ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/పండ్రెండవ అధ్యాయము
ప్రెంచిస్వాతంత్ర్యవిజయము
పండ్రెండవ అధ్యాయము
ఫ్రెంచి విప్లవము
(1)
టెన్ని నుకోర్టు,
శపధము,
1789 వ సంవత్సరము మే నెల 5వ తేదీన వర్సేల్సు పట్టణమున దేశ ప్రతినిధిసభయగు స్టేట్సు జనరలు సమావేశ మయ్యెను. అతి వైభవముతో పదునారవ లూయీ రాజు దానిని తెరచెను. 270 మంది ప్రభు ప్రతినిధులుసు 291 మంది మతగురువులుసు 564 నుంది. ప్రజాప్రతినిధులును హాజరైరి. ప్రజా ప్రతినిధుల పక్షమున ఫ్రెంచిజాతి యుండెను. మూడు శాఖ లును కలిసి యొకే సభగా చేరి చట్టములు చేయవలెనని ప్రజా ప్రతినిధులు కోరిరి, కొద్దిమంది. ప్రభుప్రతినిధులును మరి
కొంతమంది మతగురువులుసు మాత్ర మిందుకు సమ్మతించిరి. "ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
తక్కినవారొప్పుకొనలేదు. లూయీ రాజు ప్రజల ఆస్తి కిని ప్రాణమునకును సురక్షితమునిచ్చు "చట్టములు తాను చేయు ట కేమి, కొంత అధికారమును ప్రజాప్రతినిధు లవశము చేయు ట కేమి సిద్ధముగ నుండెనేగాని, ప్రభువులు, ప్రజలు, మతగురు పులు నను భేదము నాశనమై అందరును ప్రింఫ్రెంచిజాతిలో చేరి పోవుట కొప్పుకొన లేదు. తన రాచరికము ఓ పాటు ప్రభువులు, గురువులు, ప్రజలు సను భేదముకూడ నుండవ లెనని యే నిశ్చ యిచెను. రాణికిని ఇదే అభిప్రాయము. నెక్కరుమంత్రి దవ్య సంబంధమయిన ఇబ్బందుల నుండి ప్రభుత్వము తొలగిన తరువాత, ప్రభువులును మతగురువులును కలిసి యొక సభగాను, ప్రజా ప్రతినిధులు వేరుసభ గాను చేరుట యుక్తమని తలచెను. ముందుగా ప్రభుత్వము యొక్క ఆర్థిక స్థితిని గూర్చి ఒక్కరు గొప్ప యుపన్యాసమును చేసి, మూడు శాఖ లేయవిషయము లను కలిసి చర్చించవలెనో, వేనిని విడిగా చర్చించవలేనో, నిర్ధారణ చేయుటకు కమిషనరుల నేర్పాటు చేయవలసినదని సలహా నిచ్చెను. తమ్ము నెన్ను కొనిన ఫ్రెంచి ప్రజలయుద్దేశ్య ప్రకారము, ప్రభువులును మతగురువులును అనుభవించు చుండిన ప్రత్యేక హక్కులును ప్రత్యేక లాభములును సంపూర్ణ ముగా రద్దుపరిచనిది, మరియొక పని ప్రారంభించగూడ దను దృఢనిశ్చియముతో ప్రజా ప్రతినిధులు పచ్చిరి. తక్కిన రెండు శాఖలును తమతో చేరనిది, ఏపనియు తాము చేయమని ఖండితముగా చెప్పిరి. దినదినమున కీపోరాటము హెచ్చెసు.
