పెద్దాపుర సంస్థాన చరిత్రము/రామరాజు సంతతి - దేశస్థితి

రామరాజు సంతతి - దేశస్థితి.

8. పెద్దాపుర సంస్థానచరిత్రము. “ 3. ఆరామరాజేంద్రుఁ డాజిరంగంబున నైరిరాజులఁ 7ಶ್ನಿ! నారిచేత మదగజకంఖాణమాణిక్యగాణిక్య కనకాంబరము లుపాయనము లంబె యాచక శ్రేణుల కభిమతార్థము లిచ్చెఁ బ్రజల సంరక్షించె భరతునట్ల తగవత్సవాయాఖ్యనగరంబు నిజనివాసముఁ జేసె నది కారణము X సాగి ఆ.నె, నంశమునకు విత్సవాయ నామము లోక సుప్రసిధ్ధ నుసచు సొంపు గాలచే.'; అను సీసపద్యమువలన విస్పష్ట్రముగా బోధపడుచున్నది. కాబట్టి నిత్సవాయ రాజనాంశజులకు మూలపురుషు లీరావు రాజుగా రని నిస్సంశయముగా నుడున విచ్చును. ఈయనకు రామరాజు, తెలుఁగురాజు, అనంతరాజు, గోపరాజు నను నల్వురు కుమారు లుచయించిరి. వారిలోఁ దెలుఁగుహేజు రేకపల్లిద్భుధ్యకుఁడు గానుండి, శత్రువుల sజేయుఁడైయుండి విక్రమార్క_చరిత్రం బనునొకయుత్తమకావ్యమునకు నాయకసఁ డయ్యె 3部) పై రామవిలాసములోని— ము. అచలాధీశ్వరధీరు రేకపలి దుస్థాధ్యకు విద్వేషిరా ట్ర్పచయో ద్వేలబలావిలేపతిమిరప్రద్యోతనుకా విక్రమా ర్కచరిత్రోత్తమకాన్యనాయకుని వేడ్కకా బ్రస్తుతింపం దగుకా సుచరిత్రాధ్యుని నిత్సవాయ తెలుఁగుణీశచూడామణిశ్రా? అనుపడ్యమునలనఁ డెలియుచున్నది గానివిక్రమార్క_చరిత్ర మను నాయువు కాన్యిమునకుఁ గర్తయయినకవితంనుఁ డెనఁడో తెలియిరా దయ్యెను.

  • రావు రాజు సంతతి_దేశಸ್ಥಿತಿ.

రామం రాజుకునికుఁ బిమ్మటఁ దత్సంతతి వారియొక్క చరిత్రము వివరముగాఁ దెలియు నట్టి యాధారము లిన్నూరు సలనాత్సరములనఱకుఁ কর্তO"). సాగివంశపు రాజు లాలూకాలములయందుఁ బావు నివాసించు ప్రదేశములనుబట్టియుఁ, ప్రసిద్ధులైన ప్రథాన నాయకుల నామములనుబట్టియు వేశ్వేఱు వంశనామములను ఐహించి దేశముయొక్క

  • ప్రకృతకాలమునఁ బ్రసిద్ధికెక్కిన యాంధ్రకృత్రియకుటుంబములలో నొకటియ యొున బుద్ధిరాజువారివంశముకూడ నీ రామరాజువారిసంతతిలాగోనిడే యని పెద్దలు చెప్ప దురు. ఇందుకు లిఖితరూపకమైన యాధారమేదియుఁ గాన్పింపదు. అట్టిది కనిపిం చునఱకు వునను పెద్దలమాటలనే విశ్వసింపనలసియుండును. నానా భాగములకు బోయి పౌరుష విక్రమాదులను నెఱపుచు ప్రఖ్యాతి గాచుచుండిరి. అట్లే సాగివంశములో నంతర్భాగ మైన వస్తావాయ వంశములోని వారు కూడా కొంతకాలము స్వతంత్రులుగాను, కొంతకాలము మహమ్మదీయుల పక్షమును మరి కొంతకాలము గజపతుల పక్షమునుండి ప్రతిపక్షనాయకులతో పోరాడుచు, నందందు గిరిదుర్గముల నాక్రమించుకొనుచు బదునాఱవ శతాబ్దంలో లను, రెడ్డినాయకులను జయించుటదుస్తరంగుట చేతనో, మతాంతరులైనతురుష్కుల సాహాయ్యమపేక్షించుట దేశద్రోహమగు నన్న తలంపుచేతనో గాని కళింగోత్కల దేశాధీశ్వరు లగుగజపతుల సహాయమునుబొంది, కపిలేశ్వరగజపతిరాయలకాలమున బశ్చిమమున నోరుగల్లువరకును, దక్షిణమున గాంచీపురమువరకును జయించిరి. వత్సవాయవారు, సాగివారు, పూసపాటివారు, మందపాటివారు, దంతులూరివారు, దాట్లవారు, గణపతిరాజువారు మొదలుగాగల సుప్రసిద్ధులగు రాచవారనేకులు గజపతులక్రింద సర్వాధికారములను వహించి ప్రబలులైరి. ఆంధ్రదేశమునందున్న క్షత్రియులందరు తమయనుపమాన శౌర్యసాహసములను ప్రకటించినకాల మిదియే !

