ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/ఎనిమిదవ అధ్యాయము
ప్రెంచిస్వాతంత్ర్యవిజయము
ఎనిమిదవ అధ్యాయము
రాజుల నిరంకుశత్వము
(1)
రాజులు
నిరంకుశులగుట.
ఫ్రాన్సు దేశపు రాజగు నాల్గవ హెన్రీ సమర్థుడు. ఫ్రాన్సులో గలిగిన అంతర్యుద్ధములు రాజులయొక్క అధికారమును బలపరచినవి. స్టేట్సు. జనరరలు (దేశప్రతి నిథి సభ) ను తిరిగి సమకూర్చనే లేదు. దేశప్రముఖుల నప్పుడప్పుడు పిలిచి రాజు సలహా నందుచుండెను. ప్యారిసుపట్టణములోని (సార్లమెంటు) న్యాయాధిపతుల సంఘ సభ్యులమీద నొక పన్ను వేయబడి వారియధికారము వంశపారంపర్యమైనదిగా చేయబడెను. ఇందువలన వారు తమ పదవికి రాజునుగ్రహమునకు లోబడ కొంతవఱకు స్వతంత్రులై రి.నాల్గవ హెన్రీ మంత్రియగు సల్లీ ఆర్థిక విషయములలో బహు సమర్థుడై రాజునకు సర్వవిధములను తోడుపడెను.
. ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
పదుమూడవ
లూయి
1610 వ సంవత్సరమున నాల్గవ హెన్రీ చంపబడినందున . ఆయన కుమారుడగు పదునొకొండువత్సరముల వయస్సుగల పదుమూడవ లూయి రాజయ్యెను. రాజమాత. యగు మేరి-డి- మెడిసి రాజ్యభారమును వహిం చెను. ఆ మెపాలనము ప్రథమమున ప్రజానురంజకముగ లేదు. కాని 1624 వ సంవత్సరమున అదృష్టవశమున గోప్ప మేధావి యుగు కార్డినల్ రిచ్లూ ఆ మెకు మంత్రిగా లభియించెను. ఇంత నుండియు పరాసు దేశము యూరఫుఖండములో ప్రధాన స్థానమును వహించెను.
1524 మొదలు 1642వ సంవత్సరమున ఆయన చనిపోవు
వరకును రిచ్లూ మంత్రి పుంగవుడు యూరఫుఖండపు రాజ్యాంగపు
వ్యవహారములలో ముఖ్యుడుగ' నుండెను. ఈ
యన యు దదేశ్యములు రెండు: ప్రాన్సులో
ప్రభువుల యొక్కయు, న్యాయాధిపతుల యొక్కయు, హ్యూజి
నాట్ల యొక్కయు అధికారములను, పలుకుబడిని అణచి వేచి
రాజును నిరంకుశునిగ చేయుట ఒక యుద్దేశ్యము. ఫాన్సుకు
పోటీగనున్న ఆస్ట్రియా, "స్పెయిన్ దేశములకు నష్టము కలుగ
చేసి ఫ్రాన్సు దేశమును యూరపుఖండములో కెల్ల నుత్కృష్ట
మైనదిగ జేయుట రెండవ యుద్దేశ్యము. ఈయన ఫాన్సు లోని
ప్రొటెస్టెంటులగు హ్యూళినాట్ల నోడించి వారిని రాజునకు లోబ
బిచి పిదప వారికి మత స్వేచ్ఛ నొసంగుట మనము పైన చూచి
99
ఎనిమిదవ అధ్యాయము
ఫ్రాన్సు లోని ప్రభువులతో నెప్పుడును రిచ్లూ పోరాట ములు సలుపుచునే యుండెను. వారి హక్కులను కొంతవఱకు లాగికొనుటకు ప్రయత్నించెను. కాని ప్రభువులు కొంతపఱ కై నను నిలువబడి తమ హక్కులను నిలువ బెట్టుకొనిరి. పరాసు దేశములో తుదివ ఱకును రాజుతో హక్కులలో పోటీపడ దగినవారు ప్రభువులే. 'పెక్కు మార్లు రిచ్లూ మంత్రిని చంపు టకు కుట్రలు జరిగెను. రిచ్లూమంత్రి రాజప్రతినిధులుగను రాజు యొక్క పెద్ద యుద్యోగులుగను ప్రభువులకు మారుగ సామాన్య ప్రజల నుండి యేర్పరచెను.
స్టేట్సు జనరలు (దేశ ప్రతినిధి సభ)ను రిచ్లూ పిలువనేలేదు.
వీలయినపుడెల్ల రాష్ట్రములలోని ప్రతినిధి సభలను దీసి వేసెను.
న్యాయాధిపతులను (పార్లమెంటు) న్యాయవిచారణ విషయ
ములలో తప్ప మరి యేవిషయముల లోను జోక్యము పుచ్చుకొన
కుండ చేసెను. అప్పుడప్పుడు రాజ్యములోని కొందరు ప్రముఖు
లతో మాత్రము రాజు సంప్రదించునట్లు చేసెను. రాజు యొక్క
కార్యనిర్వాహక వర్గము బలపరచబడి అదియే రాజ్య భారమును
వహించెను. రాజు నిరంకుశు డయ్యెను.