ప్యారిసు పట్టణములోని బీదజనులకు తిండి ప్రియమై క్షుద్బాధ 168
పండ్రెండవ అధ్యాయము
హెచ్చుగా నుండెను. ప్రజాపక్షవాదులు తీవ్రమైన యుపన్యాస ములు గావించుచుండిరి. ప్రజలలో నాగ్రహము హెచ్చెను. ప్రభువులు, మతగురువులు నాశనముగానిది తగుకు కడుపునిండ భోజనము దొరకదని ప్రజలు తలంచసాగిరి. ఒకే సభ గా కూడుటకు వ్యతిరేక పక్ష మువారినందరిని ప్రజలు తొందరచేయసాగిరి. రాజధానియొక్క, ప్రజాభిప్రాయమువలన స్టేట్సుజనరల్ లోని ప్రజాప్రతినిధుల పట్టుదల హెచ్చెను. జూస్ 17 వ తేదీన ప్రజాప్రతినిధులు (నేషనల్ ఎస్సంబ్లీ) జాతీయసభ యను పేరును 'బెట్టుకొని, ప్రభువులును, మతగురువులును తమతో చేరినను, చేరకపోయినను తామే దేశము యొక్క నిజమయిన ప్రతినిధులమనియు, దేశము తరఫున సర్వకార్యములను చేయుటకు తమకే సర్వాధికారము గలదనియు శ్రీర్మానించిరి. కొంత మంది ప్రభువులును చాలమంది సామాన్యమత గురువులును వీరిలో చేరిరి. రాజునకును రాణికిని నాగ్రహము కలిగెను. జూతీయ సభను సభ చేయుచున్న మందిరములోనుండి, దానిని బాగుచేయవలసియున్న దసుమీషమీద వెడలగొట్టించిరి. ప్ర జాప్రతినిధులందరును (టెన్నీసుకోర్టులో) బంతులాడుకొను ప్రదేశములో సమా వేశమై, జాతీయ ప్రభుత్వమును స్థాపించు వరకును తాము వీడిపోమని జూన్ 20 ప తేదీన శపథములు చేసికొనిరి. బయట ప్రజలగుంపు లాతురతతో కని పెట్టుకొని
యుండిరి.
{{Center|ఫ్రెంచి స్వాతంత్ర్య విజయ}
}
ప్రజాప్రతినిధులు
రాజు నెదిరించుట
జూన్ 28వ తేదీన లూయీ రాజు దర్భారుచేసెను.
ప్రతినిధుల నందరిని సమావేశపరచెను. . రాజు యొక్క చిత్త
మును మంత్రులు వినిసించిరి. “మూడు శాఖ
లను విడిడిగనే కూడవలసినది. రాజుగారి
యుత్తరువు. పైన నేదైన ప్రత్యేక విషయముల
లో అందరును. కలియవచ్చును. ముఖ్యముగా
మత సాంఘిక రాజకీయవిషయములను ప్రత్యేకముగానే చర్చించ
వలెను. ఇది రాజుగారి యాజ్ఞ. అందరు ప్రతినిధులను. వెంటనే
వెళ్ళిపోయి రేపు ఎవరికి నిర్ణయమయిన ప్రదేశమున వారు
ప్రత్యేకముగా గూడవలసినది. ఇట్లు చేయని చో రాజుగారే
తన ప్రజల సౌఖ్యమున కవసరమగు చర్యలు జరుపుదురు,”
అని మంత్రులు సెలవిచ్చి. దర్బారు చాలించగ నే రాజును,
చాలమంది ప్రభువులును, మతగురువులును వెడలిపోయిరి.
మిగిలిన వారును, ప్రజాప్రతినిధు లందరును తమ స్థానములను
వదల లేదు. ప్రజాప్రతినిధి బైలి యగ్రాసనాధిపత్యమును వహిం
చెను. రాజు యొక్క యుర్యోగస్థుడగు డిబ్రె .. అచటకు వచ్చి
రాజు గారియుత్తరువును వింటి రా యని యడిగెను. ప్రజాప్రతి
నిదులకు నాయకుడు గానున్న మీరాబో రాజుగారినోట పలి
కంచబడిన మాటలను వింటిని.మేము లేచిపోము. మమ్ము
సు వెడలగొట్టమని మీ కుత్తరువులున్నచో, పటాలములను తెచ్చి వెళ్ళగొట్టుడు” అని ప్రత్యుత్తరమిచ్చెను. రాజు చర్య పుచ్చుకొనుటకు
శంకించెను. పటాలములను బంపినను సైనికి భటులు కాల్చుటకు నిరాకరించెదరు. పైగా
169
పండ్రెండవ అధ్యాయము
కాస్టింకోట నేల మట్టము గావింప బడుట. రాజధానిలో తిరుగు బాటులు జరుగును. ఈవిధముగా రాజు యోచించి, లేచివచ్చిన ప్రభువులను మతగురువులను తిరగ వెళ్ళి ప్రజాప్రతినిధులతో చేరి యొ కేసభగా నేర్పడవలసినదని చెప్పి పం పెను. ప్రజాపక్ష మునకు సంపూర్ణ జయము కలిగెను (జూన్ 26.)
