శ్రీరస్తు

ప్రబంధరత్నావళి

అధర్వణాచార్యులు -- [భారతము] (అం.)

శా. తృష్ణాతంతునిబద్ధబుద్ధులగు రాధేయాదులంగూడి శ్రీ
కృష్ణుం గేవలమర్త్యుఁగాఁ దలచి మర్దింపంగ నుత్సాహవ
ర్ధిష్ణుండయ్యె సుయోధనుం డకట! ధాత్రీనాథ! యూహింపుమా
యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్? (అం) 1

మ. నతనానావనినాథయూథమకుటన్యస్తాబ్జ రాగోజ్జ్వల
ద్ద్యుతి విభ్రాజితపాదపీఠు లలనాదోశ్చామరోద్ధూత మా
రుతలోలాలి వినీలకుంతలు బ్రభారుగ్ధాము గేయూరశో
భితబాహాపరిఘున్ సువర్ణధరణీభృద్ధైర్యు దుర్యోధనున్. (అం) 2

మ. ప్రణతాశేషవసుంధరాధిప శిరస్స్రగ్గంధలుబ్ధభ్రమ
[1]త్క్వణదభ్ర భ్రమకృద్ద్విరేఫగణఝంకారప్రదాబద్ధసం
[?]ప్రణవత్యుత్ప్రథిత ప్రవర్ధితసమస్తక్షత్త్రసూయాధ్వర
క్షణసింహాసనభాసితున్ దృఢధనుశ్శ్లాఘానుజున్ ధర్మజున్. (అం) 3

సీ. రాజమండలపూర్ణరాజమండలవీధి రత్నగర్భామల రత్నగర్భ
గంధర్వగంధర్వగంధర్వనగరంబు నాగపున్నాగపున్నాగవనము
మార్గణమార్గణమార్గణపీఠ ముత్తుంగభుజంగభుజంగభూమి
కాంతకాంతారాతికాంతకుంతస్థలి వీరకుమారకుమారసరసి
ఆ. యనగ బొగడ్త కెక్కు నలకాపురంబు దే
వేంద్రుపురము దానవేంద్రుపురముఁ
గ్రేణిసేయు లలితశోణాంశుమణిబద్ధ
గోపురంబు హస్తినాపురంబు.

అన్నమరాజు, కానుకొలను [అమరుకము] (ఆం)
చ. చులుకనఁ జాపముం దిగుచుచోఁ గటకాముఖపాణిమీఁదఁ బొ
ల్లొలయు నఖాంశులం గదిసి యొప్పెడు కెంజిగురాకుగుత్తిచే
నలవడి కర్ణపూరమున నంటిన తుమ్మెదవోని పార్వతీ
లలన కటాక్షదృష్టి మనలం జరితార్థులఁ జేయుఁ గావుతన్. (ఆం) 5

సీ. తివిరిరాశికి నెక్కి తిరుగు చక్రంబులు మెట్టులఁ బదిలమై మెఱయుతేరు,
బహుముఖంబుల నేర్పు పచరించుసారథి వ్రాసి చూపఁగరాని వారువములు,
గట్టియై వీఁక నక్కఱఁ దీర్చు విలుగమ్మి శ్రుతిహితంబుగ మ్రోఁత చూపునారి,
విజయానుకూలమై విలసిల్లుబాణంబు సరిలేనికోటుల సంఖ్యబలము,
గీ. దనకు నబ్బుటయునుఁ బురత్రయము గెలిచి
పృథుల విఖ్యాతిఁ గైకొన్న రథికవరుఁడు
జయముఁ దేజంబు భూతియుఁ బ్రియమెలర్ప
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుగాత. (ఆం) 6

అన్నమయ్య, తాళ్ళపాక [తిరువేంకటేశ్వరశతకము]
చ. అరిసెలు నూనెబూరెలును నౌఁగులుఁ జక్కెరమండెఁగల్ వడల్
బురుడలు వాలమండెఁగ లపూపము లయ్యలమేలుమంగ నీ
కరుదుగ విందువెట్టెఁ బరమాన్నశతంబుల సూపకోట్లతో
నిరతవినిర్మలాన్నముల నేతులసోనల వేంకటేశ్వరా! (ఆం) 7

అప్పన్న [చారుచర్య] (జ)
సీ. కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా ర్థప్రమాణము ప్రాఁతఁదనము గలిగి
యుజ్జ్వలచ్ఛాయమై యొత్తినతరవాయి శశమాంసఖండంబు చంద మగుచు
నొగరించుకయు లేక మిగులంగఁ దీపైన క్రముకంబు; నొఱ్ఱనై కమ్మవలచి
దళమెక్కి పండినతాంబూలదళములు; కాలోపలంబులు గాల్చి వడియ
గీ. నూని కట్టిచ్చి చూర్ణంబుగా నొనర్చి
భుక్తి గొనక ముందట నాల్గు భోజనోత్త
రమున రెండును నటమీఁద రాత్రి యాఱు
మార్లు తమ్ముల మొప్పారు మంత్రియప్ప! (జ) 8

సీ. లఘుకారి క్రిమిదోషవిఘటనసంధాయి దీపననిర్దోషదీప్తికరము,
పాషాణచూర్ణంబు; పైత్యవాతఘ్నంబు శంఖచూర్ణము పైత్యశైత్యహరము;
చిప్పలసున్నంబు శ్లేష్మంబు నడఁగించు గుల్లసున్నము వాతగుణముఁ జెఱచు
తనవిచ్చుఁ జాల ముత్యంపుఁజూర్ణము చూర్ణ పర్ణ మాయువునకు బాధకంబు;
గీ. పత్రమూలంబునను రోగపటల ముండు
నగ్రమది పాపములకెల్ల నాలయంబు
నడిమి యీనియ బుద్ధివినాశకరము
వీని వర్జించి తగఁ జేయు వీడియంబు. (జ) 9

చ. వదనవికాససౌరభవివర్ధనకారి లసన్ముదావహం
బుదరవిశేషసౌఖ్యకర ముద్గతదోషబలప్రహారి స
మ్మదజనకంబు తమ్ములము మానవతీపరిభోగవేళలన్
మదనపునర్భవీకరణమంత్రము తుల్యమె దీని కెద్దియున్. (జ) 10

అమరేశ్వరుఁడు, చిమ్మపూఁడి [విక్రమసేనము] (ఇ)

మ. అదె కైలాసము దిగ్విలాసము విహాయశ్చారిణీసమ్మద
ప్రదవిన్యాస ముదగ్రభాసము మరుద్భానూసదాభ్యాస మ
భ్యుదయన్యాస మసన్నిరాసము మయూరోదారనిధ్వానభి
భ్యదహివ్రాతకృతప్రవాసము త్రినేత్రావాస ముర్వీశ్వరా! (ఆం) 11

సీ. అరుణపుష్పావలి యగ్నిగా సంధించి యళుల నుల్కలుగాఁగ నావహించి
దందడి వీతెంచు దక్షిణపవనంబు భస్త్రానిలంబుగాఁ బరిఢవించి
చిలుకలు పికములు చేదోడు సేయంగ మాధవుండనుకనుమరి గడంగి
యంగజుం డనుపతియానతిఁ బనిపూని మొగడల న్ములుకులమొనలు చఱచు
తే. కొలిమియొక్కొ యనఁగఁ గురియు పరాగంబు
విస్ఫులింగములుగ విరహు లులుక
నేచి పూచియున్న యీ యశోకమహీరు
హంబుఁ గంటె మాళవాధినాథ. (ఆం) 12

చ. అలకలు తేఁటిదాఁటులును హస్తతలంబులు పల్లవంబులుం
బలుకులు గీరపోతములభాషలు మేనులు బువ్వుఁదీఁగెలున్
లలిఁ దమలోఁ దడంబడ విలాసవతు ల్మదనాధిరాజ్య ల
క్ష్ములగతి నెల్లచో విరులుగోయుట చెన్నెసలారెఁ దోటలన్. (ఆం) 13

చ. అలరులపాన్పులం దలిరుటాకుల సెజ్జల హర్మ్యవేదికా
తలములఁ దీవెయిండ్ల సికతాశయనంబుల మున్వియుక్తి మై
నలఁదురి వందుకందువల నప్పటి కప్పటి కింపుఁ బెంపఁ గో
ర్కులు తనివారి వేడ్కపడఁ గూడిరి వేడుకతోడ దంపతుల్. (ఆం) 14

చ. అలికలితపంకజము నొక్కయతివఁ దెచ్చి
చుట్టమగునట్టి వనితకుఁ జూపుటయును
తన కురులు మోము నెదుట నద్దంబులేక
తోఁచె ననుచు నమ్ముగ్ధ యద్భుతముఁ బొందె. (ఆం) 15

చ. ఇఱియుకుచంబులందొకటి యించుక వీడ్వడ నొక్కకేల లేఁ
బొఱఁగబళించి నిక్కుచును బూవున కెత్తిన చేతిచంక క్రొ
మ్మెఱుఁగులు హస్తముం గడచి మీఁదికి బ్రాఁకఁగ మున్నుగన్న యా
గుఱుతులు డాసి కోసెఁ దుదికొమ్మల పూవులు కొమ్మ నెమ్మితోన్. (ఆం) 16

తే. ఇఱ్ఱి పాపయిల్కుందేలు మఱ్ఱి యనుచు
జనులు కనుకని పలికెడు చందమామ
నడిమిమచ్చకు నెఱిఁగి పే రిడఁగ నేర్తు
రప్పురమున మేడలపయి నాడుసతులు. (ఆం) 17

సీ. ఏపునఁ జెలరేఁగి యేయు మనోజన్ము చెఱుకువిల్ రెండుగా విఱిచివైతుఁ
బలువలై పలుకు చిల్కలనాలుకల ముల్లు విఱిచి యీరములలో వెడల నడఁతు
మదమున మ్రోయు తుమ్మెదలఁ జంపకలతాం తములలో మునుగంగ నిమురింతుఁ[?]
దగులమై వీతెంచు దక్షిణాశాగంధ వహు మహాహీంద్రునివాఁతఁ ద్రోతు
తే. నేటి కులికెదు నా యట్టిబోటి కలుగ
వెలఁది! నీ మదిలోపల వెఱవకుండు
మమ్మ! ధైర్యంబు వదలకు మమ్మ! యెందుఁ
గత్తలము గల్గు మేనికిఁ గలదె బాధ? (ఆం) 18

చ. కటి వడఁకాడ నీల్గ నసికౌను కరంబుల నక్కులించి పి
న్నట తరళంబుతోడ నయనద్యుతి భ్రూలతలం దెలర్ప నుం
గుటములు మోఁపి నిక్కుచునుఁ గ్రొవ్విరిచన్నులచాయ మోము చ
క్కటి కెసఁగంగఁ జొచ్చె నొక కామిని తోయజషండ మిమ్ములన్. (ఆం) 19

తే. కమలినీకాంత యెంతయుఁ గంది వంద
వారుణీసక్తుఁడై వసువ్యయము చేసి
యరిగినట్లు సరాగియై యంబరంబుఁ
దొఱఁగి పశ్చిమజలధిలో నుఱికెఁ దరణి. (ఆం) 20

సీ. కలయంగ నలఁదిన కస్తూరి పెల్లున జలములదెల్లనుఁ గఁలఁగఁజేసి
కుచమండలముల కుంకుమ చర్చల నీరెల్ల జేవుఱు నీరు చేసి
తనులిప్త సురభిచందన కర్దమంబున వారినెల్లఁ బులకవండు[?] సేసి
మూలల నవపుష్పమాలికావితతుల వనమెల్లఁ దెట్టువఁ గొనఁగఁ జేసి
తే. యలక లలితవీధి నంటఁ గన్గవలఁ గెం
పెలయఁ గామచిహ్నలెల్ల బెలయ
నలరువాతు లమర జలకేలి సాలించి
కొలను వెడలి రింతు లలసగతుల. (ఆం) 21

మ. కులశైలంబులలో సువర్ణగిరి దిక్కుంభీంద్రవర్గంబులో
బలభిన్నాగము లోకపాలకులలోఁ బర్జన్యుఁ డుగ్రోరగం
బులలో శేషుఁడు పెంపుఁగన్నకరణిన్ బూజ్యాధిపశ్రేణిలో
వెలసెన్ విక్రమసేనభూవిభుఁడు దోర్వీర్యప్రతాపంబునన్. (ఇ) 22

సీ. కేలిఁ దెప్పము సేసి క్రాలి లీలావతి నీఁదించుచును నొక్క యింతి డాసి
చే యిచ్చి యిందు విచ్చేయుమంచును దన్వి నడిపించుచును నొక్కపడఁతి నూఁది
ముదిత చేకూడను ముద్దులాడుచు నొక్క తరుణికి నిమ్ములఁ దమ్మ యొసఁగి
రమణిపాపటఁ బుష్పరజముఁ బోయుచు నిదె మిగిలెఁ గొమ్మని యొక్క మగువ కిచ్చి
తే. కదలఁ బడినట్టు లొక్కతెఁ గౌఁగలించి
ముంపు మునిఁగినట్లొక్కతె మోవి యాని
లలితనాయక కేలీవిలాస మమర
లీల జలకేలి సలిపె భూపాలసుతుఁడు. (ఆం) 23

చ. కొలఁదికి మీఱఁ బెద్దయగు కోటతనర్పున వస్తుసంతతో
జ్జ్వలతరసత్ప్రభాతిరవిచంద్రరుచుల్ సొరనేరకున్న సం
ధ్యలు దివసత్రియామలును దత్పురిపౌరజనం బెఱుంగుఁ ద
మ్ములముచవిన్ విహంగగతిఁ బూవులతావి రతిప్రసంగతిన్.[2] (ఆం) 24

తే. క్రాలుఁగన్నులు ముద్దుమొగములుఁ దమకు
నసదృశప్రభావమునఁ జెల్వగుటఁ జేసి
మునిఁగి మీలను దలలెత్తి వనరుహములఁ
దూలపఱచిరి వనకేళివేళ సతులు. (ఆం) 25

చ. గొనయము తమ్మినూల్ చెఱకుఁగోల ధనుర్లత పూవులమ్ము లే
టును నొకమాటు తా నతనుఁడున్ మును నుగ్రు జయించె జీవరా
శి నొడుచు టేమి చెప్ప నని చేయు నుతుల్ దగు మోహనప్రవ
ర్తన గల కాముఁ డీవుత ముదంబున మీ కిలఁ గామసౌఖ్యముల్.[3] (జ) 26

చ. చనవున రెండువక్త్రములు చన్నులపా ల్గుడువంగ నొక్క మో
ము నగఁగ నొక్క యాననము ముద్దు నటింపఁగ నొక్క యాస్యము
న్గనఁగ నిదేమి పల్క దని యాలపనంబునఁ బెక్కులించు[?] ను
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు నీవుతన్. (ఆం) 27

సీ. చూపులకట్టు పూఁదూపులఁ జేపట్టు నబలలచూడ్కుల యాయుధములు,
తాయంబునకు గండుఁగోయిలఁ గూయించు బాలలపలుకుల మూలమంత్ర,
మెదిరికిఁ దేఁటుల నెడయాటలాడించు నబలలయలకల యాప్తబలము,
సవరణకుం జంద్రుఁ జాలించు మగువల మొగముల సేనకుఁ దగినమొగము
తే. భావభవునకు; నటుఁగాక బలమె బలము
గాఁగఁ దిరిగెనే వీరిచేఁ గాసిఁబడఁడె?
యనఁగ సౌందర్యసంపద లభినవముగ
వఱలుదురు దత్పురంబున వారసతులు. (ఆం) 28

క. తరుణవయస్కుల యౌవన
పరిపాకుల వృద్ధజనుల భటులను నిజసో
దరులను గురులనుగాఁ జూ
తురు పురము పతివ్రతాసతులు పుణ్యవతుల్. (ఆం) 29

క. తరుణుండగు శీతలకరు
మరగి వియల్లక్ష్మి తన్నుమాని ముదుకఁడున్
ఖరకరుఁడును నని ద్రొబ్బిన
కరణిన్ రవి పశ్చిమాద్రికడఁ గ్రుంకె నృపా! (ఆం) 30

తే. తరులు వడి యుత్తరాయణ, దక్షిణాయ
నముల రవితేర విడిలిన నఱువలట్లు
మెఱయుఁ గనుఁగొనఁ గొమ్మలు మింటి కిడిన
కుదురువిధమునఁ దనరారు కోటమీఁద. (ఆం) 31

సీ. దక్షిణపవనంబు తనుగంధమున నూని మలయాచలముమీఁది మరులు మానఁ,
దివిచి పట్టిన లేఁతచివుళులచాయకుఁ గరతలంబులకాంతి వరము లొసఁగఁ,
గుసుమముల్ గోయుచో గోళ్ళమెఱుంగులు తని మొగ్గలకు గవుసెనియ లొసఁగఁ,
బలువగఁ జెలఁగెడు పలుకులు రాజకీ రములకు నొజ్జతనములు సేయఁ,
గీ. గురులు నలులపిండు బెరయఁగ వనమయూ
రములగతులువేఁడ గమనలీల
ననఁగి పెనఁగి ప్రీతి వనకేలి సలిపిరి
వనజముఖులు వేడ్కఁ బనుపు సేయ. (ఆం) 32

సీ. దళమైనచీఁకటి గుళియలు సేసి ప ద్మాసనుం డాయువు వోసె ననఁగఁ,
దొలుకారుమెఱుఁగులు కొలదిఁకి నఱికి వి రించి వాల్గనుల నూరించె ననఁగఁ,
జంద్రికాసార మబ్జజుఁడు గట్టిగఁ బద నిడి యాణిపాణియుఁ బడసె[?] ననఁగఁ,
బాటించి విధి రాగపరమాణువునఁ బల్ల వితమూర్తి గాఁగ నిర్మించె ననఁగఁ,
తే. బొలచునలులను మదనునమ్ములను ముత్తి
యముల విద్రుమవల్లిక నపహసించి
తరుణి యలకలుఁ జూడ్కులు దశనములును
నధరమును బ్రస్తుతింప నాయలవి యెట్లు? (ఆం) 33

శా. దానానేకపబృంహితస్వనము గంధర్వావలీహేషిత
ధ్వానంబున్ మృదువేదనాదమును గాంతానూపురారావమున్
గానానూనరవంబుఁ దూర్యబహుశంఖస్ఫారరావంబుఁ బె
ల్లై నీరాకరఘోషమో యనఁగ నిత్యంబుం జెలంగుం బురిన్. (ఆం) 34

సీ. ధర వియోగులనెల్లఁ బరిమార్పఁ బూని హృ ద్భవుఁడు గట్టిన వీరపట్ట మనఁగ,
విరహులపై దండు వెడలుచో మదనున కెత్తిన కెంజివురెల్లి యనఁగ,
దోయధి వెడఁ గ్రుంక దోఁచుపురందర కుంభిసిందూరితకుంభ మనఁగఁ,
గులిశాయుధుని పెద్దకొలువునఁ జెన్నొంద దీపించు మాణిక్యదీప మనఁగఁ,

గీ. గుముదినీరాగరససిద్ధఘుటిక యనఁగఁ
గాముజనరంజనౌషధీకబళ మనఁగఁ
బొడుపుఁగెంపున బింబంబు పొలుపు మిగులఁ
జంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు. (ఆం) 35

సీ. ధమ్మిల్లభారముల్ కమ్మపూవులఁతోడఁ బొదికొని వెన్నులఁ బొలసి వ్రేల,
నలికతలంబులఁ బొలుచు కుంతలములు ఘర్మజలంబులఁ గలసి యంట,
గల్హారదళములకాంతి మిన్నక కొన్న చెన్నునఁ గనుఁగవ జేగుఱింప,
సోలెడువల్లులఁ బోలెడుమేనులఁ బయ్యఁట గాలిచేఁ బ్రస్ఫురింప,
తే. ఘనపయోధరములఁ గాశ్మీరచర్చలు
గలఁగ నలసగతులు చెలువమొందఁ
బువ్వుఁబోఁడు లంతఁ బుష్పాపచయకేళి
సోలి వచ్చి రా నృపాలు కడకు. (ఆం) 36

సీ. ధరణీశ! లవణాబ్ధిపరివేష్టితక్షితి వఱలిన నేరెడు గఱితికొలఁది
నొక్కొక్కదిక్కున కొక్కొక్కలక్షయో జనములు ధన్మధ్యమున సువర్ణ
సారమై యున్నది చతురుత్తరాశీతి సాహస్రయోజన సంఖ్య మొదలి
వలము పదాఱువే ల్గలిగి వెడల్పు ము ప్పదిరెండువేలుఁగాఁ బాఁతు లోఁతు
తే. మొదలివలమునయంత యై తుదిఁ బదాఱు
నేసివేలుగా మేరువన్ శిఖరి యొప్పు
దానిపై బ్రహ్మపురి చతుర్దశసహస్ర
యోజనస్థితిఁ గనుఁగొనఁ దేజరిల్లు. (ఆం) 37

చ. నలువగురక్తి మించిన మనంబున నుబ్బును లావు వుట్టి చెం
గలువ వికాసవేళ మురుకంబు[?] నటింపఁగఁ బువ్వుఁబోఁడి మొ
క్కలములఁ బేర్చి నాథునధికారముఁ గైకొని కేలి సల్పె న
చ్చలమున సిగ్గు చాలమియుఁ జన్గవహారము లోలిఁ జెప్పగన్. (ఆం) 38

ఆ. నీర నగ్నియునికి యారయ విస్మయం
బనుచు బాడబాగ్ని కడరి యప్పు
రంబుఁ జొచ్చెనొక్కొ రత్నాకరము మణు
లనఁగఁ జెలువ మమరు నాపణములు. (ఆం) 39

గీ. నూఱుక్రతువులు సేయని పాఱుటిల్లు
కోటిపడగలు లేని కిరాటగృహము
జాతిరత్నంబు గాని పాషాణకులము
వెదకి చూపిన వీటఁ బన్నిదము గలదు. (ఆం) 40

సీ. నెఱవుగా విరియక నెగడు నెత్తావి తు మ్మెదలచే మునుమును మీఁదు వోక
యకరువు నెఱయక మకరంద మొలుకక నెఱి దప్ప నొరగక కఱకు లేక
బింకంబు లొక్కింత ప్రిదులక జిగిసొంపు చెదరక ఱేకులు చిక్కువడక
పొరటతో రాయక పొలుపు సొం పెడలక సుడియు క్రీగాలిచే సూర గిలక
తే. కరము శోభిల్లు రుచిరమంజరులు గోసి
వనిత యొక్కర్తు తనదు లావణ్యరసము
నెలమి నుద్యాన మొక క్రొత్తచెలువు దాల్ప
లతలలో నాడు జంగమలతిక వోలె. (ఆం) 41

మ. పరపై యొప్పెసలారు మానికపుసోపానంబులం బ్రజ్జ్వల
ద్వరవజ్రోపలసైకతంబులును సౌవర్ణారవిందంబులన్
హరినీలాసితవారిజంబులనుఁ జక్రాంగాదివాఃపక్షివి
స్ఫురణం గల్గు సరోవరంబుఁ గనియెన్ భూవల్లభుం డయ్యెడన్. (ఆం) 42

చ. పరముఁడు కంథరస్థలముపై నిడి వేడుక ముద్దులాడఁగాఁ
గరమున మౌళిగంగయుదకంబులు మెల్పునఁ బీల్చి యూఁది శీ
కరములు భూషణేందునకు కారవ[?]తారకలీలఁ జేయు త
త్కరివదనుండు మత్కృతికిఁ దా సుముఖస్థితితోడఁ దోడగున్. (జ) 43

సీ. పరిణత ఫణిలతాపత్రంబుఁ గదిసిన చివురు నాఁ జెక్కునఁ జేయి చేర్చి,
కందర్పుమదకరికరముపై జక్కవ లెఱఁగెనాఁ దొడఁ గుచ మిఱియ మోపి,
దవనంబు పొరకల గవిసిన మంచునా బలుచనిచెమట మైఁ గలసి మెఱయ,
గలువరేకులు మౌక్తికముల నీనెడి ననా గన్నుల బాష్పంపుఁగణము లురలఁ,
తే. వేఁడి నిట్టూర్పుగాడ్పులు విరహవహ్ని
శిఖలు ప్రబలంగ వలవంతచింత నొగిలి
యేకతం బున్నదాని రాజేంద్రతనయఁ
గనిరి లతికాగృహంబులో వనజముఖులు. (జ) 44

చ. పలుచని చంద్రికారసము ప్రన్నని నున్ననితేట క్రొమ్మెఱుం
గుల తుదల న్విదిర్చు నెలకొమ్ములకాంతి పసిండినిగ్గుతోఁ
గలిపి యలంతి వన్నె యిడి కాయజునిల్పిన రత్నపుత్రిక
న్నలువ సజీవిఁ జేసెనొకొ నాఁ దగు నాతివిభాతి చూడ్కికిన్. (ఆం) 45

సీ. పాంథులహృదయముల్ పల్లటంబులు సేయ దర్పకు పనిచిన దం డనంగ
విరహిమృగంబుల సురిఁగింపఁ దివిరెడు కాయసంభవుని మొక్కల మనంగఁ
గడునల్గి జైత్రునాగారంబు ముద్రింప మనసిజు పనిచిన యనుఁగు లనఁగ
సహచరుం డగు గంధవహుఁ గానఁగా మీన కేతను పంచిన దూత లనఁగ
తే. నభినవాకారసౌందర్యసుభగలీల
లతిశయంబుగ మెలఁగుచు నసమబాణు
పుష్పలావికాజనములపోలె నెఱసి
కోమలాంగులు పువ్వులు గోసి రెలమి. (ఆం) 46

ఉ. పూవులప్రోవులై చిలుకబోదలు కోయిలపిండు మందలై
తావులక్రోవులై యలివితానము గానము తానకంబునై
కావను బండఁజాలుటఁ ద్రికాలముఁ గల్గ వరంబుఁ గన్నయ
ట్లై వనరాజి పొల్పగుఁ బురాంతికభూముల నెల్లఁ జూడఁగన్. (ఆం) 47

చ. పొడవుగ నెల్లయంగళులఁ బ్రోవులు వోసిన నూత్నరత్నముల్
కడఁక ననేకవేషములు గైకొని వచ్చిన యర్థికోటికిన్
బిడికెఁడులాదిగాఁగ బలి వెట్టుదు రప్పురి వైశ్యభామిను
ల్కడపక హస్తకంకణఝళధ్వను లొప్పఁగ నెల్లయప్పుడున్. (ఆం) 48

సీ. ప్రత్యగ్రరచనాతి భాసురప్రాసాద నిర్జిత గోత్రావనీధరంబు
ప్రాకారశిఖరాగ్రబంధురమణిగణ ద్విగుణితతారకావిభ్రమంబు
పరిఖాజలాంతరప్రతిబింబితద్రుమ స్మారితపాతాళభూరుహంబు
వనపుష్పసౌరభావర్జితమధుపశూ న్యీకృతాశావారణేంద్రగండ
గీ. మప్సరస్స్పృహణీయలీలాతిశయవి
లాసినీజననేత్రవిలాసజనిత
కుసుమశరబాణవైహృత్య మసదృశార్థ
నిర్జితాలక ముజ్జయినీపురంబు. (ఆం) 49

సీ. ప్రాణంబు లెడల నభ్యాసంబు సేయు మా ర్గం బన నిట్టూర్పుగాడ్పు లెసఁగఁ
గవ్యశాలగ నేయి గ్రమ్ముకైవడిఁ గామ శిఖిఁ గ్రాఁగి మైదీగె చెమట వొడమ
మదనునమ్ములు నీరుపదను పెట్టినక్రియ వాలుఁగన్నులు బాష్పవారి మునుఁగఁ
బగ లేదుటయు నెడఁబడు రథాంగము చంద మునఁ జన్నులు ముఖోద్గముగ వడంక
ఆ. ప్రాణ మెడలి నెఱవడి యొడలు[?]
భూషణములతోడి పొత్తు విడిచి
లాఁతు లైరి సఖులు లలఁతులు వాయని
ప్రాఁత లైరి నిషధరాజసుతకు. (జ) 50

చ. బలిమి రాహు సుధాంశుబింబంబు వెఱచి
పాఱఁ గడు డాసి వెనుకొనుపగిది నొక్క
యెడ సఖులు గూడి చెలరేఁగి యీఁదుచోట
నీలవేణియు మొగమును నెలఁత కొప్పె. (ఆం) 51

సీ. భట్టనారాయణభాషారమాదేవి లబ్ధవర్ణుల కర్థలబ్ధిఁ జేయు
బాణవాగ్భామినీప్రసవమంజరి విశా రదుల కలంకారరమణఁ జేయు
రాజశేఖరభారతీజహ్నుకన్యక సుకవీంద్రులకు భావశుద్ధిఁ జేయు
మాఘవాణీశీతమారుతగతి సార మతులకు రోమోద్గమంబుఁ జేయు
ఆ. నని యెఱింగి వారియడుగులు దలఁచి న
మస్కరించి దండి మఱి మురారి
వామనుని గుణాఢ్యు క్షేమేంద్రు నిల నలం
కారవిదులఁ దలఁచి గారవమున. (ఆం) 52

గీ. భూమి నిండె మింటఁ బూర్ణమై కర్కట
మకర మీనరాశిమహిత మైన
హరియశస్సుధాబ్ధియందుల తుంపురు
లనఁగఁ జుక్క లొప్పె నాకసమున. (ఆం) 53

సీ. మకరధ్వజునివిల్లు మనము వాయిని నిడి నమ లింపుగాఁ జేయు నల్లఁజెఱకు
మదనుబాణావళి మనము క్రుమ్ముళ్ళపైఁ బొలుపారఁ దుఱిమెడు పుష్పచయము
మనసిజాతుని యెల్లి మనము వినోదార్థ మై వచ్చి యాడెడు మావిచిగురు
మరుతేరిహయములు మనయిండ్లలోఁ బంజ రంబులఁ బొరలు కీరవ్రజంబు

గీ. తా ననంగుఁ డట్టివాని యలంచుట
యేమి? యతనికడిమి యేమి? యతని
బీర మేమి? ధరణిఁ బిచ్చుక [4]యలుకేమి
వాలఁగ ... ... ... నేమి వాలుఁగంటి[?] (జ) 54

సీ. మదవతీగండూషమదిరాభిషేచన వడి నంకురించిన వకుళములును
నతివల మృదుపాదహతినూత్నకోరక స్ఫురణఁ గైకొన్న యశోకములను
సుదతుల క్రేగంటిచూడ్కిపైఁ బాఱినఁ దిలకించి యలరిన తిలకములను
నన్నుల నెవ్వీఁగుఁ జన్నుల సోఁకునఁ గొమరొంది ననిచిన కురవకముల
ఆ. నెరగఁ జరణములను నెఱకలు విఱిసిన
మొగడలందునుండి మొఱయు తేఁటి
కొదమ లెలమిఁ బొంది ఘూర్ణిల్ల నధికవి
భూతిఁ దనరు చూతపోతములను. (ఆం) 55

చ. మరలఁగఁ బోదు రిండ్లకును మా పవునంతకుఁ జేలలోపలం
దిరిగి యొకింత లేఁతవడఁదేరెడు మోములఁ జెన్ను సేయుచున్
బిరిగొని క్రాలు దృగ్రుచుల పెల్లునఁ జీఁకటి నెల్లఁ బాచినం
దెరువరు లర్థిఁ గూడఁ బఱతేరఁగఁ బామరభామినీజనుల్. (ఆం) 56

శా. ముత్తా కేకుజము ల్సడల్చె? మొగడ ల్మున్నేమహీజంబులం
దొత్తెం? బువ్వులు నిండఁగాఁ బెరిఁగె నే యుర్వీజముల్? పూఁపలన్
మొత్తంబై విలసిల్లె నే ధరణిజంబుల్? కాయలం బండులం
జిత్తానందముఁ జేర్చి నేక్షి తిజముల్ చెల్వొందఁగాఁ జెప్పుమా! (ఆం) 57

క. మొగములు విరిదమ్ములఁ గుచ
యుగములు గోకములఁ జూడ్కు లుత్పలముల మం
దగతులు హంసలఁ దోల న
రుగుగతిఁ జొచ్చిరి సతు ల్సరోవర మెలమిన్. (ఆం) 58

తే. వామనానేకపము చక్రవాళకుధర
ధాతుతటము గోరాడుచోఁ దరులు విఱిగి
కూలుటయు మింటి కెగసెడు ధూళివోలెఁ
బర్వె నెఱసంజ పడుమఱ పట్టుకొనుచు. (ఆం) 59

తే. సతులు చల్లుఁ బోరాడుచో జలకణములు
నెఱికురులమీఁద నిండి క్రిక్కిఱిసి చెలువ
మమరెఁ గనుఁగొన నింద్రనీలములతోడఁ
గలయఁ గ్రుచ్చిన మౌక్తికంబులునువోలె. (ఆం) 60

సీ. సారథిశతవృద్ధు చక్రంబు లొనగూడి జరగవు రథమున సంఘటించి
యుదకంబుసోఁకున కోర్వనియరదంబు చేతికి బిరుసైన ఱాతివిల్లు
గఱితాఁకు కోర్వక గడగడ వడఁకుచు మువ్వంకఁ బోయెడి చివ్వనారి
మేఁపు నీరును లేక మెదలాడ నోపక వర్ణహీనంబైన వారువములు
తే. నిట్టిసాధనములు నీకు నెట్టు లొదవె
ద్రిపురముల నెట్టు గెలిచితి దేవదేవ!
యనుచు నగజాతచెలు లాడ నలరు శివుఁడు
చిత్త మిగురొత్త మనల రక్షించుఁ గాత. (ఆం) 61

సీ. సుదతులు డస్సినచో నలంతలు వోవ సొబగుఁడై చలిమిరి చూపి చూపి
యువిదలు తిలకించి యున్నచో వేడుకఁ గొలఁది మీఱఁగ నొజ్జఁ గుదిసి కుదిసి
సుభగుల పెనఁకువచోఁ దాన వలఁతి యై యెఱుకువ వాసన కెక్కి యెక్కి
వెలదులు ముదమున విహరించుచో సోయ గంబున వీథులఁ గ్రాలి క్రాలి
తే. యతులితం బైన శృంగారరతుల నిజవి
భూతిపొందాస సేసి తత్పురములోనఁ
బవలు రేయును నుడుగక తవిలి తిరుగు
మిండఁడును బోలె మందానిలుండు లీల. (ఆం) 62

క. హరగిరి సురగిరి రోహణ
గిరు లీనినకొదమ లనఁగ గృహములు పురి న
చ్చెరు వగును గుడ్యరత్న
స్ఫురణను విలసిల్లి తగినపొడవులతోడన్. (ఇ) 63

ఎఱ్ఱయ, కూచిరాజు [కొక్కోకము] (జ)

సీ. ఒంట మౌహమునఁ గన్గొంట చక్షుఃప్రీతి, పలుమాఱు నది దలంపంగఁ జింత,
యుడివోనికోర్కిచే నుండుట సంకల్ప, మొగి గుణస్తుతి నిద్రయుడిగి పొగడ,

విరహతాపంబున వెగ డొందుటయె కార్శ్య, మరుచి యేమిటిమీఁదియాశ లుడుగు,
టెంద ఱుండియు వారి నెఱుఁగమి నిర్లజ్జ, గమనంబు తనయిల్లుఁ గదలి చనుట,
గీ. వలపు తల కెక్కి మది తన వశము గాక
పరవశత్వంబుచే డిల్లఁబడుట మూర్ఛ,
పొందు లేకున్నఁ బ్రాణంబు పోవు ననుట
మృతియు, నని దశావస్థలగతులు నొప్పు. (జ) 64

క. చూచుట తలఁచుట కోరుట
కాచుట కృశ మౌట రుచులు గానమి సిగ్గున్
ద్రోచుట నడచుట మూర్ఛా
ప్రాచుర్యము మరణ మనఁగఁ బదియు నవస్థల్. (జ) 65

సీ. పట్టెకంకటి దూదిపఱుపు ముక్కలిపీఁట యగరుధూపము వెలు వైనదివ్వె,
పూలు గంధము గందవొడి పున్గుబరణియ జాలవల్లిక వన్నెమేలుకట్టు,
తమ్మపడిగ పాన్పు తలగడ చిటిచాఁప పానఱా యడపంపుసంచి గిండి
గొడుగు పావలు గాజుగుడిగి సున్నపుఁగ్రోవి గందపుఁజిప్పు బాగాలబరణి,
గీ. గిండిచెంబును చిరుతేరగిన్నె బోన[?]
నిలువుటద్దము వీణియ చిలుక సురఁటి
మిద్దెయిల్లును ముంజూరు మిగిలినట్టి
పంచటోవరి గల కేళిభవనమునను. (జ) 66

సీ. పర్వతతరునదీపక్షినామంబుల నేకన్నెఁ బిలిచెద రింటివారు?
పొడవు కొంచెము వక్రమును బొందు నేకన్నె ................ వక్రములు తొడలు?
పెదవియు నధికంబు పింగళ మై గుంట కన్నులు గల్గి యేకన్నె మెలఁగుఁ?
గలకంఠమును బాదకమలంబులును గడుఁ గఠినంబులగుచు నేకన్నె కమరు?
గీ. నిదురవోవంగ నవ్వుచు నిడుదయూర్పు
లడర నేకన్నె లేడుతు రశనవేళ?
మీసములు గల్గి చనుదోయిమీఁద రోమ
ములును గల్గును నేకన్నె బొసఁగ దదియు. (జ) 67

సీ. పొగకంపు గలుగక మిగుల వెచ్చన గాక తెలు పైననీటను జలకమాడి,
కరము పల్చన నున్నఁ గాక పిప్పియుఁ గాక మృదు వైనగంధంబు మేన నలఁది,
గడితంబు జిలుఁగు గా కరవడుసైన[?] పంచపై వలిపదుప్పటముఁ గట్టి,
చెమ్మ వల్వక వన్నె చెదరక వాసనఁ గులుకుపువ్వులు దోఁపి కొప్పు ముడిచి,
గీ. మదనరతికోవిదులు పీఠమర్దకాది
విటులు సల్లాపములు చేసి వేడ్క సేయ
మోహనాకారుఁ డై మరుమూర్తి వోలెఁ
బల్లవుఁడు కేళిమందిరాభ్యంతరమున. (జ) 68

సీ. వనరుహానన మనోవాక్కాయకర్మల ధవుని దైవముఁ గాఁగఁ దలఁపవలయుఁ,
బ్రత్యుత్తరము లీక పని యేమి చెప్పినఁ జెవిఁ జేర్చి వేగంబె చేయవలయు,
నత్తమామలచోట నాప్తభృత్యులయెడ మాయాప్రచారము ల్మానవలయుఁ,
బ్రతివాసరంబు శోభితవృత్తిచే నిల యంబు గోమయముచే నలుకవలయు,
గీ. .................
.....................
...................
...................... (జ) 69

సీ. వలిపపయ్యెదలోన నిలువక వలిగుబ్బ చనుదోయి మెఱుఁగులు చౌకళింపఁ,
బగడంపువాతెఱపై నొకించుక డాఁగి మొగమునఁ జిఱునవ్వు మొలక లెత్తఁ,
గొలుకుల నునుగెంపుఁ జిలికించి క్రొవ్వాఁడి దిట్ట చూపులు దలచుట్టుఁ దిరుగ,
నునుగొప్పులోపల నునిచినపువ్వుల తావి పైకొని తుమ్మెదలను బిలువఁ,
గీ. దొడవులకు నెల్లఁ దొడ వైనతొడవుతోడ
వలపుకు నెల్లఁ దనమేను వలపుఁ దెలుపఁ
బరఁగు కామిని తనవామపార్శ్వమునను
గదియఁగా వేడ్క లెంతయుఁ గడలుకొనఁగ. (జ) 70

సీ. హేమవర్ణం బైన నిందీవరద్యుతి యైనను దనుకాంతిఁ బూనవలయు,
జరణంబులును హస్తసరసిజంబులు గోళ్ళుఁ గనుఁగొనలును నెఱ్ఱ గలుగవలయు,
సరసముల్ మృదువు లై చక్రాబ్జము ల్చిన్హ కము లైనవరపాదసరయుగములు,
సమము బింకము నైన చనుదోయి, నల్ల నై కడ లొక్కకొలఁ దైనకచభరంబు,
గీ. భోజనము నిద్రయును గొంచెమును మొగంబు
నుదరమును జాలఁ బలుచ నై మృదులతనువు
నధికశీలంబుఁ గలకన్య యర్హగాఁగఁ
జాటి చెప్పిరి పరిణయశాస్త్రవిదులు. (జ) 71

ఎఱ్ఱయ, కూచిరాజు [సకలపురాణసారము] (జ)

ఉ. నీరజనేత్ర, కృష్ణమృగనేత్ర, నవారుణనేత్ర, దృష్టివ[?]
న్నీరదగాత్రు, వేదగణనిర్మలసూత్రుఁ బురాణభారత
స్ఫారకథాచరిత్రు ఘనపాపనికుంజలతాలవిత్రు దు
ర్వారతపస్సమాధిజితశత్రుఁ బరాశరపుత్త్రుఁ గొల్చెదన్. (జ) 72

ఎఱ్ఱాప్రెగడ, పెదపాటి [కుమారనైషధము] (జ)

సీ. అడియాసలే కొల్పి యఱవీసమును నీక యాడుచుండును చేతి కందినట్ల,
మొనసి పద్దులఁ బ్రోఁకలను[?] వెంటఁబెట్టుక మమ్మరించును తనయెమ్మె లెల్లఁ,
గప్పువెట్టినపండ్లు గానరాఁ బల్కుచు నెఱవుసొమ్ములు చూపి ముఱియు నుఱక,
యెన్ని లే వకట తా నీడేర్చినవి యిండ్లు మాటికిఁ జెప్పుకో నేటి కనుచు,
తే. రాగిపైఁ బూఁతపూసినరవణములను
[5]నెఱయలచ్చరిపండ్లకఱ్ఱలును చమిరి
నట్టిప్రాఁతల చుట్టలు పెట్టి పెట్టి
తగిలి వల దన్న మానక దాఁచఁబెట్టుఁ
జెప్ప రోఁతలువో వీని సేఁతలెల్ల (జ) 73

సీ. అలరెడుఱెప్ప లల్లార్చినయందాఁక ననిమిషకన్యఁ గా దనఁగ వశమె?
యమృతంబు చిలుక మాటాడినయందాఁకఁ గనకంపుఁ బ్రతిమ గా దనఁగ వశమె?

