బసవరాజు అప్పారావు గీతములు/ఇంకెన్నాళ్లు?
ఇంకెన్నాళ్లు?
(పాట: యమునా కల్యాణి)
ఈ విధి నింకెన్ని నా
ళ్ళిలను నేను కష్టపడుట? (పల్లవి)
కామ్యపదవు లందకయే
వ్యామోహమ్మున దగులక నీవిధి||
దారేషణచే పరగతి
దలప కంధకారమ్మున నీవిధి||
చేజే నీకై కూర్చిన
రోజాపూదండ వాడి
మోజు సన్నగిల్లిపోయి
రోజులు చింతతో గడుపు చీవిధి||
మానవవాంఛా నిష్ఫలత్వము
ఆకసమ్మున చుక్క లల్లుకొనుచుండె
పక్షులు వినువీధి బర్వుచునుండె