ఈ పుట ఆమోదించబడ్డది

194

లంక సూర్యనారయణ

కొలది మనశ్శరీరములు సూక్ష్మస్థితికి వచ్చును. అందువలన యింద్రియములకు గ్రహణశక్తి అతి సూక్ష్మమగుచుండును. నేలపై బడిన సూది వలన కల్గిన శబ్దమును కూడ వినగల్గు నట్లుగా చెవి యొక్క గ్రహణ పాటవము పెంపొందును. అటులనే మిగిలిన యింద్రియముల శక్తి కూడ సూక్ష్మ స్థితికి వచ్చును. ప్రాణాయామము చేత శ్వాసయు, ప్రత్యాహరము చేత యింద్రియములను వశపడును.

ప్రాణాయామమును చక్కగా సాధన చేసిన యెడల అనగా ఆహారాదినియమములతోను, బంధములతోను, ముద్రలతోను కలిపి సాధనచేయుచున్న యెడల సాధన విశిష్టత వలన కేవల కుంభకము సిద్ధించును. అనగా శ్వాస ప్రశ్వాసలు నిలిచిపోవును. అందుచేత మనోవేగము అణగిపోవును. ప్రాణాయామము వలన కల్గిన ఉష్ణము వలన దేహము నందలి సూక్ష్మనాడి మండల మంతయు శుద్ధియగును. శుద్ధి పొందిన నాడీ మార్గమున సుషుమ్న యందు ప్రాణము ప్రవేశింపగా మనస్సులయమగును. మనస్సులయమగుట వలన యింద్రియములతో ఎడబాటు కల్గి వానికి విషయమును తెలిసికొను శక్తియుండదు. అనగా యింద్రియ వ్యాపారము ప్రతిహరింపబడును. మరియు నాధాను సంధానము ప్రత్యాహారమునకు, ధారణకు మరియొక సాధనము. షన్ముఖి ముద్రయందు అనగా రెండు చెవుల రంధ్రములను రెండు చేతుల బొటన వేళ్ళతో మూసుకొనుట వలనగాని శరీరము లోపలి నుండి వచ్చు అవ్యక్తమగు ధ్వని వినదగును. మనసును ఆ శబ్దముపై లగ్నము చేసిన మిగిలిన యింద్రియముల నుండియు బాహ్య