ఈ పుట ఆమోదించబడ్డది

33


చుండును. మితి మీరిన వ్వాయామము వలన కీళ్ల వ్యాధులు వంటి అనర్థములు వాటిల్లును. అందు చేత వ్యాయామము మితముగానే చేయ వలయును. బలము సంపాదించుట కొరకు 200 కేజీల బరువులను ఎత్తు కోనక్కర లేదు. పాతిక మైళ్ళు పరుగు చేయుట కూడ అవసరముండదు. శరీరము ఎంత వ్యాయామమును సుఖముగా సహించ గలదో అంతకు కొంచెము ఎక్కువగా మాత్రమే చేయవలయును గాని ఎక్కువ చేయుట శరీరమునకు హాని కరము. శరీరము ఒక రాగి పాత్ర వంటిది. దానిని నిత్యము తోమినట్లు వ్యాయామము చేసి చిలుము పట్టకుండా నివారింప వలయును.

అష్టాంగ యోగ మందలి ఆసన ప్రాణాయామముల వలన ఎట్టి విపరీత ఫలములు వుండవని గ్రహించి ప్రపంచ మంటటను వైద్యులు, వైజ్ఞానికులు, సామాన్యుడు కూడ యోగాసనములకు ఎగ బ్రాకు చున్నారు. సనాతన ఋషులు కూడ ఈ ఆసనములు శరీరమును ధృడ పరచున్నియే నిర్దేశించినారు. ఉన్నత యోగ సాధన కొరకు మాత్రము కొన్ని ఆసనములల యందు సిద్ధిని సాధించ వలసి యున్నది. అనగా కొన్ని గంటల పాటు సుఖముగా ఆ ఆసనము నందుండుటను సాధింప వలసి వున్నది. మిగిలిన ఆసనములు శరీర వ్యాయామమునకు ఉపకరించును. ఆసన వ్యాయామము ఇతరములగు అన్ని వ్యాయామముల కన్నా ఉత్తమోత్తమ మయినది. ఇందు శరీరమున వున్న కండరములు ఎక్కువ శ్రమ పడవలసిన అవసరము లేదు. చెమటలు కార్చి వ్యాయామము చేయ నవసరము