నడుఁగక యడు గెత్తి నడచినయందాఁక గొనలుపూఁదీగె గా దనఁగ వశమె?
కలికి తనూరేఖఁ గదిసి కన్గొనుదాఁక ఘనవనలక్ష్మి గా దనఁగ వశమె?
గీ. యువిద సఖిమీఁద వెడ వ్రాలి యున్నదాఁక
నొనరు తొలుకారు మెఱుఁగు గా దనఁగ వశమె?
వెలఁదిగుణములు సఖులచే వినినదాఁక
నంగసంభవుమాయ గా దనఁగ వశమె? (జ) 74

చ. అలికుల మెల్ల వేణియును హంసములెల్లను మందయానముల్
జలజము లెల్ల నెమ్మొగము జక్కవలెల్లను చన్నుదోయి యా
పులినము లెల్లఁ బెన్బిఱుఁదు పుష్పములెల్లను మేనివాసనల్
పొలఁతుక నాశ్రయించుకొనిపోయె నవన్నియు నన్నివంకలన్. (జ) 75

సీ. ఈశుచేఁ గాంచి సాహిత్యవిద్య ధరిత్రి నిల్పినయట్టి పాణిని భజించి,
శ్లోకార్థమునఁ జంద్రజూటు మెప్పించి యి ష్టార్థము ల్గొన్న మల్హణు నుతించి,
గద్యంబు చెప్పి శంకరునిచేఁ గరములు ప్రతిభతోఁ బడసిన బాణుఁ దలఁచి,
శతకంబుఁ చెప్పి భాస్కరుని మెచ్చఁగఁ జేసి యురుదేహుఁ డైన మయూరుఁ గొలిచి,
తే. భవుని మెప్పించి కన్నులు పడసి తెచ్చి
వనిత కిచ్చిన కాళిదాసునకు మ్రొక్కి
హరుని వినతులచేఁ బాస లాడఁజేసి
నట్టిధట్టుని నన్నయభట్టుఁ బొగడి. (జ) 76

క. ఉడురాజు కొలువు దీరిన
నుడుగణపరివారసమితి నొఱపుగ ననుపన్
వడి వచ్చుకటికవాఁ డనఁ
బొడజూపెన్ వేగుఁజుక్క పురుహూతుదెసన్. (జ) 77

చ. కలిసి యొకళ్ళొకళ్ళు కసుగందనివేడ్కలఁ జూచువేళ ఱె
ప్పలు మఱువయ్యెనే నవియుఁ పాయుట, తత్సుఖపారవశ్యులై
పలుకకయుండుటే యలిగి పైకొనకుండుట, యంతె గాని తొ
య్యలియు విభుండుఁ బాయుటయు నల్గుట నాఁగ నెఱుంగ రెన్నఁడున్. (జ) 78

క. కురువిందవజ్రమయ గో
పురకాంతులవలనఁ బ్రొద్దు పోకలురాకల్
పరికింప నరిది యయ్యును
సరసిజకైరవవికాససంపద దెలియన్. (జ) 79

సీ. కొమరువెన్నెలమోసు నమలి ప్రాణేశ్వరు కొసఁగి యిం పొనరించు నొకచకోరి,
పరపువెన్నెల గుజ్జు బంతెనగూళ్ళాడు నోలి నెచ్చెలులతో నొకచకోరి,
పా టైనవెన్నెలతేఁటకేళాకూళి నోలలాడుచు నుండు నొకచకోరి,
గట్టివెన్నెల చల్దిగాఁ గట్టి వల్లభు నుడురాజు కడ కంపు నొకచకోరి,
తే. చేగవెన్నెలక్రొవ్వు భంజించి విందు
లొనరఁజేయును జుట్టాల కొకచకోరి
పండువెన్నెలపేస మేర్పఱిచి పతికి
నుబ్బుగా నిచ్చు వేడుక నొక చకోరి. (జ) 80

సీ. తంగేడు జెముడుకుఁ దామ రుమ్మెత్తకు గన్నేరువేళ్ళకుఁ గరకకాయ,
ముసిఁడికి శుంఠియుఁ బసుపు సున్నమునకుఁ దెఱఁగొప్పఁ బొగడకుఁ దెల్లయుప్పి,
వట్టివేళ్ళకుఁ బత్తి వావిలి కొడిసెకు నేయి పాలకును వేన్నీళ్ళు దలఁప,
జీడికి సెనఁగ మించిన వసనాభికి జిఱ్ఱివేళ్ళును నల్లజీలకఱ్ఱ,
తే. తైలశశులకు జిల్లేడుపూలనీళ్ళు
పనసపంటికి నూనె యావడకు ముస్తి
మిరియ మరఁటికిఁ దెగడకు నరయఁ దుమ్మ
లడరు వెలితుమ్మ నేలతంగెడుకు వైరి. (జ) 81

సీ. తొలిదలి గోసినతోరంపుఁ గ్రొవ్విరు లించు విల్తునికి మీఁ దెత్తి మ్రొక్కి,
పద్మపరాగంబుభసితంబు మంత్రించి పువ్వారుఁబోఁడికిఁ బొట్టు వెట్టి,
సంపంగిఱేకుల సర్పంబు లిఖియించి రాజాస్యకరమున రక్ష గట్టి,
నెఱిఁ బచ్చనివి యెఱ్ఱనివి యైన వొనగూర్చి [?]బడిసి పుష్పంబుల బడిమి పోసి,
తే. మదచకోరంపుమఱక నేమఱక ద్రిప్పి
పడఁతికిని దమ్మికప్పెర వెడలఁజేసి
చెలఁగి పూఁదేనియలఁ దేఁటిసిద్ధులకును
వెలఁది యెదుటను జూఱ గావించె నపుడు. (జ) 82

సీ. పులుసొఱ్ఱచేఁదు నుప్పును దీపు నొగరును గణుతింపఁ భాగాధికములు గాక,
చిముడంగఁ బాఱక చిక్కనై యిగురక కాటువోవక మఱి కలఁత వడక,
యుడికియు నుడుకక యుండి నిక్కమ్మక[?] పసరువేయక పరిపాటిచెడక
సంబారములతోడి సంబంధ మెడలక పొగపువాసన విరిపోటుగాక,
తే. వింతలై జిహ్వకును రుచు ల్విస్తరిల్లఁ
దగుపదార్థంబు లెడనెడఁ దాము తామ
భోక్తలకు భోజనాసక్తిఁ బొడమఁ జేయ
నిండువేడుకఁ గూరలు వండ నేర్తు. (జ) 83

సీ. మన్మథదివ్యాగమమున కోంకారంబు భూతేశునౌదల పువ్వుదండ,
యమితశృంగారరేఖార్గళకుంచిక యధికతమోదంతి కంకుశంబు,
విరహిణీజనమర్మవిచ్ఛేదకర్తరి యంబరక్రోడదంష్ట్రాంకురంబు,
తారకామౌక్తికతతికి నంచితశుక్తి దగు నంబునిధికి ముత్యాలజోగు,
తే. మారుపట్టాభిషేకార్థవారికుంభి
చిత్తజుని కోటలగ్గ దంచెనపుగుండు
నాఁగ నానాఁటి కబివృద్ధి నారుకొనిన
చంద్రుఁ డుదయించెఁ గాంతి నిస్తంద్రుఁ డగుచు. (జ) 84

సీ. లావణ్యరేఖావిలాసలీలాకళా శాసితసూనశరాసనుండు,
కుంభినీవహనవిజృభదోస్స్తంభసం భావితాశాంతదంతావళుండు,
[6]దారాక్ష దానాంబుధౌతయాచక జాల దుర్దమదుర్వ్యధాకర్దముండు,
నీహారసురవాహినీహారనారద శారదనీరదస్వచ్ఛయశుఁడు,
తే. వినుతి సేయంగఁ దనుజదిగ్విజయలటహ
పటహనిర్గుణనిర్ఘాతపటలచటుల
ఘోరనిర్ఘోషవినమితకుమతవిమత
కులకరన్యన్తవిస్తృతనలుఁడు నలుఁడు. (జ) 85

సీ. విరదమ్మిసురఁటుల విసరకే యెలనాఁగ! యుష్ణాంశుచెలు లవి యుడుకుచల్లు,
వెలఁదిముక్తాహారములు వైనకే సఖి! యౌర్వాగ్నితోఁబుట్టు లవి యలంచు,
................................................

గీ. చెలఁగి పన్నీరు చల్లకే కలువకంటి!
రాహుదంష్ట్రలు సోఁకినరాజుమేని
కసటుచేఁ బ్రోదియగునవి కాదు మిగులఁ
గాన యవియెల్ల నబల నీగతికిఁ దెచ్చె. (జ) 86

సీ. శాత్రవభుజగభుజంగమశాత్రవ శాత్రవ నృపబల సంగరముల,
రిపుపద్మవనపద్మ రిపురిపుప్రళయ ధా త్రీనాథపురవర త్రిపురములను,
విద్విష్టగిరిగిరి విద్విష్టవిద్విష్ట మండలాధీశ భూమండలముల,
వైరికైరవ వనకైరవ వనవైరి వైరిభూపాల కాంతారములను,
ఆ. బొంగడంపఁ ద్రుంపఁ బొరిమార్ప గాల్ప నౌ
ర్వానలుండు[?] వృషాంకబాణ
పటుతరానలుండు ప్రళయానలుఁడు ద
వానలుండు ధరణి నానలుండు. (జ) 87

సీ. శ్రీ బయల్పడకుండఁ జికురము ల్దమకప్పుఁ గుచచూచుకములకుఁ గొంత యిచ్చె,
లేమి దోఁపకయుండ లెస్సఁగా నడిమికిఁ గుచములు తమకల్మిఁ గొంత యిచ్చెఁ,
దనువల్లి కనుదృష్టి దాఁక కుండఁగ సాధు దంతముల్ తమకాంతిఁ గొంత యిచ్చెఁ,
[?]దరబసిరింత లై దాఁటకుండఁగఁ దమ యలసత చూడ్కుల కంఘ్రు లిచ్చె,
తే. నంగకము లొక్కమై నున్న సాంగములను[?]
కలిమిలేములు దమలోన నలకరించె
నరయఁ బుత్రోత్సవమున కాయత్తపడెనొ
యనఁగ సతిమేన గర్భచిహ్నములు దోఁచె. (జ) 88

సీ. శ్రీసిద్ధి రస్తు శాసితవైరిమండల! విజయో౽స్తు భువనైకవీరవర్య!
అభ్యుదయో౽స్తు సాహసబలసామగ్ర్య! కల్యాణ మస్తు నిష్కలుషహృదయ!
శుభమస్తు కారుణ్యవిభవసముజ్జ్వల! బ్రహ్మాయురస్తు భూపాలతిలక!
అభివృద్ధిరస్తు మహౌదార్యభూషణ! చిరకీర్తిరస్తు భాసురగుణాఢ్య!
తే. తుష్టిరస్తు నిజాంకనిర్ధూతకలుష!
పుష్టిరస్తు జగత్త్రయీపూరచరిత!

భద్రమస్తు మహీభారభరణ! నీకు
నధికతేజో౽స్తు తే నిషధాధిరాజ! (జ) 89

ఎఱ్ఱాప్రెగడ, పెద్దపాటి [మల్హణచరిత్ర] (జ)

సీ. కువలయకమలాభినవమనోజ్ఞం బయ్యుఁ బంకజీవనపరిప్లవము గాక,
ఘనసారపున్నాగ కమనీయ మయ్యును గితవదుష్కళి[?]సంయుతము గాక,
సాధుదానప్రౌఢి యూధపం బయ్యును విశ్రుతఖరసమన్వితము గాక,
రాజితోత్తమ జాతిరత్నాంకితం బయ్యు శృంగారవిటవిదూషితము గాక,
గీ. వరసరోవరచయమును వనచయంబు
నృపచయంబును దివ్యమంటపచయంబు
నెలమిఁ దనుఁ బోలె ననఁబొగడ్తలు వహించె
భువనసారంబు కల్యాణపురవరంబు. (జ) 90

చ. గములగు పద్మరాగములఁ గ్రమ్ముమరీచులు చౌకళింపఁగా
గమలవనంబు లెన్నడుఁ వికాసము గుందవు వజ్రమౌక్తికా
సమరుచి చంద్రికం గుముదసంఘములుం గసుగందకుండునాఁ
గొమ రగుదివ్యరత్నమయగోపురవైభవ మెన్న నేటికిన్. (జ) 91

సీ. పగడపుఁగంబాల పచ్చటోవరియును నపరంజికాళంజి యలరుఁబాన్పు,
బంగారుసకినెల పట్టెమంచంబును వజ్రపునునుజాలవల్లికయును,
గుంకుమతలగడ ల్గొజ్జంగిపూఁదెరల్ దరమైనచంద్రకాంతంపుగిండి,
చౌసీతిరతముల సవరనిమేల్కట్టు దీపించుమాణిక్యదీపకళిక,
గీ. పొసఁగఁ గర్పూపవేది కప్పురపుసురఁటి
నిలువుటద్దంబు రతనంపునెత్తపలుక
తళుకుదంతపు బాగాలు కలికిచిలుక
గలిగి యొప్పారు చవికెలోపలికి నెపుడు. (జ) 92

కసవరాజు, తేళ్ళపూడి [కళావతీశతకము] (ఇ)

క. ఆ కంజానన యుపరతి
కాకాశము వడఁకెఁ దార లటునిటు పడియెన్
బోకైన [గి]రులు గదలెను
భీకరమగు తమము చంద్రబింబముఁ గప్పెన్. (జ) 93

చ. గురుకుచకుంభము ల్గదలఁ గ్రుమ్ముడి వీడఁగ రాలఁ గ్రొవ్విరుల్
కరమణికంకణక్వణనకాచనగధ్వను[?] లుల్లసిల్లఁగా
భరతపుఁబిట్టకైవడిని బాదికిఁ జేరెడి వెల్చెలాగునన్[?]
బరిపరిరీతులన్ జెలఁగు భంగులు మెత్తుఁగదే కళావతీ! (ఆం) 94

చ. ప్రకటితలీలఁ గీ లెడలి పాపటముత్తెపుఁజేరు మోముపైఁ
దకపికలాడఁ గ్రక్కదలు దంతపుఁ గమ్మలకాంతి మొత్తమై
వికచకపోలభాగముల వెన్నెల గాయుచునుండ నీవు నన్
................................... లాగులు మెత్తుఁగదే కళావతీ! (ఇ) 95

కేతన, మూలఘటిక [ఆంధ్రభాషాభూషణము] (జ)

ఉ. మెచ్చుఁడు మెచ్చవచ్చునెడ, మెచ్చకుఁ డిచ్చకు మెచ్చు రానిచో,
మెచ్చియు మెచ్చు మ్రింగకుఁడు, మెచ్చక మెచ్చితి మంచుఁ గ్రుచ్చలై
మెచ్చకుఁ, డిచ్చ మెచ్చుఁ గని మెచ్చుఁడు, మె చ్చొకమానమైనచో
మెచ్చియు మెచ్చకుండకయు మెచ్చుఁడు, సత్కవులార! మ్రొక్కెదన్.[7] (జ) 96

కేతనప్రెగడ, భాస్కరుని [కాదంబరి] (ఇ)

శా. గంధర్వాత్మజ రాజుఁ జూచెఁ బతియుం గాదంబరిం జూచె ద
ర్పాంధీభూతమనస్కుఁడై మరుఁడు విల్లందెన్ బ్రసూనోల్లస
ద్గంధం బొప్పఁగ నెక్కువెట్టి గుణనాదం బాని పుష్పాస్త్రముల్
సంధించెన్ దెగఁబాపి యేయఁ దొడఁగెన్ సవ్యాపసవ్యంబుగన్. (జ) 97

సీ. దీనిలోపలఁ గొన్నిదినము లుండిన నుష్ణ కరుఁడైన నట శీతకరుఁడు గాఁడె?
దీని లోఁ తెరిగినఁ దా నంబురాశిలోఁ గా దని జలశాయి గాఁపురాఁడె?
దీనితీయనినీరు దివిజులు త్రావిచూ చినఁ దమయమృతంబు చేఁదు నారె?
దీని తోయమ్ముల దీర్థమాడిన నెంత పాపాత్ములును మోక్షపదవిఁ గనరె?
ఆ. యనుచుఁ గొలనినీటి యతిశీతలత్వంబుఁ
బఱపు పెంపుఁ దీపుఁ బావనతయు
మనుజనాయకుండు గొనియాడి పడివాగె
త్రాట హయముఁ దిగిచి తఱియఁజొచ్చె. (ఇ) 98

కేతన [కువలయాశ్వచరిత్ర] (ఆం)

ఉ. కోటతనర్పు చూడ్కుల కగోచర మయ్యును తేరు మీఁదఁ బ
ల్మాటును నేఁగుచోఁట దగులంబడమిన్ రవిమండలంబు నీ
పాటిదయన్ తలంపునకుఁ బట్టగుచున్నదిగాక దీనికిం
బాటి యనంగ గుజ్జనఁగఁ బట్టులె యయ్యుదయాస్తశైలముల్. (ఆం) 99

కొండయ, బొడ్డపాటి [చాటువు] (జ)

సీ. కడఁగి యెక్కడ నైనఁ గదలనియరదంబు నరదంబుపై నిల్చినట్టి విల్లు,
వింటికిఁ గాఁపుగా విహరించుచక్రముల్ చక్రములను బ్రొద్దుజరపు శరము,
శరమునఁ బొడమిన చక్కనిసారథి సారథిమొగమునఁ జాఁగు హరులు,
హరులసామర్థ్యంబు నరసిన శింజిని శింజినిఁ దరిత్రాడు సేయు బలముఁ,
గీ. బొందువడఁ జేసి దైత్యులపురము లేసి
యఖిలజగములు రక్షించునట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ! (జ) 100

సీ. తొమ్మిదితునుకల నెమ్మిఁ గూర్చినతేరు సరిజోకఁ గూడనిచక్రయుగము,
నొకముఖంబున గడ్ప నోపనిసారథి రూపింపరాని వారువపుసమితి,
బెడిదంపుదెగలకుఁ బెలుచైన విలుకమ్మి గాలిచేఁ బ్రొద్దులు గడపు నారి,
పదివంకలై చాయఁ బాఱనిబాణంబు పడిబత్తెములు లేని భటగణంబుఁ,
గీ. బొందువడఁ జేసి దైత్యులపురము లేసి
యఖిలజగములు రక్షించునట్టి జోద
వనుచుఁ గొనియాడుదురు నిన్ను ననుదినంబు
నంగభవభంగ! తిరుకాళహస్తిలింగ! (జ) 101

సీ. దేహంబు మిక్కిలి తిరమైనరథము గా ఘననేత్రయుగము చక్రములు గాఁగ,
నూర్పు లశ్వంబులై యొప్పారుచుండఁగఁ[?] దొరయు పళ్ళెరము సూతుండు గాఁగ,
సవ్యాంగ మతిఘోరసాయకం బది గాఁగ సొరిదిఁ గుంతలములు జోడు గాఁగ,
దలమైన విహరణస్థలము కార్ముకము గా నలువైన హారంబు నారి గాఁగ,

గీ. నన్నియును నీమహత్త్వంబ యగుటఁజేసి
లీలఁ ద్రిపురంబు లేసి గెల్చితివిగాక
నీకు నొరులు సహాయులై నిలువఁగలరె?
యంగభవభంగ! తిరుకాళహస్తిలింగ! (జ) 102

కొమ్మయ, నిశ్శంకుని [వీరమాహేశ్వరము] (ఆం)

సీ. ఎనిమిదిరూపంబు లేకమై కనుపట్టి దీపించు నెవ్వాని దివ్యమూర్తి?
గణుతింపఁ దగు దేవగణముల యాఁకలి వెసఁ దీర్చు నెవ్వాని నొసలికన్ను?
రాజసంబునఁ జొరరానిచోటులు సొచ్చి వడి మేయు నెవ్వాని వాహనంబు?
నాణెమై యఱువదినాల్గుపీఠములందు రాణించు నెవ్వాని రాణివాస?
గీ. మది గనుంగొనఁ బాయ రానట్టి మోహ
మిచ్చ నొదవించు నెవ్వాని యిల్లు విల్లు?
బెరయు నెవ్వానిపలుకులు బేసి యగుచు?
నెందు నెవ్వాని సేవింతు రెల్లసురులు? (ఆం) 103

సీ. కడిఁదియుద్ధంబులఁ గదిసి యాఁకలిదీఱ మించుఁజూపుల నారగించువాఁడు,
గడియసేపైన నొక్కెడ నూరకుండక త్రిభువనంబుల సంచరించువాఁడు,
నూఱుతంత్రులవీణె నూతనంబగుక్రియా హేవాకమొప్ప వాయించువాఁడు,
గోర్లు దాఁటించి నిర్నిమిత్తంబు[?] వీఁకునఁ బోరు గావించువాఁడు,
గీ. మునివరేణ్యుఁడు పద్మగర్భునికి నింపు
కొనలు సాఁగంగఁ బుట్టిన కొడుకుఁగుఱ్ఱ
చనియె శర్వాణిఁ గొలువంగఁ దనువిలాస
శారదాంబుదవర్ణుండు నారదుండు. (ఆం) 104

మహాస్రగ్ధర.
కని రా బ్రహ్మాచ్యుతాదు ల్ఘనకనకలతాగ్రంథిసంబంధి జూటా
వనిఖేలద్బాలచంద్ర స్వయముపచయ కృద్వర్ణనీయ ప్రభా సం
జనిభాస్వత్ఫాలభాగస్థలసితభసితస్థాపక శ్రీసమగ్రా
నన పద్మున్ బుణ్యసద్మున్ జరణనతవిపన్నాశు నా నందికేశున్. (ఆం) 105

సీ. కమలజాండంబులు కందుకంబులు సేసి యొండొండఁ దాటింప నోపువారు,
విలయవహ్నులఁ బట్టి వెసదండలుగ గ్రుచ్చి యురమున ధరియింప నోపువారు,
తివిరి సంహారభైరవునైనఁ బొరివోవ నొక మాత్ర ససిమాల్ప నోపువారు,
కాలచక్రక్రియాఘటనంబుఁ ద్రిప్పి యొం డొకలాగు గావింప నోపువారు,

గీ. ప్రమథవీరులు వివిధరూపములతోడ
హసన లను ఘనతాపనాద్య లఘుగతులు[?]
వెలయఁ గోటానుకోటులు కొలిచి వచ్చి
రతఁడు హరుఁ గొల్వ నేతెంచు నవసరమున. (ఆం) 106

సీ. కఱకుఁజీఁకటులమూఁకలు నుగ్గునూచగా నుఱిచి నూఱక త్రాగు నెఱతనంబు,
పొట్టేటిరాయని బొళయంబుఁ గదలించి వాహ్యాళిఁ గదలెడు వైభవంబు,
క్రతుభాగములు దెచ్చి కైతప్పు గాకుండ వేల్పుల కందిచ్చు వెరవుసొంపు,
మూఁడుమూర్తులు దాల్చి మురువుతో జన్నంపు వేదిపైఁ గొలువుండు విభ్రమంబు,
ఆ. నీకుఁ జెల్లు నొరుల నీతోడిసాటికిఁ
బేరు గ్రుచ్చి యెన్నలేరు జగతి
వశమె నిన్నుఁ బొగడ స్వాహావధూకుచా
భ్యున్నతప్రకాశ! యో హుతాశ! (ఆం) 107

సీ. కల్పాంతవార్ధి మోఁకాలిబంటిగ నే య తీశ్వరుఁ డొంటిమైఁ దిరిగినాఁడు?
వటపత్రవీథి నెక్కటి యున్న బాలు నే తాపసాధిపుఁడు ముద్దాడినాఁడు?
తనపేర నే తపోధనమౌళి సుస్థిర స్థితిఁ బురాణంబు సంధించినాఁడు?
హరుని మెప్పించి సంహారకాలుని జయో న్మాద మే మునిరాజు మాన్చినాఁడు?
గీ. కనియె నటువంటి సంయమీంద్రుని మహాత్ముఁ
దనయునిఁగ నమ్మృకండుని ధర్మపత్ని
సహజశివభక్తిరతుని విశ్వప్రసిద్ధు
ననఘకీర్తి మార్కండేయుఁ డనెడువాని. (ఆం) 108

సీ. జడివట్టు పడగలు, పడగలమీఁదిచోఁ గదలెడి కండ్లును, గండ్ల నడుపు
సూత్రించు జోడును, జోడుపైఁ జరియించు బంట్లును, బంట్లకుఁ బాయరాని
ధనువును, ధనువుతోఁ దగలిన యరదంబు, నరదంబుక్రిందికి నరుగు నారి,
నారి నిద్రించుబాణము, బాణ మొదవించు సూతుండు, సూతసంజాతహరులు,
గీ. గాఁగ నద్భుతార్థకరపదార్థావళి
యుల్లసిల్ల నొప్పుచున్న దిపుడు
త్రిపురహరణ కరణదృఢదత్తధీర మ
నోరథంబు దేవ! నీరథంబు. (ఆం) 109

సీ. తల్లిదండ్రులతోడి తగు లొల్లకుండియు దల్లిదండ్రులతోడి తగులు వలచి,
కందర్పుమీఁది యక్కటికంబు సెల్లియుఁ గందర్పుమీఁది యక్కటిక మొదవి,
సంసారకేళి ప్రసక్తిఁ బోఁదట్టియు సంసారకేళి ప్రసక్తి గలిగి,
సగుణవిశేషయోజనము ల్ఘటించుయు సగుణవిశేషయోజనము మరఁగి,
గీ. సగము పురుషుండు కంజాక్షి సగము గాఁగ
నర్థనారీశ్వరాకృతి ననువుపఱచి
హరుఁడు తల్లింగమధ్యంబునందు నుండి
హరివిరించుల కంతఁ బ్రత్యక్షమయ్యె. (ఆం) 110

సీ. దైతేయకాంతల తళుకుఁగెమ్మోవుల వీటికాశ్రీలకు వీడుకోలు,
వేల్పుటిల్లాండ్రక్రొవ్విదపుఁ జన్నులమీఁది యలువుఁబయ్యెదలకు నిలువనీడ,
విశ్వజగత్త్రయీ విజయలక్ష్మీగాఢ బిరుదోత్సవములకుఁ బెండ్లివిందు,
పరిపంథివాహినీ పరిచితపరిభవ ప్రాప్తి సంకటముల పాయుత్రోవ,
గీ. సేసి యెయ్యది విలసిల్లుఁ జిత్రమహిమ?
నది ప్రయోగింప నెత్తె నయ్యచ్యుతుండు
విలయసమయ సముద్భూత విపులదహన
దారుణస్పర్శనంబు సుదర్శనంబు. (ఆం) 111

ఉ. నన్నయభట్టుఁ గావ్యరచనావిధిఁ, దిక్కనసోమయాజి న
చ్ఛిన్న మహత్త్వ సంవిహితశేముషి, నెఱ్ఱయప్రెగ్గడన్ సము
త్పన్ననవప్రబంధరసభావన, నింపునఁ బ్రార్థనాంజలుల్
మున్నుగ నాత్మలోఁ దలఁతు మువ్వుర మువ్వురఁ బోలు పుణ్యులన్.[8] (ఆం) 112

సీ. పులినంబు తొలుచూలు పుండరీకాక్షుని యవతారభేదంబు కవులరాజు
బహుపురాణగ్రంథ భారతసంహితా పరిగుంభనక్రియా పండితుండు,
కఱ్ఱివన్నియవాఁడు కౌరవాన్వయకర్త శ్రుతు లేర్పఱించిన సూత్రధారి,
సిద్ధనీవారముష్టింపచాధ్యక్షుండు శుకునికూరిమితండ్రి సకలవేది,
గీ. కాళికేయుండు యోజనగంధిపట్టి
తత్త్వనిర్ణేత ఘనతపోధర్మరాశి
నైమిశారణ్య మునిసభాభూమికెలమి
నేఁగ నొకనాఁడు వ్యాసమునీశ్వరుండు. (ఆం) 113

సీ. పులుఁగురాయఁడు తమ్మికొలఁకుల చెలికాని బండిబోయనితోడి పాలివాఁడు,
పన్నగస్త్రీలకు బాలిండ్లపసుపాప మగిడింప నోపిన మగలమగఁడు
దంభోళి కొకయీకతాఁకుఁ గానిక సేసి యమృతంబుఁ దెచ్చిన యవఘళుండు
వినతముద్దులపట్టి వనధిచెంగట బోయ పల్లె నాఁకలిగొన్న భవ్యబలుఁడు
గీ. పక్షములు దాల్చి వచ్చిన పసిఁడికొండ
యట్టు విలసిల్లు మేటి వాహనము గాఁగ
నడచె హతశేషదేవసైన్యములు దాను
నసురకులమర్దనుండు జనార్దనుండు. (ఆం) 114

సీ. పైఁడిచాయలతోడి పక్షసంపుటముల మెలఁగు తేజులతేరు గలుగునతని,
మొకరితుమ్మెదలకు మకరందరసధార లొసఁగు పీఠమునఁ గూర్చుండునతని,
సత్కవీంద్రుల మానసములలో విహరించు కొమరాలి కింపులు గులుకునతని
దిక్కులు నాల్గింట లెక్కదప్పక యొప్పు నాననంబుల మాటలాడునతనిఁ
గీ. గనిరి యింద్రానలాంతక దనుజ వరుణ
పవన భవసఖేశాన పూర్వకము గాఁగ
నమరులందఱు మధుకైటభాసురేంద్ర
మదవిమర్దక నాభిపద్మజుని నజుని. (ఆం) 115

సీ. ప్రణవపీఠిక నెక్కి భాసిల్లు నే దేవి యామ్నాయహేమహర్మ్యాగ్రవీథిఁ?
జరియించు నే దేవి సహజారుణజ్యోతి రానందమూర్తియై బ్రహ్మనాడి?
నే దేవి ఠవణిల్లు నిచ్ఛాక్రియాజ్ఞాన శక్తిభేదమున విశ్వంబు నిండి?
తోడునీడయుఁ బోలెఁ దులకించు నే దేవి యెల్లకాలంబు విశ్వేశుఁ గూడి?
గీ. యట్టి దేవి జగన్మాత యఖిలవంద్య
నిఖిలవిద్యాకళేశ్వరి నిత్యమహిమ
నొకటియును శ్రీగళుని క్రేవ నుల్లసిల్లు
నలఘుకల్యాణశుభగాత్రి యద్రిపుత్రి. (ఆం) 116

గంగరాజు, చిరుమూరి [కుశలవోపాఖ్యానము] (ఇ)

క. హరిదాసుని వనవాసునిఁ
బరిచితపరమోపవాసు భాసురహాసున్
సురుచిర నిగమాభ్యాసున్
విరచిత కాశీనివాసు వేదవ్యాసున్. (ఆం) 117

సీ. పదపద్మరజమునఁ బాషాణపుత్రికఁ బూఁబోఁడిఁ జేసిన పుణ్యుఁ డితఁడు
బాలుఁడై హరధనుర్భంగంబు సీతకు నుంకువ సేయు నిశ్శంకుఁ డితఁడు
మణిమయంబై యున్న మాయాకురంగంబుఁ గడఁగి చంపిన వేఁటకాఁ డితండు
కట్టాణిముత్యంబు కైవడి మున్నీరు బాణాగ్రమున నిల్పు ప్రౌఢుఁ డితఁడు
తే. ప్రబలదశకంఠ పటుకంఠనిబిడవిపిన
దహన కీలాయమానదోర్దండచండ
చటులకోదండ నిర్ముక్తశరనికాయుఁ
డితఁడు కాకుత్స్థవంశాబ్ధి హిమకరుండు. (జ) 118

గంగాధరుఁడు, కాకమ్రాని [బాలభారతము] (ఆం)

గీ. అట యుధిష్ఠిరుఁ డప్పంకజాక్షితోడ
ధౌమ్యహితవహ్ని ధూమకందళితశిఖలు[?]
మగువఁ గూడిన రాయంచ మధుపశబల
నలినములఁ బోలెను బ్రదక్షిణంబు సేసె. (ఆం) 119

ఉ. ఆంధ్రకవిత్వతత్త్వ సముదంచితకీర్తినిఁ దిక్కయజ్వ నీ
రంధ్రతరప్రభావనిధిం బ్రస్తుతిసేయుఁదు [?] నుల్ల స
త్కంధ్రగభీరమంజుతర గర్జిత విభ్రమభవ్యభంగి సై
రంధ్రికయైన చాటుమధురస్ఫుటబంధుర వాగ్విజృంభిగన్. (ఆం) 120

శా. ఆ లజ్జావతి ధౌమ్యుపంపున శిఖివ్యాలోలకీలాలిపై
నోలి న్వేల్చిన లాజరాజి పవనప్రోద్ధూతవారాశి వీ
చీలోలోత్థితవిద్రుమాటవి నధిక్షేపించు కట్టాణి ము
త్యాలో నాఁ గనుపట్టె నట్టియెడ నందద్రాజహంసంబుగాన్. (ఆం) 121

క. ఇంద్రప్రస్థం బనుపురి
సాంద్రమహేంద్రాశ్మకాంతిసంతతులను ని
స్తంద్రంబై విలసిల్లెను
జంద్రాతప ధవళచంద్రశాలాయుతమై. (ఆం) 122

గీ. ఇంద్రమణిజాలకములందుఁ జంద్రముఖుల
వాలుఁగన్నులు యమునయావర్తములను
మెలఁగి యాడెడు వాలికమీ లనంగ
......... కనుపట్టు నీ పట్టణంబునందు. (ఆం) 123

సీ. కైవార మొనరింతు గంభీరసాహిత్య ఘంటాపథోద్భాసుఁ గాళిదాసు
వర్ణింతు నుజ్జ్వలవాణీసుధాపూర పాథోధిపరిబాణు భట్టబాణుఁ
బ్రణుతింతు నుద్దండభాషాసమాక్షిప్త హరబాహుకేయూరుఁ డగు మయూరు
సన్నుతిఁ గావింతుఁ జాటుధారాప్రౌఢి కోమలతాయత్తు సోమదత్తు
గీ. భక్తి నంజలి రచియింతుఁ బ్రవరసేన
భాస శివభద్ర భవభూతి భట్టహర్ష
భారవి మురారి హేరంబ చోరులకును
మఱియుఁ దక్కిన సుకవుల మదిఁ దలంతు. (ఆం) 124

శా. క్రీడాలోలత దంతకోరకశిఖిం గీలించి భూచక్రమున్
గ్రోడగ్రామణి మించి యెత్తి ఫణు లక్షుద్రానుమోదంబునన్
జూడాభోగము లెత్తి చూడఁగ దిశాశుండాలరాణ్మండలిన్
వ్రీడం బొందఁగఁజేయు దంతిముఖు నిర్విఘ్నార్థమై కొల్చెదన్. (ఆం) 125

శా. చంచత్కేళిసరస్తటీమరకతచ్ఛాయాకదంబంబు గ్రొ
మ్మించు ల్సోఁకినఁ దమ్ము లిమ్ములను గిమ్మీరంబులై యుంట సం
ధించు న్వాసనఁ జంచరీకములు మందీభూతసందేహతన్
సంచారించుచు నల్లకల్వవిరుల్ ఝంకారశంకారులై. (ఆం) 126

శా. ధారాపాతవిభాతి శీతకరకాంతస్ఫారగేహంబు లీ
యూరం జంద్రికమీఁదఁ బర్వనురువున్[?] వ్యూఢాంబుధారాతతిన్
జేరున్ జాతకపంక్తి చిత్తములు రంజిల్లన్ మయూరంబులున్
సారస్యంబుల లాస్యము ల్మెఱయు నుత్సాహించి భూపాలకా! (ఆం) 127

సీ. పురుహూతవిస్ఫూర్తి భూమండలంబెల్ల భుజవిటంకంబునఁ బూనినాఁడు
గీర్వాణదుర్వారుఁ గేశిదానవుఁగొట్టి విజయలక్ష్మీయుక్తి వెలసినాఁడు
లచ్చినెచ్చెలికాని లలితోరుపీఠికఁ బొడమిన పూఁబోడిఁ బొందినాఁడు
నవయుగద్వీప భూనాథచూడారత్న మిత్రశాసనలీల మెఱసినాఁడు
గీ. విమలకీర్తిమందాకినీ వీచినికర
పూరపాతాళ మర్త్యవిబుధనివాసుఁ
డై కరంబొప్ప సోమాన్వయప్రభుండు
చారుకీర్తి పురూరవశ్చక్రవర్తి. (ఆం) 128

శా. మత్తారాతి మహాంధకారపటలీ మార్తాండుఁ డుద్ధాటికా
దత్తోద్యత్తురగావళీఖురపుటోత్పన్నక్షమాధూళికా
యత్తాంభోధి యయాతిఁ జెప్పఁదగు నుద్యద్వజ్రధారాప్రభా
జిత్తేజున్ సితకీర్తికైతకదళ శ్రీనూతనాంభోదమున్. (ఆం) 129

గీ. వరుఁడు కెంగేల నక్కన్యచరణపుటము
సన్నెకంటిపై నిడ నొప్పె శత్రుయువతి
చూడమాణిక్యములమీఁదఁ గూడఁజేయు
లీలఁ బ్రకటింపఁ బూనిన కేళి మెఱయ. (ఆం) 130

క. శబ్దార్థరసవిశారదు
శాబ్దికమూర్ధన్యు శబ్దశాసనబిరుదున్
శబ్దాయమాన విస్ఫుర
దబ్దఘటారభటి నన్నపార్యునిఁ దలఁతున్. (ఆం) 131

శా. శ్రీరామాయణకావ్యకల్పన విరించి న్వేదఘంటాపథో
ద్ధారప్రౌఢమనీషి సర్గ మునిమార్తాండున్ దపఃకీర్తి ల
క్ష్మీరమ్యు న్భువనైకవంద్యుఁడగు వాల్మీకిం గవిగ్రామణిన్
ధారాళస్థిరభక్తియుక్తిఁ దలఁతున్ దత్త్వజ్ఞచూడామణిన్. (ఆం) 132

శా. సంసారార్ణవపారగుం బరమహంసవ్రాతచూడాపదో
త్తంసంబున్ శ్రుతిసంకరోద్దళన పాథఃక్షీరభేదక్రియా
హంసంబున్ జగదేకవంద్యు జలదశ్యాము న్మహాపాతక
ధ్వంసాభారతు భారతామృతనిధిన్ వ్యాసున్ బ్రశంసించెదన్.