(2)
బాస్టిలు కోటనేల
మట్టము గావింప
బడుట
ఈ కాలయాపనవలన ప్యారి సునగరవాసులలో నుద్రే కము హెచ్చెను. ప్రతిదినము . వేలకు వేలు ప్రజలు సభలు జరిపి వక్తలు గంభీరోపన్యాసముల గావించు చుండిరి. రాజ యొక్క, బంధువుడగు ఆర్లీ యన్సు ప్రభువు ప్రభుపక్ష మునువదలి ప్రజా పక్షము చేరెను. ఆయననగరునకంటి యొక పెద్ద తోటగలదు. దానిచుట్టును పుస్తకములను కాఫీని పల హారములను అమ్ము దు కాణములుండెను, ఆమధ్య సున్న విశాల మైన ప్రదేశములలో వేలకొలంది ప్రజలు సమావేశమగుచు ఉపన్యాసములను వినుచుండిరి. అక్కడకు పోలీసు వారు గాని ప్రభుపక్షవాదులు గాని వచ్చుటకు భయపడు చుండిరి.
ప్రభుత్వము వారు శాంతిని నెలకొలుపవలె సను మిష
మీద ప్యారిసు,వర్సేల్సు పట్టణములయొద్ద స్విసు, జర్మను సైన్య
ముల నుంచిరి. ప్యారిసుసు ముట్టడించి సైనిక శాసనమును ప్రవేశ
పెట్టుదురేమోయని ప్యా రిసు ప్రజలు భయపడుచుండిరి. ఈ సైన్య
ములను తీసి వేసి ప్రజల యైచ్ఛిక భటులను తయారుచేయవల
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
. లేదు. నెక్కరుమంతీ 'రాజున కీవిషయములలో సహాయము చేయుట లేదు. కాస జులై 11 వ తేదీన రాజు నెక్క రుమంత్రిని పద భ్రష్టుని జేసి ఫ్రాస్సు దేశ ముసుండి వెంటనే లేచిపోవలసినదని యాజ్ఞాపించెను. నెక్కరును తీసి వేసినందుకు జాతీయ సభవారు ఖం డితముగా తమ అసమ్మతిని రాజునకు తెలిపెరి. కాని ప్రయో జసము లేదయ్యె. నెక్క రుండగా రాజు పటాలములను జాతీ యసభ పై నగాని రాజధానిమీద గాని ప్రయోగించ డనునమ్మక ము ప్రజల కుండెడిది. నెక్కరును వెళ్ళగొట్టి రసువార్త మరు సటియుదయమున ప్యారిసుపట్టణములో వ్యాపించెను. ప్రజలలో కలిగిన యాందోళనమునకు మేరలేదు. రాజు వెంటనే సైన్య ములను ప్రయోగించి ప్రభావిప్లవమును బలవంతముగా సణచి వేయునని భయము హెచ్చెను. సభా వేదిక పై కామిల్ డెమొ లిన్" అను యువకు డెక్కి “పౌరులారా! నెక్కరును వెళ్ళగొట్టి నారు. దేశాభిమానుల సందఱను నరికి వైచుటకు యత్నించు చున్నారు. లేపండి! తుపాకులు తీసికొని లేవండి! ప్రతివారు నొక పచ్చనియాకులుగల కొమ్మును గుర్తుగా పుచ్చుకొని బయలు దేరుడు!” అని హెచ్చరించెను. చెట్లకొమ్మలు తీసి కొని ప్రజలు బయలు దేరిరి. నెక్కరు యొక్క పటమును తీసి కొని ప్రజలు ఊరేగింపుతో వచ్చుచుండగా, రాజు యొక్క జర్మసు గుఱ్ఱముదళము ప్రజలపై బడి తోక్కి గుంపులను చెదరగొట్టినది. ప్రజలయాగ్రహమునకు మేర లేదు. మూడు వేల అయిదువందల మంది 'ఫ్రెంచి సైనికులు ప్రజలపక్షమునకు
వచ్చి చేరిరి.తుపాకలు, కత్తులు,గొడ్డళ్ళు మొదలగు 170
పండ్రెండవ అధ్యాయము
నవి తీసికొని ప్రజలు బయలు దేరిరి. ప్రభుత్వమువారి
సైనిక సామగ్రిగల యింటి పైబడి ఆయుధ సామగ్రిని తీసి
కొనిపోయిరి. రాజ సైన్యము లేనిమిషమునవచ్చి తమ్ము
ముట్టడించునో యను భీతితో ముఖ్య స్థలములలో ఫిరంగులను