జర్మనీలో రోమను కాథలిక్కు - మతస్థుడగు ఆస్ట్రియా
చక్రవర్తికిని ప్రొటస్టెంటు మతస్థులకును జరుగుచున్న ముప్పది
సంవత్సరముల యుద్ధములో రిచ్లూ మంత్రి రోమను కాథలిక్కు-
మతస్థుడయ్యును ఆస్ట్రియాకు వ్యతిరేకముగ ప్రొటె
స్టెంటులతో చేరెను. జర్మనీలో ప్రొటస్టెంటు మతము నిలు
ఫ్రెంచి స్వాతం త్యనిజయము
భేదములకన్న దేశమే ప్రధానముగ నుండెను. పోర్చుగలువారు స్పెయినురాజుపై తిరుగబడునట్లు చేసి రిచ్లూ పోర్చుగలుకు సహాయము చేసెను. ఈ .యుద్ధములన్నిటిలోను పరాసువారే జయము పొందుచుండిరి. 1642 వ సంవత్సరమున రిచ్లూ మరణించెను. అదివరకు రిచ్లూ కింద పనిచేయుచున్న కార్టీ సలు మెజరీను ప్రధానమంత్రి యయ్యెను. ఈయనయుసు రీచ్లూ వంటి మేధానియు సుప్రసిద్ధరాజ్యూంగ వేత్తయు నైయుండెను. విదేశ వ్యవహారములలో రిచ్లూ యొక్క.అడుగుజాడలనే నడచెను. తరువాత ఆరు నెలలకే పదుమూడవలూయి రాజు మరణించెను. ఆయనకుమారుడగు పదునాల్గవలూయి రాజ్యము నకు వచ్చెను.
(2)
మెజరీను
(1643-1661)
పదునాలుగవలూయి రాజగుసరికి ఐదుసంవత్సరముల యీడు గలదు.ఈయనకు యుక్త వయస్సు వచ్చువరకును తల్లి యగు ఆని ప్రభుత్వమును వహంచెను. కార్డినలు మెజరీను ప్రభుత్వమును నడపెను. ఇదివరకు జరుగు చుండిన ముప్పదిసంవత్సరముల యుద్ధ ము యధాప్రకారము జరుప బడెను. ఇరువది యొక్క సంవత్సర ముల యీడుగల కాండి సేనాని పరాసు సేనలను నిపుణతతో నడి పి 1643 సంవత్సరమున స్పెయిన్ వారిననేక యుద్ధములలో నోడించి జర్మను, ఆస్ట్రియను సైన్యములను తరిమి వేసి, ప్లాండర్సును జయించి, డన్కర్కు. నాక్ర మించి, ఫ్రాన్సునకు ఘనతను చేకూ
ర్చెను. 1648 మే నెలలో పరాసు సేనలు ఆస్ట్రియా రాజధాని 101
ఎనిమిదవ అధ్యాయము
యగు వియన్నాపట్టణమున ప్రవేశించగనే ఆస్ట్రియావారు సంధిని కోరిరి. 1648 సం! అక్టోబరు 24 న తేదీన వస్టుఫాలి 'యాసంధి జరిగి ముప్పది సంవత్సరముల యుద్ధము అంతరించినది.. ఈ సంధిపలన ఆస్ట్రియా చక్రవర్తియెక్క ప్రాముఖ్యత తగ్గి పోయి యూరఫుఖండములో కెల్ల పరాసు దేశము మిగుల ప్రా ముఖ్యతను పొందినది. ఫ్రొటెస్టెంటు మతస్థులకు మత స్వేచ్ఛ కలుగచేయ బడెను. పరాసు దేశము ఇదివరకే స్వాధీనమును బొం దియున్న లోరెను, ఆల్సెను రాష్ట్రములందు హక్కును సంపాదిం చినది. రైనునదిని దాటి తూర్పున జర్మనీలోనికిని, ఆల్ఫ్ పర్వ తములను దాటి ఆగ్నేయమున ఇటలీలోనికిని పరాసు దేశపు సరి హద్దులు విస్తరింపచేయ బడినవి. జర్మను రాష్ట్రముల వ్యవహార ములలో ఫ్రాన్సునకు ప్రవేశము గలిగినది.
స్పెయిన్ వారు వెస్టు ఫాలియాసంధిలో చేర లేదు. మెజరీ
ను ఇంగ్లాండులో నూతనముగ స్థాపించబడిన ప్రజాస్వామ్యమున
కధ్యక్షుడగు క్రాంవెలుతో నొడంబడిక చేసికొనెను. ఆంగ్ల
పరాసు సేనలు స్పెయిన్ వారి నోడించెను. 1658 నవంబరు నెల
లో స్పెయిన్ దేశము సంధిని చేసికొనెను. పదునాలుగవ లూయి
రాజు స్పెయిన్ రాకుమార్తె ఇన్ ఫాంటా మేరియూ ఢిలిజూను వివా
హమాడెను. ఆమె అయిదులక్షల క్రౌసుల కట్నమును తెచ్చెను.
