ఈ పుట ఆమోదించబడ్డది

17


పాలన చేయుచు అష్టాంగ యోగమున మూడవది యగు ఆసనములను అభ్యసించ వలయును. అసనమనాగా స్థిర సుఖాసనమ్ అని పతంజలి మహార్షులవారు సూత్రీకరించి యున్నారు. అనగా ఆసనము స్థిరమైన, సుఖ ప్రదమైన ఒక భంగిమ. అది ఎట్టిదైనను కావచ్చును. యోగ సాధన పై తరగతులలో సాధన చేయు వారు గంటా కొలది, దినముల కొలది తన శరీరము పై ధ్యాసను విడచి భగవంతుని యందు చిత్తమును లయ పరచి ఉంచవలసి యుండును. అందు కొరకు ఒకటి లేక రెండు సుఖమయిన ఆసనములను సాధకుడు ఎన్నుకొని ఎంత కాలమయినను ఎట్టి బాధను పొందక ఆసనములో నుండు రీతిని ఆసన సిద్ధిని సాధించ వలసి యుండును. వివిధ ఆసనముల సాధన శరీరమునకు స్థిరత్వము, దృడత్వము, బలము, ఆరోగ్యము, చిత్త స్థయిర్యమును సాధించు శక్తిని గల్గియున్నందున ఆసనములను శరీర వ్వాయామమునకును, రోగ నిర్మూలనము కొరకూ సాటిలేని మేటి సాధనమని గుర్తించ బడినది.

ఆసనముల గూర్చి తెలిసి కొన బోవు ముందు మానవ శరీర నిర్మాణము గురించి ఒకింత తెలిసికొనవలసి యున్నది. పర బ్రహ్మ సృష్టి కర్త. సృష్టిని ప్రారంభించుటకు ముందుగా ఆకాశమును సృజియించెను. దాని నుండి వృద్వి, వాయువు, అగ్ని, జలము ఉద్బవించినవని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ ఐదును పంచ భూతములుగా చెప్పబడినవి. ఇవి ప్రకృతికి మూల పదర్థములు. జడ స్వభావము కల్గినది. ప్రకృతియందు