ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/నాలుగవ అధ్యాయము

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

నాలుగవ అధ్యాయము

ముసల్తానులకును క్రైస్తవులకును యుద్ధములు

ముసల్మానుల పై
క్రైస్తవుల మత
యుద్ధము.

పదునొకొండవ శతాబ్దమున మతగురువుల ప్రాముఖ్య మెక్కువయినది. క్రైస్తవ ప్రధానమతాచార్యుని (పోపు) మాట యూరపుఖండమంతయు శిరసానిహించినది. అం తకు పూర్వము కొంత కాలమునుండియు ప్రజ లలో మతవిశ్వాస మెక్కువై యా త్రలు చేయు నభ్యాసము ప్రబలినది. ముఖ్యముగ ఏసుక్రీస్తుప్రభువు యొక్క సమాధిగల జెరూసలేముకు యాత్రసలుపుట మిగుల పుణ్య కార్యమని తలచిరి. యూరపుఖండమునుండి యనేక

లక్షలమంది క్రైస్తవులు ప్రతిసంవత్సరమును ప్రభువు యొక్క
34

ప్రెంచిస్వాతం త్వపజయము


సమాధిని దర్శించి పచ్చుచుండివారు. జరూసలేము పట్ట ణము చాలకాలమునుండియు ముసల్మానుల వశమం దుండెను. కానీ 'భాగ్దాదు, ఖైరో ఖలీఫాలు మతసహసము గలవారు. క్రైస్తవుల కేమియు నిబ్బందులు కలిగించ లేదు. యాత్రికులకు అడ్డు లేకుండనుండెను 1055 నం. వత్సరమున నీఖలీ ఫాల యధికారము పడిపోయినది. సెబ్బూకి యను జాతికి చెందిన తురుష్కులు బాగ్దాదును జయించిరి.కొలది కాల ములో సిరియా, పాలేస్తైన్ దేశములు వీరి స్వాదీనమయ్యెను. జెరూసలేమును దర్శించుటకు వెళ్ళిన క్రైస్తవ యాత్రికులకు వీరు చాల ఇబ్బందులు కలుగ చేసిరి. ఈ యాత్రికులను ముసల్మా నులు చాల బాదలు పెట్టుచున్నారని యూరఫుఖండములోని ప్రతి దేశములోను చెప్పుకొనసాగిరి. ఇంతలో తురుష్కులు ఆసియ మైనరులో ప్రవేశించి 1071 న సంవత్సరమున కాంస్ట్రాన్ టీ నోపిలునుండి వచ్చిన క్రైస్తవ సేనల నోడించి గ్రీకు చక్రవ ర్తిని ఖైదు చేసిరి. యూరపుకు తూర్పున నేగాక పశ్చిమమునగూడ ముసల్మానులు చెల రేగి 1086 వ. సంవత్సరమున 'స్పెయిన్ దేశమున జెల్లకా వద్ద క్రైస్తవులకును ముసల్మానులకును జరిగిన గొప్ప యుద్ధములో ముసల్మానులే పూర్తిగ జయమందిరి . “క్రైస్తవమతము, క్రైస్తవనాగరికత, అపాయకరమగు స్థితి యం దున్నవి; వెంటనే రక్షింపుడు,” అను సందేశమును రో ములో నున్న క్రైస్తవప్రధానాచార్యుడగు పోపు ఏడవ గ్రెగరీ యూరఫుఖండమున కంతకును పంపెను. పీటర్ ది