ఇందుకు ప్రతిఫలముగ తండ్రి యొక్క స్పెయిన్ రాజ్యపు వారసత్వ
పుహక్కును వదలు కొనెను. స్పెయిన్ రాజు పూర్తిగా కట్నమును
చెల్లించనందున ఆమె వార సత్వపు హక్కును వదలుకొనిన ఒడం
ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము
స్పెయిన్ రాజ్యమును ఫ్రాన్సుసకు సంక్రమింపచేయ వలెనను సం కల్పము తోనే యీ వివాహమును జరిపెను. 1657 వ సంవత్స రమున ఆస్ట్రియా చరవర్తి మూడవ ఎర్డినాండు మరణించెను. పదునాలుగవ లూయిని అపదవికి ఎన్నుకొనెదరేమో నను అశ మెజరీను కుండెను గాని అట్లు జరుగక మొదటి లియోపాల్టు చక్ర పర్తిగ నెన్ను కొన బడెను. జర్మను రాష్ట్రాధిపతులను చాలమం దిని చేర్చి పరాసు రాజు సంరక్షణ క్రింద నుండునట్లు (లీగు ఆ ది రైను) రైను సంఘము నేర్పాటు చేసెను. ఇందువలన జర్మన్ లోను, ఆస్ట్రియా రాజ్యము లోను పరాసు దేశమునకు మంచి పలుకుబడి యేర్పడినది.
మెజరీను రాజు పేర నిరంకుశముగ పాలించెను. లూయి
రాజునకు నిరంకుశత్వమును నేర్పేను. దేశ ప్రతినిధి సభ (స్టేట్సు
జనరలు) నెప్పుడును సమావేశ పరచ నేలేదు. ప్రభువుల కుద్యో
గము లిచ్చియు గౌరవము లిచ్చియు లోబరచు కొనెను. ప్యారిసు
లోని పార్లమెంటను పేరుగల న్యాయాధీపతుల సంఘమువారు
కొంత స్వతంత్రముగ పనిచేయు యత్నించగ మెజరీను వాటిలో
ముఖ్యులను చెరసాల కంపెను. న్యాయాధిపతులును, కొందరు
ప్రభువులును తిరుగ బాటు చేసిరి. 1649 లో రాజమాత పిల్లల
తోకూడ ప్యారిసును వదలి పారిపోవలసి వచ్చెను. కొంతకాల
ము తిరుగ బాటుదారులు జయమును బొందిరి. మెజరీను దేశ
భ్రష్టుడయ్యెను. కానీ కొలది కాలములో తిరుగ బాటుదార్లలో
నైకమత్యము చెడి 'మెజరీసు దేశములోనికి తిరుగ వచ్చెను. తిరు
103
ఎనిమిదవ అధ్యాయము
స్థిరపరచెను. తిరిగి యెట్టి అడ్డు లేకుండ రాజు యొక్క
నిరంకుశాధికారము 1789 వ సంవత్సరపు విప్లవము వరకును అప్ర
తిహతముగ సాగెను.
మెజరీసు విదేశ వ్యవహారములలో సమర్ధత చూపెనే
గాని పరాసుదేశపు ప్రభుత్వము యొక్క ఆర్థిక స్థితిని బాగుచే
యలేదు. ఈయన మరణించు సరికి పరాసుదేశము నలువది
మూడుకోట్ల ఋణములో నుండెను. అవివాహితుడగు మత
గురువయినను ఈయన విశేషముగ ధనము నపహరించి, చని
పోవుసవుడు పదికోట్లధనమును తసబందువులకు విడిచి పెట్టెను,
ఈయన కాలమున నొక గొప్పగ్రంథాలయమును, నొక సర్వకళా
శాలయు, శిల్పము, చిత్తరువులు, చిత్రలేఖనము నేర్పు క ళా
శాలను స్థాపించెను. ఈయన l661 సంవత్సరమున చని పోయెను.
(3)
పదనాలగవ
లూయి రాజ్య
భారమును వహించుట
1661 సంవత్సరమున లూయి రాజు స్వయుగ రాజ్య భారమును వహించినపుడు ఇరువది మూడు సంవత్సరముల వయసు గలదు. మెజరీను మరణించగనే మంత్రులీయన వద్దకు వచ్చి ఇంతట నుంచి ఎవరికిని జవాబు చెప్పవలసియుండునని యడుగగా తనకేనని యీయన ప్రత్యుత్తర మిచ్చెను. దినమునకు ఎనిమిది గంటల కాలము రాజ్యపాలన సంబంధమగు కార్యములలో విని యోగించి ప్రతిపనిని తాసు స్వయముగ చేయుచు వచ్చెను. రాజే
ముప్పది సంవత్సరముల వరకు ప్రధానమంత్రిగ నుండెను.' ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
కాల్పర్టు మంత్రి
కాల్బర్టు 1619 సంవత్సరమున నొక గొప్ప వర్తకులయింట జన్మించెను. పరాసు ప్రభుత్వపు కొలువులో ప్రవేశించి మెజరీసు క్రింద పనిచేయు చుండెను. మెజరీను కాబర్టు యొక్క సమర్థతను బాగుగ గ్రహించి చని పోక ముందు రోజున కీతనిని మిగుల సమర్థుడని వప్పగించెను. కాల్బర్టును రాజు 1661వ సంవత్సరముననే ముఖ్యమంత్రి జేసెను. గొప్ప విద్వాంసుడు. బహు యోగ్యుడు. మిగుల కష్టపడి పనిచేయు వాడు, ఆర్థిక విషయములలో మిగుల సమర్థుడు. కాల్బర్టు నందు రాజునకు గూడ విశేషమగు నమ్మకము గౌరవము