ప్రబోధచంద్రోదయము/పంచమాశ్వాసము
ప్రబోధచంద్రోదయము
పంచమాశ్వాసము
క. | శ్రీరమణీరమణీయవి | 1 |
వ. | అవధరింపు మిట్లు విన్నవించిన శ్రద్ధావధూటిం గనుంగొని విష్ణుభక్తిమహా | 2 |
క. | కేళ్లంగి వేసిన ట్లా | 3 |
గీ. | దండి గల్గిన బుద్ధిమంతుండు దనకు | 4 |
చ. | అతఁడును బుత్రపౌత్రవిలయంబునఁ బుట్టినశోకవహ్నిచే | |
| మతి నిజ మయ్యెనేని మనమన్కిత మంతయుఁ దీరు నాత్మకున్ | 5 |
ఆ. | అనిన శ్రద్ధ పల్కె నావిష్ణుభక్తితో | 6 |
క. | అని విష్ణుభక్తియు మనం | 7 |
సీ. | హా! కామరాగమదాది పుత్రకులార | |
గీ. | నేది యేదితి మిమ్ముల నిన్నినాళ్ళు | 8 |
చ. | విసమువిధాన నెక్కుడు వివేకముఁ జూపుచుఁ బ్రాణమారుత | 9 |
గీ. | చేరి సంకల్పుఁ డప్పుడు సేదదేర్ప | 10 |
మ. | కలకంఠీ! ననుఁ బాసి నీ వెఱుఁగ వేకాలంబు నే నిన్నుఁ బా | 11 |
మ. | చతురత్వంబున సేదదేర్ప మన సాసంకల్పుతో నాకు నీ | 12 |
క. | అంతట డగ్గఱి యావే | 13 |
క. | భావంబు లనిత్యము లని | 14 |
మ. | శతకల్పాయువులైన పంకజభవుల్ శక్రాదిదిక్పాలకుల్ | 15 |
క. | లోకంబు లనిత్యములను | |
| శోకము నిత్యానిత్యవి | 16 |
క. | ఏకము నిత్యము బ్రహ్మము | 17 |
క. | మనసు సరస్వతిఁ గనుఁగొని | 18 |
గీ. | వాణి యతనిఁ జూచి వత్స! యీవిభ్రాంతి | 19 |
శా. | క్లేశప్రాయబహుప్రియోరువిషవల్లీబీజముల్ విత్తఁగా | 20 |
సీ. | అనవుడు మనసు వేదాంతశారదఁ జూచి | |
గీ. | నీపరిగ్రహములును ము న్నిపుడు మీఁద | 21 |
ఉ. | ఎక్కితి వెన్ని పర్వతము లేఱులు దాఁటితి వెన్ని దేశముల్ | 22 |
చ. | అనవుడు నాసరస్వతికి నమ్మన సిట్లను దేవి! యాన తి | 23 |
ఆ. | అని శారదాంబ మనసుఁ గనుంగొని | 24 |
ఉ. | కాన ననర్థమూల మగు కాలిన నీమమతావికారమున్ | 25 |
వ. | అనవుడు న్మనంబు వ్యాససరస్వతి గనుంగొని దేవీ! నీయానతిచ్చినట్ల | 26 |
క. | విడువని యభ్యసనంబున | 27 |
ఉ. | సాటువయైన త్రోవ మనసా! విను మున్ను భవాంబురాశిలోఁ | 28 |
గీ. | జనని భవదీయవదనేందుజనితమైన | 29 |
క. | అటుగాక మిక్కిలిని సం | 30 |
ఆ. | ఏటుపోటు వ్రేటు నేమియులేక మ | 31 |
సీ. | తల్లి! వేదాంతశాస్త్రసరస్వతీదేవి! | |
గీ. | నతిరహస్యంబు చెప్ప రా దన్యజనుల | 32 |
లయగ్రాహి. | నందకధరున్ ఘనపురందరమణిప్రతిము నిందిరమనోహరు ముకుందు హరిఁ గానీ | 33 |
వ. | తత్పరమబ్రహ్మానందసాధనంబులైన యంతర్లక్ష్యంబులు బహిర్లక్ష్యం | |