హెర్మిటు ఫ్రాన్సు దేశ మంతటను సంచారము చేసి క్రైస్తవ

నాలుగవ అధ్యాయము

34


యాత్రికులు పడుచున్న కష్టములను గూర్చి బోధ సలిపి, మహమ్మ దీయుల పై యుద్ధము చేసి ఏసుక్రీస్తు యొక్క సమాధిని జయిం చుటకు ప్రజలను పురికొలిపెను. ప్రతిచోటను ప్రజలు ముస ల్మానుల పైకి నెడలుటకు ఆయుధపాణులైరి. 1096 వ సంవత్స రమున పోవు ఒక గొప్ప క్రైస్తవసమా వేశమును చేసి "నాస్తికులగు " మహమ్మదీయుల పై న పవిత్రమైన యుద్ధము చేయ ఫలసినదని బోధించెను. కొలది కాలములో పదిలక్షలమంది క్రైస్తవులు తమ వస్త్రముల పై నెఱ్ఱనిగుడ్డతో శిలువలను కుట్టు కొని ఈ 'పవిత్రమగు' ఉద్యమములో 'జేరిరి. 1096 వ సం వత్సరమున క్రైస్తవ భక్తులు జెరూసలేము దండయాత తకు బయలు దేరిరి. హౌస్సునుండియు జర్మనీ నుండియు లక్ష యేబది వేల పు రుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు పీటర్ ది హెర్మిటు యొక్క నాయకత్వము కింద మతావేశముతో బయలు దేరిరి. అందరి యొద్దను ఆయుధములు లేవు. భగవంతుడు తమ్మ ప్రత్యేక ముగ సంరక్షించుననియు ప్రతిచోటను అద్భుతములు చేయుననియు సమ్మి బయలు దేరిరి. జర్మనీ గుండ పోవునప్పుడు యూదులను నరికి వైచిరి. భోజనము కొరకు తోవలో ప్రజలను దోచు కొనుచు అనేక దుష్కార్యములను చేయుచుండిరి.' హంగెరీ దేశములో నీక్రైస్తవభక్తుల దుండగము లెక్కువై నందున అచటి క్రైస్త వ ప్రజలు వీరి పై తిరుగబడి పెక్కు మందిని చంపి తమ దేశములో నుండి వెడలగొట్టిరి. చాపగ మిగిలిన క్రైస్తవ భక్తులు కాన్ స్టాంటు నోపిలు చేరగ చక్రవర్తి వారి అల్లరుల

నుండి తప్పించుకొనుటకు త్వరగ ఆసియా మైనరుకు పంపెను. .
36

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

జయించుట, అచటివారి నందరిని తురుష్క సేనలు నరికి వేసిరి. పీటర్ ది హెర్మిటు తప్పించుకొని పోయెను,

జెరూస లేమును
జయించుట

ఈలోపున యూరపు ఖండమునుండి ప్రభువుల క్రింద గొప్ప క్రైస్తవ సైన్యములు బయలు దేరి నలువైపుల నుండియు కాక స్టాంటినో పిలును చేరిరి. వీరిలో ఇతర దేశీ యులకన్న పరాసు పరాసు ప్రభువులెక్కువమంది యండిరి. తురుష్క సేనలనుండి జయించెడి దేశములను గ్రీకు చక్ర వర్తికి సామంత రాజులుగ మాత్రమే స్వాధీనమును పొందెద మని ప్రమాణము గైకొని వీరు ఆసియా మైనరులో ప్రవేశించి, త్రోవలో అడ్డగించిన తురుష్క సేన నోడించి, తుదకు జరూస లేమును చేరిరి. పీటర్ ది హెల్మెటు యొక్క నాయకత్వము క్రింద ఈ క్రైస్తవ సేనలన్నియు జరూసలేము పట్టణము చుట్టును ప్రదక్షిణము చేసి పట్టణమును ముట్టడించిరి. ముట్టడి అనేక దినములు పట్టెను. తురుష్కులు జాగ్రత్తగా పట్ణమును సంరక్షించుచుండిరి. తుదకు 1099 వ సంవత్సరము 15 వ జులై తేదీన క్రైస్తవులు మతా వేశముతో గోడల నెక్కిరి. పట్టణములో ప్రవేశించిరి. క్రైస్తవులకు జయము కలిగెను. ముసల్మానులను చంపుట భగవత్ప్రతియగు కార్యమని నమ్మి క్రైస్తవులు ముసల్మానుల సందరిని హత్య గావించిరి. “భగ వంతుని యనుగ్రహమువలన నడుములోతున పొరుచున్న ముసల్మానుల రక్తప్రవాహముగుండ క్రైస్తవ భక్తులు వెళ్ళి “ఒక చెంప మీదకొట్టినచో రెండవ చెంపనుకూడ నిమ్ము,”

"నీశత్రువులను ద్వేషింపక ప్రేమింపుము” అను ప్రేమా సందే
37

నాలుగవ అధ్యాయము

38

ఉండకు శమును లోకమునకు ప్రసాదించిన ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధిని స్వాధీనమును పొంది. జెరూసలేములో క్రైస్తవ ' రాజ్యము స్థాపించబడెను.

