పౌర రక్షణ చట్టము, 1968

frarot || 3 Tre EUT 31. 5 . Fri, 13 - RRR Registered No, D-221 రిజిస్ట్రీ సంఖ్య డి * 281 [Price: Rs. 43-00 Paise మూల్యము : రూ. 43-00 "పైసలు aria.....**** + ATTITUT The Gazette of India భారత రాజపత్రము UTFIT TRUT EXTRAORDINARY అసాధారణ TUS, R , 83 HTT XVI BETHTT 1 Part XVI Section 1 భాగము XVI అనుభాగము 1 out # VETTA PUBLISHED BY AUTHORITY ప్రాధికారము ద్వారా ప్రచురింపబడినది F. ? 7 fast gear 83 3744tae, 2008 / 30 argue No. 2 New Delhi Wednesday 13th October, 2004/30 Bhadrapadh Vol. 13 సంఖ్య 2 న్యూఢిల్లీ బుధవారము 13 అక్టోబర్ 2004/30 భాద్రపద సంపుటము 13 MINISTRY OF LAW AND JUSTICE LEGISLATIVE DEPARTMENT New Delhi, 29th June 2004/12 Ashada, 1926 Saka New Delhi, 16th August, 2004/30 Adika Sravan 1926 Saka The Translations in Telugu of the following Acts namely:- (1) The Central Reserve Police Force Act, 1949 (Act 66 of 1949); (2) The Civil Defence Act,1968 (Act 27 of 1968); (3) The Excise (Malt Liquors) Act, 1890 (Act 13 of 1890); (4) The Indian independence Pakistan Courts (Pending Proceedings) Act, 1952 (Act 9 of 1952); (5) The National Commission for Minorities Act, 1992 (Act 19 of 1992); (6) The National Trust for Welfare of Persons with Autism, Cerebral Palsy, Mental Retardation and Multiple Disabilities Act, 1999 (Act 44 of 1999); (7) The Small Coins (Offences) Act, 1971 (Act 52 of 1971); (8) The Taxation Laws (Continuation and Validation of Recovery Proceedings) Act, 1964 (Act 11 of 1964) and (9) The Passport (Entry into India) Act, 1920.(Act 34 of 1920) are hereby published under the authority of the President and shall be deemed to be the Authoritative Texts thereof in Telugu under Clause (a) of Section 2 of the Authoritative Texts (Central Laws) Act, 1973 (Act 50 of 1973),

Mac

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)


ఈ క్రింది చట్టములు, అనగా :- (1) కేంద్ర రిజర్వు పోలీసు బల చట్టము, 1949 (1949 లోని 66వ చట్టము); (2) పౌర రక్షణ చట్టము, 1968 (1968 లోని 27వ చట్టము); (3) ఎక్సైజు (మాల్ట్ మద్యముల) చట్టము, 1890 (1890 లోని 13 వ చట్టము); (4) భారత స్వాతంత్య్ర - పాకిస్తాను న్యాయస్థానముల (పెండింగు ప్రొసీడింగుల) చట్టము, 1952 (1952 లోని 9వ చట్టము); (5) జాతీయ అల్ప సంఖ్యాక వర్గముల కమీషను చట్టము, 1992 (1992 లోని 19వ చట్టము): (6) ఆటిజమ్, సెరిబ్రల్ పాల్సి, బుద్ధి మాంధ్యత మరియు బహు వికలాంగత కలిగిన వ్యక్తుల సంక్షేమ జాతీయ ట్రస్టు చట్టము, 1999 (1999 లోని 44వ చట్టము); (7) చిన్న నాణేముల (అపరాధముల) చట్టము, 1971 (1971 లోని 52వ చట్టము}, (8) పన్ను విధింపు శాసనముల (వసూలు ప్రోసీడింగుల కొనసాగింపు మరియు శాసనమాన్యత) చట్టము, 1964 (1964 లోని 11వ చట్టము) మరియు (9) పాస్ పోర్టు (భారతదేశములో ప్రవేశము) చట్టము, 1920 (1920 లోని 34వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందు మూలముగా ప్రచురించడమైనది. ఆ చట్టములకు గల ఈ అనువాదములను ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973 లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను.

.

పౌర రక్షణ చట్టము, 1968

( 1908 లోని 27వ చట్టము)

(24 మే, 1968)

పౌర రక్షణ కొరకును దానికి సంబంధించిన విషయముల కొరకును

నిబంధనలు చేయుటకైన చట్టము

భారత గణరాజ్యము యొక్క పందొమ్మిదవ సంవత్సరములో పార్లమెంటు ఈ క్రింది విధముగ శాసనము చేయబడినది : -

అధ్యాయము

ప్రారంభిక

సంగ్రహ నామము, విస్తరణ మరియు ప్రారంభము.


1. (1) ఈ చట్టమును పౌర రక్షణ చట్టము, 1968 అని పేర్కొనవచ్చును.

(2) ఇది యావద్భారత దేశమునకు విస్తరించును.

(3) ఇది, ఏదైన రాజ్యములో లేక దాని భాగములో, భారత రక్షణ చట్టము, 1962 ( 1962 యొక్క 51వ చటము ) యొక్క ముగింపు తేదీకి పూర్వపు తేదీ కాకుండ, కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి రావలెను; మరియు వేరు వేరు రాజ్యములకు లేక రాజ్యముల వేరువేరు భాగములకు వేరువేరు తేదీలు నియతము చేయబడవచ్చును.

