ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

197


స్థితియందు ప్రాణ చలనము నిలచి పోవును. శ్వాసించుచు ధ్యానము చేయు చున్నమనుట సరియైనది కాదు. ధ్యానమున సిద్ధి పొందినపుడు శ్వాస సమసి పోవును. అట్టి స్థితిలో మాత్రమే ధ్యానము పక్వమైనట్లు తెలియ నగును.

ధ్యాన స్థితి యందు దృష్టిని ఎచట నిలుప వలయునని చాల మందికి సందేహము కల్గు చున్నది. దృష్టిని మూడు విధములుగా విభజింప వచ్చును. ఒకటి పూర్ణిమా దృష్టి. రెండు ప్రతిప దృష్టి. మూడు అమవస దృష్టి. పూర్ణిమా దృష్టి అనగా కనులు పూర్తిగా తెరచి భ్రూమధ్యమున లగ్న పరచుట. ప్రతిపద్దృష్టి అనగా రెండు కన్నులను అర్థనిమీలతముగా నాసికాగ్రమున నిల్పుట. అమవస దృష్టి అనగా రెండు కన్నులను పూర్తిగ మూసి మనస్సును షట్ చక్రములలో ఒక దాని యందు లగ్న పరచుట. అట్లు దృష్టిని లగ్నము చేసి మనస్సును శరీరము నుండి వచ్చు నాదమందు అనగా అనాహత శబ్దమందు లయము చేసిన సిద్ధిని పొందనగును.

సమాధి
............

పైన చెప్పిన విధముగా ఏకధారా ప్రవాహ రూపమున ధ్యానము చేయుచు అధ్యానమున రూపమును విడిచి అర్థమును మాత్రము నిలుపునట్టి స్థితియే సమాధి. సమాది ముఖ్యముగా రెండు విధములు. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రాజ్ఞాత సమాధి. ఇది పరిణితిలో భేదము, ఉన్మని, మనోన్మని, శూన్యాశూన్యము, పరమ పధము, అమనస్కము, అమరత్వము, జీవ