ఈ పుట ఆమోదించబడ్డది

180

లంక సూర్యనారయణ


చేయును కనుక జలుబు చేసిన వారును శీతాకాలమందు కఫ వాత తత్వములు కలవారును చేయ రాదు. వీరు సూర్య బేధనములు చేయ వలయును. ఉష్ణాధిక్యత వలన కల్గిన రోగములు చంద్ర బేధనము నివారించును.

2. ఉజ్జాయి ప్రాణయామము:.....

నోటిని మూసుకొని నాసిక యొక్క రెండు రంధ్రముల చేత వాయువును పూరించి కొంచెము శర్మయగు వరకు అనగా పూరించిన కాలమునకు నాల్గు రెట్లు సమయము కుంభించి ఎడమ నాడి చేత రేచింప వలయును. దీని వలన శిరోగత రోగములు నశించును. కంఠ, గత, కఫ, శ్లేష్మ దోషములు హరించును. ధాతువు చక్క బడును. జఠరాగ్ని వృద్ధి యగును. ఈ ఉజ్జాయి ప్రాణామము నిలబడి నపుడు, నడుచునపుడు కూడ అభ్యసింప దగినది.

3. సీత్కారి ప్రాణాయామము:

నాలుకను పైకి మడచి నాలుక చివర పై దవడకు తాకు నట్లుగా వుంచి నోటి ద్వారా వాయువును శబ్ధము వచ్చి నట్లుగా గట్టిగా లోనికి పీల్చ వలయును. పూర్తిగా నిండుగా పూరించి పూరించిన కాలమునకు నాలుగు రెట్ల కాలము సేపు కుంభించి రెండు నాసికా రంధ్రముల చేతను వాయువును రేచించ వలయును. పూరించిన కాలమునకు రెండింతల కాలము రేచకము చేయ వలయును.

ఇది శరీరమునకు కాంతిని వృద్ధి జేయును. ఆకలిని దాహమును, మగతను, నిద్రను నివారించును. దాహముతో వున్నపుడు చేసిన యెడల దాహం తగ్గి పోవును.