ఈ పుట ఆమోదించబడ్డది

36


సర్వాంగాసనమని మారొక ఆసనము వున్నది. ఇందు సాధకుడు వెల్లికిల వీపు మీద పరుండి శిరస్సు మెడ భూమి మీద ఆనించి భుజముల నుండి పాదముల వరకు వున్న శరీరమును నిట్టలిలువుగా ఎత్తవలయును. ఇందు గడ్డము రొమ్ముపై భాగమును తాకి వుండవలయును. ఈ మాత్రమునకే సర్వాంగాసనమని ఏల పేరు పెట్టిరి. దీని పేరునకు తగినట్టి ఆసనమే యిది. ఇందు కంఠము నందలి ధయిరాయిడు గ్రంధులు, శిరస్సులో ప్రవేశించి వున్న వెన్నెముక పైభాగమున వున్న పీనియల్ గ్రంధులు మరియు దాని దిగువున వున్న పిట్ట్యుటరి గ్రంధులు చక్కగా పని చేయుట వలన ఆ గ్రంధుల నుండి స్రవించు రసములు (హర్మోనులు) శరీరము వున్న ఆ గ్రంధుల నుండి శ్రవించు రసములు (హార్మోనులు) శరీరమున వున్న యితర గ్రంధులను బాగుగా పని చేయించుట శరీర నిర్మాణము మొదలగు కార్యములు చేయించును. ఇది గాక యోగ శాస్త్ర రీత్యా శరీరమునందు చంద్ర స్థానము శిరస్సు నందున్నది. సూర్య స్థానము నాభి యందున్నది. చంద్ర స్థానము నుండి ఉత్పత్తి అయిన అమృతము క్రిదకి పడగా క్రింద నున్న అగ్నొ స్థానమైన నాభి స్థానమందు పడి భస్మీభూతము అగు చున్నది. ఈ ఆసనము వలన రెండు స్థానములు తారుమారై సూర్య స్థానము (అగ్ని స్థానము) నాభి కమలము పైకిన్నీ చంద్ర స్థానము క్రిందకిన్నీ వచ్చినవి. అపుడు ఉత్పత్తి అయిన అమృతము శరీరమున నిల్చి చిద్రమగుచున్న శరీరమును పునర్జీవన కల్గించు చున్నది. ఇంతటి