నిర్వచనములు

2. ఈ చట్టములో, సందర్భమును బట్టి అర్థము వేరుగా ఉన్ననే తప్ప, -

(ఎ) "పౌర రక్షణ" లో భారతదేశములో లేక దాని రాజ్యక్షేత్రము యొక్క ఏదైన భాగములో ఎవరేని వ్యక్తికి, ఏదేని ఆస్తికి, స్థానమునకు లేక వస్తువుకు విమానము నుండి గాని భూమి నుండి గాని సముద్రము నుండి గాని లేక ఇతర స్థానముల నుండి గాని జరుగు ఏదైన శత్రు దాడి నుండి రక్షణ కల్పించుటకు , లేక అట్టి ఏదైన దాడిని పూర్తి గాగాని కొంత మేరకు గాని తొలగించుటకు, వాస్తవ పోరాటము క్రిందికి రానట్టి ఏవ్వెన చర్యలు- అట్టి చర్యలు అట్టి దాడికి పూర్వము, దాడి జరుగుచుండగా, దాడి సమయమున తీసికొనబడినను లేక దాడి సమయము తరువాత తీసికొనబడినను- చేరియుండును.

(బి) "పౌర రక్షణ దళము" అనగా పూర్తిగాగాని, ప్రధానముగా గాని పౌర రక్షణావశ్యకతలను పూర్తి చేయుటకు ఏర్పాటు చేయబడిన దళము అని అర్ధము; ఇందు పరిచ్ఛేదము 4, ఉప-పరిచ్ఛేదము (1) కి గల వినాయింపు క్రింద ఒక దళముగా భావించబడిన ఏదైన వ్యవస్థ చేరియుండును;

(సి) "శత్రు దాడి" అనగా ఏదైన యుద్దములో గాని, బాహ్య దురాక్రమణలో గాని, అంత: కల్లోలములో గాని అన్యధా గాని భారతదేశములో లేక దాని రాజ్యక్షేత్రము యొక్క ఏదైన భాగములో ఏదేని ప్రాణము ఆస్తి, స్థానము లేక వస్తువు యొక్క భద్రతకు ముప్పు కలిగించు నట్టి, ఎవరేని వ్యక్తిచే, లేక వ్యక్తుల నికాయముచే చేయబడు ఏదైన దాడి అని అర్ధము;

(డి) "అధిసూచన" అనగా అధికార రాజపత్రములో ప్రచురింపబడిన అధిసూచన అని అర్ధము;

(ఇ) "వైయక్తిక సేవా కృతి". వైయక్తిక కృతుల (అత్యవసర నిబంధనల) చట్టము, ( 1962 యొక్క 59వ చట్టము ) లో ఏ అర్ధమును కలిగి యున్నదో ఆ అర్ధమునే కలిగియుండును;

(ఎఫ్) ఒక సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధింది ".రాజ్య ప్రభుత్వము " అనగా ఆ సంఘ రాజ్యకేతము యొక్క పరిపాలకుడు అని అర్ధము.

అధ్యాయము- 2

పౌర రక్షణ కొరకు నియమములు చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము

పౌర రక్షణ కొరకు నియమములు చేయు అధికారము -

3. (1) పౌర రక్షణ కలిగించుటకు కేంద్ర ప్రభుత్వము, ఈ క్రింద పేర్కొనబడిన విషయములన్నింటికైనను వాటిలో దేనికొరకైనను నిబంధనలు చేయుచు అధిసూచన ద్వారా నియమములు చేయవచ్చును, అవేవనగా: ---

(ఎ) ఏ పని వలన పౌర రక్షణకు బహుశ: భంగము కలిగించగలదో, ఆ పనిని చేయుటను నివారించుట;

(బి) పౌర రక్షణ గురించి జనసామాన్యమునకు శిక్షణ గరపుట మరియు అట్టి రక్షణకు వారిని తయారుచేయుట;

(సి) పౌర రక్షణ కొరకు అవసరమగు వస్తు, సామగ్రిని ఏర్పాటు చేయుట, నిల్వచేయుట, నిర్వహించుట;

(డి) ఓడరేవులలోను ప్రాదేశిక ఆటుపోటుల మరియు దేశీయ జలములలోను రాకపోకలను మరియు జలయానముల, బోయాల, దీపముల మరియు సంకేతముల ఉపయోగమును నిషేధించుట, లేక క్రమ బద్దము చేయుట;

(ఇ) దీపముల, ధ్వనుల నియంత్రణ;

(ఎఫ్) అగ్ని నివారక చర్యలను తదితర చర్యలను తీసికొనుట ద్వారా ప్రాణమును ఆస్తిని రక్షించుట;

(జి). శత్రు దాడి జరిగినచో ఎవైన భవనములను , భవనక్షేత్రాదులను లేక ఇతర కట్టడములను, వెంటనే గుర్తుపట్టే వీలు లేకుండా చేయుట;

(హెచ్) ప్రాణమునకు లేక ఆస్తికి అపాయము కలుగుటను నివారించుటకు ఏదైన భవనమును, భవనక్షేత్రాదులను లేక ఇతర కట్టడములను లేక ఏదైన ఇతర ఆస్తిని కూలగొట్టుట, నాశము చేయుట లేక పనికి రాకుండునట్లు చేయుట; (ఐ) ఈ క్రింద తెలిపిన వాటిని తన వద్ద ఉంచుకొనుటను, వాటి ఉపయోగమును, లేక వ్యయనమును నిషేధించుట లేక క్రమబద్దము చేయుట:-