రెండవ
యుద్ధము

ముసల్మానులనుండి. జయించిన చుట్టుపట్టు దేశము నాల్గు రాష్ట్రములుగ విభజించబడి క్రైస్తవప్రభువులచే పాలించబడు చుండెను. వీరు నలుగురును జెరూసలేములోని క్రైస్తవ ప్రభువుకు సామంత రాజు లైరి. వీరు కాన్ స్టాంటినోపిలులోని గ్రీకు చక్రవర్తికి చేసిన భక్తిప్రయాణము నకు వ్యతి రేకముగ స్వతంత్ర రాజ్యమును స్థాపించుకొనినందున గ్రీకు చక్రవర్తి వీరియందు ద్వేషమువహించి తురుష్కులతో కుట్రలు సలిపెను. కొలదీ కాలములో ఈ నాలుగు క్రైస్తవ రాష్ట్రముల మధ్యను కూడ బేదాభిప్రాయములు, మనస్పర్ధలు కలిగెను. ముసల్మాను లీ సంగతి కని పెట్టి వీరి పై దండెత్తి 1141 వ సంవత్సరములో ఎడెస్సా పట్టణమును పట్టుకొనిరి. దీనివలన యూరపుఖండమున భయముకలిగెను. పోపు ముసల్మానులపై యుద్ధమును ప్రకటించెను. పరాసు దేశవు రాజగు ఏడవ లూయి కొన్ని సైన్యములతో ముసల్మానుల పైకి "దాడి వెడలెను. జర్మనీ నుండియు కొన్ని సైన్యములు బయలు దేరెను. కాని యూ రపుఖండము వెనుకటి యుత్సాహమును చూపలేదు. ఫ్రెంచి సైన్యములును జర్మములును ఆసియా మైనరులో చేరిరి జర్మనులను క్రైస్తవులగా గ్రీకులు 'మోసపుచ్చి ముసల్మానులకు నొప్పగింత చేసిరి. జర్మనులు తురుష్కులచే వధించబడిరి. పరా

సురాజగు లూయికూడ తురుష్కులచే నోడించబడెను. అతని
38

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

సామంతరాజులు వధింపడి 'సై స్యములు చెల్లా చెదరయ్యెను. అతడు తనతో నున్న వేలకొలది. క్రైస్తవ యాత్రికులను వదలి గ్రీకుల పడవలలో నెక్కి కొలది సైన్యముతోను, సామంత ప్రభువుల తోడను ఆంటియాకు చేరెను. వెనుక విడచి పెట్టబడిన యాత్రికులు తురుష్కులచే చంపబడిరి. మూడు వేల మంది 'యేసు క్రీస్తు తమ్ము మోసము చేసెనని నిందించి, తమ ప్రాణ సంరక్షణము కొరకు ముసల్మాను లైరి. ఆంటీయాకు నుండి లూ యీ రాజు యాత్రకై. జెరూసలేము వెళ్ళి యాత్ర పూర్తి చేసి కొని మాస్కసు పట్టణమును ముట్టడించెను. ఇచట ముస ల్మానులచే నోడింపబడి చాలవరకు జనమును పోగొట్టుకొని తన దేశమునకు మరలి వచ్చెను. ఇటుల రెండవ దండయాత్ర వలస క్రైస్తవు లనేక వేల మంది వృథగా చంపబడిరి. ముస ల్మానుల బలము హెచ్చెను.

మూడ్డవ
యుద్ధము

ఇంతలో గొప్ప ముసల్మాను రాజొకడు బయలు దేరెను . ఈజిప్టు రాజగు సాలడిన శూరుడు. ఔదార్యవంతుడు. దయా దాక్షిణ్యములకు ప్రసిద్ధి కెక్కి నవాడు. ఈయన ముస ల్మాను రాజ్యము విస్తరింప జేయుటకై బయలు దేరి, సిరియాను జయించి, క్రైస్తమల నోడించి, 1187 సం||న జెరూస లేమును, చుట్టుపట్ల క్రస్తవ రాష్ట్రములను ఆక్రమించుకొనెను. కాని ఆయన క్రైస్తవులను ఔదార్యముతో చూచి మత స్వేచ్ఛ నొసంగెను. జెరూసలేము ముసల్నాను చేతులలో పడుటవలన యూర పుఖండములో సంక్షోభము పుట్టెను. ఇంగ్లాండు యె

