బాలవ్యాకరణోద్ద్యోతము

బాలవ్యాకరణోద్ద్యోతము గ్రంధకర్థ: వజ్ఝల చిన సీతారమ స్వామి శాస్త్రి. ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడిమి, కళాభవన్, సైఫాబాద్. హైదరాబాదు. 4 ద్వితీయ ముద్రణము: నవంబరు 1977

పరిచయము

తెలుగు వ్యాకరణ ముని త్రయములలో చిన్నయసూరి, బహుజనపల్లి సీతారామాచార్యులు, పాణిని, కాత్యాయన స్థానియులైనచో, శ్రీ శాస్త్రిగారు పతంజలి స్థానీయులని శిష్యులచే కీర్తించ బడిన మహా భాష్యకారులు. వీరు బాల, ప్రౌడ వ్యాకరణములలోని దురుక్తములను సవరించుట అనుకములను చేర్చుటయేగాక, తెలుగు విద్యాఅర్థులకు ఆవస్యకమైన సర్వ సంస్కృత వ్యాకరణాంశములను కూడ వివరిచుట చేత ఈ వాల వ్యాకరణోద్ద్యోతము తెలుగు విద్యార్థులకు అత్యంత అవస్య పఠనీయ గ్రంధము. గ్రంధకర్థ తన కృతి సమర్పణలో కంద పద్యంలో ఏమన్నాడో చూడండి.

కం. బాలావ్యాకరణోద్ద్యో, తాలోకన ముభయభాషలందును వ్యాకృ, త్యాలోడన ఫల మీయం, జాలుట నిది శబ్దశాస్త్ర సర్వస్వమగున్.

మరియు: ఆంధ్ర సంస్కృతంబుల లక్షణ జాలమిందు పరగుచున్నది సూరి లోపములు దీర్చు నిట్టి దీని సాటి వ్యాకృతులు గలవే? అని కూడ అన్నాడు. వివరణయనదగు త్రిలింగ లక్షణ శేష మందును కొన్ని యుప సిద్ధంతములు, లక్షణ విరోధములును, నుండుత చే... ఆంధ్ర గ్రాందిక వాగ్మయ స్థలములగు పెక్కు లక్షణములు పేర్కొన బడలేదు. లక్షణ విరోదములను, నపసిద్ధంతములను విద్యార్ర్థుల మనమునందు నాటుకొనొన మర్మాదాఅరము. కాన నందలియుప ప తిస్షంతములను లక్షణ విరోధములను తొలగించి , బాలవ్యాకరణ ప్రఊడ వ్యాకరణములయందు పేర్కొన బడని లక్షణ విశేశ్హములను జేర్చి... మిగిల బాల వ్యాకరణ విషయములను నిల్పి రచించుట విద్యార్తులకత్యం తోపోకారక మగునని తలంచి యీ బాలవ్యాకరణోద్ద్యోతమును రచించితిని. అని కూడ అన్నాడు.

వ్యాకరణ విషయాలను వివరిస్తూ........ ఱ .. ట వివరణ.

ప్రాచీన కాలమున 'ఱ ' కారము 'ట - త ' మధ్య స్థోచ్చారణము గల్గి యుండెడది. కావుననే కుఱు + ఉసురు = కుట్టుసురు మున్నగు నెడల 'ట ' కార స్థితి సంభవించెను. కాని నన్నయ నాటికె దాని కలఘురేఫోచ్చారణము గల్గెను. దానికే కాక ల కారమునకును నలఘాచ్చారణము సంభవించెను. అట్లగుట చేతనే లఘు 'య, వ ' లతో పాటుగ నలఘు ' ఱ - ళ ' లకును వర్ణమాలలో, బృథగ్గణనము చేయలేదు. అట్లయినను నితర ద్రావిడ మహాకవ్యను రోధమున దన భారతభాగమున నన్నయ 'ర - ఱ ' యతి ప్రాసమైత్రిని జేయలేదు. తక్కిన కవులెల్ల నేదో యొకతీరున వాని మైత్రిని జేసిరి.

'ఱ ' కారము నన్నయనాఆటికె తెలుగున నశించినది. అది 'డ ' కారముగనో (ఏడు = ఏఱు) ' ల ' =(ళ) కారముగనో (తమిల = తమిఱ) (హోసగన్నడమున పఱగన్నడ 'ఱా ఆరము 'ళ ' కారముగ వరిణమించెను) పరిమణించెను. కాననే దానిని నన్నయ యచ్చాంద్ర వర్ణమాలలో బరిగణిపలేదు. కాని నన్నయకు బూర్వపౌ యుద్దమల్లుని బెజవాడ శాసనమున నది లిఖింపబడి యున్నది. (అఱిసిన - ఱస్సిన) ఇట్టి యలవాటుననె నన్నయకు దర్వాతి పొందున గ్రామ శాసనమందును (ఖఱ్గ = ఖడ్గ) నది లిఖింప బడెను. తమిఱమందు నేటికిని నట్టి వర్ణము నుచ్చారణము గలదు గాన దాని నచ్చ తెలుగున నిల్పితిని.

అర్థానుస్వారాన్యదేశ్యములు.