గణపయ, రాయసం [సౌగంధికాపహరణము] (ఆం)

శా. అంతంతం గబళింపఁగాఁ గడగె బాలార్కున్ ఫలభ్రాంతి, వే
శంతోల్లంఘనకేళి దాటెను సరస్వంతున్ మహాదానవా
క్రాంతారామ మహీరుహంబుల నుదగ్రక్రీడఁ ద్రుంచెన్ హనూ
మంతుండున్ గపియు న్నవిం గపులె సామాన్యాటవీచారముల్? (ఆం) 133

గౌరనకవి [నవగ్రహస్తవము] (జ)

ఉ. మ్రొక్కులయిక్క కాంతిగలమువ్వురు వేల్పులమూర్తి చీఁకటిన్
మెక్కెడిమిత్తి పద్మములమేలు నవగ్రహరాజు మింటిపై

నెక్కెడుమానికంబు దినమేలిక సింహవిభుండు ముక్తి పెన్
జక్కెర యిందుమిత్రుఁడు ప్రసన్నత మాకు ప్రసన్నుఁ డయ్యెడిన్. (జ) 135

చ. హరు తలపూ చకోరముల యామని పాల్కడలుబ్బుమందు శ్రీ
వరుని మఱంది తారకల వల్లభుఁ డిందిర తోడబుట్టు వం
బురుహముదాయ కల్పలతప్రోది యనంగుని మామ ఱేవిభుం
డరయఁగఁ గర్కటేశుఁ డమృతాంశుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్. (జ) 136

చంద్రమౌళి [హరిశ్చంద్రకథ] (జ)

చ. అలసత టొంకు నాస్తికత యాయతచింత యయుక్తికారితా
కలనము దీర్ఘసూత్రము వికాసముఁ బొందమి దుర్వ్యయంబు పె
ల్లలుక నిరర్థకార్యరుచి యర్థమతచ్యుతి మంత్రహాని ప్రా
జ్ఞులవెలి శాంతసౌమ్యకృతిశూన్యత నా నివి రాజదోషముల్. (జ) 137

చిక్కయ, చందలూరి [నాచికేతోపాఖ్యానము] (ఆం)

సీ. అమృతోపమానంబులగు నన్నములతోఁడ బహువిధశాకసూపములతోఁడఁ
బాయసాపూపజాంబాలికములతోఁడ విమలహైయ్యంగవీనములతోఁడ
షాడబంబులతో రసావళ్ళతోఁడను ఘనశర్కరాపానకములతోఁడఁ
గదళికాద్రాక్షాది మృదుఫలంబులతోడ వడియాలతోఁడఁ బచ్చడులతోఁడఁ
గీ. బ్రకటముగ దుగ్ధమథితతక్రములతోఁడఁ
బ్రియముఁ దళుకొత్త షడ్రసోపేతముగను
భాసురంబుగ నారగింపంగఁ జేసె
నా రఘుక్షోణివిభుఁడు బ్రాహ్మణుల నెల్ల. (ఆం) 138

సీ. ప్రాలేయకిరణబింబస్ఫూర్తిఁ దలఁపించు విశదంపుఁ దనుకాంతి దిశలు వ్రాఁక
జిగినిండఁ దొలఁకెడు చిగురుటాకులసొంపు వాటించు ఘనజటాభరము మెఱయఁ
గాంచనమౌంజీవికాసంబు గెడగూడి చెలువు సూపుచు మృగాజినముఁ దనరఁ
గమనీయ కోమల కరపయోరుహమునఁ బ్రకటితంబగు విపంచికఁ దలిర్ప
గీ. హరికథాలాపశోభితమైన యట్టి
యాననమ్ము ప్రసన్నత నలరుచుండ

గగనముననుండి సమవర్తి కడకు వచ్చె
నమరసంయమివరుఁడు విద్యాగురుండు. (ఆం) 139

సీ. బహువిధపరిమళభరితోదకంబులఁ జెలువంబు శోభిల్ల జలకమార్చి
నిండారు పండువెన్నెల సోయగము నవ్వు పసిఁడికమ్ముల వెల్లపట్టుఁ గట్టి
కబరిభారంబునఁ గన్నెచెంగలువలు పస మీఱఁ గొనలుఁ దోఁపంగఁ జెరివి
తీండ్రించు పసిఁడిదీధితులచే నమరెడు నవరత్నమయభూషణములుఁ దొడిగి
గీ. మృగమదముఁ గుంకుమంబును మేళవించి
గంధసారంబు మైఁదీఁగెఁ గలయ నలఁది
శ్రీలు మెఱయంగఁ బరిణయోచితముఁ గాఁగ
సఖులు కైసేసి తెచ్చిరి చంద్రముఖిని. (ఆం) 140

సీ. రాజితరత్నదర్పణతోరణంబులఁ గడుశోభితములైన కలువడముల
మానితకనకరంభాస్తంభపంక్తుల భాసురోజ్జ్వలపతాకాసమృద్ధి
నిర్మలస్ఫురితమాణిక్యకుంభంబుల మెండైన చిత్రంపు మేలుకట్లఁ
బ్రకటిత నూత్నమౌక్తికరంగవల్లుల రమణీయపరిమళద్రవ్యసమితిఁ
తే. దనరు నగరంబు నుతనిరంతరవిభూతి
నతిశయంబుఁగఁ దగ నలంకృతు లొనర్చి
బహుపదార్థంబు లొడఁగూర్చి పరిణయమున
కాయితము సేసి రంత వా రనుపమముఁగ. (ఆం) 141

సీ. లక్ష్మిఁ గొల్లాపురి లంక శాంకరి విశాలాక్షిఁ గాశికను వింధ్యమున దుర్గఁ
గన్యఁ గన్యాకుబ్జఁ గామరూపంబునఁ గామాక్షిఁ గాంచిని గామకోటి
మండలిఁ బుండ్రక మాణిక్య దక్షవాటమున నార్యావర్తకమునఁ ద్రిపుర
జాలంధరంబున జ్వాల హేమచ్ఛత్రపురి మహాయోగ శ్రీగిరిని భ్రమర
గీ. విరజవిరజహుంకృతిపీఠ[?] సింహ
ళమున నరసింహికనుఁ గాశ్మిరమున వాణి
నుజ్జయిని మహాకాళిని నున్నతముఁగఁ
జూచువారలు జముపురిఁ జూడరెందు. (ఆం) 142

సీ. వర్ణితప్రాకారవప్రరత్నప్రభావ్యూహకిమ్మీరితవ్యోమతలము
వివిధవాదిత్రభైరవరావపూరిత ప్రవిమానతరదిశాభాగసమితి

బహుళదంతావళప్రాలంబఘంటికా టంకృతోల్లాసి ఘంటాపదంబు
కమనీయరూపరేఖాకళావిభ్రమ ప్రకటితాబ్జాననా రత్నపేటి
గీ. సహజ ధర్మార్థకామమోక్షప్రసిద్ధి
సన్నుతౌదార్యఖేలనాజన్మభూమి
సకలసంపద్విలాసవిస్తారహసిత
రాజరాజపురంబు వారణపురంబు. (ఆం) 143

చౌడయ్య, గంగరాజు [సాముద్రికశాస్త్రము] (జ)

క. ఉదరంబు దర్దురోదర
సదృశంబై జఘన మతివిశాలం బయినన్
సుదతీరత్నంబున క
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్రుఁడు పుట్టున్. (జ) 144

క. కడు నిడుదయుఁ గడు గుఱుచయుఁ
గడు వలుదయుఁ గడుఁ గృశంబుఁ గడు నల్లనిదిన్
గడు నెఱ్ఱనిదగు మెయి గల
పడఁతిని గీడనిరి మునులు వరమునిచరితా. (జ) 145

చౌడయ్య, గంగరాజు [నందనచరిత్ర] (ఇ)

సీ. కురులు వ్రాయుటయును గొదమ తుమ్మెదలయ్యెఁ గన్నులు వ్రాయంగఁ గలువలయ్యె
నధరంబు వ్రాసిన మధురబింబంబయ్యె గళము వ్రాయుటయును గంబువయ్యెఁ
జనుఁగవ వ్రాసినఁ జక్రవాకములయ్యెఁ జేతులు వ్రాసినఁ జిగురు లయ్యె
నడుము వ్రాయుటయును నవలతయై యొప్పెఁ బొలుపారఁ గటి వ్రాయఁ బులినమయ్యెఁ
గీ. దరుణి తొడలు పాదతలములు వ్రాసినఁ
గరికరములు హల్లకములు నయ్యె
నేమి వ్రాయఁదలఁచి యేమి వ్రాసితినని
మదనవిభ్రమమున మనుజవిభుఁడు. (జ) 146
[9]

క. కులమున బలమునఁ జలమునఁ
నలవునఁ గార్యమున సదృశులగువారలతో
బలిమి యుడిగి సామముగాఁ
దలకొని చేయునది నీతి తత్త్వజ్ఞులకున్. (జ) 147

గీ. దొడ్డముత్తియంబు తోరంపుఁబటికంబు
వెండిగుండు మొల్లవిరులచెండు
రసముగుళిక కప్పురంబున కరుడు నా
సొంపు మిగిలి వేగుఁజుక్క వొడిచె. (ఆం) 148

సీ. బచ్చనయోవరి బంధాలమేల్కట్టు సకినల మంచంబు జమిళిపఱుపు,
నిలువుటద్దము హరినీలపు గద్దియ పటికంపుగిండి పొంబట్టుసురఁటి,
పసిఁడిపావలు వెండిపడిగంబు ముత్యంపు జాలవల్లిక కెంపుసానఱాయి,
పగడంపుదివియకంబము వజ్రముల తట్ట మరకతమయమగు మధువుకుడుక,
ఆ. గరిగె పోఁక యొత్తు బరణి సున్నపుఁ గ్రోవి
కప్పురంపుఁబెట్టె గాజుకోర
తనువు నునుపు గలుగుతడి యొత్తుమడుఁగులు
నాది యైనవాని నలవరించి. (ఆం) 149

చ. ముదిమికి మందు వాక్కలిమి[?] ముంగలిజిహ్వ తపఃఫలంబు స
మ్మదమునివాస మింపుగని మారవికారముప్రోది కామినీ
వదనవిభూషణంబు జనవశ్యము హాస్యరసాబ్ధి లాస్య సం
పద యుదరస్థలంబు మధుపానసుఖంబు జగత్త్రయంబునన్. (ఆం) 150

గీ. వికసితంబైన మోమున వెండికోరఁ
గదిసి మధువొక్కయెత్తున సుదతి కొనిన
మగువమొగ మచ్చునను శశిమండలంబు
చెలువముగఁ జేయఁ బెట్టింపఁ జేర్చినట్లు. (ఆం) 151

ఉ. వెన్నెలరూపుకప్పురపువేలుపువజ్రపుబొమ్మలెల్లఁ దాఁ
బన్నిన నొప్పులెప్ప మనఁ బంకజమధ్యమునందుఁ బొల్చి క్రేఁ
గన్నుల బ్రహ్మఁ జూచి చిలుకం బలికించుచు నున్నవాణి యు
ద్యన్నవశబ్దభావరసతత్త్వము మత్కృతి కిచ్చు నెప్పుడున్[?] (ఆం) 152

శా. సారాచారవిచారు నుత్తమకులున్ సౌజన్యధన్యున్ గృపా
పారున్ శూరు వికారదూరు ననఘున్ గంభీరు ధీరు న్మహో
దారున్ భవ్యు సమస్తకార్యవిదు నాప్తప్రాప్తు నర్వేంగితా
కారజ్ఞున్ హితు మంత్రిఁ జేసి పతి సౌఖ్యం బందుచుండం దగున్. 153

తిక్కన [విజయసేనము] (ఇ)

సీ. అరిమానసమ్ములు దరికొని యేర్చు నె వ్వని యుజ్జ్వలాకారవైభవంబు?
బుధుల లజ్జానతిఁ బొందునట్లుగఁ జేయు నెవ్వని పాండిత్య మెసక మెసఁగ?
నే వదాన్యులనైన నెవ్వని వితరణం బులు వంది[జనుల] చాపల మొనర్చు?
వనితాజనము మానధనముఁ గోల్పుచ్చు వి చ్చలవిడి నెవ్వాని విలసనంబు?
ఆ. అట్టి విజయసేను నభిరామమూర్తి వి
ద్యానిరూఢమతి వదాన్యవరుఁడు
మధురవిభ్రమైకనిధి యను జగమెల్ల
నతఁడు చిత్రగుణసమగ్రుఁ డగుట. (జ) 154

ఉ. అల్లనఁ దొండ మెత్తి శివునౌఁదల యేటిజలంబు వుచ్చి సం
ఫుల్లతఁ బాదపీఠకము పొంతన యున్న సహస్రనేత్రుపైఁ
జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణ సేయునట్లు శో
భిల్లు గజాననుండు మదభీప్సితసిద్థికరుండు గావుతన్. (ఆం) 155

శా. ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుండై పరీక్షించినన్
దిత్సావ్యగ్రుఁడు గాక వ్రిగహముచో దేశంబుఁ గాలంబు సం
వత్సామగ్ర్యముఁ జూపి శక్యము దెసన్ బ్రారంభియై భూప్రజా
వాత్సల్యార్థమనస్కుఁడైన [పతి] శశ్వచ్ఛ్రీసమేతుం డగున్. (జ) 156

క. కిసలయ కదళీబిస బిం
బ సుధాంశు ప్రాయవస్తుబహువిధరూపో
ల్లసము ముద ముడుప నజుఁ డొక
యసమాకృతిఁ దాల్చె ననఁగ నంగన యొప్పెన్. (జ) 157

చ. కొనియెద మన్న బండరులు కోటుల కమ్ముదు; రమ్మఁబూని తె
చ్చిన సరకెంత పెద్ద వెల సెప్పినఁ గొండ్రు తగంగ నిచ్చి న
చ్చిన వెల తీర్చి లక్ష్మి తమ చెప్పిన యట్టుల చేయుసొంపు పే
ర్కొన గణుతింపరాదు, పురికోమటులం బ్రణుతింప నొప్పదే? (జ) 158

శా. గీర్వాణాచలసాను వాత్మరదనక్రీడాహతంబైన న
య్యుర్వీరంధ్రమునం దనంతఫణరత్నోద్యత్ప్రభ ల్పర్వి దృ
క్పర్వంబై పొదిఁగట్టి పేర్చిన మదిం గంజంబ యంచున్ కన
ద్గర్వోన్మీలితనేత్రుఁడై మెఱయు వేదండాననుం గొల్చెదన్. (ఆం) 159

చ. తరుణుల వీగుఁ జన్నుఁగవ తాఁకున మన్మథచక్రవాక బం
ధురగతి లీలఁ గామినుల తోరపుటూరుల ఘట్టనంబులన్
కరివరహస్తకాండపటుఘట్టనలన్ బరిఖాతరంగముల్
దిరుగుడు వడ్డ తీరముల దెట్టువు గట్టు సరోజరేణువుల్.[10] (జ) 160

సీ. పద్మంబులును వప్రపద్మరాగ ప్రతి బింబములును తగ బెరసి మెఱయఁ
గల్లోలములును రంగన్మకరాయిత తుండములను నటు తొట్రు పడఁగ
బిసములు విహరణరససమాగత రసా తల నాగశిశువులు చెలిమి సేయఁ
జక్రయుగ్మంబులు జలకేళిలోల ని తంబినీస్తనములు తఁడబడంగ
ఆ. సొంపు మీఱినట్టి పెంపును గంభీర
తయును బరపు [బోవు] వేడ్క దగిలి జనులు
సంస్తుతింప నఖిలసన్నివేశస్థితి
నప్పురంబు పరిఖ యతిశయిల్లు. (జ) 161

క. పరధన పరాంగనాజన
పరిహారము పరమధర్మపథ మందురు స
త్పురుషులు మఱవక వీనిం
బరికింపుము వినకు మెపుడు పైశున్యంబుల్. (జ) 162

సీ. మదనవశీకారమంత్ర దేవత దృష్టి గోచరమూర్తిఁ గైకొనియె నొక్కొ?
సితకరబింబ నిస్సృతసుధాధార ని తంబినీరూపంబుఁ దాల్చె నొక్కొ?
విధికామినీ సృష్టివిజ్ఞాన పరసీమ భాసురతనులీలఁ బడసె నొక్కొ?
శృంగారనవరస శ్రీవిలాసోన్నతి సుందరాకారంబు నొందె నొక్కొ?
ఆ. కాక యొక వధూటి కడుపునఁ బుట్టిన
భామ కేల యిట్టి రామణీయ
కంబు గలుగు ననుచుఁ గన్నియపై మహీ
పాలసుతుఁడు దృష్టి పఱపె నర్థి. (జ) 163

ఆ. మహిమ చెడదు స్వామ్యమాత్య సుహృత్కోశ
రాష్ట్రదుర్గబలపరాయణులకు
నీవు నిదియు నెఱిఁగి కావింపు సప్తాంగ
సంగ్రహంబు నీతిశాస్త్రనిపుణ! (జ) 164

తిప్పరాజు, కుడిచెర్ల [కాంచీమాహాత్మ్యము] (ఆం)

గీ. అరుణమణిదీప్తు లంతంత నతిశయిల్ల
విమలశశికాంతరోచులు విస్తరిల్ల
గావ్యబుధగురుసంగతి గలిగి పురము
సూర్యసోమవీథులు కడుసొంపు మిగిలె. (ఆం) 165

గీ. కనకభూధరశిఖరానుకారు లగుచు
నా పురంబున నొప్పారు గోపురములు
సంతతాధ్వగమన పరిశ్రాంతులైన
చంద్రసూర్యుల విశ్రమస్థలములట్లు. (ఆం) 166

మ. జ్వలదగ్ని ప్రథమానతేజుని భరద్వాజున్ వినిర్ధౌత వ
ల్కల భాస్వత్పరిధానుఁ బింగళజటాలంకారుఁ గృష్ణాజినో
జ్జ్వల సంవ్యానుఁ దపః కృశీకృతతనున్ శాంతాత్ము బ్రహ్మైక ని
శ్చలచిత్తున్ విజితేంద్రియున్ బ్రముదితస్వాంతున్ గృపావంతునిన్. (ఆం) 167

సీ. పద్మరాగప్రభాభాసురపటల మ కాల సంధ్యారాగ లీలఁ బెనుపఁ,
గాశ్మీర కనకనిర్గతదీప్తి యసమయ బాలాతపస్ఫూర్తిఁ బరిఢవింప,
హరినీలరుచులు గస్తురిప్రోవులును ననా రంభ నీలాభ్రవిభ్రమముఁ జేయ,
వజ్రమౌక్తిక హిమవాలుకాదీప్తులు నిర్నిశాచంద్రిక నిర్వహింపఁ,
గీ. జతురబహువర్ణ పట్టవస్త్ర ప్రభాతి
నిర్జలద జాల సముదీర్ణ నిర్జరేంద్ర
చాపలక్ష్మి రచింపఁ బ్రశస్త [దీప్తి]
[వి]తతి నొప్పారు నప్పురి విపణివీథి. (ఆం) 168

సీ. మహనీయతర యాజమాన మంత్రంబులు జపియించు ముఖచతుష్టయము దనరఁ,
బావన నవనీత పరిలేపనంబున మెఱుఁగెక్కియున్న క్రుమ్మేను వెలుఁగ,
బహుచిత్రమృదుసూక్ష్మపక్ష్మశోభితమైన హరిణాజినోత్తరీయంబు మెఱయ,
శ్రీవత్సలాంఛన శ్రీమూర్తిచింతన సంభృతానందబాష్పములు దొరుగ,

గీ. శారదాదేవి, సావిత్రి, శ్రద్ధ, తుష్టి,
మతియుఁ, గుశసూత్రకాంచిదామములు వెట్ట
నెమ్మిఁ గొలువంగ దర్భాసనమ్ముమీఁదఁ
జూడ నొప్పెఁ బితామహసోమయాజి. (ఆం) 169

ఉ. సహ్యముఁ గాంచె వాణి వనసైరిభ సామజ సింహ గండకా
సహ్యము సిద్ధసాధ్యసురచారణకిన్నర సన్మునీశ్వర
గ్రాహ్యము శృంగసంశ్రిత కిరాతవధూశ్రుదివ్యయోషి దై
తిహ్యము నగ్రభూసుఖితతిగ్మమయూఖ రథౌపవాహ్యమున్. (ఆం) 170

తిమ్మయ, కుంటముక్కల [శైవాచారసంగ్రహము] (ఆం)

సీ. కపిలవర్ణముగోవు కడునొప్పు నంద నా జనియించెఁ దద్గర్భమున విభూతి,
నల్లనిమొదవు వర్ణన కెక్కు భద్ర నాఁ దద్గర్భమున భసితంబు వుట్టె,
నెఱ్ఱనిధేనువు నేపారు సురభి నాఁ గలిగె భస్మంబు తద్గర్భమునను,
పొగ[డ]చాయ గలయావు పొలుచు సుశీల నా క్షారంబు గలిగెఁ దద్గర్భసరణిఁ
గీ. జిత్రతరవర్ణరుచులు ప్రసిద్ధిఁ దాల్చు
గిడ్డి సుమనోభిధాన మంగీకరించుఁ
బ్రభవ మొందెఁ దదీయగర్భమున రక్ష
పంచముఖముల నిట్లుద్భవించె భూతి. (ఆం) 171

త్రిపురాంతకుఁడు, రావిపాటి [అంబికాశతకము] (ఇ)

ఉ. ఆదిమశక్తి యీ తరుణి యాద్యకుటుంబిని యీ కుమారి ము
త్తైదువ యీ తలోదరి చిదాత్మక యీ సతి విశ్వమాత యీ
పైదలి సర్వలోకగురు భామిని యీ చపలాక్షి యంచు బ్ర
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి ని న్నెఱిఁగింతు రంబికా! (ఆం) 172

ఉ. కూడెడు వెండ్రుకల్ నిడుదకూఁకటఁ బ్రోవుగ బొడ్డుపై వళుల్
జాడగఁ దోఁపఁ గ్రొమ్మొలకచన్నులు మించు దలిర్ప సిగ్గునన్
జూడఁగ నేరముల్ మెఱుఁగుఁ జూపుల నీన హిమాద్రి యింట నీ
వాడుట శూలికిన్ మనము వాడుట గాదె తలంప నంబికా! (ఆం) 173

ఉ. భారతివై సరోజభవుపాల వసించి రమావధూటివై
నీరజనాభుఁ జెంది ధరణీధరనందనవై మహేశ్వరుం
గోరి వరించితమ్మ! నినుఁ గొల్వక యూరక యేల కల్గు సం
సారసుఖంబు లీ మనుజసంతతికిం దలపోయ నంబికా! (జ) 174

త్రిపురాంతకుఁడు [ఉదాహరణము] (ఇ)

ఉ. పాములు హారముల్ నెలయుఁ బాపటసేసయు నేఱు మల్లికా
దామము తోలు దువ్వలువు దట్టపుబూదియుఁ జందనంబు మై
సామునఁ జాల నందముగ సన్నిధి సేసిన జాడఁగంటి నే
నా మదిలోఁ గుమారగిరినాథుని శైలసుతాసనాథునిన్. (జ) 175

త్రిపురాంతకుఁడు [తారావళి] (జ)

మ. అమితధ్వాంత తమాలవల్లిలవనవ్యాపారపారీణ దా
త్రమొ సౌగంధికషండకుట్మలకుటీరాజీసముద్ఘాటన
క్రమనిర్వాహధురీణకుంచికయొ నాఁగం బెంపున న్నీ కళా
రమణీయత్వము చూడ నొప్పెసఁగుఁ జంద్రా! రోహిణీ వల్లభా! (జ) 176

మ. చరమక్ష్మాధర చారుసింహముఖదంష్ట్రాకోటియో నాఁగ నం
బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేఖప్రస్ఫురద్గర్వసం
హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల మీ రేఖ ని
త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియచంద్రా! రోహిణీవల్లభా!

మ. పొలకయ్యంబులఁ గల్గు ముద్దుటలుకన్ బుష్పాయుధారాతి మ్రొ
క్కులఁ దీర్పన్ దలమీఁదఁ గాన నగు నీ క్రొమ్మేను పుణ్యాంగనా
తిలకంబైన భవాని పాదనఖపంక్తిం జెంద డెందంబులో
దలఁతా చుక్కలతోడి మక్కువలు చంద్రా! రోహిణీ వల్లభా! (జ) 177

మ. రతినాథుం డను మాయజోగి చదలం ద్రైలోక్యవశ్యాంజనం
బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయంబై యున్న పాత్రంబునన్
మతకం బేర్పడఁ బెట్టి దాఁచెనన మీ మధ్యంబునన్ మచ్చ సం
తతమున్ గన్నులపండువై వెలయుఁ జంద్రా! రోహిణీవల్లభా! (జ) 178

దుగ్గన, దగ్గుఁబల్లి [నాసికేతోపాఖ్యానము] (జ)

సీ. పాండ్య కేకయ చోళ బర్బర పాంచాల బంగాళ లాట నేపాళ గౌళ
గాంధార సౌవీర కాంభోజ కాశ్మీర హేహయాభీల బాహ్లిక విదేహ
మగధ మద్ర విదర్భ మాళవ కేరళా శ్మంతక కుంతల మత్స్యవత్స
కరహాట వరహాట కర్ణాట శకలాట కుకుర కోసల కాశ కురు కరూశ
తే. సుహ్న సౌరాష్ట్ర ఘూర్జర శూరసేన
చేది సింధు యుగంధర చేకితాన
యవన బహుధాన మలయాల కాంగ వంగ
తెంకణాంధ్ర కళింగాది దేశములకు. (జ) 180

దుగ్గన, దగ్గుఁబల్లి [శివకాంచీమాహాత్మ్యము] (ఆం)

సీ. క్షోణీనభంబులు సూత్రించిన ట్లింద్ర చాపంబు చాపమై సంఘటింప,
బ్రహ్మాండభాండంబు పగిలించు గర్జలు సింహనాధస్ఫూర్తిఁ జేయుచుండ,
సౌదామనీదామజాలము ల్దిక్కుల స్వప్రతాపానలజ్వాలలుగను,
నాహార్యహరణోద్యదశనిసంఘంబులు దివ్యాస్త్రవితతులై తేజరిల్ల,
గీ. నాశుశరవృష్టి శరవృష్టి నఖిలలోక
బాధకోద్గ్రీష్మభీష్మశుంభత్ప్రతాప
మార్చె నర్జునాయిత శిఖండ్యధికబద్ధ[?]
నాఖ్యవర్షర్తు నారాయణాఖ్యమూర్తి. (ఆం) 181

సీ. బంధూక మెఱమించె బరపయ్యె గేదంగి కడిమి పుష్పితమయ్యె గ్రంథి పూచె
నర్జునం బలరారె నరవిందములు కేరె భూస్థలి నేఱులు పుక్కిలించె
గండూపదము లుబ్బె గలరె హంసచయంబు నటియించె గప్పలు నమిలి చెలఁగెఁ
జాతకంబులు మించె సాగరం బెడయించె హరిగోపములతోడ నాడె లేళ్ళు
గీ. మత్తభృంగంబులకుఁ దేనె రిత్త యయ్యె
గండుకోయిల కూఁతలు గట్టుకొనియె
చూలుకొన స్వాతి చూటిఁ బొదువ[?]
విష్ణునకు నిద్రపోయెడు వేళ యయ్యె. (ఆం) 182

దేచిరాజు, రాపరది [గ్రంథమేదో?] (ఆం)

మ. ఘనవప్రోపరిభాగకేతుకషణన్ గంజారిబింబంబు కం
దిన దంచున్ బురి ముగ్ధభామినులు ప్రీతిన్ గందు వోఁ దోమఁ జం
దన మర్థిం గొని లీల నీలరుచిమత్కాంతోరుహర్మ్యంబు లె
క్కిన నంభోదతటిల్లతావితతిమాడ్కిం బొల్తు రుద్యద్గతిన్. (ఆం) 183

దేవరాజభట్టు [హరిశ్చంద్రకథ] (ఆం)

ఉ. అంబుధు లాలవాలము దిగంతము లాకులు కూర్మశేషవ
ర్ష్మంబులు కందమూలములు చక్రపుఁగొండలు కోట నాఁగ హ
ర్షంబున విష్ణువిగ్రహకుజంబునఁ జుట్టి పెనంగి మిన్ను పు
ష్పంబుగ నబ్జజాండ మను పండును బండు ధరిత్రి వల్లియై. (ఆం) 184

చ. సురనిచయంబు ద్రోచి నహుషుం డటు లేలకయున్న రాక్షసు
ల్వరుసల వచ్చి చూఱకొని వాసవు వెట్టికిఁ బట్టకున్న శ
ర్వరిఁ గనుమూయఁ గన్నఁ ద్రిదివంబను నాఱడి నల్పజీవమై
యరుగక భూమినున్న అమరావతి యీడగు నయ్యయోధ్యకున్. (ఆం) 185

నరసింహభట్టు, ఆమడూరి [షోడశరాజచరిత్ర] (జ)

శా. జంఘాలప్రతిభాను లార్షకవితాసంజాతు లాశుక్రియా
సంఘస్రష్టలు సంఘశః కమలజుల్ సాహిత్యసర్వంకషుల్
సంఘర్షార్హులు గాక కాకవులు లక్ష్యంబే హలిగ్రామఘా
ణంఘణైక్యశరణ్య బల్బజ[?]నిబంధల్ మత్కుటాక్షేక్షుకున్. (జ) 186

నాగనాథుఁడు, పశుపతి [శ్రీవిష్ణుపురాణము] (ఆం)

ఉ. మాసరమయ్యె నంత మధుమాసము పాంథవిలాసినీజన
త్రాసము పుష్పబాణనవరాజ్యవిలాసము వల్లరీవధూ
హాసము మత్తకోకిలసమంచితపంచమనాదమంజిమ
వ్యాసము జీవలోకహృదయంగమసౌఖ్యవికాస మెంతయున్. (ఆం) 187

నన్నిచోడఁడు [కళావిలాసము] (జ)

క. తలపోయఁగ రుచులాఱును
గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు నాఁ

కలి పుట్టు దగయుఁ జెడుఁ ద
మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్. (జ) 188

చ. తొడవులు పెట్టి సంభ్రమముతోఁ దిలకించు మడుంగుఁ గట్టుఁ బై
పడఁ దడవోప దింపెఱిఁగి పట్టను నేర్పులు గట్టిపెట్టుఁ బ
ల్కెడునెడఁ దొట్రుపాటొదవుఁ గింకకు జెంగిలు మేన్ సెమర్పఁగాఁ
జిడుముడిఁ బొందుఁ గాంత పతిఁ జేరిన కూరిమి గల్గెనేనియున్. (జ) 189

సీ. పృథులవిశ్వంభరా రధమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు?
కాంచనాచలకార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు?
నవిహతపాశుపతాస్త్రమ్మునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు?
నతులితామరదానవాదిబలంబుల గెలిపించె నెవ్వఁ డయ్యళిబలంబు?
తే. నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోక
ములకు వెఱగొంగ జీవుల మూలకంద
మతని యిలు సొచ్చి వెడలని యతఁడుఁ గలఁడె?
యతని యమ్ములనుఁ బడకున్న యతఁడుఁ గలఁడె? (జ) 190

క. శ్రీమంతుఁడు గుణవంతుఁడు
ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండు కళా
ధాముండును గావలయును
దా మహిఁ గాముండు కామతంత్రవివేకీ! (జ) 191

పద్మకవి [జినేంద్రపురాణము] (ఆం)

సీ. హరినిలయంబును హరినిలయంబును విషధరాఢ్యంబును విషధరాఢ్య,
మప్సరోమయమును నప్సరోమయమును వనవిలాసమును బావనవిలాస,
మున్నతకరిశృంగ మున్నతకరిశృంగ మిందుకాంతస్రవ మిందుకాంత,
మురుకలనకులంబు నురుకలనకులంబు నంశుకాంతద్యోతి తాంశుకాంత,
గీ. మొనర నవశతసాహస్రయోజ నోన్న
తమును బదివేలు యోజనా లమరువలము
గలిగి కనకాద్రి కిన్నూటఁ గలిగి తనరి
ప్రథితమై యొప్పు మందరపర్వతంబు. (ఆం) 192

పెద్దిరాజు, పొన్నాడ [ప్రద్యుమ్నచరిత్ర] (ఇ)

సీ. అమృతంబులోనికందంతయుఁ బోఁదోమి కొని పూర్ణచంద్రుండు దనరెనేని
విధుమండలంబున విధిచేత దశవంబు [?] గని పూవుఁదూపులు గ్రాలెనేని
శృంగారరస సరసీజాతులైన కో మలమృణాళంబులు పొలిచెనేని
పసిఁడికుంభములకుఁ బ్రభవించి మించు జ క్కవకవ బోదలు గలిగెనేని
తే. మెలఁత నెమ్మోము చెన్నున మించవచ్చుఁ
బొలఁతిచూడ్కుల పొలపంబుఁ బోలవచ్చు
నింతి మృదుబాహువుల దొరయింపవచ్చుఁ
జెలువ చనుఁగవ జిగి సరి సేయవచ్చు. (జ) 193

శా. అవ్యాయామపురారు లక్షుభితపారావారు లక్షీణపు
ణ్యవ్యాపారసురేంద్రు లగ్రహణచంద్రాదిత్యు లస్థావర
ప్రవ్యక్తామరభూరుహంబు లచతుర్భావాననబ్రహ్మలా
దివ్యద్వారవతీపురిం గలుగు ధాత్రీపాలు రెల్లప్పుడున్. (జ) 194

చ. ఇతవులయందు నెల్ల తన మేపును సొంపును మవ్వమున్ జిర
స్థితిఁ జెలువొందనోచి మరుసేనలకున్ బెనుప్రాపుగా సమా
తతముగఁ బెక్కు నిల్కడలు దాల్చిన మాధవలక్ష్మీయో యనన్
సతతము నొప్పెఁ జూడఁ బురనందనసుందరపాదపావలుల్. (జ) 195

చ. ఇలకు నుపేంద్రుతోఁ దగిలి యీశుఁడు వేల్పులపిండు వెండిగు
బ్బలికిని బైఁడికొండకును బాలెము నిచ్చలుఁ జేయు చంద్రసూ
ర్యుల నిలఁ దెచ్చిరో యనఁగ నొప్పగు నప్పురి హేమరత్నమం
డలిఁ దగి నాగభోగపరిణాహము లయ్యెడి దేవగేహముల్. (జ) 196

సీ. కమనీయ చిత్రసంగత గతిక్రమముల దిగ్గజాదులనడ ధిక్కరించి
లాలితగంభీరలఘుతరప్లుతముల హరిణసంఘంబుల నపహసించి
సవ్యాపసవ్యసంచరణమహోద్ధతిఁ బంచాననక్రీడ బాహు సఱిచి
మహితనిరాయాసమధ్యాజవంబుల ననిలప్రయాణంబు నతకరించి
తే. సముచితాన్వర్థపూర్ణవేగములచేతఁ
గెరలి వచ్చి తలంపులఁ గిక్కురించి
హేతిమాడ్కి నుప్పరముల నెసక మెసఁగి
పంచధారలు గల హయపంక్తు లడరు. (జ) 197

మ. కలయం గాడ్పునఁ దూలి పుప్పొడి దివిం గప్పందు మారుండు వే
డ్కల నారామరమావసంతులఁ గడంకం బెండ్లి సేయుంచుచో
వెలయంబట్టిన యుల్లభంబుపగిదిన్ వేమాఱుఁ దద్భూమిపైఁ
జెలువొందింపుచు రాలుఁ బుష్పవితతుల్ చేకొన్న ప్రాలో యనన్. (జ) 198

క. కోటలతుద మకరప్రభ
దీటుగొనం బర్వి పరులదృష్టికి నొప్పున్
బాటించి మేయ దివి రవి
ఘోటకముల కజుఁడు పసురు కొలిపిన భంగిన్. (జ) 199

సీ. గజయాన మెలఁగిన గతియైనఁ బైపడి గద్దించి తర్కించి కలఁక నొందు,
మానిని యల్గినమాడ్కిఁదోఁచినఁ దేర్ప నుంకించి భావించి యుమ్మలించుఁ,
జపలాక్షి కెమ్మోవిఁ జవిగొన్న యట్లైనఁ జెమరించి చర్చింతి చిన్నవోవు,
మదవతి కొఁగిలి గదిసిన యట్లైనఁ బులకించి తేఱి సంచలత నొందుఁ,
గీ. దన్ను నొఱసినఁగోర్కులు తగులుగొలుపు
నోలిఁ దనలోన నన్నరపాలసుతుఁడు
మానమూఁటాడ గాంభీర్యమహిమ సడల
లజ్జ గడివోవ ధైర్యంబు లావు డిగఁగ. (జ) 200

క. ద్విజశుశ్రూషాపరవశు
లజనిత పరివాదు లభినవాకృతులు[?] మహా
సుజనచరిత్రులు ధీరులు
భుజవిక్రమధనులు ఘనులు పురిశూద్రజనుల్. (జ) 201

సీ. నెలఁతుక చూడ్కి వెన్నెల గాసినఁ గుమారు వీక్షణాంభోనిధి వెల్లివిరియఁ,
బతి చూడ్కి తామరల్ పరువంబు నొందఁ దొ య్యలి చూపుటలలు చిట్టాడుచుండ,
సుదతిచూ పమృతంపుసోనయై కురిసిన వరుదృష్టి యనిమిషత్వమునఁ బొంద,
నధిపుదృష్టిప్రవాహంబు పెల్లడరిన నింతి దృఙ్మీనంబు లీఁతలాడ,
తే. వరుసఁ గౌతుకకల్లోలవలన మొలయ
రాగమకరందమత్తత ప్రజ్వరిల్ల
సంచితధ్యాన మనుప్రకాశము తలిర్పఁ
జిఱుతసి గ్గనువలలోనఁ జిక్కువడక. (జ) 202

సీ. పరువంపువిరులపైఁ బొరసి యొండొకవనంబుల సౌరభంబులఁ బొరపుసేయుఁ,
బక్కువాసినపువ్వుఁ బదువుతోఁ జెరలాడి యిలకు వేద్యంకంబు లలవరించుఁ,
గ్రొవ్విరులను దిరుగుడువడి పుప్పొడి దలిరాకులకు వింత చెలువొనర్చుఁ,
దనుపారఁ గొలఁకులఁ దగ నాడి వనకేళి జనులపైఁ బులకలఁ జాదుకొల్పుఁ,
గీ. గేరి మకరందములఁ దొలఁకించి మించి
మొనసి లేఁదీఁగెలకుఁ జిఱు ముసురు గురియ
నప్పురారామముల నెల్ల నలసగతుల
మలసి సొంపారు నింపారుమారుతంబు. (జ) 203

క. పురగోపురశిఖరంబులఁ
గర మరుదై పద్మరాగకలశము లమరున్
జరమాచరమాద్రులపై
సరిఁ బున్నమఁ దోఁచు సూర్యచంద్రులభంగిన్. (ఇ) 204

సీ. బహువర్ణరత్నప్రభాతతి దివికి నొప్పఁగ వసంతశ్రీవిభాతి గాఁగ,
నగ్రస్థితాంగనాస్యామోదములు దివ్యసరిదబ్జములకు వాసనలు గాఁగ,
రమ్యస్థలములు నిర్జరుల చూడ్కికిఁ గొమరౌ[?]గదాకరములలాగు గాఁగ,
రజతకుట్టిమకాంతి రాజరోచుల కెదు రరుగు చుట్టపుఁబిండువరుస గాఁగ,
తే. సరసలీలావిలాసవిస్ఫురణ గలుగు
రమణరమణులచే నిప్డు గొమరు మిగిలి
పొడవు సొబగును గలిగి యప్పురమునందు
భర్మనిర్మితహర్మ్యముల్ పేర్మి నడరు. (జ) 205

మ. బహువస్తుక్రయవిక్రయక్రియలు సంపత్ప్రాప్తికై కాకయు
న్విహితాచారములైన చందముల వర్ణింపంగ నింతంత నా
మహిలో రాదని చెప్ప నొప్పుదురు ధీమంతుల్ కుబేరాధికుల్
మహిమోదాహరణంబు లప్పురము కోమట్లెల్ల లక్ష్మీస్థితిన్. (జ) 206

సీ. బ్రాఁతియే యిఁకఁగల్గు లేఁతవెన్నెల నిగ్గు లుగ్గువెట్టెద నీకు నూరకుండు
మునుపుగా నీకిత్తు ముదురువెన్నెలసోఁగు సంతసంబున నుండు జాలిమాని,
వేగిరింపకు నీకు వెలఁదివెన్నెలక్రొవ్వు గుడిపింతుఁ జిన్నారికడుపు నిండ,
నిట్టి ముచ్చట వాయ నీఁదింతుఁ బండువెన్నెలవెల్లిఁ బలుమాఱు నిన్నుఁ జేరి,

గీ. కూయకుఁడు మీరు సంతుష్టిఁ గూరినపుడు
శీతలంబగు వెన్నెల చిగురుఁబాన్పు
నందు నిడి నిద్రపుచ్చెద ననుచు నాద
రించె బిడ్డల నొక చకోరీపురంధ్రి.[11] (జ) 207

సీ. మించినగతులు సాధించి యింద్రునికి మార్కొని యున్న కాల్గలకొండ లనఁగఁ,
జేతనత్వంబులు చేకొని రవికిఁ గొమ్ములు చూపు చీఁకటి మొన లనంగఁ,
జేకల్గి యలుల కనేకదానము లిడ మేలఁగు తమాలభూమిజము లనఁగఁ,
జిత్రకుధాస్తరాస్తీర్ణులై[?] గాడ్పుతో మోహరించిన కారుమొగుళు లనఁగఁ,
తే. నెల్లచందంబులను గడు నెసగ మెసఁగి
పొగడు నెగడును బడసి యప్పురిఁ జరించుఁ
దమ్ముఁ జూచిన సిరియుఁ బుణ్యంబు నొసఁగఁ
దావలంబైన భద్రదంతావళములు. (జ) 208

గీ. రత్నగర్భ గర్భరత్నంబు లవ్వీట
నర్థిఁ బుట్టుచుఁ గొనియాడ మరగి
వీథి వీథి నెపుడు విలసిల్లు నా నాప
ణముల వివిధరత్నసమితి వెలుఁగు. (జ) 209

గీ. రాయుచున్న ఘనపయోధరములు గలిగి
నడుము లొక కొంత బయలయి బెడఁగు మిగిలి
చూడ నొప్పారు రేఖలసొంపు మెఱసి
కోటకొమ్మ లమరు వీటికొమ్మలట్లు. (ఆం) 210

మ. లలిత లతాంతపల్లవశలాటు ఫలాంకిత భూజరాజి సం
కుల బహుచిత్ర వర్ణపటకూటకుటీపటలంబుగా లతా
మిళితవిలాసులై చెలువు మీఱుఁ బురీవనముల్ జగజ్జయా
కలిత రమాభిరామ నవకామ మహాశిబిరంబులో యనన్. (జ) 211

శా. లీలం గాముని నోమఁ బోవునెడఁ గేళీనందనం బెంతయున్
జాల న్వాసన కెక్కు, నొండొరువు లోజం బల్కుచోఁ జిల్కపిం
డాలో నాల్కలతొక్కుఁ దక్కుఁ, జని నీరాడంగ నంభోజినీ
రోలంబంబులు చొక్కు, వీటి సతులన్ రూపింప సామాన్యమే? (జ) 212

సీ. వలరాజు వోసిన విలునాఱువోలె బం ధురములగు చెఱకుఁదోఁటలకును,
నలువచేఁ బెరిఁగి దీనుల కీగియును లేని కల్పకంబులు వోని క్రముకములును,
మాధవుండేదిన మవ్వపుఁబొరల యే డ్తెఱ నివ్వటిలు నాకుఁ దీఁగెలకును,
పర్జన్యసత్కృతిఁ బసిఁడి పండెడు చేల నంగఁ బేర్చిన రాజనంబులకును,
తే. దెట్టుపలు గట్టి నీటితోఁ దేలిపాఱు
తమ్మిపుప్పొళ్ళఁ బ్రోదులై తనరుచుండు
ననిన నవ్వీటిచెఱువుల యతిశయంబుఁ
బుడమిలో నింక నేమని పొగడవచ్చు? (జ) 213

ఉ. శీలములీల, లంగములు చేకొని క్రాలెడు వేదముల్, కలా
జాలము మన్కిపట్లు, యతిసజ్జనసంపదతిట్ట, లర్థి పూ
జాలలిత ప్రభావములు ... .... .....
వేలుపుఁ బిండుపండువులు, వీట ధరామరు లుత్తమస్థితిన్. (జ) 214

పెమ్మన, భావన [అనిరుద్ధచరిత్రము]

గీ. అన్నిదినములు నీ భంగి నఖిలలోక
సమ్మదావహమై మహోత్సవము జరుగ
నుత్తమ క్షత్రవిహిత శాస్త్రోక్తసరణి
శాంతవిఘ్నమై పెండిలి సంపతిల్లె. (ఆం) 215

గీ. అభినవములైన ముక్తాఫలాక్షతములు
హస్తపంకేరుహముల నిండారఁబట్టి
జాణజగజెట్టియగు పంచబాణుపట్టి
చేరి నించె నుషాదేవి శిరముమీఁద. (ఆం) 216

క. అభిషేకోత్సవ లీలా
విభవానంతరమునందు వెన్నుని మనుమం
ఢభినవవిలేపనాంబర
విభూషణ స్రక్కలాప విభ్రాజితుఁడై. (ఆం) 217

సీ. అర్జునప్రీతియు నర్జునఖ్యాతియు నిగిడింప మగిడింప నేర్పుగలిగి,
యక్రూరచరితంబు నక్రూరదురితంబు భూషింప దూషింపఁ బొందెఱింగి,

కుబ్జావలేపంబుఁ గుబ్జావరూపంబు ధరియింప విరియింప వెరవు గలిగి,
గోపాలచయమును గోపాలభయమును బాలింపఁ దూరింపఁ జాలి వారి,
గీ. వారి కెదిరిన రిపువీరవరుల నమర
మానినీ హారనాయకమణులఁ జేయఁ
బటుపరాక్రమకేళి సంపదలఁ బొలిచెఁ
దరమె వర్ణింపఁ గృష్ణాభిధానవిధులు? (ఆం) 218

చ. అసమవసంత నీల జలజాకృతిఁ గైకొని యొప్పె నెంతయు
న్విసృమర హోమధూమములు నిర్భర లీలమెయిన్ హవిశ్శమీ
కిసలయ లాజసౌరభ వికీర్ణసమస్తదిశాముఖంబులై
కుసుమశరాసనాత్మజునకున్ రజనీచర రాజపుత్రికిన్. (ఆం) 219

క. ఆంగిరస భార్గవులును
జెంగట మంత్రంబు సెప్పశ్రీపతి మనుమం
డంగన గళమునఁ గట్టెను
మంగళసూత్రంబు సర్వమంగళ యెదురన్. (ఆం) 220

క. ఆసాయ మాప్రభాతము
వాసరయామినులు హృదయవర్థితరాగ
వ్యాసంగంబునఁ దరుణియు
రాసుతుఁడు భజించి రెల్ల రతిసౌఖ్యంబుల్. (ఆం) 221

గీ. ఇగముచే నంబరంబెల్ల నిమురుకొనఁగ
నుష్ణకరుఁడును గరము లొయ్యొయ్యఁ జాఁచి
తాను ననలాశఁ జరియింపఁ బూలె ననిన
నెంత యనవచ్చు నింక హేమంతమహిమ?[12] (ఆం) 222

సీ. ఇరులు దర్పము మానఁ దిరముగా మంత్రించి జగముపై నడరిన జడ నడంచి,
జలజాతగృహములతలుపు లొయ్యనఁ బుచ్చి మెలపుమైఁ దేఁటుల మేలుకొలిపి,
సొంపున మెఱుఁగారు చుక్కలఁ బోఁజాగి పేర్చుకైరవముల బింక మడఁచి,
రజనికిఁ బతియైన రాజుమై కందించి చక్రవాకముల కుత్సవము నొసఁగి
గీ. దెసల కెసకంపుఁదెలువులు దీటుకొలిపి
సకలజంతుప్రమోదసంజనకలీల

దనదు రుచిరారుణంశులు వినుతి కెక్క
నుదయ ధరణీధరము మీఁద నొప్పె నినుఁడు. (ఆం) 223

సీ. ఉచ్చైశ్శ్రవంబును, నురుమద సురభి కపోలపాళీవిలోలాళికలర
వాన్వితమై వాలునభ్రశుండాలంబు వాహనంబులు, వీరవైరిభీష
ణాంశుల మించు నూఱంచుల కైదువు, కొమరారు పరివార మమరగణము
పట్టంపుదేవియుఁ బౌలోమి, యీగతి నెల్లభోగములకు నెల్ల యగుచు,
గీ. విలసదమరీ కరాంభోజ వీజ్యమాన
చామరానిలసంచార చలితచారు
చికురభారుఁడై చూడఁగఁ జెలువు మిగిలె
వేయుఁగన్నుల నింద్రుఁ డీ విభుఁడు తరుణి! (ఆం) 224

సీ. ఉదయార్కరుచిఁబోర నొలిచికొన్నట్టి మ వ్వమునఁ జెంగావి గోవణము మెఱయ,
వెన్నెల జడిగొన్న విద్యుల్లతలమాడ్కి యజ్ఞోపవీతంబు లఱుతఁ బొలయ,
ననుకైన కుసుమఁబెట్టిన పల్లవంబుల చాయ సన్నపుగుజ్జుజడలు గ్రాలఁ,
గందువోఁ జదలేటఁ గడిగిన శశిరీతి నెడకేల ముత్తెంపుగొడుగు దనర,
గీ. జగతిఁ దనుకాంతి యసమయచంద్రికావి
భాతిఁ బ్రసరింప దివినుండి పార్థివేంద్రు
కొలువునకు వచ్చె సభయెల్ల నెలమిఁ జూడ
నారదుఁడు సర్వలోకవిహారశీలి. (ఆం) 225

