ఈ పుట ఆమోదించబడ్డది

84

లంక సూర్యనారయణ


38. హస్త సృష్ట బద్ధపాద ప్రసరణాసనము :




కూర్చుని రెండు కాళ్ళస్ను ఇరు ప్రక్కలకు సరళ రేఖలో ఉండు నట్లు చాచి చేతులు రెంటిని వీపు వెనుక కట్టు కొని ముందునకు వంగి నేల మీద రెండు భుజములు, గడ్డము తాకు నట్లు వుంచ వలెను.

ఉపయోగములు

దీని వలన పొత్తి కడుపులో నున్న అవయవములు ఒత్తిడి పొంది ఎక్కువ రక్తమును గ్రహించును. అందువలన జఠరాగ్ని వృద్ధి చెందును. మలాశయము మూత్రాశయము మరియు ప్రోస్టేట గ్రంధులు బాగుగా పని చేయును. మరియు తొడల మూలమందున్న బంతి గిన్నె కీలు చుట్టు నున్న సంధి బంధములు స్నాయువులు బలపడును. అచ్చట వాత దోషములు తొలగును.