గలవు. ప్రభు త్వము యొక్క యార్థిక దుస్థితిని తొలగించుటకు కాల్బర్టు కృషి సలి పెను. ప్రతి సంవత్సరమును ముందుగనే ప్రభుత్వము యొక్క ఆదాయ వ్యయపట్టికను తయారుచేసి ఆదాయమునకు తగినట్టులే ఖర్చు చేయుచు వచ్చెసు. కాల్బర్టు మంత్రి యైన 1661 వ సంవత్స రమున ఆదాయము 8 1/2 కోట్లు. వ్యయము పదకొండుకోట్లు. ఈ యన మరణించిన 1683 సంవత్సరమున ఆదాయము పదకొండు కోట్లు, వ్యయము తోమ్మిది కోట్లు నయ్యెను. పరాసు దేశముయొ క్క వ్యవసాయాభివృద్ధికిని పారిశ్రామికాభివృద్ధికిని కాల్బర్టు విశేష ముగ తోడ్పడెను. విదేశముల నుండి దిగుమతియగు సరుకుల మీద పన్నులు వేసియ, దేశములోని నూతన పరిశ్రమలకు ధనసహా యము చేసియు, నిపుణులైన పారిశ్రామికులను పరాసు దేశమున కాకర్షించియు, పారిశ్రామికుల మధ్య తగాదాలను పరిష్కరిం చుటకు పంచాయితీల నేర్పరచియు పెక్కు విధముల దేశీయపరి
శ్రమలను సంరక్షించెను. రోడ్లు, కాలువలు నిర్మించెను. రేవు 105
ఎనిమిదవ అధ్యాయము
లను కట్టించెను. పరాసు దేశము యొక్క ఉన్ని పరిశ్రమ, లోహ పుపనులు, చర్మపు సరుకులు, జరీ పనులు, తివాచీలు, పట్టు, గ్లాసు, పింగాణీసామాను మొదలగు ననేకవిధములగు పరిశ్రమలు మిక్కిలి వృద్ధియయ్యెను. దేశములోని వర్తకము నేగాక సముద్రముమీద విదే శవర్తకమును కూడ పెంపొందించెను. 1665 సంవత్సరమున సముద్రములమీద వర్తకమును వృద్ధి చేయుట కొర కొక సంఘమును నియమించెను. దానికి ప్రతి పదునైదు దినములకు రాజు స్వయముగ నధ్యకతను వహించు చుండెను. ఆ కాలమునడచ్చి (వలాందా) వారు సముద్రవర్తక మునందు మిక్కిలి ఖ్యాతివహించియుండిరి. వారికి పదునారు వేలనావ లుండెను. వాని మీద ప్రపంచములోని వివిధ దేశములతోను వర్తకముచేయుచు మిగుల ధనికులై యుండిరి. పరాసుదేశమునకు ఆరు వందలకన్న నెక్కువ ఓడలు లేవు, డచ్చి వారితో పరాసులు తులతూగునట్లు చేయవలెనని రాజును, కాల్బర్టును నిశ్చ యించిరి. శీఘ్రముగ పెక్కు పడవలను నిర్మాణము గావించిరి. పరాసు రేవులకు వచ్చు విదేశ పడనలమీద పన్నులను విధిం చిగి. సముద్రములమీద వర్తకముచేయు పరాసు వర్తకులకు సహాయముచేసి. విదేశములతో వర్తకము చేయుట కైదు వర్తక సంఘముల నేర్పరచి వానికి వర్తక పుహక్కుల నిచ్చియు ఋణముల నిచ్చియు ప్రోత్సహించిరి. హిందూ దేశ ప్రాంతములతో వర్తకము చేయుటకు ప్రెంచి ఈస్టు ఇండియాకంపెనీని,
అమెరికాతో వర్తకము చేయుటకు ఫ్రెంచి వెస్టిండియా ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము
కంపెనీని, ఉత్తర దేశములతో వర్తకము చేయుట కొక సంఘ
మును, లివాంటు, సెనిగలు అను మరి రెండు సంఘములను,
స్థాపించిరి. ఈస్టుఇండియాకంపెనీకి అరువదిలక్షలు రుణ
మునిచ్చిరి. ఈవిధముగనే ఇతర సంఘములకును
నిచ్చిరి. పరాసు దేశముయెక్క వలసరాజ్య ములను కూడ వృద్ధి
చేయుటకు ప్రయత్నించిరి. కయేనిలోను, కనడా లోను రాజ్య
మును విస్తరింప జేసిరి. ఉత్తరం అమరికాలోని టెర్రానోవ
నాక్రమించుకొనిరి. 1680 వ సంవత్సరమున ఉత్తర అమెరి
కాలోని మిసిసిపి చుట్టునున్న ప్రాంతములో పరాసులు వలస
నేర్పరచిరి. ఆఫ్రికాలో 1665 వ సంవత్సరమున సెనగలును,
మడగాస్కరు యొక్క తూర్పుతీరమును స్వాధీన పరచుకొని.
తూర్పు ఇండియావర్తక సంఘము వారు హిందూదేశములోని
సూరతు, చంద్రనాగూరు, పుదుచ్చేరి పట్టణములను సంపా
దించిరి. రాజును మంత్రియు పరాసు దేశము యొక్క. నావి
కాదళమును విశేషముగ వృద్ధి చేసిరి. బలమైన నావికాదళము
లేనిది. వలసరాజ్యములు నిలువ నేరవని బాగుగ గ్రహించి.
నౌకానిర్మాణశాలలను కట్టించి నూతన నౌకలను నిర్మాణము గావించిరి.
టూలూను రేవును విరింప జేసి ప్రపంచములో
మిక్కిలి సొగసైన రేవులలో నొకటిగ చేయించిరి.