బెట్టి పారి సునగర సంరక్షణమునకు వలయు సన్నాహముల
నెల్ల గావించిరి
. జూలై నెల 18 తేది అంతయు విప్లవము జరిగెను. ప్రజలు ప్రజలు సుకపుశాలలను తగులబెట్టిరి. చెరసాలలను తెరచి ఖైదీలను విడుదల చేసిరి. రొట్టెల అంగళ్లను కల్లుదుకాణములను దోచుకొనిరి. రాజు వెర్సెల్సు లో నుండెను. ప్యారిసులోని యధికారు. లెవ్రునును ఆటంక పరచలేదు. అటంక పరుచుటకు భయపడిరి. మ్యునిసిపలు సభ్యులు హెూటులు డి వెల్లి అను నగరులో కూర్చొని ప్రజ లకు సలహానిచ్చుచుండిరి. ప్రజలను సాయుధులగు జాతీయ సైనికులుగా తయారు చేయుచుండిరి. ఇంతలో బాప్టిలుకోట లోని రాజ సైన్యములు కోటమీద ఫిరంగుల నెక్కించిరి. ఇట్టి ముఖ్యమగు ప్రదేశము శత్రువుల స్వాధీనమందుండుట అపాయ కరమని తలచి జులై నెల 14 వ తేదీన ప్రజా సైన్యము బాప్టిలు కోటను ముట్టడించ నిశ్చయించెను. లండనులోని 'టవరు' వలె ఫ్రెంచి ప్రభుత్వ విరోధులను తరచుగా విచారణ లేకుండ నీ కోటలో పడి వేయుదురు. బాస్టిలుకోట ప్రభుత్వం ద్వేషుల కారాగృహము. లోపల కొద్ది సైన్యములు గలవు. సేనాధిపతి
యాకోటను వదలుటకు సమ్మతించక పోరాడెను. అయిదు ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
గంటలు యుద్ధము జరిగిన తరువాత ప్రజా సైన్యములు బా స్టిలు కోటను పట్టుకుని లోన జొరబడిరి. ప్రభుత్వ సైన్యాధిపతి సేన లతో లొంగెను. సైన్యాధిపతిని ప్రజలు చంపిరి. ప్రభుత్వ సైసి కులకు క్షమాపణ నొసంగెరి. బాస్టిలుకోటలోని ఖైదీ లను విడుదల చేసిదానిని సంపూర్ణముగా నేలమట్టము గావించిరి. ఆ రాత్రి బాప్టిలుకోట పడిపోయిన దనుసంగతీ వెర్సేల్సులోని రాజునకు తెలిసెను. ప్రజలు తిరుగు బాటు చేసిరి,' అని మాత్రమే ఆయన చెప్పెను. 'అయ్యా! తిరుగు బాటు కాదు. విప్లవము ప్రాంభ మయినది,' అని లైన్ కోర్టు ప్రభువు చెప్పెను. ఫ్రెంచి సైన్యములు ప్రజలలో చేరిపోయి నందుకు రాజు చింతించెను.
రాజు ప్రజాచిత్తము నెదిరించజాలక ప్రజలకు లొంగె
సు. జాతీయసభ యొక్క కోరికలు మన్నించెను. విదేశ సైన్య
ములను తీసివేసెను. "నెక్కరును తిరిగి ప్రధానమంత్రిగా చేసెను.
ఈసంతోష వార్తలను ప్యారిసు ప్రజలకు తెలుపుటకై జాతీయ
సభవారు 'వెర్సెల్సు నుండి ఎనుబది ఎనిమిదిమంది ప్ర
ప్రతినిధులను ప్యారిసునకు బంపిరి. ప్యారిసు ప్రజలు మిగుల నుత్సాహమును
పొందిరి. ఆమెరికా స్వాతంత్యపక్షమున నింగ్లాండుతో యు
ద్ధము చేసియున్న సుప్రసిద్ధ ఫ్రెంచి సేనాని లఫయతు ప్రభువును
ప్యారిసులోని జాతీయ సైన్యములకు సేనాధిపతిగా చేసిరి. గణిత
శాస్త్ర విద్వాంసుడును, టెన్ని సు కోర్టుశ పథకాలమున అధ్యక్షత
వహించిన వాడునునగు బైలీని ప్యారిసు నగర పురపాలక సంఘముస
పండ్రెండవ అధ్యాయము
ఎరుపు, తెలుపు, మూడురంగులు గల జెండా ఎత్తబడెను. "ఈ
మూడు రంగుల జెండా ప్రపంచమంతను సంచరించును!" అని లఫ
యతుసేనాని చెప్పెను.
