బాలకృష్ణ అష్టకము

బాలకృష్ణ అష్టకం

మార్చు

నీల యత్కుచేల మౌని పాలితం కృపాకరం
నీళ నీళ మింద్ర నీల నీల కాంతి మోహనం
బాల నీల చారు కొమలాలకం విలాస గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 1 ||

ఇందు కుంద మందహాస మిందిరా ధరాధరం
నందగోప నందనం సనందనాది వందితం
నందగోధనం సురారి మర్దనం సమస్త గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 2 ||

వారిహార హీర చారు కీర్తితం విరాజితం
ద్వారకా విహారమం భుజారి సూర్య లోచనం
భూరి మేరు ధీరమాది కారణం సుశేవ్య గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 3 ||
 
శేష భోగ శాయినం విశేష భూషణోజ్వలం
యోషమాన కింకిణీ విభీషణాది పోషణం
సోషనాక్రుతాంభుదిం విభీషణార్చితం పదం గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 4 ||
 
పండితాఖిల స్తుతం పుండరీక భాస్కరం
కుండలప్రభాసమాన తుండ దండ మండలం
పుండరీక సన్నుతం జగన్నుతం మనోజ్ఞకం గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 5 ||
 
ఆంజనేయ ముఖ్యపాల వానరేంద్ర కృంతనం
కున్జరారి భంజనం నిరంజనం శుభాకరం
మంజు కంజ పత్రనేత్ర రాజితం విరాజితం గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 6 ||

రామణీయ యజ్ఞ ధామ భామినీ వరప్రదం
మనోహరం గుణాభిరామ ఉన్నతోన్నతం గురుం
సామ గాన వేణు నాద లోల మర్జితాస్తకం గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 7 ||
 
రంగ దింది రాంగ మంగళాంగ సౌర్య భాసదా
సంగ దాసురోత్తమాంగా భంగక ప్రదాయకం
తుంగ వైరవాభి రామ మంగళామృతం గో
పాల బాల జార చోర బాలకృష్ణ మాశ్రయే || 8 ||
 
బాలకృష్ణ పుణ్యనామ లాలితం శుభాష్టకం
యే పత్తంటి సాత్వికొత్తమా సదా ముదాచ్యుతం
రాజమాన పుత్ర సంపదాది శోభనానితే
సాధయంతి విష్ణులోక మభ్యయం నరాష్ట తే || 9 ||