సీ. ఉప్పరం బెగయఁగ నొదవిన వెరవున నడిసన్నరోహణశైలమనఁగ
వినతాసుతాకృతి వినువీధి వర్తిల్లు బాలభానుప్రభాపటలమనఁగఁ
జైతన్యసంపదాస్పదభాతి దివిఁ బర్వు శాతమన్యవచాపభూతి యనఁగ
జడధి నుండక మింటఁ జరియించుటకు మూర్తి పొలుపు దాల్చిన రత్నపుంజమనఁగ
తే. వివిధమండనభవవిభావిభవజటిల
నిఖిలదిక్చక్రవాళుడై నిరుపమాన
జవసముల్లాసగగనసంచారగరిమ
చెలువు నెలవయ్యె నప్పు డప్పులుఁగుఱేఁడు. (జ) 223

సీ. కమనీయవప్రసంకలితనానారత్నధామకిమ్మీరిత వ్యోమతలము,
సౌధాగ్రవిహరణాసక్తబింబాధరావిజితఖేచరవధూవిభ్రమంబు,

లీనావనీపుష్పలోలాలికలనాదరచితమన్మథధనుర్జ్యారవంబు,
పరిఖాంబుపరివర్తకరవిడంబితవార్ధిసంచారిజీమూతసంచయంబు,
గీ. మహితవితరణ నృపతికుమారతిలక
హసితగీర్వాణసర్వంసహారుహంబు
విపులసౌభాగ్యపుష్పలావీవిలాస
కలితరథ్యాంతరము ద్వారకాపురంబు. (ఆం) 227

సీ. కరిముఖుండు లిఖించెఁ గల్యాణరేఖలు కనకపట్టికల లోకములకెల్ల,
వివిధశిల్పానల్పవిన్యాసరచనల వేది శృంగారించె విశ్వకర్మ,
కేకేసి యప్సరఃకాంతాజనంబును బెరిమెతో నేతెంచెఁ బేరఁటంబు,
పంచమహాశబ్దభరితమై విలసిల్లె నంకురార్పణమహోద్యమవిభూతి,
గీ. భార్గవుఁడు దానవాన్వయ ప్రథమగురుఁడు
కాలసంసిద్ధికై నిల్పె గడియ [కొడుపు]
[శాస్త్రసరణిని] దేవతాసంయమీంద్రు
లాచరించిరి పుణ్యాహవాచనంబు. (ఆం) 228

చ. కలమవనప్రతానములు గాచుటకై చనుదెంచి యింపులం
జిలికెడు మంజురీతి విలసిల్లఁగ నార్చుచు ముద్దుఁబల్కులన్
జిలుకులఁ దోలి పైఁ జెమరుచెందఁ గొలంకుల కేఁగి చిల్కలం
జిలుకల నాడుచుండుదురు చెన్నుగఁ బామరబాలికాజనుల్. (ఇ) 229

క. కల్పితమణిఘృణిరచనా
కల్పమగు వివాహవేదికామధ్యమునన్
గల్పోక్తవిధానంబున
వేల్పించిరి యదుకుమారు వేల్పుం దపసుల్. (ఆం) 230

ఉ. కాంతనితాంతరతనపరికల్పితశిల్పములన్ ద్రికాలమున్
వింత తెఱంగులన్ దనరి విష్ణుపదోల్లిఖవైజయంతికా
సంతతు లుల్లసిల్ల సిరిచామ యహర్నిశమున్ వెలుంగ న
త్యంతముఁ జూడ నొప్పుఁగను నప్పురిలేని గృహప్రతానముల్. (ఆం) 231

చ. కులకుధరాపహాసిపురగోపురశేఖరరత్నదర్పణం
బుల వలరాచపోఁడుములు పోలఁగఁ జూచి తలంపు ప్రాణనా

థుల దెసఁ గూర్చి యత్తఱిని తోడివయస్యలు చూడ సిగ్గునన్
జెలువెసనారఁగ న్గురులఁ జిక్కులు దీర్తురు సిద్ధకామినుల్. (ఆం) 232

సీ. కుసుమంబుఁబోలి పొల్పెసఁగు పొక్కిలి డిగ్గఁ గుఱుపట్టుపుట్టంబు నెఱికఁ గట్టి,
కమనీయనవరత్నఖచితమై యొప్పు పసిండిపీఠమునఁ గూర్చుండఁబెట్టి,
గన్నెరాకుశరంబు కరపల్లవమునకు రక్షాప్రయోజనార్థముగ నిచ్చి,
దీవింఛి కాశ్మీరతిలకమధ్యంబునఁ బుణ్యాక్షతలఁ జిట్టిబొ ట్టమర్చి,
గీ. భాగ్యసౌభాగ్యవతియైన భామ యోర్చు
చన్నుఁగవ భారమునఁ గౌను జలదరింపఁ
దివిచి కొనగోరఁ దోఁచి బిందువు విదిర్చి
బాణతనయకు నంటె సంపంగినూనె. (ఆం) 233

సీ. కుసుమకోదండుండు గుణవంతుఁడగుటెల్ల యళులార! మీ ప్రాపు కలిమిఁ గాదె!
మరుని యెక్కుడు పెంపు మహిమీఁదఁ జెప్పుట కీరంబులార! మీ పేరఁ గాదె!
సంకల్పజన్ముండు సప్రాణుఁ డగుటెల్ల మలయానిలంబ! నీ మహిమఁ గాదె!
మీనకేతనుకీర్తి మిన్నందు కొనుటెల్ల శీతమయూఖ! నీ చెలిమిఁ గాదె!
తే. బాలఁ గారింపఁదగదని పలుకఁదగదె!
యేడుగడయును మీర కాలెంత దవ్వు
మాకుఁ బుష్పాస్త్రుఁ? డంచు ననేకనుతుల
మధుపశుకమందపవమానవిధులఁ దలఁచి. (జ) 234

శా. క్షామక్షామము గీకటప్రకటవక్షఃపీఠమున్ బాండుర
క్షా మిశ్రావయవంబునైన వికటాకారంబుతో నవ్వుకై
చాముండాకరతాళకుక్షివలయస్థానంబుగా నుజ్ఝిత
హ్రీముద్రంబుగఁ బేరణీవిధము నర్తించెన్ మహాభృంగియున్. (ఆం) 235

ఉ. ఖంజననేత్ర చన్నుఁగవ కంజముఁ బొంగఁగ ధీరమేఖలా
శింజితకంకణక్వణనజృంభణ మొప్పఁగఁ గౌను నిక్కఁగా
వ్యంజితబాహుమూలముగ హర్షము లజ్జఁ దిరస్కరింపఁగా
నంజలి యెత్తి నించె విభూనౌదల నిర్మలమౌక్తికాక్షతల్. (ఆం) 236

గీ. గురులపంపున వక్షోజభరము గదలఁ,
జెలువు వీక్షించి యొక్కింత సిగ్గువడుచుఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ
నతివ లాజలు వోసె సప్తార్చియందు. (ఆం) 237

సీ. ఘనపక్షవిక్షేపజనితవాతాహతిఁ బర్వతశ్రేణులు పాదు గదల,
విపులాస్యకర్ణికావిర్భూతదీప్తుల మలయాద్రి యవ్వల వెలుకఁ బాఱ,
శతకోటిశతచండజవభవారవముల శరధులు ఘూర్ణిల్లి బరలు గడవ,
వితతాద్భుతాపాదివిభ్రమోత్థిత కాంతి దెసల హోమద్యుతి దీటుకొనఁగ,
గీ. సిద్ధచారణగణనుతశ్రీఁ దనర్చి
మింటఁ బరఁగు ఱెక్కలతోడి మేరువనఁగ
వచ్చెఁ దన రాక కఖిలంబుఁ బిచ్చలింపఁ
బక్షిదేవుండు పుండరీకాక్షుకడకు. (ఆం) 238

సీ. చంద్రమండలములే జలజాతములు గాక కాకున్న నలులేల కాఁపులుండు?
నెలదమ్మితూఁడులే యలరుఁదీగెలు గాక కాకున్న నీ కోరకములు గలవె?
క్రొక్కారుమెఱుఁగులే కుసుమాస్త్రములు గాక కాకున్న నీవిండ్లు గలగ వచటఁ?
గనకకుంభంబులే ఘనచక్రములు గాక కాకున్నఁ దరగలఁ గదియనేల?
గీ. ననుచు వదనాలకములు బాహానఖములుఁ
బొలయుచూపులఁ బొమలుఁ జన్నులును వళులుఁ
జూచి జనములుఁ దమ్ము సంస్తుతులు సేయ
వఱలుదురు దత్పురంబున వారసతులు. (ఆం) 239

ఉ. చీటికిమాటికిన్ మొగుపుఁజేతులు మౌళి ఘటించి మ్రొక్కెదన్
హాటకగర్భుబోటికి మహాకవికాంక్షితకల్పకాటవీ
వాటికిఁ దారకాహృదయవల్లభమంజులపుష్పమంజరీ
జూటికి వల్లకీస్ఫురితశుద్ధవరాటికి వాగ్వధూటికిన్. (ఆం) 240

చ. చెలువము లొప్ప రాజనపుఁజేలకుఁ గావలియున్న కాఁపుఁగూఁ
తుల నిడువాలుఁగన్నులును దోరపుఁజన్నులుఁ జూచి ధైర్యముల్
పలపలనైన మందగతులన్ జనుచుండుదు రంగజాస్త్రముల్
దలముగఁ దాఁక నధ్వగులు దన్నగరాంతికమార్గభూములన్. (ఇ) 241

మ. జలనైర్మల్యవిధాయి వింధ్యగిరి శిక్షాకేళిసంశీలుఁ డి
ల్వల దైత్యావరజన్మగర్వదళనావంధ్యక్షుధాభీలుఁ డు
జ్జ్వలతేజోనిధి కల్పితాయత పిపాసారిక్తవారాశి మం
జుల హేలాగతిఁ దోఁచెఁ గుంభజుఁ డురుస్తోత్రైకపాత్రోన్నతిన్. (ఆం) 242

చ. తగులము పెక్కువం బురి సుధాధవళోన్నత హర్మ్యరేఖలన్
మగలునుఁ దారు మచ్చరపుమచ్చికమై వలరాచవేడ్కలన్
సొగియు వధూజనంబుల తనూతనుఘర్మము లార్చు నిచ్చలున్
గగనతరంగిణీ కమలగంధసుగంధ మరుద్విహారముల్. (ఆం) 243

చ. తలిరులు దోచె నే తరుల దట్టములై? నన లే ధరారుహం
బుల దలసూపె మున్ను? వలిమొగ్గల నొప్పెడు నే యనోకహం
బులు? నవగుచ్ఛరాశి నగము ల్విలసిల్లెడు నెవ్వి? యన్నియున్
గలుగుట నే మహీజములు గన్నులపండువు లయ్యె? నామనిన్. (ఆం) 244

మ. తెర యెత్తించిరి దేవదానవగురుల్దీక్షాకళాకోవిదుల్
తరుణీరాజతనూభవాంతరమునన్ దట్టంపుఁ గౌశేయమున్
తెర యెత్తించెను వారలిద్దఱ మనోదేశంబులన్ గాముఁడున్
సరి నన్యోన్యముఖేందుమండలదిదృక్షాకౌతుకాంభోనిధిన్. (ఆం) 245

సీ. తెలపుల దాయ జారులకుఁ గట్టనియిల్లు బలితంపుఁజోరుల బ్రదుకుఁదెరువు,
నలుపుల మొదలు రే నెలఁతకస్తురిపూఁత యఖిలంబుఁ గప్పెడు నరిదిముసుఁగు,
గుణములమీఁదటి గణనవిజ్ఞానంబు మఱుఁగు సందియముల మనికిపట్టు,
కౌశికంబులచూపు క్రవ్యాదవితతి మ న్నియము జక్కవదొల భయముప్రోఁక,
గీ. యనఁగఁ గలవస్తువుల నెల్లఁ దనమయంబ
కాఁగఁ జేయుచు దెసలు నాకసము నిండ
సకలజనులకు మతుల విస్మయము లడర
నంధకార మంతంతకు నగ్గలించె. (ఆం) 246

శా. ధన్యంబై పితృదేవతానివహ ముద్యత్ప్రీతి నర్తింపఁ బ
ర్జన్యాచార్యుఁడు భార్గవుండు శ్రుతిమంత్రంబుల్ పఠింపంగఁ బ్రా
ధాన్యం బొప్పఁగ శైలరాజసుత యత్యాసక్తి వీక్షింపఁగాఁ
గన్యాదాన మొనర్చెఁ బాణుఁ డనురాగస్ఫూర్తిఁ బ్రాద్యుమ్నికిన్. (ఆం) 247

ఉ. ధన్యవిభూతి శోభితుఁడు దామరసేక్షణుఁ డొత్తె నూర్జిత
ధ్వన్యతులోగ్రతా దళిత దానవసైన్యము ధూతభూత చై
తన్యముఁ దోషితేంద్రముఖ దైవతసంస్తుతిమాన్యము న్నదీ
జాన్యుదరాంతర స్థగిత సన్నుతజన్యముఁ బాంచజన్యమున్. (ఆం) 248

సీ. ధూర్జటి కోపాగ్ని ధూళిగాఁ గ్రాఁగిన నాఁ డేల నీ యమ్ము వాఁడి లేదు?
వాఁడికోఱల రాహు వడిఁ దోలి కఱచిన నాఁ డేల నీ రశ్మి వేఁడి లేదు?
శాపంబు శ్రీరామభూపాలుఁ డిచ్చిన నాఁ డేల కూయవో పోఁడిగాను?
చనుపకముల కర్గి కనుకని డుల్లిన నాఁ డేల మ్రోయరో? నేడు మీరు
గీ. మగువఁ బాయు టెఱిఁగి మగఁటిమి వాటించి
యేయఁ గాయఁ గూయ మ్రోయ నగునె?
మదన! చంద్ర! పికమ! కొదమతుమ్మెదలార!
నాఁడు నాఁడు నాఁడు నాఁడు లేరె? (జ) 249

సీ. నిర్భర వాంఛాఘనీభూత మానస భంగీకృతా దయాలింగనంబు,
సురచిర నఖరాగ్రపరిరంభితాల కం బాస్వాద్యమానాధరామృతంబు,
బాహ్యక్రియా సార్ద్రభావనాళీకంబు వితత మృదూరూరువేష్టనంబు,
వర్ధిత మధురోక్తి వాచాలవదనంబు ఘర్మాంబుకణగణాకలితగండ,
గీ. మతి తరంగిత నిశ్వాస మాత్తపులక
మరుణితాక్రాంత లోచనాంబురుహయుగళ
మగు మనోహరఖేలనం బతిశయిల్లఁ
దనరెఁ గామినీకామకదంబకంబు. (ఆం) 250

సీ. పడఁతికన్నుల యొప్పుఁ దడవుచో నది యెంత వెలిదమ్మిఱేకుల విలసనంబు?
పొలఁతినెన్నడ పెంపు పొగడుచో నది యెంత కలహంసముల యానగౌరవంబు?
ఉవిద నెన్నడుముతో నుపమింప నది యెంత కొఱనెల నెలకొన్న నెఱసుకలిమి?
వనిత యూర్పులతావి కెనపోల్ప నది యెంత యరవిరులందలి సురభిమహిమ?
గీ. లలనకరివంక బొమలయొప్పులు గణించు
చోట నది యెంత వెడవింటి సోయగంబు?
కాంత తనుకాంతి నరసేయ నెంతమాత్ర
వాలు మెఱుఁగుల సౌభాగ్యవైభవంబు? (ఆం) 251

సీ. పల్లవాధరతోడఁ బలుకులయింపుల[?] నరయంగఁ బికము పోల్ననుట పికము
నలినాక్షి వేనలి చెలువుతో సరిసేయఁ బురులెంత పురినెమ్మి పురులపొలుపు?
తనుమధ్య నడముతో నెనవచ్చు ననిచూడ బయలగు నఖిలంబు బయలుకలిమి,
సుదతి దంతధ్యుతి సొబగు వర్ణించుచో రుచులె మౌక్తికముల రుచులు దడవ?
గీ. ననిన నభనవరామణీయకము మహిమ
యజ్జగంబునఁ బ్రతిలేమి యేమి సెప్ప,
గరుడఖచరోరగామరకన్యలందు
నయ్యుషాకన్య నుపమింప నబల గలదె? (ఆం) 252

చ. ప్రమదవనాంతరంబుల విభాకమనీయములై యశోకము
ల్తమిగొనె నెల్లచోటఁ బ్రియులన్ గృతకప్రణయాపరాధ వి
భ్రమముల నల్గఁ జేసి వెడవాసినపాంథులమీఁది కోపభా
రమున రతీశుకన్నుఁగవ రాలిన నిప్పులప్రోఁకలో యనన్ (ఆం) 253

గీ. ప్రియముఁగూర్చి ముత్తైదువ పేరంటాలు
నలువపట్టంపుదేవి లేనగవు నగుచు
నగసుతాపద్మ లీక్షింప బిగియ ముడిచె
దంపతుల యుత్తరీయ వస్త్రముల తుదలు. (ఆం) 254

గీ. పూని తిమిరారు లందఱు పొడిచిరేని
పంగమగ్న రత్నంబులభాతి నిందు
మినుకు మినుకని యంతన పొనుఁగు వడరె
యనఁబటు ధ్వాంత జృంభణ మగ్గలించె. (ఆం) 255

గీ. పొదలి యొండొండ దివియును భువియు దెసలుఁ
బొదివికొనియెడి చీఁకటి ప్రోవువలన
మిక్కుటంబుగఁ గాటుక గ్రుక్కినట్టి
కరవయంబన జగదండ ఖండ మమరె. (ఆం) 256

చ. పొలుపు వహించి పెన్నురువు ప్రోఁకగతిన్ హరిదంతభాగముల్
గలయఁగఁ బర్వు మంచున దళంబుగ శైత్యముఁ దాల్చు క్రొత్తత
మ్ములచెలికాని నిందుఁడని ముద్దొలుకంగఁ దదీయదీప్తు లు
య్యలలుగఁ దూఁగుఁ బ్రీతి యెసలారఁ జకోరకిశోరసంఘముల్. (ఆం) 257

చ. భువిఁదనివోక వెండియు నభోనదిపొందునకై కళిందసం
భవబహువేణికావిభవబంధురతన్ దివియందుఁ బర్వె నా
నవిరళ లీల నొప్పెసఁగు నప్పురివప్రనిబద్ధశాతమ
న్యవమణిజాయమానసముదగ్రతరాగ్రిమదీప్తిపూరముల్. (ఆం) 258

సీ. మకరందరసపానమత్తాలినీగానమంజులోద్యాననికుంజములను,
కలనినాదగభీరకాదంబసంచారసముదీర్ణకాసారసైకతములఁ
జందనామృతచంద్రచంద్రశేఖరచంద్రసదృశశోభాసాంద్రసౌధములను,
కమలాప్తహిమభానుకాంతశిలాభానుమహితలీలాసానుమంతనములను,
గీ. వినుతలావణ్యసంపద కనుగుణంబు
ప్రకటసామ్రాజ్యవిభవంబునకు ఫలంబు
నగు మనోజఖేలనమున నతిశయిల్లె
భోజనందనయును దానుఁ బుష్పశరుఁడు. (ఆం) 259

సీ. మత్తాలిసంగీతమాధుర్యములతోడి కుసుమగుచ్ఛంబులు కోసి కోసి
సంఫుల్లమాధవీసదనవాటికలందుఁ జిలుకల పెండిండ్లు చేసి చేసి
కమనీయకమలినీఘనసైకతంబుల నంచలఁ బట్టంగఁ బొంచి పొంచి
సహకారవరుతరుచ్ఛాయాతలంబుల మేనులఁ జెమరార మెలఁగి మెలఁగి
గీ. దర్పకునియాజ్ఞఁ దలమోచి తమక తమక
తమకముల నోలముల కల్లఁ దారి తారి
మఱియు బహువిధసంచారమహిమ లమర
నుల్లసిల్లిరి లీలామహోత్సవముల. (ఆం) 260

గీ. మందవాఃకణపరితాపమథితహృదయ
పాంథలోకమై తన విజృంభణము దనర
శిశిరసంపద భువనలక్ష్మీ దుకూల
కల్పితోపకుంఠనభాతిఁ గానఁబడియె. (ఆం) 261

క. మధుపర్కము సేయించిరి
మధురిపు మనుమనికి సర్వమంగళ యెదురన్
విధివిహతంబగు పథమున
నధిగతపరమార్థులగు సురాసురమంత్రుల్. (ఆం) 262

చ. మరుతురగాలయంబులన మన్మథు నమ్ములయిండ్లు నాఁగ శం
బరరిపునాట్యశాలలనఁ బంచశిరీముఖు నాతపత్రమం
దిరములు నాఁగఁ శారుశుకదీప్తలతాంతమరుచ్ఛటల్ లతా
సురుచిరపల్లవ ప్రతతి సొంపెసగుం బురితోఁట లెప్పుడున్ (ఆం) 263

సీ. రక్షోవధూవృత్తవక్షోజపరిలిప్తకుంకుమక్షోభంబు క్రొవ్వుడించి,
శక్రారిమదవతీవక్రాలకాభోగఘనతమఃపరభాగగరిమ నడఁచి,
క్రవ్యాదయౌవనీగ్రైవేయమణిహారకహ్లారదీప్తులగర్వ మడఁచి,
దైవతాహితవీరతరుణీసముల్లాసదరహాసచంద్రికాదర్ప మడఁచి,
గీ. చటులసంవర్తపరివర్తచండకిరణ
శతశతాఖిలపరిదీప్తసారఘోర
దర్శనం బగునట్టి సుదర్శనంబు
గలుగ నీ కసాధ్యంబులు గలవె కృష్ణ! (ఆం) 264

మ. లలనల్ పాడఁగఁ గౌఁగిలింపఁగ సముల్లాసంబునం దాఁపఁ బైఁ
గలయం బుక్కిటికల్లు నింపఁ దిలకక్ష్మాజాతకాండంబుఁ గ్రో
వు లశోకంబులుఁ గేసర క్షితిరుహవ్యూహంబుఁ దోడ్తోఁ గడున్
దిలకించెన్ బులకించె నవ్వె నలరెన్ దీపించె నుద్యానముల్. (ఆం) 265

సీ. వనరుహామోదిని చనుదోయిప్రాపున ననులేపనములు వాసనకుఁ నెక్కఁ,
బూఁబోణి నెఱివేణిపొందు సంధిల్లుట నలరులు సౌమనస్యంబుఁ దాల్ప,
నంగనారత్నంబు నపఘనద్యుతుల సౌ వర్ణమండనములు వన్నె కెక్క,
ధవళాంశుముఖిమేనితఱచు గ్రొమ్మించుల వెలిపట్టుగుణరాజి నెలవుకొనఁగఁ,
గీ. జెలువ మసలారఁ బూసి వేడ్కలు జనింప
ముడిచి బెడఁగుగఁ దొడిగి సొంపడరఁ గట్టి
గట్టినేర్పులు దళుకొత్తఁ గంబుకంఠి
కాచరించిరి శృంగార మాత్మసఖులు. (ఆం) 266

సీ. వరుణుండు కానిక పురుహూతునకుఁ దెచ్చి ప్రోవిడ్డ నవరత్నపుంజ మనఁగ,
నుదయాద్రితటములో నున్నాళమై మున్ను వికసించు రక్తారవింద మనఁగఁ,
గాశ్మీరరసపూరకమనీయమగు శచీసఖిచేతికల్యాణచషక మనఁగఁ,
బ్రాచి కందుకకేళిపరత మింటికి వైవఁ బొల్పారు మందారపుష్ప మనఁగ,
గీ. నడరు కెంజాయ మండలం బతిశయిల్ల
నఖిలభూసురదత్త సంధ్యార్ఘ్యతోయ
దళితమందేహుఁడై జగంబులు వెలుంగ
భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు. (ఆం) 267

సీ. వరుణుని శృంగారవనములోఁ బొగడొందు పగడంపుఁదీగల ప్రాఁకనంగఁ,
జరమభూధరము పై సురగాలి నెగయింపఁ దోతెంచు జేగురుధూళి యనఁగ,
నస్తాంబురాశిలో నంతకంతకుఁ గ్రాలు బాడబానల శిఖాపటల మనఁగ,
నినురాక కపరదిగ్వనిత యెత్తించిన రత్నతోరణవిభారాజి యనఁగ,
గీ. విరియ నుంకించుచెందొవ విరులయందు
వఱలు ఱేకుల కాంతికి వన్నె వెట్టి
రమణ రమణీజనానురాగములతోడ
నిగిడి యెఱసంజ పడుమట నివ్వటిల్లె. (ఇ) 268

గీ. వారుణీస్పర్శమున నాదు వాఁడి దఱిగె
సకలతీర్థనిదాన మీ జలనిధాన
మే నొనర్చెదఁ బావనస్నాన మనుచు
మునుఁగుగతిఁ బశ్చిమాంబుధి మునిఁగె నినుఁడు. (ఇ) 269

శా. విఘ్నధ్వాంతనిరాసవాసరపతిన్ వేదండరాజాననున్
విఘ్నాధీశ్వరునిన్ గపోలఫలకావిర్భూతదానచ్ఛటా
నిఘ్నాళిన్ నిరుపాధికాధికకృపానిత్యోదయోపఘ్నుఁ గ్రౌం
చఘ్నజ్యేష్ఠు భజింతుఁ గావ్యరచనాచాతుర్యసంసిద్ధికై. (ఆం) 270

సీ. వికచారవిందదీర్ఘికల వినోదించి తని గమ్మతావుల ననఁగి పెనఁగుఁ,
గుసుమిత నవలతావిసరంబుఁ గదిలించి వలిదేనియల సోనఁ దలము గొల్పు,
సహకారపాదపచ్ఛాయలకై యేఁగి శశికాంతవేదుల సంచరించు,
సురతకేళీశ్రాంతి సొగియుముద్దియలపైఁ జిట్టాడితనువులఁ జెమట లార్చుఁ,
గీ. జంచరీకంబురీతిఁ బర్జన్యుభాతి
విరహపరితాపహరుమాడ్కి సురఁటిపోల్కి
నప్పురంబున సకలజనానుమోద
కరణదక్షుండు దక్షిణగంధవహుఁడు. (ఆం) 271

గీ. వెలయువెన్నెల నిఖిలంబు వెల్లివొడిచి
తనిసి చనుచోట నుడువీథిఁ దవిలియున్న
నురువుబుగ్గలు దోడ్తోన విరియుపగిదిఁ
దరతరంబ తారకములు విరియఁ దొడఁగె. (ఆం) 272

ఉ. “వేగుచు వచ్చెఁ బాసె నిదె వెన్నెల యిన్నెలవింక నుండఁగా
వేగునె మాకు నీ క్షణమ వేఁడివెలుం గుదయించు” నంచు ను
ద్వేగమునం దదీయ పదవీపరివర్తన ముజ్జగింప వే
వేగమునం దొలంగుగతి విచ్చె నుడువ్రజ మంబరంబునన్. (ఆం) 273

ఉ. వేలుపుగిడ్డియుం బరుసవేదియుఁ గల్పకుజంబుఁ దోడ రా
లాలితపాదనూపుర ఝళంఝళనాదము లుల్లసిల్లఁ బై
చేలచెఱంగు దూలఁగ విశృంఖలవృత్తిఁ జరించుచుండు నీ
లాలక యన్నపూర్ణ యమృతాన్నము వెట్టుచుఁ బంక్తిపంక్తులన్.[13] (ఆం) 274


శా. సీమాంతంబున ద్వారకానగరమున్ జేరన్ దటాకోత్త రా
రామశ్రేణి సమన్వితంబులగుచున్ రాజిల్లి రాజన్య స
స్యామోదం బిరుకారునుం గలుగు భాండాగారవాటీ మహా
గ్రామవ్రాతము నిచ్చెఁ గన్యకు హరిద్రాచూర్ణసంపత్తికిన్. (ఆం) 275

సీ. సుందరీయౌవనస్ఫురతోష్ణ కుచకుంభ పరిరంభలీలలఁ బరఁగకున్న,
బింబాధరాననా తాంబూలరస సుధా స్వాద ఖేలనమున జరుగకున్న,
సీమంతినీజన స్నిగ్ధోరుయుగళ సం కలితపేషణములఁ గ్రాలకున్న,
రాజాననానేక రతికళావిర్భూత సుఖవిజృంభణముల సొగియకున్న,
గీ. మఱి శరణ్యంబు గలుగునే మనుజతతికి?
ననఁగ హేమంతసంపద కంతటికినిఁ
దాన యగుచుఁ గుబేరదిక్తటమునందు
... ..... ...... ...... ...... ..... .... ...... (ఆం) 276

శా. సేవాయాతవధూమనోజ్ఞకలకాంచీకింకిణీకంకణా
రావంబున్ సముదగ్రవాద్యపటలీరావంబులున్ గూడి భూ
దేవస్తోత్రనినాదమేదురములై దిక్కూలముల్ నిండఁగా
దేవాగారములొప్పు నప్పురములో దివ్యప్రభావోన్నతిన్. (ఆం) 277

సీ. హంసతూలికశయ్య లలరుఁబొత్తుతలాడ శశికాంతమణి శిలావిశదధరణి,
తాంబూలపేటి యద్దము రాజకీరంబు పన్నీరుచెంబులు పసిడిఁగిండి,
విరులచింద్రికె[?] రుద్రవీణామతల్లిక వింజామరము వట్టివేళ్లసురఁటి,
గిలుకలపాగాలు క్రీడాసరోజంబు కాళంజి ముత్యాలమేలుకట్టు,

గీ. చతురశీతిబంధసంయుత ప్రతిసీర
యగరుధూపపాత్ర యాదియైన
కామదీపన ప్రకాశవస్తువులతో
నందనమైన కేళీమందిరమున. (ఆం) 278

పేరయ, బొడ్డపాటి [అనంతమహత్త్వము] (జ)
సీ. తన యనురాగాభ్యుదయ మూర్తి పద్మినీ సతికిని ముఖవికాసం బొనర్పఁ,
దన దుర్నిరీక్షప్రతాపవైఖరి యరి తమముల గిరిగుహాంతరములఁ దార్పఁ,
దన కరవిదళిత దానధారాశక్తి కలయలోకులకు నాకండ్లు దీర్పఁ,
దనదు మిన్నందిన ఘనతరైశ్వర్యంబు నకు విబుధాళి సన్నుతు లొనర్పఁ,
గీ. దేజరిల్లెడు రా జన దినదినంబు
మూఁడుమూర్తుల జనులచే మ్రొక్కుఁ గొనెడు
పద్మినీవల్లభుని నాదుపాలివేల్పు
భక్తసులభునిఁ గొల్తు హృత్పద్మ మలర. (జ) 279

పేరయ, బొడ్డపాటి [చాటువు] (జ)
సీ. కాంతులఁ జూపట్టు కండ్లమరించిన తిరమైన విపులపుఁ దేరునందు,
విద్యమ ప్రోఁకయౌ వృద్ధసారథి నిల్పి యతఁడు శిక్షించు హయములఁ బన్ని,
తన్నివాసుల మించు తిన్నని ప్రావిల్లు చొక్కుఁబై నారిని నెక్కువెట్టి,[?]
గరితోడఁ గూడ నాకసపుసూటిని బాగు నెమ్మేనుఁ బసనిచ్చు నమ్ముఁ దొడిగి,
గీ. యమరభటు లార్వ దైత్యపురములు గెడపి
విజయ మొందిన జోద వీ విశ్వమునను
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ! (జ) 280

సీ. ఖండఖండంబునఁ గదిసిన తేరును భంగంపుటిరుసు బొసంగఁ గూర్చి,
విజ్జోడుపడి నిచ్చ వినువీథిఁ దిరిగెడు చక్రంబు లొనగూడ సంఘటించి,
తలకొన్న భీతిఁ గొందలపడ బహుముఖ భ్రాంతసారథి నేరుపరిగ నిలిపి,
పలుకఁ బదక్రమంబుల నలుజాడలఁ బోయెడి గుఱ్ఱముల్ పూనుకొలిపి,

గీ. కుంటివింటను బలువంక కోలఁ దొడిగి
విషమలక్ష్యంబు లే గతి వేసితయ్య!
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ! (జ) 281

సీ. బంట్లున్న పాలెంబు బలువిల్లుగాఁ జేసి నవమణివలయంబు నారిఁ జేసి
నుదుటి నెన్నడిమికన్నును ముల్కిగాఁ జేసి దక్షిణాంగంబె యస్త్రంబుఁ జేసి
చేకొఱతలవాని జోక సారథి సేసి తన మూర్తి యొకట రథంబు సేసి
కనుదోయిఁ జక్రయుగ్మముగ యోజన చేసి సమత నూరుపుల నశ్వములఁ జేసి
గీ. యన్నియును నీ యధీనంబు లగుటఁ జేసి
పురము లేసితిగాక నీ కొరులు తోడె?
వేల్పు లెవ్వరు నీ సాటి విజయవాటి
మల్లికార్జునలింగ! యుమాప్రసంగ! (జ) 282

పేరయ్య, బొడ్డపాటి [పద్మినీవల్లభము] (జ)
ఆ. ఆ ప్రదోషయ...ములై యున్న సమయంపు
కంట వేఁటకాని కరము దిల్పె
సొగపు దోచెఁ గ్రుంకె నగు ప్రొద్దు పరసంధ్య
వెనుక నిరులు ముందు వెలుఁగు నగుట.(?) (జ) 283

క. ఒక యెనిమి దడఁగె దిక్కుల
మకరంబున కొకటి యోడె మలహరుచే ము
న్నొక టుడిగె ధిక్కరింపఁగ
నిఁక నేలని మాఱుమలయు నేనుఁగులు పురిన్. (జ) 284

సీ. కమలాకరస్ఫూర్తి కాసారములయందుఁ దమయందుఁ గలుగంగఁ దనరుచుండు,
గంభీరజీవనక్రమ మగడ్తలయందుఁ దమయందుఁ గలుగంగఁ దనరుచుండు,
ధారావిహార ముత్తమ తురగములందుఁ దమయందుఁ గలుగంగఁ దనరుచుండు,
సుమనోవికాసంబు ప్రమాదవనములందుఁ దమయందుఁ గలుగంగఁ దనరుచుండు,

గీ. దానమహిమ సముత్తుంగ దంతులందు
దమకరంబులఁ గలుగంగఁ దనరుచుండు
సిరులసంతోషమున ముఖ్యశీలవృత్తి
రణజయౌదార్యములఁ బురి రాజకులము. (జ) 285

సీ. గజముల నడలుఁ దత్కరముల జిగులుఁ ద త్కుంభగౌరవములుఁ గూర్చి కూర్చి
జలజస్ఫుటములుఁ దచ్ఛదవిభ్రమములుఁ ద త్కేసరసురభులు గిలిమి గిలిమి
మరువిండ్లుఁ దన్మౌర్విమధుకర రుచులుఁ ద దస్త్రంబుమొనలును నలమి యలమి
గనకవేదులు నందుఁ గాంతినుగ్గులును దత్ స్థగితసన్మణులును దార్చి తార్చి
గీ. గతులు నూరుకుచములు మొగములు నేత్ర
ములును దనుగంధములు బొమ లలకములును
చూపులు నితంబములును రుచులును దశన
ములును విధి సేసె నా నుంద్రు పురిచెలువలు. (జ) 286

ఉ. పాయక కన్నెనాథు తలఁబ్రాలిడఁ బూన్చిన యాణిముత్తెముల్
దోయిట పద్మరాగమణులలో యన నించుక యెత్తిచూచుచో
జాయల నింద్రనీలముల చాయలుగాఁ బతిమౌళి మీఁదటన్
బోయఁగఁ బూవుమొగ్గలనఁ బొల్చె విచిత్రవిలాసవైఖరిన్. (జ) 287

ఉ. సారసరః ప్రతీరవనసౌరభపుష్పరజోవిభూతి నొ
య్యారపుఁజొక్కు చల్లి మలయానిలుఁడన్ గడిదొంగ వేకువన్
జోరణగండ్లఁ గన్నములఁ జొచ్చియు దివ్వెలు దూల్చి భోగభా
మారతితాంతఘర్మకణ మౌక్తికపంక్తులు దార్చు నిచ్చలున్. (జ) 288

పేరయ, బొడ్డపాటి [మంగళగిరివిలాసము] (జ)
ఉ. హారతు లిచ్చు వేయిన ... సారికిరాయనిఁ గన్నతండ్రి కొ
య్యారి మెఱుంగుఁజూపులనె యారతు లిచ్చె నొకర్తు తజ్ఝణా
త్కారకరద్వయీవలయకాంతులు గుత్తపుఁజన్నుదోయి తా
హారగళంచలన్నలుజాలతశ నెంతకురాయభాకాంతియై[?] (జ) 289

పేరయ, బొడ్డపాటి [శంకరవిజయము] (జ)
చ. అడరి సరోజరాగమణు లామిషఖండము లంచుఁ గఱ్ఱుకు
ట్లొడికము సేయు వేడుకల నుజ్జ్వలసన్మణు లేర్చి నిప్పులం

దిడియును భల్లుకవ్రజనిరీక్షణముల్ గని దివ్వెలంచుఁ దేఁ
దడవుదు రొయ్య మౌగ్ధ్యమునఁ దద్గిరిసీమఁ గిరాతబాలికల్. (జ) 290

ఉ. ఆమని టెంకిపట్లు మలయానిలునిత్యవిహారసీమముల్
కామునిపాళెముల్ శుకపికంబులజీతపుటూళ్ళు కామినీ
కాముకవిశ్రమంబులకుఁ గట్టని యోర్వకు[?] లా పురాంగనా
స్తోమమునందు నెందు నెలతోఁటలు శైలశిలోన్నతస్థితిన్. (జ) 291

ఆ. తనకు బలముఁ గలిగి తన మంత్రి మిత్రాప్త
బలము దలకుఁ దోడుపడుట కలిగి
వైరిబలము దఱిగి వారిచుట్టము లెల్లఁ
గ్రిందు వడినవేళ గెలువవచ్చు. (జ) 292

చ. తన రుచిగానివేళ బెడిదంబగు వేఁడి నినుండు దోఁచినన్
గనుమొఱఁగుంట రాజునకుఁ గర్జమటం చెటయేనిఁ జన్న య
ట్లనుచరులై వెలింగెడి గ్రహంబులుఁ దారలుఁ దోడరాఁగ వే
గన చనె వెల్లవెల్లని మొగంబుకళంకమున్ శశాంకుఁడున్. (జ) 293

గీ. రాజురాకకుఁ దారహారములతోడి
యామినీపాత్ర నాడింప నేమి సమయ
నాటకుఁడు దోఁపుతెరవాఱినాఁ డనంగ
సాంధ్యరాగము పశ్చిమాశను దనర్చె. (జ) 294

సీ. సంజప్రొద్దున నాట సలుపు నంబరకేశు తలయేటిజలకణతతు లనంగ
రజనీవధూద్విజరాజుల పెండ్లి కేర్పఱచు ముత్యపుఁదలఁబ్రా లనంగఁ
గాలవాణిజ్యుండు నీలాంబరస్థలి స[రి] బఁచరించు వజ్రము లనంగ
వేళాఖ్య పుష్పలావిక యిందుఁడను రాజునకు నేరిచినప్రసూనంబు లనఁగఁ
గీ. బాలవెల్లి మథించు తొల్కాలమునను
నమృతబిందువు లుదరి మిన్నందె ననఁగ
గగనమను కొల నలమిన తొగ లనంగఁ
గలయఁ జుక్కలు తోఁచె నాకాశవీథి. (జ) 295

మ. సమలావణ్యము వన్నెఁగూడి రసముల్ సంధించి శృంగారవే
షముతోఁ జొక్కపుఁజూపు నవ్వొలయ నిచ్ఛాతూలికన్ భావచి

త్రముగాఁ బంచశరుండు రాగరతిఁ జెంతంచూచుచున్ వ్రాసి ప్రా
ణము వాగీశ్వరు వేఁడి నించె నన మేనాపుత్త్రి యొప్పెం గడున్. (జ) 296

పేరయ్య, బొడ్డపాటి [సూర్యశతకము] (జ)
శా. ఈఁగల్వోలె వ్రణంబులే వెదకుచు న్నీర్ష్యం బరు న్మెచ్చ కే
మూఁగల్ వోలె నిరంతరాస్యులగుచున్ మూర్ఖించి తర్కించినన్
వీగఁ న్నేరని దుష్కవుల్ బ్రతుకనీ విక్రాంతులై వారినో
రాఁగం బోవఁగ నేల సత్కవులు సూర్యా! పద్మినీవల్లభా! (జ) 297

పోతరాజు [బేతాళపంచవింశతి] (ఆం)
చ. అరయఁగఁ బూర్వదిగ్వనితయం దనురక్తుఁడు ముంద ఱిప్డు భా
స్కరుఁ డిట వచ్చి నాదెసఁ బ్రశాంతముతో ననురక్తుఁ డయ్యె సు
స్థిర మిది యంచు నయ్యపరదిక్సతి రాగముఁ బొందె నాఁగ వి
స్తరముగ నిండఁ బర్వె నెఱసంజ నభంబునఁ బశ్చిమంబునన్. (ఆం) 298

క. ఇంటింటం జింతామణు
లింటింటం బరుసవేదు లింటింట నిధుల్
జంటగొని యుండు ధనపతి
యింటి క్రియన్ బురములోని యిండుల నెల్లన్. (ఆం) 299

ఉ. ఇందుల నున్న నగ్నిభయ మెందునుఁ గల్గదటంచు మున్ సురా
నందనమైన ఖాండవవనం బమరావతి వాసి వచ్చి పొ
ల్పొందఁగ మర్త్యలోకమున నుత్సవలీల వహించెనొక్కొ నా
నందనవనంబు లొప్పెఁ బురి నాలుగుదిక్కుల నున్నతస్థితిన్. (ఆం) 300

క. ధర మిన్ను దఱిఁగివైచిన
కరణిఁ దటాకంబు లెల్లకాలమునందున్
బరిపూర్ణములై యుండును
బురికి నవగ్రహభయంబు పొరయక యుండన్. (ఆం) 301

క. పురివిభవముఁ జూడఁగ న
త్కరమున [?] జలదేవి పెక్కుకన్నుల వెలయన్
ధరియించినట్లు వికసిత
సరిసిరుహాకరము లొప్పు సౌరభలీలన్. (ఆం) 302

సీ. ప్రజ్వరిల్లుచునున్న పసిఁడిశాఖలతోడ వెలసిన వనముల చెలువుదానిఁ,
గరిమకరగ్రాహకచ్ఛపంబులతోడఁ బరిపూర్ణజలముల పరిఘదాని,
మరకతవైడూర్యమాణిక్యములతోడఁ హాటకమయమైన కోటదానిఁ,
గమనీయ కాంచన కలశాంగములతోడ నమరిన దేవాలయములదానిఁ,
గీ. గనకఖచితమైన కంబంపుగట్లతో
వెండిమాడులిండ్లు వెలయుదాని
జనమహోత్సవ మనఁ దనరిన యుజ్జయి
నీ పురంబు సొచ్చె నృపవరుండు. (ఆం) 303

క. రవిఁ బొంది రాహుచేఁ బరి
భవములఁ బడ నోడి తద్గభస్తులు పురి ను
క్కివమునఁ జొచ్చిన విధమున
నవిరళరుచి వెలిఁగె దివియ లయ్యైయిండ్లన్. (ఆం) 304