(i) పేలుడు పదార్ధములు, మండే స్వభావము గల పదార్ధములు, క్షారక, లేక ఇతర అపాయకర పదార్ధములు లేక వస్తువులు, ఆయుధములు మరియు మందుగుండు సామగ్రి;

(ii) జలయానములు;

(iii) వెర్లెస్ టెలిగ్రాఫిక్ ఉపకరణములు;

(iv) ఎయిర్ క్రాప్టు; మరియు

(v) ఫోటో గ్రాఫిక్ మరియు సిగ్నలింగ్ ఉపకరణములు మరియు సమాచారమును రికార్డు చేయు ఏదైన సాధనము:

(జె) ప్రాంతములను ఖాళీ చేయుట మరియు అచటినుండి ఆస్తిని, జంతువులను తరలించుట;

(కె) ఏదైన ప్రాంతము నుండి నిర్వాసితులైన వ్యకులకు వేరొక ప్రాంతములో వసతి కల్పించుట మరియు అట్టి ప్రాంతములో వసతి కల్పించబడి నట్టి నిర్వాసితుల నడవడిని క్రమబద్దము చేయుట;

(ఎల్) నిర్వాసితులకు లేక ఈ చట్టము క్రింది కృత్యములను నెరవేర్చుటకు ప్రాధికృతులైన వ్యక్తులకు నివాస ఆదేశములిచ్చుట;

(ఎం) నష్టమ్మెన భవనములను, కట్టడములను మరియు ఆస్తిని ఉద్దరించుట మరియు శవములకు సంస్కారము జరుపుట;

(ఎన్) గాయపడినట్టియు, క్లెయిము చేయబడనట్టియు లేక అపాయకరమై నట్టియు, జంతువుల అభిగ్రహణ, వాటి అభిరక్ష లేక వాటిని నాశనము చేయుట;

(ఓ) ఈ క్రింది తెలిపినవి సురక్షితముగా ఉండునట్లు చేయుట: ---

(i) ఓడరేవులు, డాక్ యార్డులు, లైట్ హౌస్ లు , దీపపు ఓడలు , విమానాశ్రయములు మరియు వైమానిక యానమునకు సంబం ధించిన ఇతర సౌకర్యములు;

(ii) రైలు మార్గములు, ట్రాంమార్గములు, రోడ్లు, వంతెనలు ,కాలువలు మరియు భూమార్గమునగాని, జలమార్గమునగాని ఇతర రవాణా సాధనములన్నియు;

(iii) టెలిగ్రాపులు, తపాల కార్యాలయములు, సిగ్నలింగ్ ఉపకరణములు మరియు ఇతర కమ్యూనికేషన్ సాధనములన్నియు; (iv) నీటి సరఫరా వనరులు మరియు పద్దతులు, నీరు గ్యాసు లేక విద్యుచ్చకి, సరఫరా కొరకైన నిర్మాణములు మరియు సార్వజనిక ప్రయోజనముల కొరకైన ఇతర నిర్మాణము లన్నియు;

(v) జలయానములు, విమానములు, మోటారు వాహనముల చట్టము, 1939 ( 1939 యొక్క 4వ చట్టము) లో నిర్వచింపబడిన రవాణా వాహనములు మరియు రైలు మార్గముల యొక్కయు ట్రాంమార్గముల యొక్కయు రోలింగు స్టాకులు;

(vi) గిడ్డంగులు మరియు నిలువచేయు ప్రయోజనముల కొరకు ఉపయోగించబడెడి లేక ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన ఇతర స్థానములన్నియు;

(vii) సాధారణముగా గనులు, చమురు గనులు , ఫ్యాక్టరీలు లేక పారిశ్రామిక లేక వాణిజ్య సంస్థలు, లేక ప్రత్యేకముగా ఏదైన గని, చమురు గని, ఫ్యాక్టరీ లేక పారిశ్రామిక లేక వాణిజ్య సంస్థ;

(viii)వైజ్క్షానిక లేక సాంకేతిక పరిశోధన లేక ప్రశిక్షణ జరుపు లేక గరుపు ప్రయోగశాలలు మరియు సంస్థలు;

(ix) ఈ ఖండములో ఇంతకు పూర్వము పేర్కొనబడిన దేనిలోనైనను భాగమై యున్నట్టి లేక దానికి సంబంధించియున్నట్టి అన్ని నిర్మాణములు మరియు కట్టడములు;

(x) ఏది ప్రభుత్వము యొక్క లేక స్థానిక ప్రాధికారి యొక్క లేక పాక్షికముగా ప్రభుత్వము యొక్క లేక స్వాయత్త వ్యవస్థ యొక్క ప్రయోజనముల కొరకు ఉపయోగించబడుచుండునో లేక ఉపయోగించబడుటకు ఉద్దేశించబడినదో మరియు పౌర రక్షణను సునిశ్చితమొనర్చుటకు దేనిని రక్షించుట ఆవశ్యకమని లేక సముచితమని భావించబడినదో ఆటి ఏదైన ఇతర స్థానము లేక వస్తువు;

(పి) ఏదైన రోడ్డు లేక బాట , జలమార్గము , బల్లకట్టు లేక వంతెన, నది కాలువ లేక ఇతర నీటి సరఫరా వనరు యొక్క నియంత్రణ;

