడును, తానుసద్గుణములుకలవాడనియు, దాజేయుచున్నపనులన్నియు, దానుసత్ప్రవర్తకుడనియు దలచుచుండును. కానియిదియసంగతము. ఎట్లన? దొంగ, తానుచేయు దొంగతనము మంచిదనిత