రాజు ప్యారీసును
దర్శించుట,
రాజు యొక్క సోదరుడగు ఆర్డాయిప్రభువును మరికొం దరు ప్రభువులును ఫ్రాన్సును విడిచి పారిపోయిరి. తన సురక్షి తము కొరకు రాణి వెర్సెల్సులో భయపడుచున్నను, లూయిరాజు కొంతమంది జూతీయ సభ్యులను వెంటగాని ధైర్యముతో ప్యారిసునగరమునకు వెళ్లెను. ప్యారిసునగరము వెలుపలనే మ్యునిసిపలు అధ్యక్షుడగు బైలీ రాజు ంర్దుర్కొనిన, రాజభక్తి సూచకముగ నగరపు తాళపు చెవులను రాజున కర్పించెను. 'ప్రజలు రాజుగారి హృదయమును వశ పరచుకొనినా రని నమ్రతతో బైలీ చెప్పె ను. రాజు ప్రజల జయజయధ్వానముల మధ్య ప్యారిసు నగర ములో ప్రవేశిచెను. రాజు హోటలు డివెల్లికి పోయి తనటో పీలో మూగురంగుల పతాకమును ధరించి, మేడమీదనుండి ప్రజలకు దర్శనమిచ్చెను. బయట మూగియున్న వేలకొలది జను లానందపరవశులై "మారాజును దేవుడు రక్షించును గాక! "మా దేశమును దేవుడు రక్షించుగాక!" యనుగోలా హలధ్వనులు చేసిరి. రాజును తీసివేయపలెనని అంతవరకును ప్రజ లు కోర లేదు. ప్రభువులు ప్రజలు నను భేదములు పోయిన రాజు రికమునే ప్రజలు కాంక్షించిరి. రాజు ప్రజల యిష్టానుసారము
పాలింలిపలెనని కోరిరి. "ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
రాష్ట్రములలో
విప్లవము,
రాజధానిలోవలనే రాష్ట్రములలోకూడ ప్రజాందో ళణాము హెచ్చెను, ప్రభువులకుగల ప్రత్యేకలాభములును ప్రత్యేక హక్కులును నాశనమై, ప్రభువుల యెత్తిడినుండియు డార్జన్యమునుండియు విముక్తు లగుటకు ప్రజలు తొందరపడుచుండిరి. ఇంకను జూతీయసభ ఏమియును చేయడాయ్యే . ప్రజలు ప్రభువులకు పన్నుల నిచ్చుటకు నిరాకరించి.. సుంకపు శాల లను, టోలు గేట్లను తగుల బెట్టసాగిరి. జూలై 14వ తేదీన బాస్టిలు కోట నాశనమైన దనువార్త రాష్ట్రము లోని యాం దోళనపరుల కుత్సాహము కలుగజేసెను. ప్యారీసులో నొక ప్రభుత్వోద్యోగి 'ఫాలన్ ' అనునాయన ప్రజల కాకలియయిన యెడల గడ్డితినవచ్చునని చెప్పి సందున నాయనను, ఆయన అల్లుని దీపపు స్తంభమునకు గట్టి ప్రజలు రి దీసిరి. ప్యారిసు పురపాలక సంఘము వారును, జూతీయ సైన్యములును, ప్యారిసు ప్రజలలో శాంతిని నెలకొల్పుచుండెను. అనేక రాష్ట్రములు లో సక్కడక్కడ ప్రజలు గుంపులుగ బయలు దేరి, ప్రభువుల యిండ్లను, వారియిండ్లలోని భూదాన శాసనములను తగులబెట్ట. సాగిరి. ప్రజలకు వ్యతిరేక పక్షమువారు వచ్చి తమ పంటలనన్ని టిని నాశ సముచేయుదురని వదంతి బయలు దేరినందున ప్రజలు సాయుధులుకాసాగిరి. మధ్యమతరగతిప్రజలుసు, విద్యాధి కలును, మ్యునిసిపలు సంఘములును ఐచ్ఛిక భటుల నేర్పాటు,
చేసి, శాంతిని నెలకొల్పిరి. దీనివలస నొక సంగతి స్పష్ట. 175
పండ్రెండవ అధ్యాయము
జాతీయ సభ మయ్యెను. రాజుయొక్కయ, ఆయన యుద్యోగస్థుల యొక్క యు సధికారము రాజధానిలోను, రాష్ట్రములలోను కూడ సదృశ్యమై, ప్రభుత్వోద్యోగు. లధికారము చలాయించలేక యూరకొనిరి. సైన్యములు ప్రజలలో చేరెను. ప్రజలు ఆయుధపాణులైరి. ప్రజలే శాంతికొరకు ప్రయత్నములు చేసి కొనిరి. తమమీద సధికారము చేయుటకును, తమ కష్టములు నీడేర్చుటకును జాతీయసభ మీదనే ప్రజలు తమదృష్టిని నిల్పుకొనియుండిరి.