(క్యూ) ప్రభుత్వము లేక ప్రభుత్వము యొక్క ఏదేని విభాగము లేక ఏదేని స్థానిక ప్రాధికారము, పోలీసు బలగపు సభ్యులు, అగ్నిమాపక దళము, మరియు పౌరరక్షణ ప్రయోజనముల కొరకు కాకుండ ప్రధానముగ ఇతర ప్రయోజనముల కొరకు నియమించబడినట్టి ఏదైన సేవా లేక ప్రాధికారి యొక్క సభ్యులు తమతమ అధికారితలలో లేక తమచే నియమించబడిన సిబ్బందికి సంబంధించి తీసికొనవలసి యుండునట్టి ముందు జాగ్రత్త చర్యలు;

(ఆర్) అధికారికమైన లేక ఇతరమైన యూనిఫారంలను లేక పతాకములను లేక మెడల్స్, బ్యాడ్జీలు వంటి ఇతర అధికార అలంకారములను లేక ఇతర చిహ్నములను లేక వాటిని పోలియున్న వేటిని మోసగించునట్లు లేక పౌరరక్షణకు భంగములో మనకు ఉపయోగించకుండా నివారించుట లేక నియత్రించుట;

(ఎస్) జరుగగలదని భావించిన ఏదైన శత్రుదాడి యున్న నుండి జనసామాన్యమును లేక జనసామాన్య సభ్యులను రక్షించుట లేదా ఆ అపాయములను వారికి తెలియజేయు దృష్టితో వ్యక్తులచే లేక కారులు తీసికొనబడవలసిన ముందు జాగ్రత్తలు లేక చర్య:

(టి) అగ్ని ప్రమాదమును కనుగొనుటకు, నివారించుటకు ఆవశ్యకమగు నట్టి ఏర్పాటు చేయవలసినదిగా లేక అట్టి ఏర్పాట్లను పూర్తి చేయవలసినదిగా ఏదేని భవనము, కట్టడము , లేక భవన క్షేత్రాదుల యజమానిని లేక ఆక్రమణను కలిగియున్న వ్యక్తిని కోరుట;

(యు) అగ్ని ప్రమాదము జరిగినప్పుడు దానిని చలార్పులకు నిర్ధిష్టమైన చర్యలు తీసికొనుట;

(వి) ఏదైన నిర్ధిష్ట మినహాయింపుకు లోబడి, ఏదైన నిర్ధిష్ట ప్రాంతములో ఉన్న ఏ వ్యక్తి గాని ఎవరేని నిర్ధిష్ట ప్రాధికారి లేక వ్యక్తి చే ఈయబడిన ప్రాతమూలకమైన అనుజ్ణా పత్రమువలన లభించిన అధికారముతో తప్ప, నిర్ధిష్టపరచబడు. వేళల మధ్య ఇల్లు వదలి బయటకు రాకూడదని ఆదేశించుట;

(డబ్ల్యు) (i) పౌరరక్షణకు భంగకరమైన విషయములలో ఉన్న ఏదైన వార్తాపత్రిక, వార్తా పత్రము, పుస్తకము , లేక ఇతర దస్తావేజు యొక్క ముద్రణను, ప్రచురణను నిషేధించుట;

(ii) ఉపఖండము (i)లో నిర్ధేశింపబడిన ఏదైన విషయమును కలిగి యుండు ఏదైన వార్తాపత్రికను, వార్తాపత్రమును, పుస్తకమును లేక ఇతర దస్తావేజును ముద్రించుటకు లేక ప్రచురించుటకు ఉపయోగించబడెడి ఏదైన ముద్రణాలయము నుండి హామీని అడుగుట, మరియు ఆ వార్తాపత్రము, పుస్తకము లేక ఇతర దస్తావేజు యొక్క ప్రతులను కోల్పోవునట్లుగా చేయుట;

(ఎక్స్) ఏ ప్రాంతముల నియంత్రణ ఆవశ్యకమని లేక సముచితమని భావించబడినదో ఆ ప్రాంతములోని వ్యక్తుల నడవడిని క్రమబద్దము చేయుట, మరియు అట్టి ప్రాంతముల నుండి వ్యక్తులను తొలగించుట,

(వై) ఏదైన పౌరరక్షణ పథకమును పాటించవల్సినదిగా ఏ వ్యక్తినైనను. లేక వ్యక్తుల వర్గమున్నెనను కోరుట;

(జడ్) పౌరరక్షణ ప్రయోజనములకు ఆవశ్యకమగు ఏదైన ఇతర నిబంధన;

(2) ఉపపరిచ్చేదము (1) కింద చేయబడిన ఏదైన నియమములో అందు నిర్దిష్టపరచబడిన విషయములను గూర్చిన ఉత్తరువులు రాజ్య ప్రభుత్వముచే చేయబడవచ్చునని నిబంధన చేయబడవచ్చును . (3) ఉపపరిచ్ఛేదము (1) కింద చేయబడిన ఏదైన నియమములో ఆ నియమమును లేక దాని క్రింద చేయబడిన ఏదైన ఉత్తరువు యొక్క ఉల్లంఘనకు అయిదు వందల రూపాయల వరకు జుర్మానాతోను, ఆ ఉల్లంఘన కొనసాగుచున్నదైన యెడల, మొదటి జుర్మానా తరువాత అట్ట్టి ఉల్లంఘన కొనసాగు కాలావధిలో ప్రతి దినమునకు ఏబది రూపాయల వరకు అదనపు జుర్మానాతోను, శిక్షింపదగి యుండునని నిబంధన చేయవచ్చును.

