బసవరాజు అప్పారావు గీతములు/యమునా సాంత్వనము
యమునా సాంత్వనము
ఏలా పాడే నింక యమునాకళ్యాణి, నే
లీలామానవుడు గోపాలుడు లేడాయె? ||ఏలా||
బంగారు గనులలో
చెంగలించే వేళ
పిడుగు బోలినవార్త
వినిపించినా రయ్యొ ||ఏలా||
చెడువార్త వినగానె
చెవులు గింగురుబోయె
ఎంత చించుకొన్న
గొంతు పెగలదాయె ||నేలా||
వెన్నెలకు తోడు మా
వేణుగోపాలుడు
కన్నుల పండువుగ
కనిపించకుంటేనే ||నేలా||
ఈ నాటి యీ నేస్త
మే జన్మకో తిరిగి
కన్నీళ్ళు గారవకె
కడుపు చెరు వయ్యేనే
నేలా బాడే నింక యమునాకళ్యాణి, మా
లీలామానవుడు గోపాలుడు లేడాయె!
దగాయీత
"ఈదుతున్నా నీదుతున్నా
నీ సముద్రములో దగాగా
ఈదుతున్నా నడ్డగోలుగ
నీదు తున్నాను!"
"ఈదుతున్నా వా దగాగా
నీది నీవే అనుభవించే
వీదకోయీ అడ్డగోలుగ
నాద బోకోయీ!"