ఉ. వ్యాళవిభూషణాళియు దిగంబరమున్ గదయున్ ద్రిశూలమున్
వ్రేలెడు కెంజడల్ గగనవీధికిఁ జాఁగిన యుగ్రరూప మా
భీలచతుర్భుజంబులు నభేద్య కరాసియుఁ జంద్రఖండమున్
ఫాలవిలోచనంబుఁ గల భైరవుఁ గాంచె విభుండు ముందరన్. (ఆం) 305

క. సురధరము పెక్కురూపులు
ధరియించి పురంబులోనఁ దనరె ననంగా
స్ఫురిత నవరత్నకాంచన
భరితములై వివిధదేవభవనము లొప్పున్. (ఆం) 306

పోలమరాజు [పర్వతపురాణము] (జ)
చ. అరయఁగ లోకబాంధవుఁడనై భువనత్రయకర్మసాక్షినై
హరిహరపద్మసంభవమయాకృతినై మను నాకు వారుణీ
పరిచయదోష మబ్బెనని భానుఁడు తద్దురితోపశాంతికై
శరనిధిఁ గ్రుంకెనా నపరశైలతిరోహితుఁ డయ్యె నయ్యెడన్. (జ) 307

బసవయ, అంగర [ఇందుమతీకల్యాణము] (జ)
మ. ఉదయస్తంభములోపల న్వెడలి తా నుద్యత్తమోదైత్యునిం
గుదియంబట్టి గభస్తిమన్నృహరి సక్రోధంబునన్ వాని దు

ర్మదగాత్రంబు కరంబులం దునుమ ధారాళాస్రపూరంబు కా
వి దివిం బర్వినకైవడిన్ గలయఁబర్వెన్ సాంధ్యరాగచ్ఛవుల్. (జ) 308

ఉ. బీద శచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మఱున్
బాధలఁ బెట్టఁగాఁ జెఱలు పట్టఁగ నుండుట భారమంచు రం
భాది మరున్నివాస లసదప్సరల్ చనుదెంచి వచ్చిరో
నా దరఫుల్లపద్మవదనల్ విహరించుదు రప్పురంబునన్. (జ) 309

సీ. లాజవిమోక్షవేళాసముద్గతహోమ ధూమవాసన మేనఁ దొంగలింప,
మృగనాభిమకరికారేఖలై మృదుగండమండలి హోమధూమములు నిలువ,
హోమధూమశిఖాముఖోష్ణంబు సోఁకి పూర్ణేందుబింబాననం బెఱ్ఱవార,
మాటికి హోమధూమంబుచే వెడలెడు కన్నీటఁ గాటుక కరఁగి పాఱ,
గీ. గురుజనోక్తవిధానానుకూల చాల[?]
నిజవివాహవిలాసంబు నిర్వహించి
భోజుఁ డప్పుడు వేడుక బుధకవి వి[?]
తానములతోడ నార్ద్రాక్షతములు చల్లె. (జ) 310

సీ. శశిమండలముమీఁద సాంద్రచంద్రికవోలె నునుమొగంబునఁ దెల్లఁదనము నిల్చె
బసిఁడికుండలమీఁద బలభిన్మణులువోలె వలిచన్నుముక్కుల నలుపు లొదవె
నిఱుపేదమీఁది నిర్ణిద్రసంపదవోలె మధ్యభాగంబున మహిమఁ దాల్చెఁ
గదలిన లతమీఁది కమ్మపూవులువోలె నలవనిమేన సొమ్ములు దొలంగెఁ
తే. దరుణిగమనంబు మిగుల మాంద్యము వహించె
వనజపత్రాక్షి కోర్కులు కొనలు సాఁగె
వనిత నేత్రాంతములు వసివాళ్ళు వాడె
రమణి తనువల్లి శయ్యల వ్రాలఁగడఁగె. (జ) 311

సీ. హేమసింహాసనం బెక్క నుద్యోగించు మణికల్పితాస్థానమంటపమున,
విసరించుకొనఁ జూచు వింజామరంబున వైరివీరవిలాసవతులచేత,
నాటింపఁ దలఁచు నానాద్వీపసంధుల గెలుపుఁగంబంబులు వలసినన్ని
దుష్టరాక్షసకోటిఁ దునుమ విచారించు మఘవన్ముఖాఖిలామరులు వొగడ
గీ. సంతసము జహ్ను కన్యాతటాంతరముల
నధ్వరంబులు గావింప నలవరించు
నెలఁత నిచ్చలు నిజగర్భనివసదర్భ
కప్రభావపరిప్రాప్తి గౌరవమున. (జ) 312

బసువయ్య, తులసి [సావిత్రికథ] (జ)
ఉ. అన్నగరంబు హర్మ్యములయందు ఘటించిన పద్మరాగర
త్నోన్నతకాంతిమండలము లొక్క మొగిన్ జదలేటఁ బర్వినన్
కిన్నెరకాంత లాత్మఁ దలకింతురు జంబునదీప్రవాహ మి
ట్లెన్నఁడు వచ్చె నింగికని యెత్తిన సంశయసంభ్రమమ్ములన్. (జ) 313

మ. అరవిందప్రియవాది ఘోరతిమిరవ్యాళవ్రజస్ఫూర్తికిన్
గరుడం డంచితదిక్సతీకుచతటీకాశ్మీరపంకంబు పు
ష్కరభాగాటవిధాగ్రపల్లవితమాకందంబు [?] మందప్రభల్
బెరయం దూర్పునఁ గుంటువేల్పు పొడసూపెన్ దీపదండాకృతిన్. (జ) 314

క. ఆ పూర్ణశంఖపద్మ మ
హాపద్మాధిక ధనాఢ్యులై పుణ్యజన
వ్యాపారవృత్తి పెంపున
నా పౌలస్త్యున్ గణింప రప్పురివైశ్యుల్. (జ) 315

చ. ఉరగవధూజనంబులు పయోధరసంభృత కుంకుమాంకముల్
గరఁగ నిరంతరంబు నవగాహన మర్థి నొనర్చుచుండఁగా
నరుణరుచిం గనుంగొనఁగ నందమగుం బరిఖాంబుతోయ మ
ప్పురిఁ దన ఘోరవీరరసముం బ్రకటించుచునున్న కైవడిన్. (జ) 316

సీ. కమలకోరకనికాయములఁ జిక్కిన తేఁటి గమిమ్రోఁత ప్రియు కూఁతగాఁ దలంచు
వికసన్మనోజ్ఞహల్లకరాశిలోఁ దూఱి దావానలంబని తల్లడిల్లు
హంసఖండితమృణాళాంకూరములు శశి ప్రతిబింబితములని పరితపించుఁ
గల్లోలఘట్టనోద్గతఫేనపుంజంబు ఘనమైన వెన్నెల యని కలంగు
గీ. వెదకు నలుదిక్కులును జాల వెచ్చనూర్చు
తలఁకు బిసినీపలాశమధ్యమునఁ బొరలు
జాలిఁ బడి తూలు దివసావసానవేళ
జడిసి ప్రాణేశుఁ బాసిన చక్రవాకి. (జ) 317

చ. కరుణ దలిర్ప నిన్ గుటిలుఁగా మదిఁ జూడక జూటకోటిలో
నిరుపమలీలఁ జేర్చుకొని నెమ్మది నున్న పురారిఁ బాండు రు
గ్భరితశరీరుఁ జేసితివి కంతుని వైరముఁ బట్టి యక్కటా!
సరసిజవైరి! యీ విసపుజాతికిఁ బాంథవధంబు పెద్దయే? (జ) 318

తే. గగనలక్ష్మీవధూటికిఁ గలశవార్ధి
యులమితోడ నుపాయనం బిచ్చినట్టి
క్రొత్తకట్టాణి ముంగఱముత్తె మనఁగ
జూడ నొప్పారి వేగురుఁజుక్క వొడిచె. (జ) 319

ఉ. గైరికమండనంబులు నఖర్వసమున్నతపాదపంక్తియున్
హారిమదాపరాశి యపహార్యసమంచితసత్త్వరేఖయున్
ధారుణి మీకు మాకు విదితంబుగ సాటియె పొమ్మటంచు దు
ర్వారగతిన్ హసించు గిరివర్గముఁ దత్పురి వారణౌఘముల్. (జ) 320

సీ. తన శాత హేతి మత్తవిరోధిశుద్ధాంత దుర్దాంతహృదయాగ్నిధూమరేఖ
తన కీర్తి హుతవహస్తంభశంభుకిరీటి తక్షులమల్లికాస్తబకపంక్తి
తన నిరర్గళదానధార పంకజభవాం డోదంచితావరణోదకంబు
... ... ... ... ... .... .... ... ... ... ... ....
గీ. గాఁగ విలసిల్లు సకలదిక్చక్రవాళ
భరితతేజోనివహబృహద్భానుదళిత
చండభానుండు సంతతాఖండవిభవ
శాలియగు నశ్వసేనభూపాలవరుఁడు. (జ) 321

సీ. ధర్మభంగము విధూత్తంసవీరమునంద ధర్మభంగము రణస్థలులయంద
ఘనతమస్స్ఫూర్తియు[?]ర్యమునంద ఘనతమస్ఫూర్తి యామినులయంద
విక్రమోత్సేకంబు వీరయోధులయంద విక్రమోత్సేకంబు విష్ణునంద
బలగర్వహతి గోత్రకులభంజనునియందఁ బలగర్వహతిరా... [?]
గీ. [కాకిఁకే]చోట లేక నిష్కంటకంబు
గా మహీతల మేకచక్రముగ నేలె
రంతి దశరథ నాభాగ రఘు దిలీప
నయసమన్వితుఁ డశ్వసేనప్రభుండు. (జ) 322

సీ. పటుచండతాండవోత్పతిత ధూర్జటిజటామకుటాగ్రఫణిఫణామణి యనంగ
నికటవాతాఘాతనిర్భగ్నమగు పశ్చిమాచలధాతుశృంగాంగ మనఁగ
సంధ్యాప్రభిన్నరక్షఃకోటిపై వియచ్చరణుఁ డేసిన సుదర్శన మనంగ
ఘననిశాంబుధి జగంబను కలం బెడలక యుండంగఁ ద్రోచిన గుం డనంగఁ

గీ. దేజమంతయు శిఖియందుఁ దిరము గొల్పి
కడఁకఁ దలలెత్తి పటుమాంసకలశ శంకఁ
బదరి జలచరపంక్తి పైపైఁబడంగఁ
బడియె నపరాంబురాశిలోఁ బద్మహితుఁడు. (జ) 323

చ. పనివడి పాకశాసను నెపంబునఁ బంకజసంభవుండు నీ
తనువుఁ దొఱంగఁ జేసె నతిదారుణశాంభవరోషవహ్నిచే
మనమున నాటి యాగ్రహము మానక నీవును సంఘటించి తా
ఘనునిశిరంబుఁ ద్రుంచు తమకం బితరుల్ తెలియంగ నేర్తురే. (జ) 324

ఉ. పోకులఁ బోయి యన్యసతిఁ బొందినవాఁడు సదాకళంకి దో
షాకరుఁ డుగ్రమూర్తి సముద్రవిషాగ్నిసహోదరుండు ప
ద్మైకవిరోధి సంతతజినాత్ముఁడు మా సరిగాఁడటంచు ను
త్సేకముతోడ రాజు నిరసింతురు రాజకుమారు లప్పురిన్. (జ) 325

సీ. బింబంబు హిమధామబింబంబు నడఁగించు మధురాధరాననమండలములు
మించులఁ బసిఁడిక్రొమ్మించులఁ దలపించు నతిమనోహరకటాక్షాంగరుచులు
నగములఁ గృష్ణపన్నగములు నగుఁ గుచద్వితయరోమావళీవిభ్రమములు
దమ్ములఁ దేటిమొత్తమ్ముల నిరసించు నంఘ్రిద్వయీవినీలాలకములు
గీ. కరము కేసరిఁ గేసరోత్కరముఁ దెగడు
మధ్యకోమలదంతాంశుమండనంబు
లౌర! నుతియింప నజునకునైన వశమె?
యప్పురంబున నొప్పారు నబ్జముఖుల. (జ) 326

క. బీరమునఁ బొదలి సమర
ప్రారంభమె పెండ్లియనుచు బలవర్షమునన్
వైరులకు వెన్నుచూపని
శూరప్రజ మప్పురమునఁ జూడఁగ నొప్పున్. (జ) 327

క. మందేహ దేహదహనా
మందక్షతజప్రవాహ మహనీయనదీ
సందేహదాయి యగుచును
గ్రందున నెఱసంజ మింటఁ గానఁగ నయ్యెన్. (జ) 358

ఉ. మాయపుఁదుంటవిల్తు వెడమాయల మానినులార! ప్రాణముల్
వోయెడునాఁడునాఁటికిఁకఁ బోవిడుఁ డీ యలుకల్ నిజేశులన్
బాయకుఁడీ యటంచుఁ బరిభాషలఁ జాటెడుభంగి కొక్కురో
కో యని కూఁత వేసెఁ దొలికోడి పురాంతరగేహదేహళిన్. (జ) 329

మ. లలితాహంకృతిచేత రాచిలుక తాళం బుగ్గడింపం గరాం
చలవాచాలవిపంచికారణనచంచద్గానముం గూడి యు
జ్జ్వలపాదాంబుజ రత్ననూపురచలద్వాక్యంబు సొంపొంద వా
గ్జలజాతాక్షి యొనర్చు నా హృదయరంగక్షోణి నృత్యక్రియన్. (జ) 330

సీ. వదనాంబుజంబుపై వ్రాలిన మదభృంగ జాలంబు లబల నీలాలకములు
రదనముక్తాఫలప్రరంబు దాఁ[చిన పవడంపునును]గ్రోవి పడఁతి మోవి
యౌవనాంభఃప్రవాహములోనఁ దేలెడు జక్కవ కవకాంత చన్నుదోయి
నతనాభికూపసంగతయైన నవజల ద్రోణి పల్లవపాణి రోమరాజి
గీ. ... ... ... ... రామణికి నిడిన
కమ్మపూదండ లబ్జాక్షి కరయుగంబు
చరణపద్మముల్ ముట్టంగఁ జాలునట్టి
కరికరంబులు నిడువాలుఁగంటి తొడలు. (జ) 331

చ. విడిలిన మోవికెంపులును వ్రేకపుటూరువు గాలిసొంపులున్
బడలిన మేనియొప్పులును నానదొఱంగిన మాటతప్పులున్
సడలిన కొప్పుబాగులును జంకెనచూపుల వింతలాగులున్
దడఁబడ నభ్యసించిరి ముదంబున నిద్దఱుఁ గామతంత్రముల్. (జ) 332

సీ. సకలదిగ్దేశరాజన్యహారప్రభా జాలంబు ఫేనపుంజంబు గాఁగఁ
జంచలలోచనాజనకరాంచలచల చ్చామరోత్కర మూర్మిచయము గాఁగఁ
సముచితరత్నాసనము లంతరాకీర్ణబహుళభూధరకదంబములు గాఁగఁ
బరనృపాలార్పిత బాలాజనంబుల మెఱుఁగుఁజూపులు గండుమీలు గాఁగఁ
గీ. వందిసంస్తుతు లద్ధతధ్వనులు గాఁగ
జయ రమాకాంత కుధ్భవస్థాన మగుచు
నంచితాజ్ఞామహావేల నంబురాశి
మహిమఁ జెలువొందు నాస్థానమండపమున. (జ) 333

సీ. సంతతి లేని సంసారంబు నిస్సార మొగి నర్భకులు లేని యొప్పు తప్పు
కొడుకుతోఁ గూడని కూడు గీడు తనూజు లెపుడు క్రీడింపని యిల్లు పొల్లు
పుత్త్రరత్నము లేని భోగంబు రోగంబు తనయుఁ గానని దాని తగవు నగవు
పిన్నబిడ్డలు లేని పెక్కువ తక్కువ సూను మైసోఁకని మేను మ్రాను
తే. కాన యెబ్భంగినైన సంతానలబ్ధి
కాననగు త్రోవఁ బరికించి కానవలయుఁ
గాని యూరక యున్కి యుక్తంబు కాదు
జగతి సంతతి లేకున్న జన్మహాని. (జ) 334

సీ. సురవాహినీ హేమసరసిజమ్ములు గోయ జను లర్థి నిడిన నిచ్చెన లనంగ
నభ్రంబు పాథోధి యనుచు నెఁగఁగ నిల్చి సాగిన శరదభ్రచయము లనఁగ
జవభిన్నరవిరథాశ్వములు నిల్వఁగ నోలిఁ బన్నిన పటికంపుఁ దిన్నె లనఁగ
ఘనరత్నకుట్టిమోద్గతరసాతలశేష ఫణిఫణాద్యుతికలాపంబు లనఁగ
గీ. భూమి కాంచిత నవమణిస్తోమ ధామ
మండలాఖండలాచ్ఛకోదండఖండ
పటల నర్తిత దేహళీబర్హికులము
లగుచు నప్పురి సౌధంబు లతిశయిల్లె. (జ) 335

సీ. సౌవీర మగధ కోసల భోసల పుళింద లాట కేరళ మహాభోట చోట
సాముద్ర పౌండ్ర ఘూర్జర కుంత లావంతి పాండ్య గాంధార నేపాళ గౌళ
కర్ణాటక కురు కేకయ వత్స మత్స్యాంగ బంగాళ సింధు కళింగ వంగ
కురు బాహ్లికా[?]ది కొంకణ టెంకణ సాళ్వ కాశ్మీర పాంచాళ చోళ
గీ. శక సుధేష్ణ త్రిగర్త దశార్ణ వార్ణ
కాల కాంభోజ దరద కంథాణ హూణ
సింహలోత్కళ బహుధాన శూరసేన
యవన మద్ర మరుద్రదేశాంధ్రవిభులు. (జ) 336

క. హరితురగము నరుణాంశుని
హరులుం గవగూడెనేని యగు సరి లేదా
సరి గావని యితర హయో
త్కరములనగు నప్పురమునఁ గల హరులెల్లన్. (జ) 337

సీ. హరినీలరుచిరమధ్యప్రభాభోగంబు నంభోదరశ్రేణి నపహసింప
శశికాంతకుట్టిమచ్ఛాయాకలాపంబు వరబలాకావైభవంబు నెఱప
నంగనాచటులకటాక్షపాతంబులు సౌదామనీవిలాసములు సేయ
నిబిడభేరీశంఖనినదసంరంభంబు ఘనగర్జితప్రౌఢిఁ గైకొనంగఁ
గీ. గలహవిగళితసౌధాగ్రగతవధూటి
కా ప్రసూనాళి కరకాప్రకాస్తిఁ బెనుప
మహిమ నే ప్రొద్దు వర్షాగమంబు ఠేవ
దీపితం బయ్యె భోగవతీపురంబు. (జ) 338

భాస్కరుఁడు [?] (ఆం)
సీ. తొలిపల్కు మునికోలఁ దోఁచువారువములు వారువములఁ గన్న సారథియును,
సారథిఁగన్న యస్త్రము నస్త్రమును మోచు గరి గరితోడఁ దొడరెడు నారి,
నారిమీఁదటి తేరు తేరిమీఁదటి విల్లు నా విల్లుపై పట్ల నరుగు రథము,
మెఱుఁగుఁజిప్పలజోడు మెయిజోడుపై గతుల్ గతులపై విజ్జోడుకండ్లు కండ్లు
గీ. సరివెలుఁగుచున్న ములికియు సంఘటించి
విషమలక్ష్యము ల్సమదృష్టి విఱుగనేసి
జయము చేకొన్న విలుకాఱ చక్రవర్తి
కరుణ దళుకొత్త మనలను గాచుఁగాత. (ఆం) 339

మల్లయ, నంది [మదనసేనము] (జ)
గీ. అపుడు తానావసానంబునందు మధ్య
కీలితంబయి యొప్పెఁ గెంగేలు వలికి
నలియవు గదా యటంచు నా నడిమితీఁగ
నుపచరింపఁగ వచ్చినదో యనంగ. (జ) 340

సీ. తళతళమను పతాకలతోడ రవికాంతిఁ దలతలమనెడి రత్నములతోడఁ
గనఁగన సొబ గధికంబైన పొడవుతో గనకనమను హేమకాంతితోడఁ
గలకలఁ బల్కుచిల్కలతోడ గృహదీర్ఘి కలఁగలహంససంఘములతోడఁ
బరిపరిగతి నాడుబర్హులతో నిజోపరిపరిగతిమేఘపంక్తితోడఁ
తే. దముల విహరించు పారావతములతోడ
భ్రమదళివ్రాత సుమవితానములతోడఁ
బ్రమదవనవాసనలచేతఁ బ్రమద మొసఁగి
యెనయు నీ మేడతోఁ బ్రతి యెనయఁ గలదె? (జ) 341

సీ. పరిఫుల్లహల్లకప్రభలు నిండినచోట సాంధ్యరాగద్యుతి చౌకళింప
వికచనీలోత్పల ప్రకరస్థలంబుల గిఱికొన్న చీఁకట్లు గ్రేళ్ళుదాఁట
నిర్ణిద్ర కుముదవనీప్రదేశంబులఁ దేఁటవెన్నెల పిల్ల తీపులాడ
వికసిత కనకారవిందబృందంబులు బెరయు నీరెండఁ బింపిళ్ళు గూయఁ
గీ. బగలు రేయును దమలోనఁ బగలు మాని
కలసి మెలసిన బాగున గడలు కొల్పి
వివిధమహిమలఁ దనరు నా విమలసరసిఁ
జూచి నివ్వెఱపడి రాజసూనుఁ డపుడు. (జ) 342

సీ. మెఱుఁగుశృంగములందు మెదలక యున్నవి నీలమేఘంబులు నీరజాస్య!
వెన్నెలపులుఁగులు వేకువచంద్రుపైఁ దేలుచున్నవి చూడు తియ్యఁబోఁడి!
మింట నాగడపలు మెల్లమెల్లన విచ్చి కానరావయ్యె నో కలువకంటి!
పారిజాతపుఁదీగ బహువర్ణపుష్పభారంబు మోవగలేదు కంబుకంఠి!
గీ. యనుచుఁ దమలోన గర్భోక్తు లాడుకొనుచుఁ
దనకు నుపచారములు సేయు ననుఁగుఁజెలులఁ
జూచి నవ్వుచు సహజన్య చూడ నొప్పెఁ
జారుదోహద లక్షణసహిత యగుచు. (జ) 343

మల్లయ, నండూరి [హరిదత్తోపాఖ్యానము] (జ)
చ. నవరుచిపల్లవస్థితిఁ దనర్చి లసత్సుమనస్సమృద్ధివై
భవమున నొంది గంధబహుబంధురతం దగి యాశ్రిత ద్విజో
త్సవములఁ బొల్చి వారవనితామణిరీతిఁ ద్రివిష్టపంబు ఠే
వ వరగజంబుమాడ్కిఁ గ్రతువాటిగతిన్ బురితోట లొప్పగున్. (జ) 344

మల్లయ, మద్దికాయల [రేవతీపరిణయము] (జ)
సీ. అమృతాంశుబింబంబు నవఘళింపఁగఁజాలు తీయని పెదపెన తేనెపెరలు
కలశాంబునిధి తరంగల పిల్లలనఁ జాలు సాంద్రదీర్ఘవళక్షచామరములు
తారకంబుల యొప్పిదములు గాదనఁజాలు వైణవమౌక్తికవ్రాతములును
పండువెన్నెలగుంజుఁ బరిహసింపఁగఁ జాలు పరిపరిగతుల యబ్బురపుజున్ను
గీ. నాది యగు దివ్యవస్తుసంహతులు దెచ్చి
యవనమండలపతి కుపాయనము లిచ్చి

విన్నపము చేసె నిట్లని వేడ్క దనదు
డెందమునఁ గందళింపఁ బుళిందవిభుఁడు. (జ) 345-A

మ. కటకండూయన మంతనంతఁ జలుపంగాఁ దామ్రపర్ణీ మదో
త్కటదానంబులు నిండి చెండుకొన కస్తగ్రావకూటద్యష
త్తటముల్ మెట్టఁగఁ జిర్కుబాఱె నవినీతంబుల్ వడింబాఱెనా
బుటకన్యాప్తుఁడు గ్రుంకెఁ బశ్చిమ మహాంభోరాశి పూరంబునన్. (జ) 345-B

చ. నిలయతమఃప్రతానము గణింప మఱుంగులు సొచ్చినట్టుగా
నలరు పిఱిందినీడలు రతాంతదుకూలపరిగ్రహ త్వరా
కలిత విలాసినీ నివహకౌతుక హేతువులై చెలంగ ను
జ్జ్వలరుచి మించె గేహముల సంపెఁగమొగ్గలవంటి దీపముల్. (జ) 346

మల్లుభట్లు, ఘటసాసి [జలపాలిమహత్త్వము] (జ)
సీ. అత్రిమునీశ్వరుం డడవి కేఁగిన వేళ హరిహరబ్రహ్మలు ధరకు వచ్చి,
యనసూయ వర్తనం బరయఁ దలంచి వా రతిథులై యాహార మడిగినంత,
యవుగాక యని వేగ నన్నపానాదులు వడ్డింపఁ దలఁచుచో వారికోర్కి,
తప్పకుండఁ బతివ్రతాప్రభావంబున నకళంక యగుచు బాలకులఁ జేసి,
తే. యంబరము లూడ్చి, సకలపదార్థములను
పాత్రములఁ బెట్టి, తొంటి [రూప]ము లొనర్ప
సంతతం బంది, తత్తదంశముల సుతుల
వరము లందె, నయ్యది పతివ్రతల మహిమ. (జ) 347

సీ. కచభరకృష్ణమేఘంబులఁ బ్రభవించు మెఱుంగుఁదీగలరీతి మేను లలర
వదనేందుదరహాసవరశరచ్చంద్రిక లక్షిచకోరంబు లనుభవింప
నతులసౌందర్యాబ్ధి కధరబింబద్యుతుల్ పవడంపుఁదీగెల బాగు మెఱయ
జగముఁ గెల్వఁగ దక్షనగరంబు దొనసేసి మరుఁడు దాఁచిన దివ్యశరము లనఁగ
తే. సరసలీలావలోకనచతురగతుల
నప్సరస్త్రీసమూహంబు లభ్యసింపఁ
బద్మినీజాతిముఖ్యస్వభావములను
వన్నె మెఱయదు రప్పురివారసతులు. (జ) 348

సీ. ధవళాంగుఁడగు శంభుదత్తగర్భముగాఁగ వనితదేహము పాండు వర్ణమయ్యెఁ
బుత్త్రలాభానంద పూరితకుక్షియై యఖిలభక్ష్యములందు నరుచియయ్యెఁ
జెలులు వచ్చినఁ జూచి సిగ్గున నున్నట్లు పలుక నోపక యుండె నలసవృత్తిఁ
దతి మరాళములకు గతినేర్పుకై వడి నలినాక్షి మందయానము వహించె
తే. హేమకలశాగ్రములయందు నింద్రనీల
రత్నములరీతిఁ దత్కుచాగ్రంబులందు
నలుపు సొంపారి గర్భచిహ్నములు గలుగ
నతివ తల్లికి సంతోష మావహిల్లె. (జ) 349

మాధవుఁడు, ఫణిధవు [ప్రద్యుమ్నవిజయము] (జ)
గీ. అత్రిముని కంటి పసుబిడ్డఁ డాకసమున
నుడుగణము లాడకాడకు నొడ్డగిలిన
బాలభానుండు నలుగడఁ బర్వమీటు
వెండిగుండన నుదయించె వేగుఁజుక్క. (జ) 350

చ. ఎడపక దివ్యవస్తువు లనేకము లుండుటఁ జేసి యేమిటం
గడమ యిడంగరాని నిజగర్భభరంబున దేవతాపురిం
దొడరుట కప్పురంపు బిరుదుల్ గగనంబున కెత్తెనో యనన్
బొడవున నాడుచుండు నృపపుంగవ! మారుతవైజయంతికల్. (జ) 351

సీ. గబ్బిబేడిస మీలు కన్నుల కెనవచ్చుఁ బలుమాఱు నవి మిట్టి పడకయున్నఁ
దొగలనెచ్చెలికాఁడు మొగమున కెనవచ్చు నొకయింత మేనఁ గందుండకున్నఁ
గ్రొవ్వున జక్కవల్ గుచముల కెనవచ్చుఁ బ్రొద్దువోయినఁ బాసిపోకయున్న
మెఱుఁగులు మెత్తనిమేనుల కెనవచ్చుఁ దళతళఁ బొడకట్టి తలఁగకున్న
గీ. ననుచు సరసులు వర్ణింప నవయవాతి
విభ్రమవిలాసవిస్ఫూర్తి వినుతి కెక్కి
గణన మీఱిన మానినీమణులు గలరు
... ..... ...... ....... .... ..... (జ) 352

గీ. గాఢతరకాంతికై మ్రింగుకాంక్ష నంత
రిక్షకాపాలికుఁడు సంతరించినట్టి

గొప్పయగు శుద్ధపారదఘుటిక యనఁగఁ
జొక్కమగు కాంతి వేగురుఁజుక్క దనరె. (జ) 353

ఉ. చెంచెతగుబ్బచన్నుఁగవ శీఘ్రతరంబుగ నంతనంత వ
ర్తించిన యౌవనోపగమ జృంభణమెక్కిన నంతకంత శో
షించెను దానినెన్నడుము జీవితనాథుఁడు వానివిల్లునున్
జెంచులరాజులున్ సవతిచేడియపిండును బక్కణంబులన్. (జ) 354

గీ. తొలుత ముంగిళ్ళఁ గర్పూరధూళిఁ దుడిచి
సహజచందనజలములఁ జాఁపి చల్లి
చారుగృహములఁ గమ్మకస్తూరి నలికి
మ్రుగ్గు లిడుదురు పురసతుల్ ముత్తియముల. (జ) 355

చ. దలదవదాత కంజదళ ధౌతకనత్కలధౌతమల్లికా
వలుల విలాసలీల శరవర్గమృణాళ మనోజ్ఞహార వ
ల్లుల రవణంబునన్ సకలలోకనుతోజ్జ్వలకందబృందకం
దళములచాయఁ జంద్రకిరణంబులకుం దెలుపెక్కె నంతటన్ (జ) 356

చ. నవకపుఁదెల్లమ్రుగ్గు జతనంబునఁ గూర్చివియద్గృహంబునన్
దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చఁగా
సవరఁగ దీర్చి కాలమను జక్కులముద్దుఁడు వేడ్కతో దివా
యవనికఁ బాయఁదట్టె నన నంచితలీల వెలింగెఁ దారకల్ (జ) 357

గీ. పట్టువడ కది చపలతఁ బాఱె మనసు
సూరిజననుత! రూపఱి సుడిసె గాలి
యండగొనె నారి గట్టియై యాశుగంబు
లప్పురముగుఱ్ఱముల వేగమరసి చూడ. (జ) 358

ఉ. పొంకపుగుబ్బలుం బునుఁగుఁబూతయుఁ దుమ్మెదకప్పుమేనులున్
జంకెనచూపులున్ జఘనసైకత సీమలఁ బారుటాకులున్
మంకెనచాయమోములును మానితహస్తధనుశ్శరంబులున్
గొంకక భిల్లకామినులకుం దగియుండుఁ బసిండిగుబ్బలిన్. (జ) 359

ఉ. పోలఁగ నందులం గలుగు పుష్పసుగంధుల రూపవైభవ
శ్రీ లరయంగఁ గోరి యట జేరిన ఖేచరయక్షదైవత

స్త్రీలని సంశయింపఁగఁ బురీజను లద్భుతదర్శనప్రియా
చాలనదూరతన్ నెఱయు సౌధహిరణ్మయసాలభంజికల్. (జ) 360

గీ. మిక్కుటపుఁగాంతి వేగురుఁజుక్క వొడిచె
బారెఁడెక్కినయపుడు గన్పట్టియుండె
నినుఁడు నరుదెంచినను రాగ మెసఁగఁ బ్రాచి
మురువుగాఁ దాల్చునాసికాభరణ మనఁగ. (జ) 361

క. మెత్తనిబంగరురవరవ
లొత్తెడుకరమూలరోచు లొలయంగను దా
రెత్తులు గట్టెడుమిషమునఁ
జిత్తిణితన మెల్ల బయలు సేయుదు రచటన్. (జ) 362

ముత్తరాజు—నెల్లూరి [పద్మావతీకల్యాణము] (జ)
క. నీ వెంతవేఁడుకొన్నను
గేవలపాతకుల కేల కృప వుట్టు మదిన్
దేవుఁడు ‘నహి’ గురువున్ ‘నహి’
భావజచంద్రులకు వికచపద్మదళాక్షీ! (జ) 363

ముద్దమరాజు—రెడ్డిపల్లె.[అష్టమహిషీకల్యాణము] (ఆం)
ఉ. రామకథాసుధారసము బ్రహ్మపయోంబుధి మున్గి యుండఁగా
నేమునివాక్యమందరమహీధరసన్మథనంబుచే సము
ద్ధామత సంగ్రహించి విబుధప్రకరంబున కిచ్చె నరిమై
నామహితుం బ్రచేతసునియాత్మజుఁ గొల్చెద నాదిసత్కవిన్. (ఆం) 364

శా. శ్రీవామాగృహలిప్తసన్మృగమదశ్రీఁ బొల్చి వక్షంబునన్
శ్రీవత్సంబు వెలుంగఁ గౌస్తుభము లక్ష్మీదీప మైయొప్పఁ ద
ద్దేవీఖేలనలోలచిత్తుఁ డగు శ్రీదేవుండు కృష్ణుండు స
ద్భావం బొప్పఁగృపావలోకనమునన్ బాలించుఁ ద్రైలోక్యమున్. (ఆం) 365

ముమ్మయ—జైతరాజు. [విష్ణుకథానిధానము] (ఇ)
ఉ. అంగిటిగాల మాపదకు వ్యాధుల కెల్ల బొజుంగు భీతికిన్
గౌంగ దరిద్రవృత్తిముకుఁగొయ్య యఘంబులవేఱు విత్తుదు

స్సంగతి వెన్నుసమ్మెట విషప్రకరంబులమిత్తి దేవ! నీ
మంగళ నామధేయము సమాశ్రిత భక్తివిధేయ మచ్యుతా! (ఆం) 366

చ. అమృతమువంటితల్లి కమలాసనుపట్టపుదేవి వేద శా
స్త్రముల విహారభూమి కలప్రాణులకెల్లను పల్కుఁదోడు వి
శ్వమున సమస్తవిద్యల విశారద శారద నాదు వక్త్రప
ద్మమున వసించి మత్కృతిఁ జమత్కృతిఁ బట్టుగఁ జేయుఁగావుతన్. (ఇ) 367

చ. అరుణజటాచయంబును దిగంబరభావము సాంద్రధూళి ధూ
సరిత శరీరమున్ వెఱపుచంద మెఱుంగమి యెల్లచోటులన్
దిరుగుచు నున్కియున్ గలిగి తెల్లము చేసె యశోదపట్టి దా
హరిహరు లేకమౌటఁ దనయం దతిశైశవవిభ్రమంబునన్. (జ) 368

క. అలకలును ముద్దుఁజెక్కులు
వలుఁదతొడలు మెడలు నడలు వలసినయెడలున్
చెలువుగఁ బుడుకుచు వెన్నుఁడు
వెలఁదులఁ జొక్కించి పుడుకువేఁదుఱుఁ గొలిపెన్. (ఆం) 369

చ. అసదృశసర్వశాస్త్రనిచయంబుల క్రొవ్వు పురాణపంక్తిలో
మిసిమి సమస్తవేదముల మీఁగడ మంత్రచయంబులోని య
య్యుసురు విశిష్టధర్మములయుక్కు తపంబులచేవ యంచు నిం
పెసఁగఁగఁ నీదు నామము మునీంద్రులు సెప్పుదు రర్థి నచ్యుతా! (ఆం) 670

ఉ. అడఁగఁ గెంజడల్ దొలఁకి యాడఁగ జాహ్నవి దిక్కులెల్ల న
ల్లాడఁగ భూతధాత్రి యసియాడఁగ నాకము నాకసంబు నూఁ
టాడఁగ ముజ్జగంబు గొనియాడఁగ నిచ్చలు నీవు తాండవం
బాడఁగ గౌరి నిన్ సరసమాడఁగఁ జేరు నటా! మహానటా! (ఇ) 371

శా. ఆడెన్ దాండవ మార్భటిన్ బటహలీలాటోపవిస్ఫూర్జిత
క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ
క్రోడాఘాటకరోటికోటరకుటీకోటీలుఠత్సింధువీ
చీ డోలాపటలీపరిస్ఫుటతరస్ఫీతధ్వని ప్రౌఢిమన్. (ఆం) 372

సీ. అయు వగ్గలముగా నాశిర్వదించుచో నే పుణ్యుఁబురుడింతు రెల్లవారు?
జనులకు నే మహాత్మునిపురాణము సర్వ వర్ణాశ్రమాచారనిర్ణయంబు?

ఏ యయ్య చేసిన యీశ్వరస్తోత్రముల్ పఠియించినను మృత్యుభయము వాయు?
... ... ... వీర శివలింగములఁ బ్రతిష్ఠించి నెగడె?
గీ. నట్టి లోకైకమాన్యు మహానుభావు
సుతునిఁగా గాంచి వెలసిన సుకృతమయుని,
ఘను మృకండుమునీంద్రునిఁ గరివిభుండు
గనియెఁ దొలుమేనిసుకృతపాకమునఁ జేసి. (ఆం) 373

సీ. ఆరఁగా బండిన యల్లొనేరెడుపండు మెఱుఁగున మెఱుఁగారు మేనివాఁడు,
వెడవెడ విరిసినవిరిదమ్మి ఱేకులఁ దెగడు కన్నులుగల మొగమువాఁడు,
మెండైన యేనికతుండంబు మెచ్చని యిరుదోయి చేతులఁబరఁగువాఁడు,
తొమ్మిదిరూపుల తుమ్మెద వాయని పువ్వుఁదామరగల బొడ్డువాఁడు,
గీ. కలిమిముద్దియ యురమునఁ గలుగువాఁడు
గడఁగి మున్నీటి సెలయైన యడుగువాఁడు
వన్నెగలపైఁడిచీరలవన్నెకాఁడు
నేడు నా చూడ్కిచుట్టమై నిలిచె ననుచు. (ఆం) 374

శా. ఆహా కావ్యము! మేలుమే లనమి యన్యాయంబు వో శారదా!
ద్రోహం బేటికిఁ గట్టుకో ననుచు సంతోషించు నట్లుండు న
య్యూహాదుల్ విని సత్కవీంద్రుఁ డితరుం డొచ్చెం బపేక్షించు సం
దేహించుం దనసొమ్ము పోయినగతిన్ దీనత్వముం బొందుచున్. (జ) 375

సీ. ఉత్తుంగకర్కశవృత్తస్తనంబుల నద్వైతభావన యతిశయిల్ల,
నత్యంతశూన్యతాయత్తమధ్యంబున నాస్తికతత్త్వంబు విస్తరిల్ల,
స్నిగ్ధారుణారుణముగ్ధాధరంబునఁ బ్రాభాకరాపూర్వశోభ దొలఁక,
విటమనోవిదళనస్ఫుటకటాక్షంబుల భేదసిద్ధాంతంబు పెంపు మిగుల,
గీ. మేన వైశేషికప్రభ గానఁబడఁగ
నొప్పదురు వారకామిను లిప్పురమునఁ
దలఁప గేవలకామశాస్త్రంబె కాదు
నిఖిల శాస్త్రంబులును నిందు నెగడు ననఁగ. (ఆం) 376

సీ. ఊఁకరల్ గొట్టక యుబ్బసం బందక వెఱవక దేహంబు విఱుచుకొనక,
నిడుచన వెట్టక నిద్దొట + + + + తరవాయి దప్పక తడవికొనక,
అక్షరాస్పష్టత యతిగీతనష్టత కాకుండ నర్థంబు గానఁబడఁగ,
నయ్యైరసంబున కనురూపముగఁ బెక్కు రాగముల్ ఫణుతులు బాగువుట్టఁ

గీ. జెఱకుకొననుం + + + + వు దోఁప
కంతకంతకు వేడుక లతిశయిల్లఁ
జదువుకొన్నారు వీరల చదువుఁబోలఁ
జదువలేదని పొగడిరి సభికవరులు. (జ) 377

శా. ఓ లక్ష్మీపతి! యో పురాణపురుషా! యో పుణ్యసంకీర్తనా!
యో లోకేశ్వర! యో గజేంద్రవరదా! యో ద్వారకావల్లభా!
యో లీలామనుజావతారనటనా! యో కృష్ణ! యో యచ్యుతా!
యోలిన్ నాదు మనస్సరోవరములో నోలాడవే యో హరీ! (ఆం) 378

చ. కదలదు తేరు రథ్యములు గట్ట నశక్యము సూతుఁడంటి మా
ముదుసలి చక్రముల్ సరసమోపుఘటిల్లని వల్ల నారియున్
గుదిగొను నమ్ము శార్ఙ్గమునకుం బనుపడ్డదిగాన వింత పెం
పొదవఁ బుర త్రయంబునెటు లోర్చితి వో త్రిపురాంతకేశ్వరా! (ఆం) 379

చ. కమలజకృష్ణశంకరులు కాంచననీలపటీరవర్ణు లా
గమ నగ చంద్రధారు లఘకంసపురారులు హంసతార్క్ష్య గో
గమనులు జన్మపోషలయకారులు వాక్కమలాంబికేశ్వరుల్
శమకరుణావిభూతిగుణసక్తులు ప్రోతురు మమ్ము నెప్పుడున్. (జ) 380

సీ. కమలజుతమ్ముఁడు గొమరుండుఁగూడి నీ మూర్తియుఁ గీర్తియు మూదలింపఁ
జతురాస్యుచదువులు జననియుఁ గూడి నీ యునికియు మనికియు నుపచరింప,
హరిశిరోమాల్యంబు వరధనుఃప్రభయు నీ యడుగును మడుగును నంగవింప,
శివునిరథంబును జెవికుండలములు నీ యునికియు మనికియు నుపచరింప,
గీ. ననుసరింపఁగ నేర్తు వీ వఖిలజగము
జగము లొగిఁ బ్రోవ నిల్చిన జగధదీశ!
ఈశ! వాణీశ! నిర్మలహృదయవాస!
వాసుదేవ! జగత్త్రయావాస! దేవ! (ఆం) 381

సీ. కమ్మలు నటియించు గతులకుఁ గడుమెచ్చి చెక్కులు చిఱునవ్వు సేసచల్ల,
బిగువుచనుంగవ బింకంబునకు మెచ్చి లీలమైఁ జూపు నివ్వాళి సేయ,
జఘనంబు చేసిన శౌర్యంబునకు మెచ్చి వేనలి తగఁ బుష్పవృష్టిఁ గురియ,
నూరుకాండంబు నొయ్యారంబునకు మెచ్చి మొలనూలు కైవార మెలమిఁ జేయఁ,

గీ. జెమటఁ గరఁగినతిలకము సెదరఁ గురులు
గలఁగ వదనము విరిదమ్మిచెలువుఁ దెగడ
మదనసమ్మానమందలి మగతనమున
మెఱయు గోపాంగనల పొందు మెచ్చె శౌరి. (ఆం) 382

మ. కరఢక్కారవవాద్య మింపొదవ గంగాతుంగ రంగత్తరం
గ రవప్రస్ఫుటతాళసమ్మిళిత తత్కంజాతపుంజస్ఫుర
ద్వరపుష్పంధయ మంథరధ్వనులు గీతంబొప్పఁ దౌర్యత్రికం
బిరవై యుండఁగ నీదు తాండవ మహం బేపారు సర్వేశ్వరా! (ఆం) 383

