బసవరాజు అప్పారావు గీతములు/కన్నెనోము
పారదోలి నడివీధిని పట్టాగలు,
నల్గు రెదుటను దానికి న్నవ్వుంబాట్లు
కల్గజేసి కౌతుకమును గాంచి చనుమ !
రమ్యముల్ ఫలభారనమ్రమ్ములైన
ఆంరనారంగ సీతాఫలాదివనము
లందగించు కాషాయజలాశయప్ర
వర్ధితము లౌచు పురికి నస్ల్వంకలందు !
--------
కన్నె నోము
*[1]( శాఫోగీతము )
కన్నెనై యెల్లపుడు కాలమ్ము బుత్తు
నీవు నా భరెతవు గావేని ప్రియుడ !
పరపురుషు డెవారున్ బడయడు నన్ను
ఇప్పటికేని యిం కెప్పడికేని.
ఈ వొక్కడివె సుమ్ము యేరగాగలవు
అతిసుకుమార మీ యందంపుసుమము
అద్దుకు, దివ్యమౌ నగరుధూపమ్ము
బలె, దీనితావి గాపాడు మెల్లపుడు
నీవె సుమి నాప్రేమ నెమ్మనమ్మందు
జ్ఞాపక ముంచుకోగలవు, రాగల్లు
కాలాల మోదమ్ము, గర్వమున్, శాంతి,
రాగమ్ముతో పవిత్ర మ్మొనర్వగదె !
-----
ప్రణయగానము
(శాఫోగీతము)
కదలేటి రెల్లులకన్న లోలను నేను,
వలపుచే నదిలోని జలమట్తు లైతి
మలయ వాయువుంబోలి యలమె నీపాట నన్
ప్రియుడ ! చపలంపు నాహృది యెల్ల వినెడు
ఇశ్శో యనిన కృంగి, ఈపు మోద మ్మంద
ప్రొద్దుతిరుగుడుపూవు జోలి పొంగును,
సౌందర్యపిపాస
(శాఫోగీతము}
అలల నురగలతోడి నాడేటిదేవ !
సర్వదానము లిచ్చు సంద్రంపురాజ !
- ↑ *శాఫో, గ్రీసుదేశపు కవయిత్రి