బసవరాజు అప్పారావు గీతములు/ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి

(వాయుసందేశమునుండి)

అల్లదే ఇంద్రకీలాద్రి, ఆకసమ్ము
పై కెగయబ్రాకు, నల్ల యా ప్రాతదుడిసె
పార్ధు డా శైలశిఖరాన పాశుపతము
బడయ శివుని గూర్చి ఘోరతపమ్ము జేసె!

కార్యశూరతి దక్కి నిర్వీద్యు లౌచు
కన్నభూమాతకును కళంకమ్ము గూర్చు
పరమనాస్తికు లిపుడు తప: ప్రభావ
మెల్ల బూటకమంచు నిందింతు రకట !
ఆ నగోత్తమమున కధిష్ఠాన దేవి
కనకదుర్గాభవాని లోకాలతల్లి
తొల్లి తన యుగ్రశక్తుల నెల్ల నొక్క
బాలసన్న్యాసి ఘనతపోబలముకతన
గోలు పడి, యొంటి నివ్సింప దాళలేక
స్త్రీజనోచిత కోమలప్రేమ చకిత
చిత్తయై, మొన్న మొన్ననే చెంత జేర
విభుని మల్లికార్జునని రప్పించుకొనియె !

ప్రాతదయ్యును నా వధూవ్రుల ప్రేమ
నవనవానందజనక మై భువనతతికి
ప్రగ నిత్యకళ్యాణమున్ పచ్చతోర
ణముగ సోభిల్లజేయు నన్నగనరమును !
ఆలయముప్రక్క కోనే రగాధమైన,
దప్స్రస్త్రీలు రాత్రుల నచట జలక
మాడి, దేవిని పూజించి వీడినట్టే
పసుపుకుంకుమ మస్థతల్ కుసుమము లవె !
ఆ కోని చెంతనున్న గుహాంతరముల
యుగములాదిగ మునివరుల్ యోగనిరతు
లై నిమీలితలోచను లగుచు లోక
స్ంగ్రహార్ధముగ తపమ్ము సల్పుచుంద్రు !
అద్రిశిఖరమ్ముపై కెరాతార్జునులు మ
హాహన మ్మొనరించిన యట్టిచోట
నేటికిని చిన్నె లగుపించు నాటివలన
విజయవాడ యుంచు పురికి పేరు కలిగె !
చుట్టు నున్నట్తి పర్వతాల్ పెట్టనట్తి
కోటలైయొప్ప శాత్రంకోట్ల కెల్ల
మిగుల దుర్భేద్యమై పండునగుచు కనుల
కలరు మా విజయునివాడ, చెలిమికాడ!

కాలువలు నల్గడల నలంకారములుగ
జెలగ, జలయంత్రనిర్గత జలకణాళి
మౌక్తికాహారభూషిత మందిరాంగ
ణోల్లవత్ పుష్పవల్లుల నొప్పుపుకము !
వారకాంతలు నివసించు వాడలందు\
గాన వృత్తానుకర మృదంగములదైన
స్నిగ్ధగ్ంభీర ఘోషము చెవులబడిన్
తోడనే మేఘరవమంచు దోచు నీకు !
భాగ్యవంతులు మేడల పాంపులందు
మందమతులట్లు పొరలాడుచుందు రకట !
అన్నమో రామచంద్రా యటంచు నేండ
నేడ్చు బీదవానికి నిల్వనీడలేదు !
కాంచుమా కృష్ణవేణీ, దుర్గాంబ పైడి
ముక్కపో గందుకొన పంత మూని వేగ
వచ్చు నాటోపముగ పరవళ్ళతోడ
చెంగలించుచు నార్చుచు భంగపడుచు !
ఇంద్రకీలాద్రి కాసింత సందు నీయ
కృష్ణవేణీ మోమోట మింతేని లేక
చీల్చి భేదించి ప్రవహించు చెచ్చెర నదె
చనువునిచ్చిన నెక్కెను చంక కనగ.