యోగాసనములు
181
4. సీతలి ప్రాణాయామము:....
పెదవుల వెలుపలికి నాలుకను చాచి గుండ్రముగా పక్షి ముక్కు వలె చేసి నాలుకతో (నోటితో) వాయువును పూరించి జలాంధర బంధనమును చేసి మూల భంధమును పూరించిన కాలమునకు నాలుగు రెట్లు కాలము కుంభించి కుంభాకాంతమున ఉడ్యాన భంధము చేసి నెమ్మది నెమ్మదిగా పూరించిన కాలమునకు రెట్టింపు కాలములో రేచించ బలయును. రేచకమును నాసిక యొక్క రెండు రంధ్రముల చేత (ఇడ, పింగళ) రేచించ వలయును.
దీని వలన గుల్మము, ప్లీహము, స్వస్రములు, విషములు హరించును. దీనిని పద్మాసనమున గాని సిద్ధాసనమున గాని ఉదయ సాయం సమయముల యందు చేయ వచ్చును. ఇది రక్తమును శుభ్రపరచును. దాహమును, ఆకలిని అణచును. శరీరమునకు చల్లదనము కల్గించును. ఇది విషములను హరించును.
5.భస్తికా ప్రాణాయామము:.....
కమ్మరి వారి తోలు తిత్తిని సంస్కృతమున భస్త్రిక అని అందురు. ఆ తోలు తిత్తీ బలముగా పూరించుచు బలముతో వదులు నట్లుగా పోలి వుండుట చేత భస్త్రికా ప్రాణయామమనిరి. సుఖముగ ఆసనమున కూర్చుని కుడి తొడపై ఎడ పాదమును ఎడమ తొడపై కుడి పాదమున కూర్చుని అనగా పద్మాసనమున కూర్చొని శిరస్సు, వెన్ను తిన్నగా వుంచి నాసిక యొక్క కుడి రంద్రముచేత (పింగళా నాడి చేత) ధ్వని యుక్తముగా రేచకము చేయ వలయును. మరియు