ఈ పుట ఆమోదించబడ్డది
ఓం

శ్రీ గురుభ్యోనమః

ఉపోద్ఘాతము

ఈ భరత భూమి పరమ పవిత్రమైనది. ఇందు వేదములు ఉద్బవించినవి. శాస్త్రములు ప్రభవిల్లినవి. ప్రపంచము నందలి సర్వ జ్ఞానము సనాతన భారతి యందు మూర్తీ భవించినది. ప్రపంచనమునకు సున్నను ప్రసాదించి గణిత శాస్త్ర పురోభి వృద్ధికి దోహదజు చేసినది భారతీయ మహర్షులు.భూగోళ మందలి ఎక్కువ భాగములోని ప్రజలు కండ్లు పూర్తిగా తెరువని కాలము నాడే ఇచ్చట ఎన్నో శాస్త్రములు, కళలు వెల్లి విరిసినవి. తన చుట్టూ నున్న వాఅతావరణమును విపులంగా తెలిసి కొనుటతో పాటు తనను గూర్చి ఎక్కువగా తెలిసి కొనినాడు సనాతన భారతీయ మహార్షి. తన యొక్క భౌతిక శరీరము,దానిని అనుసరించి యున్న సూక్ష్మ కారణ శరీరముల గురించి చాల వివరముగా తెలిసి కొన్నాడు. నక్షత్ర శాస్త్రము, కాంతి వేగమును, కాంతి సంవత్సరములను గూర్చి వివరముగా గ్రహించినారు భరత ఋషులు, భరత భూమి రత్న గర్భ కూడ. దీని యందలి రత్న రాసులపై విదేశీయులకు కన్ను పడింది. కొంత కాలమునకు దేశమందలి రాజ్యములు ఏలు రాజులలో ఐకమత్యము సన్నగిల్లుట తెలుసుకొని పర దేశీయులు