అధ్యాయము- 3

పౌరరక్షణ దళము

పౌర రక్షణ దళమును ఏర్పాటు చేయుట -

4. (1) రాజ్య ప్రభుత్వము, రాజ్యములోపలి ఏ ప్రాంతము కొరకైనను (ఇందు ఇటు తరువాత "దళము" అని నిర్దేశించబడిన) పౌరరక్షణ దళము అనబడు వ్యక్తుల నికాయము నొకదానిని ఏర్పాటు చేయవచ్చును. మరియు (ఇతను కంట్రోలరు అనబడును) తన అభిప్రాయములో జిల్లా మేజిస్ట్రేటు కంటే తక్కువ కానట్టి హోదాగల ఎవరేని వ్యక్తిని అట్టి దళముపై ఆజ్జలు ఇచ్చుటకు నియమించవచ్చును:

అయితే, ఏదేని రాజ్యము యొక్క ఏ ప్రాంతములోనైనను, ఆ ప్రాంతములో ఈ చట్టము ప్రారంభమగుటకు అవ్యవహితపూర్వము, దళము యొక్క కృత్యములను దానికప్పగించవచ్చునని రాజ్య ప్రభుత్వము అభిప్రాయపడునట్టి ఏదైన వ్యవస్థ ఉన్నచో, ఆ ప్రాంతమునకు వేరుగా ఒక దళమును ఏర్పాటు చేయుటకు బదులు, ఆ ప్రాంతములో దళము యొక్క కృత్యములను చేపట్టవలసినదిగా లేక నిర్వహించ వలసినదిగా రాజ్యప్రభుత్వము ఆ వ్యవస్థను కోరవచ్చును, మరియు అటుపై ఆ వ్యవస్థ, ఈ చట్టము యొక్క ప్రయోజనములకు ఆ ప్రాంతపు దళముగా భావింపబడవలెను.

(2) రాజ్యములోపల కంట్రోలర్ల కార్యకలాపములను సమన్వయ పరచుటకు రాజ్య ప్రభుత్వము, ఒక పౌరరక్షణ డెరెక్తరును నియమించవచ్చును మరియు ప్రతి కంట్రోలరు, అట్టి డెరెక్టరుచే ఈయబడిన ఆదేశములను పాటించవలెను.

సభ్యులు మరియు అధికారుల నియామకము.

5. (1) రాజ్య ప్రభుత్వము, దళము సభ్యులుగా పనిచేయుటకు యోగ్యులై యుండి అందుకు ఇష్టపడు వ్యక్తులను అట్టి సభ్యులుగా నియమించవచ్చును, మరియు కంట్రోలరు అట్లు నియమించబడిన ఏ సభ్యుడినై నను తన అభిప్రాయములో ఆ సభ్యుడు ఏ పదవిని లేక కమాండ్ను చేపట్టుటకు యోగ్యుడై యుండునో ఆ పదవికి లేక కమాండ్ నకు నియమించవచ్చును .

(2) దళపు సభ్యుడుగా నియమించబడిన ప్రతి వ్యక్తికి, విహితపరచిన ప్రరూపములో ఒక సభ్యత్వ ధ్రువపత్రమును ఈయవలెను.

పౌర రక్షణ దళపు సభ్యుల బర్తరపు.

6. (1) కంట్రోలరు అభిప్రాయములో దళము యొక్క ఏ సభ్యుడినను అట్టి సభ్యుడిగా అతని కరవ్యములను తృప్తికరముగా నిర్వహించనిచో లేక నిర్వహించుటలో విఫలుడైనచో లేక అట్టి సభ్యుడిగా అతని కర్తవ్య నిర్వహణలో ఏదైన, చెడు నడవడికి దోషియైనట్లు లేక దోషియై యుండినట్లు కనుగొనబడినచో, కంట్రోలరు, అట్టి దళపు సభ్యునిపై గల ఆరోపణల విషయమున అతని విన్నపము ఆకర్షింపబడుటకు యుక్తమైన అవకాశమిచ్చి పరిశీలన జరిపిన పిమ్మట ఉత్తరువు ద్వారా అట్టి సభ్యుని ఆ దళము నుండి బర్తరఫు చేయవచ్చును.

(2) దళము యొక్క ఏ సభ్యుడైనను ఆ దళములో కోనసాగుట వాంఛనీయము కాదని కంట్రోలరు అభిప్రాయపడు నెడల, అతడు అట్టి సభ్యుని దళము నుండి, ఏ కారణము తెలుపకుండ, సంక్షిప్తముగా బర్తరఫు చేయవచ్చును.

అపీలు

7. దళము నుండి 6వ పరిచ్ఛేదము క్రింద బర్తరపు చేయబడిన దళపు సభ్యుడు, అట్టి బర్తరపు తేదీ నుండి ముప్పది దినముల లోపల రాజ్య ప్రభుత్వమునకు అపీలు చేసికొనవచ్చును. మరియు కంట్రోలరు లేక ఇతర ప్రాధికారిచే చేయబడిన ఉత్తరువును ఆ ప్రభుత్వము, అట్టి అపీలుపై ఖాయపరచవచ్చును, మార్పు చేయవచ్చును లేక విపర్యస్త పరచవచ్చును .

పౌరరక్షణ దళపు సభ్యుల కృత్యములు.

8.(1) దళపు సభ్యులు, ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల ద్వారా లేక తత్సమయమున అమలునందుండు ఏదైన ఇతర శాసనము ద్వారా వారికి అప్పగించబడి పౌరరక్షణ చర్యలు తీసికొనుటకు సంబంధించిన కృత్యములను నిర్వర్తించవలెను .