లవ్వేమంత్రి యుద్ధమంత్రిగనుండి సైనికాభివృద్ధిని చేసి
పరాసు కాల్బలమును గుఱ్ఱపుదళమును యూరపులో కెల్ల శ్రేష్ఠ
మైనవిగా గావించెను. వాబా అను సుప్రసిద్ధ నిర్మాణ కౌశలుడు
102
ఎనిమిదవ అధ్యాయము
యేకలిసి కోటలను కట్టించెను. మరియు కొత్తరకపు యుద్ధపరికరము లనుగూడ కని పెట్టెను. ప్రజల కెక్కువ న్యాయమును కలుగ చేయుటకు దండ శాస్త్రమునందును, న్యాయవిచారణ : పద్దతుల యందును మార్పులు కలుగ జేసి వివిధములగు చట్టములను చేసి. జస్టీసియసు కాలమునకును, నెపోలియన్ కాలమునకును మధ్య పదునాల్గవ లూయీ రాజును, కాల్బర్టుమంత్రియే కలిసి చేసిన చట్టముల వంటివి పుట్టి యుండ లేదు.
1666 వ సంవత్సరమున ప్రకృతి శాస్త్ర పరిశోధనాల
యమును, సంగీతకళాశాలను స్థాపించిరి. 1671 లో శిల్పమును
చిత్ర లేఖనమును గరపు కళాశాలలను, ప్రాగ్దేశ భాషలను పరి
శోధించు ప్రతిష్టాపనమును నెలకొల్పిరి. మెజరీను స్థాపించిన
గ్రంథాలయమునకు పది వేలగ్రంథఘులను చేర్చి ప్రజలంద
రా గ్రంథాలయమును స్వేచ్ఛగా వాడుకొనుటకై తెరచిరి.
లూయీ రాజు విద్వాంసులకును గ్రంథకర్తలకును చిత్ర లేఖకుల
కును ననేక విధముల సహాయము చేయుచుండెను.
విదేశ ములలోకూడ లూయీరాజు యొక్క ఔదార్య
ము, విద్యా పోషణము, కీర్తిని బడసెను..విదేశములనుండి
విద్వాంసులు, చిత్ర కారులు మొదలగువారు పరాసుదేశము
నకు వచ్చి లూయీరాజు యొక్క సత్కారమును బడయు
చుండిరి. పదునాల్గవ లూయి యొక్క కాలము సాహిత్యము
యొక్కయు కళల యొక్కయు అభివృద్ధి పరాసు దేశ చరి
త్రలో ప్రఖ్యాతి చెందిన కాలము. కాల్బర్టుమంత్రి, 1683 వ
108
ఫ్రెంచి స్వాతంత్య విజయము
ఫ్రాన్సు యొక్క
గొప్ప స్థితి
పదునాల్గపలూయి కాలమునకు యూరపులో కెల్ల ఫ్రా న్సు దేశమే అత్యుత్తమస్థితియందున్నది. ఇంగ్లాండు దేశములో , నాకాలమున ప్రజలకును రాజులకును గొప్పపోరాటములు జరుగుచుండెను. 1649 వ సంవత్సరమున మొదటి చార్లెసు రాజును ప్రజాప్రతినిధిసభ వారు విచారించి మరణదండన విధించిరి. రాజును తీసివేసి సంపూర్ణ ప్రజాస్వామ్యమును స్థాపించిరి. ప్రజానాయకుడగు - లివరు క్రాం వెలుసు సంరక్షకుడుగ నెన్ను కొనిరి. క్రాం వెలు 1658 వ సంవత్సరమున చనిపోయి నందున ఆంగ్లేయ ప్రజలను సరిగా నడుపు విశ్వాసపాత్రుడగు నాయకుడు లేకపోయెను. తుదకు చిరచ్ఛేదము గావింపబడిన చార్లెసు రాజు యొక్క 'కుమారుడగు రెండవ చార్లెసును రాజుగా తెచ్చుకొనిరి. రెండవ చార్లెసుసకును ఆంగ్లేయ ప్రజలకును కలహములే కలి గెను. రాజప్రతినిధి సభను సంప్రతించక యే తనయిచ్చవచ్చి నటుల నిరంకుశముగ పాలించెను. రాజునకును ప్రజా ప్రతినిధు లకును పోరాటములు జరుగుచుండగనే 1685 సంవత్సరమున చార్లెసు చనిపోయి, రెండవ జేస్సు రాజయ్యెను. 'జేమ్సు సకును ఆంగ్లేయ ప్రజలకును స్నేహభావములు కుదురనే లేదు. ఉభయుల మధ్యను కలహములు వృద్ధికాగా మూడుసంవత్స రముల లోపలనే ఆంగ్లప్రజ లాయనను వెడలగొట్టి హాలెండు దేశమునుండి విలియమును తమకు రాజుగా తెచ్చు కొనిరి. ప్రజాప్రతినిధి సభ యొక్క సమ్మతి లేనిది పన్నులు
109
ఎనిమిదవ అధ్యాయము
వేయననియు సైన్యములను పెట్టుకొనననియు విచారణ లేకుండ నెవరిని శిక్షించననియు నీయస వాగ్ధత్తముచేసి రాజయ్యెను. 'ఈ కల్లోలముల మధ్య చిక్కుకొని ఇంగ్లాండు దేశము, యూరపు వ్యవహారములలో విశేషముగ జోక్యముపుచ్చుకొను స్థితిలో లేదు. 