ఈ పుట ఆమోదించబడ్డది

31


భౌతిక శరీరమున పీవియల్, పిక్ట్యుటరి, పేంక్రియాన్, ఎడ్రినల్స్ మూత్ర పిండములు, ప్రొస్టేటు వంటి కొన్ని గ్రంధులు కలల్వు. ఈ గ్రంధులు శరీరమున ఒక విధమైన హార్మోనులనబడు ద్రవ్యములను సృష్టించు చున్నవి. ఈ రస ప్రభావము వలన మనము తినిన ఆహారము జీర్ణమయి శరీరమునకు కావలసిన పోషక పదార్థములను సృష్టి చేయుటకు శరీరమునకు హాని కలుగ జేయు పదార్థములను తొలగించుటకు పనికి వచ్చు రసములను తగు పాళ్ళలో ఉత్పత్తి చేయును. మన శరీరము నందలి అవయములు నిత్యము పని చేయుట వలన కలిగిన అరుగుదలను భర్తీ చేయుటకు ఉపకరించు చున్నవి. మాతృ గర్భము నుండి శిశువుగా బయటకు వచ్చిన తరువాత శరీరమున పెరుగుదల పోషణయు చురుకుగా సాగు చుండును. సుమారు 25 లేక 27 సంవత్సరముల వయస్సు వచ్చు వరకు ఈ గ్రంధులన్నియు పని చేసి శరీర నిర్మాణమున పరిపూర్ణత సాధించి నిండు యవ్వనముతో శరీరము లావణ్యము కల్గి తొణికిసలాడు చుండును. అటు పిమ్మట కొన్ని గ్రంధులు డస్సి పోయినట్లు చురుకు తనము తగ్గి మంద గిల్లును. శరీర పోషణకు పనికి వచ్చు రసముల అనగా హార్మోనుల ఉత్పత్తి తగ్గించును. అందు వలన అప్పటి నుండి దేహము పెరుగుట మంద గించును. ఎముకలు పెళుసు బారును. చర్మము ముడతలు పడి లావణ్యము తగ్గును. రాను రాను శరీరము రోగమును పొందును. సామాన్యముగా జనులు శరీర వ్వాయామము చేసి కండరములు ఊపిరి తిత్తులు, హృదయము మొదలగు భాగములకు పని కల్పించి రోగములను దూరము చేయుటకు ప్రయత్నించు చున్నారు.