ఉ. కాటుక చేతులున్ మొగము గాఁ బులుమాడుచుఁ దల్పవస్త్రముల్
చీటికిమాటికిం దరలి చిందఱవందఱచేసి యాడుచున్
మీట నదల్ప నేడ్చుచును మెత్తనిమాటల బుజ్జగించి ము
ద్దాటకుఁ జొచ్చినన్ నగుచు నట్లమరెన్ హరి శైశవంబునన్. (జ) 384

సీ. చనుఁగవఁ బయ్యెద జాఱంగ జాఱంగఁ గరమూలమున నంటఁ గదిమి కదిమి,
వేనలి వెడవెడ వీడంగ వీడంగ నెలమి మూఁపునఁ జాల నిఱికి యిఱికి
నుదుటిపై నలకలు సెదరంగఁ జెదరంగ నల్లని ముంజేత నదిమి యదిమి
పొడతెంచు చెమటలు పొదలంగఁ బొదలంగ నడరు నూర్పులచేత నడఁచి యడఁచి
గీ. చన్నులును జేతికలశంబు సరసమాడ
నవ్వు నమృతంబుఁ దమలోన నవ్వులాడ
సిగ్గు తమకంబు వినయంబుఁ జెంగలింప
వెలఁది యమృతము వడ్డించె విబుధతతికి. (జ) 385

[గూఢచతుర్థి]



సీ. చూడ్కి మోమున నాభి సువిహార యోగ్యత వలరాజుబావి జావళము సేసి,
యెలయింత బొమల మై మెలఁకువ మాటల మరువింటి రసము లేఁబరము సేసి,
కళలఁ దనుప్రభ గతి నటనంబున శారదమెఱుఁగు గజంబు గెలిచి,
యెలమి నవ్వునఁ గుచముల నిటలంబున మొలకవెన్నెలమొగ్గ ముంపు దింపి,
గీ. పలుగ నేర్చిన రత్నంపుఁబ్రతిమలనఁగఁ
దిరుగ నేర్చిన వెన్నెల తీఁగెలనఁగఁ

బొంద నేర్చిన పుత్తడి బొమ్మ లనఁగ
నొప్పుదురు కామినీ మణు లప్పురమున. (ఇ) 386

మ. జయనారాయణ! పుండరీకనయనా! శార్ఙ్గీ! జగన్నాయకా!
జయపీతాంబర! భక్తవత్సల! విరించిస్తోత్రపాత్రక్రియా!
జయజంభారివిరోధివిక్రమ కళాశ్లాఘావిఘాతక్రమా!
జయగోవింద! ముకుంద! మందరధరా! శౌరీ! మురారీ! హరీ! (ఆం) 387

చ. తమకముతోడఁ దల్లియును దండ్రియు నొక్కట ముద్దువేఁడ సం
భ్రమమున వచ్చి తల్లిముఖపద్మముఁ దండ్రి ముఖంబు లైదు వే
గమ తనయాఱుమోములను గైకొని ముద్దిడు మేటివేలుపుం
గొమరుఁడు నాదువాణికి నకుంఠితశబ్దము లిచ్చుఁ గావుతన్. (ఇ?) 388

సీ. తియ్యవెల్లువయను తెల్లదామరలోనఁ గొమరారునిద్దంపుగ్రుద్ద [గుబ్బ?] యనఁగఁ,
గొడుకుఁజూడఁగ వచ్చి కడ నిరవైనను నిలిచిన మంచుగుబ్బలి యనంగ,
ముక్కంటికొండకు నెక్కుడుగాఁగ వె న్నుండు పాటించినకొండ యనఁగ,
నేఱులనెలఁత నిండెలమి [?] వేడుకకునై పట్టిన ముత్తెపుబంతి యనఁగఁ,
గీ. బుడమిముద్దియ గంధంపుఁబూఁతతోడి
చన్నుఁగవఁనాగఁ జుక్కలసంగడీల
గనియొకో యనఁ దెలుపులగద్దె యగుచుఁ
దెల్లమిగ నొప్పు నత్తెల్లదీవిమీఁద. (ఆం) 389

శా. ధాటీధూళియుఁ బోలెఁ బుష్పరజముల్ దట్టంబుగా నుల్లస
ద్ఘోటీకోటులమాడ్కిఁ జూతతరువుల్ గ్రొవ్వారఁ జంచచ్చల
త్పాటీరానిల లోలపల్లవము లుద్యత్ఖడ్గసంఘంబుగాఁ
బాటిల్లెన్ వనవాటిఁ జైత్రుఁడు జితప్రాలేయసంరంభుఁడై. (ఇ) 390

సీ. నారాయణునకుఁ బ్రణామంబు గావింతు నడుగుల కెరఁగుదు నచ్యుతునకుఁ,
గైటభారికి నమస్కారంబు వాటింతు మ్రొక్కుసేయుదు నాదిమూలమునకు,
వందనంబొనరింతు వాసుదేవునకును దండమొనర్తు గదాధరునకుఁ
బ్రణతిసంపాదింతుఁ బరిపూర్ణమూర్తికి నంజలి ఘటియింతు నఖిలపతికి,
గీ. ననుచు నానందభరితులై యమర దైత్య
ముని నరోరగముఖ్యులు వినతులగుచుఁ

గొలువ నొప్పుజగత్పతిఁ గొలుతు నిన్ను
నఖిలభూతాత్మ! యాదినారాయణాత్మ! (ఆం) 391

ఉ. పూర్వకవీంద్రులం గొలుచుపూనికి నిప్పటివారిఁ గొల్తు ని
ర్గర్వత నిక్కవీంద్రులు పురాణకవీంద్రులకంటెఁ దక్కువే?
యుర్విని నేఁటివారగుట యొచ్చెమె? నేఁడును దామ్రపర్ణిలోఁ
బూర్వపుముత్తియంబులను బోలిన మౌక్తికరాజి లేదొకో? (జ) 392

ఉ. భారవిఁ గాళిదాసు శివభద్రుని మాఘుని బాణు భామహుం
జోరు మయూరునిం దలఁచుచున్ మఱియుం గవులౌ విదగ్ధు లె
వ్వారలు వారినెల్ల ననవద్యుల నాద్యులఁ బ్రస్తుతింతు సం
సార సుఖైకసార విలసత్కవితా వర వైభవార్థినై. (ఆం) 393

చ. మదమును మందెమేలమును మందటయుం దమకంబు వేడ్కయుం
గుదిగొనియున్న జవ్వనపుఁ గొమ్మలకాంక్ష యెఱింగి యెంతయున్
బ్రిదులని కౌఁగిలింతలను బింకపుఁ గ్రీడ నఖక్షతాదులన్
మదనగురుండనంగ సుఖమర్మములం దనిపెం బ్రవీణుఁడై. (ఆం) 394

సీ. మేరురోహణముఖ భూరిమహాశైల కులజనకాయిత గోపురంబు,
సోమసూర్యాద్యనానా మహస్సముదయ జననీభవద్వప్ర చక్రశతము,
అభ్రగంగాయమునాది ప్రవాహ సం ఘాత ధాత్రీభూతకేతనంబు,
సౌదామనీశక్రచాపపురస్సర ద్యుతిదేశికాయిత తోరణంబు,
గీ. నిఖిలపాతాళపాతాళ నిమ్నపరిఖ
మూర్ధ్వలోకోర్ధ్వలోకాయితోచ్చ సౌధ
మసదృశానేక శుభవిభవాస్పదంబు
పుణ్యసులభంబు వైకుంఠపురవరంబు. (ఆం) 395

సీ. రాగంబులగు శుద్ధరాగ సాళగరాగ సంకీర్ణరాగముల్ చక్కఁ దీర్చి,
స్త్రీ పు న్నపుంసక రూపంబులను వాని వేళలు మైత్రియు వెలయఁజూపి,
తాన ప్రపంచవిస్తారంబు చూపుచోఁ గ్రొత్తతానంబులు గొసరి కొసరి
స్వరమూర్ఛనా గ్రామజాతి శ్రుతుల లక్ష ణములకు నపుడు లక్ష్యములుగ[?]
గీ. ......లింపు లొదవంగఁదగిన శుద్ధ
దేశమార్గములను రాణఁ దేటపడఁగ

సకలమోహన సంగీతచతురుఁడగుచు
వేణుగానంబుఁ బ్రకటించె విశ్వగురుఁడు. (జ) 396

సీ. లసదురఃస్థలంబునఁ బసనైన గళమున విలసిత లీల శ్రీ నిలిపినారు,
చరణంబుపట్టున జడలలో చుట్టున ననువొందఁగా గంగ నునిచినారు,
భవ్యగుణంబున దివ్యదేహంబున నొఱపు మీఱఁగ భూతి మెఱసినారు,
తిరముగా మూఁపునఁ గరమొప్పురూపునఁ బొలుపొందఁగా ధాత్రిఁ బూనినారు,
తే. తెల్ల గల యిండ్ల నిలిచి వర్తిల్లినారు
ఇరువు రిరువుర భార్యల నేలినారు
పెక్కు మొగములకొడుకులఁ బెనిచినారు
హరిహరులు వీరు సర్వలోకాధిపతులు. (జ) 397

[గూఢచతుర్థి]



సీ. వలపుల బొమల మై నిలుకడఁ గన్నులఁ బుష్పచాపధ్వజ స్ఫూర్తిగలిగి,
కాంతి గంధంబునఁ గరములఁ దనువల్లిఁ గనకపంచమదామ గరిమఁదాల్చి,
కురులను బొడ్డునఁ బిఱుఁదునఁ గుచమున ఘనసరసీచక్రగతి వహించి,
నేర్పున నగవున నిగ్గున మొగమున శారదామృతభాను సమితినొంది,
గీ. కౌను నఖములసొబగును గల్గి చూపు
హరిమణి శ్రీసమానత నతిశయిల్లి
రూపశుభలక్షణముల నేపుమిగిలి
వెలఁదు లమరుదు రవ్వీట వేడ్కతోడ. (జ) 398

చ. వలపెటువంటిదో ముసలివాఁడనవచ్చునె? యద్దిరయ్య! ప
ల్కుల జవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్ల ప్రొద్దును మొగంబునఁ గట్టినయట్ల యుంటు నీ
నలువకు నంచుఁ గాముకులు నవ్వువిధాత శుభంబు లీవుతన్. (ఇ) 399

చ. వెడవెడఁ గౌఁగిలించుచును వేమఱుఁ జుంబనలీల మోవియుం
దొడుకుచు బుజ్జగించుచును దొంగలిచూపుల లోన సిగ్గుతో
సుడివడు భీతి వాపి మదిసోఁకునకున్ సొగియంగఁజేసి యే
ర్పడ రతిసౌఖ్యముల్ మరపె బాలలకుం గమలాక్షుఁడింపుగన్. (ఆం) 400

చ. వెనుకకుఁబోక యీయనక వేసటఁ బొందక పంక్తిపంక్తికిన్
బెనుపక కానమిన్ బ్రమసి బెగ్గిల కంతయు మున్న చూచుచున్
గనుఁగొని యక్షరాక్షరము కందువదప్పక యేకచిత్తుఁడై
యనుపమ భక్తితోఁ జదువు నాతని వాచకుఁడండ్రు భూవరా? (జ) 401

సీ. శృంగారవిభుఁడని చెప్పంగ నేటికి భావజుఁ గొడుకుఁగా బడసె ననినఁ?
గారుణ్యనిధి యని గణుతింప నేటికి సృష్టిరక్షణ నిత్యశీలుఁ డనినఁ?
బరమపావనుఁడని ప్రణుతింప నేటికి గంగఁ బాదంబునఁ గాంచె ననినఁ?
ఘనవైభవుండని కొనియాడ నేటికిఁ గలిమిముద్దియ కులకాంత యనిన?
గీ. విష్ణుఁడఁట యడంగ నేటికి విశ్వమూర్తి
యనఁగ? నచ్యుతుఁడఁట నిత్యుఁడనఁగ నేల?
యని మునీంద్రులు గొనియాడ నతిశయిల్లు
నమ్మహాత్ముండు సర్వలోకాధికుండు. (జ) 402

శా. శ్రీరామాస్పదమైన పేరురముపై శ్రీవత్సచిహ్నంబుఁ దా
నారూఢంబుగఁ దాల్చి శ్రీకిఁ దగుచిహ్నల్ గల్గువాఁ డౌట సొం
పారం దెల్లమి సేయుదేవుఁడు కృపావ్యాసక్తుఁడై మామక
ప్రారంభంబు నిరంతరాయశుభసాఫల్యంబుఁగాఁ జేయుతన్. (జ) 403

శా. శ్రీనిత్యాశ్రయమై మహామధురిమ శ్రీపేర్మికిన్ సంతత
స్థానంబై యనపాయమై యనఘమై తాపఘ్నమై స్వచ్ఛమై
యా నారాయణుశుద్ధసత్త్వగుణ మీ యాకారముం దాల్చెనో
నా నొప్పారుఁ బయఃపయోనిధి నిఖిలానందైకసంధాయియై. (ఆం) 404

శా. శ్వేతద్వీపము దుష్కృతాంధతమసచ్ఛేదక్రియాదీప ము
ద్భూతాఖండసుఖస్వరూప మమరస్తోమాద్భుతాటోప ము
త్ఖాతామర్త్యరిపుప్రతాపము నతధ్వస్తోగ్రసంతాప మ
బ్జాతాక్షప్రియరూప మార్యహృదయప్రక్షేప మొప్పుం దగన్. (ఆం) 405

క. సుతుఁడు దటాకము దేవా
యతనము నల్లిల్లు నిధియు నారామము స
త్కృతియు ననుసంతతుల యం
దతిశయము ప్రబంధ మెపుడు నక్షయమగుటన్. (జ) 406

సీ. సూర్యునిఁబోలు కౌస్తుభముపైఁ బ్రాలంబ మనియెడు పరివేష మతిశయిల్ల,
మేఘంబుసరియైన మేనిపైఁ బీతాంబ ర ప్రభ యను తటిత్ప్రభలు మెఱయ,
నిండుఁజందురు నవ్వునెమ్మొగంబున సుప్ర సన్నత యను సుధాసార మమర,
జలజంబుఁ దెగడెడు చరణంబునను దివ్య దీర్ఘిక యను పూవుఁదేనె దొరఁగ,
గీ. హస్తముల శంఖచక్రగదాంబుజంబు
లమర ధర్మార్థకామమోక్షముల మాడ్కి
నఖిలలోకేశుఁ డాద్యుఁ డవ్యయుఁడమేయుఁ
డమ్మహాత్ముండు మెఱయు నారాయణుండు. (ఆం) 407

చ. స్ఫురదురుకర్ణతాళమునఁ బుట్టినగాడ్పున విఘ్నవారిదో
త్కరములఁబాఱఁదోలి మదధారల విశ్వముఁ దొప్పదోఁచుచున్
గరివదనుండు దోడుపడుఁగాత! మహాగణనాథుఁ డర్థితోఁ
గరవదన స్తవంబు పని గైకొని సల్పిన నాకు సత్కృపన్ (జ) 408

రంగనాథుఁడు [?] (ఇ)
చ. అదలని తేరు తేరునకు నాదరువై తగువిల్లు వింటికిన్
గుదురగు నారి నారిపయిఁ 2గూన్కుశరంబు శరంబు బొడ్డునం
బొదలినయంత యంతముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
చెదరక నీకు నెట్టిపని సేయునయా! గిరిజాధినాయకా! (జ) 409

సీ. ఓజుచే ముట్టక యొగ్గానఁ బట్టక చక్కఁగా దివిఁబాఱు చక్రమునును,
లాయానఁ గట్టక లలి మేఁతవెట్టక వర్ణహీనంబైన వారువములు,
దవనవెట్టక జీవితము కాసుముట్టక సత్త్వసంపదఁజూపు సారథియును,
కడచీలఁ దట్టక ఘనముగా మెట్టక గంభీరసంపద గలుగునిరుసుఁ,
గీ. గలిగి తనరారు నరదంబుఁ గడఁక నెక్కి
త్రిపురవిజయంబుఁ జేకొన్న దేవదేవుఁ
డిందుశేఖరుఁ డానంద మందిరుండు
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁ గాత! (ఆం) 410

ఉ. గోశతపంచవార్థులును గోయుగవార్ధులు గోత్రివార్ధులున్
గోశరవార్ధులున్ విదితగోశత[వార్ధులు] పంచవార్ధు లా
కేశవ తల్పపద్మభవకేకిసవాహనదానవేశ దే
వేశులకిచ్చునట్టి పరమేశ్వరుఁడీవుత మా కభీష్టముల్. (జ) 411

రామయ్య, వాసిరాజు [బృహన్నారదీయము] (ఆం)
శా. అంభోజాసన మానసాంబుజభవుం డధ్యాత్మవిద్యోన్న తా
రంభుం డిద్ధ తపోవిశేషమిత ప్రస్ఫీత ఘోరాఘ సం
రంభుం డంచితశాంతిసంయుతుఁడు భారద్వాజ మౌనీంద్రుఁ డు
జ్జృంభించెన్ వరసప్తసంయమిజనశ్రేణీ సముద్భాసియై. (ఆం) 412

సీ. మల్లికానవసముత్ఫుల్లపాటల పుష్ప వల్లరీసౌరభ్య వాసితంబు,
కాసారనీరజ వ్యాసక్త మధుకరీ ఝంకార ముఖరితాశాముఖంబు,
పద్మాప్త కిరణప్రభావలీ సంతప్య మాన సర్వంసహామండలంబు,
దహనహేతిచ్ఛటాదందహ్యమాన దు ర్గమఘోరకాంతార సముదయంబు,
గీ. చటులతర నిర్భరోష్ణ సంసక్తవాత
శోషితాశేష నిమ్నగాస్తోమ జంతు
సంచయంబును నగు ఘర్మసమయ మేచి
వర్వె నతిసాంద్రమగుచు దిగ్భాములకు. (ఆం) 413

సీ. విశ్వంభరాచక్ర విజయలక్ష్మీఘన స్తన పరీరంభదోస్స్తంభ యుతుఁడు,
బాడబానలశిఖాభంగ భానుప్రభా ద్యోతమాన ప్రతాపోజ్జ్వలుండు,
కుండలీశాధీశ గురుపద్మసంభవ స్ఫుట శేముషీకళా భూషణుండు,
సురసింధుశరదభ్రశుభ్రాభ్రకాదభ్ర విభ్రమస్థిర యశో విశ్రుతుండు,
తే. విపుల కోదండ నిర్ముక్తవిశిఖనివహ
దారుణోదగ్ర దహన దందహ్యమాన
సమదశాత్రవ రాజన్య చటులవిపిన
సముదయుండు భగీరథక్ష్మావరుండు. (ఆం) 414

రామయ్య, ఆంధ్రకవి [విష్ణుకాంచీమాహాత్మ్యము] (ఆం)
మ. అరుణస్ఫూర్తి సురేంద్రదిక్తటమహావ్యాప్తిన్ విజృంభింపగా
శిరసు ల్వంచెఁ జకోరవర్గములు హెచ్చెం జక్రవాకంబు లా
తురతం గైరవపంక్తిఁ దూలెఁ గడు సంతోషించెఁ బద్మంబు లొ
క్కరి చే టొక్కరి మేలు పొమ్మనుట నిక్కంబైన చందంబునన్. (ఆం) 415

శా. ఇష్వాసక్రకచాదిసాధనపరాహీనప్రభాంగీకృతా
భిష్వంగద్యుమణిద్యుతిప్రకరుఁడై పీతాంబరాలంకృతున్

విష్వక్సేనుని గౌస్తుభాభరణు నుర్వీశ్రీయుతుంగొల్చి యా
విష్వక్సేనుఁడు సంచరించు గణరాడ్విఖ్యాతుఁ డాచక్కటిన్. (ఆం) 416

క. కాంచనబహువిధ రత్నా
భ్యంచితమై చిత్రరచనబంధురతరమై
మించి సురాసురముఖ్యులు
కాంచి నుతింపంగఁ గాంచి కాంచిం బోలెన్. (ఆం) 417

సీ. గజకచ్ఛపంబు లెరునికుక్షిలోనికినిరాది [టి][?] భిక్ష.........,
సకలలోకములు నే జవసత్త్వసంపన్ను ఖురళికాయాత్రకు గోష్పదంబు,
బలభేదివజ్రమే యలఘు ఱెక్కలలోనఁ జిక్కిపెంపే[ఁదిన] చిఱుతపుల్ల,
కద్రూతనూజవర్గంబు లే మహనీయు నాగ్రహంబునకుఁ జొక్కాకుపదువు,
తే. లతఁడు హరిఁ గొల్వ నచ్చోటి కరుగుఁదెంచె
శంఖచూడసుదక్షిణ క్షమపయోద
వాహనోద్గారతాభీలసాహసైక
జనిత దాక్షిణ్యుఁడైనట్టి వినతపట్టి. (ఆం) 418

సీ. తనుఁబట్టి విడువని తగవరి యితఁడంచు మృడునకు నొకవంక మేలు సేసెఁ,
దనకుఁ బూర్వాశ్రితుఁడని సురాధ్యక్షుని శతకోటిధన సమన్వితునిఁ జేసెఁ,
దనపాదములు నితాంతముఁ జేరి కొలువఁగ రాజీవశత్రుని రాజుఁ జేసెఁ,
దనకు గుణంబుగాఁ దగిలియుండుట సూచి యహికులాధిపుని భోగాఢ్యుఁ జేసె,
తే. ననుచు మిన్నక కొనియాడినను నిజంబ
యగుచుఁ దనయందుఁ గాన్పించు ననుదినంబు
జగతి నొప్పారు నీ శైలచక్రవర్తి
యసమతరకీర్తి నిత్యకల్యాణమూర్తి.

శా. ద్రాక్షాపాక నవీనవైఖరిఁ బ్రబంధస్తోమముల్ సెప్పి య
ధ్యక్షుండయ్యె మహాకవీంద్రులకు నాహా! యెట్టి పుణ్యాత్ముఁడో
సాక్షాద్భారతిఁ గాక యీతఁడు మనుష్యవ్యక్తియే యంచు సం
లక్షింపం దగు కాళిదాసుఁ గృతిలీలావ్యాసుఁ గీర్తించెదన్.

సీ. పడియలలోపలఁ బడి యలందురుఁ గాక గండుమీనము లంబకముల సరియె?
పొదలు మాటుగ నేచి పొదలుటఁ గనుఁగాక యలరుగుత్తులు కుచావళుల సరియె?

గహనంబులోన నగహనమై చనుఁ గాక చమరవాలములు కేశముల సరియె?
ఘనములయొద్ద నఘనములై మనుఁ గాక తళుకులు మించుగాత్రముల సరియె?
తే. కలువ లొండెనుఁ జక్రవాకంబు లొండెఁ
దేటు లొండెనుఁ బువ్వారుఁదీఁగె లొండెఁ
గాక యని ప్రస్తుతింప నా కాంచిలోన
సతులు విలసిల్లుదురు హేమలతలుఁ బోలె. (ఆం) 421

చ. రసికత సోలిసోలి యనురాగరసంబునఁ దేలితేలి యా
కసములు మెట్టిమెట్టి తమకంబునఁ గాంతలఁ బట్టి పట్టి యా
దొసకులఁ జిక్కి చిక్కి కడుదూరముగాఁ జని తక్కితక్కి పై
కొసరెసఁగం జకోరికలు కోరిక లీరికలొత్త మత్తిలున్. (ఆం) 422

సీ. రాలు కారాకులఁ గ్రాలుమాఱాకులఁ గలయ భూజములెల్లఁ గానరాఁగ,
సతులడెందంబుల నతులకుందంబుల వికసనం బాత్మకు వ్రేగుఁగాగఁ,
బొలుచుదారకముల గెలుచు కోరకముల విరవాదితీగెలు విఱ్ఱవీఁగఁ,
జంపకజాలంబు నింపక యోలంబుఁ గొని దవ్వులనె తేఁటికొలములాఁగ,
తే. నెంతయును వింత యిది యన నంతనంత
సంతతాక్రాంత మదన నితాంతతాంత
కాంతకాంతాకదంబక స్వాంతములకు
సంతసము నింప వచ్చె వసంత మంత. (ఆం) 423

సీ. శబ్దశాసనకావ్యసంఘట్టన క్రమా నందిత బుధవర్యు నన్నపార్యు,
నుభయభాషా రచోన్నిద్ర భద్ర వ చోరాజిఁ దిక్కనసోమయాజి,
లక్ష్యలక్షణకళాలంకార సౌభాగ్య సత్కావ్యవిన్యాసు శంభుదాసు,
ఛందోనిబంధన చాతురీధౌరేయ వాగ్ధాము వేములవాడ భీము,
తే. రసికజనపద్మ దిననాథు రంగనాథుఁ,
బ్రకటకృతికర్మనిస్తంద్రు భాస్కరేంద్రు
నమితరసభావు శ్రీత్రిపురారిదేవు
సూక్తితిమిధాము నాచనసోముఁ దలఁతు. (ఆం) 424

సీ. శ్రుతులును నిర్జరస్థితులును మగిడింప నిగడంపఁ జాలు నీ నేర్పుకలిమి,
ధరణియు రిపుగర్వసరణియు ధరియింప హరియింపఁ జాలు నీ యలవుకలిమి,

భ్రాత నర్మిలిఁగన్నమాతనుఁ బాలింప లాలింపఁ జాలు నీ లావుకలిమి,
గేహిని రవిసుతావాహిని సాధింప భేదింపఁ జాలు నీ పేర్మికలిమి,
తే. జనులఁ బాతకజనులను జరుప నురుప
నలరు నీ నేర్పుకలిమి చిహ్నములు నీకు
మత్స్యకూర్మమహీధరమనుజసింహ
ఖర్వరామత్రయీ బుద్ధకల్కి గతులు. (ఆం) 425

రామరాజు, ఎలుకుర్తి [రామలింగశతకము] (జ)
సీ. గంగాప్రవాహంబు కన్నెగేదఁగిఱేకు నమృతాంశురేఖ ముత్యాలసేస,
యురగేంద్రహారంబు కురువిందములపేరు విసము కప్పురముతో వీడియంబు,
ప్రాఁతకంకటికాలు పంకసంజాతంబు జింకపిల్లయు రాచచిలుకబోద,
యిభచర్మచేలంబు నింద్రగోపపుఁబట్టు భూతిపుంజము నవ్యపుష్పరజము,
తే. హేమగోత్రకోదండంబు నిక్షుధనువు
గలుగునర్థనారీశ్వరాకారమునను
భువనజాలంబుభక్తులఁ బ్రోవుమయ్య
రాజహంసరథాంగ! శ్రీరామలింగ! (జ) 426

రామలింగయ్య, తెనాలి [కందర్పకేతువిలాసము] (జ)
ఉ. అక్కమలాక్షిఁ గన్గొనినయప్పటినుండియు నేమి చెప్ప నా
కెక్కడఁ జూచినన్ మదనుఁడెక్కడఁ జూచిన రోహిణీవిభుం
డెక్కడఁ జూచినx జిలుక లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు లిం
కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానలతాపవేదనన్. (జ) 427

ఉ. కామిని చంద్రుఁ జూచి మదిఁ గందు సరోరుహగంధి మంది రా
రామముఁ జూచి మ్రానుపడు రాజనిభానన సారెకున్ శుక
స్తోమముఁ జూచి యేఁకరును దొయ్యలి కోకిలఁ జూచి కంటఁ గెం
పౌ మదలీలఁదాల్చు మదనానలతాపవిషాదవేదనన్. (జ) 428

సీ. తారామనోరంజనారంభ మే దొడ్డు శిలలు ద్రవింపంగఁ జేయుననినఁ
జాకోరహర్షయోజనకేలి యేదొడ్డు పేర్చి యంభోధు లుబ్బించు ననినఁ
గుముదౌఘతాపోపశమకృత్య మేదొడ్డు సృష్టియంతయుఁ జల్లసేయుననిన
వరనిశాకామినీవాల్లభ్య మేదొడ్డు వర్ణింప సత్కళాపూర్ణుఁ డనినఁ

గీ. దనకు సర్వజ్ఞ శేఖరత్వంబు గలుగ
హితసుధాహార వితరణం బేమిదొడ్డు
ననఁగ విలసిల్లె హరిదంత హస్తిదంత
కాంతి నిభకాంతిఁ జెలువారి కంజవైరి. (జ) 429

ఉ. వారిజ! మీన! కోక! యళివర్గ! సితచ్ఛద! సల్లతావనీ!
మీ రుచిరాస్య మీ నయన మీ కుచ మీ యలకాలి మీ గతిన్
మీ రమణాంగి మత్ప్రియ నమేయగతిన్ విరహాతురాననన్
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరుఁ గానరే. (జ) 430

రామలింగయ్య, తెనాలి [హరిలీలావిలాసము] (జ)
ఉ. ఆ కరివేల్పు సామి చరణాబ్జములన్ జనియించినారు మం
దాకిని తోడునీడలయినారు నిజంబుగఁ గమ్మకట్టి దా
మై కమనీయకీర్తి మహిమాతిశయంబున మించినారు భ
ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రుల మాద్రులు శూద్రు లప్పురిన్. (జ) 431

ఉ. అల ఘృతంబు వేఁడియగునన్నము నుల్చిన ముద్దపప్పు క్రొం
దాలిపుఁ గూర లప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్
మేలిమిపిండివంటయును మీఁగడతోడి ధధిప్రకాండమున్
నాలుగు మూఁడు తోయముల నంజులుఁ గంజదళాక్షి పెట్టఁగన్. (జ) 432

గీ. ఉడుపథం బనుములు దోసతొడిమ యూడఁ
దామరసబంధుఁడనుపండు తనకుఁ దానె
వికృతి గనుపింపఁ గనుపట్టు విత్తులనఁగఁ
దనరె నెఱసంజఁ గెంపగు తారకములు. (జ) 433

ఉ. ఎంతయు రాజుతోడి పగ యే కొదవో? మధుపప్రసక్తి య
శ్రాంతము గల్గుతమ్ములప్రచారము గాదని చూడ నోడి దే
శాంతర మేఁగె నాఁగ నపరాశఁ బతంగుఁడు దాఁగె నట్టి వృ
త్తాంత మెఱింగి సిగ్గొలసినట్టులు గందె సరోరుహంబులున్. (జ) 434

ఉ. ఏటి మహానుభావుఁ డిహిహీ జమదగ్నితనూజుఁ డేడు ము
మ్మాటులఁ గాని శత్రుమదమర్దనదక్షుఁడు గాఁడు గోత్రమే

తూఁటుగఁ జేతఁ దల్లిమెడఁ ద్రుంచెఁగదా యని యీసడింతు రౌ
గాటపుపంతగాండ్రు కులగణ్యు లగణ్యులు పుణ్యు లప్పురిన్. (జ) 435

ఉ. కాలధనంజయుండు తనుఁ గాచి దివాకరమత్స్యయంత్రమున్
గీలెడలించి సంధ్య యనుకృష్ణ నుదంచితరూపవిభ్రమ
శ్రీలలితాంగినిం దగ వరించి తమోమయధార్తరాష్ట్ర భూ
పాలక సేన నేయు సితభల్లములో యనఁ బర్వెఁ దారకల్. (జ) 436

ఉ. చంగున దాఁటు ధే యనిన సప్తసముద్రములైన వేగ వా
గెం గుదియింప నిల్చు నడిగెంటనె శస్త్రనిపాతధీరతన్
సంగరరంగవీథిఁ దమ స్వామికి గెల్పు ఘటించునట్టి యు
త్తుంగ తరంగరత్నములు తొంటిహయాకృతి శార్ఙ్గి పుట్టువుల్. (జ) 437

తే. భానుశశిమండలంబుల లోనడంచి
యిరులు పెనువానఁ గురియుచు నేపు చూపు
రాత్రి వర్షర్తువునఁ బుట్టె బ్రతిగృహా క
కరములఁ బటుదీపవైడూర్యరత్న సమితి. (జ) 438

చ. తెలతెలవాఱ నొయ్య నరుదెంచు నిశాంతరతాంతతాంత లౌ
చెలువలకింపుగా మెలఁగుఁ జెక్కులఁ గూరిన చూర్ణకుంత లా
వళి సరసంబుగా జడియు వాడినసెజ్జలమీఁది ప్రావిరుల్
దొలఁగఁగఁ జేయు నూడిగపుఁ దొయ్యలులంబలె వేఁగుఁదెమ్మెరల్. (జ) 439

సీ. నీ రింకఁదొడఁగె వెన్నెల మానికం బుల వేఁడిరాతూపుల విడిసె వహ్ని
కలఁగె జీవంజీవముల నిండుమనములు జక్కవపులుఁగుల జాలి వదలెఁ
గనుమూసెఁ గుముదకానన విభా విభవంబు శ్రీలక్ష్మి నిలిచె రాజీవపీఠి
వాజువాఱఁగఁ జొచ్చె వరుణునిదిక్కున నేర్పడి దీపించెఁ దూర్పువలను
తే. తార లుడివోయె వికసించెఁ దరుల విరులు
చంద్రికలు గందెఁ గొలఁకులు చాలఁ దేరె
దీపరుచి దాఁగెఁ దలసూపె రేపటెండ
చందురుఁడు వ్రాలెఁ 3బొడిచెఁ గంజాతహితుఁడు. (జ) 440

ఉ. పున్నమచందమామఁ బొరపుచ్చి సుధారసమొయ్యఁజిల్కుచున్
సన్నముగాఁగ నూరి ఘనసారమునం బ్రతిపాకమిచ్చి మీఁ

ద న్నెఱయంగ నల్కినవిధమ్మున వెన్నెల గాయ నప్పురిన్
సున్నపుమేడ లభ్రపద చుంబిశిరోగృహరాజి రాజిలున్. (జ) 441

క. పురనిధిరక్షకునై ఫణి
పురము వెడలి వెట్టివెట్టి పొంగారు ఫణా
ధర పరివృఢుకరణి భయం
కరమగుఁ బ్రాకారపరిథి కడు నచ్చెరువై. (జ) 442

సీ. మదభిన్నకటగళన్మౌక్తికంబులు తొట తొట రాల మస్తవిధూననముల
ఆనమత్కుతలంబులగు పదక్రమముల ఘణఘణంకృతి నాభిఘంట లులియఁ
గీర్తిచంద్రికలయాకృతి దట్టమై దళ దళఁ బర్వ దంతకుంతముల రుచులు
పుష్కరఫూత్కారముల నకాలపు వాన కారు లెల్లెడఁ దము తార కురియఁ
గీ. దమకుఁ బరవాహినులలోను దఱియఁ జొచ్చి
క్రీడలాడుట యుచితపుజాడ లనఁగఁ
బెరిఁగి సరయూజలంబుల సరసలీల
గ్రాలఁ జనుచుండు నప్పురి గంధకరులు. (జ) 443

సీ. ముదురుఁజీకఁటిమన్నెమూఁకకుఁ గై జీత మొసఁగు కుంతలముల యొప్పు వెలయుఁ
బండు వెన్నెలరాజు బంటుగా నేలు చ క్కని మొగంబుల నిక్కుఁ గని భజింపఁ
బసిఁడిగట్రేనిఁజేపట్టుకుంచము సేయు జిగిమించు చన్నులబిగువు నిగుడ
గబ్బియేనిక దొర గారాముగాఁగ మ న్నించులేనడపుల నేర్పు మెఱయ
తే. నూరువులె గాదు? రంభ మైయొఱపుఁ దమ వ
శంబు గావింపఁ, బద నఖచయమె కాదు
విలసనముఁ దార పాటింప వీటఁ బద్మ
పత్రనేత్రలు చాలఁ జూపట్టుచుంద్రు. (జ) 444

చ. యుగములు వేయు వోవు నొకయుద్దరువుల్ గణుతించు నంతకే
యుగములు లక్ష చెల్లుఁ బొరి నున్నధనంబు మితింప నమ్మహా
యుగశతకోటు లేఁగు నితరోన్నతవస్తువులెన్నఁ గీస వె
ల్తిగ నలకాదినాథులు గదే పురిలో మను వైశ్యపుంగవుల్ (జ) 445

ఉ. రాసి సహస్రభాను ఫణరత్నములెల్లను బోవఁదన్నుచున్
వాసరభోగిఁ గాలఫణివైరి కడున్ వడి నొక్కి నక్కుగాఁ
జేసినఁ గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజృంభణం బనం
గా సముదగ్రతం బొలిచెఁ గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్. (జ) 446

సీ. వలమానచంపకోత్పలమాలికాది సం గ్రథనచాతురి నెఱ కవులఁ బోలి
దళము గెలిచినసూత్రమున నూల్కొల్పు నే ర్పున యోధవీరుల పొలుపుఁ దెలిపి
ఖండితత్వమున రాగము గల పల్లవా వలిఁగోయుటల వేశ్య వలపు నెఱపి
పలుతావులరసి యెత్తులు పచరించు పెం పున జూదరుల ఠేవ పొడమఁ జేసి
గీ. తమ నిజాంగ మరీచులు తత్తదన్య
పుష్పములసావి నిక్కంపుఁబువ్వులమరు
పేరఁ బేర్కొనుపౌరులఁ గేరికేరి
నవ్వుదురు పుష్పలావికా నలినముఖులు. (జ) 447

సీ. వినుతమాణిక్యవందనమాలికాకాండకల్పితరోహితాకారరేఖ
జాలకానననిర్యదాలోలవాసనాగరుధూపపోషితకంథరాళి
చంద్రశాలాతిగర్జన్మృదంగధ్వానవిరచితపరిఘోషనవిభవలహరి
సంభోగసంరంభసమయవిచ్ఛిన్నముక్తాహారమణికృతకనకనికర
తే. మదనమదభారమంథరమత్తకాశి
నీదృగంచలసంచితనిబిడచంచ
లాలతాతల్లజయునై యిలావివిక్త
వర్ష యననొప్పుఁ గాకుత్స్థవంశ్యనగరి. (జ) 448

ఉ. వేదపురాణశాస్త్రములు వేడుకవిద్యలు, సర్వయజ్ఞసం
పాదనశక్తి నిత్యనిరపాయవిధి ప్రతిపాలనంబు, దా
రాదిమతత్త్వముం గనుట హస్తగతామలకంబుఁ గంట, ధా
త్రీదివిజావతంసుల కరిందమ మన్పురిఁ గల్గువారికిన్. (జ) 449

చ. సరళదలత్సరోరుహససారపరాగపరంపరాపరి
స్ఫురితసువర్ణవర్ణమును బూరితదిఙ్ముఖహంసనాదమే
దురమునునై యగడ్త కనుదోయికిఁ బండువుసేయ మ్రోయుఁ ద
త్పురవరలక్ష్మి యెప్పుడును బూనెడు కాంచనకాంచియో యనన్. (జ) 450

చ. సరసులపొందు గల్దనఁగఁ జాలి బహూన్నతచారుశాఖలం
బెరిఁగి మహాద్విజావనమె పేర్చి నిజాయతిగాఁ దనర్చి ని
ర్భర జనతాపసంహరణపాత్రములయ్యు మహీజవాటికల్
పురివెలి నిల్చె మేటియు నపూజ్యుఁ డగున్ మధుపానుకూలతన్. (జ) 451

వల్లభరాయఁడు [వీథినాటకము] (జ)
సీ. చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు విమలదంష్ట్రాప్రరోహములవానిఁ,
బవడంపుఁగొనలతోఁ బ్రతివచ్చు ననవచ్చు కుటిలకోమలజటాచ్ఛటలవాని,
నింద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతరదేహకాంతివాని,
నుడురాజరుచులతో నొఱవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసములవాని,
గీ. సిగ్గుమాలిన మొలవానిఁ జిఱుతవాని
నెల్లగాలంబు ములికినాఁ డేలువాని
నర్థి మోపూర నవతారమైనవాని
భైరవునిఁ గొల్వ వచ్చిరి భక్తవరులు. (జ) 452

వీరయ్య, పిల్లలమఱ్ఱి [పురుషార్థసుధానిధి] (ఆం)
సీ. కాశకర్పూరనీకాశఁగా భావింపఁ గవితానిరూఢిఁ బ్రఖ్యాతి నెసఁగు,
యావకారుణదేహయష్టిఁ గాఁ జింతింప మదకుంభియానల మరులుగొలుపు,
నీలజీమూతసన్నిభఁగా విలోకింప సకలమాయాప్రపంచంబు నడఁచుఁ,
గనకచంపకధామగౌరిఁగా శీలింప నంహస్సమూహంబు సంహరించు,
గీ. శంభుదేవి విశాలాక్షి సదనుకంప
యోగిజనసేవ్య యోగపయోదశంప
శ్రీకర కటాక్షలేశరక్షిత నిలింప
ముజ్జగంబుల మొలిపించుమూలదుంప. (ఆం) 453

సీ. భర్గభట్టారకు పర్యాయమూర్తికి షాణ్మాతురుని కూర్మిజనకునకును,
మేషరాజము నెక్కుమేటిరౌతున కమరాధీశుపొరుగుదిశాధిపతికి,
హరిణవాహనుని నెయ్యపుసంగడీనికి సామిధేనీప్రియస్వాంతునకును,
యాయజూకులయిండ్ల యనుఁగుఁజుట్టమునకు స్వాహాస్వధాప్రాణవల్లభునకు,
గీ. దండములు వెట్టెదము మోడ్చెదము కరములు
సేవ యొనరించెదము మమ్ముఁగావు ప్రోవు

యాగవేదికి విచ్చేయు మారగింపఁ
బ్రథమజన్ముల యింటికల్పద్రుమంబ. (ఆం) 454

వీరయ్య, పోతరాజు [త్రిపురవిజయము] (ఆం)
సీ. కపిలజటాజూటగంగాసముత్తుంగవీచీఘటలు మిన్ను వీఁక దాఁకఁ,
బ్రబలబాహార్గళపరికంపితస్ఫారఢక్కాధ్వనిని దిశల్ పిక్కటిల్ల,
జ్వాలాకరాళభీషణశారదస్థూలశూలయుద్ధప్రభల్ సూర్యుఁ బొదువఁ,
బ్రకటబంధురదీర్ఘపటువజ్రనిష్ఠురపదఘట్టనము లుర్వి యదర నొదవ,
గీ. విమలశార్దూలచర్మాంచలములు దూల
మహితమండనఫణిఫణామణులు గ్రాల
నసమరౌద్రరసావేశ మావహింప
నారభటి భూరితాండవం బాచరించె. (ఆం) 455

సీ. తమ్ముల బెదరించు తళుకువెన్నెల పాప గన్నెగేదఁగిఱేఁకు గారవింపఁ
బదినూఱుపడగలఁ బఱపైనపదకంబు సవడిముత్తెపుబన్నసరముఁ బ్రోవ
మిసమిసమన మించు భసితాంగరాగంబు పరఁగుచందనచర్చఁ బరిఢవింప
మెఱయుమువ్వన్నెల కఱలపుట్టముకొంగు చెఱుఁగుల నునుపట్టుచేలఁ బెనుప
గీ. మించి తలమీఁద నురముపై మేనఁగట్టి
యీడుదోడుగ నుమతోడఁగూడి జగము
లెల్ల రక్షించు నిను భజియింతు మెపుడు
భయద దురితలతాదాత్ర! ఫాలనేత్ర!

