బసవరాజు అప్పారావు గీతములు/గురువర్య
గురువర్య.
పాడదలచిన పాట లన్నీ
నానోటె
పాడించ మనసాయెనయ్యా?
గురువర్య?
* నీవు నేర్పిన పాట
నీ సన్నిధినె నోట
పాడిచూపేకన్న
భాగ్య మేముందయ్య ||పాడదలచిన||
పాటలో దొల్లే
అపస్వరా లన్నింటి
సవరించుకొని నీవె
సద్దుకొని పోవాలి!
పాడదలచిన పాట లన్నీ
నానోటె
పాడించ మనసాయెనయ్యా?
గురువర్య!