బసవరాజు అప్పారావు గీతములు/ప్రేమతర్కము
నను సృజించితివి నీ మనసొచ్చినట్ల
మిగులు ప్రేమించేటి మేటి శక్తిచ్చి
తిస్సి, నాచపలంపు హృదయ మేమందు
నిలను నందపువస్తువుల నెల్ల గోరి
కమలేందువదన నామముల రెండింట
నెది యందమైనదో యేర్పరుపలేము !
ప్రేమతర్కము
(శాఫోగీతము)
చావే మేలని యంటావే
దేవత లేటికి చావరురా ?
ప్రాణమె చేదని యంటావే,
బ్రతుకుదు రేలను దేవతలు ?
ప్రేమ వొట్తిదే యంటావే,
ప్రేమెంతురేల దేవతలు ?
ప్రేమె సర్వ మ్మంటావే,
ప్రేమింకేమి సేతుమురా ?