ఈ పుట ఆమోదించబడ్డది

29


హత అజ్ఞా చక్రములందు కలియుచున్నవి, ఇడా, పింగళులు సుషుమ్నకు ఇరుప్రక్కలుగా పోయి కేంద్రములందు చక్రముల యందు కుడి ఏడమలు మారి పై చక్రము నందు మరల ఎడమ కుడి ప్రక్కలకు మారు చుండును. అటులనే గాంధారి, హస్తి, జిహ్వ, కుహు, పూష, సరస్వతి, పయస్విని, శంఖిని, వారుణి, ఆలబుష, విశ్వోధరి, యశశ్వని, మొదలుగా గల నాడులు కంద స్థానము నుండి బయలు దేరి సుషుమ్న నాడికి ప్రక్క గానే ప్రసరించుచు శరీర మంతయు విస్తరించుకొని యున్నవి.

మన శరీరమున దశ వాయువులు గలవు, వాయు సంచరమునకు అనువగు సూక్ష్మ నాడుల యందు ఈ వాయువులు వ్వాపించి యుండును. ఇవి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అను ముఖ్యమగు ఐదు వాయువులు. వీనినే పంచ ప్రాణములు అందురు. మారియు ఇవి గాక ఐదు ఉప వాయువులు గలవు. ఇవి నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ అనునవి. ప్రాణ వాయువు హృదయము నందును, అపాన వాయువు మూలాధారమునను సమాన వాయువు నాభి స్థానమునను ఉదాన వాయువు కంఠ స్థానమునను వ్యాన వాయువు స్వాధిష్టాన చక్రమును ఆధారముగా చేసికొని సర్వాంగముల యందును ప్రసరించి యుండును. వాయువు అంతయు ఒకటియే అయినప్పటికీ స్థాన భేధముల చేత వివిధ కార్యములు చేయుచు ప్రవర్తిల్లినవి. నాగ వాయువు వలన ఎక్కిళ్ళు కలుగు చున్నవి. కూర్మ వాయువు కంటి రెప్పలను మూయుటకు తెరచుటకు ఉప యోగ పడు చున్నది. కృకుర వాయువు వలన ఆకలి దప్పులు