బసవరాజు అప్పారావు గీతములు/నిర్వాణసుఖము
వెనకజన్మలో యేమి
పెట్టి పుట్టితిమొ ?
బంగారుపండంటి
పసిబాల కలిగె !
పెట్టి యెవరిని యేమి
తిట్టుకున్నామొ?
ఇచ్చిన్న దైవమూ
మర్చిపోడాయె !
--
నిర్వాణసుఖము
నామంగళప్రదా ! నా చిన్నతల్లి !
మరువలేదే నిన్ను మాకన్నతల్లి !
ఉదయాన సూర్యు డీ సదనకాంతులలో
బంగారు నీమేనిచాయలే గందు !
మల మలా మాడ్చేటి మధ్యాహ్న వేళా
గల గలా గలమని క్రింద్ రలేటి
పండుటాకులుఇ పాట పాడుతుండగ
చిట్టీ ! నీయేడ్పు విని దద్దరిల్లేను !
మడమటా సూర్యుండు కుంకేటి వేళా
సందెకాంతులు కళ్లపండ గౌవేళా
వికసించి నవ్వేటి బీరపువ్వులలో
చిరినవ్వునీమోము చూచి మురిసేను !
వెర్రిలోకము సద్దు మణిగిన్న వనక
మత్తన్ని మబ్బు పొత్తిళ్లలో వొదిగి
బజ్జుని మింట వుయ్యాల లూగేటి
చెంద్రుణ్ణి నీమేని పట్టబొయ్యేను !
మాయదారీ నిద్ర మచ్చుఒడిజల్లీ
మనసు గొని దివ్యలోకాలన్ని దిప్పి
తుదకు దయచేసింది నా చిన్నతల్లి !
నీసన్ని ధనియేటి నిర్వాణసుఖము !
సంవత్సరాది
బాలభాస్కరా! అపుడే
వచ్చిన ఉగాదియంచు
బంగరు కిరణాల దుస్తు
లంగడు మరఉచు కలుకుచు !
గల గల మని వీచెడు చిఱు
గాలిపాట కలరియాడు
మావియాకులార ! మఱచి
పోవుదురే యింతలోనె
బన్నుండి భవద్ధర్శన
మ్ము;న బ్రహ్మానందమ్మును
గను ముద్దుల నాబిడ్డను ?
తోరణాల దూర నేగు
తొందరలో నున్నమిమ్మి
నాపబోను, లోలోననె
యావేదన నడచికొనెద !