క్రీ.శ. 1461వ సంవత్సరములో బహమనీరాజైన అహమ్మదుషా త్రిలింగదేశపురాజులను జయించి ఓరుగల్లుపట్టణమును వశపరచుకొనియెను. కాని 1440వ సంవత్సరములో గళింగదేశపురాజును, కపిలేంద్రజగపతిమహారాయల కుమారుడును నగు ఉర్బరదేశకుమారమహాపాత్రుడును, పరశురామతనయుడును నగు వీరభద్రరాజును గలిసి ఏకశిలానగరముపై దండెత్తివచ్చి, మహమ్మదీయులనచ్చటినుండి పారద్రోలి, ఓరుగల్లును మరల స్వాధీనము చేసికొన్నట్ట్లు, అచ్చటివారిశాసనములవలన బోధపడుచున్నది. 1471వ సంవత్సరములో గజపతులకు సామంతులుగానున్న మండలేశ్వరులన్యోన్యవైషమ్యములను బెంచికొని,తమలోదాముపోరాడుచుంటనుజూచి, కొండపల్లి రాజమహేంద్రవరదుర్గములను, దత్ప్రాంత ప్రదేశములను దనరాజ్యములో జేర్చికొనుటకై సంకల్పించి, విఫలమనోరధడయ్యెను. తరువాత కపిలేంద్రగజపతి మరణము నొందగా పురుషోత్తమగజపతిమహారాయలు సింహాసనమునకువచ్చెను. అందును గూర్చి యతనికిని, నతనిదాయాదికిని వివాదముపొసగి, యాదాయాది మహమ్మనీయులసాహాయ్యమును గోరెను. అప్పుడు బహమనీరా జైన రెండవమహమ్మదుషా యదివరకే గజపతుల రాజ్యము నపహరింపవలెనను పేరాసతో నున్నవాడగుటచేత మిక్కిలిసంతోషించి, యాపని నిర్వహించుటకై, మల్లిక్-ఉల్-ముల్క్ అను బిరుదము నొసంగెను. ఈబిరుదమే తరువాత మహమ్మదీయుల బిరుదములలో మిక్కిలి ప్రఖ్యాతివహించినదయ్యెను. ఈనిజామ్-ఉల్క్-ముల్క్ మొదట హిందువుగానుండి, బాల్యములో మహమ్మదీయులచే జెరగొనిపోబడి యంతపురమున రాజునకు సహవాసిగా నియమింపబడి మహమ్మదీయమతావలంబకుడై, బహమనీరాజ యొక్క దయకుబాత్రుడై,యిభివృద్ధిగాంచి, ప్రఖ్యాతికెక్కినవాడుగానుండెను. తరువాత నితడు గజపతులరాజ్యముపైకి దండె త్తిపోయి, కొండపల్లి రాజమహేంద్రవరదుర్గములను జయించి, యాదేశములను దన ప్రభువురాజ్యములో జేర్పించెనుగాని తరువాత నయ్యనియొక సంవత్సరముకాలములోనేగజపతులకు సామంతులుగా నున్న మండలేశ్వరులవశ మయ్యెను. అంతట రెండు సంవత్సరములు దేశములో క్షామోపద్రవము సంభవించి, వర్షములు లేక పంటలు పండ్క, బావులింకిపోయి, ప్రజలు వలసపోవుట థటస్తహించెను. ఈరెండుసంవత్సరములలోను ద్రిలింగదేశమును, బహమనీరాజ్యమును గూడ వేడిమంగలమునలె వేగు మండుట చేత విత్తనముల చల్లికయే లేకపోయెను. కాని కొంతకాలమునకు భగవదనుగ్రహమువలన వర్షము కురిసి భూమి వ్యవసాయమున కనుకూలముగ నున్నను, వ్యవసాయము చేయుజనుల సంఖ్య మిక్కిలి తక్కువై యుండెను. ఇట్ట్లుండ గొండపల్లిదుర్గములో నున్న తెనుగుసైన్యము తిరుగబడి దుర్గాధ్యక్షుడగు మహమ్మదీయప్రభువును సంహరించిరనియు, ఏతద్దుర్గమును వశపరచుకొన్న యొరిస్సాగజపతుల సేనానులలో నొకడగుభీమరాజు దేశమంతయు క్షామభూయిష్ఠమైయుండుతట చేత బహమనీరాజుల ఖ్వాజామహమ్మదుగవానును రాజమహేంద్రవరమున నిలిపి, ఉత్కలదేశకుపై దండెత్తిపోయి, దేశమును బాడుచేసియు, ప్రజలను జూరగొనియు, దృప్తిగనజాలక, గజపతిని సింహాసనబ్రష్ఠున్ని గావించి, గజపతిరాష్ఠ్రమునంతయు శాశ్వతముగ దనరాష్త్రములో జేర్పవలయు నని నిశ్చయించి,తనకొడుకును, మంత్రిని రాజమహేంద్రవరమునుండి రప్పించెను. కాని బుద్దిశాలి యగుగజపతి సమర్ధులచే రాయబారము నడిపించి, కొంతధన మాతనికి సమర్పించి, తురుస్కులు మరలిపోవునటుల జేసెను. ఆధనముతో మహమ్మదుషా తృప్తి బొందనందున ప్రాణసమానముగా జూచుకొను చున్నరురువదియైదు యుద్ధగజములనుగూడ సమర్పించెను. అంతట మహమ్మదుషా మరలి కొండపల్లివరకు వచ్చి, రోషావేసపరవశుడై కొండపల్లి దుర్గమును ముట్టడించెను. కానీ యారుమాసములవర కాదుర్గము స్వాధీనము కాకపోయెను. ఆహారపదార్ధములు తక్కువయగుటచేతభీమరాజు దుర్గములో నిలువజాలక లోబడి, దుర్గమును తురుష్కులవశము చేసెను మహమ్మదుషా తనకింత కాలమువరకు దుర్గము వశము కానందుకు మండిపడుచు, మతాబినివేశపరుడై యచటి దేవాలయములలో నొకదానినిబ్రవేశించి, తనచేతిఖడ్గముతో బ్రాహ్మణ పూజారులను గొందరిని నరికి నారంబించెను ఇతడు తురుష్కదేశమునుండి వచ్చిన యొక యుద్దవీరుడు. ఇతడు బహమనీరాజ్యమునుండి కొంతప్రదేశము నాక్రమించుకొనుటతో మాత్రము తృప్తినొందక, మహమ్మదీయమతమునకు శత్రువులుగా నున్న యాంధ్రరాజులను జయింపగోరి విజృంభించెను. కంభముమెట్టున కధిపతి యైనసీతాపతి నోడించి, యంతవరకుగల తెలుగుదేశము నాక్రమించెను. అద్దంకి గంగాధరకవి వీనివిజయములను దనతపతీసంవరణోపాఖ్యానములొ__