| యిప్పుడు నీహృదయం బుపదేశక్షమంబయ్యె నటుగావున నింక నొక్కటి | 34 |
ఆ. | జడున కీయసారసంసారవిభ్రాంతి | 35 |
మ. | అన వైరాగ్యుఁడు వచ్చె నిట్లనుచు నీలాంభోజపత్రంబు క | 36 |
మ. | ధన ముద్యన్నిధనంబు దేహము విపత్సంతానగేహంబు భా | 37 |
సీ. | అని వచింపుచుఁ జేరఁ జనుదెంచు వైరాగ్యుఁ | |
గీ. | నిన్నుఁ జూడంగ నిపుడు నానెమ్మనమున | 38 |
మత్తకోకిల. | త్రోవఁ బాంధులు పుష్కరంబునఁ దోయదంబులు వార్ధిలో | 39 |
మణిగణనికరము. | అనవుడు మనసున నతిముదమున న | 40 |
శా. | ఆవిశ్రామపుఁదోఁటలో మధుసుగంధాంధీకృతాళివ్రజ | 41 |
వ. | అనవుడు వ్యాససరస్వతి మనసుం గనుంగొని గృహస్థున కొక్కముహుర్త | |
| మాదిమంత్రిరక్షితంబైన యౌవరాజ్యంబు పాలింప నిన్నూఱడింప విష్ణు | 42 |
సీ. | ఈవును బుత్రసమేతుండవైతేని | |
గీ. | కొడుక! నీవు నివృత్తితోఁ గూడితేని | 43 |
మ. | అని భోధించిన శారదారమణిపాదాంభోజయుగ్మంబుపై | 44 |
వ. | అనవుడు నమ్మన సట్లు గావించె నిత్తెఱం గంతయు దివ్యచిత్తంబున | |
| ననర్గళశ్రేయఃప్రాప్తి యగున ట్లనుగ్రహించెదనని పనిచిన సమీపంబునకుం | 45 |
చ. | ప్రియసతి నందనుల్ పొలియఁ బెద్దకుమారుఁడు మోహుఁ డేడనో | 46 |
గీ. | నీవు మత్ప్రియ నుపనిషన్నీరజాక్షి | 47 |
క. | కని మ్రొక్కి తల్లి యెచటికిఁ | 48 |
గీ. | మోహముఖదుష్టవర్గంబు ముడుఁగు పడియె | 49 |
క. | జీవేశ్వరుండు జీవులు | 50 |
సీ. | అనవుడు శాంతి యిట్లనియెను మనసుపై | |
| చెఱఁ బడ్డయతనికిఁ జెఱఁ బెట్టి నతనిపైఁ | |
గీ. | మూలమని దాని నిప్పుడు మూలముట్టు | 51 |
సీ. | అనుకూలభార్య నిత్యానిత్యచింత సు | |
గీ. | గాఁగ జీవేశ్వరుండు నిష్కంటకముగ | 52 |
వ. | అనవుడు శ్రద్ధాంగన తనయనుంగుఁదనయ శాంతిం జూచి యిట్లనియె. | |
| మం బయ్యేనేని యెట్టకేలకు నించుకంత యంగీకరించు ధర్ముండును | 53 |
సీ. | శతకోటియోజనశబ్దంబు లైనను | |
గీ. | బరశరీరప్రవేశంబు జరపవచ్చె | 54 |
క. | ఆవేళన్ మది విదిత | 55 |
కందగర్భితమణిగణనికరము
| కలికి యొకతె యలకము లలిబలమున్ | 56 |
సీ. | పోవుచో నప్పు డప్పురుషుని యెదుటఁ గ | |
గీ. | సృమరహిమవారిధారాగృహములతోడ | 57 |
వ. | అ ట్లతిమనోహరంబును నానారత్నమయంబునునై యింద్రచాపనిర్మితం | 58 |
సీ. | కంకణంబులు మ్రోయఁ గడిగెఁ బాదాబ్జంబు | |
గీ. | నిట్టిసంసారసుఖము చేపట్టె నాత్మ | 59 |