'స్పెయిసు, ఆస్ట్రియా దేశములు మతయుద్ధముల వలని మిగుల బలహీనములయినవి. జర్మనీ ముప్పది సంవత్సరముల మత యుద్ధమువలన క్షీణించుటయేగాక యనేక ఖండములుగ చీలియున్నది. కావున పదునాల్గవ లూయి యూరపువ్య హారములలో ప్రవేశించి ఫ్రాన్సుకు ఇంక నెక్కువ గౌరవము తేవ లెననియు తాను విదేశములలో రాజ్యమును సంపాదించ వలెననియు తలచి, అనేక యుద్ధములలోనికి దిగెను. విశేష, భాగము జయముల నంది కొంత ప్రదేశమును సంపాదించెను, గాని ఈ యుద్ధముల వలనను దంభముగాను వైభవము తోను విశేషభోగ పరాయణత్వములోను తాను సంచరించుటలో కలి గిన దుర్వయముల వలనను ఫ్రాస్సు దేశమును మితి లేని ఋణ ములలో ముంచివేసెను. ఆగాయముకన్న ఖర్చులెక్కువై ఋణము లపరిమితముగ పెరిగెను. కాని, గొప్ప విద్యాపోషకు డనియు యూరఫుఖండములో కెల్ల కళలను, సాహిత్యమును, గా స్త్రములను, చిత్తరువులను వృద్ధి చేసినవాడనియు కీర్తిని సంపాదిం. చెను. ప్రజాప్రతినిధిసభలను పిలువక తన దేశమును నిరంకుశ ముగా పాలించినసు దేశములో శాంతిని, అభివృద్ధిని నెలకొలిపి ఎచట చూచినను ఫోన్సు దేశపు గొప్పదనమును స్థాపించిన
వాడని పేరువడసెను.
ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము
స్పెయిన్ తో
యుద్ధము
ఆయన చేసిన మొదటి యుద్ధము స్పెయిన్ దేశముతోనై యున్నది. 1665 వ సంవత్సరమున స్పెయిన్ రాజగు నాలుగవ ఫిలిపు చనిపోయెను. ఫిలిపుకు మొదటి కొమార్తె, కూతురు పదునాలుగవ లూయీ భార్య. రెండవ భార్య రెండవ కుమారుడు 'రెండవచార్లెసు. పదునాలుగవ లూయీ తన భార్యకు అచటి చట్టముల ప్రకారము స్పెయిన్ రాజ్యము క్రిం దనుండిన సెదరులాండ్సు రావలెననెను. రెండవ చార్లెసు కుమారు... యావత్తును తన కే రావ లెనె ననెను. రెండవ చార్లె సుకును ఫ్రాన్సు రాజునకును యుద్ధము జరిగెను. స్పెయిన్ రాజు మిగుల బలహీనుడుగ నుండెను. ఫ్రెంచి సైన్యములు, నెడర్లెం డ్సులో అడ్డు లేక జొరబడెను. విశేష భాగము నాక్రమించెసు. ఒక నెల పదునైదు దినములలో "ఫ్రెంచి కౌంటీ స్వాధీనమయ్యెను, దీనితో తక్కిన దేశముల వారికి కన్ను కుట్టెను. ఇంగ్లాండు, స్వీడను, హా లెrండు దేశముల వారు జోక్యము కలుగ జేసికొని సంధి కుదిర్చిరి. స్పెయిన్ రాజగు 'రెండవ చార్లెసు విశేషముగ వ్యాధిగ్రస్తుడై యుండెను. ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యమంతయు వార సత్వముగ దనభార్య కే వచ్చునని పదునాలుగవ లూయీ తల చెను. తాను జయించిన దానిలో కొంత యుంచుకొని తక్కిన దానిని వదలి లూయి సంధి కంగీక రించెను.యుద్ధము ముగిసెను..
హాలండుతో
యుద్ధము.
హాలెండువారు తనకు వ్యతిరేకము ముగ నింగ్లాండులో కలిసివచ్చుటను పదునాలుగవలూయి సహించలే కుండెను. మరియు హాలెండువారు 'ఫ్రెంచివారికి విదేశ
వర్తకములో ముఖ్యముగ పోటీగ సుండిరి. 111
ఎనిమిదవ అధ్యాయము
దేశములో నిరంకుశత్వముండగా హాలండులో ప్రజాపాలన ముండెను. ఫ్రెంచి రాజు యొక్క నిరంకు శత్వమును ఖండించుచు వ్రాయబడిన గ్రంథములు హాలండులో ప్రచురించబడెను. కావున 1672 వ సంవత్సరమున పదునాల్గవ లూయీ రాజు హాలండు మీదికి యుద్ధము ప్రకటించెను. ఇంగ్లండు స్వీడెన్ రాజులకు లంచమిచ్చి హాలండు నుంచి విడదీసెసు. ప్రతిసాలున నిరువదిలక్షల లివరీలు ఇంగ్లాండు యొక్క రాజునకు నిచ్చెను. జరిగిన యుద్ధములో ప్రతిచోటను ఫ్రెంచివారికి జయమును డచ్చి వారికి " (హా లెండు), అపజయమును కలిగెను. ఇంతలో డచ్చి వారికి విలియమ్ ఆఫ్ ఆరెంజి నాయకుడయ్యెను. మీరు సంపూర్ణ ప్రజాస్వామ్యమును తీసివేసి ఆయనను స్టాడు హో ల్డరుగ చేసికొనిరి. ఆయన యూరపులోని రాజులనందరిని నాశ్రయించి ఆస్ట్రియా, స్పెయిసు, జర్మన్, ప్రభువులు మొదలగువారు ఫ్రాన్ సుకు వ్యతిరేకముగా నొక మాదిరిగా చేరునట్లు చేయగలిగెను. కొంతకాలము యుద్ధము జరిగి యిరు పక్షముల వారికిని విసుగుపుట్టి 1678 వ సంవత్సరమున నిం-వే- గన్ సంధితో యుద్ధము ముగిసెను. ఈ సంధివలన ఫ్రెంచి కౌంటి ప్రదేశము 'ఫ్రాన్సులో చేర్చుకొనబడెను. ఇంకను కొంత ప్రదేశము ఫ్రాన్సుకు దక్కెను. ఫ్రాన్సు యొక్క ప్రతిష్ఠ అనేక మడుంగులు హెచ్చెను. 1688 వ సంవత్సరమున నిం గ్లాండులోని ప్రజలు రెడన జేమ్సు రాజును వెడలగొట్టి హాలం డుస్టాడు హోల్డరగు విలియం ఆఫ్ ఆరెంజిని రాజుగా చేసి.