"పీ.పడమటను సవాయి బసవనిగా జేసి యచట గొయ్యలకొండ నావరించె
తమది మల్లాహాను దక్షిణంబున గొట్టి హరియించె బానుగ ల్లదిగిరులు
నుత్తరంబున బరీదోడి పారగ ద్రోలి మెతుకుదుర్గంబాక్రమించిమించె
బ్రధమదిక్కున నొడ్డి పాత్రసామంతుల ధట్టించి కంభముమెట్ట గొనియె
నతని బొగడంగ దగదె యాచతురసీతి
రూఢి గిరిదుత్గలుంఠనప్రౌఢతేజు
వాహశిఖరాధిరోహరేవంతమూర్తి
కుతుబశా హినిక్షాపాలు గుణవిశాలు"

అనుపద్యంబున దభివర్ణించెను. ఇత డాంధ్రదేశముపై దండెత్తివచ్చి వరుసగా కంభముమెట్ట, కొండపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము మొదలగు దుర్గములను ముట్టడింపగా విశ్వనాధదేవగజపతి, సుల్తానుకులీకుతుబ్ షాతో సంధిచేసికొని, యుభయరాజ్యములకు గోదావరినది సరిహద్దుగా నిర్ణయించుకొనిరి. అంతట సుల్తాను కులీకుతుబ్ షా తన ముఖయనగర మైన గోలకొండకు మరలి పోయెను. ఇతడు 1543 వ సంవత్సరము లొ దొంబదవయేట దనరెండవకుమారుడైన జమ్షీదుచే జంపపడియెను. తరువాత 1550 వ సంవత్సరమున బ్రసిద్దివహించిన ఇబ్రహీమ్-కులీ-కుతుబ్ షాహ తెలింగవాదేశము నాక్రమించుకొనియెను. గజపతులపక్షమున సీతాపతి, వేదాద్రి వత్సవాయ ముసలి తిమ్మరాజుగారును దండెత్తి వచ్చి, ఏలూరుదుర్గమును ముట్టడించిరి. ఏలూరు సర్కారునకు డిలావర్ ఖానుడు గవర్నరుగానుండి, కోటలోనుండి యధికపౌరుషముతో బోరాడెను గాని నిష్ప్రయోజనమై, మిక్కిలి దురవస్థలో నుండి, గోలకొండ కనేకచారులను బంపించి సహాయమునకై నిరీక్షించి యుండెను. అంతట ఇబ్రహీము తన్ను ముట్టడించియున్న శత్రువులతో సంధిచేసికొని కొంతసైన్యమును డిలావర్ ఖానునికు దోడ్పడుటకై యేలూరునకు బంపించెను డిలావర్ ఖాను డీసైన్యము యొక్క తోడ్పాటుచే శత్రువులను దరిమి, కుతుబ్ షాహయొక్క ఉత్తర్వును శిరసావహించి శత్రువులు, సరిహద్దును దాటిరాకుండ, నిడదవోలులో నొకకోట గట్టించెను ఈ కోటను గట్టి డిలావర్ ఖాను రాజమహేంద్రవర దుర్గమును ముట్టడించి స్వాధీనము చేసికొనుట యుక్తమని కుతుబ్‌షాకు భోదించెను.


రఫత్ ఖానుని దండయాత్ర.


అప్పుడు హరిచందన దేవుడు లేక విష్ణు దేవుడను ఆంద్రుడు గజపతుల రాజ్యము ఆక్రమించుకుని, బంగాళాదేసశము మొదలుకుని గోదావరి పర్యంతముగల తూర్పు తీరమును పరిపాలించుచుండెను. రాజమహేంద్రవర దుర్గం ఇతని రాజ్యము లోనిదిగా వుండి ఆ ప్రాంతానికి పరిపాలకుడిగా వున్న వేదాద్రిచే (రెడ్డి కాబోలు) సంరక్షించ బడుచూ ఆంద్ర మహమ్మదీయులకు దుస్శాద్యముగా ఉండెను. ఈ దుర్గాద్యక్షుడైన వేదాద్రి కొంచెం ఇంచుమించు గా స్వతంత్రుడై వ్యవహరించు చుండెను. రెడ్డి సంస్థానమునకు పరిపాలకుడై వేదాద్రి కి ప్రధాన మంత్రిగా ఉన్న వత్సవాయి పేర్రాజు గారి పుత్రుడు మహా వీరుడు అయిన ముసలి తిమ్మ రాజు గారు రెండు వేల సైన్యమునకు అధీశ్వరుడైన సర్దారుగా నుండది మహామ్మదీయులతో చెలిమి చేయ నారభించెను. ఆయన మహమ్మదీయులకు తోడ్పడినందుకు ప్రతిపలము గా వారు కిమ్మూరు సీమ తమ కిచ్చునట్లు ఒప్పందం చేసికొనెను ఇంతే కాక కళింగ దేశమున మాండలిక రాజు లన్యోన్యము వంచకులై, యొండరులతో పోరాడుచుండిరి. బంగాళా దేశ ప్రాంతము నుండి శత్రువులు దండెత్తి వచ్చుట ఇబ్రహీము ఉత్సాహ వంతు దిన దిలావారు ఖాన్ కోరిక ను మన్నించెను. అప్పుడు ప్రసిద్ధి కెక్కిన సేనాని అగు రపత్ ఖాను లారీయను నతనికి మల్లిక్ నాయబ్ అను బిరుదము నొసంగి, సైన్యాద్యక్షునిగావించి, తక్షణము పోయి నిడదవోలు దుర్గమున