(2) రాజ్య ప్రభుత్వము లేక కంట్రోలరు. ఉత్తరువు ద్వారా, దళము యొక్క ఎవరేని సభ్యుడిని, శిక్షణ కొరకు గాని, అట్టి ఉత్తరువులో నిర్దిష్టపరచబడు పౌరరక్షణ చర్యలు తీసికొనుటకు సంబంధించిన కృత్యములను నిర్వహించుట కొరకు గాని, పిలువచ్చును.

(3) ఈ విషయమున కేంద్ర ప్రభుత్వము చేయు ఉత్తరువులకు లోబడి, ఏదేని రాజ్యపు దళము యొక్క సభ్యుడెవర్నెనను, ఏదైన ఇతర రాజ్యములో పౌరరక్షణకు సంబంధించిన కృత్యములను నిర్వహించుటకు, ఎప్పుడైనను ఉత్తరువు ద్వారా కోరబడవచ్చును. మరియు అట్టి కృత్యములను నిర్వహించుచుండగా, ఆ ఇతర రాజ్యపు దళము యొక్క సభ్యుడుగా భావింపబడవలెను మరియు అతనియందు ఆ ఇతర రాజ్యపు దళము యొక్క సభ్యునికి గల అధికారములు, కృత్యములు, మరియు విశేషాధికారములు నిహితమై యుండవలెను మరియు ఆ దళపు సభ్యుని బాధ్యతకు లోనై యుండవలెను.

వినియమములు చేయు అధికారము,

9. (1) కేంద్ర ప్రభుత్వము అధిసూచన ద్వారా ఈ అధ్యాయము యొక్క వినియమములు ప్రయోజనములను నెరవేర్చుటకు వినియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకించి, మరియు పైన చెప్పబడిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము కలుగకుండ అట్టి వినియమములు: --

(ఎ) దళపు సభ్యుల కృత్యములను విహితపరచవచ్చును మరియు వారు ఏ రీతి సేవకై పిలువబడవచ్చునో ఆ రీతిని క్రమబద్దము చేయవచ్చును;

(బి) ఏదైన దళము యొక్క లేక అన్ని దళముల యొక్క సభ్యుల వ్యవస్థను, నియామకమును, సేవా షరతులను, క్రమశిక్షణను, సాధన సామగ్రిని, మరియు దుస్తులను క్రమ బద్దము చేయవచ్చును ; (సి) ఏదైన దళము యొక్క లేక అన్ని దళముల యొక్క సభ్యత్వ ద్రువీకరణ పత్రములను ద్రువీకరించవచ్చును.

అద్యాయము- 4

వివిధ విషయములు

వైయక్తిక కృతుల (అత్యవసర నిబంధనల) చట్టము యొక్క నిబంధనలు దళపు సభ్యులకు కలిగిన కృతులకు వర్తించుట.

10. వైయక్తిక కృతుల (అత్యవసర నిబంధనల) చట్టము, 1962 (1962 యొక్క 59వ చట్టము) యొక్కయు దాని కింద చేయబడిన ప్రతియొక పథకము యొక్కయు నిబంధనలు. అవి ఒక పౌరరక్షణ స్వచ్ఛంద సేవకునికి కలిగిన వైయక్తిక సేవా కృతికి వర్తించునట్లు గనే, దళపు సభ్యుడుగా నియమించబడిన ఎవరేని వ్యక్తికి కలిగిన వైయక్తిక సేవా కృతికి ఈ క్రింద తెలుపబడిన మార్పులకు లోబడి వీలైనంతమేరకు వర్తించవలెను. ఆ మార్పులేవనగా-

(ఎ) ఆ చట్టము క్రింద లేక దాని క్రింద చేయబడిన ఏదైన పథకము క్రింద పౌరరక్షణ గూర్చిన వాడిన నిర్దేశము దళపు సభ్యుని గూర్చిన నిర్దేశముగా అన్వయించబడవలెను. మరియు

(బి) దళపు సభ్యునికి సంబంధించి అందులోని అత్యవసర పరిస్థితి యొక్క కాలావధిని గూర్చిన ఏదైన నిర్దేశము, ఈ చట్టము అమలులోనున్నప్పటి కాలావధిగా అన్వయించబడవలెను.

11. (1) 8వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (2) క్రింద ఉత్తరువు ద్వారా పిలువబడిన మీదట దళము యొక్క ఏ సభ్యుడైనను అట్టి ఉత్వరువును పాటించుటకు లేక అట్టి సభ్యుడిగా తన కృత్యములను నిర్వర్తించుటకు లేక అతని కృత్యముల పాలనకై అతనికి ఈయబడిన ఏదైన నిధ్యుక్తమైన ఉత్తరువును లేక ఆదేశమును పాటించుటకు సరియైన కారణము లేకుండ ఉపేక్షించుచో లేక నిరాకరించుచో, అతడు అయిదువందల రూపాయల దాక ఉండగల జరిమానా తోను, మరియు అట్టి ఉపేక్ష లేక నిరాకరణ కొనసాగుచున్నదైనయెడల, మొదటి జరిమానా తరువాత అట్టి ఉల్లంఘన కొనసాగు కాలావధిలో ప్రతి దినమునకు ఏబది రూపాయల దాక ఉండగల అదనపు జరిమానాతోను శిక్షింపదగియుండును.