కొనిరి. పదునాల్గవ లూయీ రెండవ జేమ్సును దగ్గరకుతీసెను. ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము
ఇంగ్లాండు, స్పెయిను, హాలండు, ఆస్ట్రియా, సావాయ్, ' డెన్ మార్కు, స్వీడెన్ యొకటిగా జేరెను. యుద్ధము ప్రారంభ మయ్యెను. తొమ్మిది సంవత్సరముల వరకు జరిగెను. భూమిమీ' దసుసముద్రముమీదను గూడ ఫ్రాన్సు కే జయముకలిగెను గాని యిందరితో పోరాడుటవలన ఫ్రాసుకు అపరిమితమైన ధనవ్య యము కలిగెను. తుదకు 1697 వ సంవత్సరమున రెస్విక్ వద్ద సం ధిజరిగెను. విలియమును నింగ్లాండునకు రాజుగా పదునాల్గవ లూ యీ అంగీక రించెను. ఫ్రాన్సు దేశము జయించిన దానిలో కొం తభాగమువదలి వేసెను. యూరపులో కెల్ల సైనిక బలమునందు ఫ్రాన్సు ప్రథమస్థానము వహించినదని స్థిరపడినది.
స్పైన్ వారసత్వము
స్పెయిన్ దేశపు రాజును 'రెండవచార్లెసు మూడు సంవత్స రములు వ్యాధిగ్రస్తులుగ నుండెను. అయనకు పిల్లలు లేరు. ఆయన చనిపోయిన తరువాత వారసులెవ్వరు? పదునాల్గవ లూయీరాజు యొక్క కుమారుడును ఆస్ట్రియాచక్రవర్తి యగు లియోపాల్డును, బవేరియా రాష్ట్రాధిపతియు నీముగ్గురును వారసులమని తలచుచుండిరి. స్పెయిను రాజు కిందనుండిన రాజ్యమంతయు ఫ్రాన్సుసురాజ కుమారునకుగాని ఆస్ట్రియా చక్రవర్తికిగాని వచ్చినచో వారు యూరపులో కెల్ల బలవంతులగుదు రను భయమువలన నింగ్లాండు మొదలగు దేశముల రాజులు స్పెయిన్ రాజ్యమును యీ వివిధవారసులకు పంపిణీ చేసికొను నటుల రెండు పంపిణి యేర్పాటులను చేయించిరి. ఇందుకు పదునాల్గవ లూయీ కూడ సమ్మతించెను. కాని యీపంపకము లేవియు 'స్పెయి
ఎనిమిదవ అధ్యాయము
రాజు యొక్క అనునుతితో జరుగలేదు. ఇంతలో స్పెయి రాజు చనిపోయెను. ఒక (వుయిలు) మరణశాసన ముసు వ్రా సెను. దానిప్రకారము రాజ్య మంతయు పదునాల్గవ లూయీ యొక్క రెండప మనుమడగు ఫిలిప్పునకు సంక్రమింపజేసెను. పదునాల్గవ లూయీ మరణ శాసనము ప్రకారము యావత్తు రాజ్యమును తన మనుమనికి కోరునా? లేక పంపకపు యేర్పా టుల పక్షమున నిలుచునా పదునాల్గవలూయీ రాజు తన మనుమనికి యావత్తు రాజ్యమును వశపరచెను. ఫిలిప్పు స్పెయిన్, దేశమునకు రాజయ్యను. వెంటనే యింగ్లాండు, హాలండు, ఆస్ట్రియా, జర్మనీ ప్రభువులు, పోర్చుగల్ దేశ పు రాజు లోక్క టై యుద్ధమునకు వెడలిరి. ప్రథమమున ఫ్రాన్సునకు జయము కలిగెను. తరువాత అపజయములు కలుగ నారంభించెను. పదు నాలవలూయీ సంధికోగేను. మిత్రమండలివారు తిరస్కరం చిరి. వెంటనే లూయీ ప్రాన్ సు దేశ ప్రజల నుద్భోధించి గొప్ప సేనలను తయారు చేసి శత్రువుల నోడించెను. 1713 వ సంవత్స రమున ఉటెక్టు వద్ద జరిగిన సంధివలన ఆల్సేసు, 'ఫెంచికంటి మొదలగు ప్రదేశముల సన్నిటిని ప్రాన్ సు దక్కించుకొనెను.. ఖైదులోనున్న ప్రొటెస్టెంటులను లూయీ విడుదల జేసెను. స్పెయిన్ రాజ్యము లూయీ రాజు యొక్క మనుమడగు ఫిలిప్పు స్థిరపడెను గాని అతడు ఫ్రాన్ సురాజ్యపు హక్కునుత్యజించెను.
