ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

177


కు భకములను బాగుగా అభ్యసించిన పిదప కేవల కుంభకము ప్రాప్తించును. ప్రాణాయామము కేవల కుంభకము సిద్ధించునంత వరకు సాధన చేయ వలయును.

సహిత కుంభకములు ఎనిమిది. అవి. 1. సూర్య బేధ, 2. ఉజ్జాయి, 3. సీత్కారి, 4. తేతలి, 5. భస్తిక, 6. భ్రామరి, 7. మూర్ఫ్చ, 8. ప్లావిని, అని ఎనిమిది విధములు. ప్రాణాయామమునకు ఉపక్రమించుటకు ముందుగా సుఖముగను, భద్రమముగ నుండు స్థలము నేర్పాటు చేసుకొని, అనగా మిక్కిలి ఎత్తుగా గాని, మిక్కిలి పల్లముగా కాని లేని ఒక ప్రదేశమున ఎక్కువ గాలి, ఎక్కువ వెలుగురు లేని స్థల మందు దర్భతో చేసిన చిన్న చాపను పరచి, దానిపై లేడి లేక పులి లేక చిరుతపులి చర్మములతో నేదైన లభించినట్లయిన దానిని పరచి ( లేని యడల అవసరము లేదు) దానిపై ఒక మెత్తని వస్త్రమును పరచి ఎక్కువ వెలుగురు లేని ఒక గదిలో సుగంధ ద్రవ్యముల నుంచి ప్రశాంత మైన మనసుతో అలవాటు పడిన యోగ్యమైన ఒక స్థిరాసనమున అనగా పద్మ, సిద్ధ, స్వస్తిక సుఖాసనుమలో నేదైన ఒక దానియందు కూర్చుండి ప్రాణాయామము చేయుటకు సిద్ధపడ వలయును. భగవద్గీత యందలి ధ్యాన యోగము ఆరవ ఆధ్యామమున 11 వ శ్లోకమున నిట్లు చెప్పబడినది.

శ్లో: శుచౌ తేశే ప్రతిష్ఠాప్య స్థిర మానస మాత్మనంః
నాత్యస్ఛ్ర్తం నాతినీచం చేలాజినకు శోత్తరం
తత్రై కాగ్రం మనః కృత్వాయతచిత్తేంద్రియ క్రియః
ఉపవిశ్వాసనే యం జ్యాద్యోగమాత్మ విశుద్ధయే.||