జాతీయ సభ
జాతీయసభ యొక్క ప్రజాప్రతినిధి శాఖలో కొందరు సుప్రసిద్ధవిద్వాంసులు, 16 గురు వైద్యులు, 102 రు భూస్వా ములు, 212 మంది న్యాయవాదులు,కొం దరు వర్తకులు, కొందఱు మేజిస్ట్రేటులు, చిన్న రైతులు, 12 మంది ప్రభువులు, ఇద్దరు మతగురువులును నుండిరి. అర్ధ చంద్రాకారముగ నధ్యక్షుని యెదుట సభ్యుల యాసనము 'లమర్చబడెను. సభ్యల యుపన్యాసము లందకి వినబడునట్లుగ నుపన్యాస వేదిక నేర్పాటు చేసిరి. జాతీయసభలో నాలుగు విధములైన యభిప్రాయములు గల సభ్యులు కూర్చుండి యుండిరి. అధ్యక్షుని కుడి వైపున ప్రభు జాతియొక్కయు మత గురువులజాతి యొక్కయు ప్రత్యేక హక్కులు సన్ని టిని నిలువ బెట్ట యత్నించుచుండిన ప్రభువులుసు మతగురువులును కూర్చుం డియుండిరి. వారి కెడమ వైపున పుట్టుక వలన ప్రభువులైన వారుగాక్, ధనమువలన ప్రభువులైనవారుండి తీరవలయునని
యు, అట్టివారు లేనిది రాజరిక ముసకు ముప్పు వాటిల్లుననియు ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము
సభిప్రాయపడుచుండినవారు కూర్చుండిరి. శాసనసభలకు వోట్ల నచ్చువా రప్పటి యింగ్లాండులో వలె విశేషమగు ఆస్తిగలవారుగా నుండవలయుననియు, శాసనసభలలో భూఖామందులే పలుకు బడి గలిగియుండ వలయుననియు, ఇంగ్లాండులోవలే రెండుశాసన సభ లుండవ లెననియు వీరియభిప్రాయము. అన్ని విధములైన అల్లరులను వెంటనే యణచి వేయ వలయునని కూడ వీరు కోరు చుండిరి. వీరు స్వల్ప సంఖ్యాకులుగ నుండిరి. అధ్యక్షుని యెడమ వైపున రాజు లేని ప్రజాస్వామ్యమును, ప్రతిమానవునికిని వోటు ను, ఆ స్తియున్నను లేకున్నను యోగ్యతను బట్టియే అన్ని యుద్యో గముల కర్హతయును గోరు అతివాదులు ఇరువది ముప్పది మంది కూర్చుండి యుండిరి. వీరికి నాయకులు పేషన్, రాబిస్పీ యరులు. రాజును వెళ్ళగొట్టుట వీరి యుద్దేశ్య మేగాని, సాధ్య పదని తలచి యూరకొనిరి. ఈ అతివాదులకు కుడి వైపునను, పైన చెప్పిన రెండవ పక్షమువారీ కెడమ వైపునను, ఏడెనిమిది వందల సభ్యులు మీరాబో, లఫయతు, ఆబి సైసు మొద లగువారి నాయకత్వము క్రింద కూర్చుండిరి. సర్వసమానత్వ మును ప్రత్యేక హక్కుల నాశనమును వీరు కోరిరి. ప్రజాపరి పాలనమును కాంక్షించిరి. ప్రభుత్వము దృఢముగా నుండు టకు రాజుండి తీరవలయునని వీరి అభిప్రాయము. కాని నిజ మయిన అధికారము ప్రజ ప్రతినిధుల చేతులలోనే యుండి, రాజు నామమాశ్రావశిష్టుడుగా సుండవలెననియే, వీరియుద్దే శ్యము, ప్రజలయందు వీరికి సంపూర్ణ విశ్వాసము గలదు. ప్రస్తు
తము కొన్ని చోటుల కొన్ని అల్లరులు జరుగుచున్నను, తిరిగి 177
పండెండవ అధ్యాయము
వెనుకంజ వేయుటకు వీలు లేని సరియైన పునాదుల మీద జాతీయ
ప్రతిష్టాపనలను నిర్మించిన తరువాత, కొలది నెలలలో దేశము
లో శాంతి, సంపద, సంతృప్తి నెలకొలుపబడునని వీరి తలంపు .
