70

బా ల నీ తి.

ధర్మరాజునకిచ్చి గదాదులను భీమార్జునులకొసంగి ధర్మరాజుచే సత్కృతుండై చనెను. ఈసభను బోలుటకు దేవేంద్రాదిసభలును గొఱగావని నారదాది మహర్షులు వచించిరి.

    కనుగొంటిరా! ఆమయునికృతజ్ఞత యెట్టిదో! మఱియు నెటుల నాయుపకారులకు మేలొనరించెనో! కావుననే యామయుడు కృతజ్ఞత యందున బ్రసిద్దిని నంది యున్నాడు. కాన మనముగూడ గృతజ్ఞతకల వారమై తిరిగి యుపకారులకు మేలొనరించుచు గృతలక్షణులమగుటకు బ్రయత్నమొనరించు చుందుము.

క.కృతమెఱింగి కర్తనుత్తమ
   మతుల సభల సంస్తుతించి♦మఱవక తగన
   త్కృతిసేయుడె కృత్మఱిగెడు
   పతియె జగజ్జనుల నెల్ల♦బరిపాలించున్

(భారతము.)

దా న ము.

    అనగా నిరతులకు ధనముగాని యుపయోగ మగు వస్తువుకాని యిచితముగా నొసంగుటయు, మఱియు నభయమిచ్చుటయు నని యెఱుగదగు.
ఈదాన మెక్కువగాజేయువారలు వదాన్యులని చెప్పబడుడురు. సామాన్యముగా దీనులై, యకుటిల స్వభావులై

71

బా ల నీ తి.

మనదగ్గఱకు మంచియాచకులు వచ్చినయెడల వారికి నేమియు నియ్యక వ్యర్దముగా వెడల గొట్టక సంభావించి యధాశక్తి దానమొసంగుట వివేకునిలక్షణము తానాపదల బొందుచున్నను ధర్మమునుమాత్రము విడనాడగూడదు. భయముకల వాడై శత్రువువచ్చి తన్నుశరణు బొందినయెడల వానికభయదానం లొసంగి రక్షింపవలయును. దానము జేయునపుడు ప్రతివారును బాత్రాబత్ర విచారణజేయుట ముఖ్యము. పాత్రమనిన యోగ్యము. అపాత్ర మనిన యోగ్యము కానిది. ఎటువంటి వారలకు దానమొసగవలెనన? వేదములను, వేదాంగములను, జక్కగా సుస్వరముతో బఠించిన వారును, నకల్మషల్మనస్కులును, నగు నవధానులకును, సంస్కృతభాషనభ్యసించి సత్ప్రవర్తన కలిగినవానికిని, విద్యావిహీనులైనను సద్గుణులకును, గుటుంబము కలవారికిని దాన మొసగుట పరమార్దమన జెల్లు. ఆకలిచే బాధపదుచునన్నముబెట్టుమని మనకడకు వచ్చినవా డేజాతివాడైనను వానికన్నదాన మొనరించుటయు బరమార్దమన జెల్లు. ఈ పైవారలకు దానముగా నొకవస్తువునిచ్చినను నన్నమును బెట్టినను వారినినాపదనుండి రక్షించినను బ్రయోజనముకలదియగును. తదితరులకు దానమొసంగిన నిష్ప్రయోజనమ యగును. ఎటులన? పిసిని తనముగలిగిన యొకని కొక వస్త్ర మిచ్చితిమని యనుకొనుడు, వాడుమనమిచ్చినవస్త్రమును దీసికొని
72

బా ల నీ తి.

యావణవీధికరిగి యమ్ముటకు జూపును. కాన మనమట్టివానికి దానముచేయరాదు. మనమొక ధనవంతునిబిలిచి సంబావించి పదిరూప్యములిచ్చితి మని యనుకొనుడు. వాడుతాధనవంతుడనని గర్వించుచు మనమిచ్చిన దానిని నిర్లక్ష్యముచేయుచు సపహసించు చుండును. కాన ధనవంతులకు దాన మొనరించ గూడదు. దురభిమానియగు నొకనిని విందునకుబిలిచిషడ్రసోపేతంబగు పరమాన్నంబు బెట్టితి మని యనుకొనుడు. వాడు మనమిడినవిందును నెందుకు గఱగానిదానిగా నొనరించుచు దననెచ్చెలుల వద్ద వదరుచుండును. కావున దురభిమానులకు దానము గావించ గూడదు. వీరలకు దాన మొసంగుట "నీటిలోనివ్రాతయె" యని నమ్ముడు. సుగుణములతొ గూడికొనిన బీదవారల కన్నమిడినను దబ్బు నిచ్చినను మరియేదానము జేసినను ఫలవంతమ గును. తగినకాలమునందు జక్కనిపనిజేసిన నేదియైనను ఫలించును గదా. కానధనికి దురభిమానికి, వాచాటునికి, గ్రుద్ధునికి,లోభికి, దానము ముమ్మాటికిని చేయ గూడదు. మంచివారలకు జేయుచుండవలెను.