సీ. తలిదండ్రుల పొందు దప్పి యొండెడ నార్వు రువిదల యెయ్దువ నెదిగినతఁడు
కడువడి బలుగొండఁ గాఁడిపాఱినమేటి ఘనసాయకము కేలఁ గ్రాలునతఁడు
కమియారఁగాఁ బాఁపకవణంబు దిని యాడు ఱెక్కలతురగంబు నెక్కినతఁడు
భోగిపాన్పున నిద్ర భోగించుదేవునిఁ దఱమిన రక్కసు నుఱిచినతఁడు
గీ. సవడిమోములఁ జతురత సమకొనంగ
జోడుమాటలు సరివడ నాడునతఁడు
దంతిముఖుకూర్మితమ్ముఁడై తనరునతఁడు
కదలె బలముల నడిపింపఁ గ్రౌంచవైరి. (ఆం) 457

సీ. శూలి కన్నులఁగెంపు చూపిన రౌద్రంబు పొదల ముందఱిదెసఁ బొడమినతని,
భువనభయంకరస్ఫూర్తి పెంపెసలార శరభావతారతఁ బరఁగినతని,
జన్నంపుసిరి కొనసాఁగఁ జూచినతాతఁ జేకొని తలవంపు చేసినతనిఁ,
దళతళమని మించుదులకిచు కైదువుల్ కరములు పదిరెంటఁ గలిగినతని,
గీ. సురలు నసురులుఁ బలుమఱుఁ జూచి బెదర
బిరుదుపెండెంబు డాకాలఁబెట్టినతని
భద్రకాళి మహాశక్తిఁ బరమభక్తిఁ
బాయకుండెడు శ్రీవీరభద్రుఁ దలతు. (ఆం) 458

శేషనాథుఁడు [పర్వతపురాణము] (జ)
ఉ. తత్తరపాటుతో నిరులు తద్దయు మాన్పఁగఁ జాలు కన్ను ను
వ్వెత్తున వేల్పుమూఁకలకు విందులు వెట్టెడుకన్నుదమ్మియున్
మొత్తమెలర్ప లచ్చికిని ముద్దుగఁబుట్టిన ముద్దుపట్టి మే
నెత్తిలఁజూచుకన్నుగల యిట్టిఁడి వేలుపుఁ గొల్తు నిచ్చలున్. (జ) 459

శ్రీగిరన్న, చెనమల్లు [శ్రీరంగమాహాత్మ్యము] (ఆం)
క. కాలాగరుకుంకుమ స
మ్మేళనబాలాకుచాగ్రమేదుర పరి రం
భాలోల లీలచే హిమ
కాలముఁ గడుపుదురు జనులు కౌతుకమతులై. (ఆం) 460

చ. తమము నుడువ్రజంబు భరితంబుగ నంతటఁ దూర్పుదిక్కునన్
హిమకరజన్మవేళ నుదయించినపాండిమ మించి పాఱెఁ బ
శ్చిమమున కభ్రలక్ష్మి కుచసీమఁ గురంగమదంబలంది హా
రములిడి తా దుకూలమున రక్షగఁ బయ్యెద గప్పుచొప్పునన్. (ఆం) 461

సీ. దీపించు నే వేల్పు దివ్యాంగకంబులఁ గాళీకుచాంగరాగంబు భూతి?
కొమరొందు నే వేల్పు గురుజటాభరసీమ నమృతాంశుఖండంబు నభ్రగంగ?
కడుమించు నే వేల్పు గాత్రవల్లికచుట్టు వ్యాఘ్రచర్మము వారణాజినంబు?
కరమొప్పు నే వేల్పు కంఠపీఠంబున భుజగేంద్రహారంబు పునుకపేరు?

గీ. అట్టి వేలుపు శంకరుండాదిమూర్తి
వేదవేదాంతవేద్యుండు విశ్వభర్త
విసకితోజ్జ్వల వదనారవిందుఁ డగుచు
నుచిత రీతిఁ బేరోలగం బున్నయంత. (ఆం) 462

శా. సంతోషంబునఁబొంది యేలె విమలస్వాంతున్ మహాదానవ
ధ్వాంతవ్యూహవిదారణోజ్జ్వల వివస్వంతున్ యశఃపూరితా
శాంతున్ సాహసవంతు నిర్భర జయాయత్తైకవిశ్రాంతు ధీ
మంతున్ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్ జవాత్యంతునిన్. (ఆం) 463

శ్రీనాథుఁడు [వల్లభాభ్యుదయము] (జ)
సీ. రజనీవధూకర్ణ రజతతాటంకంబు వలరాజు ధవళోష్ణ వారణంబు
ప్రోషితయువతి హృత్పుటభేదదాత్రంబు బహుచకోర కుటుంబ పానపాత్ర
మధుకైటభాసుర మథనుదాఁపటికన్ను చక్రవాకంబుల చల్లచేఁపు
దుగ్ధపాథోరాశి తొలిచూలిసంతతి రోహిణీదేవితారుణ్యఫలము
తే. చంద్రకాంతశిలానునిలకృపీట[?]
నిర్జరాంధోవ్యథా మోక్షనియమవైద్యుఁ
డంధకారచ్ఛటా హలాహలహరుండు
చంద్రుఁడొప్పారెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు. (జ) 464

శ్రీనాథుఁడు (?) [నైషధము] (ఆం)
సీ. మించి కన్నులఁ గోరగించు రాజాన్నంబు లొలుప యించుకలేని యొలుపుఁబప్పు
అభినవసంతప్త హైయంగవీనంబుఁ బరువంపు రుచినొప్పు పాయసములు
నేతను మిరియాల నెనసిన కూరలు ఖండశర్కరతోడఁ బిండివంట
గ్రొజ్జుగాఁ గాంచిన గోక్షీరపూరంబుఁ బనస రంభా చూతఫలచయంబు
గీ. ద్రాక్షపండులు ఖర్జూర మాక్షికములు
బహుసుగంధిరసావళు ల్పానకములు
పెక్కువిధముల పచ్చళ్ళు పెరుగు మజ్జి
గయును వడ్డించి రెంతయుఁ గ్రమముతోడ.[14] (ఆం) 465

సర్వదేవుఁడు [ఆదిపురాణము] (ఆం)
మ. సరసీజాతవిరాగకారి పురయోషావక్త్రహృద్యాతిసుం
దరకాంతిన్ దఱిఁగించు బో యని మదిం దర్కించి దోషాకరున్
బురముద్దండ కరంబు లెత్తి చఱవం బొత్తైనయట్లొప్పు ను
ద్ధుర సౌధాగ్రనిబద్ధకేతువు మహాదోలాభిరామంబుగన్. (ఆం) 466

క. హరినీలమణి విరాజిత
సురుచిర గోపురము దగిలి చూచి తమిస్రా
కరుఁడు విధుంతుదమండల
పరిశంకం జేసి పురముపైఁ జన నోడున్. (ఆం) 467

సర్వదేవుఁడు [విరాటము] (ఆం)
సీ. ఇక్షురసాబ్ధి నీరెట్టిదో యని మది నూహించి యువ్విళులూరకుండ
విరసంపుముదిమికిఁ బరిహరంబఁగు రసా యనముమీఁదికిఁ జిత్త మరుగకుండఁ
దివిరి దేహమ్ము వేధించు సిద్ధరసంబు[?] కందువ యచ్చోటి కందకుండ
నాయువుఁ జిరతరస్థాయిగాఁ జేయు సు ధారసంబున వేడ్కఁ దగులకుండ
గీ. నఖిలజనులకుఁ బంకేరుహాసనుండు
నేర్చి యన్నింట రుచులొడఁగూర్చి తెచ్చి
సంచితంబులుగా సంగ్రహించె ననఁగ
భరితజలములై పురసరోవరము లొప్పు. (ఆం) 468

సర్వన్న, మలయమారుతము [షష్ఠస్కంధము] (జ)
సీ. పోడియావగనున్న వుదులు జక్కవలింక నక్కట నెగసెగా శాడకున్నె,
సరిగామి నెంతయుఁ జఱులలోఁ బడనున్న గిరులెల్ల నిఁకఁ బెచ్చు పెరుగకున్నె
పగిలి లోఁగరఁగెడు బంగారు కుండలు తలకెక్కి యటమీఁదఁ జెలఁగ కున్నె
గలఁగినమాలూరఫలము లింకిట మీఁద గిట్టితి దీవులఁ బెట్టకున్నె
తే. సదు...గ మైన నున్నతిఁ బాయవలసె
నక్కటా! మాకు నని యమి యాత్మఁగుంద
మునుపుఁ చింతాంధకారంబు మొనసె ననఁగ
నలిన లోచన చనుమొనల్ నల్లనయ్యె. [?] (జ) 469

సింగయ, ఏర్చూరి [కువలయాశ్వచరిత్ర] (జ)
శా. ఆదిబ్రహ్మముఖాళి చాలక విహారార్థ ప్రయత్నంబుతో
వేదంబుల్ భువి ధర్మపోషణకునై విఖ్యాతిగాఁ బుట్టెనో
కాదే నిట్టి మహత్త్వ మన్యుల యెడం గానంబు నాఁ బొల్తు రా
భూదేవోత్తమ లప్పురంబున మహాపుణ్యప్రభావంబులన్. (జ) 470

క. గిటగిటనగు నెన్నడుములు
పుటపుటనగు చన్నుఁగవలుఁ బున్నమనెలతోఁ
జిటచిట లాడెడు మొగములుఁ
గటితటముల యొప్పు శబరకాంతల కొప్పున్. (జ) 471

ఉ. గోపురగోపురప్రతిమగోపురముల్ చెలువొంద నప్పురిన్
మాపులు రేపులం గవలు మంజులగీతవినోదకృత్యముల్
చూపఁగఁ గిన్నరాదులవి చూచు నెపంబున వచ్చి నేర్తు రా
లాపవిశేషనర్తనవిలాసకలాపముల్ ముదంబునన్. (జ) 472

ఉ. చల్లనిపండువెన్నెలల సౌధతలోన్నత హేమవేదులం
దల్లన వల్లభుల్ గదిసినట్టి సుధాకరుఁ జూచి ప్రాణముల్
జల్లన రాహువుందలఁచి సయ్యనఁ బాపుదు రంకసంగ తో
త్ఫుల్ల వధూముఖంబులను బొల్పగు కస్తురిపత్రభంగముల్. (జ) 473

సీ. తన జన్మ మప్పులఁ దలమున్కలని రోసి పులిన మీ పొంకంబుఁ బొందెనొక్కొ?
పరికింపఁదన పట్టు తిరిగెడిపాటని పెన్నిధిసుడి మూర్తి బెరసె నొక్కొ?
బ్రతు కెల్లగతి బట్టబయలాయె నని చూచి గగన మీ పుట్టువుఁ గనియె నొక్కొ?
పనిలేక పాసెడి పాపంబుఁ దలపోసి జక్కవ లీ రీతి కెక్కె నొక్కొ?
గీ. యనఁగ లలనజఘన మంబుజముఖినాభి
చామనడుము బాలచన్నుదోయి
మహితరుచులఁ దెగడి మానవపతి కన్ను
దోయి పండువగుచు దొరసె నంత. (జ) 474

సీ. తమచూపు లొగిఁ బాంథతతులపైఁ బూనిన భావజుకరవాలభాతు లనఁగఁ
దమకురుల్ యువమృగేంద్రములకై తీర్చిన మరునసమానంపుటురు లనంగఁ
దమహాసములు విటోత్కరమానములఁ బట్టు వలరాజుపూవులవల లనంగఁ
దమకాంతి పురుషులఁ దాపంబు నొందించు రతిరాజుమోహనరస మనంగ

గీ. జలజ కాహళకదళికా పులినగహన
కోకబిసశంఖచంద్రాళికులముఁ దెగడు
పాదజంఘోరుకటిమధ్యపటుకుచోరు
బాహుగళ వక్త్ర కచములపణ్యసతులు. (జ) 475

సీ. తిమిరమంతయుఁ బాసి దిక్కులు తెలివొందె నమృతాంశువులు సెందె నభ్రవీథిఁ
గువలయానందమై కోరిక లిగురొత్తె విబుధులమదిలోన వెట్టలొదవె
నక్తంచరశ్రేణి నయమెల్ల దిగజాఱెఁ జిత్తజోల్లాసంబు చెలువుమిగిలె
దివ్యనీరంబులతేట లల్లనఁ బర్వె భువనాధిపతి వేడ్కఁ బొంగి పొరలె
గీ. దీపికాజాలమెల్లఁ జిత్రించినట్టి
రమణఁ దోఁపంగ దృక్చకోరములు మెచ్చ
నమిత తేజోవిరాజమానాత్ముఁడైన
పుత్త్రచంద్రుండు జననము వొందునపుడు. (జ) 476

క. నిరుపమ ధర్మస్థితిచే
వరపాతివ్రత్యనిరతి వైభవమున న
ప్పురిపుణ్యకాంత లమరిరి
గిరిదత్పురివాణులెల్లకీర్తితగతులన్.[?] (జ) 477

శా. ప్రాచీనంబులు రత్నకాంతులు లసత్ప్రకారముల్ హేమముల్
సూచింపన్ ఘనవేదకుట్టిమము లా శుభ్రాంశుకాంతంబులై
యే చోట న్వరరత్నజాలములచే నింపొంది సొంపొందుచున్
వాచాగోచరమై గృహంబులమరున్ వస్తుప్రశస్తోన్నతిన్. (జ) 478

ఉ. మీఱిన భద్రనాగములమీఁదికి దాఁటి తదీయకుంభముల్
చూఱలు వట్టి కేసరికిశోరనఖావళినుండి రాలి సొం
పారిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కిరాతబాలికల్
గీరనగింజలాడుదురు గేలిఁ దలిర్పఁగఁ బక్కణంబులన్. (జ) 479

ఉ. వైరితమస్తమం బడఁగ వంశమాహార్ణవ ముబ్బ బాంధవో
ద్ధార చకోరసంతతి ముదంబునఁ దేలఁగ నర్థివర్గ స
త్కైరవజాతమెల్లను వికాసముఁ బొందఁగఁ బుత్త్రచంద్ర జ
న్మారవచంద్రికానుభవ మబ్బిన చిత్తము మిన్నుముట్టదే? (జ) 480

తే. శేషఫణులకు మణులైనఁ జేరి యమ్మఁ
గోరి రత్నాకరంబైన గుత్తగొనఁగఁ
జాలి వరవస్తు సంచయ సమితి నొనరి
పరఁగుదురు వైశ్యవరు లప్పట్టణమున. (జ) 481

సిద్ధనప్రెగడ [శాకుంతలము] (ఆం)
ఉ. నీరజమిత్రుతో బయలనిల్చి చలంబునఁ గిట్టి మైమయిం
బోరుట దుర్లభంబనుచు భూరితమఃపటలంబు లొక్కమై
సూరెలఁ గోటవట్టి పొడసూపఁగ నొక్కొ యెదిర్చె నాఁగఁ బ్రా
కార నిబద్ధమణికాంతిఁ గనుంగొన నొప్పునెంతయున్. (ఆం) 482

సూరయ్య, కంచిరాజు [కన్నప్పచరిత] (జ)
ఉ. కారణ మేమి? రక్కసు నఖంబుల వ్రచ్చితి నాఁడు నీకుఁ బెం
పారఁ గుఠార మబ్బదొ? పురారివిరించులు చేరి యేటికిం
1గోరనఁ బోవుసేఁతలకు గొడ్డలి యన్నఁదొఱంగితో? వినం
గోరెద నన్న యిందిరకుఁ గోర్కులనిచ్చు ముకుందుఁ గొల్చెదన్. (జ) 483

ఉ. కొమ్మును దొండమున్ కఠినకుంభయుగంబును నయ్యుమా కపో
లమ్ముల చారుకాంతిఁ దొడలన్ వలిచన్నులఁ బోలెఁ, బుత్త్రకుం
డిమ్ములఁ దల్లిఁబోలి జనియించిన నంచితభాగ్యవంతుఁ డౌ
నమ్మ! యటంచు సిద్ధసతు లక్కునఁజేర్చు గజాస్యుఁ గొల్చెదన్. (జ) 484

మ. తమ సౌభాగ్యము లంగసంభవుని భద్రశ్రీల సేవింపఁగాఁ
దమ దృగ్జాలము లా లతాంతశరకుంతశ్రేణిఁ బాలింపఁగాఁ
దమ వృత్తస్తనభారముల్ మరునిచిత్తస్ఫూర్తి సూచింపఁగాఁ
దమకం బారఁగఁ జేరి చూచిరి పుళిందగ్రామణిన్ బ్రేముడిన్. (జ) 485

సీ. శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూమల్లశంకరధర్మమహితబుద్ధిఁ
గగకూర్మకిటినరమృగకుబ్జరామరామానంత ద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి ముఖముష్టికస్త్రీవిముక్తఖలులఁ
దత్పుచ్ఛకర్పరదంష్ట్రాగ్రనఖపదపరశుబాణహలాంగఖురపుటములఁ

ఆ. జెరివి తాల్చి యెత్తి చీరి బంధించి ని
ర్జించి యేసి యేర్చి చెఱిచి మట్టఁ
గడఁగచున్న శౌరి కరుణావిధేయుఁడై
మనలఁ గోర్కులిచ్చి మనుచుఁగాత.[15] (జ) 486



సూరయ్య, నూతనకవి [ధనాభిరామము] (జ)
చ. ఇరువదియాఱు వీక్షణములెన్నఁగ నాలుగు వక్రచేష్ట లిం
పరుదుగ నేడు భ్రూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్
సరసతఁ జూపి హంస వృష సామజ వాయస శుద్ధ సంగతుల్
పరువడి ముట్ట నిల్పె సితపంకజలోచన పాడుచుండఁగన్. (జ) 487

సోమయ్య, దామరాజు [భరతము] (జ)
ఉ. అంబరసీమఁ దారలు జటాటవి మల్లెవిరుల్ భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బూవులవర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళి గం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడుశంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్. (జ) 488

మ. అడుగుల్ ముప్పదియాఱిటన్ వెడలు పై హస్తత్రిషట్కంబుచే
నిడుపై యున్నతమై సమస్థలమునై నిర్మోకహస్తాంకమై
మృడ మిత్ర [?] పులందు వాకిలొకటై మించం గవాక్షంబు లిం
పడరన్ శాలను రాజు షడ్విధము నాట్యంబిట్టు సేయించుటన్. (జ) 489

ఉ. నంది మృదంగరావము ఘనస్తనితంబని మ్రోల నున్న యా
స్కందుని వాహనంబగు శిఖండి యఖండితనృత్యమాడ భీ
తిం దన హస్తరంధ్రముగతిం జొరునాభరణాహిరాజి వో
వం దలయూచువిఘ్నపతి భాసురపూత్కృతి మమ్ముఁ బ్రోవుతన్. (జ) 490

సీ. ప్రాకారములయందుఁ బటుగోపురంబుల దామరమ్యద్వారసీమలందు
విపణిగృహంబుల వెలయునాయుధహస్తభటులను హి[తము]గాఁ బ్రౌఢి నిల్పి
రక్షితంబొనరించి రాజబింబ ద్యుతుల్ మించికాయుచు నున్న మంచివేళ
మహిమ నాప్తసుబంధుమధ్యస్థలమునందుఁ జెలఁగి రత్నాసనాసీనుఁడగుచు

ఆ. నర్తకేళిలాస్య నటనాగతులచేత
శాస్త్రసమ్మతముగ జనులకెల్ల
వేడ్క సూపి మఘవవిభవుఁడై కొలువుండ
వలయు విభుఁడు నిఖిలకళలు నెఱిఁగి. (జ) 491

సీ. మొదలిపుష్పాంజలి ముదమునఁ గావించి కరబాళిమొగబాళి సరవులెత్తి,
యురుపృథుబాళము లొగిఁబిల్లమురువును హస్తప్రకణము లే ననువుచఱచి,
కడకట్టుశబ్దంబు కడఁగి దర్వును జిందు బాగైన గీతప్రబంధములును,
కుండలి బహురూపదండలాస్యవిలాస దేశిమార్గంబుల తెరువులెఱిఁగి,
గీ. నయము బిఱుసును, నరిగతుల్ కడిఁది గాను
తిరువుమురువును నిలుకడ తిన్ననగుచు,
పాత్రఁ గొనిపించఁ గొనఁగను బ్రౌఢియైన
వాఁడె నటుఁడనఁబరఁగు నీ వసుధయందు. (జ) 492

సోమయ, పెదపాటి [అరుణాచలపురాణము] (జ)
సీ. అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్గు చదువంగ నేరని సద్ద్విజాతి,
బ్రాహ్మపాద్మాదిపురాణాగమేతిహా సములెఱుంగని బ్రహ్మసంభవుండు
భాట్టవైశేషిక ప్రాభాకరాది శా స్త్రములాఱు చూడని ధరణిసురుఁడు
స్వకులోచితములైన సప్తతంతువులెల్లఁ బార మెయ్దింపని బాడబుండు
తే. కావ్యనాటక లసదలంకార ముఖ్య
విద్యలన్నియు నెఱుగని విప్రవరుఁడు
పంచయజ్ఞంబులును లేని బ్రాహ్మణుండు
వెదకిచూచినఁ బొడమండు వీటిలోన. (జ) 493

క. తఱుముదు రంతకునైనను
వెఱచఱవఁగ భద్రకరుల విఱుతురు హరి ను
క్కఱఁబట్టి చట్ట లేరుదు
రుఱుకుదురు యుగాగ్నినైన నురుభటులందున్. (జ) 494

ఉ. తారకజిచ్ఛిఖండి శివతాండవమాడ నతండు మర్దళో
దార రవంబు మేఘ నినదంబని చేరినఁజూచి నాసికా
ద్వారబిలంబు జన్నిదపు వ్యాళము చొచ్చినఁ దొండమెత్తి ఘీం
కారము సేసి నవ్వువెనకయ్య కృతీశ్వరు మన్చుఁగావుతన్. (జ) 495

సీ. ప్రతిభావిలంఘితభారతబహుకథాఘట్టు నన్నయభట్టుఁ గడు భజించి,
యుభయభాషాప్రౌఢిమోద్యన్మహారాజ్యభాజిఁ దిక్కనసోమయాజిఁ బొగడి,
వాక్ప్రతోషితదక్షవాటీమహాస్థానభీము వేములవాడభీముఁ గొలిచి,
భావబంధ నిబంధ పరమేశబిరుదప్రశర్ము నెఱ్ఱయశర్ము సన్నుతించి,
గీ. భారతీహారు భవదూరుఁ బ్రణుతి సేసి
సుకవికులసోము నాచన సోమునెన్ని,
నవ్యకవితాసనాథు శ్రీనాథుఁ దలఁచి
సరససకలాంధ్రకవుల కంజలి యొనర్చి. (జ) 496

ఉ. బంటుతనంబు వైభవము భాగ్యము తేజము చాలఁగల్గ ము
క్కంటిని దమ్మికంటి నధికంబగు భక్తి భజించి కేలిమైఁ
గంటకులం జయించి కలకాలము నర్థులకోర్కిపంటలై
పంటలుఁబాఁడియుంగలిగి పంటలు మీఱుదు రప్పురంబునన్. (జ) 497

సీ. భ్రమరికావళికప్పు ప్రసవగుచ్ఛభ్రమ ద్భ్రమరకావళికప్పు బాంధవింప,
కరములకెంపును గమనీయహల్లకో త్కరములకెంపు సఖ్యంబు సేయ,
ముఖసౌరభములు నమోఘాతిముక్తక ముఖసౌరభంబులు మొనసి బెరయ,
హాసవిస్ఫూర్తులు నతులవర్ణప్రతి హాసవిస్ఫూర్తులు నణఁగి పెనఁగ,
తే. సారములగు తమ్ముల విలాసములు చూపి
వరుసఁబువ్వులు జట్టికోవచ్చినట్టి
జనుల మనసులు మును తీరు జట్టికొండ్రు
పుష్పలావీవధూటు లప్పురమునందు. (జ) 498

ఉ. రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే
రాజులు రూపరేఖ రతిరాజులు మానగుణంబునందు రా
రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా
రాజులనంగ నొప్పుదురు రాజితతేజులు దత్పురంబునన్. (జ) 499

చ. వలుఁదకుచంబులున్ బవడవాతెఱలున్ మెఱుఁగారుమేనులున్
బలుచని చెక్కుటద్దములుఁ బద్మపుమోములుఁ గంబుకంఠముల్
కలువలఁబోలుకన్నులు వికాసపునవ్వులుఁ జిల్కపల్కులున్
దలిరుల మించుపాదములుఁ దత్పురికాంతల కొప్పు నెంతయున్. (జ) 500

సీ. విపణికోరో యన్న విబుధాచలంబైనఁ దెమ్మనఁ దేని వైదేహికుండు,
పులిజున్నువలె నన్నఁ బొరుగిల్లు సూపక యా క్షణంబున నీని యర్యవరుఁడు,
మహనీయకౌస్తుభ మాణిక్యమునకైన వెలఁద్రెంచనేరని విడ్వరుండు,
గురుతరహాటకకోటికిఁ బడగలు కోటియెత్తని వణిక్కుంజరుండు,
గీ. మందునకునైన లేరు సమగ్రభోగ
భాగ్యసంక్రందనులు జగత్ప్రకట కీర్తు
లర్థి సంపత్ప్రదుల్ నిర్జితార్థపతులు
వర్ణితోదారు లప్పురివైశ్యులెల్ల. (జ) 501

సీ. వ్యాసుని వాల్మీకి వరరుచి వామను బాణు క్షేమేంద్రునిఁ బ్రవరసేనుఁ
గర్ణామృతు మయూరుఁ గాలాంతకుఁ గళింగుఁ గవిదైత్యు శివదాసుఁ గాళిదాసు
భట్టార హరిచంద్రు భట్టనారాయణు భట్టగోపాలుని భట్టబాణు
భాసు భామహు సార్వభౌముని శివభద్రు భారవి భవభూతి భర్తృహరిని
తే. రాజశేఖరుఁజోరు మురారిఁగృష్ణ
మిశ్రు జయదేవు దండి సౌమిల్లు సోమ
చంద్రు దిఙ్నాగు విజయవిశాలదేవు
హర్షుఁ జిత్తపు శాతవాహను సుబంధు
మాఘు మల్హణు బిల్హణు మఱియుఁ గలుగు
ప్రథితగీర్వాణకవులను బ్రణతి సేసి. (జ) 502

సోమయ, పెదపాటి [కేదారఖండము] (ఇ)
ఉ. కన్నియ రూపుఁగోరుఁ, గనకంబులు గోరును దల్లి, బుద్ధిసం
పన్నతఁ గోరుఁ దండ్రి, కులభవ్యతఁ గోరును బంధుకోటి, ప
క్వాన్నపలాదిభక్షణము లన్యులు గోరుదు, లిట్టు లిన్నియున్
బన్నుగ నొక్కచో నొదవె, భాగ్యము సేసితిఁ గన్య నిచ్చెదన్.[16] (జ) 503



సీ. కక్షకటిస్కంధకుక్షిఫాలాస్యంబు లాఱు నున్నతము లయ్యర్భకునకు,
నాజానుబాహునాసాక్షులు దీర్ఘముల్ హ్రస్వముల్ పృష్ఠమేహనగళంబు,
లంగుళీజత్రుకేశాంఘ్రిగుల్ఫములు సూక్ష్మము లధరోష్టనఖరదృగంత
తాలుజిహ్వాకరతలరేఖ లెఱ్ఱన స్వరనాభిసత్త్వముల్ సద్గభీర

తే. ములు, సెమర్పవు మృదువు లంఘ్రులు, కరములు
కఠినములు శంఖచక్రాంక కలితములును,
నైదురేఖలు చెలువొందు నలికతలము,
లక్షణములింత యొప్పునే యక్షయములు. (ఆం) 504

సీ. కెంజాయజడముడి కేశపాశంబును బూపచందురుఁడును బూవుదండ,
యురగకుండలమును దరళతాటంకంబు వనజాప్తుఁడగు కన్ను వాలుఁగన్ను,
ముదురుపున్కలపేరు ముత్యాలహారంబుఁ గడుఁ గొంచెమగు చన్ను ఘనకుచంబుఁ,
బులితోలు దుప్పటి వెలిపట్టుచీరయుఁ బాఁపపెండెంబును బసిఁడియందె,
గీ. మృదువు దెలుపును నగు భూతి మృగమదంబు
నింత యొప్పునె కుడివంక నెడమవంక
నిమ్మహాదైవమునకని యిచ్చమెచ్చి
యర్ధనారీశ్వరుని గొల్చి రఖిలజనులు. (ఆం) 505

సీ. చరియంచువారికి సంకల్పసిద్ధిగా నిర్మించె నెవ్వాఁడు నిజవనంబు?
సార్వకాలిక ఫలసస్యంబుఁ గల్పించి వరముని శ్రేణి నెవ్వాఁడు ప్రోచెఁ?
జీఁకటితప్పు సేసిన నెవ్వఁడొదవించె నింద్రుని తనువెల్ల హేయముగను?
నుర్వీసురశ్రేణి కొరిమ లేకుండంగఁ బలికె నెవ్వఁడు ప్రతాపంబు మెఱసి?
గీ. యట్టి శ్రీవీరశైవాగమాది వేది
యైన గౌతమసంయమి యాశ్రమంబు
పొంత నెంతయు నొప్పారి పొగడ నెగడు
ననఘమానస! శ్రీవైజయంతిపురము. (ఆం) 506

మ. పదలాలిత్యము వర్గశుద్ధియును శబ్దస్థైర్యమున్ మంగళా
స్పద భావంబును రాజయోగ్యతయు దోషస్ఫూర్తిరాహిత్యమున్
సదలంకారవిశేషముం గలిగి విశ్వప్రాణసౌభాగ్య సం
పదమై తేజియ పోలి క్రాలవలదా! పద్యంబు హృద్యస్థితిన్.[17] (జ) 507



సీ. లలిఁగావ్యనాటకాలంకారములు చూచి శబ్దప్రపంచంబు జాడఁదెలిసి
వర్ణోద్భవ వ్యక్తివర్గగ్రహారి మి త్రస్నిగ్ధరూక్షచింతనము లెఱిఁగి
గణరూపదేవతాగ్రహమైత్రి నక్షత్ర మాతృకాపూజాదిమార్గ మెఱిఁగి
జల్లి విక్రియ కాకు పొల్లు వ్యర్థము ద్రాభ విరసంబు గ్రామ్యోక్తి పరిహసించి

గీ. కవిత సెప్పినఁదగుఁ గాక కవిసి నోరి
కొలఁదు లివ్వల నవ్వలఁ గూర్చి తెచ్చి
దిట్టకూళతనంబున వట్టిబిగిని
గావ్యమని చెప్ప మెత్తురే కవిజనములు. (జ) 508

సీ. వనిత యూర్పులచేత వావిలి వికసించెఁ బాటఁబ్రేంకణము లేఁబరువమయ్యె,
నాతుక చూచిన నలువొత్తెఁ దిలకంబు గొమరారె మాటలఁ గొండగోఁగు,
సతిముఖరక్తిచే సంపంగి సొంపెక్కె నవ్విన సురపొన్న మవ్వమలరె,
నెలనాఁగ కౌఁగిట నిగురొత్తెఁ గురవకం బంటినఁ జెలువొందె నామ్రతరువు,
గీ. పొలఁతి పుక్కిటిమధువునఁ బొగడ వొలిచెఁ
గాంతపదసంగమున నశోకంబు విరిసెఁ
గాననములోన జాతి యొక్కటియె తక్క
భూజములుఁ దీఁగలునుఁ బూచి పురువులయ్యె. (ఆం) 509

సీ. వేదాదులగు మహావిద్యలన్నియుఁ గూడి మూర్తిమంతంబులై మొనసి కొలువఁ,
గ్రతుమరీచ్యంగిరఃకణ్వాదిసంయముల్ పలుమాఱుఁ గనుసన్నఁ బనులు సేయ,
సురసిద్ధకిన్నరగరుడవిద్యాధర యక్షాదు లంతంత నభినుతింప,
నారదవిశ్వసనత్కుమారాంగిర శ్శతరుతు లుభయపార్శ్వముల మెఱయ,
గీ. భాషతోఁగూడి యానందభరితుఁడగుచు
సత్యలోకేశ్వరుండందు సంస్తుతింప
నిమ్మహాసృష్టికెల్లను నితఁడు కర్త
చూడుమీ! బ్రహ్మలోకంబు సుభగమూర్తి! (ఆం) 510

సీ. హరి యురస్స్థలిఁబోలెఁ గర మొప్పఁ జూచితే భాసురకమలాధి వాసమగుచుఁ,
ద్రిదివంబుఁబోలె నొప్పిదమయ్యెఁ జూచితే మకర కచ్ఛప మహా మహిమ గలిగి,
గగనంబువోలె నక్కజమయ్యెఁ జూచితే రాజహంసస్ఫూర్తి రమణఁ గలిగి,
యాశాతటమువోలె నసలారెఁ జూచితే బంధుర కుముదవిభ్రమము గలిగి
గీ. యతిమనోహర మందమారుత విహార
లోల కల్లోలమాలికాందోళకేలి

కలితబహువిధ ఖగసముజ్జ్వలత గలిగి
యమరెఁ జూచితె యీ సరోజాకరంబు. (ఆం) 511

సోమయ, పెదపాటి [త్రిపురవిజయము] (ఆం)
సీ. భూరివిశ్వంభరాభూతంబు రథము, త ద్రథమధ్యమునఁ బొల్చు ఱాయి విల్లు,
విల్లువెంబడిఁ దిర్గువెలుఁగులు చక్రముల్ చక్రారికులపతి చారు నారి,
నారిఁ బట్టఁగఁ బాఱు నాగరకపు గఱి గఱిమీఁద విహరించు ఘన శరంబు,
శరము నాభిని గన్న శతవృద్ధు సారథి సారథి మాటలు సైంధవములు,
ఆ. గాఁగ నేఁగి వేగ గడఁకతోఁ బురములు
గెల్చి వచ్చి గెలుపు గిరిజతోడఁ
జెలఁగి చెలఁగి చెప్పి చెలువొందుశంభుండు
గాచుఁగాత! మనలఁ గరుఁ తోడ. (ఆం) 512

సోమయ, పెదపాటి [శివజ్ఞానదీపిక] (జ)
సీ. కవగూడి నడక సాఁగని బండికండులు దొమ్మిది తునుకల తొడుసు తేరు,
పెక్కుబ్రాహ్మణులచేఁ జిక్కినగుఱ్ఱమ్ము చిలుకుట నఱిగిన చివుకు టిరుసు,
బహుముఖ విభ్రాంతిఁ బడలిన సారథి వినువీథి నఱిగిన 4వీఁగు విల్లు,
పదిబ్రద్దలై యొడ్డువాసిన బాణంబు పొరలెత్తిపోయిన బోలు నారి,
తే. పట్టఁబస లేదు సాధనప్రకరశక్తి
విషమశబ్దంబులైనట్టి విమతపురము
లెల్ల సాధించి గెల్చితి వేక హేల?
బావు! త్రిపురాంతకేశ్వర! భక్తవరద! (జ) 513

సీ. బవరాన సూతుఁడై పార్థున కాతండు నచ్చినాఁ డీతండు మెచ్చినాఁడు,
చంచత్కృపాస్ఫూర్తిఁ బంచాస్త్రు నాతండు పెంచినాఁ డీతండు నొంచినాఁడు,
శేషపన్నగరాజు సెజ్జగా నాతండు వ్రాల్చినాఁ డీతండు దాల్చినాఁడు,
హాలాహలముఁ జూచి యల్లంత నాతండు చెంగినాఁ డీతండు మ్రింగినాఁడు,
తే. చక్రి యాతండు వసుమతీచక్రి యితఁడు
నవనపరుఁ డాతఁ డీతఁడు హరణపరుఁడు
విశ్వమయుఁ డాతఁ డీతండు విశ్వనాథుఁ
డనుచు హరిహరనాథుల నభినుతింతు.[18] (జ) 514

క. సుకవులు పలుకఁగఁ గెళవులు
కుకవులు దా రఱతు రౌర! కొలఁకుల భ్రమర
ప్రకరము ఝంకారింపఁగ
‘బెకబెక’ మనకేల మాను భేకము లవలన్. (జ) 515

సోముఁడు [వసంతవిలాసము] (జ)
శా. ప్రాలేయప్రతిసీరసేనఁబఱపెన్ బైపై వసంతంబిలన్
గాలోన్మీలిత కోరకోదరపరాగ ప్రౌఢ కోపాగ్నియై
హాలాపాన విహారపౌరమహిళాలంకార దోస్సారమై
హేలాపల్లవ హేతిఖండిత మహాహేమంత సామంతమై. (జ) 516

సోమేశ్వరుఁడు, పాలపర్తి [?] (జ)
సీ. తలకమ్మికొండయు విలుకమ్మికొండయుఁ గడయును నడుముగాఁగలుగు తేరు
సరసిజ ముకుళంబు సద్వాక్యసకలంబు మాతయు నా లగు మాతలియును,
మిన్నులఁ జనువాఁడు కన్నుల వినువాఁడు నంకపర్యంకంబులైన శరము,
చల్లనిపవనంబు నెల్లైనభువనంబు మేపును మోపుగా మెలఁగు నారి,
ఆ. కాఁక కోర్చువిల్లు గఱిగల గుఱ్ఱాలు
పగలు రేయుఁదిరుగు బండికండ్లు
గలుగఁ బురజయంబు గైకొన్న నినుఁగొల్తు
చిరశుభాంక! సోమశేఖరాంక! (జ) 517

సీ. వింటిక్రిందటికొమ్ముఁ వికలించి పెఱికిన భూకాంతకును నాభి పొలుపు మిగిలె,
నమ్ముపుచ్చుకొనఁగ నమిత తరంగముల్ పాలసంద్రంబునఁ బ్రజ్వరిల్లె,
బండికండులు రెండు పండ్లిగిలించినఁ గలువలు దామరల్ చెలిమి చేసె,
వాజులఁగొనివచ్చి వర రథంబున బూన్పఁ జిచ్చుకు నాఁకలి చిచ్చు వుట్టె,
గీ. నారి సంధింపఁ గశ్యపునారి వడఁకెఁ
గోల సంధింప లచ్చికి గోల పుట్టె
విల్లుఁదెగఁబాపి పురములు ద్రెళ్ళనేసి
తరిది విలుకాఁడ వౌదు వో శరభలింగ! (జ) 518

హరిభట్టు [ఉత్తరనృసింహపురాణము] (జ)
సీ. మందారకుసుమంబుఁ జందురుండును గూడి మౌళిభాగంబునఁ గీలుకొనఁగ,
ఫణిమండలంబును మణికుండలంబును గండభాగంబునఁ గప్పుకొనఁగ,
వరచక్రశూలాబ్జ వరదహస్తములందుఁ గంకణ భుజగ కంకణము లమరఁ,
గనకకౌశేయంబు గజరాజచర్మంబు మునుకొని కటిభాగమున నటింపఁ,
గీ. దిమిరమును జంద్రికయు జోక నమరినట్లు
పుండరీకోత్పల ద్యుతు ల్పొదివినట్లు
నీలవజ్రంబు లొకచోట నిలిచినట్లు
హరిహరాకృతి త్రిభువనానందమయ్యె. (జ) 519

? [అన్నదానమహత్త్వము]
గీ. ఆదిమూర్తి మహాలక్ష్మి యప్పురంబు
సొల్చి నిల్చిన వారాశి చూడ వచ్చి
కోట సొర రాక కూఁతుపైఁ గూర్మిఁ జుట్టు
పాఱియున్నటు లొప్పారి పరిఖ మెఱయు. (?) 520

గీ. మహిత సన్మార్గ వర్తన మాన్యులనఁగఁ
బొలుచు నినరాజగురు కవిబుధులనైనఁ
దగులువడఁ జేయు పెంపునఁ దనరు వీటి
కొమ్మలకు సాటియై కోటకొమ్మలమరు. (?) 521

? [ఇంద్రసేనము] (ఆం)
చ. పుడిసిటిలోన డొంకి కడుఁబొల్పఱి యమ్మున నింకి చల్లినన్
గడపలఁ గానవచ్చి వెసఁగైకొని త్రచ్చిన రొల్లఁజొచ్చి య
జ్జడనిధి భంగపడ్డఁ గని స్రష్ట యపాయములేని వార్ధిఁగాఁ
గడఁగి యొనర్చె నోయన నగడ్త పొగడ్తల నొప్పు నప్పురిన్. (ఆం) 522

? [కామందకము] (జ)
క. అరుణుడు కిరణము[ల] సం
చరణంబుల వాయ కెపుడు చరియించుగతిన్

జరజనులచేత నృపతియు
నురుగతి జగమెల్ల నెఱిఁగి యుండఁగ వలయున్. (జ) 523

? [నీతిసారము]
సీ. ఒనరంగఁ గమలంబు నుపహారసంధియు సంతానసంధియు సంగడంబుఁ,
జాల నుపన్యాససంధియు ................. ......సంధియు యోగసంధికమును,
బుష్పాంతరాదృష్ట పురుషనామకములు నాదిష్టకంబును నాత్మమిషయు,
బంధురోసగ్రహసంధి పరిక్రియ సంధియు నుచ్ఛిన్నసంధికంబు,
ఆ. ననుపమ పరదూషణాంచిత స్కంధోప
నేయసంధులనఁగ నిశ్చితముగ
షోడశప్రకార సునిశితసంధి వి
ధానమెఱుఁగవలయు ధరణిపునకు. (?) 524

శా. నానాశాస్త్రవిశారదుండు నయనానందాంగుడున్ సత్కుల
స్థాన శ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్ఛుద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడును నిశ్చింతుండునై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని చెప్పన్ వచ్చు నుర్వీస్థలిన్. (?) 525

క. పతి కలిగి తానె పొలియును
బతి నలిగించు [టనుఁ] దనకె భంగము వచ్చున్
బతిమతమె కాని భటునకుఁ
బతితో నాగ్రహము చనదు బద్దెనరేంద్రా! (?) 526

క. పతిచీర లట్టి చీరలు
పతితొడవులఁ బోలుతొడవు పతిగతివేష
స్థితియును సేవకులకుఁ దగ
దతిధనయుతు లైన ననుఁగు లైనను సభలోన్ (?) 527

సీ. బలుగాపు వాకిళ్ళఁ బగలు రేయును నిడి కోటఁ బాళెముఁ దగుచోటఁబెట్టి,
కనుమట్లనెల్ల[?] కావలి నియమించి నడిమి చావఁడిదగు నరుల నునిచి,
నగరిచుట్టును జాలె నడిపించి క్రంతలఁ దిరుగుచుఁ దగఁ దలవరుల నునిచి,
దిన[?] బాళెముల్ దృష్టి వెట్టుచుఁ గేల దివియలు విడువక తిరుగఁజేసి,

ఆ. దొరలు రాజులందు నరయుచు భటులందు
భేద మొదవకుండ నాదరించి
యుచితవృత్తిఁ గావకుండిన దుర్గంబు
నేలఁగలఁడె భూమి నింద్రుఁడైన? (?) 528

? [పంచతంత్రము] (జ)
గీ. అన్యదేశమెల్ల నాత్మదేశంబ కాఁ
దలఁచువాఁడు నెపుడు తలఁకు లేక
రణము సేఁత యెల్ల రాజ్యంబుసేతగాఁ
దలఁచువాఁడు ప్రియుఁడు ధరణిపునకు. (జ) 529

చ. చెలువుగ దుష్కరంపుఁబని సేసియుఁ జేసితినాక, క్రూరతం
బలుమఱు వ్రేసినం గడవఁ బల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక, పల్కు చొప్పిదము తథ్యముగాఁ దగఁబల్కి మోసలన్
బిలువక వచ్చియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్ని భంగులన్. (జ) 530

క. బలుకొఱడువోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్. (జ) 531

క. మానుగఁ బతి వనిచినఁ దన
చే నది గాదనక వేగ సేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిని భృత్యుల్. (జ) 532