(4)
ప్రజాహక్కు ల
స్థాపనము,
1789 సంవత్సరము ఆగష్టు నెల 4 వ తేదీ ఫ్రాన్సు దేశ చరిత్రలో కెల్ల ముఖ్యమగు దినము. ఆ సాయంతనము ఫ్యాన్సులో అదివఱకు శతాబ్దములనుండి పాదుకొనియుండిన మొఖాసాప్రభుపరంపరయును, మతగురువుల యాధిక్యతయును జాతీయసభచే నాశనము చేయబడెను. ఇంతట నుండియు ఫ్రెంచి దేశము లోని మనుష్యులందరును జాతి భేదములు లేక సమానహక్కు' బాధ్యతలు గలవారని శాసించబడెను.చట్టము లందుకును. సమానముగ వర్తించును. అందఱకిని సమానమగు స్వాసంత్య ములుండును. పుట్టుక యొక్క గాని ధనము యొక్క గాని ఆధిక్యత యుండదు. ప్రభువులకును మతగురువులకుసుగల స్యాయవిచార ణహక్కులు, ప్రత్యేక గౌరవములు, రైతులచే బలవంతముగ పనిచేయించుకొను హక్కులు, ప్రభువులకు గల వేల హక్కులు, కొన్ని ప్రదేశములకును, పట్టణములకును, వర్తక సంఘములకును గల ప్రత్యేక వర్తకహక్కులు, "మొదలగు ప్రత్యేకహక్కు లన్ని యు రద్దుపజచ బడెను. రైతులకును ఇతర సామాన్య ప్రజలకును గల నిర్బంధము లన్నియు తొలగించ బడెను. వ్యవసాయక బానిస త్వము సంపూర్ణముగ రద్దుపఱచ బడెను. సివిలు, సైనిక, మతవి
షయిక ఉద్యోగములన్నిటికిని యోగ్యత, సామర్థ్యము మాత్ర “ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము
మే కావలెను. పుట్టుక నుబట్టి యియ్యబడవు. మఠముల యొక్క
అభివృద్ధి - ప్రజ లిచ్చు పన్నులు తీసి వేయబడెను, ప్రభువుల
యొక్కయు, మతగురువుల యొక్కయు భూముల కిదివరకు
పన్ను లనుండిగల మినహాయింపులన్నీయు రద్దుపరచ బడి అం
దటి భూములకును సమాసముగ పన్నులు వేయబడెను. -
జాతీయసభవారు మానవులకు స్వభావముగా నుంట్టియు, భగవ
దుద్దేశ్య మైనట్టియు హక్కుల ప్రకటనమును , కావించిరి. (1)
స్వాతంతమును, ప్రాణ మాన విత్తముల సంరక్షమును,
వీనికి భంగముగలుగ జేయ యత్నించినవారి సెదుర్కొనుట
యు, ప్రతి మానవునికిని సహజమైన హక్కులు, 2)
హక్కులుతో మనుష్యులందుసు పుట్టినారు. (8) చట్టముల
ముందఱ పౌరులుదరుసమానులు, (4) యోగ్యత, సామ
ర్థ్యము నను భేదములుతప్ప తక్కిన యెట్టి భేద ములును లేక , ప్రభు
త్వములోని అన్ని యుద్యోగములకును పౌరులందఱును అర్హు
లు. (5) దేశమునకు ప్రజలే ప్రభువులు. (6) ప్రజల యొ
క్క యుద్వేశ్యములను దెలుపుటయే చట్టము. ఈ ఆరు
వాక్కులును ఎవరును తీసివేయుటకు వీలు లేని సహజహక్కు
లని శాసించబడెసు. ప్రభువులు, మతగురువులు, ప్రజలు నను
భేదము రద్దుపుచబడెను. పత్రికాస్వాతంత్యము, వాక్స్వాతం