ఇటుల దాన మొనరించుట మనుజుల కేకాకసత్స్వభావముగల తిర్యగ్జంతువులకు దానము జేయవచ్చును. ఇదియుగూడనుత్తమము. వీనికి దానముచేయుట యెట్లన? చీమలు మొదలగు మంచిపురుగులకు చక్కెరమున్నగు మధుర పదార్దములు జల్లుచుండవలెను. పశువులు నీరుత్రాగునటుల దటా
(10)

78

బా ల నీ తి.

కము నొకదానిని ద్రవ్వించి వానికాహారార్దమై గడ్ది మొదలగువాని నియ్యవలెను. పక్షులు, వసించుటకు గూళ్లనిర్మించి యవితినుటకు దగినపదార్దములు నిచ్చు చుండవలెను. సాధుస్వభావముగలిగినమృగములకు దగిన యాహారపదార్దముల నిచ్చుచుండవలెను. ఇట్లు దానముజేయు వారల నుత్తములనిచెప్పితీర వలయును.

     మఱియు నేప్రాణి యైనను భయముకలిగి తన్ను శరణుజొచ్చినయడల యధాసామర్ద్యముగ నభయ మొసంగి రక్షించవలయును. ఇదియే వధాన్యుని లక్షణము.ఇదిలేని వాడు జాతకానేరడు. 
యోగ్యుడు దానమునీదలచిన వానినినెవడు నాపలేడు. హీనుడు దానమీయదలచియు నొకనిబోధకు లొంగిదానమియ్యక యాగిపోవును. వీడపకీర్తిపాలు కాగలడు. మఱియు లోకోపకారము లగు దానములు కొన్నిగలవు. ఈదానముల నొనరించినవారి నామములు బహుకాలము ప్రచారములో నుండగలవు.వీనివలన బరలోక సౌఖ్యము కలుగును. కాన వాని నాచరించుటకు బ్రయత్నించవలెను. ఆదానములేవియనిన? విద్యార్ధు;ఇ చదువు కొనుటకై విద్యాశాలలు నిర్మించుట చెఱువులుద్రవ్వించుట, తోటలువేయించుట, సత్రములుగట్టించుట, దేవాలయములు బ్రతిష్టించుట, వైద్యశాలలు స్ధాపించుట,పుస్తకపత్రికాపఠనశాలలు నెలకొల్పుట, సత్కృ
74

బా ల నీ తి.

తినందుటయు మొదలగునవి వీనినిజేయుటకు దమకు శక్తిలేనియెడల జేతనైనంత సహాయము ఛేయవలెను. వీరలు కీర్తివంతులకి కించిత్తుకూడ సందియము లేదు.

   మనకున్నదానిలో గొంచెమిచ్చినను పేదయెక్కువగా నానందమందుననియు మనకున్న దానినంతయు నిచ్చినను ధనవంతుడామోదమును జెందడనియు, నభయదానంబొసంగిన నేప్రాణికయై నను సంతోషించుననియు మనము తెలిసికొనవలయును.
    ఇటులదానమొసంగి కీర్తిగాంచినవారలు మనపూర్వులలో జాలమంది కలరు. వారిలో నొకరిని జూపించుచున్నాను. సకలనీతివిశారదుడగు శిబియను రాజర్షి యజ్ఞంబమోఘంబుగా జేసినసర్వజనులకును మృష్టాన్నమిడియధ్వర్వులు సంతోషించునటుల దక్షిణ లొసగి చేయదగిన దానంబులెన్నికలవో వాని నన్నిటిని యధావిధిగా నొనరించి లోకముచే "లోకోత్తర దాతృశిఖామణి" యని బిరుదమునంది యుండెను. ఈ సంగతి  స్వర్గలోకంబున విని వెఱగంది యింద్రుడును, నగ్నియు, నీతనిగుణంబుల బరీక్షించుటకై తలంచిరి. తరువాత వారిద్దఱిలోనింద్రుడు డేగయై యనలుడు పావురమై బయలుదేఱిరి. ఆడేగవలన నీపావురము భయమొందుచున్నట్లు పరుగిడును. ధర్మజ్ఞానుడగు నాశిబి చక్రవర్తిని శరణు జొచ్చెను. అటుతరువాత నాస్యేన మాకపోతమును దఱుముచు  వచ్చుచుం
ట నాకపోతమాశిబిమహారాజు సమీపమున నుండుట

