ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

(ప్రారంభం)

ఆసనమనగా స్థిరసుఖమ్‌ అని పతంజలి మహర్షుల వారు వివరించిరి. ఆసనము శరీరమునకు స్థిరత్వమును, సుఖమును ఇచ్చునదై యుండును. ప్రపంచముపై ఎన్ని జీవ రాసులున్నవో అన్ని ఆసనములు ఉన్నవి. కాని విజ్ఞానులైన ఋషులు 84 లక్షల ఆసనములకు బదులు 84 ఆసనములను మాత్రమే ముఖ్యమైనవిగా పేర్కొనిరి. ఆ ఎనుబది నాలుగింటిని కూడ కుదించి ముప్పది రెండు మాత్రము అతి ముఖ్యమైనవిగా మానవ శరీరమునకు ఉపకరించునని నిర్థారణ చేసిరి. ఆసనములు కొన్ని బోరగిల పడుండి చేయునవి. కొన్ని వెలకిల పరుండి చేయునవి. కొన్ని నిలబడి చేయునవి. మరి కొన్ని కూర్చొని చేయునవి. ఇలా నాలుగు విధములుగా వర్గీకరింపవచ్చును. అందు కూర్చొని చేయు ఆసనములు సిద్ధ, పద్మ, స్వస్తిక, సుఖ అను నాలుగు ఆసనములు.