త్యము "దేశీ యులకందఱికిని నియ్యబడెను. పౌరులు ఎవరియి
యిష్టమువచ్చిన మతమును వారవలంబించవచ్చు ననియు, ప్రభుత్వ
మువారేమతము నవలంబింపరనియు, ఏమతమునందు నెక్కువ
179
పండ్రెండవ అధ్యాయము
లుండవలెనని కొందరు వాదించిరి గానీ, ఎక్కువమందిచే ప్రజా ప్రతినిధి సభ యొకటే యుఁడవ లెసని తీర్మానింపబడెను. దీనికి రెండు సంవత్సరముల కొకసారి యెన్నికలు జరుగును. గడువు లోపల దీనిని విచ్ఛిన్నము చేయుహక్కు... రాజునకు లేదు. సమస్త పరిపాలనాధికారములు నీసభ కుండును,
దేశములోని యిరువది అయిదు సంవత్సరముల వయస్సుగలిగి, సాలున కొక రూపాయి పన్ను చెల్లించు పౌరుల లందఱకును ఎన్నిక అధి కారము కలుగజేయ బడెను. ప్రతినిధి మాత్రము సౌలుకు ముప్పది రూప్యముల పన్ను చెల్లించువాడుగా నుండవలెను. ప్రజాప్రతినిధి సభ చేసిన చట్టమును రాజు రెండు సారులు తిప్పి వేయవచ్చును. మూడుసారి దానినే ప్రజా, ప్రతినిధిసభ వారు చేసిన యెడల, రాజంగీకరించక పోయినను, దానియంతట నదే చట్టమగును.
అత్యంతము
దేశాభిమానము
పైన చెప్పబడిన ప్రత్యేక వాక్కుల నాశనములోను, మాసవ సమానత్వస్థాసనములోను, అత్యంతమైన దేశాభి మాసములో ననేక మంది ప్రభువులును మత గురువులుసు కూడ హృదయ పూర్వకముగా తోడ్పడిరి. తమ ప్రత్యేక హక్కులను గౌరవ ములను తామే ముందుగా విసర్జించి ఆత్మత్యా గమునకు మార్గదర్శకులగుచు వచ్చిరి, నోయలిసు ప్రభువు అందరికిని త్రోవజూపెను. ప్రభువుల న్యాయవిచారణహక్కు , వేటహక్కు, రైతులవలన బలవంతముగ పనిచేయించుకొను
హక్కు మొదలగు హక్కులన్నియు వెంటనే రద్దుకావలెనని ఫెంచి స్వాతం త్య విజయము
ఆయన తీర్మానమును బెట్టెను. ఇంతటితో నొకరి వెంట నొకరు ప్రభువులును, మతగురువులను, తమ తమ హక్కులను విసర్జ నముగావింప నారంభించిరి. దేశాభిమానములోను ఆత్మత్యాగములోను పోటీ గలిగెను. ఒక రికంటే మరి యొక "రెక్కువ త్యాగమున, జూపిరి.. అమితోత్సాహము ఫుట్టెను. దేశము కొరకై- ప్రత్యేక వ్యక్తులు చేసిన సమర్పణము లాఖరు కాగనే, డాఫిన్ రాష్ట్రపతినిధి లేని రాష్ట్రము నకుగల ప్రత్యేక హక్కుల సన్ని టిని వదలెను. ఒకటి వెంట నొకటి రాష్ట్రములు, పట్టణ ములు, వర్తక సంఘముల... అమతమ ప్రత్యేక హక్కులను . గౌరములను వదలుకొనిరి. ఆదిన మత్యంతశుభ దినముగా పరి గణించుటకు జాతీయసభవారు తీర్మానించిరి.పదునారవ లగాయి రాజునకు, ఫ్రెంచిస్వాతం త్యపునరుద్ధారకు డను బిరు దము నొసంగిరి. ఆదినమున ఫ్రాన్సు దేశములో "ఫ్రెంచిప్రజల యొక్క- పాలనము స్థాపింపబడెను..