75

బా ల నీ తి.

గాంచి కర్తవ్యమేమియుతొచక యారాజుతో "రాజా నీవు సకలధర్మవేదివని వినియుంటిని. కాన బ్రస్తుత మాకలిచే మిక్కిలి బాధపడుచున్న నాకాహార విఘ్నము సేయదగునా? మఱియు "స్యేనా,కపోతాన్ ఖాదయన్తి" అనగా " డేగలు పావురములను భక్షించు"నను వేదవాక్యానుసారంబుగా నాకాహారంబుగా నున్నదీపావుతము.నాభార్యయు, పిల్లలు, నేను, నీకపోతాహారములేనియెడల జీవించలేము. నీవొక జీవమును రక్షించుట కనేకజీవముల హింసబెట్టుటధర్మమేనా?" యని యడిగను. అంతనావదాన్యుడు "నీవుచెప్పినదంతయు సత్యమే? కానిప్రాణభయముచే వచ్చి రక్షించుమని కోరినది. ఇట్లాశ్రయించినదానిని వెడలుగొట్టుట దర్మమేనా? చెప్పు"మని యడుగుచు"నీవుపక్షివైనను దర్మమెఱింగినటుల మాటలాడుచున్నావు. కాన నీకాననంబున నుండు మృగంబుల మాంసంబులదిని నీయాకలిని దీర్చుకొనుము. కాని యీకపొతముపై నిక నాశ విడువుము"అని పలికెను. అంత నాడేగ "రాజా! నేదినదగిన దిదియే. దీనిని రక్షించుటకు నీకిష్టమున్న నీమాంసంబు నాకాహారంబుగాని"మ్మని పల్కెను. వెంటనే యారాజు తనకత్తితో దన శరీర మంతయు నాడేగకాహారంబుగా నొసగెను. అంత నాడేగ పావురములారూపములవీడి తమ నిజ రూపములదాల్చి యారాజుతొ "మేము వానవాగ్నులము,నీదానమునకు, నీధర్మబుద్దికి మెచ్చితిమి. కాననీకీర్తి
76

బా ల నీ తి.

బ్రహ్మాదులున్నంతవఱ కనశ్చరమైన వృద్ధిజెందుగాక, నీశరీరము యధాప్రకారముగా నుండుగాక, యని యాశీర్వదించి తిరోధానమైరి.

    కాంచితిరా! ఆశిబిచక్రవర్తియొక్క దానము, ధర్మబుద్దియు, ఆమహారాజార్తత్రాణ పరాయణ నిమిత్తమై తనశరీరమునుగూడ గోసియిచ్చెనుగదా. ఆహా! ఏమియాదానము! ఆయార్తత్రాణపరాయ ణత్వ ము. కాబట్టియె, వాననాగ్నుల పరీక్షించి మెచ్చి యనేక విధముల నాశీర్వదించిరి. సామాన్యులకిటుల గొప్పవా రల దర్శనము కాగలదా? కాదు. కాన మనము మంచివారలకు దానముచేయుచు లోకోపకారములగు దానము లొసంగుటకు బ్రయత్నముగావించుదు దీనిలకబయదానంబొసంగి కాపాడుచు నెక్కువకీరితి గాంచు చుందము.

తే.చెల్లియుండియు సైరణ♦సేయునతడు
    బేదవడియును నర్దికి♦బ్రియము తోడ
    దనకు గలభంగినిచ్చున♦తండు, బుణ్య
    పురుషులని చెప్ప రార్యులు♦గురువరేణ్య

(భా ర త ము.