ప్రాచీనతమ కాల్లమున నర్థానుస్వారము చోట బూర్ణానుస్వారమఏ పల్కబడేడిది. కాలక్రమమున నయ్యది తేలి నన్నయ నాటికి అర్థానుస్వారముగ గొన్నిట నేర్పడెను. నన్నయ భారథాగమున మాత్ర మర్థానుస్వార ప్రాసము నియమితముగ గలద. ప్రాచీనకాలపు వాసనచే నన్నయకు దర్వాతి కవులను గొందఱు ఖండానుస్వారము చోట దీర్ఘము మీద సైతము పూర్ణమునే ప్రాసములలో బ్రయోగించిరి. ఉదా: కం. పోడిగ నగజతపశ్శిభి| మూడు జగంబుల.... బ్రహ్మాండ...... నన్నయ చింతామణిలో బూర్ణార్థములు పేర్కొనబడెను. అట్టి పేరులే వాని యాకారమునకు నిరూపకము లనదగును.

నన్నయ కాలమునకు దురుష్కులు, ఆంగ్లేయులయు భాషలు తెలుగున వ్రవేశించుట కవకాశము లేకుండుట చేత నన్నయ చింతామణిలో నన్యదేశ్యమను బేర్కొనలేదు. తన భారత భాగమున బ్రయోగింపను లేదు. తన భార భాగమున బ్రయోపను లేదు. యయాతి చరిత్ర, మను చరిత్రాదులలో నన్య దేశ్య {తురుష్క) శబ్దములు ధారాళముగ వాడబడినవి. కాన నేటి వ్యాకరణములలో నన్యదేశ్యము నొకభాగముగ నంగీకరించుట యుక్తము. అట్టి యన్య దేశ్యములలో యానాంధ్ర వర్ణములను దొలగించి నానిచో దత్సన్నిహితాచ్చాంధ్ర వర్ణముల నిల్పుట యుక్తము. అట్టి మార్పు చే నర్థస్పూర్తి ప్రతి బంధము గల్గు చో నట్టి యనాంధ్ర వర్ణముల నిల్పుటయు యుక్తమె. (షరా.... షరతు.. మెదలగు) కొన్ని యన్యదేశ్యములు: టాణా = (ఠాణా), టలాయించు =- ఠలాయించు, టికానా = ఠికానా, పాయిదా = ఫాయిదా, పిర్యాదు = ఫిర్యాదు, సరాబు = షరావు, సికారు = షికారు, హాసజు , హుకుము, హుజూరు మొదలగునవి. ఆంగ్లంము; కాపీ = కాఫీ, పీజు= ఫీజు, రైలు ' రోడ్డు కలెక్టరు మొదలగునవి.

హ్రస్వ దీర్ఘములమీద ఖండము. దీర్ఘముమీద సాధారణముగా పూర్నము నిల్వదు. అనిర్దిష్ట బిందు విధాన స్థలములలో దీర్ఘముమీద ఖండమునె నిల్ప వలయును. (సూరి 'దీర్ఘము మీద సాధ్య పూర్ణము లేదు ' అని సూత్రించుట సరి కాదు. దీర్గము మీద సిద్ధ పూర్ణము మాత్రము ప్రచురముగా నిల్చునా? ఉదా: వాడు, వీడు మొదలగునవి. మఱియు తేంట్లు =(తుమ్మెదలు), ఏండ్లు, పూండ్లు, విలుకాండ్రు, ఆండ్రు మున్నగు పెక్కు చోట్ల సాధ్య పూర్ణములు గలవు.

పూర్ణము నిల్వని సిద్ధ స్థలములు: సైచు , తోచు, ఆకలి, వేడు, సాధ్య, స్స్థలములు. వాడు- వీడు - రాడు, లేడు గోగులు, రేగులు కాబట్టి, కాబోలు, నాతో బల్కె మొదలగునవి.

అచ్చతెలుగున బరుష సరళ పూర్వకమె బిందువు

సంస్కృత సమఏతరములైన తెలుగు శబ్దములయందు బరుష సరళములకు ముందే బిందువు కానంబడు చున్నది. వంకర, కలకువ కలత, మంచు, త్రాచు, దంట, జంట, చాటు, కొంత, కోత ఇత్యాదులు. ఈ సూత్రపు నియమము చేత విందు పూర్వకత్వమున 'డ ' కారమునకు 'ల ' కారాదేశము మున్నగు విధులు వర్తిల్ల నేరవు. ఉదా: ఏడులు = ఏండ్లు, బండులు = బండ్లు,

చిన్నయసూరి తద్భవములందును శకటరేఫము లేదనెను. ఒక్క నన్నయ తద్భవములందు శకటమును ప్రయోగింప లేదు. కాని పెక్కురు మహాకవులు ప్రయోగించిరి.

తత్సమ లక్షణము

సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు.

సంస్కృతప్రాకృత సమములు
1. ఆంధ్రవిభక్తి యోగము, చన్నిమిత్తకము లగు మార్పులను దప్ప నితరములగు మార్పులు శబ్డావయవమున జరుగని సంస్కృత శబ్దములు సంస్కృత సమములు. అట్టి పాకృత శబ్దములు ప్రాకృత సమములు. ఉదాం; సం. సమ ఽ రాముడు (రామ) పిత (బితృ - పితా) రాజు (రాజన్ , రాజా) బుద్ధిమంతుడు (బుద్ధిమత్ - బుద్ధిమాన్) మొదలగునవి.
తద్భవ లక్షణము

సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబ;

ఉదా: సంస్కృతము.... సంస్కృతభవము : ఆకాశ: ఆకసము, కుడ్యం, గోడ, ముఖం, మొకము, మొగము హరణం ... అరణము మొ||

ఈ విధంగా గ్రంధకర్త తన గ్రంధంలో ప్రతి వ్యాకరణ సూత్రాన్ని పరిశీలించి పరిశోదించి సోధాహరముగా విశిదీకరించారు.