? [పురాతనచరిత్రము] (ఆం)
క. చీటికి మాటికి వెలువడి
హాటకమయ వప్రమెక్కి యహికన్యలు మి
న్నేట విహరింతురనినను
గోటపొడువుఁ బరిఖలోఁతుఁ గొలఁదియె పొగడన్. (ఆం) 533

? [రంగనాథశతకము] (ఆం)
సీ. కురులు తుంపెసలాడఁ గ్రుమ్ముడి యరవీడఁ గుచ కుంభ యుగళంబుఁ గునిసియాడఁ
గటియుగంబు నటింపఁ గౌను కంపముఁబెంప సరు లురంబున గల్లు చౌకళింపఁ
గనుజంకె లొఱపెక్కగగు రంగముల నిక్కఁ గర్ణపత్రము లాటగతులకెక్కఁ
గంకణంబులు మ్రోయఁ గలనాద మెసపోయ రశనా కలాపంబు రట్టు సేయ
ఆ. నటునిరీతి వీరభటుని చందంబున
గమ్మవిలుతు కీలుబొమ్మ కరణి
నుపరిభాగకేలి నొప్పె దాఁ గావేరి
రంగవిభుని గూడి రాజవదన. (ఆం) 534

? [‘రామా! రాజచూడామణీ’] (ఆం)
శా. అజ్ఞాన ప్రబలాంధకార తరుణోద్యద్భాను తేజోనిధుల్
ప్రజ్ఞా పావనపుణ్యసద్గుణ పయః ప్రస్ఫీత భాగీరథుల్
విజ్ఞానోజ్జ్వల చంద్రికామృతకరుల్ వీక్షింపఁగా నొప్పు బ్ర
హ్మజ్ఞాను ల్భవదీయ సేవకులు రామా! రాజచూడామణీ! (ఆం) 535

శా. కంథాధారులు చర్మధారుణపరుల్ కాపాలికుల్ దుష్క్రియా
పాంథు ల్మిమ్ము భజింపనేరక వృథాపాషండులైనారు స
ద్గ్రంథార్థాప్రతిమానవాదనులు [?] సత్కావ్యప్రవీణుల్ మహా
మాంధాళుల్ భవదీయ సేవకులు రామా! రాజచూడామణీ! (ఆం) 536

మ. కనకంబుల్ వెదచల్లు వా రభయముం గైకొంచు మేలందు వా
రనురాగంబునఁ గామినీమణులతో నానందముం బొందు వా
రనుకూలించిన పుత్త్ర పౌత్త్రతతులన్ హర్షించు వారెల్ల ము
న్మనసారన్ నినుఁగొల్చినారు రఘురామా! రాజచూడామణీ! (ఆం) 537

శా. చంకం గొల్లఁడు మేఁకపిల్లనిడి తచ్ఛాయాకృతుల్ నీటిలో
శంకం గన్గొని నూతఁబడ్డగతి శాస్త్రంబు ల్వితర్కించి హృ

త్పంకేజంబున నిన్నుఁ గానక మనస్తాపంబున న్మూఢులై
మంకుల్ గొందఱు గాథఁ దప్పుదురు రామా! రాజచూడామణీ! (ఆం) 538

మ. తినదే చెట్టలు యాకు మేఁక, గుహగొందిన్ పాము నిద్రింపదే,
వనవాసంబునఁ బక్షులన్ మృగములన్ వర్తింపవే, నీటిలో
మునుఁగం జూడవె మత్స్యకచ్ఛపములున్, మోక్షార్థులై ముక్తికిన్
మనసే మూలము నీదు భక్తికిని రామా! రాజచూడామణీ! (ఆం) 539

మ. పరమార్థజ్ఞుఁడు సర్వభూతచయమున్ బ్రహ్మస్వరూపంబుగాఁ,
బరకాంతామణిఁదల్లిగా నహితునినే బ్రాణోక్తబంధుండుగాఁ,
బరికించున్ సమలోష్టకాంచనమతిన్ భావింపఁడాత్మన్ జరా
మరణ క్లేశభయంబు నొంది రఘురామా! రాజచూడామణీ! (ఆం) 540

మ. బుధధాత్రీజ వికాసముల్ గుణలతాభోగ ప్రియావాసముల్
మధురస్త్రీ సుఖహాసముల్ పికవచో మాధుర్య విన్యాసముల్
విధురప్రాయ తుషార భాసములు విద్విడ్భాతి సంత్రాసముల్
మధుమాసంబులు నీ విలాసములు రామా! రాజచూడామణీ! (ఆం) 541

మ. రణరంగంబున వజ్రకాయమున సంరక్షించు సంసార దా
రుణ బేతాళభయంబు పాఱ నణఁచున్ రోగాగ్ని సంతాపమున్
క్షణమాత్రంబునఁ బాయఁజేయవె భవత్కల్యాణ నామావళుల్
మణిమంత్రౌషధసేవ పుణ్యులకు రామా! రాజచూడామణీ! (ఆం) 542

గ్రంథనామము, కర్తనామము తెలియరానివి
సీ. అఖిల లోకానందుఁడగు చంద్రుఁ డెందేనిఁ గలిగె నుజ్జ్వలఫేనకంబు మాడ్కి,
నైరావతాదిమహాకరు లెందేనిఁ బ్రభవించె మకరశాబముల పగిదిఁ,
గమనీయసురతరుసముదయం బెందేని జనియించె శైవాలచయము భంగి,
భువనైకమాత మాధవుపత్ని యెందేనిఁ బొడమె మాణిక్యంపుబొమ్మ పోల్కి,
గీ. నాది మత్స్యకూర్మములు విహారలీలఁ
దనరు నెందేనిఁ బ్రకృతిసత్త్వముల కరణి
నట్టి యంభోధి యొప్పారు నద్భుతైక
సారమహనీయమహిమ కాధార మగుచు. (ఆం) 543

మ. అతి మాధుర్యమనోజ్ఞ చూతఫల మాహారంబుగాఁ గల్గియున్
మతి గర్వింపక కోకిలంబు వలుకున్ మంజూక్తి, జంబాల దూ
షిత నీహారముఁ గ్రోలి భేక మఱచున్ జృంభించి యాకర్ణ [న]
స్థితిఁ గాఠిన్యము దోఁపఁగా ‘బెకబెక’ స్పీతకులారావముల్. (జ) 544

మ. అనిలోద్ధూత పరాగరేఖలు సముద్ధ్యచ్చంచలా లీలఁగా,
ఘనమత్తాలి గభీరగానరవముల్ గర్జావిభూతిం దన
ర్ప, నమందంపు మరందబిందుతతి వర్షస్ఫూర్తి నొప్పారఁగాఁ
దనరెం గారుమొగిళ్ళ, పెల్లున [ను] నుద్దండోత్పలవ్రాతముల్. (జ) 545

గీ. అమరనాయకు కొలువుకూటమున యందుఁ
గరము విలసిల్లు వెలిపట్టుఁ దెరయపోలెఁ
జెలువమై తూర్పుదిక్కునఁ దెలుపు దోఁచెఁ
బ్రజలకెల్లను గన్నులపండువగుచు. (ఆం) 546

గీ. అమరు లమృతాబ్ధి లోపలి యమృతరసము
వెండిచేరులఁ బటికంపుఁగుండఁగట్టి
చేఁదుకొనియెదరో నాఁగ శీతరోచి
మెల్లమెల్లన రుచులతో మిన్ను వ్రాఁకె.[19] (ఆం) 547

ఉ. అరయక మున్ను పుష్పవతియైన లతాసతిముట్టి యంబుజా
కరముల నీళ్లులాడి మఱిఁగ్రమ్మఱ ముట్టెదమొక్కొ యన్వెఱం
బొరిఁ బురవీథులం దెరలఁబోవక మెల్లనఁ బోవునట్టివై
పరిమళ శైత్యమాంద్య సులభంబుగఁ బల్మఱు వీచుఁ దెమ్మెరల్. (ఆం) 548

శా. ఆనందాశ్రుల నగ్నినిల్చె నొకొ నా నల్లాడు దృగ్దీధితుల్
మానం బుష్పమధుప్రసంగము కడున్ మత్తిల్లెనాఁ గ్రుమ్ముడుల్
జానై క్రాలఁగ మంథరస్థితి నిజేచ్ఛన్ షోడశావస్థలున్
బూనం బొందఁగఁ దద్దయొప్పి రరుణాంభోజాక్షు లున్మత్తలై. (ఆం) 549

ఉ. ఆరయ జీవనంబమృత, మల్లుఁడు దేవర, సొమ్ములన్నియున్
సారపురత్నముల్, కొడుకు చంద్రుఁడు, కూఁతురు లక్ష్మి, యాలు భా
గీరథి, తా సముద్రుఁడని కీర్తన సేయుదు రెల్లవారు నా
క్షీరపయోధి, నన్యులకుఁజెల్లునె యిట్లు సమస్తభాగ్యముల్. (ఆం) 550

శా. ఆ రాజాస్యలు గాంచి రయ్యెడ సముద్యల్లోల కల్లోల సం
చారోద్ధూత నవీనఫేన దరహాసస్ఫారమున్ నిర్జరా
హార శ్రీకరవారిపూరము ఖగవ్యాపార విస్తారమున్
బారావార గభీర మున్నత మహాపారంబుఁ గాసారమున్. (ఆం) 551

చ. ఇరవున గోపురాగ్రముల నెత్తిన కేతనవాత పూరణో
త్కరము వియన్నదీజలము గ్రాయుచు వాతహతిం దదంబు శీ
కరములఁ జల్లుటన్ జలదకాలముగాఁ గొనియాడు నెప్పుడున్
బురిని నెముల్ ప్రమోదగతి భూరిహిరణ్మయ హర్మ్యవేదులన్. (ఆం) 552

ఉ. ఈఁకలు నల్లనైనవని యెంచి విశాల రసాలశాఖ యు
త్సేకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్
గోకిల రీతినుందు ననుకొన్నను నంటివి కాక పాపపుం
గాకమ! నీకు నమ్మధురగానము గల్గునే యెన్ని వల్కినన్! (జ) 553

గీ. ఉదయరాగ మించించుక యుజ్జగించి
నిండుచంద్రుండు కన్నులపండువయ్యె
ధావనాంతర స్నిగ్ధ దాక్షిణాత్య
రాజశుద్ధాంత దంతవజ్రముల కాంతి.[20] (ఆం) 554

ఉ. ఏచి తలిర్చి గొప్పలగు నెఱ్ఱనిపూవులతోడి బూరుగున్
రాచిలు కర్థిఁజేరి మధురంపు ఫలంబుల నాస సేసినన్
జూచి నిరాశయై చనిన చొప్పగు నల్పుల నాశ్రయించినన్
... .... .... ... ... (జ) 555

గీ. కడలుఁజేతు లార్చుచు ఫేనఘనత రాట్ట
హాస రుచితోఁ బ్రవాళజటాలివిచ్చి
యౌర్వశిఖి ఫాలలోచన మనఁగ సింధు
వమలుఁ దాండవ మాడెడు హరునిఁ బోలి.[21] (?) 556

సీ. కదళికా కాండయుగ్మము మీఁద నెట్టొకో నిద్దంపుఁబులినంబు నెలవుకొనియె?
జలజాకరంబులో మొలచి యే గతి నొక్కొ తోఁతెంచె మవ్వంపు ధూమరేఖ?

బయలుపై నే మాడ్కిఁ బదిలమైనది యొక్కొ కొమరారు నవహేమ కుంభయుగళి?
మొలకచందురుమీఁద నిలిచి యే క్రియనొక్కొ బలసి క్రాలెడు నోలి నలఁతియిరులు?
గీ. జగతి నరు దనఁదొడలును జఘనతలము
నాభియును నారు నడుముఁజన్గవయు నుదురు
నలకములయొప్పు వర్ణింప నలవియగునె
రాజబింబాస్య చెలువంబు రాజతనయ! (ఆం) 557

మ. కనియెన్ దుర్గమ సానురింఖణ తురంగగ్రావణా నూరువున్
దిననాథద్యుతి పుంజభంజనల సద్దీపితిచ్ఛటాచారువున్
కనదభ్రంకషతుంగశృంగ విహరద్గాయన్మరుద్భీరువున్
దనుజారిస్థితి భద్రదారువును దద్వందారువున్ [?] మేరువున్.[22] (ఆం) 558

మహాస్రగ్ధర. కని రుగ్రగ్రాహనక్రగ్రహణ ఘుమఘుమాకార కల్లోల డోలాం
చన బద్ధాందోళకేళీ సరభసఫణభృచ్చారుజూటాగ్ర జాగ్ర
ద్ఘన రత్నోదంచదత్యుత్కటకుటిల మయూఖచ్చటాటోప మిథ్యా
జనితౌర్వారంభ శుంభత్సలిల నివహ నిస్తంద్రు రత్నాకరేంద్రున్.[23] (ఆం) 559

గీ. కన్నుఁగవఁ గాటుకయు బోటికచ్చడంబు
భూతి రుద్రాక్షమాల త్రిపుండ్రకములు
ధవళదంతవాటికాస్థాపుటములు
నంగవికృతియు సజ్జాతిభృంగిరిటికి. (ఆం) 560

చ. కమలిని యించుకేని యెసఁగం గనుమూయదు లోన నవ్వెడిం
గుముదిని రాగపల్లవిత కోమలశీతలధాముఁ డంబరాం
తముఁ గబళింపఁ జొచ్చెనని తాను నవాంగనవోలె సిగ్గునన్
శమితము సేసె నల్లన నిశాసతి ప్రొద్దను గేహదీపమున్. (ఆం) 561

చ. కలఁగిన పూఁతయున్ నుదుటికస్తురనంటిన కుతలంబులున్
బలసినయూర్పులున్ గలిగి పాన్పుఁ గరంబున నూఁది మూఁపు నం

దలక భరంబు పూని గనయం బొకచే నమరన్ రతాంత వే
ళల శయనంబు దిగ్గుసతులన్ వనజాక్షుండుఁ పొందె వెండియున్. (ఆం) 562

సీ. కలకంఠమదకీరకలకలధ్వనులతో బెడఁగుగా నెలవీరు విడిసె మరుఁడు,
మరుధనుర్జ్యావల్లి మొరపంబుగతి లతామంటపంబుల నించె మధురరవము,
మధుపరవోల్లసన్మంజరీమకరంద సురభిగంధంబులు నెరసె దిశల,
దిశలెల్లఁదానయై తిరిగె బంధుశ్రేణి కంపింప దక్షిణగంధవహుఁడు,
గీ. వనములెల్లను గ్రొత్తజవ్వనముఁ దాల్చె
దళితహేమంతగర్వమై వెలసె నెండ
సతుల హిందోళగానంబు లతిశయిల్లె
రాగకరమైన నవవసంతాగమమున. (ఆం) 563

గీ. “కాంత! నీ మోముఁబోలమిఁ గందె నిందుఁ
డీసువాఁడని కినియకు మింక” ననుచు
బ్రార్థనము సేయుచున్ మ్రొక్కునట్టి యుడుగ
ణంబొకో నాఁగ సతిపాద నఖము లమరు. (ఆం) 564

చ. కుసుమశరాళి బాసటము గొల్పిన కైవడిఁ దమ్మి ఱేకులం
గసిబిసి సేసి క్రాలు తెలిగన్నులఁ గజ్జల మిడ్డ బ్రహ్మ న
ల్వెఁగఁగ గండుమీల సృజియించుతఱిన్ ఋజులేఖ క్రొత్త య
భ్యసనపు నీలినూ ల్మడఁచినట్లు మృగాక్షికి నొప్పు నెంతయున్. (ఆం) 565

సీ. కొండంత హేమకోదండంబు విలసదహీనగుణంబున నెక్కు వెట్టి,
హరినీలమణి కాంతియగు నమ్ము శరధిపొం దెడలించి వలచేత నేర్చిపట్టి,
స్వరముల సకిలించు వారువంబుల గుణాధారభూతంబగు తేరఁబూన్చి,
నలుదిక్కులును జూడ్కు లొలయంగ సకలంబుఁ గను వాని సారథిగా నొనర్చి,
గీ. కడఁగి రథచక్రములు తన కన్నులట్ల
యేమఱక యేఁగఁద్రిపురంబులేర్చి సకల
లోకములు నెమ్మిఁ బ్రోచు పినాకపాణి
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత! (ఆం) 566

మ. క్షయకాలంబున సీధుసాగరరసాస్వాదాతిరేకంబునన్
నయనాబ్జంబులు ఘూర్ణితంబులుగ సంధ్యాకాళరాత్రీకర

ద్వయ తాళానుగతిం బ్రమోదమున మత్తల్లీ మహానృత్యముల్
ప్రియ మొప్పారఁగఁ జేయు భైరవుఁడు గల్పించున్ మహైశ్వర్యముల్.[24] (ఆం) 567

సీ. గండపాళికలును గన్నులుఁ దెలుపెక్కెఁ దోరంబులయ్యెఁ బెందొడలు నడుము,
గతియును దీపనస్థితియు మాంద్యముఁ దాల్చెఁ బృథలత మించె నాభియును బిఱుఁదుఁ,
జను ముక్కులును నారుఁజాల నీలిమ నొప్పె సన్నంబులయ్యె వాచవులుఁ దనువుఁ,
గోర్కులు నూర్పులుఁ గొనలు సాగఁగఁ జొచ్చెఁ దలసూపె నిదురయు నలసతయును,
ఆ. సిగ్గు వదలెఁ బుట్టెఁ జిట్టుము లుప్పొంగె
వింతకాంతి యోకిలింత లడరె
నర్కవంశతిలకమైన కుశధ్వజు
నువిద కపుడు గర్భ మొదవుటయును. (ఆం) 568

గీ. గజ్జపరిద్రొక్కెఁజూపె భాగడవిధంబు
గీతమున కాడెఁ జేసె సంకీర్తనంబు
పాడె సూళాదిగీత ప్రబంధవితతి
భృంగి పంచాంగకంబైన పేరణమున. (ఆం) 569

సీ. గొజ్జంగివిరులపైఁ గుప్పించుఁ కుప్పించి కన్నె గేదఁగులపై గంతు గొనును,
వకుళగుచ్ఛములపై వర్తించు వర్తించి పున్నాగతతులపైఁ బూన్కి నెఱపు,
గురువెందపొదలపైఁ గ్రుమ్మఱుఁ గ్రుమ్మఱి విరవాదిలతలపై విశ్రమించు,
మల్లికావలులపై మసలాడు మసలాడి సురపొన్నతరులపైఁ బొరలు వెట్టు,
గీ. ననుదినము నిట్లు పుష్పవాసనలఁ దేలి
యంగజాభంగరతులందు ననఁగి పెనఁగి
యలసిపడియున్న జనముల యలఁత మాన్పు
మలఁగి యప్పురిఁ బ్రాభాతమారుతంబు. (ఆం) 570

మ. గ్రహయుక్తంబయి ఫేనతారకలచేఁ గన్పట్టి మందాకినీ
సహితంబై ధ్రువలక్ష్మిచే నమరుచున్ సర్వాతిరిక్తంబునై

బహుభూతంబులఁ దాన లోఁగొనుచు శబ్దస్థానమై యద్భుతా
వహమై విష్ణుపదత్వ మేర్పడఁగ నవ్వారాశి యొప్పుం దగన్. (ఆం) 571

సీ. చందనం బలఁదిన సౌభాగ్యలీల మైఁ బూసిన కస్తూరిపూఁతతోడ,
వికలియై విరిసిన నఖరేఖ వ్రణముతో వీఁగాడు కుచముల వ్రేఁగుతోడఁ,
జుంబించి విడిచిన బింబాధరంబుతో మూలవదలు పుష్పమాలతోడ,
నన్నువనడుము దా నసియాడుచుండంగ వదలిన గనయంబు నదిమికొనుచుఁ
ఆ. దొడలు నడుగులుఁ దడఁబడఁ ద్రొక్కికొనుచును
దలుపు దెఱచి యొక్కతయు లతాంగి
సురతసుఖములెల్ల సుభగున కొప్పించి
మారుతార్థి యగుచు మగుడి వెడలె. (ఆం) 572

ఉ. చుక్కల నెయ్యపుం దగవు సూచిన యామిని కూర్మి సూచినన్
జక్కన నాథు దీనతకుఁ జాలక మున్కడు నస్తమించె న
మ్మక్క! శిలావిశేషము గదా! శశియశ్మము నీలరోచి గా
దొక్కొకలంక నొల్లనని యోర్చిఁ దదీయ వియోగదుఃఖమున్? (ఆం) 573

గీ. తనరి రాగిల్లి ముక్తుఁడై తరతరంబ
నిర్మలత్వంబుఁ బొందుచు నీరజారి
పరమయోగియుఁ బోలె సత్పథమునందు
నడవఁగాఁజొచ్చె గువలయానంద మెసఁగ. (ఆం) 574

సీ. తమకు ముందఱ నింకఁ దలవంపు లౌనని నాతి చన్ముక్కులు నల్లనయ్యెఁ,
దన యౌవనార్థ మింతటఁ దీఱునో యని పల్లవాధర మోము తెల్లవాఱెఁ,
దనయులు లేరని తరుణి రోసినమాడ్కి నింతికెంతయు నోకి లింత లొదవెఁ,
దన వంశమెల్ల వర్ధనమొందు తెఱఁగునఁ బొలఁతి నెన్నడుమంతఁ బొదలఁదొడఁగె,
గీ. నడపు జడనయ్యె వెడనిద్ర దొడఁకఁజొచ్చె
దప్పి మోమునఁజాలఁగ నుప్పతిల్లె
జెలువ యొప్పారె నా గర్భచిహ్నలందుఁ
బేద పెన్నిధిఁ గాంచిన ప్రియము దోఁప. (ఆం) 575

సీ. తస్కరశత్రుభూధవసర్పవృశ్చిక శార్దూలభల్లుకసలిలపవన
వహ్నినవగ్రహవారణవిషరోగ దివిజాంతకాసుర వరమహాఘ

శాకినీబ్రహ్మరాక్షసభూతబేతాళ కూశ్మాండధారిణిక్రూరశస్త్ర
దారిద్ర్యదుర్భిక్షదారుణదుస్స్వప్న దుశ్శకునోత్పాతదుష్టమృత్యు
గీ. ఘోరసంసారభవభయాపారదుఃఖ
సమితి నిర్జించి రక్షింపఁ జాలు నీదు
భవ్యపంచాక్షరీమంత్ర పఠనశక్తి
భానుశతకోటిసంకాశ! పాణికేశ! (ఆం) 576

సీ. తిమిరభూతముసోఁకు దెలియ జగత్త్రయీ లలన దాల్చిన రక్తతిలక మనఁగ,
సఖ్యంబునకు నిశాశబరి యిచ్చినఁ బ్రాచి పాటించు గురివెంద బంతి యనఁగఁ,
దోయధి వెడగ్రుంకఁదోఁచు పురందర కుంభినీ సింధూర కుంభ మనఁగఁ,
గులిశాయుధుని పెద్దకొలువునఁ జెన్నొంద దీపించు మాణిక్యదీప మనఁగఁ,
గీ. గుముదినీ రాగ రససిద్ధ గుటిక యనఁగఁ
గాము జనరంజనౌషధి కబళ మనఁగఁ
బొడుపుఁగెంపున బింబంబు పొలుపు మిగులఁ
జంద్రుఁ డుదయించెఁ గాంతి నిస్తంద్రుఁ డగుచు. (ఆం) 577

సీ. తుహినధాత్రీధరోత్తుంగగాత్రస్ఫూర్తిఁ బరిపూర్ణచంద్రికాప్రభలు మాయఁ,
గఠినబంధురతరస్కందఘంటాధ్వని నదిరి దిశావలి యెదులు మ్రోయఁ,
బవిచండనిష్ఠుర పటుపాదఖుర హతిఁ బఱిపఱియై మహీభాగ మగల,
వరభోగ భోగీంద్ర వాల వాతోద్ధతిఁ జెదరి ధారాధరశ్రేణు లవియ,
గీ. వర్ణితాయత శృంగతీవ్రక్షతములఁ
బెల్లుకొని పద్మజాండంబు బెల్లు లొలయఁ
జండగతి వచ్చు కైలాసశైల మనఁగ
నెసఁగు పడివాగెతో వృషభేంద్రుఁ డమరె. (ఆం) 578

చ. ద్విగుణసరోజమయ్యె సుదతీజనచారుముఖవ్రజంబుచేఁ
ద్రిగుణిత మీనమయ్యె యువతీజనలోచనపంక్తిచేఁ జతు
ష్ప్రగుణిత కోకమయ్యె రుచిరప్రమదాననరాజిచే నదం
బగణిత షట్పదప్రకరమయ్యె సతీకుటిలాలకాలిచేన్. (ఆం) 579

చ. నెఱఁకులయందుఁ గ్రిక్కిఱిసి నిండిన పొంపిరి నిక్కుపట్లు ద
గ్గఱుటయు నూరడించి తమకంబున నెవ్వరికన్న వేడ్కఁ ద
త్తఱ వెస మీచి పట్టుకొను తౌలము లొండొరుఁ జుట్టుముట్టి త
మ్మెఱుఁగని సంగమక్రియ మహీతలనాథుఁడు రాజపుత్త్రియున్. (ఆం) 580

ఆ. పదియుఁ బదియు నింకఁ బదియేను బదియేను
నిరువదేను నూటయిరువదేను
నూఱు నూఱు నూఱు నున్నూఱు నన్నూఱు
తలలవాఁడు నిన్ను ధన్యుఁ జేయు. (జ) 581

చ. పరమవివేకసాగరుఁడు పంకజసంభవసంభవుండు ధూ
మరహితవహ్నితుల్యుఁ డసమానతపోనిధి విష్ణుభక్తిత
త్పరుఁ డఘదూరుఁ డాద్యుఁడు కృపారసచిత్తుఁడు దివ్యబోధ సు
స్థిరుఁడగు నవ్వసిష్ఠుఁ డరుదెంచె దిలీపనృపాలు పాలికిన్. (ఆం) 582

చ. పలుకులయాస వాయపునెపంబిడి పల్కు సఖీజనంబుతోఁ
బలికినమాత్రఁ జూడ్కులకు బ్రాంతిగ వెన్నెలఁ బుక్కిలించి న
ట్లలువుల వెళ్ళు గాంత దశనాంశువిభాతికి వజ్రదాడిమీ
ఫలనవబీజమౌక్తికవిభాతికి రాజనుమాట పూజయే? (ఆం) 583

సీ. పలుకుల వెడలజ్జ వెలితి సేయుచు నొయ్యఁ బలికించి చూడ్కికిఁ బట్టు కొలిపి,
చెంతకు నెఱయని చెయ్వులఁ బుయిలోట సడలించి వేడ్కలఁ గడకుఁ దెచ్చి,
నెపమునఁ జోఁకి పొణ్మెడుకంపములు మాన్చి డాసి వంచించి పొందాస పఱచి,
యుపగూహనములకు నొఱపిచ్చి పురికొల్పి చుంబనములఁ జవి చూపి రేచి,
గీ. మూరి బోయిన మవ్వంపుఁ గూరి మెసఁగఁ
గాయ్వు దలకంటెఁ జెయ్వుల గడవఁగఱప
బల నవసంగమంబున నోలలార్చె
రాజనందనుఁ డా రతిరాజు పోలె. (ఆం) 584

సీ. పసిఁడిక్రొమ్ముగులులోఁ బ్రభవించి యచలిత శ్రీ మించు చంచలరేఖయైన,
వరసుధారససరోవరములో జనియించి యనిశంబు నలరెడు వనజమైన
నిక్షురసాబ్ధిలో నెలసి మార్దవమున నతిశయిల్లు ప్రవాళలతికయైనఁ
బరిపూర్ణచంద్రబింబంబను కరసాన నొరసిన నురువాఁడిశరములైన,
గీ. బోల్ప నొకకొంత పొసఁగినఁ బొసఁగుఁగాక
ముదిత నెమ్మెనిమెఱుఁగును మోముచెలువు
నధరమును గటాక్షముల సోయగమునందు
దొరయు నన నెందు నొంఢువస్తువులు గలవె? (ఆం) 585

సీ. పాటించు నెయ్యది బహుళనిర్మలధర్మ గంభీరమగు మూర్తి గౌరవంబుఁ,
గావించు నెయ్యది కాంతిమై దిశలకు వాడని చంద్రికావైభవంబు,
గర్జించు నెయ్యది ఖణిలుఖణిల్లున ఘోరదైతేయుల గుండె లడన,
మెచ్చించు నెయ్యది మీనకేతనవైరి వాహ్యాళికావల్గు వల్గనముల,
గీ. నది రయంబున నవ్విభు నగ్రవీథి
నిర్భరారూఢి నొప్పఁ బ్రాదుర్భవించెఁ
బృథులపదపాతనిర్ఘాతభీతపన్న
గేశ్వరంబైన శ్రీవృషభేశ్వరంబు. (ఆం) 586

ఉ. పీడనతాడన గ్రహణభేదములన్ బహుబంధబంధన
క్రీడల హాస్యలీలఁ గిలకించితముఖ్యవిలాసలక్ష్మికిన్
జాడలుదీయునేర్పుల రసంబుల భావములం బ్రగల్భుఁడై
ప్రోడలఁ బొంది శ్రీవిభుఁ డపూర్వసుఖంబులఁ జొక్కఁజేయుచున్. (ఆం) 587

ఉ. పీనసరోగి నిన్నుఁదిలపిష్టసమానము చేసినంతనే
వాని వివేకహీనతకు వందురనేల కురంగనాభమా!
మానవతీకపోలకుచమండలమండితచిత్రపత్రికా
నూనవితానవాసనల నుండుట లోకము నిన్నెఱుంగదే! (జ) 588

చ. పురవనదౌత్యపానములు భూధరనాయకవిప్రలంభముల్
శరధియుఁ బెండ్లి యుద్ధము విచారము యానము పుత్రసంభవం
బిరవుగఁ జంద్రసూర్యు లుదయించుటయున్ జలకేళియున్ ఋతుల్,
సురతముఁ జెప్పఁగావలయు సొంపుగ సత్కృతులందు నేర్పునన్. (ఆం) 589

ఉ. ప్రేమముతోఁ జకోరశిశుబృందము ముక్కుల కెక్కకుండ జ్యో
త్స్నామృతధార వంచుటకునై యుడురాట్కలశీముఖంబునన్
యామవతీవిలాసవతి యడ్డము వెట్టిన హస్తమో యనం
గా మెఱసెన్ బరిస్ఫురితకజ్జలదీధితి చిహ్న మయ్యెడన్. (జ) 590

సీ. బడబానలంబను ఫాలేక్షణముచేత నక్రాది ఫణిభూషణములచేతఁ,
బవడంబు లనియెడు బహుజటావలిచేత నాతతఫేనవిభూతిచేతఁ
బ్రకటబుద్బుదచయస్ఫటికదానంబుచే శుక్తిఖండార్ధేందుశోభచేత,
భాసురభంగకపాలమాలికలచేఁ గమనీయమాధుర్యకలనచేతఁ,

గీ. దుహినకుధరసుతావాసమహిమచేతఁ
దనదు గంగాధరత్వంబు తథ్య మనఁగ
శౌరి కే ప్రొద్దు సంతోషకారి యగుచు
నొప్పు నొప్పులకుప్ప నా నప్పయోధి. (ఆం) 591

ఉ. బాలముఖేందుబింబరుచి పద్మనిభానన యాన లీల నీ
లాలక చన్నుదోయి రుచిరాంగి మనోజ్ఞవిలాసహాసముల్
లోలకురంగలోచన విలోకనసంపద నెట్టువోల్చినన్
బోలినఁ బోలు నారతముఁ బోలఁగ నీ త్రయి నొండు గల్గునే? (ఆం) 592

శా. బేటంబై దృతి పల్లటిల్లఁదొడఁగెన్ బ్రేమంబు వట్రిల్లె నా
రాటం బుజ్జనమయ్యె లజ్జ యెసఁగెన్ రాగంబు వాటిల్లెఁ బు
య్లోటం బుత్కటమయ్యెఁ గంపములపై నుప్పొంగెఁ బ్రస్వేద మ
జ్జోటిం జెప్పఁగ విన్నమాత్రఁ బతికిన్ సూనాస్త్రుబేటంబునన్. (ఆం) 593

సీ. భసితంబు వేదోక్తపదనిరూఢంబగు భసితంబు మునిజనప్రాణపదము
భసితంబు సర్వేశుభక్తి కాధారంబు భసితంబు సకలశుభప్రదంబు
భసితంబు దుర్మేఘపటలానిలంబగు భసితంబు లోకైకపావనంబు
భసితంబు భవరోగభంజనౌషధమగు భసితంబు ప్రత్యక్షభర్గమూర్తి
గీ. భసిత మనవరతాశేషభయహరంబు
భసిత మసమసుజ్ఞానవైభవకరంబు
భసిత మాభరణము యోగివిసరమునకు
భసితమహిమ వర్ణింపఁగ బ్రహ్మతరమె? (ఆం) 594

సీ. మొగమును మొగమును ముచ్చట లాడంగ నగవును నగవును నవ్వియాడ,
మోవియు మోవియు ముద్దులు గురియంగఁ జూపును జూపును దీపులాడ,
నొడలును నొడలును నొక్కటియై యుండఁ బులకలు పులకలుఁ గలయఁబడగఁ
దొడలును దొడలును దొడరి పెనంగఁగ నడుగులు నడుగులు నదిమి కొనఁగ
గీ. వరుసఁ దలయంపిఁ జేతులు సరసమాడ,
నితరకరములు పైనొప్ప రతుల యెడల
సరస శయనించి పరిరంభసంభ్రమముల
వ్రేతలును దాను సుఖియించె విశ్వవిభుఁడు. (ఆం) 595

సీ. రాజకదంబవిరాజితంబగుఁ గాని కంటకపార్థివోత్కరము గాదు,
పద్మాలయాతిశోభన మనం జనుఁ గాని కుముదోదయాతి సంకులము గాదు,
స్నిగ్ధసువర్ణప్రసిద్ధాత్మమగుఁ గాని పరచిత్రవర్ణసంకరము గాదు,
పరమౌషధిప్రభాభాసురంబగుఁగాని దుస్తృణద్యోతవిద్రుతము గాదు,
గీ. వరకులంబును సత్సరోవరకులంబు
చెలువమగు హర్మ్యకులము సుక్షేత్రకులము
పోల నిన్నింటితో దానిఁ బోలియున్నఁ
బ్రస్తుతంబగు నోషధిప్రస్థపురము.[25] (ఆం) 596

ఉ. రాజితతేజుఁ డైన దినరాజు తిరోహితుఁడైన పిమ్మటన్
రాజు దయాద్రిపీఠము తిరంబుగ నెక్కెడు సందుకట్టునన్
భ్రాజితసత్పథంబులకు బాధ యొనర్చుచు జారచోరసం
పూజితమై తమంబు గడుఁబొంగె నధర్మముతోటి జోటియై. (ఆం) 597

ఉ. లేమికి లేఁత కౌను, ప్రతి లేమి కుదాహరణంబు రూపు, మా
ర్లేమికి మచ్చుచూడ్కులగు లేమివిలాసము వల్లిచిత్రముం
దామరఱేకులుం గల కతంబునఁ బోల్పఁదలంచి లోకు లా
నామములెన్నవాతెఱవ నాలుక యాడునె మై వడంకదే. (ఆం) 598

క. లోకము విరహులకును శశి
భీకరుఁ డగుటరుదె? సురలు పీఁకుకతినఁగా?
నాకాశపిండమై తిరి
గే కుటిలాత్మునకు నేడ కృప మదిఁ దలఁపన్. (జ) 599

సీ. విటసేనపై దండువెడలిన వలఱేని గొల్లెనపై హేమకుంభ మనఁగఁ
గాముకధృతివల్లికలు ద్రుంప నెత్తిన శంబరాంతకుచేతి చక్ర మనఁగ
మరుఁడు పాంథశ్రేణి మానాటవులు గాల్పఁ గూర్పిన నిప్పులకుప్ప యనఁగ
విరహిమృగంబుల వేఁటాడ మదనుండు దెచ్చిన మోహనదీప మనఁగ
ఆ. వీఁకునునుపు గలిగి వృత్తమై యరుణమై
కాంతితోఁ జకోరగణము లుబ్బఁ
బొడుపుఁగొండ చక్కిఁబొడిచె రాకాచంద్ర
మండలంబు గగనమండనంబు. (ఆం) 600

చ. విరహులకెల్ల సంధ్యపతి వేడుక జోతము సెప్పవచ్చుచో
నితరముతోడ నక్షతలు నించి తగన్ గరపంకజంబునన్
మురియుచుఁ బట్టునా మెఱుఁగుముత్తెపుఁజిప్పన నొప్పెఁ జూడ్కికిన్
శరనిధిపుత్రునిన్ విదియచంద్రునిఁ గంటిరె పశ్చిమంబునన్. (ఆం) 601

సీ. విషమాస్త్రునకు వేఱ విండులు గలవెట్టు పొలఁతుక నెలవంక బొమలు గాక,
యంగజునకు వేఱ యమ్ములు గలవెట్టు తనుమధ్యలోల నేత్రములె కాక,
శంబరారికి వేఱ చక్రంబు గలదెట్టు బింబోష్ఠి పృథుజఘనంబ కాక,
చిత్తజునకు వేఱ చిగురెల్లి గలదెట్టు ధవళాక్షి యధరపల్లవమ కాక,
గీ. కాయజునకు వేఱ కవదొనల్ గలవెట్టు
తోయజాస్య పిన్న తొడల కాక
భావజునకు వేఱ పాశంబు గలదెట్టు
తరుణి కేల కాక ధరణినాథ! (ఆం) 602

సీ. వెన్నెలపులుఁగుల వెన్నెలపులగంబు చెఱకుసింగిణికాని చెలిమికాఁడు,
వేయికన్నులవాని వీటిపొత్తులమేఁత జోడువాయనివారి చొక్కుమందు,
కలువచుట్టంబు చుక్కలకెల్ల మను[?] భ్రాంతి వేడుకకాండ్రచే వెన్నుతఱటు,
మబ్బుమూఁకలకెల్ల నబ్బూచి పెనువేల్పు తలపూవు రేకొమ్మ వలపులాఁడు,
గీ. కలిమిముద్దియసైతోడు కడలిపట్టి
జక్కవలమిత్తి తామరచల్లఁజంపు[26]
దొంగలకు గొంగ యల ప్రొద్దుసంగడీఁడు
పొడిచెఁ బున్నమ రేఱేఁడు పొడుపుఁ గొండ. (ఆం) 603

చ. వెలయుకళాఢ్యుఁడైన శశి వేడుకఁ జేయు రతోత్సవంబునన్,
లలితరుచి స్ఫురద్గగనలక్ష్మి మనోహరహారమౌక్తికం
బుల క్రియ నున్న తారకలు పూర్వసురాధిపుభాగ్యచిహ్నముల్
తొలఁగినమాడ్కి దృష్టిపథదూరములయ్యెఁ గ్రమక్రమంబునన్. (జ) 604

చ. వెలవెలఁబాఱె దీపములు వెన్నెల వెల్లువ డొంకఁబాఱె ను
త్పలములజోకలెల్ల దిగఁబాఱె రథాంగము లించు వేడ్కలన్
గలగొనఁ బాఱెఁ దుమ్మెదలు కంజవనంబులు చేరఁబాఱెఁ దా
రలరుచి మాఁగువాఱె సురరాజదిగంతయు తెల్లవాఱఁగన్. (ఆం) 605

చ. వెలవెలఁబాఱె దూర్పు నన విల్లు మనోభవుఁ డెక్కుడించెఁ దా
రలపొది వివ్వఁజొచ్చె ననురక్తిఁ జెలంగె రథాంగదంపతుల్
జలజము లుల్లసిల్లె విలసద్గతి వీచెఁ బ్రభాతవాయువుల్
కలకల పల్కెఁ బక్షులు వికాసము కల్వలఁ బాసె నయ్యెడన్. (జ) 606

మ. సరి నుప్పొంగుచు వాహిను ల్బెరయఁగాఁ జక్రచ్ఛటాకుంతభీ
కరమై పోటును బాటును గలిగి సంగ్రామంబునుం బోలె నె
వ్వరికిం జొచ్చి మెలంగరాక ఘనసత్త్వప్రౌఢి శోభిల్లుచున్
ధరణీభృన్నికరంబు రాయ నమరెం దత్తత్ప్రదేశంబులన్. (ఆం) 607

సీ. సురలోనఁ దనరూపుఁ జూచి యెప్పుడు పొత్తు నకు వచ్చితే యని నవ్వువారు,
అన్నినట్లైన నిట్లాడుమా నీ వని నీడకుఁ గఱపుచు నాడువారుఁ.
జిలుకపలుకు విని యెలుఁగు సూపఁగ నేల వలతేని రమ్మని పిలుచువారు,
ముఖసౌరభమునకు మొరయు తుమ్మెద మ్రోఁత వించుఁ దోడన దాళగించువారు,
గీ. జాడ మునుకొని వెడమాట లాడువారుఁ
జేయి తాళంబులొండురు వ్రేయువారు
నైరి కాదంబరీపానహర్షమున మ
నంబు లలరంగ ముదితేందుబింబముఖులు. (ఆం) 608

గీ. హారిమందసమీరవిహారలీల
వెలయుపుప్పొళ్ళలో నలినికర మడరఁ
బొలుచు కెందమ్మికొలఁకులు పుష్పసాయ
కప్రతాపాలనంబులగను లనంగ. (ఆం) 609

  1. ఇందలి 2, 3 చరణముల యర్థము కుదురలేదు. మేము మార్చలేదు.
  2. చూ. నన్నిచోడని కుమారసంభవము 7.105
  3. “ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ...క్రియాసిద్ధిః సత్వే వసతి మహతాం నోపకరణే” సుభాషితరత్నభాండాగారం 2.252
  4. పా. యులుమేమి
  5. సరిగా లేదు.
  6. ధారాక్త?
  7. ఈపద్యము ముద్రిత మగునాంధ్రభాషాభూషణమునఁ గానరాదు. తాళపత్రప్రతులందును గానరాలేదు.
  8. నిశ్శంకుని కొమ్మయ శివలీలావిలాసములోనిది
  9. “ఒకటి కొకటి యాప నుండ” - చూ. అన్నమాచార్యుని శృంగారసంకీర్తనము (15-70)
  10. చూ. నిర్వచనోత్తరరామాయణము
  11. ఫణిదవు మాధవుని ప్రద్యుమ్నవిజయములోనిది.
  12. పోతరాజు భైరవుని శ్రీరంగమాహాత్మ్యము లోనిది.
  13. శ్రీనాథుని భీమఖండములోనిది 3.144
  14. ఈ పద్యము నైషధమున గానరాదు.
  15. ఆంధ్రసాహిత్యపరిషత్తు గ్రంథసంధాత ఈపద్యమును భీమకవి దశావతారపద్య మని పేర్కొనెను.
  16. చూ. “కన్యావరయతే రూపం.....”
  17. నన్నిచోడని పద్యమున కనుకరణము
  18. నాచనసోముని ఉత్తరహరివంశము(న నుండదగునా)?
  19. మెఱుఁగు మెఱుతోన యల్లన మిన్నువ్రాఁకె (పాఠాం)
    చూ. పారిజాతాపహరణము 2.40
  20. చూ. భీమఖండము 2.43
  21. ప్రథమముద్రణమున నీ తుది రెండుపంక్తులందు చుక్కలున్నవి.
  22. ఎఱ్ఱనరచన [హరివంశము?]
  23. నాచన సోముని ఉత్తరహరివంశము పోల్కి.
  24. చూ. కాశీఖండము 5.83
  25. నన్నిచోడని కుమారసంభవములోనిది 7.127
  26. చల్లఁజంపులు జోగిజంగమంబులు. చూ. హరవిలాసము