బాల నీతి/ఆశ
బా ల నీ తి.
ఆ శ.
ఆశయనగా నొకదానినిగోరుటయే.
89
బా ల నీ తి.
టికి నిరసించుచున్నాను. కారణమేమన? ఈదురాశ, విషవృక్షముతొ సమానముకాబట్టియే!. విషవృక్షతుల్య మగు నీదురాశను గోరినవారల కది విషఫలముల నిచ్చుచుండును. వానిని దినినచ్వారలగతి జెప్ప, వ్రాయ, నలవిగాదు.
ఈదురాశ, యొకతల్లికిబుట్టిన కొమరులను విడదీయుచున్నది. వారలను న్యాయసభలకెక్కించు చున్నది. అంతవారిచే సొమ్మునంతయు నమ్మొనరింప జేయుచున్నది. మఱిల్యు తండ్రికొడుకులకు దలపట్లు పట్టించుచున్నది. జనులయైకమత్యమును ధ్వంసము సేయుచున్నది. ఇది,యది, యననేల? ఈదురాశ, సుఖములనెల్ల జిటికలో బాపి యనేకకష్టముల జేయించగలదు. ఓకవేళ మనము దురాశకులొంగి చేయదగనిపనుల జేసిన నవి మననాశనమునకె కారణములగుచుండును. దురాశ గలిగిన వారలకు దృప్తియుండదు. దృప్తిలేనివారల కొకకాసైన (పైసలో 5 వవంతు) నివ్వగూడదు. ఒకసమయమున నిచ్చినను నది బూడెదలో నాజ్యముబోయుటయె యగును. దురాశగలిగినవారలు, తమసామర్ద్యముల తుఱ్తెఱుగక గొప్పగొప్పపనుల జేయ నుంకించు చుందురు. ఇటుల బ్రయత్నించుట "అందనిమ్రాని పండ్లకు నఱ్ఱులుజాచుటయె" యగును. దానివలన నితరులనగుబాటుకు లోనగుచుందురు. మఱియు నవమానముల కొడి గట్టవలసివచ్చును. బా ల నీ తి.
అమూల్యములగు బాల్యయౌవనములుగడచి వార్దక్యమువచ్చినను నాసమత్రమువిడనాడక యుందురు. ఈ యాశకంతమేలేదు ఇట్లంతములేని యాశ మనముగలిగియుండగూడదు. కలిగినయెడల నిడుములబడగలము. ఇటుల దురాశవలన నిడుములబడినవారల కొందఱు కలరు. వారిలో నొకనిని జెప్పుచున్నాను.తొల్లి దుర్యొధనమహారాజు దురాశచే బిన్నవారలను, దనపినతండ్రికుమారులను నగుధర్మరాజాదులకు భాగమెగవేయదలచెను. అందువలన దగినపటోపాయ ముల ననేకములు జేసెను. అవియన్నియు వ్యర్దము లాయెను. తుదకు ధర్మాత్ములగు నాధర్మరాజాదులను జంపనెంచెను. అందునకు దగినదురాలోచనము దురాత్ములతోడ నొనరించి తనతండ్రినే నాధర్మరాజాదులు కాశీపట్టనమునకుజనునటుల వారికి జెప్పించెను. తదుపరి యదుర్యోధను డావారణావతమున ధర్మరాజాదులు నివసించుటకై తననెచ్చలియగు వురొచనునిబిలిచి రహస్యముగా వానితో "నీవు ముందుగా గాశీపట్టణమునకుబోయి నయనాభిరామ ముగా నొకలక్కయిల్లుగట్టుము. మఱియు నీవుకట్టిన లక్కయింటిలో వారేమఱి కాపురముజేయుచుండు తఱి నాయింటికి జిచ్చుపెట్టి వారిని దగ్దులనుగా జేయు" మని పంపెను. అంత నతడటులసేయుటకు జని లక్కయిల్లు సొగసుగాగట్టి సిద్ధముగా నుండెను. తరువాత ధర్మరాజాదులు తమ పెదతండ్రిగారి యానతిని శిర
91
బా ల నీ తి.
పోవహించి గురుకురువరులయాజ్ఞగైకొని యావారణా వతమ్ము నకుజని యాలక్కయింటిలోనె జాగరూకులై సుఖముగా గాపురముజేయుచుండిరి. కొలదికాలమైన తరువాత నీతివిశారదుడుడగువిదురుడు ఖనకుడను నొకనిని బిలిచి నాతో "నీవు వారణావతమ్మునకుజని పాండవుల జేరి పరమరహస్యముగా నీబహుళచతుర్దశీ దినమున రాత్రియందు బురొచనుడనువాడు మీరున్న లక్కయింటికగ్గిపెట్టి మిమ్ములను దగ్దులుగాజేయ గలడు. కాన జాగ్రత్తతో నుండుడని వారికి జెప్పవలసిన" దని పంపించెను. అంతనాఖనకుడటులనేచేసెను. అంతట భీముడానియమితదినమున రాత్రియం దాపురోచను డాయింటికగ్గిబెట్టకమునుపె యాపురొచ నాదు లాయింటిలోనే గాఢనిద్రబోవుచుండెడిసమయ మున నాలక్కయింటికి జిచ్చుబెట్టివిదురుని పంపున వచ్చిన ఖనకునికి దమక్షేమము దెలియబఱచి తనయన్నను, దమ్ములను, దల్లిని, దనపైనిడికొని యొక బిలమునుసొచ్చి యొకచొ సుఖముగాజేసెను.
చాచిరితిరా! ఆదుర్యోధనుడు దురాశచేత బిన్నవారగుపినతండ్రి కుమారుల భాగమున కెగ నామము బెట్టదల చెనుగదా! తుదకు వారిని జంప దల చెనుగదా! దానికి దగినయుపాయ మాలోచించి పురొచనునిచే లక్కయిల్లు గట్టించి వారిని నాశనము జేయుమని యాపురొచనును కుపదేశమొనరించి పంపించెనుగదా. అతడావిధమున చేయుసమయము ను వేచుచుండ నింతలో భీముడు తెలిసికొని యాపు బా ల నీ తి.
రోచనుడు పెట్టకమునుపె తానగ్గి నాయింటికంటించి వారిని దగ్దులనుగా నొనరించి మాతృసోదరసమేతముగా సుఖముగా నొకచోజేరెనుగదా. ప్రస్తుతము దురాశవలన బెడిసినదెవరు? దుర్యోధనుడేగదా. ఈతడుతన్ను గట్ట ద్రాళ్ళు తానెతెచ్చుకొనెనుగదా. వీని కీదురాశయె లేని యెడల బాగుపడునుగదా. కాబట్టి దురాశ గలిగించ్వరలు దు:ఖభాగులగుదురు. కావున మనము దురాశవిడనాడి తరినయాశ కలిగియుంది సత్కార్యము ల జేయుచుందము.
క. అది సర్వదోషముల కా
స్పద మది దురితక్రియాను♦బంధంబులకున్
మొదలు నిరంతర దు:ఖ
ప్రదమని మదిదలచి తృష్ణ♦బాతురు సుమతుల్
(భారతము)
---
అ హం కా ర ము.
నేనేశ్రేష్ఠుడననుబుద్ధిని జనింప జేయునది యహంకారమనబడును.
ఇది, తన మాట కెదురు మాటాడక యుండునపుడును లోకము తాజెప్పుదానిని విశ్వసించి యాచరించుసమయమునందును, మఱియు నొక చిషయమున దానధికుడని జనులచే బొగడ్తజెందినపుడును జనించుచుండును.