బసవరాజు అప్పారావు గీతములు/ప్రణయస్మృతి

ఆశయు సంశయ మ్మలమి నాదైన
యాలోలహృదయమ్ము నాడించుచుండె
అందరో యిండ్లకై యేగుదెంచెదరు
కాని నీ వింక దూరానెఉంటివిగా.
               -----

              ప్రణయస్కృతి
             (శాఫోగీతము)

  • [1]మున్నొకతఱి నా హృదయతల్పమున

పన్నుంటిని నీలరజత జ్యోత్స్నలు
నీ సొమ్మేయగు నిర్మలప్రేమను
నిలపై ఠీవిని నడువంగన్
పోయ న్నేడో చంద్రుడు, చుక్కలు
బోయె, నిశీధము వోవుచున్నది,
వేళ దాటిపోయె, పాన్పుపై నే
వేస్ట నొంటిగ బడియుంటిన్.

  1. *మున్నొకతరి నా హృదయతల్పమున

    బన్నుంటిని నీలరజత కౌముది

    యిలపై పచారుసేయగ నీ సొ

    మ్మే యగు నిర్మలప్రేమముతోన్