బసవరాజు అప్పారావు గీతములు/నాగుల చవితి
ప్రణయకలహము
రొంయి రొయ్యని పాడు తుమ్మెదా
నీవు
కయ్యాలు వద్దనీ తుమ్మెదా
ఆలిమొగులనందు కయ్యం తుమ్మెదా
నున్న
నద్దంమీద పెసరగింజ తుమ్మెదా
వెయ్యి తేనెబొట్లు బోస్తా తుమ్మెదా
చిట్టి
కయ్యాలు మానిపిస్తె తుమ్మెదా.
నాగుల చవితి
నీ పుట్టదరికి నా పాప లొచ్చేరు
పాప పుణ్యమ్ముల వాసనే లేని
బ్రహ్మస్వరూపులౌ పసికూన లోయి
కోపించి బుస్సలు కొట్టబోకోయి !
నాగులచవితికీ నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !
చీకటిలోన నీ శిరసు తొక్కేము
కసిదీర మమ్మల్ని కాటేయబోకు
కోపపుట్టలోని కోడెనాగన్న !
పగలు సాధించి మా ప్రాణాలు దీకు
నాగులచవితికి నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !
అర్ధ రాత్రివేళ అపరాత్రివేళ
పాపమే యెఱగని పసులు తిరిగేని
ధరణికి జీవనాధార మైనట్టి
వాటిని రోషాన కాటేయ బోకు !
నాగులచవితికి నాగేంద్ర ! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి !
అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ
నాగులకొండలో నాట్య మాడేటి
దివ్యసుందరనాగ ! దేహి యన్నాము
కనిపెట్టి మ మ్మెపుడు కాపాడవోయి !
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
పగ లనక రే యనక పనిపాటలందు
మునిగితేలేటి నా మోహాలబరిణె
కంచెలు కంపలూ గడచేటివేళ
కంపచాటున వుండి కొంప దీకోయి!
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
- _________________
ఏమొ
ఈ యగాధ నిశీధాన నెట్టయెదట
వెలుగు కన్పించెనని అదే కులకబోకు
కొఱివిదయ్యాలొ? యెవరైన నరులయొక్క
కరములం దుండు దీపాలకాంతు లేమొ?
ఈ యఖండసముద్రాన నేరి కోరి
సంచులకు నిండ దెస్తిని సంప దంచు