(2) ఏ వ్యక్తి యైనను, అతనికి ఈ చట్టము క్రింద గాని, ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల క్రింద గాని ఇవ్వబడిన ఏదైన ఉత్తరువును లేక ఆదేశమును పాటించుటకు సరియైన కారణము లేకుండ ఉపేక్షించుచో లేక పాటించ కున్నచో అతడు అయిదు వందల రూపాయల దాక ఉండగల జరిమానాతోను, మరియు అట్టి ఉపేక్ష లేక పాటించకుండుట కొనసాగుచున్నదైనయెడల, మొదటి జరిమానా తరువాత అట్టి ఉపేక్ష లేక పొటించకుండట కొనసాగు కాలావధిలో ప్రతి దినమునకు ఏబది రూపాయల దాక ఉండగల అదనపు జరిమానాతోను శిక్షింపదగియుండును.

ఇతర శాసనములతో అసంగతముగా నున్న, చట్టము మరియు నియమములు మొదలైన వాటి ప్రభావము.

12 (1) ఈ చట్టము గాక ఏదైన ఇతర అనుశాసనములో లేక ఈ చట్టము గాక ఏదెన ఇతర అనుశాసనమును బట్టి ప్రభావము కలిగియున్న ఏదైన పత్రములో తద్విరుద్దముగ ఏమీ ఉన్నప్పటికిని, ఈ చట్టము యొక్క నిబంధనలు లేక దాని క్రింద చేయబడిన ఏవైన నియమములు లేక ఈ చట్టము క్రింద గాని ఏదైన అట్టి నియమము క్రింద గాని చేయబడిన ఏదైన ఉత్తరువు ప్రభావము కలిగియుండును. {2) పౌరరక్షణకు సంబంధించిన ఏదైన శాసనము ద్వారా గాని దాని క్రింద గాని, ఈ చట్టము ప్రారంభమగుటకు పూర్వము పౌరరక్షణకు సంబంధించి చేయబడిన ప్రతియొక నియామకము, ఉత్తరువు లేక నియమములు, అది ఈ చట్టము యొక్క నిబంధనలకు అసంగతముగా లేనంతమేరకు, ఈ చట్టము క్రింద అది రద్దు చేయబడువరకు లేక మార్చబడు వరకు అమలులో కొనసాగవలెను మరియు ఈ చట్టము యొక్క తత్సమానమైన నిబంధనల క్రింద చేయబడినట్లు భావించబడవలెను.

విశదీకరణ : - ఏదైన నిబంధన లేక ప్రాంతము విషయములో " ఈ చట్టము యొక్క ప్రారంభము ", అనగా ఆ ప్రాంతములో ఆ నిబంధన ప్రారంభమగుట, లేక, సందర్భానుసారముగ, ఈ చట్టము ప్రారంభమగుట, అని అర్ధము.

13. ఈ చట్టము ననుసరించి వ్యవహరించుచున్న. ఏ ప్రాధికారిగాని వ్యక్తి గాని సామాన్య జీవన వ్యాసంగములలోను ఆస్తిని అనుభవించుటలోను, ప్రజాభద్రతను మరియు పౌరరక్షణను కాపాడు నిమిత్తము అనువుగా నుండునంత తక్కువ జోక్యము కల్పించుకొనవలెను.

14. . (1) ఈ చట్టము ద్వారా గాని దాని క్రింద గాని ఒసగబడిన ఏదైన అధికారమును వినియోగించుచు చేయబడిన ఉత్వరువు ఏదియు ఏ న్యాయస్థానము లోసు ప్రశ్నగతము కారాదు.


(2) ఏదైన ఉత్తరువు ఈ చట్టము , ద్వారా గాని దాని క్రింద గాని ఒసగబడిన అధికారమును వినియోగించుచు ఎవరేని ప్రాధికారిచే చేయబడి సంతకము చేయబడినట్లు భావించవల్సియున్నయెడల, భారత సాక్ష్య చట్టము, 1872 ( 1872 లోని 1వ చట్టము) యొక్క అర్ధములో అట్టి ఉత్తరువు అట్టి ప్రాధికారిచే చేయబడినదని న్యాయస్థానము పురోభావన చేయవలెను.

సాయుధ బలములు రక్షణకై తీసికోనబడిన చర్యలకు ఈ చట్టము వర్తించకుండుట.

15. సంఘ సాయుధ బలములకుగాని, అట్టి బలముల పొరరక్షణ లేక భద్రతను కాపాడుటకై లేక ఏదైన నౌకా, సైనిక లేక వైమానిక బలముల ప్రతిష్టాపనలు లేక భండారముల రక్షణ కొరకు - సంఘ సాయుధ బలములపై నియంత్రణ కలిగియున్న ఎవరేని ప్రాధికారులచే తీసికొనబడిన ఏవైన చర్యలకు గాని, ఈ చట్టము లేక ఈ చట్టము క్రింద చేయబడిన ఏదైన నియమము, వినియనుము లేక ఉత్తరువులో నున్నదేదియు, వర్తించదు.

16. ఈ చట్టము క్రింద శిక్షింపదగిన ఏదైన అపరాధమునకై అభియోగ మేదియు, ఏ వ్యక్తి పైనగాని, కంట్రోలరు లేక ఈ విషయమున కంట్రోలరుచే ప్రాధికృతుడైన ఎవరేని వ్యక్తిచే తప్ప, లేక వారి సమ్మతితో తప్ప, తేబడరాదు.