పదునాల్గవ లూ బరాజు డెబ్బది రెండు సంవత్సరములు రాజుగా
ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము
ఆయనకన్న ముందే ఆయనకుమాళ్లును, మనుమలును మరణిం
చినందున ఆయన తరువాత మునిమనుమడు, అయిదు సంవత్సముల
యీడుగల పదునేనవ లూయీ రాజ్యమునకు వచ్చెను.
నానిష్ణుః
పృధివీపతిః"
పదునాల్గవ లూయీ రాజు ఫ్రాస్ సు దేశమును నిరంకు శముగ పాలించెను. “ నావిష్ణుః పృధివీపతిః అనగా రాజు దైవాంశ సంభూతుడు” అను సిద్ధాంతము నా యన సమ్మెను. ప్రజలను పాలించుటకు తనకు దైవము ప్రసాదించెననియు తాను దైవమునకు తప్ప మనుష్యుల కెవరికిని జవాబుదారూ కాసనియు ఆయన తలంచెను. ఆయన కాలమున స్టేట్సు జనరలు (దేశ ప్రతినిధిసభ') ను సమూ వేశ పఱచనే లేదు. రాజు యొక్క చిత్తమే చట్టము," " రాజు నకు సర్వాధికారము గలదు,” ఈ రాజున కడ్డుచెప్పువా రుండ గూడదు” అని ఆయన తలంపు. ఇట్టి అభిప్రాయములనే యిం గ్లాండును పాలించిన మొడటి జేమ్సు రాజు కలిగి యుండెను. ఆంగ్లేయ ప్రజ లెదిరించిరి. తమ ప్రతినిధి సభ యొక్క. ఆసుమతి లేనిది తమమీద పన్నులు వేయుటకు వీలు లేదనిరి. రాజు ఒప్పుకొనలేదు. ఆయన కుమారుడగు మొదటి చార్లెను కాలమున నీ పోరాటము హెచ్చెను. చార్లెసు తన యిచ్చ వచ్చిన పన్ను లను వేసి వసూలు చేయ దలచెను. ప్రజ లెదిరించిరి. తిరుగ బడిరి. రాజును దేశ ద్రోహపు నేరము క్రింద విచారించిరి. శిర ఛ్ఛేదము గావించిరి. ఇటుల ఇంగ్లాండు ప్రజలు రాజు యొక్క నిరంకుశత్వముతో పోరాడుచున్న కాలమున యూరపుఖండ
మంతయు రాజుల నిరంకుశత్వము కింద పాలింపబడు చుండెను. 115
ఎనిమిదవ అధ్యాయము
లూయీరాజు తనక్రింది ప్రభువులుసు సామంతు రాజులును తన చుట్టును చేరి తన్ను స్తోత్ర పాఠములు చేయుచు తనతో పాటు విలా సములలోను కీడలలోను నింద్రియ వ్యవసముల లోను రాజమం దిరములో కాలము గడవునటులు చేసెను. రాజునకు దూరము గసున్న పలువును ఏదో పేరు పెట్టి రాజు శిక్షించెను. రాజు చుట్టు చేరిన ప్రభువులకు బిరుదములిచ్చి సంతోషపర చెమె. ప్రభువులు తమ భూములమీదవచ్చు. ఐవజును "చ్చుకొని రాజు సమ్ముఖ మున ఖర్చు చేసికొని ఋణ స్తులైరి. రాజు మునిసిపాలిటీల హ క్కులను తగ్గించెను. వర్తకులు ప్రతివిషయమునను రాజు మీద ఆధారపడునట్లు చేసెను. సామాన్య ప్రజలు ప్రభువుల మొ త్తిడిసుం డి సంరక్షణకొరకు రాజు మీదనే ఆధారపడిరి. రోమను కాథలిక్కు మతగురువులు, రాజు రాజ్య వ్యవహారముల కేగాక మతమునకు గూడ దైవాంశ సంభూతుడగు నిరంకుశ ప్రభువని తీర్మానించిరి. ఇందుకు ప్రతిఫలముగ రాజు ప్రొటెస్టెటు మతావలంబులను ఘోరశిక్షలపాలు చేసి రోమను కాథలిక్కు మతగురువులను సంతోష పెట్టెను. ఈ విధమున సమస్త విషయములలోను రాజు నిరంకుశు డయ్యెను. పదునాలుగవ లూయీ యొక్క.అనుగ్రహ ముసుకోరి జయజయధ్వనులు చేయుచు అన్ని జాతుల ప్రజలు మెలఁగిరి ఆయన యొక్క పరిపాలనా సామర్ధ్యము యుద్ధజయ ములు, వైదుష్యము, పేరు ప్రతిష్టలు—యివి ఆయన యొక్క యింద్రియ లోలతను, దుర్వ్యయముసు, ఆర్థిక దుస్థితిని, నిరంకు శత్వమును తాత్కాలికముగా కప్పిపుచ్చినవి. అతని వార సుల కాలమున ఈ లోపములన్నియు బయటపడి సవి.