బసవరాజు అప్పారావు గీతములు/నా జీవిత నాటకము

*[1]

మధురమధుయామినీపీఠ మధివసించి
        చల్లచూపుల జడ్జి మా చందురుండె
        నవ్వె తనపర్వు (పగ్గె) బుగ్గయినట్లు కొంటె
        రిక్కప్లీడర్లు నను జూచి పక్కుమనిరి.

నా జీవిత నాటకము

        ఈకపటనాటకాల నే నింక నాడ
        లేను, తెరదించుడీ, కొరగాని నాలి
        వేసముల వేసి, పొట్టకై మోసగించి
        పరుల యాచించి లాలించి బతకలేను.

        పుట్టినట్టి పౌరుషమైన పుటక మరిచి
        పరునికృతికి వేసముగట్టు పాప మేల ?
        నా విధురజీవితమ్మునే నాటకమ్ము
        జేసి ఆడించి జగతి రంజింపలేనొ ?

    • మధురమధుయామిని సీమ కధిపతియగు చల్లచూపుల రాజు మా చందురుండె నవ్వె తనపగ్గె బుగ్గయినట్లు కొంటె రిక్కకన్నెలు నను జూచి పక్కుమనిరి.