ప్రత్యాయోజనము చేయు అధికారము,

17. రాజ్య ప్రభుత్వము అధిసూచన ద్వారా----

(ఎ) ఈ చట్టము క్రింద తనచే వినియోగించబడు అధికారములన్నీగానీ, వాటిలో ఏవైనను గాని, ఆ అధిసూచనలో నిర్ధిష్ట పరచబడునట్టి పరిస్థితులలోను ఏవైన ఉన్నయెడల, అట్టి షరతులపైనను, రాజ్య ప్రభుత్వము అభిప్రాయములో ఒక జిల్లా మేజిస్ట్రేటు హోదాకు తక్కువకాని, సదరు అధిసూచనలో నిర్ధిష్టపరచబడు. అధికారిచే కూడ వినియోగించబడవలెననియు; ఈ చట్టము క్రింద కంట్రోలరుచే వినియోగించబడదగు అధికారములన్ని లేక ఆ అధికారములలో ఏవైనను, ఆ అధిసూచనలో నిర్ధిష్టపరచబడు నట్టి పరిస్థితులలోను ఏవైన ఉన్నయెడల అట్టి షరతులపై నను, రాజ్య ప్రభుత్వము అభిప్రాయములో ఒక సబ్-డివిజనలు మేజిస్ట్రేటు హోదాకు తక్కువకాని, సదరు అధిసూచనలో నిర్ధిష్టపరచబడు అధికారిచే కూడ వినియోగించబడవలెననియు;

ఆదేశించవచ్చును.

సద్భావపూర్వకముగ తీసుకోనబడిన చర్యకు

16. ఈ చట్టము క్రింద లేక దాని క్రింద చేయబడిన ఏవేని నియమములు లేక ఉత్తరువుల క్రింద లేక ఏదైన అట్టి నియమము క్రింద జారీ చేయబడిన ఏదైన ఉత్తరువు క్రింద సద్భావపూర్వకముగా చేయబడిన లేక చేయుటకు ఉద్దేశింపబడిన దేనిని గూర్చియైనను రాజ్య ప్రభుత్వముపై గాని ఆదేశకునిపై గాని లేక కంట్రోలరుపై గాని లేక ప్రభుత్వముచే లేక కంట్రోలరుచే ప్రాధికృతుడైన ఏ వ్యక్తిపై గాని ఎట్టి దావా, అభియోగము లేక ఇతర శాసనిక ప్రోసీడింగులు ఉండవు .

(2) ఈ చట్టము లేక దాని క్రింద చేయబడిన ఏదైన నియమము లేక ఏదేని అట్టి నియమము క్రింద జారీచేయబడిన ఏదైన ఉత్తరువు క్రింద, సద్భావ పూర్వకముగ చేయబడిన లేక చేయుటకు ఉద్దేశింపబడిన దేని వలననై నను కలిగిన లేక బహుశ: కలుగగల ఏదైన నష్టమునకు, ప్రభుత్వముపై గాని, డెరెక్టరుపై, గాని, కంట్రోలరుపై గాని, లేక ప్రభుత్వముచే లేక కంట్రోలరుచే ప్రాధికృతుడైన ఏ వ్యక్తిపై గాని, ఎట్టి దావా ఇతర శాసనిక ప్రోసీడింగులు ఉండవు.

ప్రాధికృత వ్యక్తులను దళపు సభ్యులను ప్రభుత్వ సేవకులగుట,

19.ఈ చట్టము క్రింద కంట్రోలరుచే గాని రాజ్య ప్రభుత్వముచే గాని ప్రాధీకృతుడైన ఏ వ్యక్తి యైనను, మరియు దళపు ప్రతి సభ్యుడును, అట్లు పనిచేయుచున్నపుడు, భారత శిక్తా స్మృతి (1860 యొక్క 45వ చట్టము) యొక్క 21వ పరిచ్ఛేదము యొక్క అర్ధములో ఒక ప్రభుత్వ సేవకుడుగా భావింపబడవలెను.

నియమములు మరియు వినియమములు పార్లమెంటు సమక్షమున ఉంచబడవలసి యుండుట


20. ఈ చట్టము క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రతి నియమమును, మరియు ప్రతి వినియమమును దానిని చేసిన పిమ్మట వీలైనంత త్వరితముగా పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతి యొక్క సదనము సమక్షమున, ఉంచవలెను. అట్టి కాలావధి ఒకే అధివేశనములో గాని రెండు అనుక్రమ అధివేశసములలో గాని చేరియుండవచ్చును; మరియు అట్లు ఉంచబడిన అధివేశనము ముగియు లోపలగాని దానికి అవ్యవహితముగా వచ్చు అధివేశనములోగాని ఉభయ సదనములు ఆ నియమములో లేక వినియమములో ఏవేని మార్పులు చేయుటకు అంగీకరించినచో, లేక సందర్భాను సారముగ ఆ నియమము లేక వినియమము అట్లు చేయబడరాదని ఉభయ సదనములు అంగీకరించినచో అటు పిమ్మట ఆ నియమము లేక వినియమము అట్టి మార్పు చేయబడిన రూపములో మాత్రమే తదనంతర ప్రభావము కలిగి యుండును లేక సందర్భానుసారముగ ప్రభావరహితమై యుండును; అయినప్పటికినీ అట్టి మార్పుగాని రద్దుగాని అంతకు పూర్వము నియమము క్రింద లేక వినియమము క్రింద చేసిన దేని శాసనమాన్యతకైనను భంగము కలిగించదు.