క్కయు ప్రాస్సు యొక్కయు రాజులు, గ్రీకు చక్రవర్తి, అనేక

నాలుగవ అధ్యాయము

39

ప్రభువులు గొప్ప సైన్యములతో బయలు దేరిరి, కాని వీరిలో నైకమత్యము లేక పోయెను. గ్రీకురాజు త్రోవలో మరణించెను. ఇంగ్లీషు రాజును ఫ్రెంచి రాజును కలిసి సాలడిస్ చక్రవర్తి యొక్క సైన్యముల నోడించి ఏకరును పట్టుకొనిరి. అంతట వీరిలో కలహములు గలిగి పరాసురాజు తన దేశము నకు వెడలి పోయెను. ఇంగ్లీషు రాజు కొంత కాలముండి ఏమియు చేయజాలక మరిలిపో మెను . ఇంగ్లీష్ రాజు తాను పట్టుకొనిన ముసల్మాను ఖయిదీ లనందరిని చంపెను. సాలడీను తాను పట్టు కొనిన క్రైస్తవ ఖైదీలను విడిచి పెట్టెను.

(3)

నాలగవ
యుద్ధము

పోపు మూడవ యిన్నోసెంటు క్రైస్తవ ప్రపంచమున కంతకును ఐక్యత గలించి ముసల్మానుల నోడించ దలచి తిరిగి యుద్ధమును ప్రకటించెను. ఈ పర్యాయము రాజు లెవరును చేర లేదు. అనేకులు ప్రభువులు "" క్రైస్తవ సైన్యములతో ముసల్మానుల పైకి బయలు దేరిరి. త్రోవలో నీ క్రైస్తవ సేసలు ఇటలీ దేశములోని "వెనీసు షట్టణమున దిగెను. సిరియూ పైకి వెడలుటకు పడవల నిమ్మని వెనీసుపట్టణము యొక్క ప్రజాప్రతినిధి సంఘమును కోరిరి. వెనీసు వారు. క్రైస్త వులు. ఆ కాలమున ఆసియాకును యూరఫునకును మధ్య జరుగుచుండిన వర్తకమునకు వెనీసు ప్రధాన స్థానముగ నుం డెసు. వెనీసువారికి మత యుద్ధముల వలస వర్తక లాభము కలు గుచుండెను. వెనీసుకు ఏడ్రియాటికు సముద్రము యొక్క తూర్పుతీరమున నున్న జూరాయను క్రైస్తవ పట్టణము వర్తక

ములో చాలపోటీగ నుండెను. ముసల్మానుల పై వెడలుటకు
40


ప్రెంచి స్వాతంత్య విజయము

పడవలు కావలెనని కోరగ, క్రైస్త భక్తులగు సేనలన్నియు ముందుగా తమకు శత్రువగు జారా పట్టణమును ముట్టడించి నచో పడవల నిచ్చిదమని వెనీసు ప్రభుత్వమువారు చెప్పిరి.. క్రైస్తవ సేన యొప్పుకొనెను. వెనీసువారును క్రైస్తవ సేనలును పడవలలో వెడలి క్రైస్తవ ప్రజలదగు జారాను ముట్టడించిరి. జురాను జయించి వెనీసు వారివశము చేసిరి. ఇక్కడనుండి యైన క్రైస్తవ సేనలు ముసల్మానుల పైకి పోలేదు.కాన్ స్టాంటి నోపిలు చకప యొక్క అన్న కుమారుడగు అలెక్సియసు జారాకు వచ్చి, తనకు తండ్రి నుండి సంక్ర మించిన రాజ్యము సక్రమముగా తన పినతండ్రి అపహరించెను గావున తనకు సహాయ ము చేయ వలసినదని కోరెను. కాన్ స్టాంటినోపిలుకూడ వెనీసుసకు వర్తకములో పోటీగ నున్నది. వెనీసువారి ప్రోత్సా, హముస క్రైస్తవ సేనలు ముసల్మానులను యూరపులో ప్రవే శింపకుండ చిరకాలము నుండి ఆవుచున్న ప్రధాన క్రైస్తవ రాజ్యమగు కాన్ స్టాంటి నోపిలు పై దండెత్తిరి. అచట రాజ్య మేలుచున్న' చక్రవర్తి నోడించి అల్మే యసును చక్రవ ర్తిగా చేసిరి. కాని త్వరలోనే అచటి ప్రజలు తిరుగబడి అలెక్షి య సుసు చంపి వేసిరి. దీనిమీద క్రైస్తవ సైనికులు కాన్ స్టాంటి నోపిలు ప్రజలను ముట్టడించి వారిని దోచుకొని ఘోర హత్యలపాలు చేసిరి. వచ్చిన క్రైస్తవ సైనికుల నాయ