క. | అన విని శాంతిమృగేక్షణ | 60 |
శా. | అంతన్ జీవుని పార్మ్వవర్తి యగుతర్కామాత్యుఁ డాయిద్దఱిన్ | 61 |
క. | గాటపు సంసారాంబుధి | 62 |
ఉత్సాహ. | మేలుమేలు తర్క నన్ను మేలుకొల్పి యెంతయున్ | |
| జాలుఁ జాలు నింక విషయసంగ మనుచు మధుపతిన్ | 63 |
క. | జననీ నామదిలోపలి | 64 |
ఆ. | నన్ను నవ్వివేకనరనాథుఁ డుపనిష | 65 |
క. | అని శాంతిశ్రద్ధలు తమ | 66 |
సీ. | అసదృశక్లేశోర్ము లన్నియు దాఁటితి | |
గీ. | ఘోరసంసారవారిధితీరమునకుఁ | 67 |
వ. | అని పురుషుడు సంతోషించునవసరంబున వివేకమహారాజు శ్రద్ధాంగ | 68 |
ఉత్సాహ. | కన్నకన్న ధూర్తులెల్లఁ గాసిపెట్టి దాసిఁగా | 69 |
సీ. | నావుడు నుపనిషద్దేవి కిట్లను శాంతి | |
| ఫలమునఁ దనుదానె భగ్నమై పోయె నీ | |
గీ. | నీవు నిలువంగ వలదిఁక నిట్టిపాట్ల | 70 |
క. | అన నుపనిషత్తు శాంతిం | 71 |
క. | చని యేరికైన జీవుఁడు | 72 |
మానిని. | అంచుఁ గృపామతి నానతియిచ్చె వయస్యగతత్రసనై యెట్లుగా | 73 |
ఉ. | జీవునకున్ వివేకునకుఁ జెప్పెఁ జుమీ హరిభక్తి మున్ను | 74 |
ఆ. | అనిన నుపనిషత్తు నాత్ముని డగ్గఱి | |
| దల్లి! మేము చేయఁదగు నీకు నీనమ | 75 |
క. | దేవీ! నీకుం దల్లికి | 76 |
తోటకము. | అని పల్క వివేకున కర్థిమహో | 77 |
విద్యున్మాల. | అమ్మా! యిన్నా ళ్ళత్యంతాయా | 78 |
చ. | మఠముల రచ్చలన్ దివిజమందిరతీర్థతటంబులన్ వృథా | 79 |
గీ. | వేదు లనుచుఁ బురాణార్థవేదు లనుచుఁ | 80 |
సీ. | అంతటఁ గృష్ణాజినాజ్యసమిజ్జుహు | |
| బహువిధపుస్తకభారసహిత | |
గీ. | న న్నిముడుకొమ్ము కరుణ ననాథ ననిన | 81 |
ఉ. | ఎవ్వనియందు విశ్వ ముదయించు నడంగుఁ దలంప నిజ్జగం | 82 |
వ. | అనవుడుఁ దన్నుం గనుంగొని యజ్ఞవిద్య సాక్షేపంబుగా నిట్లనియె. | |
| సమయసంసారంబు చెడుననుట చీకటిచేతఁ జీకటి చెడు ననుటగాదె | 83 |
తరళ. | వినుము తన్మఖవిద్య యిట్లను వింతగా ననుఁ జూచి యో | 84 |
క. | అంటను నచట వెడలి నేఁ | 85 |
ఆ. | చూచి యజ్ఞవిద్యజోటి వేఁడినయట్లు | 86 |
వ. | అపుడు. | 87 |
సీ. | అప్పుడు మీమాంస యాత్మశిష్యులవద | |
| నంతఁ గుమారిలుం డను హితశిష్యుండు | |
గీ. | పొగడ దుపయుక్తకర్మునిఁ బురుషు నెందుఁ | 88 |
క. | అనినఁ గుమారిలగురుఁ డి | 89 |
ఉ. | ఆతఁడు చూచుచుండు జగదావళి చేష్టలు సర్వసాక్షియై | 90 |
క. | అన విని వివేకనరపతి | 91 |
భుజంగప్రయాతము. | సుపర్ణంబు లారెండు జోకై మహాపా | 92 |
క. | అనినఁ బురుషుఁ డుపనిష | |
| చనిన తెరు వెల్లఁ జెప్పుము | 93 |
సీ. | అంత మీమాంసచే ననిపించుకొని తర్క | |
గీ. | తత్వగణనాపరాయణత్వంబు దాల్చి | 94 |
వ. | అప్పుడు వారిలో నొక్కతర్కవిద్య కర్కశభాషణంబుల నోసి యభాసు | |
| తంబు నానావర్ణంబులయిన మేఘంబుల వికారంబు గగనంబునకు మూఢు లా | 95 |
ఉ. | అంతటఁ దర్కవిద్యలు వృథాతిశయంబున దొమ్మి రేఁగి యీ | 96 |
మహాస్రగ్ధర. | తల వీడన్ గోక జాఱన్ దరళకుచతటితారహారాళిముక్తా | 97 |
స్రగ్విణి. | దండకారణ్యమధ్యంబు కాల్ద్రోవలో | 98 |
ఆ. | వెడలి నన్నుఁ జూచి వెఱవకు వెఱవకు | 99 |
సీ. | అప్పు డాతర్కవిద్యలు పికాపికలై య | |
| కడుసంభ్రమంబునఁ గౌఁగిలించి | |
గీ. | చెప్పఁడే తొల్లి తెలియ నాచిన్మయుండు | 100 |
క. | తను నెఱుగనివారల నే | 101 |
ఆ. | అతనికంటె వేఱ యనరాదు నిన్ను నీ | 102 |
వ. | అనుచు బహుప్రకారంబుల బోధించిన. | 103 |
చ. | ఉపనిషదబ్జనేత్ర వినయోక్తుల యర్థ మెఱుంగలేక జీ | 104 |
క. | నావుడు వివేకుఁ డిట్లను | 105 |
క. | ఇది నేఁ గా నిది నేఁ గా | 106 |
వ. | పురుషుం డి ట్లుపనిషద్వివేకులు చెప్పినవాక్యంబుల యర్ధంబులు పలుమాఱు | 107 |
చ. | దగదగమంచుఁ గ్రొమ్మెఱుఁగుతండము కైవడి గంటలాఱునున్ | 108 |
చ. | కలుగునొ కల్గదో యవునో కాదొకొ తోఁచునొ తోఁచదో తుదిన్ | 109 |
క. | అనుచుం బురుషున్ డగ్గఱి | |
| బునఁ గౌఁగిలించి యాహా! | 110 |
గీ. | గాఢమోహాంధకారవికల్పనిద్రి | 111 |
ఉ. | ఒక్కటి సంశయిం చడుగనొల్లక యొక్కటి గూడఁ బోక యే | 112 |
క. | ఇది కలిగె ననుచు నుబ్బిక | 113 |
వ. | అని యిట్లు పురుషుండు విద్యాప్రబోధచంద్రోదయంబుననైన పరమానం | |
| రాజ్యంబునందు సువృష్టియు ధనధాన్యాదిసమృద్ధియుం గలుగు. రాజులు | 114 |
శా. | ముగ్దామీనపతాక నాకతటినీమూర్ధన్యసద్భోధ సు | 115 |
క. | విభవమహేంద్ర! యనంత | 116 |
మంగళమహాశ్రీ. | శ్రీరమణశీతకరశేఖర సరోజభవసేవిత ధనేశ్వరరహస్యో | 117 |
గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారస్వా
తాభినంది నంది సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ
మలయమారుతాభిధాన ఘంటనాగయ ప్రధానతనయ
సింగయకవిపుంగవ ప్రణీతంబైన ప్రబోధచం
ద్రోదయంబను మహాకావ్యంబునందు సర్వం
బును బంచమాశ్వాసము.