కులలో నొకడగు పరాసుప్రభువు బాల్డ్విమును చనర్తిగా

నాలుగవ ఆధ్యాయము

41

చేసిరి. కొంత భాగమును వెనీసు వారికిచ్చిరి. ఈవిధముగా ముసల్మానుల పై యుద్ధముకొరకు బయలు దేరిస క్రైస్తవ సేనలు క్రైస్తవ పట్టణమగు జారాను ముట్టడించి క్రైస్తవ రాజ్యమగు కాన్ స్టాంటినోపింలును మిగులబలహీనముగ గావించిరి. క్రైస్తవ ప్రజలను దోచుకొని వధంచిరి. కాన్ స్టాంటునోపిలులో వీరు స్థాపించిన కొత్త చక్ర వర్తిని రాజ్యములోని చాలభాగము లంగీక రించక స్వతంత్ర మును ప్రకటించెను. ఈ తొత్తచక్రపర్తి యొక్క వంశమువారు మిగుల బలహీనులై 8. 1262 సం! న నీవంశముపై ప్రజలు తిరుగుబాటు జేసి తిరిగి గ్రీకువంశమును నిలు వబెట్టిరి. కాని స్టాంటునో పిలు తన పూర్వబలమును కోలుకొనలేదు. తుదకు ముసల్మానుల స్వాధీన మాయెను.

4

తర్వాత
యుద్ధములు

.

తర్వాత 'పోపులు' ఇంకను కొన్ని దండయాత్రలు సలిపిరి, ముసల్మానుల పైకి అయినను గాకున్నను “పోపులు” మతము పేర జరుపు దండయాతలకన్నిటికిని క్రైస్తవమత యుద్ధములనియే పేరిడిరి. 1218 సం| ఈజిప్టు లోని ముసల్మాను రాజు పై యుద్ధము ప్రకటింపబడెను. " పోవు” యొక్క ప్రతినిధి యే స్వయముగా క్రైస్తవులను 'నైలు” సది ముఖ ద్వారయుననున్న డెమియ ట్టాను క్రైస్తవులు జయించిన. దానిని తనకు విడిచి పెట్టిన చో

జెజూసలేమును క్రైస్తవుల వశము చేసెదనని ఈజిప్టు సుల్తాను
42

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

సంధి రాయబార మంపెను. క్రైస్తవులొప్పు కొన లేదు. ఈజిప్టు నంతను జయించి సుల్తానును క్రైస్తవునిగా జేయవలెననీ వారి యాశ, సుల్తాను తెన సేనలతో క్రైస్తవుల పైకి వచ్చి వారి నోడించి డిమియాట్టాసుండి వెడలగొట్టెను. క్రైస్తవులు ఈజిస్ట్ నువదలి పారిపోయి.. 1229 సం|| సిసిలీ రాజు 'రెండవ ప్రెడ రిక్కు క్రైస్తవ సేనలతో పాలస్తీనులో ప్రవేశించెను. ఈజిప్టు సుల్తాను సంధికి వచ్చి జరూస లేముకు క్రైస్తవయాత్రికులు స్వేచ్ఛగా రాక పోకలు చేయునట్లు సంధి చేసికొనెను. ముస ల్మానులలో కొన్ని అతఃకలహములు కలిగినపుడు జెరూసలే మును క్రైస్తవులు స్వాధీనమును పొందిరి. కాని 1244 సం|| ఈజిప్టు సుల్తాను తిరిగి బలవంతుడై సిరియా, పాలస్తైను మొద లగు గా ఆసియా మైనరు ప్రాంతము. అన్నిటిని వసశపరచుకొని అక్కడ యెచటను క్రైస్తవ రాజ్యము లేకుండ చేసెను. తదాది జెరూసలేము ముసల్మానుల వశమందే యున్నది.


1235 సం॥న పరాసు దేశములో మతయుద్ధము ప్రక టింపబడెను. జేరూసలేముకు పోవుమార్గములో యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన వారివంశ్యులగు యూదుల సందరిని హత్య గావించి క్రైస్తవమతములో కొన్ని సంస్కరణములను గావింప యత్నించుచుండిన నూట యెసు బది ముగ్గురు క్రైస్తవు

లను మంటలలో పడ వేసి చంపి, క్రైస్తవ సేనలు పాలస్తైనులో

నాలుగవ అధ్యాయము

43

చేరిరి. అచట గాజా వద్ద తురుష్కులచే నోడింపబడి మరలి వచ్చిరి. 1244 సం!న పరాసురాజగు 'సెంటులూయికి జబ్బు చేసెను. అపుడు తనకు వ్యాధి నెమ్మదించినచో ముస ల్మానుల పైకి యుద్ధమునకు వెళ్ళెదనని దేవునికి 'మొక్కు- కొనెను. శరము నెమ్మది అయినది. 1249 సం|| న ఆయన 1800 పడవలలో "సేనలు తీసికొని ఈజిప్టు మీదికి వెళ్ళను. గాని మహమ్మదీయులు వీరి నోడించి 'సెంటులూయిని కొన్ని సేనలతో పట్టుకొని ఖైదు జేసిరి. విశేషమగు ధనముపుచ్చుకొని విడిచి పెట్టిరి. వెంటనే పరాసురాజు పాలస్తైనుకు పోయి మూడు సం || లు యాత్రలలో గడపెను. రాజు ముసల్మానులచే పట్టుకొనబడిన సంగతి తెలియగ నే పరాసు దేశములోని ప్రభువు లూరకొనిరి. వ్యవసాయ కూలీలు, వ్యవసాయకులు మొదలగు బీదవారు సముద్రముదాటి వెళ్ళి రాజును విడిపించి తెచ్చెదమని బయలు దేరిరి గాని తోవలో వీరు పరాసు ప్రజలను దోచుకొనుటవల నను, హత్యలు గావించుటవలనను వీరిని ప్రజలు ప్రతి చోట నుండియు తరిమివేసిరి. అందువలన నేమియు చేయజూలక గృహములకు చేరిరి. సెయింటు లూయిరాజు 1254 సం|| న పరాసు దేశమునకు వచ్చెను. ఈ రాజు 1270 సం|| న మరియొక మత యుద్ధము చేయ యత్నించి ట్యూనిసు పట్టణము పై దండెత్తి

అచట తన సైనికులతో గూడ ప్లేగువలన మరణించెను.
44

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఈ మతయుద్ధముల వలస గిలిగిన ఫలితము లేమి? ముస ల్మానుల బలము తగ్గకపోగా వృద్ధి అయినది. ఆసియా మైనరు. పాల స్తైను, జెరూసలేము, 'మొదలగు ప్రాంతములన్నియు ముస ల్మానుల వశమందే యున్నవి. ముసల్మానులను తూర్పునుండి. యూరపు ఖండములో ప్రవేశించకుండ అరికట్టుచున్న కాన్ స్టాం టునోపిలు సామాజ్యము బలహీనమైనది. క్రైస్తవుల కేమియు లాభము గలుగలేదు. కాని యూరపులోని క్రైస్తవులు తమ ప్రభువగు నేసు క్రీస్తువలెను , ఆయన యొక్క గొప్ప శిష్యుల వలెను, ధర్మసం స్తాపనకొరకు తాము ఇతరులచే బాధల ననుభ వించు పద్ధతిని విడిచి, మతము పేర నితరుల పై కత్తిదూయు అల వాటును నేర్చుకొనిరి. మత సహనమును బొత్తుగా మరచి పోయి యితర మతస్థులను చంపి వేయు దురభ్యానముల కల వాటుపడిరి.